No transcript for this section.
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ యోగత్రయీలో మూడవదైనటువంటి జ్ఞానయోగ భూమికలోకి ఇవాళ ప్రవేశం. ఇంతకు ముందే కర్మ యోగాన్ని భక్తి యోగాన్ని గురించిన విచారణ చేశాం. ప్రాపంచిక కర్మలు వ్యక్తిగా చేస్తే కర్మలని, భగవత్ ప్రీత్యర్థం చేస్తే అవి కర్మ యోగాలని, కేవలం కొన్ని ఆలోచనలకి కోరికలకు పరిమితమై పరమేశ్వరుని మనకంటే భిన్నమైన శక్తిగా ఉపాసన చేస్తే అది భక్తి అని, పరమేశ్వరా నీవు నేను ఒకటేనన్న భావనలు అంటే సూర్యుడు సూర్యకిరణాలు అభిన్నంగా ఎట్లా ఉన్నాయో అట్లాగే నువ్వు నేను ఒకటే అనే భావనతో గనక చేసినట్లయితే అది భక్తి యోగం అని విచారణ చేశాం. కర్మ యోగంలో కర్మలున్నాయి భక్తి యోగంలో పరమేశ్వరుడు మనము ఉన్నాం మరి జ్ఞాన యోగంలో ఎవరున్నారు అని. జ్ఞాన యోగంలో నిజానికి అందరూ ఉన్నా ఎవరూ లేరు అది జ్ఞానయోగం. జ్ఞానయోగంలో నువ్వుగా అనబడే దేహం ఉన్నది నిన్ను నడిపిస్తున్న దేహి ఉన్నాడు. "దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడున్ దేహిని రామై యుండు" అన్నారు స్వామి. గణుతిమ్పగా దేహియే దేవదేవుడవని పద్యం స్వామి. దేవుడు ఎక్కడో ఎక్కడో ఉన్నాడని దేవుళ్ళాడకండి బంగారం నీలోనే ఉన్నారు. ఈ నీలోనే ఉన్నారు అనేది మొదటి రోజుల్లో చెప్తే మనకు అర్థం కాదు గనుక, పరిణామ సహమైనది మానవ జీవితం గనుక, అంటే పరిణామం చెందటం మానవుడి లక్షణం గనుక, చూడండి మానవుడికి మూడు దశలు ఉంటాయి. అసలు నమ్మకమే లేని స్థితి ఒకటి, రెండవది నమ్మీ నమ్మనీ స్థితి, మూడవది నమ్మకమే నడిపించే స్థితి. ఈ నమ్మకమే నడిపించేటువంటి స్థితి పేరే జ్ఞాన యోగం. ఏమిటి ఆ నమ్మకం అంటే, పరమాత్మ అక్కడున్నాడు ఇక్కడున్నాడని వెతికాను గానీ అసలు ఉన్నదంతా పరమాత్మే. చిన్నప్పుడు నిజానికి మనం ఎవరన్నా కొత్త సంవత్సరంలో డైరీ ఇవ్వగానే ఏదో ఒక మంచి మాట రాసుకునే వాళ్ళం జనవరి ఒకటో తారీఖున. "God exists everywhere" అని రాసే వాళ్ళం. పరిణామంలో ఇవాళ మనకు మళ్ళీ ఎవరన్నా కొత్త డైరీ ఇస్తే "God exists everywhere" అని రాయటంలే, ఏం రాస్తున్నాం అంటే "whatever exists is God" అని రాస్తున్నాం ఇది పరిణామం. అసలు ఉన్నదే దైవం ఆ దైవంలో మనము భాగం. ఇదివరకేం అనుకున్నాం దైవం వేరు మనం వేరు, ఆయన వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు. ఆయనేమో "త్వమేవాహం న సంశయః" యు ఆర్ మీ ఐ యామ్ యు స్వామి చెప్తూ వచ్చారు. ఆ అలా స్వామి అంటారు గానీ మనం ఎప్పుడు కావాలి అని. స్వామీ ప్రత్యక్షంగా సాక్ష్యంగా పదిమంది మధ్యం నుంచొని అందరికీ అర్థం అయ్యేట్టుగా నీకూ నాకూ తేడా లేదు బంగారు నీవు దైవమని తెలుసుకో అంటున్నారాయన. ఈ దైవమని తెలుసుకునేటువంటి మార్గంలో కర్మ యోగం ఒక సోపానమైతే, భక్తి యోగం రెండవ సోపానమైతే, మూడవది జ్ఞాన యోగం. ఇది పరమోత్కృష్టమైనటువంటి సాధనా స్థితి. ఈ జ్ఞాన యోగాన్ని చూడండి శ్రీకృష్ణుడి యొక్క మధుర విషాద గాథ అయింది. అది ఎంత మధురమో అంత విషాదభరితం. అది ఎంత విషాదంగా కనిపిస్తుందో దానిలో ఒక విషాద మాధుర్యం అన్నది మాధుర్య విషాదం కూడా ఉన్నది. రెండు కలబోసుకొని ఉన్నాయి. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడుగా, కౌమార కృష్ణుడుగా, యవ్వన కృష్ణుడుగా, ప్రౌఢ కృష్ణుడుగా, యోగీశ్వరుడుగా పరిణామం చెందాడు. భగవద్గీత ఆయన చెప్పాలి అనుకుంటే కురుసభలోనే ఆయన చెప్పి ఉండేవాడు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ జ్ఞానబోధకి స్థానం లేదు. అక్కడ కావలసింది యుద్ధం చేయటమా అక్కర్లేదా అని విచారణ. చేయాలో చేయక్కర్లేదో నిర్ణయించింది ఆయనే, కానీ చెప్పదలచుకున్న దాని రంగం మాత్రమైనా మహాభారత సంగ్రామ వేళ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. యోగ భూమికలోకి వెళ్ళి రాబోయేటువంటి కలియుగంలో దేవుడు లేడు అంటూ ప్రారంభమయ్యే మన కలియుగంలో అనేకానేకమైన సందేహాలకు సమాధానంగా భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేశాడు. అప్పుడే ఎందుకు చేశాడు అంటే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి చెప్తూ ఓ మాటన్నారు. దక్షిణామూర్తి స్తోత్రం ఊరికే పది శ్లోకాలే కదా అని ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి, తత్వమసి స్థాయికి వెళ్ళిన వాడికి ఈ దశ శ్లోకీ చెప్పండి అన్నారాయన. అంటే తత్తత్వం అసి, నీవు నేను ఒకటే అయి ఉన్నాం అదే నేనై ఉన్నాను నేను అదే అయి ఉన్నదనే భావన. అంటే అద్వితీయమైనటువంటి అద్వైత భావనలోకి వెళ్ళాక దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విచారణ అర్థమవుతుంది. అర్జునుడి వంటి వాడు తన జీవితంలో ఉన్న అన్ని ఎత్తుపల్లాలు అనుభవిస్తూ అనుభవిస్తూ ఇంకా మహాభారత సంగ్రామం తర్వాత ఏం అనుభవిస్తాడయ్యా అంటే ఏం లేదు ఆయన అనుభవించటానికి. ఆయన రాజ్యం వెళ్తాడు గెలుస్తాడు తప్పదు, రాజ్యం వెళ్తాడు తప్పదు. ఇంకా రాజైనవాడు రాజభోగంలో ఉన్నవాడికి భగవద్గీత చెప్పటానికి వీల్లేదు గనుక ఆ జయ-విప-విజయాన్ని పొందటానికి ముందే భగవద్గీతని ఉపాసనా మార్గంగా ఉపదేశనం చేశాడు. ఆ చేయటం అష్టాదశాధ్యాయిని పద్దెనిమిది అధ్యాయాలు. జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగం, మధ్య ఆరు అధ్యాయాలు భక్తి యోగం, చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగం. ఇవాళ ఈ జ్ఞానయోగ విచారణలో శ్రీకృష్ణుడే ఎందుకు గుర్తు రావాలంటే కృష్ణుడి యొక్క స్థితి కృష్ణుడి యొక్క బోధ నిత్య నూతనమది. స్వామి లాగా. పొద్దున్నే చూశాం స్వామిని మళ్ళీ మూడు ఎప్పుడవుతుందా అని మనస్సు తహతహలాడుతుంది. ఇప్పుడు మళ్ళీ మూడింటికి చూస్తాం మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుందా అని. ఏమున్నది? దుహానం దుహానం సుజానేన మౌజ్యంజిహ్వానం జిహ్వానం సుధాం వేణునాథై లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ అంటాడు లీలాశుకుడు. ఎంత అందంగా కృష్ణుడిని వర్ణిస్తాడంటే జిహ్వానం జిహ్వానం సుజానేన మౌధ్యం ఏమయ్యా కృష్ణ పరమాత్మ నిన్ను పదేళ్ల వాడిగా చూశా, ఇరవై ఏళ్ల వాడిగా చూశా, అరవై ఏళ్ల వాడిగా చూశా, ఎనభై ఏళ్ల వాడిగా చూశా నా చూపులు మారటం లేదు నువ్వు మారటం లేదు నీలో ఇంకా ఆ బాల్యంలో ఉన్న ముగ్ధత్వం ఎలా నిలబడింది అని. స్వామికి సమన్వయం చేయండి. స్వామిని యాభై ఏట చూశాం, అరవై ఏట చూశాం, డెభై ఏట చూశాం, ఎనభై న చూశాం, తొంభై న చూస్తాం, తొంభై ఆరున చూస్తాం మార్పు ఏదన్నా ఉన్నదా అని. ఒక మార్పు మాత్రం ఉంది. ఏమిటా మార్పు అంటే ఎప్పటికీ మారనటువంటిది ఒకటి మాత్రం ఉన్నది అది మహా చైతన్యం. పొద్దున కంటే మధ్యాహ్నం మధ్యాహ్నం కంటే మళ్ళీ రేపు పొద్దున తేజస్సు పెరుగుతున్నదే అది సుజానేన మౌధ్యం. మౌధ్యం అంటే ముగ్ధత్వం. ముగ్ధత్వం అంటే ప-శిశుత్వం పసిపిల్లవాడి తత్వం. దేవుడు పిల్లలు భగవంతుడు అంటే అంతా సమానమే గనుక స్వామిలో ఒక పసితనం ఉన్నది గనుక ఆ పసితనానికి మాలిన్యం లేదు. అందుకనే అది వికాసమానంగా ఉంటుంది, ప్రకాశమానంగా ఉంటుంది. రెండవది జిహ్వానం జిహ్వానం సుధాం వేణునాథైహి ఎన్నిసార్లు విన్నాం ఈ వేణునాదం తమాల వృక్ష ఛాయల్లో విన్నాం, యమునాతటిలో విన్నాం, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, మనసులో విన్నాం, రేపల్లెలో విన్నాం, అందరి గుండెల్లో విన్నాం, అందరి కంఠాలలో విన్నాం ఎన్నిసార్లు విన్నా అమృత బిందువులు తాగినట్లే ఉంటుందేమయ్యా. స్వామితో సమన్వయం చేయండి. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు ఒక ఉపన్యాసానికి రెండో ఉపన్యాసానికి పోలిక ఉన్నదా? ఆ ఇది మొన్నే చెప్పారులే అన్నట్టు అనిపించినా మొన్న చెప్పింది ఇవాళ చెప్పింది రెండు పక్కపక్కన పెట్టి చదువుకుంటే మొన్న చెప్పింది వేరు ఇవాళ చెప్పింది వేరు. లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై ఈ స్వామిని చూస్తుంటే, కృష్ణ పరమాత్మని చూస్తుంటే వీడు బాలుడా, గోపబాలుడా, నందబాలుడా, యశోదా బాలుడా ఎవరు ఈ కృష్ణ పరమాత్మ అని పాదం మొదలుపెట్టి చూస్తే కనుల చూపులు బారులు కట్టి వెళుతూ వెళుతూ ఉండగా ఆకాశం అంచు తగిలింది అంటాడు. అంటే అవని ఆకాశము రెండు ఆక్రమించినటువంటి పరమాత్మకి మానవుడి యొక్క చూపుకు అందుబాటు ఏందా ఆ రూపమని. లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహా ఆనంద సర్వస్వమేతన్ నమస్తాత్. మహానంద సర్వస్వం ఒక చోట ఉన్నది గనుకనే ఆయన భగవంతుడు అయినాడు. జ్ఞాన యోగంలో మనస్సు ఆర్ద్రమవుతుంది, మనస్సు కరుణా పరిపూతం అవుతుంది. భగవాన్ రమణ మహర్షిని ఒక మాట అడిగారు, జ్ఞానికి కర్మలు ఉంటాయా అని. ఎందుకుండవ్ ఆయనే పని చేస్తాడు కదా అన్నారు. మరి ఎందుకు దాని వలన ఫలితాలు ఉంటాయి కదా అవి ఆయనకు అబ్బుతాయా అని. ఏమీ అబ్బవు అన్నారు. ఎందుకని అంటే జ్ఞాని నిష్కామ కర్మ చేస్తాడు ఏం చేసినా ఏం తలచినా ఈ ప్రపంచం యొక్క కళ్యాణాన్ని, క్షేమాన్ని, శాంతిని కోరి ఆ పనులు చేస్తాడు. కనుక ఆయనకి ఫలితాలు అంటూ ఏం లేవు. ఆశించినవి లేవు గనుక అనుభవాలేం మిగలవు. జీవుడు ఏదో కోరి చేస్తాడు గనుక కోరినంత దక్కుతుంది. అర్హత ఉన్నంత దక్కుతుంది. జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు గానీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆ పర్ఫెక్షన్ ని సుమారుగా మన వరకు నలభై ఆరు సంవత్సరాలుగా ప్రశాంతినలయ దర్శనంలో అనుభవం పొందుతూనే ఉన్నాం. 1963 నుంచి ఇదిగో 2009 అంటే నలభై ఆరు సంవత్సరాలు. ఏం జరుగుతున్నదయ్యా అంటే స్వామి ఏ పని చేసినా పర్ఫెక్షన్ అంతే. నియర్ పర్ఫెక్షన్ కాదు పర్ఫెక్షన్ అంతే. అంటూనే స్వామి అన్నారు పర్ఫెక్షన్ గా చేయాలి కానీ పర్ఫెక్షన్ ఎప్పుడూ కూడా obsessive గా ఉండకూడదు It should never become an obsession అన్నారు. obsession ఎవరికంటే జీవుడికి పరమాత్మకి obsession లేదు obstruction లేదు ఏమీ లేదు. సంకల్ప బలమే సాకారం అవుతుంది గనుక జ్ఞాని సంకల్పాలు విశ్వజనీనంగా ఉంటాయి, సర్వ శ్రేయోదాయకంగా ఉంటాయి, సర్వజన మనోల్లాస పులకిత పుంభణంగా ఉంటాయి, అందరికీ ఆనందం పంచేవిగా ఉంటాయి గనుక జ్ఞాని కర్మలు చేస్తాడు. ఎలా చేస్తాడు? ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడు. జ్ఞాని మనస్సుని ప్రపంచంలో ప్రవేశపెడతాడు. మరి జ్ఞానికి మనసే లేదంటేదే ఉంది. ఎట్లా ఉందంటే ఎక్కడ ఉండాలో తన స్వస్థానంలో ఆ మనస్సు ఉన్నది. అవసరమైనవేళ ఆ మనస్సును బయటకు తెచ్చి ఆ పని పూర్తి చేసి మళ్ళీ ఆ మనస్సును హృదయ స్థానంలోకి తీసుకుని వెళ్ళగలడు జ్ఞాని. జీవుడి యొక్క మనస్సు ఒక్కసారి పంజరంలో నుంచి బయటకు వస్తే పంజరం యొక్క అడ్రస్సే మర్చిపోతుంది అది. జీవుడి ప్రారబ్ధం అది. జ్ఞాని అన్నింటినీ అధీనంలో ఉంచుకుంటాడు. సాధకుడు జీవుడు అన్నింటికీ అధీనుడై ఉంటాడు. అన్నింటినీ అధీనము చేసుకొని ఉన్నాడంటే జితేంద్రియుడుగా ఉన్నాడు అని. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు జ్ఞాని ఓ స్టేట్మెంట్ అనుకుందాం. జయించాడు ఇంద్రియాలు అంటే ఇంకా ఆయన జ్ఞాని అయినట్లేనా అంటే స్వామి ఒక మాట చెప్పారు చాలా అందమైన మాట, చాలా గొప్ప మాట, చాలా నిగూఢమైన మాట, మార్మికతతో కూడుకున్న మాట. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించటం కాదు బంగారు, జయించబడిన ఇంద్రియాలతో జీవించటమే జితేంద్రియత్వము. ఆంజనేయస్వామిని గుర్తుతెచ్చుకోండి బంగారు అన్నారు స్వామి. ఇంద్రియాలను జయిస్తే ఏముంది కథ అయిపోయింది. ఇంకో విషయం కేనోపనిషత్తులో మన ఇంద్రియాలు జీవుడి యొక్క ఇంద్రియాల యొక్క సంచలనాలు కదలికలు మెదలికలు అన్నీ కూడా ఆత్మలో నుంచి ప్రాదుర్భవిస్తాయి అంటాయి.అంటే ఆత్మ కూడా ఒక్కొక్కసారి trigger చేస్తుందన్నమాట stimulate చేస్తుందంటాం ప్రేరణ కలిగిస్తుంది ఉత్ప్రేరణ కలిగిస్తుంది మరి ఇంద్రియాలని ఉత్ప్రేరణ కలిగించినటువంటి ఇంద్రియాలని అధీనం చేసుకుని అధీనంలో ఉంచుకున్న ఇంద్రియాలతో జీవించిన వాడు మాత్రమే జితేంద్రియుడు అన్నటువంటి సత్యసాయి భగవానుడు జ్ఞాని అంటే స్వామి స్వామి అంటే అర్థం అసలు జ్ఞాని అని అర్థం జ్ఞాని అంటే అజ్ఞాన భూమిక నుంచి బయట పడేసే వాడు ఒకటైతే అసలు అజ్ఞానం ఒకటి ఉందని మనకు తెలియజెప్పే వాడు జ్ఞాని షిరిడి సాయి ని తీసుకోండి అన్ని అవతారాల్లో చాలా ప్రధానమైనటువంటి సాయిత్రయ్ అంటే షిరిడి సాయి సత్యసాయి ప్రేమసాయి మూడు సాయిత్రయ్ అవతారాలు అందులో మొదటిదైనటువంటి షిరిడి సాయి జ్ఞానబోధ కంటే కూడా అజ్ఞానాన్ని గురించిన ఎరుక చాలా ఎక్కువ చెప్పారు నానా వంటి పండితుడు కూడా మాకన్నీ తెలుసు బాబా కి ఏం తెలుసు అన్నప్పుడు తద్విద్ధి ప్రనిపాతేన పరిప్రశ్నేన సేవయా విచారణ చేస్తే అక్కడ సాగింది ఏమిటి మనం అజ్ఞాన భూమిక లో కూరుకు పోతూ పోతూ నాకు ఇన్ని పద్యాలు వచ్చు ఇన్ని పాటలు వచ్చు ఇన్ని మాటలు వచ్చు అని అజ్ఞానంలో కూరుకుపోతున్నాం జ్ఞాని అయిన వాడు మాటలను దాటి భావనలు దాటి భావనను దాటి అనేకమైనటువంటి సంకల్పాలను దాటి స్థిమితమైనటువంటి సంస్థితమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు అక్కడ ప్రజ్ఞా స్థితప్రజ్ఞే సంకల్పాలు స్థితమే ఆచరణలు స్థితమే ఆలోచనలు స్థిమితమే అంతా స్థితిగా ఉన్నది సమస్థితిగా ఉన్నది సంస్థితిగా ఉన్నది అంటే ఎక్కడ తొట్రుపాటు లేదు ఎక్కడ ఎడబాటు లేదు కడబాటు లేదు ఏమి లొంగుబాటు లేదు పొంగుబాటు కూడా లేదు అందుకే స్వామి అంటారు దేనికి ఒంగక లొంగక పొంగక జీవించండి అట్లాగే స్థితప్రజ్ఞ మూర్తి ఎట్లా ఉండాలంటే ఒక పెద్ద హిమాలయ పర్వతము వలే ఉండాలన్నారు అదరక బెదరక చెదరక కదలక నిలుచుకోండి అన్నారు స్వామి ఏం మాటలివి ఎక్కడి నుంచి వచ్చినయి సజ్జోనిర్గమమైన సర్వభావనా సంభారం ఇది కనుక జ్ఞాని అయిన వాడు ఆయన మౌనమే మాట అజ్ఞానంలో మాటలన్నీ మౌనాలే ఇప్పుడు ఈ అనుకున్న మాటలన్నీ ఉన్నాయి చూడండి పంచకోశాల బయట ఈ అంటున్నవాడు కాసేపు ఈ పంచకోశాలు దాటి లోపలికి వెళ్ళాడనుకోండి అంతర్ముఖుడయ్యాడనుకోండి వింటున్న మీరు కూడా అంతర్ముఖులయ్యారనుకోండి ఏమున్నది అక్కడ మహా నిశ్శబ్దం ఉన్నది లోపల ఏమున్నది రుద్రభూమి ఉన్నది మహా స్మశానం ఉన్నది స్మశానము అంటే విభూతి స్థితి ఎక్కడ పరమేశ్వరుడు గజ్జ కట్టి ఆడుతాడో ఇది నిటాలేక్షనుండు గజ్జకట్టి ఆడు రంగస్థలంబు అంటాడు ఆ రంగస్థలంలో అనేక పాత్రలు తండ్రి పాత్ర తల్లి పాత్ర కూతురు పాత్ర కొడుకు పాత్ర కోడలు పాత్ర బోధకుడు పాత్ర సాధకుడి పాత్ర ఎన్నో వేషం ఈ వేషాలన్నీ తీసివేయగా ఏం మిగిలింది అంటే నేను అన్నటువంటి ఒక అచంచలమైనటువంటి ఒక భావన ఒక స్పష్టమైన ఆలోచన ఒక అచ్చమైన ఆలోచన ఇది జ్ఞాన భూమిక ఓ పద్యం ఉంది విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెప్తాడు పరమేశ్వరుడి యొక్క ద్వైత బుద్ధిలో నుంచి ద్వైతాద్వైత మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు అంటే ద్వైతంలో నుంచి రెండుగా ఉన్న నువ్వు నేను అనుకుంటూ కాదయా నువ్వే నేను అనుకుంటూ వెళ్లే మార్గంలో పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయేనీ ఈ శరీరంబు నీదే కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమత నువ్వు వాడు కెరలినన్నేమి మిగిల్చితి నా సామి విట్టు నేనన్నది అభిజ్ఞ గాక ఎంత అద్భుతమైనది పంచభూతములు ఐదు దివాకరుడు కుడికన్ను నిశాకరుడు రెండవ కన్ను అంటే సూర్య నాడి చంద్ర నాడి పంచ ప్రాణాలు అనబడేటువంటి పంచభూతాలు సూర్య-- సూర్య రశ్మి సుషుమ్నా కిరణాలతో కూడిన చంద్రుడు ఐదు ప్లస్ రెండు కలిపితే ఏడు అంటివే వాటినే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు నాలుగు ప్లస్ మూడు కలిపితే ఏడు అంటివే ఏడు దాటితే మిగిలింది ఆత్మ అంటివే ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన దీని ఈ శరీరంలో ఈ గూట్లో ఎవడో ఒక ఆత్మనొకడు ఉన్నాడయ్యా వాడే దీనికి యజమాని అని చెప్తుంటే ఇంతకాలం నే రాశాను నేనన్నానన్న ఈ నేనుకు విలువ ఏమున్నది కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి నన్ను నేనుగా చెప్పుకోవడానికి ఏం మిగిల్చావయ్యా నాలో ఉన్న పంచభూతాలు వేరే నాలో ఉన్న సూర్య నాడి వేరే నాలో ఉన్న చంద్ర నాడి వేరే వీటన్నింటికీ అధిష్టానమైన యజమాన్యం వహించిన ఆత్మ వేరే ఉంటే మరి నేనెవరు అంటే విట్టు నేనన్నది అభిజ్ఞ గాక నేను నేను నేనుగా చెప్పినదంతా నువ్వు నావనటానికి గురుత్వా అందుకు మిగిల్చావా తండ్రీ అన్నాడు అంటే భగవాన్ రమణ మహర్షిని ఓ మాట అడిగారు అందర్నీ అడిగినట్టే అందరు గురువులు అందరు అవతార పురుషులు ఎదుర్కొన్న ప్రశ్న ఇది మీరు దేవుణ్ణి చూశారా వాళ్ళ జవాబు మేము చూశాము మాకు చూపించగలరా నువ్వు చూడగలిగితే మేము చూపిస్తాము ఇది ప్రశ్న రమణలను కూడా అడిగారు ఓ స్పష్టంగా చూశాను ఎంత స్పష్టంగా చూశానంటే నువ్వున్నంత స్పష్టంగా చూశా అంతెందుకయ్యా విచారణ అసలు నువ్వుగా కనబడుతున్న ఈ వస్తువు ఉన్నదే అసలు వాడు అక్కడ ఉన్నాడు అనటానికి నువ్వు గుర్తు కాదా అన్నారు నువ్వు పరమాత్మ ఉన్నాడు అని చెప్పటానికి గుర్తుగా నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావని ఎందుకు అనుకోవు నీకంటే పరమాత్మ భిన్నంగా ఎక్కడున్నాడో విచారణ చేయమన్నాడు ఆయన అంటే జ్ఞాన భూమికలో జ్ఞాన యోగంలో పరమేశ్వరుడు నేను అన్న రెండు భావనలు లేవు స్వామి శిష్యత్వ బర్తడే ఉపన్యాసం గనుక పూర్ణచంద్ర ఆడిటోరియంలోది విన్నట్లయితే ఓ మాట పరమాద్భుతమైన మాట చెప్పారు.రెండు మాటలు చెప్పారు ఆ రోజున. ఒక మాట భక్తుడి యొక్క స్థితిని స్థాయిని బట్టి చెప్పారు. దేవుడిని దేవులాడుకుంటూ మీరంతా పుట్టపర్తికి వచ్చారు సంతోషమే. అంటే దేవుడిని వెతుక్కుంటూ వచ్చారు. మరి నేను కూడా వెతుకుచున్నాను వెతుకుచున్నాను వెతుకుచునే ఉన్నాను. కంటికి ఒక్కడు కానరాడే నిజ మానవుడు ఒక్కడు కానరాడే అన్నారు. అంటే ఒక true man ఒక complete man భగవంతుడికి కూడా కనపడటం లేదేమిటి? అంటే ఏ భగవంతుడిని చూడాలని మనం వెళుతున్నామో మన ఆలోచనలన్నీ చూశాం అనుకోవటం దగ్గర ఆగిపోతున్నాయి. చూసిన తర్వాత ఏమిటన్న సాధన లేదు గనుక స్వామి అరవై ఏళ్ళు అంటే సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఒక హెచ్చరిక చేశారు. అలాగే స్వామి ఒకే ఒక్క మాట చెప్పారు. పరమాత్మ ఉన్నాడా లేడా అనే సందేహం వదిలిపెట్టండి. కలడు కలండనడి వాడు ఉన్నాడా లేదా కాదు యదహత్తి పుట్టపర్తిలో ఉన్నాడని చెప్పమన్నారు. స్వామి శరీరానికి అప్పుడు ఇంకా నలభై ఐదు ఏళ్ళు కూడా రాలే. ఎలా చెప్పారు ఎందుకు చెప్పారు అంటే పరమాత్మ ఉన్నాడన్న భావనలో నుంచి జ్ఞాన యోగంలోకి వెళుతూ జ్ఞాన యోగంలో త్వమేవాహం న సంశయః నిస్సందేహంగా పరమాత్మ నువ్వు నేను ఒక్కటే. మన ఇద్దరం ఇక్కడ రెండు కార్యక్రమాలు కొనసాగించడానికి వచ్చాం. నువ్వు చెప్పటానికి మా చేత చేయించటానికి నువ్వు వచ్చావు. నువ్వు చెప్పింది చేయటానికి మేము వచ్చాం. మన ఇద్దరం కలిసి ఉందాం స్వామి అంటారు. నిజమైనటువంటి బంధం జ్ఞాన యోగంలో భక్తుడికి భగవంతుడికి. భక్తి యోగంలో రెండుగా కనిపిస్తున్నదే జ్ఞాన యోగంలో ఒక్కటై ఉన్నది. అన్నీ పోగా అంతా పోగా ఏది మిగిలింది అంటే అఖండ చిద్గణ రసమైనటువంటి ఒకే ఒక ఆత్మ భావన దాని పేరు నేను. అదే సందర్భంలో మన స్వామి ఒక మాట చెప్పారు. నేను యతిని గాను నేను యోగిని గాను భోగిని కాదు. నేను ఎవరో తెలుసునా? నేను నేనైన నేను అన్నారు స్వామి. నేను నేనైన నేనంటే జాగ్రదవస్థలో ఈ కనిపిస్తున్న భౌతిక స్వరూపంలో నేను. మళ్ళీ సూక్ష్మ శరీరంలో నేను, కారణ శరీరంలో నేను, జాగ్రదవస్థలో నేను, నిద్రావస్థలో నేను, సుషుప్తి అవస్థలో నేను, శరీరం పడుకుంటున్నది శరీరం లేస్తున్నది, అవతారం పోతున్నది అవతారం నడుస్తున్నది, ఈ అవతారముపై కొత్త అవతారం వస్తుంది. కానీ అన్ని అవతారాలలో అన్ని జీవులలో అన్ని అవస్థలలో అన్ని కాలాలలో అన్ని భువనాలలో అన్ని సంకల్పాలలో నేనుగా మిగిలిన ఆ నేను నేనైన నేను అంటే నేను పరమాత్మనని స్వామి స్పష్టంగా ఈ జగత్తుకి ప్రకటన చేశారు. ఇది జ్ఞాన యోగ రససిద్ధిగా మనం భావించినట్లయితే మనం కూడా మనం దేహము మాత్రమే కాదు దేహంతో కూడిన ప్రాణ చైతన్యం ప్రాణ చైతన్యంతో కూడిన దేహంగా వచ్చాం. స్వామి అంటారు చూడండి ఈ ప్రాణ చైతన్యము ప్రాణశక్తి దివ్య భావన ఉన్నంతవరకూ కట్టెగా కనిపిస్తున్న ఈ శరీరం శివం. ఆ ప్రాణ చైతన్యమో దైవభావనో దేహి భావనో శరీరం నుంచి విడిపడగానే అది శవం. శవానికి శివానికి స్వామి చాలా అందంగా చెప్పారు. శవం రాస్తున్నప్పుడట కొమ్ము పైకు ఉంటుంది అది అహంకారానికి గుర్తు. ఆ పొల్లు చివరికి పైకి తీస్తాం. పొల్లు నుడికారం. ఆ ఆ నుడికారము అహంకారము కొట్టేస్తే అది శిరస్సు వంచుకొని ఉంటుంది అది శివం. ఇది మంగళం అది అమంగళం. ఇది సత్యం అది అసత్యం. ఇది నిత్యమూ సత్యమూ శాశ్వతమూ యోగమూ అది భోగం మాత్రమే. భోగాన్ని దాటి వచ్చేదే యోగం కాబట్టి భోగాన్ని యోగంగా యోగాన్ని భోగంగా భావించవలసినటువంటి స్థితి జ్ఞాన స్థితి. అందుకే రమణ మహర్షిని మరొక ప్రశ్న వేశారు. అయ్యా! అనేక శాస్త్రాల మీద మాకు అధికారం ఏర్పడుతుంది. అనేక వాటి మీద అనేకమైన వ్యాఖ్యానాలు చేస్తాం. ఎన్నెన్ని విషయాల్లో చాలా చక్కగా చెప్తాం. ఇదంతా జ్ఞానమేనా? అని అడిగారు. Interpretation of శాస్త్రస్ is not జ్ఞాన. అది ఊరికినే అది విజ్ఞాన సంపుటి మాత్రమే తప్ప జ్ఞానికి సంకల్పాలు లేవు వికల్పాలు లేవు. జ్ఞానికి విశ్లేషణ లేదు సమాశ్లేషణ తప్ప. సర్వాన్నీ సమంగా చూడటం జ్ఞాని లక్షణం. అండ్ జ్ఞాని అంటే ఇందాక అనుకున్నాం జ్ఞాని అంటే అచ్చ తెలుగులో దాని పేరు స్వామి అని అర్థం. స్వామి అయినవాడు స్వస్వామిగా ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే మనలో ఉంటాడు. ఎలా ఉన్నాడు? అన్నమాచార్ల వారిని తీసుకోండి. వెంకటేశ్వర స్వామిని ముప్పై మూడు వేల సంకీర్తనలతో స్తుతించాడు. శివుడన్నాడు భవుడన్నాడు మాధవుడన్నాడు కేశవుడన్నాడు అసలు నువ్వే అన్నాడు అంతా అన్నాడు. అనేకమైనటువంటి నవరసాలలో ఆయనను ఆవిష్కరిస్తూ వెళ్ళాడు. కానీ చిట్టచివరగా అనుభవం పండిన వేళ, గుండె నిండిన వేళ, హృదయావిష్కరణ జరిగిన వేళ, ఆత్మానుభూతికి లోనైన వేళ, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వేళ చిత్తజగురుడా! నీకు శ్రీమంగళం అన్నాడు. చిత్తజగురుడవై ఉన్నావు నా చిత్తములో పుట్టిన గురువుగా ఉన్నావయ్యా! నీకు శ్రీమంగళం. ఇంతకాలం రాళ్ళల్లో రప్పల్లో కోనల్లో కొంగల్లో మిట్టలలో పుట్టలలో గిట్టలలో అన్నింట్లలో చూశా. చూద్దామని ప్రయత్నించినా కనపడనిది నా లోపలికి ఒక్కసారి చూసుకున్నప్పుడు నేను అంతర్ముఖుడినైనప్పుడు నీ యొక్క దివ్య జ్వాలా విశేషం ఏదైతే ఉన్నదో ఆ విశేషమైనటువంటి ఆ వెలుగును నేను దర్శనం చేశాను. దానికి శ్రీమంగళం అన్నాడు. అంటే ఏది సహకారంగా కనిపిస్తున్నదో, ఏది స్వభావంగా కనిపిస్తున్నదో, ఏది వస్తువుగా కనిపిస్తున్నదో, ఏది గుణంగా కనిపిస్తున్నదో ఇదంతా కూడా పోయేదే. ఇక్కడ ఉండేది కాదు. స్వామి అన్నారు ఒకసారి The one that is real can never be challenged. The one that is ever challenged is not real it is unreal అన్నారు. ఛాలెంజ్ కు గురి అయ్యేది రియల్ కాదు. సత్యమే నిత్యమూ సత్యమే సత్యమూ సత్యమే శాశ్వతమూ సత్యమే యోగం గనుక జ్ఞాన యోగం అంటే సత్యాన్ని ఆవిష్కరించుకోవటం. ఏమిటి సత్యం అంటే నేను దేహము మాత్రమే కాదు నేను దేహిని. నాలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి, నాలో ఉన్న fluid, నాలో ఉన్న అనేకమైనటువంటి సంగతులన్నీ కూడా ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఒక అవతారంగా సాగటానికి పరమేశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక జన్మగా ఒక యోగంగా భావిస్తున్నా. అంతేగాని ఈ దేహము, ఈ కీర్తి, ఈ titles, ఈ degrees ఇదంతా జగద్వంచన దానిని మించి ఆత్మవంచన. ఇక రెండవదిజీవుడికి దేవుడికి మధ్య అభేదమే గాని భేదం ఆ భేదం మాత్రం ఉండటానికి వీలు లేదు. పరమేశ్వరుడే జీవుడుగా ఇక్కడికి కొన్నాళ్ళు వచ్చాడు. ఈ జీవుడే మళ్ళీ metamorphosis అంటాం పరిణామ దశలో గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎట్లా కావాలో పుట్టిన ప్రతి జీవుడు దేవుడు కావటానికి తనలో ఉన్న దేవుడిని దర్శనం చేసుకోవటానికి తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించటానికి జ్ఞాన యోగము ఒక స్థిమితమైన యోగం ఒక సమస్థితితో కూడిన యోగం అది సమయోగం. జ్ఞాన యోగంలో రెండు లేవు ఉన్నది ఒక్కటే. జ్ఞాన యోగంలో అంతా అన్నీ నేనే నేనే అన్నీ అంతా అంటే యద్భావం తద్భవతి లాగా విశ్వం దర్పణ దృశ్యమానన విరితుల్యం లాగా ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా అద్దంలో బొమ్మ అన్నారు శంకర భగవత్పాదులు. అద్దమే పక్కకి పోతే బొమ్మ పోతుంది బొమ్మ అక్కడుంటుంది అద్దము అక్కడుంటుంది కానీ యోగం గనుక లేకపోయినట్లయితే అద్దంలో బొమ్మ ఎట్లా కనపడదో జీవుడు గనుక పరమాత్మ ఆవరణలోకి రాకపోయినట్లయితే తనను తాను చూసుకోవటానికి తనను తాను అనుభవించటానికి తనను తాను ఆవిష్కరించుకోవటానికి అవకాశం లేదు. ఈ సన్నివేశంలో ఒక చిన్న అనుభవం స్వామితో చాలా ఏళ్ల క్రితం మేమంతా చిన్న పిల్లలం స్వామి చాలా సేపు ఒక గంటన్నర మాకిది అర్థం అవుతుందా కాదా అంటే ఏమో అర్థమైన వాడికి ఇప్పటికి అర్థమైందా అంటే ప్రశ్న గాని చెప్తూ వచ్చారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో తెలుసునా బంగారం అంటూ మొదలు పెట్టారు. ఆ రోజుల్లో స్వామి interview room లోకి వెళ్ళటం అంటే కేవలం స్వామిచ్చే ఒక ఉంగరం ఇంకోటి తీసుకుని రావటం కాదు. సుమారు గంట, గంటన్నర స్వామి విశేషాలు చెప్పేవారు. అవి మనము ఈ శరీరానికి ఏర్పడ్డ వయస్సుతో పోల్చుకుంటే అవి చాలా పెద్ద మాటలు. మరి ఏ వయస్సుని సంబోధించి స్వామి ఆ మాటలు చెప్పారు? ఇప్పుడు ఈ క్షణాన మన ఈ studio లో ఇది మాట్లాడుతున్నప్పుడు గుర్తొస్తున్నది. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అని అడగ్గానే అక్కడ మేము ముగ్గురం నలుగురం ఉన్నాం. అంటే నేను నాతో పాటు కాస్త ఆ నాకంటే ఓ ఇరవై ఏళ్ళు ఆయన కంటే ఇరవై ఏళ్ళు పెద్ద వాళ్ళందరం ఉన్నాం. కుప్ప వైరాగి శాస్త్రి గారు కూడా room లో ఉన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఈ ప్రశ్న వదిలిపెట్టారు. సమాధానం ఎవరి దగ్గర లేదు. ప్రశ్న వేశారు అంటే స్వామే సమాధానం చెప్పబోతున్నారు అన్నమాట. అప్పుడు మనం మౌనంగా ఉంటే స్వామి బోధ మనకు అందుతుంది అందరం మౌనంగా ఉన్నాం. ఆత్మసాక్షాత్కారం అంటే సినిమాల్లోలాగా మనిషి మంచం మీద పడుకుంటే ఆ మంచంలో నుంచి ఇంకో బొమ్మ బయటికి రావటం అని అనుకుంటున్నారా? మీలాగానే ఒక pant, shirt వేసుకుని ఇంకోడు లేచి వస్తాడు అనుకుంటున్నారా? లేదు బంగారు ఆత్మ comma పెట్టండి pause ఇవ్వండి సాక్షాత్ pause ఇవ్వండి ఆకారమై ఉన్నది. నువ్వు దేహంగా కనిపిస్తున్నా ఆత్మే దేహంగా వెలుగుతున్నది బంగారం. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అన్నీ దాటితే ఒక ఇంటికి సింహద్వారం ఉంటుంది పెరటి ద్వారం వాణి ద్వారం అంటాం. అంటే ఇంటి వెనక నుంచి వాకిలి. సింహద్వారం దగ్గర calling bell కొట్టా ఎవరూ తలుపు తీయలేదు. అలవాటైన వాడు తెలిసిన వాడు ఏం చేస్తాడు అంటే దొడ్డి వైపు వెళ్లి వెనక్కి వెళ్లి తలుపు తీసుకుని ఇంట్లో ప్రవేశిస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు calling bell నొక్కుతాడు సింహద్వారం నుంచి లోపలికి వెళ్తాడు. జ్ఞాని కాని వాడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇది order అయితే స్థూల శరీరం నుంచి ప్రారంభించి చివరి దాకా వెళ్తాడు ఒకడు. అసలు చివర ఉన్నటువంటి అహంకారాన్ని వదులుచుకుంటూ చిత్తాన్ని సమయోగం చేస్తూ అంటే యోగ స్థితిలో నెట్టుకుంటూ బుద్ధిని పదును ఎక్కించుకుంటూ మనస్సుని అణచుకుంటూ కారణ శరీరాన్ని అనుభవిస్తూ సూక్ష్మ శరీరాన్ని దర్శిస్తూ స్థూల శరీరం దేహంగా వెలుగుతాడు. ఇంట్లోకి వెళ్ళటానికి ఈ వాకిలైతేమి ఆ వాకిలైతేమి ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది. ఏమి ఇక్కడ పరమాత్మ సాక్షాత్కరించలేదా అంటూ స్వామి ఆ interview ముగించారు. అంటే పరమాత్మే సాక్షాత్తు సత్యసాయి ఆకారమై మీ ముందు కూర్చోలేదా? ఇది ఆకారమై ఇది పరమాత్మ సాక్షాత్కారం అయినప్పుడు మీది ఆత్మసాక్షాత్కారం కాక భిన్నమా? దీనికి పెద్ద ప్రయత్నం చేయాలా? మీరే దేహాలుగా వెలుగుతున్నారు బంగారం అన్నారు. అంటే ఆధునిక మానవుడికి గంభీరమైనటువంటి విషయాలను కూడా ఇట్లా కర్మ, భక్తి, యోగ, జ్ఞాన, జ్ఞాన యోగాలలో పరిపూర్ణమైనటువంటి ఒక సమస్థితి కలిగించటానికి సత్యసాయి భగవానుడు ఇన్ని సంవత్సరాలుగా ఉపదేశ మార్గం చక్కగా మనకు తెలియజేస్తూ ఆ ఉపదేశనంలో నుంచి ఉపశమనం పొందుతూ ఉపశమనంలో నుంచి ఆ-ఆనందాన్ని పొందుతూ శక్తిని కూడగట్టుకొని మనంతట మనం ఇవాళ నీరు సిద్ధం నావా సిద్ధం నడిపే నావికుడు సిద్ధం మిమ్మల్ని కచ్చితంగా గట్టుకు తీసుకువెళతానని ప్రమాణం చేసి ఒక అభయాన్ని ఇచ్చినటువంటి పరమాత్మ సత్యమై ఉన్నటువంటి వేళ ఇంకా మనం శషభిషలు పోయి నాకదొచ్చు నేనిదొచ్చు నేను అద చేశాను ఇద చేశాను అహంకార నివృత్తిలో నుంచి మహాపరినిర్వాణ దశ వైపు జీవుడు వెళ్ళాలి. ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. ప్రవృత్తి అంటే సహజ మానవ సహజమైనటువంటి భావనలో నుంచి పరిణామ దశని దాటి పరమేశ్వరుడి యొక్క తత్వం వైపు వెళ్ళటమే అధ్యాత్మ సాధన. అధ్యాత్మ సాధన అంటే కేవలం పూజాదులు మాత్రమే కాదు అధ్యాత్మ అంటే నిత్యంగా జీవించటం, సత్యంగా జీవించటం, అత్సంగా జీవించటం, జీవితాన్ని నడపటము కాదు గడపటము కాదు, జీవితాన్ని పరిపూర్ణంగా అర్థవంతంగా జీవించటమే అదే అధ్యాత్మ యోగం కాబట్టి అది జ్ఞానం మార్గం ద్వారా సంస్థితమైనటువంటి స్థితిలో అన్నింటినీ చాలా controlled గా చాలా balanced గా equanimity, equilibrium, equipoise వీటన్నింటినీ కూడా చక్కగా అనుష్ఠానం చేస్తూ జ్ఞాన యోగ మార్గంలో ఇప్పటివరకు వచ్చినటువంటి మహాపురుషుల యొక్క బోధలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ మన పరమ గురువైనటువంటి భగవాన్ సత్యసాయి బోధలని చక్కగా inter-intervene చేస్తూ interview view చేస్తూ ఆ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పరిపూర్ణ మహాయోగ స్థితిలోకి మనందరి జీవితాలు సాగుగాక. ఆ శక్తిని పరమేశ్వరుడు అయినటువంటి స్వామి మనందరికీ అనుగ్రహించు గాక అని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio
Talk on Gyana Yoga
Talk on Gyana Yoga
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 30:50
More in this series
Talks
- 24 min 1
Talk on significance of festival of Sankranthi
- 52 min 2
Talk - on Guru Tatwam
- 40 min 3
Talk - Koti Samithi Hyd
- 28 min 4
Talk - Bharata
- 23 min 5
Talk on Dasara
- 6 min 6
Talk on Rathasaptami
- 32 min 7
Talk on Sri Sathya Sai - Part 05
- 33 min 8
Talk on the character of Draupadi
- 30 min 9
Talk on Gyana Yoga
Now playing - 29 min 10
Talk on Hanuman Panchamukham
- 23 min 11
Talk on Leela Kaivalya Vahini
- 35 min 12
Talk on Sathya Sai Sukthamulu
- 24 min 13
Talk on yoga Triveni
- 26 min 14
Talk on the occasion of Avatar Declaration day