No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాంశ కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం అలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాన్మి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఇవాళ ప్రపంచానికి మనం స్వామితో ఎట్లా ఉన్నాము అనేది ప్రధానం కాదు. స్వామితో మనం ఉన్నందుకు మనం మన జీవితాన్ని ఎలా పండించుకున్నాం అన్నదే ప్రధానం. సాక్షాత్తు అవతారమూర్తితో కూడి ఉన్నా, అసంఖ్యాక వానర సైన్యం ఉన్నా, ఒక్క ఆంజనేయుడు మాత్రమే స్వామికి దగ్గర కాగలిగాడు. స్వామికి దగ్గర ఈయన అయినాడా? స్వామి ఆయనను దగ్గరకు చేర్చుకున్నారా? అని ప్రశ్నిస్తే స్వామే ఆయనను దగ్గరకు తీసుకున్నారు. కృతం హనుమతా కార్య సమవిద్విహు దుష్కరం మనసాపి యదన్యేన న శక్యం ధరణీతలే వాల్మీకి రామాయణంలో సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి రామచంద్రుడు ఆంజనేయస్వామి గురించి ఈ మాట అన్నాడు. ఎంతోమంది రామకార్యంలో పాల్గొని ఉండవచ్చు గాక, రామ సేవాకృతులుగా మారి ఉండవచ్చు గాక, కానీ రామ కార్యాన్ని తన కార్యం కంటే మిన్నగా, తన కార్యం కంటే ఉదాత్తంగా, అసలు తన కార్యమే కానట్టుగా పరిపూర్ణం చేసినటువంటి ఒక హనుమ తప్ప మరొక వ్యక్తికి సాధ్యం కాదు ఈ భూమండలం మీద అన్నాడు. రాముడు పట్టాభిషేక సమయంలో చేసినటువంటి ప్రమాణం ఇది. మనం కృతయుగంలో ఉన్నామో లేదో తెలియదు, త్రేతలో రాముణ్ణి చూశామో లేదో తెలియదు, ద్వాపరలో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం మనకు లభించిందో లేదో మనకు ఎరుక లేదు. కానీ కలియుగంలో వచ్చినటువంటి మహా పరిపూర్ణమైనటువంటి ద్వితీయ దత్త అవతారం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం మనం చూశాం. మరి ప్రప్రథమ దత్తావతారం ఏమిటి? అని శ్రీడి మహాస్వామి తొట్ట తొలి దత్తావతారం, పూర్ణావతారం. అంశావతారంగా, ప్రథమావతారంగా శ్రీపాద శ్రీవల్లభులు వచ్చినా కాస్త తక్కువ కాలం మాత్రమే ఉన్నదది. శ్రీడి స్వామి యొక్క అవతారం అంతా కూడా జన జాగరణ కోసం, జన కళ్యాణం కోసం వచ్చినటువంటిది. మత సమన్వయాన్ని ఒక రససిద్ధం చేసినటువంటి, పూర్ణమైనటువంటి అవధూత యొక్క ఆకారము, సాకారము, స్వరూపము, స్వభావము, సగుణము ఇవన్నీ గనక కలిపినట్లయితే ఆయన శ్రీడి బాబా. ఎట్లాగైతే శ్రీమన్నారాయణుడికి దశావతారాలు ఉన్నాయో, నిజానికి ఇరవై ఒక అవతారాలలో ఈ పది ప్రధానం కాబట్టి, వారికి ఎలా ఉన్నాయో ఈ సాయికి కూడా మూడు అవతారాలు ఉన్నాయి. శ్రీడి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి. ఒక దాన్ని చూడలేదు, మూడో దాన్ని చూస్తామో లేదో తెలియదు. అంటే జరిగిపోయిన కాలంలో మనకి మరపే ఉన్న తప్ప గుర్తు లేదు. రాబోయే కాలాన్ని బట్టి దానికి అది ఓ ఊహే తప్ప వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒక అతి వాస్తవికమైనటువంటి దృష్టితో, సంపూర్ణమైనటువంటి ఆనంద తారక రసార్ద్ర స్థితిలో ఒక మహాపురుషుణ్ణి మాత్రం మనం దర్శనం చేశాం. అది అవతార స్ఫూర్తిగా, ఆనంద కీర్తిగా, ఆశయ పతాకగా, ఆదర్శ శిఖరం గా సత్యసాయి భగవానుణ్ణి మనం దర్శనం చేసుకున్నాం. ఇవాళ ప్రపంచం యావత్తు స్వామి యొక్క మహా పరినిర్వాణ అనంతరం కొత్త సాధనా మార్గం వైపు ఎదురు చూస్తున్నది. ఆ సాధన గతించిన స్మృతులతో అల్లుకునేటువంటి పందిరి కాదది. రాబోయేటువంటి కాలాన్ని మహోజ్వలం చేయటానికి, ఉద్దీపనం చేయటానికి, ప్రకాశమానం చేయటానికి, విస్తృతం చేయటానికి, గంభీరం చేయటానికి, సుసంపన్నం చేయటానికి భారతీయ ఆర్య ధార్మిక వైదికమైనటువంటి ఒక మహా పరి సత్యాన్ని ఈ ప్రపంచానికి అందించేటువంటి దిశగా ఈ రోజున మనందరం కూడా సిద్ధం కావాలి. జరిగినదంతా స్ఫూర్తిదాయకమే. జరగబోతున్నదంతా అశావహమే. మరి జరుగుతున్నటువంటి ఈ వర్తమానాన్ని గనక సముజ్వలం చేసుకోగలిగినట్లయితే ఒక అవతారమూర్తితో గడిపినటువంటి ఈ నిండైన, పండైన, పరిపూర్ణమైనటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళమవుతాం. నిజానికి గ్రామ గ్రామానా ఒకనాడు రామాలయాలు ఉంటే, సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతరణం తర్వాత గ్రామ గ్రామానా, ప్రతి జన హృదయాన సత్యసాయి యొక్క హృదయ మందిరాలు ఏర్పడ్డాయి.ఆ హృదయ మందిరాలలో సత్యసాయి ఉన్నారు వారితో మనము ఉన్నాం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశమనసాస్వం చిన్దతా మజ్జతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్ఠు భవత్వం ఇది రమణ మహర్షి ఆత్మవిచార మార్గంలో మానవ దేహంలో ఆత్మ ఎక్కడ ఉన్నది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఒక తులనాత్మకమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. దాన్ని అచ్చ తెలుగులో చెప్పుకోవాలి అంటే ఎడమ వైపున ఉన్నటువంటి మాంసఖండర యుక్తమైనటువంటి గుండె కంటే ఒకటిన్నర అంగుళాల దూరంలో కుడి రొమ్మున ఉన్నటువంటి హృదయ స్థానము అది మౌన భూమిక అది చైతన్య భూమిక ఎడమ వైపున ఉన్నది గుండె కుడివైపున ఉన్నది హృదయం. ఈ హృదయంలో నుంచి మనస్సు పుడుతున్నది. ఆ మనస్సు పుట్టటానికి ముందు నేను నేను అంటున్నది అది యహం మహమితి సాక్షాత్ అంటున్నది కానీ ఎవరు అంటున్నది అంటే దేహమా కాదు స్థూల శరీరమా అసలే కాదు సూక్ష్మ కారణ శరీరాలా అంతకంటే కాదు మనో బుద్ధి చిత్ అహంకారాలా అవి కాదు మరి ఏమున్నాయయ్యా అంటే యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి. కాబట్టి మనందరిలో ఈ హృదయ స్థానంలో ఏమున్నది అని గనుక ఒక చిన్న ప్రశ్న తాత్వికమైన దివ్య జీవన విధానంలో గనుక వేసుకోగలిగినట్లయితే ఆత్మ అనేది మన యందు ఉన్నది అని స్పష్టమవుతున్నది. లోపల సర్వేంద్రియాలు మనోబుద్ధులు చిత్తము అహంకారము అనబడేటువంటి ఏడు శరీరాలు కూడా కేవలము ఆత్మ యొక్క కదలిక ఆత్మ యొక్క ప్రకంపన చేత ఇవన్నీ కూడా తమ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి అని మన కేనోపనిషత్తు చెబుతూ ఉన్నది. రాముడు ఆంజనేయ స్వామిని దేహధారిగా చూసి ఓ హనుమా ఓ పవనసుతా ఓ ఆంజనేయ కుమారా మిత్రమా అని సంబోధించాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు గనుక చదివినట్లయితే అర్జునుడిని అనేకానేక రీతులలో బోధిస్తూ వచ్చాడు ఒక్క అర్జునా అని మాత్రమే అనలేదు పరంతప అన్నాడు మాశుచ అన్నాడు ధనంజయ అన్నాడు ఇన్ని పేర్లతో పిలుస్తున్నావే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నేను ఏం కావాలి ఇప్పుడు అన్నాడు యోగిర్భవతి అర్జునా నువ్వు యోగివి కా అన్నాడు. యోగి కావటం అంటే భోగాన్ని పూర్ణంగా విసర్జించగలగటమే యోగత్వం. యోగత్వం అంటే ఒక సిద్ధాంతాన్ని రాద్ధాంతం చేసి ప్రచారం చేసేది యోగం కాదు. యోగము అంటే కూడి ఉండటం కలయిక దేనితో కూడి ఉండటం ఆత్మతో కూడి ఉంటే దాని పేరు యోగం. అటువంటి ఆ యోగ భూమికలో ఉన్నటువంటి అర్జునుడి చేత భగవద్గీతని ఉపదేశనం చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని అనేక రీతుల సంబోధించాడు. సత్య సాయి భగవానుడు ఆ రెండు అవతారాల కంటే భిన్నంగా ఏ ఒక్క వ్యక్తిని లౌకిక కార్యకలాపాలను వినహాయించి మిగతా బహిరంగంగా స్వామి ఉపన్యాసం ప్రారంభించటానికి ముందు ఒక మహోత్కృష్టమైనటువంటి సంబోధన చేశారు. దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా ఇది భారతీయ ఇతిహాసంలో కానీ పురాణంలో కానీ చరిత్రలో కానీ వేద వాఙ్మయంలో కానీ సాకార స్వరూపమైనటువంటి ఏ అవతారం కూడా తన ముందు ఉన్నటువంటి జీవకోటిని ఇట్లా సంబోధించటం మనం ఇంతవరకు వినలేదు అది సత్య సాయి భగవానుడి యొక్క ప్రత్యేక శైలి. ఆ శైలిలో ఎందుకని అన్నారు దివ్యాత్మ స్వరూపులారా అని ఆత్మ వేరు దివ్యాత్మ వేరా ఆత్మ దివ్యం కాదా ప్రేమ వేరు ఆత్మ వేరా మరి దానిని దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా అని ఎందుకు సంబోధించారు? విచారణ చేసినట్లయితే ప్రతి జీవుడి యందు కూడా ఈ ఆత్మ లేకుండా లేదు అంటే ఉండనే ఉన్నది అని. ఈ ఎరుకలోకి నేను దేహాన్ని మాత్రమే కాదు నేను ఆత్మను అన్నటువంటి ఎరుకలోకి వెళ్ళినటువంటి వాడు జ్ఞాని అవుతున్నాడు. జ్ఞాని అంటే జ్ఞానము కలవాడు అని అర్థం అది కూడా ఒక స్థాయి మాత్రమే. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దయా శతకం అని ఒక మంచి గ్రంథం ఉంది ఎప్పుడన్నా చదువుకోండి అందులో ఆ దయా శతకంలో శ్రీ వేంకటేశ్వరుడిని ఆయన అంటారు ఓ దయగలవాడా వేంకటేశ్వరా నువ్వు దయగలవాడివే కానీ నీవు దయ కాదు కదా అంటాడు విశేషంగా. డబ్బున్నవాడు డబ్బు ఎట్లా కాదు డబ్బు కలిగిన వాడు అన్నమాట జ్ఞానము ఉన్నటువంటి వాడు జ్ఞాని ఎట్లాగో ఈ జ్ఞానే గనుక జ్ఞాన స్వరూపంగా గనుక మారగలిగినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి విభూతి స్థాయి. ఆ విభూతి స్థాయిని సర్వేశ్వరుడు సర్వాంతరాత్మ సర్వజ్ఞుడు సకల పూర్ణుడు అయినటువంటి పరమాత్మ సాయి మనల్ని దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధించటంలోనే మన లక్ష్యాన్ని మన గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశనం చేశారు. ఈ ప్రపంచంలోకి ప్రాపంచికమైనటువంటి ఏ వృత్తినో డొక్క నింపుకోవటానికి కావలసినటువంటి ఏ ఏ కార్యకలాపాలు చేయటానికో ప్రాపంచికమైనటువంటి ఆస్తులన్నీ సంపాదించడానికో నిండు నూరేళ్ళు ఎవరికీ ఉపయోగపడకుండా జీవించటానికో వచ్చిన వాళ్ళం కాదు. అమృతస్య పుత్రాః ఇది వేద వాక్యం ఉపనిషత్ వాక్యం. వివేకానంద స్వామి తన ఉపన్యాసాల అన్నింట్లలో కూడా జీవుడిని తోటి మానవుడిని.అమృతస్య పుత్రాహ అన్నాడు అంటే నీవు అమృత లోకంలో నుంచి వచ్చావు నీకు చావు లేదు. చావు లేదంటారేమిటి ఎన్నో మరణాలు సంభవిస్తుంటే అంటే చొక్కాలు మారినట్టుగా మనం ధరించిన వస్త్రాలు మనం మార్చుకున్నట్టుగా ఈ ఆత్మ ఈ దేహం అనేటువంటి వస్త్రాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళిందే తప్ప అఖండము చిరంతనము అచ్యుతము అనంతము అనాహతము పూర్ణము ధవళము తరళము సరళము అచ్చము సత్యము అయినటువంటి ఆత్మ ఎక్కడా అది మార్పు చెందటం లేదు. ఈ మార్పు చెందని అఖండ ఆత్మ ఎన్నెన్ని దేహాల్లో ధరించవచ్చు గాక ఎన్నెన్ని జన్మలో ఎత్తి ఉండవచ్చు గాక ఎన్నెన్ని ప్రవృత్తులతోనూ తమ జీవయాత్ర సాగించి ఉండవచ్చు గాక కానీ ఒక పరమాత్మతో కూడి సంచారం చేసినటువంటి మన బోటి వారమందరం ఏం చేయాలి అన్నదే ప్రధానమైనటువంటి కర్తవ్యం మన ముందు. ఆ కర్తవ్యానికి స్వామి అనేకమైనటువంటి మార్గాలు ఉపదేశనం చేశారు. అలాగే అనేకమైనటువంటి సందేశాలు కూడా స్వామి ఇచ్చారు. వాటన్నింటికంటే ముందు స్వామిని అధ్యాత్మ అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు తొలినాళ్లలో స్వామి ఇచ్చిన సమాధానం ఒకటే, ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి రండి అని. ప్రవృత్తి మార్గం అంటే ప్రాపంచిక మార్గం అని అర్థం. ప్రపంచంలో నేను ఇది చేశాను నాకేం వస్తుంది, ఏం చేస్తే నాకేం వస్తుంది లేదా నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేసినందువల్ల ఈ లాభాన్ని నేను పొందగలిగాను అనేటువంటి కార్య, కాల, కారణ, కర్తవ్య అనబడేటువంటి ఈ నాలుగు అంశాలతో ముడిపడి ఉన్నదంతా ప్రవృత్తి మార్గమే. నేను దానం చేశాను ఆనందం కలిగింది, యజ్ఞం చేశాను పది మందిని ఒక చోట కూర్చోగలిగాను, కలిగిన వారందరూ నలిగిన వారిని కాపాడుకునే దిశగా నేను మహత్తరమైనటువంటి కార్యకలాపాలు చేశాను, ఇదంతా కూడా ప్రవృత్తి మార్గమే. ప్రవృత్తి మానసికమైనటువంటిది నివృత్తి హృదయగతమైనటువంటిది. మానవుడికి ఈ రెండూ కూడా ఉన్నాయి మనస్సు హృదయము. ఇందాక అన్నామే హృదయము అంటే ఏమీ లేదు అని. ఆ ఏమీ లేదు అంటే ప్రత్యేకంగా కనపడేది కాదు అని. కానీ మనస్సు అంటే అనుభూతిగా, అనుభవంగా, సుఖంగా, దుఃఖంగా, కష్టంగా, నిష్టూరంగా, విచారంగా ఏదైతే అనిపిస్తున్నదో ఇదంతా కూడా మనసుకు సంబంధించిన విచారణ గనుక సత్యసాయి భగవానుడు మనకి ఏం చెప్పారు అంటే ఈ ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళండి. దేహ భావనలో నుంచి, దేహాత్మ భావనలో నుంచి ఆత్మగతమైనటువంటి ఒక విషయం వైపు, ఒక సంగతి వైపు అడుగులు నెమ్మది నెమ్మదిగా వేయండి. ఆ వేయటానికి వైదాంతిక భూమికలో ఇప్పటిదాకా వచ్చినటువంటి అనంత కాల మహా ప్రవాహంలో ఎన్నెన్నో మార్గాలు ఎందరెందరో సత్పురుషులు కూడా మార్గోపదేశనం చేశారు. ఆ కాలగమనంలో విలువలు మారి, అవసరాలు మారి, ధర్మాలు మారి అది కూడా రూపాంతరీకరణం చెందుతూ వచ్చింది. ఈ ఆధునిక సమాజంలో అంటే మనం ఉన్నటువంటి ఈ సమాజంలో, ఈ సమకాలీనమైనటువంటి కాలంలో అనేక ప్రశ్నలు ఒకటి రెండు కాదు ప్రతిదీ ప్రశ్నే, ప్రతిదీ సందేహమే, ప్రతిదీ శంకే, దేనిని నమ్మటానికి వీలులేని ఒక మనోస్థితి ఏర్పడిన కాలంలో సత్యసాయి భగవానుడు ఈ సర్వ మార్గాల అంతర్వాహిని ఏదైతే ఉన్నదో దానిని ప్రేమగా, సేవగా ఉపదేశనం చేస్తూ వచ్చారు. అలా గనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుంది అని ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి మనం నెమ్మదిగా వెళ్లగలుగుతాం. అయితే ఇది తరువాతి తరానికి అర్థం కాలేదు. మళ్ళీ సత్యసాయి భగవానుడినే ఇదే ప్రశ్న వేసినప్పుడు "ఏం లేదు బంగారు ప్రభావంలో నుంచి స్వభావంలోకి రండి దాని పేరే అధ్యాత్మ" అన్నారు. ప్రభావం అంటే తల్లి గర్భాలయంలో ఉన్న మనందరం కూడా ఏ ప్రభావానికి లోను కాకుండా మాతృమూర్తి ఏ శ్వాసను పీల్చిందో దానిని మనదిగా, ఏ ఆలోచన చేసిందో ఆ ఆలోచన మనదిగా, ఏమి సంకల్పించిందో దానిని మన శక్తిగా, ఏ విచారధారలో తన మనస్సుని నిమగ్నము లగ్నము చేసిందో అదంతా మనదిగా భావిస్తూ మమేకమైనటువంటి ఒక నికామ స్థితిలో తల్లి గర్భంలో మనందరం కూడా తొమ్మిది నెలలు ఉన్న వాళ్ళమే. కానీ మంత్రసాని బొడ్డు గోసిన మరుక్షణమే తల్లి గర్భంలో నుంచి బయట పడగానే ఆకలి, దాహము, కోరిక, కామన, చింత ఇవన్నీ కూడా ఏర్పడి జీవుణ్ణి నెమ్మదిగా ఒక ప్రభావానికి లోను చేసింది. ఆ ప్రభావం కేవలము ప్రకృతి పరమైనటువంటిది. సుఖం ఉన్నదా, దుఃఖం ఉన్నదా, ఆనందం ఉన్నదా, సంతోషం ఉన్నదా వీటన్నింటికీ కూడా మూలతత్వ విచారం గనుక చేసినట్లయితే మనసంటూ ఉంటే ఇవన్నీ ఉన్నాయి. మనసును గనుక అమనస్కం చేయగలిగితే హృదయ స్థానం వైపు నడిపించగలిగినట్లయితే ఆ హృదయ స్థానంలో ఏమున్నది అంటే శాంతి ఉన్నది, సంయమనం ఉన్నది, నిశ్శబ్దం ఉన్నది, నికామమున్నది, నికేతనమున్నది, నిరంజనమున్నది, నిశ్శబ్ద స్థితి నుంచి నిశ్చల స్థితి ఉన్నది, ఒక నిర్మోహ స్థితి ఉన్నది. ఇదంతా ఎక్కడ ఉన్నది అంటే ఒక ఆంతరంగికమైనటువంటి భావనా భూమికలో నిలకడ చెంది ఉన్నది గనుక ప్రభావంలో నుంచి స్వభావంలోకి రమ్మన్నారు. ఇది అర్థం కాలేదన్నారు. అన్నవాళ్ళం మనమే. స్వామి! ప్రవృత్తి నుంచి నివృత్తి అన్నారు కొంత అర్థమైంది, ప్రభావం నుంచి స్వభావం అన్నారు ఇంకాస్త అర్థమైంది కానీ పూర్తిగా మాత్రం అర్థం కాలేదంటే మానవుడు మానవుడిగా జీవించగలగటమే అధ్యాత్మ. అంటే అనేకమైనటువంటి జన్మలు ఎత్తి వచ్చిన మనం ఇంకా Residual Animal Instincts మనలో ఉన్నాయి, అసూయలున్నాయి.ద్వేషాలున్నాయి, పగలున్నాయి, అసమానతలున్నాయి, క్రోధం ఉన్నది, మోహమాత్సర్యాలు ఎట్లాగూ ఉండనే ఉన్నాయి. వీటన్నింటికంటే దంభము ఎక్కువగున్నది, ప్రగల్భం ఎక్కువగున్నది. వీటన్నింటినీ కూడా సవరించుకోకపోయినట్లయితే జీవుడి యొక్క అధ్యాత్మ ప్రస్థానం తేలికగా కొనసాగదు. అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. అధ్యాత్మ అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏ విష్ణులోకానికో, కైలాసానికో ప్రయాణం చేయటం మాత్రం కాదు. అధ్యాత్మ అంటే మానవుడు తనలో ఉన్నటువంటి మాధవత్వాన్ని ఎరిగి, ఆ మాధవీయమైనటువంటి స్థాయిలో మానవ జీవితాన్ని పరవళ్ళు తొక్కిస్తూ, ఆనంద సందోహంగా నడిపిస్తూ, చల్లని, నెమ్మదైనటువంటి, నిస్తంద్ర మంద్రంగా, గంభీరంగా సాగేటువంటి ఒక సెలయేరువలె ప్రసన్నత, పారమార్థికతతో కూడినటువంటి దివ్య జీవన గీతికగా గనక సాగించగలిగితే దాని పేరు అధ్యాత్మ. ఆ అధ్యాత్మలో దానాలున్నాయి, జపాలున్నాయి, తపస్సులున్నాయి, ధ్యానాలున్నాయి, యోగాలున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవి ఏమీ లేనటువంటి, కానీ అన్నీ ఉన్నా కలిగేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభవం ఏదైతే మన అంతరంగంలో ఉన్నదో దాన్ని ఒక యాగంగా, ఒక యోగంగా, పూర్ణ మానస చిత్తులమై గనక మనం సాధించుకోగలిగినట్లయితే అది యోగ భూమిక. కనుకనే సత్యసాయి భగవానుడు మనని "దివ్యాత్మ స్వరూపులారా" అని సంబోధించటంలోనే పరమాత్మకి, ఈ కనిపిస్తున్న దివ్యాత్మకి అభేదాన్ని చెప్పారు. ఎందుకని అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆదిత్య కిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి బయటకు వచ్చేటువంటి సుషుమ్నా కిరణాలు ఎట్లాగైతే చందమామ నుంచి, చంద్రుడి నుంచి భిన్నం కావో, పరమాత్మ నుంచి ప్రాదుర్భవించినటువంటి ఈ మహా జీవకోటి కూడా పరమాత్మ కంటే భిన్నం కాదు. ఎవరికి కాదు అంటే ఎరుక కలిగిన వాడికి కాదు, ఎరుక లేని వాడికి భగవంతుడు వేరు, మనము వేరు అనేటువంటి భావన. అయితే భగవంతుడు వేరు కాదా అంటే వేరు కాదు. తల్లి తనువుని పంచుకొని, తెంచుకొని పుట్టినటువంటి బిడ్డ ఎట్లా అభిన్న, అద్వైత, అద్వితీయ, రమణీయ, మనోజ్ఞ స్థాయిలో ఉంటారో అలాగే పరమాత్మకి, జీవాత్మకి నిజానికి ఎట్టి తేడా లేదనేటువంటి భావనా భూమికలో నుంచి సత్యసాయి భగవానుడు "దివ్యాత్మ స్వరూపులారా! మీరు ఎరగండి, మీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి." కాకపోతే ఆ దివ్యాత్మ యొక్క స్పృహ కలగాలి అంటే మీలో ఇంకా మూడు పారిశ్వాలున్నాయి. ఒకటి దానవత్వము, రెండవది దీనత్వము, మూడవది మానవత్వము. ముందుగా దానవత్వాన్ని వదిలిపెట్టాలి. అరిషడ్వర్గాలన్నీ కూడా దానవత్వానికి సంబంధించినవే. అరిషడ్వర్గాలను జయించమని ప్రతి వేదాంతి చెప్తాడు. కానీ జయించటం ప్రధానం కాదు, జయించిన ఇంద్రియాలతో జీవించగలగటం ప్రధానం. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను తపస్సు చేత, స్వాధ్యాయం చేత, సద్గోష్ఠి చేత, సదాచారం చేత, సమ్యక్ సంకీర్తన చేత, సత్సంగం చేత, సత్సాంగత్యం చేత ఏ రకంగా అయినా ఇంద్రియాలను సాధించవచ్చును, జయించవచ్చును. కానీ జయించిన వాటితో జీవించటం ప్రధానం కనుక, అది అధ్యాత్మ కనుకనే సత్యసాయి భగవానుడు ముందుగా మనలో ఉన్నటువంటి దానవత్వాన్ని మనం వదిలిపెట్టాలి. ఆ దానవత్వ గరిమను దాటకుండా, ఆ భూమికను దాటకుండా అధ్యాత్మలోకి మనం ప్రవేశించినా కొంత అర్థమైనట్టుగా ఇంకా తెలియవలసింది ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది. లేదా అహంకారం చేత అన్నీ నాకు తెలుసని కూడా అనిపిస్తుంది. ఇది మనస్సు చేసేటువంటి ఒక వింత గారడి. ఆ మాయాజాలంలో నుంచి బయటపడి దానవత్వాన్ని నెమ్మది నెమ్మదిగా ఒక మార్గంలో గనక ప్రవేశించి, అందరితో సంయమనంగా, సహజీవన సౌందర్యంతో జీవించగలిగినట్లయితే దానవత్వం నెమ్మదిగా మాసిపోయి, సమసిపోయి, దీనత్వం వైపు మన మనస్సు వెళుతుంది. మానవుడు అన్నీ ఉన్నా దీనుడే. చాలా కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక సంపన్నుడిని దగ్గరకు వెళ్లి, "మీకు సంతృప్తిగా ఉన్నదా మీ జీవితం?" అని అడగండి. ఎంతో కష్టపడి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే సంపాదించాను. దైవానుగ్రహం నా యందు అంతగా ఉన్నట్టు లేదు. నా తెలివితేటలకి ఇంకా రెండు, మూడు వందల కోట్లు సంపాదించవలసిన వాడిని నేను అంటున్నాడు. అంటే ఏమవుతున్నది? ప్రాపంచికమైనటువంటి లౌకిక భౌతిక సంపదలు అన్నీ మన కైవసం అయి ఉన్నా ఆనందం లేదు, శాంతి లేదు, హాయి లేదు, ప్రసన్నత లేదు, ఆహ్లాదం లేదు. ఎందుకని లేదు? ఎందుకని లేదంటే తృప్తి లేదు గనుక. తృప్తి అనేది గనక ఒక్కటి ఉన్నట్లయితే ప్రతిరోజు వారి సంపాదించుకుంటూ ఆ కూలి డబ్బులతో తనకున్నటువంటి ప్రదేశంలో తాను ముడుచుకొని, పడుకొని మళ్ళీ తెల్లవారి కొత్త జీవితాన్ని ప్రారంభించేటువంటి ఆ పరిదీనుడు ఈ సంపన్నుడి కంటే నా దృష్టిలో కొన్ని లక్షల రెట్ల కోటీశ్వరుడు వాడు. వాడు గొప్పవాడు. వాడు రేపుని ఆహ్వానిస్తున్నాడు. ఇలాగే ఉంటే చాలనుకుంటున్నాడు. ఈ మాత్రం నడిచిస్తే చాలనుకుంటున్నాడు. కానీ సంపద ఉన్నవాడు అట్లా అనుకోవటం లేదు. నా తర్వాత రాబోయేటువంటి కొన్ని తరాల వరకు నేను దీనిని సంపాదించాలి అంటున్నాడు. అని మార్గాన్ని, తప్పు మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. కనుక దివ్యత్వాన్ని అతడు అనుభవించే అవకాశం లేదు. దానాలు చేస్తాడు, చందాలు ఇస్తాడు, యజ్ఞాలు చేస్తాడు. ఏదన్నా మంచి పని అంటే డబ్బు జేబులో నుంచి తీసిస్తాడు. కానీ దాన్ని అహంకారాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆనంద స్పర్శను మాత్రం వాడు అనుభవించలేడు. మరి ఆనందం ఎక్కడ ఉన్నది? ఈ దీనత్వాన్ని గనక దాటగలిగినట్లయితే...చేయి చాపటం గనక ఆపగలిగినట్లయితే, అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క ప్రత్యేకత, ఈ అవతారంలో ఇమిడి ఉన్నటువంటిది ఏమంటే మీ చేయి భగవంతుని ముందు కూడా చాచకండి. అడగందే అమ్మాయి నా పెట్టదనే ముసుగు వేసుకోకండి. మీ అవసరాలు ఏమిటో పరమాత్మకు ఎరుకే. మీ అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, మీ తాహతును బట్టి, సన్నివేశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి పరమేశ్వరుడు కరుణిస్తూనే ఉంటాడు. దానికై మీరు ప్రత్యేకంగా చేయి చాపవలసిన పని లేదు అన్నారు. కనుక ఈ దానవత్వాన్ని, దీనత్వాన్ని గనక దాటగలిగినట్లయితే అదిగో అప్పుడు మనం మానవులం కాగలుగుతాం. 1978 ప్రాంతం, కుప్పా భైరాగి శాస్త్రి గారు స్వామి interview room లో ఉన్న సమయంలో ఎవరో భక్తులు స్వామి ఆరోజు ఉపన్యాసంలో చెప్పిన కొన్ని మాటలు ఆనందం కలిగించినాయి అని స్వామికి వారు విన్నవిస్తూ, "స్వామి GOD God కి ఇవాళ మీరు చెప్పినటువంటిది చాలా ఆనందం కలిగింది. generator వాడే organizer వాడే destroyer వాడే. ఈ మూడు కలిపితే GOD God కదా స్వామి. ఇంగ్లీషులో ఉన్నటువంటి ఈ అనుకూలం మన తెలుగు పదాలకి లేదే, ఎట్లా స్వామి? అవును ఇంతకీ మానవ అంటే ఏమిటి స్వామి?" అని అడిగారు. సర్వపూర్ణ ప్రజ్ఞామూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడు ఒక్క second కూడా తటపటాయించలేదు. ఏమన్నారంటే, మా అంటే కాదు నవ అంటే కొత్త. మా నవ, నువ్వు కొత్త కాదు కుప్పా భైరాగి శాస్త్రి. ఎందుకంటే, నీవు సనాతనుడివే ఇప్పుడు సనూతనుడిగా కనిపిస్తున్నావు. నీవు అనంత కాలం నుంచి నీవు ఉన్నవాడివే కానీ అప్పుడెప్పుడో ఉండి ఇప్పుడు లేకుండా లేవు. అంటే, నీవు ఏ ఆత్మగా అనేక కాలాలలో అపరిచ్ఛిన్నంగా ఉన్నావో, అఖండంగా ఉన్నావో, ఎక్కడా విడిపడి లేవో అదే నీవై ఈరోజు దేహంగా కనిపిస్తున్నావు. కనుక మానవ శబ్దానికి అర్థం ఇది అన్నప్పుడు భైరాగి శాస్త్రి గారు తన భుజాన తగిలించుకున్న సంచి పక్కన పెట్టి, "స్వామి పాద నమస్కారం చేసుకోవచ్చునా?" అని అనుగ్రహిస్తే, "అవునులే పదనమస్కారం అయింది ఇక పాద నమస్కారం చేస్కో" అన్నారు బంగారు అది. పద నమస్కారం అంటే మనం పదాలను చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే వాక్కు అగ్ని స్వరూపం గనుక. తర్వాత అధ్యాత్మ విచారణలో entertainment కి చోటు లేదు. enlightenment జరిగేటువంటి స్థాయికి రావాలి మనం. ఎంతకాలం మనం miracles చెప్పుకుంటాం? ఎంతకాలం స్వామి యొక్క proximity నాకిలా లభించిందని మనం చెప్పుకుంటూ ఉంటాం? అది స్వీయమైనటువంటి ఒక పరిధిని దాటి జీవుడు గనుక అంతరంగ స్పర్శలో గనుక ప్రపంచం వైపు అడుగు వేయగలిగినట్లయితే ఆ గడిపిన జీవితానికి, ఆ పొందినటువంటి అనుభూతికి ఒక ప్రత్యేకత, ఒక గౌరవము, ఒక మర్యాద, ఒక గాంభీర్యము ఏర్పడుతుంది గనుక ఈ మానవత్వ పరిమళాన్ని మనం అనుభవించాలి. మానవుడిగా పుట్టటం అనేటువంటిదే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు కృష్ణ భగవానుడు. అనేక జన్మలు ఇటువంటివి ఎన్ని ఎత్తి వచ్చామో, ఇదిగో ఈ జన్మలో మాత్రం రాపిడి పరమాద్భుతంగా జరిగింది. ఎవరితో రాపిడి? ఇందాక మీరు చదివిన రుద్రుడితో రాపిడి జరిగింది. ఇందాక మీరు పాడిన గణేషుడితో రాపిడి జరిగింది. సర్వ దేవీ దేవతా స్వరూపాతీతమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య భావనతో రాపిడి జరిగింది. రా-రాయి రాయి రాపిడి గనుక ఉంటే పుట్టవలసింది జ్ఞానాగ్ని మాత్రమే. ఆ జ్ఞానాగ్ని రవ్వలో నుంచి మన మనోభూమికలో ఏర్పడేటువంటి అనేకానేకమైన వికారాలు, అనేకానేకమైనటువంటి భావనలు, ప్రాపంచికమైనటువంటి విషయాలు అన్నీ కూడా దగ్ధమై పోవు గాక. ఎప్పుడైతే అవి దగ్ధం అవుతాయో, కాలవలసినవన్నీ కాలిపోతే irreversible process complete అవుతుంది. అనుభవాన్ని పొందాలి, అనుభూతిని చెందాలి, విభూతిని చిందించుకోవాలి. ఆ విభూతిని పట్టుకోవాలి. ఆ విభూతి స్థాయియే ఇది పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ. అన్ని శబ్దాలు పుట్టే నిశబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం. నారాయణుడిని అన్వేషించడం కోసం ఈ బృహత్తరమైనటువంటి, మహత్తరమైనటువంటి, పూర్ణమైనటువంటి, సర్వేంద్రియ సంగమంగా ఈ దేహం మనకు పరమాత్మ అనుగ్రహించాడు. అందుకనే వేదాంత భూమికలో శరీరమాజ్యం ఖలు కర్మ సాధనం, శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం అంటారు. ధర్మాలతో కూడిన కర్మలు, కర్మలతో కూడినటువంటి ధర్మాన్ని మనం ఆచరణాత్మకం చేసుకోవాలి. అలా చేసుకోకపోయినట్లయితే అనేకమైనటువంటి జీవులు ఈ ప్రపంచంలో పుట్టినై కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళు కాల గర్భంలో కలిసిపోతాయి. మానవుడు కూడా అలాగే పుట్టి మెట్టి గిట్టినట్లయితే ఈ జన్మకు సార్ధకత లేదు గనుక ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి నారాయణుడిని మనం వెతుక్కోవాలి. ముప్పై మూడు వేల సంకీర్తనలు శ్రీ వేంకటేశ్వరుడి మీద అనమాచార్యుల వారు రాసి, జీవన చరమాంకంలో అలసిపోయినప్పుడు ఏమన్నాడు? చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. ఎక్కడున్నావు? ఇక్కడున్నావు. నిన్నే హరి అన్నాను, నిన్నే శివుడన్నాను, నిన్నే ఫలానా అన్నాను, అసలు నిన్ను జీవుడన్నాను. కానీ ఎక్కడ ఉన్నావు అన్న ప్రశ్నకి మాత్రం నాలో ఉన్నావన్నటువంటి సమాధానాన్ని నేను పొందగలిగాను. అది ఎప్పుడు? అంతా కథ అయిపోయిన తర్వాత. అందుకనే మనం జీవన చరమాంకంలో ఓ డెబ్భై ఏళ్ళు, ఎనభై ఏళ్ళు ఇక్కడ ఏం పని లేనప్పుడు ప్రాపంచిక కార్యకలాపాలు కొనసాగించని ఒక దుస్థితిలో పరమాత్మను తలుచుకోకూడదు.దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లా కానప్పుడే చింతింపన్ బలెనీ పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వరా అంటాడు ధూర్జటి అతి బాల్యంలో నుంచి పరమాత్మ యొక్క భావనలోకి గానము చేత ధ్యానము చేత జ్ఞానము చేత యోగము చేత అనేకమైనటువంటి మహాత్ముల యొక్క ప్రవచన శ్రవణం చేత మననం చేత నిధిధ్యాసనం చేత వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసుకోవాలి ఆ చేసుకోవటానికి ఆధ్యాత్మికమైనటువంటి రంగము పరమోత్కృష్టమైనటువంటి పూర్ణరంగమిది ఇక్కడికి వస్తే ఇక రెండవ పారిశ్వాన్ని తడుముతూ సంబోధించింది మూడు అయిపోయినయి దానవత్వం అయింది దీనత్వం అయింది మానవత్వం అయింది అన్ని పోగా మిగిలింది దివ్యత్వమే కాబట్టి మనందరినీ కూడా సత్యసాయి భగవానుడు దివ్యాత్మ స్వరూపులుగా చూశారు మనం సత్యసాయి భగవానుడిని కాసేపు మనిషిగా కాసేపు ఈశ్వరమ్మ కొడుకుగా కాసేపు పుట్టపర్తి బాబాగా అనేక రకాలుగా స్వామి అన్నట్లుగా అనేక స్థితులలో అనుభవించామే కానీ సత్యమైనటువంటి స్వామి యొక్క స్థితిని అందుకోకుండానే మన సాధన సాగుతూ ఉన్నది స్వామిని అందుకోవాలి చెందించుకోవాలి ఎలా ఉండాలి అంటే నేను దేహాన్ని మాత్రమే కాదు అన్నటువంటి భావనలో ఉండాలి ఆపై ప్రేమాత్మ స్వరూపులారా ఈ ఆత్మకి వికారం లేదు ఈ ఆత్మకి ఏ రకమైనటువంటి భావనా లేదు ఏమున్నదయ్యా అచలమూ అద్వితీయమూ అయినటువంటి అద్వైత స్థాయిలో ఏదైతే ఉన్నదో దాని పేరు మాత్రమే ఆత్మ గనుక నిజానికి శంకర భగవత్పాదులు ఒక మాటన్నారు ఆత్మ అనేటువంటి దానికి విచారణ చెప్తూ ఆత్మ అంటే ఏమీ మా అంటే లేదు ఏమీ లేదు అంటే ఏమీ లేని దాని గురించి ఎలా పట్టుకోవటం ఏమీ లేని దాని గురించి ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుకోవటం అంటే ఆత్మ ఏమీ లేదు అనేటువంటి దాని అర్థం ప్రత్యేకంగా లేదు ఉన్నదంతా ఆత్మే అని దాని అర్థం ఈ సర్వం ఖల్విదం బ్రహ్మ అదే ఇది దేనిని చూడాలనుకుంటున్నావో అదే ప్రకృతిగా అదే జీవుడుగా అదే జగత్తుగా అదే జగన్నాయకుడుగా అదే సర్వంగా కనిపిస్తున్నది గనుక ఈ కనిపిస్తున్నటువంటి చరాచర సృష్టి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క దివ్య హేలగా ఖేలగా లీలగా కనిపించు దాని దర్శనం మనం చేస్తూ ఉండాలి అందుకనే సత్యసాయి భగవానుడు ఈ సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి దానిని పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆవిష్కరిస్తూ ఒక మాటన్నారు మీరేమో దేవుడు వేరు నేను వేరు అనుకుంటూ జీవితం గడిపేస్తారు దేవుణ్ణి ఆ పటంలో బంధించేసి నువ్వు వేరు నేను వేరు నువ్వు వేరు నేను వేరు అంటారు దేవుడు ఏమంటున్నాడంటే త్వమేవాహం న సంశయః నీకు నాకు ఏం తేడా లేదు నీవే నేను యు ఆర్ మీ అండ్ ఐ యామ్ యు నేనే నీవుగా ఈ ప్రపంచంలో ఉన్నాం ఆ నేను మేను కాదు ఈ ఆత్మ పరమాత్మ యొక్క సంగమ స్థలి ఈ జీవన క్షేత్రం కాబట్టి ఇక్కడ పరిపూర్ణమైనటువంటి మానవతావాదంతో జీవించగలిగితే ఆ ప్రేమాత్మను నీవు అనుభవించగలవు అని సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి దాన్ని స్వామి ఒక అందమైనటువంటి పద్యంలో చెప్పారు చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వాళ్ళభ్యమది బ్రహ్మ జీవరాసులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ ప్రకృతంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ కాబట్టి ఏ సత్యాన్ని గురించి నేను చెప్తున్నానో అది మీకంటే భిన్నం కాదు ఏ దేనిని మీరు భిన్నంగా చూస్తున్నారో అది అభిన్నమై మీ యందున్నది కనుక ఈ అభిన్నమైనటువంటి అద్వైత స్థితిలో గనుక మీరు దర్శనం చేయగలిగినట్లయితే ప్రేమాత్మ స్వరూపులై దివ్యాత్మ స్వరూపులై ఉండగలిగినట్లయితే జీవించగలిగినట్లయితే ఈ ప్రపంచంలో ఒకడు మరొకడికి సాయం చేసే స్థాయి నుంచి ఒకడు మరొకడికి సేవ చేసే స్థాయికి ఎదగండి ఆ సేవలోనే ఒక పరిపూర్ణత ఉన్నది అది మహాయోగం ఉన్నది సర్వ జీవులలో ఉన్నటువంటి జీవాత్మని స్పృశించగలిగినటువంటి ఒక సౌభాగ్య రేఖ దాని యందు ఇమిడి ఉన్నది గనుక జ్వజ్వల్యమానమై జ్వాలా తోరణమై దీపమాలికై పౌర్ణిమా మాలికై వెలుగొందుతున్నటువంటి అఖండమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహ అమృత వృష్టి మనందరినీ కూడా నడిపించు గాక స్వామితో ఉన్నందుకు స్వామితో జీవించినందుకు స్వామిని దర్శించుకున్నందుకు స్వామి యొక్క పరమ పవిత్ర పూర్ణ దేహాన్ని తాకినందుకు స్వామి యొక్క భావనలన్నీ ఆకళింపు చేసుకోగలిగినందుకు మనము ముందు ఆదర్శప్రాయంగా జీవించాలి మరొకరికి మార్గబోధనం చేసేకింటే ముందు ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం చేస్తూ చేస్తూ గనుక వెళితే భ్రమర కీటక న్యాయ విశేషంతో చిన్న పురుగు ఒక తుమ్మెద తీసుకొచ్చి దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ జంకారం చేస్తూ ఉంటే ఈ చిన్న పురుగు కొన్నాళ్లలో తుమ్మెద ఎట్లా అయిందో అట్లాగే ఒక భక్తి నిండినటువంటి భక్త హృదయం కూడా పరమేశ్వరుడి యొక్క సమ్యక్ సంకీర్తన లహరిలో అది అనేకమైనటువంటి మునకలు వేస్తూ దానిలో ఆ లహరీ విహారం చేస్తూ మనసంతా ఆనందతాండవం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట మాటలన్నీ ఆగిపోయి మౌనం వెలిగినప్పుడు తమస్సంతా నశించి తపస్సు వెలిగినప్పుడుదేహాత్మ భావన మలగిపోయి ఆత్మ భావన ప్రకాశమానం చెందినప్పుడు ఆ ఎరుక, ఆ స్పృహ, ఆ స్పర్శ అద్వితీయమైనటువంటి అధ్యాత్మ భూమికగా మనకు అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం మనకి సంపూర్ణంగా అనుగ్రహించాలి. అది ఎప్పుడూ కూడా సాయి దివ్యమైనటువంటి మహా పరినిర్వాణ అనంతరం జరుగుతున్నటువంటి సార్వత్రికమైనటువంటి కార్యకలాపాల అన్నింట్లలో కాస్త అలసత్వాన్ని వెనకడుగు వేసినటువంటి మనందరం కూడా మళ్ళీ ఒక ఉద్దీపనం చెందవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇంతవరకు స్వామిని చూడని వారికి ఇవాళ స్వామికి స్వామి అంటే ఒక CD దిక్కయింది, ఓ పుస్తకం దిక్కయింది, ఎవడో చెప్పిన అనుభవం మన అనుభవంగా ఆనంద పడుతున్నాం. ఇది జరగరాదు. పరమేశ్వరుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ అంతర్యాన్ని తొలగించుకొని మనం అనుకునేటువంటి తేడాని తొలగించుకొని పరమేశ్వరుని ఎవరికి వారే గనుక హృదయ స్థానంలో నిలుపుకోగలిగినట్లయితే ఒక్కమాట సత్య సాయి భగవానుడి కంటే ముందు వచ్చిన ఏ అవతారం కూడా సత్య సాయి భగవానుడు చేసినంత విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం వాంగ్మయం మీద చేయలేదు, ఎవరూ చేయలేదు. వారి చుట్టూ వాంగ్మయం ఏర్పడిందేమో కానీ అంతకు ముందు అప్పటికే ఏర్పడినటువంటి దాని మీద వ్యాఖ్యానం చేసినటువంటి అవతారాలు లేవు. శ్రీరామచంద్రుడికి వశిష్టుల వారికి జరిగిన సంవాదమే యోగవాశిష్టమైంది. అంటే రాముడు విన్నాడు అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకాలలో భగవద్గీతని అన్నాడు. ఆ తర్వాత సత్య సాయి భగవానుడు అన్నాడు, విన్నాడు, కన్నాడు, అనిపించాడు, వినిపించాడు. కనుక ఇది పరిపూర్ణమైనటువంటి అవతారం. మనం చాలా గొప్ప అదృష్టవంతులం. ఎందుకంటే ఒక అవతార పురుషుడి యొక్క ఆ అవనీ సంచార కాలంలో మనం కూడా ఆ గాలిని పీల్చాం. ఆ పుడమి తల్లి యొక్క దివ్యమైనటువంటి పవిత్ర స్థానంలో మనం నిలబడ్డాం. దివ్య మంగళ విగ్రహాన్ని దర్శనం చేశాం. దివ్యమైనటువంటి వాక్కులన్నీ కూడా మనం స్వయంగా విన్నాం. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? ఆకర్ణాయత సత్య నేత్రమై అణిమయోజ్జ్వల్ కుండలద్వంద్వ శోభాకీర్ణాంచిత గల్లమై. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ విశుద్ధ చక్రం ఈ ప్రపంచానికి దివ్యోపన్యాస లహరిగా పరిప్లావితం చేసింది. సుందర భ్రూయితమైనది రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటిదే సుందరమైనటువంటి శివాత్మకమైనటువంటి మంగళాత్మకమైనటువంటి అవతార మూర్తి మనందరి జీవితాలని కూడా చల్లగా, హాయిగా, ప్రసన్నంగా, కళాత్మకంగా, లాదంగా, ప్రహ్లాదంగా, పూర్ణంగా, ఆధ్యాత్మికంగా, ఆనంద రసతుందిలంగా, మహోత్కృష్టంగా, మానవీయంగా, మాధవీయంగా పరిపూర్ణం చేయు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సకల కళా పూర్నుడైనటువంటి స్వామి యొక్క దివ్య అవతార ప్రభని సర్వ ప్రపంచానికి చాటుతూ మళ్ళీ మనందరం కూడా వెలుగులో వెలుగుతూ ఆ వెలుగు మన వెలుగుగా మార్చుకుంటూ ఈ చిన్న వెలుగు పెను వెలుగు పోతనామాత్యుడు అన్నట్టుగా ఈ చిన్న ఈవలి గట్టున ఉన్నటువంటి ఈ చిన్న వెలుగు ఆవలి గట్టున ఉన్నటువంటి పెను వెలుగులో ప్రస్థానం చేయు గాక. స్వామి యొక్క అనుగ్రహం మనందరి యందు ఉండాలని ఈ కుటుంబాలు, ఈ ప్రపంచం, ఈ తరం మాత్రమే కాక రాబోయేటువంటి ఇరవై ఒక్క తరాలు కూడా స్వామి యొక్క ఆరక్షణలో పరిపూర్ణ ఆనంద తారక స్థితిని అందుకునే స్థాయి చెందించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
SSSMC · audio
Talk - Koti Samithi Hyd
Talk - Koti Samithi Hyd
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 40:22
More in this series
Talks
- 24 min 1
Talk on significance of festival of Sankranthi
- 52 min 2
Talk - on Guru Tatwam
- 40 min 3
Talk - Koti Samithi Hyd
Now playing - 28 min 4
Talk - Bharata
- 23 min 5
Talk on Dasara
- 6 min 6
Talk on Rathasaptami
- 32 min 7
Talk on Sri Sathya Sai - Part 05
- 33 min 8
Talk on the character of Draupadi
- 30 min 9
Talk on Gyana Yoga
- 29 min 10
Talk on Hanuman Panchamukham
- 23 min 11
Talk on Leela Kaivalya Vahini
- 35 min 12
Talk on Sathya Sai Sukthamulu
- 24 min 13
Talk on yoga Triveni
- 26 min 14
Talk on the occasion of Avatar Declaration day