No transcript for this section.
[సాయి music] రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈ సంవత్సరం జరిగిన గురుపూర్ణిమ మహోత్సవం సందర్భంగా హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రేడియో సాయి శ్రోతలందరికీ వక్తగా సుపరిచితులైన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు గురుతత్వం పై అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆరంభేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ మనందరం కూడా గురుపూర్ణిమ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి కాలంలో ఉన్నాం ఇంకా. గురుపూర్ణిమ అంటే మనకి పండగ. దానికి కారణం ఒకటే గురువుని స్మరించుకునేటువంటి రోజు. గురువు మానవ జీవితంలో మానవుడిలో ఏర్పడినటువంటి చీకటిని తొలగించి వెలుగును నింపుతాడు గనుక పదహారు కళలతో సుశోభిల్లేటువంటి పరిపూర్ణమైనటువంటి మానవతా మూర్తిగా ఇటు గురువుగా అటు ఆత్మగా ఇటు పరదైవతంగా భాసిల్లుతాడు కాబట్టి ఈశ్వరో గురులాత్మేతి మూర్తి వేద విభాగినే అని మూడు బొమ్మలుగా కనిపిస్తాడు ఆయన కానీ మూడు కలిపితే ఒక్కటే. జీవితంలో ఎప్పుడో ఎప్పుడు ఈశ్వర సాక్షాత్కారం కావాలి కాబట్టి ఈశ్వరుడు కావాలి. ఆత్మను ఎరగాలి అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. ఈ రెండూ తప్పనిసరి. ఈ రెండూ కలిపి అంటే మనం సాక్షాత్కారం పొందవలసినటువంటి ఆత్మని దర్శించవలసినటువంటి పరమాత్మని ఏక రూపంలో ఏక కాలంలో ఒక సాకార సగుణ స్వభావ స్వరూపంగా ఒక విగ్రహంగా ఒక బొమ్మగా కనిపిస్తే ఆయన పేరు గురువు అని అర్థం. తర్వాత భారతీయ తత్వ సిద్ధాంతంలో గురువు లేని విద్య గుడ్డి విద్య. చేరుతాం ప్రయాసపడి కష్టపడి దారి తెను తెలియక చాలా తక్కువ సమయంలో చేరుకోవలసినది గురువు గనుక లేకపోతే కొన్ని సుదీర్ఘమైనటువంటి జన్మలు ఎత్తవలసి వస్తాయి గనుక ఈ గురువు దారి చూపిస్తాడు ఆయన తెర అవుతాడు తెరవు అవుతాడు. మనిషిని ఉన్నత స్థితి నుంచి ఉదాత్త స్థితికి దాని నుంచి ఉత్తమ స్థితికి దాని నుంచి ఉత్కృష్ట స్థితికి ఆపై యదార్థ స్థితికి నడిపిస్తాడు గనుక మానవ దేహం ఎత్తిన ప్రతి వాడికి గురువు యొక్క అవసరం ఉన్నది. ఇటు లౌకికంగా అటు పారలౌకికంగా అంటే అధ్యాత్మగా. రామాయణ కాలం గనక తీసుకున్నట్లయితే అంటే త్రేతాయుగాన్ని మనం ఒకసారి పరామర్శ చేసినట్లయితే శ్రీ రామచంద్రుడికి ఇద్దరు గురువులు. ఒకడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఆయన లోక గురువు. రెండవ వాడు వశిష్టుడు ఆయన బ్రహ్మర్షే ఆయన జ్ఞాన గురువు. లోకాన్ని గురించి చెప్పేవాడు కావాలి అట్లాగే లోకాతీతమైనటువంటి గంభీరమైన విషయాలు చెప్పే గురువు కూడా కావాలి. కనుక శ్రీ రామచంద్రుడి యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వానికి ఆ అవతార వైభవానికి ఇద్దరు గురువులు కారణమైనారు. ఆ అయిన వారిద్దరూ బ్రహ్మర్షులు కావటం ఒక విశేషం. బ్రహ్మర్షులు అంటే బ్రహ్మమును ఎరిగిన వారు అని. బ్రహ్మమును గురించి బోధించేవాడు బ్రహ్మర్షి కాదు. బ్రహ్మము ఎరగాలి దానిని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుభూతి చెందాలి తాను అది కావాలి. త్వమేవాహం న సంశయః నీకు నాకు తేడా లేదు అన్నటువంటి ఒక భావనా స్థితిలోకి ఎవరు వెళ్తారో ఎవరు సకల శాస్త్రముల యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఉంటారో తెలిసిన దానిని ఆచరిస్తారో ఆచరణలో నుంచి అనుభవాన్ని పొందుతారో అనుభవంలో నుంచి అనుభూతిని సంపాదించుకుంటారో ఆ అనుభూతిని మళ్ళీ ప్రపంచానికి తాము దాచుకోకుండా ఇస్తారో అటువంటి వారు బ్రహ్మర్షులై ఈ ప్రపంచంలో ఉంటారు. శంకర భగవత్పాదులు అంటారు యోగరతో వా భోగరతో వా సంగరతో వా విషయరతో వా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి ఏవా. అంటే మన మనసు దేనియందు లగ్నం కావాలి అని ఏ పని చేస్తున్నామో దాని యందు లగ్నం కావాలి అది ధ్యానం. దేనిని తెలుసుకోవాలని మనసు అపేక్షిస్తున్నదో దాని ఆలోచనను గనక తీవ్రతరం చేసి దాని యందు లగ్నం చేయగలిగితే అది తీవ్ర ధ్యానం అవుతున్నది. కాస్త పై మెట్టుకు వెళితే దాన్ని యోగము అంటున్నాం. కానీ అసలు ఈ సమస్త సృష్టికి మన ఉనికికి అస్తిత్వానికి వ్యక్తిత్వానికి మూలమైనటువంటి బ్రహ్మముతో గనక మనస్ మనసు కూడి ఉన్నట్లయితే అది ఒక ఆనందాన్ని ఇస్తుంది అది ఆనందం అదే ఆనందం అది మాత్రమే ఆనందం నందతి నందతి నందతి ఏవా అది మాత్రమే. ఆ అది మాత్రమే ఆనందం అని అంటే దాని పేరు బ్రహ్మానందం అని పరమానందం అని.హిరణ్యగర్భ ఆనందం అని అనేక పేర్లు మనం పెట్టుకుంటాం కానీ ఈ హిరణ్యగర్భ ఆనంద స్థాయికి జీవుడు చేరుకోవాలి అంటే ఒక గురువు కావాలి. ఆ గురువు ఎట్లా ఉండాలి సర్వ సమర్ధుడు అయి ఉండాలి. తాను ఏది బోధిస్తున్నాడో తన జీవితంలో దాన్ని ఆచరించాలి. జీవితం విసిరేటువంటి ప్రతి సవాలు జీవితం సృష్టించే ప్రతి సంఘటన ప్రతి సందర్భంలో తాను ఏకాత్మ గా ఉండాలి మహా దుఃఖం వచ్చి ముంచెత్తింది తాను కదలక ఉండాలి. తెలియరాని పట్టరాని ఒక ఆనందం వచ్చి మనల్ని మళ్ళీ ముంచెత్తింది తాను తానుగానే ఉండాలి ఇది అధ్యాత్మ మాత్రమే ఇవ్వగలిగినటువంటి ఒక పరమ రమణీయమైనటువంటి అనుభూతి. దుఃఖం లేనిది ఎవరికి రానిది ఎవరికి దుఃఖం కలగనిది ఎవరికి దుఃఖం తన నీడను పరచకుండా ఉన్నది ఎవరిని ఎవరిని వదిలిపెట్టింది. కాబట్టి ఈ లౌకిక విద్యని అధ్యాత్మ విద్యని సమన్వయం చేసుకోవాలి అంటే పరమోన్నతమైనటువంటి ఇద్దరు గురువులు కావాలి. మరి రాముడికి ఇద్దరు గురువులు ఎందుకు ఆయన దేవుడు కదా నారాయణమూర్తి కదా మళ్ళీ ఆయనకు ఒక గురువు ఎందుకు అని. రాముడు మానవుడుగా ఉండటానికి నిర్ణయించుకున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారందరూ రామా నువ్వు దేవుడివి నువ్వు నారాయణమూర్తివి అంటే లేదు లేదు నేను రఘురాజుని దశరథ రాజు కుమారుడిగా ఉండటానికి వచ్చాను. మానవ జీవితాన్ని ఎత్తుపల్లాలు చీకటి వెలుగులు ఆశాభంగాలు జయాపజయాలు కష్టసుఖాలు చీకటి వెలుగులు పగలు రాత్రులు గా భావించబడిన ఈ కాలంలో ఎట్లా జీవించాలో ప్రతి సవాలుని కూడా ప్రతి సవాలుగా భావిస్తూ జీవితాన్ని ఘర్షణ నుంచి సమన్వయం వైపు సమన్వయం నుంచి ఆనందం వైపు సంతృష్టి వైపు విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడవటానికి సిద్ధపడిన నేను కేవలం మాయా మానుషంగా అంటే మాయకు లోబడి ఉంటాను అన్నాడు గనక ఆయన్ని లోకం దైవం అన్నా ఆయన తనను తాను దైవంగా చెప్పుకోలేదు. కనుక ఇద్దరు గురువులు కావాల్సి వచ్చింది లోక గురువుగా ఒక direction ఇవ్వాలి జ్ఞాన గురువుగా ముప్పై ఆరు వేల శ్లోకాలలో యోగవాశిష్టాన్ని ఇద్దరు సంవాదనం చేశారు అంటే మాట్లాడుకున్నారు మనస్సు యొక్క మర్మాన్ని ఆ మనస్సు అనుభవించేటువంటి సుఖ దుఃఖాలని అన్నింటినీ కూడా వశిష్ఠుల వారు రామచంద్రుడికి బోధ చేశారు. కాలం మారింది యుగం మారింది ద్వాపర యుగం వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్క గురువే దొరికాడు ఆయన పేరు సాందీపుడు. ఆయన కూడా పరదైవతమే కదా అంశ కదా విష్ణు అంశగా వచ్చాడు కదా ఆయనకెందుకు మళ్ళీ గురువు ఎందుకు అని. ఆయనకు కూడా ఒక లోక గురువు ప్రాథమికంగా కావలసి వచ్చాడు ఆయన పేరు సాందీపుడు. ఈ కృష్ణుడు రామావతారం కంటే చాలా భిన్నం diametrically opposite. లోకమంతా నువ్వు దేవుడివి అంటే రాముడు కాదు నేను మానవుడిని అన్నాడు లోకమంతా కృష్ణుడిని నువ్వు దేవుడివి కాదు అంటే అసలు నన్ను మించి దైవం ఎక్కడున్నది చూపిచ్చమ్ అన్నాడు ఇది contrast. కాబట్టి ఈయనకి ఒక గురువు కాసేపు చాలు ప్రాథమికంగా చాలు. ఎందుకని అంతరించబోతున్నటువంటి ద్వాపర అవతరించబోతున్నటువంటి కలియుగం ఈ రెండింటికి కూడా కర్మ భక్తి యోగ జ్ఞాన యోగాలు అనబడేటువంటి ఈ పరమాద్భుత యోగ శాస్త్రాన్ని బోధించటానికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. కంసవధ చేయటానికో భారత యుద్ధాన్ని నడిపించడానికో వచ్చిన అవతారం కాదు అది. ఆ యుగంలో ప్రధానంగా ఉన్నటువంటి కలి ప్రభావాన్ని తగ్గించటానికి మానవ జాతిని పరమోత్కృష్టమైన ఉన్నతమైన అధ్యాత్మ మార్గంలోకి నడిపించటానికి యోగ శాస్త్రాన్ని భగవద్గీతగా చెప్పటానికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు గనుక చివరగా కడగా ఆయన యోగేశ్వరుడుగా ఆవిష్కరించుకున్నాడు గనుక ఈ ప్రపంచం అంతా ఆయన్ని జగద్గురువుగా భావించింది కృష్ణం వందే జగద్గురుం అంటాం రామం వందే జగద్గురువు అనం ఎందుకని రాముడు బోధించలేదు రాముడు విన్నాడు కృష్ణుడు విన్నాడు అన్నాడు ఎప్పుడు అన్నాడంటే భగవద్గీతని అన్నాడు విష్ణు సహస్ర నామాన్ని విన్నాడు. భీష్ముడి నోట పలుకుతున్నప్పుడు తానే అది అయినప్పటికీ కూడా ఎవరిని గురించో భీష్ముడు ఒక సుషుమ్నా గీతాన్ని సంస్తుతి గీతాన్ని పాడుతున్నట్టు భగవంతుణ్ణి కీర్తిస్తున్నట్టు వేయి నామాలతో వేయి గుణాలతో వేయి వైభవాలతో ఆ స్తుతి, నుతి, గతి, గీతి, గమకము వీటన్నింటినీ కూడా కృష్ణుడు తలవంచుకొని వినయ పూర్వకంగా చేతులు కట్టుకొని విష్ణు సహస్ర నామాన్ని విన్నాడు. కాబట్టి అన్నాడు విన్నాడు ఈయన ఆయన మాత్రం విన్నాడు. ఆ యుగం అయిపోయింది కలియుగం వచ్చేసింది కలియుగానికి అధిష్టాన పరదైవతం ఎన్నో సార్లు మనం చెప్పుకున్నట్లుగా కోటి సూర్య మండల మధ్యస్థ అయినటువంటి మహా త్రిపుర సుందరి దేవి స్త్రీ రూపంగా లలితా దేవి గాను పురుష రూపంలో శ్రీ దత్త రూపంగాను వస్తుంది గనుక ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి గురువులు అధికాధికంగా ఉంటారు ఎందుకని ఉండాలి త్రేతాయుగంలో ఉన్నట్లుగా కొద్దిమంది గురువులు చాలదా అంటే స్వామి చమత్కరిస్తూ అన్నారు పాపులేషన్ ని బట్టి పరమాత్మ అలా గురువుని పంపిస్తుంటాడు అని ఒక మాట అన్నారు. అంటే ఈవేళ మనకు అనేక రకాల గురువులు కావాలి కనుకనే లోక గురువులని శోక గురువులని బాధ గురువులని బోధ గురువులని వాచక, సూచక, మోచక, దీక్ష, నిషిద్ధ, కారణ అనబడేటువంటి అనేక వర్గాలుగా ఈ గురువులు వచ్చి ప్రబోధం చేస్తారు ప్రబోధం చేసేవాడు ఒకవైపు ప్రచారం చేసేవాడు రెండోవైపు enlightenment తో పది మందిని కూర్చోబెట్టి పురాణం చెప్పేవాడు ఒకడు enlightenment కాకుండా entertainment తో చెప్పేవాడు మరొకడు కాసేపు నవ్వించి కవ్వించి ఆనంద పరచి.వాడితో గానం ధ్యానం యోగం జ్ఞానం అన్ని పంచిపెడుతూ ఈ గురువులు బహుముఖీనంగా ఈ కాలంలో ఉంటారు గనుక వీడు ఫలానా వాడు గురువా కాదా మనం తెలుసుకోవలసిన అక్కర్లేదు మన ప్రాప్తిని బట్టి యోగ్యతను బట్టి అర్హతను బట్టి సాధనా తీవ్రతను బట్టి అనేక గురువులు వస్తారు ఇప్పుడు స్వామి గురించి అనేకమంది అనేక ఉపన్యాసాలు చెప్తారు మాట్లాడతారు అందరూ చక్కగా మాట్లాడతారు కానీ కొందరు entertainment గా మాట్లాడతారు చమత్కారంగా మాట్లాడతారు కాసేపు ఆహ్లాదం కలిగించే రీతిలో మాట్లాడతారు అది మాత్రమే కాదు స్వామి ఒక పరమ ఉత్కృష్టమైనటువంటి అవతార మూర్తి గనుక స్వామి యొక్క విషయాలను గంభీరంగా enlightenment కోసం మాట్లాడుకోవాలి entertainment కోసం కాదు సరే స్త్రీ రూపం లలితాదేవి అయినట్లయితే పురుష రూపం శ్రీ దత్తుడు అన్నాం కాబట్టి దత్తావతారాలు అఖండ భారతావనిలో ఏ క్షణాన మీరు తీసుకున్నా ముప్పై ఆరు వేల యోగ స్వరూపాలుగా ఈ దేశాన్ని గురు స్థానంలో నిలబెడతాయి ప్రధానంగా తెలుగునాట ఆంధ్రదేశంలో మూడు వేల ఆరు వందల మంది యోగులు ఈ భూమండలాన్ని ప్రధానంగా ఈ ప్రదేశాన్ని కాపాడుతూ యోగ భూమికలోకి నడిపిస్తారు గనుక ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నది ఎవరు పాలించేది ఎవరు ఈ కాలంలో అంటే ప్రజలు కాదు ప్రభుత్వం కాదు యోగులు దీన్ని నడిపిస్తారు ఆ యోగ భూమిక ఉదాత్తమైన భూమిక కనుకనే రాపిడి ఎక్కువ ఘర్షణ ఎక్కువ సంఘర్షణ ఎక్కువ సమస్యలు ఎక్కువ సమన్వయం తక్కువ ఈ సమన్వయమైన భావజాలం కావాలి కాబట్టి మళ్ళీ వెనక్కి శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయ స్వరూపాన్ని భగవద్గీతని శివ విష్ణు లలితా సహస్రనామ వైభవాన్ని మనం పదే పదే మననం చేసుకుంటూ ఉన్నట్లయితే నాస్తి నాస్తి కలౌ నాస్తి హరి నామ వినా గతిహి హరి అంటే విష్ణువు అని మాత్రమే కాదు పరమాత్మ అని అర్థం ఈ పరమాత్మ యొక్క నామ గుణ వైభవాన్ని గనుక అనుకుంటూ అనుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా క్రమబద్ధీకరణ జరుగుతాయి regularize అవుతాయి regulate అవుతాయి ఈ మనస్సు నియంత్రించబడుతుంది గనుక ఈ మనస్సు యొక్క తత్వాన్ని ఈ మనస్సు యొక్క పరిస్థితిని దీని గాఢతని చెప్పగలిగినటువంటి గురువులు కావాలి ఆ గురువులు ఇదిగో అనేక దత్త రూపాలుగా వస్తూ ఉంటాయి అయితే ఇవ్వాల ప్రతి వాడు నేను దత్తాంశులు వచ్చానంటున్నాడు దత్తుడు అంటే ఈ ప్రపంచాన్ని adopt చేసుకున్న వాడు అని అర్థం అది ఒక్కటే కాదు ఈ ప్రపంచానికి తన సర్వస్వాన్ని సమర్పించుకున్నటువంటి వాడు ఈ రెండింటిని అర్థం గనుక చేసుకోగలిగితే కంచి పరమాచార్య మహాస్వామి వారు చెప్పినట్లుగా శ్రీ దత్తుడు అంటే జగత్తుని తనదిగా చేసుకున్న వాడు అని ఒక అర్థం తానే జగత్తు అయిన వాడు అని రెండవ అర్థం జీవ జగత్తు జగదీశ్వరుల ముగ్గురికి కూడా ఒక అభేదాన్ని పాటించేవాడు పరమ గురువు గనుక అటువంటి గురువు గనుక మన పాలబడినట్లయితే మనకు దొరికినట్లయితే మనం ఆవరణంలోకి వెళ్లగలిగినట్లయితే మన జీవితాలు ధన్యవంతం అవుతాయి అయితే ప్రారబ్ధాలు అందరివి ఒకలా ఉండవు కనపడ్డ ప్రతి వాడిని గురువు అంటాం మనం అలా అనకూడదు ఎందుకు అనకూడదు అంటే పరమ గురువు ఒక్కడు ఉంటాడు ఈ కాలానికి వచ్చేసరికి మనకు దత్త సంప్రదాయంలో ప్రప్రథమ పూర్ణ దత్తావతారం ఏదంటే షిరిడి మహాస్వామి మిగతా అకల్కోట మహారాజ్ గాని ఉపాసని బాబా వీళ్ళందరూ కూడా యోగులు షిరిడి బాబా దత్త స్వరూపం కాబట్టి ఆయనకు కూడా ఒక గురువు ఉన్నాడు ఆ గురువు ఆయన చెప్పిందే వెంకూశ ఆ వెంకూశ ఎలా ఉంటాడు ఎవరికీ తెలియదు చరిత్ర లేదు కానీ చివరికి కడదాకా ఆయన మోసింది ఇటుక రాయి దాన్ని గురువుగా భావించాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత నవంబర్ ఇరవై మూడవ తారీఖుకి ఆంధ్రదేశ్ లో ఈ శ్రీ దత్త ప్రభువే సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి ఒక తేజస్సు ఒక ప్రభా పుంజం ఏదైతే ఉన్నదో అది సత్య సాయి భగవానుడిగా ఒక ఆకారాన్ని తీసుకుని వచ్చింది గనుక ఈ సత్య సాయి భగవానుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే అసలు స్వామి యొక్క స్వరూపం నిజానికి అరూపమే ఇప్పుడు ఇవ్వాళ అది formless కాదే అసలు అది formless ఏ కాసేపు form గా కనిపించింది మనకి ఎట్లా ఎనభై ఆరు ఏళ్ళు షిరిడి బాబా దాకా ఈ గురు పరంపర ఏర్పడింది వీళ్ళందరికీ రాముడికి కృష్ణుడికి దత్తుడికి అలాగే షిరిడి బాబాకి స్వామి వచ్చేసరికి ఆయనకు గురువు లేడు గురువు ఎరగని దైవం ఎవరైనా ఉన్నారా అని మనం అడిగితే స్వామికి గురువు ఎక్కడ ఉన్నారు గురువే లేడు అంటే సర్వ గురువుల యొక్క స్వరూపాన్ని తనదిగా చేసుకుని సత్య సాయి భగవానుడు ఈ ప్రపంచంలోకి వచ్చి తన కంటే ముందు వచ్చినటువంటి సర్వ అవతారాల యొక్క ప్రబోధాన్ని పరిష్కారం చేస్తూ అందుకనే ఆయన వాహినులన్నీ కూడా రాశారు రామకథా రస వాహిని అంటే రామాయణం భాగవత వాహిని గీతా వాహిని ఎన్ని ఉన్నాయో ఈ వాహినులు అన్నీ కూడా ఏమున్నాయి దాంట్లో అంటే స్వామి కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఆయన చెప్పారు నేను కొత్తగా ఏది చెప్పటానికి రాలేదు పాతది ఉన్నది ఏదో మళ్ళీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పటానికి వచ్చాను వీటి యందు దాగి ఉన్నటువంటి పూలదండలో ఏం దాగి ఉన్నది అంటే దారం దాగి ఉంది కనపడదు అది ఆ దారం అంతా కూడా సత్యం కాబట్టి సత్యం అంటే ఏమిటో చెప్పటానికి నేను వచ్చాను సత్యం తెలియకపోతే ధర్మం తెలియదు ధర్మం తెలియకపోతే శాంతి కలగదు శాంతి లేకపోతే ప్రేమ అబ్బదు ప్రేమ లేకపోతే అహింసా ప్రవృత్తి అలవడదు కనుక వీటన్నింటికీ మూలమైనటువంటి ఆ సత్యాన్ని నేను చెప్పటానికి వచ్చాను గనుక అహం సత్య బోధకః స్వామి ఎవరంటే స్వామిని ఇంద్రుడు చంద్రుడు రాముడు కృష్ణుడు మన రీతిన మనం అనొచ్చు స్వామి భావనలోనే ఆయన అంటే ఎవరు అంటే ఏమీ నిర్ద్వందంగా మళ్ళీ రెండో ఆలోచన లేకుండా నేను సత్యాన్ని బోధించటానికి వచ్చాను.సత్యం ఎప్పుడైతే బోధ పడుతుందో మనం ధర్మాన్ని ఆచరిస్తాం. ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తామో మనకు శాంతి ఉంటుంది. అధర్మంగా ఏదన్నా రూపాయి సంపాదించండి నిద్ర పట్టదు. అబద్ధం చెప్పండి నిద్ర పట్టదు. చేయకూడని పని ఎప్పుడైనా చేయవలసి చేయవలసి వస్తే ఆరోజు నిద్ర పట్టదు. మామూలుగా సహజంగా జరిగేటువంటి ధర్మ కార్యం చేయండి మంచి సేవ చేయండి ప్రేమగా ఉండండి ప్రసన్నంగా మంచి నిద్ర పడుతుంది హాయిగా ఉంటుంది. అంటే మూలం ఏమిటంటే వేదోఖిలో ధర్మమూలం వేదాలు సత్యం అయినట్లయితే ఆ సత్యానికి కూడా మూలం ధర్మం కాబట్టి సత్య ధర్మాలు రెండు కూడా రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు లాంటివి. అయ్యా బొరుసు ప్రింట్ అయింది నేను నాకు ఇది చల్లదు అంటే కుదరదు బొమ్మ ఉండాలి బొరుసు ఉండాలి. plus and minus positive and negative ఈ రెండూ కలిపితేనే ఈ సృష్టి ఈ ప్రపంచం కాబట్టి ఇటువంటి మార్మికమైన అటువంటి పరమ రహస్యాలని పరమ గుహ్యమైన గోప్యమైనటువంటి సందర్భాలని సాధారణ మానవుడు అందుకునేటువంటి రీతిలో ఇటు శంకర వాఙ్మయాన్ని అటు ప్రాచీన వాఙ్మయాన్ని వేద సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాలని అన్నింటినీ కూడా స్వామి పరిష్కరిస్తూ మానవ జాతిని అంటే జాతి మత వర్గ వర్ణాలు దాటి ఒకే ఒక మానవజాతి ఉన్నది మానవుడిగా జన్మ ఎత్తి ఏ దేశంలో నువ్వు ఉన్నా నువ్వు పాటించినట్లయితే నువ్వు ఆనందాన్ని పొందగలవు అని చెప్పటానికి వచ్చినటువంటి పరమ గురు స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడు మనకు గురువుగా దొరకటమే మనం చేసుకున్న అదృష్టం. ఆయన గురువా? దైవమా? debate పెట్టక్కర్లే ఆయన గురువు ఆయన దైవం రెండు కూడా. ఈ గురువు దైవంగా గోచరిస్తాడు ఎందుకంటే గురువు తాను ఏం చెప్తున్నాడో దాన్ని ఆచరిస్తున్నాడు. దేనిని ఆచరించదగినదిగా భావించాడో దానినే బోధిస్తున్నాడు. అంటే చెప్తున్నదానికి చేస్తున్న దానికి ఎక్కడా కూడా సంఘర్షణ లేని రీతిలో పరిపూర్ణమైనటువంటి ఒక మానవతావాదంతో మానవుడికి ప్రబోధం చేస్తూ వచ్చారు గనుక ఈ ప్రబోధ ప్రచార రెండూ దాటి transmit చేయగలిగినటువంటి గురువు కావాలి. ఇందాక అనుకున్న అనేకమైనటువంటి గురువులలో ఉత్తమోత్తమ గురువు ఎవరు అంటే కారణ గురువు. ఆ కారణ గురువు ఏమిటంటే మనం ఎందుకు వచ్చాం? ఇక్కడికొచ్చి మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం నిర్మల ఆనందాన్ని పొందుతాం? ఒక నిశ్చలమైన స్థితిని పొందుతాం? దేనికి అదరక బదరక కదలక చదరక అన్ని స్థితులలో ఏకంగా ఎలా ఉండగలుగుతాం? ఆ ఉండటానికి ఏం చేయాలి? ఇవన్నీ చెప్పగలిగినటువంటి ఒక సమర్థ గురువు కావాలి కాబట్టి ఆ సమర్థ గురువుని ఉత్తమ గురువుగా ఉన్నత గురువుగా ఉదాత్త గురువుగా దత్త గురువుగా పూర్ణ గురువుగా మనం భావన చేసినట్లయితే మన బోటి వాళ్ళందరం కూడా చేసుకున్న పురాకృత పుణ్యం ఇవ్వాళ ఏం చేసామో తెలియదు ఇవ్వాళ ఏం యజ్ఞాలు చేయలేదు యాగాలు చేయలేదు ధ్యానాలు చేయలేదు యోగాలు చేయలేదు తపస్సు లేదు. ధర్మమా ఎంత చేసామో మన దగ్గర ఏం పెద్ద ఆడిట్ లేదు లెక్కలేదు కానీ ఏం చేసామో ఇప్పటివరకు చేసుకో ఈ జన్మ ఎత్తడానికి వరకు మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి ఆ పుణ్యఫలం కారణంగా సత్యసాయి భగవానుడిని మనం గురువుగా భావించగలిగాం. ఆ భావించగలిగి ఆ గురు స్థానంలో ఉన్నటువంటి స్వామిని నెమ్మదిగా అర్థం చేసుకుంటూ ఈయన పరదైవతమే దీనిలో ఏం సందేహం లేదు అని ఒక ఆలోచన మన మనసు కలగటమే మనం చేసుకున్నటువంటి పుణ్యం. స్వామిని ఎంతమంది చూడలేదు ఎంతమంది వెళ్ళిపోలేదు. మేము స్వామికి చాలా దగ్గరగా మంచం కోడు పట్టుకున్నంత దగ్గరగా ఉన్నాం అనుకున్నవాడు స్వామిని entertainment దాటి enlightenment దాకా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చూస్తున్నారు స్వామి చెర్యలు అన్నీ వాళ్ళకి తెలుసు చాలా దగ్గరగా గమనిస్తారు కానీ ఇది పరదైవతమే ఇటు శాస్త్ర పరంగా వేద పరంగా ఉపనిషత్ భావనగా ఈయన దైవం కాకుండా మరొకటి కాదు అని ఆ మాయావరణం నుంచి బయటపడ్డ వాళ్ళు బహు కొద్దిమంది గనుక ఎందుకంటే సత్యసాయి అవతారంలో స్వామికి అతి సన్నిహితంగా ఉండి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా దూరంగా ఉండి మనం స్వామి దగ్గరికి చేరుకో లేమనుకున్న వాళ్ళు స్వామి యొక్క తత్వంలో స్వామి యొక్క భావనలో చాలా గట్టిగా ప్రపంచవ్యాప్తంగా నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి భగవంతుడికి దగ్గరా దూరమా ప్రశ్న కాదు భగవంతుడితో రోజూ కూర్చున్న ఆయన భగవంతుడు అవునో కాదో అనే శంక మనసులో ఉన్నట్లయితే దగ్గరగా ఉండి ఏం ప్రయోజనం. ఎక్కడ కూర్చుంటే ఏమి ఎక్కడ ఉంటే ఏమి ఆయన ఫలదైవతమే అనే భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో తదనుగుణంగా ఆయన బోధనలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం ఆచరించే ప్రయత్నం చేస్తాం. ఈ ఆచరణలో నుంచి ఒక ఆనందాన్ని ఒక అనుభూతిని పొందుతాం పొందిన అనుభూతిని ఈ ప్రపంచానికి ఇస్తాం. ఇదంతా కూడా మనకి ఈ గురు పరంపర వైభవం మనకు నేర్పుతూ ఉంటుంది. మనం ఇక్కడే భారతీయ గురుతత్వాన్ని భావన చేశాం. భారతీయ గురుతత్వంలో అనేక మంది గురు స్వరూపాలను మనం తాకుతూ వెళ్ళాం. ఏ ఒక్క గురువు ఇది మహా సుదర్శన చక్రం ఇరుసు ఒక్కటే ఆ చక్రానికి ఉన్న పళ్ళు వేరువేరుగా ఉంటాయి అందులో ఏ ఒక్క పన్ను dent అయినా అరిగిపోయినా విరిగిపోయినా చక్రం కదలదు. ఆ momentum ఉండదు కాబట్టి గురువుల పట్ల గురువుల మధ్య భేదాన్ని మనం పెట్టుకోకూడదు. నీకు నచ్చిన నామరూప సహితమైనటువంటి గురు స్వరూపాన్ని పట్టుకో అనంత రూపుడు అనంత నామములు కలిగినటువంటి పరమాత్మకి నిజానికి ఆయన ఆ రూపుడు ఆయనకి స్వరూపం లేదు ఆయనకేం పేరు లేదు మనం పెట్టుకున్నాం వెయ్యి నామాలు. అసలు ఆయన పేరు ఏమిటి అంటే మహా మంత్రార్ణవ గ్రంథంలో పరమాత్మ పేరు సహ అంతే.ఆ సహ కంటే ముందు ఇంకా ఏదన్నా ఉన్నదా అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అకార ఉకార మకారాలతో కూడిన ఓంకారమే పరబ్రహ్మ తత్వం కాబట్టి స్వామి ఎవరు అంటే కంటికి కనపడిన స్వామికి డ్రెస్ ఉంది అడ్రస్ ఉంది మనసు తాకిన స్వామికి అనుభవాలున్నాయి గుండె పండించుకున్నటువంటి హృదయ స్థానంలో ఉన్న సత్యసాయి భగవానుడు కూడా రూపం లేదు నామం లేదు సర్వ నామములు ఆయనవే సర్వ రూపములు ఆయనవే సర్వ జీవ తత్వాలు ఆయనవే అనేటువంటి ఈ తాత్వికమైనటువంటి చింతన మనం అలవాటు చేసుకున్నట్లయితే కారణ గురువుగా స్వామిని భావన చేయగలిగినట్లయితే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం నారాయణుడిని అన్వేషించడానికి మానవ జన్మ ఇవ్వబడింది ఏదో ఉద్యోగం చేయటానికి చేసిన తర్వాత రిటైర్ అవటానికి రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే ప్రశ్నతో మళ్ళీ జీవితాన్ని అటు ఇటు అతలాకుతలం చేసుకోవటానికి వచ్చిన వాళ్ళం కాదు పరబ్రహ్మ మూర్తిని ఎరగాలి పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి తదనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలి జీవితం మనకు కావలసినట్లుగా ఉండదు అది ఎట్లా ఏ మలుపు ఎట్లా తిరిగినా దాన్ని గౌరవంగా మర్యాదగా గంభీరంగా ఉదాత్తంగా ఆవిష్కరించుకోగలిగినటువంటి ఒక ప్రజ్ఞా భూమికని ఇవ్వగలిగినటువంటి అధ్యాత్మ కాబట్టి ఈ అధ్యాత్మని మనకి పరిచయం చేసి సుబోధకం చేసిన transmitter అంటాం canvas చాలా తక్కువ రోజులు ఉంటుంది అంటే canvas అంటే ప్రచారం సత్యసాయి దేవుడు దేవుడు దేవుడు అని ప్రచారం చేయండి ఎక్కువ కాలం నిలబడదు ఎందుకు దేవుడు ఎట్లా దేవుడు ఆ దివ్యత్వాన్ని మనం ఎట్లా అనుభవించామో ఆ స్థాయిలో గనక మనం transmit చేయగలిగితే through our own living అందుకనే స్వామి మొదట్లో my life is my message అన్నా ఇవాళ your life should become my message అన్నారు స్వామి అంటే ఏమి expect చేస్తున్నారు స్వామిని గురించి కీర్తిస్తూ వెయ్యి పుస్తకాలు రాయండి రెండు వేల cassettes తీయండి దాని వలన ప్రయోజనం కాస్త స్వల్పం స్వామి ఎవరో ఎరిగి తద్వారా మన జీవితాన్ని గనక మనం నడపగలిగినట్లయితే అది కొన్ని కోటానుకోట్ల మందిని ప్రభావితం చేస్తుంది గనుక ఈ correction process ఎక్కడ start కావాలంటే వ్యక్తిగా ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి మనలో negativities ఉంటాయి అనాచారాలు ఉంటాయి అవిద్యలు ఉంటాయి అస్పష్టతలు ఉంటాయి అహంకారాలు ఉంటాయి అసూయలు ఉంటాయి దంభాలు ఉంటాయి ప్రగల్భాలు ఉంటాయి వీటన్నింటినీ కూడా నెమ్మది నెమ్మదిగా వదులుచుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ పూర్ణ ప్రజ్ఞని పరమేశ్వరుడి వైపు అనుసంధానం చేసుకోగలిగినట్లయితే సత్యసాయి భగవానుడి యొక్క ఆ గురు స్థానం ఏమిటో ఒక గురువుగా చూడండి స్వామి కంటే ముందు వచ్చిన అవతారాలన్నీ స్వామి తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు భవిష్యత్తును గురించి పక్కన పెట్టినట్లయితే స్వామి అవతారం కంటే ముందు వచ్చిన ప్రతి అవతారం కూడా చాలా పరిమితమైనటువంటి ఆ ప్రభావాన్ని చూపించినయి ఏవో కొన్ని ప్రదేశాలు కొంతకాలం నడుపుతూ వచ్చినయి సత్యసాయి భగవానుడు గురు స్వరూపంగా ఒక పరదైవతంగా ఆ దేహంలో ఉండగానే ఈ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ధర్మాన్ని సర్వ ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు అంతేకాదు transmit చేశారు ఒక దేశం లేదు ఓ ప్రదేశం లేదు ఒక జాతి లేదు ఒక వర్గం లేదు ఒక వర్ణం లేదు అసలు ప్రశాంతి నిలయానికి రాని వాళ్ళు లేరు ఒకవేళ రాలేకపోయినప్పటికీగా వారి వారి దేశాలలో కేవలం స్వామి యొక్క చిత్ర పటాన్ని photo ని ఆధారం చేసుకొని తమ అధ్యాత్మ కార్యకలాపాలని సాంఘిక సేవా కార్యక్రమాలని స్వామి పేరు మీద స్వామి యందున్న కడు భక్తితో ఇంత విస్తృతంగా ఈ భారతీయ ధర్మం స్వామి నడిపించినట్టుగా ఎవరు నడిపించలేదు ఇది మన కళ్ళముందు ఉన్నటువంటి ఒక చారిత్రక సత్యం అందులో అటువంటి మహా ప్రవాహంలో మనమందరం కూడా ఉన్నాం ఒక బిందువుగా ఉండగలిగాం ఒక రేణువుగా ఉండగలిగం ఒక అణువుగా ఉండగలిగాం క్షణమాత్రం ఉండగలిగాం చాలు జీవితంలో దేహం వదిలిపెట్టిన తర్వాత మరణం సంభవించినప్పుడు మరణానంతరం కనుగొనేటువంటిది ఏమున్నది అంటే మరణానంతరం ఏమున్నది ఏం దేహం ఇక్కడే పడి ఉంది పోయింది ఏదో ఆత్మ ఘటాకాశం అంతా చిదాకాశం అయింది సర్వాత్మగా అది రూపాంతరీకరణం చెందింది మరి అనుభవిస్తున్నది ఎవరు మరణానంతరం అంటే మరణించకుండా ముందే ఇహ మీవా now and here ఇప్పుడే ఇక్కడే దానిని ఒక తదేక స్థితిలో అనుభవించగలిగినట్లయితే అది ఒక జీవన్ముక్త స్థాయిగా వేదాంతం భావన చేస్తుంది మనందరికీ కూడా స్వామి అటువంటి స్థితిని కల్పించారు ఇవాళ ఏం కావాలి ఏం అక్కర్లేదు మీకు ఏం కావాలి అంటాడు ఒకడు ఏం కావాలి ఏం అక్కర్లేదు ఇరవై ఏళ్ల క్రితం అది కావాలి ఇది కావాలి నలభై ఏళ్ల క్రితం అన్నీ కావాలి యాభై ఏళ్ల క్రితం అంతా నాకే కావాలి మరి ఇవ్వాళ నాకేం అక్కర్లేదు అసలు ఏదన్నా కావలసి ఉన్నదా ఏదన్నా అవసరం ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే నన్ను నేను తెలుసుకోవాలి నన్ను నేను తెలియక ఈ ప్రపంచం మొత్తాన్ని గురించి తెలుసుకున్నా ప్రయోజనం లేదు గనుక ఆత్మానాత్మ విచారణలో ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటో తెలుసుకుంటూ అంటే ఏది ఉండేది ఏది పోయేది స్వామి చెప్పారు నాది నాది నాది అనుకుంటావ్ కూడి ఉన్నవన్నీ ఊడిపోయవే బంగారు అన్నీ ఊడిపోయవే వీడిపోయవే అన్నారు వీడిపోతాయి ఊడిపోతాయి అంతా ఉన్నంత సేపు మనదనుకుంటాం ఆ అనుకోకుండా ఉండటం ఎట్లాగో స్వామి నేర్పుతారు గనుక అధ్యాత్మ అనేటువంటిది పరమోన్నతమైనటువంటి శాస్త్రంగా భావన చేయమన్నారు స్వామి.అందుకనే మనం చాలా చిన్నప్పుడే మన పిల్లలు వేళ మన వయసులో మాట్లాడాలంటే మనవోళ్ళు మనవరాళ్ళు మన తర్వాత తరం వీళ్ళంతా కూడా ప్రధానంగా యువకులు యువత అధ్యాత్మ వైపు రావాలి అధ్యాత్మ గనక తెలియకపోయినట్లయితే నరుడు నారాయణుడు కాలేడు తనలో ఉన్న నారాయణుడిని వాడు తెలుసుకోలేడు మనుజుడు ధనుజుడు కావటం తేలిక ధనుజుడు అంటే రాక్షసుడు మనిషి కావటం చాలా కష్టం ఈ process లో మనలో ఉన్న రాక్షస తత్వాన్ని వదులుచుకోవాలి మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి మనలో ఉన్న ప్రజ్ఞలని పదును ఎక్కించుకోవాలి వాటిని పరిగెత్తించాలి సేవాభావంతో చేయాలి నికామంగా నిష్కామంగా చేయాలి చేస్తూ ఉండాలి ఎప్పటిదాకా చేయాలి ఉద్యోగం అరవై ఏళ్లకు అయిపోతుంది ఉద్యోగం జీవితం కాదే జీవితంలో ఉద్యోగం భాగం అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కన్నుమూసే దాకా పరమాత్మ నామస్మరణ చేయాలి పరమాత్మ భావాన్ని గురించి ప్రతిరోజూ చక్కగా అనాలి వినాలి విచారణ చేయాలి మననం చేయాలి దానిమీద ధ్యాస పెట్టాలి ఆ ధ్యాసలో నుంచి చిత్త ఏకాగ్ర స్థితిని పొందాలి దానిలో నుంచి మనకు ఏర్పడిన అనేక మూల వాసనలు సంహారం చేయాలి ఒక యోగ స్థితిని పొందాలి తామరాకు మీద నీటి బొట్టు వలే ఉండగలిగిన స్థాయికి వెళ్ళాలి ఇదిగో ఇవన్నీ నేర్పే వాడు ఎవరు అంటే గురువు ఏదిరా నీ స్వామి అన్నారు నేను పొంగేది లేదు కుంగేది లేదు మీరు చూస్తున్న ఈ నేను మాత్రమే నేను కాదు గనక నేను నేనైన నేనుగా అన్ని అవస్థలలో ఉన్నాను గనక ఆ మూలమైన నేను ఏది అంటే ఆత్మను గనక పరమాత్మను గనక ఏను దైవంబు తద్భిన్నమేమి కాదు స్వామే చెప్పారు నేను దైవాన్ని తత్ దానికంటే నేను భిన్నమైన వాడిని కాదు మీరు ఏ దైవాన్ని చూడాలనుకుంటున్నారో అదే నేను ఆయన స్వామి అంతటితో ఆగకుండా ఈ మాట అంటున్న నేను అంటున్నాను నిజానికి మీరు అదే మీరు తెలుసుకునేదాకా మీరు దైవం వేరనుకుంటారు అది తెలుసుకున్నప్పుడు మీరు నేను ఒకటే అంటాం అన్నమాచార్యుల వారు అంటారు తనను తాను ఎరిగే దాకా తత్వం కావాలి గానీ తనను తాను ఎరిగిన తర్వాత తత్వం ఎక్కడుంది అసలు అది ఇది ఒకటైనప్పుడు రమణ మహర్షి అంటారు all efforts కావాలి పూజ కావాలి దానం కావాలి జపం కావాలి ధ్యానం కావాలి యోగం కావాలి భగవాన్ ఇన్ని efforts ఎందుకు అంటే to have an effortless effort అన్నారు కొద్ది దూరం వెళ్లిపోయిన తర్వాత అసలు వీటి ప్రయోజనమే లేదు శూన్యం కనువిందు మనసుకు విందు చేసే అర్చనలు కావాలి ఆరాధనలు కావాలి వేడుకలు కావాలి జాతరలు కావాలి ఊరేగింపులు కావాలి అన్ని కావాలి కావాలి ఎప్పటి వరకు తనను తాను ఎరిగే దాకా ఇవన్నీ కావాలి ద్వైతంలో కావాలి duality to oneness అది మన ప్రస్థానం మీరు నేను వేరు అనుకున్న మనం ఏదో ఒక రోజున అసలు ఉన్నదంతా ఒకటి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అసలు భగవంతుడి కంటే భిన్నమైంది లేదు మనం చివర్లో మొదట్లో diary లో రాసుకుంటాం god exists everywhere, god exists everywhere, god god everywhere పాటలు పాడుతుంటాం అది మాత్రమే కాదు whatever exists is god అసలు కనిపిస్తున్నదంతా పరబ్రహ్మమే అనేటువంటి ఆ భావనలోకి జీవుడిని నడిపించగలిగినటువంటి వాడు ఉన్నతోన్నత గురువు గనక ఆ ఉత్తమ గురువుని మనం పొందగలిగాం పొందగలిగాం బానే ఉంది మేము బాబాను చూశాం స్వామి దగ్గరికి వెళ్ళాం పుట్టపర్తి పట్టికో రెండు వందల సార్లు వెళ్ళాం లేకపోతే ఆయన ఎంత బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇచ్చారో లేకపోతే ఎంత గొప్పగా వస్తువును సృష్టించారో అంటున్నాం ఆగిపోతున్నాం అలాగే స్వామితో మనకున్న personal relation ని చాలా పలచన చేసుకుంటున్నాం చేసుకోకూడదు personal relation ఆ proximity నీకు ఎందుకు ఇచ్చారు అంటే ఆ space లో నిన్ను నీవు అర్థం చేసుకోవటానికి మనం ఎవరింటికో వెళ్తాం అయ్యా ఏనా freshen up అవుతారా అంటారు అవుతాం అండి అలసటగా ఉంది అంటాం వాడు సబ్బు ఇస్తాడు అద్దం ఇస్తాడు దువ్వెన ఇస్తాడు ఎందుకు మనల్ని మనం చూసుకుని సరిదిద్దుకోవటానికి ఆ proximity అద్దం దగ్గర ఆ పని అయిపోగానే అద్దం నుంచి వైదొలుగుతాం అద్దానికి మనకు సంబంధం లేదు ఆ పరమాత్మ యొక్క proximity లో ఉండటానికి ఒకే ఒక్క కారణం తనను తాను సరిదిద్దుకోవటానికి వెళ్ళాలి ఇంకొడిని దిద్దటానికి మన దగ్గర శక్తి లేదు అర్హత లేదు unless we redefine ourselves unless we refine ourselves we have no capacity to refine others అసలు మన పని ఇది కాదు మనల్ని మనం స్వీయ సంస్కరణ చేసుకోవటానికి వచ్చాం ముందు మనల్ని మనం బాగు చేసుకుంటే లోకాన్ని అంతా బాగు చేయొచ్చు ఏదో మంచి మాటలు చెప్పొచ్చు మంచి పనులు చేయొచ్చు మనల్ని చూసి ఇంకో పది మంది ప్రభావితం కావచ్చు అది మాత్రమే కాదు మనల్ని మనం ఎరగాలి మనల్ని మనం ఎరిగిన తర్వాత మనం భగవంతుడి కంటే భిన్నం కాదు అది వేదశాస్త్రాలన్నీ కూడా సప్రమాణికంగా చెప్పినటువంటి మాట గనుక వీటన్నింటినీ అనేక రీతులలో భగవత్ తత్వాన్ని బోధించేటువంటి గురువులు మనకు కావాలి ఏ కాలం తీసుకోండి గురువు అంటే సాధకుడు బోధకుడు ఓ చోట ఉన్నారు రామాయణ కాలంలో రాముడు ఆంజనేయుడు భారత కాలంలో కృష్ణుడు అర్జునుడు భాగవత సమయంలో Sri Krishna paramatma a galaxy of devotees వాళ్ళు భాగవతం అంతా పరుచుకొని ఉన్నారు అలాగే గురువు శిష్యుడు ఆధునిక కాలంలోకి వస్తే షిరిడి బాబా నాన్న షిరిడి బాబా మరొకరు మరొకరు అనేక మంది సత్యసాయి భగవానుడి దగ్గరికి వచ్చినప్పుడు ఫలానా వాడు అని చెప్పటానికి లేదు ఆయన ఆవరణంలోకి వెళ్ళిన ప్రతి వాడు ఆయనతో connect అయి ఉన్నాడు నేను connect అయి ఉన్నాను మీరు ఇంకా connect కాలేదు అనటానికి వీల్లేదు స్వామి చెప్పారు నాకు నా భక్తుడికి మధ్య there is no agent అది direct contact అన్నారు స్వామి ఆ direct contact గనకనే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక అంటాడే.మనందరం ఇవాళ ఇక్కడ కూర్చున్న స్వామితో కూడి ఉన్నాం ఒక్కళ్ళు చెప్పండి మాకు స్వామి అంటే తెలియదు అని అందరు తెలిసినే చెబుతాం మీ యొక్క అనుభవం చెప్పండి అని అడగ్గానే ఆ అనుభవం చెబుతారు వారికి కలిగిన అనుభవం మన దగ్గర ఉన్న అనుభవాలు entirely different ప్రతి ఒక్కటి విశిష్టం ప్రతి ఒక్కటి విచిత్రం ప్రతి ఒక్కటి వరిష్టం ప్రతి ఒక్కటి సత్యం కనుకనే స్వామితో ఉన్నటువంటి relation ఏ ఒక్క వ్యక్తితో పరిమితమైంది కాదు సర్వ జగత్తుతో ఇవాళ స్వామి మీద ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల నుండా ఏమున్నాయి అంటే ninety percent స్వామితో ఉన్న అనుభవాలే ఉన్నాయి స్వామి తత్వం ఆ ten percent దాటలేదు ఎందుకని అనుభవం ఏర్పడింది పరమాత్మతో ఆ అనుభవం ఒక్కటే వాడికి ఆనందాన్నిస్తున్నది ఇక మెట్టు దాటి ఆలోచించడానికి అవకాశం లేకుండా పోయింది అయితే ఈ అనుభవాలు పొందిన ఈ ninety percent కూడా మిగిలిపోయిన ఆ ten percent లోకి తత్వ విచారణలోకి వెళ్ళాలి తత్వం గనుక ఎరక్కపోతే స్వామి తెలియనట్టే లెక్క peripheral గా తెలుసు ఈశ్వరమ్మ కొడుకు అని పుట్టపర్తి లో ఉన్నారని ఎనభై ఆరేళ్ళు calendar events జరిగినాయి అని ఆయన మహిమలు చేశారని అనేక మందికి అనేక interviews ఇచ్చారని అనేక మందితో ఆయన కూడి ఉన్నారని ఆయన అనేక మందికి ఆనందాన్ని ఇచ్చారని రోగాలు పోగొట్టారని ఈ ఎన్నన్నా మనం చెప్పొచ్చు కానీ అదంతా కూడా ninety percent కు లోబడింది మాత్రమే అసలు ten percent ఏది అంటే దాన్ని పట్టుకోవాలి అంటే భారతీయ తత్వం తెలియాలి అవతారమూర్తుల యొక్క మర్మం తెలియాలి ఒక్కొక్క అవతారమూర్తి ఒక్కొక్క aspect తీసుకుని ఎందుకు వస్తారో విచారణ చేయాలి స్వామి సర్వదేవతా అతీత స్వరూపం అని స్వామి దాన్ని దేవతా స్వరూపం అంటే అతీతగా మార్చారని చెబుతాం ఆగిపోతాం ఏమిటా సర్వదేవతా అతీత స్వరూపం దేవీదేవతలందరికీ రూపాలున్నాయి నామాలున్నాయి మరి ఈయనకు కూడా ఒక నామం ఒక రూపం ఉందే దీన్ని మళ్ళీ అతీతం అంటున్నామేంటే స్వామీజీ చెప్పారు పరిష్కారం ఐదు అడుగుల మూడు అంగుళాలు దాటి చూడటం నేర్చుకోండి అని ఎవరు నేర్చుకున్నారు ఎవరికి కావలిసి వచ్చింది ఏదో స్వామి దగ్గరికి వెళ్ళాం స్వామి దగ్గర ఉన్నాం స్వామి పుస్తకం కొనుక్కున్నాం స్వామి ఇలా చేయమన్నారు అలా చేయమన్నారు అనుకున్నాం కానీ ఐదు అడుగుల మూడు అంగుళాలు దాటి చూడగలిగితే స్వామి యొక్క ఆ సత్య బోధకత్వాన్ని ఆచార్యత్వాన్ని తత్వ సిద్ధాంతాన్ని ప్రేమని సేవని ఈ ప్రపంచానికి ఎట్లా రంగరించి ఆనందాన్ని ఇచ్చారో మనకు అనుభవాలన్నీ ఏర్పడతాయి గనుక స్వామిని అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు దానికి చాలా సాధన కావాలి నిస్వార్థమైనటువంటి భావన కావాలి openness ఉండాలి purity ఉండాలి dogma లేకుండా ఉండాలి అన్నింటినీ అర్థం చేసుకుని open గా చర్చించగలిగినటువంటి ఒక ధైర్యం ఉండాలి ఒక ధీ శక్తి ఉండాలి సకల శాస్త్ర పరిచయం ఉండాలి ఇవన్నీ ఉంటేనే సత్యసాయి భగవానుడి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది అయ్యా మరి అందరికీ ఇవి ఉండవే ఇక అర్థం కాదా అంటే అది అర్థం చేసుకోవాలి అంటే భగవద్గీత లో ఒక శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అయ్యా ఈ మనిషి ఇన్ని జీవితాలు జన్మలు ఎత్తుతాడు కదా ఎప్పటికి evolve అవుతాడు ఎప్పటికి ఇంకా జన్మ రాహిత్యం ఏర్పడుతుంది అనంటే తనను తాను ఎరుగు ఎరుక కలిగే దాకా జన్మలు ఎత్తుతూనే ఉండాలి ఆ ఎరుక పేరు ఏమిటి అంటే భగవంతుడే ఎరుక మన అదృష్టం ఏంటంటే ఆ ఎరుకే భగవంతుడి రూపంలో సత్యసాయి భగవానుడిగా కనిపించినా మళ్ళీ మనం మాయావరణ ప్రభావం చేత స్వామిని కేవలం ఒక పాంచభౌతిక దేహానికి ఇందాక చెప్పిన ఐదు అడుగుల మూడు అంగుళాలకి ఆయన చేసిన చిన్న చిన్న మహిమలకి పరిమితం చేసి అక్కడ ఆగిపోయినాం ఆగిపోకూడదు వాటిని దాటాలి ప్రతి సన్నివేశం వెనుక ప్రతి సందర్భం వెనుక ప్రతి సంఘటన వెనుక పరమాత్మ యొక్క అదృశ్య హస్తం ఉన్నది అందుకనే ఆయన ఓ చోట అంటారు I am an unseen guest in every conversation అలాగే ప్రతి dining table దగ్గర మీరు రెండు కుర్చీలు వేసుకుని ఉంటే మూడో కుర్చీలో నేను కూర్చొని ఉంటా మనం గమనించం భగవంతుడు గణపడాలి అంటే దేహంతో గణపడాలి అని ఇవాళ మనం ఈ మాట్లాడుకుంటున్న ఈ నాలుగు మాటల మధ్య ఎవరు ప్రథమ స్రోత అంటే స్వామే ప్రథమ స్రోత ఆ కుర్చీ వేయటంలో దాని అర్థం ఏది ఆయన అక్కడ ఉన్నారు ఆయన ఉన్నారు అన్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా చాలా అమృతమయం అవుతాయి ఆయన అక్కడ లేరు అనుకున్న విహారంలో ఆయన లేరు ఆయన ఎక్కడో ఉన్నారు అసలు దేహంలోనే లేరు He has already become formless అంటున్నాంగా మాట్లాడేస్తున్నాం గా Is he really formless నా భావం ఒకటే He has been formless కాసేపు form గా కనిపించారు ఆయనకేం పరిణామం లేదు మనకి దృశ్యం ఉంది గనుక అదృశ్యం అయిందంతే ఆయన దృశ్యము ఆయనే అదృశ్యము ఆయనే ఇటువంటి తాత్విక చింతనా భూమికని మనం నలభై ఏళ్ళు వచ్చేప్పటికన్నా అలవాటు చేసుకోకపోతే ఉరికా మహిమలు చదివి చదివి చదివి స్వామితోనే మాట్లాడాను స్వామితో కూర్చున్నాను స్వామితో తిరిగాను ఏం సాధించావ్ ఏన్నా మార్పుందా ఆలోచనలో మార్పుందా అందరినీ ప్రేమించగలుగుతున్నావా అహం వదులుకోగలిగావా కోరికలు తగ్గినయా ప్రచార ఆడంబరాలు తగ్గించుకోగలిగావా నాకిది కావాలి అన్న అహంత్వా 'అహం మమత్వా శిథిలాయమాన్' అని అంటారు భగవత్పాదులు అహం పోనంత కాలం మమకారం తగ్గనంత కాలం నాకే కావాలి అన్న మమత్వం ఉన్నంత కాలం పరమాత్మతో ఉన్నా ఒకటే పరమాత్మని కనుగొన్నా ఒకటే పరమాత్మని గురించి ఆ దూరంగా ఉన్నా అంతా ఒకటే కాబట్టి ఉండవలసినది ఒకటే పరమాత్మకి ఎంత దగ్గరగా ఉన్నావని కాదు పరమాత్మని నీ లోపలికి ఎంత దగ్గరగా తీసుకోగలిగావ్ అందుకనే అనంత వానర సమూహం ఉంది రామచంద్రుడికి ఒక ఆంజనేయుడు మాత్రమే దగ్గర ఎందుకు కాగలిగాడు అంటే నిజంగా ఉన్నాడా పరమాత్మ అంటే గుండె చీల్చి చూపించిన వాడు ఆయన ఒక్కడే.అంటే హృదయ స్థానంలోకి రాముడిని రప్పించుకోగలిగాడు బయట కనిపిస్తున్న రఘురాముడిని, దశరథ రాముడిని, జానకి రాముడిని, అయోధ్య రాముడిని, పటాభి రాముడిని ఆత్మారాముడుగా మలుచుకున్నటువంటి వైనం ఎవరిది అంటే ఒక్క ఆంజనేయస్వామిది మాత్రమే కాగలిగింది. కనుక అందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళాలి వెళ్ళకపోతే స్వామి అర్థం కాకపోవడం ఏం లేదు అర్థం అవుతారు కొంతవరకు అర్థం అవుతారు. ఒక స్థాయి దాటిన తర్వాత అర్థం చేసుకోవాలి అంటే మాత్రం మనం కూడా దేవో భూత్వా దేవం యజేత్. ఈయన పరదైవమే అని చెప్పగలిగిన స్థాయికి మనం కూడా ఆ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి దానికి నిరంతర సత్సంగం కావాలి సత్సాంగత్యం కావాలి గుణనామ సంకీర్తనా వైభవం కావాలి భజన కావాలి తాత్విక విచారణ కావాలి ఇదిగో మనం చేసుకునే ఈ study circles కావాలి అన్నింటిని మించి వీటన్నింటికీ final result ఏమిటయ్యా అంటే we must end up with two aspects one aspect is divine love లింగభేదం లేదు అక్కడ అంతా ఒకటే ఆమె స్త్రీగా ఉంది ఈయన పురుషుడుగా ఉన్నాడు నా వరకు రెండు ఆత్మే ఆమె పేరుతో నాకేం పని ఆమె స్థితితో నాకేం పని ఆమె నేపథ్యంతో నాకేం పని ఆమె యందున్న ఆత్మతో నాకు పని స్వామి అందుకే దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా అని మనల్ని సంబోధించటం వెనకే మన స్థితిని గమనించమన్న ఒక హెచ్చరిక ఉన్నది అన్వేషణ ఆపేటువంటి ఒక పని ఉన్నది మన మూలస్థితిని తెలియజేసేటువంటి దివ్యబోధ ఉన్నది ప్రబోధం ఉన్నది. ఆ ఉత్తిష్ఠ అంటే మేలుకో పరిగెత్తు ప్రాప్యవరాన్నిత అనేటువంటి ఉపనిషత్ వాక్యానికి స్వామి ఆ రెండు సంబోధనలు కూడా పరమ ఉన్నతమైనటువంటి భావనలుగా మనం భావన చేస్తూ ఉండాలి. కాబట్టి గురు శిష్య పరంపర వైభవంలో గురుపూర్ణిమ a thanks giving day అది గురువుకు సంబంధించింది కాదు మనకు సంబంధించింది. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటున్నాం. సదాశివుడు సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసంతీ లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేమాన్యతమం లయానాం గురు స్వరూపాలందరికీ మూలం ఎవరు అంటే సదాశివుడు మూలం ఆయనకు నమస్కరించాలి. వ్యాస శంకర మధ్యమాం వాంగ్మయాంగా ప్రపంచానికి సారస్వతంగా అక్షర రూపంలో అందించిన వ్యాసుల వారికి శంకరులకి నమస్కరించాలి. ఆ తర్వాత అస్మత్ ఆచార్య మనకు elementary school లో ఓనమాలు దిద్దిన గురువుగారి దగ్గర నుంచి teacher దగ్గర నుంచి master దగ్గర నుంచి professor దాకా అనేక రీతులు అనేక విషయాలు బోధించే గురువు దాకా ఈ గురువులని అందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆలోచించండి ఓం నమశ్శివాయ అని పలక మీద చెప్పిన గురువు దొరికి ఉండకపోతే ఇవ్వేళ computer mouse నడిపించే తెలివితేటలు మనకు వచ్చేవి కాదు కదా! అది transformation ఆ స్థితి నుంచి ఈ స్థితి దాకా ఎంతమందో ఎన్ని రకాలుగానో. అందుకనే దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువులు నాకు ఉన్నారు అన్నాడు. అంటే ఇరవై నాలుగు తత్వాలను ఒక తత్వంగా ఏకత్వంగా భావన చేయగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అధ్యాత్మ స్థితిలోకి జీవుడు వెళ్ళాలి. వీటి అన్నింటినీ కూడా స్వామి condense చేశారు. చేసి అంటే చాలా సంక్షిప్తంగా precise గా ఒక మాట చెప్పారు Love all serve all help ever hurt ever ఈ నాలుగు మన బోటి వారికి మహా వాక్యాలు స్వామి పరిచయం లేని వాళ్లకు కూడా మనం ఇవి గనుక నాలుగు చెప్పగలిగితే దీన్ని మించినటువంటి అధ్యాత్మ సేవ లేదు. స్వామి miracles ఎన్నాళ్ళు చెప్పుకుంటాం. స్వామి miracles వల్ల దేవుడు అయినాడా దేవుడు గనుక miracles చేశారా అని దేవుడు కనుకనే అనేటువంటి భావనలోకి వెళ్ళాలి తత్వచింతన లోకి వెళ్ళాలి మూలాన్వేషణ లోకి వెళ్ళాలి స్వామి దగ్గరకు వెళ్ళటానికి ముందు మనం ఎట్లా ఉన్నాం స్వామి దగ్గర స్వామితో కూడి ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం స్వామి నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం ఇవన్నీ ఎక్కడికి అక్కడ barriers వేసుకుంటూ మనం చేయవలసిన కర్తవ్యాలని కర్మనిష్ఠగా భావన చేయాలి జీవితాన్ని జీవితంగా అనుభవించాలి అందులో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఆనందం ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి కానీ అన్నింటినీ సమంగా అనుభవించి అంతయున్ ఈశ్వర ప్రీతికే పరమేశ్వరా మేము ఇక్కడికి రావటానికి నువ్వే కారణం ఇక్కడి నుంచి మేము వెళ్లిపోవడానికి నువ్వే కారణం మేం కారణం కాదే. కాలా కార్య కారణ కర్తవ్య ఈ నాలుగింటికి లోబడి ఈ నాలుగింటిని నడిపించేటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అనేటువంటి ఈ మూడు భావనలు భగవద్గీతలో చెప్పినవే శిరిడి బాబా చాలా స్పష్టంగా నాన్నకి చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన ముందు శరణాగతి పొందు పరిప్రశ్నేన ప్రశ్న వేస్తూ ఉండు సమాధానం పొందుతూ ఉండు సందేహాలు వదులుచుకుంటూ ఉండు final గా సేవయా సేవ అంటే మనం చేసే physical సేవ కాదు సేవయా అంటే భావించు అని అర్థం. ఏమని భావన చేయాలి ఆ ఉన్నదంతా నువ్వే అసలు నువ్వు తప్ప అన్యం లేదు జడం నువ్వే అజడం నువ్వే చైతన్యం నువ్వే సుఖం నువ్వే దుఃఖం నువ్వే అని అనుకోగలిగినటువంటి ఒకానొక స్థాయికి వెళ్ళమని చెప్తూ స్వామి మనందరినీ కూడా సర్వసన్నద్ధం చేశారు. ఎందుకని సత్య యుగం రావాలి అంటే తలవారుగానే సత్య యుగం రాదు మన బోటి వాళ్ళంతా మనల్ని మనం సంస్కరించుకుంటూ పాత ఆలోచనలన్నీ వదిలిపెట్టి కొత్త ఆలోచనలు వినూత్నమైనటువంటి భావాలతో తత్వచింతనా భూమికలో మనల్ని మనం నిలబెట్టుకుంటూ జీవితాన్ని అది ఎట్లా వస్తే దాన్ని అట్లా accept చేస్తూ దేనికి పొంగక లొంగక కుంగక వంగక మనల్ని మనంగా నిలబెట్టుకుంటూ మన సాధనా కార్యక్రమాన్ని మనం తీవ్రతరం చేసుకుంటూ నిన్నటికంటే ఇవాళ ఇవాళ్టి కంటే రేపు ఉన్నతంగా ఉదాత్తంగా ఉండగలిగినటువంటి ఒకానొక స్థాయికి గనుక మనం వెళ్లగలిగినట్లయితే అదిపరమోన్నతమైనటువంటి భావనగా మనం భావన చేస్తూ ఆ స్థితిలోకి నడిపించటానికి వచ్చినటువంటి పరమోన్నతమైనటువంటి గురు స్వరూపంగా స్వామిని మనం భావన చేస్తూ స్వామి చెప్పిన అనేకానేకమైన విషయాలని ఆకళింపు చేసుకుంటూ మానవ జీవితాన్ని ధన్యవంతము, ప్రేమమయము, శాంతిమయము, కాంతిమయము, క్రాంతిమయము, ఆనందమయము చేసుకుంటూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనేటువంటి ఒక భావనతో ఈ గురుపూర్ణిమ అనబడేటువంటి సందర్భం మనకి గురువుకి కృతజ్ఞతాపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఆ గురు స్వరూపాల్ని చల్లగా ఉండి ఈ ప్రపంచానికి మార్గోపదేశం చేయాలి అనేటువంటి ఒక భావనతో సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాలు బాగుంటే అది మనం బాగుంటాం మన దుఃఖం ప్రపంచానికి దుఃఖం కాదు కానీ ప్రపంచం యొక్క ఆనందంలో మనకు భాగం ఉంది మన దుఃఖంతో ఈ ప్రపంచానికి ఏ సంబంధం లేదు. నాకిది జరిగింది అది జరిగింది ఎవరికి కావాలి అది నీది, నీది కూడా కాదు నిజానికి నువ్వు అనుకుంటే నీది అనుకోకపోతే అది కూడా నీది కాదు కానీ ప్రపంచమంతా ఆనందంగా ఉండటానికి మన పాత్ర ఏమిటి మనం ఏం చేయగలం మనవంతు ఏం చేయగలం అనేటువంటి అధ్యాత్మని గనుక స్వీకరించగలిగినట్లయితే దాన్ని ఉన్నత భావనగా నేను భావన చేస్తూ కోటి సమితిలో ఈ study circle ఒక వినూత్నమైనటువంటి dynamics కి dimensions కి ఇది శ్రీకారం చుట్టుకోవాలని అలాగే స్వామి పేరు మీద చాలా మందిరాలు వచ్చినాయి ఆ మందిరాల నిండా కూడా తత్వచింతన జరగాలి స్వామి యొక్క చింతనా భూమికలు పెరగాలి అనేకమంది తాత్వికులు మహాత్ములు రావాలి అనేక ప్రదేశాల నుంచి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి స్వామి గురించి మాట్లాడాలి రమణ కేంద్రానికి వెళ్తాం స్వామి గురించి మాట్లాడతాం art of living కి వెళ్తాం స్వామి గురించి మాట్లాడతాం మన గురుతత్వాన్ని గురు వైభవాన్ని అనేక చోట్లకు తీసుకొని వెళ్ళాలి అలాగే అనేక ప్రదేశాలలో నుంచి మహాత్ములంతా కూడా మన దగ్గరికి రావాలి అది నిజమైన సమర్పణ. తాత్వికమైన సమన్వయమైన ధోరణిలో మనం విచారణ సాగాలని దానికి కావలసినటువంటి ఆ అవకాశాలు యోగాలు అన్నీ కూడా స్వామి మనకు అన్నివేళలా కల్పించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ స్వామి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామిని నమ్ముకున్నాం స్వామిని నమ్మి ఉందాం స్వామి మనల్ని చక్కగా అన్ని సమస్యల నుంచి పరిష్కారం చేస్తూ పరమోన్నతమైనటువంటి భావనా స్థితిలోకి మనను నడిపిస్తారు అటువంటి పరమగురువుని పొందిన మన సౌభాగ్యానికి మురిసిపోతూ సాయిరాం. [భాగం1 సాయి music] ఇంతవరకు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు ఈ సంవత్సరం గురుపూర్ణిమ పర్వదిన సందర్భంగా నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు గురుతత్వం పై అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం. [భాగం1 సాయి music]
SSSMC · audio
Talk - on Guru Tatwam
Talk - on Guru Tatwam
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 52:08
More in this series
Talks
- 24 min 1
Talk on significance of festival of Sankranthi
- 52 min 2
Talk - on Guru Tatwam
Now playing - 40 min 3
Talk - Koti Samithi Hyd
- 28 min 4
Talk - Bharata
- 23 min 5
Talk on Dasara
- 6 min 6
Talk on Rathasaptami
- 32 min 7
Talk on Sri Sathya Sai - Part 05
- 33 min 8
Talk on the character of Draupadi
- 30 min 9
Talk on Gyana Yoga
- 29 min 10
Talk on Hanuman Panchamukham
- 23 min 11
Talk on Leela Kaivalya Vahini
- 35 min 12
Talk on Sathya Sai Sukthamulu
- 24 min 13
Talk on yoga Triveni
- 26 min 14
Talk on the occasion of Avatar Declaration day