No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాత్మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ దసరా అంటే విజయదశమి సందర్భంగా విజయదశమి అంటే ఏమిటి? దానిని గురించి కొంత విచారణ చేద్దాం. నిజానికి ఇది దసరా కాదు ఇది దశరా. దశ అంటే పది రా అంటే రాత్రి పది రాత్రులు అని అర్థం. నవరాత్రులు పూజలు అయితే దశమి నాటికి పూజ ముగిసి ఉత్సవం ఏర్పడుతుంది గనుక దానిని దసరా అని అన్నాం. అయితే దాని అర్థాలు వేరే ఉన్నాయి అవి నెమ్మదిగా తెలుసుకుందాం. ఈ దసరా పది రోజులు భగవత్ సంబంధ పూజ ద్వారా అత్యుత్తమమైనటువంటి కాలంగా స్త్రీ పురుషుల చేత ఆచరింపబడినటువంటి దివ్య విధానం ఇది. దీన్ని వసంత నవరాత్రి అని శరన్నవరాత్రి అని కూడా అంటారు. వసంత నవరాత్రి చైత్ర మాసంలోనూ శరన్నవరాత్రి ఆశ్వీజ శుక్ల ప్రథమ రోజున ప్రారంభించి దశమి పర్యంతము అందరి చేత విశేషంగా ఆచరింపబడుతుంది కనుక ఇది నిజానికి పది రోజుల నిండైన పండగ. శరన్నవరాత్రులు దేవి పూజా కాలం. దేవి అంటే దేవుని యందు కనిపించే లోక రక్షణార్థమైన శక్తి అని అర్థం. అర్ధనారీ విష్ణు వక్షస్థలవాసి పాగ్రాణి అని దుర్గా లక్ష్మీ సరస్వతి అని దేవి మహాత్ముల చేత కీర్తింపబడుతుంది. చరాచరాలను రక్షించటానికి ఆధారమైన కారణమే దైవ శక్తి. అది మూడు విధాలుగా జీవులకు ఉపయోగపడటం వల్ల మాతృభావన చేత దుర్గా లక్ష్మీ సరస్వతి నామములతో పిలవబడుతూ ఉంటుంది. దుర్గా ఆరోగ్య శక్తిని సరస్వతి జ్ఞాన శక్తిని లక్ష్మి అధికారాన్ని సంపదని ప్రతి మానవుడికి అత్యవశ్యంగా ఇస్తుంది కనుక ఈ మూడు విధాలుగా కనబడుతున్న ఈ దేవతా మూర్తులు సర్వదా ఆరాధనీయులు. ఒక్కొక్క శక్తికి త్రిగుణవంతమై ఉన్నందువలన అంటే ప్రతి శక్తిలోనూ సత్వ రజస్ తమో గుణాలు మూడు ఉన్న కారణంగా మూడు రాత్రులు త్రిశక్తులకు నవరాత్రులు ఈ త్రిశక్తుల ఏకత్వాన్ని పూజించడమే పదవ రోజు చేసేటువంటి పని. ద అంటే దుర్గా శ అంటే శారద రా అంటే రమా లక్ష్మి అని దసరా మహోత్సవం కనుక దసరా కాదిది దశ రా. పూర్వ జన్మ విశేషం చేత ధన కనక భోగ భాగ్యాలన్నీ లక్ష్మీ కటాక్షంగా మానవుడికి ఏర్పడుతుంది గనుక ఏర్పడిన వాడు ధనకుడని ఏర్పడని వాడు ధనహీనుడని ఈ లోకం గుర్తిస్తూ ఉంటుంది. అయితే ఈ దుఃఖంతో అశాంతి అజ్ఞానము అనాసక్తి ఏర్పడినందువలన డబ్బు లేనివాడు డబ్బును పొందాలి జ్ఞానం లేనివాడు జ్ఞానాన్ని పొందాలి దైహిక మానసిక శక్తులు లేనివాడు దుర్గాదేవిని ఉపాసన చేయాలి. ఆ కారణంగా జీవుడు ఈ పది రాత్రులు కూడా ఒక దీక్ష వహించాలి ఆరోగ్యము జ్ఞానము అధికారము అనబడేటువంటి ఈ మూడు అధికారం అంటే సంపద ఈ మూడింటిని ఏర్పరచుకోవాలి. కనుకనే ఇది జ్ఞాన మహా శక్తి శారీరక జ్ఞాన భాగ్య అధిదేవతలైనటువంటి ఈ ముగ్గురిని కూడా మనం పూజించి రుణ రోగ దారిద్ర్యాలు నశింపజేసుకోవాలి. నిజానికి మానవుడు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఈ శక్తి త్రయం అంతా కూడా జీవుడి ఆవరణలో ఉన్నందువలన శక్తులు అవసరం గనుక దసరా అంతా శక్తి పూజ. ఇదంతా భగవంతుని లీలలో భగవంతుని విభూతిలో ఒక భాగం. మహిషాసుర శుంభ నిశుంభ ధూమ్రాక్ష మధుకైటభ రక్తాక్షి రక్త జిహ్వాది మాయాబల అనబడేటువంటి రాక్షసులు తమలో ఉన్నటువంటి రాక్షస గుణ కారణంగా తమ చుట్టూ ఉన్న వారందరినీ కూడా యాతన పెట్టారు కనుక అమ్మవారు ఒక బాధ్యత తీసుకోవలసి వచ్చింది అప్పుడు ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వెళ్లి ప్రార్థించాడు ఎట్లా వీళ్ళని నిలువరించాలి అని.అప్పుడు జ్ఞాన గుణ సంపన్నుడు అయినటువంటి గురుడు అంటే బృహస్పతి ఇంద్రుడితో అన్నాడు వీళ్ళు మాయా బలులై విజృంభించు ఉన్నారు గనుక ఆ మాయను జయించటానికి మూడు ఉన్నాయి దా, శ, ర అనుకున్నాం కదా కనుక దమము, శమము, రమ అనేటువంటి ఈ మూడింటిని కూడా ఏకీకరణం చేసి అంటే ఒకటిగా చేసి త్రివిధ శక్తులన్నీ సాధించుకోగలిగినట్లయితే మాయ నిగ్రహింపబడుతుంది మాయ నశింపబడుతుంది కాబట్టి ఈ తమోగుణ, రజోగుణ రూపులైనటువంటి దైత్య దానవుల విజృంభణాన్ని అప్పుడే అణచవచ్చును అన్నాడు. కనుక ఈ దసరా అనేటువంటి శక్తులను పొందండి అని ఇంద్రాది దేవతలందరికీ కూడా బృహస్పతి ఒక బోధ చేశాడు. ఆ కారణంగా ఈ అమ్మవారు సంకల్ప మాత్రంగా స్త్రీ రూపంగా ఆవిర్భవించి ఈ జగత్తుని నడిపించునయ్యెను ఒక పురాణం. ఈ మహిషాసురాది రాక్షస సంహారం కోసం వచ్చిన అమ్మవారు భయద రూపంగా ఉన్నది, భయం కొలిపే లా ఉన్నది. భయం ఎవరికీ? అజ్ఞానికి, అహంకారానికి, అహంకారికి, దంభము, ప్రగల్భము ఉన్నవాడికి కనుక అమ్మవారిని ఆ రోజున గనుక ఉపాసన చేసినట్లయితే జీవుడిలో ఉన్నటువంటి అసుర లక్షణాలన్నీ నశించి పూర్ణ ముక్తుడవుతాడు అని ఒక మాట. అందుకే ఒక శ్లోకం మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. యా దేవి మధుకైటభ ప్రమథిని యా మహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండముండ శమని యా రక్తబీజాశని యా కుంభాది నిశుంభదైత్యదమని యా సిద్ధలక్ష్మీ పరశాచండి నవకోటి శక్తిసహిత మాం పాతు విశ్వేశ్వరి. విశ్వేశ్వరుడిలో భాగం గనుక ఆమె విశ్వేశ్వరి అయింది. శుంభ నిశుంభుల్ని, ధూమ్రాక్షున్ని, మధుకైటభున్ని వీళ్లందరినీ సంహారం చేసింది గనుక అమ్మవారిని ఆవాహన చేసుకొని పరాం పరాం పరాం పరేశాం జగదాది భూతాం పరాం వరేన్యాం వరదాం వరిష్ఠాం పరేశ్వరీం బహువాం మిహి కి ప్రగీతాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే. కాబట్టి దమ, శమ, రమ రహితులైనటువంటి రాక్షసుల్ని ధ్వంసం చేసి ఇహ పరలోక సముద్ధరణము కావించి సత్య ధర్మ శాంతి ప్రేమలను స్థాపించి సర్వ మానవులు శక్తి స్వరూపులే సర్వ మానవుల యందు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటామే అది సురీ లక్షణం, దైవీ లక్షణం. వాటన్నింటినీ కూడా ఈ తొమ్మిది రోజులలో ఒక ఉపాసనా మార్గంగా స్వీకరించి గనుక చేసుకోగలిగినట్లయితే ఆ శరన్నవరాత్రులంతా కూడా శక్తిమయంగా సాగుతాయి. మూలా నక్షత్రంలో సరస్వతీ పూజ, దుర్గాష్టమి, మహర్నవమి అని, విజయదశమి అని ఈ రోజులు కాబట్టి దసరా మహోత్సవాన్ని మనం కొనియాడాలి. అంటే అనుష్టించాలి అని, ఆచరించాలి అని. అయితే ఈ కలియుగంలో జీవోద్ధరణకు కారణమైనటువంటి సత్య, ధర్మ, శాంతి, ప్రేమల సముద్ధరణను దాని ఆవశ్యకతను అనుసరించి ముప్పది ముక్కోటి దేవతల మూలమైనటువంటి ఒక చైతన్యమే సాకార స్వరూపమై సత్యసాయి భగవానుడై ఈ ప్రపంచము నందు నిర్మోహవర్తి అయి జీవ సముద్ధరణాన్ని కావించటం కోసం వచ్చారు భగవాన్ సత్యసాయి. తాను తన ఈశ్వరత్వం అయినటువంటి సర్వజ్ఞత, సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వనియామకత్వ, సర్వరక్షత్వాది అనేకమైనటువంటి శక్తులను అన్నీ కూడా నిరూపించి సర్వ జీవుల యెడ సమభావుడై, భేదరహితుడై, సర్వహితుడై, సర్వ హృదయాంతర్గత తాపములను తెలిపి ఋణ, రోగ, దారిద్ర్యాది దుఃఖములు వదులుకోవాలి అని చెప్తూ తన దివ్యానుగ్రహాన్ని అనుగ్రహ వరదానం చేసి రక్షించటానికి సత్యసాయి భగవానుడు దీక్ష పూనారు. అందుకనే సత్యసాయి పరబ్రహ్మణ మహాసన్నిధానం అయినటువంటి ఈ ప్రశాంతి మహా మందిరంలో జరిగేటువంటి దసరా ఉత్సవాలన్నీ కూడా భక్త రక్షణ కటాక్ష వీక్షణలకు లోబడి ఉండటం వలన ఈ దమమును అంటే అంతఃకరణ నిగ్రహ ప్రాప్తిని, భగవత్ ప్రబోధ శ్రవణమును అంటే భగవంతుని గురించి వింటూను, శమమును అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సత్యసాయి భగవానుడి యొక్క దివ్య పాదారవిందములకు వందనము చేసినందువలన కలుగుతుంది కనుక అది పరమ శ్రేయస్కరమైనటువంటి భక్తి, ప్రేమ ఈ రెండింటినీ సమన్వయం చేసి జ్ఞాన ప్రబోధకమైనటువంటి దసరా జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు స్వామి.కాబట్టి ఈ దసరాలో ఈ తొమ్మిది రోజులు ప్రధానంగా మనం అమ్మవారిని ఉపాసన చేయాలి ప్రధానంగా సరస్వతీ దేవి ఉపాసన చేయాలి సరస్వతీ దేవిని గనుక చేసుకున్నట్లయితే మిగతావన్నీ అంటే డబ్బుంది దాన్ని జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలో కావలసిన వివేకము విచక్షణ కావాలంటే జ్ఞానం కావాలి గనుక అమ్మవారిని ప్రార్థన చేయాలి. శారద నీర దేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధా పయోధి శిత తామర సామర వాహినీ శుభాకార తనుప్పు నిన్ను మదియా నగ ఎన్నడు తలంతు భారతీ అని అమ్మవారిని ప్రార్థన చేయాలి అమ్మవారిని ప్రార్థన చేయటమంటే వాగీశ్వరీ వాంగ్మయి వాక్య విభూతి మూలమైనటువంటి సత్య సాయి భగవానుడి యొక్క దివ్య స్మరణం చేత నామస్మరణం చేత వాంగ్మయ స్వాధ్యాయం వలన సద్గోష్ఠి వలన సదాచారం వలన సరస్వతీ కటాక్షం మనకు లభిస్తుంది. అంతేకాదు దుర్గాదేవిని ఉపాసన చేయాలి మనం స్వామిలో శివ శక్తి స్వరూపమైనటువంటి స్వామి లో ఉన్నటువంటి శక్తి భావాన్ని కూడా మనం అనుభవ రస సిద్ధం చేసుకోవాలి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాల పెద్దమ్మ తనులో నమ్మినవారి తనులో నమ్మినవారి This will delete this part will delete you can take it off అమ్మలగన్నయమ్మ you can take it off కాబట్టి అమ్మవారిని ప్రార్థన చేయాలి దుర్గాదేవిని ప్రార్థన చేయాలి అలాగే స్వామిని లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీనాథుడుగా శ్రీ మహావిష్ణువుగా శ్రీమన్నారాయణుడిగా భావన చేసి మనం దానిని కూడా ఉపాసన చేయాలి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ తనులో నమ్మినవారి మనం ములనుండడి అమ్మా సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చడి అమ్మా దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సం-పదల్ సంగీతం ఉండాలి సాహిత్యం ఉండాలి పటుత్వం ఉండాలి ఓ గాంభీర్యం ఉండాలి జీవితాన్ని జీవించే విధానం ఉండాలి ఇవన్నీ ఉన్నా లక్ష్మీ కటాక్షము ఉండాలి అవన్నీ ఈ శరన్నవరాత్రుల్లో మనం పొందుతాం అందువలన హరికిన్ పట్టపు దేవీ పుణ్యముల ప్రోవు అర్థముల పెన్నిక చెందురుతో బుట్టువు తామరలందుండడి ముద్రాలు భారతీ గిరి సుతల్తో ఆడు పూబోడి భాసురతన్ లేములు బాపు తల్ లిసిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ అని అమ్మవారిని ప్రార్థన చేయాలి. అలాగే కనకధారా స్తవంలో శంకర భగవత్పాదులు బోధించినటువంటి ద్రద్యోద్దయానుపవనోద్రవిణాంబుధారాం అస్మిన్నకించన విహంగ శిశవు విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంభువాహః అని ప్రార్థన చేయాలి. అలాగే స్వామిని ఆనాడు దసరా ఉత్సవాలలో వేలూరి శివరామ శాస్త్రి గారి వంటి మహా పండితులంతా ఏ రకంగా భావన చేశారో వారిని ఈ క్షణంలో మనం తలుచుకోవాలి. ఆ భావ పరంపరలోనే మనం కూడా మన జీవయాత్ర కొనసాగించాలి. స్వామిని గురించి శివరామ శాస్త్రి గారు అంటారు కరుణామూర్తి యటండ్రు కొందరు నినున్ గాలించి లోలో అహం స్పురణామూర్తి యటంచు కొందరు మదింపు జింతురు ఇంకొందరందురు యోగీశ్వరుడంచు ఇందు నిజమేదో అన్నియున్నిక్కమో ఎరుగన్నేరము నీవ చెప్పవలె సాయి నీవ చెప్పవలె సాయి శ్వాస రూపత్రయీ పిలిచిన పలికెడు దైవము కలదాయని సంధియంబు కలిగిన యెడలన్ పిలిచి పరీక్షింపుడు మీ పిలుపు హృదంతరంబ నుండి పెగలగ వలయున్ అంతేకాదు వినయం చూడండి సమర్పణం శరణాగతి వినయాన్ని మించినటువంటి భక్తి మరొకటి లేదని అనుకుంటూ ఆయన అంటారు శతాధిక గ్రంథకర్త అయినటువంటి ఆయన చివరకు నా కవిత్వమది చల్లరే నాలుగు అక్షరాలుగా మివిలే రసంబులన్నిటను మేలి రసంబునకు అలవాలమెయ్యవియవి.సత్య సాయి అనునట్టివి అయ్యవి కూడా రెండయె మివిలడి సాయి సాయి అని మిక్కిలి వర్ణము లెల్ల మిక్కిలి వర్ణము లెల్ల చూర్ణముల్ పరమాద్భుతంగా స్వామిని గురించిన అటువంటి విచారణ మనం అలా చేసుకోవాలి. ఆ రకంగానే స్వామి ఎన్నెన్నో విశేషాలని మనకి చెప్తూ ఈ శరన్నవరాత్రులలో స్వామిని గురించిన అటువంటి దివ్య భావనని దసరా ని గురించి చెప్తూ సత్య ధర్మ శాంతి ప్రేమలలోనే ఈ దసరా ఉన్నదంటూ మానస ఈషణ త్రయంబు ఎడబాయగ జేయగ భాస్కరుండు అన్యవితర్క వాదముల హామి కడంచెడి వేదవేజ్జునన్ మానస యోగివర్యులకు మోహనివారణ ఆత్మతత్త్వూడై సన్నుత ధర్మ శాంతి రమ సత్యసుబోధవనర్చు సాయిరాం సాయిరాం. ఈ క్షణంలో ఇంత మహా పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రశాంతి నిలయంలో స్వామిని గురించి శేషమారాజు గారు అందమైన పద్యం రాశారు అది కూడా మనం ఇవాళ తలుచుకోవాలి. తన యెన్ని జన్మల తపము ఫలించెనో పుణ్యక్షేత్రంబయ్యె పుట్టపర్తి ఈ ఉసర క్షేత్రము ఏనో మునో చనో శ్రీ సత్యసాయి నివాసమయ్యె ఈ కొండ కొమ్ము మున్నేమినో చనో గాని ఆశ్రమ పోషితా ఆరామమయ్యె చిత్రావతి నది చేసయే పుణ్యమో పుణ్యతీర్థంబై పుడమి వెలిసే పర్తి గ్రామము నాటి వ్రేపల్లె అయ్యె పోలె చిత్రావతి నది పుణ్యయమున శాంతి నిలయము ద్వారక సత్యసాయి బాలగోపాల కృష్ణుని లీలతోచే. సర్వానందమయమైనటువంటి దసరా లో దమ శమ రమ అనబడేటువంటి ఆ మూడు దివ్యశక్తులని కూడా మన ఉపాసనా మార్గంలో చక్కగా దీక్షా కంకణ బద్ధులమై ఒక ఆనందంగా సానందంగా మనం జీవిస్తూ మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఈ పండుగ వాతావరణాన్ని ఈ పరమార్థాన్ని ఈ పుణ్యత్వాన్ని పంచిపెడుతూ స్వామి యొక్క దివ్య భావనలకు అనుసరణీయమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతూ అశాంతము కన్నుమూసే వరకు సత్యసాయి రామనామ స్మరణాంచిత దేహులమై ఆంతరంగికమైన దేహిని ఎరుగుతూ పరమ పవిత్రమైనటువంటి శీలము ధర్మము సత్యము శాంతి వీటన్నింటి యొక్క పరమ చరమ స్థాయి అయినటువంటి ప్రేమను సర్వ ప్రపంచానికి మనం పంచగలిగిన స్థాయిలో మన అందరి జీవితాలు చల్లగా సాగుగాక అని స్వామిని ప్రార్థిస్తూ సత్యసాయి భగవానుడు అఖండ చిద్గణ రసమై విశ్వవ్యాపకమై విశ్వచేతనమై శరీర అతీతమైనటువంటి ఒక దివ్య గరిమతో ఈ సమస్త సృష్టిని పద్నాలుగు భువనాలను చల్లగా కాచు గాక బ్రోచు గాక. ఈ దసరా మన లోపల ఉన్నటువంటి అనేకానేక రాక్షస గుణాలపై మనకు జయము సిద్ధించేట్లుగా సాగు గాక మన యందున్నటువంటి అల్పత్వాలు మనలో ఉన్న లోపాలు మనలో ఉన్నటువంటి దానవ భావాలు దీనత్వాలు నశించి మన ప్రస్థానం అంటే మన అధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమైనటువంటి ఆత్మను ఎరిగేటువంటి స్థాయిలో సాగు గాక దానికి కావలసిన సర్వశక్తులను సత్యసాయి పరమేశ్వరుడు మనందరికీ కూడా అనుగ్రహించు గాక అని స్వామిని మనసా వచసా శిరసా ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిః సాయిరాం.
SSSMC · audio
Talk on Dasara
Talk on Dasara
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 23:06
More in this series
Talks
- 24 min 1
Talk on significance of festival of Sankranthi
- 52 min 2
Talk - on Guru Tatwam
- 40 min 3
Talk - Koti Samithi Hyd
- 28 min 4
Talk - Bharata
- 23 min 5
Talk on Dasara
Now playing - 6 min 6
Talk on Rathasaptami
- 32 min 7
Talk on Sri Sathya Sai - Part 05
- 33 min 8
Talk on the character of Draupadi
- 30 min 9
Talk on Gyana Yoga
- 29 min 10
Talk on Hanuman Panchamukham
- 23 min 11
Talk on Leela Kaivalya Vahini
- 35 min 12
Talk on Sathya Sai Sukthamulu
- 24 min 13
Talk on yoga Triveni
- 26 min 14
Talk on the occasion of Avatar Declaration day