No transcript for this section.
రేడియో సాయి శ్రోతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఏమిటి? ఈ సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? దీన్ని మానవుడు తన నాగరికతా ప్రవాహంలో ఎప్పుడు పట్టుకున్నాడు? దానిని ఎట్లా అనుభవిస్తున్నాడు? వీటన్నింటినీ కూడా మనం భూగోళ, ఖగోళ, అంతరిక్ష, అంతరంగ, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి అనేక రీతులలో దీన్ని కాస్త మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే, నిజానికి ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఈ సంక్రాంతి పండుగ డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖున వచ్చేది. ఒక వెయ్యి సంవత్సరాల క్రితం. రావబోయేటువంటి ఐదు వేల సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వస్తుంది. మరి అట్లు డిసెంబరు ముప్పై ఒకటి కాక, ఇటు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కాక, జనవరి పధ్నాలుగవ తారీఖునే ఎందుకని వస్తున్నది? ఈ కాలంలో దీన్ని గనుక వైజ్ఞానికంగా విచారణ చేసినట్లయితే భూమి ఇరవై మూడు పాయింట్ నాలుగు ఐదు డిగ్రీలు అంటే ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది గనుక డిసెంబరు ఇరవై ఒకటి తర్వాత నిజానికి సంక్రాంతి ప్రారంభమవుతుంది. అభివ్యక్తమై అంటే మనందరికీ అర్థమై ఇది మకర సంక్రమణం జరిగింది అని అనుభవంలోకి వచ్చేది మాత్రం ఒక అయనాంశగా పధ్నాలుగవ తారీఖున వస్తుంది. నిజానికి ఈ సంవత్సరం కూడా పధ్నాలుగు జనవరి రెండు వేల పదమూడు నాడు మాత్రమే ఈ సంక్రాంతి ఏర్పడుతుంది. అంటే మకర సంక్రమణం జరుగుతుంది. అయనాంశము అని ఒక మాట అనుకున్నాం. అలాగే ఉత్తరాయణము, దక్షిణాయణము అన్నాం. అయనము అన్నా, అయనము అన్నా ఒకటే. అయనము అంటే ప్రయాణం, అయనము అంటే ప్రయాణం. రామాయణము అంటే రాముడి యొక్క ప్రయాణం. రామాయణము అన్నా తప్పులేదు. రాముడు ఎలా ప్ర-- ఈ ప్రపంచంలో ఎలా సంచారం చేశాడు, ఆయన కథ ఏమిటి, ఆయన జీవన రేఖలు ఏమిటి అదంతా కూడా మహోదాత్తంగా మనకు చెప్పబడింది గనుక దానిని రామాయణము అన్నారు. ఇది నిజానికి దక్షిణాయన, ఉత్తరాయణ అనబడేటువంటి ఈ రెండింట్లలో సూర్యుడి గమనానికి చెందినటువంటి ఒక విషయం. అంటే కాలగమనం అన్నమాట. కాలం యొక్క ప్రయాణమే అయనం కాబట్టి ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. సూర్యుడు ఈ మకర సంక్రమణం సమయంలో ఎక్కడికి వెళతాడు అని మనకి జాతక చక్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు గళ్ళు ఉన్నాయి. అంటే పన్నెండు ఇళ్ళు ఉన్నాయన్నమాట. ఈ పన్నెండు ఇళ్ళలో గ్రహాలన్నీ కూర్చుని ఉన్నాయి. ప్రధానంగా ఈ సమయంలో సూర్యుడు శని ఇంట ప్రవేశిస్తాడు. కనుక ఇది కాల అయనంలో, కాల ప్రయాణంలో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళుతున్నటువంటి వేళ ఇది. అంటే నెమ్మది నెమ్మదిగా చలిగాలులు తగ్గుతూ తగ్గుతూ ఆ శీతల స్పర్శలో నుంచి ఒక వేడిమి, పోడిమి, తాళిమి కలిగించేటువంటి ఒక ఉదాత్త స్థితిలోకి మళ్ళీ జీవుడు వెళ్ళాలి గనుక ఈ సూర్యగమనము సూర్యాంశ-- సూర్యాంశగా ఏదైతే ఉన్నదో ఈ అయనాంశంలో నుంచి ఈ ప్రపంచానికి చైతన్యం కావాలి. చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యగోళం నుంచి వస్తుంది. ఈ సూర్యగోళం ఈక్వేటర్ నుంచి అంటే మనం భూమధ్యరేఖ నుంచి అంటామే, దాని నుంచి సాగుతూ సాగుతూ ఉత్తర అయనంగా వెళుతున్నటువంటి కాలం గనుక మళ్ళీ ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుపచ్చదనమంతా హరితత్వాన్ని పొందాలి, హరితను పొందాలి. రెండర్థాలున్నాయి. హరితత్వము అంటే భగవత్తత్వం అని ఒక అర్థం. హరితము అంటే ఆకుపచ్చ అని రెండో అర్థం. ఈ హరి అంటే పరిపూర్ణమైనటువంటి అని మరొక అర్థం. ఏది సంహారం చేయబోతున్నదో అది హరి గనుక ఈ హరిత్వాన్ని, హరత్వాన్ని, హరిహరత్వాన్ని, అద్వైతత్వాన్ని, పూర్ణత్వాన్ని అనుభవించేటువంటి దిశగా ఇదంతా కూడా సాగుతూ ఉంటుంది. నిజానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి మాట ఎప్పుడు పుట్టిందని విచారణ చేస్తే త్రేతాయుగంలో పుట్టింది. త్రేతాయుగంలో ఈ ఉత్తరాయణాన్ని గమనించినవారు, స్పర్శించినవారు, అనుభవించినవారు, ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేసినటువంటి వారు ఎవరు అంటే దివిజ గంగని నేలమీద మూడు పాయలుగా ప్రవహింపజేసినటువంటి భగీరథుల వారు. గంగని ఈ నేలమీదికి తేవటానికి సగర వంశీకులైనటువంటి అరవై వేల మంది దేహార్పణం చేశారు, ఆత్మార్పణం చేశారు. వారు నిజానికి పెద్దలు. ఆ పెద్దలంతా ఈ మహత్తర త్యాగ భూమికను ఎందుకు ఎంచుకున్నారు అంటే నేల తడవాలి, భూమాత తడవాలి, దానిలో నిక్షిప్తమై ఉన్నటువంటి అనేకమైనటువంటి ఔషధీ విషయాలన్నీ కూడా వృక్ష రూపంలో ప్రపంచంలోకి రావాలి. మానవుడు సంపూర్ణమైన ఆయుర్వేద సంహితమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో ఆరోగ్యవంతంగా జీవించాలి అంటే ప్రకృతి మించి మరొకటి లేదు గనుక ఆ ప్రకృతికి ఒక శక్తిని ఇవ్వటానికి నీరు ఆధారమై ఉన్నది గనుక ఆ నీటిని తేవటానికి భగీరథుడి కంటే ముందు సగరులంతా కూడా ఈ అరవై వేల మంది మహా తపస్సు చేసి శరీరాలను శుష్కింపజేసుకుని శల్య అవశిష్టులై తమ జీవితాలను త్యాగం చేశారు. అయితే భగీరథుల వారు ఎప్పుడైతే పావన గంగని ఈ ప్రపంచంలోకి తీసుకుని వచ్చారో ఆ సమయంలో ఆయన చేసిన మొట్టమొదటి పని సాగరులందరికీ అంటే సగర వంశీయులైన తమ పెద్దలందరికీ కూడా గంగాజలంతో తర్పణ చేశారు గనుక ఈ సంక్రాంతి పెద్దల పండుగ.ఆ పెద్దలు ఎవరంటే మన తనువుకి మన మనసుకి మన స్థితికి మన సంస్కారానికి మన జీవన గమ్యానికి జీవన లక్ష్యానికి లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి భావాలకి మూలమైనటువంటి మన పెద్దలు అన్నమాట అంటే మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు వీరందరికీ కూడా తర్పణ విడవవలసినటువంటి పుణ్యకాలం కనుక ఇది ఉత్తర అయన పుణ్యకాలం అయింది అదే ఉత్తరాయణ పుణ్యకాలం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనగానే మనకి భీష్ముల వారు గుర్తొస్తారు ఇటు భారతంలో అటు భాగవతంలో ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆయన ఎదురు చూశారు అని నిజానికి భీష్ముల వారు శ్రీకృష్ణ పరమాత్మ ఏ నక్షత్రంలో జన్మ ఎత్తారో ఆ రోజున అష్టమి తిథిలో శరీరాన్ని వదిలిపెట్టాలని ఆయన మానసికంగా అనుకున్నారు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏకాదశి వచ్చే దాకా ఆయనకి తెలియకుండానే ఒక extension అంటామే పొడిగింపు ఇచ్చారు కనుక భీష్ముల వారు ఇచ్ఛామరణాన్ని కోరుకున్నప్పటికీ కూడా ఆ ఆ ఇచ్ఛ ఎవరిది అంటే పరమేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఇచ్ఛ ప్రకారమే ఏకాదశి నాడు మహా పరినిర్వాణం జరిగింది కనుక భీష్మ ఏకాదశి గా దానికి ఒక సుస్థిరమైన సంస్థితమైన ప్రామాణికమైన పౌరాణికమైన వాంగ్మయమైన అతి పవిత్రమైనటువంటి ఒక తిథిగా శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడికి అనుగ్రహించారు ఎందుకని అనుగ్రహించారు భీష్ముడికి అంటే త్యాగం వలననే న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైక అమృతత్వమానశుహు మన దగ్గర అపారమైన ధనరాసులు ఉండవచ్చు గాక అమృతత్వాన్ని పొందలేం అలాగే అపారమైనటువంటి అనంతమైనటువంటి బంధుకోటి ఉండవచ్చు గాక కానీ ఏ రకంగానూ వారు మనల్ని త్యాగభూమి కలోకి వాళ్ళు నడిపించలేరు న ప్రజయా ప్రపంచంలో యశస్సు ఉండవచ్చు గాక మాలిన్యమేరగని కీర్తి ఉండవచ్చు గాక అంటే ఈవేళ భాషలో popularity ఉండవచ్చు గాక కానీ నీవు గనక త్యాగం చేయకపోయినట్లయితే నీకు అమృత సిద్ధి లభించదు అమృతత్వం అంటే మరణమే లేని మార్పెరగని మూలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సహజమైనటువంటి నీ స్థితి నీకు కలగదు కనుక న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైక అమృతత్వమానశుహు కనుకనే భీష్ముల వారికి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా ఆ ఈ అనుగ్రహాన్ని ఇచ్చారు అలాగే భౌతికంగా స్థూలంగా విచారణ చేసినప్పుడు ఈ సంక్రాంతి అంతా కూడా సూర్యోపాసన గా మనం చెప్పుకోవాలి సూర్యుడి యొక్క కిరణాలు చుర్రుమనిపించే అటువంటి కాలమే మకర సంక్రమణ వేళ అప్పటిదాకా ఇవన్నీ కాస్త నెమ్మది నెమ్మదిగా ఉంటాయి సూర్యుడు వస్తున్నాడు అనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది చలి తగ్గుతుంది దానిలో నుంచి శరీరంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులు ఒక్కసారి ఉద్దీపనం చెందటానికి ఆయత్తము సన్నాహము చేసుకునేటువంటి పుణ్యకాలం కాబట్టి అది ఉత్తరాయణ పుణ్యకాలం అయింది ఆధునికమైన వైద్యశాస్త్రం ప్రకారం కేవలం డెబ్బై రెండు వేల నాడులు మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నప్పటికీ ఈ నాడులు కూడా ఉద్దీపనం చెందాలి అంటే ఇదిగో ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మకర సంక్రమణ వేళ నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇది ప్రారంభం అవుతుంది గనుక ఇది సూర్యోపాసనకి అనువైనటువంటి కాలం అనుగుణమైనటువంటి కాలం సూర్యుడికి దండం పెట్టుకోవలసినటువంటి కాలం సూర్యుడే లేకపోతే ఈ ప్రపంచానికి ప్రకృతికి చైతన్య భూమిక లేదు చైతన్యం గనక లేకపోయినట్లయితే అప్పటిదాకా నడిచినటువంటి సమస్త జీవరాశి కూడా స్తంభీభూతమై జడత్వాన్ని పొందుతాయి నిశ్చలమైపోతాయి ఇది కదలాలి కదులుతూ ఉండాలి ప్రవాహంగా ఉండాలి నదీనాం సాగరో గతిహి అని నదులన్నీ కూడా సముద్రంలోకి ఎట్లాగైతే వెళుతున్నాయో అనంతకోటి జీవకోటి కూడా మళ్ళీ పరమేశ్వరుడు అనేటువంటి మహానంద సముద్రంలోకి వడివడిగా పల్లం వైపు వెళ్ళాలి గనుక దానికి అనువైనటువంటి కాలం ఏది అంటే మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలమే అది మళ్ళీ మకర సంక్రమణ వేళే అదే సంక్రాంతిగా భావన చేయాలి అంతేకాదు సూర్యుడి యొక్క ఉపాసనతో పాటుగా ఇది సరస్వతీ దేవిని ఉపాసించుకునేటువంటి ఒక ఆ మహత్తరమైన అటువంటి సన్నివేశం సరస్వతీ దేవిని ఉపాసన గనక చేయకపోయినట్లయితే నాగరికత ప్రబుద్ధమానం కాదు నాగరికత అంటే పరిణామం ఇవ్వాళ మానవుడికి కావలసింది కేవలము వైదాంతిక పరమైన ముక్తి మాత్రమే కాదు పరిణామం జరగాలి నిన్నటి కంటే నేడు నేటి కంటే రేపు నేను ఉదాత్తంగా గనక జీవించగలిగితే నా జీవన రేఖ విస్తృతమవుతుంది విశాలమవుతుంది ఈ ప్రపంచానికి ఆదర్శం ఆదర్శవంతమైనటువంటి మార్గోపదేశనం చేస్తుంది కనుక జీవుడు అన్నివేళలా తన యందున్నటువంటి సంస్కారాన్ని సంస్కృతిని అనేకమైనటువంటి పరిణామాలని విద్య ద్వారా చదువు ద్వారా మహాత్ముల యొక్క మాటల ద్వారా అనేక ప్రవచనాల ద్వారా విశ్లేషణ ద్వారా విచక్షణ ద్వారా విజ్ఞానం ద్వారా దీనిని పొందవలసి ఉన్నది గనుక ఇది సూర్యోపాసనతో పాటుగా సరస్వతీ దేవి యొక్క ఉపాసన చేసుకునేటటువంటి ఒక శుభలగ్నంగా మనం భావన చేయాలి ఈ రెండింటితో పాటుగా ఇందాక అనుకున్నట్లుగా ఏ భగీరథుల వారు పెద్దల పండగగా దీన్ని తీర్చిదిద్దారో పెద్దలకు తర్పణ ఇచ్చారో అట్లాగే మనం కూడా మన ముందు తరాలు అంటే మన వెనకటి తరాలన్నీ కూడా మనల్ని ఇంతవరకు తీసుకువచ్చిన వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారికి స్మృత్యంజలి ఘటించేటువంటి ఒక మహత్పూర్ణమైనటువంటి భాగ్య రేఖగా దీన్ని మనం గనక భావన చేసినట్లయితే ఇది సూర్యుడి పండగ ఇది సరస్వతి పండగ ఇది పెద్దల పండగ కలిపితే మన పండగ అంతేకాదు ఇవాళఈ చలికాలం ఈ హేమంత ఋతువు అంతా కూడా నెమ్మది నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయి వేసంకాలం తొలి నాళులు ప్రవేశి-- ప్రవేశిస్తున్నటువంటి వేళ శరీరానికి animated heat అంటాం. అంటే దీనిని జాగృతం చేయగలిగిన ఉత్తేజపరచగలిగినటువంటి సర్వ నాడులని కూడా సమస్థితిలో ఉంచగలిగినటువంటి సస్యం పంటలు కావాలి. ఈ పంటలలో పొట్ట నింపేటువంటి అంటే దొక్క నింపేటువంటివి వరి, గోధుమ ఇటువంటివన్నీ ఒక ఎత్తయితే నువ్వులు ఏవైతే ఉన్నాయో దానిని గనక అప్పుడే తయారైనటువంటి చెరకు రసం లో నుంచి వచ్చిన బెల్లంతో కలిపి గనక తిన్నట్లయితే, ఇవ్వేళ మనం చెప్పుకోవాలి ప్రతి మనిషికి ఐరన్ కావాలి అంటాం. కొద్దిగా బెల్లం ఆ నువ్వులు చిన్న ఉండ చేసుకొని రోజుకు గనక ఒక ఐదు గ్రాములు తింటే శరీరానికి కావలసిన ఐరన్ ఏర్పడుతుంది. ఆ ఐరన్ వలన ఉమ్ నాడీమండల వ్యవస్థ అంతా కూడా చాలా చక్కగా శుభ్రంగా శుభంగా హాయిగా ఉంటుంది గనుక ఈ నువ్వులు పండేటువంటి ఒక గొప్ప కాలమిది. అలాగే చెరుకు తోటలంత- అంతా కూడా రసమాలయంగా ఉండేటువంటి దివ్యమైనటువంటి క్షణం ఇది. ఈ ప్రకృతి ఈ పుడమి అంతా కూడా ఒక్కసారి తనలో దాగి ఉన్నటువంటి పరమాద్భుతమైన విశేషాలన్నింటినీ ఒక వ్యావసాయికంగా, ఒక సస్యంగా, ఒక పంటగా అనేకమైనటువంటి జాతులతో అనుసంధానమై ఆవిష్కరించుకునేటువంటి దిశగా మానవుడు వీటిని అందుకునేటువంటి రోజు గనుక ఇది పెద్దల పండగ పెద్ద పండగ అయింది. పెద్దల పండగ నుంచి పెద్ద పండగకు వచ్చాం. ఈ పెద్ద పండగ మాత్రమే కాదు ఈ పెద్ద పండగలో మరొకటున్నది శక్తి ఉన్నది. ఎనర్జీ, ఇచ్ఛ, క్రియ, జ్ఞాన అనబడేటువంటి మూడు శక్తులు ఇదిగో ఈ సంక్రాంతి సంరంభంలో మనకు కనిపిస్తుంది. ఇందాక అనుకున్నట్లుగా భూమాత మనకు అనుగ్రహించే పంటలన్నీ ఒక ఎత్తు హరిదాసులంతా వచ్చి మన వాకిట తందనాలాడుతూ సంకీర్తనం చేస్తూ పరమేశ్వరుడి యొక్క హరిస-- హరినామ సంకీర్తనం చేయటం ఒక ఎత్తయితే ప్రాపంచికమైనటువంటి భావ కాలుష్యాన్ని దూరం చేస్తూ భగవన్నామస్మరణతో ఓ జీవుడా మేలుకో నీ వాకిటకి నేను వచ్చాను నేను నీకు దాసుడను గాను హరికి దాసుడనంటూ హరినామ సంకీర్తనం చేసేటువంటి ఒక కళా స్వరూపాన్ని మనం ఆవిష్కరించుకునేటువంటి పుణ్యకాలం సంక్రాంతి. అంతే కాదు దీనిలో నిజానికి మూడు ప్రధానమైనటువంటి విషయాలు భోగి, సంక్రాంతి, కనుమ. ఈ మూడు ఒక త్రిపుటి వేదాంత భాషలో దీన్ని త్రిపుటి అంటాం. మూడు రోజుల పండగ పెద్ద పండగ ఇది. భోగి నాడు ఏం జరుగుతుంది? పరిణామం జరగాలి. భోగి మంటలలో దేనిని మనం కాలుస్తున్నాము దేనిని దహనం చేస్తున్నాము అంటే పాత భావాలని, పాత ఆలోచనలని, అక్కరకురాని, పనికిరాని మనల్ని నడిపించలేని దుర్బలమైనటువంటి వాటన్నింటినీ కూడా దహనం చేస్తున్నాం గనుక ఏవి అక్కర్లేదో అవి దహనమైపోతే ఏం కావాలో రావటానికి లోపల కొంత space కొంత స్థితి ఏర్పడుతుంది గనుక భోగి నాడు జరిగేటువంటి దహనం అంతా కూడా పాత ఆలోచనల యొక్క దహనమే. అట్లాగే వినూత్నమైనటువంటి నవనవోన్మేషమైనటువంటి ఈ కాలానికి, ఈ క్షణానికి, ఈ వర్తమానానికి అక్కరకు వచ్చేటువంటి మాటలన్నీ దాని యందు ఉంటాయి గనుక దానికి ఆహ్వానం పలుకుతూ దీనికి స్వాగతం పలుకుతూ అలాగే దానికి వీడ్కోలు పలికేటువంటి భోగి పండగ నిజానికి అది భోగం. భోగం నుంచి పరమేశ్వరా నన్ను యోగంలోకి నడిపించు అని పరిదీనంగా అగ్ని స్వరూపమైనటువంటి పరమాత్మని చేతులు జోడించి మనం ప్రార్థించేటువంటి ఒక మహత్తరమైనటువంటి సన్నివేశమే భోగి పండగ. అలాగే ఈ భోగి భగిని అంటే సోదరి ఎవరికైతే అక్కలు చెల్లెళ్ళు ఉంటారో లేదు ఒకవేళ లేకపోయినా ఈ సర్వ ప్రకృతిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరినీ మాతృమూర్తులుగా సోదరీమణులుగా ఎవరైతే భావన చేస్తారో వారి యందు ఒక ప్రేమ ప్రకటించటానికి అనువైనటువంటి రోజే ఈ భోగి పండగ. భోగి అంటే భోగాన్ని అనుభవించమని కాదు యోగాన్ని భోగంగా మార్చుకోమని చెప్పేదే భోగి పండగ. గనుక ఈ పరిణామం జరుగుతూ ఉండాలి, లోపల దహనం జరుగుతూ ఉండాలి, జ్ఞానాగ్నిలో మన కర్మలన్నీ దగ్ధమై పోతూ ఉండాలి. అలాగే పనికిరాని వస్తువులన్నీ ఎప్పుడైతే విభూతి స్థాయికి వెళతాయో ఎట్లాగైతే వెళుతున్నాయో అట్లాగే జీవుడు కూడా అనుభవాన్ని పొంది అనుభూతిని పొంది విభూతి స్థాయికి వెళ్ళటానికి మొట్టమొదటి తొలిమెట్టు, తొలిరోజు, తొలిక్షణము మంగళప్రదమైనటువంటి సన్నివేశమే భోగిగా మన పూర్వీకులంతా కూడా భావన చేస్తూ వచ్చారు. అలాగే సంక్రాంతి పెద్ద పండగగా ఎందుకని అంటే ఆ సమయానికి కొత్తగా పెళ్ళిలు చేసుకున్నటువంటి ఇటు కొడుకులు అటు కోడళ్ళు అందరూ కూడా కలిసి ఒక సహజీవన సౌందర్యాన్ని సమన్వయమైనటువంటి స్థాయిలో ఉదాత్తమైనటువంటి భూమికలో సంచారం చేసి నలుగురూ కలిసి ఆనందాన్ని మాత్రమే పంచుకునేటువంటి రోజు గనుక అది పెద్ద పండగగా మనం భావన చేయాలి. ఇక మూడవది కనుమ పండగ. ఈ కనుమ పండగలో భారతీయ తత్వ సిద్ధాంతం కానివ్వండి, భారతీయమైనటువంటి ఒక ఆలోచన కానివ్వండి, దీ-- ఈ సంస్కృతిలో దాగి ఉన్న ఇమిడి ఉన్నటువంటి భావన కానివ్వండి చెట్టులో, గుట్టలో, పుట్టలో, మిట్టలో, పిట్టలో, పశువులో, పసరంలో అన్నింటా పరమాత్మను చూడగలిగినటువంటి ఒకే ఒక్క జాతి, ఒకే ఒక్క దేశం అది భారతదేశం. కనుకనే పెద్దల పండగ అయింది, స్వీయమైన భోగి అయింది మరి ఆ పశువులోఆ పరమేశ్వరుని చూడగలిగినటువంటి ఒక దార్శనికత కావాలి. కనుక ఈ పశువులన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే తప్ప అన్యం కాదని, పైగా ఈ పంటలన్నీ చేతికి రావటానికి మనకు ఉపకరించినటువంటి ఈ పశు సంపదంతా కూడా పరమేశ్వర విభూతిగా భావన చేయటమే. కనుకనే ఆ రోజున కొమ్ములకి పసుపు రాసి, కుంకుమ రాసి, అలంకరించి దాని మీద కొత్త బట్టలు వేసి వాటినంతా కూడా శుభ్రం చేసి వాటిని నమస్కరించి వాటికి కావలసినవన్నీ ఏర్పాటు చేసేటువంటిది గనుక ఈ సంక్రాంతి పండుగ "సంయక్ క్రాంతి సంక్రాంతి". "సంయక్ క్రాంతి" క్రాంతి అంటే రెండు అర్థాలున్నాయి. మామూలు భౌతిక స్థాయిలో దానికి అర్థం విప్లవం అని అర్థం. వైదాంతిక భాషలో సరళమైనటువంటి భావనా భూమికలో దాని అర్థం క్రాంతి అంటే మార్పు అని అర్థం. ఆ మార్పు సూర్య గమనంతో ప్రారంభమై జీవుడి గమనంలో ప్రవేశించి జీవుడి యొక్క ఆదర్శాలు, ఆలోచనలు, ఆశయాలు, అపురూపమైనటువంటి భావాలు అన్నీ కూడా ఒక జడత్వం నుంచి చైతన్యంలోకి ప్రస్థానం చేసేటువంటివే కనుక ఇవన్నీ కూడా సంక్రాంతి ఒక భోగ విశేషంగా మాత్రమే కాక యోగ విశేషంగా సంభావన చేయాలి. ఉదాహరణకి చూడండి మనందరి ఇళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇవాళ ముగ్గులు వేయటానికి కెమికల్స్ వాడుతున్నాం. ఒకప్పుడు కేవలం బియ్యప్పిండి మాత్రమే వాడేవారు. ఎందుకని అంటే భూత తృప్తి కలగాలి గనుక. వాటిని అందుకోవటానికి ఆ కొత్త బియాన్ని ఆడించినప్పుడు ఆ దానిలో ఉన్నటువంటి ఆ నూతనమైనటువంటి పరిమళాన్ని అనుభవించటం కోసం ఆ జీవులన్నీ కూడా అక్కడికొచ్చి మనం వేసిన ముగ్గంతా ఆ పగలు నుంచి మళ్ళీ రాత్రి అయ్యేదాకా వాటిని ఆరగించి, విందారగించి మన వాకిట్లోకి వచ్చినటువంటి అతిథి జీవులుగా ఈ భారతీయమైనటువంటి ఒక భావన సంభావన చేసింది. అలాగే గంగిరెద్దులు మనకు దగ్గరకు వచ్చి పశువే మనకు నమస్కరిస్తుంటే, పశువే మనం చెప్పినట్లు ఆడుతుంటే మనం ఏం నేర్చుకోవాలి? మనం పరమేశ్వరుడికి నమస్కరించాలని, మనం కేవలము పరమేశ్వరుడు అనేటువంటి తోలుబొమ్మలు ఆడించే వాడి చేతిలో మనం తోలుబొమ్మలమేనని ఆ భావన, ఆ వైదాంతిక, వైరాగ్య, వివేక, విచక్షణా భూమికలో గనుక ఉండగలిగితే, ఉంచేటువంటి స్థితే సంక్రాంతి గనుక ఇది సంయక్ క్రాంతిగా భావన చేయాలి. అనేక సంక్రాంతులు వస్తుంటాయి, వెళుతుంటాయి. స్వామి చెప్పినట్లుగా ఈ ప్రకృతి ఎవరికోసమూ ఆగదు. కాలము ఈ ప్రవాహాన్ని ఎక్కడా తగ్గించుకోదు, మళ్ళించుకోదు. ఏది ఎప్పుడు ఎట్లా జరగవలసి ఉన్నదో అదంతా కూడా ఏతద్ అధిష్టాత అయినటువంటి పరమాత్మ యొక్క ఇష్టాన్ని బట్టి, ఇచ్ఛను బట్టి, ప్రణాళికను బట్టి దానికి కావలసిన రీతిలోనే సాగుతుంది గనుక జీవుడు ఈ మూడు రోజుల పండగని కూడా భోగంగా, యోగంగా, ఆనందంగా, పరమానందంగా స్వామి చెప్పినటువంటి పంచుకోవటం షేర్ అండ్ కేర్ అని వాడుతున్నామే పంచుకోవాలి అంటే పెంచుకుంటే, పంచుకుంటే పెంచుకోగలం. పెంచుకోగలిగితే మాత్రమే పంచుకోగలం గనుక ఈ షేర్ కేర్ అనేటువంటి ఈ దివ్యమైనటువంటి విధానాన్ని మనం మన పొలాలలో పండినటువంటి వాటన్నింటినీ కూడా మన కోసం మనతో కూడి పనిచేసిన వారందరికీ ఎట్లాగైతే మనం పంచిపెడుతూ ఉన్నామో అలాగే సత్య సాయి భగవానుడు ఈ ప్రపంచానికి అందించిన నిజమైనటువంటి సమ్యక్ క్రాంతి, నిజమైనటువంటి మార్పు, ఒక సమగ్రమైనటువంటి ఆధ్యాత్మిక భావనా భూమిక ఏది అంటే ప్రేమతో కూడిన సేవ, సేవతో కూడిన ప్రేమ. ప్రేమే మనకు భోగం, సేవే మనకు యోగం. కనుక ఇది సేవా యోగం అది భోగం అవుతున్నది. ఈ ప్రేమతో కూడినటువంటి సేవలో ఒక పరిణామం ఉన్నది, ఒక క్రాంతి ఉన్నది, ఒక ఉద్దీపన ఉన్నది, ఒక జ్వజ్వల్యమానమైన, ఆంతరంగికమైన కాంతి రేఖ ఉన్నది, ఒక విశాలమైన దృక్పథం ఉన్నది. సర్వమత, సర్వ సహజీవన సౌందర్య రాశి ఉన్నది గనుక సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి సంక్రాంతికి ఒక వినూత్నమైనటువంటి నిర్వచనాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చి మానవుడి మనస్సునే సంక్రాంతం చేసుకోమన్నారు. ఒక పంట భూమిగా చేసుకోమన్నారు. మరుభూమిగా గాక ఒక భాషా భూమికగా, భావనా భూమికగా, యోగ భూమికగా, ఆధ్యాత్మిక భూమికగా, అద్వైత భూమికగా, ప్రేమ భూమికగా, సేవా భూమికగా దీన్ని గనుక మనం మార్చుకోగలిగినట్లయితే అది మాత్రమే ఈ దివ్యమైనటువంటి విశేషం గనుక ఈ కనుమ, ఈ సంక్రాంతి, ఈ భోగి. కనుమను గురించి మనం మరొక్కసారి అనుకోవలసి ఉన్నది పశువులో కూడా పరమాత్మను చూడగలిగినటువంటి ఒక స్థితి ఈ పండుగ మనకు కల్పిస్తుంది గనుక ఇది పెద్ద పండగ, పెద్దల పండగ, అసలు పండగ, అచ్చమైన పండగ. ఆసేతు సీతాచలము. జాతి మతాలకి అతీతంగా జరుపుకునేటువంటి ఏకైకమైనటువంటి ఈ పండక్కి మనం స్వాగతం పలుకుతూ కాలగమనంలో మనం పరమేశ్వరుడి వైపు వడివడిగా అడుగులు వేస్తూ సమాజ సేవలో స్వామి నిర్దేశించినటువంటి ఒక మంచి మార్గంలో మనం నడుస్తూ ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేసేటువంటి దిశగా జన్మ ఎత్తినందుకు దానిని సంక్రాంతం చేసుకుందాం. దేహాన్ని పొందినందుకు సంక్రాంతం చేసుకుందాం. పరమేశ్వరుడైన స్వామితో కూడి జీవించినందుకు ఈ జీవితాన్ని జీవన్ముక్తం చేసుకుందాం, పరిపూర్ణం చేసుకుందాం. ఆనంద తారక స్థితిలోకి, రసార్ద్ర భూమికలోకి చల్లగా సత్య సాయి భగవానుడు మనల్ని నడిపించు గాక. సాయిరాం. కనుమ అంటే చెప్పాను నేను
SSSMC · audio
Talk on significance of festival of Sankranthi
Talk on significance of festival of Sankranthi
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 24:08
More in this series
Talks
- 24 min 1
Talk on significance of festival of Sankranthi
Now playing - 52 min 2
Talk - on Guru Tatwam
- 40 min 3
Talk - Koti Samithi Hyd
- 28 min 4
Talk - Bharata
- 23 min 5
Talk on Dasara
- 6 min 6
Talk on Rathasaptami
- 32 min 7
Talk on Sri Sathya Sai - Part 05
- 33 min 8
Talk on the character of Draupadi
- 30 min 9
Talk on Gyana Yoga
- 29 min 10
Talk on Hanuman Panchamukham
- 23 min 11
Talk on Leela Kaivalya Vahini
- 35 min 12
Talk on Sathya Sai Sukthamulu
- 24 min 13
Talk on yoga Triveni
- 26 min 14
Talk on the occasion of Avatar Declaration day