No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పరతాన్మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కర్మ భక్తి యోగ అనబడేటువంటి ఈ మూడు యోగాలని విచారణ చేశాం అయితే విచారణ కాక ఆచరణ భావనలో దీనిని మనం ఎట్లా సాధించుకోవాలి? ఈ సాధించుకోవాలి అంటే గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, సర్వోపనిషత్తులు చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేసినాయి. అయితే అవన్నీ కూడా మన ఊహకి, మన మనసుకి, మన సంస్కారానికి, మన సాధనా తీవ్రతకి, మన ప్రాప్తికి లోబడి అర్థమయ్యేవి గాని సమకాలీనమైనటువంటి ఒక పరమాత్మ ఆచార్యవర్యుడై ఈ జగత్తులోకి వచ్చినప్పుడు ఇవే యోగాలని తాను ఎలా ఆచరించి చూపించారో మనం కొద్దిగా విచారణ చేద్దాం. చేసినట్లయితే ఓహో పరమాత్మ ఇలా ఈ మూడు యోగాలని ప్రపంచానికి సాధనా పూర్వకంగా పరిచయం చేశారు కనుక ఇది ప్రామాణికం. అంటే శాస్త్రం కంటే మిగతా అనేకమైనటువంటి విషయాల కంటే పరమాత్మ స్వయంగా ఆచార్యుడై బోధించింది సర్వకాలికమైనది, విశ్వజనీనమైనది, సర్వ ప్రామాణికమైనది గనుక భగవాన్ సత్యసాయి ఈ మూడు యోగాలని మనకి ఎలా ఆచరించి చూపించారో కొద్దిగా విచారణ చేద్దాం. ముందుగా కర్మ యోగం. కర్మ అంటే పని చేయటం. పని చేయటం అంటే మానవుడు తన సహజ ప్రవృత్తితో, తనకున్నటువంటి బలంతో, అది దైహిక, మానసిక, ఆధ్యాత్మిక మూడు బలాలతో కొంత ప్రయోజనాన్ని, కొంత స్వార్ధాన్ని, కొంత లాభాన్ని, కొంత అనుభవాన్ని పొందే దిశగా చేసే అన్ని పనులు కర్మలే. అంటే ఇక్కడ మానవుడు తన మేధాశక్తిని ఉపయోగించి తాను చేయవలసినటువంటి కర్మలను అంటే పనులని సర్వహితంగా అందులో తనకు కూడా లాభం కలిగేలాగా చేసినట్లయితే అవి కర్మలని, పరమేశ్వరుడి యొక్క శక్తిని కూడా జోడించి, నిజానికి పరమేశ్వరుడి శక్తే తనలో ప్రవహిస్తున్నది అని గనుక అనుకొని చేసినట్లయితే ఈ కర్మలన్నీ కూడా కర్మ యోగాలు అవుతాయి అని విచారణ. ముందుగా భగవాన్ మనం సమకాలీన ప్రపంచానికి కర్మ యోగాన్ని ఎలా అనుష్ఠాన పూర్వకంగా బోధించారో విచారణ చేద్దాం. ఎనభై నాలుగు సంవత్సరాలు అయింది భగవాన్ ఈ శరీరం తీసుకొని ఇక్కడికి వచ్చి. అందులో మొదటి పధ్నాలుగు కూడా చాలా గంభీరమైనవి. ఒక బీజ ప్రాయంగా అంటే ఒక విత్తన రూపంగా ఉండి మహా దివ్య శక్తి ఏదైతే ఒక వటవృక్షంగా ఒక విస్తృతమైనటువంటి ఒక మర్రిచెట్టుగా నీడలు సాచి, ఊడలు పరచి ఈ ప్రపంచానికి ఒక బోధి వృక్షం అయిపోయిందో దానికి మూలాలు ఆ పధ్నాలుగు ఏళ్లు అన్నమాట. ఏం చేశారు స్వామి? తాను ఏమి బోధించదలచుకున్నారో దానిని తొలి పధ్నాలుగు ఏళ్లలో అంటే అవతార ప్రకటన పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైకి ముందే సూచించేశారు. ఎట్లా సూచించారు? "అహం సత్య బోధకః" అన్నారు. నేను సత్యం బోధించటానికి వచ్చాను అన్నారు. సత్యం ఎవరు బోధించగలరయ్యా అంటే ఎవరు సత్యమై ఉన్నారో, ఏ సత్యం ఒక సాకారమై మానవ దేహాన్ని తీసుకుని వచ్చిందో అది మాత్రమే సత్యాన్ని అనుభూతి పరంగా బోధించగలదు. ఈ సత్యం కర్మాచరణ చేయాలి. సత్యం అంటే ఏది మారదో, ఏది కాలాజ్యవచ్ఛిన్నమైనదో, ఏది అన్ని కాలాలకు ఉపయోగపడుతుందో, జరిగిన కాలానికి, రాబోయే కాలానికి మహా వారధిగా రూపాంతరీకరణం చేస్తుందో అది బోధ. ఆ సత్యాన్ని స్వామి కర్మయోగంగా మార్చటం మన కళ్ల ముందు సుమారుగా నలభై సంవత్సరాల మన అనుభవంలో విచారణలో తేలేది ఏమిటంటే ఒక్కసారి స్వామి అవతారం తాల్చి పుటపర్తిలో వెలసిన నాటి నుంచి లేదా ప్రభవించిన నాటి నుంచి ఈ అనుకుంటున్న విచారణ చేస్తున్న ఈ క్షణం వరకు భౌతికమైనటువంటి పరిణామం చాలా పరమాద్భుతం. ఆ భౌతిక పరిణామం ఎట్లా ఉన్నదంటే సర్వ విశ్వము ఎట్లాగైతే ఒక మార్పు చెందాలని స్వామి సంకల్పించారో ఆ సంకల్పానికి ప్రతిరూపంగా ఇవాళ పుటపర్తి మన కళ్లకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఏం చేశారు? మీరు గ్రామ సేవ చేయండి అని స్వామి చాలా ఏళ్ల తర్వాత చెప్పుండొచ్చు. కానీ భగవాన్ సత్యసాయి ఒక విశిష్టమైనటువంటి రీతిలో తాను ప్రభవించినటువంటి తన గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా ఎన్నుకున్నారు స్వామి. ఎన్నుకొని నేను ఇదిగో ఈ పుటపర్తి యొక్క రూపురేఖలని, దాని యొక్క పవిత్రతని, నైసర్గికమైనటువంటి స్థితిని దాటి సర్వ ప్రపంచానికి అనుసంధానం నేను ఇలా చేయగలిగాను ఇదిగో చూడండి. అంటే ఎనభై నాలుగేళ్ల నాటి పుటపర్తి, ఎనభై నాలుగేళ్ల తర్వాత ఈ రోజున మనం చూస్తున్న పుటపర్తి ఎలా సాధించారు అంటే స్వామి కర్మల అన్నింటినీ, అన్ని పనులనీ కూడా కర్మ యోగంగా మార్చారు. అంటే స్వామి చేశారా స్వయంగా? చేశారు. చేస్తూ చేస్తూ అందరినీ దాంట్లో ఒక పాలు పంచుకునే విధంగా ఒక కర్మబద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి అర్ధ కామ మోక్షాలని సమన్వయం చేస్తూ చతుర్విధ పురుషార్ధాల నాలుగింటినీ కూడా తాను చేస్తున్న ప్రతి పనికి అనుసంధానం చేశారు. అలాగేభారతీయ ఆత్మలో భారతీయ జీవనాడిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పండుగలు. ఆ పండుగలన్నీ దేనికి అంటే ఒక వ్యక్తి అనుభవించటం కోసం కాదు. పండగ ద్వారా ఆ రోజున కొన్ని వేల మందితో ఆనందాన్ని ఎట్లా అనుభవించవచ్చునో కర్మని కర్మయోగంగా మార్చి మనకు చూపించారు. ఈ విద్యా, వైద్య రంగాలన్నీ బాగా చెడిపోయినాయి. దీన్ని మరమ్మత్తు చేసేవాడు లేడా? అని స్వామి నిరాశ చెందలేదు. నిరాశని, పేరాశని, దురాశని ప్రపంచానికి స్వామి బోధించలే. ప్రతి దానిని కూడా అంటే ప్రతి పనిని, ప్రతి శాఖని కూడా కర్మయోగంగా మార్చేశారు. వాటి యొక్క ఫలితాలని మనం ఇవాళ కళ్ళ ముందు చూస్తున్నాం. ఒక primary health center గా, ఒక చిన్న general hospital గా, ఒక పరిణామ దశ. ఈ ఎనభై నాలుగు సంవత్సరాలలో చాలా స్థాలీపులాకంగా విచారణ చేసినట్లయితే పరిణామం మన కళ్ళ ముందు కట్ట వచ్చినట్లుగా కనబడుతూ ఉన్నది. ఈ కనబడుతున్నటువంటిది మామూలుగా ఎనభై నాలుగు ఏళ్ళు జీవించిన ఒక వ్యక్తి, సామాన్యుడు అనుకుందాం. వాడు కేవల మానవుడే గనుక అయితే ఇవి సాధించలేడు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే రెండు చెప్తున్నారు. నేను దివ్యుడిని, నేను పరమాత్మని గనుక నేను ఇదిగో ఈ-- నాకున్నటువంటి ఈ సమయంలో నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలని వచ్చానో ఆ సమయంలో ఇవన్నీ చేసి మీకు చూపించా. మీరు చేయవలసింది ఒకటి. నేను పెద్ద canvas మీద చేస్తే మీ మీ వ్యక్తిత్వాలతో మీ వ్యక్తి పరిధిలో గనుక ఇవే విషయాలను చక్కగా కర్మలన్నింటినీ కర్మయోగంగా చేసినట్లయితే ముందు మీ వంటిని, ఆ తర్వాత మీ ఇంటిని, ఆ ఇంటిని తర్వాత మీ చుట్టూ ఉన్న సమాజాన్ని, తర్వాత సర్వ ప్రపంచాన్ని ప్రభావితం చేసేట్లుగా కర్మలన్నీ కర్మ యోగాలుగా చేసుకోండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను పరమాత్మనే వచ్చినా, నేను ఉపయోగించిన శక్తులన్నీ కూడా మానవీయ శక్తులే. మీరు మానవులుగా జన్మ ఎత్తి వచ్చినా మీరు వాడుకోవలసింది నాలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు వాడుకోండి. అంటే జీవుడు పరమాత్మతో కూడి ఉండటమే యోగం గనుక మన కర్మలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ప్రజ్ఞతో కూర్చి గనుక చేసినట్లయితే నిజానికి జరిగేది కర్మయోగమే. ఇవాళ సత్య సాయి institute of higher learning గాని, ఒక water project గాని, ఒక super speciality hospital గాని, ఏ పనైనా స్వామి భావనలో, స్వామి సంకల్పంతో, స్వామి ఆవరణలో, ఏమి జర-- స్వామికి ఆవరణ అంటే పుటపర్తి మాత్రమే కాదు. ఈ సర్వ సృష్టి కూడా స్వామి యొక్క ఆవరణే. ఆ పనులన్నీ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా, time bound గా, కాలానికి లోబడి, మన శక్తులకు లోబడి, అపరిమితమైనటువంటి దివ్య శక్తిని కూడా సంతరించుకొని కర్మయోగంగా అది భాసిస్తూ ఉన్నది. కర్మ యోగానికి ఏదన్నా ఉదాహరణ చెప్పండి అంటే, ఇవాళ పుటపర్తిలో స్వామి ఈ ఎనభై నాలుగు సంవత్సరాలలో తెచ్చిన పెను మార్పులు అన్నీ positive గానే. చూడండి ఎక్కడా కూడా ఒక విస్తృతమైనటువంటి, విశిష్టమైనటువంటి, వరిష్టమైనటువంటి విధానంలో ఒక వినూత్నమైనటువంటి, విశిష్టమైనటువంటి ప్రపంచాన్ని స్వామి మనకు సంకల్పించి చూపించారు. ఎలా చేశారు? సనాతనమైనటువంటి ఒక వైదిక ధర్మాన్ని సనూతనమైనటువంటి ఒక విజ్ఞాన పరంగా, విజ్ఞాన శాస్త్ర పరంగా అంటే scientific temperament తో సమన్వయం చేశారు. ఇవాళ ఏ computer technology ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నదో దానిని పుటపర్తిలో స్వామి ప్రవేశపెట్టారు. సనాతను అంతా పాతదే గొప్ప అని స్వామి ఆగలేదు. సనాతనమైనటువంటి దానిని సనూతనం చేసి అన్ని కర్మలని కూడా కర్మ యోగం చేశారు స్వామి. ఇది కళ్ళ ముందు ఉన్నటువంటిది. ఇక రెండవది భక్తి యోగం. భక్తి అంటే జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి ఒక అంతరంగ సూత్రం, ఒక బంధనం. ఒక చక్కని చల్లని ప్రేమ బాంధవ్యం అది. ఈ ప్రేమ బాంధవ్యాన్ని స్వామి ఎలా భక్తి పూర్వకంగా ఈ జగత్తులో చేశారంటే, ఒక్కసారి విచారణ చేద్దాం. పాత మందిరం రోజుల్లో స్వామి తొట్ట తొలి భజన మానస భజరే గురు చరణం రాసిన వేళ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం అంటూ అరుణాచలాన్ని, పుటపర్తిని సమన్వయం చేశారు. అంటే తాను బాబా ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నప్పుడు ఏమీ విచారణ చేయక్కర్లేదు. ఓంకారంబవ ఓంకారంబవ ఓంకారంబవ ఓం నమో బాబా అన్నారు. బాబా అంటే శరీరంగా కనిపిస్తున్న ఈ బాబా మూలాలు ఎక్కడివో మీకు తెలుసునా? ప్రణవ శబ్దంలో నుంచి నేను వచ్చాను. నిశ్శబ్దంలో నుంచి ఒక శబ్ద భూమికను తీసుకున్నాను. నిరాకారంలో నుంచి సాకారం తీసుకున్నాను. త్రైగుణ్యోత్తరుడైనటువంటి మూడు గుణాలకి అతీతమైనటువంటి నేను ఆ మూడు గుణాలని తీసుకుని మీ మధ్య నడయాడుతూ రాముడు, శివుడు, మాధవుడు, కేశవుడు వీళ్ళందరూ కూడా ఒక్కటే. అనేకంగా కనిపిస్తున్నదంతా ఏకమే అన్నటువంటి భావనలో కేవలము హైందవ మతానికి మాత్రమే కాక, కేవలము వేద మతానికి సంబంధించినదే గాక, ప్రపంచంలో ఇవాళ వెలిగిపోతున్నటువంటి అన్ని మతాలని కూడా స్వామి భక్తి యోగం చేత పరమాత్మ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి భావనతో యోగించిన కారణంగా, సమన్వయం చేసిన కారణంగా ఇవాళ కుల్వంత్ హాల్లో మానస భజరే గురు చరణం నుంచి మళ్ళీ ఈ క్షణం విచారణ వరకు ఎన్నెన్ని రకాలు, ఎన్నెన్ని రకాల భజనలు, ఎన్నెన్ని విధానాలు, ఎన్నెన్ని గుణ సంకీర్తనలు, కులమతాతీతమైన, గుణాతీతమైనటువంటి పరమాత్మ యొక్క సమ్యక్ సంకీర్తనాన్ని స్వామి భక్తిగా ఈ జగత్తుకు బోధించారు. కాస్త పాత రోజులు తెలిసిన వాళ్ళు అయినట్లయితే మందిరం లోపల స్వామి భజన lead చేసేవారు. తాను సాక్షాత్తు రాముడై, తానే కృష్ణుడై, తానే శివుడై ఉన్నప్పటికీ కూడా ఆ శివ పరమైనటువంటి, రామ పరమైన, కృష్ణ పరమైనటువంటి వాటిని తాను స్వయంగా పాడుతూ అందరి చేత పాడించేవారు. అంటే ఏమవుతున్నది? ఎవరు భజనలో కూర్చున్నారో అంటే భక్తిలో ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆత్మలన్నింటినీ కూడా పరమాత్మతో అనుసంధానం చేశారు. పూజాతే విషయోపభోగ రచన అంటారు శంకర భగవత్పాదులు.స్వామి సాక్షాత్తు ఆ మాటకి అనుసరణీయంగా పూజ, దానం, ధర్మం, యాగం, యజ్ఞం, కర్మకాండలైతే, భజన జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనం. అది సమ్మిశ్రితం. రెండూ ఒక్కచోట కూడి దానిని చూసి ఇది, దీనిని చూసి అది ప్రవసించేటువంటిది భక్తి. అందుకే స్వామి అనేక ఉపన్యాసాల్లో మనకు బోధ చేశారు, భక్తి యోగంలో. భగవంతుడు లేక భక్తుడు లేడు. భక్తుడు లేక భగవంతుడు కూడా లేడు. అంటే మీకు నాకు ఏమున్నదయ్యా అంటే అసలు మీరే నేను. మీరే నేను ఒకటైతే నేనే మీరుగా, ఏది ఒకటిగా ఉన్నదో అనేకమైనటువంటి భక్త సమూహాలుగా కనిపిస్తున్నాయి అన్నటువంటి పూర్ణాద్వైత భావనలో పరమాత్మ మనల్ని భక్తి యోగంలో నిలబెట్టారు. కనుకనే ఇవాళ ఏ మతం గొప్ప, ఏ మతం తక్కువ అన్న విచారణ సాయి భక్తులకి ఎవరికీ కలగనే కలగదు. ఎందుకంటే స్వామి స్వయంగా అనుష్ఠానపూర్వకంగా ఈ జగత్తులో ఆ భక్తి యోగాన్ని ఎంత పరమాద్భుతంగా ప్రదర్శన చేసి మనందరికీ అలవాటు చేశారంటే, రాముడైతేనేమి, కృష్ణుడైతేనేమి, మరొకడైతేనేమి, ఎవరైతేనేమి అంతా సాయిత్వమే. పోనీ స్వామిని గురించే ఒక భజన చేద్దాం, ఒక మాట మాట్లాడుదాం అంటే ఆ స్వామి మాటలలో అనేకమైన మహాత్ముల యొక్క మాటలన్నీ వాటంతట అవి వచ్చి ఒక లైన్లో పడిపోతాయే. అంటే సర్వమూ ఆత్మే, సర్వమూ పరమాత్మే, సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మము తప్ప అన్యము ఈ జగత్తులో లేదు అనేటువంటి ఆ భక్తి భావన ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే హృదయం పల్లవిస్తుందో, ఎక్కడైతే మనస్సు అణగి ఉంటుందో, ఎక్కడ సంస్కారాలు పుంజీభూతం అవుతాయో, ఎక్కడ సంసార పరమైనటువంటి యాతనలన్నీ కూడా వెనక్కి వెళ్లి పరమాత్మ యొక్క భావనలో ఆనంద రస తుందిలాలై బిందులై చిందుతూ ఉంటాయో, అది భక్తి యోగంగా స్వామి మనందరి చేత కొన్ని ఏళ్లు, ఒకరోజా, రెండు రోజుల, పొద్దునా, సాయంత్రం ప్రతిరోజూ కూడా కలిసిన అన్నివేళలా భక్తి యోగంలో భజనలు నేర్పారు, నగర సంకీర్తన చేశారు, సామూహిక భజనలు నేర్పారు. అనేకమైనటువంటి సంస్కారము, సంస్కృతి, సాహిత్యము, సంగీతము, సమన్వయం చేస్తూ రాగ, భావ, తాళలయాత్మకమైనటువంటి రీతిలో మనస్సులను రాగరంజితము, అనురాగరంజితము, ప్రేమ పరిపూతము చేస్తూ భక్తి యోగాన్ని ఈ జగత్తుకి ప్రతిపాదన చేశారు. అందుకనే మతం ఎప్పుడూ కూడా మానవుణ్ణి ఆపకూడదు. మానవుణ్ణి ఒక ఊర్ధ్వమైనటువంటి ఒక highest level కి, ఒక శిఖర స్థాయికి తీసుకు వెళ్ళాలి. భక్తుడికి, భగవంతుడికి ఉన్నటువంటి బంధమే నిత్యమూ, అది సత్యమూ, అది శాశ్వతమూ, అది నవ్యమూ, అది దివ్యమూ, అది భవ్యమూ. ఇంతే. ఇది భక్తి యోగం. ఇక జ్ఞాన యోగమా? ఏది రాని, ఏది పోని స్వామి అంటారు, నేలమీద పుట్టినటువంటి ఒక కొండ ఎన్ని పెనుగాలులు వీచినా, సుడిగాలులు వీచినా, అదరక, వెదరక, చదరక, కదలక ఎట్లా నిలబడుతున్నదో, నిజమైనటువంటి జ్ఞాని అంటే ఒక ఎరుకలో ఉన్నటువంటి వాడు. నేను ఆత్మను అన్నటువంటి స్పృహలో ఉన్నవాడు దేనికి లొంగడు, దేనికి ఒంగడు, దేనికి పొంగడు, దేనికి కుంగడు. ఈ దేనికి లొంగని, పొంగని, కుంగనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది జ్ఞానైక స్థితి. దీనినే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు స్థితప్రజ్ఞ అనేటువంటి మాట వాడాడు. ఇది ప్రపంచం. ప్రపంచం పేరే ఇది సంసార సాగరం. సాగరము అనగానే అలలు లేకుండా, కెరటాలు పుట్టకుండా, పుట్టిన కెరటం విరగకుండా, విరిగిన కెరటం మళ్ళీ మూలంలో కలవకుండా ఎట్లా ఉండదో, సంసారంలో ఉన్నటువంటి జీవుడు అనేకమైన దైహిక, మానసిక అనేకమైనటువంటి భావనలకి, యాతనలకి గురై, అనేక జాడ్యాలకు గురై, అనేక వ్యాధులకు గురై ఎన్ని పడుతున్నా, ఎంత ఎంత అనుభవిస్తున్నా, అయ్యో ఈ కష్టం వచ్చింది అంటే కర్మనిష్ఠలో ఉండాలన్నమాట. ఈ కష్టాన్ని నేను ఎలా దాటాలి, అసలు దాటిస్తున్న వాడెవడు, ఈ కష్టం అంటే ఏమిటి, దాటటం అంటే ఏమిటి, ఈ దాటుతున్నది ఎవరు, దాటిస్తున్నది ఎవరు, అంతా కలిపితే ఒకటే ముద్ద అన్నటువంటి భావనలో గనక ఉన్నట్లయితే అది జ్ఞాన యోగం. స్వామిని చూడండి. సుమారుగా ఓ యాభై ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి మన బోటి వాళ్ళం గనక విచారణ చేసినట్లయితే స్వామి ఆడారు, పాడారు, కూడారు. ఇవాళ స్వామి ఏం మాట్లాడటం లేదు. నిజానికి స్వామి మాట్లాడిన రోజులకు పోల్చినట్లయితే మాట్లాడని ఈ రోజులు చాలా profound గా ఉన్నాయి. ఎందుకని ఉన్నాయి అంటే మౌన వ్యాఖ్య పరమోత్కృష్టమైనది. ఏదైనా ఒక శాస్త్రాన్ని, ఒక బోధను చెప్పాలంటే జీవుడు సంస్కారవంతమైన ఒక భాషని, భావాన్ని ఆశ్రయించాలి. అమనస్కమైనటువంటి, మనోలయమైనటువంటి పరమాత్మ, మనసే లేని పరమాత్మ గనుక మనకు బోధించవలసి వచ్చినట్లయితే ఒక దక్షిణామూర్తి స్వరూపంగా ఘనీభవించినటువంటి మౌనంగా కూర్చొని ఉంటారు. ఇవాళ మనం కులవంత హాల్లో మనం కూర్చుని ఉన్నాం, స్వామి సింహాసనంలో కూర్చుని ఉన్నారు. ఈ జ్ఞాన యోగంలో మనకివాళ కలుగుతున్నటువంటి పరమ అద్భుతమైనటువంటి అనుభవం ఏమిటంటే స్వామి యొక్క మూలాలు, స్వామి యొక్క తత్వాలు, స్వామి యొక్క భావార్ధాలు, స్వామి ఇచ్చేటువంటి అనేక ఆంతరంగికమైనటువంటి సంకేతాలు, అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు, అనేకమైనటువంటి సందేహాలకి సమాధానాలు మౌనం ద్వారా చాలా గట్టిగా, చాలా దృఢంగా కానీ మృదువుగా, కానీ నెమ్మదిగా, కానీ ఎంతవరకు మనం అర్థం చేసుకోగలమో దానికి తగినటువంటి మోతాదులో, రీతిలో స్వామి మౌన బోధాకృతిగా ఉన్నారు. జ్ఞాని అంటే మాటలు వల్లిస్తూ మాట ద్వారా బోధించినప్పుడు ఆయన బోధ గురువే. ఆచరించి చూపించినప్పుడు ఆచార్యవర్యుడే. కానీ అనేక గురు స్వరూపాలలో మహోత్కృష్టమైనటువంటి గురు భావన కారణ గురువు. కారణ గురువు ఎవరు అంటే నువ్వెందుకు వచ్చావో తెలియజెప్పేవాడు. మాట ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, కదలిక ద్వారా, మెదలిక ద్వారా.అసలు ఇవేవీ లేకుండా కేవలం తన ఉనికి ద్వారా ఈ రోజున స్వామి యొక్క ఈ అవతార వైభవంలో మనం అనుభవించవలసింది ఒక్కటే. స్వామి మౌనం ద్వారా మనకిస్తున్న సందేశాలని, ఆదేశాలని, స్వామి ఇస్తున్నటువంటి అనుగ్రహాలని మనం కూడా మౌనంగానే పొందే స్థితికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే ఈ శబ్ద నిశ్శబ్దాలకి అభేదం పోయి శబ్దమే ఆగిపోతే దాని పేరు నిశ్శబ్దం అని శబ్దమే కాస్త సేపు మాట్లాడినట్లయితే అది శబ్-- నిశ్శబ్దము మా-- మాట్-- మాట ఆగినట్లయితే అది నిశ్శబ్దం అని ఈ శబ్ద నిశ్శబ్దాలకి అభేదాన్ని మనం పాటిస్తూ పరమేశ్వరుడు ఈ జ్ఞాన యోగాన్ని ఇవాళ అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. సంవత్సరాలు గడవటం అంటే జీవితం గడవటం. ఆ జీవితం గడవటం అంటే అనేక అనుభవాలు మనం పొందటం. ఆ అనుభవాలు కొన్ని ఆనందాన్నిచ్చినాయి, కొన్ని సుఖాన్నిచ్చినాయి, కొన్ని సంతోషాన్నిచ్చినాయి, కొన్ని మహా దుఃఖాన్ని మిగిల్చినాయి. ఇవన్నీ అనుభవించాం కదా. కానీ వీటన్నింటికీ కూడా మనం అతీతంగా నేను అన్నటువంటి ఎరుకలో మనం ఉండగలిగామా లేదా? స్వామి ఉన్నారా లేదా? స్వామి కేవలం మానవుడిగా గనుక మా-- భా-- భావించి విచారణ చేసినట్లయితే స్వామి ఈ అవతారంలో ఈ ఎనభై నాలుగు సంవత్సరాలలో కూడా ప్రాపంచిక పరమైనటువంటి అనేకమైనటువంటి ఆటుపోట్లన్నీ కూడా స్వామి చూశారు. అది మహాసముద్రం గనుక దానిని సాక్షీభూతంగా చూశారు. మనమేం చేశామంటే సాక్షీభూతంగా చూడలే, అయ్యో మనకే కష్టం వచ్చిందే, మనకే ఇబ్బంది వచ్చిందే, మనమే యాతన పడుతున్నాం అని మరింతగా కుంగిపోయినాం. స్వామి ఆ సాక్షీభూత సర్వస్వం గనుక పూర్ణమైనటువంటి ప్రజ్ఞామూర్తి గనుక అవతార పరమాత్మ గనుక ఆయన సాక్షీభూతంగా చూస్తూ చూస్తూ కదలిపోయే మేఘాలవలె పుట్టిన కెరటం సమసినిపోయినప్పుడు ఎట్లాగైతే ఉన్నదో అదే భావనతో ఒక వేదనారహితమైనటువంటి పూర్ణ ప్రశాంతమైనటువంటి మనసుతో దానిని చూడటం మొదలుపెట్టారు. చూడటం మొదలుపెట్టడం అంటే నిజానికి స్వామికి చూపు లేదు, స్వామికి అనుభవము లేదు, స్వామికి బంధనా లేదు. ఉన్నదంతా జీవుడికి గనుక, జీవుడికి బోధ చేయాలి గనుక తాను అనుభవించినట్లు, తాను ఏదో ఆనందపడిపోయినట్లు, తనకు సంతోషం, దుఃఖం రెండూ ఉన్నట్లు అభినయించారు గానీ స్వామికి అనుభవం లేదు. అనుభవ రాహిత్యం ఎక్కడ అంటే పూర్ణమైనటువంటి, పరిణితమైనటువంటి పరమాత్మ గనుక ఈ సర్వ ప్రపంచానికి కూడా కర్మ యోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞాన యోగాన్ని ఏకకాలంలో ఇవాళ ఒక రెండు నిమిషాలు కులువంత హాల్లో కూర్చున్నాం. స్వామి దర్శనం మనకి అనుగ్రహించటానికి స్వామి వచ్చారు. స్వామి కూడా సింహాసనంలో కూర్చున్నారు. ఇందులో కర్మ యోగంలో స్వామిని అనుభవించే వాడు ఒకడైతే భక్తి యోగంలో తాను ఏ దేవతను ఉపాసన చేశాడో ఆ దర్శనాన్ని స్వామిలో దర్శనం పొంది, ఆ దర్శనం ద్వారా పరిణితి చెందేటువంటి దిశగా భక్తి యోగం సాగితే స్వామి ఎంత దయామయుడివి తండ్రి, ఎంత దయాంబుధివి తండ్రి. ఇచ్చిన ఈ జన్మలోనే జ్ఞానం అంటే ఇదా? నేను అన్న భావన ఆ ఎరుక దేహాత్మని దాటి అంటే శరీరాన్ని దాటి నేను ఆత్మనన్న భావనలో నిలకడ చెందటమే ఆత్మ విచారణ మార్గమా అని ఎప్పుడైతే ఒక సమాధానం దొరుకుతున్నదో ఈ మూడు రకాల యోగులు, సాధకులందరూ కూడా పరమాత్మ కొలువులో ఉన్నారు అని. మరి పరమాత్మ ఎలా ఉన్నారు? ఒకడికి కర్మ యోగిగా, ఒకడికి భక్తి యోగిగా, మరొకడికి జ్ఞాన యోగిగా మూడు త్రిపుటీకరణం చెంది యోగత్రయిగా, వేదమాతగా, వేద స్వరూపుడుగా, వేదమే సత్య సాయి భగవానుడుగా ఇవాళ మనకి దర్శనం ఇస్తున్నారు. కాబట్టి పరమాత్మ బోధించటానికి వస్తాడు, శోధించటానికి వస్తాడు, సాధించటానికి వస్తాడు, అనుగ్రహం ఇవ్వటానికి వస్తాడు. ఆ పరమాత్మని ఎట్లా మనకు కావలసిన రీతిలో మన సాధనా మార్గానికి అనువుగా అన్వయించుకుంటామో అదే సంస్కారం కాబట్టి ఆ సంస్కారము, అనుగ్రహము పరమాత్మే ఇవ్వాలి గనుక సత్య సాయి భగవానుడి యొక్క దివ్యమైన ఉనికిని ఈ మూడు యోగాలలో మనం పరిపూర్ణం చేసుకుంటూ యోగత్రయిగా ఉన్నటువంటి స్వామిని, వేద స్వరూపులైనటువంటి స్వామిని, సర్వ దేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామిని సర్వ భువనాలకు కూడా ఈ మూడు యోగాలు అంటే మనం చిన్న కర్మ చేస్తుంటే, స్వామి దీన్ని కర్మ యోగం చేయవయ్యా, నేను భక్తి మార్గంలోనే ఉన్నా నాకు, నాకు రాముడు అంటే ఇష్టం సాయి రాముడి వలె కనిపించు, నాకు కృష్ణుడు అంటే ఇష్టం సాయి కృష్ణుడి వలె కనిపించు, నాకు మహేశ్వరుడు అంటే ఇష్టం సాయి మహేశ్వర స్వరూపంగా దర్శనమివ్వు, నాకు అమ్మవారు అంటే ఇష్టం అమ్మవారే వలె కనిపించు స్వామి అని ఆ భక్తి యోగంలో, ఆ పారమ్యంలో ఎక్కడైతే జీవాత్మ, పరమాత్మలు రెండూ కలిసి ఉంటాయో అది యోగ నిష్ఠ కాబట్టి జ్ఞాన యోగంలో నిజానికి ఇక్కడ ఏమీ లేదు, మనదంటూ ఏమీ లేదు, మనక్కూడా ఏమీ లేదనేటువంటి నిత్య వైరాగ్య వైభోగంలో స్వామి మనందరినీ కూడా ఈ మూడు యోగాలని ఏకకాలంలో అనుభవించే దిశగా నడిపించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ, స్వామి ఎలా ఈ మూడు యోగాలని తమ అవతార కాలంలో చక్కగా పరిపూర్ణం చేశారో, ఎలా demonstrate చేశారో, ఈ జగత్తుకి నిదర్శన పూర్వకంగా, సోదాహరణ ప్రాయంగా పరచినటువంటి ఎనభై నాలుగు సంవత్సరాల జీవితాన్ని సర్వ ప్రపంచం ముందు చక్కగా తెరచిన పుస్తకంలా ఉంచారో మనం కూడా open గా ఉండాలి. transparent గా ఉండాలి. సాధ్యమైనంత వరకు కాదు అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసుకొని వర్తమాన జీవితాన్ని చాలా transparent గా, చాలా పరిపూర్ణంగా ఎక్కడా తెరలేనటువంటి శుద్ధ మనస్కులుగా ఉన్నప్పుడు మాత్రమే స్వామి బోధించిన సత్యం ఆచరించినప్పుడు మాత్రమే స్వామి బోధించిన ధర్మం, అనుభవించినప్పుడు మాత్రమే స్వామి బోధించిన శాంతి అనుభవించినప్పుడు మాత్రమే స్వామి బోధించినటువంటి ప్రేమ వీటన్నింటినీ కూడా మనం ఒక అనుభవ రససిద్ధం చేసుకోవటానికి కర్మ, భక్తి, యోగ, జ్ఞానాల ఒక మహా త్రివేణి సంగమంగా సాగిన సత్య సాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో మనం కూడా ఉన్నాం. ఉండటం అంటే ఆచరణ, అనుష్ఠానం చేయాలి. అనుష్ఠానంలో నుంచి అనుభవాన్ని పొందాలి. అనుభవంలో నుంచి అనుభూతి, విభూతి స్థాయికి వెళ్ళాలి. ఆ దిశగా పరమాత్మ మనల్ని నడిపించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio
Talk on yoga Triveni
Talk on yoga Triveni
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 24:27
More in this series
Talks
- 24 min 1
Talk on significance of festival of Sankranthi
- 52 min 2
Talk - on Guru Tatwam
- 40 min 3
Talk - Koti Samithi Hyd
- 28 min 4
Talk - Bharata
- 23 min 5
Talk on Dasara
- 6 min 6
Talk on Rathasaptami
- 32 min 7
Talk on Sri Sathya Sai - Part 05
- 33 min 8
Talk on the character of Draupadi
- 30 min 9
Talk on Gyana Yoga
- 29 min 10
Talk on Hanuman Panchamukham
- 23 min 11
Talk on Leela Kaivalya Vahini
- 35 min 12
Talk on Sathya Sai Sukthamulu
- 24 min 13
Talk on yoga Triveni
Now playing - 26 min 14
Talk on the occasion of Avatar Declaration day