Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరాం! స్వామి భగవంతుడు లేక భక్తుడు లేడు, అలాగే భక్తులు లేక భగవంతుడు లేడు అన్నారు స్వామి. నిజమా? విచారణ చేయాలి మనం. ఎందుకంటే శ్రీమద్రామాయణం గనుక తీసుకున్నట్లయితే రామ, భరత, లక్ష్మణ, శతృఘ్న అది వరుస. శ్రీరామచంద్రుడు తన శక్తిని నాలుగు భాగాలు చేసుకొని నలుగురుగా అవతరించినటువంటి మహా పరిపూర్ణ అవతారం. అదే సమయంలో ఇంకో ఇద్దరు సోదర ద్వయాలు ఉన్నాయి. అవేంటంటే ఇటు రామా, భరతా ఒక aspect అయితే, వాలి, సుగ్రీవ రెండు. రావణ, విభీషణ. పూర్ణ సత్వగుణానికి రాముడు, భరతుడు. రజస్ గుణానికి వాలి, సుగ్రీవులు. పూర్ణ తమోగుణానికి రావణ, విభీషణుడు. రావణుడితో కూడి ఉన్నందువలన విభీషణుడిలో కూడా కొంత తమోగుణం ఉన్నది. ఇక వాలి, సుగ్రీవుల జాతి చేత, కులం చేత, గుణహీనత చేత వాళ్లలో కూడా రజోగుణం ఉంది. వాళ్ళు కూడా వానర సామ్రాజ్యానికి రాజులు కాబట్టి. మరి ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సాక్షాత్ నారాయణ మూర్తి అయినటువంటి రాముడు, రామ తత్వంలో నుంచి నారాయణ తత్వంలో నుంచి వచ్చినటువంటి భరతుడు పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానంగా ఉన్నారు. రజస్తమో గుణాలు దాటినటువంటి పూర్ణ పురుషులు ఇద్దరూ కూడా లేదా ఇద్దరుగా కనిపిస్తున్న ఒకరు ఎలా? వైనం ఏమిటి? విచారణ చేద్దాం. భగవంతుడి దగ్గర భక్తుడు ఉండటం సహజం. భక్తుడి కోసం భగవంతుడు ఆరాటపడటం సహజం. కానీ అన్నదమ్ములై ఉండి రాజ్యాధికారం కోసం కుటుంబాలను సంహారం చేసుకొని, కేవలం సింహాసనం కోసం, ఐహిక భోగం కోసం వావి వరుసలు, రకమైన బాంధవ్యాలు విలువ లేనటువంటి రోజుల్లో రామ భరతులిద్దరూ కూడా మనకొక నీతిని, ఒక పాఠాన్ని చక్కగా వాళ్ళ జీవితం ద్వారా, వారి అవతార కార్యక్రమం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. రాముడు ప్రాజాపత్య పురుషుడి యొక్క యజ్ఞ పాయసం లో నుంచి నారాయణుడు కౌసల్య గర్భంలోకి ప్రవేశించాడు. సుమిత్రా గర్భంలో లక్ష్మణ శత్రుఘ్నులు, కైక గర్భంలో భరత స్వామి. భరత స్వామి అని ఎవరన్నారంటే రాముడే అన్నాడు. ఆయన స్వామి అంటే జ్ఞాని అని అర్థం. స్వామే స్వామి అన్నాడు భరతుడిని. ఎట్లా అనిపించుకోగలిగాడు? శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడని, దశరథుడు మరణించాడని తెలుసుకున్నప్పుడు తల్లి దగ్గరకు వెళ్ళి భరతుడు తీవ్రంగా మందలించాడు, నిందించాడు, ఆగ్రహించాడు. "నా అన్నని కారడవులకు పంపుతావా?" అన్నాడు. అది దైవ నిర్ణయం అని తెలియక. సరే కారణం ఏదైతే ఏమీ వశిష్ఠుల వారు కూడా "పట్టాభిషేకం చేసుకొని ఆయన, తండ్రి లేడు, మీ అన్నగారు లేరు, తర్వాత వాడివి నువ్వు కాబట్టి నువ్వు రాజ్యార్హత ఉన్నది. పైగా నీ తల్లి కోరిక అదే. కోరికని వరదానం ఇచ్చిన వాడు నీ తండ్రి. కాబట్టి లోకం నిన్ను ఏమీ అనదన్నప్పుడు, నా జ్యేష్ఠ భ్రాత, నా పెద్ద అన్న రాముడు ఇక్కడ ఉండగా సింహాసనం మీద నేను కూర్చోగలనా? ఏమనుకుంటున్నారు? నేను కేవలం" రాముడికి తమ్ముడిని మాత్రమే కాదు శ్రీరామచంద్రుడి యొక్క భక్తుడిని అన్నాడు. అని ఎలా వెళ్లారు అరణ్యవాసానికి అంటే నారచీరలు కట్టుకొని రామలక్ష్మణులు, అమ్మవారు వెళ్లారన్నప్పుడు "అయితే నేను కూడా ముని వేషంలోనే వెళ్తా, రాజు వేషాన్ని నేను ఇక్కడే వదిలిపెడతాన"న్నాడు. ముని వేషంలో శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఇది కథంతా మనకు తెలుసు. అయితే పట్టాభిషేకానికి వచ్చిన రాముడితో భరతుడు ఒక మాటన్నాడు. "అన్నా! ఇదిగో కోశాగారం, ఇదిగో ధాన్యాగారం, ఇదిగో అస్త్రాగారం" అంటే అస్త్రాలు రాజులకు కావాలి, ధాన్యం కావాలి, సంపదలు కావాలి. అన్నీ కూడా పధ్నాలుగు సంవత్సరాలు నేను తాకలేదన్నా అవి అక్కడే ఉన్నాయి. భద్రంగా నువ్వు చూసుకోవచ్చును అన్నాడు. అంటే ఎంత కౌటుంబికమైన, సామాజికమైన, రాజరిక ధర్మాన్ని భరతుడు ప్రతిపాదన చేశాడో చూడండి. అంతే కాదు వశిష్ఠుల వారితో ఒక మాటన్నాడు భరతుడు. "నేను రాజ్య కాముడిని కాదు, రామ కాముడిని" అన్నాడు. "నాకు ఒకే ఒక్క కోరిక, నా శరీరంలో ప్రతి అణువు కూడా నిండిపోయింది. అది రాముడు రాముడు రాముడు కావాలన్న కోరిక. నేను రాముడికి చెందాలన్న కోరిక తప్ప అన్యాయం నాకు తెలియదు" అన్నాడు భరతుడు. అసలు భరత శబ్దం ఏమిటి అంటే భగవంతుని యందు రతి గలవాడు భరతుడు. భా అంటే ప్రకాశం, వెలుగు మూలం అది. అందుకనే భగవంతుడు రాముడా, కృష్ణుడా, భగవాన్ సత్యసాయా అంటే ఇవన్నీ కూడా ఒక ఉపాధి, ఒక రూపం, ఒక నామంతో వచ్చినాయి గాని మన స్వామిని కూడా శరీరాన్ని, రూపాన్ని, సత్యసాయి నామాన్ని దాటి చూడగలిగినట్లయితే స్వామి కూడా ఒక వెలుగు పుంజం. అది వెలుగు మూలం. అసలు వెలుగులకే వెలుగైనటువంటి మూలమైన వెలుగు గనుక వెలుగుని దర్శనం చేసుకునేవాడు గనుక ఆయనకి భా అంటే ప్రకాశం. ప్రకాశము నందు రతి, ఇష్టము కలిగినటువంటి వాడు గనుక ఆయన భరతుడు అయినాడు. భరత శబ్దంలోనే ఆయనకి భక్త శబ్దం కూడా ఉన్నది. తర్వాత పరమ భాగవతోత్తముడు అయినటువంటి భరతుడు శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కుడు అయినటువంటి అంటే అన్నివేళలా రామ పాదము, రామ నామము, రామ రూపము, రామ తత్వము, రామ భావం తప్ప అన్యం ఎరగని వాడు భరతుడు. సరే వెళ్ళాడు మనందరికీ తెలుసు. పాదుకలనన్నా అనుగ్రహించవయ్యా అని అడిగాడు.అట్లాగేలే అన్నాడు. రాముడు భరతుడు కాసేపు మాట్లాడుకున్నారు. పాదుకలు ఏం చేస్తాయి? నువ్వెళ్లి రాజ్యం ఏలుతూ ఉండు. సరేలే నీ మాట మన్నిస్తాను. పధ్నాలుగు ఏళ్ళు అక్కడ ఉండి నేను రానే వస్తా కదా అన్నాడు. అయినా లేదు, నువ్వున్నావు అంటే నీ ప్రతినిధిగా నీ పాదుకలను నాయివ్వమన్నాడు. పాదుకలే ఎందుకడిగాడు? ఏదో ఉంగరమో ఏదో ఇవ్వచ్చు కదా? అంటే, భారతీయ గురు సాంప్రదాయంలో పాదుకలకు చాలా విశిష్టత ఉన్నది. పాదుకల అడుగున అగస్త్య రేఖలుంటాయి. అగస్త్య రేఖాదభిరంచితాభ్యాం శ్రీగురు పాదుకాభ్యాం అని కదా శ్లోకం. అంటే గురువు యొక్క పాదముల అడుగున అగస్త్య రేఖలుంటే మానవుడు అంటే సాధకుడి యొక్క అరచేత కర్మ రేఖలున్నాయి. కర్మ రేఖలు వెళ్లి గురువు యొక్క పాదాన్ని స్ప్రుశించినప్పుడు అగస్త్య రేఖలు, కర్మ రేఖలు సంయోగించి మన కర్మలన్నీ కూడా నశించి పుణ్యాల మాలగా తయారవుతాయి. అందుకే స్వామి అంటారు చూడండి, మీకు తెలుసో తెలియకో కర్మ మాల, బరువు మాల, కంఠమాలగా చేసుకొని వచ్చారు. నా దగ్గరకు రండి పుణ్యాల మాల చేస్తాను అన్నారు. అంటే శ్రీరామచంద్రుడి యొక్క పాదుకల యందు ఏమున్నది అంటే శ్రీరాముడి శక్తి నిక్షిప్తమై ఉన్నది. శ్రీరాముడి స్పర్శ ఉన్నది. అందుకనే గురు పాదుకా స్పర్శ, గురుపాద స్పర్శ, స్వామి యొక్క పాద నమస్కారాన్ని మనం కోరుకోవటం వెనక అర్థం ఇంత ఉన్నది గనుక భరతుడు కూడా మనవలెనే ఏం కోరాలో అదే కోరాడు. పాదుకలిమ్మన్నారు. అందుకనే స్వామి పాదుకా ఉత్సవం అనుగ్రహం చేసినప్పుడు పాదుకలిమ్ము పావన నామా పరమపదమిమ్ము నెమ్మది నా హృదిని పాదాల పాదుకన నిమ్ము అట్లా అడగాలి స్వామిని. పాదుకలు సంకేతం. పాదుకలు ప్రతీకలు. స్వామి యొక్క దివ్యమైనటువంటి పాదాలకి అవి ప్రతినిధులు గనుక. అట్లాగే భరతుడు కూడా శ్రీరామచంద్ర పాదుకలని శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదాలుగా గ్రహించాడు. తీసుకొచ్చాడు. సింహాసనంలో కూర్చోబెట్టాడు వాటిని. ఎక్కడో ప్రత్యేకమైన మరొక సింహాసనం కాదు. ఎక్కడ రాముడు రాజ్యపట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యం ఏలబోతున్నాడో అక్కడే వాటిని కూర్చోబెట్టాడు. ఎలా కూర్చోబెట్టి ఏం చేశాడు పాదుకలని అంటే, జంకార కృతి సామగానములతో శైలాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో లావణ్య రేఖా నిరాతంకంబై చను పాదుకాయుగమున్ ప్రోజ్జత్సింహపదమ్మునన్ శంకాపేతముగా గనుంచి రఘువంశ స్వామిగా చూచుచున్. ఏం చేశాడు భరతుడు అంటే, జంకార కృతి, సమగానములతో రోజూ వేదం చదివేవాడట. సామగానం చేసేవాడు. ఎట్లా? జంకార కృతి అంటే ఒక భ్రమరం ఒక తుమ్మెద ఎట్లాగైతే జంకారం చేస్తుంటుందో భ్రమరకీటక న్యాయంలో రాముడికి తనకి అభేదం కలిగించేటువంటి అద్వైత స్థితిలోకి వెళ్ళేట్లుగా పాదుకల దగ్గర ప్రతిరోజూ సామవేదం చదివేడాయన. సామవేదం చదవటం అంటే సామగానం చేయటమే. శైలాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో అనేకమైనటువంటి గీతాలాపాలు, రామ సంకీర్తనం చేశాడు, గుణగాన సంకీర్తనం చేశాడు. లావణ్య రేఖా నిరాతంకంబై చను పాదుకాయుగమున్. శ్రీరాముడి యొక్క దివ్య పాదుకల యొక్క ఆకారం ఎట్లా ఉన్నదో రాముని యొక్క రూపాన్ని, భావాన్ని, తత్వాన్ని పరమ భక్తి పారమ్యంతో రోజూ అనుగ్రహిస్తూ దానిని చూస్తూ ఏం చేశాడయ్యా అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దానిని ఎలా చూస్తున్నాడు? రఘువంశ స్వామిగా చూచుచున్. రెండు పాదుకలు మా అన్నగారు రాముడే. అయోధ్యా నగర రాజుని చూసినట్టుగా చూశాడు. అంటే పాదుకలకి రాముడికి అభిన్నాన్ని పాటించాడు. అయితే భరతుడు ఒక మాట రాముడికి చెప్పి వెళ్ళాడు. ఏం చెప్పాడయ్యా అంటే, పధ్నాలుగు ఏళ్ళ వనవాసం ఎప్పుడు ముగుస్తుందో వశిష్టుల వారు నాకు చెప్పారు. నేను సమయం కోసం నీ ఆజ్ఞ ప్రకారం మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. తండ్రి ఆజ్ఞ పాటించి నువ్వు వనానికి వచ్చావు. తండ్రి లేడు మనకి. తండ్రి తర్వాత పెద్దన్నవి నీవు. తండ్రివి గనుక నీ ఆజ్ఞ పాలించి నేను వెనక్కి వెళ్తున్నా. నిజానికి నాకు వెళ్ళటం ఇష్టం లేదు. ఎలాగూ నారచీరలతో వచ్చాను. నీతో పాటే పధ్నాలుగు ఏళ్ళు గడుపుదామనుకున్నా. కానీ నువ్వు వెళ్ళు అన్నావు కదా. తిరిగి వెళ్తున్నా పాదుకలతో. కానీ రామచంద్రా! నీవు గనక రావటంలో ఎన్ని ఘడియలు విఘడియలలో తేడా వచ్చినా నేను అగ్ని ప్రవేశం చేస్తా. శరీరాన్ని నిప్పుకి అర్పించి నేను మళ్ళీ పాదుకల దగ్గర అయోధ్యా నగరంలో మాత్రం ఉండను. అంటే నా మనస్సు నీ రాకకై ఎంత తహతహలాడుతున్నదో ఎరిగి సమయానికి రావయ్యా అని అడిగాడు. రాముడు సరేనన్నాడు. ఇక్ష్వాకు వంశంలో మాట ఇస్తే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. కనుక శ్రీరామచంద్రుడు అట్లే సరే నాయనా వెళ్ళమన్నాడు. ప్రేమగా ముదమార పంపించాడు. అప్పుడు రాముడంటాడు, అన్నివేళలా నీవు గురువు యందు, భగవంతుని యందు నీ మనస్సు లగ్నమైయున్నదో కన్నుమూసే వరకు కూడా దాని యందు మాత్రమే నీ మనస్సును లగ్నం చేసుకో భరతా అన్నాడు. అని రాముడు ఒక మాట చెప్పాడు. మానవుడు అంటే జీవుడి యొక్క ఆయువు ఎటువంటిది అంటే ఆకు కొసన నిలిచిన నీటి బిందువు వంటిది. చిన్న గాలి కదలిక చేత, ఆకు కదలిక చేత క్షణానైనా బిందువు నేల రాలవచ్చు తమ్ముడు. కనుక ఆయువు ఉన్నంతవరకూ పరమాత్మనే ఆకుని పట్టుకున్నావే. పరమాత్మ యొక్క దివ్య పాదాలు పట్టుకున్న వాడివి. వదిలిపెట్టకుండా ఉండు అన్నారు.స్వామి రాముడి మాటలే పట్టిన పట్టు పట్టనే పట్టితివి పట్టు విడునందాక అట్టే ఉండు అన్నారు స్వామి. సాకేత రాముడు అట్లా సాయి రాముడు ఇట్లా కాబట్టి భరతుడు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళాడు. నామ రూప భావ తత్వాతీతమైనటువంటి ఆత్మ ఏమిటో ఎరగమన్నారు. ఆత్మకి రూపం లేదు కానీ ఆత్మ సహిత రూపానికి మాత్రం ఆత్మ ఉన్నది శరీరానికి ఆత్మ ఉన్నది ఆత్మకు శరీరం లేదు భరతా అని అద్వైత స్థితిని కూడా తమ్ముడికి బోధించాడు. ఇక్కడ రాజ్య లాలసను దాటాడు. తండ్రి యందు, తల్లి యందు, మిగతా తల్లుల యందు, అన్నదమ్ముల యందు, పౌరుల యందు, అయోధ్యా నగరం పట్ల అన్నింట్లో కూడా భరతుడికి అపారమైనటువంటి ఒక ప్రేమ అపారమైనటువంటి ఒక భక్తి ఒక వినయము ఇవన్నీ ఉన్నాయి గనుక ఆయన భక్తుడిగానే ఉండటానికి ఇష్టపడ్డాడు. భక్తుడు భగవంతుడు అనగానే భ్రమర కీటక న్యాయం గుర్తు రావాలి. కీటకం అంటే తుమ్మెద ఎలా తయారవుతుంది అంటే ఎక్కడో ఒక పురుగును తెస్తుంది గూట్లో పెడుతుంది పెట్టి అసలు తుమ్మెద దాని చుట్టూ జంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. రొద జంకార స్వరం విని, విని, విని పురుగు ఒక రోజున తుమ్మెదై రెక్కలు పుచ్చుకొని పారిపోతుంది. అలా తుమ్మెద తయారవుతుంది. తుమ్మెదకి అసలు పుట్టుక పురుగే. సీతాకోకచిలుక యొక్క పూర్వ రూపం ఏమిటి గొంగళి పురుగు. metamorphousis అంటామే పరిణామ క్రమంలో గొంగళి పురుగే సీతాకోకచిలుక అయింది. ఎట్లా? తన మనోవృత్తులు, తన చిత్తవృత్తులు నశింపజేసుకొని తనకు ఉన్నటువంటి అనేకానేకమైన బలహీనతలను అధిగమించి రూపంలో ఉన్న వికారాలను దాటి అన్నింటిని దాటి దాటి వర్ణ వర్ణాంచితమైన రంగురంగుల సీతాకోకచిలుకగా అది ఒక కేవల కీటకంగా పురుగుగా వచ్చినది తుమ్మెదగా జంకారం చేసే నాద ప్రక్రియకి అనువాదమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంది గనుక భక్తుడు భగవంతుడు నిజానికి భ్రమర కీటక న్యాయమే. సంఘటన ఉన్నది రామాయణంలో. రాముడు వచ్చాడు. ఇదిగో అన్నట్లుగా సమయానికి రాలేకపోయినాడు. తిరిగి వస్తూ వస్తూ భరద్వాజ ఆశ్రమంలో దిగాడు రాముడు అందరితో పాటు. కానీ రాముడికి తెలుసు సమయానికి వెళ్ళకపోతే తనతో పాటే పుట్టిన భరతుడు అగ్ని ప్రవేశం చేస్తాడు అని. ఇందులో ఎవరిని పంపించాలి అనుకున్నాడు. మళ్ళీ మన హనుమే ఆయనకి గుర్తొచ్చారు. హనుమా! నువ్వు వెళ్లి నంది గ్రామంలో ఉన్నటువంటి భరతుడికి చెప్పు శ్రీరామచంద్ర ప్రభువు కొన్ని నిమిషాలలో అక్కడికి చేరుకోబోతున్నాడు. ప్రాయోపవేశ అవసరం లేదు. ఈలోగా అక్కడ జరిగినటువంటి రావణ వధ అంతా కూడా కథా కథన రీతిలో చెప్తూ ఉండు. ఈలోగా నేను అక్కడికి వచ్చి చేరుకుంటాను లేకపోతే మా వాడు అనంత పని చేస్తాడు అన్నారు. అనగానే హనుమ కావలసింది ఒకటే రాముడు పని చెప్తాడా ఎదురు చూడటమే ఆయన తపస్సు. ఆయన కర్మ యోగం అంతా రాముడు చెప్పిన పని perfect గా చేయటమే ఆయన కర్మ యోగం. నేను చేస్తున్నానన్న భావన కాకుండా రాముడే నా చేత చేయిస్తున్నాడన్న భక్తి యోగంలో చేయటం అది హనుమ యొక్క తత్వం. చేసిన తర్వాత చేయబడినది, చేస్తున్నది, చేయించిన వాడు మూడు ఒకటే అని అద్వైత స్థితిలో ఉంటాడు హనుమ. కనుక హనుమ భరతుడి దగ్గరకు వెళ్ళాడు. ప్రాయోపవేశానికి చితి పేర్చుకున్నాడు భరతుడు. అప్పటికే సమయం ఆసన్నమవుతున్నది ఇంకా రాముడు జాడే లేదు. విమానంలో వస్తాడని అనుకుంటున్నారు ఎక్కడ వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని. హనుమ వాలినప్పుడు భరతుడు కూడా శంకించాడు. వీడెవడో లంక నుంచి తప్పించుకొని వచ్చిన రాక్షసుడు అనుకున్నాడు. అప్పుడు అన్ని వివరాలు చెప్పి మధుర వచోవీచితో చల్లని చక్కని మాటలతో ఆత్మీయమైనటువంటి పలకరింపుతో భరతుడి గురిం-- భరతుడికి రాముడి గురించి అన్ని విషయాలు చెప్పాడు. సరే ఇంతలోకే రాముడు రావటం శాలంకృతమైనటువంటి రథం చక్కగా అందరికీ కనపడేలాగా రాముడు రావటం అంటే ఏమిటి? దైవం మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కదా! అరణ్యవాసం జయకేతనం ఎగరవేసి రావణ సంహార కాండ పూర్తి చేసి శ్రీమన్నారాయణుడు రామచంద్ర ప్రభువై రాజ్యాన్ని ఏలటానికి వచ్చే మనోజ్ఞ మధుర సన్నివేశం అది. అయోధ్యా నగర ప్రజలంతా బారులు తీరి ఉన్నారు. రాముడు, భరతుడు ఇద్దరూ రథం మీద నుంచుని ఉన్నారు. నుంచుంటున్నారు రథం సాగిపోతున్నది. అంతఃపురం స్త్రీలు అయోధ్యా ప్రజలు అందరూ కూడా పూలదండలన్నీ కూడా వేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు అంటే భరతుడికి వేస్తున్నారు. భరతుడు సిగ్గుపడిపోతున్నాడు. రాముడి మెడలో ఒక్క పూదండ కూడా లేదు. ఎందుకని? భరతుడు సిగ్గుపడి రాముడి వైపు తిరిగి, "అన్నా! ఇవన్నీ నీకు చెందవలసిన దండలన్నీ నాకు వేస్తున్నారే" అని అంటే రాముడు మాటన్నాడు. "నిజమే భరతా! అన్ని పూలదండలు పొందటానికి నీవు అర్హుడివి. కారణం ఏంటంటే పధ్నాలుగు సంవత్సరాల వనవాసంలో నా మనస్సంతా రావణ సంహారంతోనూ, రాక్షస సంహారంతోనూ, ధర్మకాండలో ధర్మాన్ని నిర్వర్తించటంలోనూ, ధర్మ సంస్థాపన చేయటంలోనూ, యజ్ఞాలను కాపాడటంలోనూ, అపహరింపబడిన సీతను మళ్ళీ తలచుకొని తలచుకొని ఎప్పుడు తేవాలా అన్న ఆలోచనతోనూ, లంకానగరాన్ని తమస్సు నుంచి తపస్సు వైపు నడిపించే విముక్త స్థాయిలోనూ పధ్నాలుగేళ్ళు నా మనస్సు ప్రాపంచికమైపోయింది భరతా! కానీ పాదుకలు తీసుకువెళ్లి సింహాసనం మీద పెట్టుకున్న క్షణం నుంచి ఇదిగో మన ఇద్దరం మళ్ళీ కలుసుకున్న క్షణం వరకు పధ్నాలుగేళ్ళు నీ మనస్సంతా రామనామంతో నిండిపోయింది. రామ తలపుతో నిండిపోయింది. రాముడు ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడు అన్న ఆర్తితో నిండిపోయి భ్రమర కీటక న్యాయంలో నీవు రాముడివైపోయినావు. నీకూ నాకూ తేడా లేదు తమ్ముడు" అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ అలా అనుకోవటానికి కూడా కారణం ఏంటంటే లక్ష్మణ శతృఘ్నుల యొక్క రూపురేఖలన్నీ సమానంగా ఉంటాయి. రామ భరతులిద్దరివి కూడా ఒకే రూపుగా ఉంటాయి. నీలమేఘ శ్యాములు ఎత్తు, ఒడ్డు, పొడుగు అంతా ఇద్దరూ ఒక్కటే. గర్భాలు వేరైనప్పటికీ కూడా. ఎందుకని అంటే అసలు భరతుడుఎంత దగ్గర రాముడికి అంటే స్వామి చక్కగా దీన్ని రామకథా రసవాహినిలో కూడా మనకు చెప్పారు. అలాగే విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో కూడా చాలా అందంగా వర్ణించారు. కౌసల్య దగ్గర స్నానం చేసేవాడు రాముడు. స్నానం చేసి కైక మందిరానికి పరిగెత్తుకు వెళ్ళేవాడు. రోజు కౌసల్య రాముడిని పట్టుకుంది. "ఏమిరా! వరపుత్రుడిగా నిన్ను కన్నానే రామా! నీతో ముద్దు ముచ్చట ఎప్పుడు నాకు తీరేది? ఇక్కడ స్నానం చేస్తావు. కైక మందిరంలోకి, మీ పెనతల్లి మందిరంలోకి తుర్రుమని వెళ్ళిపోతావే! అక్కడన్నీ బొట్లు పెట్టించుకుంటావు, అలంకారం చేయించుకుంటావు, బట్టలు కట్టించుకుంటావు, అక్కడే భరతుడితో ఆడుకుంటావు. ప్రేమను నాకు ఇవ్వవా?" అని అడిగితే, నాలుగు సంవత్సరాల, ఐదు సంవత్సరాల బాలుడు రాముడు ఒక మాటన్నాడు. "అమ్మా! నువ్వు సత్వగుణ ప్రధానమైనటువంటి మాతృమూర్తివి. నన్నే నీ గర్భాలయంలో పెట్టుకున్నావు. నీకు మిగతా వాటితో అవసరం లేదు. ఇక కైక కాస్త తామసంలో ఉన్నది. పరమాత్మ సంస్పర్శ చేత, పరమాత్ముణ్ణి అలంకారం చేయటం చేత, పరమాత్మతో కూడి ఉన్న కారణం చేత ఆమె తపస్సు కూడా తొలగాలి కదా! అసలు నేను వచ్చిందే తమస్సు, చీకటి పోగొట్టటానికి కదా! నా అవసరం నీకంటే కైక దగ్గరే ఎక్కువ ఉన్నది" అన్నాడు. ఇది అత్యద్భుతమైన విశ్లేషణ. కారణంగా భరతుడితో రాముడు ఎక్కువ కాలం గడిపాడు నిజానికి. అరణ్యవాసం లో మాత్రం లక్ష్మణస్వామికి పూర్ణమైనటువంటి association అనుగ్రహించాడు. కనుకనే భరత శతృఘ్నులు ఇద్దరూ మేనమామలయింత ఉన్నారు. వనవాసానికి రాముడు వెళ్ళేటువంటి వేళ, అలాగే రామలక్ష్మణులిద్దరూ వనవాసానికి వెళ్లారు. శ్రీరామచంద్రుడి యొక్క హృదయము భరతుడు. శ్రీరామచంద్రుడి యొక్క పూర్వ-పూర్వ స్వరూపమైనటువంటి నారాయణ స్వరూపంలో శంఖం, చక్రం, గద కదా! ఆదిశేషువు లక్ష్మణస్వామి అయితే భరతుడు ఎవరయ్యా అంటే శంఖం. శంఖము అంటే అత్యద్భుతమైనటువంటి ధ్వని. శ్రీరామచంద్రుడు శబ్ద బ్రహ్మమయుడు. శబ్ద బ్రహ్మమయుడు ఆయనే, నిశ్శబ్ద బ్రహ్మమయుడు కూడా ఆయనే గనుక, శబ్దానికి ఒక ప్రతీకగా శంఖం ఉండాలి గనుక భరతుడు ఎవరు అంటే రామ హృదయం. పధ్నాలుగు సంవత్సరాలు ఇటు భరతుడు ఏలలేదు, అటు రాముడు లేడు. కానీ రామరాజ్యం అనేటువంటి మాట పధ్నాలుగేళ్ళకే ఏర్పడింది. రాముడు లేకుండా అంటే రాజు లేని రాజ్యం. అందుకనే గోదావరి తీరంలో కూడా రాముడు ఒక సందేశం ఇచ్చాడు. "నేను వచ్చి పాలించటం కాదు. నేను లేనప్పుడు కూడా మీరు-- నేనున్నట్లుగా ఉండాలి." స్వామి అదే చెప్తారు కదా, "నేను లేనిదెక్కడ? నేనున్నానని అనుకొని మీ పనులు చేస్తూ ఉండండి." రాముడు చెప్పిన మాటే, భిన్నం ఏం కాదు ఇది. కనుక భరతస్వామి రాముడి యొక్క ఆజ్ఞని, రాముడి యొక్క అభిప్రాయాన్ని, రాముడి యొక్క హృదయాన్ని ఎరిగినవాడు గనుక ఆయన పరమ భాగవతోత్తముడు అయినాడు. ఎప్పుడైతే రాముడు వచ్చాడో ధాన్యాగారాన్ని, కోశాగారాన్ని, అస్త్రాగారాన్ని ఇచ్చాడు. అనేకమైన సంభాషణలలో భరత హృదయం మనకు ఏం తెలుస్తుంది అంటే భగవంతుడి అనుగ్రహం పొందటం కంటే ఐశ్వర్యం మరొకటి లేదు. భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ప్రాపంచికమైన కోరికలు ఉండవు. భగవంతుడే మన వాడైన తర్వాత దాని కంటే ఉన్నతమైనది గాని, మించినది గాని లేదు గనుక, భగవంతుడు మన వాడైన తర్వాత కోరుకోదగినది ఏమీ లేదు. అందుకనే స్వామి ఒకసారి ఒక interview లో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, "If you ask for something it is given. If you don't ask everything is yours." అదే, "If everything is yours there is nothing to be asked." దాన్నే తెలుగులో మళ్ళీ ఏం చెప్పారంటే, "అడిగావా అడిగిందంతా ఇస్తా, అడక్కపోయినావా అంతా నీదే. అంతా నీదే అయినప్పుడు అడగటానికే ఉన్నది" అన్నారు. ఇది. కాబట్టి అడగటానికి ఇంకేదో ఉన్నది అంటే మనం ఇంకా స్వామికి దగ్గర కానట్టు లెక్క. ఆయనేదో ఇవ్వాలని మనం పుచ్చుకోవాలని అనుకుంటాం. అసలు స్వామే మన వారైన తర్వాత కల్పవృక్షమే మన పెరటి చోట ఉన్న సమయంలో పరమాత్మని అనుగ్రహం కోరాలి. పరమాత్మనే కోరుకున్నట్లయితే అన్నీ ఏర్పడతాయని భరతుడిది మనకి చెప్తుంది. అలాగే పాదుకా పూజ, పాదుకా ఉత్సవం. పాదుక అంటే అటు వైష్ణవ సాంప్రదాయంలో, ఇటు స్మార్త సాంప్రదాయంలో, ఇటు అద్వైత భావనలో ప్రతీకాత్మకమైనటువంటి విశేషణలతో పాదుకలు అంటే పరమాత్మే. అంటే ఆపాదమస్తకం అన్నాం. శిరస్సు నుంచి పాదం దాకా అనలే, పాదం నుంచి శిరస్సు దాకా. అంటే కింద నుంచి పైదాకా అన్నాం. కింద నుంచి ఇందాక చెప్పినట్లుగా అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పాద నమస్కారం ఒక గురువుకి నమస్కరించేటువంటి విధానం కూడా చెప్పబడింది. అది భరతుడు పాటించాడు. ఎట్లా అంటే అడుగున అగస్త్య రేఖలు ఉంటే మన అరచేతులు అరికాళ్ళ కిందకి ఎలా వెళతాయి అని. అందుకనే గురువు కానీ, అవతార పురుషుడు యొక్క బొటనవేళ్ళ కింద మన చేతులు పెట్టాలి. పెట్టినట్లయితే కర్మ రేఖలన్నీ కూడా పుణ్య రేఖలుగా మారి పునరావృత్తి రహితమైనటువంటి ఒక జీవితం, ఒక అదృష్టం, ఒక యోగం కలుగుతుంది గనుక రాముడు తాను ఎంచుకున్నటువంటి శంఖమే భరతుడు గనుక భరతుడు రాముడి యొక్క గుండె లయ. గుండె యొక్క ప్రతిధ్వని అది. రాముడు బింబం అయితే భరతుడు ప్రతిబింబం. రాముడు తాను ధరించిన శంఖం తన శబ్దం అయినట్లయితే శబ్దా-శబ్దానికి ఒక సాకార స్వరూపమే భరతుడు. ఆయన ధర్మ ప్రతినిధి. కనుకనే పాదుకా పూజ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అంటే భరతుడి నుంచి. పరమాత్మ యందు అచంచల విశ్వాసంతో పాటు అమిత భక్తి ఉండాలి. విశ్వాసం ఒక్కటే కాదు స్వామి చెప్తారే, "భక్తి ఒక్కటే చాలదు బంగారు. భక్తితో పాటు వినయం ఉండాలి. వినయంతో పాటు సమర్పణ ఉండాలి. సమర్పణతో పాటు శరణాగతి ఉండాలి. శరణాగతితో పాటు అస్తిత్వ వ్యక్తిత్వ వినాశనం జరగాలి." అంటే నేను అన్నటువంటి అహంకారం గనుక తొలగిపోతే నేను అన్నటువంటి అహం వెలుగుతుంది అని.ఆ అహం వెలగటం అంటే ఆత్మ వెలగటం. వెలుగులో మనం వెలిగిపోవటం కాబట్టి శ్రీరామ భరతులిద్దరూ కూడా రెండుగా కనిపిస్తున్నటువంటి అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ కథ కోసం, కథని దాటగలిగినట్లయితే, అంతరార్థంలోకి వెళ్ళినట్లయితే శబ్ద నిశబ్దాలు ఏకమైనట్లు పరిపూర్ణమైనటువంటి రెండు హృదయాలు రెండుగా-- ఒకటే ఒక హృదయం రెండుగా చీలి ప్రపంచానికి ధర్మబోధ, భగవద్భక్త సంయోగము, దాని విశిష్టత స్పష్టంగా చెప్పటానికి అలాగే ఒక కుటుంబ వ్యవస్థలో జ్యేష్ఠుడైనటువంటి అంటే పెద్దవాడైనటువంటి అన్నగారికి తండ్రి అంతటి స్థాయిని ఇవ్వమని చెప్పినటువంటి వాడు భరతుడు. చెప్పినవాడే కాదు, అట్లాగే తాను ఆచరించాడు పధ్నాలుగు ఏళ్ళు. సింహాసనం మీద కూర్చోటానికి అన్ని అవకాశాలు ఉన్నా, అన్ని అర్హతలు ఉన్నా, "నా రాముడు ఉండగా అసలు నాకివి అక్కర్లేదు" అన్నాడాయన. ఇది ఈనాటి రాజులు, ఈనాడు రాజ్యమేలేవారు కూడా భరతుడు ఆదర్శప్రాయమైనటువంటి మహావ్యక్తి. అంతేకాదు, ఒక దివ్యమైనటువంటి శక్తి, పరమాత్మ స్వరూపం. కనుకనే వాలి సుగ్రీవులలో చూడండి యుద్ధం జరిగింది. వాలి నశించాడు సుగ్రీవుడు ఒక్కడే మిగిలాడు. లంక నశించింది, రావణుడు నశించాడు. లంకానగర పునర్నిర్మాణం జరిగింది, విభీషణుడు ఏలుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరిలో ఒక్కడే మిగిలాడు. ధర్మాన్ని ఆచరించినవాడు, ధర్మస్వరూపుడైనటువంటి రాముడితో కూడి ఉన్నవారు మిగిలారు. ఇక్కడ రాముడితో కూడని భరతుడు రాముడు రాజ్యభారమేలినంత కాలం పక్కనే ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు కూడా రామరాజ్యాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని అరవై నాలుగవ రాజు శ్రీరామచంద్ర ప్రభు. కానీ అరవై ఐదవ వాడు కుషుడే అయినాడు తప్ప రాముడు తర్వాత భరతుడు, భరతుడు తర్వాత లక్ష్మణుడు అన్నదమ్ముల కలహాలు లేవు. ఏం నేర్పుతున్నాడయ్యా భరతుడు అంటే ఇంట్లో ఉన్న పెద్దన్నని తండ్రి వలె గౌరవించండి. ఆయన ఆజ్ఞను పాటించండి. ఆయన పరమాత్మ అన్న భావనతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. అట్లాగే ఆయన అప్పజెప్పినటువంటి కార్యాన్ని, కర్తవ్యాన్ని ఆయనకు సంతోషం కలిగించే రీతిలో, ఆయనకు ఆనందం కలిగించే రీతిలో దాన్ని చక్కగా నిర్వర్తించండి. పరమేశ్వర స్వరూపమైనటువంటి అన్న ఆజ్ఞను పాటించటం కంటే ఉత్తమోత్తమ విద్యుక్త ధర్మం లేదని చెప్తున్నాడు భరతుడు. భగవంతుని యందు విశ్వాసం, భగవంతుని యందు అనేక లక్ష్యాలు ఇవన్నీ ఉన్న కారణంగా భరతుడు ఆదర్శప్రాయుడు అయినాడు. భరతుడు అంటే భగవద్భక్తుడే. ఆయన మౌనిగా ఉన్నాడు, ముని వేషంలో ఉన్నాడు. పధ్నాలుగు ఏళ్ళు కాషాయం కట్టుకున్నాడు. పధ్నాలుగు ఏళ్ళు నారచీరలు ధరించాడు. మళ్ళీ రాముడు వచ్చేదాకా రాముడికి ఆయన ఆస్తిని, రాజ్యాన్ని, ప్రజలని పూర్ణమైనటువంటి క్షేమంతో అప్పజెప్పే దాకా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఇది శ్రీరామ భరత సమన్వయంలో మనం నేర్వవలసింది. ఇక రాముడు ఎటువంటి వాడు? ఆయనకు తెలుసు. ఎందుకంటే సర్వాంతర్యామి గనుక, నిజానికి అంతర్యామి గనుక. ఇదిగో భరతుడున్నాడే, రాజ్యం ఏలటానికి వచ్చాడు గనుక పాదుకలను అనుగ్రహించాడు. పాదుకలను రాజ ప్రతినిధిగా పెట్టుకున్నాడు భరతుడు. అలాగే ప్రజలు కూడా పధ్నాలుగు సంవత్సరాలు భరతుడిని చూడలే. అందువల్లనే భరతుడు ఎవడో రాముడు ఎవడో తెలుసుకోలేకపోయినారు చివరి నిమిషంలో. కానీ ఇద్దరూ కూడా భ్రమర కీటక న్యాయంలో భరతుడు రాముడైనాడు. రాముడు ఎప్పుడూ రాముడే. ఆయన నిత్య కళ్యాణమూర్తి, స్ఫూర్తి ప్రదాత. భరతుడి నుంచి మనం నేర్వవలసిన అనేకమైనటువంటి విషయాల్లో వినయం, సమర్పణ, శరణాగతి ఇవన్నీ ఉత్తమోత్తమమైనటువంటి భావాలు. భావాలన్నింటినీ కూడా మనం పుణికిపుచ్చుకొని మన అన్నని కూడా మనం గౌరవించినట్లయితే అప్పుడు మన స్వామికి వీడు రామాయణం చదివినందుకు, నా సద్భక్తుడైనందుకు, నిజంగా భక్తుడుగా జీవించాడు అని స్వామికి ఆనందము, సంతోషము కలిగించినవారం అవుతాం. అలాగే ఆదర్శప్రాయమైన భరతుడి వేళ మన ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లో స్వామి పాదుకలు ఉన్నాయి. మళ్ళీ స్వామి పాదుకలు వేరు, స్వామి ఫోటో వేరు, స్వామి వేరు అనుకోకూడదు. స్వామి యొక్క దివ్య పాదాలు మన వాకిట్లో, మన ఇంట్లో ఉన్నాయి. ఆయన అన్నివేళలా మన దగ్గరే ఉన్నారని ధర్మ కర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని భరతుడి వలె శ్రీరామచంద్ర కార్యక్రమంలో దీన్ని పరిపూర్ణం చేసుకోవాలి, మహత్తరం చేసుకోవాలి. అటువంటి యోగాన్ని స్వామి మనకు అన్నివేళలా అనుగ్రహ వరదానం చేస్తారు. సాయిరాం.
SSSMC · audio

Talk - Bharata

Home

Talk - Bharata

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 28:47

More in this series

Talks

14 episodes · 6 hr 52 min

  1. 24 min 1

    Talk on significance of festival of Sankranthi

  2. 52 min 2

    Talk - on Guru Tatwam

  3. 40 min 3

    Talk - Koti Samithi Hyd

  4. 28 min 4

    Talk - Bharata

    Now playing
  5. 23 min 5

    Talk on Dasara

  6. 6 min 6

    Talk on Rathasaptami

  7. 32 min 7

    Talk on Sri Sathya Sai - Part 05

  8. 33 min 8

    Talk on the character of Draupadi

  9. 30 min 9

    Talk on Gyana Yoga

  10. 29 min 10

    Talk on Hanuman Panchamukham

  11. 23 min 11

    Talk on Leela Kaivalya Vahini

  12. 35 min 12

    Talk on Sathya Sai Sukthamulu

  13. 24 min 13

    Talk on yoga Triveni

  14. 26 min 14

    Talk on the occasion of Avatar Declaration day