Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు రథసప్తమి శుభాకాంక్షలు. అనగనగా ఒక రాజు. రాజుకు కలగక కలగక ఒక కుమారుడు కలిగాడు. కానీ అతడు వికలాంగుడు. రాజుకు ఆనందం, మహాదుఃఖం ఏకకాలంలో కలిగి ఏం చేస్తే కొడుకు వైకల్యం నుంచి బయటపడతాడో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. క్రమంలో ఒక మునిని కలుసుకున్నాడు. తన సమస్యను విన్నవించుకున్నాడు. ఆయన తన దివ్యశక్తితో తెలుసుకుని రాజుకిలా చెప్పాడు. రథసప్తమి పర్వదినాన నిజానికి జీవితకాలమంతా సూర్యున్ని చూడకుండా గడిపినందున ఆనాటి శరీరం అందుకోవలసిన సూర్యశక్తిని అందుకోలేదు. కనుక సౌర చైతన్యశక్తి లభించని కారణంగా పుష్టిలేని అంగాలతో నీ కుమారుడు జన్మ ఎత్తాడు అన్నాడు ముని. రాజు "మహానుభావా! పరిష్కారం మార్గనిర్దేశనంగా దొరికింది. సూర్యోపాసనా విధిని నిర్వర్తించి నా కుమారుడిని ఆతను నుంచి తప్పించి రాజ్యానికి ఉత్తమ వారసుడిని చేస్తాను. ప్రజలకు అందిస్తాను. ధన్యుడిని." అంటూ రాజు కర్తవ్యం ముఖుడయినాడు. వైజ్ఞానిక దృక్పథంతో కథను అన్వయించుకున్నప్పుడు శరీరానికి, ప్రకృతికి, పంచభూతాలకు, అంతెందుకు సర్వసృష్టికి సౌరశక్తి అత్యవసరమని తెలుస్తున్నది. ఇంతకీ సౌరశక్తికి మూలమైన సూర్యుడి శక్తి ఏమిటి? దీనిని విడమరచి చెప్పేది రథసప్తమి. ఈసారి ఫిబ్రవరి పదిహేడున రథసప్తమి ఆగమిస్తున్నది. సూర్య, సవిత, రవి, అర్క, భాస్కర, భాను, దివాకర, ఆదిత్య వంటి అనేక నామాలతో సూర్యుడు అందరికీ పరిచయమే. ఇవి కాక మరికొన్ని పేర్లు సూర్యుడి కర్మనిష్ఠను అనుసరించి ఏర్పడినాయి. వెలుగుని, చైతన్యాన్ని నిరంతరం ప్రసరిస్తాడు గనుక సవిత అని, ఎవరూ చొరబడలేని చోటికి చొచ్చుకుని వెళతాడు గనుక సూర్యుడని, శూన్య గగనంలో ప్రయాణిస్తాడు గనుక ఖగాని, చైతన్య శక్తిని అమృతప్రాయంగా అందరికీ పంచుతాడు గనుక పూషా అని, కోటానుకోట్ల కిరణాలను ధరిస్తాడు గనుక గభస్తిమంతుడని, బంగారు వర్ణపు తొలి వర్ణాన్ని నెమ్మదిగా పచ్చనై, ఆపై తెల్లనై, మెల్లగా కంజాయగా మారుతూ పగటిని వెలిగిస్తుంది గనుక స్వర్ణరేతస్కుడని, ఇవన్నీ సూర్యుడి కలాపాన్ని సూచించే పేర్లు. సూర్యుడి రథాన్ని గేయచక్రము అంటుంది లలితా సహస్రనామం. రథాన్ని నడిపించే గుర్రాలు ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. గుర్రాలకు సప్తి అని పేరు. ప్రతి సూర్యకిరణంలో ఏడు రంగులు ఇమిడి ఉన్నాయి. నిజానికి ఏడు రంగులు ఏడుగురు మహోన్నత సూర్యారాధకులైన వ్యక్తులు. అందులో విశ్వామిత్రుడు ఒకడు. భూమితో మొదలయ్యే ఏడు లోకాలకు సూర్యకాంతి రథసప్తమి నాడు దేదీప్యంగా అందుతుంది. నిశ్శబ్దం నుండి శబ్దం పుట్టినట్లు శూన్యం నుండి పుడతాయి గనుక సూర్యకిరణాలకు మరీచులు అని పేరు. ఒక కొయ్యను వడ్రంగి విధంగా అందమైన బొమ్మగా తీర్చిదిద్దుతాడో విధంగానే సూర్యుడు సర్వసృష్టికి ప్రాణశక్తిని, రూపలావణ్యాలను, పుష్టిని సమకూరుస్తాడు గనుక సూర్యుడికి త్వష్ట అని పేరు. అంటే వడ్రంగి అని అర్థం. కాలాన్ని పగలు, రాత్రులు, తిధులు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు అనబడేటువంటి నానానేక చైతన్యాకృతులుగా తీర్చిదిద్ది అనుభవ రససిద్ధం చేస్తాడు సూర్యుడు. సూర్యుడు వేదనాథన్ నభోమండలం నుండి భూమండలం చేరటం వెనుక, మేఘాల అందాలను ఇనుమడిస్తూ మెరిసే మెరుపుల వెనుక, జలధారతో స్నేహం వెనుక ఉన్నదంతా సూర్యచలనమే. మహా గగనానికి తానొక్కడే చక్రవర్తి. కనుక సూర్యుడికి వ్యోమనాథుడు అని పేరు. ఊహను నిజం చేస్తున్నట్లు ఉంటాడు గనుక ఆయనకు కవి అని పేరు. అందుకే రవిగా అన్నీ చూడలేకపోయినా కవిగా అన్నీ చూడగలుగుతాడు అని లోకోక్తి. గ్రహతారకాగణాన్ని క్రమంగా నడిపించేది సూర్యుడే. విష్ణువు వలె సూర్యుడు సర్వవ్యాపి. వేదపఠనానికి, క్రతువులకు, జీవకోటి కార్యకలాపాలకు ఆయన కర్మసాక్షి. సూర్యుడు దయించే తూర్పు దిక్కు, అస్తమించే పడమటి దిక్కు రెండూ వందనీయాలే. అనివార్యమైన జీవుడి జనన మరణాలకు అవి సంకేతాలు. కోటి సూర్యమండల మధ్యస్థ అయిన మహా త్రిపురసుందరి దేవి తన మూలస్థానాన్ని సూర్యుడి యందే నిలుపుకున్నది. అంటే సౌరశక్తి అనంత శక్తి భాండాగారం. ఇంతటి పౌరాణిక, వైజ్ఞానిక ప్రభావంతో వెలుగుతూ సృష్టి మొత్తాన్ని వెలిగించేది కనుకనే రథసప్తమి పర్వదినమైంది. మాఘసప్తమి తిథి నుండి సూర్యకిరణాలు వేడిని, వెలుగును, శక్తిని, ధాతు పుష్టిని మరింత సమృద్ధం చేసుకొని ప్రకృతికి పచ్చదనాన్ని, జీవులకు వెచ్చదనాన్ని, అందునా అధ్యాత్మ సాధకులకు అంతరంగ దర్శనాన్ని, వైజ్ఞానికులకు అన్వేషణా తీవ్రతను, జాతి, మత, వర్గ, వర్ణాతీతమైన స్థాయిలో ప్రసారించే రథసప్తమి సూర్యోపాసనలో ఒక మహత్తర భూమిక. క్షణం నుంచి జీవుడి ప్రయాణాన్ని వడివడిగా సాగించే మహా చోదక శక్తి అనుభవమవుతుంది. అవిద్య, అనాచారం, అస్పష్టత, అహంకారం అనబడేటువంటి చీకటిని నశింపజేసే వినాశక శక్తి, దేహ, మనో, బుద్ధులను వికాసమానం చేయగలిగినటువంటి శక్తి సూర్యకిరణాలలో ఇమిడి ఉన్నాయి. తన శక్తి ద్వారా సృష్టికి మంగళాన్ని అనుగ్రహిస్తాడు గనుక ఆయనకు శంభువు అని పేరు. పాప, శాప, తాపాల వలననే మానవ జన్మ కలుగుతుంది గనుక రకారం సూర్యబీజంగా అంటే రవిబీజంగా, అకారం అగ్నిబీజంగా, మకారం చంద్రబీజంగా రామశబ్దం ఏర్పడింది. రాముడు జన్మించిన వంశం సూర్యవంశం. రావణ వధకు ముందు అగస్త్యులవారు శ్రీరామచంద్రుడికి ఉపదేశించింది ఆదిత్య హృదయం. అదంతా సూర్య ఉపాసనా మంత్రం. ఇంతటి మహాశక్తి మండల శాసనకర్త రథానికి సారథి అనూరుడు. ఊరువులు లేనివాడు. కదిలించే సూర్యదేవుడికి కదలలేని అనూరుడు రథసారథి. జీవితంలో ఇమిడిన వైరుధ్యం ఇదే. సకలాంగులు తాము నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని అలక్ష్యం చేస్తూ జీవితాన్ని చెల్లగొట్టుకుంటుంటే వారే అసలైన వికలాంగులు. రథసప్తమి జాతిని శక్తిమంతం కమ్మంటున్నది. పర్వదినం వెనుక ఇంత సర్వభావనా సంభారం ఉన్నది. ఓం శ్రీ సాయిరాం.
SSSMC · audio

Talk on Rathasaptami

Home

Talk on Rathasaptami

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 6:52

More in this series

Talks

14 episodes · 6 hr 52 min

  1. 24 min 1

    Talk on significance of festival of Sankranthi

  2. 52 min 2

    Talk - on Guru Tatwam

  3. 40 min 3

    Talk - Koti Samithi Hyd

  4. 28 min 4

    Talk - Bharata

  5. 23 min 5

    Talk on Dasara

  6. 6 min 6

    Talk on Rathasaptami

    Now playing
  7. 32 min 7

    Talk on Sri Sathya Sai - Part 05

  8. 33 min 8

    Talk on the character of Draupadi

  9. 30 min 9

    Talk on Gyana Yoga

  10. 29 min 10

    Talk on Hanuman Panchamukham

  11. 23 min 11

    Talk on Leela Kaivalya Vahini

  12. 35 min 12

    Talk on Sathya Sai Sukthamulu

  13. 24 min 13

    Talk on yoga Triveni

  14. 26 min 14

    Talk on the occasion of Avatar Declaration day