Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరాం! భాగవతుల, భగవంతుల, భక్తుల కథలలో ఒక అపురూపమైనటువంటి స్త్రీ పాత్ర మహాభారతంలో ద్రౌపది. ద్రౌపది అనగానే పంచభర్త్రుక అనే ఒక మాటతో ఇంకేం లేదు కథ అనుకుంటాం. సత్యం పంచభర్త్రుకే, ఐదుగురు భర్తలు కలిగినటువంటి స్త్రీమూర్తి ఆమె. కానీ విషయం తెలుసుకున్నట్లయితే అసలు ద్రౌపది పేరేమిటి అని. ద్రౌపది ద్రుపద రాజ పుత్రిక గనుక ఆమెను ద్రౌపది అన్నారు. ద్రౌపదికి అసలు పేరు అది కాదే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తనను కృష్ణుడుగా, వ్యాసుడుగా, ద్రౌపదిగా సృష్టించుకున్నాడు. ఎందుకని? "సంభవామి యుగే యుగే" అన్నాడు. "సంభవామి యుగే యుగే" లో కథ జరగటానికి ఒక కారణం కావాలి. కథ భారత కథ జరగాలి అంటే ఒక కారణం కావాలి. కారణం ద్రౌపది. ఒకటి. కథ నడిపించే కథానాయకుడు కావాలి. అది తాను, కృష్ణుడు. జరిగిన కథ తర్వాత యుగాలకు చెప్పాలి, రాసేవాడు కావాలి. ఆయన వ్యాసుడు. చాలా విచిత్రం ఏమంటే "శ్రీ కృష్ణ పరమాత్మ కరిషతీతి కృష్ణః, కృష్ణతీతి కృష్ణః, కుషతీతి కృష్ణః" అని కదా కృష్ణుడి యొక్క శబ్దం. కృష్ణుడి అసలు పేరు కృష్ణుడే అయితే వేదవ్యాసుడి పేరు కూడా కృష్ణుడే. కృష్ణ ద్వైపాయనుడు ఆయన. ఆయన రెండవ కృష్ణుడు. అంటే కృష్ణుడిలో రెండవ పార్శ్వం అది. ఇక ద్రౌపది అసలు పేరు కూడా కృష్ణే. ద్రౌపది, వ్యాసుడు, కృష్ణ పరమాత్మ ముగ్గురి పేర్లు కృష్ణ. కృష్ణ శబ్దంలోనే ఏమున్నది అంటే కాల, కార్య, కారణ, కర్తవ్య, నిమిత్తమై పరమాత్మ వస్తాడు గనుక మూడింటినీ, నాలుగింటినీ కూడా ఏకం చేసుకొని ద్వాపర యుగంలో ముగ్గురుగా వచ్చిన ఒక కృష్ణ చైతన్యం అన్నమాట. ఇక స్వామి ద్రౌపది గురించి అనేకమైనటువంటి విశేషాలు మనకు చెప్పారు. భారతాన్ని కూడా చక్కగా అర్థం చేసుకొని చదివినట్లయితే అనేక భావాలు కలుగుతాయి. అయితే స్వామి మనకోసం, ఆధునిక మానవుడి కోసం ద్రౌపది గురించి నాలుగు మాటలు చెప్పారు. నాలుగే లైన్లు. అది చదివితే ద్రౌపది ఏమిటో మనకు అర్థమైపోతుంది. "పతుల మాటకు ఎదురు చెప్పంగబోదు, వారి సేవలు చేయగా తీరదనదు, తనకు ఉన్నంతలో తృప్తిగనుచునుండు, ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు." అద్భుతంగా చెప్పారు స్వామి. ఇవాళ నేను నా భా-భర్తకి చాలా సేవ చేశాను. దాంట్లోనే నా సమయం అంతా అయిపోతున్నది. భజనకి వెళ్ళలేను, సత్సంగానికి వెళ్ళలేను, ఇంకో చోటికి వెళ్ళలేను అనే వారికి చెప్తున్నారు ఆయన. ద్రౌపది ఎలా ఉన్నది అంటే పతుల మాటకు ఎదురు చెప్పంగలేదు. ఒక్కసారి కూడా ఎవరికీ కూడా ఎదురు చెప్పలే. ఒకరా, ఇద్దరా, ఐదుగురు భర్తలు. ఐదుగురికీ ఆమె ఎదురు చెప్పలే. వారు ఏం చెప్పారో ఆజ్ఞను పాటించింది. వారి సేవలు చేయగా తీరదనదు. నాకు టైం లేదు, నేను మీ కోసం సేవ చేయలేను అనట్ల. ఐదుగురు ఐదు రకాల కోరికలు, ఐదు రకాల సేవలు కోరినప్పుడు అన్నింటినీ కూడా ఎదురు చెప్పకుండా చేసింది. ఇక మూడవది తనకు ఉన్నంతలో తృప్తిగనుచునుండు. అది. అంతఃపురం లో పెట్టామా? అక్కడ హాయి. అరణ్యానికి వెళ్దామా? అట్లాగే మీతో. అరణ్యం కాదు, మారువేషంలో విరాటరాజు దగ్గరికి, సరే. అంటే ఏమంటున్నది? ఎక్కడ పాత్ర ఇవ్వబడితే పాత్రని సమర్థవంతంగా నిర్వర్తించింది. ఎవరికోసం అంటే తమ-తన ఐదుగురు భర్తల యొక్క సంక్షేమాన్ని కోరి. వాళ్ళు బాగుంటే తాను బాగున్నట్లు. అంతేతప్ప తాను బాగుంటే వారు బాగున్నట్లు కాదు. వారు ఐదుగురు ఉండాలి అని. పంచ భర్తలు ఎవరు అంటే పంచ ప్రాణాలు. ఎక్కడ ఉన్నది ద్రౌపది అనటానికి స్వామి సమాధానం చూడండి. నీలోనే ద్రౌపది ఉన్నది, నీలోనే కృష్ణ శబ్దం ఉన్నది అన్నారు. ఎట్లా అంటే పంచ ప్రాణాలుగా ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఇవి ఐదు వాయువులు. పంచ వాయువుల యొక్క శక్తే మనం ఇవాళ మాట్లాడేది గాని, వినేది గాని, నడిచేది గాని, సర్వ జగత్తు కూడా న-నడిచేటువంటి చైతన్య భూమిక కాబట్టి ఐదు లోపలే ఉన్నాయి. వారే ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు. కాబట్టి ద్రౌపదికి ఐదుగురు భర్తలు అంటే భౌతిక స్వరూపంగా కాదు, అంతరార్థంలో తీసుకున్నట్లయితే పంచ ప్రాణములుగా మన లోపల ఉన్నారు. ద్రౌపది చుట్టూ ఉన్నారు గనుక ద్రౌపది అనబడేటువంటి కృష్ణ స్త్రీ లోకానికి శిరోమణి. చాలా ఉదాత్తమైనటువంటి వ్యక్తి. ఆమె పడ్డన్ని కష్టాలు ఎవరూ పడలే. అవమానాలు ఎవరూ పడలే. సీతమ్మ వార అపహరింపబడింది అశోకవనంలో ఉన్నది. రాముడు వచ్చాడు, రక్షించుకున్నాడు. కానీ ద్రౌపదిది అట్లా కాదే. మానభంగం జరిగింది. స్త్రీ దేనిని ప్రాణప్రదంగా భావిస్తుందో శీలాన్ని అపహరించడానికి బాలిశులు అంతా కూడా, కుచిత మతులైన వారంతా తమ మామల ముందు, ఇంటి పెద్దల ముందు, కుల పెద్దల ముందు, సభా స్థలంలో మధ్యలో నుంచోబెట్టి వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఎంత నిబ్బరంగా ఉన్నది, ఎంత నిశ్చలంగా ఉన్నది. అదే తదేకమైనటువంటి ఒక భక్తి పారవశ్యంలో భర్తలనే అడగలా రక్షించమని పరమాత్మని అడిగింది ఆమె. పరమాత్మ ఎక్కడున్నాడో వెతుక్కున్నది బృందావన విహారి అన్నది, ద్వారకాపుర విహారి అన్నది, అక్కడ విహారి అన్నది. కానీ ఏమన్నది అంటే వైకుంఠవాస అన్నది చివరికి అంతర్యామి అన్నప్పుడు పరమాత్మ పరిగెత్తుకొని వచ్చాడు. ద్రౌపది భక్తికిశక్తికి, రక్తికి, అనురక్తికి, యుక్తికి సంకేతం. ఒక స్త్రీమూర్తిలో ఉండవలసినటువంటి సర్వసముపేతమైనటువంటి లక్షణాలు కనుక వస్త్రాపహరణంలో సన్నివేశంలో ఆమె శరణాగతి జాతికి చూపించింది. స్త్రీమూర్తి ఎవరిని శరణు పొందాలి అంటే భర్త లోకంలో రక్షిస్తాడు. లోకం బారి నుంచి రక్షిస్తాడు. కానీ జన్మ నుంచి రక్షించేవాడు ఎవడంటే తనకు తన భర్తకు మూలమైన పరమాత్మే అని చాటి చెప్పింది. ఎక్కడా నిబ్బరపడలేదు, తొందరపడలేదు, నిబ్బరాన్ని కోల్పోలేదు, నిశ్చల మనస్వియై సభా మధ్యంలో ఒక ధర్మాన్ని ఎరిగినటువంటి వ్యక్తి గనుక నేను ధర్మవిజితనా? అధర్మవిజితనా? అని ప్రశ్నించింది. అంటే ధర్మరాజు తన్నోడి నన్నోడేనా? నన్నోడి తన్నోడేనా? నన్ను ఓడి గనుక ఆయన పాచికలు ఆడినట్టయితే అది చెల్లదు. లేదు నన్ను పణం పెట్టి ఆయన ఆట ఆడాడు అంటే ఆయన ఒక్కరికి మాత్రమే నేను సొంతం కాదే ఇంకా మిగతా నలుగురున్నారు. వారి అంగీకారం ఉన్నదా? ఆటలో గెలిచి నన్ను పణం పెట్టాడా? గెలవటానికి నన్ను పణం పెట్టాడా? ధర్మ నిర్ణయం చేయమని అడిగింది. తలలు వాల్చారు అందరూ. ధర్మ నిర్ణయం చేయలేకపోయినారు. భీష్ముడంతటి వాడు "తల్లీ! నీవు ధర్మశాస్త్రాలన్నీ ఎరిగిన దానివమ్మా. కష్టకాలం ఏర్పడింది. కాస్త నిబ్బరించుకో." అని అన్నప్పుడు ఆజ్ఞని, మాటని చక్కగా పాటించింది. కానీ పాటించింది గానీ మానం తనది, ప్రాణం తనది, అవమానం తనది. మరి రక్షించేవాడు ఎవడు? భర్తలా తలలు వంచుకు కూర్చున్నారు. కురువృద్ధులా నిస్సహాయులైనారు. దుష్టులా చెలరేగిపోయి ఉన్నారు. సభంతా చూస్తున్నది. తాను ఒక్కతే. అబల. కానీ సబలాన్ని నిరూపించుకోవటానికి ఎవరిని ఆశ్రయించాలో ఆయనను ఆశ్రయించింది. వస్త్రాపహరణంలో శరణాగతిలో నుంచి, ధృడత్వంలో నుంచి, నిశ్చలత్వంలో నుంచి తన మాన ప్రాణాల కంటే ఉన్నతమైనటువంటి మరొక వస్తువు లేదని నిరూపించటానికి ద్రౌపది కార్యరంగాన్ని ఎన్నుకున్నది. భూమికలో ఆమె విజయ కేతనాన్ని ఎగరేసింది. అలాగే శ్రీకృష్ణుడే తనకు ఒక అక్షయపాత్ర ఇచ్చినప్పుడు "నీకేం కావాలో, ఎప్పుడు నీకు అవసరమైతే నన్ను ప్రార్థించు. కావలసిన తినుబండారాలన్నీ వస్తాయి." అన్నప్పుడు తన కోసం వాడుకోలేదు. అక్షయపాత్రలో ముందు భర్తలకు ఏం కావాలి? ఎవరెవరికీ ఏం కావాలో వారందరికీ సమకూర్చిన తర్వాత మిగిలింది ఉచ్చిష్టాన్ని తాను భుజించింది. మిగిలినది అంటే ఉచ్చిష్టము అంటే ప్రసాదం. మిగతా వారు తిన్నదంతా సాదమైతే ఆమె తిన్నది మాత్రమే ప్రసాదం. అది కూడా కృష్ణప్రసాదం. కృష్ణప్రసాదాన్ని పరమేశ్వరుడి యొక్క జ్ఞానంగా భావించింది. పరమేశ్వరుడి యొక్క ప్రేమగా భావించింది. దానిని ఆమె అను-- రోజు కూడా చక్కగా అనుభవించింది. అలాగే అరణ్యవాసం లో సహజీవనం చేసింది. తన భర్తలు ఎక్కడ చెట్ల కింద పడుకున్నారో అక్కడే పడుకున్నది ఆమె. వాళ్ళతోనే ఉన్నది. వాళ్ళ కష్ట నిష్ఠూరాలలో, ఇబ్బందులలో, అననుకూలాలలో అన్ని వేళలా పగలు-రాత్రి లేదు. భీకరమైన జంతుజాలాలు. వాటన్నింటి మధ్య ఒక సబలగా, ఒక స్త్రీమూర్తిగా, ఒక ధృడ మనస్విగా అక్కడ ఆమె నిలబడిపోయింది. అలాగే చివరగా ద్రుపద రాజ పుత్రికై, ఐదుగురు భర్తలకు ఆమె ఇల్లాలై, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సోదరియై, శ్రీకృష్ణ అంశతో, కృష్ణ నామంతో పుట్టినటువంటి ద్రౌపది విరాటరాజు కొలువులో మాలిని వేషంలో వెళ్ళవలసి వచ్చింది. దాసి పాత్ర అది. అంటే రాజుగారికి, రా-రాణిగారికి రోజూ కురులు తీర్చిదిద్దేటువంటి పని. పని హీనము అనుకోలేదు ఆమె. మారువేషం కదా! అసలుని దాచి ఉంచవలసిన ఒక్క సంవత్సరం ఎట్లా ఉండమన్నా ఆవిడ తనను తాను నిర్ణయించుకొని వెళ్ళింది. నేర్పరితనాన్ని తాను పొందిందో, అంటే స్కిల్ అంటామే, ప్రజ్ఞ. ప్రజ్ఞని తన వనవాసానికి, అజ్ఞాతవాసానికి చక్కగా వాడుకున్నది ఆమె. వాడుకొని ఎక్కడా కూడా తాను ద్రుపద రాజ పుత్రికనని గాని, పంచపాండవుల యొక్క భార్యని గాని, అనేక ధర్మశాస్త్రాలు తెలిసిన వ్యక్తినని గాని, ఆభిజాత్యం ప్రదర్శించకుండా మాలిని అనేటువంటి ఇవ్వబడినటువంటి పాత్రలో పరమాద్భుతంగా ఆమె ఒదిగిపోయింది. అయినా విరాటరాజు విముక్తం కావటానికి, కీచక వధ జరగటానికి మళ్ళీ ఆమె కారణమైంది. కారణంలో తన యుక్తిని ప్రదర్శించింది చూడండి. తన శక్తిని ప్రదర్శించలా. భీముడికి చెప్తే ఒక్క నిమిషంలో అదే కీచకుడిని సంహారం చేసేవాడు. కానీ బయటపడిపోతాం కదా! యుక్తి కావాలి. అందుకనే ప్రపంచంలో బతకటానికి వివేకము కావాలి, విజ్ఞానము కావాలి. దానితోపాటు విచక్షణ కూడా కావాలి. అంటే డిస్క్రిమినేషన్ కూడా ఉండాలి. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం కావాలి? ఏం అక్కర్లేదు. ఏం అక్కర్లేదో తెలుసుకుంటే మిగిలిందంతా ఏం కావాలో తెలిసిపోతుంది. ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటే ఏం అక్కర్లేదో అక్కడే ఉండిపోతాయి గనుక ఏం అక్కర్లేదో ముందు తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞాన విచారణలో ద్రౌపది ఆరితేరినటువంటి చెయ్యి. ఆ, అలాగే సమస్థితి. అంటే దాన్ని మనం ఇవాళ సమస్థితిని ఈక్వానిమిటీ, ఈక్విపాయిస్, ఈక్విలిబ్రియం అని వాడతాం. కష్టం వచ్చింది. ఆమె ఏమీ బెంబేలు పడిపోలే. నిబ్బరంగా ఉన్నది. ఒకే కారణం. కష్టం ఎన్నాళ్ళో ఉండేది కాదు. మహాసుఖం వచ్చేసింది. ఏం పొంగిపోలే. ఇది ఎక్కువ రోజులుండేది కాదు. స్వామి అన్నారు చూడండి. సుఖము, దుఃఖము రెండూ కూడా అటూ ఇటూ పాసింగ్ క్లౌడ్స్ అని ఒక మాట. A pleasure is a small interval, very short interval between two calamities. A calamity is a very short interval between two pleasures. Neither you experience pleasure nor calamity. రెండూ కూడా, కష్టసుఖాలు రెండూ కూడా అలా వచ్చి వెళ్ళిపోయేటువంటి కదలిపోయే మేఘాలు, చెదిరిపోయే మేఘాలు. మేఘం వచ్చిందా? అదే తొలగిపోతుందన్న నిశ్చలత్వంతో ఉండమన్నారు. దానికి ప్రతీక ఎవరు అంటే మన ద్రౌపది. ద్రౌపది ఇటు విరాట పర్వంలో, అరణ్యవాసంలో, సభలో అట్లాగే అక్షయపాత్రను తాను పొంది కూడా అవసరమైన వేళ మాత్రమే ఆమె దాన్ని వాడుకున్నది. ఏదో పాత్ర ఉన్నది కదా!ఎప్పుడైనా ఏవైనా చేయొచ్చు అనే దాన్ని వాడుకోలే. గురువు, సచివుడు, తండ్రి, దైవము, సోదరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆకలి అయినవేళ దీనిని వాడుకో అని ఇచ్చాడు అక్షయపాత్ర. ఆకలి తన భర్తలకు ఎప్పుడవుతుందో ఆమెకు తెలుసు గనుక, అరణ్యవాసం లో ఉన్నటువంటి రాజకుమారులు గనుక, ధృడకాయులు గనుక, వారి వారికి ఏమేమి కావాలో అవి మాత్రమే అడిగింది. అందరినీ సంతృప్తి పరచింద ఆమె. ధర్మకామన, కార్యకామన, కామకామన లేదు ఆమెకి. ప్రపంచం లేదు. ద్రౌపది అంటే కేవలం తనువుతో కూడిన ద్రౌపది కాదు, కృష్ణ చైతన్యాన్ని నింపుకున్నటువంటి స్త్రీమూర్తి. నిజానికి పరమేశ్వర తత్వం గనుక ఒక స్త్రీమూర్తిగా జగత్తులోకి వచ్చిందా అంటే రెండే రెండు పాత్రలు. ఒకటి జగజ్జనని అయినటువంటి అమ్మవారు. ఆనాడు సీతగా, మళ్ళీ ఇదిగో ఈనాడు ద్రౌపదిగా. అందుకనే స్వామి అన్నారు, [పాట] "ద్రౌపదికి సాటియే పతివ్రతయు లేదు". ఇవన్నీ ఒకే ఎత్తండి. మనం ఎన్నన్నా పాటించచ్చు, ఎన్నన్నా తెలుసుకోవచ్చు, నిబ్బరంగా ఉండచ్చు కొంత సాధన చేత, నిశ్చలంగా ఉండచ్చు, మనకి భక్తి విశ్వాసాలు ఉండచ్చు. కానీ ఒక మాతృమూర్తికి గర్భశోకం కలిగినప్పుడు అది ఆమెదే. ఒకడు తీర్చేది కాదు, ఆర్చేది కాదు. భర్త అయినా "ఏం-ఏదో జరిగిందిలే, జరిగిపోయిందిలే, మనం ఏం చేయగలం" అని ఆగవచ్చు. కానీ గర్భశోకం తనది. ఎట్లా దాటాలి అని అనుకున్నప్పుడు ఉపపాండవ సంహారం ద్రౌపది జీవితంలో ఒక పరమ చరమమైనటువంటి ఘట్టం. నిద్రపోతున్నటువంటి ఉపపాండవులని అశ్వత్థామ చంపేశాడు. ఇక తన-తన తర్వాత తన బిడ్డలంటూ లేరు ఆమెకి. అప్పుడు అర్జునుడు వెళ్లి బంధించి తీసుకువచ్చాడు. ఎవరిని? అశ్వత్థామని. తీసుకొని వస్తే, "వీడిని చంపుతానన్నాడు, చంపమని నువ్వు చెప్పు. ఇదిగో వీడే నీ కొడుకుల్ని, మన కొడుకుల్ని చంపాడు. పైగా నిద్రపోతున్న వాళ్ళని" అంటే ద్రౌపది అశ్వత్థామ కాళ్ళమీద పడింది. కాళ్ళమీద పడి ఏమన్నదో తెలుసునా? "ఏమయ్యా! ఎందుకిలా చేశావు? నిన్ను గనుక ఎవరన్నా చంపితే నీ తల్లికి ఎంత శోకం కలుగుతుందో మర్చిపోయినావా? నీ తల్లికి గర్భశోకం కలిగించిన వాడివి అవుతానే అని నీకెప్పుడూ అనిపించలేదా? నువ్విలా చంపవచ్చునా పిల్లల్ని?" అని ఒక మాట చెప్పింది. కాళ్ళమీద పడి చెప్పింది. నుంచొని కాదు. మామూలుగా గనుక ఐదుగురు కొడుకుల్ని చంపినవాడు వీడే అని తన భర్త అర్జునుడిని తీసుకువస్తే, "నా ఎదురుగా వీళ్ళని చంపండి" అంటుంది. అనలే ద్రౌపది. "నీ తల్లికి గర్భశోకం కలిగించేవాడిని అవుతానేమో అని నీకు అనిపించలేదా?" అన్నది. అంటే తల్లికి గర్భశోకం కలిగించకూడదు అని. అక్కడ మాట చెప్పింది. "నువ్వు ఎటువంటి వాడివో తెలుసా అశ్వత్థామా? బ్రాహ్మణుడివి నువ్వు. పైగా ద్రోణ పుత్రుడివి నువ్వు" అని స్వామి మాటల్లో ఎంత అందంగా ఉంటుందంటే, [పాట] "పరగన్ మా మగవారలందరును మున్ బాణ ప్రయోగోపసంహరణాద్ ఆయుధవిజ్జలన్నియు ద్రోణాచార్యుచే అభ్యసించిరి. పుత్రాకృతినున్న ద్రోణుడవు. నీ చిత్తంబులో లేశమున్ కరుణా సంగము లేక శిష్యసుతులన్ ఖండింపగా పాడియే". "ఏమయ్యా! నువ్వు ఎలాంటి వాడివో తెలుసునా? మా మగవారులందరూ మా-- అంటే నా మగవారులందరూ అంటే నా భర్తలందరూ కూడా బాణ ప్రయోగము, ఉపసంహారము అనేటువంటి ఆయుధ విద్యలన్నీ కూడా, బాణం ఎలా వేయాలో, ఎలా ఉపసంహరించాలో ఎక్కడ నేర్చుకున్నారో తెలుసునా? ద్రోణాచార్యుడి దగ్గర అభ్యాసనం చేశారు. నువ్వు-నువ్వు ఎవరంటే [పాట] పుత్రాకృతినున్న ద్రోణుడవు". ద్రోణుడి యొక్క పుత్రాకృతిగా ఉన్నావ్. దీంట్లో పరమాద్భుతమైన ఒక రహస్యం ఉన్నది. ఏమిటంటే, "ఆత్మవై పుత్ర నామాసి" అని. అంటే మన పిల్లలంతా కూడా మన ఆత్మ స్వరూపులు, మన ఆత్మలో నుంచి వచ్చారు అని. ఉత్తముడవైతే. కానీ వీడు ఎలా ఉన్నాడటంటే, "అచ్చం ద్రోణుల-ద్రోణుడి లాగా ఉన్నావు కానీ, ద్రోణుడి లాగా లేవే. రూపంలో ఉన్నావ్, ఆ-ఆకారంలో ఉన్నావ్, ఆచారంలో లేవు. నువ్వెలా ఉండాలి? నా భర్తలు అయినటువంటి వారందరికీ విద్యాభ్యాసనం చేసిన నీ తండ్రి వలె ఉండాలి. నీ తండ్రికి నా భర్తలంటే ఎంత కరుణో తెలుసా? నీకసలు కరుణే లేదేమయ్యా! ఆయన, నీ తండ్రి శిష్య సంతతిని సంహారం చేయాలి అని నీకు అనిపించింది, ఇది న్యాయమా? నువ్వు ద్రోణాచార్యుడితో సమానుడివయ్యా. పని చేయకుండా ఉండవలసింది" అని అంటున్నది ఈమె. చేసినవాడు తల వంచుకుని ఉంచున్నాడు. పోగొట్టుకున్నటువంటి, బిడ్డలను పోగొట్టుకున్న భర్త వాడిని బంధించి తెచ్చాడు. ఇటువంటి ధర్మశాస్త్ర ఉపదేశనం చేస్తున్నది. శిష్య వాత్సల్యం ఉన్నటువంటి ద్రోణాచార్యుడి యొక్క శిష్యుల కొడుకులను నువ్వు సంహారం చేశావ్. ద్రోణ సమానంగా ఉన్న నువ్వు, నీకిది పాడి కాదు, న్యాయం కాదు అన్నది. అనగానే అర్జునుడున్నాడు. "ఇదేమిటి? ఉపపాండవుల్ని సంహారం చేసినటువంటి అశ్వత్థామని చంపు అంటుంది ద్రౌపదిని నేను వస్తే, అశ్వత్థామ కాళ్ళ మీద పడి ద్రౌపది ఇట్లా అడుగుతున్నదేమిటని, ఇదేమిటి నువ్వు వెర్రిదానా? వీణ్ణి చంపుతానూ నేను" అన్నాడు. అప్పుడు చూడండి, ధర్మశాస్త్రాన్ని ఇద్దరికీ బోధించింది. తన శోకం, గర్భశోకాన్ని తనలోనే ఉంచుకొని ఒకడు అశ్వత్థామ. "బ్రాహ్మణుడివై, గురుపుత్రుడివై, శిష్యుడి యొక్క కొడుకుల్ని చంపడం న్యాయం కాదు నాయనా" అన్నది. "నీ తల్లికి ఇటువంటి గర్భశోకం రాకుండా చూడు" అన్నది. అర్జునుడు ఎప్పుడైతే మాట అన్నాడో, అర్జునుడితో చెప్తుంది "నువ్వు క్షత్రియుడివి కావచ్చు గాక, కానీ ఎవరిని చంపకూడదో శాస్త్రం ఉన్నది. చెప్పనా?" అన్నది. అని చెప్పింది. [పాట] "వెరచినవాని దైన్యమున వేదురునొందినవాని నిద్రమైమరచినవాని సౌఖ్యమున మధ్యముత్ర వినదాని భగ్నుడై పరచినవాని సాధుజడ భావము వానిని కావుమల్చు వాచరచినవాని కామినుల చంపుట ధర్మము గాదు ఫల్గుణా".యమయ్యా! క్షత్రియుడివే నువ్వు ఇన్ని రహస్యాలు తెలుసుకున్నావే, శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నావే, జ్ఞానమంతా పొందావే, అశ్వత్థామని చంపకూడదు అని నీకు అనిపించలేదా? ఎందుకు చంపకూడదు అంటే భయపడ్డ వారిని చంపకూడదు. దైన్యంతో ఉన్నవాణ్ణి చంపకూడదు. నిద్రలో మైమరచి ఉన్నటువంటి వాణ్ణి, మై అంటే శరీరం, శరీరం మరచి ఆదమరచి హాయిగా నిద్రలో ఉన్నవాణ్ణి చంపకూడదు. అలాగే సుఖం పొందాలి అని సురాపానం చేసి మద్యము సేవించి పడుకున్న వాణ్ణి చంపకూడదు. అలాగే భగ్నుడైపోయినటువంటి వాణ్ణి, ప్రపంచంలో ఓడిపోయిన వాణ్ణి నువ్వు చంపకూడదు, అది శవమే కదా. సాధు జడ భావము వాని, సాధుత్వం లేని వాణ్ణి చంపకూడదు. అలాగే కావుమంచు వాచరచిన వాని, నన్ను రక్షించు అని నోరు తెరిచి అడిగిన వాణ్ణి, కామినుల స్త్రీలను చంపకూడదనే ధర్మం నీకు తెలియదా? కాబట్టి వీణ్ణి నువ్వు చంపద్దు. చంపుతావ్, నా బిడ్డలు వెనక్కి తిరిగి వస్తారా? ఉపపాండవులు మళ్ళీ నిద్రలో నుంచి లేచి వచ్చి నాకు ఆనందాన్ని కలిగిస్తారా? అశ్వత్థామ యొక్క తల్లికి గర్భశోకం కలిగించకు అర్జునా అని అర్జునుడికి, నీ తల్లికి గర్భశోకం కలిగించే పని నువ్వు చేయొద్దని అశ్వత్థామకి, ఇద్దరికీ చెప్పినటువంటి పరమ కారుణ్యమూర్తి. క్షమ, స్వామి అంటారు టాలరెన్స్. టాలరెన్స్, క్షమాగుణం కంటే అత్యుత్తమమైనది లేదు. పశ్చాత్తాపం ఒక స్థాయి అయితే, మనకి అపకారం చేసినటువంటి వాణ్ణి, మనల్ని పతనం చేయటానికి ప్రయత్నించిన వాణ్ణి లేదా మనల్ని సంహారం చేయటానికి ప్రయత్నించిన వాడి పట్ల కూడా క్షమ, ఔదార్యం వాటిని ప్రదర్శించటం ఒక్క ద్రౌపదికే చెల్లింది. ద్రౌపది చక్కగా, అయితే నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేశా కదా మరి నేను క్షత్రియుణ్ణి ఎలా అయిపోయింది అంటే ఆయన-- ఆమె అన్నది. వీడికి శిరోముండనం చేసి హాయిగా వాడి శిరోముండనం అంటే తల గొరిగి వాడిని అవమానపరచు. మానం ఉన్నటువంటి వాడికి అవమానమే ప్రాణంతో-- ప్రాణం పోయిన వాడితో వాడు సమానం కాబట్టి వాణ్ని అవమానపరిచి పంపు తప్ప వాణ్ణి చంపద్దు అన్నది. ఇది ద్రౌపది తన జీవితంలో మనకి బోధించేటువంటి ఆదర్శప్రాయంగా, తన జీవితంలో చెప్పటానికేముంది, చెప్పటం చాలా తేలిక. ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్నటువంటి ద్రౌపది అర్జునుడికి, అశ్వత్థామకి చెప్పటం. పైగా గర్భశోకాన్ని దాచుకొని, ఇది ఒక ఉదాత్తమైన స్థాయి. అధ్యాత్మలో, అధ్యాత్మ అంటే నిత్య జీవితాని కంటే భిన్నమైనది కాదు. అసలు జీవితమే అధ్యాత్మ జీవితం, అందులో కాస్త నిత్య జీవితం ఉంది. కాస్త ఉద్యోగం చేస్తాం, కాస్త వ్యాపారం చేస్తాం, కుటుంబాన్ని నడుపుతాం, అసలు జీవితమే అధ్యాత్మ. అందుకే అన్ని శబ్దాలు పుట్టె నిశబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితమ్ము. పరమాత్మను వెతుక్కోవటానికి మానవ జన్మ ఇవ్వబడింది గనుక ద్రౌపది ఒక్క క్షణం గనుక అర్జునుడిని వాణ్ణి చంపు అంటే అశ్వత్థామ మరణించి ఉండేవాడు. కానీ క్షమాగుణం చేత వదిలిపెట్టింది. అలాగే సభాపర్వంలో కూడా అంటే నిండు సభలో కూడా తనను అవమానించిన వారిని శిక్షించమని ఆమె అడగలే. అందరూ ప్రతిజ్ఞలు చేశారు. భీష్-- భీముడు ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధంలో వాణ్ణి చంపుతాను, తొడలు విరుస్తాను, వీడి రొమ్ము విరుస్తాను, రక్తం తాగుతానన్నాడు, ఆమె ఏం మాట్లాడలే. ఆమె ధర్మ విచితనా, అధర్మ విచితనా అని చెప్పమన్నది. చెప్పలేరు గనుక ప్రశ్నను వదిలిపెట్టింది లోకానికి, శాస్త్రానికి, పరమాత్మని ప్రార్థించింది. అంటే శాస్త్రాలు అనేకమైనటువంటి విషయాలు పరమాత్మ కంటే ఉన్నతమైనవి నిజానికి కావు. పరమాత్మ యొక్క అనుగ్రహం పొందిన వాడికి శాస్త్రాలు నిజానికి అక్కరలేదు, అందుకే అన్నారు. స్వామి దగ్గరికి వేలూరి శివరామశాస్త్రి గారిని రోజుల్లో వస్తే, ఎవరీ భగవాన్ సత్య సాయిబాబా వారు అని అడిగినప్పుడు ఆయనన్నారు, అదే నడిచే బ్రహ్మ పదార్థం. పండితులకి పరీక్ష, పామరులకు శ్రీరామ రక్ష అన్నారాయన. పండితుడికి ఆయన ఎప్పుడూ నిజమే నిత్య పరీక్షే అది. పామరుడికి అది శ్రీరామ రక్ష, అభయహస్తం ఇస్తే వాడి జీవితం వందేళ్లు నిండుగా, ఆహ్లాదిగా శరత్ పౌర్ణమి లాగా నడిచిపోతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నటువంటి కృష్ణ అంటే ద్రౌపది, ధర్మవేది ఆమె. ధర్మం తెలిసింది, శాస్త్రాలు ఎరిగింది, అధ్యయనం చేసింది, స్త్రీ చైతన్య స్వరూపంగా వచ్చింది, మహాభారత సంగ్రామానికి మూలమైంది. అలాగే ద్వాపరాంతంలో జరిగినటువంటి సంగ-- మహాభారత సంగ్రామం ఉన్నది చూడండి, యుద్ధం ఉన్నది చూడండి, దానికి కారణము, ప్రేరణము ఆయనైతే తారణము తనదైన మరొక భాగమైనటువంటి కృష్ణుడయినాడు. కృష్ణ గాథని అంటే ద్రౌపది గాథని, కృష్ణుడి గాథని రాసిన కృష్ణుడు వేదవ్యాసుడు గనుక ద్వాపర యుగమంతా కృష్ణ చైతన్యంతో సాగింది. అందులో ద్రౌపది చాలా ప్రధానమైనటువంటిది. పంచ ప్రాణాలు మనలోనే ఉన్నాయి అని గనుక గమనించుకున్నట్లయితే ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు ఉన్నారు మనలో అనుకోవాలి. ఎలా ఉన్నారు అంటే ధర్మరాజు ఉన్నాడు. తినజాలను నెత్తుటి కూడు మాధవా అన్నాడు. నాకు యుద్ధం వద్దయ్యా, ఎంతో మంది మరణిస్తారు దాంట్లో, తర్వాతో రాజ్యం మిగులుతుంది, నెత్తుటి కూడునే తిననా అన్నాడు ధర్మరాజు. అట్లా ఉండాలి మనం. అధర్మంతో కూడిన సంపాదన వైపు మన మనస్సు వెళ్ళకూడదు. ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. ధర్మం కూడా పరమాత్మ యందు నిక్షిప్తమై ఉన్నట్లయితే, కలిసి ఉన్నట్లయితే అది మరింత రాణిస్తుంది గనుక ధర్మరాజు అన్నివేళలా శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉండటానికి ప్రయత్నం చేశాడు భావపరంగా. ఇక భీముడా, భుజబలం ఒక్కటి మాత్రమే మనకు చాలదు. భుజబలం, బుద్ధిబలం కూడా కావాలి ప్రపంచంలో. అంటే శరీరం, మనస్సు, హృదయం మూడు ఉన్నాయి. కేవలం శరీరమే మనం కాదు, శరీరాన్ని నడిపిస్తున్న ఒక మనస్సు కూడా మనమే. శరీరము, మనస్సు మాత్రమే కాదు దానిని స్థిమితంగా ఉంచే హృదయము మనమే. కాబట్టి శరీరము, మనస్సు, హృదయము మూడింటిని కూడా సంపుటీకరణం చేయటానికిదానిని త్రిపుటి మూడుగా చేసుకోవటానికి మూడుగా కనిపిస్తున్న దానిని ఒకటి చేయటానికి భీముడు అనేటువంటి భీమ అంటే అవధి లేని దాటటానికి వీలులేని అపరిమితమైనటువంటి దేహ దారుఢ్యానికి శక్తికి భీముడు సంకేతం కానీ ఆయనలో కూడా ఒక పూర్ణ విచక్షణ ఉన్నది ఎందుకని తన జ్యేష్టుడు అయినటువంటి ధర్మరాజు యొక్క సాంగత్యం చేత ఇక అర్జునుడా ఆయన దుర్జనుల పాలిటి పలుగుణుడు ఆయన ఎవడు ప్రపంచానికి హితము గాని పని చేస్తాడో అర్జునుడి చేతిలో వాడికి సంహారం జరగవలసిందే కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని తన యొక్క భావమరిదిగా ఎంచుకున్నాడు స్నేహితుడిగా ఎంచుకున్నాడు విషయం చెప్పటానికి ఇంకో రెండు విషయాలు ఉన్నాయి ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు పంచపాండవులు కదా ద్రౌపది కూడా ఆరవ భాగం కదా ఇటువంటి అన్ని శాస్త్రాలు తెలిసిన ద్రౌపదికి కూడా భగవద్గీత చెప్పచ్చు కదా అంటే అర్జునుడికే ఎందుకు చెప్పాలి అంటే ఒక లౌక్యమైనటువంటి విశేషణం ఉన్నది యుద్ధం జరుగుతుంది ధర్మం జయిస్తుంది రాజ్యం వస్తుంది ధర్మరాజు పెద్దవాడు గనుక ఆయన రాజు అయి తీరుతాడు అర్జునుడు కాడు అవకాశం లేదు ధర్మరాజే అవుతాడు గనుక భీముడికి గాని నకుల సహదేవులకు గాని కాదు అంటే రాజ్యం వచ్చిన రాజయ్యే వాడు ఎవడయ్యా అంటే ధర్మరాజే మరి అర్జునుడు ఏం కావాలి అని యుద్ధం చేసేవాడు అవుతాడు ఆయన అడుగుతాడు ఇన్ని విషయాలు నువ్వు చెప్పావు కదా నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు ద్రౌపదికి అసలు ప్రశ్నే లేదు శ్రీ కృష్ణ పరమాత్మ నిర్దేశించిన ధర్మాన్ని తన పాతివ్రత్య ధర్మంతో తన నిత్య జీవితంతో ఆమె ఆచరించినటువంటిది గనుక కృష్ణుడు యన్ ముందు ఆమెకు ప్రశ్నలు లేవు అర్జునుడు మాత్రం అడిగాడు మరి యుద్ధం అవుతుంది రాజుని కానంటున్నావు మాటలన్నీ విన్నాను నేను పూర్తి భగవద్గీత విన్నాను ఇప్పుడు నేను ఏం కావాలి అని అడిగాడు యోగైర్భవతి అర్జునా అన్నాడు నువ్వు యోగివి కా అన్నాడు నువ్వు రాజువి కాలేవు భోగివి కాలేవు భోగం ఎవరికంటే ధర్మరాజుకి యోగం నీకు నీకెందుకో తెలుసునా నువ్వు నాతో ఉన్నావు గనుక ధర్మరాజు నాతో ఉన్నాడు గనుక వాడికి భోగం ఇచ్చా వాడిని కాపాడటం కోసం భీముడిని ఇచ్చా నకుల సహదేవులను ఇచ్చా నువ్వు మాత్రం యోగివి కా అనగానే అర్జునుడే అడిగాడు నువ్వు ఎప్పుడు యోగివైనావు అని అడిగాడు నన్ను అంటున్నావు నువ్వు అయినావా అన్నాడు సతతం యోగినః నేను అసలు ఎప్పుడూ యోగినే నీకు అప్పుడప్పుడు అట్లా కనిపించాను గాని అన్నివేళలా నేను యోగినేని అన్నాడు విచారణ ఎందుకంటే విశేష్ విశ్లేషణ పంచపాండవులందరూ కృష్ణుడిని కొలిచిన ఎత్తు ఒక ఎత్తు ద్రౌపది ధర్మశాస్త్రం ప్రకారం శాస్త్రాల ప్రకారం జీవితం ప్రకారం అనుభవాల ప్రకారం అనుభూతి ప్రకారం భక్తి ప్రకారం శరణాగతి ప్రకారం సమర్పణ ప్రకారం వినయం ప్రకారం బంధుత్వం ప్రకారం అన్నింటి కారణాల వలన ఇవన్నీ మా కృష్ణయ్య కి అప్పజెప్తే చాలు నాకేం భయం లేదు ఇవాళ ధర్మమా అధర్మమా శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయిస్తాడు అన్నది కాబట్టి ధర్మ వివేచన ధర్మ విశ్లేషణ ధర్మ ఆచరణ ధర్మ సంకల్పాలు ఇవన్నీ కూడా ద్రౌపదిని ధర్మ వేదిని చేసినాయి ధర్మం ఎరక్కపోయినట్లయితే కర్మలు అనుభవించవలసిందే కానీ ద్రౌపది అంటే కృష్ణ నామంతో ఉన్నటువంటి ద్రౌపది కష్టాలన్నింటినీ కూడా కర్మనిష్ఠగా అనుభవించింది అయ్యో నాకే వచ్చినయే ఐదుగురు భర్తలున్నారే అటు నా కృష్ణుడు నా అన్నే నే ద్రుపదరాజ పుత్రికనే ఇవేమీ అనుకోలే కష్టం జన్మలో నేను ఇది అనుభవిస్తున్నాను అంటే ఇది నాకు భగవంతుడు ఇచ్చిన కర్మనిష్ఠ దీనిని దాటాలి అంటే నా శక్తి చాలకపోతే పరమాత్మ యొక్క శక్తి కోసం నేను పాటుపడాలి దానికోసం పరమాత్మను నేను పొందాలి పరమాత్మను పొందటానికి నతుల చేత నుతుల చేత స్తుతుల చేత గీతికాల చేత ఆయన దొరకడు గనుక శరణాగతి చేత సమర్పణ చేత పరిపూర్ణ విశ్వాసం చేత నేను పొందాలి గనుక పరమాత్మను లోపలే పెట్టుకున్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరిగా సహోదరిగా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించింది ఐదుగురు గాంధర్వ స్వరూపులైనటువంటి భర్తలు వారు మామూలు వారు కాదని ఆమెకు తెలుసు అందుకనే గిరివాణాకృతులు ఎవరిప్పుడు నిను వేసం పెట్టి ప్రాణము మానమున్ అని కీచకుడికి చెప్పింది వాళ్ళు వస్తారు ఐదుగురు భర్తలు నేను ఒక ఒకరికి ఇల్లాలిని కాదు ఐదుగురికి ఇల్లాలిని వాళ్ళు గాంధర్వ స్వరూపులు వచ్చారంటే నీ యొక్క సంహారం జరుగుతుంది జాగ్రత్త అని హెచ్చరించింది ఎక్కడా తొట్రుపాటు పడకుండా ఎక్కడా నిబ్బరం కోల్పోకుండా ఒక నిశ్చలమైనటువంటి మనసుతో పతివ్రతా ధర్మాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ అన్నింటికంటే స్వామి ద్రౌపది పాత్రలో ఆయన ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని కారణం ఏంటంటే ఆయనా కృష్ణుడే కదా ద్రౌపది యొక్క మనస్సు ఒక వ్యాసుడికి ఏం తెలుసు స్వామికి తెలుసు అందుకనే అన్నారు ఉన్నదానిలో తృప్తి చెంది అందుకే స్వామి అంటారు చూడండి ప్రపంచంలో స్త్రీకైనా పురుషుడికైనా కావలసింది చారిటీయే కానీ వ్యానిటీ కాదు బంగారు అన్నారు చారిటీ అంటే త్యాగం ఉండాలి చారిటీ ఒక దానం ఉండాలి పవిత్రత ఉండాలి సౌశీల్యం ఉండాలి అంతేగాని ప్రదర్శన కాదు అన్నారు ప్రదర్శన ఎప్పుడూ కూడా తుడిచిపెట్టుకు పోయేదే కాల గర్భంలో కలిసిపోయేదే అది ఆత్మవంచన అది జగద్వంచన కనుక ఇన్ని కారణాల వలన ఒక క్షమాగుణాన్ని ఒక సహనాన్ని ఒక నిశ్చలత్వాన్ని నిర్మల భక్తి పారమ్యాన్ని పరమాత్మ యందు తనకున్నటువంటి బాంధవ్యాన్ని కూడా అన్నివేళలా గుర్తు పెట్టుకుంటూ పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ భర్తలకు కావలసినటువంటి ఆనందాన్ని కావలసినటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఒక వెన్నుదన్నుగా నిలబడి మహాభారతం మొత్తం ద్వాపర యుగంలో పరమాద్భుతంగా నడిపించినటువంటి ద్రౌపది నిజానికి ధర్మవేది ఆమెను జాగ్రత్తగా అనేక కోణాలలో పరిశీలించినట్లయితే ఆమె కూడా అగ్నిపుత్రి అగ్నిపుత్రి అంటే జ్ఞానపుత్రిక అని అర్థం జ్ఞానంలో నుంచి వచ్చింది ఆమె జ్ఞానమే జ్ఞానం ప్రకారమే ఆమె జీవితం నడిచింది ఎక్కడా రకమైనటువంటి దానికి లొంగకుండా పరిపూర్ణ వైభవంతో నడిపినటువంటి ద్రౌపది ఇవాళ మనకి అనేక రకాలుగా ఒక ఆనంద తారక స్థితిని అనుగ్రహ వరదానం చేసింది అటువంటి ద్రౌపదిని మనం ఇవాళ తలుచుకున్నాంద్రౌపది అంటే ఈవేళ సాహిత్యంలో అనేక వికృత అర్థాలు ఏర్పడ్డాయి. వాటిని మన దాకా రానివ్వకూడదు. భారతం చదవాలి. ఎందుకంటే ద్రౌపదే శాంతి పర్వంలో భీష్ములవారు అంపశయ్య మీద పడుకొని అనేకమైనటువంటి విషయాలు చెప్తూ, ప్రధానంగా విష్ణు సహస్రనామం గురించి చెప్తూ ఉన్నప్పుడు అందరూ శ్రద్ధగా వింటుంటే ద్రౌపది నవ్వింది. నవ్వింది. ఆమె ఎప్పుడైనా సరే ఒక నవ్వు ద్వారా ఒక నిరసన ప్రదర్శిస్తుంది. ఆగ్రహంతో ఊగిపోతూ కాదు. "తల్లీ! ఎందుకు నవ్వుతున్నావు?" అని అడిగాడు భీష్ముడు. "ఏం లేదు. ఇంత బోధ గనక తొలినాళ్లలోనే చేసి ఉంటే మా కౌరవులంతా మిగిలి ఉండేవారు కదా! యుద్ధమే జరిగేది కాదు కదా! విష్ణు భక్తి, విష్ణు పారమ్యం, విష్ణు నామ సహస్రనామం యొక్క విశిష్టత పెద్దవారుగా మీరు ఆనాడే చెప్పి ఉన్నట్లయితే ఎంత బాగుండేది. ఇది సమయమా?" అన్నది. అంటే ఆయన అన్నాడు. "ఆ యోగం రావాలి, సమయం రావాలి. వచ్చేదాకా కాచుకుని ఉండాలమ్మా. ఏం చేయను నేను? ఇదిగో దుర్యోధనుడు పెట్టిన అన్నం చేత, వాడు ఇచ్చినటువంటి ఉప్పు చేత నా శరీరం అంతా కలుషితం అయిపోయింది. అంపశయ్య మీద పడుకున్నందువలన రక్తమంతా దారులు కట్టి పోయింది. మిగిలినటువంటి సత్వగుణ ప్రధానము, శ్రీకృష్ణ సన్నిధానము, మీవంటి ధర్మమూర్తులందరూ నా చుట్టూ ఉన్నందువలన, సత్సాంగత్యం వలన సత్సంగ భావాలు నాలో కలిగినయి. అందువల్ల నేను విష్ణు సహస్రనామం చెప్పానమ్మా" అన్నాడాయన. అంటే విష్ణు సహస్రనామానికి సాక్షి ఎవరు అంటే మన ద్రౌపది. అంతే కాదు, ఆమె ప్రశ్న వేసింది. "ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు?" అన్నదానికి. కాబట్టి ద్రౌపదిని మనం అన్నివేళలా స్మరిద్దాం. ద్రౌపది నేర్పినటువంటి దయా ధర్మ, కారుణ్య విశేషాలని, క్షమని ఆధునిక స్త్రీలు ప్రధానంగా ఎక్కడా సహనం కోల్పోవద్దు. నిబ్బరాన్ని కోల్పోవద్దు. నిశ్చల మనస్కులై ఉండండి. మనోరోగాలు, మనోజర్జల నుంచి బయటపడండి. ఎప్పుడైనా జీవితంలో కష్టం ఏర్పడినప్పుడు పరమాత్మ వైపు చూడండి. పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. ఒక ద్రౌపది పంచభర్తలు అంటే ఐదుగురు భర్తలను మాత్రమే కాదని, పంచప్రాణములు నీ భర్తలోనే పంచప్రాణాలు ఉన్నాయని, నీ భర్తను మించినటువంటి దైవం లేదని స్వామి పదే పదే చెప్పినట్లుగా భావాన్ని చక్కగా అందిపుచ్చుకొని పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా మహాభారతంలో ద్రౌపదిని పరమ విశిష్ట రీతిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానిని ద్రౌపది అంటే శ్రీకృష్ణ చైతన్యానికి స్త్రీ స్వరూపంగా భావిస్తూ ఆమె ధర్మవేది అని చక్కగా అర్థం చేసుకుంటూ ద్రౌపది ప్రాతఃస్మరణీయమైనటువంటి మహా పతివ్రతగా సంభావిస్తూ అన్నివేళలా పరమ తృప్తిగా జీవించాలని భావిస్తూ సాయిరాం.
SSSMC · audio

Talk on the character of Draupadi

Home

Talk on the character of Draupadi

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 33:40

More in this series

Talks

14 episodes · 6 hr 52 min

  1. 24 min 1

    Talk on significance of festival of Sankranthi

  2. 52 min 2

    Talk - on Guru Tatwam

  3. 40 min 3

    Talk - Koti Samithi Hyd

  4. 28 min 4

    Talk - Bharata

  5. 23 min 5

    Talk on Dasara

  6. 6 min 6

    Talk on Rathasaptami

  7. 32 min 7

    Talk on Sri Sathya Sai - Part 05

  8. 33 min 8

    Talk on the character of Draupadi

    Now playing
  9. 30 min 9

    Talk on Gyana Yoga

  10. 29 min 10

    Talk on Hanuman Panchamukham

  11. 23 min 11

    Talk on Leela Kaivalya Vahini

  12. 35 min 12

    Talk on Sathya Sai Sukthamulu

  13. 24 min 13

    Talk on yoga Triveni

  14. 26 min 14

    Talk on the occasion of Avatar Declaration day