No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం మే మహా పరిపూర్ణావతారి భగవాన్ సత్య సాయిబాబా వారు పాంచభౌతిక దేహాన్ని ధరించి అవనీ సంచారానికి వచ్చి ఎనభై నాలుగు సంవత్సరాలు. ఇది ఒక పుణ్యకాలం ఇది ఒక యోగ కాలం ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మే గురు స్వరూపంగా రావటం అరుదైన సన్నివేశం గురువుగానే కాదు ఆచార్యవర్యులుగా కూడా స్వామి వచ్చారు ఆచార్యుడు అంటే తాను ఏది బోధించాడో దానిని ఆచరించి చూపించిన వాడు ఆచార్యుడు గనుక ఎనభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వామి అవతార వైభవాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసినట్లయితే పరమాత్మ ఈ ప్రపంచానికి చేయనిదే ఉన్నదీ ఎంత చేశారు ఎంత చేశారు అబ్బుర పడిపోతాం ఆశ్చర్యపడిపోతాం అయితే భగవాన్ చేసిన దానిలో నుంచి వారు చేశారే అని ఆశ్చర్యపడేకంటే వారు చేసినట్లుగా మనం ఏం చేయాలి అని ప్రశ్న వేసుకోవటానికి ఇది ఒక గొప్ప సందర్భం కాబట్టి స్వామి యొక్క అవతార వైభవాన్ని తత్వాన్ని స్వామి యొక్క ఆ అవతార పరిపూర్ణతని సమగ్రంగా విచారణ చేద్దాం భగవాన్ సత్య సాయి పాంచభౌతిక దేహాన్ని ధరించి ఎనభై నాలుగు సంవత్సరాలు సర్వ జగత్తుని అధ్యాత్మ మార్గంలో నడిపించినటువంటి ఒక అత్యద్భుతమైన రమణీయమైనటువంటి సన్నివేశం ఆధ్యాత్మిక చరిత్రలో కృతయుగం నాటి సత్యము త్రేతాయుగం నాటి ధర్మము ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమ కలియుగంలో ఉన్న అహింస సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా స్వరూపంగా భగవాన్ సత్య సాయి ఈ జగత్తులోకి వచ్చారు. ఒక్కొక్క అవతారి ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా తన అవతార పరమార్ధాన్ని కొనసాగిస్తూ అవతార వైభవాన్ని జగజ్జేగీయంగా వెలిగిస్తూ అప్రతిహతంగా సాగిపోయే ఒక ఆధ్యాత్మికమైన మధురానుభూతి ఇది. ఈరోజున కొంత భగవాన్ సత్య సాయి ఈ జగత్తుకి ఏం చేశారు? ఎందుకని సర్వ దేశాలు సర్వ సృష్టి పరమాత్మ సాయి యొక్క దివ్య పాదాల దగ్గరకు చేరుకోవాలని పరమాత్మ సాయి భావనలో పరవశించాలని పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ప్రేమని కరుణని తదనుభూతంగా చేసుకొని దివ్యమైనటువంటి ఒక జీవన విధానానికి శ్రీకారం చుట్టాలని తహతహలాడుతున్నదో మనందరం కూడా స్థాలీపులాక న్యాయంగా కొంత విచారణ చేయాలి. ఏ అవతారి అయినా ఈ జగత్తులోకి వచ్చినప్పుడు తనలోని దివ్యత్వాన్ని జగత్తుకి ప్రకటన చేయటానికి ఆయన ముందు ఎంచుకునేది లీల. లీల, మహిమ, అనుగ్రహము అనేక పదాలుగా మనకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నా నిజానికి స్థూల సూక్ష్మ విచారణ గనక చేసినట్లయితే ఆ మూడు ఒక్కటే. శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు నిజానికి ఆయన తొలినాళ్లలో చేసినటువంటి దివ్యమైనటువంటి లీల అహల్య శాపవిమోచనం. అపురూపమైనటువంటి మహిమ శివధనుర్భంగ సన్నివేశం. అనుగ్రహం సర్వ సృష్టిలో ఉన్నటువంటి దౌష్ట్యాన్ని కాలుష్యాన్ని నివారణ చేసి అహంకరించి మదోన్మత్తులైన వారందరినీ అణచి ధర్మసంస్థాపన చేసి ధర్మానుగ్రహంగా, ధర్మ నిగ్రహంగా, ధర్మ విగ్రహంగా సాగింది రామావతారం. అయితే రాముడు మాయా మానుష వేషధారి. మానవుడిగా ఉండటానికి మానవుడికి పరిమితమైనటువంటి కొన్ని విధానాలకు లోబడి ప్రకృతికి లోబడి సంచారం చేయాలని నిర్ణయించుకొని వచ్చిన కారణంగా రామావతారం అంతా మాయా మానుష వేషం. సామాన్య మానవుడి వలె పొందాడు, పోగొట్టుకున్నాడు, విలపించాడు, ఆశీర్వదించాడు, రక్షించాడు, శిక్షించాడు. అనేక రకాలుగా సామాన్య మానవుడి యొక్క జీవనం ఎట్లా ఉన్నదో రామాయణం అంతా అట్లా సాగింది. కానీ ఎక్కడా ధర్మ విరుద్ధమైనటువంటి ఆలోచన కానీ, ధర్మ విరుద్ధమైనటువంటి చర్య కానీ, ధర్మ విరుద్ధమైనటువంటి ఏ సన్నివేశము లేకుండా త్రేతాయుగంలో శ్రీమద్ రామాయణం అంతా కూడా అంటే రామ కథ అంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఒక యోగ స్థితిలో సంచారం చేసింది. అయితే కాలానుగుణంగా యుగ ప్రభావం చేత ద్వాపర యుగంలో అదే చైతన్యం శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు బాలకృష్ణుడైనాడు, యవ్వన కృష్ణుడైనాడు, ప్రౌఢ కృష్ణుడైనాడు, యోగీశ్వర కృష్ణుడైనాడు. రాబోయే కలియుగానికి లీలా మానుష విగ్రహ స్వరూపంగా యోగీశ్వర స్వరూపంగా భగవద్గీతని ఉపదేశనం చేశాడు. అంటే రామాయణంలో ఉన్నటువంటి రాముడంతా మాయా మానుష విగ్రహం అయితే కృష్ణావతారం అంతా కూడా లీలా మానుష విగ్రహం. లీల అంటే లీనం చేసుకొని లయం చేయటం. ఏ రకంగా? తనలో లీనం చేసుకొని సర్వ జగత్తుని లయం చేసుకునేటటువంటి ఒక విధానం ఇది. లీల నిజానికి ఒక విభూతి. మరి మహిమ అంటే అది ఒక స్థితి. సామాన్య మానవుడు బయట నుంచి చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మహిమలుగా, అసంబద్ధంగా, అసహేతుకంగా, అర్థం కానట్లుగా మానవుడి యొక్క మేధ అందుకోలేనంత స్థితిలో ఉన్న కారణంగా ఇది నమ్మదగినదేనా అని ప్రశ్న వేసుకొని జవాబు దొరికేదాకా అవిశ్రాంతంగా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యం నుంచిచిట్టచివరి మహాభినిష్క్రమణం వరకు సాగిందంతా లీలాకాండే. అయితే ఈ లీల ఎందుకు చేయాలి? ధర్మవర్తనులైనటువంటి మానవుడికి లీల అక్కరలేదు. అధర్మ ప్రవర్తనులైనటువంటి జీవుడికి పరమాత్మ తన యొక్క శక్తిని, తనలో ఉన్నటువంటి సమస్త శక్తులని పరిచయం చేయటానికి ఇదిగో పరమేశ్వరుడు దేనినైనా సృష్టించగలడు, దేనినైనా లయం చేయగలడు. కానీ రాముడైనా, కృష్ణుడైనా మరి ఎవరైనా మానవ దేహాన్ని మాత్రమే తీసుకొని ఈ జగత్తులోకి రావాలి. ఎందుకంటే అన్ని జన్మలలోనూ ఉత్తమోత్తమమైనటువంటి జన్మ, ఉత్కృష్టమైన జన్మ, సమున్నతమైనటువంటి జన్మ మానవ జన్మ కనుక. అంతేకాదు, మానవ జన్మలోనే అనేకమైనటువంటి పరమార్థాలు సాధించుకోగలడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమంతా లీలా వైభవంగా సాగింది. ద్వాపర ముగిసింది, కలియుగం ప్రారంభమైంది. కలియుగంలో ప్రధానంగా దత్తావతారాలలో ప్రప్రథమ పూర్ణ దత్తావతారం షిరిడి బాబా. ఆ తర్వాత భగవాన్ సత్యసాయి. ఈ రోజున ఏ పరమ పురుషుని గురించి మనమందరం కూర్చొని విచారణ చేస్తున్నామో, ఆ పరమ పురుషుడి యొక్క ప్రాదుర్భావమంతా నాలుగు యుగాల సమ్మేళనంగా ఒకటిగా రూపొంది ఇక్కడికి వచ్చింది. రూపొందింది కానీ భౌతికమైనటువంటి దేహంలోనే ఉన్నది. అయితే దీనిలో విచారణ చేసినప్పుడు భగవాన్ సత్యసాయి జీవితమంతా ఈ క్షణం వరకు మహిమాకాండగానే సాగలేదు. లీలాకాండగా సాగింది, మహిమాకాండగా సాగింది, సామాజిక చైతన్య స్ఫూర్తిగా సాగింది. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలు, దానిని శాసిస్తున్న, దానిలో జీవిస్తున్నటువంటి అనేకమంది జీవుల యొక్క డొల్లతనాలు కోకొల్లలుగా ఉన్నప్పుడు వీటన్నింటినీ ఒక సమస్థానంలో తీసుకురావటానికి పరమాత్మ యందు నిరంతరమైనటువంటి ఒక అనురక్తి, ఒక ఆరాధన కలగటానికి, పరమాత్మ శక్తి యందు ఒక విశ్వాసం కలగటానికి ఎనభై నాలుగు సంవత్సరాల భగవాన్ సత్యసాయి అధ్యాత్మ చరిత్ర ఒక నిలువుటద్దం. ఏం చేశారు బాబా? మహిమ చూపించారు. తన ఆవరణంలోకి సాధకుడైన వాణ్ని, యోగ్యుడైనటువంటి వాణ్ని, పరిపక్వతకు సిద్ధంగా ఉన్న వాణ్ని, శుద్ధుడైనటువంటి వాణ్ని కేవలము మహిమ ద్వారా ఆకర్షించారు. ఆకర్షించి, అశాంతము మహిమలే చేయలేదు. అశాంతము లీలలే చేయలేదు. ఒక్కొక్క వ్యక్తిలో, ఒక్కొక్క సాధకుడిలో లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలన్నింటినీ సమసింపజేసి జ్ఞానము చేత, యోగము చేత, భావన చేత, భక్తి చేత, సేవ చేత, ప్రేమ చేత, శాంతి చేత మానవుడు ఎంత దివ్యుడో, ఎంత పూర్ణుడో, ఎంత వైభవంగా ఈ జీవితాన్ని కొనసాగించవచ్చునో పరమాత్మ సాయి ఇన్నాళ్లుగా మనకు బోధిస్తూ వచ్చారు. అయితే పరమాత్మ సాయి అన్ని అవతారాల కంటే ప్రత్యేకమైనది, విశిష్టమైనది, భిన్నమైనది, చిత్రాతిచిత్రమైనటువంటి అవతారం ఇది. ఎందుకని ఇది చిత్రమైనదంటే చిత్రావతి నదీ తీరంలో అది వచ్చింది కనుక ఒకటి. చిత్రవిచిత్రమైనటువంటి రీతులలో బోధనాకృతి సాగించింది కనుక. అంతేకాదు, మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లటానికి, తన లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాలను జయించటానికి, తనలో ఉన్నటువంటి షడైశ్వర్య సంపదని అంతా కూడా సంపత్తిని సాధనామయం చేసుకొని ఒక శక్తివంతమైనటువంటి దివ్య స్వరూపుడుగా వెలిగిపోవటానికి గలిగినటువంటి అన్ని మార్గాలని ధర్మబద్ధంగా తెరచి పరచి ఈ జగత్తుకి ఆవిష్కృతం చేశారు స్వామి. అంతేకాదు, వేదాలలోని సారము, ఉపనిషత్ సారము, ప్రస్థానత్రయము, పద్దెనిమిది పురాణాలలో ఉన్నటువంటి సారమంతా సారభూతం చేసి మానవుడికి సేవ, ప్రేమ అనేటివి రెండు సాధనా యోగాలని, సాధనా మార్గాలని బాబా ప్రతిపాదన చేశారు. ఇందులో ప్రధానంగా షడైశ్వర్యాలు చాలా ఉత్తమోత్తమమైనవి. ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, ధర్మంతో కూడిన అర్థం ఉండాలి, కీర్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, సంపద ఉండాలి. ఈ ఆరు ఐశ్వర్యాలు మానవుడు ఎప్పుడైతే తనలోనే ఉన్నాయి వాటిని బహిర్గతం కనుక చేసి, సమాజహితం కనుక చేసినట్లయితే అధో జగత్ సహోదరులందరికీ ఆర్థిక, పారమార్థిక స్థితులలో పరమార్థంలో నుంచి యదార్థంలోకి ఒక ప్రస్థానం చేయటానికి అనువైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికని, ఒక కురుక్షేత్రాన్ని, ఒక కర్మక్షేత్రాన్ని, ఒక ధర్మక్షేత్రాన్ని పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా భగవాన్ తీర్చిదిద్దారు. చాలా ఉత్తమోత్తమమైనటువంటి, సనూతనమైన, సనాతనమైనటువంటి వేదిక పుట్టపర్తి. అక్కడ అధిష్ఠాన దైవము పూర్ణ పురుషుడైనటువంటి భగవాన్ సత్యసాయి. వారు మానవుడు తనను తాను పోగొట్టుకోకుండా, తనను తాను నిర్మించుకుంటూ, అనుక్షణము పునర్నిర్మాణం చేసుకుంటూ, సర్వ జగత్తుకి ఎంత సహాయకారిగా ఉండవచ్చునో, సర్వ జగత్తులో ధర్మబద్ధాన్ని ఎట్లా ప్రతిపాదించవచ్చునో, ఏ రకంగా మానవుడు ఉత్తీర్ణుడి కావచ్చునో అనేక రకాలుగా, అనేక పాయలుగా, అనేక రీతులలో, అనేక స్థాయిలలో విచారణ చేస్తూ, బోధిస్తూ, మానవుణ్ణి ఆ దారిలో నడిపిస్తూ, ధర్మవర్తనులైనటువంటి ఒక జీవన విధానాన్ని కేవలము ఆంధ్రదేశానికి, ఆపై కేవలము భారతదేశానికే కాక సుమారు నూట ఎనభై దేశాలలో ఈ దివ్య ప్రభాసంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రాచబాటను నిర్మాణం చేశారు బాబా. ఏ సగటు మానవుడి జీవితంలోనైనా ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక లెక్కలో ఉన్నటువంటిది కాదు. ఎందుకంటే అరవై ఎనిమిది సంవత్సరాలు, ఎనభై సంవత్సరాలు జీవించిన సామాన్య సాధారణ మానవుడు ఎవరూ చేయలేనన్నటువంటి అత్యుత్తమమైనటువంటి పనులు, అన్నీ సమాజహితమైనటువంటి పనులు స్వామి చేసినందువలననే పరిపూర్ణమైనటువంటి శాంతిధామంగా సర్వ సృష్టిని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఈరోజు నూట ఎనభై దేశాలలో ఉన్న భక్తులే కాదు, నూట ఎనభై దేశాలలో ఉన్న మేధావులు, చదువుకున్నవారు, చదువులేనివారు సమస్తమైనటువంటి జీవరాశులు కూడా భగవాన్ సత్యసాయి యొక్క దివ్య పాదముల దగ్గరకు రావటానికి ఒక పూర్ణ ప్రయత్నం చేసేటువంటి ఒక మహా సంబంగల వేళ ఇది. ఇది ఒక యోగ కాలం.ఇది ఒక యాగకాలం ఎందుకంటే ఆగం పోతే గానీ యాగం రాదు. ఆగ యాగాలు పోతే తప్ప యోగం రాదు. అందుకనే ప్రధానంగా ఒక్కొక అవతారం ఒక్కొక అంశం తీసుకుని వస్తే భగవాన్ సత్యసాయి విభూతి యోగాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. పరమమూ చరమమూ అయినటువంటి ఒక విభూతిని ఈ సర్వ సృష్టికి ఇవ్వటానికి పరమేశ్వరుడు అయినటువంటి సాయి సంకల్పం చేశారు. ఏమిటి ఈ వి-విభూతి? ఆర్తులకు ఇది రక్షణ. శారీరకమైనటువంటి రోగం ఉన్నట్లయితే దాని నుంచి కాపాడేటువంటి ఒకానొక శక్తివంతమైనటువంటి సాధన. దేహ రోగానికి జాజ్యానికి సంబంధించి ఉంది ఒక ఎత్తయితే భవ రోగానికి సంబంధించింది మరొక ఎత్తు. మళ్ళీ జన్మరానటువంటి ఒకానొక విభూతి స్థాయికి సాధకుణ్ణి చేరుకోవాలని పదే పదే బాబా విభూతి సృష్టి చేయటం విభూతి ఇవ్వటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. అయితే సామాన్య మానవుడు కేవలము శాస్త్ర విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవాడు హేతుబద్ధంగా తనదైనటువంటి మనసుతో ఆలోచించేటువంటి వాడికి ఇది అర్థం కాదు. ఎందుకంటే విజ్ఞాని అయినటువంటి వాడు శాస్త్ర జ్ఞానాన్ని పెడగా జ్ఞానాన్ని పరంగా చూస్తాడు. ఈ రెండింటిని సమన్వయించేయమంటున్నారు బాబా. విజ్ఞానమూ జ్ఞానమూ రెండుగా కనిపిస్తున్నటువంటి విభూతి రేఖలే. ఈ విభూతి రేఖల రెండింటిని సమన్వయం చేసినప్పుడు సైన్స్ ద్వారా spirituality ని spirituality ద్వారా సైన్స్ ని రెండూ సమన్వయం గనక చేయగలిగితే మానవ జీవితంలో శాంతి దానంతట అదే నెలకొంటుంది అనేది స్వామి ఈ జగత్తుకి ప్రతిపాదించినటువంటి ఒక వినూత్న స్థితి. అయితే ఎలా సాధించారు దీన్ని? ఈ విభూతి అంటే ఏమిటి? ఇది పరమార్థం. మానవ జీవితానికి కొలికి పూసా పరమార్థము ఏది అంటే తన్ను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళటమే. నేను దేహాన్ని మాత్రమే కాదు నేను ఆత్మనన్న భావనలో నిలకడ చెందటమే పరమార్థం గనక బాబా అందరికీ అనుగ్రహించేటువంటి విభూతి పరమార్థము. పూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం వైపు నడిపించేది. ఏ వస్తువైనా నిరంతరమూ పరిణామశీలంగా ఉంటుంది, పరిణామ సహంగా ఉంటుంది, మార్పు చెంది చెంది మరణిస్తుంది. ఇక మళ్ళీ మార్పు చెంది పునః రావటానికి వీలు లేని ఒకానొక విభూతి స్థాయికి వెళ్ళమంటున్నారు. అంటే జన్మ రాహిత్యాన్ని ఇప్పుడే ఇక్కడే సాధించుకోమంటున్నారు. అంతే కాదు దీనిలో అనేక కర్మలన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోగా మిగిలినటువంటిది ఒట్టిది ఊధి అయినట్లయితే విభుడు ఇచ్చాడు గనక అది విభూధి అయింది. విభూతి ఎందుకైనది అంటే అది ఎ-ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి రాని మరలి రానటువంటి ఒక జన్మ స్థితి గనక విభూతిని పరమాత్మ ఈ జగత్తుకి అందించారు. దీనిలో అణిమాది సిద్ధులు దానినిండా దాగి ఉన్నాయి. విభూతి నిండా అణిమా, లఘిమా, గరిమా, మహిమా, ప్రాప్తి, ప్రాకామ్య, వశీ, ఆ తర్వాత కైవల్య సిద్ధి. మానవుడు ఎక్కడ ప్రారంభించాడో చిట్టచివరికి కైవల్యం పొందాలి. కైవల్యము అంటే వైకల్యం లేనటువంటి స్థితి. వాసనా రాహిత్యంతో కూడినటువంటి జీవుడు ఎక్కడ నుంచి ప్రారంభమైనాడో ఒక మహిమతో ప్రారంభమై ఒక్క లీలతో ఆకర్షితుడై మహిమతో లీలతో ప్రభావితుడై సుసంపన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భూమికని సంతరించుకొని తన జీవన విధానాన్ని తానే నిర్మాణం చేసుకొని తనను తాను సంస్కరించుకుంటూ తన తోటి వారందరినీ సంస్కరించుకుంటూ వెళ్ళి నేను స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మాత్రమే కాదు మనోబుద్ధి చిత్ అహంకారములు మాత్రమే కాదు నేను కూడా అమృతస్య పుత్రాహ అమర లోకం నుంచి పరమాత్మ వలె ఈ జగత్తులోకి నేను వచ్చాను. నేను వచ్చి ఏం చేస్తున్నాను? అన్ని శబ్దాలు పుట్టె నిశ్శబ్దమందు అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితమ్ము. నారాయణుడిని అన్వేషించటానికి ఉత్తమోత్తమమైనటువంటి ఈ జీవితాన్ని నేను పొందాను గనుక ఆ నారాయణున్ని బయట వెతికి వెతికి ఎక్కడా దొరక్క చిట్టచివరకు మనసుని స్థిమిత పరచుకొని లీనం చేసుకొని లయం చేసుకొని లీలా మాత్రంగా గనక జీవన విధానం గనక సాగించినట్లయితే ఆ పరమాత్మ లోపలే ఉన్నాడన్న భావన కలగటమే కైవల్యం. ఇక్కడ ఉండగానే మోహము క్షయమైతే అది మోక్షం అవుతున్నది. అంతేగాని మోక్షం మరణానంతర స్థితి కాదు. మానవుడు జీవించి ఉండగానే ఆనంద స్వరూపుడుగా, శాంత స్వభావుడుగా, పరమోత్కృష్టమైన జీవన విధానం సాగించేటువంటి ఒక ద్రష్టగా, ఒక యోగిగా తన జీవితాన్ని తాను కొనసాగించాలి. పరమాత్మ సాయి ఈ లీలా కైవల్య విభూతిలో ఈ విభూతిని కేవలము సంకేతంగా ఇస్తున్నారు. అంతే కాదు ఆది వ్యాధులు, బాధలు, మానసిక వ్యాధులు అనేక వాటికి ఇది సమాధానమై మన ముందు అనేకమైనటువంటి సన్నివేశాలున్నాయి, అనేక సందర్భాలున్నాయి. అన్ని సందర్భాలలోనూ సత్యం మాత్రం ఒక్కటే. పరమేశ్వరుడు విభూతి ద్వారా నీకు ఆయుష్షుని, ఆరోగ్యాన్ని ఇచ్చాడా? దానిని దేనికై వాడుకోబోతున్నావ్? మళ్ళీ ప్రాపంచికమైన సంపాదన కోసమా? కాదు, కాదు. నిన్ను నీవు ఉద్ధరించుకునేటువంటి, నిన్ను నీవు ఎరిగేటువంటి, నిన్ను నీవు తెలుసుకునేటువంటి, నిన్ను నీవు చూసుకోగలిగినటువంటి పూర్ణ అద్వైత సాధనలోకి ప్రయాణం చేయటానికే ఈ విభూతి మంత్రాన్ని, ఈ విభూతి పదార్థాన్ని పరమాత్మ పారమార్థికంగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఆత్మను ఎరగాలి, లీలను అనుభవించాలి, మహిమను ఆనందించాలి. కానీ ఈ అన్నీ కలిసి అనుగ్రహం వైపు దారి తీయాలి. అనుగ్రహం ఎవరిస్తారు? ఇచ్చేది కాదు. అనుగ్రహానికి అర్హతను సంపాదించాలి. మానవుడు మనిషి, మనీషి కావాలి. మనీషి ఋషి కావాలి, ఋషి మహర్షి కావాలి, మహర్షి బ్రహ్మర్షి కావాలి. అంటే సర్వ జగత్తు బ్రహ్మీమయమై బ్రహ్మము కంటే అన్యమైన మరొక్క వస్తువు లేదని సమస్త బ్రహ్మీమయమైనటువంటి ఈ జగత్తులో నేను కూడా బ్రహ్మమునే అనేటువంటి స్థాయికి రమ్మంటున్నారు భ-భగవాన్ బాబా. అందుకే త్వమేవాహం న సంశయః నువ్వు నీకూ నాకూ తేడా లేదన్న దానిని ఆధునిక మానవుడు అర్థమయ్యే రీతిలో చేసుకోగలిగిన రీతిలో అనుభవించవలసినటువంటి రీతిలో You are me, I am you అంటున్నారు బాబా.నీలోనూ దేవుడున్నాడు ఎరుకలోకి రా. నీలో భగవంతుడే గనక ఉన్నాడని నీకు అర్థం అయినట్లయితే నీవు ఎలా ప్రవర్తించాలి? భగవంతుడి వలె ప్రవర్తించాలి, భగవంతుడి వలె కరుణని జాలువార్చాలి. ఈ ప్రపంచానికి నీవు అన్నివేళలా అందుబాటులో ఉండాలి. నిన్ను నీవు పోగొట్టుకుంటూనే సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి ఒక మహోత్తమమైనటువంటి జీవుడిగా సార్ధకత చెందినట్లయితే జీవ ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ రెండూ కలిసినప్పుడు ఈ సమాజానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, ఈ సర్వ సృష్టికి కూడా అది ఆనంద సంధాయకం అవుతుంది. అది ఆనంద రసతుండిల స్థాయికి వెళుతుందంటున్నారు భగవాన్. అందుకనే ఆయన విద్యా, వైద్య రంగాల అన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసి ఒక ఇంజనీర్ కావటం, ఒక డాక్టర్ కావటం, ఒక యాక్టర్ కావటం లేదా ఒక టీచర్ కావటం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ దీనిలో పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని, పరసనా డివినిటీ గనక లేకపోయినట్లయితే ఆ డివినిటీ లేనివాడు కేవలం ఒక ఇంజనీరుగా మాత్రమే ఉంటాడు, ఒక డాక్టర్‌గా మాత్రమే ఉంటాడు. దివ్యమైనటువంటి, మానవీయమైనటువంటి కరుణని ఈ జగత్తుకు గనక అందించకపోయినట్లయితే ఈ ప్రజ్ఞలన్నీ కూడా వృధాయై-- అవుతాయని చెప్తూ భగవాన్ బాబా దేవుడా కాదా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు "అరయ సత్యసాయి దేవుడే అయినతో ఆయన మానవీయతకు అంజలింతు, అరయ సత్యసాయి నరమాత్రుడైనతో ఆయన దివ్య గరిమకు అంజలింతు" అన్నాడు ఒక మహాకవి. అంటే ఆయన గనక దైవం అయినట్లయితే ఆ దైవం నాకు రోజూ కనబడుతున్నాడు, ఆ దైవం నాతో మాట్లాడుతున్నాడు, ఆ దైవం నన్ను సరైనటువంటి మార్గంలో నడవమని చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, ఎక్కడికక్కడ శిక్షణ ఇస్తున్నాడు. కనుక ఆ దివ్యత్వంలో ఉన్నటువంటి మానవత్వానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని నిష్ఠూరాలు, మానవుడి యాతనలు, సంక్లిష్టమైనటువంటి అన్ని పరిస్థితుల నుంచి పరమాత్మ బయటకు పడవేస్తున్నటువంటి కారణంగా, మానవీయమైనటువంటి ఒక మహా కోణం ఆవిష్కృతమైన కారణంగా దివ్యుడైనటువంటి పరంధాముడైన పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నా. అవేం లేదయ్యా ఆయన కేవలము నరమాత్రుడే, మనబోటి వాడే అని గనక అనుకున్నట్లయితే నరమాత్రుడే గనక అయితే ఎనభై నాలుగు సంవత్సరాల అధ్యాత్మ చరిత్రను ఒక్కసారి గమనించినట్లయితే ఎక్కడ పుట్టపర్తి? పుట్టలు, పాములు తప్ప ఇల్లు తక్కువ పుట్టలు ఎక్కువ, మనుషులు తక్కువ పాములు ఎక్కువ, నీటి చుక్క లేనటువంటి ప్రదేశాన్ని పరమాత్మే ఎన్ను-- ఎంచుకున్నాడు. రాముడు కూడా అయోధ్యలో జన్మ ఎత్తినా అరణ్యానికి వెళ్ళటానికే సిద్ధపడ్డాడు. కారాగారంలో జన్మ ఎత్తిన పరమాత్మ సర్వ జగత్తులోకి వచ్చాడు సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్యాలు అనుగ్రహించటానికి. అట్లాగే భగవాన్ సత్యసాయి లోకంలో ఉన్నటువంటి సర్వ మతాలని కూడా సమన్వయం చేస్తున్నటువంటి మహా విభూతి యోగము, భగవాన్ సత్యసాయి యొక్క దివ్య చరిత్రే ఒక లీలా కైవల్య విభూతి. ఏం చేయాలి మానవుడు? ఆయన దేవుడే మనం-మనమేం చేయాలి? ఆ దివ్యత్వంలో నుంచి ఎయిత్th స్టాండర్డ్ కూడా పాస్ కానటువంటి భగవాన్ సత్యసాయి ప్రపంచ చరిత్రలో ఒక అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ప్రారంభించినప్పుడు ఉత్తమ మానవుడు ఎట్లా తయారు కావాలి, దేనివలన, ఏది తెలుసుకున్నందువలన మానవత్వం పరిమళిస్తుందో విద్యా విధానం ద్వారా, కరుణ ఎట్లా ప్రవహించవలసి ఉన్నదో వైద్య విధానం ద్వారా, సమాజమైనటువంటి సేవ ద్వారా పరమేశ్వరుడు తన సర్వ శక్తులని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తూ తనదైనటువంటి ఆ దివ్య భావనాసీమని మహా విస్తృత పరుస్తూ అనేక క్షేత్రాలను పరవశ్యం చేస్తూ వెళుతున్నారు. ఆ అవతారంలో, ఆ భాగంలో మనం కూడా రెండు అంగుళాలు, రెండడుగులు వేయటానికి జన్మ ఎత్తాం. ఒక సమకాలీనుడిగా, ఒక పరమాత్మకి సమకాలీనుడిగా పుట్టటమే ఒక యోగం. అందునా వారు జన్మ తీసుకున్నటువంటి ఆంధ్రదేశంలో పుట్టటం రెండవ యోగం, ఆ పరమాత్మని దైహికంగా చూడటం మూడవ యోగం, చూసి ఆయన పరమాత్మే అని నమ్మగలగటం నాలుగవ యోగం, పరమాత్మే అని నమ్మిన తర్వాత దానిని నడవటం ఐదవ యోగం. కనుక మహా విస్తృతమైనటువంటి ఒక సాగర సదృశమైనటువంటి పరమాత్మని సంసార సదృశమైనటువంటి జీవుడు కొలవలేడు, తలచలేడు, అనుకోలేడు. గనుక ఏం చేయాలి? అనుభవించాలి, అనుభవించిన దానిని నిష్టగా ఆచరించాలి. సర్వ మానవులు కూడా సమస్తమైనటువంటి శాంతికాముకులుగా, శాంతిప్రియులుగా, శాంత పుంభావులుగా జీవించేటువంటి ఒక దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ సాయి మనందరిపై నిండుగా, దండిగా తన అనుగ్రహాన్ని మహామృత వృష్టి వలె కురిపించు గాక అని భగవాన్ సత్యసాయిని ప్రార్థిస్తూ ఆయన ద్విజుడూ కాడు, పుట్టినవాడూ కాదు. ఎవరయ్యా? అజుడు, జన్మలేనివాడు, జన్మ ఎత్తినట్టుగా వచ్చినవాడు. వైదిక సాంప్రదాయంలో ఉన్న అనేక అవతారాలలో శిరోమాణిక్యమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి మహావతారి భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ ఈ దివ్యమైనటువంటి, ఈ మహా పుణ్య కాలాన్న పరమేశ్వరుడైనటువంటి స్వామి సమస్త మానవాళిని, పద్నాలుగు భువనాలలో ఉన్నటువంటి సమస్త జీవరాసులని ఆత్మ వైపు ప్రస్థానం చేసే దిశగా వడివడిగా అడుగులు వేసేటువంటి ఒక దశగా ఆశీర్వదించవలసిందిగా భగవాన్ని ప్రార్థిస్తున్నాను. సాయిరాం.
SSSMC · audio
Talk on Leela Kaivalya Vahini
Talk on Leela Kaivalya Vahini
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 23:37
More in this series
Talks
- 24 min 1
Talk on significance of festival of Sankranthi
- 52 min 2
Talk - on Guru Tatwam
- 40 min 3
Talk - Koti Samithi Hyd
- 28 min 4
Talk - Bharata
- 23 min 5
Talk on Dasara
- 6 min 6
Talk on Rathasaptami
- 32 min 7
Talk on Sri Sathya Sai - Part 05
- 33 min 8
Talk on the character of Draupadi
- 30 min 9
Talk on Gyana Yoga
- 29 min 10
Talk on Hanuman Panchamukham
- 23 min 11
Talk on Leela Kaivalya Vahini
Now playing - 35 min 12
Talk on Sathya Sai Sukthamulu
- 24 min 13
Talk on yoga Triveni
- 26 min 14
Talk on the occasion of Avatar Declaration day