Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] మానవ జీవన ప్రస్థానంలో మూడు యోగాలు అత్యంత ప్రధానమైనవి కీలకమైనవి అవి కర్మ యోగము భక్తి యోగము జ్ఞాన యోగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం యోగ వేరు అది దేహానికి మనస్సుకి సంబంధించింది యోగము హృదయానికి పరమాత్మకు సంబంధించినది అంటే communication వేరు communion వేరు కదా కనుక కర్మ లేని మానవుడు లేడు "కర్మానుబంధి మనుష్య లోకే" కదా కర్మ చేయవలసిందే ఎలా చేయాలి భక్తితో చేయాలి భక్తి అంటే పూజ వ్రతము దానము ఇవి కాదు భక్తి అంటే అంటే వెలుగు క్తి అంటే కూడి ఉండటం తనలో ఉన్నటువంటి వెలుగుతో తాను కూడి ఉండేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ భక్తి ఇది శ్రద్ధ జ్ఞానము యోగము సమన్వయము సమష్టి ఇవన్నీ కూడితే అది భక్తి అవుతున్నది గనుక కర్మ ఎప్పుడు చేసినా కర్మ చేయవలసి వచ్చినా అది భక్తి సంయుతంగా చేయాలి అని భక్తి యోగం చెప్తూ ఉన్నది "భక్తిరేవ గరీయసీ" అది నారద భక్తి సూత్రం భక్తి మాత్రమే గరీయసీ సర్వ ఉత్కృష్టమైనది అని ఇక మూడవది జ్ఞాన యోగము జ్ఞాన యోగం అంటే తనను తాను ఎరుగు ఎరుక జ్ఞానం అంటే అది మిగతావన్నీ విజ్ఞానాలు సుజ్ఞానాలు ప్రజ్ఞానాలు but జ్ఞానము అంటే కానీ జ్ఞానము అంటే ఏమిటి అంటే కేవలము తనను తాను తెలుసుకునేటువంటి ఒక నిత్య స్ఫుర ఎరుక అంటే మూడింటిని శ్రీకృష్ణ పరమాత్మ తన జీవిత కాలంలో ఎలా సమన్వయం చేశాడో ఎట్లా అనుష్ఠాన వేదాంత భూమికగా మార్చాడో మనం గమనించినట్లయితే భారతాన్ని తీసుకుందాం భారతం నిండా ఉన్న కృష్ణుడు వేరే ఆయన కర్మయోగి దాని నిండా తనకు అక్కరలేని ఒక సామ్రాజ్య నిర్మాణం కోసం ఎవరో ఏలవలసిన రాజ్యం కోసం తన యావజ్జీవితాన్ని ఒక లీలగా లీలా మానుషంగా లాలనగా ఆలనగా పాలనగా అదలింపుగా మందలింపుగా హెచ్చరికగా రాయబార ప్రజ్ఞగా అనేక విధాల దానిని సాగించి సాగించి రకమైనటువంటి కర్మానుభవాన్ని గాని కర్మ ఫలితాన్ని ఆశించకుండా తాను సాగించినటువంటి కర్మ యోగమే కృష్ణ పరమాత్మ భారతం నిండా నడిపించినటువంటి యోగాభ్యాసనం అంటే కర్మ యోగం అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి అంటే భారతంలో శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవాలి తానే రాజు కాబోవటం లేదు తనకు అక్కర్లేదు మరి ఎటువంటి రాజు రాజ్యానికి అవసరం ఎటువంటి వాడు భరత భూమిని ఏలవలసి ఉన్నది అంటే ఎవరు ధర్మబద్ధులై ఉంటారో ధర్మనిష్ఠాగరిష్టులై ఉంటారో ఎగు-- ఎవరైతే భగవంతుని యందు రతి కలిగి ఉంటారో ఎవరు భాగవతులై ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి ఐదు సూత్రాలతో నడిపించగలిగేటువంటి వాళ్ళు కావాలి అని ఆయన నిర్ణయించుకొని పాండవ పక్షపాతి అయి పక్షపాతి అంటే ప్రేమ కలిగిన వాడు అని మాత్రమే తప్ప వారి పక్షము వహించిన వాడు అని మాత్రమే కాక మరొకటి కాదని వారి యందు వారు ఆచరించే ధర్మము నందు మాత్రమే ప్రేమ కలిగిన వాడని మనం అర్థం చేసుకున్నట్లయితే ఐదుగురు పాండవుల కోసం ఒక ద్రౌపది కోసం అంటే ఒక కుంతి కోసం తన యావజ్జీవితాన్ని కూడా కర్మయోగంలో అనుష్ఠానం చేశాడు కృష్ణ పరమాత్మ ఇది ఒక పార్శ్వం భాగవతం గనుక తీసుకున్నట్లయితే అది ఒక రసమాలయం అది వ్యాసులవారే రాశారు భారతం వ్యాసులవారే రాశారు ఎనిమిది వేల శ్లోకాలలో ప్రారంభమైనటువంటి ఒక వ్యాసభారతం జయా అనబడేటువంటి నామంతో మొదలై సుమారు కాలగమనంలో లక్ష శ్లోకాలతో పరిపూర్ణమై పరిపుష్టమై తుష్టమై సంతృష్టమై ఆనంద సంధాయకమై జగత్తుకి పంచమ వేదంగా భాషించినటువంటిది వేదాన్ని రచించినటువంటి వారు వేదవ్యాసులైనటువంటి మన కృష్ణ నామంతోను వ్యాసుల వారు దాని కథానాయకుడు కర్మయోగ పరంగా కృష్ణుడు ఇక భాగవతం రాసినటువంటి వ్యాసులవారు కూడా దాని నిండా కృష్ణ పరమాత్మని నింపాడు ఎలా నింపాడు అంటే భాగవతుల కథంతా భాగవతం అయితే అక్కడ కృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతార భూమికలో కృష్ణుడుగా సంచారం చేసినటువంటి మహావిష్ణు తత్వమే భాగవత తత్వం భాగవతము అంటే ఏమిటి ఒకటి భాగ-- భాగవతుడు అంటే భక్తుడు పడే కష్టము ఫలితంగా పరమాత్మ యొక్క అనుగ్రహము కలవోసుకున్నటువంటి ఒక సందర్భం అది అది ఒక యోగమాలిక అది యోగానుసంధాన స్ఫూర్తి అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో తొలినాళ్లలోనే కుంతీ పరంగా భీష్ముడి పరంగా రెండు విషయాలు చెప్పాడు కుంతీదేవి కృష్ణుడిని అడిగింది ఇక నాకు ఉత్తానం ప్ర-ప్రసాదించమని అంటే ఏమిటి నాకు మోక్షం ఇవ్వమని అడిగింది ఎందుకు నీ కొడుకులు రాజులైనారు కదా నువ్వు హాయిగా రాజ్యసుఖాన్ని కూడా అనుభవించు జీవితమంతా కష్టం పడ్డావు అంటే కృష్ణా కష్టంలో ఉన్నన్నాళ్లు నువ్వు మాతోనే ఉన్నావు సుఖంలో నిజానికి నీ అవసరం మాకు లేదు నాకు సుఖం అక్కరలేదు గనుక ప్రపంచమే అవసరం లేదు గనుక నాకు ఇంతటితో నా కథ ముగించమని అడిగింది భీష్ముడు అంపశయ్య మీద పడుకొని తాను చేసినటువంటి అనేకమైనటువంటి అంటేకౌరవుల పక్షాన నిలబడిన కారణంగా కౌరవాన్నం తిన్న కారణంగా దానివలన ఏర్పడిన రక్తం కారణంగా అంపశయ్య మీద పడుకోవలసి వస్తే రక్తమంతా కారిపోయిన తర్వాత శరీరంలో కౌరవులు వలన తిన్న అన్నం వలన ఏర్పడిన రక్తపు బిందువే లేని సమయంలో ఆయన సుషుమ్న ఆయన ఆత్మ గానమై విష్ణు సహస్ర నామం ఆలపిస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువే తానే అయినప్పటికీ కూడా వినయ వినమ్రత గాత్రుడై చేతులు కట్టుకొని శిరస్సు వంచుకొని విష్ణు సహస్ర నామాన్ని కైవారాన్ని విన్నాడు అని మనం అధ్యయనం చేశాం అంటే ఒక భక్తుడు భగవంతుడికి ఎంత సన్నిహితుడో దూరాత్ దూరాత్ అంతికేచ నేను దూరం దూరం అనుకుంటే భగవంతుడు దూరంగా ఉండడు నయనాంజన రేఖ వలె ఉంటాడు కంటి కాటుక వలె దగ్గరగా ఉంటాడు దగ్గరగా ఉండే ప్రయత్నం భక్తి వలన మధురమైనటువంటి భక్తి వలన సమర్పణ వలన శరణాగతి వలన వినయం వలన ఆత్మ గానం చేత ఎలాగైతే భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ లో జగన్మోహనాకారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకున్నాడే అటువంటి దర్శనం ఇప్పించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ భాగవతం నిండా భక్తి యోగాన్ని రసాయనం చేశాడు రసాత్మకం చేశాడు రసతుందిలం చేశాడు ఇక ఖడగా మూడవ భాగానికి వస్తే కర్మ యోగం అంతా భారతమైంది భక్తి యోగం అంతా భాగవతం అయింది జ్ఞాన యోగం అంతా భగవద్గీత అయింది మొదటి ఆరు అధ్యాయాలు కర్మ యోగమై మధ్యలో ఉన్నటువంటి ఆరు అధ్యాయాలు భక్తి యోగమై ఖడగా ఆరు జ్ఞాన యోగమై భాషించినటువంటి భగవద్గీత లో అక్కడ మాత్రమే ఆయన చెప్పాడు తాను ఎందుకు వచ్చాడు యుగంలో ఎప్పుడెప్పుడు ఎందుకు రావలసి వస్తుందో తనను తాను ఎట్లా సృష్టించుకుంటాడో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం నన్ను నేను అనుకొని నేను వస్తాను ఆయా దేశకాల పరిస్థితులను బట్టి సాంఘిక వాతావరణాన్ని బట్టి మానవుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని తాను ఆచరించవలసిన అనుసరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించక మార్గాన్ని సన్మార్గాన్ని వైదొలగినప్పుడు మళ్ళీ మార్గాన్ని చూపించి మానవుడిని మరమ్మత్తు చేసి సరిచేసి ఉత్తమ మానవుడిగా పూర్ణ మానవుడిగా తీర్చిదిద్దటానికి నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను అన్నాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన యోగానికి సంపూర్ణమైనటువంటి ఒక విజ్ఞాన భాండాగారాన్ని మనకు అందించాడు కాబట్టి జ్ఞాన యోగం అంతా కూడా భగవద్గీత నిండా ఉన్నది అది జ్ఞాన ప్రకాశిని మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక జ్యోతి ఏదైతే ఉన్నదో అది ప్రకాశమానం చేయటానికి మన ఆలోచనలు విస్ఫారం కావటానికి మన ఆలోచనలు విస్తృతం కావటానికి మనం మనంగా జీవిస్తున్నామా లేదా మనలో ఉన్న పశుప్రాయమైన భావాలు ఇంకా ఉన్నాయా అసలు మనం మానవ జన్మ ఎందుకని ఎత్తి వచ్చాము వచ్చి ఏం చేస్తున్నాము అని అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకాలలో ఒక సంవాద రూపంలో అందించినటువంటి జ్ఞాన భాండాగారము జ్ఞాన స్వరూపము కృష్ణుడే అందుకనే ద్వాపర యుగంలో ప్రప్రథమ లోక గురువు వచ్చాడు రామాయణ కాలంలో వచ్చిన గురువులు బ్రహ్మర్షులు వాళ్ళు కేవలం గురువులు గారు శ్రీరామచంద్రుడు వంటి అవతార మూర్తికి ఇద్దరు గురువులు వచ్చారు ఒకడు లోక గురువు అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి జ్ఞాన గురువు అయినటువంటి వశిష్టుల వారు మరొక బ్రహ్మర్షి కృష్ణ పరమాత్మకి తాత్కాలికంగా కొద్ది కాలం మాత్రమే సాందీపుడు మాత్రమే గురువుగా ఉన్నాడు లోక గురువుగా కానీ సర్వ ప్రపంచానికి ఆగామి కాలానికి రాబోయేటువంటి కలియుగానికి మొత్తానికి జ్ఞాన గురువుగా ఎవరు ఉండాలంటే తనను తాను ఆవిష్కరించుకోవటానికి వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక తొట్ట తొలి జ్ఞాన గురువు ఎవరు అంటే కృష్ణం వందే జగద్గురుం మరి ఆయనతో పాటుగా తొట్ట తొలి లోక గురువు మళ్ళీ ఎవరంటే విశ్వామిత్రుడు తర్వాత వ్యాసుల వారు విశ్వామిత్రుడు అసలు శస్త్ర విశారదుడు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసిన వాడు అదొక భాగం అయితే వ్యాసుల వారు సరస్వతీ ప్రవాహం వాంగ్మయం లేకపోతే ఎట్లా నాలుగు మాటలు మనకు అర్థం అయ్యేది ఎట్లా మానవుడి సంస్కార జ్వాల లోపల రగిలేది ఎట్లా ప్రవాహం బయటకు వచ్చేది ఎట్లా దీనన్నింటికీ కూడా మూలపురుషుడు అయినటువంటి లోకగురువు వ్యాసుల వారు జగద్గురువు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చిట్టచివరి శ్లోకాన్ని గనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు ఒక ఎత్తు ఏడు వందల శ్లోకం అది యుగమైన కాలమైన జాతి అయినా మతమైన ఆచరించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అది యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ఎంత అందమైనటువంటి శ్లోకం ఏదో అది మంగళాశాసనం చేసే మంగళాంత అని అంటామే అది కాదు అది అది మాత్రమే కాదు ఎప్పుడైతే యోగీశ్వర స్థాయికి చెందినటువంటి ఒక గురువు సర్వ సన్నద్ధుడైనటువంటి ఒక శిష్యుడు అంటే యత్ర యోగీశ్వర కృష్ణో అక్కడ బాలకృష్ణుడు కాదు ప్రౌఢ కృష్ణుడు కాదు కర్మ యోగంలో భక్తి యోగంలో ఉన్న కృష్ణుడు కాదు యోగీశ్వర స్థాయికి యోగులకు ఈశ్వరుడు అయినటువంటి ఇక ఆయనను మించిన యోగమే లేదు ఎందుకని జ్ఞాన యోగమే శిఖరం కాబట్టి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఒక గురువు సు-శుద్ధుడు సిద్ధుడు సంసిద్ధుడు అయినటువంటి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు వంటి ఒక శిష్యుడు ఇద్దరూ కలిసినట్లయితే అక్కడ ఏమవుతుంది అంటే ధ్రువా నీతిర్మతిర్మమ ఒక ధృడమైనటువంటి సంస్కారయుతమైనటువంటి నీతిమంతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మానుష్ఠాన పూరితమైనటువంటి భక్తి యుక్తమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనుక అటువంటి దానితో ఆయన మంగళాశాసనం చేశాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మని భగవద్గీతను ఉరికినే పాడుకునే పాటగా కాక ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన కోశంగా అర్థం చేసుకుంటే అది విజ్ఞానాన్ని దాటి జ్ఞాన యోగంలో మనల్ని నిలబెట్టేటువంటిది గనుక శ్రీకృష్ణ పరమాత్మ మూడు యోగాలకి ఒక సంపూర్ణ సమగ్ర సమ్యక్ సమాహార స్వరూపమే గనుక అది మహానంద సర్వస్వం అయింది గనుక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అన్నివేళలా మన హృదయం ఉపాసించు గాక ఇది సన్మార్గానికి ప్రత్యేకమైనటువంటి ప్రకృష్టమైనటువంటి సమున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి గురువు ఎవరు అంటే కేవల శ్రీకృష్ణ పరమాత్మ అవుతున్నాడు గనుక కృష్ణం వందే జగద్గురుం [outtro music] కోటి ఆశలతో శతకోటి అంచనాలతో [outtro music] సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు [outtro music] ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ బడ్జెట్ బండి వచ్చేస్తోంది [outtro music]
YouTube · audio

సన్మార్గం | Sanmargam

Home

సన్మార్గం | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 13:50

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

    Now playing
  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam