⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
[ఇంట్రో మ్యూజిక్] ఒక లక్షా ఇరవై ఐదు వేల సంవత్సరాల సంస్కృతి. ఆ సంస్కృతిలో నుంచి ఏర్పడిన నాగరికత. నాగరికతలో నుంచి ఏర్పడినటువంటి ఒక ధర్మం. ఇవన్నీ కలిస్తే సనాతన ధర్మం అవుతున్నది. సనాతన అంటేనే eternal ఇవాళ English లో చెప్పాలంటే. అంటే కాలాజ్యవిచ్ఛిన్నమైనటువంటి ఒక ధర్మ స్వరూపం సనాతన ధర్మం. ధర్మం అంటే ఏమిటి? వ్యక్తి ధర్మం ఉంది, కుటుంబ ధర్మం ఉంది, సమాజ ధర్మం ఉంది, ప్రదేశ, దేశ, ప్రపంచ ధర్మం ఉంది. ఇది అనేక విధాలుగా ఈ ధర్మాన్ని గురించి మనం విచారణ చేయాలి. ఒక వ్యక్తి ఒక్కడే కానీ ధర్మం యొక్క స్వరూపం అనేక విధాల ఒక వ్యక్తి యందు ఆవిష్కరింపబడాలి. ఎందుకంటే మనకి ప్రామాణికం గనక తీసుకున్నట్లయితే అనేకమంది దేవీదేవతల అవతారాలు వచ్చినప్పటికి కూడా ఒక్క రామావతారం మాత్రమే "రామో విగ్రహవాన్ ధర్మః" అంటే ధర్మములో ఉన్నటువంటి ఎన్ని కోణాలు ఉన్నాయో ఆ కోణాలన్నీ కూడా ఒక ఆకారము, సాకారము, సగుణము, స్వభావము అయి గనక ఉన్నట్లయితే అది రాముడు అని ఈ దేశం నమ్మింది, నమ్ముతుంది, నమ్ముతూనే ఉంటుంది. అంటే ధర్మానికి కూడా ఒక రూపం కావాలి. ధర్మం ఆ ఊహాజనితమైనది కాదు, ఊహాత్మకమైనది కాదు, భావభావనాత్మకమైనది కాదు. అది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం. ఈ ధర్మ ప్రమాణం వలన వ్యక్తులందరూ కూడా సనాతన ధర్మం అనేటువంటి దాన్ని గనక ఆచరించటము, ముందు అర్థం చేసుకోవటము, దాని స్వరూపాన్ని తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత దాన్ని జీవితంలో apply చేస్తూ జీవితంలో ఆ-ఆవిష్కరించుకుంటూ ఒక అలవాటుగా చేసుకుంటూ గనక వెళ్లినట్లయితే వ్యక్తులలో ఉన్నటువంటి అనేక చీకటి కోణాలు సమసిపోయి ఒక ధార్మిక బుద్ధి ఏర్పడుతుంది. ఎందుకంటే మన కర్మలన్నీ కూడా బుద్ధి ద్వారా నడుస్తూ ఉంటాయి గనుక సవరించవలసిన విషయం ఎక్కడ అంటే బుద్ధి. బుద్ధి అంటే intellect. ఆ intellect మనకి చాలా తెలివిగల వాళ్ళం గనక అయితే అహంకారాన్ని ఖచ్చితంగా తెచ్చిస్తుంది అది. అభిజాత్యాన్ని ఇస్తుంది. నేను తప్ప ఎవరు లేరు ఈ ప్రపంచంలో అనేటువంటి ఒక భావనకి తీసుకువెళుతుంది గనుక దాన్ని సరిచేసుకోకపోయినట్లయితే మనం చేసే కర్మలన్నీ కూడా ప్రజలకి, ప్రపంచానికి, మనం చుట్టూ ఉండేటువంటి కుటుంబానికి, సమాజానికి చేటు కలిగిస్తాయి గనుక ఈ సనాతన ధర్మం అనేటువంటిది అదేమన్నా మార్పు చెందనిదా? ఆత్మ వంటిదా? దానికి రూపురేఖలు ఏనాడో ఇందాక చెప్పిన ఆ లక్షల సంవత్సరాల క్రితం ఏర్పరచినవి అట్లాగే ఉన్నాయా అంటే, ఏది సనాతన ధర్మంగా ఇంతవరకు ఇన్ని లక్షల సంవత్సరాలుగా ఆచరింపబడి ఉన్నదో అది ఎప్పటికప్పుడు కాలాన్ని బట్టి, కారణాన్ని బట్టి, కార్యాన్ని బట్టి అంటే కాల కార్య కారణ కర్తవ్యాన్ని బట్టి ధర్మం తన స్వరూపాన్ని నెమ్మదిగా మార్చుకుంటూ ఉంటుంది. ఈ ధర్మ స్వరూపం ఎప్పుడు మారుతుంది అంటే మనిషి యొక్క ఆలోచనను బట్టి ఆ ధర్మ స్వరూపం మారుతుంది. చూడండి "యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ మాట చెప్పాడు. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో అనగానే ఆలోచన పుడుతుంది. ధర్మం నిప్పు వంటిది కదా, దానికి చెద పెట్టడం ఏమిటి? ధర్మం అగ్ని స్వరూపంగా దానిని ఎవరు ముట్టుకోగలరు, ఎవరు ఏమి ఏ మార్చగలరు, మార్చగలరు అని అనుకునేవేళ అక్కడ ఏమంటాడంటే ధర్మానికి గ్లాని అని కాదు, ఏ మానవుడైతే తన స్వధర్మాన్ని విడిచి పరధర్మం వైపు వెళతాడో అంటే చేయవలసిన పని చేయకుండా చేయకూడని పని యందు మనస్సుని, తనువుని, భావాన్ని అన్నిటినీ లగ్నం చేస్తాడో అప్పుడు ఆ ధర్మానికి గ్లాని జరిగినట్లుగా భావించాలి. అంటే ధర్మాచరణ ప్రధానం మానవుడికి కాబట్టి ఈ ధర్మం ఎలా ఉండాలి అంటే వ్యక్తి ధర్మం ఉండాలి. అది సనాతన ధర్మంలో నుంచి గనక మనం తీసుకున్నట్లయితే సుమారుగా తొంభై తొమ్మిది మంది ఇక్ష్వాకు రాజులు ఆ ఇక్ష్వాకు వంశం ద్వారా రాజ్యాన్ని పరిపాలించారో, రాముడు వచ్చేప్పటికి అరవై నాలుగు స-- ఆయన అరవై నాలుగవ వాడు. అరవై మూడు దశరథుడు. తర్వాత ముప్పై ఐదు మంది రాజులు రాజ్యం ఏలారు. కానీ తర్వాత వారికి చరిత్ర లేదు. కానీ ధర్మానికి ఆ చరిత్ర ఎలా ఉన్నదంటే అవిచ్ఛిన్నమైనటువంటి ఒక సాంప్రదాయ వేదికగా, భూమికగా ఈ భారతదేశం ఒక విశ్వగురువుగా సనాతన ధర్మానికి మూలమైనటువంటి ప్రదేశంగా సర్వ ప్రపంచము గుర్తించినటువంటి సందర్భంలో ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి, ఈ దేశంలో మనుగడ సాగించినటువంటి వ్యక్తి ఏం చేయాలి? అంటే సనాతన ధర్మాన్ని ఆచరించాలి. అంటే అది ఏమిటి? అంటే మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటిది ఒకటి. రెండవది మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి శక్తిని ఇచ్చేది. ప్రభావంలో నుంచి స్వభావంలోకి తీసుకు వెళ్లగలిగినటువంటి ఒక అత్యద్భుతమైన వాహికగా ఉన్నది. అంతే కాదు ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గం వైపు మన బోటి వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రవృత్తులు ఉంటాయి. ఆ ప్రవృత్తులన్నీ వదులుకుంటూ నివృత్తి మార్గం వైపు వెళ్లాలంటే దేనిని అనుసరించాలి, దేనిని ఆవేశింపజేసుకోవాలి, దేనిని ఆచరించాలి అనుకున్నప్పుడు సనాతన ధర్మమే నిలకడ చెందుతూ ఉన్నది. ఎన్నెన్ని యుగాలు దాటినా, ఎన్నెన్ని కాలాలు దాటినా, ఎన్ని ఋతువులు దాటినా, కోటానుకోట్ల జీవరాశులు పుడుతున్నా, గిడుతున్నా తనను తాను నిలబెట్టుకున్నటువంటి ధర్మమే సనాతన ధర్మం గనుక ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఒక పరిపూర్ణమైనటువంటి భావజాలం. ఈ భావజాలంలో జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతమైనటువంటి దివ్య భావనా గరిమ చేత సనాతన ధర్మం మానవుడికి శాంతిని ఇస్తుంది. ధర్మాన్ని ఆచరించండి. "ధర్మో రక్షతి రక్షితః" అన్నప్పుడు ధర్మం మనల్ని ఎప్పుడు రక్షిస్తుంది అంటే ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు, ధర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు. చూడండి ఎండలో వెళ్తాం మన దగ్గర ఒకే గొడుగు ఉంటుంది.వానకో గొడుగు ఎండకో గొడుగు అని రెండు లేవు. ఎండలో వెళ్ళినా వానలో తడిసినా నడుచుకున్నా ఉండవలసినది ఏమిటంటే ఒక గొడుగు మాత్రమే. ఆ గొడుగుే ఈవేళ భారతావని అంతా కూడా ఆక్రమించి ఉన్నటువంటి ఒక ఆతపత్రము అంటాం. ఆ ఆతపత్రమే గొడుగు అయి ఉన్నది గనుక మానవుడు ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే సనాతన ధర్మాన్ని ఆచరించి వెళ్ళండి. మీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాలను నిర్దుష్టంగా చేయండి. కాలాన్ని గమనించండి. కాలాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేయండి. ఆస్తులు వస్తాయి పోతాయి. కీర్తి వస్తుంది కరిగిపోతుంది. శరీర సౌందర్యం వడలిపోతుంది. వృద్ధాప్యం వస్తుంది. అన్ని ఎర్ప్-- అన్నీ మార్పు జరిగేవే. ఆరు రుతువులు మారుతూ మారుతూ కాలాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటుంది. కానీ Maranidhi ఏమిటంటే ధర్మాన్ని ఆచరించినటువంటి ఒక మానవుడి యొక్క మనస్సు, ఆతడి బుద్ధి, ఆతడి యుక్తి, శక్తి, భక్తి, రక్తి, అనురక్తి ఇందులో ఏ మాత్రం మార్పు లేకుండా తాను ఒక స్వచ్ఛమైనటువంటి ఆ దివ్య మానవుడిగా ఇక్కడ సంచారం చేయటానికి ఆ దివ్య మానవత్వంలో నుంచి తన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రభావితం చేస్తూ వెళ్తూ ఉంటుంది గనుక ఈ సనాతన ధర్మమే అన్నిటికీ మూలం అవుతున్నది. అంతేకాదు, కాలం మారింది కదా, ఇది ఆధునిక కాలం కదా, ఈ కాలంలో సనాతన ధర్మానికి చోటు ఎక్కడ అనుకోవద్దు. ఎందుకంటే కాలం మారుతున్నది, విలువలు మారుతున్నాయి, అవసరాలు మారుతున్నాయి కానీ ధర్మం మారటం లేదు. ఒక్కొక్క వ్యక్తి పంచభూతాలే కాదు, పంచభూతాలలో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క element కి ఒక ధర్మం ఉంది. నీటికి తడిపే శక్తి ఉన్నది, అగ్నికి కాల్చే శక్తి ఉన్నది, గాలికి చలింపజేసే శక్తి ఉన్నది, ఆకాశానికి శబ్దాన్ని దాచుకోగలిగిన శక్తి ఉన్నది. వసుంధరా బ్రహ్మదత్త భూమి నిండా అపారమైనటువంటి ఔషధులు, రత్నాలు, వజ్రాలు, బొగ్గు అన్నీ ఉన్నటువంటిది ఇది అయి ఉన్నది. అట్లాగే ఈ పంచభూతాల యొక్క ధర్మాన్ని గనక మనం అర్థం చేసుకుంటే, ఈ పంచభూతాలతోనే మన శరీరం ఏర్పడింది గనుక ఇది ధర్మాన్ని అతిక్రమించి ఈ జన్మ రాలేదు. మనందరం కూడా ఒక అగ్ని స్వరూపమై ఇక్కడికి వచ్చాము గనుక ధర్మాన్ని మన నిత్య జీవితంలో అనేక విషయాలు ఉపాసన, ప్రార్థన, అనుష్ఠానము అనేటువంటివన్నీ ఉన్నాయి. వీటికి కావలసినటువంటి పారిభాషిక పదాలున్నాయి, మంత్రాలున్నాయి అన్నీ ఉన్నాయి. అయితే ఇది ఒక ధర్మానికి చెందినది అంటే కానే కాదు. జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతమైనటువంటిది. ఉదాహరణకు ఒక గాయత్రి. గాయత్రి గనుక అర్థం చేసుకున్నట్లయితే అది సూర్యోపాసన. ఆ సూర్యోపాసన అంటే సూర్యుడు అందరికీ కనిపించేటువంటి ప్రత్యక్ష పరమాత్మగా అన్ని జాతులు అంగీకరిస్తాయి. అన్-- అన్ని జాతులు ఆయనకి నమస్కరిస్తాయి. సూర్యోపాసన చేసుకుంటే ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి మొగ్గ, ప్రతి వ్యక్తి మన శరీరంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులు అన్నీ కదలాలి అంటే సూర్యుడి యొక్క కిరణం ఆదిత్య కిరణాలు మన మీద పడాలి. అంటే సనాతన ధర్మం ఏం చేసిందంటే సైన్స్ ని కాస్త మరుగుగా పెట్టి దాని ద్వారా మీరు తే-- నేర్చుకోండి అన్నది. సనాతన ధర్మాన్ని ఆశ్రయించి గనుక వెళితే దాని నిండా ఏమున్నది? సనాతన ధర్మం అన్నా, వేద విజ్ఞానం అన్నా రెండూ నిజానికి ఒకటే. విజ్ఞానము ధర్మ స్వరూపమైంది. ధర్మము విజ్ఞానమైంది. ఆ రెండూ ఒకదానికొకటి ప్రశంసాత్మకమైనటువంటి భావనా భూమికలు ఉన్నాయి గనుక విజ్ఞానం కావాలి అంటే సనాతన ధర్మాన్ని ఆశ్రయించి కనబడుతున్న ఆధునిక కాలంలో ఏదైతే శాస్త్రీయమైనటువంటి భౌతిక విజ్ఞానం, ఏది సైన్స్ అంటున్నామే దాని ద్వారా గనక మనం వెళ్లగలిగినట్లయితే క్రమబద్ధమైనటువంటి ఒక జీవితం మనకు ఏర్పడుతుంది. సమయపాలన. కాలం ఏది రాని ఏది పోనీ కాలాన్ని మాత్రం మనం కొనలేము, తేలేము, ఇంకొకరి నుంచి తీసుకోలేము. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఆధునిక కాలంలో సైన్స్ ప్రభావం తీవ్రంగా ఉండటం, సమాజ పరిణామంలో మనిషి యొక్క అవసరాలు అంటే సుఖానికి తగిన అవసరాలు మారినందువలన ధర్మం కాస్త వెనకబడిన ట్లుగా అనిపించినా, ఇవన్నీ పొందినటువంటి వాడు కడగా కోరుకునేది ఏమిటి అంటే నాకు ఆనందం కావాలి. సుఖం ఉంది. ఆ శరీరం అనుభవిస్తోంది. సంతోషం ఉన్నది. మనస్సు అనుభవిస్తున్నది. కానీ ఆనందం ఎవరిస్తారు? ఈ ఆనందం ఆ అంటే దానికి bliss అంటున్నాం. ఆ ఆనందాన్ని బ్రహ్మానందం, పరమానందం, చరమానందం ఇవన్నీ కూడా ఎలా అనుభవించాలంటే మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, మానవ గంధర్వానందము, దేవ గంధర్వానందము, పితృపితా నందము, ప్రజాపితా నందము కడగా హిరణ్యగర్భానందము. ఆనందంలో ఇన్ని తారక స్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చెప్పారు, ఎక్కడ ఉన్నాయి అంటే ధర్మమే చెప్పింది. సనాతన ధర్మం చెప్పనిదంటూ లేదు. సనాతన ధర్మం మనం మాట్లాడుకోవటానికి అనువైన ఒక విషయం కాదది. సనాతన ధర్మం ఆచరణాత్మకమైనది, ఆలోచనాత్మకమైనది, అపాత మధురమైనటువంటిది. దానిని గనక సమగ్రంగా అర్థం చేసుకోగలిగితే ఆధునిక కాలము సంపూర్ణమై, సవికాసమై, సువికాసమై అనంతమైనటువంటి ఆనందానికి కారణమవుతున్నది గనుక ఆధునిక మానవుడు ఏం చేయాలంటే మళ్ళీ మన roots కు వెళ్ళాలి. roots బాగుంటేనే fruits బాగా వస్తాయి. అంతే కదా. వేళ్ళు బాగా ఉండాలి. కుదురు గట్టిగా ఉండాలి. ఆ కుదురులో దాగి ఉన్నటువంటివి కంటికి కనపడదు వేరు ఆ అక్కడి నుంచి అది ఆకులు, తలిరాకులు, మలిరాకులు, చిగురాకులు, పండుటాకులు అన్నీ ఎట్లా ఆవిష్కరిస్తూ ఉన్నదో సనాతన ధర్మం కూడా మన లోలోతులలో హృదయం లోపలికి చొచ్చుకొని వెళ్ళినప్పుడు దాని ఫలితాలని కూడా ఆనంద సంధాయకమై, ఆనంద రసతుందిలమై, జీవన ప్రవాహాన్ని ఒడ్డెరగనట్టుగా ప్రవహిస్తూనే హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా జీవితాన్ని నడిచేట్లుగా చేస్తుంది. అలాగే జీవితం ఇచ్చేటువంటి సవాళ్ళు, ఒత్తిళ్ళు అన్నింటినీ కూడా ఎదుర్కోగలిగినటువంటి ఒక ఆంతరంగిక, మానసిక, భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి అనేకమైన శక్తులను వరదానం చేయగలిగినటువంటిది సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మం అనేటువంటిది కాలానుగుణంగా సనూతనంగా మనం మార్చుకుంటూ దానిలో ఉన్నటువంటి రసాస్వాదన చేస్తూ క్రమబద్ధమైనటువంటి త్యాగమయమైనటువంటి భౌతికమైనటువంటి అంటే బుద్ధిజీవులమైన మనం ఇవన్నీ కూడా మళ్ళీ మనం సంపాదించుకోవాలి. ప్రపంచం నలుమూలల నుంచి మనకు అనేక భావాలు లోపలికి రావాలి. అలాగే వ్యక్తిలో నుంచి అపురూపమైనటువంటి భావాలు, ఆనందాన్ని కలిగించే భావాలు మళ్ళీ ప్రపంచానికి విస్తృతంగా వెళ్ళాలి గనుక సనాతన ధర్మం ఆధునిక కాలం నుంచి అది outdated కాదు. ఆచరణాత్మక దివ్య విధానమే సనాతన ధర్మం ఆధునిక కాలం దారి నుంచి ఎంతో లబ్ధి పొందవలసి ఉన్నది.