Skip to content
Transcript తెలుగు
శ్రీ కృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో ప్రవేశించే సరికి ఆయన వయస్సు సుమారుగా నూట పన్నెండు సంవత్సరాలు. అర్జునుడికి శరీరానికి తొంబై ఏళ్లు వచ్చినాయి. ఆనాటి కాల ప్రమాణం అది. కాబట్టి, మమతా బాంధవ్యాలకు లోనైనటువంటి ఒక మనసు కలిగిన అర్జునుడికి చెప్పవలసినవన్నీ చెప్తూ అసలు విషయానికి వస్తున్నాడు. నేను యుద్ధరంగంలోకి వచ్చాను నేను అన్నీ నీవే చేస్తావు అని చెప్తున్నావు కదా మరి యుద్ధంలో గనక ఓడిపోయినా గెలిచినా ఏమిటి నా పరిస్థితి ఏమిటి అని అడగలేదు కానీ అర్జునుడి మనసు గ్రహించిన కృష్ణ పరమాత్మ ఇవాళ కేవలం అర్జునుడికి మాత్రమే కాక మనందరికీ ఉపయోగపడే ఒక శ్లోకం చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది కీలకమైనటువంటి శ్లోకం ఇది. అర్జునా! అనన్యాశ్చింతయంతో మాం, నాయందు ఎవరైతే అన్య చింతన లేకుండా సమర్పణ, శరణాగతి, వినయము అన్న మూడు భావనలతో నిరంతరము అనన్యమైనటువంటి చిత్త ఏకాగ్ర స్థితిలో అన్ని సమర్పించుకొని త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి నీవు తప్ప నాకు వేరెవరూ లేరన్నటువంటి ఒక సమర్పణ, ఏది జరిగినా ఏది జరక్కపోయినా ఏది వచ్చినా ఏది పోయినా నువ్వు తప్ప మరొకటి లేదని అన్నీ నీకే వదిలి పెడుతున్నానన్న శరణాగతి, ఎంతో విలువిద్య ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు ఉన్నా నేను వినయంగా ఉంటానని ఎవరైతే అనుకుంటారో అటువంటి భావనతో నాతో కూడి ఉంటారో అనన్యాశ్చింతయంతో మాం యే జనాః ఇటువంటి వారు జనులందరు ప్రజలందరూ కూడా ఉంటారో పరి ఉపాసతే ఉపాసన అంటే ఒకే దానిని పదే పదే అనుకోవటం ఒకటి. ఉప ఆసన, ఈశ్వర భావనకి అనన్య చింతనికి మనస్సును ఎవరైతే దగ్గరగా తీసుకొని వెళ్ళి అక్కడే ఉంటారో దానిని పరి ఉపాసన విశిష్టమైన ఉపాసనగా మార్చుకుంటారో, మీరు ఎన్ని చెప్పండి నాకు ఆతడే ఆతడు అంటే అక్కడ కృష్ణుడు అని కాదు ఆత్మ అని అర్థం, పరమాత్మ అని అర్థం. పరమాత్మే నాకు దిక్కు మరొకటి కాదు అన్న భావన ఎవరి యందు ఉంటుందో, భావనని అనన్య చింతనతో ఎవరైతే సాగిస్తూ ఉంటారో, దానిని ఉపాసనా మార్గంగా ఎంచుకొని తమ జీవితంలో తమ భాగంగా చేసుకుంటారో, అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పరి ఉపాసతే అట్ అంతవరకే చాలదు అది తేషాం నిత్యాభియుక్తానాం యుక్తము అంటే కూడి ఉన్నవాడు అని అభియుక్తమై ఉన్నటువంటి అంటే సంపూర్ణంగా ఆతడితో కూడి ఉన్నవారు. ఎట్లా? ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు రామా అని కష్టం రా-రానప్పుడు భీమ అనుకొని ఉండేది కాదది. తేషాం నిత్యాభియుక్తానాం నిత్యము అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో జాగ్రదవస్థ, నిద్రావస్థ, సుషుప్తి అనబడే మూడు అవస్థల యందు, మూడు కాలముల యందు, మూడు లోకముల యందు, మూడు భావనల యందు అంటే అన్ని భావనల యందు అన్నిటా అంతటా నీతో నేను కూడి ఉన్నాను తేషాం నిత్యాభియుక్తానాం అభియుక్తమై ఉండాలి కేవలం ఏదో మనం షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా కాదు. అభియుక్తమై నేనే నీవు, నీవే నేను అన్నట్లుగా ఉండాలి. నేనే పుష్పము, నీవే సౌరభము తండ్రీ! లోక లోకాంతర ప్రాణముల్ పలు శ్రీదళములై విరియగా రంగత్సుధా భక్తి, నీ నానుడు మా యుగాంతర స్థిర మహానిర్వాణ నిర్మాణ సూత్రముగా నేనే నీవై వెలిగిపోయేదము తంత్రీనాథ రమ్యాకృతిన్. అంటే పువ్వు తావి ఎట్లా ఉన్నాయో, చంద్రుడు వెన్నెల ఎలా ఉన్నాయో, సూర్యుడు సూర్యకిరణాలు ఎట్లా కలిసి ఉన్నాయో అట్లే నీవు నేను ఒక్కటే అనేటువంటి భావనతో తేషాం నిత్యాభియుక్తానాం వాడి యొక్క యోగాన్ని వాడి క్షేమాన్ని నేను చూసుకుంటాను. వహామ్యహం నేను వహిస్తా అంటే నేను అంటే ఆత్మ వహిస్తుంది అని అర్థం. యోగం అంటే ఏమిటి? క్షేమం అంటే ఏమిటి? రెండు బానే ఉన్నాయి ఒకటి ఒకలానే ఉన్నాయి అంటే యోగము అంటే మనకు సంప్రాప్తించిన దాన్ని యోగము అంటారు. ఆయన యోగం బాగుందండి ఇది వచ్చింది అంటాడు. యోగాన్ని ఇచ్చేది నేనే. ఇచ్చాడు సరే, దాన్ని నిలబెట్టుకునే శక్తి కూడా మన దగ్గర లేదే. కనుక దాన్ని జాగ్రత్త పరిచేది కూడా నేనే. యోగాన్ని ఇచ్చేది నేనే, దాన్ని జాగ్రత్త పరిచి దాని క్షేమాన్ని చూసేది కూడా నేనే. యోగక్షేమం వహామ్యహం. ఎటువంటి వాడు? ఏదో రోజు వచ్చి దండం పెట్టి రెండు శ్లోకాలు పాడుకొని వెళ్ళిపోయే వాడు కాదు. జీవితాన్ని గీతగా మార్చుకునేవాడు. జీవితంలో గీతలో చెప్పబడిన ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలలో ఏది ఉన్నదో దానిని ఆకళింపుకొని జీవితంలో తన అన్ని కర్మలని కూడా అంటే పనులన్నింటినీ కూడా అంటే ఆలోచించినా, చెప్పినా, చేసినా అన్నిటా సచ్ఛీలత, సంయమనము, సమన్వయము, సమ్యక్ దృష్టి, ఆనంద తారక స్థితి ఇవన్నీ ఉండి ఇందాక చెప్పుకున్నటువంటి నిష్కామంగా ఎవరైతే చేస్తారో అటువంటి కర్మ యోగాన్ని అనుగ్రహించేది పరమాత్మ. దాంతో పాటు భక్తి ఉండాలి. భక్తి అంటే పూజాదికాలు కావు. భా అంటే వెలుగు, క్తి అంటే కూడి ఉండటం. వెలుగు మనకు బయట కనిపిస్తున్న సూర్య చంద్రాది వెలుగులన్నీ పగలు రాత్రులలో మారిపోతాయి. మన వెలుగులన్నీ మారిపోతాయి. కానీ మారని, ఆరని ఎప్పటికీ మలగనటువంటి ఒకానొక అఖండమైన చైతన్య జ్యోతి మన యందు ఉన్నది గనుక ఆత్మ జ్యోతిని గనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే తద్వారా జీవితంలో చేసే ప్రతి కర్మని కూడాఅంటే మనం ఒక పని అప్పజెప్పినప్పుడు పని సంపూర్ణంగా సమర్ధవంతంగా శక్తినంతా కూడగట్టుకుని దానిని పరిపూర్ణంగా మళ్ళీ జగత్తుకి ఎట్లా మనం ఇవ్వాలో అట్లా చేసేట్లుగా అటువంటి దాని వలన కలిగే దుఃఖము సుఖము ఆనందము సంతోషము ఏది కలిగినా అవి నావి కావు. నేను నేను చేయవలసిన పని చేశానని నీవు కర్మవీరుడివై ఉండాలి కర్మయోగంలో ఉండాలి. మనం చేస్తే కేవలం అది కర్మ జీవుడు చేసేవన్నీ కర్మలు యోగించి చేయాలి ఎవరితో యోగించి? నీ యందున్న పరమాత్మతో, ఆత్మతో అక్కడ అర్జునుడు కృష్ణుడితో మనం మనం నమ్మిన భగవంతుడితో కూడి చేస్తే కేవల కర్మలన్నీ కూడా కర్మయోగంగా మారుతాయి. చూడండి మన ఇంట్లో పండగ వస్తుంది పండగనాడు నైవేద్యం ఇవ్వటానికి ముందు పదార్థాలు తయారు చేస్తారు పదార్థాలు చేయబడినంత వరకు అవి కేవలము సాధమే. కానీ అది పరమాత్మకి నివేదన చేయగానే సాధము ప్రసాదమైపోతున్నది. మన కొళాయిలో నీళ్ళు పట్టుకుంటాం అవి నీళ్లే మంచి నీళ్లే తీసుకెళ్ళి పరమాత్మ దగ్గర కూర్చొని దాన్లో తులసి దళం వేసి మన పని మనం చేస్తాం పూజ ఏదో చేసుకుంటాం అది తీర్థం అయిపోతున్నట్లుగా సర్వోత్తముడైనటువంటి జగద్గురువుతో జగత్ భావనతో జగత్ దృష్టి కలిగినటువంటి జగదక్షుడితో జగద్రక్షకుడితో మనం గనుక కూడి ఉన్నట్లయితే మామూలు భాషలో ఉదాత్తమైనటువంటి వ్యక్తులతో సత్పురుషులతో మనం కూడి ఉన్నట్లయితే మనం కూడా సత్పురుషులమవుతాం. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక అయినట్లు ఒక చిన్న పురుగు భ్రమరమైనట్లు తుమ్మెద అయినట్లుగా భ్రమర కీటక న్యాయ విశేషంతో సత్పురుషుల సాంగత్యము సత్ సాంగత్యము సత్సంగము సదాచారము సమ్యక్ సంకీర్తన సద్భావన ఇవన్నీ కూడా మానవుణ్ణి మహనీయమైన స్థాయికి తీసుకువెళతాయి గనుక అటువంటి కర్మయోగంలోకి రా అర్జునా! నీవు నాతో కూడి ఉన్నావు నిర్భయంగా ఉండు సాగించు యుద్ధం అన్నాడు. అయింది. భక్తితో కూడి ఉండమన్నాడు చిత్తైకాగ్ర స్థితిలో ఉండు నువ్వు బాణం వేసినప్పుడు ఎట్లాగైతే సునిశ్చితంగా చేస్తున్నావో బాణప్రయోగం చేస్తున్నావో అస్త్రశస్త్ర ప్రయోగం చేస్తున్నావో అట్లాగే నీ ఆలోచనలు కూడా పరమాత్మ వైపు అనుసంధానం చెయ్ ఇది భక్తి యొక్క పరాకాష్ట. కానీ రెండింటినీ కూడా విచక్షణతో వివేకంతో చెయ్ దాని పేరే జ్ఞానం అటువంటి జ్ఞానం నుంచి నువ్వు భక్తిలోకి భక్తిలో నుంచి కర్మలోకి వచ్చి కర్మలను పరిపుష్టం చేసుకుని కర్మని భక్తిగా భక్తిని జ్ఞానంగా గనుక నువ్వు మార్చుకున్నట్లయితే ఏమవుతుంది? అంటే అటువంటి వాడి యోగక్షేమాలు నేను చూస్తానని దీనికి నేను మార్గం చూపించేవాడినే తప్ప మార్గంలో నడవవలసింది నీవే "ఉద్ధరేత్ ఆత్మనాత్మానం" నీ ఆత్మను నువ్వు ఎరగాలి, నీ ఆకలికి నువ్వు అన్నం తినాలి, నీ రోగానికి నువ్వు మందు వేసుకోవాలి, నీ కష్టాన్ని నువ్వు కఠినమైనటువంటి కర్మనిష్ఠతో ఎదుర్కోవాలి, నీకు ఏర్పడేటువంటి అననుకూలాలు అన్నీ నీ అంతట నీవే దాటాలి. కానీ నేను నీకీ మార్గం చూపిస్తున్నాను అంటూ అన్నప్పుడు నన్నిప్పుడు ఏం చేయమంటావు? అని అడిగాడు. ఇన్ని విన్న తర్వాత "యోగీభవ అర్జునా" అన్నాడు కృష్ణుడు. నువ్వు యోగివి కా అన్నాడు. ఇదేమిటి యుద్ధం చేయమన్నావ్ కదా యుద్ధవీరుడిగా వీరమరణం పొందమన్నావ్ బంధుత్వాన్ని వదిలిపెట్టమన్నావ్ కర్తవ్యం అన్నావ్ కర్మయోగం ఇవన్నీ చెప్పావ్ "యోగీభవ అర్జునా" యోగిని కమ్మంటావేమిటి? యోగి అంటే ఇంక నాకేం పని ఉండదు కదా అంటే యో-- ఇప్పటివరకు నీవు యోగివి కాదు నీవు అర్జునుడివి. నీవు ఎప్పుడైతే నాతో కూడి ఉంటావో యోగించి ఉంటావో పరమాత్మ భావనతో నీ భావన జమిలి చేశావో కలిపేశావో అప్పుడు నువ్వు యోగివవుతావు అప్పుడు ను-- నేను చేస్తున్నాను నేను చేశాను నేను చూశాను నేను నశించిపోయి ఇదంతా పరమాత్మే చేయిస్తున్నాడన్న భావనలోకి వెళ్తావు గనుక అర్జునా! నువ్వు "యోగీభవ అర్జునా" అప్పుడు అన్నాడు అర్జునుడు "కరిష్యే వచనం తవ" కృష్ణా! ఇప్పుడు నువ్వేం చేయమంటే పని నేను ఇప్పుడు చేస్తా "కరిష్యే" ఖచ్చితంగా చేస్తాను "వచనం తవ" నీ మాట ప్రకారమే నడుచుకుంటాను అన్నాడు. అంటే ఒక సత్పురుషుడితో మనం కూడి ఉన్నప్పుడు ఆలోచనలన్నీ మనం ఆకళింపు చేసుకున్నప్పుడు మనం కూడా సత్పురుషులమై మళ్ళీ కర్మ భక్తి జ్ఞాన యోగాలను మనం జీవితంలో అనుసరిస్తాం. అయితే ఇవాళ గీతా జయంతిలో మాములు ప్రవచనకారులు చెప్పే ఆదేశాలు సందేశాలు కాసేపు పక్కన పెడితే కృష్ణ పరమాత్మ జగత్తుకి ఇచ్చిన ఒక సూచన, అభయం ఏమిటి? ఏమవుతుంది? ఫలశ్రుతి కావాలి కదా అంటే ఏడువందల శ్లోకం మనం గుర్తు పెట్టుకోవాలి. "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయౌ భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" గీతా సారాన్ని విన్నా గీతా పారాయణం చేసినా గీతా అధ్యయనం చేసినా గీతా శ్లోకాలని ఉడిసి పట్టినా మనం ఆకళింపు చేసుకుని అధ్యయనం చేసి అనుభవించినా రెండు కారణాల వల్ల జరుగుతుంది. ఎట్లా అంటే నీకు బోధ చేసేవాడు యోగీశ్వర స్థాయిలో ఉండాలి "యత్ర యోగీశ్వరః కృష్ణో" ఎక్కడైతే యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ధనుర్ధారియై సిద్ధుడై శుద్ధుడై సంసిద్ధుడై ఉన్నటువంటి అర్జునుడు అంటే చెప్పేవాడు యోగీశ్వరుడు వినేవాడేమో శూరుడు. ఇద్దరూ కలిసిన ట్లయితే ఏమవుతుంది అంటే జగత్తులో ధర్మం నిలబడుతుంది. కేవలం బోధ వలన ప్రపంచం మారదు కేవలం యుద్ధం వలన ప్రపంచం ఆగదు. కాబట్టి ఇద్దరూ బోధించేవాడు వినేవాడు ఇద్దరూ కలిసి ఇవాళ మనం దానినే సనాతన ధర్మంలో కలిసిమెలసి ఉండాలి అంటాం. "సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై" అంటే అర్జునుడు కృష్ణుడు అర్జునుడు జీవ ప్రజ్ఞ అయితే కృష్ణుడు దైవ ప్రజ్ఞ. రెండూ కలిసినందువలన ప్రపంచంలో ఒక ధర్మం నిలబడుతుంది. సమాజానికి మంచి మార్గం ఏర్పడి సమాజం ఆరోగ్యకరమైన రీతిలో "ధ్రువా నీతిర్మతిర్మమ" దృఢమైనటువంటి ఒకన్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మసుఖౌశలమైనటువంటి అనేకమైనటువంటి ప్రజలతో కూడినటువంటి సమాజం ఏర్పడుతుంది గనుక గీతా జయంతి నాడు గీతా పారాయణం ఒక ఎత్తు అది ఆనందాన్ని కలిగిస్తుంది. గీతాబోధ ఒక ఎత్తు విషయాలు తెలుస్తాయి మరి ఏం చేయాలి? అంటే జరిగింది ఏదో జరిగిపోయింది జరుగుతూనే ఉంటుంది. ఇన్నేళ్లు జరిగింది కల్పాంతములు యుగాంతము వరకు కూడా భగవద్గీత జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి మహా స్థితిలో ఇది ప్రవహిస్తూనే ఉంటుంది గనుక మన బోటి వాళ్ళం మన తర్వాత తరం యువతరం గీతను చదవాలి rational గా చదవాలి అతి వాస్తవిక దృష్టితో చదవాలి scientific గా చదవాలి management skills తో చదవాలి మానసిక ప్రవృత్తులన్నింటినీ చక్కగా నివృత్తి మార్గంలోకి తీసుకు వెళ్లేట్లు గా వెళ్ళాలి ఎందుకంటే వృత్తి ప్రవృత్తి నివృత్తి మూడు కలిసి ఉన్నాయి వీటన్నింటికీ కావలసిన అన్ని ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది కనుక భగవద్గీత పారాయణం చేద్దాం గీతా మాత గీతా గ్రంథానికి పూజ చేద్దాం showcase లో పెట్టుకోకుండా దాన్ని బయటకు తీసి రోజుకు ఒక్క శ్లోకాన్ని గనక మనం అర్థం చేసుకుంటే రెండు సంవత్సరాలు పడుతుంది భగవద్గీత ఒకసారి అర్థం కావటానికి అట్లా రెండు మూడు ఆవృత్తులు చేసుకుంటూ మనందరం కూడా సద్బుద్ధితో సదాచారంతో సహజమైనటువంటి ఒక త్యాగబుద్ధితో ఎందుకంటే "న కర్మణా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వమానశుహు" చిరకాలము మరణించిన తర్వాత కూడా జీవించాలి అంటే నిష్కల్మషమైనటువంటి కర్మయోగం నిర్దుష్టమైనటువంటి కర్మయోగం పరిపూర్ణమైన భక్తి యోగం పరిపూర్ణమైన అనంతమైనటువంటి జ్ఞానయోగము మూడింటిని సమన్వయం చేసుకొని గీతా మాతని హృదయంలో పెట్టుకొని ఆత్మని కృష్ణుడుగా దేహాన్ని అర్జునుడిగా సంసార స్థలి అంతా కూడా రణరంగంగా భావించి మన జీవితాలను మనం ధన్యవంతం చేసుకోవటానికి గీతా జయంతి సందర్భం మనకి అనేకమైన అమృత భావనలు మన మనస్సు యందు మన హృదయమందు పటమరించు గాక అని మంగళాశాసనం చేస్తూ వందే జగద్గురుం. [అవుట్ ట్రో మ్యూజిక్]
YouTube · audio

సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

Home

సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 14:39

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

    Now playing
  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam