Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వత్మ సుఖావబోధే జనశ్చయే జంగలికాయ మారే సంసార హాలాహల మోహ శాన్యై ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాన్మే అంటే గురువు పూర్ణుడు గురువు శూన్యుడు పూర్ణంగా కనిపించే శూన్యము ఆకాశం శూన్యంగా కనిపించే పూర్ణత్వం ఆకాశం నిశ్శబ్దంగా కనిపించే ఆకాశం శబ్దమయం సంపూర్ణమైన ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఆకాశం అది ఆగిన తర్వాత అది నిర్మల ప్రశాంతమైనటువంటి ఒక పరమాద్భుతమైన వేదిక అది. ఇటువంటి సర్వవ్యాపకత్వాన్ని పొందినటువంటి ఆవ్యోమ పేశలమైనటువంటిది అటువంటి వాడు గురువు అటువంటి హృదయమే గురుహృదయం గనుక గురుపూర్ణిమ అషాఢ పూర్ణిమ గురుపూర్ణిమ అవుతున్నది ఇది వ్యాస పూర్ణిమిగా భారతదేశం అంతా కూడా ఒక పర్వదినంగా భావించి భాషించేటువంటి ఒక సన్మంగళ కాలం ఇది అయితే ఇంతకీ గురువు అంటే ఎవరు అని. గురువు లోపలుంటాడా వెలుపలుంటాడా? లోపల ఉంటాడు వెలుపల ఉంటాడు వెలుపల ఎలా ఉంటాడంటే బౌద్ధగా బోధించే వాడుగా ఉంటాడు ప్రబోధ ప్రచారం చేస్తూ ఉంటాడు లోపల ఉండే గురువు ప్రబోధము చేయడు ప్రచారము చేయడు ప్రసారం చేస్తాడు ప్రసారం చేసేటువంటి గురువు యొక్క స్వరూపం ఏమిటంటే అంగ్రాంగములు లేనటువంటి నిరంగుడైనటువంటి నిస్సంగుడైనటువంటి నికేతనుడైనటువంటి నిరంజనుడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపమే గురు స్వరూపం గనుక అది ఎక్కడ ఉన్నది అంటే గురువు ఆత్మగా వెలుగొందుతున్నాడు అని భారతీయమైన ఒక భావన దీనిని భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒక మాట చెప్పారు హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యహం అహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్వతా మధ్తతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం నేను నేను నేను అని నిత్య స్ప్రుహతో లోపల నువ్వు పని చేసినా పని చేయబోయినా ఏది ఆలోచించినా ఆలోచన పుట్టబోతున్నా దానికి ముందే నేను నేను నేను అని నిరంతరము ప్రకాశమానమై వెలుగుతున్నదో అదే నీవై అటువంటి ఆలోచనే ఆత్మనిష్ఠ అని భావించరాదా అది నీలోనే హృదయ గుహలో హృదయ స్థానంలో అనాహత చక్రానికి కుడివైపున ఒక రొమ్ము ఎక్కడైతే ఉన్నదో అది ఒక ఖాళీ గుహ వలే ఉంటే దానిలో నిరంతరము అనాహత నాదంగా వెలుగుతూ నినదిస్తున్నటువంటి నిశ్శబ్ద శబ్దమయమైనటువంటి నేనే అహం వృత్తిగా అహం స్పురణగా అహం గా వెలుగుతూ ఉన్నది. అహమే ప్రకృతితో కూడినప్పుడు అహంకారం అవుతున్నది ప్రకృతి నుంచి విడివిడినప్పుడు అదే నీ లోపల అహమై నిలుస్తున్నది గనుక అహం స్పురణామూర్తిగా మానవ జీవితం సాగాలి అని జ్ఞాన గురువైనటువంటి రమణుల బోధ ఇది ఒక ఎత్తు అయితే పౌరాణిక గతమైనటువంటి దాంట్లో ఒక హెచ్చరిక ఉన్నది నీ ఆత్మోన్నతికి గనక నీ గురువే అడ్డుపడుతున్నట్లయితే గురువుని ధిక్కరించమన్నది శాస్త్రం శాస్త్రమే కాదు పురాణం పురాణం ప్రధానంగా వామన పురాణంలో వామనావతార ఘట్టంలో ఇది ప్రధాన అంశంగా మనం గనక తీసుకున్నట్లయితే కథా కథన వేగంగా మనం దాన్ని ద్వైతాద్వైత మార్గంలో విచారణ చేసినట్లయితే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. బలి చక్రవర్తి దానవాహంకారం లేదు దానాహంకారం ఉంది దానాహంకారంతో ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు అహంకారంలో ఒక భాగం అది కూడా టైంలో అంటే సమయంలో తాను చేసేటువంటి దాన గ్రహీత తన నుంచి ఏది పొందాలో ఏది అడిగినా ఇవ్వగలిగిన స్థాయిలో తాను ఉన్నాడో అది జగత్తుకి చెప్పాలి. సందర్భంలోనే కశ్యపుడు అదితిలో దంపతులలో అదితి శ్రీ మహావిష్ణువుని ఒక ప్రార్థన చేసింది ఏమనంటే భగవాన్ నా కడుపున నీవంటి బిడ్డ ఒకడు పుట్టాలి అలా అనుగ్రహించు అన్నది ఆయనేమన్నాడు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అసలు రెండో వాడంటూ లేడు ఉన్నదంటూ నేనే కనుక నాకంటే మరొకడు లేడు గనుక నేనే నీ కొడుకుగా వస్తాను అన్నాడు వచ్చిన వాడే వటువు వచ్చిన వాడే వామనుడు వామనుడు అంటే వమనమైనటువంటి వాడు తనను తాను బయటకు తెచ్చి ప్రపంచానికి ఇచ్చుకున్న వాడు అని అర్థం సరే ఆయనకి ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు ఇందాక అనుకున్నాం కదా కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై పరమాత్మ వస్తాడు లోకంలోకి ఆయన అలాగే వచ్చాడు వస్తూనే ఉపనయనం అయిన తర్వాత యజ్ఞ వాటికలోకి ప్రవేశించాడు తేజస్సుని వచ్చస్సుని మహస్సుని అన్నింటినీ గమనించినటువంటి ఆహూతులందరూ కూడా ఒక దివ్య దర్శనాన్ని అనుభవిస్తున్నటువంటి వేళ బలి చక్రవర్తి హృదయం కూడా పల్లవించింది ఆయనను సమీపించాడు సాదరంగా తోడ్కొని యజ్ఞ వాటికలోకి తీసుకుని వెళ్ళాడు నీకేం కావాలి అని అడిగాడు అది మనకి కథ ప్రకారం మూడడుగుల నేల అడిగాడు సరే అని అన్నాడు సరే అనేటువంటి సమయంలో తన గురువైనటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి మంచి ఆలోచనలకు తావిస్తాడు దానవ గురువైనటువంటి శుక్రాచార్యుడు నెగెటివ్ ఎనర్జీకి సంకేతంగా పురాణాలు మనకి అభివర్ణనం చేసినయి కనుక ఆయనన్నాడు నాయనా బలిఈ వచ్చిన వాడు మాయావి కాబట్టి నీ సంపదని, నీ కుల గౌరవాన్ని, నీ వంశ వృద్ధిని సర్వాన్ని హరించటానికి వచ్చాడు గనుక హరించటానికి వచ్చిన హరి వీడు జాగ్రత్తగా ఉండు అన్నాడు. వచ్చిన వాడు ఎవడైతే ఏమి నాకిది కావాలి అని అడిగినటువంటి అర్ధి నా వాకిట్లో ఉన్నాడు. ఇవ్వటం అనేది నాకు సంకల్పం అది నాకు దాన వ్రతం దానం అనేది నాకు కేవలం చర్య కాదు వ్రతం. వ్రతంలో పా ప్రధానంగా యజ్ఞం జరుగుతున్న సమయంలో యజ్ఞ వాటిక లోకి వచ్చి బ్రహ్మచారి అయి పరిపూర్ణమైన మహా తేజస్సుతో వచ్చి ఏమి అడిగాడు నన్ను కేవలం మూడు అడుగుల నేల అడిగాడు అంటే అట్లా కాదు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక చేశాడు శుక్రాచార్యుడు. సరే ఇద్దరి మధ్య ఎవరిది వామనుడి మధ్య బలి చక్రవర్తి మధ్య అనేక మాటలు జరిగినాయి. నువ్వు నా అంతటి వాడిని మూడు అడుగుల నేల అడుగుతావా? ఒక లక్ష గోవులు అడగాలి, భూమి అడగాలి, భాండాగారం అడగాలి, స్వర్ణం అడగాలి ఇట్లా అనేకమైనటువంటివన్నీ కూడా అడగాలి మూడు అడుగుల నేలకు అర్థమే లేదు. ఇది నా స్థాయికి స్థితికి సంబంధించింది కాదు చాలా స్వల్పమైన కోరిక మళ్ళీ ఇంకేదన్నా అడుగు అన్నాడు. మూడు అడుగులు దాటి నాకేం అక్కర్లేదు అన్నాడు. సరే ఇదంతా అయిన తర్వాత పక్కనుంచి శుక్రాచార్యుల వారు బోధ చేస్తున్నాడు ఇవ్వద్దు అని అప్పుడు అన్నాడు ఖారే రాజులు రాజ్యములు కలుగవే మన వామనా అవతార ఘట్టం అంతా పోతన గారు మనకి కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు. ఇది ప్రతి తెలుగువాడు ముందు చదువుకోవాలి. తెలుగు వాడి ఆస్తి ఏమిటంటే ప్రాపంచికమైనవి కావు ఇవి మాత్రమే మనకు నిజమైన ఆస్తి కాబట్టి చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఆయన అప్పుడు అన్నాడు ఎంతమంది రాజులు రాజ్యాలు పాలించి వెళ్లిపోలేదు ఎవడన్నా ఇక్కడ ఉండగలిగారా? వెళుతూ వెళుతూ ఏదన్నా పట్టుకుని వెళ్లగలిగారా? ఇది నాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం మీరు ఏం చెప్పినా నేను ఇవ్వాలని అనుకున్నాను అన్నాడు. శుక్రాచార్యుడికి అర్థమైంది తన శిష్యుడు తన మాట వినబోవటం లేదు అని కానీ ఆయనకు కూడా తెలుసు దీన్ని ఎట్లా అడ్డుకోవాలి అది తర్వాత. అప్పుడు తన భార్యను పిలిచి ఒక బంగారు పళ్ళెం తెప్పించి నీరు తెప్పించి బంగారు కలశంలో బలి దైత్యేంద్ర కరద్వయీ కృత జల ప్రక్షాళన వ్యాప్తి కించలజాత అక్షుడు సాచే యోగి సుమనస్ సం ప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నళినా మోదము రతనం పురిత నానా వేదమున్ పాదమున్ సమస్త వేదములు ధరించినటువంటి దివ్య పాదములకు ప్రక్షాళన చేసి అక్కడ నుంచి శిరసుపై నీళ్లు చల్లుకొని దానం చేయబోతున్నాడు. సగం అవుతుండగా శుక్రాచార్యుల వారు ఒక కంటితో దాన ధారకి అడ్డుపడ్డాడు జలధారకు అడ్డుపడ్డాడు. పడ్డప్పుడు వటువుకి తెలుసు దర్భ తీసుకున్నాడు దానిని తొలగించే ప్రయత్నం చేశాడు తద్వారా ఒక కన్ను పోయింది శుక్రాచార్యుడికి. సరే శుక్రాచార్యుడు విరమించుకున్నాడు వ్రతం సాగింది దాన వ్రతం అయిపోయింది. అయిపోయిన తర్వాత మొదటి నేల అయిపోయింది రెండోది ఆకాశం అయింది మూడోది ఎక్కడ అన్నాడు ఏం లేదు మరి ఎక్కడ అప్పుడు అప్పటికీ శుక్రాచార్యుల వారు చెప్తున్నారు గురువు నాయనా వద్దు వద్దు అని. ఈయన వినటం లేదు ఏం లేదు నా శిరస్సు మీద పెట్టు నేను ఏం చేయగలను అన్నాడు. మామూలుగా ప్రవచనకారులు కళాకారులు అంతా కూడా పాతాళానికి తొక్కేశాడు అని చెప్తున్నారు ఆయన తొక్కలేదు. ఇంత మహత్పూరణమైనటువంటి ఒక దానాన్ని దానం చేసినటువంటి యజ్ఞ భాగంలో ఒక భాగంగా చేసుకున్నటువంటి బలి చక్రవర్తికి శిరస్సు మీద ఉన్నటువంటి బ్రహ్మ రంధ్రం పైన వటువు యొక్క పాదం మోపాడు. పాదం కింద ఏమున్నాయి అగస్త్య రేఖలు ఉన్నాయి శ్రీ భూయుత శ్రీహరి చిహ్నిహితాభ్యాం అగస్త్య రేఖాద విరించితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం మన అరచేతులలో కర్మ రేఖలు గురువు యొక్క పాదాల అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి రెండూ తాకినప్పుడు మనకి కర్మ రేఖలు అన్నీ కూడా క్షణం వరకు జరిగిన కర్మలు వాటి వలన కలిగిన అనుభవాలు నశించి మనం ముక్తులం అవుతామని గురు పాదుకా స్తోత్రం మనకు చెప్తూ ఉన్నది. అట్లా పాతాళానికి పంపుతూ ఆయన అన్నాడు మరి నేను ఏం చేయను అక్కడ పాతాళ లోకంలో నాకు పని ఏమిటంటే నీకు మళ్ళీ ఇంద్ర పదవి వచ్చేదాకా హరినామస్మరణ చేస్తూ ఉండమని చెప్పాడు గురువు. గురువు ఎవరు శుక్రాచార్యుడు కాదు వటువైనటువంటి వామనుడు అక్కడ భగవత్ భగవంతుడు గురువై వచ్చాడు గోవిందుడు గురువై వచ్చాడు లోక గురువుగా ఉన్నటువంటి శుక్రాచార్యుడు మంచి కార్యక్రమానికి అడ్డుపడ్డాడు ఆత్మోన్నతికి అడ్డుపడ్డాడు గనుక ఇద్దరు గురువుల యొక్క సమ్మేళనం మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు అన్నాడు నువ్వు ఒక్కడివే కాదు ఇంతకుముందు నీ తాత ప్రహ్లాదుడు నాయందు మధుర భక్తి చేత ఉండిపోయినాడు ఇంకా కైవల్యం పూర్తిగా రాలేదు గనుక నీకు తోడుగా నీ తాత ప్రహ్లాదుడు కూడా నీతోనే ఉంటాడు మీ ఇద్దరికీ రక్షణగా ఆరక్షణగా సుదర్శన చక్ర రూపంలో నేను మీకు ఇంద్ర పదవో అదేదో వచ్చేదాకా నేనుంటాను మీరు పాతాళంలో ఉండండి అన్నాడు. దానం కార్యక్రమం జరుగుతున్నప్పుడు బలి చక్రవర్తి యొక్క కుమార్తె రత్నావళి చూస్తూ ఉన్నది. చూస్తూ ఆమెకు మా మనసు కలిగింది ఒక చిన్న కోరిక పుట్టింది ఏమిటా కోరిక అంటే వటువు యొక్క తేజస్సు ఆమెని ఆకర్షించింది సహజం కదా అది భగవంతుడి యొక్క శక్తి. ఎప్పుడో రోజున నాకు వివాహం అవుతుంది నేను మాతృమూర్తిని అవుతాను నేనంటూ కంటే ఇటువంటి బిడ్డని కనాలి అనుకున్నది వ్రతానికి ముందు.వ్రతం అయిపోయిన తర్వాత తన తండ్రిని పాతాళానికి పంపించినప్పుడు అదే రత్నావళి మనస్సు రెండుగా చీలింది. ఎప్పటికైనా ఒక జన్మ ఎత్తి నా తండ్రిని ఇంత బాధించినటువంటి ఈతనికి నేను ఎట్లాగైనా ఒక శిక్ష వేస్తాను అని నిర్ణయం తీసుకున్నది. ఆమె తదనంతర కాలంలో కృష్ణావతారంలో పూచిన తనువై పూతనై వచ్చింది రత్నావళి. వచ్చి తల్లి అయింది కావాలనుకున్నది కదా! తల్లి అయి తన నుంచి స్తన్యాన్ని ఇచ్చింది. పరమాత్మకి ఆమెకు ఎటువంటి ఉద్ధారణ ఇవ్వాలో గనక జన్మాంతర సంస్కారగతమైనటువంటి వాసనా పూరితమైనటువంటి స్తన్యాన్ని అంటే చనుబాలను తాను తాగి తాగి ఆమెకు ఉద్ధారణ ఇచ్చినప్పుడు ఆమె మరణించినప్పుడు నందుడు వచ్చి ఆమె శరీరాన్ని కోసినప్పుడు దానిలో నుంచి దివ్య పరిమళాలు ప్రపంచమంతా కూడా వ్యాపించినై అని భాగవతం మనకు చెప్తూ ఉన్నది. అంటే గురువులు ఇక్కడ వామనుడు గురువుగా వచ్చాడు జగద్గురువుగా వచ్చాడు దైవతంగా వచ్చాడు. ఒకానొక కాల ఒకానొక క్షణంలో బిడ్డగా కనిపించాడు తదనంతర కాలంలో బిడ్డగా నిలబడ్డాడు కానీ సర్వ సముద్ధరణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేశాడు. అందుకనే ఇవాళ గురువు ఎవరంటే గురువు పూర్ణుడు గురువు శూన్యుడు గురువు ఆంతరంగికుడు గురువు బాహ్య ప్రపంచంలో మనను నడిపించేటువంటి కర్మయోగ విధాత భక్తి భావ విధాత అంతేకాదు జ్ఞాన ప్రదాత. అటువంటి గురువుకి మనం నమస్కరిస్తూ గురువు అంటే కేవలం మన కంటే అధికుడనో చదువుకున్న వాడనో కాదు మనను నడిపించేవాడు గురుతు చూపించేవాడు. గురుతు జీవన సాఫల్యానికి జీవన గమనానికి జీవన గమ్యానికి నెమ్మదిగా ప్రసన్నంగా ప్రశాంతంగా హాయిగా చేర్చగలిగినటువంటి గురు స్వరూపమే గురువు గనుక "గురు గోవింద్ దోనో ఖడే కాక లాగూ పాయే బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే" ఇతడు దైవము అని చూపించగలిగిన శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది గనుక అటువంటి గురువుకి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఇది గురుపూర్ణిమ అషాఢ పూర్ణిమ మన జీవితాలలో ఆనంద మాలికలు పూర్ణిమ మాలికలు నింపు గాక అని సర్వ గురువులను ప్రార్థిస్తూ మంగళాశాసనం చేస్తూ "వందే గురు నామ్ చరణారవిందే" [outro jingle] ముందుగా యోగ ఆసనాలు ప్రారంభించే ముందు ప్రార్థన ప్రార్థనతో మొదలు పెడదాం.
YouTube · audio

సన్మార్గం | Sanmargam

Home

సన్మార్గం | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 15:27

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

    Now playing
  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam