Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] ఒక వ్యక్తి సమూహం కాదు. ఒక చెట్టు వనం కాదు. ఒక గ్రామం దేశం కాదు. ఒక దేశం ప్రపంచం కాదు. వ్యష్టి అంటే వ్యక్తి, సమష్టి, సృష్టి, ఆపై పరమేష్టి. ఇది క్రమం. అంటే ఒక మహా భూజం అంటే ఒక పెద్ద మర్రిచెట్టు ఒక చిన్న విత్తనంలో దాగినట్లుగా ప్రపంచం అంతా కూడా ఒక వ్యక్తి యందు దాగి ఉన్నది. వ్యక్తి అంటే వ్యక్తమైన వాడు అని అంటే అభివ్యక్తమైన వాడు, తనను తాను ఆవిష్కరించుకున్న వాడు అని అర్థం. కాబట్టి వ్యక్తి మూలమై ఉన్నాడు. ప్రపంచానికి, దేశానికి, సమాజానికి, సంఘానికి మూలమై ఉన్నటువంటి వాడు సంస్కరింపబడకపోతే ఏమవుతుంది? అంటే పరిణామ క్రమంలో నాగరికతా పరిణామ క్రమంలో జరిగేటువంటి అనేకమైనటువంటి విశేషాలలో వ్యక్తి వికాసం చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే ఎనభై తొమ్మిది లక్షల జీవరాశులు ఎనభై నాలుగు అంటారు, ఎనభై తొమ్మిది అని [గొంతు సవరించిన శబ్దం] మధ్య మనం అనుకున్నట్లుగా దానిలో ఒక మానవుడు మాత్రమే అభివ్యక్తి చేయగలడు, మాట్లాడగలడు. తన యొక్క భావాన్ని ఒక భాషగా, ఒక భావంగా, ఒక అనుభవంగా, ఒక అనుభూతిగా, ఒక విభూతిగా ఆవిష్కరించగలిగినటువంటి సర్వ శక్తిమంతుడు ఎవరంటే మానవుడు మాత్రమే. కాబట్టి మానవుడికి అనేకమైనటువంటి ప్రజ్ఞా భూమికలు ఉన్నాయి. ప్రజ్ఞా భూమికలన్నీ కూడా తన యందు నిక్షిప్తం అన్నయ్-- ఉన్నాయి. అంటే దాగి ఉన్నాయి. దాగి ఉన్నటువంటి వానిని తనంతట తాను వికాసం చెందించుకోవాలి. ఎట్లాగైతే ఒక మొగ్గలో ఒక పువ్వు ఎలా ఉన్నదో, పువ్వు వికాసమానం అవుతున్న కొద్ది తనలో ఉన్నటువంటి శోభకులు, రంగులు, హంగులు, పరిమళాలు అన్నీ కూడా ప్రపంచానికి ఎట్లా తెలుస్తున్నాయో అలాగే ఇదిగో వ్యక్తిలో ఉన్నటువంటి అనేకా అనేకమైనటువంటి ప్రజ్ఞలన్నీ కూడా బయటకు రావలసి ఉన్నది. దీనికి ఏం చేయాలి? ఏం చేస్తే అది జరుగుతుంది? అని గనుక ప్రశ్నించుకున్నట్లయితే, వ్యక్తి సమూహాన్ని సృష్టిస్తున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి ఆవరణంలో అనేకమందిని ఏకోహం బహుష్యామి అని తనను తాను విభజించుకుంటూ ఉన్నాడు. తనను తాను అనేక విధాల అనేకమందిని తయారుచేసి మందిని తను ఏకీకృతం చేసుకునేటువంటి విధానంలో నుంచి ఒక వ్యక్తి వికాసమానం చెందుతున్నాడు. వికాసమానం ఎలా జరగాలి? అసలు వ్యక్తి వికాసం అంటే ఏమిటి? అంటే మనో వికాసము ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్లయితే మనిషి తనలో ఉన్నటువంటి గుప్తంగా, నిగూఢంగా, నిశ్శబ్దంగా, నిస్తంద్రమంద్రంగా కనిపించి కనిపించనట్లుగా ఇంకా అనుభవంలోకి రానట్లుగా ఉన్నటువంటి అనేక ప్రజ్ఞలు బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం ఇవన్నీ కూడా దాటుతూ దాటుతూ తనలో ఉన్నటువంటి వ్యక్తిని ఆవిష్కరించుకుంటాడు. వ్యక్తికి వికసించబడినటువంటి ఒక వ్యక్తిలో ఉన్నదానిని personality అంటున్నాం. personality అంటే ఒడ్డు పొడుగు కాదు. వ్యక్తిలో ఉన్నటువంటి పరసన అంటే దివ్యత్వం. దివ్యత్వం unmanifested గా ఉన్నది. దానిని manifested గనుక చేయగలిగినట్లయితే అంటే వికాసమానం చేయగలిగినట్లయితే ఒక వ్యక్తి వికాసంలో నుంచి పరమాద్భుతమైనటువంటి ఒక మంది సృష్టింపబడినప్పుడు అది సమాజంగా ఏర్పడినప్పుడు సమాజం వికాసమానం చెందింది అని అర్థం. శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో ధూర్జటి అనే ఒక మహాకవి ఉన్నాడు. ఆయన రోజూ రాజస్థానానికి వెళ్లి పద్యం పాడేవారు. లేదు శ్లోకం చేయరు, ఎక్కువగా పద్యాలు పాడారు. పద్యం పాడగానే మొదటి రోజు రాజుగారి మీద పాడితే రాజుగారు అగ్రహారం ఇచ్చారు. మరనాడు ఒక రాణిగారి మీద ఇచ్చారు. ఆవిడ నగలు ఇచ్చింది. రాజనర్తకి మీద మళ్ళీ పద్యం రాశారు ఆయన. ఆమె ఏదో ఆమె ఇవ్వగలిగింది ఆమె ఇచ్చింది. ఇట్లా ఆయన పాడటం, వస్తువులు పొందటం ఇలా జరుగుతూ ఉన్నది. పద్యం రాయటంలో మంచి దెట్ట. తనకే ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞ. ప్రజ్ఞ నెమ్మది నెమ్మదిగా ఏమైంది అంటే ప్రపంచంలో వ్యక్తికి రానంత ఖ్యాతి, ఎవరికీ రానంత సంపద ఆయన చుట్టూ ఏర్పడిపోయినాయి. పద్యం అంటే ధూర్జటి, ధూర్జటి అంటే పద్యం అన్నటువంటి స్థాయికి వెళ్లారు. సమయంలో ఒకరోజు మనిషైనా ఏకాంతంలో కూర్చున్నప్పుడు జరిగిన కాలము, జరుగుతున్న కాలము రెండింటిని సమన్వయం చేసుకున్నప్పుడు ఇకపై ఏమిటి? అధాతో బ్రహ్మ జజ్ఞాస అని ఒక మాట ఉంది కదా. తర్వాత ఏమిటన్నదే మానవుడు వేసుకోవలసిన ప్రశ్న. జరిగింది ఏమిటి? అది ఏం మిగిల్చింది అంటే ఆనందమో, బాధ మిగిల్చింది. జరుగుతున్నది ఏమిటంటే జరుగుతూ ఉన్నది ఇంకా అనుభవం కాలేదు. అనుభవం అవుతూ ఉన్నా అనుభూతి దొరకలేదు. మరి జరగబోయేది ఏమిటంటే అది కాలానికి చిక్కేది కాదు, మనసు పట్టుకోగలిగింది కాదు, ఊహించగలిగింది కాదు, అలాగే ఉండాలని అనుకోవటానికి వీలు లేదు గనుక, భూతకాలము, వర్తమానము రెండూ కలిపి భవిష్యత్తును నిర్మిస్తూ ఉన్నాయి గనుక, ఈయన ధూర్జటి ఒకరోజున ఆలోచనలో పడ్డాడు. ఇలా వెళ్తున్నాను, శారదాదేవి అనుగ్రహంతో పద్యాలు పాడుతున్నాను. పాడినప్పుడల్లా అగ్రహారాలు వచ్చేస్తున్నాయి. మరి రాజుగారు ఆనంద పరవశులై పోతున్నారు. ఎందుకంటే ఆయన సంకీర్తన చేస్తున్నాను. అలాగే రాణిగారు, అలాగే రాజనర్తకి మరి ప్రజంతా కూడా భగవంతుడి వైపు గనక మళ్ళించకపోతే నా జీవితం ఏమిటి? అనుకున్నాడు.ఒక వ్యక్తికి ఆయన ఒక ప్రతీకగా గనక మనం చూసుకున్నట్లయితే ఆయనలో నుంచి ఒక ఆవేదన, పరివేదన, నివేదనగా మారి "రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు. వారిచ్చు అంభోజాక్షి చతురం తయాణ తొరగి భూషాదులు ఆత్మవ్యధా బీజముల్. తదపేక్ష చాలు. పరితృప్తిన్ చెందితిన్. జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా" అనుకున్నాడు. రాజు గారికి నేను పొగిడినప్పుడల్లా మైకం కలుగుతున్నది. అగ్రహారాలు ఇచ్చాడు, ఆడగుర్రాలు ఇచ్చాడు, పల్లకీలు ఇచ్చాడు, చీని చీనాంబరాలు ఇచ్చాడు, ఆభరణాలు ఇచ్చాడు. ఆయన ఇవ్వనిది ఏమున్నది? కానీ అవి నాకు తొలినాళ్లలో సుఖాన్ని ఇచ్చినయి. అది దేహానికి సంబంధించింది. పై కాలంలో మనస్సుకి సంతోషాన్ని కలిగించినయి. అది మనస్సు అనుభవించింది. కానీ ఆనందం ఇంకా నాకు దక్కలేదు. నాలో ఉన్నటువంటి ఒక ఆత్మ, ఇందాక అనుకున్నామే దివ్యత్వం, అది ఎక్కడో కుంటుపడుతున్నట్లు అది ఇంకా అందుకోవలసినది, అనుభవించవలసినది అంటూ ఏదో ఉన్నదని తహతహలాడుతున్నది. తహతహ నాకు వ్యధ అయిపోయింది. ఆత్మవ్యధ బీజముల్ అక్కడ మొదలైంది. ఇక చాలు. సంపాదన, ఐశ్వర్యం, కీర్తి, ఆదరణ, రాజాదరణ, పోషణ ఇవన్నీ కూడా చాలు. జాగ్రదవస్థ లో ఉండగానే నా కళ్ళు, కాళ్ళు, కీళ్ళు, ఇంద్రియాలు పనిచేస్తూ ఉండగానే "జాగ్రత్ పరిణామమిమ్ము దయతో" నాలో ఉన్నటువంటి జాగ్రత్ అంటే వికాసమానం. ఒక స్పర్శ, ఒక అద్భుత స్ఫురహ, ఇవన్నీ గనక నాకు కలిగినట్లయితే మిగతావి నాకు ఏమీ అక్కరలేదు అనుకున్నాడు. అనుకున్నాడు కదా! వ్యక్తి వికాసంలో మొట్టమొదట ఆత్మవ్యధ ఏమిటో కనుక్కున్నాడు ఆయన. ఉన్నవన్నీ ఆయనకి సంతోషం కలిగించుటలా. ఇంకా కావలసినవంటూ ఏమీ మిగలలేదు. రేపు ఏమిటన్న ప్రశ్న లేదు. ఒకే ఒక్క ప్రశ్న. మహోత్కృష్టమైనటువంటి ఒక మానవ జన్మ ఎత్తి ఒక ప్రజ్ఞామూర్తి నైనటువంటి నేను ఏం చేస్తున్నాను అని ప్రశ్న పొటమరించినప్పుడు ధూర్జటి నిర్ణయం చేసుకున్నాడు. కాళహస్తీశ్వరుని గురించి ప్రార్థన చేద్దాం అని వెళ్ళాడు. వెళితే ఆయన స్వర్ణముఖీ నదీ తీరంలో కూర్చున్నాడు. ఎక్కడా మాట రావటం లేదు, పదం పలకటం లేదు, భావం పుట్టటం లేదు, భాష అందుబాటులో లేకుండా పోయింది. ఏమైంది? ఇదంతా దీని వల్లనే కదా ఇంతవాడినయ్యాను. మరి నాలో వికాసమానం జరగలేదా? ఎందుకని జరుగుతున్నటువంటి క్రమంలో నన్ను ఎందుకు ఇంత యాతన పెడుతున్నది ప్రక్రియ? అని అనుకుంటూ ఆయన ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే వ్యక్తి ఒక దారిన వెళుతూ వెళుతూ అదే రహదారి అనుకుంటాడు. అదే రాజమార్గం అనుకుంటాడు. దీనిని మించి మరొక మార్గం లేదనుకుంటాడు. మార్గంలో వెళుతూ వెళుతూ ఉంటే సంపదలన్నీ చేకూరుతూ ఉంటాయి. భోగమయమైనటువంటి జీవితాన్ని హాయిగా వృద్ధాప్యం వచ్చినా కూడా సుఖంగా నడుపవచ్చు కదా అని అనుకుంటాడు. సమయంలో ఎంత చూసినా ఆయనకి రకమైన ఆలోచన పుట్టటం లేదు. ఒకరోజున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అంటే బ్రాహ్మీ ముహూర్తము అంటే ముహూర్తంలో మనతో మనం ఉండే ముహూర్తమే బ్రాహ్మీ ముహూర్తం. మనలో మనం ఉండగలిగితే అది బ్రాహ్మీ ముహూర్తం. తొలిజాము వేళకు వెళ్ళాడు. వెళ్లి కూర్చున్నాడు. స్వర్ణముఖీ నదీ తీరంలో కూర్చున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా చూశాడు. ప్రకృతి అంటే ఏమున్నది? తూర్పున ఒక కొండ ఉన్నది. ఆకాశం ఉన్నది. ఆకాశంలో చుక్కలున్నాయి. చంద్రుడు అప్పుడప్పుడే మెరుగబారుతూ ఉన్నాడు. ఇంకా చీకటి పోలేదు. వెలుగు విచ్చుకోలేదు. ఇది సన్నివేశం. "ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహమ్ము వార్ధి ధరీధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారా నివహంబుల్ అర్పిత సుమంబుల్ గా తమోదూర సౌఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగంబుప్పె ప్రాచీదిశన్" పద్యం. లోపల నుంచి అభివ్యక్తమైంది. పద్యం ఆయన గుండె లోతులలో నుంచి, పరివేదనలో నుంచి, జీవుని వేదన అంటారు. జీవుని వేదనలో నుంచి వచ్చింది. ఏమిటంటే, ఏమిటి? శివుడు ఎక్కడో ఉన్నాడని నేను అనుకోవటం ఏమిటి? కాళహస్తీశ్వరుడు అంటే ఎవరు? నా ముందున్నటువంటి ప్రకృతి అంతా కూడా శివాయతనమై భాసిస్తూ ఉన్నది కదా, వెలిగిపోతున్నది కదా, తూర్పు కొండ నాకు శివలింగంగా ఉన్నది. పై నుంచి వస్తున్నటువంటి నీళ్లు అభిషేక జలం లాగా ఉన్నాయి. అలాగే నెమ్మది నెమ్మదిగా పారుతున్నటువంటి సువర్ణముఖీ నదీ జలాలన్నీ అభిషేక జలాలై వెళుతూ ఉంటే దానిలో అవి చాలా నిస్తంద్ర మంద్రంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, సరళంగా, సూటిగా, గంభీరంగా, ఉదాత్తంగా వెళుతూ ఉంటే దానిలో ఆకాశంలో ఉన్నటువంటి అంటే మింటిని అంటిన చుక్కలన్నీ కూడా అప్పుడే చేసిన పూజా పుష్పాలు సాగిపోతున్నట్లుగా ఉన్నాయి. ఇంకా వెళ్ళనటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడంటే కర్పూర కళిక లాగా ఉన్నాడు. నా చుట్టూ ఆవరించి ఉన్నటువంటి చీకటి ఏదైతే ఉన్నదో చీకటి అంతా కూడా అప్పుడే వేసిన ధూపం లాగా ఉన్నది. ఇదంతా కలిపినప్పుడు నాకు పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు అనుకున్నాడు. అంటే వ్యక్తి వికాసం జరుగుతూ ఉన్నది చూడండి. ఒక బీజం, ఒక ఆలోచన, ఒక స్పందన, ఒక స్పర్శ, దానిలో నుంచి కలిగినటువంటి ఒక భావనలో నుంచి ఒక వ్యక్తి అనబడేటువంటి ధూర్జటి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అంతా కూడా పరమేశ్వర భావన చేశాడు. చేసి చివరగా ఒక మాట అనుకున్నాడు. [గొంతు సవరించిన శబ్దం] అడగాలి కదా పరమేశ్వరుడ్ని, నాకు ఆత్మవ్యాధ లేకుండా చేసినటువంటి వ్యక్తిగా నేను సమాజంలోకి వెళ్లి ఇటువంటి సమాజ నిర్మాణం జరగాలి, ఆలోచన పుట్టాలి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు వచ్చాను, నా జీవిత లక్ష్యం పరమము, గమ్యము అయినటువంటిది ఏమిటి? అంటే లక్ష్యం ఒక సిద్ధి. గమ్యం ఒక సిద్ధి. రెండు సిద్ధుల మధ్య గమనం ప్రధానం. మనం కూడా అంతే. మనం కూడా జీవితంలో ఇది కావాలి అనుకొని బయలుదేరాలి. దానిని చేరే ప్రయత్నం చేయాలి. కానీ చేరే ప్రయత్నం, గమనం ఎలా ఉండాలంటే సమాజహితంగా ఉండాలి, పరమేశ్వరాయత్తంగా ఉండాలి. సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి పరమేశ్వరుడి యొక్క శక్తే కారణమని భావించి ఏది చేసినా దేని గురించి కూడా ఆలోచించకుండా ఈశ్వరార్పితం చేయగలిగినటువంటి ఒక స్థితిలోకి వెళ్లగలిగినట్లయితే అఖండమైనటువంటి భారత జాతి దాని ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే అధ్యాత్మలో ఉన్నది గనుక వ్యక్తి వికాసంలో నుంచి సమాజ వికాసం చాలా స్మూత్ గా అంటే చాలా సరళంగా, సునాయాసంగా, అనాయాసంగా సాగిపోతుంది గనుక ఒక ఆరోగ్యకరమైన, ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్తు నిర్మాణం భూత వర్తమానాల సమన్వయంలో నుంచి ఏర్పడుతుంది. కనుక వ్యక్తి వికాసం సమాజ వికాసం కావాలి. ఎందుకంటే వ్యక్తులందరూ కలిస్తేనే సమాజం అయింది. సమాజంలో నుంచి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు రావాలంటే ఎటువంటి సమాజ నిర్మాణం జరిగిందో దానిలో నుంచి పరమాద్భుతమైనటువంటి ప్రజ్ఞా స్వరూపాలన్నీ బయటకు వస్తాయి గనుక వ్యక్తి వికాసం అన్ ఫోల్డ్మెంట్ జరగాలి, డెవలప్మెంట్ కాదు. మనం రెండు పదాలు వాడుతున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు పర్సనాలిటీ అన్ ఫోల్డ్మెంట్. "జాగ్రత్ పరిణామమిమ్ము దయతో" అన్నాడు. చూశారా? జాగ్రత్ పరిణామం కావాలి. అలాగే ఆయన అంటాడు, నిరంతరము నేను చేసినటువంటి అనేకమైనటువంటి కర్మలు మొగ్గలై ఉంటే, అనుభవాలన్నీ మీద పడుతూ ఉంటే మనోవికాసం జరగటం లేదు. జరగటం లేదు అని తెలుసుకున్నానే అదే నా అనుభవం. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి సమాజ నిర్మాణంలో నాకొక పాత్రనివ్వమని పరమేశ్వరుణ్ణి అడిగాడు ధూర్జటి. అందువల్ల ఇవాళ మనకు రోల్ మోడల్ ఎవరంటే ధూర్జటి అయినాడు.
YouTube · audio

సన్మార్గం | Sanmargam | EXPERT

Home

సన్మార్గం | Sanmargam | EXPERT

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 13:51

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

    Now playing
  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam