⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
[ఇంట్రో మ్యూజిక్] "మధుశ్చ మాధవశ్చ వాసంతీకా వృతౌ" అంటుంది యజుర్వేదం. ఈ యజుర్వేదంలో దేనిని గురించి ప్రస్తావన అన్నది అంటే వసంత కాలాన్ని గురించి. మానవ జీవితంలో అన్ని రుతువులలోనూ వసంత ఋతువు మహోత్కృష్టమైనటువంటిది, సుందరతమైనది, ఆహ్లాదకరమైనటువంటిది గనుక ఈ సమయంలో మధువు మాధవుడు అంటే మధువు అంటే మనకు తెలుసు తేనే. మాధవుడు అంటే మా అంటే భూమి. దాని ధవుడు ఎవరు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అంటే పౌరాణిక విష్ణుమూర్తి అని కాదు. భూమాతని భరించేటువంటి ఆతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు గనుక ఆరు రుతువులలోనూ వసంత ఋతువు స-సమున్నతమైనటువంటిదిగా వేదం భావించింది. అయితే ఉగాది ఎప్పుడు ఏర్పడింది అనేటువంటిది ప్రశ్న. మానవ జీవన పరిణామ క్రమంలో ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి మానవుడు ప్రకృతికి అతీతమైనటువంటి భూగోళ ఖగోళాలని అనుభవిస్తూ వాటి మూలాలని అన్వేషిస్తూ తాను నిర్ణయించుకున్నటువంటి కాలగణనము ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా రుతువులను నిర్ణయించుకున్నాడు. అటువంటి ఒక వేదము అంటే కేవలము సుస్వర సస్వరమైన మంత్ర సంచయమైనటువంటి వేదం కాదు. వేదం అంటే విద్ అనే ధాతువు. అంటే దేనిని తెలుసుకోవలసి ఉన్నదో, దేనిని తెలుసుకుంటే మానవుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతాడో ఆ చెప్పేదే వేదం కాబట్టి ఆ వేదాలు ఇన్ని ఉన్నాయి. ఇట్లా ఈ వేదము అని చెప్పబడినప్పుడు మానవుడి యొక్క ఈ పరిణామ దశలో తనను తాను సంబాళించుకొని తనను తాను సంస్కరించుకొని కాలాన్ని కూడా పరబ్రహ్మ స్వరూపంగా ఋతువుని ఒక ఆహ్లాదకరమైనటువంటి వేషధారణగా అంటే ప్రకృతి యొక్క వేషధారణగా భావించాడు గనుక దీనికి ఉగాది అని పేరు వచ్చింది. నిజానికి ఉగాది అంటే ఉక్ అంటే మాట. మాట మొదలైంది ఎప్పుడు అని. మాట కూడా చాలా కాలం తర్వాత కానీ రాలేదు. అయితే ఎప్పుడు వచ్చింది అంటే మానవుడు భాష, భావ వ్యక్తీకరణకి తనకు కావలసినటువంటి భాష ద్వారా అభివ్యక్తి అయినప్పుడు మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు సౌజన్యాలు దాటిన తర్వాత ఆరంభమైనటువంటి వేళకి ఉగాది అని ఒక మాట. అలాగే ఇదిగో క్రోధి నామ సంవత్సరం వెళ్ళిపోతున్నది, కొత్త సంవత్సరం వస్తున్నది. ఇది కేవలం ఉగాది మాత్రమే కాదు ఇది యుగాది. అంటే ఒక యుగం ప్రారంభమవుతుంది. యుగము అంటే ఆ నాలుగు లక్షల సంవత్సరాలు అది కాదు. యుగము అంటే క్షణము, కాలము, అదొక విభజన. కాబట్టి ఇది ఉగాది, ఇది యుగాది. ఈ రెండింటిని దాటి మూడవ స్థాయి ఉన్నదీ అది పరమాత్మతో జీవాత్మ నిత్యానుసంధాన తత్త్వ స్ఫూర్తితో జీవించేటువంటి ఆ దశని యోగాది అన్నారు. యోగించి ఉండటం. ఎవరితో? పరమాత్మతో. పరమాత్మ ఎక్కడున్నాడు? మన యందున్నాడు. కనుక తనతో తాను కూడి ఉండేటువంటి సందర్భం కాబట్టి దీనికి యోగాది అని పేరు. ఉగాది, యుగాది, యోగాది. ఈ మధువు, ఈ మాధవుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి ఒక మహా చిచ్ఛక్తి ఏదైతే ఉన్నదో ఈ ప్రకృతిని అంతా ఆవహించి, ఆవేశించి, ఆవరించి ఉన్న కారణంగా దీనికి ఉగాది అని మనం పేరు పెట్టుకున్నాం. అంతే కాదు. ఈ ఉగాది ముఖ్యంగా మాసములలో ఇది మొట్టమొదటిది చైత్ర మాసం, పాడ్యమి. తర్వాత ప్రతిదీ ప్రథమమే అవుతున్నది. పగలు అది ప్రథమం. అలాగే అయనం ప్రథమం. అన్నీ మొదలు మొదలుగా అంటే కొత్త సంవత్సరము, కొత్త జీవన ప్రవాహ రీతి సాగుతూ ఉన్నది గనుక దీనికి ఉగాది అని పేరు పెట్టారు. ఈ వసంత కాలంలో చాలా చాలా విషయాలు జరిగినాయి. ముఖ్యంగా రామాయణాన్ని గనుక మనం తీసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడి యొక్క జీవితం అంతా కూడా అరణ్యవాస ఆరంభ వేళలు వసంతంలో ప్రారంభమైనవి. నిజానికి సీతాపహరణం జరిగింది వసంత కాలంలో. సుగ్రీవుడితో మైత్రి ఏర్పడింది వసంత కాలంలో. అలాగే లంకా విజయం హనుమంతుడి లంకా విజయం అంతా వసంత కాలంలో జరిగింది. పట్టాభిషేకము కూడా వసంత కాలంలో జరిగింది. అందువలన ఈ వసంత కాలం అంటే మానవుడి జీవన దశలలో అంటే మన బోటి వాళ్లకు కూడా రాముడే కాదు మనకు కూడా అనేక దశలు ఏర్పడి ఉంటాయి. ఈ పన్నెండు, పధ్నాలుగు ఏళ్ల సమయం ఏదైతే ఉన్నదో దానిలో పెను మార్పులు సంభవిస్తూ ఉంటాయి గనుక ఆ మార్పులకు అనుగుణంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి మనస్సును మనం రూపొందించుకోవాలి అంటే ఈ వసంత కాలం ప్రధానం. ప్రకృతి అంతా కూడా కొత్త కొత్త రంగులు, సొబగులు, వర్ణ వర్ణాంచితమైనటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి కాలమిది. ఆకులన్నీ రాలిపోతాయి, కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. అలాగే పాత ఆకులు, పాత అలవాట్లు, పాత ఆచారాలు వెళ్లిపోవాలి. కొత్త కొత్త అంటే నవ నవోన్మేషమైనటువంటి ఆలోచనలతో మానవుడి జీవితం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు ఉదాత్తంగా, ఉన్నతంగా సాగాలి గనుక దీనికి ప్రేరణ, స్ఫురణ కలిగించగలిగినటువంటి ఒక పర్వదినం ఏది అంటే అది ఉగాది. ఈ ఉగాది నాడు మనకి షడ్రుచుల గురించిన విచారణ చాలా ఉన్నది. మానవ జీవితంలో కష్టసుఖాలు, ఆనందాలు, దుఃఖాలు, ఖేదము, మోదము, ప్రమోదము, హ్లాదము, ఆహ్లాదము ఇవన్నీ కూడా భాగం గనుక ఈ షడ్రుచులు మానవుడి జీవితంలో ఏర్పడేటువంటి అనేకానేక స్థితులకి సంకేతంగా చెప్పబడి ఉన్నది గనుక ఈనాడు ఉగాది పచ్చడి అనేటువంటి దానిని మనం దానిగా తీసుకుంటాం. అదొక గుర్తు. అలాగే ఇది ప్రకృతి ఆరాధన కూడా. ఈ ప్రకృతి ఇంత అందంగా ఉన్నది గనుకఈ ప్రకృతి పుష్పించి ఉన్నది గనుక, దాని యందు తేనె ఏర్పడి ఉన్నది గనుక, ఈ తేనెటీగలన్నీ కూడా మధువుని సేకరించి తాము అనుభవించక మన బోటి వారికి వదిలిపెడతాయి గనుక నేర్చుకోవలసినది, అనుభవించవలసినది ఏమిటంటే పరాప్రకృతి ఇచ్చినటువంటి ప్రతి వస్తువుని కూడా మనం యధాతథంగా స్వీకరించాలి. ప్రకృతి మీద ఆధిపత్యం వహించకూడదు. ప్రకృతితో సహజీవనం చేయాలి. సమాంతరంగా నెమ్మదిగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. దానికి శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఓ మాట చెప్తారు. "శంభుధ్యాన వసంతసంగిని హృదారామేఘ జీర్ణచ్ఛదా శ్రస్తా భక్తిలతాచ్ఛта విలసతా పుణ్యప్రవాళ శ్రితాః దీశ్యంతే గుణకోరక జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి" అంటారు. పరమ అద్భుతమైనటువంటి సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి ఒక శ్లోకమిది. ఏమి, ఏమవుతుందట అంటే ఈ వసంత కాలం గురించి అన్యాపదేశంగా చెప్తూ "శంభుధ్యాన వసంతసంగిని" శంభువు అంటే శుభమును కలిగించేవాడు. ఆ శుభమును కలిగించేవాణ్ణి గనుక ధ్యానించినట్లయితే "వసంతసంగిని" వసంత ఋతువు వస్తుంది. "హృదారామే అఘజీర్ణచ్ఛదా" హృదయము అనేటి-- హృదయము అంటే ఇక్కడ మనస్సు. మనస్సు ద్వారా ఏర్పడినటువంటి ఎండిపోయినటువంటి పాపము అనే ఎండ టాకులన్నీ కూడా టపటప రాలిపోగా అప్పుడు "శ్రస్తా భక్తిలతాచ్ఛта విలసతా" భక్తి అనేటువంటి ఒక సన్నని తీగ పాకుతుందట. అక్కడ ఏమవుతుంది? "దీశ్యంతే గుణకోరక" సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి మూడు గుణాలు తీగ మీద పుడతాయి. అయితే అవి ఏమవుతాయి? మొగ్గ మొగ్గగానే ఉండటానికి వీల్లేదు కదా! "దీశ్యంతే గుణకోరక" ఆ మొగ్గగా ఉన్నవన్నీ "జపవచః పుష్పాశ్చ సద్వాసనా" జపతపముల చేత, ధ్యానము చేత, స్వాధ్యాయము చేత, సత్ప్రవర్తన చేత, సదాచారము చేత, సమ్యక్ సంకీర్తన చేత, సత్సంగము చేత, సత్సాంగత్యము చేత ఏమవుతాయి ఆ మొగ్గలన్నీ కూడా విరాజమానం చెంది, అవన్నీ వికాసమానం కూడా చెంది, దానిలో నుంచి అందమైనటువంటి రంగులు, పరిమళాలు ప్రకృతిని అంతా కూడా ఆహ్ ఆవరించి ఉంటాయి చక్కగా. అయితే అది అట్లాగే ఉంటుందా అంటే మొగ్గ పువ్వు కావాలి, కాయ కావాలి, కాయ పండు కావాలి. ఇట్లా ఈ జపతపాది విషయాల చేత, స్వాధ్యాయం చేత సంపాదించుకున్న ఒక సంస్కార విశేషం చేత ఏమవుతుందంటే ఒక జ్ఞానం కలుగుతుంది. ఏమిటి ఆ జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం కాదది. అది ఆంతరంగికమైన, హృదయంగమమైనటువంటి ఒక భావనా స్పందన. ఒక అతీంద్రియమైనటువంటి ఒక అనుభూతి. అటువంటి జ్ఞానం కలిగినప్పుడు అంటే పరమాత్మకి నాకు, ప్రకృతికి నాకు ఒక అభేద అద్వితీయ అద్వయ రమణీయమైనటువంటి మనోజ్ఞ భావన ఉన్నది అనేటువంటి ఆ భావన పేరే జ్ఞానము. కనుక జ్ఞానం అంటే వివేకము, విచక్షణ రెండు కలిపితే జ్ఞానం. ఆ జ్ఞానము "ఆనందసుధామరందలహరి" ఆనందం అనేటువంటి ఒక వాక అంటే ప్రవాహం. ఆ ప్రవాహం అమృత ప్రవాహంలో ఉన్నదట. అమృతం సెలయేరులాగా వెళుతున్నదట. వెళుతూ ఉంటే దానిలో ఏం దొరికిందయ్యా అంటే "సంవిత్ఫలాభ్యున్నతి" సంవిత్ అనేటువంటి ఒక పండు దొరికింది. అంటే మొగ్గ అయింది, పువ్వు అయింది, కాయ అయింది, పండు అయింది. ఈ పండటము, జీవితాన్ని పండించుకోవటము ప్రారంభం చేసుకోవాల్సినటువంటి సమయం ఏదేంటే ఇదిగో ఈ "సుప్రభాతాం చిత నవ ప్రభాత వేళ" ఇటువంటి ఉగాది ఆరంభ వేళ మానవుడు జరిగిన వాటి నుంచిన విచారణ నుంచి బయటపడి జరుగుతున్నటువంటి వర్తమానాన్ని విచారణ చేసుకుంటూ ఆగామి కాలాలను సుసంపన్నం చేసుకునేటువంటి దిశగా తనను తాను సంస్కరించుకునేటువంటి ఒక మహోదయానికి పేరే ఉగాది. కాబట్టి ఇది ఉగాది అవుతున్నది. యుగాది కూడా అవుతున్నది. రాత్రి పోయింది, పగలు వచ్చింది. పగలు ఉంటున్నదా, పగలు పోతున్నది, మళ్ళీ రాత్రి వస్తున్నది. ఇట్లా ఒకదాని వెంట ఒకటి నెమ్మది నెమ్మదిగా సాగుతున్నాయి గనుక ఈ పడుగు పేకల వలె సాగేటువంటి మానవ జీవన దివ్య విధానానికి ప్రకృతికి నమస్కరిస్తూ, లోపల ఉన్న పరమాత్మకి నమస్కరిస్తూ ఒక సభ్యతా సంస్కారంతో కూడినటువంటి మానవ జీవితాన్ని గడపాలని నిర్దేశించి, ఉపదేశించి, ఆదేశించి, సందేశించేటువంటి మహత్తర క్షణమే ఉగాది. ఉగాదికి పునఃస్వాగతం పలుకుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి. [అవుట్ర్ో] తెనాలి డబల్ హార్న్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. తెనాలి డబల్ హార్న్స్ వారి ఉగాది శుభాకాంక్షలు.