Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] గీతా జయంతి శుభ సందర్భంలో మనం చేసుకున్నటువంటి గీతా తత్వ విచార ధారలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. కొన్ని శ్లోకాలు. శ్రీరామచంద్రుడు ప్రమాణము చేయలా ప్రమాణం మహావిష్ణువుగా ఉండగా చేశాడు. కానీ కృష్ణ పరమాత్మ తన జీవిత కాలంలో ఎన్నడూ ప్రమాణం చేయలా ఎందుకు వచ్చానో చెప్పలా, అవతారాలు ఎందుకు వస్తాయో చెప్పలేదు, వాటి పరమార్థం చెప్పలేదు. కానీ, భగవద్గీతని అర్జునుడికి ఉపదేశిస్తున్నటువంటి సందర్భంలో రెండు శ్లోకాలు చెప్పాడు. "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" ఎప్పుడైతే మానవుడు మానవుడిగా జీవించి ధర్మాచరణం యందు ఆసక్తిని కోల్పోయి ధర్మము నుంచి వైదొలగి అధర్మ మార్గంలోకి ప్రవేశిస్తాడో, అధర్మాన్ని అణచి మళ్ళీ మానవుణ్ణి ధర్మ మార్గంలో ప్రవేశింపజేసేట్లుగా నేను ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నన్ను నేను సృష్టించుకొని వస్తాను. ఇది "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అంటే ధర్మానికి అది అగ్ని స్వరూపం చదబట్టదు. కానీ ఎప్పుడూ అంటే మానవుడు వ్యక్తిగతమైన అంటే వైయక్తికమైన, కుటుంబపరమైన, సమాజపరమైన, ఆర్థికపరమైన, ప్రపంచపరమైన, విశ్వపరమైన, సృష్టి పరమైనటువంటి ధర్మ ప్రవాహం ఏదైతే ఉన్నదో దాని నుంచి వైదొలగి అధర్మ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇట్లా చేస్తే నీకూ, నీ వారికి, వారికి, వారికి, వారి వారికిన్ ఆనందం కలుగుతుంది గనుక నువ్వు ధర్మ మార్గాన్ని ఆశ్రయిస్తే "ధర్మో రక్షతి రక్షితః" ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అంతేకాదు "యతో ధర్మస్థతో జయః" ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయము సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి మానవుడు ప్రధానంగా ధర్మమార్గావలంబి కావాలి. ధర్మాన్ని ఆశ్రయించాలి, ధర్మాన్ని అధ్యయనం చేయాలి, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని అనుభవించాలి, ధర్మ అనుభూతిని చెందాలి, కడగా విభూతి స్థాయికి వెళ్ళాలి అని చెప్తూ అది చెప్పటానికై ఆయా దేశములు, కాలముల యందు నన్ను నేను సృష్టించుకుంటాను. సృష్టించుకొని ఒక అవతారిగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే "పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" యుగే యుగే అంటే కృతయుగం కొన్ని వేల ఏళ్ళు, ద్వాపర యుగం కొన్ని వేల ఏళ్ళు, త్రేతాయుగం మరికొన్ని వేల ఏళ్ళు. ఇదిగో ఐదువేల ఐదువందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా సాగుతున్న కలియుగం. యుగే యుగే అంటే క్షణే క్షణే అని అర్థం. మన మనసులో చెడు భావన కలిగినప్పుడల్లా నీ లోపల ఒక గురువుగా, నీ లోపల ఒక వెలుగుగా, నీ యందే ఉండి నిన్ను మేల్కొల్పి జాగృతం చేసి, నీవు చేస్తున్నది ధర్మబద్ధం కాదు, ఇది అధర్మమైనటువంటిది, అధర్మ మార్గం నుంచి చెడు తలుపులు తొలగించుకొని సన్మార్గావలంబనం చేయమని చెప్పటానికి ఉంటానని చెప్తూ "అయమాత్మా గుడాకేశ" అన్నాడు. అయమాత్మా గుడాకము అంటే నిద్ర. గుడాకము అనేదానికి ఈశత్వం అంటే దానిలో అత్యున్నత స్థాయి ఏది అంటే అది యోగనిద్ర. యోగనిద్ర ఎక్కడ ఉన్నది అంటే "హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహం అహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతావా పవనచరణ రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం" నీ యందే ఒక వెలుగుగా అనుక్షణము నేను, నేను, నేను అంటున్నై ప్రకాశమానంగా ఉన్నావో అది నీవై నిన్ను నడిపిస్తూ ఉన్నది. నేను, నేను అని. కాస్త జాగ్రత్తగా భగవద్గీతను గనక అధ్యయనం చేస్తే ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇది "కృష్ణ ఉవాచ" అనే పదం వాడనే లేదు. నేను కృష్ణుణ్ణి చెప్తున్నాను అని చెప్పలా. ఏమన్నాడాయన "భగవాన్ ఉవాచ" అన్నాడు. భగవాన్ అంటే అంటే భక్తి, గ్ అంటే జ్ఞానము. భక్తి జ్ఞానములతో నీవు కర్మవీరుడివి కా అనేటువంటి భావన ఎవరి యందు ఉన్నదో, చెప్పగలిగిన శక్తిమంతుడో, అర్హత కలిగిన వాడో అతడు భగవాన్ అవుతున్నాడు. అది బిరుదు కాదు. భగవాన్ అంటే భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్యములన్నీ కూడా సమన్వయం చేసుకున్నవాడు. అటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి జగద్గురువు ఏం చెప్తున్నాడంటే, నీవు-- నేను చెప్తున్న మాటలన్నీ నువ్వు శ్రద్ధగా విను. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" నీకు శ్రద్ధ ఉందా? జ్ఞానం నీకు అర్థమవుతుంది. శ్రద్ధే లేదా? ఏదో చెప్పబడినై నేను కూడా విన్నాను అనేటువంటి భావనలో ఉంటావని చెప్తూ ఎక్కడా "శ్రీకృష్ణ ఉవాచ" అనే పదం మనం వినపడదు మనకి. అలాగే కేవలం "భగవాన్ ఉవాచ" అని మాత్రమే చెప్తాడు. కానీ, ఏడు వందల శ్లోకాల మధ్యలో ఒక్క చోట మాత్రం "మధుసూదన ఉవాచ" అని చెప్పాడు. మధు అనే రాక్షసుణ్ణి సంహారం చేసినటువంటి నేను చెప్తున్నాను అంటే తన పూర్వ శక్తిని, పూర్వ అవతారాన్ని, పూర్వ కార్యకలాపాన్ని అర్జునుడికి పరిచయం చేశాడు. అక్కడే ఇదిగో భగవద్గీతని ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదని అడిగావు కదా, దీనిని ముందు ఆదిత్యుడికి చెప్పాను. అంటే సూర్యుడికి చెప్పాను. మనువుకి చెప్పాను. అంటే అర్జునుడు నమ్మలా. నీవు నిన్న, మొన్న నాకు బావగా నాతో కలిసి తిరిగిన నీవు సూర్యుడికి ఎలా చెప్పగలవు? అంతకు ముందే ఉన్న మనువులు వీళ్ళందరికీ ఎలా చెప్పగలవు? అని సంశయాత్మతో కూడినటువంటి అర్జునుడు చెప్పినప్పుడు అది వినశ్యతి కాకుండా, నశింపకుండా, అజ్ఞానము నశింపజేసేట్లుగా, జ్ఞానము పొటమరించేట్లుగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే భగవద్గీత ద్వాపర యుగాంతంలో ఏదో ఇందాక చెప్పిన కొన్ని సంవత్సరాల క్రితం చెప్పబడిందని అర్జునుడు ఎలా అనుకున్నాడో మనం కూడా అలా అనుకోకూడదని ఇది సనాతన ధర్మ వేదికగాధర్మ భూమికగా ఇది అపూర్వమైనటువంటి ఒక హేలగా లీలగా ఖేలగా పరమాత్మ జగత్తులోకి వచ్చి అవతరించి ఒక సంగ్రామ రంగంలో నిలబడి సంగ్రామం ప్రారంభం కావటానికి ముందే జ్ఞానోపదేశం చేశాడు. ఏది సంగ్రామం? కేవలం భారత సంగ్రామమేనా అంటే మన జీవితమే ఒక సంగ్రామం. సంసారమే ఒక సాగరం ఇందులో జీవుడి ఆనందాలు దుఃఖాలు జనన మరణాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలుగా సాగిపోతున్నప్పుడు అద్వయమై అద్వితీయమై రమణీయమై మనోజ్ఞమై ఏదైతే మన యందు నిరంతరము ప్రవాహ వేగంతో ఉండాలో దానిని ఒక్కసారి తట్టి మేల్కొలుపుతున్నాడు. దానినే ఉపనిషత్ వాక్యంగా తర్వాత వివేకానందుడు "ఉత్తిష్ఠ జాగ్రత్ ప్రాప్యవరాన్ నిబోధిత" అంటే "stop not till the goal is reached" అని ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ ఎక్కడివి అంటే అర్వాచీనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఒక భావనని ఇవాళ ఆధునిక భాషలో మనకి చెప్పారు. కాబట్టి కృష్ణ పరమాత్మ నాయనా! నువ్వు నిమిత్త మాత్రుడివి అని అన్నప్పుడు నేను నిమిత్త మాత్రుడిని గనుక అయితే మరి యుద్ధం అంతా ఎందుకు అంటే యుద్ధానికి వచ్చే ముందే అందరూ సంహరింపబడ్డారు. వాళ్ళందరూ కూడా లయింపబడ్డారు. కేవలం దేహం మాత్రమే మిగిలింది. ఇక యుద్ధం చేయ్ అన్నాడు. అంటే కాదు కాదు నిరూపణ చేయమన్నాడు. నిరూపణ చేయటానికి చూడు మానవుడికి భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, తత్వం ఉండాలి. ఆపై కదా ముక్తి అనేది ఏర్పడేది. చూడు నేను యుద్ధం చేస్తున్నాను అన్న భావన వదిలిపెట్టు. ఎందుకంటే "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" నువ్వు కర్మలు చేస్తూ ఉండు అది నీ బాధ్యత అంతే. దాని ఫలితాలు వస్తాయి సుఖమో దుఃఖమో వస్తుంది. ఫలితాన్ని త్యాగంచేయ్. కర్మను త్యాగం చేయమని ఎక్కడా లేదు. నేను పని చేయనండి నేను జ్ఞానినైనాను అంటే జ్ఞాని అయిన వాడు కూడా జగత్తులోకి వచ్చి బోధ చేయాలి. అన్ని విషయాలు నాకు తెలుసు అన్నవాడు తెలియజేయాలి. బాధ్యత ఒక అపురూపమైనటువంటి బాధ్యతను ఆయన స్వయంగా స్వీకరించి "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన" అన్నప్పుడు ఓహో! అంటే నేను కర్మ చేయాలన్నమాట అన్నాడు. అంతే కాదు మీ వాళ్ళందరూ పోతున్నారు. వాళ్ళు మరణించబోతున్నారు. దుఃఖాన్ని నేను తట్టుకోలేను అని చెప్తున్నావే "వాసాంసి జీర్ణాని యథా విహాయ" చూడు ఒక వస్త్రం ధరిస్తాం పగలంతా పని చేస్తాం. దాన్ని వాడుకొని తెల్లవారుగానే మళ్ళీ శరీరం మీద నుంచి తీసి మూటగట్టి బయట పడేసినట్లుగా శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో శరీరంలో కొన్నాళ్ళు ఉండి తన పని అయిపోయిన తర్వాత కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఒక దేహాన్ని ఆశ్రയിస్తున్నట్లుగానే ఉంటుంది తప్ప ఇప్పుడు నీకు తాత వాడెవడో నీకేం తెలుసు ఇంతకు ముందు? రేపు ఏం కాబోతున్నాడో ఏం తెలుసు? కనుక అర్జున ఇటువంటి మమతానుబంధాలలో చిక్కుకొని నీ సహజమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోకు. ఇది అసత్యము అబద్ధము అయినటువంటి ఒక బాంధవ్యమే తప్ప ఇది శాశ్వతమూ కాదు, నిత్యమూ కాదు, సత్యమూ కాదు అని శ్లోకంలో ఆయన చెప్తూ అనేక విషయాలు నెమ్మది నెమ్మదిగా చెప్తూ మరొక్క మాట చెప్పాడు. అహమాత్మా గుడాకేశ అని నేను చెప్పాను కదా! నేను కనిపిస్తున్న కృష్ణుడు ఎలా ఉన్నాను అంటే నీలో నేనుగా ఉన్నాను. అందుకనే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలలో నన్నే స్మరించుము నాకే నమస్కరించుము అంటాడు. "మన్మనా భవ మద్భక్తో మధ్వాజీ నాం నమస్కురు" నన్నే ఎవరు ధ్యానిస్తారో, ఎవరే నన్ను నిత్యము స్మరిస్తూ ఉంటారో, ఎవరు నన్ను ఆలోచనలను పట్టుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తారో వాళ్ళందరినీ నేను రక్షించుకుంటాను అంటే నేను కృష్ణుడు కాదు. నేను ఆత్మకు పర్యాయపదం. నేను అనంతమై చిద్ఘనమై శాశ్వతమై నిత్యమై సత్యమై నవ్యమై భవ్యమై లోపల ఒక చిద్ఘన రసం గా వెలుగుతున్నటువంటి కణికాకణిక ఒక దీపం ఏదైతే ఉన్నదో అది నేనుగా భావించేటువంటిది. నేను చెప్తున్నాను అంటున్నామే అది నేనుకు సంబంధించిన నేను. అసలు నేను ఏమీ అనట్ల ఏం జరుగుతున్నదో చూస్తున్నది. సాక్షిభూతంగా చూస్తున్నది. కర్మ భక్తి జ్ఞాన యోగాలని పర్యవేక్షిస్తూ ఉన్నది. ఏం జరుగుతున్నదో గమనిస్తున్నది. కానీ హెచ్చరిస్తున్నది. కనుక భగవద్గీతను చదివేటప్పుడు కృష్ణుడు అన్నీ నేనే అంటున్నాడు ఏమిటి యోగ-- వేదములలో సామవేదాన్ని నేను అలాగే పక్షులలో గరుడ పక్షుని నేను ప్రధానంగా ఇదిగో మార్గశిర మాసంలో మాసము కూడా నేనే. అంతెందుకు మీరందరూ కలిసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతడు సర్వ శ్రేష్టుడు అని నాకు గనుక చూపిస్తే వాడు కూడా నేనేనన్నాడు కృష్ణుడు. నేను అంటే దేహ పరమైన నేను కాదు. నేను అంతర్గతమై ఆత్మ వశమై ఆత్మ గతమై ఆత్మై అంటే ఆత్మ అంటే ఆత్ అంటే ఏమి మా అంటే లేదు. ఏమీ లేకపోయినా అన్నీ తానైనదిగా ఏదైతే ఉన్నదో అంటే "సర్వం ఖల్విదం బ్రహ్మ" సృష్టికర్త సృష్టింపబడిన ప్రపంచం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు వాటి మధ్య ఉన్న వైవిధ్య వైరుధ్య సంచలనాలు వాటి చరణాలు విచారణలు ఇవన్నీ కూడా ఏమిటి? దేని reflections ఇవన్నీ? వేటికి ప్రతిబింబాలివి? వేటికి ప్రతిధ్వనులివి? అని విచారణ చేసినట్లయితే నేను లో నుంచి వచ్చినవే ఇవి. నేను లో నుంచే నేనును నేనుని దాటి నేను వెళుతూ ఉంటే గనుక నీవు ఆత్మ గతమైన విచార ధారలోకి వెళ్ళాలి అర్జున. నీ వైక్లబ్యాన్ని నీవు వదిలిపెట్టు. నీ మనస్సు విషాద యోగంలో ఉన్నట్లయితే నీవు పని చేయలేవు. కనుక కర్మ చెయ్. కానీ నిష్కామ కర్మ చెయ్. నిష్కామము వేరు నిష్కామము అంటే పని లేకపోవడం పని చేయకపోవడం. నికామము అంటే సాక్షిభూతంగా ఉండటం. "కలవక కొన్ని వేళలు నికామ భవత్ పదాచింతనానలో జ్వలిత శిఖాసనాధములు" అన్నట్లుగా ప్రతి జీవుడికి కూడా కొన్ని క్షణాలు ఆలోచనారహిత్యం పొందేటట్టుగా ఉంటాయి. మనస్సు మలగిపోతుంది. లోపల అంతర్జ్యోతి వెలిగిపోతుంది. వెలుగులో సన్నని దారిలో నుంచి వెలుగు పుంతలో నుంచి వెన్నెల పుంతలో నుంచి ఖగోళ అంతర్గతమైనటువంటి అనేకమైన సూక్ష్మ సూక్ష్మీతర స్థాయిలోకి వెళ్ళాలి అంటే కావలసినది విద్య కావాలి. విద్య అన్ని విద్యలలోకి ఆత్మవిద్య. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదవవలయు. చావులేని చదువు ఆత్మవిద్య గనుక అర్జునా! నీ దేహ భ్రాంతిని విడిచిపెట్టు. దేహాత్మ భావన వదిలిపెట్టు. నీలో ఉన్నటువంటి ఆత్మభావన వైపు నెమ్మదిగా అడుగులు వెయ్యి. అడుగులు వేసినట్లయితే ఏమవుతుందో తెలుసునా? "త్వమేవాహం సంశయః" నీకూ నాకూ తేడా లేని స్థితి వస్తుంది అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ అర్జునుడిని యుద్ధ కర్తవ్యోన్ముఖుడిని చేస్తున్నాడు. విచారణ చేద్దాం.
YouTube · audio

సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

Home

సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 13:24

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

    Now playing
  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam