⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శృతి, స్మృతి, పురాణం. ఈ మూడింటిలో పురాణం ప్రధానమైనది అంటే జనరంజకమైనది. శృతులు కాస్త పండితులకు సంబంధించింది. కనుక ఈ పురాణాలు ఆధునిక కాలంలో చదవని వారు, వాటి పట్ల గౌరవం లేని వారు పుక్కిటి పురాణంగా చెప్తారు. కానీ అది కాదు. ఎందుకంటే వేదాలు ఎప్పుడైతే వచ్చినయో, ఆ వేదాలు decode చేశారో ఇవాళ భాషలో అంటే నానానాథ సందోహంగా అడవిలో ఉన్నటువంటి ఆకుల మధ్యలో నుంచి ఒక గాలి వెళ్ళినప్పుడు దానిలో ఒక నాదం ఏర్పడినప్పుడు ఆ నాదాన్ని ఆనాటి మహర్షులు తమ జ్ఞాన దృష్టితో తమ ఇంద్రియాలతో వాటిని ఒడిసిపట్టి ఒక మూటగా అక్కడ పెడితే వేదవ్యాసుల వారు వచ్చి వాటిని విభజించారు. అందుకనే వారు వేదవ్యాసులవారు అయినారు. ఆ వేదవ్యాసులవారు ఏం చేశారంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. సామవేదము అంటే గానం, అది పాట. ఋగ్వేదము అంటే ఋక్ అంటే మాట, అది మాట. యజుర్వేదం అంటే కర్మకాండ, అది ఆట. ఇవి శృతులు, ఇవి వేదాలు. వేదాలలో వేదాలు అర్థం కావట్లేదు, మాకు అవగాహనలోకి రావట్లేదు అన్నప్పుడు శిఖర సమానమైనటువంటి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క ఒక మూట విజ్ఞానపు భాండాగారాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చింది ఒకనాటి మహర్షిగణం. ఉపనిషత్తులు అర్థం కాలేదనుకున్నారు. వేదాలైనాయి, ఉపనిషత్తులైనాయి. అప్పుడు పురాణాలు ఏర్పడ్డాయి. పురాణాల తర్వాత ఇతిహాసాలు ఏర్పడ్డాయి. అంతే కదా! కాబట్టి పురాణం అంటే పురా అంటే పాతది, ణ అంటే జ్ఞాన మార్గం. అంటే పాతదైనటువంటి ఒక విజ్ఞాన ఖనిని జ్ఞాన మార్గం వైపు నడిపించుకోవటానికి మానవుడు వాడుకోవలసినటువంటి విజ్ఞాన సర్వస్వమే పురాణంగా భావన చేయాలి. కనుకనే వేదాలు, ఉపనిషత్తులువై ద్వాపర యుగంలో వేదవ్యాసుల వారు వేద విభజన చేసిన తర్వాత ఆయన పద్దెనిమిది పురాణాలు ఈ ప్రపంచానికి ఇచ్చారు. ఈ పద్దెనిమిది పురాణాల యొక్క అంతస్సారము ఏమిటి అంటే ఒకటే, ఇతరులను బాధించడమే పాపము, ఇతరులకు సేవ చేయడమే పుణ్యము. ఇంతే. పద్దెనిమిది పురాణాల కథలు, కథనము వేరుగా ఉండొచ్చు గాక. పద్దెనిమిది పురాణాల సారమేమిటి? పాత విషయాలని ఇవాళ అజ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానాలు దాటి జ్ఞానం వైపు నడిపించేట్టుగా దానిని వాడుకోవలసినటువంటి జ్ఞాన మార్గోపదేశనం చేయగలిగినటువంటి దివ్య కథా కథన విధానమే పురాణం. కనుక మనము భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తాం, పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం, వ్యాసేన గ్రథిత పురాణమునినా. చెప్పిన వాడు కృష్ణుడు అయితే దానిని గ్రంథ రూపంలో తీసుకువచ్చిన వారు వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల అనలే, పురాణమునినా అంటే పురాతనమైనటువంటి ఒక జ్ఞాన మార్గాన్ని కర్మ, భక్తి, జ్ఞాన, యోగాల సంపుటిగా భగవద్గీతగా ఇస్తున్నటువంటి ఆ ముని, ఆ మౌని, ఆ తపస్వి, ఆ జ్ఞాని, ఆ మహత్తరమైన దివ్యదృష్టి కలిగినటువంటి వాడు వేదవ్యాసుల వారు. కనుక పురాణమునినా. ఎక్కడ అంటే మధ్యే మహాభారతం. మహాభారత సంగ్రామ వేళ ఆ రణరంగం మధ్యలో కృష్ణుడు చెప్పగా వ్యాసుల వారు రాశారు. మరి ఈ పురాణాలు ఇవాళ ఆధునిక కాలంలో కాలం చెల్లినవేండి, అప్పుడున్నట్టు ఇప్పుడు లేరు అంటే అప్పుడున్నట్లు ఇప్పుడు మనుషులు లేరు గాని దాని విలువలు అలాగే ఉన్నాయి. చదవగలిగితే. కథగా చెప్పుకుంటే మామూలు కథలే అవి. హాయిగా చెప్పుకోవచ్చు. కానీ మూలంలోకి వెళ్లి తత్వాన్వేషణ చేసి ఒక్కొక్క పురాణాన్ని మనం అర్థం చేసుకొని ఈ పద్దెనిమిది పురాణాలుగా ఎందుకని వేదవ్యాసుల వారు రాశారంటే ముప్పై ముక్కోటి దేవతలలో ఉన్న ప్రధాన దేవతలని, వారి చుట్టూ అనేకమైన విషయాలను గుదిగుచ్చి, వారి మధ్య జరిగినటువంటి అనేక సందర్భాలని, సంఘటనలని, సన్నివేశాలని మానవుడి హృదయానికి హత్తుకునేలాగా చేసి జానపదులు సహితము విషయాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని ధన్యవంతము, పారమార్థిక ప్రధానము చేసుకోగలరు కనుక వ్యాసుల వారు పురాణ రచన చేశారు. దీన్నే ఆధునిక కాలంలో ఏమున్నది పురాణాలలో అంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు పద్దెనిమిది పురాణాల సారం ఏమిటి అని ఒక పాశ్చాత్యుడు అడిగినప్పుడు ఏమీ లేదు Help ever hurt never అన్నారు. అదే పాపాయ పరపీడనం. ఆ ఎవరిని నువ్వు బాధించకు, ఎవరినీ వేధించకు. చేయగలిగితే నువ్వు చేయగలిగిన సహాయం చేయమని చెప్పినటువంటి ఆధునిక మహాపురుషులు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అంటే కాలం మారవచ్చు, యుగం మారవచ్చు, ఎప్పటి పద్దెనిమిది పురాణాలు, ఆ ఎప్పటి ద్వాపర యుగము, కలియుగం వచ్చి ఐదువేల ఐదువందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోతున్నది. కానీ ఇప్పటికీ వాటి యొక్క సమగ్రత, వాటి యందు దాగినటువంటి ఆ విజ్ఞాన నిధి నిక్షేపాలు ఎన్నున్నాయంటే ముందు మనం చదవాలి కదా! ఒక్కొక్క పురాణం మనకు ఏమిస్తున్నది గనుక అని అర్థం చేసుకున్నట్లయితే భూగోళాన్ని, ఖగోళాన్ని ఏకం చేయగలిగినటువంటి ఒక పురాణ విజ్ఞానం దాంట్లో ఉన్నది. అంతే కాదు ఆర్యభట్టుడు, వరాహమిహిరుడు 428 అంటే నాలుగు వందల ఇరవై ఎనిమిది AD కాలంలో వాళ్ళ దగ్గర చేతిలో ఏ instruments లేవు. భూమండలం మీద నుంచొని ఆకాశంలోకి చూసి ఖగోళంలో ఏం జరుగుతున్నది, ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఏమిటి, వాటి ప్రధానమైనటువంటి సంబంధాలు ఏమిటి, మానవుడి జీవితం మీద ఈ గ్రహాల ప్రభావం ఏమిటి, గ్రహానికి గ్రహానికి ఉన్న పొంతన ఏమిటి, ఇవన్నీ కూడా ఎలా చెప్పగలిగారంటే అది జ్ఞానైక దృష్టి.దానినే అంతర్నేత్రము అన్నాం మనం ఇవాళ. అంతర్నేత్ర సాధన అందరి వల్ల కాదు గనుక అంతర్నేత్రాన్ని దర్శించినటువంటి, అనుభవించినటువంటి, కలిగి ఉన్నటువంటి ఒక మహాత్ముడు ప్రపంచానికి విజ్ఞాన రేఖని అందించాలి అంటే అదిగో ఒక వరాహమిహిరుడు రావచ్చు. అలాగే వేదవ్యాసుల వారు సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపం అది. అందుకనే భగవాన్ వే-వేదవ్యాసుల వారిని భగవాన్ అన్నారు. లోక గురువుగా మొదటి వాడు వేదవ్యాసులైతే జగద్గురువుగా మొదటి వాడు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ కూడా మనకి పురాణాలు చెప్తాయి. పు-పురాణాలు పద్దెనిమిది చదివినా ఆయా దేవీదేవతల యొక్క శక్తినంతా కూడా ఎంత గొప్పవో, ఎంత శక్తిమంతమైనవో, ఎంత బలమైనవో మనకు చెప్తూనే కడగా ఏం చెప్తుందంటే అధర్మం మీద ధర్మమే జయిస్తుంది. ధర్మం ఒక అడుగు వెనక్కి వేయొచ్చు గాక. చూడండి సింహం ఉంటుంది. వచ్చి ఒక ఉదుటున వచ్చి మన మీద అది దాడి చేయదు. ఒక అడుగు ముందుకు వేసి రెండో అడుగు వెనక్కి వేస్తుంది. ఆ వెనక వేసింది కదా అనుకున్నామా? లంఘిస్తుంది. direct గా మన మీదకు రాదు. అట్లాగే ఈ విజ్ఞానాన్ని కూడా పురాణ విజ్ఞానాన్ని ఉదాహరణ తీసుకుంటే మత్స్య పురాణం, వరాహ పురాణం వీటన్నింటిలో కథలను ఇవాళ యువత ముందు చదవటం నేర్చుకోవాలి. చదవాలి అంటే సంస్కృతంలో ఉన్నాయి. సరే ఆంద్రీకరింపబడ్డాయి. కొన్ని కొన్ని English versions కూడా ఉన్నాయి. వాటిని చదివి వాటి మూలాలు పట్టుకోవాలి. ఏ పురాణం మనకి ఏ నీతి చెప్పింది, ఏ బోధ చేసింది, ఏ మార్గాన్ని ఇప్పించింది, ఆ మార్గం ద్వారా వాళ్ళు పొందినదేమిటి, మనం పొందవలసినదేమిటి నిర్ణయించుకోవటానికి ఒక విస్తృతమైనటువంటి ఒక గ్రంథాలయమే పురాణాలు, పద్దెమిది పురాణాలు. చెప్పబడిన విధానం బహుసుందరం. అత్యంత పటిష్టమైనటువంటి భాష. అలాగే కథా కథనం. ఇవాళ screenplay అని వాడతారు చూడండి. మహాభారతాన్ని మించిన screenplay రాయగలిగిన వాడు ఉన్నాడా? అంటే దాని చిత్రానువాదం. ఒక చిత్రానికి, ఒక కథా కథనం చెప్పడానికి తాను ఎంచుకునేటువంటి విధానం. ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం రావాలి, దేనివలన మానవుడి యొక్క ఆలోచన ఒక్కొక్క దాని మీద దాటుతూ దాటుతూ పదునెత్తుతుంది, దేనిలో నుంచి తాను దీన్ని పొందగలుగుతాడు అనేటువంటి ఆ చిత్రానువాద నైపుణ్యం. దానిని విన్నాణం అంటాం. ఆ విన్నాణం అంతా కూడా ఋషులు మనకి ఏనాడో. ఇవాళ ఋషులు లేరు, మనుషులున్నారు. ఈ మనుషులు ఋషులు కావాలి. ఋషులు మహర్షులు కావాలి. మహర్షులు కడగా బ్రహ్మర్షులు కావాలి. ఇది మానవ జీవిత పరమార్థం. అందుకే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. పురాణం కూడా అదే చెప్తుంది. నువ్వు ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉన్నది. ఎత్తుతూ ఎత్తుతూ రా. వచ్చి ఏదో ఒక జన్మలో జ్ఞానం అంటే ఏమిటి, పురాణం అంటే ఏమిటి అని ఒక విచారణ జరుగుతుంది గనుక. పురాణాల కంటే ముందు వేదాలున్నాయి. వేదాల కంటే ముందు అవన్నీ ఏర్పడినటువంటి ఒక విధానం ఉన్నది. ఆ విధానం ఏమిటని చెప్పినటువంటి వారు వేదవ్యాసుల వారు గనుక పురాణముని అయినటువంటి వేదవ్యాసుల వారు మనకు అందించినటువంటి ఈ పురాణ వాంగ్మయాన్ని మనం అధ్యయనం చేస్తే ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్యల కొన్ని తెచ్చుకున్నవే తప్ప ప్రకృతి ఇచ్చినవి కాదు. ప్రకృతి మీద అధికారాన్ని, ప్రకృతి మీద యాజమాన్యాన్ని, ప్రకృతి మీద ఒక నిరంకుశమైన ధోరణిని మానవుడు చూపించినంత కాలం ప్రకృతి కూడా తిరగబడుతుంది. ఆ ప్రకృతి ఎక్కడ? మనం చెప్పే చెట్లు, చేమలు, వాగులు, వంకలు కాదు. మన దేహమే ప్రకృతి. దేహాన్ని కాపాడుకోవాలి. శరీరం ఆజ్యం ఖలు కర్మ సాధనం, శరీరం ఆజ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మబద్ధమైన కర్మలు చేయాలంటే మంచి శరీరం కావాలి. ఆ శరీరాన్ని రోగ భోగాలకు కాకుండా యోగానికి గనుక అంకితం చేయగలిగినట్లయితే ఆంతరంగికమైనటువంటి ఒక స్మృతిలో, ఒక స్పురణలో మానవుడు జీవించగలిగినట్లయితే పురాణ వాంగ్మయం ఈనాటి యువత తీవ్రంగా అధ్యయనం చేయాలని, ఆ దిశగా మన ఆలోచనలు సాగాలని నేను అందరినీ కోరుకుంటూ పురాణం చదవటం అంటే ఋణ తీర్చుకోవటంగా భావన చేస్తూ స్వస్తి. [అవుట్ర్రో మ్యూజిక్]