Skip to content
Transcript తెలుగు
[శ్రీగణేష్] శ్రీరామ శ్రీరామత్వం ఇది శ్రీరామ తత్వం కాదు శ్రీరామత్వం రామము అంటే ఆనందము అని అర్థం విశ్రమము అని అర్థం విరామం లేనిది రామము కాబట్టి రామ శబ్దం రకార అకార మకారాలు కూడి ఉన్నాయి రకారము రవిబీజం అకారము అగ్నిబీజం మకారము చంద్రబీజం మూడింటితో కూడి ఉన్నది గనుక సూర్యోపాసన లో నుంచి సూర్యవంశంలో నుంచి ప్రకృతిని అధక్కరించి ప్రకృతిని దాటి పరమాత్మ ఒక మానవ దేహంలోకి వచ్చి తాను రామచంద్రుడై శ్రీరామభద్రుడై జగత్తుని పాలించటానికి వచ్చి ధర్మ సంస్థాపన మాత్రమే కాదు ధర్మ ఆచరణ అధర్మ నిర్మూలన రెండు ఏకకాలంలో తన పధ్నాలుగు సంవత్సరాల వనవాసంలో సాగించినటువంటి రామాయణము ఆయనం అంటే ప్రయాణం రామాయణమే రామాయణము అయినది రామాయణము వాల్మీకి మహర్షి దానిని సీతాయాశ్చరితం మహత్ అన్నాడు దీనిలో సీతాదేవి యొక్క కథ ఉన్నది అన్నాడు ఇది శ్రీరాముడి కథ రామకథ అన్నాడు ఇతిహాసంగా చెప్పాడు ఇక మూడవది పౌలస్త్య వధ రావణబ్రహ్మ యొక్క వధ మూడు దీంట్లో ఇమిడి ఉన్నాయి అంటే రాముడు సీత రావణబ్రహ్మ మూడు పాత్రల ద్వారా అంటే మూడు మహత్పూర్ణమైనటువంటి వ్యక్తిత్వాల ద్వారా మానవుడు మానవుడిగా ఎలా జీవించాలో చెప్పటానికి వచ్చినటువంటి మహనీయ మూర్తి శ్రీరామచంద్రుడు తొంభై తొమ్మిది మంది ఇక్ష్వాకు రాజులలో శ్రీరామచంద్రుడు అరవైనాలుగవ వాడు అంటే రాముడు కంటే ముందు అరవై మూడు మంది రాజులు రాజ్యం ఏలారు రాముడు తర్వాత ముప్పై ఐదు మంది ఇక్ష్వాకు రాజులు రాజ్యం ఏలారు చారిత్రకమైనటువంటి సన్నివేశాన్ని దాటి శ్రీరాముడు మానవుడికి మహనీయుడు ఎందుకయినాడు శ్రీరాముని గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే రామో విగ్రహవాన్ ధర్మః ధర్మాన్ని గురించి చెప్పాలి అంటే రాముని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది ఎట్లా ఒక ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ఒక కుమారుడిగా అన్నగా అలాగే ఉత్తముడైనటువంటి భర్తగా ఉత్తముడైనటువంటి రాజుగా అనేక విధాల శ్రీరామచంద్రుడు మానవ జీవితంలో ఉన్న అనేక పార్శ్వాలను ఒక దుఃఖాన్ని ఒక సుఖాన్ని ఒక ఆనందాన్ని ఒక విజయాన్ని అన్నింటినీ కూడా ఒక సమభావంతో ఎలా తీసుకున్నాడో గమనించినట్లయితే స్ఫురణ మనకు ఒక ప్రేరణ కలిగిస్తుంది గనుక శ్రీరామచంద్రుడు ఆదర్శ మానవుడు అయినాడు మనం దేవుడిని చేశాం కానీ ఆయన ఏనాడు నేను దేవుడిని అని చెప్పుకోలేదు ఎవరన్నా అన్నా దానిని అంగీకరించలేదు లేదు లేదు నేను కేవలం దశరథ మహారాజు కుమారుడిగా ఉండటానికి వచ్చాను అన్నాడు అంటే మానవుడు గతి తప్పినప్పుడు మతి తప్పినప్పుడు మానవత్వాన్ని కోల్పోయినప్పుడు దీనత్వ దానవత్వాలు విజృంభించినప్పుడు లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఇదిగో రీతి అనుభవించవచ్చును అని చెప్పటానికి వచ్చినటువంటి భూమండలీకృత పుణ్య అవతారి శ్రీరామచంద్రుడు భూమండలం పుణ్యం చేసుకుంది ఏమిటా పుణ్యం అంటే అధర్మం పెచ్చరిల్లి పోతున్నటువంటి వేళ మళ్ళీ ధర్మసంస్థాపన చేయాలి ధర్మాచరణ చేయాలి ధర్మాన్ని ఆచరించే విధానంలో ఎన్నో కష్టనిష్టూరాలు ఉంటాయి అధర్మవాదికి కష్టము లేదు నిష్టూరము లేదు కేవలం దాని భూమిక అజ్ఞాన భూమిక అవిద్య భూమిక అహంకార భూమిక అభిజాత్య భూమిక కానీ సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి మానవుడు ఎలా ఉండాలి అంటే అన్ని అవమానాలను ఎదుర్కోవాలి అన్ని ఆటుపోట్లను తట్టుకోవాలి జరిగేటువంటి సంయోగ వియోగాలను సమంగా భావించగలగాలి అందరూ తన దగ్గరకు కోరికలతో వచ్చినా తాను కోరికలు లేనివాడై ఉండాలి ఎన్నెన్ని విషయాలను ఒక్క జీవితంలో ఒక్క మానవ జీవితంలో శ్రీరామచంద్రుడు ప్రపంచానికి తన జీవితాన్ని సందేశంగా అందించాడు ఇట్లా శ్రీరాముని గురించి మనం ఇంకా చెప్పాలి అంటే వినయము ప్రధానంగా ఉన్నాడు ఆయన సాక్షాత్ వృక్షామాకృతి యజ్ఞమూర్తి అంటారు విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో అంటే ఋగ్వేదము సామవేదము యజుర్వేదము ఒక మూర్తిమంతమైనట్లయితే అది రామచంద్రుడు ఋక్ అంటే మాట సామము అంటే గానము గానము అంటే అది నాదము ఇక మూడవది కర్మకాండ తాను రాజకుమారుడై ఉన్నప్పటికీ కూడా అరణ్యాలలో పధ్నాలుగు సంవత్సరాలు నిరాటంకంగా అయనాన్ని ప్రయాణాన్ని సాగించి ఖడగా ధర్మసంస్థాపన చేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఆశ్రమాల దగ్గర ఆగి ఋషులకి కృతజ్ఞత తెలిపి తన కోసం ఎదురు చూస్తున్నటువంటి భరత స్వామి కోసం ఉండి అక్కడ ఆగి పైన నందిగ్రామం నుంచి అయోధ్యకి ప్రవేశం చేశాడు అంటే ఎక్కడా ధర్మం తప్పలేదు ఎక్కడా మాట తప్పలేదు నిజానికి కొద్దిగా వెనక్కి వెళ్ళినట్లయితే అయోధ్యా నగర ప్రజలందరూ కూడా రాముడిని నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు మేమందరం నీతో వస్తాం నువ్వు లేని రాజ్యంలో మేము ఉండలేము అంటే రాముడు అన్న మాట ఒక్కటి అది అరణ్యం అది భయానకం అక్కడ అన్ని రకాల క్రూర జంతువులు ఉంటాయి అది వాటి స్వస్థానం స్వస్థానంలోకి వెళ్ళటానికి నేను నాకొక్కడికే అనుజ్ఞ ఉన్నది తండ్రి ఆజ్ఞ ఉన్నది కనుక మీకెవరికీ అటువంటి విషయం లేదు అంతేకాదు అయోధ్యా నగర ప్రజలంతా నాతో వచ్చి అరణ్యంలో గనుక ఉన్నట్లయితే అక్కడ పండేటువంటి పండ్లు కాయలు అనేక కందమూలాలు ఇవన్నీ కూడా అక్కడ జీవించే జంతువులకు లేకుండా చేసే మహాపాపం మనంకూడగట్టుకోకూడదు గనుక మీరు నా తండ్రి ఆజ్ఞను నేను పాలిస్తాను మీరు అయోధ్య నగరానికి వెళ్లి చక్కగా పరమ ప్రశాంతంగా ప్రసన్నంగా హాయిగా జీవనం సాగించండి ఇంకెంత పధ్నాలుగు ఏళ్ళు ఇట్లాగే గడిపి నేను వచ్చేస్తాను అన్నాడు అంటే పర్యావరణ పరిరక్షణలో మొట్టమొదటి వీర ధీర శూర గంభీరమైనటువంటి మూర్తి ఏది అంటే రామచంద్రుడు శ్రీరామచంద్రుడు లేకపోయినట్లయితే ఆయన సైన్యంతో వెళ్ళొచ్చు అరణ్యానికి ఆయన ఒక్కడినే వెళ్ళమని ఏమి చెప్పలా సైనికుల్ని తీసుకెళ్లొచ్చు నగర ప్రజలను తీసుకు వెళ్లొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఇదేం చేయలేదు శ్రీ రామచంద్రుడు శ్రీరామనవమి అంటే పట్టాభిషేకం గాని శ్రీరాముడి జన్మ కానీ శ్రీరాముడి జీవనం కానీ శ్రీరాముడు సకల జంతువుల పట్ల చూపించిన ప్రేమ గాని ఉదాహరణకి జటాయువు కుమారుడు ఉన్నట్లయితే పున్నామ నరకం నుంచి తనను రక్షిస్తాడని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడో పుత్రకామేష్టి యాగం వలన వచ్చాడో అటువంటి కుమారులు నలుగురు ఉండగా భరత శత్రుఘ్నులు మేనమామల దగ్గర ఉన్నారు రామలక్ష్మణులు అరణ్యంలో ఉన్నారు అంటే దశరథుడు మరణించిన వేళ నలుగురు కొడుకులలో ఒక్కడు లేడు అంటే ఏమిటి జీవితం అనేది అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేది జీవితం కాదు అనుకోనిది జరిగినప్పుడు దానిని మనం స్వాధీనపరుచుకొని దానిని ఎదుర్కొని దాన్ని మనతోపాటు నడిపించాలి జీవితం మనల్ని నడిపించకూడదు జీవితం గడిపించకూడదు జీవితాన్ని మనం జీవించాలి అని చెప్పి తండ్రి మరణ వార్త విన్నప్పుడు అయ్యో నా తండ్రి పోయినాడా అని దుఃఖం ఒకవైపు ఉన్నా ఎవరికి అగ్నిసంస్కారం చేశాడు అంటే జటాయువుకు చేశాడు జటాయువుకు ఎందుకు చేశాడంటే తన సేవలో సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు చూసి పోరాడి తనకున్నటువంటి రెండు బలమైన రెక్కలను పోగొట్టుకొని అచేతనంగా ఉన్నాడు గనుక ఒకటి రెండవది దశరథ మహారాజుకి పరమ మిత్రుడు ఎవరంటే ఒకడు గుహుడు రెండో వాడు జటాయువు తండ్రి యొక్క స్నేహితుడు తండ్రితో సమానం కాబట్టి దశరథ మహారాజుకు బదులుగా అగ్నిసంస్కారం జటాయువుకు చేసి శ్రీరామచంద్రుడు మన బోటి వారికి అతి వాస్తవిక దృష్టిని ప్రసాదించాడు ఎంత rational గా అదే అతి వాస్తవిక దృష్టి అంటే వాస్తవాన్ని తెలిసి మెలగాలి మనకు కావలసినట్లు జీవితం ఎప్పుడూ ఉండదు జీవితం మనకివ్వబడుతుందో దాంట్లో ఒదిగి ఉండాలని చెప్పినటువంటి శ్రీ రామచంద్రుడు మహనీయుడు అందుకయినాడు తాను దైవం అయినప్పటికీ కూడా తనకు అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా తాటక సంహారంలో మాటన్నాడు స్త్రీ వధతోనా నా కథ ప్రారంభమైంది అన్నాడు అంటే స్త్రీని వధించడం మంచిది కాదు అన్నాడు శూర్పణఖ ముఖ చెవులు లక్ష్మణస్వామి కోసినప్పుడు చాలా బాధపడినటువంటి వాడు ఎవరు అంటే రామచంద్రుడు అంటే శీల ప్రధానమైనటువంటి ఒక రామచంద్రమూర్తి శీలానికి కట్టుబడి తన భార్య తప్ప మరి ఎవరి యందు వ్యామోహం కాదు ఒక కంటి చూపు కూడా లేకుండా తనదైనటువంటి ధర్మాన్ని తాను ఆచరించాడు కనుకనే శ్రీ రామచంద్రుడు సీతాదేవి అనేటువంటి శక్తితో కూడి సత్వగుణాన్ని సహజంగా ఉన్నప్పటికీ కూడా రజస్తమో గుణాల రెండింటినీ కూడా ఆవాహన చేసుకొని అనేకమైనటువంటి రాక్షసులను సంహరిస్తూ నెమ్మది నెమ్మదిగా వానరులతో స్నేహం చేసి విభీషణుడు వంటి వాడికి పట్టాభిషేకం చేసి తను మానవుడు ఎలా ఉండాలి కృతజ్ఞతా బద్ధంగా ఉండాలి పరుల సొమ్ము ఆశించకుండా ఎలా ఉండాలో రామకథ చెబుతుంది యుద్ధం అయిపోయింది రావణుడు మరణించాడు లక్ష్మణస్వామి లంకా నగరాన్ని చూశాడు షష్టి యోజన విస్తీర్ణం శత యోజన సమున్నతం అష్ట ద్వార పురీ లంకాం సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్షంచ విధీనాం రావణేన సురక్షితం అన్నటువంటి లంకను చూసి అన్నా లంక అంతా కూడా స్వర్ణమయంగా ఉన్నది బంగారంతో చేయబడింది జయించాం కదా మనం లంకా నగరాన్ని కూడా మనమే ఏలుకుందామా అని అన్నగారైన రాముడితో అన్నప్పుడు రాముడు అన్నాడు మాట అపి స్వర్ణమయీ లంకా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి ఇది బంగారంతో చేయని ఎట్లాగైనా చేయని స్వర్ణమయం కానీ మనం పుట్టిన ఊరు మన కన్నతల్లి దానిని మించినటువంటి సౌభాగ్యం మరొకటి లేదు ఏలుకోవటానికి మనకు అయోధ్య ఉన్నది ఏలుకోవలసిన విభీషణుడు ఇక్కడ ఉన్నాడు అని రాజ్యాన్ని అప్పజెప్పాడు అంటే ఒక రాచ మర్యాదలు రాచరికపు పోహళింపులో రాజ్యాన్ని ఎవరు ఎవరు పాలించాలి అనేటువంటి ధర్మ నిర్ణాయక స్థాయిలో శ్రీరామచంద్రుడు సాగించినటువంటిది జీవితమంతా ధర్మమయమే ధర్మబద్ధమే అలాగే శ్రీరామచంద్రుడు వెనక్కి వచ్చేసిన తర్వాత పట్టాభిషేకం అవుతున్నప్పుడు అందరూ కూర్చొని ఉంటే ఆయన కళ్ళు వెతుకుతున్నాయి వెతుకుతుంటే తనకు కావలసిన వాళ్ళు కనపడటంలా అంతఃపుర స్త్రీలు రాముడిని చూస్తున్నారు పురజనులు హితజనులు సన్నిహిత జనులు కిష్కింద నుంచి వచ్చిన వానర సమూహము కానీ ఇవేవీ రాముడిని ఆనందపరచలే వెతుకుతున్నాయి రెండు కళ్ళు రెండు సింహాసనాల మధ్య కూర్చున్నటువంటి ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్ళి హనుమా నేను వచ్చానన్నాడు రాముడు హనుమ కళ్ళు తెరవలా హనుమా నేను రామచంద్రుడిని వచ్చానన్నాడు నీ నామస్మరణతో నీ తలుపులతో నా రెండు కళ్ళు కన్నీటితో నిండిపోయినాయి కన్నీరు తెప్పించిన రామా కన్నీరు తప్పించవయ్యా అన్నాడు సరేసరే అని భుజం తట్టి చిటికెన వేలు అందించి సింహాసనం వరకు నడిపించి అందరి సమక్షంలో ఒక మాట చెప్పాడు క్రతం హనుమతా కార్య సమవిద్వుహు దుష్కరం మనసాపి అదన్యేన శక్యం ధరణీతలే ఇటువంటి హనుమ నామంతో ఎవరైనా ఉండవచ్చు గాక హనుమంతుడి లాగా సేవ చేసేవాడు మాత్రం భూమండలం మీద ఎవ్వడూ లేడు అది అసాధ్యము అన్నాడంటే ఒక సేవని గుర్తించటం యజమానిగా తన బాధ్యతని కట్టకడపటి క్షణం వరకు కూడా శ్రీరామ భద్రాభిరామ మూర్తి అంటుంది అహల్య భద్రాభిరామ మూర్తి లోక భద్రకారుడుడై లోకకళ్యాణ కారకుడై కళ్యాణ చక్రవర్తియై పరిపూర్ణ మానవుడైనటువంటి దివ్యత్వ స్వరూపము మూర్తిమత్వం ఏదంటే శ్రీరామచంద్రుడు గనుక ఇవ్వాళ ఆయనకి కైవారం చేయటం పూజ చేయటం ఆరాధన చేయటం వివాహం చేయటం అది కాదు శ్రీరామ ధర్మాన్ని మనం కూడా జీవితంలో సాధ్యమైనంతవరకు పాటించినట్లయితే శ్రీరామనవమి పుణ్యదినం మనకొక ప్రేరణ కలిగిస్తుందని భావన చేస్తూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరాముడి కరుణ అందరి యందు కలుగుగాక స్వస్తి. [outro jingle]
YouTube · audio

సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

Home

సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 12:59

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

    Now playing
  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam