Skip to content
Transcript తెలుగు
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో జగద్గురువు అనిపించుకున్నటువంటి వేళ అవతరించబోయేటువంటి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి ఉపదేశ సందేశ ఆదేశాలతో కూడి కర్మ భక్తి జ్ఞాన యోగాలు మూడింటిని సమన్వయం చేసి ఒక ఆధ్యాత్మిక త్రివేణిగా ఎక్కడైతే నిర్ణయం చేశాడో తదనుగుణంగా ప్రాదుర్భవించినటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథరాజమే శ్రీమద్భగవద్గీత భగవద్గీత పుట్టిన సందర్భం చాలా సున్నితమైనది సునిశ్చితమైనది అవసరమైనది అక్కరకు వచ్చేది ఎందుకని అంటే ఒక విద్యార్థి పరీక్ష రాయటానికి మూడు వందల అరవై నాలుగు రోజులు కష్టపడి చదివి తీరా పరీక్ష ప్రాంగణంలో ప్రవేశించి నేను పరీక్ష రాయను అంటే ఎలా ఉంటుందో పాశుపతాస్త్రం వంటి మహత్తరమైనటువంటి అస్త్రాలను సాధించుకొని విలువిద్యా విశారదుడై సర్వశాస్త్ర పారంగతుడై సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మతో అతి సన్నిహితంగా గడిపినటువంటి అర్జునుడు తీరా యుద్ధం చేయవలసి వచ్చేసరికి అంటే యుద్ధరంగ ప్రవేశంతోనే నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకోవటానికి కారణం మనో వైక్లభ్యం కారణం విషాదం కారణం కనుకనే భగవద్గీత అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది అర్జున విషాద యోగం అంటే మానవుడి విషాద యోగమే యోగము అంటే అప్పటికప్పుడు సంభవించేది అని అది ఒక మానసికమైనటువంటి వైపరీత్యము ఒక అసమర్థత ఒక నిస్సహాయత ఒక మమత ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల పోగొట్టుకోలేనటువంటి ఒక మమతా బాంధవ్యము ఇన్ని కారణాల వల్ల నుంచి ఒక విషాదం పుట్టినప్పుడు తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి కృష్ణుడితో ఒక మాటన్నాడు నాకు రాజ్యం వద్దు కీర్తి వద్దు నాకీ కాంక్షలు ఏవీ లేవి వేళ నా తల్లిదండ్రులు మేనమామలు తోబుట్టువులు దయాదులైన వాళ్లందరినీ అంతేకాదు కురువృద్ధులు గురువృద్ధులు నాకు విద్య నేర్పినటువంటి వారు వీరందరినీ కూడా చంపి నేను సాధించబోయేది ఏముంది కనుక నేను యుద్ధం చెయ్యను అన్నాడు అప్పుడు జగద్గురువైనటువంటి వాడు చేయవలసిన పని శ్రీకృష్ణుడు క్షణంలో పని చేశాడు ఏమనంటే నీ హృదయ దౌర్బల్యానికి కారణం ప్రాపంచికమైనటువంటి బంధు ప్రీతి కారణం మమతా బాంధవ్యాలు కారణం రాగ బంధాలు కారణం అనురాగ సంబంధాలు కారణం అర్జునా ఇక్కడ నీవు నిమిత్త మాత్రుడివి ఎందుకంటే నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు ఇక్కడ రెండు విషయాలున్నాయి యుద్ధంలో మరణిస్తే నువ్వు వీరుడివి అవుతావు అంటే వీరమరణాన్ని పొందుతావు యుద్ధంలో నుంచి పారిపోయి వెన్నుచూపి గనుక నువ్వు పారిపోయినట్టయితే నువ్వు పిరికిపందగా చరిత్రలో మిగిలిపోతావు ఇది క్షాత్ర ధర్మం కాదు ఒక క్షత్రియుడిగా జన్మ ఎత్తి అనేకమైన తపస్సులు చేసి నబోట్టి వారితో కూడి ఉండి ఇన్ని అష్టకష్టాలు పడి వీటన్నింటి నుంచి బయటపడి మళ్ళీ రాజ్యం సంపాదించుకోవాలి ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి ఒక సందర్భం ఏర్పడినప్పుడు నీవు అకస్మాత్తుగా యుద్ధం చెయ్యను అంటే ఇది సమంజసం కాదు అని చెప్తూ ఒక పక్కన అర్జునుడికి బోధ చేశాడు అయితే సాధారణంగా లోకరీతిలో ఏమున్నది అంటే ఒక కృష్ణుడికి ఒక అర్జునుడు మాత్రమే శిష్యుడుగా ఉన్నాడు భగవద్గీతను విన్నది ఒక అర్జునుడు మాత్రమే అని అందరూ చెప్తూ ఉంటారు అది మాత్రం నిజం కాదు ఎందుకంటే అంతఃపురంలో జనుశాంధుడు అంటే పుట్టుగుడ్డి అయినటువంటి దృతరాష్ట్రుడు దూరదర్శనము దూర శ్రవణము అనే సిద్ధులు కలిగినటువంటి సంజయుడిని పక్కన పెట్టుకొని సంజయా కురుక్షేత్ర సంగ్రామ ఆరంభ వేళలో ఏం జరుగుతున్నది మామకాహ పాండవస్య పాండవులు అంటే పాండు కుమారులు నా పిల్లలు ఎలా ఉన్నారు అన్నాడు ఇది మమతానుబంధాలకి ఒక పరాకాష్ట అంటే పాండురాజు కుమారులని దృతరాష్ట్రుడు ఎన్నడూ తన కుమారులుగా అంగీకరించలేదు తన కుమారులు ఎట్లా ఉన్నారు అంటూనే పాండవులు ఎలా ఉన్నారు పాండు కుమారులు ఎలా ఉన్నారు అన్నప్పుడు సంజయుడు యుద్ధరంగంలో జరుగుతున్న అనేక సందర్భాలని ఆరంభ వేళల్ని వర్ణించి చెప్తున్నాడు అంటే భగవద్గీత ఆరంభ వేళ కృష్ణార్జునులతో పాటుగా ఒక పక్కన అంతఃపురంలో సంజయుడు ఉన్నాడు దృతరాష్ట్రుడు ఉన్నాడు అంటే అప్పటికి నలుగురు అయినారు మరి ఇక ఐదవ వాడు ఎవరు అంటే అదిగో జెండాపై కపిరాజు జెండా మీద త్రేతాయుగం దాటి ద్వాపర యుగంలో ప్రవేశించి పంచబ్రహ్మలలో ఒకడై చిరంజీవిగా పేరుగాంచినటువంటి ఆంజనేయస్వామి ఉన్నాడు రథమే పద్ధతి దానిపై ఒక జెండా దానిమీద కపిరాజు అంటే ఒక విహంగ వీక్షణం చేస్తున్నాడు అన్నీ వింటున్నాడు ఏం జరుగుతున్నదో ఆయన మరొకడు ఇంకొకడున్నాడు ఆయన ఎవరంటే పురాణముని ఆయన వ్యాసులవారు వేదవ్యాసులవారు వ్యాసేన గ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతంఆయన గనుక సూక్ష్మ శరీరంలో ఉండి కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి సంవాదం అంతా కూడా ప్రతిబోధ అంతా విని ఉండకపోతే ఇవ్వాళ మనకి భగవద్గీత చేతికి వచ్చేది కాదు. కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు ఇలా చెప్పబడుతున్నది అంటున్నాడు సంజయుడు వింటున్నాడు ధృతరాష్ట్రుడు దీనినంతా పైనుంచి వీక్షిస్తున్నాడు మారుతి. కనుక భగవద్గీతని విన్నటువంటి ఐదుగురు ప్రథమ శ్రోతలుగా మనం భావన చేయాలి. అందులో బౌద్ధ తొలి కృష్ణ పరమాత్మ అవుతున్నాడు. సంగ్రామం ప్రారంభం కాగానే నువ్వు ధనుర్బాణాలు వదిలిపెట్టకూడదు శుద్ధుడివై సిద్ధుడివై సంసిద్ధుడివై వచ్చావు. శుద్ధము అంటే prepared పవిత్రతను పొంది వచ్చావు. సంసిద్ధుడివై వచ్చావు అంటే యుద్ధం చేసి తీరాలి అని వచ్చావు అన్ని శక్తులు సంతరించుకొని సిద్ధుడివై వచ్చావు. మూడు నీ దగ్గర ఉంచుకొని నేను రథసారథిగా ఉండగా యుద్ధం ఎందుకు చేయకపోతున్నావు అన్నప్పుడు ఇదిగో ఇందాక చెప్పినవన్నీ అర్జునుడు చెప్తూనే ఉన్నాడు వింటూనే ఉన్నాడు కృష్ణుడు. ప్రతి దానికి చెప్తున్నాడు అది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు అంతరించబోయేటువంటి ద్వాపర యుగానికి కాక అవతరించబోయేటువంటి కలియుగానికి ఒక మహా బౌద్ధై జగద్గురువై శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని మనకు ఉపదేశనం చేశాడు. అయితే ప్రాపంచికమైన అధ్యాత్మ గ్రంథాలు వేలకొలది ఎన్ని భాషలలో ఎన్ని మతాలలో ఉన్నా ఒక గ్రంథానికి జయంతి జరిగేది మాత్రం ఒక గీతకు మాత్రమే. గీత అంటే గానం అని ఒక అర్థం రెండవది పరిధులు లేనిది అని రెండవ అర్థం. అంతేకాదు అది శృతి స్మృతి పురాణం మూడు మాత్రమే కాక యోగం క్షేమం అన్నీ కూడా కలబోసుకున్నటువంటి ఒక విజ్ఞాన బృహత్తర సంపుటి భగవద్గీత. పైగా గీత ఎవరు చెప్పారు? ఋషి గారు చెప్పారా? మహాత్ముడు చెప్పాడా? ఒక తపస్వి చెప్పాడా? ఒక తాత్వికుడు చెప్పాడా? అంటే ఆర్ధాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం నారము అంటే జ్ఞానము జ్ఞానము అయనము కాగలిగినటువంటి వాడు నారాయణుడు నారాయణ శబ్దానికి అర్థం అది. కాబట్టి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కలియుగానికి ఇవ్వాలి కలియుగంలో ఉండే మన బోటి వాళ్ళందరం కూడా ప్రశ్న వేయటానికి పుట్టాం. మనకి జవాబు కావాలి నిరూపణ కావాలి ప్రజ్ఞ కావాలి ఉదాహరణ కావాలి వ్యాఖ్యానం కావాలి విస్తృతమైనటువంటి బోధ కావాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకాలలో తొలి ఆరు అధ్యాయాలు కర్మ యోగంగా మళ్ళీ ఆరు అధ్యాయాలు భక్తి యోగంగా కడగా ఆరు ఉన్నటువంటివి జ్ఞాన యోగంగా కర్మ భక్తి జ్ఞాన మూడింటిని కూడా ఒక పరమాద్భుతమైనటువంటి స్థాయిలో తీసుకుని వెళ్ళాడు. దీనికి ఒక పూర్వరంగం కూడా ఉన్నది ఒక యుగం ముందు నారాయణుడే శ్రీరామచంద్ర పరబ్రహ్మమూర్తిగా జగత్తులోకి వచ్చాడని మనం అనుకుంటే రామచంద్రుడు మాత్రు నేను దశరథ మహారాజు కొడుకుగా వచ్చాను దశ యుగాల వరకు వినపడేటువంటి మంచి పేరుతో ఉంటాను పేరు శ్రీరామచంద్ర నామం దశకంధరుడి యొక్క పది తలలు ఉత్తరించి ధర్మసంస్థాపన చేస్తాను అని శ్రీ మహావిష్ణువుగా ఉండి ప్రమాణం చేసి వచ్చాడు. వస్తే ఆయన కూడా అయోధ్యా నగరం అంతా తిరిగి వచ్చి అంతఃపురం చేరుకొని తలవంచు కూర్చున్నాడు. దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు జ్ఞాన వృద్ధుడైనటువంటి వశిష్ఠుల వారు వచ్చి అదేమిటి రథమెక్కి వెళ్ళావు అంతఃపురం వీడి అయోధ్యా నగరాన్నంతా చూసి వచ్చావు కదా ఎందుకు ఇంత విషాదంగా ఉన్నావు? ఎందుకు ఇంత నిర్లిప్తుడిగా ఉన్నావు? ఏమి జరిగింది? అని అడిగితే శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే గురుదేవా నేను ప్రపంచాన్ని చూసినప్పుడు నాకంతా దుఃఖారామం అని అనిపిస్తున్నది. ఇక్కడ సుఖమూ సంతోషమూ ఆనందమూ నాకెక్కడా పొందినవారు నాకు కనపడలేదు మరి దుఃఖారామమైన ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాను అని అనగానే వశిష్ఠుల వారు ఒక్కసారి మేల్కొని జ్ఞాన దృష్టితో చూసి అవతారం వచ్చిందే రావణ వధకి యజ్ఞయాగాదులను రక్షించటానికి తపో స్వాధ్యాయ నిమిత్తమై ఉన్న సకల జీవులని చక్కగా సంరక్షించి ధర్మసంస్థాపన చేసి ధర్మాన్ని ఎలా ఆచరించాలో తన జీవితం ద్వారా చూపించి కడగా అధర్మాన్ని నశింపజేయటానికి కదా వచ్చాడు రాముడు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఇంత వైరాగ్యం కనక కలిగితే ఆయన మనసుకు ఇప్పుడే ఇంత దుఃఖం కలిగితే అవతారం నడిచేదెప్పుడు రావణ వధ జరిగేదెప్పుడు అధర్మం నశించేదెప్పుడు అని ఆలోచించి ఆయనతో అంటే రాముడితో కూర్చొని కొంత ప్రసంగం చేశాడు. ప్రసంగం అంటే ఇద్దరూ మాట్లాడుకున్నారు. రాముడు అడుగుతున్నాడు వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నాడు. వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకున్నవే ముప్పై మూడు వేల శ్లోకాలతో వచ్చినటువంటి యోగవాశిష్ఠం. లేదా వశిష్ఠ గీత. అనాడే దానికి వశిష్ఠ గీత అని పేరు. దాని నిండా ఏం చెప్పబడిందయ్యా అంటే మనసు యొక్క మర్మం చెప్పబడింది. మనసు ఒక క్షణం ఆనందంగా ఎందుకుంటుంది? క్షణం దుఃఖంలో ఎందుకు కూరుకుపోతుంది? ప్రపంచంలో కొన్ని వేల వందల సంవత్సరాలు బతకాలని మనసు ఎందుకు కోరుకుంటుంది? లేదు లేదు జీవితం అయిపోయింది ఇక చాలు అని ఎందుకు అనుకుంటున్నది? మళ్ళీ జన్మ కావాలి అని ఎందుకంటున్నది జన్మలే వద్దని ఎందుకంటున్నది? ఇవన్నీ కూడా విచారణ చేస్తూ చేస్తూ చివరగా ఆయన ఎట్లాగూ రావణ వధ చేయాలి పట్టాభిషిక్తుడు కావాలి అయోధ్యా నగరాన్ని పాలించాలి ఇక్ష్వాకు వంశాన్ని నిలబెట్టాలి ఇవన్నీ ఉన్నాయి గనుక సమయంలో లోకే విహర రాఘవా అని యోగవాశిష్ఠాన్ని ఆయన చక్కగా చెప్పినప్పుడు ఇవాళ భగవద్గీత యొక్క ఏడు వందల శ్లోకాలని తీవ్రంగా కేవలం పాఠగా కాక తత్వ విచార ధారలో గనుక అర్థం చేసుకోగలిగినట్లయితే యోగవాశిష్ఠంలో చెప్పబడిన మనసుకు సంబంధించిన అనేక విషయాలు మళ్ళీ మనకు భగవద్గీత లో కనిపిస్తాయి. ఇది ఒక పూర్వ రంగం. దీన్ని దృష్టిలో మనం పెట్టుకున్నప్పుడు భగవద్గీత లో కొన్ని శ్లోకాలు మనం ఉదాహరణ ప్రాయంగా విశ్లేషణాత్మకంగా ఒక తాత్విక చింతనా సారస్వతంగా ఒక హృదయంగమమైనటువంటి దివ్య భాషలో భావనలన్నీ అర్థం చేసుకొని ఇదిగో పురుడు పోసుకున్నటువంటి మానవ జీవితాన్ని ముగించేలోగా ఎంత ఉదాత్తమైన స్థాయిలో సంచరింప చేయవచ్చునో మానవ జీవితాన్ని ఎంత ధన్యవంతము శక్తివంతము చేయవచ్చునో మనకు భగవద్గీత అవకాశాన్ని కల్పిస్తుంది గనుక అటువంటి తత్వ విచార ధారలోకి మనందరం కూడా శుభంగా ప్రసన్నంగా ప్రశాంతంగా హాయిగా కానీ ఉదాత్తంగా లోతుగా గంభీరంగా ప్రస్థానం చేద్దాం.
YouTube · audio

సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

Home

సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 13:46

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

    Now playing
  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam