Skip to content
Transcript తెలుగు
ఇవాళ వీళ్లందరిలో తెలుగువారే ఎరగనటువంటి ఒక మహాత్ముని గురించి మాట్లాడుకునేటువంటి ఒక పరమ ఉత్కృష్టమైనటువంటి యోగాన్ని మనందరికీ సత్యసాయి భగవానుడు దివ్యంగా అనుగ్రహించాడు. చాలా విచిత్రం ఏమిటంటే ఇలా చెప్పుకోవాలి అని అనుకునేది ఏం ఉండదు సత్యసాయి భగవానుడా తెలుగుదేవర యోగులలో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి మొట్టమొదటి త్రైలింగ స్వామి కూడా తెలుగు వాడే అది. ఒక తెలుగుదేవర, ఒక తెలుగు యోగి, ఒక తెలుగు భక్తుడు ముగ్గురు కలిస్తే అది ప్రవాహం కాక ఏమవుతుంది? ముప్పేటగా సాగేటువంటి అధ్యాత్మ ప్రవాహంలో త్రైలింగ స్వామి పరమ ఆశ్చర్యంగా ఎన్ని సంవత్సరాలు బతికాడు, జీవించారు అని గనక తెలుసుకున్నట్లయితే ఒక్కసారి నిశ్చేష్టులమై "మేం నమ్మం" అంటారు. రెండు వందల ఎనభై ఏళ్ళు బతికాడు ఆయన పంచభూతిక దేహంలో two hundred and eighty years. Sixteen nought seven పదహారు వందల ఏడులో డిసెంబర్ నెలలో పుట్టారు. పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అదే డిసెంబర్ నెలలో తమ అవతారాన్ని పరిసమాప్తం చేశారు. ఎవరు? త్రైలింగ స్వామి. ఆయన హాలియా అనేటువంటి ఒక ప్రదేశం విజయనగరం జిల్లా అది అక్కడ పుట్టాడాయన. తల్లి విద్యావతి. అసాధారణ మేధాశక్తితో పుట్టాడాయన. ధారణా శక్తి అనంతం. కానీ నిత్య సమాధి ఆయనకి చాలా ఇష్టం. ప్రాపంచికమైన ఆటపాటల కంటే కూడా మనస్సుని చిత్తైకాగ్ర స్థితిలో నిలబెట్టుకొని, పరమేశ్వరుడితో అనుసంధానం చేసుకొని, తనతో తాను రమిస్తూ, తనతో తాను ఉంటూ, ఒక స్వా ఆత్మ ఆనంద అంటే స్వాత్మ ఆనంద స్థితిని అనుభవిస్తూ నందతి నందతి అన్నామే దానికి ఒక సాకార సగుణ స్వభావ స్వరూపంగా, సమ్యక్ దర్శనంగా ఆవిష్కృతమైనారు ఆయన. తెల్లైనా, తండ్రైనా పిల్లవాడు సమాధి స్థితిలోకి వెళితే తట్టుకోగలరా? వాడేదో చదువుకోవాలి, కనీసం గుమస్తా ఉద్యోగం అన్నా చేయాలి, ఇంటికి నాలుగు రూపాయలు తేవాలి అని కోరుకుంటారు సహజం. కానీ తండ్రికి అటువంటి ఆలోచనలు ఉండేవి. "ఏమైపోయినాడు? ఇటువంటి వాడిని కన్నాం ఏమిటి? వీడు చదువుకోడు ఏమిటి? ఏమైపోతాడు వీడు?" అని. తల్లి ఆమె పేరు చూడండి విద్యావతి గ్రహించింది. "వాడి జోలికి మీరు వెళ్ళకండి. వాడు ఎలా పెరగాలో వాడిని పెరగనివ్వండి" అన్నది. తండ్రి ఏమంటాడు? తల్లికే భయం లేనప్పుడు తండ్రి భయపడటం మానేశాడు. అట్లా పదహారు, పదిహేడు ఏళ్ళు వచ్చింది. ఆయన పుట్టిన పదహారు వందల సంవత్సరంలో బహుశా పదిహేనేళ్ళకో, పన్నెండేళ్ళకో పెళ్లి చేసేసేవారు. బాల్య వివాహాలు permitted. అష్ట వర్షాద్ భవేత్ కన్యా ఎనిమిదేళ్ళు ఆడపిల్లకు రాగానే ముందు పెళ్లి చేసి ఇంకో చోటికి పంపటం ఆనాటి సాంప్రదాయం. కనుక ఈయన పదహారు ఏళ్ళు వచ్చి యవ్వన ఆరంభ వేళలు ప్రారంభం కాగానే తండ్రి నాడు "వీడికి పెళ్లి చేసేద్దాం. చేస్తే ఏమన్నా కాస్త బాధ్యతగా ఉంటాడేమో" అని అనుకున్నారు. భార్యతో తన భావాన్ని పంచుకున్నప్పుడు "అడిగి చూద్దాం" అంది. ఆయనన్నారు "నాకు పెళ్లి వద్ద" అన్నారు. "నేను పెళ్లి చేసుకోవటానికి రాలేదు" అన్నాడు. పదహారు ఏళ్ళ వాడు "నాకు పెళ్లి ఎప్పుడు చేస్తావు నాన్నా?" అని అడిగే రోజులివి కదా. "నాకు పద్దెనిమిది వచ్చింది అన్నా వెతుకుతున్నారా పిల్లని?" అనే రోజులు ఇవైతే నాకసలు పెళ్లే వద్దు అన్నాడాయన. విద్యావతి గ్రహించింది తల్లి. వాడికి పెళ్లి వద్దు, అక్కర్లేదు, అవసరం లేదు అన్నది. అప్పుడు తాను తొలిగా తల్లిగా ఒక గురు స్థానాన్ని స్వీకరించి తన బిడ్డకి శాస్త్రాల మీద ఉన్నటువంటి కొన్ని విషయాలని పరిచయం చేసింది. They were all intro lectures. చాలా deep ఏం కావు. అంటే రామాయణం, భారతం, భాగవతం. కాస్త తెలుగునాట ఆనాటికి ఏమి ప్రాచుర్యంలో ఉన్నాయో కొన్ని పద్యాలు బహుశా, నీతి సూత్రాలు, మనిషి ఎలా బతకాలి, moral philosophy ఇవన్నీ కాసేపు చెప్పిందావిడ. వంట పట్టించుకున్నాడు. ఆయనకి నలభై ఏళ్ళు వచ్చేసరికి తండ్రి గతించాడు. తర్వాత ఒక ఐదు, పదేళ్ళకి తల్లి గతించింది. మరి ఏం చేయాలి ఈయన? పెళ్లి లేదు. ఈయనకి ఒక సవతి తమ్ముడు ఉన్నాడు. సవతి తమ్ముడికి ఆస్తి అంతా అప్పజెప్పేశాడు. అప్పజెప్పి యోగ సాధనలో తన మనస్సును నిలబెట్టుకున్నాడు. అయితే తమ్ముడు కూడా ఎటువంటి వాడు అంటే అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ, యోగ సాధనలో ఉన్నవాడికి అవసరానికి నిత్య నైమిత్తికంగా ఏమేమి ఇవ్వాలో అవిస్తూ ఆయన శరీరాన్ని పోషిస్తూ నడిపాడు. సుమారుగా సాధన నలభై సంవత్సరాలు చేశారు. డెబ్భై ఏళ్ళు వచ్చినాయి. ఒకరోజున తానున్న ప్రదేశంలోనే తాను నడిచి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక పరమాద్భుతమైన సంఘటన జరిగింది ఆయన జీవితంలో. ఎవరో ఒక పాముని తరుముతూ వస్తున్నారు. అది వచ్చి త్రైలింగ స్వామి యొక్క పాదాలను చుట్టుకొని ఉండిపోయింది అది. దానివైపు ఎవరు రాయి విసిరినా రాయి దానికి తగలటంలా రాళ్ళు వెనక్కి వెళ్లిపోతున్నాయి. రాళ్ళు విసిరే వాళ్ళు ఆశ్చర్యపోయినారు. "ఇదేమిటీ మహిమ? ఇట్లా ఉందేమిటి?" అని. పాముని చంపాలి. అయ్యో గురువుగారి పాదాలు ముట్టుకుంది అది, ఆయన్ని చంపేస్తుందేమో అని వీళ్ళ భయం. ఆయన నిశ్చల స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన పాము నిర్భయంగా ఉంది.రాళ్ళు కొడుతున్నటువంటి మాములు జనం అంతా కూడా నివ్వెరపోతున్నారు అప్పుడు ఈయనకు ఏదో మహత్యం ఉన్నది మహత్తు ఉన్నది అని కొంత గ్రహించారు దండం పెట్టారు ఆయన అన్నారు ముందు పాముని కొట్టటం ఆపండి దాని దారిన దాన్ని వెళ్ళనివ్వండి అన్నారు ఇది మాములుగా మనుషులు చేసే పని కాదు అతిమానుషమైన పని అప్పుడు వాళ్ళంతా ఈయనకు మహిమ ఉన్నది అని చాటటం మొదలు పెట్టారు అధ్యాత్మ లో మనిషి ప్రచారాన్ని కోరుకోకూడదు నువ్వు ఎంత popular అవుతుంటే ప్రపంచం నిన్ను మోసే ప్రయత్నం చేస్తుంది నిన్ను ఒక గురువుని చేసేసే ప్రయత్నం చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అనాహత చక్రంలో దాకా అక్కడికి వెళ్ళటం చాలా తేలిక అనాహతం దగ్గరికి వెళ్ళేప్పటికి ప్రపంచం మన చుట్టూ చేరి నీ అంతటి వాడు లేడు అంటుంది నాకంటే భగవంతుడు ఉన్నాడు వాడు ఎప్పుడూ గొప్పవాడే అనేటువంటి ఒక స్పృహ లో ఉన్నాడా వీడు బాగుపడతాడు అవును లోకమంతా నా అంతటి వాడు లేడంటున్నప్పుడు నిజమే కాబోలు అనుకున్నాడా మూలాధారంలోకి వస్తాడు ఇది పతనానికి మొదటి మెట్టు అవుతుంది గనుక నిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి స్వరూపం కాబట్టి త్రైలింగ స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు వెళ్లి ఎక్కడికి వెళ్లారు రామేశ్వరానికి చేరుకున్నారు రామేశ్వరంలో కూడా చాలా సమయం సమాధిలో గడిపేవారు ఆయన ఒకరోజున రామేశ్వర పురవీధులలో నడిచి వెళుతున్నారు పదహారు, పదిహేడు ఏళ్ల నవ యువకుడు మరణించాడు శవాన్ని మహాస్మశానానికి తీసుకెళుతున్నారు తీసుకెళుతున్నటువంటి సమయంలో తల్లి రోదిస్తున్నది తండ్రి రోదిస్తున్నాడు సహజం కదా వియోగాన్ని భరించలేని బంధువులంతా విచారంలో మునిగిపోయినారు ఈయన ఏమి పట్టించుకోనటువంటి ఆయన రోజున పట్టించుకున్నారు పట్టించుకొని తన చేతిలో ఉన్న నీళ్లు తీసి శవం మీద చల్లారు ఏం మంత్రాలేం చదవరు ఉరికే చల్లారు వాడు లేచి కూర్చున్నాడు లేచి కూర్చోగానే పరమేశ్వరుడు నీకు ఆయువు అనుగ్రహించాడు జన్మ ఇచ్చాడు తల్లిదండ్రులను సేవించి నీ జీవితాన్ని సద్గతి చెందించుకో అని వెళ్ళిపోయినారు జనం వదిలిపెడతారా చచ్చిపోయిన వాడిని బతికిస్తే వాడిని వదిలిపెట్టే వాడు ఎవడు మనం doctor నే వదిలిపెట్టం ఎలాగైనా చూడండి అంటాం వాడు చూడలేడని తెలుసు కూడా ఇక్కడ సాక్షాత్తు దృశ్యం చూశారు అయినా జనమంతా ఆనందంతో ఆయన వెనక పరిగెత్తారు ఎప్పుడైతే ఆయనను గుర్తించటం మొదలుపెట్టి జనం ఆయన చుట్టూ చేరటం మొదలు పెట్టారో అన్ని సందర్భాలలోనూ ఆయన ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు వెళ్ళటం వెళ్ళటమే హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు హిమాలయ పర్వతాలలో అనేక మంది మహాత్ములను దర్శనం చేశాడు తపస్సు చేసుకున్నాడు యోగంలో అనేక సిద్ధులు పొందాడు ఆయన శరీరం హిమాలయాలకు వెళ్ళేప్పటికి ఆయన వయస్సు నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలలో ఆయన శరీరం బరువు మూడు వందల పౌండ్లు అది ఆయన ఆకృతి చాలా పెద్ద బాన పొట్ట అజానుబాహువు కానీ మహా తేజస్సు హిమాలయ పర్వతాల నుంచి నెమ్మదిగా కిందకి వస్తూ వస్తూ వారు రోజుల్లోనే మానససరోవర దర్శనం చేసి అక్కడ యోగ సిద్ధులు పొంది నర్మదా నది తీరానికి చేరుకున్నారు నర్మదా నది తీరంలో ఒక పరమాద్భుత సంఘటన జరిగింది సంఘటనలన్నీ కూడా యోగ శక్తికి నిరూపితాలు వాటి విచారణ తర్వాత చేద్దాం అవి ఎందుకు వస్తాయి అవి ఎట్లా జరిగినాయి నర్మదా నదిలో గురువుగారి ఆశ్రమం ఉంటే వీరు ఆశ్రమానికి వెళ్లారు బయట నదిలో ఏముంటాయి నీళ్లుంటాయి దాహం వేసింది నీళ్లు తాగటం మొదలు పెట్టారు ఆయన లోపల ఉన్న గురువు గారికి నర్మదా నది మొత్తం పాల సముద్రం అయిపోయినట్టుగా పాలనది అయిపోయినట్లుగా నీళ్లన్నీ పాలుగా మారినట్టుగా ఒక భావన కలిగింది లేదు లేదు ఇది మనోభ్రాంతి నీళ్లు పాలు కావడం ఏంటి అసంభవం అనుకున్నాడు ఈయన తాగుతూ ఉన్నారు నర్మదా నదిలో నుంచి వస్తున్నదంతా ఆయన స్పర్శ చేత ఆయన ఎక్కడ తాకుతున్నారో అదంతా పాలుగా మారుతున్నది గురు స్వరూపమైనటువంటి ఆయన పెద్దాయన వచ్చి ఈయన పాదాల మీద పడ్డారు ఇది ఏమిటి అని అడిగారు ఏమో ఇదంతా భగవత్ లీలా విలాసంలో భాగమేమో నాకేం తెలుసు అన్నారు ఆయనకు తెలుసు అన్ని అనిమాది సిద్ధులని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా మనలోనే మాయావి ఉన్నాడు మన యందే మహా యోగి ఉన్నాడు మాయావి తనను తాను వంచన చేసుకుంటాడు జగత్తుని వంచిస్తూ ఉంటాడు సిద్ధుల ద్వారా మహా యోగి అవే సిద్ధులని ఆధారం చేసుకొని తాను ఆత్మనిష్ఠలో ఉండి ఆత్మానుసంధానం చేసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొంది పరమోత్కృష్టమైనటువంటి పరమ చరమ స్థాయికి చేరుకుంటాడు రెండు అనివార్యమైనటువంటి పరిస్థితులు పాంచభౌతిక దేహాన్ని తీసుకుని వచ్చిన ప్రతి వాడి యందు మాయావి ఉంటాడు మాయావే మోసానికి గురవుతాడు మాయకు గురవుతాడు మహా యోగి చైతన్యంతో కూడి ఉంటాడు అందుకనే సత్యసాయి భగవానుడు అనేక సందర్భాలలో చెప్పిన మాట నువ్వు తరించటానికి వచ్చావా అంతరించటానికి వచ్చావా తెలుసుకో రెండు దారులు చీలి ఉన్నాయి తరించాలి ఇదిగో ఇది మార్గం అంతరించాలి అది మార్గం మీ ఇష్టం.ఏ మార్గంలో వెళుతావో రెండు నీ ప్రారబ్ధాన్ని బట్టి ఏర్పడతాయి. గురువుని, పరమాత్మని గనక ఆశ్రయించి ఉన్నట్లయితే తరించే మార్గం నీకు లభిస్తుంది, అంతరించే మార్గం మూసుకుపోతుంది అని చెప్పారు. కానీ మనలో ఉన్న మాయావి కాసేపు అంతరించాలని, కాసేపు తరించాలని పొద్దున్న పూజ చేస్తాం, సాయంకాలం పాపం చేస్తాం. ముక్తి ఎక్కడ లభిస్తుంది? ఆనందం ఎక్కడ లభిస్తుంది? పైకి ఒకటి మాట్లాడుతుంటాం, లోపలన్నీ అనేకమైనటువంటి కల్మషాలు ఉంటాయి. ఎవరినీ మనం ప్రశంసించం, ఎవరినీ అంగీకరించం, ఎవరినీ గౌరవించం. కానీ ప్రపంచం మొత్తం మనల్ని గౌరవించాలని మాత్రం భావన చేస్తాం. ఇది అసంభవం. ఎందుకంటే, నీవు ప్రపంచాన్ని ప్రేమిస్తేనే ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది. సత్యసాయి భగవానుడు ప్రేమ స్వరూపం కనుకనే సర్వ జగత్తు ఆయన్ని ప్రేమించింది. ఆయన ఇంత ప్రేమించబడటానికి కారణం ఏమిటి అని మొన్న ఎవరో ప్రశ్నిస్తే, ఏం లేదు, ఆయన ప్రపంచాన్ని ప్రేమించారు. ప్రపంచానికి ఏమిచ్చారో ఆయన వెనక్కి అదే తెచ్చుకున్నారు. మనం పని చేయలేకపోతున్నాం కాబట్టి మనం నచ్చే వాళ్ళు కొందరు, మనం నచ్చని వాళ్ళు కొందరు, మననికిచ్చేవాళ్ళు కొందరు, అనేక మంది ఏర్పడుతూ ఉంటారు. అక్కడ ఏం ఉండదు. ఉన్నదంతా దివ్యమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి చైతన్యమే ప్రవాహంగా ఉంటుంది. అనటానికి త్రైలింగ స్వామి వంటి వారంతా ఒక ఉదాహరణ. నర్మదా నదిని వదిలిపెట్టారు, వారణాసి చేరుకున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి కథ, అంటే ఆయన అవతార వైభవం అంతా కాశీలో జరిగింది. కాశీ మహాస్మశానం. కాశీకి గనక వెళితే, కాశీలో గంగా స్నానం చేస్తే పరముక్తి లభిస్తుందని, చిదంబరంలో నటరాజ దర్శనం చేస్తే పరముక్తి లభిస్తుందని, తిరువయ్యూరులో జన్మ ఎత్తితే పరముక్తి లభిస్తుందని, అరుణాచల శివాన్ని స్మరిస్తే పరముక్తి లభిస్తుందని భగవాన్ రమణులు ప్రపంచానికి చెప్పారు. "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా, కరుణామృత జలధి అరుణాచలమిది". అరుణాచల శివ అనేటువంటి శబ్దమే మహా శబ్దం. అందుకనే సత్యసాయి భగవానుడి మానస భజరేలో "అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోహం" అంటారు. ఇంకేమీ ముట్టుకోలేదు ఆయన. ముట్టుకున్నది అరుణాచలమే. ఎందుకంటే అధ్యాత్మ జ్ఞాన భూమికలో ఒక శిఖర స్థాయి అరుణాచలం. అరుణాచలం కొండ సాక్షాత్తు శివశక్తి స్వరూపం. అది అచలం. అదే శివశక్తి స్వరూపం సత్యసాయి భగవానుడు, ఇది చలం, ఇది నడుస్తుంది. ఇది నడిచే పరమాత్మ ఇది, అది నడిపించే పరమాత్మ, రెండూ ఒకటే. ఒకటి చైతన్యంగా ఉన్నది, ఒక జడ-- ఒకటి జడంగా ఉన్నది. దీనిని అర్థం చేసుకోగలిగినటువంటి ఒక వైజ్ఞానిక భూమికను అందించినటువంటి వాడు త్రైలింగ స్వామి. కాశీ చేరారు. కాశీ చేరి అనేక ఘట్టాలలో ఆయన అనేక సందర్భాలలో మహిమా ప్రదర్శన చేశారు. అందులో రోజుల్లో వారక్కడికి చేరుకున్న సమయంలో తెలుగునాట నుంచి, ప్రాంతం నుంచి అనేకమంది ఋషి సమానులైన వాళ్ళంతా కాశీ చేరుకున్నారు. ఎందుకని అంటే శరీరం ఎలాగూ వదిలిపెట్టక తప్పదు. అది మన ఇంట్లోనో, మన సావిట్లోనో, మన పెరట్లోనో, మన ముంగిట్లోనో దేహం వదిలిపెట్టేకంటే కాశీ వెళ్ళి అక్కడ గనక తొమ్మిది రోజులు కనీసం ఉండి దేహం వదిలిపెడితే మళ్ళీ పునర్జన్మ ఉండదట అనేటువంటి ఒక హైందవ సాంప్రదాయాన్ని, నమ్మకాన్ని ఆధారం చేసుకొని ఆయా రంగాలలో దిట్టలైనటువంటి వారు వారణాసి చేరుకున్నారు. వాళ్ళంతా అచ్చమైన తెలుగు వాళ్ళు. ఎప్పుడైతే త్రైలింగ స్వామిని, ఇంకా ఆయన పేరు త్రైలింగ స్వామి కాదు, గణపతి స్వామి అని పేరు పెట్టుకున్నారు. అట్లాగే చలామణి అవుతున్నారు ఆయన. కొన్నాళ్ళు మౌన స్వామి అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. తెలుగువారందరూ కూడా వీరి దగ్గరకు వెళ్ళి వీరి యొక్క మహత్యాన్ని చూసి వీరి మహత్తు చాలా పూర్ణ మహత్తు అనేటువంటి భావన కలగ్గానే ఆయనని త్రిలింగ స్వామి అని పిలుచుకున్నారు. అందులో కుటుంబ, కౌటుంబిక, విజ్ఞాన, వైజ్ఞానిక ఎట్లా పదాలు ఏర్పడతాయో, త్రిలింగ స్వామి తెలుగునాట నుంచి వచ్చినవాడు గనుక ఆయన త్రైలింగ స్వామి అయినాడు. త్రైలింగ స్వామి ఇందాక అనుకున్నాం కదా, మూడు వందల పౌండ్ల శరీరం అయింది. వారు గంగలో స్నానం చేయటానికి దిగగానే అలలన్నీ ఏర్పడివి. అలలలో నుంచి ఒక మహా పద్మం బయటకు వచ్చేది. మహా పద్మంలో ఆయన కూర్చునేవారు పద్మాసనం వేసుకొని. గంగానది మొత్తం కూడా ఆలోకనం చేస్తూ, చక్కగా దర్శనమిస్తూ దాని యందు ధ్యాన నిమగ్నులై ఉండేవారు. ఎక్కడైనా ఒక తామర పువ్వులో మూడు వందల పౌండ్ల బరువున్నటువంటి వస్తువు తేలుతుందా, మునుగుతుందా? అది యోగ శరీరం. పత్తి వలే ఉండేది. యోగ భూమికలో ఆయన సంచారం చేసి బయటకు వచ్చేసరికి సుస్నాతులైనటువంటి, నెరలంకారులైనటువంటి, దిగంబర స్వరూపమైనటువంటి త్రైలింగ స్వామి దర్శనమే ఆయనకి ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చింది. పేరు గుళ్ళో, కాశీలో, విశ్వేశ్వరాలయంలో విశ్వనాథుడు ఉంటే ఆయన అచల విశ్వనాథుడు. ఆయన కదలడు. బయట తిరుగుతున్నటువంటి త్రైలింగ స్వామి చల విశ్వనాథుడు అనే పేరు వచ్చింది ఆయనకి. పరమేశ్వరుడు గనక గుళ్ళో నుంచి బయటకు వస్తే, ఆయన నడిస్తే ఇట్లా ఉంటుంది అనే భావన అందరికీ కలిగింది. ఇక మహత్యాల పరంపర ఎన్ని చెప్పుకున్నా కానీ కొన్ని ముచ్చటించాలి. ముచ్చటించడంలో వారు దిగంబరులు, అంటే దేహాత్మ భావన లేదు వారికి.కానీ స్వాత్మానంద స్థితిలో ఉండేవారు నిరంతరము పరబ్రహ్మము యందు మాత్రమే ఆసక్తి కలిగి ఉండేవారు ఎక్కడ దేనిని గురించి ప్రవచనాలు ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు కాదు వారి ఆవరణమే వారి ప్రసన్నతే వారి పారమార్థికమైన ఒక దృక్పథమే వారి దివ్య మహా సౌందర్యమే ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేది దానిలోకి యోగులైనవారు యోగ్యులైనవారు ప్రాప్తి ఉన్నవారు అనుగ్రహం ఉన్నవారు సాధనలో కాస్త ముందుకు వెళుతున్నటువంటి వారందరూ ఆకర్షింపబడటం రోజూ జరిగేటువంటి విషయమే అటువంటి త్రైలింగ స్వామి ఒకరోజు బయటకు వచ్చినప్పుడు ఒక మహారాష్ట్రియన్ లేడీ ఒక స్త్రీమూర్తి రోగపీడితుడైనటువంటి తన భర్తని దగ్గర పెట్టుకొని కూర్చుంది ఎందుకొచ్చిందంటే ఎవరో చెప్పారు కాశీలో ముప్పై రోజులు ఉండు మీ స్త్రీ వారికి ఆరోగ్యం కూడతబడుతుంది మళ్ళీ మీరు దంపతులు హాయిగా వచ్చి దాంపత్యం చేయొచ్చు కాశీ వెళ్ళండి అంటే మహారాష్ట్ర దేశం నుంచి వెళ్లారు ఆమె దిగంబర స్వామి అయిన త్రైలింగ స్వామిని చూసి నిందించింది ఏమనంటే ఇక్కడ స్త్రీలు సంచారం చేస్తారని తెలియదా కనీసం బట్ట కట్టుకోవాలన్నటువంటి జ్ఞానం కూడా మీకు లేదా మిమ్మల్ని చూసి మేము సిగ్గుతో చితికిపోతున్నాం మాకు కనపడకండి అంది త్రైలింగ స్వామి మాటలేమి పట్టించుకోలేదు ఎందుకంటే దేహ భావనతో చూసేవాడికి దేహమే కనిపిస్తుంది ఆత్మ భావనతో చూసే వాడికి ఆత్మే కనిపిస్తుంది వస్తువు ఒకటే అందుకే సత్యసాయి భగవానుడు చెప్పారు "సృష్టిలో లోపం లేదు బంగారు మానవుడి దృష్టిలోనే లోపం" చూట్టం పరమాద్భుతమైన ఆత్మైక స్థితిలో చూడండి స్త్రీ ఏమి పురుషుడు ఏమి బాలుడు ఏమి జ్ఞాని ఏమి అజ్ఞాని ఏమి అన్న అన్ని ఉన్నాయా ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం కూడా బ్రహ్మమే విద్య ఉదాత్తమైనదైతే అవిద్య కూడా అంతే వెలుగు గొప్పది అయితే చీకటి కూడా గొప్పదే రెండూ అభిన్నంగా ఉన్నాయి అద్వయంగా ఉన్నాయి అద్వైతంగా ఉన్నాయి రమణీయంగా ఉన్నాయి మనోజ్ఞ భావనా భూమికలో నిలకడ చెంది ఉన్నాయి వీటిని విచారణ చేయటానికిని నిమిత్తమే ఒక వైదాంతిక భూమిక మనకు ఏర్పడింది ఇది వైజ్ఞానిక భూమికను దాటినటువంటి ఒక పరమ చరమమైనటువంటి అంతస్సిది ఆయన స్త్రీ మాటలు విన్నారు నడిచి వెళుతూ ఉన్నారు భగవంతుడి శక్తి యోగ శక్తి ఏమిటో ఆమెకు తెలియచెప్పాలి ఆమె వచ్చి కేవలం మూడు రోజులయింది ఇంకా ఇరవై ఏడు రోజులు అక్కడ ఉండాలి ఆమె ఉన్నది గనుక త్రైలింగ స్వామి అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళరు ఆమే ఉండాలి విశ్వేశ్వరుడు ఉండాలి విశ్వనాథుడు ఉండాలి త్రైలింగ స్వామి ఉండాలి అందరూ ఉండాలి ఇందులో ఎవరూ ఉండకుండా ఉండకూడదు అందరూ లేకుండా ఉండకూడదు అందరూ ఉండాలి ఆయన నాలుగు అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి తిరిగి దయా పూరితంగా కరుణా స్ఫోరకంగా స్త్రీమూర్తి వైపు చూస్తూ ఇంకా ఇరవై ఆరు రోజులు ఇక్కడ ఎందుకు వెళ్లి హాయిగా దాంపత్యాన్ని అనుభవించు గృహస్థాశ్రమంలోకి వెళ్ళు నీవు పొందవలసిన ఆనందాన్ని నువ్వు పొందు అని ఒక మాట చెప్పగానే విష జ్వరంతో ఉన్నటువంటి వాడు లేచి వాడికి ఏమీ లేనట్టుగా లేచి కూర్చున్నాడు ఆమె నమ్మశక్యం కాలేదు ఇది యోగుల యొక్క ఘటనా ఘటన శక్తి ఇవి చెప్పటానికే మనం ఇవన్నీ కూడా ఇవాళ విచారణ చేయాలి అయితే లోకంలో ఒక ప్రమాణం కావాలి ఏమిటి ప్రమాణం అంటే త్రైలింగ స్వామి ఎంత గొప్పవాడో మనకు తెలియాలి అంటే చాలామంది గొప్ప వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్లి ఉండాలి అది లేకపోతే మనం ఒప్పుకోం కదా చాలామంది మన దృష్టిలో గొప్ప వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళితే ఆయన కూడా గొప్పవాడవుతాడు ఇది చాలా అధమ ప్రాథమిక స్థాయిది వాళ్ళు మహా గొప్ప వాళ్ళు గనుకనే వీళ్ళు కూడా అక్కడికి చేరుతారు వీళ్ళు మన దృష్టిలో గొప్ప వాళ్ళు స్వామి దగ్గరకి ప్రపంచంలో నెంబర్ వన్ అనిపించుకున్న వారంతా అక్కడికి చేరారు వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళందరూ వెళ్ళినందువలన స్వామి దేవుడు కాలే స్వామి దేవుడు గనుక వీళ్ళందరూ అక్కడికి చేరారు ఇది ఎనాలసిస్ అలాగే త్రైలింగ స్వామి దగ్గరకి వచ్చినటువంటి ఆయనని దర్శనం చేయాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి రామకృష్ణ గురుదేవులు రామకృష్ణ పరమహంస తన మేనల్లుడిని వెంబడి పెట్టుకొని వారణాసి వెళ్లారు దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకున్నప్పుడు త్రైలింగ స్వామి రామకృష్ణ గురుదేవురిని సమాదరించారు దగ్గరకు తీసుకున్నారు దగ్గర పెట్టుకున్నారు దగ్గర పెట్టుకొని అనేక విషయాలు ముచ్చటించారు ముచ్చటించినప్పుడు రామకృష్ణ గురుదేవులు వేసిన ఒక ప్రశ్న చూడండి పరి ప్రశ్నలు అంటే అవి భగవంతుడు ఏకమా అనేకమా అని అడిగారు త్రైలింగ స్వామిని మామూలు వాడైతే ఇది కూడా తెలియని వాడివి నువ్వు పరమహంసవి ఎట్లా అయినావ్ అంటాడు ఆయన స్థాయి చూడండి రామకృష్ణ గురుదేవుల ప్రశ్న ఆయన కోసం కాదు మన బోటి వాళ్ళ కోసం అప్పుడు ఏమన్నారంటే సమాధిలో యోగంలో కనుక నీవు చూసినట్లయితే పరమాత్మ ఒక్కడే లౌకిక జ్ఞానంతో చూసినప్పుడు ఆయనే అనేకమై కనిపిస్తాడు చాలునా అన్నారు చాలు తన మేనల్లుడి వైపు చూశారు పరమహంస చూశావా ఇది అచల అద్వైత మహా స్థితి అంటే ఇది యోగ స్థితిలో ఇది పరాకాష్ట అని మీకొక నివేదన చేయాలని అనుకున్నాను నాకు మీరు అంగీకరించండి అనుగ్రహించండి అని అడిగారు అలాగే చేయండి అన్నారు.రామకృష్ణ గురుదేవులు పాయసానికి కావలసిన పదార్థాలన్నీ వారణాసిలో కొన్నారు. తాను స్వయంగా పాయసాన్ని తయారు చేశారు. తయారుచేసి పాయసాన్ని త్రైలింగ స్వామికి నివేదన చేశారు. నివేదన చేసినప్పుడు అందరూ విస్తుపోయినారు. మూడు వందల పౌండ్లు ఉన్నటువంటి heavy body ఏదైతే ఉందో దానికి రామకృష్ణ పరమహంస ఇచ్చినటువంటి నివేదన సరిపోతుందా అని. మన దృష్టిలో అయితే చాలదు. ఆయన అన్నారు "నేను తీసుకుంటాను వచ్చిన వారందరికీ పంచి పెడుతూ ఉండండి" అన్నారు. రోజున పాయసం నాలుగు వందల మందికి సరిపోయింది. అది మనకి వేళ ఆశ్చర్యం ఏం లేదు. ఎన్ని నారాయణ సేవలు మనం చేశామో. వంద మందికి సరిపడా తయారు చేస్తే ఐదు వందల మంది స్వామి విభూతి చల్లి స్వామికి నమస్కరించుకొని స్వామికి బ్రహ్మార్పణం చెబితే వేలమంది తినగా మిగిలిపోయిన సంఘటనలు మన జీవితంలోనే మనం ఇప్పుడే చూశాం. ఇది ఆశ్చర్యం కాదు కానీ ఇది ఒక యోగసిద్ధి. యోగసిద్ధి ఫలించాలి అంటే రామకృష్ణ గురుదేవుల వంటి భక్తుడు ఉండాలి, పరమహంస ఉండాలి, భక్తి అవధూత ఉండాలి, దానిని అంగీకరించేటువంటి పరమాత్మ ఉండాలి, దాని వెనుక భావశుద్ధి ఉండాలి. బహుశా రామకృష్ణ పరమహంస ఒక evolved soul అది. త్రేతాయుగనాటి రాముడు ద్వాపర నాటి కృష్ణుడు కలిపితే రామకృష్ణుడు అని వివేకానంద స్వామికి చెప్పిన మహాపూర్ణ అవతారమూర్తి రామకృష్ణ గురుదేవులు. వారన్నారు "ఇవేళ సాక్షాత్తు సచల విశ్వనాథుడికి సాకార స్వరూపమైనటువంటి పరబ్రహ్మమూర్తికి నేను నివేదన చేసుకున్నాను. నా జన్మ ధన్యమైంది" అని అంటే త్రైలింగ స్వామి అన్న మాట "మీరు ప్రపంచానికి అధ్యాత్మని అందిస్తున్నారు. మీరు పరమేశ్వరుడి యొక్క విభూతి ఈవేళ నా దగ్గరకు వచ్చినట్టుగా నేను భావన చేస్తున్నాను" అన్నారు ఆయన. అది. వాళ్ళు మాట్లాడుకుంటే స్థాయిలో ఉంటుంది. ఇక రెండవది పరమహంస యోగానంద వచ్చారు వారణాసికి. పరమహంస యోగానంద కెనడా నుంచి వచ్చి భారతదేశంలో ఇద్దరు గురువులు మాత్రమే దర్శనం చేశాడు. ఒక గురువు త్రైలింగ స్వామి, రెండవ గురువు అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి. పరమహంస యోగానంద క్రియా యోగ మనం వింటూ ఉంటాం. ఇవాళ చాలా it is for sale no problem. వెళ్లి CDలతో సహా దొరుకుతాయవి. క్రియా యోగ అనబడేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి బాబాజీ శ్యామాచరణ లాహిరి, శ్యామాచరణ లాహిరి తర్వాత పరమహంస యోగానంద. ప్రపంచానికి ప్రధానంగా పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసినటువంటి పరమాద్భుత యోగి పుంగవుడు మన యోగుడా అంటామే యోగానంద పరమహంస యోగానంద. గురువుని అనుక్షణము పరీక్ష పెట్టినటువంటి వాడు. ప్రతిక్షణము గురువు ముందు తల ఉంచిన వాడు. అది విచిత్రం. గురువు యొక్క శక్తి ఎప్పటికప్పుడు తనకు అనుభవం అవుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు గురువుని పరీక్షిస్తూనే ఉత్తీర్ణుడైనటువంటి ఒక మహోజ్వలమైనటువంటి మూర్తిమంతమైన స్వరూపం అది. ఆయన త్రైలింగ స్వామి దర్శనం చేసుకున్నప్పుడు త్రైలింగ స్వామిని ప్రార్థన చేశారు. "వారణాసి వంటి పవిత్ర ఘట్టంలో మీవంటి పరమ కారుణ్యమూర్తిని, మహాద్భుత మూర్తిని దర్శనం చేసుకోవటమే నా జన్మకి సాఫల్యం. మేము అనేక యోగ ప్రక్రియలలో జీవితాన్ని కొనసాగించవచ్చు, పొడిగించవచ్చు అని ప్రపంచానికి నేర్పుతాం. ఇంతకీ రెండు వందల సంవత్సరాల వరకు జీవిస్తూ ఉన్న మీరు యోగాన్ని ఆశ్రయించారు చెప్పండి" అని అడిగాడు. సహజం కదా! మనిషి రెండు వందల ఏళ్ళు ఎలా బతుకుతాడు మనకు, మనం నమ్మలేము. ఆయన అన్నారు "ఒకే ఒక్క యోగం ఉన్నది. యోగం పరబ్రహ్మముతో మన మనస్సుని అనుసంధానం చేయటమే ఉత్తమోత్తమ యోగం. పరమేశ్వరుడు మన యందు శ్వాసిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. పరమేశ్వరుడు మన ద్వారా ప్రపంచంలో అనేక కార్యకలాపాలు చేస్తుంటాడు. ఒక్క నమ్మకం పెట్టుకుంటే చాలు. నమ్మకమే యోగం" అన్నాడు పరమహంస యోగానందతో. ఆయన అరుణాచలానికి వచ్చినప్పుడు కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని పరమహంస యోగానందతో మాట్లాడాడు. "పక్కనే అఖండమైనటువంటి తేజో రాశి అయినటువంటి రమణులు వెలిగిపోతుండగా ఇంత దూరము వచ్చి కళ్ళుమూసుకు కూర్చున్నారేమి? కళ్ళు తెరవండి వారిని చూడండి" అని అడిగాడు. పరమహంస యోగానంద సమాధానం ఏమిటంటే "దేన్నీ చూడను, వస్తువును చూడనా? రమణ విగ్రహాన్ని చూడనా? రమణుల్ని చూడనా? నా మనస్సంతా రమణుల్ని చూట్టంలో మునిగిపోయింది. రమణ విగ్రహంతో నాకేం పని" అన్నాడు. అది స్థాయి. అటువంటి పరమహంస యోగానంద అక్కడికి వచ్చారు. శ్యామాచరణ లాహిరి వీరి గురువుగారు వచ్చారు. త్రైలింగ స్వామి వారిని చూస్తూ ఉండగానే దగ్గరకు తీసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. ఎందుకని చేశారు? ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో యోగాన్ని ఎలా పరిచయం చేశారంటే యోగశాస్త్రంలో కేవల కుంభక యోగం అని ఒకటి ఉంది. కేవల కుంభక యోగంలో శరీర అవస్థలు దాటి మనం అనుకుంటాం, పాపం ఆయనకు ఒంట్లో బాలేదట, నల్లబడిపోయారట, సన్నబడిపోయారట, అన్నం తినటం లేదట, అయ్యో ఎట్లా అని. ఎట్లా మనకి వాళ్ళకి అక్కర్లేదు. అసలు ఇంతకాలం ఇట్లా ఉండటమే వాళ్ళకి మహా యోగ విశేషం.అటువంటి సందర్భంలో శ్యామాచరణ లాహిరి కేవల కుంభక యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహాద్భుత యోగి ఆయన. లాహిరి మహాశయులు అంటారు ఆయనే ఈయన. అటువంటి యోగి యోగాత్మతో కూడినటువంటి ఒక దేహం తనను సమీపించగానే action reaction అంటామే త్రైలింగ స్వామి వారిని అక్కున చేర్చుకున్నారు. వారు కౌగిలించుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి శ్యామాచరణ లాహిరి. తర్వాత దయానంద సరస్వతి విగ్రహారాధన తప్పని, విగ్రహాలను పూజించకూడదని, విగ్రహారాధన చాలా ప్రాథమిక స్థాయికి నిజానికి అధమ స్థాయికి చెందినటువంటి పూజా విధానం అని విగ్రహారాధనను నిరసిస్తూ సమస్త భారతావని వైపు ఆయన నడిచి వెళుతున్న సమయంలో కాశీలో ఆయన ప్రవచనం చేయాలి ఆరోజు సాయంకాలం. మన దృష్టిలో కాశీ విశ్వేశ్వరాలయంలో ఉన్న లింగం పరమేశ్వరుడి సాక్షాత్తు. దయానంద సరస్వతి భావనలో అది కాదు, దాన్ని పూజ చేయకూడదు, అక్కర్లేదు, ప్రయోజనం ఏం లేదు అది ఆయన భావన. వచ్చారు. గంగా స్నానం చేసి వస్తున్న త్రైలింగ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయన అన్నారు "ఈ క్షణం నుంచి విగ్రహారాధన వద్దు అని ఇకపై నేను చెప్పను." అక్కడ ప్రమాణం చేశారాయన. తర్వాత, తర్వాత కాలంలో వేదాల మీద, ఉపనిషత్తుల మీద ఒక పరమాద్భుత వ్యాఖ్యానం చేశాడు. అగ్నిని ప్రధానంగా చేసుకుని జ్ఞానాగ్నిని రగిలించుకోమని చెప్పిన వాడు దయానంద సరస్వతి. కానీ త్రైలింగ స్వామి యొక్క దర్శనం అయ్యేదాకా ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకి. విగ్రహం లేకపోతే నిగ్రహం రాదు. భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే పరమేశ్వరుడి బొమ్మ కావాలి. అందుకనే సాంప్రదాయకమైన మాట ఏమిటంటే "ప్రతిమా ఈశ్వరః" కనిపిస్తున్న బొమ్మలో నుంచి బొమ్మని ఆధారం చేసుకుని బ్రహ్మాన్ని పట్టుకో. అలాగే కనబడుతున్న స్థూల దేహంలో స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి నాలుగు కలిపి తను సప్తకం అంటాం. ఏడు శరీరాలు దాటి వీటన్నింటినీ ఇంద్రియాలని, మనస్సుని నడిపిస్తున్నటువంటి ఒక కదలని శక్తి ఏదైతే ఉన్నదో కదలని శక్తి ఆత్మ అని అదే నీవని గ్రహించటానికి ముందు నీకు బొమ్మ ఆధారం అవుతుంది. అన్నప్పుడు దయానంద సరస్వతికి కలిగిన ఒక అద్భుతమైన ఆలోచన ఇక వ్యర్థ ప్రసంగం ఇక చేయకూడదు అని. ఆయన ఉత్తముడు, ఉదాత్తుడు, ఉన్నతుడు. ఆయన కూడా ఆత్మ సాక్షాత్కారానికై సాధన చేస్తున్నటువంటి ఒక రీతి యోగి గనుక తన ప్రయత్నాన్ని తాను విరమించుకున్నారు. విగ్రహారాధన వద్దు అనటం కంటే దాన్ని దాటి వెళ్ళమని చెప్పటం ఉత్తమం. "పూజాతే విషయోపభోగ రచన" శంకర భగవత్పాదులు. స్వామి కూడా అదే మాటన్నారు. రాయిలో సాయిని చూడండి మీకు లాభం. సాయిలో రాయిని చూస్తే మీకేం లాభం? ఏం లాభం లేదు. రాయిలో సాయిని చూసే ఒక ప్రయత్నం చేయటం మొదలు పెట్టండి. దానికి దీనికి తేడా ఏం లేదు. కాబట్టి దయానంద సరస్వతి, పరమహంస యోగానంద, రామకృష్ణ గురుదేవులు, శ్యామాచరణ లాహిరి వీరందరితో పాటుగా ఒక హైందవ వేదాంత డిండిమని ప్రపంచానికి ఒక పరమాద్భుతమైనటువంటి, గర్జన చేసినటువంటి వివేకానంద స్వామి త్రైలింగ స్వామి దర్శనం చేసుకొని ఒక్క మాటన్నారు. త్రైలింగ స్వామి యొక్క శక్తి నా యందు ఆవహించి నా యావజ్జీవితము నేనిక్కడ ఉన్నంత కాలము కూడా నాలో ప్రతి కణము హైందవ జాతి కోసం నిలకడ చెందు గాక అని he has drawn that energy from త్రైలింగ స్వామి. ఇది కేవల కుంభక యోగంలో ఒక పరమోత్కృష్టమైన స్థాయి.
SSSMC · audio

Yoga Pravaham - 02

Home

Yoga Pravaham - 02

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 34:57

More in this series

Yoga Pravaham

15 episodes · 7 hr 37 min

  1. 27 min 1

    Yoga Pravaham - 01

  2. 34 min 2

    Yoga Pravaham - 02

    Now playing
  3. 24 min 3

    Yoga Pravaham - 03

  4. 30 min 4

    Yoga Pravaham - 04

  5. 29 min 5

    Yoga Pravaham - 05

  6. 41 min 6

    Yoga Pravaham - 06

  7. 26 min 7

    Yoga Pravaham - 07

  8. 42 min 8

    Yoga Pravaham - 08

  9. 32 min 9

    Yoga Pravaham - 09

  10. 29 min 10

    Yoga Pravaham - 10

  11. 26 min 11

    Yoga Pravaham - 11

  12. 40 min 12

    Yoga Pravaham - 12

  13. 19 min 13

    Yoga Pravaham - 13

  14. 28 min 14

    Yoga Pravaham - 14

  15. 21 min 15

    Yoga Pravaham - 15