Skip to content
Transcript తెలుగు
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ యోగ ప్రవాహంలో ఇవాళ ఒక మలుపు తిరుగుతున్నాం. ప్రవాహం తన ధర్మాన్ని మార్చుకోదు, తన గుణాన్ని మార్చుకోదు, తన లక్ష్యాన్ని తన గమ్యాన్ని మార్చుకోదు. కానీ దిశని దశని మార్చుకుంటూ పల్లం వైపు సాగుతూ ఒక నది సాగరంతో సంగమించినట్లుగా జీవుడు తన ప్రస్థానాన్ని కొనసాగించి పరమాత్మ భావనలో నిలకడ చెందటమే యోగంగా భావన చేయాలి. త్రైలింగ స్వామి ఒక మహా యోగ పురుషుడుగా ప్రపంచానికి ఎటువంటి ఉపదేశం చేశారో, ఎటువంటి మహాత్ములు ఆయన్ని దర్శనం చేసుకున్నారో, విన్నప్పుడు అనుకున్నప్పుడు ఒళ్ళు పులకాంకుర ప్రకారం అవుతుంది. అగస్త్యుల వారికి కాశీ ప్రయాణంలో జరిగిన అనుభవం మనందరికీ కలుగుతుంది. ఒళ్ళు పులకరించాలి అంటే భగవన్నామస్మరణ చేయాలి, భగవత్ చింతన చేయాలి. దానిలో కలిగే ఒక తాదాత్మ్యమే మహా యోగంగా భావన చేయాలి. దిశగా భారతీయ తత్వ చింతనలో పరమాద్భుతమైనటువంటి యోగమూర్తులంతా కూడా అవతారంగా వచ్చారు ఇక్కడికి. అవతారము అంటే సత్యసాయి భగవానుడి మాటల్లో దిగిరావటం అని అర్థం అంతే. కనబడుతున్నటువంటి చరాచర ప్రపంచాన్ని నడిపించే కదిలించే ఒక మహా శక్తి ఉన్నదని, శక్తి ధర్మగ్లాని జరిగినప్పుడు ధర్మసంస్థాపన కోసం మళ్ళీ పునః మానవుడు ధర్మబద్ధమైన జీవితాన్ని కార్యకలాపాన్ని కొనసాగించటానికి వీలుగా ఒక మానవ దేహాన్ని తీసుకుని వస్తాడు. ఒకప్పుడు గురువుగా, ఒకప్పుడు జ్ఞానిగా, ఒకప్పుడు తపస్విగా, ఒకప్పుడు యోగిగా, ఒక్కసారి మాత్రమే అవతారమూర్తిగా పూర్ణావతార మూర్తిగా. అవతార మూర్తులలో కూడా కళావతారాలని, అంశావతారాలని, అర్చావతారాలని, ప్రభావ అవతారాలని, ప్రసవావతారాలని, అనుప్రవేశ అవతారాలని, ఆవేశ అవతారాలని అనేకమున్నప్పటికీ యుగానికి ఒక్క పూర్ణ పురుషుడు వస్తాడు అది పూర్ణావతారం. పూర్ణావతారం వచ్చి మిగతా అంశ అవతారాల అన్నింటి ద్వారా అనేకమంది యోగుల ద్వారా సమస్త జనావళికి కూడా మళ్ళీ మార్గోపదేశనం చేసి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలో తాము జీవిస్తూ నేర్పి చాలా గహనమైన, గుహ్యమైనటువంటి, మార్మికమైనటువంటి మహా పరిసత్యాలు అన్నింటినీ కూడా ఆయా సాధకులందరినీ ఏర్చుకొని, కూర్చుకొని ఉపదేశించి మళ్ళీ వారి ద్వారా సర్వవ్యాప్తం చేస్తారు. ఇది భారతీయ చరిత్రలో ప్రధానంగా అధ్యాత్మ చరిత్రలో కొత్త విషయం ఏం కాదు. ఇట్లా జరుగుతూనే ఉన్నది. ఎప్పట్నుంచి? సృష్టి ఆది నుంచి నడుస్తూనే ఉన్నది. విషయాలన్నీ నీకెప్పుడు తెలుసు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడే ప్రశ్నించాడు. ఇన్ని విషయాలు చెప్తున్నావు నువ్వు ఎప్పుడు చదివావు, ఎప్పుడు నేర్చుకున్నావు? చాలా కొత్తగా అనిపిస్తున్నదే నాకు. ఏదో ఆడుకున్నాం, పాడుకున్నాం. నీ సోదరుని వివాహం చేసుకొని బాంధవ్యాన్ని పొందాను. మా కష్టాల అన్నింట్లోనూ నువ్వు ఆసరాగా ఉన్నావు, ఇవన్నీ తెలుసు గానీ యోగ శాస్త్రాన్ని నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అని అడిగాడు. చూడండి ఎంత అజ్ఞాన భూమికి చెందిన ప్రశ్న. నీకెప్పుడు తెలుసు అని కూడా కాదు ఎప్పుడు నేర్చుకున్నావు అన్నాడు. పరమ ప్రసన్న గాంభీర్యమైనటువంటి కంఠస్వరంతో యోగేశ్వర కృష్ణుడు ఒక సమాధానం ఇచ్చాడు. ముందుగా ఆదిత్యుడికి చెప్పాను, సూర్యుడికి చెప్పాను, వివస్వుడికి చెప్పాను, పైన మనువుకి చెప్పాను, పైన ఇక్ష్వాకుకి చెప్పాను త్రేతాయుగంలో. ఇక్ష్వాకు వంశ స్థాపన చేసినటువంటి ఇక్ష్వాకుకి యోగ శాస్త్రాన్ని చెప్పాను. తర్వాత ఇదిగో అర్జునా! నీకు చెప్తున్నాను అన్నాడు. నాకు నమ్మశక్యం కావటం లేదు అన్నాడు. అట్లా మనకు కూడా అనిపిస్తుంది. ఏమీ చదవకుండా ఎలా చెప్పటము అని. చదువు అయిపోయిందన్నమాట, చెప్పటం మిగిలిందన్నమాట. ఇంకా ఇప్పుడు చదువుతూనే ఉన్నాము అంటే చెప్పటానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలన్నమాట. ఇది ప్రధానం. హైందవ సిద్ధాంతంలో ప్రధానంగా పునర్జన్మ ఉన్నది అని చెప్పే ఒకే ఒక్క మతం, ఒకే ధర్మం అది హైందవ ధర్మం. మిగతా వాళ్ళకి అది మీమాంస ఉందా లేదా, ఉందో లేదో, వస్తుందో రాదో మనకు మాత్రం ఇదివరకు ఉన్నాయి, ఇవ్వేళ ఉన్నది, రేపు ఉంటుంది. అందుకనే రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, భగవాన్ సత్యసాయి భగవానులు వచ్చారు. అవతార పరంపర ప్రవాహం ఎట్లా కొనసాగుతూ ఉంటుందో యోగులు కూడా వస్తూనే ఉంటారు. యోగులు కలియుగంలో అర్జునుడి తర్వాత యోగ శాస్త్రాన్నిఈ యోగం వెనక దాగి ఉన్నటువంటి మహా మార్మికమైనటువంటి విషయాలని అంటే intricate గా ఉండే వాటిని ఎవరు పొందారు అంటే బాబాజీ పొందారు. బాబాజీ యుక్తేశ్వరులకు చెప్పారు యుక్తేశ్వరులు పరమహంస యోగానంద కి చెప్పారు. యుక్తేశ్వరులకి బాబాజీ కి మధ్య ఒక మహా మహిమాన్విత మూర్తి ఒకాయన ఉన్నారు ఆయనే శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయుడు. శ్యామాచరణ లాహిరి మహాశయుడే ఈనాటి మన ప్రస్తావన. శ్యామాచరణులు ఇల్లు వదిలిపెట్టి నగరం వదిలిపెట్టి అడవుల బాట పట్టినటువంటి యోగి కాదు ఆయన. గృహస్థాశ్రమంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ తాను పొందినటువంటి అనేకానేక యోగానుభవాలు యోగాత్మికమైనటువంటి విషయాలని చాలాకాలం ఆయన గుప్తంగా ఉంచుకున్నారు. గుప్తంగా ఉంచుకోకూడదు కదా "ప్రౌఢః ప్రౌఢనియానుభూతిః కలితదైతేంద్రజాలః గురుః స్వచ్ఛిష్యబోధయా తత్సత్యమాశ్రితావన్" అని కదా ప్రమాణం ఇది శంకర భగవత్పాదులు చెప్పిన మాట ఎవరు అనుభూతిని పొందారో అనుభూతిని దాచుకోవటానికి వీల్లేదు. ఇది నాది అని అనుకోవటానికి వీల్లేదు ప్రపంచానికి అందిస్తూనే ఉండాలి. తాము ఎరిగిన రీతిలో అనుభవించిన రీతిలో అనుభూతి చెందిన రీతిలో మళ్ళీ సామాన్య జనుడికి సైతం అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాలి. కనుకనే శ్యామాచరణ లాహిరి మహరాజ్ అనబడేటువంటి ఒక మహాశయుడు గుప్తంగా ఉంచుకోవాలని చాలాకాలం అనుకున్నారు. వేసంకాలం వచ్చి మల్లెపూలు వికసించటం మొదలు పెట్టాక పరిమళాన్ని ఎవరు దాచగలరు? సంపెంగ పొదలో ఒక మొగ్గ పూర్ణంగా వికాసమానం చెందినప్పుడు సంపెంగ తన పరిమళాన్ని దాచిపెట్టుకోగలదా బహిర్గతం చేయాలి తప్పదు. సంపెంగకో మల్లెపువ్వుకో మరొక్క దానికో పరిమళం భగవంతుడు ఇచ్చాడు అంటే పువ్వు కోసం కాదు పువ్వుకి పరిమళమే తెలీదు. తన యందున్నటువంటి పరిమళాన్ని ప్రపంచానికి అందించడమే మహా యోగం. మహా యోగ స్థితిని శ్యామాచరణ లాహిరి మహరాజ్ ఇప్పుడే కాదు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అని యోగేశ్వర కృష్ణుడు కూడా సమయం వచ్చేదాకా భగవద్గీత చెప్పలే సరైన వ్యక్తి దొరికేదాకా ఆయన భగవద్గీత చెప్పలే. మానవుడికి రెండు కారణాలు ఉండాలి ఒక జ్ఞానాన్ని ఎరగాలి అంటే తీవ్ర విషాదం అన్నా ఉండాలి తీవ్ర వైరాగ్యం అన్నా ఉండాలి. తీవ్ర విషాదంలో పరమేశ్వరుడి యొక్క ఆలోచనలు తీవ్రంగా ఉంటాయి అంతే స్థాయిలో. వినోదంలో పరమేశ్వరుడికి తావు లేదు మన మనసుల్లో వినోదాన్ని మనము ఏకంగా అనుభవిస్తాం. కానీ విషాదంలో మనకి partner ఎవరంటే దేవుణ్ణి రమ్మంటాం. నువ్వు నాతో ఉండు విషాదాన్ని నేను భరించలేకపోతున్నా నువ్వు నాకు తోడుగా ఉండు అంటాం. పరమేశ్వరుడు మన సుఖంలో ఉన్నాడో ఉంటాడో లేదో కానీ మనకు దుఃఖం కలిగినప్పుడు మనసు అతలాకుతలమైనప్పుడు వైఫల్యాల పరంపర కొనసాగుతున్నప్పుడు నేనున్నాను అనేటువంటి ఒకే ఒక వ్యక్తి పరమాత్మ. అందుకే సత్యసాయి భగవానుడు "అంతరంగము కన్నా జాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుడే" ఈశ్వరుని మించిన స్నేహితుడు లేడు మిగతావన్నీ పరిచయాలు. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి స్వార్ధాన్ని బట్టి అనేకమైనటువంటి పరిచయాలు ప్రపంచంలో ఏర్పడుతూనే ఉంటాయి కానీ ఇవి ఏవీ అక్కరలేనటువంటి ఒకే ఒక్క బాంధవ్యం పరమేశ్వరుడిది. నీవు కావాలనుకున్నా వద్దనుకున్నా ఆయన నిన్ను వదిలిపెట్టడు. అందుకే షిరిడి మహాస్వామి సత్యసాయి భగవానుడు మీరు మమ్మల్ని మరిచిపోయినా మేము మిమ్మల్ని వదిలిపెట్టమన్న కారణం అదే. వాళ్ళు వదిలిపెట్టరు ఎందుకనంటే ఒక సాత్విక గుణ సంపన్నమైనటువంటి ఒక సాధకుడు ప్రపంచంలో ఒక్కడు దొరికినా వాళ్ళ కార్యకలాపం సాగిపోతుంది. వాడు ఒక్కడు దొరకకపోతే దొరికించుకుంటారు తమ శక్తిని వాడి యందు ప్రవేశ పెడతారు. ఇది భారతీయ యోగశాస్త్రంలో యోగానుభూతిలో ప్రపంచం పంచుకున్నటువంటి అనేక సందర్భాలు. సత్యసాయి భగవానుడు ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని చెప్పారా? ప్రత్యేకంగా ఎందుకని యోగశాస్త్రం మీద వ్యాఖ్యానం చేయలేదు? అని ఆలోచించినట్లయితే స్వామి ధ్యాన, జ్ఞాన, యోగ అనే దాన్ని త్రిపుటి చేశారు. శ్యామాచరణ లాహిరి మహరాజ్ వలనే స్వామి కూడా తమ దివ్యత్వాన్ని ప్రపంచానికి ప్రచారం చేస్తామని వచ్చిన వారందరికీ సమయం ఆసన్నమైనప్పుడు అందరికీ తెలుస్తుంది మౌనం వహించండి అన్నారు ఒక మాట. దాసగణు వెళ్లి షిరిడి మహాస్వామిని అడిగాడు "నువ్వు నాకు permission ఇవ్వు ప్రతిరోజూ గజ్జ కట్టి ఆడి నీకు ప్రచారం చేస్తాను" అని అడిగాడు.శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం సార్వకాలికం మహోదాత్తమైనటువంటి స్థాయి అది తప్పకుండా చేయి కానీ రెండు మూడు సందర్భాలు ఉన్నాయి ఒకటి కాళ్ళకి గజ్జెలు కడుతున్నాను అన్నావే గజ్జెలు విప్పదీసేసేయ్ అవి నీవు అంటించుకున్నవి రెండవది నీకు ప్రపంచం అనే ఒక శాలువాలు కప్పిందే అవి మూటగట్టేసేయ్ నీ అంతటి వాడు లేడు అని ప్రపంచం అంటున్నదే భావన వెనక్కి నెట్టేసేయ్ కేవల భక్తుడుగా నీవు గనక నా గురించి కాసేపు ఎక్కడైనా మాట్లాడితే ప్రచారం అక్కర్లేని నాకు ప్రచారం కావలసిన నీకు ఇద్దరికీ సమాధానం దొరుకుతుంది భగవంతుని గురించి ప్రచారం చేస్తున్నాను అనుకునేవాడు ఒక భ్రమలో ఒక అజ్ఞానంలో ఉంటాడు భగవంతుని గురించి ప్రచారం చేయకూడదు ప్రసారం చేయాలి canvas చేయకూడదు transmit చేయాలి ఇది చాలా ప్రధానం మనం కూడా ఎవరినైనా పరిచయం చేసేటప్పుడు వీరు సాక్షాత్తు స్వామి దూత అంటుంటాం దూతకి స్వామి ఊత అది మర్చిపోతున్నాం స్వామే లేకపోతే ఎవరి గురించి మాట్లాడుతాం కాబట్టి సర్వ కార్యకలాపాలకి మూలమైనటువంటి ఒక పరమాత్మ ఉన్నాడని అది చిచ్ఛక్తి స్వరూపంగా ఉంటుందని ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటుందని ఎవరి యందు ఇష్టము గాని ద్వేష భావము గాని లేకుండా ఉంటుందని సర్వ జీవుల యందు ఒక సమతాభావన ఉంటుందని పైకి కనిపిస్తున్నట్లుగా మమతగా అనిపిస్తున్నా మమతా రాహిత్యం ఉంటుందని అహంకార మమకారాలు శిథిలమై ఉంటాయని పూర్ణ ప్రజ్ఞ విస్ఫారితమై ఉంటుందని ఎరుక కలిగినట్లయితే అది ఆత్మజ్ఞానానికి తొలిమెట్టు భగవద్గీత అంతా వింటున్నాడు అర్జునుడు వింటూ వింటూ అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు అర్జునుడు ఏం చెప్పాలి యుద్ధం చేయ్ అనాలి వెళ్ళింది అందుకే కదా యోగీర్భవ అర్జునా నువ్వు ఇప్పుడు యోగివి కా అన్నాడు యోగి యుద్ధం చేయాలా చేయకూడదా యుద్ధం చేయమనేగా భగవద్గీత అంతా చెప్పాడు భగవద్గీత అంతా ఆకళింపు చేసుకున్నాను అనుకుంటున్న అర్జునుడు మళ్ళీ అడిగాడు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని వీరుడివి కా శూరుడివి గా ధీరుడివి గా గంభీరుడివి గా అనలేదు శత్రు సైన్యాన్ని తునమమని అడగలేదు యోగీర్భవ అర్జునా అర్థం కాలే అంటే అన్నాడు నేను చేస్తున్నాను అన్న భావన ముందు వదిలిపెట్టు నేను ఇంత చేయగలిగాను అన్న భావన వదిలిపెట్టు నేను యుద్ధం చేయబోతున్నాను అన్న భావన వదిలిపెట్టు నీవు కేవలము నిమిత్త మాత్రుడవై నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ కేవలము నాతో నువ్వు కూడి ఉండు అది యోగం చూశారా యోగి అంటే వేషం కాదు యోగం అంటే aerobics కాదు gymnastics కావు ఇవాళ యోగ శబ్దం ఎంత పల్సబారి పోయిందంటే మోకాళ్ళ నొప్పులకి yoga clinic ఇంకేదో వస్తే yoga clinic yoga చికిత్సలు శరీరాన్ని ఎంతకాలం నిలబెడతాం రాలిపోయే దాన్ని ఎన్ని రకాలుగా సాధన చేసి దాన్ని నిలబెట్టిన రాలిపోయే రోజున ఇవి ఏవీ ఆపవు గనుక యోగము దేహ సంబంధి కాదు యోగము హృదయ సంబంధి మనోతీతమైనటువంటి ఒక ఉదాత్త స్థాయికి చెందినటువంటి పరమాద్భుత ప్రజ్ఞా భూమిక యోగశాస్త్రమే అందుకనే భీష్ముల వారు అంపశయ్య మీద పడుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దూరంగా కనిపిస్తున్నప్పుడు ఆయన అంటాడు ప్రతిరోజూ ఇక్కడ యుద్ధారంభ వేళ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం నాకు అవుతున్నది ఎటువంటి కృష్ణుడు నాకు కనిపిస్తున్నాడో తెలుసునా మా విజయం చేరడు వన్నె కాడు మా అర్జునుడి వైపు వెళుతున్న వన్నె కాడు తేజో రూపమైన వాడు యోగ శాస్త్రాన్ని బోధించినటువంటి పరమ యోగాచార్యుడు నాకు దర్శనం ఇస్తున్నాడు అంటాడు భీష్ముడు అంటే యోగ సిద్ధి ఒక పరమాద్భుత రససిద్ధి యోగం అంటే స్థూలంగా పరమేశ్వరుడితో కూడి ఉండటమే పరమేశ్వరుడు ఎక్కడున్నాడు మనమందరం చేతులు పైకెత్తి చూపిస్తాం పైనా ఉన్నాడు వెనకా ఉన్నాడు ముందు ఉన్నాడు పక్కన ఉన్నాడు అన్నింటికంటే మన లోపల ఉన్నాడు ముప్పై మూడు వేల సంకీర్తనలతో శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతించి గీతించి గానం చేసినటువంటి అన్నమాచార్యుల వారు చివరగా ఒక మాట అన్నాడు అలసిన వేళ అన్న మాట ఇది చిత్తజ గురుడా నీకు శ్రీ మంగళం ఎంత వెతికాను అయ్యా బయట నేను ఆంజనేయస్వామి అన్నాను ఇంకోడు అన్నాను ఇంకోడు అన్నాను కేశవుడు అన్నాను మాధవుడు అన్నాను భవుడు అన్నాను అసలు ముప్పది ముక్కోటి దేవతలు నీ యందు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నాను ఎన్ని కీర్తనలు రాశాను చివరకు తెలుసుకున్నది నీవు నా యందే ఉన్నావు you are within లోపలికి ప్రయాణం చేయాలి సాధకుడు అయినవాడు అందుకనే శంకర భగవత్పాదులు చెప్పారు దాన ధర్మాలు గాని వ్రతాలు గాని దీక్షలు గాని ఉపవాసాలు గాని ఉపన్యాసము గాని సన్యాసము గాని ఇవన్నీ కూడా దేహ పరమైన బహిరంగ చర్యలే తప్ప అజ్ఞాన భూమికకు లోబడి జరిగేటువంటివే కనుక నిజమైనటువంటి జ్ఞాని మానసిక యజ్ఞం చేస్తూ ఉంటాడు.మానసికమైనటువంటి ధ్యానంలో తనలో తాను నిలకడ చెందేటువంటి ఒక పరమాద్భుత స్థాయిని తాను సంతరించుకుంటాడు. ఎట్లా? చదవటం ద్వారాన? వినటం ద్వారాన? అనటం ద్వారాన? కేవలం పరమేశ్వరానుగ్రహం వలన మాత్రమే. పరమేశ్వరానుగ్రహం మనకెట్లా లభిస్తుంది? పరమేశ్వరుడి యందు విశ్వాసం ఉంటే అది లభిస్తుంది. మన సంకల్పాలన్నీ కూడా మన విశ్వాసానికి లోబడ్డవే. Faith and practice రెండు జమిలిగా సాగుతుంటాయి. practice లేని faith, faith లేని practice ఒట్టి శుద్ధ దండగ. పరమేశ్వరుడు ఉన్నాడు, ఒక కర్త ఉన్నాడు, జగన్నాయకుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన జగత్తును నడిపిస్తుంది. జగత్తుని నడిపించటానికి ఒక జీవుడు కావాలి. కాబట్టి జీవుడు, జగత్తు, జగన్నాయకుడు. ముగ్గురూ కలిస్తే దాని పేరు త్రిపుటి. జీవుడు లేక జగన్నాయకుడు లేడు. జగత్తు లేక జీవుడు లేడు. అందుకనే ప్రశాంతి నిలయం నుంచి ఒక పరమాద్భుతమైన లాలిత్యంతో కూడినటువంటి మార్ధవ కంఠం మనకి చెప్పింది. భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తుడు లేడు. ఇది అవినాభావ సంబంధం. యుగయుగాంతరాలుగా ఏర్పరచుకున్నటువంటి బాంధవ్యమే నిత్యమూ, సత్యమూ, శాశ్వతమూ. తనువుతో ఏర్పడిన బాంధవ్యాలన్నీ తనువుతో తెల్లవారి పోయేవి. కూడి ఉన్నవన్నీ ఊడిపోయేవే, వీడిపోయేవే అని అచ్చమైన తెలుగులో ఒక పరమాద్భుతమైనటువంటి వైదాంతిక భూమికని, వైరాగ్య భూమికలో వైభవోపేతంగా ప్రపంచానికి ఆవిష్కరించినటువంటి మహా మహిమాన్విత మూర్తి పూర్ణావతారి భగవాన్ శ్రీ సత్య Sai బాబా. కనుకనే స్వామి ఏది చెప్పినా శాస్త్రగతం. స్వామి నోటి నుంచి మాట వచ్చినా అది యోగపరం. స్వామి సందేశం ఇచ్చిన అది ధ్యానగతం. వారి నుంచి వెలువడినటువంటి ప్రతి వాక్యము కూడా మహా వాక్యమే. రామాయణంలో పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చాడు. ఒక్క ఆంజనేయుడికి తప్ప అందరికీ ఇచ్చాడు ఆయన పేరుపేరునా. వెతికి వెతికి ఇచ్చాడు. తీసుకుంటున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు మొట్టమొదట ఎవరికి ఇవ్వాలి అంటే ఆంజనేయస్వామికి ఇవ్వాలి కదా! ఆయనకి ఇవ్వకుండా మనందరికీ బహుమానాలు చేస్తున్నాడే రాముడు అని అనుకున్నారు. రాముడు ఉపరిషత్ సారభూతమైన, వేద పరమైన, వైదాంతిక పరమైన, జ్ఞాన ధ్యాన యోగ పరమైనటువంటి అనేకానేక మహా వాక్యాలన్నింటినీ కూడా ఒక రత్నమాల చేశాడు ఆయన. మామూలుగా ఆంజనేయస్వామికి రాముడు రత్నాల మాల ఇచ్చాడంటే, రాముడు ఇవ్వకపోతే ఎవడు ఇవ్వగలడు? ఆయన రాజు కదా! మన దగ్గర ఉన్న ముత్యాల మాలో, వజ్రాల మాలో ఇవ్వలేదు. ఉపనిషద్ వాక్యమాలని రత్నమాలగా మార్చి ఆంజనేయస్వామికి అనుగ్రహ వరదానం చేశాడు. చిరంజీవత్వాన్ని అనుభవించవలసినటువంటి, యోగ భూమికలో నిలకడ చెందవలసినటువంటి, వాయు స్తంభన ద్వారా వాయు ప్రసరణాన్ని నిరోధించగలిగినటువంటి, నియంత్రించగలిగినటువంటి యోగాత్మ ఆంజనేయస్వామి గనుక ఆకల్పాంతము రాబోయేటువంటి బ్రహ్మ కాబట్టి, శ్రీరాముడు శ్రీమన్నారాయణుడు కాబట్టి వాక్య రత్నావళిని ఒక సభా మంటపంలో ప్రభాసంపన్నమైనటువంటి రీతిలో ఆంజనేయుడికి ఇచ్చాడు. మీకేమిచ్చారు భగవంతుడు అని మనల్ని అడిగితే, జీవితాన్ని ఇచ్చారు. దాన్ని సక్రమంగా నడిచే మార్గం చూపించారు. హాయిగా బతకగలిగిన మనస్సునిచ్చారు. హృదయము నిండార పండార భగవంతుని గురించి విచారణ చేయగలిగిన కలిమిని బలిమి చేశారు అని చెప్పాలి. ఇది పరమోత్కృష్టమైనటువంటి యోగ సాధకుడి యొక్క ఆలోచనా రీతి ఇట్లా ఉంటుంది. ఇలాగే ఉండాలి. చివరకు పరమేశ్వరుడైనా సరే వస్తువు ఇచ్చాడా కాల గర్భంలో కలిసిపోతుంది. పరమేశ్వరుని నుంచి మనం పొందవలసింది జ్ఞాన రత్నమాలని పొందాలి, ధ్యాన యోగాన్ని పొందాలి, యోగాన్ని పొందాలి. వారణాసిలో కాశీలో త్రైలింగ స్వామి వారి గురించి మాట్లాడుకున్నప్పుడు శ్యామాచరణ లాహిరి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎవరికీ ఇవ్వనటువంటి ఒక అరుదైనటువంటి అనుభవాన్ని అనుగ్రహించారు త్రైలింగ స్వామి. శ్యామాచరణులకి ఒక ఆలింగనాన్ని, పరిష్వంగాన్ని అనుగ్రహించారు. కౌగిలిలో తీసుకున్నారు ఆయన. అంటే ఒక యోగి ఒక యోగితో కలిసినట్లుగా లెక్క. మళ్ళొక్కసారి భగవద్గీతలోకి వెళ్ళాలి. ఎందుకంటే భగవద్గీతను మించిన యోగశాస్త్రం మరొకటి లేదు. యోగము మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికి సంబంధించింది గనుక, జాతి, మత, వర్గ, వర్ణాతీతమైనటువంటి భావనా భూమిక గనుక అర్జునుడితో శ్రీకృష్ణుడు ఒక చోట అంటాడు, "కాయకమైనటువంటి కర్మ నిష్ఠలో ఉన్నవాడికంటే, అంటే కర్మిష్ఠి కంటే, మానసికమైనటువంటి ధ్యానము చేసే ధ్యాని కంటే, నిరంతర చింతన చేసేటువంటి తపస్వి కంటే నాతో కూడి ఉన్నటువంటి యోగి ఉత్తమోత్తముడు. కనుక అర్జునా! నీవు యోగివి కా." ఎంత గొప్ప మాట! యోగివి కావాలి.యోగత్వాన్ని సిద్ధింపజేసుకోవాలి. శ్యామాచరణులు త్రైలింగ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది, వినయ వినమ్రత గాత్రులై వినయమే మూర్తీభవించినట్లుగా ఒక పరమాత్మ లక్షణాన్ని సంతరించుకొని గృహస్తు అయి ఉండి కూడా కలకత్తాలో ఒక Government Office లో పనిచేస్తూ కూడా తమ యోగ అభ్యాసనాని వదిలిపెట్టలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఆయన పైన ఉన్న అధికారి ప్రతిరోజూ వీరిని గమనించేవారు. ఇతడు ఏదో ప్రత్యేకంగా మాత్రం ఉన్నాడు, అర్థం కావటం లేదు. వాడు పాశ్చాత్యుడు. తేజోవంతంగా ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు, నిరుపమానంగా ఉన్నాడు, నిరామయంగా ఉన్నాడు, నిరాసక్తంగా ఉన్నాడు. అందరికంటే అతివేగంగా పని చేస్తున్నాడు, నిర్దుష్టంగా చేస్తున్నాడు. కర్మ సుఖౌషలం అని ఉంది కదా! ప్రజ్ఞా భూమికలో సంచారం చేస్తున్నాడు, ఆనంద పడుతున్నాడు ఆయన. ఆనంద పడుతున్నాడు గానీ ఈయన ఎవరో అర్థం కావటం లేదు. ఏదైనా సరే అర్థం కావాలి అంటే అనుభవం కావాలి. అనుభవం లేకుండా పరమాత్మను గురించి మాట్లాడే హక్కు మనకు ఉండదు. వస్తువు రుచి చూడకుండా బాగుంటుంది తినండి అని మనం అనలేం. మనం తిన్న తర్వాత బాగుందో, బాగాలేదో చెప్పగలం. కాబట్టి రుచి, శుచి ఏవైతే ఉన్నాయో, ఒకానొక సందర్భం ఏర్పడింది. అంతా తరుణాధీనం, అంతా కాలాధీనం. పరమేశ్వరుడి యొక్క సంకల్పం లేకపోతే సమయం రాదు. వేళటికి వచ్చింది. యోగ ప్రవాహాన్ని గురించి కాసేపు అనుకునేటువంటి తరుణం ఇప్పటికి వచ్చింది అన్నమాట. ఇంతకుముందు రావచ్చుగా. అంటున్నది మనమే, వింటున్నది మనమే ఎప్పుడో అనుకోవచ్చుగా అంటే అనుకునేది మనం కాదు, పరమాత్మ అనుకోవాలి. ఒకరోజున Office కి వెళ్ళినప్పుడు తన యజమానిని, తన అధికారిని అడిగాడు, "ఎందుకు విషాదంగా ఉన్నారు? చాలా చికాకు పడుతున్నట్టున్నారు, అసహనంగా ఉన్నారు. ఎందుకిలా ఉన్నారు?" అని అడిగారు. ఆయన అన్నాడు, "నాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో నా భార్య చాలా అనారోగ్యంతో ఉంది. ఆమె లండన్ లో ఉన్నది. ఏమో నేను మళ్ళీ నా భార్యను నేను, నన్ను నా భార్య చూడగలడో లేదో, ఇదే ఇవ్వాళ నాకు ఉన్నటువంటి చింత." అన్నాడంతే. గదిలో నుంచి శ్యామాచరణులు బయటికి వచ్చారు. ఏకాంత స్థలం అక్కడ ఉంటే వెళ్లారు. ధ్యాన ముద్రాంకితమైన స్థితిలో తనులో తాను నిలకడ చెందారు. ఒక పది, పదిహేను నిమిషాల తర్వాత పై అధికారి దగ్గరికి వెళ్లారు. వెళ్ళి, "మీ భార్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. రెండు, మూడు రోజుల్లో నేను బాగున్నానని, నేను హాయిగా ఉన్నానని, నేను భారతదేశానికి రాబోతున్నానని ఆమె Travel Plans అన్నీ కూడా చెప్తూ మీకు ఉత్తరం రాస్తుంది. ఉత్తరాన్ని మీరు అందుకుంటారు." అని చెప్పి బయటికి వచ్చేశారు. ఎట్లా? ఎలా చెప్పాడు ఈయన? Web-Web కెమెరాలు లేవే, ఇంకేవో లేవే. లేని రోజులివి. ఆయన ఏదో ఒక పవిత్రుడు చెప్పిన మాటగా భావన చేశాడు గానీ నమ్మకం కుదరలే. సరిగ్గా వారం రోజులకి ఆయన చేతికి ఉత్తరం వచ్చింది. శ్యామాచరణులు ఏమి మాట్లాడారో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఆమె ఉత్తరం రాసింది. ఆశ్చర్యపోయారు ఆయన. ఆశ్చర్యపోయి, "ఇది ఎట్లా సాధ్యమైంది?" అని మాత్రం అడిగారు. ఆయన, "పరమాత్మ భావనతో నిలకడ చెందితే ఇవి చాలా చిన్న విషయాలు." అన్నారాయన. అంటే ఒక పాశ్చాత్యుడికి, అనుభవం లేని వాడికి ప్రతిదీ అద్భుతం. మనం కూడా స్వామిని చూసినప్పుడల్లా ఆశ్చర్యపోయినాం. ఎలా సృష్టిస్తారు వస్తువుల్ని? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? బంగారాన్ని ఎలా సృష్టిస్తారు? ఉంగరాన్ని ఎలా సృష్టిస్తారు? ఇవన్నీ మనం ప్రశ్న వేసుకున్న వాళ్ళమే. సమాధానం ఏమిటంటే Man Creates Energy out of Matter, God Creates Matter out of Energy అంతే. మనం Energy ని సృష్టించగలం, Matter సృష్టించలేం. Matter కు మూలమైనటువంటి సత్ సంకల్పించగానే ఏం జరగాలో జరిగిపోతుంది, ఏం కావాలో అది వస్తుంది. ఇదంతా కూడా ఒక మార్మికమైన విషయం, గుహ్యమైన విషయం. చాలా Intricate గా ఉన్నటువంటి విషయం. దీన్ని గమనించుకోవటానికే యోగ ప్రవాహం. ఎప్పటి శ్యామాచరణులు, ఎప్పటి యుక్తేశ్వరులు, మొన్న మొన్నటి పరమహంస యోగానంద, వారికంటే ముందు బాబాజీ, వారికంటే ముందు మనువు, వారికంటే ముందు మరొకరు, మరొకరు ఇది పరంపరానుగతంగా నిజానికి ఇక్ష్వాకు వంశం వచ్చి భౌతిక వాదం వినపడనంత వరకు అంటే Materialistic Approach లేనంత వరకు పరంపరానుగతంగా ఇది ఏర్పడుతూ వచ్చింది. ఇది కలియుగం కదా! చెప్పేవాడికి శక్తి లేదు, వినేవాడికి శక్తి లేదు. ఏం చేయాలి? కనుక పురోహితుల పాలబడింది యోగం. దాన్ని వాళ్ళు Practice చేయని కారణంగా, ఏదైనా సరే వస్తువు మన దగ్గర ఉంటే వాడితే పదును ఎక్కుతుంది, దాచిపెడితే తుప్పు పడుతుంది. అంతే కదా! దాన్నే సత్యసాయి భగవానుడు "Rust is Rust" అన్నారు, ఒకటే మాట. నేను చాలా చేశానండి, ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అంటే తుప్పు పట్టడం మొదలవుతుందన్నమాట. కన్నుమూసేదాకా నా కార్యక్రమంలో ఉంటాను అంటే వెలుగుతూ ఉంటుందన్నమాట. It gets sharpened minute by minute.
SSSMC · audio

Yoga Pravaham - 04

Home

Yoga Pravaham - 04

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 30:48

More in this series

Yoga Pravaham

15 episodes · 7 hr 37 min

  1. 27 min 1

    Yoga Pravaham - 01

  2. 34 min 2

    Yoga Pravaham - 02

  3. 24 min 3

    Yoga Pravaham - 03

  4. 30 min 4

    Yoga Pravaham - 04

    Now playing
  5. 29 min 5

    Yoga Pravaham - 05

  6. 41 min 6

    Yoga Pravaham - 06

  7. 26 min 7

    Yoga Pravaham - 07

  8. 42 min 8

    Yoga Pravaham - 08

  9. 32 min 9

    Yoga Pravaham - 09

  10. 29 min 10

    Yoga Pravaham - 10

  11. 26 min 11

    Yoga Pravaham - 11

  12. 40 min 12

    Yoga Pravaham - 12

  13. 19 min 13

    Yoga Pravaham - 13

  14. 28 min 14

    Yoga Pravaham - 14

  15. 21 min 15

    Yoga Pravaham - 15