No transcript for this section.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా, ఇదంతా ఒక చరిత్ర, ఇదొక ప్రవాహం. ఈ ప్రవాహంలో వచ్చినటువంటి మరొక పరమాద్భుతమైనటువంటి ముని, యోగి ఎవరు అంటే వారు కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని. ముని ఆయనకి బిరుదు. ఆయన కూడా విజయనగరం జిల్లాలో మన త్రైలింగ స్వామి వారు హాలియలో ఎట్లా పుట్టారో, వీరు కలువరాయిలో జన్మెత్తారు. అతి విచిత్రం ఏమిటంటే, ప్రపంచం భగవంతుని సృష్టి ఎట్లా ఉంటుందంటే, Introvert, Extrovert అవుతాడు. అది వాడి లీల. ఏమీ తెలియన వాడు పరమాద్భుత వాక్చాతుర్యంతో ప్రపంచంలో నడయాడుతాడు. పరమేశ్వరుడి లీల. దేవుడు లేడన్నటువంటి ఒక Agnostic వివేక నరేన్ వివేకానందుడు కాగలుగుతాడు. దేశ ప్రేమి, జర్నలిస్టు, మరొకటి విప్లవవాది, తీవ్రవాది అయినటువంటి అరవిందులు మహాయోగి అవుతాడు. ఇవన్నీ వాళ్ళు కావాలని అనుకోలే. అలా చేస్తాడు భగవంతుడు. ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సన్నివేశాలను బట్టి తన శక్తిని ఆ వ్యక్తుల యందు ప్రవేశింపజేసి, అందుకే మనం చెప్తాం కళావతారాలు, అర్చావతారాలు, అంశావతారాలు, ప్రభవావతారాలు, ప్రవేశావతారాలు, అనుప్రవేశావతారాలు, ఆవేశావతారాలు అంటాం. ఆ ఆవేశావతారమే వివేకానందుడు. ఆ ఆవేశావతారమే అరవింద యోగి. దాని మూలం ఏమిటి మళ్ళీ వెతికినట్లయితే చిచ్ఛక్తి స్వరూపిణి యొక్క జగజ్జనని యొక్క సంకల్పమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది గనుక. కావ్యకంఠ వాశిష్ఠ గణపతి మునికి చిన్నప్పుడు మాటలు రాలే. వాక్కు లేదు. భయపడ్డారు. ఏదన్నా లేకపోతే ఆ బాగు చేసుకోవచ్చు గాని, మాటే లేకపోతే బతికేది ఎట్లా అని. తర్వాత కాలంలో మనకు తెలుస్తుంది మాటలు లేకపోతేనే బతుకు హాయిగా ఉంటుంది అని. కదా? కానీ సహజంగా ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో, వైదిక అంటే వేదం ఎరిగినటువంటి ద్రావిడ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మ ఎత్తి మాట రాకుండా ఎట్లా అని అనుకుంటున్నప్పుడు దైవవశాత్తు ఆయనకి మాటలు రావటం, ఆ తర్వాత ఆయన మంత్రద్రష్ట కావటం అంటే మంత్రాన్ని దర్శించటం అంటే మంత్రాలలో ఉన్న బీజాక్షరాల వెనక ఉన్నటువంటి అధిష్ఠాన పరదైవతం యొక్క తత్వాన్ని దర్శనం చేయటం. వాడు ఋషి అవుతాడు. కావటం సంస్కృతము, వాంగ్మయము ఆయన వెనక పరిగెత్తుకుంటూ రావటం, ఆయన ఏనాడు ఏ పదం కోసం కానీ, ఒక భావం కోసం కానీ తడుముకున్నటువంటి సందర్భం కావ్యకంఠుల జీవితంలో లేదు. వారు కూడా అరవింద యోగికి సమకాలీనులు. వారివలె ఈయన కూడా దేశభక్తి. ఈ దేశానికి స్వాతంత్రం రావాలి అంటే ఏం చేయాలి అని ఇంద్ర సంఘము అని పేరు పెట్టి ఇంద్ర సంఘాన్ని రేణుకాస్తంభం అంటే రేణుకా రూపంలో ఉన్నటువంటి జగజ్జననిని ఉపాసన చేసి ఆ సర్వశక్తి యువకుల యందు ప్రవేశించు గాక, ప్రవహించు గాక అని భారతదేశాన్ని తమ ఉపన్యాసాల ద్వారా ఉర్రూతలూగించినటువంటి మహా వాంగ్మయ స్వరూపం కావ్యకంఠ గణపతి ముని. మహా తపస్వి. స్వాధ్యాయంలో ఆయన్ని మించినటువంటి దిట్ట ఆయన కాలంలో మరొకడు లేడు. ఎట్లాగూ యోగుల ప్రస్తావన ఈ మధ్యలో కొన్ని సమకాలీనమైన సందర్భాలు అనుకోవాలి గనుక కావ్యకంఠ గణపతి ముని రమణాశ్రమం నుంచి అరవిందాశ్రమానికి వెళ్లారు. వారికో చిన్న ముచ్చట. అరవిందుల వారితో కలిసి ధ్యానంలో కూర్చోవాలి అని ఓ చిన్న ఆలోచన. ఆయనకి అలాంటి ఆలోచనలు ఉండేవి. రమణ మహర్షి పక్కనే కూర్చొని ఫోటో తీర్చుకోవాలని, అరవిందుల వారితో కూర్చొని ధ్యానంలో ఉండాలని. రెండు నెరవేరినాయి. ధ్యానానికి వెళ్లారు. వెళ్ళగానే అరవిందుల వారు ది మదర్ ని చూపించారు. శ్రీమాతను చూపించి "మీరు వారితో కూర్చొని కాసేపు ధ్యానంలో గడపండి" అన్నారు. ది మదర్ అండ్ కావ్యకంఠులు ఇద్దరూ కూడా ధ్యానంలో కూర్చున్నారు. ది మదర్ కంటే అతివేగంగా, అతి శీఘ్రంగా, అత్యంత స్వల్ప కాలంలో ధ్యాన అంతఃస్థితికి చేరుకున్నాడు కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని. ది మదర్ ఆ Altitude నుంచి కిందకి దిగి వచ్చి మళ్లీ జాగ్రదవస్థలోకి రాగానే గణపతి మునిని అడిగిన ఒక ప్రశ్న, ఓ కోరిక. "మీరు అరవిందాశ్రమంలోనే ఉండిపోయినట్లయితే మనం కలిసి ధ్యానం కొనసాగించవచ్చు కదా" అని ఒక మాట అడిగారు. అంటే అంత ఆనందపడిందామె. కావ్యకంఠులు అన్నారు "మీరు ఇక్కడ చేస్తున్న పని నేను ఇంకోచోట చేస్తున్నాను. రెండు శక్తులు ఒకచోట అవసరం లేదు. Epicenters అన్నింటినీ కూడా మనం బలవత్తరం చేద్దాం. శక్తిహీనమైనటువంటి క్షేత్రాలలో మనం కూర్చొని అతి శక్తివంతమైనటువంటి క్షేత్రాలని మనవిగా చేసుకొని ఆ భూమికలో నుంచే భారతీయమైనటువంటి తత్వాన్ని నిలబెడుతూ విదేశీ పాలన నుంచి దేశాన్ని మనం రక్షించుకుందాము" అని ఒక మాట. అన్నప్పుడు ఆమె సగౌరవంగా, సాదరంగా అంగీకరించి "ఇదే కరెక్ట్. ఇట్లాగే చేయాలి. అందరం ఒకేచోట గుమిగూడి శక్తి క్షేత్రం అంతా సెంటర్ చేసాకంటే Epicenters అక్కడ అక్కడ అక్కడ ఈ భావ బీజాలన్నీ దా-నాటుతూ భారతదేశాన్ని అంగాంగీ భావంతో ఉన్నటువంటి దాన్ని సర్వాంగీణమైనటువంటి భరతమాత యొక్క దేహాన్ని ప్రతి అణువునీ శక్తి క్షేత్రం చేయాలి" అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందుకే యోగ ప్రవాహం అనేటువంటి ఈ విచారణ ఈ సమయంలో చాలా చాలా అవసరం. అందుకేసత్య సాయి భగవానుడి యొక్క దివ్య సంకల్పం కారణంగా ఇది ఈ క్షణాన జరగటం అత్యుత్తమమైనటువంటి స్థాయి. అయితే కావ్యకంఠులు ఇంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా వారు వేలూరు అనేటువంటి ఒక ఊరు, ఇవ్వేళ వేలూరు హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఫేమస్. అట్లా గుర్తు పెట్టుకోవాలి చిత్తూరు దగ్గర. అక్కడికి వెళ్లారు Humphries అనేటువంటి ఒక మహమ్మదీయుడిని కలిశారు. ఆ హంఫ్రీస్ సిద్ధపురుషుడు. రేపు ఏం జరుగుతుందో చెప్పగలిగేవారు ఆయన. ఆయన ఓ రోజున ఒక చిన్న బొమ్మ గీసుకున్నారు, ఏదో బొమ్మ ఓ పుస్తకంలో. ఏ బొమ్మ గీసుకున్నారో ఆ బొమ్మ ఆ రాత్రి కలలోకి వచ్చింది. తర్వాత తర్వాత రిఫరెన్స్ చేస్తే అది రమణులుగా వారికి అర్థమైంది. కావ్యకంఠులు వారిని కలిసినప్పుడు ఓ ప్రశ్న వేశారు. "తీవ్రమైనటువంటి తపస్సు చేసినా, తీవ్రమైన అధ్యయనం చేసినా, వాఙ్మయ మధనం చేసినా, మంత్ర దర్శనం చేసినా నాకు చిత్తశాంతి దొరకటం లేదు ఏం చేయాలి? ఇంకా ఎక్కడో మనస్సు మలగకుండా ఉంది. అది ప్రాపంచికమైనటువంటి యాతనలు కలిగిస్తూ ఉన్నది. దీనికి మార్గం ఏమిటి?" అని ఈయనని అడిగారు. అప్పుడు హంఫ్రీస్ చెప్పారు "అరుణాచలానికి వెళ్ళండి, అక్కడ బ్రాహ్మణ స్వామి లేదా మౌన స్వామి అనేటువంటి పేరుతో ఒకరున్నారు. ఆ యువకుణ్ణి కలవండి." అన్నప్పుడు ఈయన వెళ్లారు. అరుణాచలం మీద రమణులు ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు కౌపీనం ధరించి. ఇంకా అప్పటికి ఆయన మాటలు మాట్లాడి సుమారుగా తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది. కంఠనాళాలన్నీ పూడుకుని ఉన్నాయి. మాట మాట్లాడాలి అంటే స్వరం బయటికి రావటం లేదు, అది వారి పరిస్థితి. కావ్యకంఠులు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించి వారి సన్నిధికి చేరి ఒక మాట అడిగారు. "భగవాన్! పధ్నాలుగు సంవత్సరాల తీవ్రమైన తపస్సు చేశాను. మంత్రద్రష్టనైనాను, వాఙ్మయాన్ని ఎరిగాను. సకల కళల, సకల శాస్త్రాల సారం నేను కైవసం చేసుకున్నాను. సంస్కృత భాష నా వెనక పరిగెత్తుకుని వస్తున్నది. ఏం చెప్పాలన్నా ఆశువుగా మహా ప్రవాహమై వస్తున్నది. ఇదంతా బానే ఉంది కానీ నాకు చిత్తశాంతి లేదు. మీరు అనుగ్రహించాలి." అని అడిగారు. చిత్తశాంతి గురించి రమణులు సమాధానం ఇవ్వలేదు. వారు మౌనం వహించారు. వీరు మళ్ళీ రెండోసారి అడగకుండా " ఇంతకీ నేను ఇంతకాలము చేసింది తపస్సేనా? ఇంతకీ తపస్సు అంటే ఏమిటి?" చెప్పమని అడిగారు. చూడండి! అప్పుడు కంఠనాళాలు సవరించుకుంటూ భగవాన్ రమణులు నెమ్మది నెమ్మదిగా మాటలన్నీ కూడబలుక్కుంటూ కొన్ని ఏళ్ళ తర్వాత కావ్యకంఠులను చూస్తూ ఒక మాట అన్నారు. "నేను అన్నటువంటి ఈ ప్రథమ తలపు, the very first thought origin of thought అంటాం. అది ఎక్కడ పుట్టిందో గమనించుకుంటూ దాని వెంట ప్రయాణం చేయగా చేయగా ఆ నేను ఎక్కడ ముగుస్తున్నదో గమనించగలిగినట్లయితే దాని పేరు తపస్సు." అన్నారు. శబ్దమైనా అంతే! శబ్దం ఒకచోట పుడుతుంది. ఒకచోట పుట్టకపోతే అది నానాధ్వనులు అవుతుంది. అన్ని చోట్ల పుట్టింది అనుకోండి. ఇక్కడ పుడుతున్న శబ్దమే పరివ్యాప్తమైనట్లుగా ఆ నేను అన్నటువంటిది ఒక హృదయంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు అది ఆత్మగా, అఖండంగా, సర్వవ్యాపిగా సమస్త ప్రపంచాన్ని ఆవరించినప్పుడు మళ్ళీ ఆ శబ్దం ఎక్కడ మలగుతున్నది, మళ్ళీ ఎక్కడ ముగుస్తున్నది అంటే అది ఎక్కడ ప్రారంభమైందో అది అక్కడికే ముగుస్తున్నది. ఈ అంటున్నటువంటి ఈ శబ్దమంతా హాలంతా వెళ్లినా మళ్ళీ మాట ఒక పదం లోపల్నుంచి వచ్చేప్పటికి అది ఎక్కడికి వెళ్తున్నది అంటే మళ్ళీ ఇక్కడికే వస్తున్నది. ఇది ఆత్మతత్వం. ఆనందపడ్డారు కావ్యకంఠులు. పరిష్కారం దొరికింది ఆయనకి. నేను తపస్సు చేస్తున్నాను, నేను పాడుతున్నాను, నేను అంటున్నాను, నేను కంటున్నాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అన్న భావనలన్నీ దేహపరమైనటువంటివే. అసలు నేను మాత్రం ఇవేమీ అనటం లేదు. నువ్వు అను, అనకపో సాక్షిభూతంగా నీ లోపల ఉన్నది. ఆ అసలు నేనుని నేను పట్టుకోవాలి అంటే నేను చేసిన ఈ తపస్సుకి అర్థం ఇదా అనుకుంటూ మరొక్క చిన్న సం-సందేహం "నా తపస్సు ఫలించింది అనటానికి నాకు గుర్తు ఎట్లాగో చెప్పమంది" అడిగాడు. అడుగుతారుగా! పరీక్ష బాగా రాశావా అన్నప్పుడు బ్రహ్మాండంగా రాశాను అంటాడు పిల్లవాడు. నేను బాగా రాయలేదు అనేవాడు ఎవ్వడు లేడు. వివేకి అయినటువంటి తల్లిదండ్రులు ఏమంటారంటే "సరే results రానీయ్ అప్పుడు చూద్దాం. అదే చెబుతుందిగా" అంటాం కదా. కాబట్టి తపస్సు ఫలించటం ఎట్లా ఆ కిటుకు కావాలనుకున్నారు ఆయన. భగవాన్ చెప్పారు "తపస్సు చేయటానికి ముందు నీవు ఈ ప్రపంచంలో ఉంటావు. తపస్సు ఫలించిన తర్వాత ఈ ప్రపంచం నీ లోపల ఉంటుంది. నీకంటే ఈ ప్రపంచం భిన్నం కాదని అభిన్నంగా, అద్వయంగా, అద్వైతంగా, inseparableగా, నీకంటే భిన్నం కాకుండా ఉన్నది గనుక ఆ ఏకాత్మ భావన, ఏకైక స్థితి ఏదైతే ఉన్నదో దానిని అధ్యాత్మ భావనగా భావన చేయమన్నారు."మౌనం వహించారు. ఎదురుగా ఉన్నటువంటి కావ్యకంఠులు మహాయోగి, మంత్రద్రష్ట అంటే యోగ స్థితిని పొందినటువంటి వాడు. ఆయన నుంచుని ఉన్నారు. దక్షిణం దిక్కుగా ఆరు సార్లు తేజోమయమైనటువంటి కాంతి పుంజాలు వచ్చి రమణ మహర్షి యొక్క ఆజ్ఞా చక్రాన్ని తాకుతున్నాయి. ఆజ్ఞా చక్రం అంటే మనం విభూతి, కుంకుమ పెట్టుకునేటువంటి కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి స్థానం. అది త్రికూట స్థానం. ఆ త్రికూట స్థానాన్ని ఆరు సార్లు వరుసగా వచ్చి తగలగానే వీరు ఆనందపడిపోయి ఏమన్నారంటే, "అవును మీరు స్కందులా?" అని అడిగారు. మనకి వెంటనే మనిషినో దేవుడ్ని చేసేయటం మనకిష్టం, అది మనకు ఆనందం. ఈయన రాముడే అన్నాం అనుకోండి, అది మనకో ఆనందం. అవునో కాదో కానీ మనకలా అనిపిస్తుంది. కావ్యకంఠులక్కూడా జరిగినటువంటి విషయం అదే. "మీరు స్కందులా?" అంటే సుబ్రహ్మణ్యస్వామి కదా? అని అడిగారు. భగవాన్ పూర్ణమైనటువంటి తత్వ విధానంలో ఒక ఎదురు ప్రశ్న వేశారు. ఓ ఎదురు సమాధానం ఇచ్చారు. "నేను ఎవరో తెలుసుకున్నందువలన మీకేం లాభం లేదు. మీరు ఎవరో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ తపస్సుని ఇప్పుడు ప్రారంభించండి." అంటే ఇంతకుముందు చేసిందంతా preparation మాత్రమే. స్వాధ్యాయం గాని, సద్గోష్ఠి గాని, సత్సంగం గాని, సత్సాంగత్యం గాని, సమ్యక్ సంకీర్తన గాని, యోగ భూమికలో నిలకడ చెందటానికి అయినటువంటి లయ యోగం గాని, హఠ యోగం గాని, ఉన్మనీ యోగం గాని, మనోన్మనీ యోగం గాని, అమనస్క ముద్ర గాని, ఏదైనా సరే, ఇవన్నీ కూడా preparation. దేనికి? మనల్ని మనం ఎరగటానికి. మనల్ని మనం ఎరగనంతవరకు ప్రపంచం యొక్క శక్తి మనకు అవసరం అవుతుంది. మనల్ని మనం ఎరిగిన తర్వాత మన శక్తి ఈ ప్రపంచానికి అవసరం అవుతుంది. అది యోగ శక్తి. ఈ యోగ శక్తి వలననే ఈ సమాధానం వినగానే కావ్యకంఠులు ఒక్కసారి ఆనందపడిపోయినారు. అప్పటిదాకా ఆయన మౌనస్వామి, ఆయన బ్రాహ్మణ స్వామి, ఆయన వెంకట్రామన్, ఆయన పేర్లవి. అలా పిలిచింది లోకం. అప్పుడు ఆ యోగ శక్తి చేత కావ్యకంఠులు వెంకట్రామన్ కి ఓ పేరు పెట్టారు. మీరు భగవాన్. ఎందుకనంటే 'భ' అంటే వెలుగు, 'గ' అంటే జ్ఞానం. వెలుగు ద్వారా, లోచూపు ద్వారా, ఆంతరంగికమైనటువంటి స్థితి ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి వారు కనుక మీరు ఆత్మ స్వరూపులే. కనుక మీరు భగవాన్. భగవాన్ అనేటువంటి శబ్దానికి దేవుడు అని కాదు. దేవుడు అంటే, దేవ అంటే ఆట. దేవుడు అంటే ఆడించేవాడు, మనతో ఆడుకునేవాడు అని. స్వామి కూడా చూడండి, పరమాత్మయను ఈ బొమ్మలాటగాడు తాను జీవుల ఈ రంగస్థానాలను నిలిపి అని ఆడించేవాడిని నేను, ఆడేవాళ్ళు మీరు, ఇదంతా తోలుబొమ్మలాటే అన్నారు భగవాన్ సత్యసాయిబాబా వారు. అంటే ఆడించేవాడు ఒకడు లేకపోతే ఆట సాగదు. అప్పుడు మనకి దేవుడు అవసరం ఉంది. భగవాన్ అవసరం. భగవాన్ ఎవరు అంటే ఆత్మతత్వవేది అయినటువంటి వాడు, ఆత్మను ఎరిగిన వాడు, ఆత్మ తానైనవాడు, ఆత్మగా ఉండి సర్వాత్మలా సమతా, మమతా, నవతా, దివ్యతా, మానవతా, మాధవతా అన్నింటినీ ఏకకాలంలో అనుగ్రహించగలిగినటువంటి పూర్ణ శక్తివంతుడు ఎవరు? ఆతడే భగవాన్. భగవాన్ ఒక్కడే. ఎవడు ఆత్మను ఎరిగాడో వాడే భగవాన్. ఆత్మతత్వ విచారణ గురించి ఎవరు చెప్తున్నాడో వాడు భగవాన్. అంటే ప్రకాశము ఉన్నది, జ్ఞానము ఉన్నది, ఆత్మానుసంధానం ఉన్నది, ఆత్మనిష్ఠ ఉన్నది, తత్వ విచారణా భూమిక ఉన్నది, వేదిక ఉన్నది, అది నిత్యమూ తాను పరమాత్మతో ఏర్పరచుకున్నటువంటి దివ్య తత్వానుసంధానంలో నుంచి మొలిచేటువంటి అనేకానేక ఉదాత్త భావనలకి ఆయన మూలమై ఉన్నాడు. ఆ భావనలన్నీ పంచభౌతిక దేహంలో నుంచి పుట్టినవి కావు. సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక మహా తత్వంలో నుంచి వెలువడేటువంటి ఆ వెలుగే జ్ఞానంగా, వాంగ్మయంగా, వాక్కుగా, మాటగా, పాటగా అనేక రీతులలో కళా స్వరూపాన్ని సంతరించుకొని ప్రబుద్ధమానం చేసేటువంటి పరమ ఆధ్యాత్మిక భూమిక కాబట్టి అటువంటి స్థితి మీకున్నది గనుక మీరు భగవాన్ అన్నారు. మీరు ఇకపై రమణ నామంతో ఈ ప్రపంచంలో మీ సంచారం సాగుతుంది అన్నాడు. అంటే గురువుకి నామకరణం చేసినటువంటి వాడు కావ్యకంఠులు. రమణ అనే దానిలో రెండు మాటలున్నాయి. ఒకటి స్మరణ, రెండవది మరణ. స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలం ఇది అని కదా! చిదంబరం లో నటరాజ దర్శనం కన్నా, కాశీలో గంగా స్నానం కన్నా, తిరువయ్యూరులో జన్మ ఎత్తటం కన్నా, పరమ పవిత్రమైనటువంటి అరుణాచల శివ అనబడేటువంటి ఒక నామాన్ని గనక అంటే పరముక్తి లభిస్తుంది అనేది ఒక ప్రమాణం. ఈ ప్రమాణానికి అనుసరణంగా దానిలో స్మరణ ఉన్నది గనుక మానవుడు జడ చైతన్యాల కలయిక గనుక, అంటే జడమైనటువంటి ఈ దేహంలో చైతన్య స్థలి అయినటువంటి ఆత్మ రెండు కూడి ఉన్నాయి గనుక తొలిరోజున చెప్పుకున్నట్లుగా ఇనప పెట్టెలో బంగారు necklace ఉన్నట్టుగా, బంగారు necklace లోపల భద్రంగా ఉంది. పైన ఉన్నటువంటి బీరువా మాత్రం శిథిలమైపోతున్నది. బీరువాలు మారుతున్నది, ఆత్మేం మారటం లేదు. అది అఖండంగా ఉన్నది, అనాహతంగా ఉన్నది, మార్పు ఎరగకుండా ఉన్నది, మార్పుకి లోను కాకుండా ఉన్నది. కానీ జరుగుతున్న ప్రతి మార్పుకి కర్మసాక్షిగా ఉన్నది, అంతఃసాక్షిగా ఉన్నది గనుక ఆత్మని ఎరగటమే పూర్ణ విద్య గనుక ఆ విద్యని మరణము అనేటువంటి ఒక పరమాద్భుతమైన మార్పు. యోగేశ్వర కృష్ణుడు, ఆయన కంటే ముందు కృతయుగంలో మరణాన్ని గురించినటువంటి విచారణ, మరణం అంటే మార్పే. అదేం కాదు, అదొక విషాదాంతం కాదు. ఈ గది నుంచి ఆ గదికి వెళ్ళినట్లు, ఈ బట్ట విప్పి ఇంకో బట్ట కట్టుకున్నట్లు, ఈ పాత్ర ముగించి మరొక పాత్రలోకి ప్రవేశించినట్లు మరణం కూడా అంతే. మనం కూడా రోజులో ఎన్ని సార్లు మరణిస్తామో మనకు తెలీదు, స్పృహ లేదు. ఆలోచనకి, ఆలోచనకి మధ్య ఉన్న విరామ కాలమంతా శూన్య మహాస్థితి. ఆలోచన పుట్టి మళ్ళీ మరొక ఆలోచన పుట్టటానికి వ్యవధి తక్కువైతే మనం ఉన్నట్లు, వ్యవధి ఎక్కువైతే మనం లేనట్లు. ఈ మరణం కేవలం దేహం శిథిలం కావటం కాదు, దేహాత్మ భావన నశించడమే అసలు శిశలైనటువంటి మరణం. అటువంటి కావ్యకంఠులు వెంకట్రామన్ కి రమణ అనేటువంటి పేరు పెట్టారు. దానిలో మరణం ఉన్నది, స్మరణ ఉన్నది. అన్నింటికంటే రమణ అంటే రమయతి ఇతి రామః. రామ శబ్దానికి అర్థం ఏమిటి? రామ అంటుండంగానే ఆనందం కలుగుతుంది.
SSSMC · audio
Yoga Pravaham - 13
Yoga Pravaham - 13
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 19:46
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
- 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
- 26 min 7
Yoga Pravaham - 07
- 42 min 8
Yoga Pravaham - 08
- 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
- 40 min 12
Yoga Pravaham - 12
- 19 min 13
Yoga Pravaham - 13
Now playing - 28 min 14
Yoga Pravaham - 14
- 21 min 15
Yoga Pravaham - 15