No transcript for this section.
రామ అనంగానే ఎవరో వచ్చి మనల్ని కాపాడినంత భద్రత కలుగుతుంది. సత్యసాయి భగవానుడు ఈ రామ శబ్దాన్ని ఎంత పరమ రమణీయంగా యోగశాస్త్రంతో అనుసంధానం చేశారో గుర్తుచేసుకున్నప్పుడు, ఆయన సర్వజ్ఞుడు, పరమాత్మ, పరబ్రహ్మమూర్తి గనుక మరి ఆయన చెప్పకపోతే ఎవరు చెప్తారు? యోగశాస్త్రం ఎరిగిన వాడు తప్ప యోగాన్ని గురించి చెప్పలేడు. దేవో భూత్వా దేవం యజేత్. ఈయన దేవుడే అని ఎవరు చెప్తారు? దివ్యత్వాన్ని సంపాదించుకున్నవాడు. సంపాదించుకోని వాడు కాసేపు అవునంటాడు, కాసేపు కాదంటాడు. ఆయన అన్నారు రామ శబ్దమే ప్రాణాయామం. మీరు మళ్ళీ ఇంకా గాలి బంధించి యాత్రలు పడకండి. రా అనాలి అంటే రెండు పెదవులు తెరుచుకోవాలి, అది పూరకం. మళ్ళీ మా అనటానికి లోప కుంభకం అయిపోతున్నది, పీల్చుకున్న గాలి లోపల ఉంటున్నది. దానిని కాసేపు నిలబెట్టాలి అంటే మా అనాలంటే రెండు పెదవులు కలుసుకోవాలి. పెదవులు open అయితే అది పూరకం, అది close చేస్తే అది రేచకం. కాబట్టి పూరక, కుంభక, రేచక అనేటువంటి ప్రాణాయామ విధానం కేవల రామనామం యందు మాత్రమే ఉన్నది. శివ అనాలనుకోండి, పెదవులు కదపక్కర్లే, పెదవులు రెండు కలవక్కర్లే. కృష్ణ అనాలి, పెదవులు కదపక్కర్లే, కలపక్కర్లే. రామ అంటే పెదవులు కదలాలి, కలపాలి. ముందు విడగొట్టాలి, మళ్ళీ కలుపుకోవాలి. ఇది ప్రాణాయామంలో అందుకనే స్వామి ఆ రామ శబ్దాన్ని అనమని చెప్పటంలో యోగం చెప్పారు. యోగం అనే పేరుతో చెప్పలే. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ్. అది. ప్రేమ ముదిత మనసే కహో, ప్రేమతో చెయ్, ఇష్టంతో చెయ్, ఆనందంతో చెయ్, అనుభవంతో చెయ్, తాదాత్మ్యమైన స్థితిలో రామ శబ్దాన్ని అనుకో. ఇది ఒక మహోత్తముడైనటువంటి ఒక పురాణ పురుషుడు మాత్రమే చెప్పగలిగినటువంటి దివ్యమైన విద్యావిధానం ఇది. రామ శబ్దానికి ఇంత అర్థం ఉన్నదా? ఊరికే రమయతీతి రామః అంటాం. రామ శబ్దంలో రకార, అకార, మకారములున్నాయి, మూడు ఉన్నాయని చెప్తాం. రకారము రావు బీజమని, అకారము అగ్ని బీజమని, మకారము చంద్ర బీజమని. కాబట్టి ఈ మూడు కలిపితే రామ శబ్దం అయిందని, భారతీయమైనటువంటి సంఖ్యాశాస్త్రం ప్రకారం రామ అంటే ర అనేటువంటి శబ్దానికి రెండు, మ అనేటువంటి దానికి ఐదు, దాని potency అని, రామ అని ఒక్కసారి అంటే two into five is equal to ten అని, మళ్ళీ రెండోసారి అంటే ten into ten hundred అని, మూడోసారి కూడా అంటే ten into ten into ten, శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మూడు సార్లు రామ అంటే వెయ్యి సార్లు రామ నామాన్ని చేసిన ఫలితాన్ని ఇస్తున్నది అని ఎందుకన్నారంటే, ప్రాణాయామంలో నాడీశుద్ధి జరుగుతుంది. నాద శ్రవణం కలుగుతుంది. నాదానుసంధానం జరుగుతుంది. లోపల ఉన్నటువంటి యోగాగ్నులన్నీ కూడా రగిలి రగిలి చిట్టచివరకి చంద్ర కళాస్థానాన్ని చేరుకుంటాయి గనుక కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని రమణులకి ఆ పేరు పెట్టారు. ఇక కడగా వారిని మహర్షి అని పిలిచారు. భగవాన్ అనగానే సత్యసాయి భగవానుడు ఎట్లా మనకు గుర్తు వస్తారో, భగవాన్ అనగానే శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా గుర్తు వస్తాడో, అట్లాగే ఆధునిక కాలంలో భగవాన్ అనగానే రమణులు గుర్తు వస్తారు. అలాగే మహర్షి అనగానే వారే గుర్తు వస్తారు. ఎందుకనంటే మనం ఉంటున్నటువంటిది ప్రపంచం. ఈ ప్రపంచం అంతా కూడా దృశ్యమాన ప్రపంచం. బొమ్మగా కనబడుతున్నది చాలా picturesue గా ఉంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా. యః సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణము, అమూర్తం ఎక్కడ అయిందంటే కుడివైపున అయింది. ఎడమవైపునంతా అమ్మవారి శక్తి నడుస్తున్నది. అదే గుండె. ఇక్కడ కుడివైపున ఏం లేదు. మూర్తి అంటే బొమ్మ. అది అమూర్తం అయింది, బ్రహ్మ అయింది. ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నదంటే మన దేహంలోనే ఉన్నది అనేటువంటి పరమాద్భుతమైనటువంటి విషయాన్ని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం open చేస్తూనే మనకి స్పష్టం చేశారు. కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా అద్దంలో బొమ్మలా ఉందని ఇదంతా విచారణ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి, ఒక మనిషి మనీషి కావాలి. ఉత్తమ స్థాయికి వెళ్ళాలి. ఆ మనీషా అంటే conviction, స్థితప్రజ్ఞ, స్థిమితమైన అభిప్రాయం, అది మనీషా. అదే మనీషా పంచకం. శంకర భగవత్పాదులు మనీషా పంచకం అని చెప్పడం అంటే ఐదు శ్లోకాలలో ఏం చెప్పారా? మనీషా, మనీషామమా అంటూనే ఉంటారు. ఇది నా conviction, ఇది నా నిర్దుష్టమైన అభిప్రాయం. వాడు చండాలుస్తు, ద్విజోస్తు వాడు ఎవడన్నా గానీ చీమలో, దోమలో ఉన్నదంతా పరబ్రహ్మమేనని, పరబ్రహ్మము లేని జడము గానీ, చైతన్యం గానీ ఈ ప్రపంచంలో లేదని నిర్ద్వంద్వంగా ఏకత్వాన్ని ప్రకటించినటువంటి కరుణాలయం అది. అది పూర్ణాద్వైత మూర్తి శంకర భగవత్పాదులు. కనుక ఈ మనిషి మనీషని సంతరించుకోవాలి. మన అభిప్రాయాలు రోజుకి మారిపోతుండకూడదు, నిశ్చితంగా ఉండాలి. పట్టిన పట్టు పట్టనే పట్టితివి పట్టు విడునందాక అట్టే ఉండు అన్నారు, అది మనీషా. స్వామి మనీషా అని చెప్పకుండా పట్టిన పట్టు పట్టనే పట్టితివి, ఎట్లాగో పట్టుకున్నావు ఇందాక వచ్చావు. పట్టు విడునందాక అట్టే ఉండు. ఆ పట్టు విడటం అంటే నీ ఆత్మను నీవు ఎరగటమే. పుస్తకం చదువుతున్నాము అంటే అర్థమయ్యేదాకా చేతిలో బుక్కు ఉండాలిగా. వీణ వాయిస్తున్నాం అంటే వాయించినంత సేపు వీణ ఉండాలిగా. ఆ తర్వాత?వీణ వాయించవలసిన అవసరమే లేనినాడు వీణ ఎందుకు పుస్తకం ఎందుకు కాబట్టి పట్టు విడునందాక అట్టే ఉండు ఆ మనీష ఆ ఆ పద్యంలో దానిలో ఉన్న అర్థం అది. ఆ కొమ్మని పట్టుకోవటమే కష్టం చే కొమ్మని అడిగేవాళ్ళు లేరు మనంతట మనమే పట్టుకోవాలి ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం మనంతట మనం ప్రయత్నం చేయాలి ఇదిగో ఇది జరుగుతున్నది అంతా ఆ ప్రయత్నమే పట్టుకునే ప్రయత్నం పట్టుకున్న దాన్ని వదిలేసేయకూడదు ఈ మనీషి ఏం కావాలంటే మంత్రశాస్త్రాధ్యయనం చేత అందరూ చేయలేరు కదా మరణాత్ రాయతే ఇతి మంత్రః మాట అనగా అనగా అనగా అది మంత్రం అయిపోతుంది భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనుకుంటున్న కొద్ది ఆయన ఉంటాడు లేడు లేడు అనుకోండి లేడు లేని వాడికి ఎలాగూ లేడు ఉన్నవాడికి మాత్రం కచ్చితంగా ఉన్నాడు మరి ఉన్నవాడు మరణాన్ని గనక మంత్రం చేసుకోగలిగినట్లయితే ఆలోచనలని విగదీసుకుంటూ చక్కగా అనుకుంటూ ఉన్నట్లయితే మంత్రాలు మంత్రాల స్వరూపము బీజాక్షరాలు వాటి వెనుక ఉన్న దేవీదేవతలు అధిష్ఠాన దేవతలు అన్నీ కలిపి వాడు ఋషి అవుతాడు భగవంతుడు ఋషి కాడు భగవంతుడు తన్నస్సర్వః సర్వుడు ఆయన శర్వుడు ఆయన మహా మంత్రార్ణవ గ్రంథంలో పరమేశ్వరుడికి చెప్పినటువంటి నామం సర్వభ్యః సర్వసర్వభ్యః సర్వుడు ఆయనే శర్వుడు ఆయనే అన్నీ ఆయనే అంతా ఆయనే మార్పెరగని వాడు ఆయనే అన్ని మార్పులకు కారణమైన వాడు ఆయనే కాబట్టి ఈ సహ తన్నస్సర్వః అన్నప్పుడు స్వామి దాన్ని endorse చేశారు తన్నస్సత్యః అనాలి కదా అనంటే తన్నస్సర్వః అది correct దాన్నే ఉంచు అన్నారు సర్వ శబ్దం ఈశ్వర శబ్దం కాబట్టి ఈశ్వరుడు తప్ప అన్యం లేదని ఈ గాయత్రి చెప్తున్నది గనుక దాన్నట్లా ఉంచమన్నారు కాబట్టి ఒక గాయత్రిని అనటం ద్వారా కానీ అనటానికి కారణమైన వల్ కారణం వల్ల కానీ మూలం కానీ సాధన కానీ ప్రణవ శబ్ద ఉచ్చారణ ద్వారా కానీ ఈ మనీష వల్ల వాడు ఋషి అవుతున్నాడు ఋషి అంటే అర్థం అది మంత్రాన్ని ఉపాసన చేయాలి మంత్రాన్ని జపం చేయటం వేరు తపం చేయటం వేరు అజపం చేయటం వేరు మంత్రము తాను కావటం వేరు ఆ మంత్రము తాను అయినటువంటి వేళ మంత్ర ద్రష్ట స్థితిన దాటి మంత్రము తానై అభేదమైనటువంటి స్థాయిలో ఉండి తాను ఋషి అవుతాడు ఈ ఋషి ఋషిత్వంలో నుంచి బ్రహ్మర్షి కావాలి బ్రహ్మర్షి అంటే సర్వం ఖల్విదం బ్రహ్మాని అయమాత్మా బ్రహ్మాని ప్రజ్ఞానం బ్రహ్మాని త్వమేవాహం న సంశయః చివరగా తత్వమసి అని ఈ నాలుగు మహా వాక్యాలు అనుభవం గనక చేసుకున్నట్లయితే ఆతడు బ్రహ్మర్షి అవుతాడు అంటే బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు అని కదా యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది బ్రహ్మమును ఎరగని వాడు ఎరుగుతున్నవాడు బ్రహ్మం కావటంలే ఎరుగుతున్న ప్రయత్నంలో ఉన్నాడు వాడు బ్రహ్మమును ఎరిగిన వాడు ఏమవుతున్నాడు అంటే బ్రహ్మమే అవుతున్నాడు నీట మునిగిన వాడు నీరవుతున్నాడు నీటి లోపలికి మనం తల ఉంచాం ముంచాం మనకి నీటికి ఒక అభేద స్థితి ఏర్పడింది అట్లాగే బ్రహ్మర్షి కావాలి చిట్టచివరగా అంతస్సుని రోచస్సుని అంటే కాంతిని అంతరంగాన్ని దాటి నభస్సుని చీల్చుకుని అంటే ఆకాశం శూన్యాన్ని చీల్చుకుని మహస్సుని ఎవరు దర్శనం చేస్తారో శూన్యానికి కారణమైన శూన్యం ఏర్పడాలి అంటే ఎవరో మళ్ళీ కావాలి ఎవరు ఆయన అని అది తానుగా భావించిన వాడు మహర్షి అవుతాడు అంటే చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు అక్కడ నిరోధించటం అంటే ఆపటము అని కాదు ఆ వృత్తులు అన్ని అధిగమించటం దాటటం ఆపితే మళ్ళీ లేస్తాయి ఆ విజృంభించినటువంటి దానిని యోగ శక్తి ద్వారా యోగ భావన ద్వారా యోగుల సాంగత్యం ద్వారా యోగశాస్త్రాధ్యయనం ద్వారా యోగాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా సర్వ ప్రకృతికి మూలమైన పరమేశ్వర శక్తి ఒక వ్యక్తి యందు ప్రవేశిస్తుంది అందుకనే అది ప్రధానంగా గురువు ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి వివేకానంద స్వామి ఒక్కడిగా Parliament of Religions కి వెళ్ళినప్పుడు నక్షత్రాలను నలిపి వేయగల ఖగోళాలను పిండి చేయగలిగినటువంటి మా రామకృష్ణ గురుదేవుల శక్తితో వచ్చానన్నాడు ఆయన గురు శక్తి ఉత్తమోత్తమం గురువు మనకు మార్గదర్శి అవుతాడు ఎటువంటి గురువు ఉండాలి అంటే మళ్ళీ నిషిద్ధగురువు వాచక గురువు సూచక గురువు మోచక గురువు బోధ గురువు దీక్షా గురువు ఆ అనేకమైన గురువులలో కారణ గురువు ఉత్తమోత్తముడు గనుక మన జన్మకి కారణం జన్మ సాఫల్యానికి కారణం చెప్పేవాడు గనుక ఆయన మహర్షి అవుతున్నాడు సేమ్ మనిషి మనీషి కావాలి మనీషి ఋషి కావాలి ఋషి బ్రహ్మర్షి కావాలి బ్రహ్మర్షి మహర్షి కావాలి కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని యొక్క యోగశాస్త్ర అధ్యయనం అంతా కూడా ఆయన రచనలలో నిన్నో మొన్నో అనుకున్నాం ఇంటర్నల్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఒకటి ఎక్స్టర్నల్ పర్సనాలిటీ రెండవది ఆయన రచించిన రచనలన్నీ అవి ఆయన బయటకు కనిపించే కారెక్కే కారు దిగే పల్లకి ఎక్కే పల్లకి దిగే ఆయన కాదుఆయన internal personality ఈ వ్యక్తిది ఏది అని మనం ఎవరినైనా గమనించాలంటే, పోతన గారు సాహిత్యకారుడా, భక్తుడా, కవి భక్తుడా, భక్త కవే ఎన్ని మాటలన్నా చెప్పండి. ఆయన ఎవరు అని తెలుసుకోవాలి అంటే భాగవతం చదవాలి. వాల్మీకి బోయ వాడా, వేటగాడా, వాడి కులం ఏమిటి ఇది విచారణ కాదు. వాల్మీకిని ఎరగాలి అంటే రామాయణం చదవాలి. అట్లాగే ఎవరినైనా మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నిన్న ఇందాక కూడా అరవిందుల వారి ప్రస్తావన వచ్చింది గనుక All Life Is Yoga చదవాలి, సావిత్రి చదవాలి ఎప్పటికైనా చదవగలిగితే. Integrated Yoga చదవాలి, చదివితే అరవిందుల వారు తెలుస్తారు. ఆయన కథలో నుంచి అరవిందుల వారు మనకేం అర్థం కాదు. అయ్యే ప్రసక్తే లేదు. కావాలి అంటే ఆ రచనలు, త్యాగరాజస్వామి వారు మనకు తెలియాలంటే ఆయన ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఉంచ వృత్తి చేశారా లేదా, అది అవునా కాదా ఆయన కీర్తనలు గనక చదివితే త్యాగరాజ హృదయం మనకు అర్థమవుతుంది. సత్యసాయి భగవానుడు దైవం అవునా కాదా అని మీమాంసలో ఇంకా ఎవడన్నా ఉంటే, ఆయన చేసిన పనులు, ఆయన రాసిన వాంగ్మయాన్ని చదివితే ఆయన ఏంటో అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు మనం ఎంత చెప్పినా వాడు అక్కడే ఉంటాడు. ఎందుకని స్వామి అనేకమైనటువంటి వాంగ్మయానికి, సనాతనమైనటువంటి ధర్మానికి, పరమ రమణీయార్ద్రమైనటువంటి భూమికలో వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం మనం గనక తెలుసుకోకపోతే స్వామి అర్థం కారు. నేను స్వామితో ఉన్నాను, స్వామిని చూశాను, స్వామితో కలిశాను, షేక్ హ్యాండ్ ఇది కాదు. నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావా, పాద నమస్కారం తీసుకున్నావా ఇది కాదు. స్వామిని నువ్వు అర్థం చేసుకున్నావా లేదా, చేసుకొని తదనుగుణంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, ఆ ప్రేమని, ఆ సేవని, ఆ భావాన్ని, ఆ శక్తిని అతిమానుషమైనటువంటి దాన్ని నీవు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా ప్రదర్శించుకోగలిగావా? ఈ ప్రశ్నలు వేసుకుంటే మనకి స్వామి ఎంత అర్థమైనారో తెలుస్తుంది లేకపోతే అర్థం కాదు. ప్రాజెక్టులు కట్టారు అదొక లెక్క అది చాలా గొప్ప విషయమా స్వామి విషయంలో. సర్వ సృష్టికి మూల కారణమైనటువంటి స్వామి నాలుగు water projectలు కడితే దేవుడైనాడా? దేవుడు కనుక అవి చేయగలిగారు. మనం ఎందుకు చేయలేకపోయాం. కాబట్టి ఇదంతా ఒక పరిణామ దశ. అందుకనే సత్యసాయి భగవానుడి తత్వం ఏమిటి అని మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ముక్తిని గురించి కాదు transformation స్వామి యొక్క మూలతత్వం. మార్పు చెందుతూ ఉండాలి Change for Betterment. నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని వారికి నామకరణం చేసి, యోగశాస్త్రాధ్యయనం చేసి, యోగంలో నిలకడ చెంది శాంతిర్నితాంత మహితా పరమాస్య శక్తిహి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్రా జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం నృణాం నిదర్శనమయం రమణో మహర్షిహి. ఈయన మహర్షి స్థాయికి చెందిన వాడని గమనించాలి అంటే, అంతవరకు రమణ మహర్షిని ఎంత మంది చూడలేదు. మరి వీరొక్కరికి ఆ స్ఫూరణ ఎట్లా కలిగింది అంటే వీరు దానిని ఎరగగలిగిన శక్తి కలిగిన వాడు కనుక. ఆ శక్తి యోగ శక్తి. కనుకనే ఇంద్ర సంఘాలు చేసినా, రేణుకా స్తవాన్ని చెప్పినా, ఉమా సహస్రాన్ని అమ్మవారి శక్తిని వేయి విధాల చెప్పినా, ఇంద్రాణి సప్తశతి అంటే ఇంద్రాణి అంటే మెరపు తీగ అని అర్థం. ఇంద్రాణి అంటే అమ్మవారు, అమ్మవారి యొక్క నామం. ఆమె శక్తిని ఏడు వందల శ్లోకాలలో ఆయన రాశారు. ఎట్లా? కూర్చొని కాదు. నిన్న సావిత్రి ధారణ లో నుంచి వచ్చింది అన్నామే, కావ్యకంఠ గణపతి ముని కూడా ధారణా స్థితిలో నుంచి పరమాద్భుతమైనటువంటి మహాకావ్య సృష్టి చేశారు. చివరగా యోగ స్థితిలో ఆయన ఈ ప్రపంచానికి ఒక సందేశం కూడా ఇచ్చారు. ఆ సందేశం ఏమిటంటే కొన్నాళ్ళు భగవాన్ రమణుల దగ్గర ఉన్న చివరి దశలో ఆయన శిరసి అనేటువంటి ఖరగ్పూర్ దగ్గర అక్కడికి చేరుకున్నారు. తన శిష్యుల్ని పిలిచారు. ఫలానా రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు నేను ఈ దేహాన్ని వదిలిపెట్టబోతున్నాను అని చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు మాత్రం యాతన పడిపోయినారు. అంటే రేపటి నుంచి గురువుగారు కనపడరన్నమాట అని. కానీ ఆయన అనుకున్న ప్రకారం, చెప్పిన time ప్రకారం శరీరాన్ని వదిలిపెట్టారు. వారు ఇచ్చిన సందేశం ఏమిటంటే, రాజపుత్రా చిరంజీవ మాజీవ మునిపుత్రక జీవలా మరలా సాధో వ్యాధమా జీవమా మర. ఓ రాజకుమారుడా! నువ్వు కలకాలం జీవించవయ్యా అంటున్నాడు. సంతోషమే మనం ఎవరినైనా చిరంజీవి అంటాం కదా. రాజపుత్రా చిరంజీవ మాజీవ మునిపుత్రక ఓ ముని కుమారుడా! నువ్వు ఎక్కువ కాలం జీవించొద్దు అనగానే బాధపడతాం. ఇదేమిటి రాజకుమారుడు బతకాలంటాడు, ముని కుమారుడు పోవాలంటాడు. అంటే రాజకుమారుడు ఎందుకు బతకాలి అంటే తండ్రి చేసిన మహా పాపాలను వాడు మోయాలి. అందుకని ఆ రాజకుమారుడు బతకాలి. తండ్రి చేసిన మహా పాపాలన్నీ వాడి accountలో పడిపోతూ ఉంటాయి. ఇదంతా వదులుచుకునే లోగా వీడి జన్మ ఖర్చైపోతుంది. అయినా తప్పదు వారసత్వంలో తండ్రి మహా పాపమే వాడికి సంపద అవుతుంది. అదే కర్మభూమి అవుతుంది. దానిలో నుంచి వాడు మహా యాతనలు పడాలి. తండ్రి ఉండగా పాప కార్యాల వల్ల సుఖించిన వాడు ఎవరంటే కొడుకే. తండ్రి మరణానంతరం పాప భారాన్ని మోయవలసింది ఎవరంటే మళ్ళీ కొడుకే. కనుక కావ్యకంఠులు అంటున్నారు, రాజపుత్రా చిరంజీవ.మా జీవ ముని పుత్రక ఎందుకంటే మీ తండ్రి మౌని, మహర్షి, మహాత్ముడు. ఆయన కడుపున పుట్టావు. నీవు పుట్టి, జీవించి, దేహంలో ఉన్నప్పటికీ కూడా దేహాత్మ భావనని నశింపజేసుకొని జీవించవయ్యా అని అర్థం. మాజీవ అంటే నువ్వు మరణించు అని కాదు, జీవించి నువ్వు ఉండక్కరలేదు అని. జీవించి ఉండటం అంటే నేను అనుకోవటం, అది నీకు అక్కరలేదు. నేను లేదు, నువ్వు లేదు. నీ తండ్రే ముని, ఆ బంగారం లో నుంచి కోసాం బంగారమే వచ్చింది. నువ్వు హాయిగా ఉండు. జీవవా మరవా సాధో ఓ సాధుపురుషుడా మంచివాడివే నువ్వు. మంచి చేసావు, చెడు చేసావు. కర్మ ఫలాలు అనుభవించడానికి ఉండు, కర్మానుభవాన్ని పూర్ణం చేసుకోవటానికి కూడా ఉండు. జీవవా మరవా సాధో. జీవించి ఉండగానే మరణాత్మ భావనలో ఉండు. నేను మరణించానని అనుకుంటూ ఉండు. ఎందుకంటే, మరణించిన తర్వాత నీ తండ్రి దయవల్ల నువ్వు ఎప్పుడూ జీవించే ఉంటావు. చూడండి తండ్రి గొప్పవాడైనప్పుడు, మహాత్ముడైనప్పుడు ఆయన వారసులంతా-- ఆ తండ్రి మరణించిన తర్వాత కూడా వాడు బతికి ఉంటాడు. చివరగా, వ్యాధ ఓ వేటగాడా మా జీవ మామర నువ్వు బతకద్దు, చావద్దు. ఎందుకంటే, ఆ పిట్టను కొట్టావు కదా, దాని ప్రాణం పోయేటప్పుడు పాపం దానికి బతకాలని ఉందట. దాని బతుకుని బుగ్గిపాలు చేసావు గనుక, నువ్వు కూడా నీ తండ్రి వేటగాడు గనుక, ఆ కడుపున పుట్టావు గనుక, నీవు ఉన్నంత కాలం కూడా ఏ రోజుకారోజే మరణమా, జీవితమా, ఉన్నామా, పోయినామా అనుకుంటూనే ఉండు అన్నాడు. ఇటువంటివి కొన్ని కోకొల్లలు చెప్పారు కావ్య కంఠులు. కోకొల్లలు, వందలు, వేలు చెప్పారు. అంటే యోగ శక్తిని ప్రజ్ఞా భూమికగా మార్చుకున్నటువంటి పవిత్ర భారతదేశం ఇది. ఇట్లా అనేకమంది, ఒకళ్ళా, ఇద్దరా, ముప్పై ఆరు వేల మందిని మనం అనుకున్నాం. అందరినీ చెప్పుకోలేకపోయినా, సమయం లేదు కాబట్టి ఉన్న సమయంలో వీళ్ళంతా మనం అనుకున్న వాళ్ళంతా కూడా అనేక పార్శ్వాలకు సంబంధించినవారు. అనేక కోణాల్లో యోగ శక్తిని ఈ ప్రపంచానికి ప్రసారం చేసినటువంటి వాళ్ళు. వీరితో పాటుగా వీరంతా యోగులైనారు. కొందరు తపస్సులని చూశాం, కొందరు జ్ఞానుల్ని దర్శనం చేశాం, కొందరు మహాత్ముల్ని చూసి వచ్చాం, కలిసి వచ్చాం. చాలా గొప్ప వాళ్ళు ఈ ప్రపంచం చేత ముద్ర వేయించుకున్న వాళ్ళు కూడా మన జీవితంలో ప్రవేశిస్తారు. ఇదంతా ఒక ఎత్తు. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్య సాయి భగవానుడి యొక్క ఆవరణలో ఉండగలగటం, దానిని మించినటువంటి పరముక్తి మరొకటి లేదు. ఎందుకంటే, భరద్వాజ మహర్షి దేవ దర్శనానికి అంటే భగవంతుని దర్శనానికి నాలుగు వందల ఏళ్ళు ఎదురు చూశాడు. ఏం లాభం లే. చూడలేకపోయినాడు ఆయన. మహర్షిగానే ఉండిపోయినాడు. తపస్సులోనే ఉండిపోయినాడు. మంచివాడే కానీ భగవద్ దర్శనం చాలా దుర్లభం. అంత తేలిక కాదు. మనం ఇవాళ ప్రత్యేకించి భగవంతుడు ఎట్లా ఉంటాడు అని చెప్పాలి అనగానే త్రేతాయుగం నాటి రాముడినినూ, ద్వాపర యుగం నాటి కృష్ణుడిని కాస్త అధ్యయనం చేయగలిగితే, వాళ్ళని మనం ఈ కంటితో చూడలేదు గనుక ఆ రెండు తత్వాలు జమిలిగా ఇవిడిపోయినటువంటి ఒక పరమాద్భుత దివ్యమూర్తిని మనం దర్శనం చేశాం. అది సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్య సాయి భగవానుడు. వస్తువు అదే. ఈశ్వరమ్మ కొడుకుగా ఒకడికి, పుట్టపర్తి సాయిబాబాగా రెండో వాడికి, మూడో వాడికి మహిమలు చేసేవాడిగా మూడో వాడికి, ప్రాజెక్టులు కట్టించిన వాడిగా నాలుగో వాడికి, ఏదో పాతకాలపు యజ్ఞాలన్నీ కూర్చొని చేయించిన వాడిగా ఐదో వాడికి, ఎవరికీ ఎట్లా కనపడాలో, ఎంతవరకు అర్థం కావాలో ఆయన అర్థం అయినారు. కానీ ఆత్మని ఎరిగే ప్రయత్నంలో పరమాత్మ యొక్క భావనని, ఆ ఛాయలని, ఆ జాలుని, ఆ శక్తిని అవగతం చేసుకోవాలి అంటే శుభ్ర మనస్సు కావాలి, యోగాత్మ కావాలి, యోగ సిద్ధి కలగాలి. ఆ యోగ సిద్ధి కేవలం ఉపన్యాసం లో నుంచి రాదు, నిష్ఠలో నుంచి వస్తుంది. అది ఆత్మ నిష్ఠ లో నుంచి రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే, స్వామి అన్న మాటే, "ఎప్పుడైతే నా నుంచి నీవు ఏమీ కోరకుండా ఉంటావో, నీకేం కావాలో అది నేను ఇస్తాను. నీకేం కావాలో నువ్వు కోరుతున్నంత కాలం నువ్వు అడిగిందే ఇస్తుంటాను. నువ్వు అడగటం ఆపేసెయ్, నీకేం కావాలో అది నేను ఇస్తా." అంటే, ఏది ఇస్తే నీకు నిజంగా ఆనందము తర్వాత ముక్తి కలుగుతుందో అది నాకు వదిలేయ్" అన్నారు. కానీ అజ్ఞానం చేత, "స్వామి ముందు పిల్ల పెళ్లి కానివ్వండి, కొడుకు ఈ దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి తొందరగా వాణ్ణి మీ అనుగ్రహంతో తరిమేయండి. లేకపోతే నా భార్యకి ఆరోగ్యం బాలేదు, మీరే చూసుకోండి. లేకపోతే నాకేదో కావాలి, నాకివ్వండి." ఏముంది ఇస్తారు. పెద్ద కష్టమేముంది ఆయనకి? చాలా చిన్న విషయాలు అవి. "పరమాత్మ నీవే నాకు కావాలి" అని గనుక మనం అడిగినట్లయితే, ఆయన Yes అని గనుక అన్నట్లయితే, ఆయనే మన వాడైనప్పుడు మనకి ఇంకా ఏం కావాలి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన వాడైన తర్వాత ఇంకా ఈ చిన్న చిన్న విషయాలు మనల్ని యాతన పెడతాయా, బాధిస్తాయా? ఇవన్నీ కూడా ఈ యోగుల కథలన్నీ నిరూపణ చేస్తాయి. ఏం చేయవు. పరమేశ్వరుడికి సమర్పణ చేయాలి, శరణాగతి చేయాలి, వినయంగా ఉండాలి. ఈ పట్టిన పట్టు కొమ్మని వదిలిపెట్టుకోకుండా ఉండాలి. ఇది నిరంతరము జరిగేటువంటి ఈ ప్రవాహం అనేక మలుపులు తిరిగి, తిరిగి, తిరిగి ఎక్కడికి వెళ్తుంది అది? ఎక్కడో పుడుతుంది.ఓ గోదావరి నది, కృష్ణా నది దాని పుట్టుక, ఋషి పుట్టుక, నది పుట్టుక ఎవడికీ తెలియదు. అక్కడ ఎందుకు పుట్టిందో తెలియదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ అది ఉంది. ప్రవహిస్తున్నది పల్లానికి వెళుతూ వెళుతూ ఉన్నది. తాను వెళుతున్న దారినంతా శుభ్రపరుస్తున్నది, తాను శుభ్ర పడుతున్నది. చివరగా సాగర సంగమం చేస్తున్నది. పరమేశ్వర భావనతో తనను తాను తమింపజేసుకుంటున్నది, కూడి పోతున్నది. ఇటువంటి మహా యోగాన్ని మనం అనుభవించాలి అంటే స్వామి యొక్క మహిమలు చెప్పుకుంటూ కాలం చెల్లగొట్టే సమయం అయిపోయింది, అది కాదు. పరమాత్మ అంటే తెలియాలి. రామకృష్ణావతారాలను గురించి తెలుసుకోవాలంటే రామాయణ భాగవతాలు ఉన్నాయి, భారతం ఉంది. యోగశాస్త్రం ఎరగాలి అంటే భగవద్గీత ఉన్నది. సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ప్రబోధం తెలియాలి అంటే మహిమాన్వితమూర్తి అయినటువంటి స్వామిని ఆ కోణం నుంచి దాటి తాత్విక చింతనలో విచారణ చేయాలి. బహుశా సత్యసాయి భగవానుడికి ఎరుక కనుక, తానే ఎరుక కనుక కోటి సమితిలో ఈ యోగ ప్రవాహం అనేటువంటి దానికి స్వామి ఒక అనుగ్రహ ఆశీర్వచనాన్ని పరమాద్భుతంగా అనుగ్రహించారు. తర్వాత యోగుల కథలను మహత్యాల కోసం చదవకండి. ఈ నాలుగు రోజులుగా ఎవరెవరి పరంగా ఏదన్నా కొన్ని మహిమలు చెప్పినా అది వారు కాదు. సాధారణమైన మానవుడి యందున్నటువంటి ప్రేమ చేత, వాత్సల్యం చేత ఏదో ఒక ప్రదర్శన చేయకపోతే మనకు నిదర్శనం ఎట్లా కలిగేది? Proof కావాలంటాం కదా కాబట్టి ఆయన అవన్నీ ప్రదర్శిస్తుంటాడు. ప్రదర్శనే ఆయన కాదు అనేటువంటి భావనలో నిలకడ చెంది మనలోనే ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు ఉన్నాయి. వాటిని నిలబెట్టుకుందాం. మనలోనే సర్వశక్తులు ఉన్నాయి గమనించుకుందాం. ప్రపంచంగా ఏది కనిపిస్తున్నదో అదంతా మనలో బీజప్రాయంగా ఉన్నది. దానిని గమనించుకుందాం. ఎన్నేళ్ళు వచ్చినాయి అని కాదు, ఎంత సాధించాం అని కాదు, ఇక్కడ సాధించేం లేదు, అనుభవించటమే. అనుభవం దగ్గర ఆగిపోవటానికి వీల్లేదు, అనుభూతిని చెందాలి. అనుభూతిని కూడా ఏదో ఒక property లాగా మన దగ్గర పెట్టుకోవటానికి లేదు, విభూతి స్థాయికి వెళ్ళాలి. Irreversible process అంటామే! నిదానవతి ఉపాసనలో పాలు నెయ్యి అయినట్లుగా మనం కూడా పరిణామ క్రమంలో ఆ transformation అనండి, ఆ betterment అనండి, యోగైక స్థితి అనండి, దానికి ఏ పేరు పెట్టినా అటువంటి మహోన్నత స్థితికి సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మనందరినీ చల్లగా, భద్రంగా నడిపించాలి అని స్వామికి మనసా, వచసా, చిరసా ప్రార్థన చేస్తూ చిట్టచివరగా స్వామి యొక్క ఒక అభయాన్ని గుర్తు చేస్తూ మనం ఇవాళ స్వస్తి పలుకుదాం. ఏ ఇంట నా చిత్రపటం ఉండునో, ఏ ఇంట నిత్యమూ భగవన్నామ సంకీర్తన జరుగునో నేను ఆ తరాన్ని మాత్రమే కాక వారి వారి ఇరవై యొక్క తరాలను కాచుకుంటాను, చూచుకుంటాను అన్నారు స్వామి. ఇరవై యొక్క తరాలు చూడండి. ఇవాళ మనం చేసే పుణ్యం మన ఇరవై యొక్క తరాలకి చక్కగా penetrate అవుతుంది. ఇరవై యొక్క తరాలు స్వామి యొక్క ఆరక్షణలో ఉంటాయి. ఇంకేం భయం? మనం ఉండాలి అంతే. ఆ ఉండదగినటువంటి ఈ ధనాన్ని మన పిల్లలకివ్వాలి, మన తర్వాత తరానికి ఇవ్వాలి. మన కడుపున పుట్టిన వారికి ఇవ్వాలి, ప్రపంచానికి ఇవ్వాలి, దాటాలి. అన్నీ barriers దాటుకుంటూ ఏ సత్యసాయి భగవానుడు పుట్టపర్తిలో తమ అవతార కార్యక్రమాన్ని ఎనభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించి సర్వ దేశాలని కూడా, సర్వ ప్రపంచాన్ని కూడా పుట్టపర్తికి రప్పించారో, ఆ ప్రజ్ఞ ఏమిటి అని విచారించినప్పుడు ప్రేమను మించి మరొకటి లేదు. సేవను మించిన యోగం మరొకటి లేదు. ఇప్పుడు చెప్పుకున్న ఈ యోగాలన్నీ కూడా దేహ పరమైనవి, మనస్సు పరమైనవి, విచారణ పరమైనవి, శాస్త్ర పరమైనవి, అవన్నీ మన తెలివితేటలతో కూడినవి, మన intellect తో కూడినవి. అసలు ఏది యోగము స్వామి చెప్పిందంటే సేవా యోగమే యోగం. దానిలో ఇవన్నీ మిడి ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞాన, యోగములు నాలుగు కలిపితే సత్యసాయి ప్రవచించిన, ప్రబోధించిన, ప్రసారించిన, అనుగ్రహించిన అటువంటి సేవా యోగంగా భావన చేస్తూ సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మనందరికీ సద్బుద్ధిని, సదవకాశాన్ని, సత్సంగ యోగాన్ని, నిత్య సత్సంగ యోగాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio
Yoga Pravaham - 14
Yoga Pravaham - 14
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 28:59
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
- 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
- 26 min 7
Yoga Pravaham - 07
- 42 min 8
Yoga Pravaham - 08
- 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
- 40 min 12
Yoga Pravaham - 12
- 19 min 13
Yoga Pravaham - 13
- 28 min 14
Yoga Pravaham - 14
Now playing - 21 min 15
Yoga Pravaham - 15