No transcript for this section.
శామాచరణులు కేవల కుంభక యోగాన్ని ఆశ్రయించినటువంటి మహాత్ములు. కేవల కుంభక యోగాన్ని సాధించిన అనేకమంది మహాత్ముల పేర్లు మనం చెప్పుకున్నాం. పునః వాటి అవసరం లేదు. కాకపోతే కేవల కుంభక యోగం అనేకమైనటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా కేవల కుంభకము అనబడేటువంటి పేరుతో పిలవబడే యోగమే ఉత్కృష్టమైనది అని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారు. ముందు కేవల వదిలిపెడితే కుంభకమేమిటో తెలుసుకోవాలి. క్రియాయోగ అంతా కూడా ప్రాణాయామానికి సంబంధించింది. ప్రాణాయామం అంటే ప్రాణ ఆయామం. వచ్చే పోయే గాలి యొక్క స్థితిని గమనించటం. ముందుగా పూరకం పూరించటం, కుంభకం నిలబెట్టటం, రేచకం వదిలిపెట్టటం. పూరక, కుంభక, రేచక ఇది యోగ త్రయీ. ఇందులో గాలి పీల్చుకోలేకపోయినా ప్రాణం పోతుంది. పీల్చుకున్న గాలిని వదిలి పెట్టలేకపోయినా ప్రాణం పోతుంది. కావలసిన దానికంటే తక్కువున్నా ప్రాణం పోతుంది, ఎక్కువ ఉన్నా ప్రాణం పోతుంది. ప్రాణాయామం మనం రోజు చేస్తున్నామా? చేయటం లేదా అని. మనకు తెలియకుండానే చేస్తున్నాం. తెలియకుండా చేస్తే భగవంతుడిచ్చిన చీటీ ప్రకారం బతుకుతున్నాం. తెలిసి చేస్తే జీవితాన్ని extend చేసుకోవచ్చు. క్రియాయోగంలో ఉన్న సిద్ధి అది. త్రిలింగ స్వామి వారు రెండు వందల ఎనభై సంవత్సరాలు ఈ పుడమిపై సంచారం చేశారన్నప్పుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాం. రెండు వందల ఎనభై ఏళ్ళు బతకటమా? అని. కాశీకి వెళ్ళేప్పటికి నూట ముప్పై ఏళ్ళు అనుకున్నాం. ఆ తర్వాత నూట యాభై ఏళ్ళు వారు సశరీరులై ఉన్నారు. చిట్టచివర సహజ సమాధి స్థితికి వెళ్ళే దాకా పూర్ణ స్ప్రుహతో వారున్నారు. ఎట్లా ఉన్నారంటే కేవల కుంభక యోగాన్ని సాధించటమే. మన ఒంటిమీద చిన్న దోమ వాలగానే దాన్ని చంపే వరకు మన మనసు నిలుకడ చెందదు. మనది కాని ఏ వస్తువు మన యందు వచ్చినా దానిని తరిమి, తరిమి బయటకు కొట్టే దాకా మనం-మన మనసు నిగ్రహించదు. వ్రతం చేస్తాం, శ్రీడి బాబా సచ్చరిత్ర పారాయణం ఏడు రోజులు బ్రహ్మాండంగా చేస్తాం ఇంట్లో. కావలసిన వాళ్ళందర్నీ పిలుచుకుంటాం పారాయణం పూర్తయిన రోజున. పిండివంటలు చేస్తాం. వాళ్ళకి ఆనందం కలిగిద్దామని చేస్తాం. కథలో చెప్పిన కుక్క ఎలాగో వస్తుంది. కత్తె దానికి దండ వేయం, దండం వేస్తాం. ఓ కర్ర పెట్టి కొట్టేస్తాం. మనం పారాయణం చేసినట్ల, చదివినట్ల, చదవనట్ల ఏది చదివినా, ఏది ఆలోచించినా, ఏది చెప్తున్నా అది నువ్వు అనుష్ఠానం గనక చేయకపోతే నీవే దురదృష్టవంతుడివి. అనుష్ఠానం చేస్తే నీకు అనుభవం ఏర్పడుతుంది. అనుభవంలో నుంచి ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని గనక గాఢం చేసుకోగలిగినట్లయితే అది విభూతి స్థాయికి వెళుతుంది. అనుభవం దగ్గర ఆగిపోయి, "నేను స్వామిని చూసేశాను, ఎంత బాగున్నారు" ఏం లాభం? ఎన్న లాభం ఉందా? "నయనానందం కలిగింది, స్వామితో నేను మాట్లాడాను. ఎంత బాగా మాట్లాడారు" అట్లాగా! ఏం నేర్చుకున్నావ్? "ఏం నేర్చుకునేది కాదు, చాలా చమత్కారంగా మాట్లాడారు. ఎంత బాగా మాట్లాడారు. జోక్స్, బాగా జోక్స్ వేశారు" ఏం ప్రయోజనం? ఆత్మజ్ఞానాన్ని గురించి ఏమన్నా చెప్పారా? "చెప్పారు కానీ నాకది అర్థం కాలే" అర్థం కాలే కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేయలే. నీవు ఆత్మవిద్యని ఎరగాలి అని స్వామి చెప్పిన మాట మీద గనక మనసును నిగ్రహించుకొని చిత్తైకాగ్ర స్థితిలో ఆ ఒక్క పదాన్ని నీవు పట్టుకొని ఉన్నట్లయితే, నీవు మహోన్నతుడివై ఉండేవాడు, యోగివై ఉండేవాడివి. అందుకనే అర్జునుడికి ఆయన చెప్పిన ఒకే ఒక్క ఉపదేశం "యోగి భవ అర్జున". యోగివి కా, ఇంక మిగతావన్నీ వచ్చేస్తాయి. యోగివి కాలేదనుకోండి, స్వామితో మమేకం కాలేదు, చూశాం, వచ్చాం. ఓ వంద సార్లు వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. ఆయన మాట్లాడారు, యాభై సార్లు మాట్లాడారు. చివరికి ఏమిటి నీ మీద ప్రభావం అని ప్రశ్నించినప్పుడు, ఏమో ఆ రోజులు బాగున్నాయి అని వదిలేస్తాం తప్ప నన్ను ఇట్లా ప్రభావితం చేశారని చెప్పలేని ఒక పరిస్థితి రాకూడదు. క్రియాయోగం అంటే మనసును నిగ్రహించటం, శరీరాన్ని సత్కర్మలలో, కార్యకలాపాలలో నిమగ్నం చేయటం. నిర్ణీత సమయంలో మనం చేయవలసిన పని చేయటం. Right action at right time. ఏ మనలాగా ఏమీ చదువుకోనటువంటి రైతు సమయం వచ్చేదాకా చూసి వర్షం పడుతుందన్న ఆనవాలు కంటి చూపుకి అందగానే అప్పుడు దున్నుతాడు. చాలులో మొక్కలు వేస్తాడు. ముందు మదుపు చేస్తాడు, అదుపు చేస్తాడు, విత్తనం చల్లుతాడు, కాపాడుకుంటాడు. ఆధ్యాత్మిక భావ బీజాలు మన మనోక్షేత్రంలో వెయ్యాలి అంటే ఏమీ తవ్వకుండా, ఏ process లేకుండా భగవంతుడు ఇస్తాడా అంటే, అవును అడవి-అడవిలో కూడా వర్షం పడుతుంది, అడవిలో కూడా పూలు పూస్తాయి, అడవిలో కూడా వెన్నెల కాస్తుంది. మన కడుపున పుట్టిన బిడ్డే మనం తీసుకెళ్లని చోటికల్లా తెలియన్నాడు వచ్చాడు, కదా. టికెట్టు కొన్నామో లేదో తెలీదు, ఏ ఊరు తీసుకెళ్తున్నామో చెప్పలేదు. మనతో పాటు బస్సు ఎక్కాడు, మనతో పాటు బస్సు దిగాడు. ప్రయోజనం ఏమన్నా ఉందా? ఎరిగిననాడు మాత్రం అడుగుతున్నాం, "ఎక్కడికి వెళ్తున్నావ్? ఏం చేయబోతున్నావ్? ఎన్నాళ్ళు ఉండబోతున్నావ్? ఏ టికెట్టు కొనబోతున్నావ్?" అన్నీ తల్లినో, తండ్రినో అడుగుతున్నాం. తండ్రి కూడా చెప్తున్నాడు. "నాయనా! నాలుగు రోజులు ఉంటాం" అన్నప్పుడు ఎరిగి వెళ్తున్నాడు.ఎరిగి వెళుతున్నాడు ఎరగక వెళుతున్నాడు ఎరిగి వెళుతున్న దాంట్లో సుఖముంది అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఒక మాట "అర్థం తెలియకుండా చేసే ఏ పనైనా వ్యర్థమే" ముందు అర్థం తెలియాలి. క్రియాయోగ మన మనస్సుని మన శరీరాన్ని మన యందున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి యోగ నాడులని శుద్ధి చేసుకునేటువంటి ఒక పరమాద్భుత ప్రక్రియ యోగ ప్రక్రియ. కేవల కుంభక యోగాన్ని గురించి మనం విచారణ చేస్తున్నప్పుడు గాలిని కుంభింప చేయటం లోపల నిలబెట్టుకోవటం అంటే మనస్సు అన్నా ప్రాణం అన్నా లోపల ఉండేటువంటి వాయువు అన్నా మూడు ఒక్కటే పర్యాయపదాలు. వాయువే ప్రాణంగా ప్రాణమే మనస్సుగా అంతే కదా. ప్రాణం బాగాలేదు అంటాడు చదువుకోని వాడు కాస్త చదువుకున్నవాడు ప్రాణం బాగాలేదనడు మనస్సు బాగాలేదు అంటాడు. ఈ రెండూ తెలియని వాడు ఒంట్లో బాగాలేదు అర్థం కావట్లేదని. ముగ్గురిది బాగాలేదు కానీ మూడు మాటలు వాడారు. మూడు ఒకటే. ఈ కుంభకం చేసినప్పుడు శరీరము యొక్క అవస్థ శరీరంతో మనకున్న సంబంధం మానసికంగా తెగిపోతుంది ఇంకేమీ ఉండదు. రమణ మహర్షి భుజం మీద వ్రణం లేచినా, జిల్లెళ్ళమూడి అమ్మ కడుపులో cancer గడ్డలు లేచినా, రామకృష్ణ గురుదేవుల కంఠం cancer కి గురైనా వారు ఎలా తట్టుకొని నిలబడ్డారు అనంటే కేవల కుంభక యోగం కారణమే. పునః మళ్ళీ చెప్పుకోవాలి రెండువేల మూడులో సత్యసాయి భగవానునికి జరిగినటువంటి hip joint fracture ఏదైతే ఉన్నదో అది కేవలము కేవల కుంభక యోగం ఎరిగిన వారు మాత్రమే దాన్ని భరించగలరు. మామూలు వాడు అట్లా ఉండలేడు మనిషి ఉండలేడు అసంభవం. వైద్యశాస్త్రం చదివిన వాడికి అబ్బురంగా ఉంటుంది కానీ యోగశాస్త్రం ఎరిగిన వాడికి అసలు అది అబ్బురం కానే కాదు. అనుభవం లేని వాడికి ప్రతిదీ మహిమగా కనిపిస్తుంది అనుభవం ఉన్నవాడికి ఆ మహిమే అనుగ్రహంగా గోచరిస్తుంది. మహిమ అనుగ్రహం రెండు విడివిడిగా లేవు మహిమ ద్వారా అనుగ్రహాన్ని అనుగ్రహం ఉన్నది కాబట్టి మహిమని రెండింటిని దర్శనం చేయగలిగాం. ఒక మహిమని చూశాం ఒక అనుగ్రహాన్ని అనుభవించాం. ఈ పర్యాయపదాలన్నీ చాలా technical గా ఉంటాయి కానీ ఇవన్నీ యోగశాస్త్రానికి సంబంధించినటువంటి మాటలే. కనుక ఈ కేవల కుంభక యోగంలో శ్యామాచరణ లాహిరి దగ్గరికి అనేకమంది భక్తులు ఎప్పుడైతే కొద్దిగా popularity వస్తుందో, ప్రపంచం ఎప్పుడైతే కొద్దిగా గుర్తిస్తుందో వాడి చుట్టూ జనం చేరుతారు. తప్పేం లేదు వాళ్ళు రావలసిందే బెల్లం ఉంటే కదా చీమలు వచ్చేది. బెల్లం లేని చోటికి చీమ వెళ్ళనే వెళ్ళదు దానికేం పని. వెళ్లి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండాలి కానీ ఉండరు. చూశారా? వాడు ఏమనుకుంటున్నాడో వీడు అది చేయాలని అనుకుంటాడు అది జరగదు. వీడు ఏం చేయాలనుకున్నాడో విధాత నిర్ణయించాడు దాని ప్రకారమే జరుగుతాయి. ఈ వైదాంతిక భూమికని అలవాటు చేసుకున్నప్పుడు మనసుతో ఈ ప్రపంచాన్ని చూడటం ఆపేసినప్పుడు హృదయంతో మాత్రమే చూడటం ప్రారంభించినప్పుడు ఈ సర్వ ప్రకృతి కూడా పరమేశ్వర విలాసంగా పరమేశ్వరుడి యొక్క హేలగా మనకు గోచరిస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళల్లో ఒక doctor వచ్చాడు ఆయన దగ్గరికి ఆ doctor లహరి మహాశయుల యొక్క సద్భక్తుడు చాలా తీవ్రమైనటువంటి భక్తుడు మామూలు అటూ ఇటూ కాదు. ఆ రోజున ఆ సాయంకాలం శ్యామాచరణులు తమ కుడి చేతిని doctor కి చూపించారు. "doctor నేను జీవించి ఉన్నానా? మరణించి ఉన్నానా? చెప్పు" అని అడిగారు. చెయ్యి చూశాడు "ఇదేం ప్రశ్న? మరణించిన వాడు ప్రశ్నించనే లేడే! నేను మరణించి ఉన్నానా? జీవించి ఉన్నానా? చెప్పు" అన్నప్పుడు నాడి పట్టుకున్నాడు. పట్టుకుంటే నాడిలో చలనం లేదు. వైద్యశాస్త్రానికి అందనటువంటి ఒక పరమాద్భుతం జరిగింది ఆ రోజున. జరగ్గానే "గురుదేవా ఏమవుతున్నది ఇక్కడ?" అన్నాడు. "మరి ఇప్పుడో?" అన్నారు చమత్కారంగా. మళ్ళీ నాడి నెమ్మదిగా కొట్టుకోవడం ప్రారంభించింది. "perfect గా ఉన్నది" అన్నారు. "అది ఎంత perfect గా ఉన్నది? తాబేలు వలె ఉన్నదా? పాము వలె ఉన్నదా? ఏనుగు వలె ఉన్నదా? సమాధానం చెప్పమన్నారు. చూడండి ఎంత గొప్ప-- యోగ శాస్త్రాన్ని అలా చెప్పాలి. "మీరు ఇది చేయండి చేయండి" ఎలా చేయాలో కూడా చెప్పాలి. పాము గాని ఏనుగు గాని తాబేలు గాని మనవలె డెబ్బై రెండు సార్లు దాని గుండెలు కొట్టుకోవు. పన్నెండు, పదమూడు సార్లు తాబేలు యొక్క గుండె కొట్టుకుంటుంది. తాబేళ్ళల్లో ఒక జాతి మూడు వందల ఏళ్ళు బతుకుతుంది. ఏనుగుకి అసలు గుండె కొట్టుకోవటం అనేదే లేదు. చాలా తక్కువ ఉంటుంది. గుండె ఎంత తక్కువగానే కొట్టుకుంటే అది ఎక్కువ కాలం బతుకుతుంది. మనక్కూడా డెబ్బై రెండు దాటగానే doctor గారు ముందు మందులు ప్రవేశపెడతాడు. డెబ్బై రెండుని ఆపెయ్ అక్కడిదాకా లాక్కు రావాలని. "ఇవాళ ఎంత? ఇవాళ ఎంత?" అంటే "డబ్బ్ ఎంత కాదు BP ఎంత?" అని. ఆ BP చెప్తుంటాడు వీడు "one eighty by one twenty అయితే గయా" అంటాడు వీడు. "ఏమిటి గయా?" ప్రాణం పోతుంది. ప్రాణాయామంలో ఉన్నటువంటి వ్యక్తి తన నిశ్చలమైనటువంటి క్రమశిక్షణ ద్వారా శారీరక శ్రమ ద్వారా మానసికమైన balance ద్వారాఈ శ్వాస ప్రక్రియని నిగ్రహించగలిగినటువంటి స్థాయి పేరే కేవల కుంభక యోగం. కేవల కుంభకంలో దేహ భ్రాంతి ఉండదు, దేహాత్మ భావన ఉండదు, దేహంలో జరుగుతున్న ఏదీ వారికి పట్టదు. దాన్ని బయట వాడు సమాధిలో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారని అనుకుంటారు. ధ్యాన సమాధులను దాటినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి స్థితి నిజానికి కేవల కుంభకం. శ్యామాచరణ్ లు "ఏం చేద్దాం ఇప్పుడు?" అని అడిగారు. అడిగితే, "ఇది ఎట్లా జరిగిందో చెప్పండి" అని అన్నప్పుడు, మనస్సుని నియంత్రించడం ద్వారా, నిగ్రహించడం ద్వారా, control చేయటం ద్వారా నీలో జరిగేటువంటి అనేక పరిణామాలని నీవు నిరోధించవచ్చు. కేవల కుంభక యోగంలో ఉన్నప్పుడు సర్వేంద్రియాలు అణగిపోయి ఉంటాయి. సర్వ కార్యకలాపాలు నెమ్మదిగా వాటి వాటి స్థాయిలో జరుపుతూనే ఉంటాయి కానీ జీవుడికి స్పృహ ఉండదు. ఆ స్పృహ లేనటువంటి ఒక స్థితి జీవుడికి కలగాలి. ఇవేళ నిద్ర పట్టడం లేదు అంటే మాత్రలున్నాయి, నిద్ర రావాలి అంటే మాత్రలున్నాయి, కదా. పట్టటం లేదుకి, రావటానికి, పోవటానికి, ఎక్కువైందికి కూడా మందులు ఉన్నాయి. చేయవలసింది మనస్సుని ఒక్క దాన్ని control చేస్తే tablets అవసరం లేదు. అయితే ఎప్పటినుంచి చేయాలి? మళ్ళీ చిన్నప్పటి నుంచే చేయాలి. క్రియా యోగలో ఇవాళ గతించిన కాలాన్ని వదిలిపెట్టండి. మన బాల్యాలు మన వరకు అదృష్టవశాత్తూ ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి. ఇవాళ బిడ్డకి ఆట లేదు, పాట లేదు, రెండూ లేవు. చిన్న చిన్న అగ్గిపెట్టెల్లో వాళ్ళు మనుషులు తయారవుతున్నారు, మరమనుషుల వలె తయారవుతున్నారు. ఆడకపోతే, ఎండలో పరిగెత్తకపోతే, కింద పడకపోతే, పైకి లేవకపోతే, శరీరానికి కాయానికి గాయం కలక్కపోతే వాడు జీవితాన్ని ఏం ఎదుర్కొంటాడు? showcase లో బొమ్మల వలె మనం పెంచుతూ, దైవానికి దూరం చేస్తూ, దైవభావన నుంచి వైదొలగింపజేస్తూ, ఇది దేవుని గురించి ఆలోచించే వయస్సు కాదు, అది అరవై ఏళ్ల తర్వాత అని మనమే చెప్తున్నప్పుడు ఈ జాతి ఎటు వెళ్ళిపోతుంది? కనుకనే సత్యసాయి భగవానుడు బాల వికాస్ ప్రారంభించిన కారణం అది. బాలుడుగా ఉండగానే వాడు వికాసమానం చెందటం మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టటంలో ఈ యోగాభ్యాసనం కూడా చేయాలి. అయితే స్వామి ప్రాణాయామాన్ని అందరికీ prescribe చేయని కారణం మాత్రం ఒకటున్నది. ప్రాణాయామం గనుక సక్రమంగా చేయగలిగామా, అదిచ్చే లాభాలు అనంతం. చేయలేకపోయినామా, నష్టాలు అనంతం. కాబట్టి సాధారణమైనటువంటి సాధకుడు ప్రాణాయామం చేయలేడు గనుక, దాని పూర్తి విషయాలు తెలియకుండా చేస్తే ప్రమాదం గనుక, "నువ్వు హాయిగా కాసేపు ధ్యానిగా ఉండు, నిత్య ప్రార్థన, ధ్యానము" అని మనకి nine code of conduct లో ఆ రెండూ చెప్పారు. ప్రార్థన మర్చిపోయాం, ధ్యానము మర్చిపోయినాం. ఆ రెండూ మినహాయించి అన్నీ చేశాం మనం, కొన్ని ఏళ్ళు చేశాం. మళ్ళీ నవసూత్ర జ్ఞాన యజ్ఞం మళ్ళీ బయటకు రావటానికి ముప్పై ఏళ్ళ సమయం పట్టింది, ముప్పై ఏళ్ళు. ఎవరికి ఆనందం కలిగింది? కలిగిందా? పోనీ ఇప్పటికైనా జరిగిందని అనుకుంటూ, ఇప్పటినుంచి మన పిల్లల్ని గనుక ఆ ధ్యానంలో ప్రవేశపెట్టగలిగినట్లయితే ఒక ఏకాగ్రత, ఒక పవిత్రత, ఒక ధారణ, ఒక స్మృతి, ఒక బలమైనటువంటి వ్యక్తిత్వము, సర్వ శాస్త్రముల యందున్నటువంటి మహా మర్మాలు అన్నీ కూడా కైవసం అయ్యేటువంటి ఒక శక్తి దాని యందు ఇమిడి ఉన్నది కాబట్టి ముందు ధ్యాని కావాలి, యోగి కావాలి, జ్ఞాని కావాలి. ఈ మూడు ఏకకాలంలో చేయటానికి నిజానికి క్రియా యోగ చేయాలి అనుకునేటువంటి వారికి అది ఉత్తమోత్తమమైనటువంటి proven technique. అది కాల పరీక్షకు నిలబడ్డది. ఇవాళ కాదు, మనువు నుంచి ఉన్నది అది. ఆదిత్యుడి దగ్గర నుంచి ఉంది. యోగశాస్త్రం ఉన్నప్పటి నుంచి ఉన్నది క్రియా యోగ. మధ్యలో కాస్త there was a lull period. అది కేవలం ఆ విషయం తెలియని వాళ్ళు-- ఎందుకంటే సంగీతం ఉంది. త్యాగరాజ స్వామి వారు పాడుతూ పాడుకుంటూ ఉండేవారు. ఆ పాడుకుంటూ ఉన్న వాటిని శిష్యులంతా రాసుకుంటూ ఉండేవారు. రాసుకుంటూ రాసుకుంటూ ఉంటే సాహిత్యం నిలబడింది. అందులో జరిగిన ప్రమాదం ఏమిటంటే త్యాగరాజ స్వామి వలె ఉదాత్త స్థాయిలో సంచారం చేయలేని వారు "అదొద్దులే" అన్నారు. మంద్రంలో పాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పాడలేని వాడు కూడా మంద్రము వద్దన్నాడు. అంటే ఉదాత్త స్థాయి లేదు, అనుదాత్త స్థాయి లేదు, పైనా లేదు, కిందా లేదు, ఏదో హాయిగా పాడుకుంటూ వెళ్లిపోయాం. కాబట్టి సంగీతము యొక్క పూర్ణత్వాన్ని, యోగము యొక్క పూర్ణత్వాన్ని, ప్రాణాయామంలో ఉన్న పూర్ణత్వాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే క్రియా యోగకు వెళ్ళాలి. వెళితే శ్యామాచరణ లాహిరీ మహరాజ్ ఎటువంటి ఉదాత్త భూమికలో ఒక యుక్తేశ్వరుడిని సృష్టించాడో, ఒక యుక్తేశ్వరుడు ఎట్లాగైతే పరమహంస యోగానందుడిని సృష్టించాడో, ఒక పరమహంస యోగానంద పాశ్చాత్య దేశాలలో భారతీయమైనటువంటి ప్రాణాయామానికి విపరీత ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చారో, కేవల భౌతిక వాదంతో నిలకడ చెందినటువంటి సమస్త దేశాలు మళ్ళీ మరొక్కసారి ఆధ్యాత్మిక మార్గంలోకి రావటానికి ఎంత దోహదపడ్డయో విచారణ చేసినప్పుడు వారు చేసినటువంటి కృషి అనుపమానమైన కృషి.అలాగే ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, యోగం కానీ ఇంకా ఏం చేస్తాయ్? అంటే నాలుగైదు విషయాలు మాత్రమే ఇవాళ ముచ్చటించుకుందాం. ఒకటి మన చెడు రక్తం మనలో చెడు రక్తం ఏర్పడుతూ ఉంటుంది. ఆ చెడు రక్తాన్ని శుద్ధి చేయగలిగినటువంటి శక్తి ఈ ప్రాణాయామానికి ఉన్నది ఒకటి. రెండవది ఎన్ని cells కణాలు పుడుతూ ఉంటాయో అన్ని కణాలు మరణిస్తూ ఉంటాయి. అందుకనే యుక్తేశ్వరులు ఒక మాట అనేవారు "నేను రోజూ మరణిస్తూనే ఉన్నాను" అని. రోజూ మరణించడమేంటి? రమణ మహర్షి అన్నారు "ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్న విరామ కాలం మృత్యువు గాక ఏమిటి? ఆలోచనతో ఉన్నావు మళ్ళీ ఆలోచన పుట్టే దాకా ఒక time and space ఏర్పడ్డది. అక్కడ నువ్వు ఉన్నావా అంటే నువ్వు లేవు. నువ్వు కానిది ఏదో ఉన్నది, నీవు కానిది ఏదో ఉన్నప్పుడు నువ్వు లేనట్లు లెక్క అది మరణం" అన్నారు. అలాగే ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనకి ఈ మరణానుభవం లేకుండా లోపల పరమాత్మ వైశ్వానరుడై ప్రాణాయామాన్ని సహజ ప్రాణాయామంగా చేయిస్తున్నాడు. ఎవరి దగ్గర ఏ fees తీసుకోకుండా అది. అందుకనే "ఎంత రుణం నీవు తీర్చుకోగలవు" అన్నారు స్వామి. పరమేశ్వరుడి రుణాన్ని నీవు ఎలా తీర్చుకోగలవు? నీ శరీరం మొత్తం లెక్క కడితే నిన్ను మించిన కోటీశ్వరుడు ఉన్నాడా అని. కిడ్నీ పది లక్షలు, గుండె ఇరవై లక్షలు, lungs నలభై లక్షలు. ఊరికే లెక్కేసుకుంటూ వెళ్దాం ఎన్ని కోట్లో! ఎప్పుడు? ఈ దేహాన్ని సక్రమంగా మనం వినియోగించినప్పుడు. మనస్సును నియంత్రించగలిగినప్పుడు. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" జ్ఞానం చదివితే రాదు. పుస్తకాల్లో నుంచి బట్టీ బడితే వచ్చే జ్ఞానం ఎక్కువ కాలం నిలపడదు. ఒక అనంతమైనటువంటి అసదృశ్య ప్రవాహం వలె బయటకు రావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఓంకార నాదానుసంధానంలో నుంచి వస్తుంది. కాబట్టి three dimensional గా క్రియాయోగాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చారు శ్యామాచరణ లాహిరి మహరాజ్. అలాగే లోపల ఉన్నటువంటి కణాలన్నీ ఎన్ని పుడుతున్నాయో అన్నీ అప్పటికప్పుడు మళ్ళీ జీవాన్ని పొందుతున్నాయి. జీవశక్తితో, ధాతు పుష్టితో పెరుగుతున్నాయి. ఇది science. వైజ్ఞానిక పరమైనటువంటి భాషలో, భావనలో క్రియాయోగాన్ని మనం విచారణ చేయవలసి వచ్చినట్లయితే మనకున్నటువంటి ఆయుష్షు ఎన్నేళ్ళు ఉన్నామని కాదు, ఉన్నంత కాలం ఏం చేశామో అని అది ప్రశ్న. డెబ్భై ఏళ్ళా, ఎనభై ఏళ్ళా, వందేళ్ళా ఏమీ చేయకుండా బతికుండి ఏం ప్రయోజనం? ఉన్నన్నాళ్ళు శంకర భగవత్పాదులు ముప్పై రెండేళ్ళు, వివేకానంద స్వామి ముప్పై తొమ్మిది సంవత్సరాలు, ఐదు నెలలు, ఇరవై నాలుగు రోజులు. "I will not see forty" అని రాసుకున్నారు ఆయన diary లో. అట్లాగే నలభై చూడకుండా దేహం వదిలిపెట్టారు. వివేకానందుడ్ని ఈ జాతి మర్చిపోలేదు. సత్యసాయి భగవానుడు అనంత కాల ప్రవాహానికి సంబంధించినటువంటి ఒక పరమాద్భుత కారుణ్యమూర్తి, అవతారమూర్తి ఆయన. ఆయన చేసిన అవనీ సంచారం ఎనభై ఆరు. పరమేశ్వరుడి కాలంలో గనక మనం గమనించినట్లయితే ఎనభై ఆరు ఒక లెక్కలోదే కాదు. మన ఇంట తాతలు వందేళ్ళు బతికారు, ఏం ప్రయోజనం? ఎనభై ఆరు సంవత్సరాలలో ఈ సర్వ ప్రకృతిని, సమస్త జాతులనీ ఏకం చేసినటువంటి పూర్ణ యోగమే సత్యసాయి యోగం. స్వామి ప్రత్యేకమైన ఏ సిద్ధాంతం చెప్పలేదు. సనాతనమైనటువంటి దానిని మళ్ళీ పునః ఎట్లాగైతే బాబాజీ వచ్చేదాకా క్రియాయోగ మరుగున పడిపోయిందో, యుక్తేశ్వరులు వచ్చేదాకా అది ఉపన్యాసానికి వివరణకి నోచుకోలేదో, పరమహంస యోగానంద వచ్చేదాకా అది క్రియాపరం కాలేదో, practical కాలేదో. ఒక్కొక్కరు ఒక్కో కారణంగా వస్తారు. అందుకనే బాబాజీని అవతార పురుషుడుగా అంటాం మనం. అలాగే యుక్తేశ్వరుడ్ని జ్ఞానావతారంగా చెప్తాం. శ్యామాచరణ లాహిరిని యోగావతారంగా చెప్తాం. అంటే ఒక యోగము అవతారమూర్తియై అవతరించినటువంటి సందర్భం. ఇదంతా చూడండి భారతదేశంలోనే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. ఇది ఎటువంటి భారతదేశం అని విచారణ చేసినప్పుడు ఏమో వారంతా గొప్పవారే, మహాత్ములే. వారు నడిచిన ఈ నేల మీద మనం కూడా పుట్టాం. వారు విన్న మాటలు, వినిపించిన మాటలే మనం వింటూ వింటూ, అంటూ అంటూ మనము మన జీవితాలను గడుపుతూ ఉన్నాం. శ్యామాచరణ లాహిరి ఒక యోగావతారం. ఎవరినించి ఆయన ప్రచారాన్ని కోరలేదు, ప్రచారం వద్దన్నాడు ఆయన. అలాగే మానసికమైనటువంటి ఏ రుగ్మతకి, ఏ వివాదానికి ఆయన తావివ్వలేదు. త్రైలింగ స్వామి దర్శనం తర్వాత మాత్రం ఒక్క మాట అన్నారు. "క్రియాయోగముల వలన ఎవరైనా రెండు వందల ఎనభై ఏళ్ళు బతుకుతారు" అని నాబోటి వాడు చెప్తే దానికి సజీవ ఉదాహరణ త్రైలింగ స్వామి, అందుకని వారి దర్శనం చేసుకున్నాను అన్నారు. త్రైలింగ స్వామిని గనక అడిగితే ఆయన ఏమన్నారంటే "క్రియాయోగ అంటే ఏమిటో నాకు తెలియదు. జరుగుతున్నదంతా క్రియాయోగాయే కదా!" ప్రకృతి సృష్టించబడటం, ప్రకృతి ఉండటం, ఋతువు వెంట ఋతువు మారటం, మనం కూడా తల్లి గర్భంలో చిన్న అండంగా, పిండంగా ఉన్న మనం కరచరణాది అవయవాలని సంతరించుకొని ప్రపంచంలోకి వచ్చి బాల్య, కౌమార, యవ్వన, మధ్య స్థితులన్నీ దాటి అనేకమైనటువంటి ఉదాత్త వైఖరులను అనుభవిస్తూ పరమాత్మ సాంగత్యాన్ని అనునిత్యము అనుభవించేటువంటి ఈ జీవితం కూడా యోగ భూమిక కాదా? అని మనం ప్రశ్నించుకోవాలి. ఎరిగి జీవిస్తే అది యోగ భూమిక, ఎరగక జీవిస్తే అది కేవల వినియోగ భూమిక.It is spent It is expended అంతే expend కావటం కాదు మనం చేసినా చేయకపోయినా కాలం చెల్లిపోతుంది. ఓ సాయంకాలమా! ఓ రాత్రి! ఈరోజుకు ఆగు అంటే ఆగుతుందా? బళ్ళును తెలవరుతుంది. మన జీవిత పుటలో నుంచి ఓ page వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి మనకు ఏదన్నా సంబంధం ఉన్నదా? ఏమీ లేదు. ఇవాళ వారు ఇది చేశారు, అది చేశారు అని పది మాటలు అంటే అవన్నీ జరిగినవి. జరుగుతున్నది ఏమిటి అన్నది విచారణ. ఈ జరుగుతున్న దాన్ని నియంత్రించుకోవటానికి, నియమం చేసుకోవటానికి, భద్రం చేసుకోవటానికి జీవుడు ఒక ఉదాత్త పురుషుడు వలే ఉండాలి. కనుకనే ఉత్తమ గురువులకు శిష్యులం కావాలి, ఉత్తమ శిష్యులకి గురువులం కావాలి. ఇది మానవ జీవితం. మన అదృష్టం చూడండి, ఏ సర్వదేవతా అతీత స్వరూపమని సర్వ ప్రపంచము ఎనభై ఆరు సంవత్సరాలు ఘోషించిందో, అంగీకరించిందో, సత్యానుభవాన్ని సొంతం చేసుకున్నదో అటువంటి పరమోత్కృష్టమైన గురువులు లేని గురువు సత్య సాయి భగవానుడు మనకి గురువైనాడు. ఎంత అదృష్టం చూడండి. రాముడికి గురువులున్నారు ఇద్దరు లోక గురువు విశ్వామిత్రుడు, జ్ఞాన గురువు వశిష్టుడు. కృష్ణుడికి గురువున్నాడు సాందీపుడు. సత్య సాయి భగవానుడికి గురువే లేడు. అటువంటి గురువుణాం గురువు జగద్గురువు మనబోటి సాధకులకు గురువు కావటం, ఆ గురువుగా పొందటం, ఏ రకమైనటువంటి భేషజం లేకుండా ఇవాళ మనం స్వామి మాటలు తలచుకుంటున్నాం, శ్యామాచారులను గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. వారికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇస్తున్నాం. వారి నుంచి నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం సత్య సాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఒక మాట గుర్తొస్తుంది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు. "నాలో అందరినీ చూడు, అందరిలో నన్ను చూడు" ఇంకేముంది తేడా? ఉన్నది ఒకటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఒకటి. అసలు ఏకమే అనేకం అవుతున్నది. ఆ అనేకంగా ఉన్నదంతా సహస్ర శీర్షా పురుషః. వేయి పాదాలు, వేయి కళ్ళు, వేయి కాళ్ళు అంటే అవన్నీ ఎవరివి? పరమేశ్వరుడివి. పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తితో ఏర్పడినటువంటి మానవ దేహం కూడా తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళేట్లుగా విద్యాభ్యాసనం చేయాలి. శ్రీ కృష్ణ పరమాత్మ ఆదేశించినట్లుగా యోగులం కావాలి. అంటే గడ్డాలు, మీసాలు పెంచుకోవటం కాదు. యోగులం కావటం అంటే పరమేశ్వరుడితో కూడి ఉండాలి. జీవ ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ ఒకటి కావాలి. దైవ ప్రజ్ఞ మెండుగా ఈ ప్రపంచంలో ఉన్నా ప్రయోజనం లేదు. జీవ ప్రజ్ఞ మెండుగా ఉండి దైవ ప్రజ్ఞ గనక అక్కరకు రాకపోతే జీవ ప్రజ్ఞ వృధా అయిపోతుంది. రెండూ జమిలిగా సాగాలి, సమన్వయంగా సాగాలి, సంయుక్తంగా సాగాలి, సాలోక్య సామీప్యాలుగా సాగాలి, అది నిత్య సాన్నిధ్యంగా ఏర్పడాలి. ఇటువంటి పరమోదారమైనటువంటి క్రియా యోగ ప్రపంచానికి అందించారు. అలాగే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్దీకరించేటువంటి ఊపిరితిత్తులు రెండు ఏవైతే ఉన్నాయో, అవి ఇవాళ వాతావరణ కాలుష్యంతో కుచించుకు పోతున్నాయి. కొన్నాళ్ళు గుండె జబ్బులు, ఆపై కిడ్నీ జబ్బులు, ఇప్పుడు ఊపిరితిత్తుల జబ్బులు వచ్చేసినాయి. రాబోయే కాలంలో ప్రతి వాడు కూడా lung cancer కి గురి కాబోతున్నాడు. ఎందుకనంటే వాతావరణాన్ని, ప్రకృతిని మనం use చేయటం లేదు. misuse చేస్తున్నాం, చేస్తే చేశాం కొంత, ఎంత చేయగలం. కానీ abuse చేస్తున్నాం. కనుక ప్రకృతిలో ఉన్న చెట్లు కాలుస్తున్నాం. మనుషుల మధ్య మానవ సంబంధాలు నెమ్మదిగా సన్నగిల్లిపోయినాయి. మనిషి తన నీడను తానే నమ్మలేని ఒక దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇక భగవంతుణ్ణి ఎప్పుడు నమ్ముతాడు? ఆయన ఎన్ని ప్రదర్శనలు చేయని, ఎన్ని మహిమలు చేయని, ఎన్ని ఉదాత్తమైన మహా వాక్యాలు చెప్పని, ఎంతమందికి తమ ప్రజ్ఞని అనుగ్రహించి అనేకమైన విషయాలు చెప్పించని, చెప్పని. మానవుడు తనను తాను ఎరిగేటువంటి ఆ ప్రయత్నంలో మనస్సుని గనక నియంత్రించుకోకపోతే, శుద్ధి చేసుకోకపోయినట్లయితే, ఆ మనస్సుని బ్రహ్మము నందు నిలబెట్టకపోయినట్లయితే, అందుకనే శంకరాచార్యుల వారు, మిగతా వారు ఏ వ్యాఖ్యానం చేసినా ధ్యానాన్ని గురించి స్వామి ఒక్క మాటలో చెప్పారు. ఏమిటి ధ్యానము అంటే బ్రహ్మైక్య భావనే ధ్యానము అన్నారు. ఇది ఆ మాట వింటున్నప్పుడల్లా కొన్ని వేల గ్రంథాల సారాన్ని రెండు పదాలలో ఇమిడ్చటం ఒక్క స్వామికే చెల్లింది. బ్రహ్మైక్య భావనే ధ్యానం. దాని వెనుక చాలా తాత్విక చింతన ఉంది. లోతెరిగిన వాడికి అది పరమ అన్నం, పాయసం అది. లోతరగని వాడికి అది సూచిక. ఎరిగి ఎరగని వాడికి హెచ్చరిక. సాధనలో పరమ చరమ స్థాయికి వెళ్ళిన వాడికి అది ఒక పరమాద్భుతమైనటువంటి దివ్య ఔషధం, ఆంతరంగికంగా. కాబట్టి యోగ ప్రవాహంలో అనేకానేక యోగ భూమికలకి మూలమైనటువంటి కేవల కుంభక యోగాన్ని క్రియా యోగ ద్వారా సాధించవచ్చునని, సాధించుకోవాలని, ప్రాణాయామ సిద్ధి ద్వారా ధ్యాని కావాలని, జ్ఞాని కావాలని, యోగి కావాలని, ఈ ప్రపంచానికి ఎలుగెత్తి తమ దివ్య జీవన విధానం ద్వారా చాటినటువంటి శ్యామాచరణులు యోగ అవతారం అది, యోగావతారం. కృష్ణావతారం లీలా అవతారం. అతిమానుష అవతారం అది. రామావతారం పూర్ణ మానుషావతారం. మనిషిగా ఉన్నారాయన.సత్యసాయి భగవానుడు లీలా మానుష మాయా అవతారం. లీల ఉంది, మాయ ఉంది, మానుషము ఉంది, అతిమానుషము ఉంది. మనం కనిపించగానే ఎట్లా ఉన్నావ్ అని పలకరించే ప్రాథమిక స్థాయి ఉంది. ఏం కావాలి అని అడిగేటువంటి ఒక కరుణ ఉన్నది. మనల్ని సంస్కరించేటువంటి ఒక దివ్య విధానం correction ఉంది. శిక్ష ఉంది, శిక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది ఒక సమగ్రమైనటువంటి భూమిక. అందుకనే స్వామి ప్రాణాయామం కంటే ధ్యానిగా ఉండు ప్రస్తుతానికి అని చెప్పారు. ప్రాణాయామం చేయగలిగిన వాడిని చేయమన్నారు, చేయలేని వాడికి దాన్ని ఆయన prescribe చేయలేదు నిర్ద్వంద్వంగా. దాని జోలికి వెళ్లొద్దన్నారు. కానీ ప్రపంచము, సృష్టి అన్నింటికంటే మన మూలాలు తెలుసుకోవాలి అంటే, నిజంగా అధ్యాత్మ సాధనలో పూర్ణ స్థితికి వెళ్ళాలి అంటే క్రియాయోగ చాలా మంచిది. దానిలో అనేకం ఉన్నాయి సుదర్శన క్రియాన్ని, మరో క్రియాన్ని ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ చిన్న, చిన్న లాభాలు ఇస్తాయి, చాలా చిన్న లాభాలు. స్వామి చెప్పినటువంటి సేవా యోగం అపరిమిత ఆనందాన్నిస్తుంది. సేవలో అహంకారం, మమకారాలు శిథిలమైపోతాయి. నాకు కావాలి అన్న భావన నుంచి అందరికీ చెందాలి అన్న భావన పెరుగుతుంది. అందరినీ సమంగా చూడగలిగినటువంటి ఒక భావన మనయందు ఏర్పడుతుంది. మనకు ఉన్నదాంట్లోనే మన పరిమితికి లోబడే, మన శక్తికి లోబడే ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగిన ఒక ఔదార్యాన్ని పెంపొందిస్తుంది. శారీరక శ్రమ సేవలో ఉంది. స్వామి మాట చెప్పారా క్రియాయోగ అంటే సేవ అని చెప్పలేదే. సేవలో క్రియాయోగ ఉంది. మనో నియంత్రణ ఉన్నది. sudden గా పిలుస్తారు సేవకురమ్మని అంటారు. లేదా ఎక్కడో ఉపన్యాసం మీరు కాసేపు మాట్లాడాలి అంటారు. ఇంట్లోనో ఇంకోటో ఏదో ఒక పని ఉంటుంది, ఉండనే ఉంటుంది అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఒక చిన్న ఘర్షణ ఒక నిమిషం ఏర్పడుతుంది. అటా ఇటా. అటైనామా గెలిచినట్లు, ఇటైనామా ఓడిపోయినట్లు. పరమాత్మ అనుగ్రహం ఉంటే అటే వెళుతూ ఉంటాం. అంటే దైవ కార్యకలాపాలలోనే మన సమయం అంతా గడిచిపోతుంది. అది శారీరక, మానసికమైనటువంటి ఒక నిత్య కృషి, శ్రమ ఉంది. ఎప్పుడైతే సత్సంగులతో నీవు నిరంతరము కూడి ఉంటావో, నీ ఆలోచనలు కూడా పవిత్రీకరణం చెందుతాయి. అయ్యా వినే మాకు చాలా లాభం ఉంది, అనే వాడికి ఏమన్నా లాభం ఉందా అని ఓ ప్రశ్న వేశారు. అనే వాడి లాభాలేమిటో చెప్పండి మేము కూడా కాసేపు అనటం మొదలు పెడతాం అని. ఇంతకంటే లాభం ఉంటే ఏదన్నా అని. వినే వాడికి లాభం ఏమిటంటే తనను తాను సరిదిద్దుకోగలుగుతాడు. అనే వాడికి ఒక్కటే లాభం. తాను తన ప్రాణాన్ని ఈ శరీరం నుంచి వదిలిపెట్టేటువంటి ఒక మధుర క్షణంలో, ఎక్కడో నాలుగు ఎకరాల్లో ఒక చిన్న పాదులో, గుమ్మడి పాదు పెట్టాడు ఒకడు. ఆ తీగ మూడు ఎకరాలు పాకింది. ఎక్కడో అది ఒక పిందె అయింది, కాయ అయింది, పూర్ణంగా పండింది. తన మూలమైనటువంటి విత్తనానికి కానీ, రైతుకు కానీ చెప్పటం లేదు అది. ఆ తొడిమె నుంచి, తీగ నుంచి చెప్పి పెట్టకుండా, ఎవ్వరికీ చెప్పకుండా నిష్క్రమిస్తున్నది. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం. ఈ రెండింటినీ అనే వాడికి అనుగ్రహిస్తాడు పరమాత్మ. ఆ అనే వాడు నిస్వార్థంగా ఉండాలి. ఇందాక అనుకున్నాం. నిస్వార్థం ఉండాలి, బ్రహ్మైక్య భావన ఉండాలి, నేను బ్రహ్మమును అన్న ఎరుకలో ఉండాలి, యోగాన్ని కేవలం రోగం పోగొట్టుకునే దిశగా కాక భవరోగాన్ని పోగొట్టుకునే దిశగా దాన్ని మార్చుకోవాలి, ఓంకార నాదం చేయాలి, ప్రణవ శబ్దాన్ని ఉచ్చరించాలి నిస్తంద్ర మంద్రంగా. ఆ ప్రణవ శబ్దంలో నుంచి అగ్ని, చంద్ర, ఉమా బీజాల ద్వారా పూర్ణ ప్రాణశక్తిని కైవసం చేసుకోవాలి, నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవాలి, నాద శ్రవణం చేయాలి, నాదానుసంధానం చేయాలి, అనాహత నాదంగా మిగలాలి, పూర్ణ నాదంతో సాయుజ్యం చెందాలి. ఇది శ్యామాచరణులు స్థూలంగా ఏది తమకంటే ముందు ఉన్నదో దానినంతా పరిష్కారం చేసి, ఈ మూడు మాటలు మూడు సోపానాలుగా పేర్చి ఇంతవరకు చేసుకోండి అని చెప్పటానికి వచ్చినటువంటి యోగావతారిణి ఈరోజు మనం చక్కగా స్మరించుకున్నాం, స్మరించుకోవాలి. అట్లాగే యోగం కూడా అనేకమైనటువంటి dynamics లో ఉంటుంది, అనేక dimensions లో ఉంటుంది. ప్రతిదానినీ చేయాలా? అత్యుత్తమమైన దాన్ని చేస్తే మిగతావి చేయక్కర్లే. మరి సత్యసాయి భగవానుడితో కూడి ఉన్న మన బోటి వాళ్ళు ఏ యోగాన్ని చేయాలి? ఇది ప్రశ్నే. స్వామితో స్వామిని దైవంగా భావించి, మహా చిచ్ఛక్తి స్వరూపంగా నిజంగా భావన చేసి, ఆయన కేవలం మానవ మాత్రుడు కాదు అని నమ్మినటువంటి వాడికి మాత్రము ఈ సహజ సిద్ధులన్నీ ఏర్పడతాయి. శ్యామాచరణ లాహిరి మరొక్క ప్రమాణం చేశారు. క్రియాయోగం ద్వారా ఏమవుతుంది అంటే సకల శాస్త్రాల సారము నీకు నీ యందు ప్రవహిస్తూ ఉంటుంది అది. నువ్వేం ప్రయత్నమే చేయక్కర్లే. చదువులన్నీ అయిపోయినయా, కాలేదా కాదు, అవి అవుతూ అవుతూ ఉన్నట్లుగా కనిపించినా అవి ఎప్పుడో అయిపోయినట్లుగానే నీకు భావన కలుగుతుంది. ఇద్దరినీ ఉదాహరణ తీసుకోవాలి. రమణ మహర్షికి పెరియపురాణం ఇచ్చారు ఒకాయన, మన బోటి భక్తుడు. ఆయన మీద దయతలచి పెరియపురాణం పుస్తకాన్ని తీసుకెళ్ళి, అయ్యా మీరు ఇప్పటికే చాలా పేరు తెచ్చుకున్నారు, మీ దగ్గరికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, ఏవేవో ప్రశ్నలు వేస్తుంటారు, జవాబు చెప్పాలి కదా.నా దృష్టిలో మీరు ఏం పెద్దగా చదువుకున్నట్లు అనిపించటం లేదు. మీకు ఈ పుస్తకాలతో పరిచయం లేదు కదా. కనీసం ఈ పెరియపురాణం చదువుకోండి మీకు కొన్ని లాభాలు కలుగుతాయి అని ఇచ్చాడు ఈ భక్తుడు. ఆయన సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కాబట్టి అమిత వినయంతో ఆ పుస్తకాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి page నుంచి చివరి page వరకు అట్లా browse చేశారు. చేసి పరమ ప్రశాంతంగా ఆ పుస్తకం వైపు చూస్తూనే, ఇదంతా ఎప్పుడో చదివినట్లుగానే ఉన్నదే అంటూ మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు. అది. అంటే భగవాన్ కి పెరియపురాణం అక్కర్లా. సత్యసాయి భగవానుడు రామాయణం చదవక్కర్లా. సాక్షాత్తు ఆయనే రాముడు. కనుకనే రామకథారస వాహిని రాశారు. వాల్మీకిలో లేని అనేకానేక విషయాలను స్పృశించారు స్వామి. ఇది లోకానికి తెలియదు. స్వామి అనగానే మహత్తులు చేసిన వ్యక్తిగా మాత్రమే అర్థమైనటువంటి సందర్భంలో స్వామి భారతీయ వాంగ్మయానికి సనాతన వేద విజ్ఞానానికి స్వామి వేసిన పెద్ద పీట మామూలు పీట కాదు. సమస్త జాతులు కూడా అర్థం చేసుకునేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి హైందవ ధర్మాన్ని సమస్త మతాల్లోకి ప్రవాహ వేగంతో తీసుకొని వెళ్లారు. అలాగే వివేకానంద స్వామి అమెరికాలో ఉండగా ఆయనకు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకి పరీక్షలే ఉన్నాయి tenth class, intermediate, degree ఆ తర్వాత post graduation తర్వాత అంతా మనమే మిగతా వాళ్ళందరికీ పరీక్షలు పెడతాం అంతే కదా. భగవంతుడికి నిత్య పరీక్షే మనం కాకపోతే ఇంకొకడు. అడిగేవాడు ఎప్పుడూ ఉండనే ఉంటాడు ఆయన్ని అదే అడిగారు వివేకానంద స్వామిని. మీకు ధారణా శక్తి అపారం అని అందరూ అంటున్నారు కదా! మీకు ఈ పుస్తకం చేతికి ఇస్తాను తర్వాత నేను అడుగుతాను మీరు చెప్పాలి అన్నారు. పుస్తకం ఇచ్చారు చేతికి. ఇందాకట్లానే చూశారు వెనక్కి ఇచ్చారు. ఏదో నూట నలభై నాలుగో page లో రెండో పేరా లో మూడో లైన్ లో ఏముందో చెప్పమని అడిగాడు. యధాతథంగా చెప్పారు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది అంటే యోగత్వంలో నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనం పరమేశ్వరుడితో కూడి ఉంటామో సర్వ శాస్త్రాలు మన వెనుక పరిగెత్తుకొని వస్తాయి. ఇది సత్యం. ఈ జన్మలో మనం ఏం చదవక్కర్లా. అవి ఎట్లా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అంటే పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఏర్పడతాయి. దానికి వేరే answer ఏం ఉండదు. కాబట్టి సత్య సాయి ఈశ్వరుడితో కూడి ఉన్నటువంటి మనం స్వామి చెప్పిన ప్రేమ యోగాన్ని, సేవా యోగాన్ని నిత్య నైమిత్తికం చేసుకోవాలి. ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ కూడా academic గా నేర్చుకుంటే మంచిదే. ఒకవేళ నేర్చుకోకపోయినా నష్టం ఏమీ లేదు గాని లాభం మాత్రం కొంత ఉంటుంది. కాబట్టి యోగావతార్ అయినటువంటి శ్యామాచరణ లాహిరి దివ్య మహా స్మృతికి పరిపూర్ణమైనటువంటి అంజలి ఘటిస్తూ, వారు గనక లేకపోయినట్లయితే ఇవాళ పాశ్చాత్య దేశాలు అతలాకుతలం అయిపోయి ఉండేవి. కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, భోగ స్థితులు మానవుణ్ణి పతనం అంచుకు తీసుకు వెళుతున్నటువంటి వేళ పరమహంస యోగానంద అమెరికా దేశం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ యోగ స్థితులను పరిచయం చేసి యోగాభ్యాసనంలో నుంచి వచ్చే అనేక లాభాలను వాళ్ళకి విశద పరచి అనేకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా demo lectures ద్వారా భారతీయమైనటువంటి, ఆర్షమైనటువంటి, ఋషి ప్రోక్తమైనటువంటి సత్యాల అన్నింటినీ కూడా బహుళ ప్రచారంలోకి తీసుకుని వచ్చి సనాతనమైన సాంప్రదాయానికి పెద్ద పీట వేసి ఒక జాతి జాతిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి యోగ గురువు శ్యామాచరణ లాహిరి. మిగతా వారి సంగతి ఎట్లా ఉన్నా చెప్పీ చెప్పక చెప్తున్నట్లే అంతా చెప్తూ ఏమీ చెప్పనట్లుగా అన్నీ చెప్తూ సర్వ దేశాలలో ఉన్నటువంటి మానవాళిని కూడా పరమేశ్వరుడి శక్తి యందు నమ్మకం కలిగేట్లుగా పరమేశ్వరుడి యొక్క ఉరికే ఈ ప్రపంచం యొక్క అస్తిత్వం అని చాటినటువంటి సర్వ దేవతా అతీత స్వరూపమైనటువంటి సత్య సాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయి రామ్.
SSSMC · audio
Yoga Pravaham - 06
Yoga Pravaham - 06
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 41:28
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
- 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
Now playing - 26 min 7
Yoga Pravaham - 07
- 42 min 8
Yoga Pravaham - 08
- 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
- 40 min 12
Yoga Pravaham - 12
- 19 min 13
Yoga Pravaham - 13
- 28 min 14
Yoga Pravaham - 14
- 21 min 15
Yoga Pravaham - 15