Skip to content
Transcript తెలుగు
అలాగే అరవిందుల వారి గురించి మనం తొలి పరిచయ వాక్యాలలో "All life is yoga" అని మనం అనుకున్నాం. "All life is yoga", "All yogas are life" అందుకని integrated yoga అని ఒక దాన్ని ప్రతిపాదన చేశారు. యోగాలు కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. మనం కూడా పిల్లలకు మూడు కాగితాలు ఇస్తాం. కర్మయోగం గొప్పదా, భక్తియోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా ఎలక్షన్ competition పెట్టి ప్రైజ్ లు ఇచ్చేస్తాం. తీరా తీసుకెళ్ళి స్వామి ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తాం పిల్లలకి, అన్యాయం. ఎందుకంటే పిల్లలకు ముందే కర్మయోగం వేరని కర్మయోగం కంటే ఇంకో యోగం గొప్పదని మనమే విభజించి చూపిస్తున్నాం. కర్మ, భక్తి, జ్ఞాన యోగములు మూడు కూడా త్రివేణి సంగమం అది. అందుకనే అది యోగ త్రివేణి. యోగ త్రయీ అన్నారు. త్రయీ అంటే వేదం. వేదాలు నిజానికి మూడే, నాలుగవది అథర్వణ వేదం. వేదత్రయీ, శ్వాసత్రయీ, లోకత్రయీ, అవస్థాత్రయీ, గుణత్రయాత్రయీ, ఇవన్నీ కూడా ఏమిటి? మూడే. మూడును మించి ఏం లేదు fourth dimension. The fourth dimension ఇది కర్త. మూడు dimensions మన దగ్గర ఉన్నాయి physical level. ఫలానా వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడని బొమ్మ చూపిస్తాం, వాడి photo చూపిస్తాం. physical level అయిపోయింది. ఇంతకీ ఆయన mental quotient ఏమిటి? ఆయన బ్రహ్మాండమైన books రాశాడు. ఆయన CD లు తయారు చేశాడు. ఆయన అవి చేయిపిస్తాడు, అవి చేశాడు. అంటే తాను చేస్తున్నటువంటి work ఏదైతే ఉన్నదో అది అతను ఇందాక చెప్పినటువంటి mental character, internal character కి రచనలు అద్దం పడతాయి. external character లో ఏం లేదు. బయటకు కనిపించేది ఎంత? just two percent. లోపల గనక internal character లేకపోతే వాడు రామాయణం చదవడు అసలు ముందు, రాయటం సంగతి తర్వాత. రాముడు గురించి ఆలోచించడు. రాముడి గురించి ఆలోచిస్తున్నది, కనిపిస్తున్న స్థూల దేహం కాదు. లోక లోకాంతర ప్రాణాలలో ఉన్న అసలు నేను చూడమంటున్నది, అది చదవమంటున్నది. చదివిన దాన్ని analyze చేసుకున్నది, అర్థం చేసుకున్నది, అభివ్యక్తి చేసింది, రాసింది అన్నది that is internal character. మహా గాయకుడు పాట పాడుతూ ఉంటాడు. పాడుతున్నది వ్యక్తే, పైకి కనిపిస్తున్నాడు that is an external ప్రజ్ఞ, external character. ఫలానా గాయకుడు ఎలా ఉంటాడో గుర్తు పట్టాలంటే చెప్పి వర్ణించి చెప్తాం. పాటను ఎలా పాడతాడో వర్ణించండి అంటే వర్ణించలేం. బాగుందో, బాగా లేదో చెప్పగలం. అతని సంచారం మన సంచారం కాదు. కానీ యోగ స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క సంచారం ఎట్లా ఉంటుందంటే, వింటున్న వాడు అంటున్న వాడు ఒక్కటైపోవాలి. అది ఒక ఉత్తమమైన సత్సంగానికి గుర్తు. అంటున్న వాడిది దారి ఒకటే, వింటున్న వాడిది దారి రెండోది అయితే సమన్వయం లేదు, యోగత్వం లేదు. యోగత్వం ఎక్క-- అంటే కూడిక, కలయిక, union, unionism, communion. మాటలన్నీ ఎక్కడున్నాయి అంటే, అనబడుతున్న వినబడుతున్న రెండు ఒకటి కావటం. అది కావాలి, అది యోగం. చెప్పిస్తున్న వాడు, చెప్తున్న వాడు ఒకటి కావాలి, అది యోగం. జరుగుతున్నది, జరగబోతున్నది ఏకం కావాలి, అది యోగం. కాబట్టి యోగము అంటే స్థూలార్థంలో కలయిక మాత్రమే కాదు. కలయికకి కాలం ఉంది, కార్యం ఉంది, కారణం ఉంది, కర్తవ్యం ఉంది, నిమిత్తం ఉన్నది, ప్రయోజనం ఉన్నది, దానికో ప్రకాశం ఉన్నది, దానికొక భాతి అంటే వెలుగు ఉన్నది. ఇవేవీ లేకుండా యోగ భూమికలోకి మనం వెళ్ళలేం. యోగత్వాన్ని సిద్ధించుకోవటానికి అరవిందుల వారి యొక్క సాధనా క్రమంలో ఏర్పడినటువంటిదే ఆయన internal character సావిత్రి అది. mental character, mental potentiality ఏదైతే ఉన్నదో అది మామూలు స్థితులైన కవిత్వాన్ని, ఒక భావాన్ని, ఒక ఊహని, ఊహాత్మకమైన ఒక చిత్రాన్ని దాటి ఆంతరంగికంగా ఒక దర్శనాన్ని అనుభవించినప్పుడు ఏర్పడిందే సావిత్రి మహాకావ్యం కాబట్టి అరవిందుల వారు అనంగానే సావిత్రి అదొక్కటే గుర్తొస్తుంది. But commentary on Vedas తక్కువదేం కాదు. అట్లాగే integrated yoga కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడింటిని integrate చేయమన్నారు. అలాగే భగవద్గీత మీద ప్రతి వాడు వ్యాఖ్యానం చేయాలనే ఆతృత పడతాడు. తెలిసిన వాడు ఆతృత పడతాడు, తెలియని వాడు కూడా ఆతృత పడుతూ ఉంటాడు. భగవద్గీత మీద కాసేపు మాట్లాడితే మనకన్నీ వచ్చాయని లోకం అనుకుంటుంది అని, కదా. భగవద్గీత మీద ఒక స్థితికి వెళ్ళిన వాడే వ్యాఖ్యానం చేయాలి. ఎందుకనంటే ఒక శ్లోకం చదివి కిందకు రాగానే మొదటి శ్లోకాన్ని ఖండించినట్టుగా ఉంటుంది అది. ఖండించటంలే, తత్వ విచారణలోకి నీ మనస్సుని ప్రవేశ పెడుతున్నది. నెమ్మది నెమ్మదిగా అంతకు ముందు జరిగిపోయినా, విన్నా, చదివినా retain చేసుకున్నటువంటి శ్లోకానికి ఉన్న అర్థం ఏదైతే ఉన్నదో దానిని ఇంకా manifold చేస్తున్నది, multi dimensions లో చూపిస్తున్నది. కాబట్టి కర్మలు చెయ్యి అంటాడు, వెంటనే చెయ్యొద్దు అంటాడు, నువ్వెవడివి చేసేది అంటాడు. ఏదో సూటిగా చెప్పవే, చెయ్యమంటావా, వద్దా అంటే చెప్పడు. చెయ్యొద్దు అంటాడు, చెయ్యాలి అంటాడు. అందుకనే భగవద్గీతని నేను మొన్న బెంగుళూరులో మన స్వామి పిల్లలందరితో మాట్లాడినప్పుడు ఒక్కమాట చెప్పాను. వెళ్లి వేయండి, నోట పట్టండి. ప్రతి వ్యాఖ్యానం చదవకండి. భగవద్గీతను చదవాలి అంటే text గా మాత్రం చదవకండి context గా చదవండి. చాలా important. సందర్భాన్ని బట్టి అదే శ్లోకం మనకో అర్థాన్నిస్తుంది. సందర్భం మారగానే దాని అర్థం కూడా మారిపోతుంది.ఈ సమయానికి నాకు ఏది కావాలో అర్ధాన్ని ఇవ్వగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి భూమిక భగవద్గీత గనుక అరవిందుల వారు కూడా భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు. The commentary on భగవద్గీత చదవండి కొన్ని కొత్త కోణాలు తెలుస్తాయి ఆలోచనలు కొన్ని trigger అవుతాయి అవి వైయక్తికం-వ్యక్తిగతం అవునా కాదా అది ఆయన తపస్సా? ఆయన perception ఆ? ఆయన interpretation ఆ? ఏమో కొన్ని చోట్ల మన ఆలోచనలు ఆయన ఆలోచనలు కలుస్తూ ఉంటాయి చాలు. మన confirmation కోసం చదవాలి మనం ఒక తీరుతెన్నులలో విచారణ చేస్తున్నప్పుడు యోగాత్మగా యోగ భూమికలో ఉన్నప్పుడు వారు రాసిన works ఎందుకని చెప్తున్నాను అంటే ఆయన మిగతా వారిలాగా క్రియాయోగ, సుదర్శన యోగ ఇవి చెప్పలే. ఆయన జీవితం ఎంత భిన్నభిన్న స్థాయిలలో జరుగుతూ జరుగుతూ వెళుతూ ఆయన ప్రమేయం ఏమీ లేకుండానే ఆఘాత సదృశ్యంగా సాగి రామాయణంలో రాముడి కథ వలెనే సాగి చివరికి పరమోన్నతమైనటువంటి యోగ భూమికలోకి ఆయన వెళ్లారు అది. అందువలన ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇదిగో ఇందాక అనుకున్నాం పదేళ్లు ప్రపంచం నుంచి ఆయన వైదొలిగారు. ఏకాకిగా ఉన్నారు. ఏకాకిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? ఏకాకిగా ఉండటంలో అలాగే ఉన్నారు ఏకాత్మగా ఉన్నారు. జ్ఞానిగా ఉన్నారా? యోగిగా ఉన్నారా? తమ జీవితాన్ని తాము సరిదిద్దుకున్నారా? ఆలోచనా విధానాలలో ఏర్పడుతున్న మార్పులను సమన్వయం చేసుకున్నారా? నవీన భావాలతో ఉన్నారా? పాతదాన్నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారా? ఏం చేశారు అంటే చివరకు కడగా తేలింది ఏమిటంటే internal character ని కూడా ఆయన సమసింపజేసుకున్నారు. దర్శనాలు ఇవ్వటం ఆపేశారు. "నా దర్శనంతో మీకు ఒరిగే లాభం ఏం లేదు" అన్నారు చూశారా? రండి కావాలంటే చూడండి చూసి వెళుతూ ఉండండి కానీ మిమ్మల్ని మీరు దర్శనం చేసుకోవటం మొదలు పెట్టండి. ఎంత అద్భుతమైన మాట! కనుకనే వాళ్ళు యోగులు అవుతారు. చాలా రోజులైంది కనపడి మా ఇంటికి రండి అంటాం. ఊరికే వ్యవహార నిమిత్తం పిలుస్తాం. శ్రీపాద పినాకపాణి గారిని మీరు విని ఉంటారు. కర్నూలులో medical college లో work చేశారు ఆయన గొప్ప doctor ఆయన. సంగీత ప్రపంచంలో ఆధునిక కర్ణాటక సంగీతంలో దిగ్గంతులైనటువంటి వాళ్ళకి ఆయన గురువుగారు శ్రీపాద పినాకపాణి గారు. ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యం ఏమిటంటే సత్యసాయి భగవానుడి అవతార ప్రకటన జరిగిన తొలి నాళ్లలో పినాకపాణి గారు మూడు సంవత్సరాలు స్వామి దగ్గర ఉన్నారు. ఎక్కువ సింహభాగం ఆయన దగ్గర గడిపారు. శ్రీపాద పినాకపాణి గారు వైద్యులు కదా స్వామితో ఏం పని అని. స్వామితో ఆయన సంగీత చర్చ చేశారు. సంగీత చర్చలో స్వామి అనేక విషయాలు ఆయనకు బోధించారు. పినాకపాణి గారు అనుకున్నారు కర్నూలును, పుట్టపర్తి చాలా దగ్గిర ఇట్లా ఇంకా చాలా పెద్ద జీవితం ఉంది జీవితాంతం స్వామితోనే ఉండి పోగలను అనుకున్నారు. మూడేళ్ళలో ఎంతో జరిగింది. స్వామి ఒకరోజున పిలిచి, "పినాకపాణి! ఇకపై నువ్వు నేను కలుసుకోవటం లేదు. ఇక ఇంతటితో ఇది అయిపోయింది" అన్నారు. ఆశ్చర్యపోయినాడు. "ఎలా చెప్పగలరు స్వామి? మీరా చిన్నవారు వయసులో. నేనుంటాను, మీరుంటారు మనం కలుసుకుంటూ ఉంటాం. సంగీతాన్ని గురించి మీరు నాకు ఇంకా చాలా నేర్పాలి. నేను మిమ్మల్ని ఎలా వదిలిపెట్టగలను?" అని మామూలు ధోరణిలో కాసేపు ఆశ్చర్యపడ్డాడు. కానీ సత్యం ఏమిటంటే స్వామి మాట అన్న తర్వాత పినాకపాణి గారికి స్వామి దర్శనమే దొరకలే. ఆయన వెళ్ళలేకపోయినారు పుట్టపర్తి. ఇది యోగాత్మలో ఉన్నటువంటి వాడు ఒక్కొక్క కార్యకలాపాన్ని ఎంతవరకు చెయ్యాలో చేసి దాన్ని వదిలిపెడతాడు. దాన్నే పట్టుకొని ఉండడు. అరవిందుల వారు చేసింది అదే. దర్శనాలు ఇచ్చి, మాట్లాడిచ్చి, evening talks అనే పేరు మీద ప్రతిరోజూ interaction sessions పెట్టి ప్రజా బాహుళ్యాన్ని విపరీతంగా ఆకర్షించి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి వ్యాఖ్యానాల మీద మళ్ళీ భాష్యం రాసి ప్రపంచంతో మమేకమైనటువంటి అరవిందుల వారు ప్రపంచంతో ఒక్క నిమిషంలో తెగతెంపులు చేసుకున్నారు. కారణం ఏమిటి? అంటే మనం కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నంత కాలం మాట్లాడకుండా ఉండకూడదు. అవసరం ఎప్పుడు వస్తుందా అని మాట్లాడేవాడు ఎదురు చూడాలి. అంటే మౌనభూమికలోకి జీవుడు వెళ్ళాలి solitude ఏకాంతంలోకి వెళ్ళాలి. ఏకాంతంలోకి వెళ్ళకపోయినట్లయితే ప్రపంచం ఏర్పరచేటువంటి అనేకమైనటువంటి బాంధవ్యాలు అతని సాధనని పలచన చేస్తాయి. ఇది సత్యం. కన్ను మూసేదాకా నేను మాట్లాడాలి అని నిర్ణయించుకోకూడదు. భగవంతుడు ఎంతకాలం అనుగ్రహిస్తే, నా అవసరం ఉంటే అంతకాలం నేను మాట్లాడుతూ ఉండాలి. నా అవసరం ఇక అక్కరలేదు అని ఆయన నిర్ణయించుకున్ననాడు నేను మౌనం వహించాలి అనేటువంటి నిర్ణయం జీవుడు తీసుకోవాలి. జీవుడు తీసుకోగలడా? తీసుకోలేడే. కాబట్టి పరమాత్మ అనుగ్రహించాలి. అనుగ్రహించినప్పుడు ఇన్నాళ్ళు సాగించినటువంటి ప్రాపంచిక కార్యకలాపం అంతా కూడా నెమ్మదిగా సమసి, తగ్గి, క్షమించి తీవ్ర భావాలన్నీ కూడా తగ్గిపోయి పరమాత్మను తేజోమయంగా దర్శనం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి యోగ స్థితి సాధించుకుంటాడు. సాధనా స్థితిలోకి వెళ్ళటం కోసమే this is all preparatory. ఇది pre qualification. దేనికోసం? మీ అంతటి వాడు లేడు అనిపించుతు-- అనిపించుకోవటానికోనేను మాత్రమే భగవంతుని గురించి సత్య సాయి గురించి మాట్లాడగలనని అనుకోవటం కోసము కానే కాదు కాకూడదు అయింది అంటే నీవు అధ్యాత్మ సాధనలో తొలి మెట్టు కూడా ఇంకా ఎక్కని వాడి కింద లెక్క వినాక రాణి గారి జీవితం మనకు హెచ్చరిక కావాలి స్వామి ఎంత నిర్ద్వందంగా చెప్పారో మనం ఇంకా కలవమని చెప్పేశారు కలవలేం కాబట్టి పరమేశ్వరుడు మన యందున్న దయ చేత అనుగ్రహం చేత solitude లోకి పంపాలి ఏకాత్మ భావనలోకి వెళ్ళాలి అక్కడ ప్రపంచం లేదు ప్రపంచ భావనలు లేవు విషయ వాంఛలు లేవు విషయ వాసనలు లేవు నాలుకకి రుచులు లేవు మనస్సుకి ఆలోచనలు లేవు అది ప్రజ్ఞాన భూమిక ప్రజ్ఞాన భూమిక లోకి అరవిందుల వారు ప్రవేశం చేసే ప్రయత్నమే యోగ ప్రయత్నం అది కాకపోతే ధ్యానంలో జ్ఞానంలో తపస్సులు నిస్వార్థంగా వారు తమ శరీరాన్ని తమ మనస్సుని వినియోగించిన కారణంగా క్రియాయోగ పేరు చెప్పకుండానే ప్రణవ నాదంతో నిశ్శబ్దంతో అనుసంధానం చేసుకున్న కారణంగా అరవిందుల వారు మహా యోగి అయినారు మహా యోగి అనబడేటువంటిది ఆయనకు బిరుదు కాదు ఆయన ఆధ్యాత్మిక స్థితి అది ఆధ్యాత్మిక స్థితిలో సర్వాన్ని కూడా బ్రహ్మ స్వరూపంగా దర్శనం చేయగలిగిన ఒక భావన కలగాలి ఇవ్వాళ మనకి ఇంకా కలగటం లేదు కలగదు అప్పుడే కలగదు కొంతకాలం సాగాలి కావాలి ప్రాపంచిక అనుభూతులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా సన్నగిల్లుతూ రావాలి ఆలోచనల తీవ్రత తగ్గుతూ ఉండాలి విచార ధార మొలకెత్తాలి ప్రవాహం కూడా వేగాన్ని తగ్గించుకోవాలి నిస్తంద్ర మంద్రంగా ఉండాలి చల్లగా ఉండాలి ప్రసన్నంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి హాయిగా ఉండాలి ఇన్నాళ్లు ప్రపంచంతో కూడి ఉన్న మనం ఇవాళ మనతో మనం కూడి ఉండగలిగితే ధ్యానిగా తపస్విగా జ్ఞానిగా అన్నింటిని మించి యోగిర్భవ అర్జునా అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎట్లా చెప్పాడో అట్లాగే మనం యోగత్వాన్ని సాధించుకోవాలి అధ్యాత్మ సాధనలో ప్రధానంగా అధ్యాత్మ శాస్త్రం ఏం చెప్తుందంటే by analysing so many శాస్త్రస్ you cannot become జ్ఞాని mere interpretation of a జ్ఞాన or interpretation of scriptures doesn't make you a జ్ఞాని at the most you may become a విజ్ఞాని చూశారా శాస్త్రాల మీద వ్యాఖ్యానం జ్ఞాని చేయడు విజ్ఞాని చేస్తూనే ఉంటాడు అది interpretation it's a intellectual exercise it's an exercise of the mind still mind is there mind has to go where it should go it should merge with the heart మనస్సు హృదయంతో కలవాలి దాని మూల స్థానం అది దాని పుట్టుక స్థానం అది నేను అంటూ ప్రారంభమైనటువంటి శిరస్సు దాకా వెళ్లి శిరస్సు ద్వారా అహంకార ప్రవృత్తులను తెచ్చుకొని మమకారాన్ని పండించుకొని బాహ్య వృత్తులతో ఉండేటువంటి మనస్సు మళ్లీ లోపలికి హృదయ స్థానంలోకి వెళ్లి వీటన్నింటినీ వదులుచుకోగలిగిన స్థాయికి వెళ్ళాలి అంటే యోగశాస్త్ర ప్రమాణం అనుసారంగా నేను అనే దాని పుట్టుక ఎక్కడ అంటే ఇది ప్రథమ తలపు ఎక్కడ పుడుతున్నది అంటే కుడి రొమ్మున ఉన్నటువంటి హృదయ స్థానంలో పుడుతున్నది అది cave గుహ హృద్గుహలో నుంచి ప్రారంభమైన నేను మెల్లగా ఎక్కడికి వెళ్ళింది అన్నింటినీ దాటుకుంటూ శిరస్థానానికి వెళ్ళింది శిరస్సులో ఆలోచనలు పుడుతున్నాయి దాంతో మమేకమైపోయింది mind pure mind lost its purity ఎప్పుడైతే సంస్కారానికి మూల వాసనకి లోబడిన ఆలోచనలతో మమేకమైందో గాలి ప్రవాహంగా ప్రవహిస్తున్నది పూల చెట్టు మీదుగా వెళ్ళింది గాలి పూల పరిమళాన్ని మోసుకొని వెళ్ళింది దుర్గంధ భూయిష్టమైనటువంటి ఒక కుప్ప మీద అటు వెళ్ళింది దాన్ని మోసుకొని వెళ్ళింది మోసుకొని వెళ్ళిందే కానీ అది తాను కాలే అట్లాగే జీవుడు కూడా ప్రాపంచిక అనుభవాలతో మమేకమై ఉన్నట్లుగా ఉన్నా ఆంతరంగికంగా మమేకం కాకూడదు that is internal character that's called internal personality బాహ్యంగా ఉండేటువంటి personality అనేక కార్యకలాపాలు చేస్తుంది ధర్మవ్యాధుడు మాంసం అమ్మేడు కానీ తత్వబోధ చేశాడు కౌశికుడికి కాబట్టి భారతీయమైనటువంటి తత్వ చింతనలో యోగాత్మ ఏది అంటే తనతో తాను తన మూలంతో తాను మమేకమైనదే యోగాత్మగా భావన చేయాలి solitude కోసం ప్రతిరోజూ సాధన చేయాలి కొద్దిసేపు పది నిమిషాలు మనతో మనం ఉండాలి laptop లు లేవు recording లు లేవు పుస్తక పఠనాలు లేవు భజనలు లేవు శ్రవణాలు లేవు మననాలు లేవు నిదిధ్యాసనాలు లేవు ఏమీ లేని మనోవృత్తి శూన్య స్థితి రావాలి అంటారు భగవత్పాదులు మనోవృత్తి లయమైనప్పుడు శూన్యమైనప్పుడు మనస్సు ఆనందతాండవం చేస్తుంది చేస్తున్నానన్న స్పృహ కూడా దానికి ఉండదు తన హృదయంతో తాను లీనమై ఉంటుంది ఇది యోగం అంటే యోగ ప్రవాహంలో ఇది ఒక పరమాద్భుతమైన మలుపు ICS పరీక్షకు prepare అయినవాడు దేశం కానీ ఇంకో దేశంలో విద్యని అర్జించిన వాడుWestern జీవితానికి ముగ్గు చూపిన వాడు కడగా భారతీయ తత్వ సిద్ధాంతానికి ఒక మకుటాయమానమైన యోగ స్థితిలో నిలకడ చెందటానికి సాధన చేశాడాయన. తీవ్ర సాధన చేశాడు. జ్ఞానిగా ఉన్నాడు, యోగిగా ఉన్నాడు, తపస్విగా ఉన్నాడు, జిజ్ఞాసువుగా ఉన్నాడు, శాస్త్రాధ్యయనం చేశాడు, analyze చేశాడు, analytical approach తో వెళ్ళాడు. Radical గా వేదాలలో ఏం లేదు అనేవాడికి అసలు-- లేదు అంటున్నవాడు ఎవడంటే చదవని వాడు అంటున్నాడు, చదివిన వాడు అనటంలా. చదివిన వాడు అంటున్నాడు "ఏదో ఉంది కానీ నాకు అర్థం కావటం లేదు" అన్నాడు. దానిని interpret చేసుకోగలిగితే వేదాలలో ఏమున్నదో ప్రపంచంలో అదే ఉన్నది. ప్రపంచంలో ఏం ఉన్నదో అది వేదాలన్నీ కూడా ఘోషించి ఉన్నాయి. సంయమనాన్ని, సంభ్రమాన్ని, పరమాద్భుతమైన సమన్వయ స్థితిని, పూర్ణత్వాన్ని, ఒక సిద్ధత్వాన్ని, సంసిద్ధత్వాన్ని, శుద్ధత్వాన్ని, అనుగ్రహ వరదానం చేసినటువంటి వేదాలన్నీ కూడా అపౌరుషేయాలైనయి. మన కోసం మాటలుగా రాసుకున్నాం. వాటిని అక్షరాలలో పొదిగాం. అది pristine clear gold. దానికి ఆభరణం చేయాలి అంటే రాగి కలిపింది మనం. శుద్ధ బంగారంతో ఆభరణం తయారు కాదు గనుక. అట్లాగే అపౌరుషేయమైనటువంటి నానానాథ సందోహమైనటువంటి కేవల నాదమయమైనటువంటి వేదాన్ని జీవుడు అర్థం చేసుకోలేడు గనుక దాన్ని అక్షర బద్ధం చేశారు. అక్షరాన్ని కూడా దాటి పూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి చైతన్య వెలసితమైనటువంటి భావనా స్థితిలోకి వెళ్ళటానికి solitude కావాలి, ఏకాంతం కావాలి. మనతో మనం కూడి ఉండాలి, మన లోపల మనం ఉండాలి. తపస్సులో మన అహంకార మమకారాలు అగ్నిహోత్రంలో పడేయ్యాలి. ఆద్యధారయా స్తోతసా సమం సరళ చింతనం విరళ తత్పరం అంటారు భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారంలో. ఆద్యధార వలె ఉండాలి, ఏదో గంట మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. గంట మాట్లాడుకుని వెళ్ళేది అది కేరాయితనం, పరాయితనం. అసలు తనం ఏమిటంటే మాట్లాడటానికి ముందున్న అన్ని గంటలు మాట్లాడిన తర్వాత మిగిలే అన్ని గంటలు పరమేశ్వరానుసంధానం కావాలి. లేకపోతే తత్వచింతన కేవలం నేతి బీరకాయ వలె మిగిలిపోతుంది. ఇది ఎవరికో బోధించేది కాదు. This is nothing but a loud thinking. మనలో మనం మనతో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక దివ్యభాష, యోగభాష. యోగభాష అర్థమైన వాడు, అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవాడు, అప్పటికే యోగాగ్ని రగిలినవాడు, భూమికలోకి వెళ్ళాలి అన్న చింతన కలిగిన వాడు మార్గంలోకి అతి సులువుగా ప్రవేశిస్తాడు. కాని వాడికి ఇది అర్థం కాదు. అట్లాగే అరవిందుల వారు కూడా అంత తేలికగా అర్థమయ్యే యోగి కాదు. కడగా, చివరగా, చరమంగా, పరమంగా వారు అనుకున్నట్లే ఆగస్టు పదిహేనవ తారీఖున పంతొమ్మిది వందల నలభై ఏడు దేశం స్వాతంత్ర్యాన్ని సిద్ధించుకున్నది. సంకల్పం నెరవేరింది. రెండవది సర్వమూ ధ్యానమయం చేసుకొని సర్వాన్ని యోగమయం చేసుకొని సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యమంతా పరమేశ్వర సౌందర్యంగా భావన చేసి బాహ్య సౌందర్యాన్ని దాటి ఆంతరంగిక సౌందర్యాన్ని అణువణువునా దర్శనం చేసి ఒక పరితృప్తమైనటువంటి వైరాగ్య భూమికలో ప్రపంచం నుంచి అతి సులువుగా విడిపోయినటువంటి మహోన్నతమైన మనస్విగా ఆయన మిగిలిపోయినారు. దీనికి పరమ చరమంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై నాలుగు తెల్లవారింది. ధ్యానముద్రలో ఉన్నారు సమయంలో. ఒక్కసారి ఆయన మనస్సు మహానందంతో నర్తించింది. ఒక ప్రకటన చేశారు. "ఏ కృష్ణ చైతన్యం భూమిలోకి రావాలని కలగన్నాను, కృష్ణ చైతన్యం ప్రపంచాన్ని నడిపించాలని అనుకున్నాను, కృష్ణ చైతన్యం సనాతనమైన వైదిక ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని సంభావన చేశాను, సంకల్పించాను అది కొన్ని గంటల క్రితమే ఒక చైతన్యాకృతిగా ప్రపంచంలో ప్రవేశించింది" అని ప్రకటన చేశారు. ఆయన చేసిన దర్శనం ఏది అంటే సత్యసాయి భగవానుడి యొక్క దివ్యాగమనం. నవంబరు ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు స్వామి అవతారమూర్తిగా ప్రపంచంలో ప్రభవించటం, మరుక్షణమే అరవింద యోగి దానిని సంస్థితం చేయటం ఒక మహోదాత్తమైన భావనా భూమిక. అంతేకాదు అరవిందుల వారు ప్రపంచానికి integrated yoga, "యోగాలన్నీ సమన్వయం చేసుకోండి. మీలో ఉన్నటువంటి లోక లోకాంతర ప్రాణాలలో జరుగుతున్నటువంటి వాటిని గమనించండి. ఆలోచనల పుట్టుక స్థానాన్ని పరిశీలిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఆలోచనలు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకు వెళ్తున్నాయా లేదా గమనించుకుంటూ ఉండండి. barriers వేసుకుంటూ ఉండండి అండ్ never pronounce on the other. అధ్యాత్మలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద వ్యాఖ్యానం చేయకూడదు. Never pronounce on the other. ఆయన యందు, నీ యందు ఏమున్నదో అదే ఉన్నది." ఇది అరవింద యోగి యొక్క దర్శనం. దీనికి నిదర్శనం ఏమిటి? అని అడుగుతారు. అటు అరవింద భక్తులు అడుగుతారు, సత్యసాయి భక్తులు అడుగుతారు. ఇదెవరో రాసిన మాట నిజమేనా అని. నిజమేనా అని చెప్పటానికి మనం అక్కడ లేం. నిజమే అని చెప్పటానికి పరమోదాహరణలు చాలా ఉన్నాయి. చాలా ఉండటంలో ఒక చిన్న విషయం మీకు చెప్తాను.అరవింద యోగి కృష్ణ చైతన్యం భూమి మీదకి ప్రభవించింది. ఇక అది సమాజాన్ని ప్రపంచాన్ని నడిపిస్తుంది అని ప్రకటించిన చాలా ఏళ్ళకి కృష్ణ భక్తుడు అయినటువంటి వి.కె.గోకాక్ అరవింద యోగికి పరమ భక్తుడు ఆయన. ది మదర్ తో అరవింద యోగి తో ఆయనకి interactions మనకి స్వామితో ఎట్లా ఉన్నాయో ఆయనకు అట్లా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. వి.కె.గోకాక్ జ్ఞానపీఠ awardee ఆయన కూడా. సాహిత్యరంగంలో సమున్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి మహా జ్ఞాని. అటువంటి ఆయన అటువంటి వి.కె.గోకాక్ వినాయక కృష్ణ గోకాక్. తదనంతర కాలంలో అరవిందుల వారి మహా పరినిర్వాణ అనంతరం సత్యసాయి భగవానుడికి శరణు చొచ్చారు ఆయన. సత్యసాయి భగవానుడు మానవతా విలువలతో కూడిన విద్యా ప్రబోధం చేయాలి అని university ని పెట్టాలి అని సంకల్పించినప్పుడు అది రూపు దాల్చినప్పుడు దానికి తొట్టతొలి vice chancellor వి.కె.గోకాక్. స్వామి ఆయనను ఎప్పుడూ కూడా కృష్ణ భక్తుడుగానే స్వామి ప్రేమించారు, గౌరవించారు. "నీ కృష్ణుణ్ణి నీవు వదిలిపెట్టక్కర్లేదు బంగారు, నీ గురువు అరవిందుల వారిని నీవు వదిలి పెట్టవలసిన పనే లేదు. నీవు నీవుగా ఎక్కడ నీ మనస్సు లగ్నమై ఉన్నదో దాన్ని అట్లాగే కొనసాగించమన్నారు." కానీ అరవిందుల వారి అనుభవాలు, జ్ఞానానుభవాలు, తర్కానుభవాలు, యోగానుభవాలు అరవిందుల వారితో గోకాక్ వి ముడిపడి ఉంటే, గోకాక్ దివ్య తత్వ అనుభవాలన్నీ సత్యసాయి భగవానుడితో కూడి ఉన్నాయి. దివ్య శక్తిని ఆచరణాత్మకం చేయటం ఎంత సులభమో స్వామి నిరూపణ చేశారు. ఆయన జీవితంలో ఒక పరమాద్భుతమైనటువంటి ఒక రోజుని స్మరిద్దాం ఇవాళ. అరవిందుల వారు ఉండగానే ది మదర్ ఉండగానే వి.కె.గోకాక్ పాండిచ్చేరి లో పొద్దున వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరువణ్ణామలై మీదిగా ఆయన ప్రయాణం సాగాలి. తిరువణ్ణామలై లో ఆగారాయన. రమణుల దర్శనాన్ని చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చారు. సాయంకాలానికల్లా సత్యసాయి భగవానుడి దర్శనం చేసుకున్నారు. అరవింద యోగిని, రమణులని, సత్యసాయి భగవానుడిని ఒకే రోజు దర్శనం చేసుకున్నటువంటి పుణ్య చరితుడు వి.కె.గోకాక్. స్వామి university పెట్టినప్పుడు ఆయనను ఎన్నుకున్నారు. కారణం ప్రాపంచికమైనటువంటి academic excellence అధ్యాత్మలో పనికిరాదు. మనకెన్ని degrees ఉండనివ్వండి ఒక vice chancellor అందులో పరమాత్మ ప్రారంభించిన విశ్వవిద్యాలయానికి vice chancellor కావాలి అంటే పరమాత్మ తత్వాన్ని ఎరిగి ఉన్నవాడు కావాలి, అనుభవం ఉండాలి. దేవో భూత్వా దేవం వజేత్. దైవాన్ని గురించి ఎవరు మాట్లాడగలరు అంటే దైవాన్ని ఎవరు ఎరిగారో వాళ్ళు మాట్లాడగలరు. ఎరగని వాడు ఏనుగు తోక పట్టుకుని దీన్ని ఏనుగు అని, తొండాన్ని పట్టుకుని ఇదే ఏనుగు అని, దాని చెవులు అల్లల్లాడించి ఇదే ఏనుగు అని ఎట్లాగైతే fractional గా విచారణ చేస్తాడో. తత్వవిదుడు అయినటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏకంగా కానీ అనేకంగా ఏకకాలంలో అనుభవించగలిగినటువంటి యోగ సిద్ధిని పొందుతాడు గనుక అటువంటి ఒక పుణ్య చరితుడ్ని మనం ఇవాళ స్వామి సన్నిధానంలో తలుచుకున్నాం. ఇవాళ స్వామికి చాలా ఆనందం కలిగి ఉంటుంది తప్పకుండా. ఎందుకనంటే గోకాక్ స్వామిని గురించి వాక్యం చెప్పినా తన అనుభవంలో నుంచి చెప్పాడు. నేను చెప్పే నాలుగు మాటలు ప్రపంచమంతా వింటున్నదా లేదా అని చెప్పలేదు. నేను ఇది నమ్మాను, ఇది సత్యము, దీన్ని అనుభవించాను అని చెప్పాడు. కనుకనే గోకాక్ వాక్యాలు ప్రామాణికాలు. స్వామి మాటల్లోనే చమత్కారంగా "యూనివర్సిటీకి డీమ్డ్ యూనివర్సిటీ recognition వచ్చింది స్వామి" అని అన్నప్పుడు స్వామి "అవును ప్రపంచంలో అన్ని యూనివర్సిటీస్ డూమ్డ్ యూనివర్సిటీస్ అవుతున్న వేళ ఇది ఒక్కటే డీమ్డ్ యూనివర్సిటీ గోకాక్ from now you are my peacock" అన్నారు. peacock అంటే పురివిప్పిన నెమలి. పురివిప్పిన నెమలి ఆడుతుంది నా-- తాండవం చేస్తుంది, నర్తనం చేస్తుంది. తన నర్తనంతో పరమేశ్వరుడిని ఆనందింపజేస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఆనంద తాండవంలో నుంచి దాని కన్నీటి నుంచి రాలినటువంటి ఒక బిందువే ఆడ నెమలి తాగుతుంది, గర్భాన్ని ధరిస్తుంది. ఆడ నెమలి నాట్యం చేయడానికి రాదు. మగ నెమలియే నాట్యం చేస్తుంది. కానీ సినిమాల్లో బయట కవులు "మయూరి వలె నాట్యం చేశావ్" అని స్త్రీకి ఆపాదిస్తారు. స్త్రీకి నాట్యం రాదు. ఆడ నెమలి చేయలేదు. ఆడ నెమలి-- దాన్ని కేకి అంటారు, కేకి. కేకి అరుస్తూ ఉంటుంది ఆనందంతో. ఆనందంతో అరుస్తూ అరుస్తూ ఆనంద తాండవం చేస్తున్నటువంటి నెమలి యొక్క కన్నీటి బిందువుని తీసుకుని గర్భం దాల్చి గుడ్డు పెడుతుంది. ఇది పరిణామ దశ. ఎంత అద్భుతం చూడండి ప్రకృతిలో ఎక్కడో మగ నెమలి దాని కంటి కన్నీరు దీని గుడ్డు రావటానికి బీజం అవుతున్నది. పరమాద్భుతమైన సృష్టి వైచిత్రిని యోగ భూమిక లో విచారణ చేయాలి.పై పైన సత్యసాయి భగవానుడి దివ్య చరిత్రలో అనేకమైనటువంటి భాగాలని కేవలం మహిమలతోనే గనక కాలం వెళ్లబుచ్చినట్లయితే స్వామితో కూడి ఉన్న క్షణాలు మాత్రమే గొప్పవని అక్కడే ఆగిపోయినట్లయితే స్వామి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సందేశం తత్వచింతన ఇది రేపటి తరానికి ఇవ్వవలసిన బాధ్యత మన బొట్టు వారి మీద లేదా? అన్నప్పుడు స్వామి యొక్క వాంగ్మయాన్ని అధ్యయనం చేయాలి ఇటు అరవిందుల వారితో అటు శంకరులతో ఇటు రమణులతో అటు వేదంతో ఇటు ఉపనిషత్తుతో బ్రహ్మసూత్రాలతో అన్నింటితో సమన్వయం చేసుకుంటే తప్ప సత్యసాయి భగవానుడు అర్థం కాదు. మనకు అర్థం అయినంతవరకే ఆయన అనుకున్నట్లయితే ఆయన మాటల్లోనే "ఐదు అడుగుల మూడు అంగుళాలకు నన్ను పరిమితం చేసి చూడకండి దాన్ని దాటి చూట్టం నేర్చుకోండి" అన్నారు. దాటి చూడాలని మనకు ఉన్నా చూడగలిగిన శక్తిని ఒడుపుని పరమేశ్వరుడు స్వామి అనుగ్రహించాలి గనుక. ఈవేళ కోటి సమితి తలపెట్టినటువంటి యోగ ప్రవాహం మనస్సుకు ఒక ఆనందాన్ని ఆహ్లాదాన్ని తాత్విక చింతనా భూమికని ఘనమైనటువంటి ఒక గాఢత్వాన్ని తీవ్రమైనటువంటి తారక స్థితిని అనుగ్రహిస్తూనే ఉన్నది అనుగ్రహిస్తూనే ఉంటుంది అది అంటున్నవాడు ఒక్కడికే కాక అనుగ్రహం వింటున్న మీ అందరికీ స్వామి మహా అమృత వృష్టి వలే కురిపించాలని అందించాలని స్వామిని మనసా వచసా శిరసా మరొక్కసారి ప్రార్థిస్తూ సమితి ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ అనేకమైనటువంటి కార్యకలాపాలు చేయాలి ప్రపంచానికి రేపటి తరానికి ఉపయోగపడే పనులు చేయాలి ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా తాత్కాలికమైంది కాదు శాశ్వతమైంది సముజ్వలమైనటువంటిది పరమాత్మ భావనలో వెలుగొందవలసినటువంటి దివ్య రీతులలో మనందరి జీవితాలు సుషుమ్నా గీతమై సాగుగాక సాయిరాం.
SSSMC · audio

Yoga Pravaham - 09

Home

Yoga Pravaham - 09

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 32:42

More in this series

Yoga Pravaham

15 episodes · 7 hr 37 min

  1. 27 min 1

    Yoga Pravaham - 01

  2. 34 min 2

    Yoga Pravaham - 02

  3. 24 min 3

    Yoga Pravaham - 03

  4. 30 min 4

    Yoga Pravaham - 04

  5. 29 min 5

    Yoga Pravaham - 05

  6. 41 min 6

    Yoga Pravaham - 06

  7. 26 min 7

    Yoga Pravaham - 07

  8. 42 min 8

    Yoga Pravaham - 08

  9. 32 min 9

    Yoga Pravaham - 09

    Now playing
  10. 29 min 10

    Yoga Pravaham - 10

  11. 26 min 11

    Yoga Pravaham - 11

  12. 40 min 12

    Yoga Pravaham - 12

  13. 19 min 13

    Yoga Pravaham - 13

  14. 28 min 14

    Yoga Pravaham - 14

  15. 21 min 15

    Yoga Pravaham - 15