Skip to content
Transcript తెలుగు
లయోగాలు లక్షా ఇరవై వేలు ఉంటే అందులో నాదానుసంధాన యోగం ఎంత గొప్పదో అట్లాగే అనేకమైనటువంటి యోగాలలో ఉత్తమోత్తమ యోగం కేవల కుంభక యోగం. కేవల కుంభక యోగాన్ని మన కాలంలో చాలా సమర్ధవంతంగా అంటే ప్రపంచానికి తెలిసే రీతిలో చూపించిన అటువంటి వారు ముగ్గురు నలుగురు కంటే లేరు. కంచి మహాస్వామి వారు కుంభక యోగం, రమణ మహర్షి కేవల కుంభక యోగం, జిల్లెళ్ళమూడి అమ్మ కేవల కుంభక యోగం, శ్యామాచరణ లాహిరి కేవల కుంభక యోగం ఆయన ఆర్జుడు. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు కేవల కుంభక యోగం. ఏమిటా కేవల కుంభక యోగం? తమ మనస్సుని తమలో ప్రసరిస్తున్న ప్రసరిస్తున్న వాయువుని మూలాధారం నుంచి పైకి లాగి యోగ శక్తితో ద్వాదశాంత స్థానమైన చంద్ర కళాస్థానంతో అనుసంధానం చేసి నిరంతరము బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి దేహాత్మ భావన లేని పరమోత్కృష్టమైనటువంటి స్థాయి వారిది. దానిని కేవల కుంభక యోగంలో ప్రాణ చలనాలు ఆగిపోతాయి. మనస్సు యొక్క పరిగెత్తడం ఆగిపోతుంది. శరీరమే జడమైపోతుంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న వీరిలో కొద్దిమందిని మనం చూసాం మిగతా వారిని ఎవరినీ చూడలేదు. కానీ పరమ చరమ గురువై సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి రెండువేల మూడులో hip joint fracture అయినప్పుడు operation అయిపోయినటువంటి కేవలం ఒక గంటన్నర సమయంలోనే మంచం దిగి గది లోపల పచార్లు చేయటం అనేది కేవల కుంభక యోగానికి ఉత్కృష్టమైన పరాకాష్ట అది. పిప్పి పిప్పి అయిపోయింది రజన్ అయిపోయింది తుంటి. వీళ్ళంతా ఏదో చేశారు అతికిచ్చారు కానీ ఏం జరుగుతున్నదో జరుగుతున్న దానితో ప్రమేయం లేకుండా ఉన్నటువంటి ఒక అప్రమేయమైనటువంటి ప్రభావ సంపన్నమైనటువంటి కేవల కుంభక యోగానికి ఒక పతాక స్థాయి మన కాలంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. మనం అనుకుంటాం ఆయన hip joint బాగు చేసుకోవచ్చు కదా, ఇదివరకు లాగా రావచ్చు కదా, అవి మన ఆలోచనలు. నెమ్మదిగా withdraw అవుతూ ఉండాలి ప్రపంచం నుంచి ఇక్కడే ఎనభై ఆరేళ్ళు ఉంటేనే మనం నేర్చుకున్నది చాలా తక్కువ. ఆయన ఇంకో రెండు వందల ఏళ్ళు ఉన్నా అదే నేర్చుకుంటాం మనం కొత్తగా ఏం నేర్చుకోం. ఆయనకు తెలుసు సంగతి. కాబట్టి ఏం చెప్పాలో చెప్పారు, ఎంతవరకు చెప్పాలో చెప్పారు, ఎట్లా చెబితే మన జీవితాలు బాగుపడతాయో చెప్పారు. మీరందరూ కూడా మాట పెద్ద శబ్దం కేవల కుంభక యోగం అని అనకుండా కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి, మేఘాల వలె దూది పింజల వలె పోతూ ఉంటాయి. పెద్దగా వచ్చేది కొద్దిగా వచ్చేది అంటూ సాధకుణ్ణి prepare చేశారు. మన జీవితంలో కూడా కష్టం రాగానే కింద పడిపోకూడదు నిలబడాలి. కష్టాన్ని ఆహ్వానించద్దు వచ్చిన కష్టాన్ని మాత్రం నిబ్బరంగా ఎదుర్కోవాలి. మన శక్తి చాలదు సమాజ శక్తిని తీసుకోవాలి. అది చాలదు భగవంతుని శక్తి తీసుకోవాలి. భగవంతుడు, సమాజం లేకుండా వ్యక్తి ఏకాత్మగా సాధించలేడు. కనుక ఇదొక వ్యష్టిగా కనిపిస్తున్నదంతా పరస్పరం ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది గనుక త్రైలింగ స్వామి యొక్క జీవితం అంతా అలా సాగింది. అట్లాగే మరొక సందర్భంలో ఒక వేటగాడు. అవి త్రైలింగ స్వామి జీవితంలో చివరి ముప్పై సంవత్సరాలు. చివరి ముప్పై సంవత్సరాలు మౌనం వహించారు ఎవ్వరితో మాట్లాడలేదు ఆయన. ఒకరోజున ఉజ్జయినీ మహారాజు ఆయన దర్శనానికి వచ్చాడు. ఆయన తేజస్సు చూశాడు. చూసి తాను తెచ్చిన పడవలో నేను ప్రయాణిస్తున్న పడవలో మీరు కూడా కూర్చోవాలి గురువుగారు మనల్ని అంటారు కదా, ఒక్కసారి మా కారు ఎక్కండి అంటారు, ఏమవుతుంది ఎక్కితే? ఏం కాదు. అవతల వాడి తృప్తి అంతే. కాస్త మా కారు ఎక్కండి అంటారు. అట్లాగే మా పడవ ఎక్కండి అన్నాడు ఆయన. ఈయన ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆయన ఈయనతో ఏం మాట్లాడలేదు. ఉజ్జయినీ మహారాజు వరలో నుంచి ఒక అందమైన కత్తి, దాని నిండా రత్నాలు, diamonds మణులు పొదిగి ఉన్నటువంటి పిడికి పిడి ఉన్నటువంటి ఒక కత్తి చేతికిచ్చి, "ఇది నా ఉపధగ-- నా కానుకగా మీకిస్తున్నాను మీ దగ్గర ఉంచుకోండి. దాన్ని చూసినప్పుడల్లా నేను గుర్తొస్తాను" అని ఏదో ఇచ్చారు. ఆయన దాన్ని చూశారు. "చాలా బాగుంది" అన్నారు. చాలా బాగుంది అనంగానే ఎవరన్నా మనల్ని భోజనానికి పిలిచినప్పుడు చాలా బాగుందని మనం అన్నామా, పప్పులో కాలేసామే. వాడు రెండోసారి వేసేస్తాడు. కాబట్టి మౌనంగా తిని మన దారిన మనం వెళ్ళిపోవాలి. బాగుంది బాగాలేదు చెప్పకూడదు. బాగుంది అంటే ఇల్లాలికి ఉత్సాహం కలుగుతుంది. అలాగే బాగుంది అనగానే ఇంకా రాజుగారు అనుకున్నాడు ఇంకేముంది ఆయన దగ్గర పెట్టుకుంటారని. అంటూనే ఏం చేశారు గంగా నదిలో విసిరి పారేశారు. చూడండి రాజు అహంకారి కదా, నేను నా వరలో నా రాజవంశీకుల కత్తి చేతికిస్తే ఈయనకు ఏం విలువ తెలుస్తుంది? తీసుకెళ్ళి గ-గంగా పారే గంగా నదిలో పారేశాడు అని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. "గురువు గారు ఇలా మీరు పారేయకుండా ఉండవలసింది. చాలా నొచ్చుకున్నాను I felt too bad" ఇట్లా ఏదో మాట్లాడాడు. ప్రవహిస్తున్న గంగా పడవ దాటి చాలా time అయిపోయింది ఎక్కడో పడేశాడు ఆయన. ఇలా చేయి పెట్టారు రెండు కత్తులు వచ్చినాయి. అటువంటివే similar. అంటే original లేండి Xerox ఒక్కోసారి తేడా తెలియదే అట్లా వచ్చినాయి. వచ్చి త్రైలింగ స్వామి రాజుగారి చేతికిచ్చి "ఇందులో నీదేదో గుర్తుపట్టగలవా?" అన్నాడు.పట్ల పోయినాడు. నీ వస్తువును నీవే గుర్తు పట్టాలి, నీ వస్తువును ఇంకొకడు గుర్తు పట్టడు. ఇకపై రాజ్యం ఏలుతూనే నీలో ఉన్న సద్వస్తువును గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి, ఇది నా గుర్తుగా నీ రాజ్యంలో ఉంచుకో అన్నాడు. కత్తిని ఇచ్చేసాడు. అది. సత్య సాయి భగవానుడు గుర్తుకు రావాలి మనకి. "I am always a giver, I am never a taker" అన్నారు స్వామి. నేను ఇవ్వటానికి వచ్చాను, మీ నుంచి తీసుకోవటానికి రాలా. నా నుంచి ఏం కావాలో తీసుకుని వెళ్తుండండి, మీ నుంచి నాకు ఏమీ వద్దు. అస్సలు వద్దు. విన్నామా ఎక్కడైనా? అది తేలేదే, ఇది తేలేదే, ఇది వలేదే, అది వలేదే అనే గురువులు బోధ గురువులు, బాధ గురువులు, శోక గురువులు. ప్రపంచంలో రాజ్యం ఏలుతున్నటువంటి వేళ నాకు ఏమీ వద్దు, మీ మనసుని ఇక్కడ పెట్టండి. కాసు ఖర్చు లేదన్నారు. ఒక్క రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టక్కర్లా అని మహాత్ములందరూ కూడా ఒక పద్ధతిలో యోగాన్ని బోధిస్తూ ఉంటారు. అలాగే ఇది జరిగిన కొన్నాళ్ళకే, కొన్ని రోజులకే రాజు గారు నేపాల్ దేశంలో, రాజు గారు వేటకి పులిని తరుముతూ వచ్చాడు. పులి అందటల్ల, అది గాండ్రిస్తున్నది. వీడు గన్ పేల్చడానికి సిద్ధపడుతున్నాడు. అది వచ్చి త్రైలింగ స్వామి యొక్క పాదాల దగ్గర మామూలుగా ఒక పిల్లి వలే కూర్చుంది. వారొక సంజ్ఞ చేశారు. సంజ్ఞ రెండర్థాలు. ఒక అర్థం పులికి అర్థమైంది, నువ్వు వాడి జోలికి వెళ్ళద్దు అని. వేటగాడు రాజుకు అర్థం కాలా, దాన్ని బాణంతో చంపద్దు అని. మనిషికి నోటితో చెప్పవలసి వచ్చింది. నువ్వు బాణం వేయకు, దాని దారిన దాన్ని వెళ్ళని అన్నట్లుగా చెప్పారు. కాసేపు అయిన తర్వాత అతను వచ్చి అడిగాడు. పులిని చంపితే నా రాజ్య ప్రజలు నా మీద చాలా గౌరవాన్ని, భయాన్ని పెంచుకుంటారు. పులిని చంపిన రాజు అనగానే భయమేస్తుంది ప్రజలకి. ప్రజలకి నేను భయాన్ని కల్పించాలి. దాన్ని నా వెంట పెట్టుకొని వెళ్తాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. పులితో సహవాసం చేసే రాజుని ప్రజలు అంగీకరించరు. భగవంతుడితో కూడి ఉన్నటువంటి రాజుని ప్రజలు గౌరవిస్తారు. పులిని వదిలిపెట్టు, భగవంతుణ్ణి పట్టుకో అని చెప్పారు. చూశారా? చిన్న సంఘటనలా ఇవి. ఏదైనా, అవతారమూర్తి అయినా, ఎన్నేళ్ళున్నా దేహాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టడానికి ముందు అనేకమైన సంఘటనలు జరిగినాయి. వారెవరికీ భవిష్యత్తు చెప్పేవారు కాదు. వర్తమానంలో ఇట్లా ఉండండి, అట్లా ఉండండి అని చెప్పేవారు కాదు. త్రైలింగ స్వామి యొక్క యోగ భూమికంతా కేవల కుంభక యోగ భూమిక. యోగ భూమికలో తమ యందున్నటువంటి వాయు ప్రసారం, వాయువన్నా, ఆయువన్నా, ప్రాణమన్నా, చైతన్యమన్నా, కరెంట్ అన్నా, పవర్ అన్నా, ఫ్లూయిడ్ అన్నా, హంస అన్నా అన్నీ ఒకటే. పర్యాయ పదాలివన్నీ. హంసని ఆయన కుంభించారు. It was under his control breath. కనుక రెండు వందల ఎనభై ఏళ్ళు హాయిగా ఆయన ఏనాడూ ఒక రోగం పాలు కాకుండా జీవితాన్ని కొనసాగించారు ఆయన. త్రైలింగ స్వామి జీవితంలో మరొక సంఘటన. తమ శరీరాన్ని వదిలిపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైనప్పుడు అర్థం చేసుకోగలిగినటువంటి ఒకడ్ని పిలిచారు. పిలిచి, అతి కొద్ది రోజులలో, రాబోయే పది రోజుల్లో శరీరాన్ని నేను వదిలి పెడతాను. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ నేను మీకు సజీవంగా దర్శనమిస్తాను. సజీవ దర్శనం తర్వాత నేను నా వచ్చిన పని ముగించుకుంటాను. దీనికై వగవవలసిన పని ఏమీ లేదు. ప్రసన్నంగా ఉండండి. భారతీయమైన తత్వ సిద్ధాంతానికి లోబడి వేదాంతాన్ని అనుష్ఠాన వేదాంతంగా మార్చుకొని మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అంటున్నప్పుడు భక్తులందరికీ కూడా చాలా బాధ కలిగింది. అయోహ్య గురువుగారు ఉండరేమో అని. కానీ అనివార్యం. time వచ్చింది. వారు గంగా స్నానానికి వెళ్లారు. మామూలుగా రావలసినట్లే పద్మం వారి కిందకు వచ్చి చేరింది. దానిలో తాను సంచారం చేసినటువంటి వరుణ, అసి అనబడేటువంటి రెండు నదుల సంగమ స్థానానికి వెళ్లారు. వరుణా నది, అసి నది కలిపితే వారణాసి అయింది. వారణాసి వేదవ్యాసుల వారు, అగస్త్యుల వారు, లోపాముద్ర, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి, విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు నెలకొన్నటువంటి మహాస్మశాన వేదిక అది. వైరాగ్య భూమిక, అది పుణ్యభూమి. తనువు చాలించిన ప్రతి వాడు చేరుకోవాలని కోరుకునేటువంటి ప్రదేశం. స్మశాన భూమికలో వైభోగం ఎంత ఉన్నదో వైరాగ్యం అంత ఉన్నది. యోగశాస్త్రంలో, పాతంజలిక యోగశాస్త్రంలో విభూతి పాదం అని ఒకటుంది. విభూతి పాదంలో అణిమాది అష్టసిద్ధులు చాలా అతి తక్కువ మందికి లోబడి ఉంటాయి. చాలా అతి తక్కువ మందికి. అణిమా, గరిమా, లఘిమా మనందరికీ తెలుసు. అధ్యాత్మ చరిత్రలో అణిమాది సిద్ధులను కైవసం చేసుకున్నటువంటి పురాణ పురుషుడు ఎవరు అంటే హనుమంతుడు. మళ్ళీ మిగతా వాళ్ళ దగ్గర అన్నీ ఎనిమిది సిద్ధులు లేవు.ఎనిమిది సిద్ధులు సత్య సాయి అవతారానికి ముందు వచ్చిన వారిలో త్రైలింగ స్వామి హనుమంతుడి తర్వాత త్రైలింగ స్వామికి అణిమాది సిద్ధులు మొత్తం కైవసం. కానీ, ఏనాడు కూడా సిద్ధిని తన కోసం ఆయన వాడుకోలేదు. త్రైలింగ స్వామి తర్వాత అంటే 1887 తర్వాత 1926న ప్రభవించినటువంటి సత్య సాయి భగవానుడికి అణిమాది సిద్ధులు ఆభరణాలై ఉన్నాయి. శూన్యహస్తంలో సర్వ సృష్టి నిలుచుకున్నది. తన నడకతో, నడతతో, పూర్ణమైన దృక్కుతో ప్రపంచానికి నిత్య మంగళాశాసనం చేసినటువంటి సద్గుణ సంపన్న వైభవ గుణ కీర్తిమూర్తి సత్య సాయి భగవానుడు. మామూలు విషయం కాదది. కానీ, ఆయన కూడా ఏనాడు సిద్ధి తన కోసం వాడుకున్న ఒక్క సందర్భం కూడా లేదు. వారు దేహాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైందని అనుకున్నాం. గంగా స్నానానికి వెళ్లారు. పద్మం వచ్చింది, విహారం చేశారు. వరుణాసి ప్రాంతాన్ని మళ్ళీ మరొక్కసారి మూలాలు తాకారు, తడిమారు. తనకు యోగ ముద్రని, భద్రమైన యోగ స్థితిని అనుగ్రహించినటువంటి సర్వ ప్రకృతికి ఒక పక్కన శవదహనాలు అవుతున్నాయి. దానిలో దాగిన అగ్ని స్వరూపాన్ని దర్శనం చేశారు. దాని పక్కనే నిరంతరము పారేటువంటి గంగా జలాల మీద విహరిస్తున్నారు. నిర్మలమై, నిరామయమై, వ్యోమమై, పూర్ణమై, శూన్యమై, గగన-గగనాంతరాలన్నీ పైన వెలిగిపోతున్నాయి, దాన్ని చూశారు. సర్వానికి కూడా ఆధారమైనటువంటి భూమాతకి నమస్కరించుకున్నారు. తనలో వాయువుగా, ఆయువుగా ఉన్న పంచభూతాత్మకమైన ఒక శరీరంలో ఒక ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో వాయువుని కుంభింపజేశారు. అంటే, దేహం పంచభూతాలలో నుంచి వచ్చిందో దానిని ఒక్కొక్క భావాన్ని, ఒక్కొక్క తత్వాన్ని, పంచతత్వాలని మళ్ళీ ప్రపంచానికి, మళ్ళీ పంచభూతాలకి, ప్రకృతికి వరదానం చేశారు. అనుసంధానం చేశారు. బయటకు వచ్చారు. వచ్చి ప్రాణ నిర్గమనం చేశారు. మళ్ళీ రెండు రోజుల తర్వాత బయటకు వచ్చారు. వచ్చి ఇక మీరంతా యోగ భూమికలో నెలకొలది చెందండి. మీ హృదయాన్ని కాశీ చేసుకోండి. మీ ఆలోచనలను గంగా ప్రవాహం చేయండి. మీ దేహాన్ని మహాస్మశానంగా మార్చుకోండి. "దహయతి ఇతి దేహః" ఎప్పటికైనా దహింపబడుతుంది గనుక దీనికి దేహం అని పేరు. "క్షరియతి ఇతి శరీరః" మార్పు చెందుతుంది గనుక శరీరం అని పేరు. దశ ఇంద్రియాలతో నడుస్తూ ఉంటుంది గనుక దీనికి రథం అని పేరు. చివరగా పరమ చరమంగా "దేహో దేవాలయ ప్రోక్తో" దేవాలయం మానవ దేహంలో దేవుడున్నాడు గనుక అది దేవాలయ సమానం అనేటువంటి వైదాంతికమైనటువంటి భూమికలనన్నింటినీ పరిచయం చేస్తూ అగస్త్యుడు లోపాముద్ర వ్యాసులవారు అడిగితే మాట చెప్పారు. కొన్నాళ్ళు మేము కాశీలో ఉన్నాం. గంగా విహారం చేసేవాళ్ళం. చాలా రోజులైంది. వ్యాస దేవా! నిన్న, మొన్న మీరు అక్కడి నుంచే వచ్చారు కదా. ఎలా ఉన్నది అని అడిగారు అగస్త్యులవారు. ప్రశ్న ఎక్కడ వేశారంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ద్రాక్షారామంలో వేశారు ప్రశ్న. వ్యాసులవారిని ఆహ్వానం చేయడానికి అగస్త్యులవారు వచ్చారు. కుశలమా, కుశల ప్రశ్నలన్నీ వేసిన తర్వాత కాశీ ఎట్లా ఉన్నది అని అడిగితే కాశీకి ఏమి అది నిత్య పుణ్యక్షేత్రం. కాశీ విశ్వేశ్వరుడు అక్కడ ఉన్నాడు. దానిని మించిన పవిత్ర క్షేత్రం ఉన్నదా? అని ఆయన చెప్తూ-చెప్తూ మళ్ళీ ఆయన మరొక ప్రశ్న అగస్త్యుల వారిని వేశారు. మీరు కూడా కొన్నాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఎలా ఉండేది కాశీ అని అడిగారు. చూడండి. "ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ ఖాయంగా నానా సైకత వేదికలన్ నల్ దిక్కులన్ శంభున్ శివున్ పాడదన్ మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో" వ్యాస దేవా! అడిగారు గనుక చెప్తున్నాం. కాశీ వెళ్ళి గుడిలో కొబ్బరికాయ కొట్టి మేము పడుకోలేదయ్యా. సర్వ ప్రపంచము నిద్రిస్తున్న సమయంలో నేను, నా భార్య లోపాముద్ర కలిసి గంగా నదికి వెళ్ళేవాళ్ళం. గంగా నది మీద నిస్తంద్ర మంద్రంగా గంగ ప్రవహిస్తున్నది. ఆకాశంలో పూర్ణిమా మాలికలు వెలిగిస్తున్నటువంటి చంద్రుడు సుషుమ్నా కిరణాలను వెన్నెల ధారలుగా, ప్రవాహంగా కిందకి దింపుతుంటే శివాయతనమైనటువంటి ప్రకృతికి నమస్కరిస్తూ, నమస్కరిస్తూ నానా సైకత వేదికలన్ ఇసక తిన్నెలను వేదికలు చేసుకున్నాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే నానా దిక్కుల వైపు తిరుగుతూ, తిరుగుతూ విశ్వేశ్వరుడి యొక్క దివ్య దర్శనాన్ని మేము సంపూర్ణంగా అనుభవించాం. సంకీర్తన చేశాం. నమశ్శివాయ మంత్రాన్ని చదువుకున్నాం. చదువుకుంటున్నప్పుడల్లా మేనెల్ల పులకాంకుర ప్రకరముల్ పొంగార. శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకున్నాయి ఆనందంతో. ఎలా తెలిసిందో తెలుసునా? మేమేమీ శరీరం మీద పులకలు తాకి చూసుకోలే. "నిండార మిన్నేటిలో" మిన్నేరు అంటే గంగ.అవి నెమ్మదిగా పారుతున్నటువంటి గంగా నదిలో మా దేహం మీద ఏర్పడిన పులకలు అద్దంలో ప్రతిబింబంలా పులకరిస్తూ కనిపించినయి. దీనిని బట్టి మేము దాన్ని అనుభవించాం. సర్వము ప్రకృతి శివా-- శివాయతనంగా, శివమయంగా, శివస్ఫురణగా, శివ సంకీర్తనంగా, పరమాద్భుతమైనటువంటి ఈశ్వరుడి యొక్క సంకల్పంగా మేము భావన చేశాం. అట్లా జీవించామన్నాడు. యాసుల వారు అడిగితే అగస్త్యుల వారి జవాబు అట్లా ఉంటుందన్నమాట. మనల్ని అడిగామనుకోండి, "మీరు అప్పుడు పాత building చూశారు, అది పోయి ఇప్పుడు mall వచ్చేసిందండి. అప్పుడేదో అవి ఉండేవి కావు, ఇప్పుడేదో ఇంకో కొత్త shop వచ్చిందండి. అక్కడ విశ్వేశ్వరుడి బొమ్మలు దొరుకుతాయండి. ఇదిగో ఇదేనండి" ఇవి చెప్తాం. వస్తువులు ఎలా మార్పు చెందుతాయో మనం చెప్తాం. అగస్త్యుల వంటి మహాత్ములు వస్తువును దృష్టిలో పెట్టుకోరు. సద్వస్తువు పరంగానే సమాధానం చెప్తారు. అటువంటి త్రైలింగ స్వామి రెండు వందల ఎనభై ఏళ్ళు దేహంలో ఉండి ఇప్పటికీ కూడా ఆయన మహావాక్య రత్నావళి అని ఒక, ఒక యోగశాస్త్రానికి వ్యాఖ్యానం రాశారాయన. అది బెంగాలీ భాషలో ఉంది. తెలుగువారి దురదృష్టం, అలసత్వం, carelessness తెలుగులో రాసిన వాళ్ళు లేరు. రాయాలి. తెలుగులో ఎవడికి వాడు వాడి కవిత్వం రాస్తున్నారు. మహారత్న వాక్య రత్నావళి మీద త్రైలింగ స్వామి యొక్క వ్యాఖ్యానం రాయగలిగితే, దాని పేరే మహావాక్యాలు అవి రత్నాలు అయి ఉన్నాయి. అది ఒక రత్నం, రెండు రత్నాలు కాదు, రత్నావళి. అది ఆవలి వరసలుగా ఉన్నాయి. అనంతంగా ఉన్నాయి. దానిని ప్రపంచానికి పరిచయం చేయవలసినటువంటి ఒక అవసరం ఇవాళ ఉన్నది. అయితే మనం ప్రధానంగా సత్యసాయి భగవానునితో జీవించి జీవిస్తున్న మనకి ఒక అదృష్టం ఉంది. మహావాక్య రత్నావళిలో త్రైలింగ స్వామి చెప్పినటువంటి ఒక మహా పరిసత్యాలు అన్నింటినీ కూడా సత్యసాయి భగవానుడు అచ్చ తెలుగులో మనకు అందించారు. మనకేమీ దిగులు లేదు. కానీ ఇది అది అని తెలియాలి. అందులో ఒక్కటి చెప్తాను. "అహంకారం ఉండెనా గురువు చిక్కడు, గురువు చిక్కెనా అహంకారం ఉండదు" ఎంత అద్భుతం! స్వామే చేయగలరు. ఇంకెవరూ చేయలేరు అది. అహంకారం ఉంది, నేను, నేను, నేను అన్న భావన ఉన్నంత కాలం గురువు చిక్కడు. గురువు ఉంటాడు, పక్కనే ఉంటాడు, చుట్టూ తిరుగుతుంటాడు. గురువు చుట్టూ మనము తిరుగుతుంటాం. వాడేమీ చిక్కడు. గురువు చిక్కెనా, నిజంగానే గురువు దొరికాడా అహంకారం ఉండదు. గురువు దొరికాక మన అహంకారం పెరిగింది అనుకోండి, గురువు చిక్కినట్లా చిక్కనట్లా? త్రైలింగ స్వామి యొక్క జీవితం అంతా కూడా మానవాళికి ఒక దివ్యమైనటువంటి ఒక యోగ భూమికని పరిచయం చేస్తుంది. వారు జీవించి ఉన్నంత కాలం ఒక స్ఫూర్తివంతమైనటువంటి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తదనుగుణంగా జీవించారు. ఒక అవధూత, ఒక జీవన్ముక్తుడు, ఒక మహాత్ముడు, ఒక తపస్వి, ఒక తత్వానుసంధాన యోగి, ఆత్మానుసంధానంలో నిత్యమూ రమించినటువంటి పరమ భక్తాగ్రేసరుడు, యోగి, పూర్ణ తత్వవేత్త, ఆధ్యాత్మిక విషయాలని అవగతం చేసుకుని ప్రపంచానికి అందించినటువంటి పరమ కారుణ్యమూర్తి ఎవరుంటే ఆయన త్రైలింగ స్వామి. అటువంటి మహాత్ముణ్ణి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇవాళ స్వామి నిర్ణయించారు. ఇది ఎవడి చేతిలో ఉంది? వీళ్ళని గురించి చెప్పుకోమని ఎవడు చెప్తాడు మనకి? స్వామి చెప్పాలి, మనం చెప్పాలి. దానిని అనుగ్రహించినటువంటి స్వామికి కైమోడుస్తూ స్వామే గనక మన జీవితాలలోకి తమ అనుగ్రహాన్ని ప్రసరించి ఉండకపోతే, ఏదో గొప్ప engineer అయ్యేవాళ్ళం, పోయేవాళ్ళం. ఏదో కుబేరులమయ్యే వాళ్ళం, కాల గర్భంలో కన్నుమూసే వాళ్ళం. లేదు ఇంకేదో అయ్యేవాళ్ళం, కాలం చెల్లిపోయి ఉండేది, చరిత్రలో ముగిసిపోయి ఉండేవాళ్ళం. భగవంతునితో కూడి ఉన్నందువలన, భగవంతుడు ఉన్నంత కాలం మనం కూడా ఆయనతోనే పెనవేసుకుని ఉంటాం. Whether within the body or without the body. శరీర గతంగా ఉన్నామా, శరీరాతీతంగా ఉన్నామంటే, నిజానికి యోగ భూమికలన్నీ శరీర గతం కాదు. మనస్సుకి, భావానికి, భావనకి, తత్వానికి అతీతమైనటువంటి పుణ్య భూమికలు గనుక అటువంటి పరమాద్భుతమైనటువంటి యోగాన్ని అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ మళ్ళీ వేదం చదువుకున్న వాళ్ళంతా రోజూ అనుకునే మాట "ఆమాయంతు బ్రహ్మచారిణస్స్వాహా". అయ్యా! నిన్నొక రోజు గడిపాను. ఏదో కొన్ని అనుభవాలు వచ్చాయి, అనుభూతులు కలిగాయి. నాకొక్క శిష్యుణ్ణి నీవు చూపించినట్లయితే, లేదు నేను చెప్పేది వినేవాడు ఒక్కడు దొరికితే రేపు నా కార్యక్రమం ఉంటుంది. లేకపోతే ఉండదు. కనుక ఇవాళ నేను నేర్చుకున్నదంతా వినటానికి, కనటానికి ఒక్కడిని ఇవ్వమని అడుగుతాడు వేదం చదువుకున్నవాడు అగ్నికి నమస్కరిస్తూ. ప్రతిరోజూ "ఆమాయంతు బ్రహ్మచారిణస్స్వాహా". సత్యసాయి భగవానుడి అనుగ్రహం ఎంత అంటే, మనం ఏం వేదం చదివాం? యజ్ఞాలు చేశాం? తపస్సు చేశాం? ప్రతిరోజూ రెండు, మూడు వందల మంది శ్రోతలు మనకి స్వామి అనుగ్రహిస్తే ఇది ఎంత వేదాధ్యయనానికి మించినటువంటిది ఇది. అనుగ్రహానికి కొలత ఉన్నదా? లేదని భావన చేస్తూ స్వామి యొక్క దివ్యానుగ్రహం మనందరి మీద నిత్యమూ మహామృత వృష్టి వలే కురుస్తూనే ఉండాలని, స్వామితో కలిసి జీవించినందుకు, స్వామి ఉన్న సమయంలో మనమూ జన్మ ఎత్తినందుకు, మన వలన ప్రపంచానికి అన్నివేళలా సర్వ శ్రేయోదాయకమైన, సర్వజన మనోల్లాస పులకిత పుంభణమైన, పూర్ణమైన ఆనంద తారక స్థితులు మెరయుగాక, వెలుగుగాక. సాయిరాం.
SSSMC · audio

Yoga Pravaham - 03

Home

Yoga Pravaham - 03

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 24:28

More in this series

Yoga Pravaham

15 episodes · 7 hr 37 min

  1. 27 min 1

    Yoga Pravaham - 01

  2. 34 min 2

    Yoga Pravaham - 02

  3. 24 min 3

    Yoga Pravaham - 03

    Now playing
  4. 30 min 4

    Yoga Pravaham - 04

  5. 29 min 5

    Yoga Pravaham - 05

  6. 41 min 6

    Yoga Pravaham - 06

  7. 26 min 7

    Yoga Pravaham - 07

  8. 42 min 8

    Yoga Pravaham - 08

  9. 32 min 9

    Yoga Pravaham - 09

  10. 29 min 10

    Yoga Pravaham - 10

  11. 26 min 11

    Yoga Pravaham - 11

  12. 40 min 12

    Yoga Pravaham - 12

  13. 19 min 13

    Yoga Pravaham - 13

  14. 28 min 14

    Yoga Pravaham - 14

  15. 21 min 15

    Yoga Pravaham - 15