No transcript for this section.
అంత సూత్రమైనటువంటి భక్తి భావన ఉండాలి అంటే యోగ స్థితిలోకి వెళ్ళాలి. అందుకనే అర్జునుడు "నేను యుద్ధం చేయనా? వద్దా? చేయనా? వద్దా? చేస్తే ఏమిటి? చేయకపోతే ఏమిటి?" అని మీమాంసలో పడ్డప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు? "యోగక్షేమం వహామ్యహం" నీ యోగం ఏమిటో నేను చూసుకుంటాను అన్నాడు. ఆ యోగము అంటే అది రాజ యోగం కాదు, విభూతి యోగం కాదు. "నీ సంగతి నాకు వదిలేసెయ్, నాతో ఉండు" అది యోగం. నాతో ఉన్నావా? క్షేమం. ప్రపంచంతో కూడి ఉంటే క్షేమం ఎప్పుడూ ఉండదు. దానికి గ్యారెంటీ ఏం లేదు. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. భగవంతునితో కూడి ఉండండి, ఎప్పుడూ ఏం జరగదు. కాబట్టి "యోగక్షేమం వహామ్యహం" అన్నదానికి అర్థం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని "నిన్ను నాతో తీసుకుంటున్నాను, నాలో కలుపుకుంటున్నాను, నా ప్రజ్ఞతో నువ్వు యుద్ధం చేయబోతున్నావు" అన్నటువంటి ఒక అభయవరదానం చేశాడు. దాన్ని అర్జునుడు అంగీకరించాడు. అప్పుడు మాత్రమే అంగీకరించాడు. అప్పుడన్నాడు "ఇహ నా యోగము, నా క్షేమము నువ్వు చూస్తాను" అంటే ఇంకేముంది? "కరిష్యే వచనం తవ" "తట్టని తట్టని నీ బరువు నేను మోస్తాను" అని అవతల ఆయన చెప్తుంటే ఇంకేముంది? ఎత్తుకో అంటాం మనం. మోసేవాడు దొరకాలిగా. అర్జునుడికి దొరికాడు. యుద్ధం అయ్యేదాకా దొరికాడు. కాబట్టి, ఇవన్నీ కూడా యోగేశ్వర కృష్ణుడికి నమస్కరిస్తాం. ఆయన సర్వయోగ సారాన్ని, యుద్ధాన్ని ఒక బొమ్మగా సాగించాడు. బొమ్మలాటగా సాగించాడు. జస్ట్ ఒక animation లాగా చేశాడు. ఇవాళ ఈ భాషలో చెప్పాలి. భగవద్గీత వింటున్నప్పుడు అర్జునుడు యోగ స్థితిలో నిలకడ చెందాడు. నిలబెట్టింది ఎవరంటే కృష్ణుడు. కృష్ణుడు కూడా సహజ సమాధి స్థితిలో ఉన్నాడు. ఇవాళ ఆ SSY లో ఉన్నాడు ఆయన. ఉండి transmit చేశాడు. మనం అనుకున్నట్లుగా రాగాలతో పాడి, దాని మీద వ్యాఖ్యానాలు చేస్తూ భగవద్గీత చెప్పలే. three minutes twenty eight seconds లో transmit చేశాడు. అది భగవద్గీత. ఇదంతా యోగ స్థితిలో ఉన్నవాడు, ఇందాక చెప్పిన time and space ని దాటినప్పుడు కొన్ని కొన్ని గంటల అవసరం మనకు లేదు. అందుకే స్వామి ధ్యానం విషయంలో ముందు ఇరవై ఎనిమిది నిమిషాల నలభై నాలుగు సెకన్ల time సాధారణమైన వ్యక్తులకు చెప్పినా, ధ్యానంలో మహోన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నేను వెళ్ళాను అనటానికి గుర్తు ఏమిటంటే eleven seconds చాలు మనస్సుని దైవం మీద నిలబెట్టగలిగితే అన్నారు. పదకొండు సెకన్లు. ఇరవై ఎనిమిది నిమిషాలు మనమందరం పెట్టగలం. పదకొండు సెకన్లు ఎవరు నిలబెట్టగలరో వాడు ఉత్తమ ధ్యాని అన్నారు. చాలా tough. చాలా కష్టం. అసలు కాళ్ళు, చేయి సర్దుకునేప్పటికే పదకొండు సెకన్లు అయిపోతుంది. కదా. మన దృష్టిలో ధ్యానం అంటే దీర్ఘ ధ్యానమే ధ్యానం. అదంతా మన CVR లో నేను ధ్యాన యోగం మీద, ధ్యాన వాహిని మీద తీవ్రమైన వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళాం. తర్వాత విందాం అది. అం-అంటే ధ్యానం కానీ, యోగం కానీ రెండుగా కనిపిస్తున్నటువంటి ఒక సాధనా భూమికలు. సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క యోగ భూమిక ఇవాళ ఆచార మానవుడికి కాక, ఆచార మానవుడికి మాత్రమే అక్కరకు వచ్చేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే అట్లా వెళ్ళాలి. మనం ఉన్నాం. practical గా ఎట్లా చేయాలి? చూద్దాం. మనం సదాశివ బ్రహ్మేంద్రుల అయిపోవాలని కోరుకోక్కర్లే, అంత అవసరం మనకు లేదు. మనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు. దానిలో సుమారుగా పద్దెనిమిది గంటలు మనం ఈ ప్రపంచంలో జాగ్రదవస్థలో ఉంటాం. మిగిలినవి మన దగ్గర ఆరు గంటలు. ఆరు గంటలలో సుమారు ఐదు గంటలు గట్టిగా నిద్రపోతాం. ఓ గంట అటూ ఇటూగా. మనకోసం మనం మేల్కొన్నది ఎప్పుడు? మనకోసం మనం జీవించింది ఎప్పుడు? మనకోసం మనం ఖర్చు పెట్టింది ఎప్పుడు? ఈ సమయాన్ని గనక ఒక్కసారి audit చేస్తే అసలు మనతో మనం కూడి లేం. మనతో మనం కూడి ఉండకుండా నాకు యోగం కావాలి, యోగ లాభం కావాలి, యోగ ఫలితం కావాలి, నేను యోగిని అయిపోవాలి అని అనుకుంటే యోగత్వాన్ని ఎట్లా పొందటం? కాబట్టి ముందు మనం ఏం చేయాలి? మనతో మనం కూడి ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడి ఉండాలంటే, ప్రపంచానికి మన అవసరం ఎప్పుడు లేదో అది మన సమయం. ఎప్పుడు లేదది? పొద్దున ఐదు గంటలకి ఈ ప్రపంచం మన గురించి ఏమీ ఆలోచించటంలే. అసలు దానికి మనతో పనే లేదు. అసలు మనం ఉన్నామో లేమో కూడా దానికి అక్కర్లేదు. ఇది సత్యం. మనకు కూడా ఇంకా ప్రపంచం మేల్కొనలేదు. దాంతో కూడా మనకు పని లేదు. ప్రపంచానికి మనతో పని లేదు, మనకి ప్రపంచంతో పని లేదు. ఆ సమయాన్ని మనతో మనం కూర్చి ఉంచుకోవాలి. ఇంట్లో వారు మిగతా వారు పడుకున్నారా? లేచారా? మన పని కాదు. మనం లేచాం. ఎవరికి వారే అనుకోవాలి. లేచి ఆ పది నిమిషాలు, పదకొండు నిమిషాలు మనతో మనం గనక కూడి ఉన్నట్లయితే ఈ సహజమైనటువంటి ఒక ఆనంద భూమిక మనకు కలుగుతుంది. ఎట్లా? కలిగినట్టు ఎట్లా? దానికేమన్నా అనుభవాలు వస్తాయా? సిద్ధులు వచ్చేస్తాయా? రేపు ఏం జరగబోతున్నదో ఇవాళ చెప్పేస్తామా? ఎందుకు చెప్పటం? రేపు ఏం జరగాలో జరగనివ్వండి. దాన్ని మనం ఆపే ప్రయత్నం ఎందుకు చేయాలి? అది చేయకూడదు. మరి ఏం-ఏం లాభము అంటే, పదకొండు నిమిషాలు గనక మనతో మనం కూడి ఉన్నట్లయితే మిగతా ఇరవై మూడు గంటల ఆ balance time ఏదైతే ఉన్నదో అనంత శక్తి మన యందు విజృంభిస్తుంది. ఒక్కచోట concentrate అవుతుంది. ఎక్కువ సమయంలో చేసే పని అతి తక్కువ సమయంలో చేయగలుగుతాం. ఏ పని చేసినా సునిశ్చితంగా చేస్తాం. మంచి కౌశల్యంతో చేస్తాం. అంటే with perfection and precision చేస్తాం. ఈ రెండూ జరిగిన తర్వాత విజయం లభించక ఏమవుతుంది? సమయానికి లోబడి చేస్తున్నాం, perfect గా చేస్తున్నాం, precise గా చేస్తున్నాం, అర్థం ఎరిగి చేస్తున్నాం, శక్తివంతంగా చేస్తున్నాం, అందంగా చేస్తున్నాం. We are presenting the most beautiful and endearing form.తర్వాత మన కార్యకలాపం మన కార్యకౌశల్యం చూసి అందుకుంటున్నటువంటి వాడు ఎంత ఆనందపడుతున్నాడు వాడికి ఆనందం కలిగిస్తున్నాం గా ఆ ఆనందం నీవు కోటానుకోట్ల రూపాయలు ఇచ్చినా వాడు ఆ ఆనందాన్ని పొందడు ఇంకొద్దిగా పట్టుకురండి అంటాడు ఇది యోగ భూమిక సాధారణమైన స్త్రీమూర్తి మీరంతా ఉన్నారు గనుక మీకు కూడా మీరు కేవలము కుటుంబ వ్యవహారాలలో మాత్రమే మీ శక్తి యుక్తులను అన్నింటినీ వినియోగించకుండా మీరు కూడా మీ కోసం కొంత సమయాన్ని ఖర్చుపెట్టుకోండి మీ కోసం ఉంచుకోండి అది అదిగో ఆ తెల్లవారుజామున స్నానం చేయాలా మళ్ళీ ఉప్పు ప్రశ్నలున్నాయి స్నానం చేయాలా ఏం చేయాలి ఏమీ చేయొద్దు స్వామి చెప్పారు సోఫాలో కూర్చుని కూడా ధ్యానం చేయొచ్చు చేయాలని అనుకుంటే ఎవరు కాదన్నారు సుఖాసీనం అంటే ఏమిటి నీకు ఏది సుఖమో ఏది అనుకూలమో అది ప్రధానం మిగతావన్నీ మనం తగిలించుకున్నవే ఆచారం వేరు సాంప్రదాయం వేరు అలవాటు వేరు అనుకూలత వేరు ఇందులో ప్రధానం ఏమిటంటే అనుకూలతే ప్రధానం ఫలానా కాలంలో జరిగినట్టు ఇవ్వాల జరగాలనుకోవటం దానిని మించిన శఠత్వం మూఢత్వం మరొకటి లేదు కాలం మారింది యుగం మారింది యుగ ధర్మం మారింది ఇవ్వాళ మనం మన కళ్ళ ముందే కాలం ఎంత వేగంగా పరిగెత్తుతున్నదో నిన్న మొన్న కొత్త సంవత్సరం వచ్చినట్లుంది అప్పుడే ఒక నెల అయిపోయింది అంటే వేగం ఒకప్పుడు ఇంత వేగం లేదు కాలానికి కాలం పరిగెత్తుతున్నదా మనం ఎక్కువ పరిగెత్తుతున్నామా విచారించినట్లయితే కాలం మనల్ని పరిగెత్తిస్తున్నది ఇది సత్యం అందుకే ఇక్కడ మళ్ళీ సత్యసాయి భగవానుడి మాట ఆయన చెప్పిన ప్రతి మాట జీవితానికి అక్కరకు వస్తుంది ఏం చేస్తున్నావు అని అంటే ఒకాయన ఏదో కాలం వెళ్లబుచ్చుతున్నాను స్వామి ఇప్పుడు ఏం చేయడానికి లేదు కదా పెద్దవాడినైపోయాను అంటే ఆ ఏం చేస్తున్నావ్ అని మళ్ళీ అడిగారు కాలం వెళ్లబుచ్చుతున్నాను స్వామి అని మళ్ళీ గట్టిగా స్వామికి వినపడేటట్టుగా అరిచాడు సుమారుగా స్వామి మెల్లగా అన్నారు కాలమే నిన్ను వెళ్లబుచ్చుతున్నదేమో జాగ్రత్త పడుతున్నావా అన్నారు కాలం మనం వెళ్లబుచ్చలేం కాలమే మనల్ని వెళ్లబుచ్చుతుంది అంటే వెళ్లేట్టుగా చేస్తుంది ఎక్కడికి స్వస్థానంలోకి మనదైనటువంటి హృదయ స్థానంలోకి ఇవన్నీ యోగంలో ఏర్పడేటువంటి పరమాద్భుత భావనలు ఇవన్నీ కూడా ఈ భావనలు పుస్తకాల్లో నుంచి రావు ఇవి ఎక్కడా రాసి ఉండవు మరి ఎక్కడి నుంచి వస్తాయి ఒక యోగికి ఆత్మ కావాలి మనకి ఆత్మ ఉంది potency ఉంది దానిని ధ్యానాత్మ చేయాలి జ్ఞానాత్మ చేయాలి యోగాత్మ చేయాలి సదాశివ బ్రహ్మేంద్రుల వారు పరమాద్భుతంగా వాదించగలిగిన వాడు మౌనం వహించటం అనేది యోగంలో ఒక పతాక స్థాయి బాగా మాట్లాడగలిగినటువంటి వాడు మౌనం వహించటం అతను సాధించుకున్నటువంటి విషయం మాట్లాడగలడు కానీ మౌనం వహిస్తున్నాడు ఎట్లా అంటే అతని సాధన మౌనంలో పూర్ణమైంది పూర్ణ మౌనంలో ఉన్నటువంటి వాడు పరమాద్భుతంగా మాట్లాడుతున్నాడు అంటే introvert is becoming an extrovert అది సమాధి స్థితిలో నుంచి అతనికి అబ్బినటువంటి ఒక యోగం ఆ యోగం కూడా it's all phase ఈ phase ఇట్లా నడుస్తుంటుంది ఇది శాశ్వతం కాదు ఇంతకుముందు సత్యం కాదు రేపు జరగబోయేది సత్యం కాదు ఏది అంటే ఇవ్వాళ ఈ క్షణాన ఏం జరుగుతున్నదో ఇది మాత్రమే సత్యం అందుకనే స్వామి the present is omnipresent అని చెప్పారు సదాశివ బ్రహ్మేంద్రుడు కాల దేశ కలనా అతీత స్థాయిలో సంచారం చేసినప్పటికీ కూడా he lived in the present ఆ ఉన్న present ని బలీయం చేసుకున్నారు స్ఫూర్తివంతం చేసుకున్నారు తనలోకి తాను అంతర్ముఖులు కాగలిగారు అనేక సిద్ధులు ఏర్పడినప్పుడు అనేకమందికి రోగాలు మాన్పించారు అవన్నీ ఆ మహిమల జోలికి మనకు వెళ్ళం కాబట్టి చేయవలసినవన్నీ వారు కూడా చేశారు కానీ ఏది చేస్తున్నా ఎన్ని చేస్తున్నా అందులో నా ప్రమేయం ఏమీ లేదన్న భావనలో ఆ సమాధి స్థితిలో నిలకడ చెందారు కనుక సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి మనందరం కూడా ఇవాళ ఒక వందనం చేసి మౌనంగా పరమాద్భుతంగా యోగ భూమికని ఆవిష్కరించి ఈవేళ the so called transcendental meditation is nothing but సహజ సమాధి యోగ SSY దాన్ని పూర్తిగా మనం చక్కగా తెలుగులో అనుకుందాం ఇకపై అట్లా అనుకుంటూ ఉంటే ఆ విద్యకి బలం వస్తుంది అనుకుంటూ ఉంటే ఆ శాస్త్రం బలపడుతుంది ఆ బలపడే దిశగా మనందరం కూడా దానికి కొంత సాధన చేయాలి అలాగే కాస్త రెండో పార్శ్వంలోకి వెళదాం ఇది చాలా ప్రధానమైన పార్శ్వం సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు మనతో పాటు ఉన్నటువంటి ఒక మహాత్ముడు ఆయన ఆయన కూడా ఆంధ్రదేశానికి చెందిన వాడు అంటే తెలుగు దేశానికి చెందిన వాడు ఆయన పేరు చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారు ఆయనని స్మరించకుండా ఈ యోగ విషయాలు మాట్లాడుకోవటానికి ఒకవేళ మాట్లాడుకున్న అది పూర్ణం కాదు గనుక వారిని ప్రపంచమంతా చందోలు శాస్త్రి గారు అని పిలిచేది అది అట్లా ఉంచుదాం ఎవరు ఈ చందోలు శాస్త్రి గారు ఏం చేశారు అంటే లలితా సహస్ర నామ పారాయణం చేయటం ఈ ప్రపంచం ప్రపంచంలో ఇవాళ ఈ కాలంలో చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి విషయం ప్రతిచోటా లలితా సహస్రం ఎక్కడికి వెళుతున్నాం అంటే ఆ పారాయణానికి వెళుతున్నానని స్త్రీమూర్తులు గుంపులు గుంపులుగా వెళుతున్నారు చేస్తున్నారు చెయ్యాలి కలియుగానికి అధిష్టాన పరదైవతం లలితాదేవి గనుక మహా త్రిపురసుందరి దేవి గనుక శక్తివంతమైనటువంటి అధిష్టాన దైవత కాబట్టి లలితని మాత్రమే చేసుకుంటూ స్త్రీలంతా చేస్తూ వెళ్ళాలి అట్లా వారి ఉపాసనా మార్గంలోలలితాదేవి ఉపాసన చేసుకున్నారు ఆయన. ఏం కోరి ఉపాసన చేశారు? ఏమి కోరకుండా చేశారు. అది ఆయన ప్రత్యేకత. నిష్ఠ, బ్రహ్మనిష్ఠ, ఆత్మనిష్ఠ, కర్మనిష్ఠ, యోగనిష్ఠ అన్నింటినీ ఒక్కచోట పుంజీభూతం చేసి, చేస్తూ చేస్తూ వెళుతూ ఉంటే ఉపాసనా బలమంతా ఆయనకు కలిగింది. ఎంత అద్భుతంగా కలిగింది అంటే, మీరు ఆశ్చర్యపోతారు. ప్రతిరోజూ అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ లలితాదేవి ఆయన ఉపాసన చేసుకునేటువంటి గుమ్మం దగ్గరికి వచ్చి సజీవంగా నుంచున్నది. బాలగా. బాలగా దర్శనం ఇచ్చేది. దర్శనం అంటే హాలూసినేషన్ కూడా కావచ్చు, మనోభ్రాంతి కావచ్చు, ఏదో ఆయన బాగా ఉపాసన చేశాడు కాబట్టి ఆయనకు కనబడుతున్నది అనుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడారు ఆమెతో. మాట్లాడి, "అమ్మా! హయగ్రీవుల వారు, అగస్త్యుల వారు కలిసి నీకు వెయ్యి నామాలు రాసేసి ఇచ్చారు. అది లోకమంతా చదువుతున్నది. ఏమో అవన్నీ నేనేం రాయలేదు. రోజూ నేను ఏదో నీ గురించి కాస్త అనుకుంటున్నాను గనుక మా వాకిట్లోకి వస్తున్నావ్. అంత గంభీరమైనటువంటి పదజాలం లేకుండా ఉరికే నిన్ను చిన్నమ్మ అని పిలవవచ్చునా?" అని అడిగారాయన. "అలాగే పిలుచుకోరా" అంది. "పేరులై ఉందిరా పిలుచుకో" అంది. ఈ బాలమ్మ అన్నమాట. బాల రూపిణిగా వచ్చిన అమ్మవారు. జీవితంలో కొన్ని సంఘటనలు యోగులకి చాలా తీవ్ర సంఘటనలు ఏర్పడుతాయి. అవన్నీ ఆ యోగంలో వాళ్ళు సాధించుకున్నటువంటి స్థితుల్ని మనకి తెలియజెప్పడం కోసమే. ఒకరోజున ఆయనకి కడుపులో నొప్పి అంటే ఆ రోజుల్లో దాన్ని శూల వ్యాధి అనేవాళ్ళు. తీవ్రమైన శూల వ్యాధి వచ్చింది. మంత్రం కుదరటంలే, ధ్యానం కుదరటంలే, మనస్సు కుదరటంలే. అమ్మవారి కోసం ఏదన్నా కాసేపు మౌనం వహిద్దామంటే ఆ లోపల ఉన్నటువంటి బాధ ఆయన్ని కూర్చోనివ్వటంలేదు. అట్లా ఉండగానే పన్నెండు అయిపోయింది. ఆయన లోపల అంతర్లీనంగా ఒక్క మాట అనుకున్నారు. కాసేపు నాకు ఈ ఉపాసన అయ్యేదాకా ఈ బాధ పక్కకి వెళితే తర్వాత ఎంత పెట్టినా పర్వాలేదు కదా అని ఎక్కడో లోపల ఆయనకు ఒక ఆలోచన ఉంది. అమ్మవారు ఆ రోజు ఆయన ఉపాసన చేయకపోయినా పన్నెండు గంటలు అవగానే వచ్చింది. "ఏమిరా! ఈ వేళ ఎట్లా ఉన్నావు?" అన్నది. ఈ 'రా' అని పిలుచుకున్నవాడు చిన్నవాడు ఏం కాదు. చాలా పెద్దవారు ఆయన. అమ్మవారు కదా ఆమె అట్లాగే మాట్లాడుతుంది. "అమ్మా! శూలబాధ చాలా ఎక్కువగా ఉంది. ఈ వేళ అసలు నీ-నీ మీద నా మనస్సు లగ్నం కావటంలేదు, అటూ ఇటూ పోతున్నది. శరీర అవస్థని దాటానని అనుకున్నాను కానీ, దాటలేదురా అని లోపల ఉన్న బాధ నాకు చెప్తూ ఉన్నది." "మరి ఏం చేయమంటావ్?" అన్నది. "నువ్వేమన్నా తగ్గించగలిగితే కాసేపు నీ గురించి మనస్సు ధ్యానంగా ఉండి తర్వాత పడే యాతనేదో మళ్ళీ రేపు పొద్దున్న దాకా పడతాను. నాకేం లోపం లేదు, లోటు లేదు" అన్నాడు. "అవును ఇంతకీ ఎందుకు వచ్చిందిరా? నేనెందుకు తీర్చాలి?" అని అడిగింది రెండో ప్రశ్న. "ఏమోనమ్మా! నీకు తెలియాలి. మోసి మోసి శంకరుల వారు త్రిశూలం దాచుకోలేక నా కడుపులో పెట్టినట్టు ఉన్నాడు." అని చమత్కరించారు. మొయ్య భగవంతుడే మొయ్యలేని స్థితి వస్తే మానవుడిని నేను ఎలా మొయ్యగలను అని దాంట్లో ఒక అంతరార్థం. "చమత్కారివి కదరా నాన్నా!" అన్నది అమ్మ. "అది నువ్వే కదమ్మా!" అన్నారీయన. చూడండి మాట్లాడితే ఆ స్థాయి. అప్పుడు "మరి ఇప్పటికిప్పుడు తగ్గిస్తాను కానీ, శారీరకమైన రుగ్మతలు పోవాలి, పోగొట్టుకోవాలి, రోగం తగ్గాలి అంటే నువ్వు చేసుకున్న తపస్సులో కొంత ఖర్చు అవుతుందిరా! మరి ఏం చేద్దాము?" అని అడిగింది. "తపస్సు ఖర్చు అవుతుందా? వద్దులే అమ్మా! ఈ యాతనేదో నేను పడతాను." అన్నారాయన. "పోతే పోయింది. మళ్ళీ ఇంకా ఎస్తావ్. పది వేల జపం ఎక్కువ చేసుకుంటాను. ముందు కడుపు నొప్పి తగ్గించమనలేదు." "అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి నాన్నా" అన్నది బాలమ్మ. రాఘవ నారాయణ శాస్త్రి గారున్నారు. "ఎప్పుడు జరిగిందమ్మా చరిత్రలో? అన్నీ నువ్వనుకున్నట్లే జరుగుతాయి. పిచ్చి వాళ్ళం మేము వింటూ ఉంటాం." అని చమత్కరించారు. కడుపు నొప్పి పోయింది. ఇది యోగ భూమికలో ఒక అద్భుత స్థాయి. అలాగే అటువంటి మహాత్ముడికి ఉత్తమోత్తముడైన కొడుకు పుట్టాడు. బహు అందగాడు. వేదాధ్యయనంలో ఒక ఉత్తమోత్తమ స్థాయికి వెళుతున్నటువంటి వాడు. ఆయన ధ్యాననిష్ఠలో వాడు అల్పాయుష్కుడు అని తెలుసుకున్నారు. భార్యకి చెప్పలేరు. ఆవిడ తట్టుకోలేదు. కానీ ఆయనకి నిజం తెలుసు. ఏం చేయాలి? అదిగో అట్లాగే పన్నెండు గంటల వేళ రోజూ వస్తుందిగా మళ్ళీ వచ్చింది. "తప్పకుండా నీ కొడుకుని బతికించుకోవడం పెద్ద కష్టం కాదు. నువ్వు చాలా తపస్సు చేశావు. ఇప్పటివరకు నువ్వు చేసిన తపస్సు అంతా ధారపోస్తే నీ కొడుకు ఇంకొక పన్నెండేళ్ళు బతుకుతాడు. ఆ పని చేయమంటావా?" అని అడిగింది. "ధారపోయవలసింది నేను కదమ్మా! నువ్వెలా చేస్తావ్? నేను ధారపోసాక కదా నీ పని మొదలయ్యేది." "వద్దులే" అన్నారు. "ఒకవేళ ఈ తపస్సు చేసిన ఫలితం నా దగ్గరే ఉంటే ఏమవుతుంది?" అని అడిగారు రెండో ప్రశ్న. అంటే నువ్వు ఉత్తమ లోకాలకి పోతావు అటువంటివి అనలేదు ఆమె. "ఉంటే, నువ్వు తపస్సు చేస్తూ ఉంటే ఈ సర్వ ప్రపంచానికి శాంతి కలుగుతుందిరా" అన్నది. "అమ్మా! ప్రపంచంలో శాంతి కోసం నా తపస్సు అట్లాగే ఉండని, వాడి దారిన వాడిని వెళ్ళని" అన్నాడు. అది, అది యోగ భూమిక. చాలా రసార్థమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా. అలాగే వాళ్ళ ఇంట్లో ఓ ఉత్సవం జరుగుతుంటే సర్వ సంభారాలువెండి సామాను దొంగలు వచ్చి పట్టుకుపోయారు ఇంటికి కన్నం వేసి. సరే అది రాఘవ నారాయణ శాస్త్రి గారి సొమ్ము అంటే పవిత్రమైన సొమ్ము కాబట్టి పోలీసులకు వాళ్ళు చిక్కారు. వాళ్ళకి ఏ శిక్ష వేయాలి? వాళ్ళని తీసుకొని వచ్చారు. నిర్ణయం చెప్పమని అడిగారు. మీ సొమ్ము దొంగతనం చేసిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళని ఏం చేయమంటారు? పోలీసులకు అప్పజెప్పటం తప్పదు. చేయమంటారా? చూడండి ఒక యోగి యొక్క ఆ perception ఎలా ఉంటుందంటే దొంగతనం అవసరం కోసం చేశారు వాళ్ళు. వాళ్ళ అవసరమూ తీరలేదు. నా ఇంట్లో ఉన్న వస్తువులు కాసేపు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినాయి. మళ్ళీ అవే వస్తువులు మళ్ళీ నా ఇంటికి రానే వచ్చినాయి. వీళ్ళు గనక జైలుకు వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళు అన్నం ఎలా తింటారు? వాళ్ళ దారిన వాళ్ళను వదిలిపెట్టండి అని. అది. అలాగే ఆయన ఎవరినీ చెయ్యి జాచి ఆశించలేదు, యాచించలేదు. వచ్చిన వాళ్ళందరికీ వేద విద్య నేర్పారు. ప్రతిరోజూ కొన్ని పదుల మంది భోజనం చేసేవాళ్ళు. చెయ్యాలి అంటే ఎవరో ఇచ్చే వాళ్ళు ఉండాలి. నిండుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య, ఆమె పేరు శ్రీదేవి. ఆమె వచ్చి, "మరి ఇవాళ కష్టమవుతుందేమో పన్నెండు గంటలకి భోజనం తయారు చేయలేను" అని ఆయన ముందు గోడు వెళ్లబోసుకుంది. "ఇన్నాళ్ళు నువ్వే చేశాను అని అనుకుంటున్నావా? చూస్తూ ఉండు ఏం జరుగుతుందో" అన్నారు. "వదిలేద్దాం మనం బాలమ్మ చూసుకుంటుందిగా" అన్నారు. ఈ మాటలు అవుతున్నాయో లేదో మూడు బళ్ళ నిండా, ఒక దాని నిండా బియ్యం, రెండో దాని నిండా ధాన్యం వచ్చి bucket లో పడ్డాయి. నమ్మకం ఉండాలి. భగవంతుణ్ణి పరీక్ష పెట్టడానికి ఇటువంటి పనులు మనం చేయకూడదు. నమ్మకం ఉంటే ఇవే జరుగుతాయి. ఆ సమయానికి భగవంతుడు ఒక రూపంలో వచ్చి మన మర్యాదను కాపాడతాడు. మన గౌరవాన్ని కాపాడతాడు. మన అవసరాన్ని తీరుస్తాడు. అది భగవత్ ప్రేరితంగా జరుగుతుంది. వారు ఇంకా అనేక సంఘటనలో ఒక్క సంఘటన మళ్ళీ ఇవాళ యోగ భూమిక లో చెబుతాను. శృంగేరి పీఠాధిపతుల వారు వారి దర్శనం కోసం చందోలు వచ్చారు. మామూలుగా యతిరాజులు వచ్చినప్పుడు వారికి భిక్షా వందనం చేయాలి, భిక్ష పెట్టాలి అంటే భోజనం పెట్టాలి. పీఠం నడవటానికి కొంత డబ్బు కూడా ఇవ్వాలి. అది సామాజిక ధర్మం అది, కుటుంబ ధర్మం. వచ్చి వచ్చి రఘునారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చారు భోజనాలు అయిపోయినాయి. ఎప్పుడైతే వారి దర్శనం కోసం శృంగేరి వారు కూడా వచ్చారో వారి దర్శనం కోసం జనం వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయిపోయినాయి. ఇక స్వామి వారికి డబ్బు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఏం చేశారంటే నవ్వుతూ చమత్కారంగా చిరునవ్వు నవ్వుతూ రఘునారాయణ శాస్త్రి గారి వైపు చూస్తూ, "మరి మీరు మాకు ఇవ్వవలసినటువంటి సంభావన సంగతి, దక్షిణ సంగతి ఏం చేస్తున్నారు?" అని అడిగారు. తన ఒంటిమీద కప్పుకున్నటువంటి శాలువా తీశారు ఆయన. తీసి నేల మీద పరిచారు. దాని నిండా ఒక వెయ్యి చిల్లులున్నాయి ఆ శాలువాకి, వెయ్యి చిల్లులు. నేలమీద ఇట్లా పరిచారు quiet గా ఆ సమాధి యోగ స్థితిలో కూర్చున్నారు. వచ్చిన వారందరూ దాంట్లో డబ్బు వేశారు. అంతా మూటగట్టారు. వారికిస్తుంటే శృంగేరి స్వామి వారు అన్నారు, "కాశ్మీర్ శాలువాలలో లేని మహత్యం ఈ చిల్లుల శాలువాలో ఉన్నది. మాకు చిల్లుల శాలువా కూడా ఇవ్వండి మా దృష్టిలో అది అక్షయపాత్ర" అన్నారు. అది. శిథిలము శరీరమే శిథిలమైపోయేది ఉండేది కాదే. శరీరాన్ని కప్పుకున్న వస్త్రం అందం కోసం కాక నిష్ట కోసం వేసుకోవాలి. ఆ నిష్ట ఆత్మనిష్ట కోసం వేసుకోవాలి. భగవద్దర్శనాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉండాలి. ఆంధ్రదేశం నుంచి కంచి వెళ్లి పెద్దస్వామి వారి దగ్గరికి, చంద్రశేఖర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, "మాకు ఏదన్నా విభూతి ఇవ్వండి, మాకు ఏదన్నా అక్షింతలు ఇవ్వండి, మీ ఆశీర్వచనం ఇవ్వండి" అని అడిగితే, "ఇంత దూరం ఎందుకు వచ్చారు? చందోలు శాస్త్రి గారి దర్శనం చేసుకుంటే అన్నీ తీరేవి కదా! వారి వాకిట్లో ఒక బావి ఉన్నది. ఆ బావి తవ్వినప్పుడే వారణాసిలో ప్రవహిస్తున్నటువంటి గంగా దానితో అనుసంధానమై ఉన్నది గనుక వారి వాకిట్లో ఉన్నటువంటి ఆ కూపం అంటే బావి, ఆ బావి నీరు గంగాజలమే. ఇకపై ఇంత దూరం శ్రమపడి రాకండి. వారి దర్శనం చేసుకోండి. అక్కడ ప్రసాదం స్వీకరించండి. తీర్థం తీసుకోండి. మీరు హాయిగా చల్లగా ఉండండి. వారు సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తులు" అన్నారు కంచి మహాస్వామి. అటువంటి రాఘవ నారాయణ శాస్త్రి గారు అట్లాగే అవతార మూర్తుల వలనే ఆయన కాలం చెల్లాలి, అవతార పరిసమాప్తి చేయాలి. ఆ సమయం వచ్చింది. వచ్చినప్పుడు యోగబ్రహ్మ నిష్ఠలో ఆయన ఉన్నారు. 1995 లో ఆంధ్రదేశంలో అప్పటికి newspapers బాగా విస్తృతంగానే ఉన్నాయి. వారు శరీరాన్ని చాలించినప్పుడు స్మశానానికి తీసుకువెళ్లి చితిమీద పడుకోబెట్టారు. దానికి చితి అంటించగానే వారి హృదయ స్థానంలో నుంచి లలితాదేవి సశరీరంగా బాల రూపంలో అక్కడున్న వారందరికీ దర్శనం ఇచ్చింది. అది ఫోటోల రూపంలో ఇవాళ it is available.చరిత్ర సాక్ష్యం అది అంటే పరమేశ్వరుని గురించి అంటూ అంటూ వింటూ వింటూ ఉంటే మనలో పరమేశ్వర భావాలు మొలకెత్తుతాయి అది చాలా ప్రధానం భక్తిని ఒక ఆవేశం గా గాక సేవని ఒక చాకిరీ కాక మనం మొయ్యలేని బరువుని మన నెత్తిన పెట్టుకుని అడుగు వెయ్యలేక చతికిల పడిపోయేకంటే పరమేశ్వరుడు ఏది అనుగ్రహించాడో ఏం చెప్పాడో దాన్ని ఆచరించగలిగితే అది ఉత్తమ యోగం నా దృష్టిలో మిగతాదంతా యోగశాస్త్రం యోగాన్ని గురించి కాసేపు మాట్లాడుకోవటానికి ఇవన్నీ విచారణలు అసలు సిసలు యోగం ఏమిటి అంటే help ever hurt never is the real yoga love all serve all is the real realistic yoga ఈ నాలుగు మహా వాక్యాలు మన జీవితంలో practice చేయటం మొదలు పెడితే సర్వ యోగాలు శక్తులు కూడా మన యందు ప్రవేశిస్తాయి కానీ మనం వాటిని sloganise చేసుకుంటున్నాం చేయకూడదు మహాపాపం ఎందుకంటే సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి నోటి నుంచి వెలువడినటువంటి మాటలు ఇవాళ ఈ ఆధునిక కాలానికి అవసరం గనుక ఈ భాషలో చెప్పారు అప్పుడు సంస్కృత భాషలో అప్పుడు చెప్పారు తర్వాత తెలుగులో చెప్పారు లేకపోతే ఇంకో భాషలో చెప్పారు భాష ప్రధానం కాదు ఏం చెప్పారన్నదే ప్రధానం రాఘవ నారాయణ శాస్త్రి గారు ఏనాడూ కూడా దేనిని ఇది నాది అని claim చేయలేదు ఇక్కడ సందర్భం ఉంది కాబట్టి ఒక విషయం చెప్తాను ముక్కోటి ఏకాదశి నాడు మొన్న మలక్ పేట లో ఒక దేవాలయంలో మాట్లాడటానికి నన్ను పిలిచారు general గా నేను దేవాలయాలకు వెళ్ళను ఎందుకంటే గంట కొట్టేవాడు ఒకడు ప్రసాదం కోసం వచ్చేవాడు ఒకడు వచ్చి పోయే వాడు ఒకడు it is indeed a nuisance వాడు భగవంతుని మీద భక్తితో ఏం రాడు ఏదో కాలక్షేపానికి వచ్చి విని పోతాడు అక్కడ మన సమయం quality time ని మనం పాడు చేసుకోకూడదు గనుక వాటికి నేను అంగీకరించను కానీ ఆ రోజున సాధకులు అడిగారు కదా అని నేను వెళ్ళాను వెళ్తే రాఘవ నారాయణ శాస్త్రి గారి ప్రస్తావన వచ్చింది ఈ ప్రస్తావన చేయటానికి ముందు అక్కడ పిల్లలు వేదం చదివారు ఆ వేదం చదివిన పిల్లలని ప్రశంసించడానికి వీల్లేదు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆ వేదం నేర్పిన గురువు ఉత్తమోత్తముడు అని ఆ ఆచార్యుడు ఎక్కడున్నాడో పిలవండి అంటే ఆయన్ని తీసుకువచ్చారు శ్రీధర శర్మ అని కుర్రవాడు అదే చూట్టం ఇదంతా అయిపోయింది చాలా బాగా చెప్పారు అని అంటే ఆయన కూడా కూర్చున్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత బయటకి సభ అయిపోయాక బయటికి వస్తుంటే ఆయన ఏమన్నారంటే శ్రీధర శర్మ ఇవాళ నా జన్మ చరితార్ధం అయింది దానికి కారణం ఒక్కటే ఈ శరీరము ఈ వాక్కు ఈ వేద స్పురణ ఈ వేద భావన ఈ పిల్లలందరూ వేదాన్ని ఇంత చక్కగా చెప్పగలగటం ఇదంతా మా గురుదేవులు అయినటువంటి రాఘవ నారాయణ శాస్త్రి గారి అనుగ్రహం వారు ఇక్కడిదాకా వచ్చారన్నమాట ఎవరికి తెలుసు ఆయన పేరు ఎవరికైనా తెలుసా తెలియదే ఎందుకు తెలియదంటే మనం చదవం స్వాధ్యాయం చేయం స్వాధ్యాయం చేయాలి మనకు తెలియని ముప్పై ఆరు వేల మంది యోగులను చదవాలి ఎంత time పడుతుంది కానీ దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మహిమల దగ్గరే అయిపోతాం ఆ యోగి చేసిన మహత్ కార్యాలన్నీ మనకిష్టమైపోతాయి ఆయన ఎలా జీవించారో ఆ ప్రయత్నం మాత్రం మనం చేయం యోగాత్మగా జీవించాలి అంటే యోగిగా మన మనస్సును మార్చుకోవాలి మనం భోగంలో ఉన్నాం కదా ఇవాళ నాకివేమీ అక్కరలేదు అనే వాడిని ఒక్కడిని చూపించండి లేదు రెండో వాడు చాలు అనేవాడిని చూపించండి లేదు ఇది కాకపోతే మరొకటి అసలు మీకేం కావాలి అంటే మీరడిగి మీరు ఇస్తున్నవి నాకక్కర్లేదు గాని నాకు కావలసిన లిస్టు ఉందని ఇచ్చేవాడున్నాడు తప్ప ఏమీ వద్దు అనేవాడు లేడు సర్వమూ ఈశ్వర ప్రీతి కోసం చేస్తున్నాననేవాడు లేడు ఇవన్నీ లేకుండా దేనినీ వదిలిపెట్టకుండా యోగత్వం కావాలి ధ్యాని కావాలి తపస్వి కావాలి అంటే ఎట్లా మనస్వి అయినటువంటి వాడు తపస్వి కావాలి తమస్సుని చేధించుకుంటే తప్ప తపస్సు వెలగదు ఈ తపస్సు వెలిగిన తర్వాత లోపల ఉన్నటువంటి రోచిస్సు అంటే splendor ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది ఎప్పుడైతే ఆ వెలుగు మూలం తెలుస్తుందో అప్పుడు అంతస్సు వెలుగుతుంది లోపలది internal purity takes on యోగంలో ఉన్న లాభాలివి మిగతావన్నీ ఇవాళ చాలా దురదృష్టం మళ్ళీ పునః యోగా క్లినిక్ ఇటువంటి మాటలు ఈ దేశంలో వినపడకూడదు శరీరానికి కాకపోతే దేనికి రోగం వస్తుంది శరీరానికి రోగం వచ్చింది అంటే మన మనస్సు బాగా లేదు గనుకనే ఆ శరీరానికి రోగం వచ్చింది కోరికలు మితిమీరుతున్నాయి గనుకనే మనం మొయ్యలేక ఆ భారం మొయ్యలేక ఆగిపోతున్నాం మన నడక ఆగిపోతున్నది తీరిన కోరికలు తీర్చగా తీరని కోరికలు లోపల ఉండగా రోగం రాక ఏమవుతుంది ఏ కోరిక ఎన్నాళ్ళు ఏ వయస్సులో ఎప్పటిదాకా ఉండాలని విచారణ చేసుకున్నట్లయితే ఒక్క కోరిక ఉండాలి అది సత్యసాయి భగవానుడి మాటల్లో దాని పేరు భగవద్రతి భగవంతుని యందు మాత్రం అని నమ్మకే స్వామి అనేక ఉపన్యాసాల్లో ఎంత అందంగా చెప్పారంటే ఏడుస్తున్న వాళ్ళను చూస్తున్నాను నిరంతరము ఏడిచే వాళ్ళను చూస్తున్నాను ఏడిచాను ఏడిచాను అంటున్నారు మీ కోసం ఏడిచినారే గాని దైవం కోసం ఒక్కరోజు ఏడ్చినారా ఒక్కణ్ణి చూపించమన్నారు దైవం కావాలి అని ఏడ్చిన వాడు ఉన్నాడా లేడన్నారు ఆయన.భగవంతుని యందు ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ గౌరవం, ఆ నిష్ఠ ఇవి ఏర్పడితే దానిని మించిన యోగం మరొకటి లేదు. మిగతావన్నీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ రాఘవ నారాయణ శాస్త్రి గారిని ఈవేళ మనం మాట్లాడుకున్నాం అంటే, లలితా సహస్ర నామ పారాయణం చేయలేదు ఆయన. అమ్మా! అవి సంస్కృతంలో నీకు పెట్టబడిన పేర్లు తల్లీ! నా పేరు నాకు తోచిన పేరు నేను పెట్టుకొని నిన్ను పిలవవచ్చునా? చిన్నమ్మ అచ్చ తెలుగులో అడిగారాయన. నీ ఇష్టం రా నాన్న! అంది. ఆమె సర్వనామ ప్రియ. ఎట్లా స్వామి అంటారు. నువ్వు ఎట్లా పిలిస్తే నాకు వినపడుతుంది. నువ్వు రహీమ్ అను, అల్లా అను, ఇంకో ముల్లా అను ఏ పేరు పెట్టి పిలిస్తే నాకైతే వినపడుతుంది. నీకు నమ్మకం ఉండాలి, ఏమని నాకు వినబడుతున్నది అని. వినబడుతున్నది అన్న నమ్మకం నీకు లేదు గనుక రెండు, మూడు సార్లు అరుస్తూ ఉంటావు. నువ్వు అరవటానికి ముందే నువ్వు అరవబోతున్నావు అని నాకు తెలుసు అన్నారు స్వామి. అదే అంటే కొన్ని దౌర్భాగ్యాలు ఏర్పడితే స్వామికి రోజు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాయాలా? స్వామిని అవమానించటం కాదా? స్వామికి రోజు ఉత్తరం రాస్తేనే మన కష్టం ఆయనకు తెలిసినట్లు. అంటే ఆర్ యు పర్మిట్టింగ్? ఆర్ యు కన్ఫైనింగ్ ద విశ్వాత్మ? నీకు ఆ భావం కలగటానికి కారణం ఏమన్న మూలాన్వేషణలోకి నీవు గనుక వెళ్ళినట్లయితే మళ్ళీ ఆ ప్రేరణ భయవంతుడే. కాబట్టి ఆధునిక కాలంలో సత్యసాయి భగవానుడు మళ్ళీ అక్కడి దాకా రావాలి. ఎందుకని అంటే సదాశివ బ్రహ్మేందుల్ని మనం చూడలే. మిగతా వారందరినీ మనం చూడలే. పరమహంస యోగానంద ని గాని, త్రయలింగ స్వామి వారిని గాని చూసిందే ఒకటి, దొరికిందే కొమ్మ అన్నారు విశ్వనాథవారు. చెట్టుకి యాభై కొమ్మలు ఉంటాయి. నువ్వు ఏం పట్టుకున్నావో అదే నీ కొమ్మ అంతే కదా. ఆ కొమ్మని పట్టుకున్నావు. పట్టుకున్న కొమ్మలో నుంచి దానిమీద పళ్ళున్నాయి, ఆకులున్నాయి, నీడ ఇచ్చింది. రేపో, మాపో పోతే శరీరాన్ని కాల్చడానికి ఆ కట్టె అవసరం అవుతుంది. ఈ వైరాగ్య భూమికలో గనుక మనం లేకపోయినట్లయితే కేవలం మహిమల ద్వారా లేదా భగవంతుణ్ణి, స్వామిని కీర్తించి, కీర్తించి, కీర్తి ఏం లాభం? లాభం లేదు. లేదు కాక లేదు. లాభం ఎప్పుడు అంటే స్వామి వలె జీవించే ప్రయత్నం మనమందరం కూడా చేయాలి. స్వామి జీవించిందంతా కూడా యోగ భూమికే. ఒక పధ్నాలుగు ఏళ్ల పిల్లవాడు నేను సాయిబాబాను అని ప్రకటించటం ఒక ఎత్తయితే, తన కళ్ళ ముందే కన్న తల్లిదండ్రులున్నారు, తోబుట్టువులున్నారు, ఊరు వాళ్ళున్నారు మీతో నాకు సంబంధం తెగిపోయింది అనటానికి ఎంత గుండె ధైర్యం కావాలి. తర్వాత ఏమవుతుంది? ఎవరు ఆదుకునేవారెవరు? అన్నం పెట్టేవారెవరు? స్వామి ఇవన్నీ ఆలోచించారా? మనం ఈ దేశం నుంచి, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేలోగా యాభై రకాలుగా చెప్తారే. అక్కడ జాగ్రత్తగా ఉండు, అక్కడ అటు రాత్రిపూట పది దాటాక వెళ్ళకు, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఎన్నో చెప్తూ ఉంటామే. మరి పధ్నాలుగు ఏళ్ల పిల్లవాడు ఇలా చెప్పాడు అంటే మనిషి అయితే చెప్పడు, ఆయన పరమాత్మ గనుక చెప్పారు ఆయన. తన కళ్ళ ముందే తన తల్లి కనబడుతున్నప్పటికీ ఇంటి అమ్మ అని పిలిచారు. గృహ అమ్మాయి. ఇవన్నీ మనం ఆ యోగాత్మ భూమిక లో నుంచి మనం స్వామిని యోగ స్వరూపంగా ఆవాహన చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ దేవిని వదిలిపెట్టేసాడు కన్నతల్లి. పెరిగింది ఎక్కడ? యశోదా మాత దగ్గర పెరిగాడు. శ్రీరామచంద్రుడు కౌసల్య గర్భానందనుడై వచ్చాడు. కైక దగ్గర పెరిగాడు. కన్న తల్లిదండ్రుల దగ్గర యోగాత్మలు ఉండవు. ఎవరు ప్రేమిస్తారో, ఎవరు పెంచవలసి ఉన్నారో, అందుకే స్వామి అన్నారు, ఈశ్వరమ్మ కన్నతల్లి అయితే కరణం సుబ్బమ్మ కనుగొన్న తల్లి అన్నారు. కన్న తల్లులు అందరం ప్రతి వాడికి ఒక కన్నతల్లి ఉంటుంది. కనుగొన్న తల్లులు ఎంతమంది అని. ఇతను పరమాత్మ, ఇతను దివ్యాత్మ, మహా దివ్య పురుషుడు, ఈ ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన పరబ్రహ్మమూర్తి అని ఈశ్వరమ్మ అనుకోలేదే. అనుకున్నది ఎవరంటే కరణం సుబ్బమ్మ. యశోదాదేవి కూడా విష్ణు మాయని అనుభవించింది దేవకి కాదు, యశోదే అనుభవించింది. కలయో వైష్ణవ మాయో అన్న అనుభవాలు ఎవరికొచ్చినాయి? శ్రీరామచంద్రుడికి యుద్ధ విన్యాసం నేర్పింది ఎవరు కైక, కౌసల్య కాదు. కాబట్టి కన్న తల్లులు వేరు, కనుగొన్న తల్లులు వేరు. యోగాత్మలు వేరు, యోగ భూమికలు వేరు. నా వరకు సత్యసాయి భగవానుడిని దేహంగా మాత్రమే కాక దేహాతీతమైనటువంటి ఒక స్థితిలో అనుభవించినప్పుడు కలిగేటువంటి భావాలు యోగశాస్త్రం యొక్క స్వ-సమగ్ర స్వరూపమే స్వామి. అర్థం చేసుకోవాలి. అది ఒక ఫెర్వరుతో, ఒక ఎమోషన్తో, ఒక మూఢభక్తితో చెప్పే విషయం కాదు. సాధన చేసి, సాధనానుభవంతో పరమాత్మను దర్శనం చేసి, ఆ దర్శనాన్ని రంగరించి, దానికి అనేకమైనటువంటి శాస్త్రాలలో ఉన్న అనేకమైన విషయాలన్నింటినీ కూడా నిరూపణ ప్రాయం చేసుకొని నిదర్శన భూమికలోకి వెళ్ళినప్పుడు మాత్రమే సత్యసాయి భగవానుడు మనకు పరదైవతంగా కనిపిస్తారు. లేకపోతే హి ఈజ్ ఆల్సో లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ ఆర్ ఎక్స్ట్రార్డినరీ పర్సన్. ఏదో ఒక మహాత్ముణ్ణి దర్శనం చేశాం. మహాత్ముడు మాత్రమే కాదు పరమాత్మ. ఎట్లా అంటే ఇగో ఇవన్నీ. సన్యాసాశ్రమ స్వీకారం చేయకుండా, గురువు లేకుండా తనకు చెందిన వారందరినీ తన కళ్ళ ముందే కాదనుకొని తాను ఎక్కడ పుట్టారో అక్కడే ఉండి, అక్కడే అవతార పరిసమాప్తి చేసినటువంటి ఏకైక అవతారం భగవాన్ సత్యసాయి. అందుకే మొన్న చెప్పాను, దేర్ ఈజ్ నో ఛేంజ్ ఇన్ హిజ్ డ్రెస్ ఆర్ అడ్రస్. ఒక్కటే పుట్టపర్తి. అక్కడే ప్రకటన చేశారు, అక్కడే ఉన్నారు. సర్వ ప్రపంచాన్ని ఆయన తన దగ్గరికి తీసుకువచ్చారు. ఇవాళ కాస్త నాలుగు ముక్కలు మాట్లాడే ప్రతివాడు సోములవారైపోతున్నాడు. ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం కావాలి? ఈ దేశంలో ఏం గొడ్డు పోయిందని? అసలు ఏం కావాలని? ఇటువంటి తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి వంటి మహాత్ముల జీవితాన్ని చదివినప్పుడు మనం చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాం.మనకు లెక్కకు మిక్కిలిన ఈ విషయాలు మన దగ్గర ఉన్నాయి. అన్నీ వదులుచుకుంటూ వదులుచుకుంటూ ఒలుచుకుంటూ స్వామి దానికి ఒక చిన్న ప్రమాణం చెప్పారు. ఎక్కడికో వెళ్తావు నీ యందు ఉన్నటువంటి ప్రేమ చేతో అభిమానం చేతో గౌరవం చేతో ఒక బత్తాయి పండో కమలా పండో మీ చేతిలో పెడతారు. నువ్వేం చేస్తావ్? పై తోలు ఒలుస్తావ్. తొన తీస్తావ్. తొల చరుకుతావ్. అంటే మళ్ళీ దాన్ని open చేస్తావ్. అప్పుడు కదా నీవు ఆ రసాస్వాదనం చేయగలిగింది. తోలు అభిమానంతో ఇచ్చారని తోలుతో సహా తింటామా? తినమే వలవాలి. లోపలికి తొలుచుకుంటూ వెళ్ళాలి. We must become the inner self and that is the real self. ఆ real self తో attach అయిన వాళ్ళు అనుసంధానమైనటువంటి వాళ్ళు యోగ భూమికలో నెలకొంది చెందుతారు గనుక యోగ ప్రవాహంలో ఈవేళ మనం ఇద్దరు మహాత్ములని చాలా సమగ్రంగా చాలా లోతుగా విచారణ చేసుకోగలిగాం, చేయాలి. అట్లాగే రాబోయే కాలంలో అనేక మంది మహాత్ములు చిన్నా, చిటుకు వాళ్ళందర్నీ పక్కన పెట్టిన ట్లయితే ఇది కేవలం ఒక ఐదు రోజులతో ముగిసేది కాదు. అంటే మిగతా వారి గురించి మాట్లాడే అవకాశం ఉండదు గనుక వీలైనప్పుడల్లా ఈ యోగాత్మల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే ఇది ఒక అనంత యోగ ప్రవాహమై రేప్ పొద్దున ఈ దేశం వదిలిపెట్టి tourist గానైనా ఇంకో దేశానికి మనం వెళ్ళినప్పుడు మీ దేశం గురించి కాసేపు చెప్పండి అంటే మనం IT రంగంలో సాధించిన విజయాలు, అంతరిక్షంలోకి వెళ్ళిన విజయాలు, అవి అన్ని దేశాలు సాధిస్తున్నాయి. అంతరంగంలోకి ఎలా వెళ్ళాలో చెప్పగలిగిన స్థాయికి స్వామి భక్తులు అందరూ వెళ్ళాలి. అంతరంగంలోకి వెళ్ళాలి అంతరిక్షంలోకి ఏముంది కొన్ని కోట్లు ఉంటే వెళ్ళచ్చు ఎవడో sponsor చేస్తే పోయి రావచ్చు. మన లోపలికి మనం ఎట్లా వెళ్ళాలి? కేవలం మన వల్లనే మనం వెళ్లగలం కాబట్టి స్వీయ సాధన చేత నిష్కాపట్యం చేత నిశ్చలత్వం చేత నిర్మలత్వం చేత నిష్ఠ చేత నియతి చేత శ్రద్ధ చేత సమర్పణ చేత శరణాగతి చేత అన్నింటికంటే వినయం చేత. commitment ఉండాలి. అది ఏదైనా సరే. ఆ commitment గనక లేకపోతే జీవితంలో మనం ఏమీ సాధించలేం. ప్రతి దానినీ కాలానికి లోబడి చేయాలి, కాలాన్ని దాటకూడదు. అది ఒక spiritual discipline. అలాగే ఏ సమయంలో ఏ పని ఎట్లా చేయాలో భద్రంగా చేయాలి. కర్మ ఫలమంతా మన account లో పడిపోవాలని కాకుండా పరమేశ్వరా ఇవాళ కూడా మనం ఇవాళ అనుకోవాలి. ఈ కుర్చీలో నుంచి లేచే ముందు స్వామి! నీ దయవల్ల కాసేపు మాట్లాడుకోగలిగాం. అసలు ఈ మాట్లాడిందంతా నువ్వే, మేము మాట్లాడినట్టుగా అనుకుంటున్నాం. నిజానికి విన్నది నువ్వే, నీ గురించి నీవే అనుకొని నీవే విన్నావు స్వామి. దీని వల్ల ఏమన్నా మంచి ఫలితం గనక ఉంటే అది నీ account లో వేసేస్తున్నాం. మళ్ళీ ఎట్లా empty గా మెట్లెక్కు వచ్చామో అట్లాగే empty గా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించు అని ప్రార్థించాలి. దాని పేరు పూర్ణాహుతి. ఆ పూర్ణాహుత్యాంతంలో కలిగేటువంటి బ్రహ్మానంద భావన కంటే మిగతా ఏ వస్తువు కూడా గొప్పది కాదు కాదు. పరమేశ్వరుడు సాక్షాత్తు సత్య సాయి భగవానుడిగా ఈ ప్రపంచంలోకి విచ్చేసి ఎనభై ఆరు సంవత్సరాలలో సుదీర్ఘ కాలం స్వామివారు మనల్ని మన-- తమతో ఉంచుకొని తమ పక్కన పెట్టుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచ్ఛన్నంగా బయట వెలుపల లోపల అంతటా అన్నిటా అన్నీ అంతా తానే నడిపించినటువంటి ఈ పరమాద్భుత జీవితంలో జరిగేటువంటి మనందరి జీవితాలలో జరిగేటువంటి పరమోత్కృష్ట సంఘటనలు అన్నీ పుణ్యాలన్నీ కూడా పరమేశ్వరార్పితము సత్య సాయిరామ దివ్య చరణామృతానికి మనం సమర్పిస్తూ సాయిరాం.
SSSMC · audio
Yoga Pravaham - 12
Yoga Pravaham - 12
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 40:49
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
- 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
- 26 min 7
Yoga Pravaham - 07
- 42 min 8
Yoga Pravaham - 08
- 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
- 40 min 12
Yoga Pravaham - 12
Now playing - 19 min 13
Yoga Pravaham - 13
- 28 min 14
Yoga Pravaham - 14
- 21 min 15
Yoga Pravaham - 15