No transcript for this section.
అరవింద యోగి యోగేశ్వర కృష్ణుడు వంటి యోగే? అరవింద యోగం అంటూ ఒక special path ఉన్నదా? అది ఈ వేళ విచారణ. ఇది చాలా క్లిష్టమైనటువంటి ఒక యోగ భూమిక లో అరవిందుల వారి ప్రస్థానం సాగింది. ఎందుకు క్లిష్టము అంటే, వారున్న సమయంలోనే ది మదర్, శ్రీ మాత అంటారు. ఆమె వచ్చి వారి శిష్యురాలుగా సుశ్రూష చేసింది. వారు సుమారుగా ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంతో సంబంధాలు తెంచి వేసుకున్న తర్వాత, ఆశ్రమ పర్యవేక్షణ నిర్వహణ ది మదర్ చేశారు. కానీ ఎలా చేశారంటే, యోగ భూమిక లో చేశారు. comparison లేదు కానీ, ఆధ్యాత్మిక యోగ స్థితిలో ది మదర్. ఆవిడ చేరుకున్నటువంటి స్థితి కూడా సామాన్యమైనది ఏం కాదు. ఈ అరవిందుల వారు యోగి ఎప్పుడయినాడు అని. ఈయన సిద్ధాంతం ఏమిటి? ఈ ప్రపంచానికి ఆయన ఏం చెప్పారు? అందరికీ తెలిసిన ఒక మాట, అంటే ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్న మాట "all life is yoga" అది అరవిందుల వారు. all life అంటే? మనం బతికున్నంత కాలమా? మనిషి అహంకారం చేత all life is yoga అంటే, నేను పుట్టినప్పటి నుంచి పోయే దాకా అంతా యోగ అని అనుభవించుకుంటాడు. అరవిందుల వారి వ్యాఖ్యానం అది కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి జీవ పరిణామం ఏదైతే ఉన్నదో, ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా యోగంలోనే ఉన్నాయి అని అర్థం. అవి కూడా ఒక యోగి శరీరాన్ని పొందాలి అంటే, మానవ జన్మ దాకా చాలా తాపత్రయ పడాలి. వాటి వాటి స్థాయిల్లో తెలియకుండానే సంచారం చేయాలి. ఇది అరవింద తత్వం. ఎవరీ అరవిందులు అన్నప్పుడు, ఊరికే ఆయన biography కొద్దిగా తెలియాలి, తెలియని వాళ్ళ కోసం గనుక. ఆయన ICS కావాలి అనుకున్నారు. ఆయన తండ్రి ఇండియాలో పిల్లల్ని చదివించకూడదు అని ఆ రోజునే నిర్ణయించుకున్నాడు. కనుక వాళ్ళని లండన్ పంపించేశారు. సరిగ్గా ICS పరీక్షలకి రాబోతున్నటువంటి సమయంలో జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, ఆ రోజుల్లో ICS కావాలి అంటే గుర్రపు స్వారీ తెలిసి ఉండాలి. అది కూడా ఒక భాగం training లో. ఆయన గుర్రపు స్వారీ చేయడంలో fail అయిపోయారు. కనుక ICS తప్పిపోయింది. అసమర్థుడై తప్పిపోలే. జీవితంలో ఏర్పడే అనేకానేక సంఘటనలని అన్నింటినీ మనం గమనించినప్పుడు, ఏదో జరగనప్పుడు మన మంచికే జరిగింది అనుకోవటం నేర్పుతుంది జీవితం. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంటే, జీవితం ఎట్లా అవుతుంది? మనం అనుకోనిది జరిగితే దాని పేరు జీవితం. దాన్ని మనం జీవించాలి. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది అనుకోండి, దేవుడు ఎందుకు మనకి? ఇంక ఆయన్ని అడిగేది లేదు, ఆయన దగ్గర నుంచి తెచ్చుకునేది లేదు. సరే, ఆయన ఓడ ప్రయాణం చేశారు. ఇండియాకి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుండగా ఇంటి దాకా వచ్చారు. అప్పుడే ఆయన ఎదుర్కొన్నటువంటి వార్త తన కోసం ఎదురు చూస్తున్నటువంటి తన తల్లి మరణించింది అని. అంటే జీవితం ఇంతేనా? ఎవరీ తల్లి? ఆమెను చూడాలని నేను రావటం ఏమిటి? కొన్ని గంటలలో చూడబోతున్న నేను ఆమె నుంచి దూరం కావటం ఏమిటి? అని ఇప్పుడే మరణించటం ఏమిటి? ఇది ఎవరు చేస్తున్నారు ఈ పని? ఎట్లా జరుగుతున్నది? అని ఒక తాత్విక చింతన ప్రారంభమైంది. మనిషికి తత్వచింతన ప్రారంభం కావాలంటే ఒక ఆఘాతం కలగాలి. ఈ ఆఘాతాన్ని గురించి విచారణ చేద్దాం. రామాయణమంతా, మనం అద్వైత రామాయణం, అధ్యాత్మ రామాయణం, ఇంకో రామాయణం, బాల రామాయణం వింటాం. ఆఘాత రామాయణం ఎప్పుడూ వినలే, కదా. శ్రీరామచంద్రుడి కథ మొదలు ఆఘాతమే మొదలైంది. అంటే separation. అనుకోని సంఘటనలే ఆయన జీవితంలో ఎదురైనాయి. అయోధ్య నగర దర్శనం చేశాడు, వైరాగ్యం కలిగింది. అంతఃపురం లోకి వచ్చాడు, కూర్చున్నాడు. ఏమిటి ఈ ప్రపంచం? ఒక వైరాగ్యంలో మనస్సు కూరుకుపోయింది. ఆ సమయంలో వశిష్టుల వారు అడిగారు, "ఎందుకిట్లా ఉన్నావు?" అని. "ఏమో గురుదేవా, ఈ ప్రపంచం అంతా దుఃఖారామంగా కనిపిస్తున్నది. ఏమి అందమైన భూమి అన్నారు, ప్రపంచం గొప్పది అన్నారు. కానీ ఎక్కడ చూసినా దుఃఖము, నిరాశ, నిరాశ, వైరాగ్యం ఇవే కనపడ్డాయి తప్ప, నాకు ఆనందం ఎక్కడా కనపడలేదు." అన్నాడు రామచంద్రుడు. రామచంద్రుడే గనక నిరాశ్యంలో మునిగిపోతే, ఇక అవతారం పూర్తయ్యేది ఎప్పుడు? రావణుడు చంపబడేది ఎప్పుడు? కనుక ఆయన ఏం చేశారు, వశిష్టుల వారు యోగవాశిష్టాన్ని అంటే జ్ఞాన మార్గాన్ని, మనస్సు యొక్క మర్మాన్ని ముప్పై ఆరు వేల శ్లోకాల్లో చెప్పారు. అంటే మనస్సును గనక నియంత్రించుకుంటే, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది."జగతియెల్ల మధుర సౌందర్యమయమంచు కన్నుమూసి కలలు కాంచినాను. కన్నువిప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యమగురు వసుధయెనచు" ఎందుకొచ్చాం ఇక్కడికి అంటే ప్రపంచంలో ఉన్న చెడు మంచి మనకు సంబంధం లేదు. మనం ఏదో పని చేయాలని వచ్చాం. దేనికోసమో మనం రప్పించబడ్డాం. మనం ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా మిగతా అన్నీ పనులు చేస్తాం, ఇబ్బందుల పాలైపోతాం. చేయవలసిన పని చేయాలి. చదవవలసిన చదువు చదవాలి. ఆ చదువు ఏమిటి? "చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలె" ఆత్మవిద్య నేరగాలి. అది అధ్యాత్మశాస్త్రం కావాలి. సరే రాముడు పెరిగాడు మా-- మనసు మరల్చుకున్నాడు మళ్ళీ ప్రపంచంలో పడ్డాడు మామూలుగా ఉన్నాడు. పన్నెండేళ్ళు వచ్చినయి. తండ్రి ముగ్గురు తల్లుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఆటపాటలతో ఆనందగీతికగా సాగిపోతున్నటువంటి రామకథ విశ్వామిత్రుడి రాకతో ఒక పెద్ద మలుపు తిరిగింది. "నీ కొడుకును పంపించు, నేను యజ్ఞయాగాదులను రక్షించుకోవాలి" అన్నాడు విశ్వామిత్రుడు. ఇది దశరథుడికి ఆఘాతం. పన్నెండేళ్ళ పిల్లవాడిని బాణాలు ఇచ్చి అరణ్యంలోకి ఏ తండ్రయినా పంపుతాడా? లేక, లేక పుత్రకామేష్టి యాగం చేసి వరపుత్రుడుగా వచ్చినటువంటి రామచంద్రుణ్ణి నునులేత వయస్సులో అరణ్యానికి పంపటానికి ఏ తండ్రి మాత్రం ఒప్పుకుంటాడు? "అయ్యా! వాడు చిన్నవాడు. యుద్ధం చేయలేడు. నేను యుద్ధాలలో ఆరితేరిన వృద్ధమూర్తిని. నన్ను తీసుకెళ్ళండి. నేను చేస్తాను. మీకేం కావాలో అన్నీ యాగాలన్నీ రక్షిస్తా. సర్వ సంభారాలు నేను సమకూరుస్తా. నాకు ఆజ్ఞ ఇవ్వండి" అన్నాడు. దైవ నిర్ణయంలో ఎవరు ఏ పని ఎప్పుడు చేయ్యాలొది నిర్ణయించబడి ఉంటుంది. ఇవాళ మనమే చేస్తున్నాము, మనము చేస్తున్నాము అని కాక, ఇప్పుడు మనం, మన తర్వాత ఇంకోడు, మన పక్కనే ఇంకోడు, మనతోటే ఇంకోడు, ఎంతోమంది చేయాలి. కానీ ప్రతి వాడికి భగవంతుడు ఒక కార్యక్రమాన్ని నిర్దేశించున్నాడు. ఆ కార్యకలాపం జరుగుతూ ఉండాలి. ఆఘాతమే కారణమై విశ్వామిత్రుని నుంచి రామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరూ బయటికి వెళ్లారు. మంచికే జరిగింది. తాటక సంహారం, అహల్యా శాపవిమోచనం, సీతా పరిణయంతో ఆ ఘట్టం పూర్తయింది. సరే చక్కగా వచ్చాడు రాముడు వెనక్కి. ఇంకా కొడుకులు కోడళ్ళు ఇల్లంతా కళకళలాడి పోతున్నది. దశరథుడు మహానందాన్ని పొందుతున్నాడు. ఒకరోజున ఆయన మనసుకు స్ఫురణ కలిగింది, "నేను పెద్దవాడినై పోతున్నాను. రాజ్యభారం మోయలేను. రామచంద్రుడికి అన్ని అర్హతలున్నాయి. రేపే పట్టాభిషేకం" అన్నాడు. పరిషత్తుని పిలిచాడు. సభ పెట్టాడు. అందరికీ ముందు తన మనస్సుని విప్పి చెప్పాడు. "రాముడు రాజైతే అంతకంటేనా?" కానివ్వండి అన్నది పురప్రజంతా కూడా. రాముణ్ణి కూడా పిలిచారు. "నాయనా! మంగళస్నానం చెయ్. దీక్ష వహించు. రాత్రంతా ఉపవాసం ఉండు. సీత మీ అత్తవారి దగ్గర ఉండి ఉపవాసం చేస్తుంది. నువ్వు నీ గదిలో ఉండి దీక్ష వహించు. చక్కగా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు. తెల్లవారేప్పటికి చేని చీనాంబరాలతో సర్వాలంకార భూషితుడవై ఇక్ష్వాకు వంశ కిరీటధారణ చెయ్యాలి రామా" అన్నాడు దశరథుడు. అవుదల దాల్చాడు రాముడు. రాత్రయింది. రాత్రి పన్నెండు గంటల తర్వాత తొలి వేకువజాముకు ముందు రాముడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కైక దగ్గరకు వెళ్ళాడు. తలుపు కొట్టాడు. "అమ్మా! ముప్పై ముక్కోటి దేవతల కంఠస్వరాలు నాకు వినిపిస్తున్నాయి. ధ్యానంలో నా మనస్సు కుదరటం లేదు. కుదిరింది అని నేను ఎలా చెప్పను, కుదరటం లేదు. దైవ ప్రేరితమైనటువంటి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. 'రామా! నువ్వు సింహాసనం ఎక్కద్దు' అంటున్నాయి. నన్నేం చేయమంటావు?" అని అడిగాడు. ఈ మాట అనటానికి, అడగటానికి ముందే కైక దశరథుడి దగ్గర వరాన్ని పొందింది. ఆ వరంలో ఒక భాగం భరతుడి పట్టాభిషేకం, రాముడి అరణ్యవాసం. అప్పటికే మాట తీసుకున్నది. ఆమె ఎప్పుడైతే రాముడు వచ్చి ఈ మాట అన్నాడో, ఆమె ఒక్క మాట అన్నది. "నాయనా! దైవ శాసనం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. కానీ, నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి" అన్నది. మళ్ళీ రాముడు వెళ్ళాడు గదిలోకి. ఉపవాసంలో, దీక్షలో మునిగిపోయినాడు. తెల్లవారేప్పటికి ఆయనకి తెలీదు. దశరథ మహారాజు ఆజ్ఞాపించాడు. "నువ్వు అయోధ్య వదిలి అరణ్యాలకు వెళ్ళాలి. పధ్నాలుగు ఏళ్ళు వెళ్ళాలి." ఇది దశరథుడి జీవితంలో ఆఘాతం. అంతేనా? రాముడి అవతారంలో కూడా ఆఘాతమే. ఆఘాతం అంటే గ్యాప్, గల్ఫ్. విడదీయరానంతటువంటి ఒక స్పేస్ ఏర్పడుతుంది. సరే కాలగమనంలో కొంత దూరం అయిపోయిన తర్వాత దశరథ మహారాజు మరణించాడు. మరణవార్త రాముడికి కాస్త తీరిగ్గా అందింది. దుఃఖించాడు. తండ్రి పోయినాడు కదా అని. పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు అని ఒక రాముణ్ణి వరపుత్రుడుగా దశరథుడు తెచ్చుకుంటే, ఆ రాముడు ఏం చేశాడు? తన సేవలో రెండు రెక్కలు పోగొట్టుకున్న జటాయువుకి అగ్నిసంస్కారం చేశాడు. ఏది ఎవరికి ప్రాప్తి, విధి ఎట్లా ఉంటుందో చూడండి. అందుకనే రాముడి యొక్క ప్రమాణం ఏమిటంటే, "విధిని నేను ఉల్లంఘించను. విధి శాసనం ఎట్లా ఉంటే దానికి లోబడి మానవుడిగా నేను జీవిస్తాను" అన్నదే శాసనం. అది ఆయన తీసుకున్న నిర్ణయం. అది ప్రమాణం.ఇటు దశరథుడికి ఆఘాతమే అటు రాముడికి ఆఘాతమే. అది అరణ్యమో అయోధ్యో హాయిగా మాట్లాడుకుంటూ భార్యాభర్తలు, మరిది లేదా తన తమ్ముడు లక్ష్మణస్వామి ఉన్నారు. ఏదో కొంత కాలం కరిగి పోతున్నది వనవాసం కూడా తగ్గిపోతున్నది. ఆ సమయంలో బంగారు లేడి కావాలి అని అడిగింది. అమ్మవారు తెలిసి అడిగిందా తెలియక అడిగిందా? ఆఘాతం ఏర్పడాలిగా. "కారణం లేనిదే నింద లేనిదే పొందే పోదు" అని మా సామెత ఉంది తెలుగులో. నింద ఉండాలి. ఫలానా వారు ఎలా పోయినారు అంటే ప్రపంచానికి కారణం కావాలి. ఊరికే పోయాడు అంటే ఒప్పుకోము. ఏదో కారణం చేత ఓహో ఇది వెళ్ళిపోయాడని మన పనిలో మనం పడిపోతాం అది. అలాగే సీతాదేవి రాముడితో ఉండి మళ్ళీ వెనక్కి రావాలి కానీ ఆఘాతం ఏర్పడింది. జగదేక సుందరి అయినటువంటి మండోదరితో హాయిగా జీవితం కొనసాగిస్తున్న రావణ బ్రహ్మకి శూర్పణఖకు జరిగినటువంటి అవమానమే పగై అది కారణమై అమ్మవారిని తీసుకుని అశోకవనంలో పెట్టవలసిన పరిస్థితి రావణ బ్రహ్మకు ఏర్పడింది. అది రావణుడి జీవితంలో ఏర్పడిన ఆఘాతం. వాడు పరమ వీర శైవాచార్యుడు వాడు మామూలు వాడా? వీణావాదనలో యాజ్ఞవల్కుణ్ణి మించిన వాడు. వేదాధ్యయనంలో వాణ్ణి మించిన పౌలస్త్య బ్రహ్మ మరొకడు లేడు. దేహ సౌందర్యంలో జయంత వసంత కంతురులు దాటినటువంటి వాడు. కానీ చూడండి జీవితం ఏది ఎట్లా ఉంటుందో తెలియదు. అలాగే కిష్కింధ కాండకు వచ్చేసరికి అప్పటిదాకా హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేశాడు. శ్రీరామచంద్ర దర్శనం కాగానే లోపల ఒక enlightenment జరిగింది ఆయనకి. రామ సమేతంగా వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి "నిన్నటిదాకా నీవు నాకు యజమానివి. ఇప్పుడు నీకూ నాకూ రాముడు యజమానిగా వచ్చాడు. ఇకపై మనందరం కలిసి రామ కార్యంలో ఉందాం" అన్నాడు. సుగ్రీవుడి జీవితంలో రాజ్యాన్ని, రమణిని పోగొట్టుకోవడం ఒక ఆఘాతం. ఆ కారణంగానే వాలి తన జీవితాన్ని పోగొట్టుకోవటం మరొక ఆఘాతం. వాలి ఎటువంటి వాడు? రావణ బ్రహ్మని తన తోకతో చుట్టి సముద్రంలోకి ఒక్క నిమిషంలో విసిరినటువంటి వాడు. అంతటి బలశాలి. అంతటి బలశాలి రామకార్యంలో లేడు. బలహీనుడు అయినటువంటి, లోలుడు అయినటువంటి సుగ్రీవుడు రామకార్యంలో పాల్గొన్నాడు. ఇది ఆఘాతం. ఎవరికి భోగము? ఎవరికి యోగం? ఏది సంయోగం? ఏది వియోగం? అన్నటువంటి విచారణ చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అట్లాగే పరమ వైరంతో ఉన్నటువంటి రావణ బ్రహ్మ తమ్ముడు విభీషణుడు శ్రీరామచంద్ర ఆవరణలోకి వచ్చి శరణాగతిని పొందాడు. పూర్ణ సత్వగుణ ప్రధానంతో పవిత్రమైనటువంటి రామస్వామి యొక్క ఆవరణలో ఉండి సాన్నిధ్యాన్ని, సామీప్యాన్ని, సాలోక్యాన్ని ఏకకాలంలో అనుభవించి లంకా సామ్రాజ్యానికి రాజైనాడు. ఎప్పుడైనా కలగన్నాడా? అంటే జీవితాన్ని మనం కూడా ఒక్కసారి విచారించి చూసుకుంటే జీవితమంతా separation ఏ. A chain of separation. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రసాని బుడ్డు కోసినప్పుడు అది తొలి separation. ఏడ్చామా? నొప్పి వచ్చి ఏడ్చామేమో. తెలియక మాత్రమే ఏడ్చాం. తర్వాత తెలిసి తెలిసి చాలాసార్లు ఏడ్చాం. ప్రతి వియోగాన్ని, ప్రతి separation ని అదే final అనుకున్నాం. దాని వెనక, దాని వెంట, దాని తర్వాత అనేకమైనటువంటి ఆఘాతాలు ఉన్నాయని మనకు తెలియదు. విధి ఒక్కొక్క దాన్ని open up చేస్తూ ఉంటుంది. పొరలు విప్పుతూ విప్పుతూ వెళ్తున్నప్పుడు ఈ ఆఘాతాలు బయట పడతాయి. ఎప్పటికప్పుడే దుఃఖాన్ని దుఃఖంగా, సుఖాన్ని సుఖంగా, సంతోషాన్ని సంతోషంగా జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి ఆఘాతాన్ని అనుభవించిన వాడు అరవింద్ ల వారు. అది. తల్లి పోగానే ఆయనకి ఈ ప్రశ్నలన్నీ పొటమరించినాయి. కానీ తాత్వికుడు గనుక, బాగా చదువుకున్నాడు గనుక ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పటికి ఈ దేశం స్వాతంత్రాన్ని పొందలేదు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉంది. ఆయనకి ఎన్నో ఆలోచనలున్నాయి. ఈ పరదాస్యం నుంచి ఎప్పుడు మనకు విముక్తి అన్న ఓ బలీయమైన ఆలోచన. కానీ ఏం చేయాలో తెలియదు. తాను ఏమి చేయగలడో కూడా తెలియదు. రెండూ తెలియవు. ముందు అన్నింటికంటే బరోడా మహారాజ్ కళాశాలలో ఓ lecturer గా వెళ్లి join అయినాడు. అక్కడ అనేకమైనటువంటి అంశాలు పాఠంగా చెప్తున్నప్పుడు ప్రధానంగా భారతీయమైనటువంటి దేశ ప్రేమని గురించి మాట్లాడినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఒక్కడు, ఏకాకి, ఎదురుగా ఒక గోడ తప్ప ఏం లేదు. కానీ మూడు ప్రమాణాలు చేసుకున్నాడు, నిర్ణయాలు, సంకల్పాలు. ఒకటి, నా birthday అయినటువంటి ఆగస్టు పదిహేనున ఈ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాలి. అదే నా నిజమైన birthday అని నిర్ణయించుకున్నాడు. తర్వాత జరిగిన సంఘటన ఆయన సంకల్పాన్ని బలపరుస్తున్నది. ఆగస్టు పదిహేరునే అయింది. రెండవది, జీవించి ఉండగానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని కూడా నేను పొందాలి. శరీరంలో ఉండగానే. ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని నేను పొందానో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చైతన్యం నేనుండగానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాలి. రెండు ప్రమాణాలు. గోడ మీద శ్రీకృష్ణ దర్శనం అయింది.ఆనందపడ్డాడు ఆయన జైలు నుంచి బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ అనేక అభియోగాలు దేశద్రోహం నేరాలు మోపబడినప్పుడు అక్కడి నుంచి పాండిచ్చేరి చేరుకున్నారు ఆయన అజ్ఞాత జీవితాన్ని గడిపారు ఒక జర్నలిస్ట్ అయినాడు పేపర్లను నడిపాడు విప్లవ జ్వాలలు రగిలించాడు ఇంకా ఆయన యోగి కాలే ప్రాపంచికమైన దేహాభిమానము దేశాభిమానము ప్రాకృతమైనటువంటి అనేకమైన ప్రజ్ఞా భూమికలన్నీ కూడా పరుచుకుంటున్నటువంటి వేళ ఆ సమయంలో ఆలోచన చేశాడు ఆయన ఈ దేశానికి స్వాతంత్రం రావాలి అని ధ్యానించాడు ఆయన ధ్యానం తాను యోగి కావాలని చేయలేదు దాస్య విముక్తి అయిపోతే ఈ దేశ సంస్కృతిని మనం కాపాడుకుందాం ముందు బయట వాడు వెళ్లిపోవాలి వెళ్లిపోతే మనదేదో మనం జాగ్రత్త పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన బ్రిటిష్ వాళ్ళ దౌష్ట్యం ఈ ప్రపంచాన్ని భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు అలాగే అనేకమైనటువంటి మతాలు హైందవ మతం మీద దాడి చేస్తున్నప్పుడు దానిని నిరోధించాలి అంటే ముందు ఆయన అయింది ధ్యాని అయినాడు చూసారా యోగి కావటానికి ముందు ఆయన అయింది ధ్యాని ధ్యాని అయిన తర్వాత తపస్సు చేశాడు ఏమిటా తపస్సు విప్లవంను నడిపిన వాడు ఉద్యమంను నడిపిన వాడు జర్నలిజం ద్వారా ఒక విదేశీ పాలకుల్ని గడగడలాడించిన వాడు తామస రాజస గుణాలు రెండు లేకపోతే ఆ పని చేయలేడు కానీ తపస్సు ద్వారా ఆ రెండింటిని క్షమింపజేసుకున్నాడు అరిస్తే లాభం లేదు ఉద్యమాలు పట్టుకుంటే లాభం లేదు తీవ్ర తపస్సు వలన ఏర్పడే శక్తి వలననే శత్రువు పరాజితుడు కావాలి అని నమ్మినటువంటి వాడు అది కొత్త విషయం కాదు అస్త్రాలు అంటే మంత్రాలు శస్త్రాలు అంటే బాణాలు అస్త్రము కావాలి శస్త్రము కావాలి శస్త్రాలు అందరూ వాడలేరు అస్త్రాలు కొందరు వాడగలరు రెండింటిని సమన్ ఆయన ఆలోచన చేశాడు ఇది శస్త్రాలు వాడే సమయం కాదు కాలము కాదు కాబట్టి అస్త్రం వాడుదాం ఏమిటా అస్త్రం అంటే తన యందున్నటువంటి ఊపిరిని శక్తివంతమైనటువంటి యోగ సాధనంగా మార్చాడు ధ్యాని అయినాడు యోగి అయినాడు తపస్వి అయినాడు ఆ సమయంలోనే భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశాడు ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం రాశాడు నాలుగు వేదాల మీద అరవిందుల వారు రాసినటువంటి వ్యాఖ్యానం సర్వ సమగ్రమైనటువంటి వ్యాఖ్యానం దానికి ఒక తాత్విక దృష్టే తప్ప మానవీయమైనటువంటి కేవల భౌతిక వాదం దాంట్లో లేదు వేదాలను నిజంగా అర్థం చేసుకోవాలి తాత్విక దృష్టితో అని గనుక ఇందాక అనుకున్న స్పిరిట్యుయల్ సైన్స్ అధ్యాత్మ శాస్త్రం ప్రకారం నేర్చుకోవాలి వేదం అని గనుక అంటే అరవిందుల వారి వ్యాఖ్యానం చదివితే చాలు ఇంకేం చదవక్కర్లేదు మిగతావన్నీ వాటికి ఆ పదాలకి మంత్రాలకి మాటలకి అర్థాలే తప్ప తర్వాత తర్వాత వేద సంగ్రహం మీద వచ్చినటువంటి అనేకమైనవన్నీ కవిత్వము సాహిత్యము ఒక సిద్ధాంతానికి ఒక ఇజంకి లోబడినవే తప్ప అవి సర్వ సిద్ధాంత సార్వభౌమత్వాన్ని సంతరించుకొని చాలా అల్పమైన వ్యాఖ్యానాలు ఒక్క అరవిందుల వారిది తప్ప అరవిందుల వారి యొక్క వేదం మీద వ్యాఖ్యానం నిజంగా వేదాల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఆ ఒక్కటి చదవండి చదవాలి చదివితే ఋషుల యొక్క దర్శనాలు మనకు మనకు కూడా తెలుస్తాయి అదృష్టం ఉంటే కలుగుతాయి కలగాలి అని చదవక్కర్లేదు చదువుతూ వెళ్తే అవే కలుగుతూ ఉంటాయి కలగాలి అని చదివితే కలక్కపోతే అశాభంగం చదువుతూ వెళ్తే కలిగాయి అనుకోండి బోనస్ ఆనందమేగా దర్శనాలు ఎప్పుడైతే ఏర్పడతాయో వేదార్థం మనకు బోధపడుతుంది పదార్థ విజ్ఞానం అంతా యదార్థమైనటువంటి తత్వచింతనా భూమికలోకి జీవుడిని నడిపిస్తుంది కనుక ఆయన ఏమైనారు ధ్యాని అయినాడు తపస్వి అయినాడు జ్ఞాని అయినాడు జ్ఞాని అయి లోకంతో సంబంధాలు తెంచుకున్నాడా ఇక్కడ అరవిందుల వారిని గురించి ఈవేళ యోగ భూమిక లో విచారణ చేయాలి ఎక్స్టర్నల్ పర్సనాలిటీ అండ్ ఇంటర్నల్ పర్సనాలిటీ అని రెండు ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా ఎక్స్టర్నల్ పర్సనాలిటీ లో ఒక బ్యూటీ ఉండొచ్చు ఒక ఆకర్షణ ఉండొచ్చు పదే పదే చూడాలి అన్నటువంటి ఒక మూర్తి మత్వం ఉండొచ్చు అంటే ఒక మానిఫెస్టేషన్ ఉండొచ్చు కదలికలో మెదలికలో ఏవో మనల్ని ఆకర్షించవచ్చు కానీ అవన్నీ ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్ కానీ ఒక ఇంటర్నల్ పర్సనాలిటీ కూడా మనలో ఉంటుంది మనందరిలో ఉంటుంది అది ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మన వాక్కు ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మన చూపు ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మన స్పర్శ ఆ ఇంటర్నల్ పర్సనాలిటీ మనం రాసే రాత అందుకనే while speaking is mere preparedness, writing is exactness అంటారు నువ్వు రాస్తున్నప్పుడు you are that అది కావాలి అది అయితే తప్ప రాయలేవు అది అయితే తప్ప అనలేవు కూడా ఈ అనటానికి రాయటానికి ఒక అభేద స్థితి రావాలి అంటే ధ్యానితో పాటుగా అంటే ధ్యానంతో పాటుగా ధారణ కూడా ఉండాలి ధారణకి ఇవాళ మనకు మామూలుగా అర్థం కావాలి అంటే రిటెన్షన్ అది రిటెన్షన్ ఉంటేనే రిట్రీవల్ ఉంటుంది అంతేగా కంప్యూటర్ కి మీరు ఫీడ్ చేస్తే అది ఏ బాక్స్ లో ఉన్ననివన్నీ మళ్ళీ రిట్రీవ్ చేయగలుగుతారు అసలు లేకపోతే ఎక్కడి నుంచి తెస్తారు అది ఎక్కడో ఒక处 ఉండాలి ఇవాళ అంటే కంప్యూటర్లు వచ్చినాయి లాప్ టాప్ లు వచ్చినాయి ఇంకొచ్చేయి ఇంకొచ్చినాయి ఎన్నో వచ్చినాయి.వీటన్నింటికంటే ఒక సూపర్ కంప్యూటర్ భగవంతుడు మనకిచ్చి పంపాడు మనం వాడం అంతే. That's our mind. The brain is not at all used beyond పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ unfortunately. పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గరికి దాని వాడకం మొదలు పెట్టేప్పటికి వాడు ప్రపంచంలో number one అవుతున్నాడు just పాయింట్ ఫైవ్. మరి ఆ నైంటీ ఫైవ్ పాయింట్-- నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఏం చేద్దాం అని? ఈ పాయింట్ ఫైవ్ తో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ను పట్టుకోవాలి. మనం ఓ పొలానికి వెళ్ళాం అనుకోండి మన పొలమే, గట్టునుంచున్నాం పక్కనున్న మిత్రుడు అడుగుతున్నాడు "మిత్రమా! నీవి ఎన్ని ఎకరాలు?" అని అడుగుతున్నాడు. "ఐదు ఎకరాలు" అన్నాడు సమాధానం ఇచ్చాం. కొలిచి ఇచ్చామా? ఆ గట్టు చూపించి అదిగో అక్కడ తుమ్మ చెట్టు ఉందే, అక్కడ వేప చెట్టు ఉందే అదే మా సరిహద్దు. ఇదంతా కలిపితే ఐదు ఎకరాలు. దేంతో కలిపితే? నువ్వు ఉన్నటువంటి first పాదంతో కలిపితే ఐదు ఎకరాలు. ఇది మినహాయించి కాదుగా. కనుకనే ఈ ప్రమాణం అంతా కూడా జ్ఞాని అయినటువంటి వాడు తనలో ఉన్నటువంటి అపారమైనటువంటి మేధాశక్తి ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ను పట్టుకోవాలి. అందుకై ఈ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు. మనకి పాయింట్ ఫైవ్ లో పాయింట్ టు ఫైవ్ వచ్చేపటికే మనం జ్ఞానులం అయిపోతాం. దురదృష్టం అది. అనుకుంటాం మనం. మనకు అన్నీ వచ్చు అని, మనను మించిన వాడు ఎవ్వడు లేడని, మనకు చాలా తెలుసని అనుకుంటాం. పాయింట్ టు ఫైవ్ కే మనం ఇట్లా అనుకుంటున్నామే, బిరుదులు కావాలి, చాలువాలు కావాలి, సన్మానాలు కావాలి, ఊరేగింపులు కావాలి, చేతి కంకణాలు కావాలి. మరి పాపా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ తెలిసిన వాడు వాడు ఏం అనటం లేదు. నాకిది కావాలి అనటం లేదు. భగవంతుడు ఎప్పుడన్నా ఎవడి పాకెట్ లోకన్నా వచ్చి ఇది నాకు ఇవ్వండి అని అడిగాడా? అనలే. మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను అంటున్నాడు. అది సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆయుష్షు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. మరి జీవుడు ఎందుకని అనలేకపోతున్నాడు? ఇది తత్వ విచారణలో ప్రధానమైన భాగం. అధ్యాత్మ శాస్త్రం మనకు ఏం నేర్పుతుందంటే ఎవరినీ ఏం అడగొద్దు, అవసరం లేదు. దానికి ఏర్పాటు కావాలంటే అది జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది? త్రైలింగ స్వామి యొక్క మహావాక్య రత్నావళి ఎవడన్నా తెలుగులో రాస్తే బాగుండు అని ఓ రోజు అనుకున్నామో లేదో, నమ్మండి నిన్న సాయంకాలం కల్లా మా దక్షిణామూర్తి గారు నా చేతిలో ఆ పుస్తకం పెట్టారు. 1988 లో ప్రింట్ అయింది, ఇది మీ దగ్గర ఉంచుకోండి అని నాకు ఇచ్చారు. నేను నిన్నే చూశా ఆ పుస్తకం. అంటే సంకల్పాలు బలీయంగా ఉండాలి, వాటి పట్ల అపేక్ష ఉండాలి. అది ఎట్లా ఉంటుందో, దాని మూలం ఏమిటో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటున్నప్పుడు ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద్వారా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అర్థమవుతాడు. దీపాలు వెలిగించడానికి దీపాలు అక్కర్లేదు ఒక్క దీపం చాలు. ఒక చిరుదీవిని వెలిగిస్తే అది వెయ్యి దీపాలను వెలిగించగలదు, లక్ష దీపాలు వెలిగించగలదు. ఇది జ్ఞాన భూమికలో, యోగ భూమికకు ముందు జీవుడు సాధించవలసినటువంటి విషయం. ఇక్కడ అరవిందుల వారు తత్వ చింతన అంతా కూడా వేదాధ్యయనం మీద, వేదాల మీద ఆయన Commentary on Vedas అంతా కూడా ఇంగ్లీషులో రాశారు ఆయన. ఎలా రాసేవారు? ఇది ఆశ్చర్యం. రాత్రి కూర్చునేవారు పదకొండు గంటలకి. తెల్లకాయితం మీద పెన్ను పట్టుకునేవారు. తెల్లవారి దాకా ఆయనకి స్పృహ ఉండేది కాదు. తెల్లవారి చూస్తే సుమారుగా నూట ఇరవై పేజీలు కింద రాయబడి ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ధారణ, retention. ధ్యాన, ధారణా స్థితులే సమాధి వైపు నడిపిస్తాయి. సావిత్రి అనబడేటువంటి ఒక మహా కావ్యాన్ని రాశారు ఆయన. It's a magnum opus. ఏం లేదు, సావిత్రి సత్యవంతుల కథ. సావిత్రి ఏం చేసిందంటే యముడితో పోరాడి యగత జీవుడైనటువంటి తన భర్తను వెనక్కి తెచ్చుకుంది. లాజికల్ గా ఆయన రెండు మూడు ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టి సాధించుకొని వచ్చింది. ప్రాణశక్తి, స్త్రీ శక్తి రెండూ ఏకమైనట్లయితే భగవంతుడు Fate is alterable అని చెప్పేటువంటి కథ సతీ సావిత్రి కథ. Fate is unalterable అని అప్పటిదాకా అందరి నమ్మకం. It is alterable. విధిని మనకు కావలసినట్లుగా అన్నివేళలా కాదు గాని కొంత మార్చుకోవచ్చు. ఫ్రీ విల్ ద్వారా-- ఫ్రీ విల్ అనేది మనిషికి ఉన్నదా లేదా అని ఒక మీమాంస. కొంత వరకు అది పనిచేస్తుంది. కానీ అన్నివేళలా కాదు, అందరి యందు కాదు. విధిని మార్చే technique మాకు చెప్పేట్లయితే కష్టాలు లేకుండా చేసుకుంటాం అంటారు. ఆ technique ఏం లేదు. ఎప్పుడన్నా జరగొచ్చు సకృత్తుగా. అందుకనే ఎక్కడో జరిగింది general కాదు generalగా జరిగేది ప్రమాణం అవుతుంది. ఆ generalగా generalize చేసిన విషయం ప్రపంచానికి అక్కరకు వస్తుంది గనుక యోగ భూమికలో ఉన్నటువంటి, యోగత్వాన్ని సిద్ధింపజేసుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి, ధారణా స్థితిలో ఉన్నటువంటి అరవిందుల వారు సావిత్రి మహా కావ్యాన్ని రాశారు. సావిత్రి మహా కావ్యాన్ని ఎలా రాశారు? అరవిందుల వారంటే నాకు అపారమైన భక్తి ఉండవచ్చు గాక, చాలా ఇష్టం ఉండవచ్చు గాక, ఆయనే రాశారు అన్నప్పుడు అధ్యాత్మ శాస్త్రవేత్తగా దాన్ని వెంటనే ఒప్పుకోలేం. ఎందుకనంటే దీనికి మూలం ఎక్కడ ఉన్నది? సతీ సావిత్రి కథ కంటే గొప్ప కథ ఇంకేదన్నా ఉన్నదా? ఇక్కడ ఏదో తన భార్య భర్త పోతే భర్త ప్రాణాన్ని తెచ్చుకున్నది. అది సావిత్రి కథ. కఠోపనిషత్తు చదవండి. నచికేతుడు యముడు వాకిట్లో కూర్చున్నాడు. ముప్పై తిప్పలు పెట్టాడు. ప్రశ్న మీద ప్రశ్న వేశాడు.చివరికి నచికేతుడు వెనక్కి వచ్చాడు. అంటే తన తండ్రి ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు, యాగం చేస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వట్టిపోయిన ఆవులు, విరిగిపోయిన కుర్చీలు, పనికిమారని వస్తువులన్నీ దానం ఇస్తున్నప్పుడు ఈ నచికేతుడు వెళ్లి తండ్రిని అడిగాడు, "దానం ఇట్లా ఇవ్వచ్చా? తప్పు కదా నాన్నగారు. ఎవరికన్నా ఏదన్నా ఇచ్చేటప్పుడు ఎంచి, చూసి, తుడిచి, శుభ్రపరచి అవతల వాడికి ఇస్తామే. ఒక పండు ముత్తైదువు ఇంకో ముత్తైదుకు పండు ఇచ్చేటప్పుడు ఎంచి పండు ఇస్తుంది. మచ్చలు లేకుండా, ఎక్కడా ఏ రకమైన కుళ్ళిపోయిన భావన లేకుండా, నిగనిగలాడుతున్నది, నెంబర్ వన్ ఏదో అది ఇస్తుంది. ఇదేమిటి మన ఇంట్లో పనికిమారని వస్తువులన్నీ ఇచ్చి దీన్ని దానమని మీరు అంటున్నారే?" అని చిన్న పిల్లవాడు విసిగిస్తున్నాడు తండ్రిని. కోపం వచ్చింది. రెండు, మూడు సార్లు జవాబు చెప్పాడు కానీ వీడు వదిలిపెట్టడం లేదు, నచికేతుడు. కోపం వచ్చి ఏమన్నాడంటే, "ఎవరూ అనకూడదు" అని మాట "ఏ తండ్రీ" అని మాటన్నాడు. "నువ్ ఇట్లా అల్లరి చేసి నన్ను ఇబ్బంది పెడితే యముడికి అప్పజెప్తాను" అన్నాడు. కావలసింది అది. అప్పుడు నచికేతుడు అన్నాడు "అయితే నన్నా యముడికి అప్పజెప్తావా లేదా" అన్నాడు. ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనయినాడు తండ్రి. ఏ తండ్రి గాని, ఏ తల్లి గాని మృత్యుదేవతకు నేను అప్పజెప్తాను, నిన్ను చంపుతాను అందుకనే మన తెలుగులో ఒక తిట్టు ఉన్నది. అది ఏ తల్లి నోటా రాకూడదు, తండ్రి నోటా కూడా రాకూడదు. "నీ దుంప తెగ" అంటారు. అనకూడదు. దుంప అంటే మూలం. మూలమే తెగిపోతే వంశాంకురాలు ఉండవు. వంశం నశిస్తుంది. నువ్వు వాడిని తిడుతున్నావ్ అనుకుంటున్నావు కానీ నీ వంశ క్షయాన్ని కోరుతున్నావు. "తథాస్తు" అంటారు అశ్వరి దేవతలు. కనుకనే అసలు ఆ మాటలే, తిట్టే మంచిది కాదు. That is entirely negative energy. అది వాడకూడదు. ఇక్కడ "యముడికి నిన్ను ఇస్తాను" అన్నప్పుడు నచికేతుడు "నన్ను అప్పజెప్పు" అన్నాడు. బాధపడ్డాడు తండ్రి. ఇంత యజ్ఞం చేసి మంచి పని కార్యం, మంచి కార్యం తలపెట్టి చివరికి కొడుకుని యముడికి అప్పజెప్పే దుస్థితి నాకు ఏర్పడిందే అని. ఏం మెత్తబడలేదు. కొడుకు తండ్రి ఎంత ప్రాధేయపడినా నచికేతుడు అన్నాడు "లేదు, నేను యముడ్ని చూడవలసిందే, అప్పజెప్పు. అతను ఎట్లా ఉంటాడో నేను చూస్తాను" అన్నాడు. వెళ్ళాడు. ఈయన వెళ్ళినప్పుడు యముడు పరిమితి వెళ్ళాడు. అక్కడ లేడు, యమలోకంలో లేడు. మూడు రోజులు నిద్రాహారాలు లేకుండా అక్కడ ఉన్నాడు నచికేతుడు. చదవండి కఠోపనిషత్. కథగా చదవకండి, తత్వంగా చదవండి. కథగా చదివితే ఏం ప్రయోజనం లేదు, వేస్ట్. ఊరికే చందమామ కథలా ఉంటుంది. ఎవరికి కావాలి అది. మూడు రోజులయ్యే అప్పటికీ సజీవంగా ఈ కుర్రవాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎందుకు వచ్చాడో తెలియలే. సజీవంగా ఎలా వస్తాడు? తాను వెళ్ళాలి, పట్టుకు రావాలి, యమభటులు వెళ్ళాలి, వాళ్ళు లాక్కు రావాలి, ఏం లేకుండా హాయిగా వచ్చి ఎదురుచూస్తున్నాడే, ఎవడు వీడు అతిమానుషం అనుకున్నాడు. "నువ్వు ఎవరివి?" అన్నాడట. "నేను తర్వాత సంగతి చెప్తాను, ఆ ప్రయత్నం మీదే వచ్చాను. ప్రపంచమంతా నువ్వెవరు, నువ్వెవరు అని అడగటం అలవాటు చేసుకుంది తప్పా, నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవటం మానేశారు" అంటూ నచికేతుడు కఠోపనిషత్ అంతా యముడితో చేసిన సంవాదమే అది. అన్ని ఉపనిషత్తులలోకి కఠోపనిషత్ అత్యద్భుతమైనటువంటి వైరాగ్య భూమిక, ఆధ్యాత్మిక భూమిక. మిగతావన్నీ కూడా అన్నం గురించి, నిద్ర గురించి, ఆకలి గురించి, జీవితాన్ని గురించి, మన శరీరంలో ఏర్పడేటువంటి అవయవాల నిర్మాణం గురించి, ప్లేట్లెట్స్ గురించి శ్వేతాశ్వతర ఉపనిషత్ చదివితే that is nothing but Anatomy, Medicine, Medical Science అదంతా. కాబట్టి ఉపనిషత్తులు అన్నీ చెప్పినయి, కఠోపనిషత్ మాత్రం వైరాగ్యాన్ని చెప్పింది, అద్వైత సిద్ధిని గురించి చెప్పింది, ఆత్మానుభవాలను గురించి చెప్పింది. ఆ సంవాదం ఎవరి మధ్య? నచికేతుడి మధ్య. నచికేతుడికి, యముడికి మధ్య జరిగింది కాబట్టి అటువంటి భావన అరబిందుల వారి సావిత్రి మహాకావ్యానికి అది కూడా ఒక ప్రేరణ. అంటే దీనికంటే ముందున్న చరిత్ర తెలుసుకోవాలి మనం. తెలుసుకోవటం కోసమే సావిత్రి మహాకావ్యం అనేది అరబిందుల వారి యొక్క దివ్య ధారణలో నుంచి బయటికి వచ్చింది. ధారణలో వచ్చేటప్పుడు పదాలు మన చేతుల్లో ఉండవు. రాయాలి అని కూర్చున్నప్పుడు, రాస్తున్నప్పుడు ఈ పదం కాదు ఆ పదం, ఆ పదం కాదు ఈ పదం అని మన చేతిలో పెన్ను, పేపర్ ఉంటుంది. ఏవైనా చేయొచ్చు. కానీ సజ్జోనిర్గమంగా, అంటే సజ్జస్పురణంగా అప్పటికప్పుడు ఏర్పడేటువంటి మాటలు అనుకుంటూ చెప్పే మాటలు కావు అవి. అనుకుంటూ ఉండే చెప్పే మాటలు వేరే ఉంటాయి. ప్రవాహంగా వచ్చే మాటలకి తీవ్రమైనటువంటి ఒక గాంభీర్యం ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాసి దాన్ని రామచంద్రుడికి సమర్పణ చేస్తూ పద్యం రాశాడు. అదే దీనికి సమన్వయం. "సజ్జోనిర్గమమైన సర్వభావనా సంభారంబెల్ల నైవేద్యంబిచ్చితి నీకు రామచంద్ర ప్రభువా! విశ్వాసమున్ పూనవే ఆద్యంబగు జీవలక్షణము సంహారంబు కావింపవే! హృద్యంబై చనితోచు నీ దివ్యతేజమ్ము సారింపంగదే నా గుండియన్" ఆ సజ్జోనిర్గమం కావాలి. సజ్జః అప్పటికప్పుడు. స్పురణలో నుంచి రావాలి. స్పురణ దేనిలో నుంచి వస్తుంది అని, స్మృతిలో నుంచి స్పురణ కలుగుతుంది. వేళ గుర్తొచ్చింది అంటాం. అంటే అది మనకు తెలుసు అన్నమాట. తెలుసు కాబట్టే గుర్తొచ్చింది. మరి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? జ్ఞాపకం పొర వీడింది గనుక గుర్తొచ్చింది. జ్ఞాపకం పొర ఇప్పుడే ఎందుకు వీడింది? ఇప్పుడు దాని అవసరం ఏర్పడింది గనుక గుర్తొచ్చింది. ఆహా! ఇప్పుడన్నీ తెలుస్తున్నాయి. అవును అక్కడ అది ఉందిగా అంటూ ఉంటాం మనం. అంటే మనకన్నీ ఆ విషయాలు తెలుసు. అందుకనే సత్యసాయి భగవానుడు మానవుడి గురించినటువంటి ఒక గొప్ప వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం ఏమిటంటే మానవుడు దేవుడు కావటం ఏమిటి? మానవుడు దేవుడే. మానవుడికి ఆ స్పృహ లేదు.స్పుర కలిగిన మరుక్షణం తాను దివ్యున్ని అనేటువంటి భావనలో తాను నిలకడ చెందుతాడు అన్నారు స్వామి. స్వామి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఈ మాటలు పట్టుకోవాలి. ఆయన చెప్పిన చిన్న కథలు, ఆయన చెప్పినవన్నీ మనల్ని ఉల్లాసపరచడానికి తాను చెప్పినటువంటి అనేకమైన గంభీరమైనటువంటి విషయాలని మనకి అర్థం కావాలి అన్న భావం కోసం చిన్న కథ చెప్పారు తప్ప చిన్న కథలు మాత్రమే చదవండి మిగతాది వదిలిపెట్టమని ఆయన చెప్పలే. నిజానికి కథ కంటే ముందు కథ లోపల కథ వెనుక ఏముందో తెలుసుకోవాలి. కాబట్టి కఠోపనిషత్తు యొక్క expansion ఏ అరవిందుల వారి మహాకావ్యం, సావిత్రి మహాకావ్యం. సావిత్రి, సరస్వతి, గాయత్రి ఇదే సాయిత్రి గా మనం భావన చేస్తాం. చమత్కారంగా పెట్టిన పేరే గాని స్వామి తనను తాను అభివర్ణించుకున్నటువంటి, అంటే తనను తాను reveal చేసుకున్నటువంటిది సాయిత్రి కాదు. ఊరికల ప్రచారంలో కొన్ని మాటలు వస్తాయి. ఒక మహారాష్ట్ర పండితుడు స్వామి సన్నిధిలో 1980 ప్రాంతంలో ఒక interview లో, ఆ room లో నేను కూడా ఉన్నందువలన ప్రమాణంతో చెప్తున్నాను ఆ మాట. "ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణుః అంత్యే దేవః సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే" అని ఒకాయన స్వామిని దత్తాత్రేయుడిగా అభివర్ణిస్తూ మూలమంత్రాన్ని చదివినప్పుడు స్వామి వెంటనే సవరించారు "ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణుః అంత్యే దేవః సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ కాదు బంగారు శ్వాసత్రయ స్వరూపాయ సత్యసాయి శ నమోస్తుతే" అనమన్నారు. మూర్తి అంటే బొమ్మ, బొమ్మే ఉండేది కాదు. మూర్తులు అమూర్తం కావటమే ఉత్తమ స్థితి. నేను నేను కాకుండా పోవడం, నేనుగా మిగలటం, ఆత్మగా మిగలటం అఖండ చైతన్య స్థితి అది. అది అధ్యాత్మ స్థితి. ఆ స్థితిని అనుభవించేటువంటి దిశగా ధ్యాన ధారణా స్థితులలో సంచారం చేస్తున్నటువంటి అరవిందుల వారి మనోభూమిక లో నుంచి ఏర్పడినటువంటి పరమాద్భుతమైనటువంటి మహా కావ్య సృష్టి సావిత్రి. అది చాలా జటిలమైన అటువంటిది. తత్వచింతనలో the toughest. దాని నిండా మనకు తెలియని అనేక గ్రీక్ అండ్ లాటిన్ పదాలు ఉంటాయి. అవి వారి ఎంచుకొని తన పాండిత్యాన్ని ప్రదర్శించడానికి చెప్పలే, అవి అలా వచ్చాయి అంతే. అంటే వారి సంచార స్థాయి అటువంటిది అని అర్థం. ధారణలో-- ధారణ లేనివాడు, ధ్యానం ఎరగనివాడు, తపస్సు లేనివాడు, భగవదనుగ్రహం మోచుకోని వాడు గంభీరమైనటువంటి భాషని ఎట్లా వాడగలుగుతాడు? వాడికి ఎవడు ఇస్తాడు అది? ఇవన్నీ ఎక్కడన్నా నేర్చుకుంటే వస్తాయా? రాదే. ధారణలో నుంచి రావాలి. retain చేసి ఉండాలి ఎప్పుడూ. అరవిందుల వారి జీవితం కూడా ICS కాకపోవటానికి, దేశ ప్రేమికుడు కావటానికి, తన జన్మదినం నాడే ఈ భారతదేశం దాస్య శృంఖలాలు తెంచుకొని బయటపడాలని కోరుకోవటానికి, తాను జీవించి ఉండగానే శ్రీకృష్ణ దర్శనం కావాలని, కృష్ణ చైతన్యమే ఈ ప్రపంచాన్ని నడిపించాలని భావించటంలోనే ఆయన యోగ్యత స్థిరపడిపోయింది. చివరి పదేళ్లు ఒక solitude, ఒక నిరామయ ప్రదేశంలో ఏకాంతంలో ఆయన తనను తాను నిలబెట్టుకున్నారు, నిలదొక్కుకున్నారు. ప్రపంచం అన్నది-- ఈయన సమాజం నుంచి వైదొలిగాడు. సమాజం నుంచి దూరమైన వాడిని సమాజం గుర్తించదు. అందుకే మనిషి ఎప్పుడూ circulation లో ఉండాలని కోరుకుంటాడు. భగవంతుడు circulation లో ఉండడు కానీ ఆయన తనను తాను దాచుకోలేడు. మహత్తత్వాన్ని ఎలా దాచగలవు? మనం కొనుక్కొచ్చే ఇంగువే ఆ వాసన గుడ్డ పోయేదాకా ఉంటుంది అంటుకొని భగవంతుడి పరిమళం ఈ ప్రపంచంలో దాచగలిగిన వాడు లేడు, మహత్తత్వాన్ని ఆపగలిగిన వాడు లేడు. కానీ తరుణం ఆసన్నమైనప్పుడు, కాలం ఆసన్నమైనప్పుడు, అవసరమైనప్పుడు మాయావరణాన్ని ఛేదించుకొని చైతన్యం యోగాత్మకంగా ఆవిష్కరణ కావటం ఈ భారతదేశంలో కొత్త విషయం ఏం కాదు. పద్నాలుగవ ఏట నేను సాయిబాబాను అని స్వామి ప్రకటించే దాకా సాయిబాబా పేరే దక్షిణాపథంలో ఎవడికీ తెలియదు. నేను సాయిబాబాను అని ప్రకటించడం చాలా తేలిక, ఎవడైనా అనొచ్చు. అనొచ్చా? అనటం తేలిక, అట్లా ఉండటం కష్టం. నేను దైవాన్ని అని ప్రకటించుకోవటం చాలా తేలిక, దైవంగా జీవించగలగటం, ఉండగలగటం, దివ్య శక్తులను ఈ ప్రపంచానికి పరిచయం చేయటం చాలా కష్టం. కనుక వీరందరూ కూడా వశ్యవాక్కులుగా ఉంటారు. వాక్కు వారి వశమై ఉంటుంది. ఏ క్షణానికి ఏ ప్రమాణంలో ఏ మాట ఏ శబ్దం వాగ్ రూపంగా బయట పడాలో, లేఖనిగా రావాలో, అది ఒక అక్షర రూపాన్ని సంతరించుకోవాలో, దానిలో వారి ప్రజ్ఞాభూమికలన్నీ కూడా సహాయపడతాయి. అట్లా ఏర్పడిందే యోగాత్మకమైనటువంటి విచారణ సావిత్రి మహాకావ్యం.
SSSMC · audio
Yoga Pravaham - 08
Yoga Pravaham - 08
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 42:01
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
- 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
- 26 min 7
Yoga Pravaham - 07
- 42 min 8
Yoga Pravaham - 08
Now playing - 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
- 40 min 12
Yoga Pravaham - 12
- 19 min 13
Yoga Pravaham - 13
- 28 min 14
Yoga Pravaham - 14
- 21 min 15
Yoga Pravaham - 15