Skip to content
Transcript తెలుగు
సర్వ సృష్టికి మూలమైనటువంటి సనాతన ధర్మం పుట్టింది ఇక్కడ. ప్రపంచానికి గురు స్థానాన్ని కల్పించే దిశగా భారతదేశం తన ఉనికిని, తన అస్తిత్వాన్ని అన్నివేళలా కాపాడుకుంటూ ప్రపంచానికి ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తూ వస్తున్నది. ఇందులో ఇరవై రెండు నారాయణ అవతారాలు రావాలి అందులో ఇరవై ఒక్క అవతారాలు వచ్చినాయి. ఇవి మాత్రమే కాకుండా కళావతారాలుగా, అంశావతారాలుగా, అర్చావతారాలుగా, ప్రభవావతారాలుగా, ప్రవేశావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా, పూర్ణావతారాలుగా అనేకం ఒకటి కాదు రెండు కాదు. ఎన్నెన్ని రీతులలోనో పరమాత్మ మానవ జాతిని సముద్ధరించటానికి "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అంటూ "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అంటూ అనేక ప్రమాణాలతో పరమేశ్వరుడు మానవుడికి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పారమ్యాన్ని, దాని లోతులని, దాని అంచులని, దానికున్నటువంటి అనేకమైనటువంటి dynamics ని dimensions ని ఆయా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రాదేశికంతో ప్రారంభమై సర్వదేశకాల అతీతమైనటువంటి ఒకానొక భావనా స్థితిలో భగవంతుని యందు మనకి అమితమైనటువంటి ప్రేమ, ఇష్టము, గౌరవము, భక్తి కలిగే దిశగా వీరందరూ కూడా మానవజాతిని సముద్ధరిస్తూనే వచ్చారు. అయితే కృతయుగం అస్థి యుగమని అంటే అస్థి గతమని, త్రేతాయుగం అంతా మాంస గతమని, ద్వాపర యుగం అంతా రక్త గతమని, కలియుగం అన్న గతమని ఇంతకుముందే మనం విచారణ చేశాం. అన్నగతం ఉదాత్తమైనది it's more refined మిగతా యుగాల కంటే. అన్న గతంలో నుంచి అన్నగత భావనలో నుంచి మిగతా కోశాలు ఏర్పడుతున్నాయి. అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. దీనికి basis ఏమిటి మొట్టమొదటి సోపానం అంటే అన్నమయ. అందుకనే కలియుగంలో మనం చాలా జాగ్రత్తగా భుజించాలి "యుక్తాహార విహారస్య". సాత్వికమైనటువంటి భోజనం చేయాలి, పదార్థాన్ని తీసుకోవాలి. పదార్థ శుద్ధి చేయాలి, పాత్ర శుద్ధి చేయాలి, పరమాత్మకి నివేదించాలి, ఆపై మనం స్వీకరించాలి. టైం లేదు అనటానికి వీల్లేదు, ఇవన్నీ జరగాల్సిందే. పాత్ర శుద్ధి లేదు, పాక శుద్ధి లేదు, పదార్థ శుద్ధి లేదు తినబోయేది ఎవరు? మనమేగా! తినగలమా? తినలేమే. ఒక చిన్న తేడా రాగానే ఏదో తేడా ఉందే అనిపిస్తుంది. అనిపించడమేంటి మనం అంటాం కూడా. కనుక పాత్ర శుద్ధి అంటే దేహ శుద్ధి కావాలి. దేహ, ఆంతరంగిక శుద్ధి కావాలి. బయట రోజూ దీనికి స్నానం చేయిస్తున్నాం, తలంటు పోస్తున్నాం, బట్టలు కొడుతున్నాం, దీన్ని చాలా మితంగా ప్రేమిస్తున్నాం, భద్రంగా కాపాడుకుంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇది పై పైన. మరి దేహం లోపల "యః మహమితి సాక్షాద్ ఆత్మ రూపేణ భాతి" అని ఓంకార ప్రణవ నాదం నేను నేను అంటూనే ఉందిగా. "ఏతదధిష్ఠాత" ఎవడో యజమానుడు అని అష్టమ తనువు వాడు అని మనకి స్ఫురణ కలుగుతున్నదిగా. అంటే ఎనిమిదో శరీరం మనలో ఉన్నదని, దాని పేరు ఆత్మ అని మనకి కాస్త అధ్యాత్మ సాధన చేసిన వాడికి తెలుస్తున్నది కదా. ఓంకారంగా ఉన్నప్పటికీ ప్రకృతి, పరమాత్మ, ప్రకృతి, జీవుడు అంటూ రెండుగా చూస్తున్నాం కాబట్టి ద్వైతం ఉంది. ఏకత్వంలో నుంచి అనేకత్వంలోకి ఎట్లా మనం ప్రస్థానం చేస్తున్నామో గమనించినప్పుడు ఆశ్చర్యపోతాం. మూలమైనటువంటి primordial sound ఏదైతే ఉన్నదో ఓం అనేటువంటి అకార, ఉకార, మకారాలు మూడు బీజాక్షరాలు, దానిలోని జ్ఞానం అనేటువంటి అగ్ని బీజం, శుద్ధ మనస్సు అనబడేటువంటి మకార బీజం, శివశక్తి ఆత్మకమైనటువంటి ఉమా బీజము మూడు ఉన్నాయి గనుక ఓం చెప్పకుండా, చేర్చకుండా నామం ఉచ్చరించినా ఉరికే పేరు పెట్టి పిలిచినట్లే ఫలితమేం ఉండదు. ఇది పునః మనం చెప్పుకోవాలి. ప్రణవ శబ్దంతో కూడి ఉన్నటువంటివి మాత్రమే బలాన్ని సంతరించుకుంటాయి. వేదమైనా సరే శివ సహస్ర నామం గాని, విష్ణు సహస్ర నామం గాని, సత్యసాయి అష్టోత్తరం గాని ఏం చదవండి ముందు ఓం చెప్పాలి. చెప్పకపోతే అవి ఒట్టి మాటలుగా మిగిలిపోతాయి. ఓం చేర్చగానే మాటలన్నీ మంత్రాలైతే-అవుతాయి, బలాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి ప్రథమ తలపు నేను ప్రథమ శబ్దం ప్రణవ శబ్దం ఓంకారం కాబట్టి ఓం అనేటువంటి దాంట్లో నుంచి అంటున్న నేను, వింటున్న నేను రెండు ఏర్పడుతున్నాయి ఇది ద్వంద్వం, రెండు. మనలోనే మూడు గుణాలున్నాయి సత్వ, రజస్, తమో గుణాలు ఇది త్రిగుణాత్మకమైన భావన. ఇప్పటికే ఒకడుగా ఉన్న మనం ఒకటి రెండైనాం, రెండు మూడైనాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనబడేటువంటి చతుర్విధ పురుషార్థాలు మనకి ఆచరణీయం.కాబట్టి నాలుగు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఐదు కోశాలు ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. షట్చక్రాలు ఆరు మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఆరింటినీ తాను కదలకుండా నడిపించే సహస్రారం. నిజానికి యోగశాస్త్రంలో ఎనిమిదవ చక్రం కూడా ఉంది దాన్ని యట్ చక్రం అన్నారు. అది సోమరసం సోమచక్రం. సోమచక్రాన్ని మనం రోజు చదివేటువంటి రుద్రంలో కూడా వింటూ ఉంటాం. అనుస్వారంగా బిందు స్వరూపంగా చెప్తూ ఉంటాం. అందుకనే శిఖ పిలక పెట్టుకున్నటువంటి వారు వాళ్ళు కరన్యాసం చేసినప్పుడు అంగన్యాసం చేసినప్పుడు చప్పట్లు శిఖని తాకుతూ దానికి శక్తిని ఆపాదిస్తారు. కాబట్టి ఎనిమిదో చక్రం కూడా ఉన్నది అని మనకు తెలుస్తున్నది. ఏడవ చక్రానికి ఎనిమిదవ చక్రానికి అతీతంగా మరొకటున్నది అది చక్రం కాదు చంద్రకళాస్థానం. యోగశాస్త్రం తీవ్రంగా అధ్యయనం చేస్తే తప్ప ఇవన్నీ తెలియవు. సరే షట్చక్రాలు ఆరు అనుకున్నాం అక్కడ ఆగుదాం. సప్తజ్ఞాన భూమికలున్నాయి అవి ఏడు. శుభేచ్ఛ, విచారణ, అసంసక్తి, సత్వాపత్తి, పదార్థభావని, తురీయం ఇవన్నీ కూడా. ఏడైపోయినాయి అష్టాంగ యోగాలున్నాయి మన దగ్గర. నవవిధ భక్తులున్నాయి. తొమ్మిది అల్టిమేట్ నెంబర్ దగ్గరికి వచ్చేసాం. పది అనంగానే మళ్ళీ ఒకటి. నవవిధ భక్తులనేటువంటివి సామాన్య జనుడు చేయగలిగినటువంటి పనులు. భక్తి భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి ఒక బాంధవ్యం కాబట్టి అష్టాంగ యోగాలు చేయగలిగినా, చేయకపోయినా సప్తజ్ఞాన భూమికను అందుకోలేకపోయినా ఇదిగో ఓంకార ప్రణవ నాదాన్ని ప్రతిరోజూ నిశ్శబ్దంగా అన్నా అనకపోయినా, ద్వంద్వాన్ని దాటలేకపోయినా, త్రిగుణాలను దాటలేకపోయినా, చతుర్విధ పురుషార్ధాలని జీవితంలో ఆచరించలేకపోయినా తొమ్మిది భక్తి మార్గం మాత్రం తొమ్మిది విధాలుగా చెప్పబడింది అందులో మొట్టమొదటిది శ్రవణం. ముందు వినటం నేర్చుకోవాలి. అధ్యాత్మ సాధనలో వినటమే మానేస్తే తర్వాత ఏం రావు. వినని వాడు సంకీర్తన ఏం చేస్తాడు? మరణం ఏం చేస్తాడు? నిదిధ్యాసనం ఏం చేస్తాడు? ఏం చేయలేడు కాబట్టి వినాలి. ఉత్తమోత్తమ ధ్యానం ఏది అంటే ఏమీ అనకపోవటం ఒకడి పాలు ధ్యానం అయితే తనతో తాను నాదానుసంధానం చేసి తనను తాను వినటం ఉత్తమ ధ్యానం. ఇంకో శబ్దాన్ని వినటం ఉత్తమ ధ్యానం కాదు. తనలో ఉన్న శబ్దాన్ని తాను వినాలి. వినటం తనలో ఉన్న శబ్దం నాభిస్థానం చుట్టూ ఏర్పడి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచే నాదం ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని నాదానుసంధాన యోగమని, లయయోగమని సరే. శంకర భగవత్పాదులు పూర్ణ తీవ్ర విచారణ చేశారు. ఇవన్నీ కూడా యోగ భూమికలో ప్రధానం. యోగ ప్రవాహం అంటే యోగుల జీవిత చరిత్ర కాదు. అది మాత్రమే కాదు. వారు ఎక్కడ పుట్టారు? వారి తల్లిదండ్రులు ఎవరు? వారు చదువుకున్నారా లేదా? వాళ్ళకి శాస్త్రాలు ఎట్లా వచ్చినాయి? అది మన పని కాదు. యోగత్వాన్ని సిద్ధింపజేసుకున్న తర్వాత వాళ్ళు ప్రపంచంలో ఎట్లా ఉన్నారు? మానవుణ్ణి ఉన్నత మార్గంలోకి ఎట్లా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు? తమ జ్ఞానాన్ని, తమ ధ్యానాన్ని, తమ యోగాన్ని, తమ సంపూర్ణత్వాన్ని, భగవద్దర్శనాన్ని ప్రపంచానికి మళ్ళీ ఎట్లా పరిచయం చేశారు? ఒక వ్యక్తి ధ్యానియై, జ్ఞానియై, తపస్వియై, యోగియై అన్నీ దాటి దాటి జీవన్ముక్తుడు గనక అయిపోతే వ్యక్తికి మాత్రమే లాభం. ప్రపంచానికి లాభం కలగాలి యోగుల వల్ల. ఎట్లా కలగాలి? వాళ్ళు తమ జీవన విధానం ద్వారా మనం బతుకుతున్నటువంటి ప్రపంచంలోనే మనకంటే భిన్నంగా మన దగ్గర అన్నీ ఉంటాయి ప్రాపంచికమైన వస్తువులు సుఖం మాత్రం ఉండదు. సంతోషం ఉండదు. శాంతి ఉండదు. ఏం లోటుంది మన దగ్గర? బజార్లో ఏది తయారై కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చిందో సాయంకాలం కల్లా మన ఇంటికి వస్తోంది. ఆనందాన్ని పొందుతున్నామా? ప్రశ్న వేసుకోవాలి. యోగులు అయినటువంటి వారి దగ్గర ప్రపంచానికి సంబంధించినవి ఏవీ ఉండవు. కానీ వాళ్ళు మనకి మనకంటే చాలా ఆనందతారక స్థితిలో ఉంటారు. కనుకనే సాధారణ సాధకుడు కూడా యోగి దగ్గరకు వెళ్ళి ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా, జవాబు ఇచ్చిన ఇవ్వకపోయినా కాసేపు అక్కడ ఉండి ఆనందాన్ని పొంది వెళ్తున్నానంటున్నాడు. ఆనందాన్ని ఆయన ఇచ్చాడా? ఈన అడిగాడా? అడిగితే ఆయన ఆనందాన్ని ఇవ్వగలడా? ఇస్తాడా? ఇచ్చేవాడు యోగి అవుతాడా? కాదే. మరి ఏమిటి? అంటే వారి ఆవరణ ప్రభావం చేత మల విక్షేప దోషాలు రెండూ నశించిపోతాయి. పోగా మిగిలింది ఏమిటంటే ఆనందమే. ఆత్మ అంటే ఏమిటి అని ఎవరైనా గనక అడిగితే శంకర భగవత్పాదులు చెప్పిన ఒక వ్యాఖ్యానం గుర్తు పెట్టుకోవాలి. ఆత్మ అంటే ఏమి మా అంటే లేదు. ఇది సరే. ఇది శబ్దార్థం. అనాత్మను గురించి గనక మనం తెలుసుకున్నట్లయితే అంటే ఆత్మ కానిది ఏమిటో తెలుసుకుంటే మిగిలిందంతా ఆత్మే. ఉదాహరణకి షిరిడి బాబా జ్ఞానబోధ చేయలే. మిగతా వారి వలె జ్ఞానం అంటే ఇది అది అవెం చెప్పలే. అజ్ఞానం అంటే ఏమిటో చెప్పారు ఆయన. అజ్ఞానం యొక్క స్థూల స్వరూపం ఇదని సచ్చరిత్ర నిండా సాధకుడి యొక్క అజ్ఞానం ఎట్లా పటాపంచలు చేశారోశ్రీడి మహాస్వామి యొక్క దివ్య జ్ఞాన భూమికను మనం అందుకునే దిశగా యోగత్వంలోకి వెళితే తప్ప నిజానికి సచ్చరిత్ర అర్థం కాదు పైకి ఊరికే వ్రతం కథలాగా అనిపిస్తుంది. అది మాత్రమే కాదు పరమ పవిత్రమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి సాధకుడు అనుభవించదగినటువంటి ఉత్తమోత్తమ గ్రంథం ఏది అంటే సచ్చరిత్ర, శ్రీడి సాయి సచ్చరిత్ర. అది ఎవరి ఇంట ఉంటుందో స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది చదివినా చదవకపోయినా. ఇది కోటానుకోట్ల సాయి భక్తుల యొక్క అనుభవం ఇది. అది ఒక ఎత్తయితే సత్య సాయి భవానుడి చిత్రపటం ఎవరి ఇంట ఉంటుందో వాడికి సర్వానందం కలుగుతుంది చూశారా? ఇది కూడా మళ్ళీ భక్తుడి అనుభవమే. ఇక్కడ పుస్తకం ఏం లేదు వినటానికి ఏం లేదు ఊరికాన ఫోటో ఉంది మన ఇంట్లో. ఉంటే ఏమవుతుంది అంటే ఆనందం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఫోటో మాట్లాడదే. అంటే మాట్లాడే ఫోటోలు ఆనందాన్నివ్వవు. అవి కూడా ఒక బాంధవ్యాన్ని మనకు పరిచయం చేస్తాయి. అది కాకుండా త్రిగుణాతీతమైనటువంటి పరమాత్మ యొక్క భావనని మనం అర్థం చేసుకోవాలి అన్న ఒక యోగ స్థితిలోకి మనం వెళ్ళాలి. సాధారణమైన మానవుడు సాధారణంగా ఉన్నటువంటి జీవితం గడిపేటువంటి వాడు యోగి కాగలడా? అంటే యోగి కావటం లేదు యోగి మన యందు ఉన్నాడు వాడిని తట్టి లేపాలి గ్రహించుకోవాలి. దక్షిణామూర్తి స్తోత్రం మాయావి మహాయోగి అని రెండింటిని ఆయన స్పృశించారు. మనం ఎందుకని ఆనందంగా లేము? ఫస్ట్ అఫ్ ఆల్ మనకు ఎందుకు ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఆనందాన్ని సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలి కదా. అయినా ఎందుకని లేము అని విచారణ చేసినట్లయితే మన యందున్న మాయా వివరణనే మనం మహాయోగాన్ని పొందలేకపోతున్నాం. మహాయోగ స్థితి ఏమిటంటే మనతో మనం కూడి ఉండటమే. మిగతావన్నీ పక్కన పెట్టండి శ్రవణం చాలా ప్రధానం. సత్య సాయి భగవానుడు కూడా ప్రపంచానికి శ్రవణము అనేటువంటి మహా భాగ్యాన్ని కల్పించారు. అవతార మూర్తి ఇన్ని మాటలు మాట్లాడారు? అవతారమూర్తి ఇన్ని విషయాల మీద ఇన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు? కేవలం అది ఉపన్యాసమేనా ఉపన్యాసం స్వామిది వినగానే మనకు అన్ని కోణాలు అర్థం కావు లోపలికి వెళ్ళాలి. తత్వ చింతనా భూమికలు అదే ఉపన్యాసాన్ని అనేకమైన కోణాలలో అనేక డైనమిక్స్ లో దాన్ని అర్థం చేసుకున్నట్లయితే కొన్ని వేవేల గ్రంథాల సారమంతా వారి ఉపన్యాసంలో ఉంటుంది. అది బాగా చెప్పారా బాగా చెప్పలేదా కాదు పరమాత్మ మాట్లాడిన తర్వాత బాగా లేకపోవడం అనే ప్రశ్నే లేదు. మనం దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాము అన్నదే ఒక భూమిక కాబట్టి, ఇవాళ చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అందరికీ కూడా. ఏమిటి పరమ పవిత్రత అంటే ఇది గురువారం సాయంకాలం మహాత్ముల యొక్క స్పురణ చూడండి సత్య సాయి భగవానుడి సంకల్పంలో ఏర్పడిన ప్రతి సమితి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. తత్వానుసంధానం వైపు మనం నడవకపోతే ఒక అవతారమూర్తితో కలిసి జీవించిన ఫలితం పూర్ణంగా రాబట్టుకున్నట్లే లెక్క. మంచి మామిడి పండ్ల తోటలో కూర్చొని ఒక్క మామిడి పండు కూడా ఇంకా తినని వైనం. ఎక్కడున్నావ్ అంటే మామిడి తోటలోనే ఉన్నాను నేను చెట్టుకు కాయలున్నాయి పండ్లున్నాయి కానీ నేను ఎప్పుడూ తినలే అన్నట్లు ఉంటుంది. తినాలి, అనుభవించాలి, రుచిని మళ్ళీ మరొకడికి పరిచయం చేయాలి. దిశగా ఇవాళ మనం యోగ స్థితులు ఒక్క రీతి కాదు అది గుర్తు పెట్టుకోవాలి. ముప్పై ఆరు వేల మంది యోగులు ఉన్నారంటే There is no repetition. యోగులలో ఉన్నట్టుగా బి లేడు, బి ఉన్నట్టుగా సి లేడు ఎవరికి వారే. ఇదొక మహా సుదర్శన చక్రం అందులో ప్రతి పన్ను చాలా important. ఒక్కొక్క జ్ఞానాన్ని ఒక్కొక్క రీతిలో తమ దివ్య జీవన విధానం ద్వారా ఒక పరమ పవిత్ర జీవన శైలి ద్వారా దృక్పథం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి యోగాత్మలు ఆయా కాలాలని ఎట్లా ప్రభావితం చేశారో చూసినప్పుడు ఓహో యోగి అంటే ఇదా అని మనం ఆశ్చర్యపోతాం. ఇవాళ ప్రాతఃస్మరణీయులైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర యోగిని గురించి మాట్లాడుకుందాం. ఎలాగూ కేవల కుంభక యోగాన్ని గురించి మాట్లాడుకుంటూనే వస్తున్నాం కాబట్టి అన్నీ కుంభక యోగాలలోనూ కేవల కుంభకం చాలా ఉత్తమమైనదని మనం విచారణ చేశాం. అంటే దేహాభిమానాన్ని దేహాత్మ భావనని దాటి శరీర స్పర్శను దాటి మనస్సుని దాటి భావ భావన అతీత స్థితిని దాటి ఎవరు తమ యందు తాము లగ్నమై నిమగ్నమై మగ్నమై ఉంటారో అటువంటి వాడిని మనం యోగిగా భావన చేసినప్పుడు సదాశివ బ్రహ్మేంద్రులు కూడా ఒక మహా యోగి. సదాశివ బ్రహ్మేంద్రులు అనగానే వారి సంకీర్తనలు మనకు గుర్తొస్తాయి. ఆయన ఒక పదమూడు రాశారు అంతే. ఖేలతి మమ హృదయే ఇవన్నీ మనందరికీ తెలుసు. సంగీతాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే తాను పొందినటువంటి ఒక రసాత్మకమైనటువంటి అనుభూతిని ప్రపంచానికి తన సంకీర్తన ద్వారా పరిచయం చేశారు. అంతేనా ఇంకేం చేయలేదా అంటే వారు మంచి పీఠానికి అనేక ప్రదేశాలు వెళ్లారు ఎక్కువ కాలం కంచి స్వామి వారి దగ్గర ఉన్నారు మహాస్వామి కాదు ఇంతకు ముందు.స్వామి వారి దర్శనానికి చాలా మంది వస్తూ ఉండేవారు వచ్చిన వాళ్ళలో పండితులు మీమాంస, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, వ్యాకరణం ఇటువంటివి అన్నీ కూడా అంటే విద్యలన్నింటి మీద స్వామి వారి ముందు మాట్లాడుకునేవారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఇద్దరు పండితులు మాట్లాడుకుంటే మాటలు అయిపోయిన తర్వాత స్వామి వారు ఒకరిని పిలిచి "నువ్వు రెండో వాడి కంటే చాలా బాగా మాట్లాడావు" అని అనిపించుకోవటానికి మాట్లాడేవారు అంతే. అంటే వారి దగ్గర గెలిచిన గెలుపే గెలుపుగా భావించి మాట్లాడాలని వాదోపవాదాలు చేసుకునేవారు. పక్కనే కూర్చున్నటువంటి సదాశివ బ్రహ్మేంద్రుడు వాదనలన్నీ అయిపోయిన తర్వాత లేదా ముగుస్తున్న సమయంలో వాదనలో తల దూర్చేవారు. తల దూర్చి ఇద్దరూ తప్పు అని నిరూపణ చేసేవారు. ఇది వచ్చిన వాడికి ఆశాభంగమే. గురువు గారు తప్పు, రైట్ అంటే సరిదిద్దుకుంటాం గాని మనము మన పక్కనే కూర్చున్న వాడివి నువ్వు చెప్తున్నది తప్పు అండి అని మనం ఒప్పుకోం కదా. కాబట్టి అహంజల్లారని వారంతా కూడా "ఈ సదాశివ బ్రహ్మేంద్రుడు ఏమిటి ఎప్పుడూ స్వామి వారి దగ్గర కూర్చొని మనం ఏం మాట్లాడినా ఖండిస్తుంటాడు, ఇతను ఎక్కువ మాట్లాడుతున్నాడు" అని ఒక ఆలోచనకు వచ్చారు. అంతటితో అనుకుంటే పోయేది. రోజున స్వామివారు ఎవరో మాట్లాడుకుంటుండగా చాలా చక్కగా మాట్లాడారు కాకపోతే "ఇవన్నీ పంచకోశాలకు బయట మాట్లాడటమే. మీ పాండిత్యాన్ని, కవిత్వాన్ని, మీ భావావేశాన్ని, వేదాంతం మీద మాట్లాడగలిగిన శక్తిని, ప్రజ్ఞని అంతర్ముఖత్వం చేసుకోండి మీకింకా మంచి లాభం కలుగుతుంది. ఇంకా ప్యూరిఫికేషన్ చాలా ఫాస్ట్ గా అవుతుంది" అని స్వామి వారు చెప్తూ ఉన్నారు. సమయంలో "అమ్మయ్యా ఇవాళటి గురువుగారు మనతో డైరెక్ట్ గా మాట్లాడారు" అని కాచుకొని ఉన్నారు వాళ్ళు. "సరే స్వామి మేము మీరు చెప్పినట్లే ఇవాళ నుంచి చేస్తాం కానీ చిన్న విన్నపం" అన్నారు. "ఏమిటది?" అన్నారు. "ఈ సదాశివ బ్రహ్మేంద్రుడు మేము వచ్చి ఏం మాట్లాడిన దాన్ని ఓడిస్తున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు" స్వామివారు వారికి తెలుసు సర్వకాలజ్ఞులు గనుక "ఏమీ సదాశివా! ఎక్కువ మాట్లాడుతున్నావట మాట్లాడకపోవడం ఉత్తమం కదా" అన్నారు. అంతే జీవిత పర్యంతం కూడా ఆయన మళ్ళీ నోరు విప్పలేదు. మౌనభూమికలోకి వెళ్ళిపోయినారు. అది గురువు యొక్క అనుగ్రహం. గురువుకి పూజ చేసి, ఊరేగించి, జాతర చేసి, వేడుక చేస్తే మనకి ఆనందం ఏమోగానీ గురువుకు ఆనందం కలగదు. గురువుకి ఏమిటి ఆనందం అంటే తాను చెప్తున్న మాటని శ్రద్ధగా ఆలకించే ఒక శిష్యుడు దొరికినప్పుడు, ఆలకించిన దానిని ఆచరిస్తున్నది, చేస్తున్నాడు అన్న భావన కలిగినప్పుడు గురువు పరమానందాన్ని పొందుతాడు. చూడండి ఎటువంటి కంచే స్వామివారు అనగానే ఆయన మౌనం వహించారు. మౌనం వారి యావజ్జీవిత కాలం maintain చేస్తూ వచ్చారు. ఇంకెవరితో మాట్లాడలే. పరమాద్భుతమైన వాక్ప్రవాహం అంతా ఒక్కసారి కనికట్టు కట్టినట్టుగా మూగనవ్వం పట్టినట్టుగా ఆగిపోయింది. అయితే అది వాచామౌనం కాదు, భాషామౌనం కాదు. తీవ్రమైనటువంటి మనస్సుని నియంత్రించి, నిగ్రహించి, నిరోధించి, మనోవికారాల అన్నింటినీ కూడా దాటుకుంటూ, దాటుకుంటూ తనతో తాను రమించి ఉండగలిగినటువంటి ఒక ఉదాత్త మహాయోగ స్థితిలోకి ఆయన వెళ్ళిపోయినారు. అది సదాశివ బ్రహ్మేంద్రుడు అంటే. సదా ఎల్లప్పుడూ అది ఆయన పేరు కాదు. ఆయన పేరు వేరే. పూర్వ నామం మనకు అక్కర్లేదు. శివుడు వేరు, రుద్రుడు వేరు, మాహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు. రుద్రుడు అంటే మన శరీరంలో ఏకాదశ రుద్రాలు ఉన్నాయి. సత్యసాయి భగవానుడే చెప్పారు మాట. ఏమిటంటే ఐదు పంచేంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఏతద్ అధిష్టాతమైనటువంటి మనస్సు. మనస్సు ఎక్కడుంది? మనలోనే ఉంది. కర్మేంద్రియాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు పదకొండు, ఏకాదశ రుద్రాలు. ఏకాదశ రుద్రాలు దేంట్లో ఉన్నాయి? జడాత్మకమైన దేహంలో ఉన్నాయి. జడాత్మకమైన దేహంలో చైతన్య స్ఫూర్తితో రుద్రులంతా ఉన్నారు. కనుక ఏకాదశ రుద్రాభిషేకం మనం చేస్తున్నాము అంటే మనలో ఉన్న కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, మనస్సుకి దాని కర్త అయినటువంటి పరమాత్మకి అభిషేకం చేస్తున్నాము అని అర్థం. అది. ఏకాదశ రుద్రాభిషేకం అంటే జడ, స్థావర, జంగమ అంటే ఇనర్ట్ గా ఉన్నటువంటి దేహంలో చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మో, ఆత్మో ఏదైతే దాని పేరు ఏం పెట్టుకున్నా రెండూ కలిసి ఉన్నాయి. మనందరం కూడా జడ చైతన్యాల మేలుకలైక. మన శరీరం ఒక మంచి ఇనప పెట్టె. బాగా దట్టించి తయారుచేసిన ఇనప పెట్టె. కానీ ఆత్మ దానిలో పెట్టుకున్నటువంటి డైమండ్ నెక్లెస్. ఇంతకీ మన అపేక్ష దేనిమీద అని. దొంగొచ్చి వీరువా పట్టుకెళ్తే పట్టుకెళ్ళాడు. నగేదో ఇంట్లో పడేసిపోతే సరిపోయేదిగా అంటాం పోగొట్టుకున్న స్థితిలో కూడా. అంటే మనకి దేహం మీద పెద్ద బాంధవ్యం ఉండదు. కానీ అజ్ఞానం చేత మనం దీన్ని స్థిమితంగా ఇది నేను అనుకుంటాం. ఇది నేను కాదు. దీని పేరు మేనే. మేనులో ఎవరున్నారయ్యా అంటే నేను ఉన్నది. నేను ఆత్మ. అది అఖండము, చిద్ఘనము, పూర్ణము, అది సత్యము. సత్యము అంటే సతతము ఉండేది సత్యం.సదా అన్న అదే మాట నిరంతరము ఎల్లవేళలా Eternal గా ఏదున్నదో అది శివ. శివ అంటే మంగళాత్మకమైన శోభస్కరమైన శోభాయమానమైన శుభప్రదమైన క్షేమంకరమైనటువంటి ఒక భావన దాని పేరు శివం. సదాశివ బ్రహ్మేంద్ర అంటే కంచి ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు అది ఇంద్ర సంప్రదాయం కాబట్టి వీరు కూడా బ్రహ్మేంద్రులైనారు బ్రహ్మ ఇంద్ర సాంప్రదాయంలో దీక్షా నామం ఇవ్వబడింది గనుక సదాశివ బ్రహ్మేంద్రులు అంటే దాని అర్థం అది. అన్ని వేళలా మంగళాత్మకంగా ఉన్నారు అన్నివేళలా ఆయన ఉన్నారు ఎట్లా ఉన్నారంటే ఆత్మనిష్టలో ఉన్నారు ఆత్మై ఉన్నారు పూర్ణంగా వెలిగిపోతున్నారు. బానే ఉంది మాటలు మానేస్తే యోగ అయిపోతాడా? అని కదా ప్రశ్న. గురువుగారు చెప్పారు ఆయన మాటలు మానేశారు యోగ అయిపోయినారా? కాదె. ఎలా అయినారు అంటే ఎప్పుడు మాటలు తగ్గిపోయినాయో మాటలంటూ లేకుండా పోయినయో మానసికంగా కూడా రకమైన భావనలు లేవో శుభ్ర మనస్సు ఏర్పడింది. దాన్ని Supra mind అని Supra mental consciousness అని ఆధునికంగా మనం చెప్పుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అవన్నీ అక్కర్లే. అతీంద్రియ మనస్సు అతిమానుష మనస్సు అవన్నీ Technical words రెండే రెండు మనసులున్నాయి మనకి ఒకటి మనసుగా అనబడుతున్న ఒక దొంగ మనస్సు రెండవది The real mind. Real mind ఉన్నటువంటి వాళ్ళు ఇగో ఇక్కడ కూర్చున్న మనందరం మన బోటి వాళ్ళం Real mind తో ఉన్నాం లేకపోతే మనం ఇక్కడికి రాము. అసలు ఇది అక్కర్లేదు ఎవరికీ సూడో మైండ్ ఉన్నవాడికి. రెండు గంటల్లో రెండు లక్షలు సంపాయిద్దాం అనేవాడికి ఇక్కడికెందుకు వస్తాడు వాడు He will never waste his time కదా. పైగా మనల్ని చూసి అంటాడు రోజూ పోతారు ఏం దొరుకుతుందయ్యా అని మనం ఏం పట్టుకుంటామో వాడికేం తెలుసు. కదిలే సిరి వాడి దగ్గర ఉంది కదలని సిరి మన దగ్గర ఉంది మనతో పాటే ఉండే సిరి జ్ఞానం పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు గనుక మనందరం కూడుతూ ఉంటాం. కనుక సదాశివ బ్రహ్మేంద్రులకు ఒక శుభ్ర మనస్సు ఏర్పడింది. శుభ్ర మనస్సు మామూలుగా ఒక సాధారణ వ్యక్తికి కలగాలి అంటే అనేక జన్మలు దాటాలి ఒక జన్మలో ఏదో ఇట్లా వెళ్లి అట్లా బయటికి రాగానే Dry cleaning అయిపోయినట్లుగా ఏం రావు బయటికి. ఎన్నో వికారాలు, సంస్కారాలు, మూలవాసనలు, వాసనలు మనకున్నటువంటి భావనలు, ప్రారబ్ధాలు, జన్మగత విశేషాలు అనేకమైనటువంటి వైక్లభ్యాలన్నీ దాటుతూ దాటుతూ ఉంటే ఎప్పటికో ఒక శుభ్ర మనస్సు ఏర్పడుతుంది. ఇక్కడ గురువు యొక్క ఆజ్ఞను పాటించిన మరుక్షణమే సదాశివ బ్రహ్మేంద్రుల మనస్సు శుభ్ర మనస్సైపోయింది ఆలోచన లేదు. ఎవరితో అయినా మాట్లాడాలి ఆలోచించి గా మాట్లాడాలి ఆలోచన చేయాలి చదవాలిగా చదవాలి అంటే పుస్తకం కావాలిగా పుస్తకంలో ఉన్నది వెంటనే బయటికి చెప్పగలమా పుస్తకంలో చాలా ఉన్నాయి చెప్పటం ఎట్లా శుభ్ర మనస్సు గనక లేకపోతే విషయం చెప్పలేం. శుభ్ర మనస్సుకి ఏమీ అక్కరలేని తనం ఉంటుంది. దానికేమీ అక్కర్లేదు అదేమిటండీ ఏదన్నా కావాలి-- నాకేం అక్కర్లేదు అంటాడు. అన్నీ కావలసినటువంటి వాడు పొందుతాడు కానీ అశుభ్ర మనస్సు అది. కాబట్టి శుభ్రమనస్సు యోగత్వంలో తొలి మెట్టు అది సాధించారు ఆయన. సాధించగానే తమ చుట్టూ వాదోపవాదాలు ఎన్ని జరిగినా మౌనం వహించారు. సాక్షిగా ఉన్నారు. విన్నారా లేదా తెలీదు. విన్నారేమో వినలేదేమో ఎవరికెరుక. ఆయనకు మాత్రం ఒక్క విషయం తెలుసు. అవన్నీ గురువుగారు అనద్దన్నారు గానీ వినద్దనలేదుగా కాబట్టి అక్కడ ఉన్నారు. అనటం మానారు వినటం మాత్రం మానటం లేదు. నెమ్మదిగా యోగ సాధనలో పూరక, కుంభక, రేచక అనబడేటువంటి ఒక దివ్య ప్రాణాయామంలో నుంచి ప్రాణం శక్తివంతమైంది. ప్రాణం శక్తివంతం కావటమంటే ఒక సమతుల్యంలో అది సాగాలి. దానికి Equanimity, Equilibrium, Equipoise అనబడే మూడు స్థితులు కలగాలి. సుఖం రాణి వాడు ఏం పొంగడు. కష్టం వచ్చి మీద పడని ఏమీ బెదరడు వాడు ఎలా ఉంటాడు? ఓహో పడ్డదా అనుకుంటాడు. సుఖం వచ్చి ముంచెత్తుతున్నది ఇదీ మంది కాదనుకుంటాడు. రెండూ అనుభవించటము యోగత్వంలో పరిణిత మనస్సులో అది ఒక స్థాయి గనుక సదాశివ బ్రహ్మేంద్రుల వారు నెమ్మదిగా యోగ స్థితిలోకి వెళ్ళిన తర్వాత యోగ అనుభవాలు కలుగుతాయి కొన్ని సిద్ధులు ఏర్పడతాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి.
SSSMC · audio

Yoga Pravaham - 10

Home

Yoga Pravaham - 10

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:17

More in this series

Yoga Pravaham

15 episodes · 7 hr 37 min

  1. 27 min 1

    Yoga Pravaham - 01

  2. 34 min 2

    Yoga Pravaham - 02

  3. 24 min 3

    Yoga Pravaham - 03

  4. 30 min 4

    Yoga Pravaham - 04

  5. 29 min 5

    Yoga Pravaham - 05

  6. 41 min 6

    Yoga Pravaham - 06

  7. 26 min 7

    Yoga Pravaham - 07

  8. 42 min 8

    Yoga Pravaham - 08

  9. 32 min 9

    Yoga Pravaham - 09

  10. 29 min 10

    Yoga Pravaham - 10

    Now playing
  11. 26 min 11

    Yoga Pravaham - 11

  12. 40 min 12

    Yoga Pravaham - 12

  13. 19 min 13

    Yoga Pravaham - 13

  14. 28 min 14

    Yoga Pravaham - 14

  15. 21 min 15

    Yoga Pravaham - 15