Skip to content
Transcript తెలుగు
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఒక పరమాద్భుతమైనటువంటి యోగ శక్తి అది. వారి జీవిత గాథ కావాలంటే మన పుస్తకాల్లో దొరుకుతుంది అసలు వారి తత్వం ఏమిటి ఆయన ఏం చెప్పారు. ఏదో మన రోగాలు, ఈతి బాధలు, ప్రాపంచికమైన కష్టాలు, సుఖాలు వీటితో మాత్రమే ముడిపడకుండా వారి జాతకాన్ని జ్యోతిష్యులకు చూపిస్తే ఒకడన్నాడు "డెబ్భై ఏళ్లు ఉంటాడు ఈన" అన్నారు. రెండో వాడు అన్నాడు "కాదు, కాదు ఆయన మూడు వందల ఏళ్లు ఉంటాడు" అన్నారు. మూడో వాడు అన్నాడు "ఏడు వందల ఏళ్లు ఉంటాడు" అన్నారు. రాఘవేంద్ర స్వామిగా ప్రపంచం చేత జేజేలు అందుకొని గౌరవించబడి, పూజించబడి ఒక పరమాద్భుతమైన మహిమాన్విత మూర్తిగా గౌరవించబడుతున్నటువంటి సమయంలో కదాచిత్ ఏదో ప్రసంగ వశాత్ ఒకరు వారిని అడిగారు ప్రశ్న. జ్యోతిష్య శాస్త్రం తప్పయింది అని మీ విషయంలో నిరూపణ అయిపోయింది. ఎందుకంటే శాస్త్రం గనుక నిజమైతే మూడు ఎలా చెప్తారు? డెబ్భై అన్నా కావాలి, ఏడు వందలు అన్నా కావాలి. మధ్యలో మూడు వందలు ఎక్కడినుంచి వచ్చింది? మూడు కాదన్నమాట అసలేమిటి? అని అడిగారు. జ్యోతిష్య శాస్త్రం అది ఒక వెలుగు. దాంట్లోని, పేరులోని జ్యోతి అంటే వెలుగు. వెలుగు ద్వారా మనకు ఒక మార్గాన్ని సూచిస్తుంది. మన కర్మని మార్చదు జ్యోతిష్యం. ఏం జరగబోతున్నది, ఎట్లా ఉంటుంది, ఇంతకుముందు ఏం జరిగింది చెప్తుంది. ఇంతకుముందు ఏం జరిగిందో తెలుసుకున్నందువల్ల మనకు ప్రయోజనం ఏం లేదు కానీ, రేపు ఏం జరగబోతున్నదో కొంత తెలుసుకుంటే జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. రాఘవేంద్రుడు గంభీర ముద్రతో వారు ఇచ్చిన సమాధానం విన్నప్పుడు ఆశ్చర్యపోతాం. "ఆ మూడు కరెక్టే" అన్నారు. ఎందుకని అంటే "డెబ్భై సంవత్సరాలు జనం మధ్యలో నడయాడుతాను. దేహానంతరం మూడు వందల సంవత్సరాలు సమాధి గతమై ఉంటాను. ఏడు వందల సంవత్సరాల తర్వాత ప్రపంచానికి రాఘవేంద్రుల అవసరం ఉండదు. కానీ ఏడు వందల సంవత్సరాలు జీవిత కాలంలో సాధించిన సర్వ తపస్సు కూడా సాధారణమైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఈతి బాధను తొలగించి, మనసుకు ఒక స్వాంతన కూర్చి, కుటుంబాన్ని, వ్యక్తిని సంస్కరిస్తూ ఒక భద్రాయతమైనటువంటి స్థితిలో అభయ ముద్రగా జీవితాలను గనక నడిపించగలిగితే ప్రతి ఒక్కడూ ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలుగుతాడు. అందువలన రాఘవేంద్రుల యొక్క ప్రభ ఏడు వందల సంవత్సరాలకు పరిమితం." అని వారే స్వయంగా చెప్పారు. ఇట్లా చెప్పిన యోగిని మన ఎక్కడ చూడం. వారు వీణావాదనంలో కానీ, శాస్త్ర వాదనలో కానీ, కరుణలో, దయలో, అనుగ్రహంలో, ఆదరణీయమైనటువంటి మానవీయ స్పందనలో ఆయనతో తులతూగినటువంటి యోగులు ఎవరూ లేరు. మంత్రాలయ రాఘవేంద్రులు, అది వారు ఎంచుకున్నటువంటి ప్రదేశం. ఒక నవాబ్ ను అడిగారు, "నేను ఇక్కడ ఒక ఆశ్రమం కట్టుకోవాలని అనుకుంటున్నాను, నాకు చోటు కావాలి" అన్నారు. రికార్డ్స్ తీసుకొచ్చి చూశారు తెప్పించి. ప్రదేశం అప్పటికే ఇంకెవరికో ఇచ్చేసి ఉంది. అయితే నవాబు అతని ఇంటికి వెళ్లి "రాఘవేంద్రులు స్వయంగా ఇక్కడ ఉండాలి అని కోరుకుంటున్నారు, మీరు దయచేసి అది వారికి అప్పగించవలసింది" అని అడిగినప్పుడు "నాకు నిలువ నీడ లేకుండా చేస్తారా?" అని ప్రశ్నించాడు. నవాబ్ అన్నాడు. అంటే హిందూ, మొహమ్మదీయ మతాల మధ్య సామరస్యం ఎట్లా ఉండేది, ఎట్లా ఉండాలి అనటానికి గతం మనకు ఒక స్ఫూర్తి కావాలి. నవాబ్ అన్నాడు, "నువ్వు ఎంత రాఘవేంద్రులకు ఇస్తున్నావో దానికి రెండింతలుగా భూమిని నేను ఇస్తాను." వారు అడిగారు, "అది ఇద్దాం" అన్నారు. అదే మంచాల గ్రామం. మంచాల గ్రామంలో రాఘవేంద్రులు రావటం, మూలరామ పూజలు జరగటం, మూలరామ, మూల అక్షతలు ఏవైతే ఉన్నాయో అది మంత్రాక్షతలు కాబట్టి. ప్రపంచంలో మనం అనేక ఆలయాలు చూస్తాం. దేవీదేవతా నామాలతో ఏర్పడినటువంటి శివాలయాలు, రామాలయాలు, విష్ణు ఆలయాలు, శక్తి పీఠాలు. కానీ ఒక మంత్రమూలమైనటువంటి భావనకి ఆలయం ఉన్నది సర్వ జగత్తులో ఒక్క మంత్రాలయం మాత్రమే. అంటే ఎంత విభిన్నమైనటువంటి సంస్కృతి దేశం మనకిచ్చిందో చూడండి. మంత్రానికి ఆలయం, శబ్దానికి ఆలయం, నిశ్శబ్దానికి ఆలయం. ఆలయం అంటే పరమ పవిత్ర ప్రాంగణం. ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఐదు రోజులుగా ఇది ఆలయమే. ముఖ్యంగా, ప్రధానంగా ప్రదేశం పుణ్యం చేసుకున్నదో సత్యసాయి భగవానుడు అన్నట్లు "బయటంతా పీసెస్ ఏ, లోపలే పీస్". బయట జరుగుతున్నది తలుపు తెరిస్తే అంతా గందరగోళమే. మరి ఇక్కడ మాత్రమే ఒక ప్రశాంత నిలయంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి భావన, నిశ్శబ్దము, మౌనభూమిక ఎట్లా ఏర్పడ్డాయి అంటే నిరంతరమైనటువంటి భగవత్ చింతన చేతసత్సంగం చేత, సత్సాంగత్యం చేత, నిరంతరమైనటువంటి తీవ్ర విచారణ చేత, ఆధ్యాత్మిక భావనా భూమికలో జీవుడు నిలకడ చెందిన కారణం చేత, అన్నింటికంటే భారతీయ తత్వాన్ని ఎరగాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి జిజ్ఞాస కారణంగా ఇదంతా కూడా sanctify అవుతుంది పవిత్రీకరణ జరుగుతుంది. పవిత్రీకరణ ప్రతిరోజూ జరగాలి, ప్రతి చోటా జరగాలి, ప్రతి ఇంటా జరగాలి, ప్రతి వంటా జరగాలి. ప్రతి ఇంటిని, ప్రతి వంటిని ఒక ఆలయంగా మార్చుకోగలిగినట్లయితే మంత్రాలయ క్షేత్రంలో అనుభవాలు మనకు కలుగుతూ ఉన్నాయో, మనది శుద్ధ మనస్సు నిన్నంతా విచారణ చేశాం అదేమిటో supra mental consciousness మళ్ళీ అరవిందుల వారిదే భావం. వాటిని తీసుకుని శుద్ధ మనస్సుని మనస్సుకి, బుద్ధికి, చిత్తానికి అతీతమైనటువంటి ఒక భావనా భూమికని మనం గనక సంపాదించుకోగలిగినట్లయితే మాటలు మంత్రాలు అవుతాయి. లేకపోతే మంత్రాలన్నీ ఒట్టి మాటలై మిగిలిపోతాయి. మంత్రం మాట కావాలి కావాలా? కాకూడదు. మాట మంత్రం కావాలి అది value addition. అందరమూ ఒకే స్థితిలో ఒక జన్మ తల్లి గర్భాలయంలో నుంచి వచ్చాం value addition ఇచ్చుకుంటూ వెళ్ళాం. చదువుల ద్వారా, కీర్తి ద్వారా, సత్సంగం ద్వారా, సత్సాంగత్యం ద్వారా, స్వీయ సాధన ద్వారా, గురువు అనుగ్రహం ద్వారా, ప్రాప్తి ద్వారా, జన్మాంతర సంస్కార విశేషం ద్వారా ఇవన్నీ కూడా మనం అనుభవించగలిగినటువంటి ఒక మనస్సుని నిర్మాణం చేసుకోవాలి. మనోనిర్మాణంలో ఒక యోగాన్ని కూడా మనం అనుభవించాలి. ధ్యానము అంటే మనలో మనం ఉండటమని, యోగము అంటే మనతో మనం ఉండటమని ఇప్పటికే విచారణ పూర్ణం చేసుకున్నాం. అటు విద్యారణ్యులు కానీ, ఇటు రాఘవేంద్రులు కానీ వారితో వారు కూడి ఉన్నందువలన, వారిలో వారు ఉన్నందువలన మాత్రమే ప్రపంచంలో ఆరాధనీయులు అయినారు. ప్రపంచంతో గనక కూడి ఉన్నట్లయితే ఇవాళ వారిని గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ప్రపంచంతో కూడి లేకుండా ఉన్నట్టుంది గాని ప్రపంచాన్ని వాళ్ళేం వదిలిపెట్టలేదు. సత్యసాయి భగవానుడు అదే చెప్పారు "ప్రపంచాన్ని వదిలిపెట్టి నీవు గనక ఎలైనేట్ అయిపోయినట్లయితే ఇంకా నీ కర్తవ్యం ఏముంది ఇక్కడ? నాకు ప్రపంచం అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు, ఇల్లాలు అక్కర్లేదు అన్న వాడికి ఏం కావాలి?" అని. కనుక గృహస్థాశ్రమమే అత్యున్నతమైనటువంటి ఆశ్రమ భూమిక. అక్కడే మనం ఎవరినైనా ఆదరించగలం, సమాదరించగలం, ప్రేమించగలం. మానవీయమైనటువంటి emotional quotients అంటామే, sentiments అంటామే, మన సంస్కారం ఉన్నదే, ఇవన్నీ cherish చేయాలి, celebrate చేయాలి అంటే గృహస్థాశ్రమాన్ని మించి మరొకటి లేదు. సన్యసించిన వాడికి సన్యసించాలన్న భావనే గృహస్తు మన భావనలో నిజమైన సన్యాసి. సన్యాసి అంటే వదిలిపెట్టిన వాడు కాదు. వదిలిపెట్టినట్లుగా కనిపిస్తున్నా, వదిలినట్లుగా, అంటిపెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నా సమన్యాసం చేసేవాడు సన్యాసి. అంతే కానీ సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాడు మాత్రమే కాదు. అది వైయక్తికం, వ్యక్తిగతం అవుతుంది. నిజమైనటువంటి సన్యాసం సమన్యాసం balancing act అని ఇవాళ మనం చెప్పుకోవాలి. అన్నీ ఉండాలి. ఇల్లు ఉండాలి, ఇల్లాలు ఉండాలి, పిల్లలు ఉండాలి, ప్రొజనీ ఉండాలి, తరవాతరాలు మన కళ్ళ ముందు పెరగాలి. వాళ్ళంతా పెరిగి ఏం చేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు భారతీయమైనటువంటి మూలాలు మాత్రం కదిలిపోకుండా జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకే మళ్ళీ ఒక్కసారి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యావరణంలోకి ప్రవేశిస్తే చాలా గొప్ప మాట అన్నారు ఒకసారి. "నీ బిడ్డలకి ఆస్తి ఇవ్వటం ప్రధానం కాదు, అది వారసత్వం కాదు. నీ బిడ్డలకి సంస్కారాన్ని, భారతీయ సంస్కృతిని గనక అందించగలిగితే నీవు నీ బిడ్డకి ఇచ్చేటువంటి ఉత్తమోత్తమమైనటువంటి వారసత్వం." It's not enough if we give world to the child but we must produce a child and give it to the world. ఎటువంటి వాడై ఉండాలి? వాడు భారతీయుడై ఉండాలి, పూర్ణ మానవుడై ఉండాలి, సంపూర్ణ మానవుడై ఉండాలి, ఉదాత్తుడై ఉండాలి, ఉత్తముడై ఉండాలి, ఉన్నతుడై ఉండాలి, ఆధ్యాత్మిక భావనా భూమికలో నిలకడ చెందినటువంటి spiritual bent of mind ఉండాలి. spiritual కానిదంతా ritual ఏ, అంతాతంతే కర్మకాండే. అది లాభాన్నివ్వదా అంటే ఇస్తుంది. పరిమిత లాభాన్నిస్తుంది. మళ్ళీ దానిలో ఒక రకమైన వ్యామోహం ఉంటుంది. ఇది ఎలా చేయాలి, చేయగలమా లేదా అనేటువంటి మీమాంస ఉంటుంది. spirituality అనబడేటువంటిది ఒక ఆధ్యాత్మికమైనటువంటి supreme state. అక్కడికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక భావన అంటే physical, metaphysical and spiritual మూడు స్థాయిలలో physical level లో అన్నీ ఉండనివ్వండి. ఇప్పుడు మనం అనుకున్న విద్యారణ్యులు physical స్థాయిలో ఆచరించి-- ఆలోచించి ఉన్నట్లయితే వారు రాజ్య నిర్మాణం చేయవలసిన పని లేదు, హరిహర రాయలని, బుక్క రాయలని పిలవవలసిన పని లేదు, ఒక సామ్రాజ్య సంస్థాపన చేసి రాజ్యాధికారాన్ని పొందవలసిన అవసరం లేదు. కానీ తద్వారా సమస్త కార్యకలాపాల ద్వారా ఒక హైందవ జాతి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టారు. రాఘవేంద్రుడు పండితులు, మహాకవి, దార్శనికులు.వ్యాకరణ మీమాంస అనబడేటువంటి అనేకమైనటువంటి వాదాలలో ఆయనని నిలువరించ గలిగిన వాడు సమయంలో మరొకడు లేడు. అన్నింటికంటే ఆత్మ దర్శనం చేసినటువంటి మహా దివ్య పురుషుడు కనుకనే ఇవాళ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని మనం ఉపాసిస్తున్నాం, పూజిస్తున్నాం, నమ్మకంతో వెళుతున్నాం. వెళ్ళినందుకు నమ్మకాలు నిలబడుతున్నాయి అది వారి ప్రమాణం. కాబట్టి రాఘవేంద్ర సంస్కృతికి మళ్ళీ మూలం ఏమిటి అన్నప్పుడు వారు నిజానికి వైష్ణవులు. హరి సర్వోత్తమా అనబడేటువంటి ఒక మూలమైనటువంటి మంత్రమే ఆధారంగా మధ్వమతం ఏర్పడింది. అక్కడ హరి అంటే వాయువు అని అర్థం, హరి అంటే విష్ణువు అని అర్థం, హరి అంటే కోతి అని అర్థం. కోతి వాయునందనుడు. ఆంజనేయస్వామి కేసరి నందనుడు అంటే గాలి నుంచి పుట్టినవాడు. కాబట్టి హరి సర్వోత్తముడు. మనమేం ఉన్నాం, ఇదిగో దేహం కూర్చుంది మాట్లాడుతుంది కొన్ని వింటున్నాయి. వింటున్నది ఏది అంటే మన యందు ఉన్నటువంటి వాయువే. అది లేదనుకోండి అనేది లేదు, వినేది లేదు. కాబట్టి మన సర్వమూలము, సర్వోత్తమమైనది దేహంలో ఏది అంటే ప్రాణమే కాబట్టి మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ అనబడేటువంటి షట్ చక్రాలలో యోగాగ్ని నెమ్మదిగా మూలాధారంలో ప్రారంభమై అది గం. మూలాధారంలో ఓం గం గణపతయే నమః అంటాం. గం అనేటువంటి మూలాధారంలో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. అంటే సహస్రారం. మూలంలో ఉన్న గం చివరలో ఉన్న కలిపితే గంగ. గంగని తిప్పి చదవండి అది మళ్ళీ గంగే. పైనుంచి కిందకైనా, కింద నుంచి పైకైనా ఆపాదమస్తకమైనా ఒకటే, శిరస్సు నుంచి పాదం వరకు చూసినా ఒకటే. అంటే గం అనేటువంటి మూలాధారంలో నుంచి అజ్ఞాన భూమిక లోనుంచి ప్రారంభమై ఇదిగో అనేకమైనటువంటి ఆవృత్తాలు తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఊర్ధ్వముఖంగా అప్ వర్డ్ జర్నీ అంటాం. అప్ వర్డ్ జర్నీలో వెళ్ళి వెళ్ళి వెళ్ళి సహస్రారానికి వెళ్ళినప్పుడు అనబడేటువంటి జ్ఞానం పొటమరిస్తుంది కనుక, అక్కడ ప్రాదుర్భవిస్తుంది కనుక, అది అక్కడ ఏర్పడుతుంది కనుక గం లేకుండా లేదు. పాపమే చేయలేదనుకోండి గంగాస్నానం ఎందుకు? చీకటి గనక లేకపోతే వెలుగు యొక్క ఉనికి ఎక్కడున్నది? పిరికితనమే లేకపోతే ధైర్యం ఎక్కడున్నది? అపజయమే లేకపోతే విజయం ఎక్కడున్నది? బురదే లేకపోతే పద్మం ఎక్కడున్నది? జననమే లేకపోతే మరణం ఎక్కడున్నది? అంటే ప్రతి మూలాన్ని మనం వెతుకుతూ వెళ్ళినట్లయితే కంటికి కనపడనంత గాఢమైన, ఘనమైన చీకటి. చీకటిని చీల్చుకొని వెలుగుని దర్శనం చేయటమే ఆత్మావలోకనం. దానికై ఆత్మనిష్ఠ చేయాలి. ఆత్మనిష్ఠ చేయాలి అన్నప్పుడు క్షణాన మనోఫలకం మీద స్మృతి పథంలో అనేకమంది గురు స్వరూపాలు తెరమీద బొమ్మల వలే కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అందులో రాఘవేంద్రులు ఎంత పౌరాణికమైన, వాంగ్మయమైన, సనాతనమైన మూర్తో. దేవుడు లేడంటూ, సమాజాన్ని మించిన దైవం లేదంటూ, ప్రకృతి మాత్రమే దైవమంటూ ప్రారంభమైన మరొక వివేకానంద తుల్యమైనటువంటి మహా గురువు ఒకడున్నాడు ఆయన నారాయణ గురువు. సమాజంలో అస్పృశ్యత పోవాలి, అనాచారం పోవాలి, కుల మత విధానాలు నశించిపోయి జాతి అంతా ఒక్క జాతిగా ఉండాలి, అది మానవజాతిగా నిలబడాలి అని చెప్పినటువంటి మహోదాత్తుడు నారాయణ గురువు. ఒక సంఘ సంస్కరణ ద్వారా జాతిని ఉత్సాహపరచిన, ఉద్వేగపరచిన, ఆలోచింపచేసిన అటువంటి పరమోత్కృష్టమైనటువంటి మహా యోగి నారాయణ గురువు. వారు పరమ చరమమైనటువంటి ఒకానొక దశలో చిట్టచివరగా వారు వెళ్ళిన ఒకే ఒక్క ప్రదేశం అది అరుణాచలం. శిష్య సమేతంగా వెళ్లారాయన. రమణులు వారితో ఏం మాట్లాడలే. రెండు రోజులున్నారు, మూడు రోజులున్నారు వాళ్ళిద్దరి మధ్య రకమైన సంభాషణ జరగటం లేదు. నారాయణ గురువు సంస్థితం అవుతున్నది. ఆయన మనస్సు హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, పరమ ఉదారంగా ఉన్నది. కానీ ఆయనతో వచ్చిన శిష్యులు అహాన్ని అణచుకోలేక ఒక సాయంకాలం అడిగారు, "ఇంత అమర్యాద మీకు జరుగుతున్నది, వారు మీతో ఏం మాట్లాడటం లేదే ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం?" అని. "వారు మాట్లాడటం లేదని మీకెలా తెలుసు? మేమిద్దరం నిరంతరం మాట్లాడుకుంటూనే ఉన్నాం" అంటూ ఐదు శ్లోకాలు రమణుల గురించి రాశారు. ఐదు శ్లోకాలు ఒక ఆయతం మీద రాసి అక్కడ పెట్టి మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇది జరిగిన అతి కొద్ది రోజులకే ఒకరోజున భగవాన్ రమణులు కుంజుస్వామి అని ఒక భక్తుడ్ని పిలిచి అరుణాచలం నుంచి విభూతి పొట్లం కట్టి "ఇది నారాయణ గురువుకి అందించిరా" అన్నారు. రమణుల చరిత్రలో ఇట్లా జరగటం అది ఒకే ఒక్కసారి. అది ఒక్క నారాయణ గురువు విషయంలోనే జరిగింది. కుంజుస్వామి వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్లేసరికి నారాయణ గురువు సర్వజ్ఞుడయినాడు అప్పటికి. ఆత్మని ఎరిగిన వాడయినాడు. "భగవాన్ నా మీద ఉన్నటువంటి దయచేత విభూతిని పంపించారా, అది నాకు ఇవ్వండి" అన్నారు. ఆయనకేం తంత్రం తెలియదు. ఆయనేం జ్యోతిష్యం చదివినవాడు కాదు. అంటే మనస్సు మీద ఉన్న వాలినటువంటి మాలిన్యాలు తొలగిపోతే ఆత్మ కనపడుతుంది. దానికి గంభీరమైన వేదాంత ఉపన్యాసాల ద్వారా ఆత్మనిష్ఠ కలగదు. మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి.మనసంటూ ఉన్నది గనుక అనేక ఆలోచనలు పుడతాయి. ప్రతి ఆలోచన మనకు అక్కరలేదు గనుక కావలసిన ఆలోచన భగవత్ భావన భగవద్రతిని మాత్రమే దగ్గర పెట్టుకుని మిగతా వాటన్నింటిని కూడా erase చేస్తూ వెళ్ళాలి. చేయగా, చేయగా శుభ్ర మనస్సు పరమాత్మకి సన్నిహితం చేస్తుంది. కుంజుస్వామి ఆశ్చర్యపోయినాడు. అడిగాడు, "భగవాన్ పంపించారు అని మీకు ఎలా చెప్-తెలిసింది? ఎట్లా గ్రహించారు? నిజమే నన్ను పంపించారు తీసుకోండి అన్నారు." అంటే ఇక్కడ గ్రహించటానికంటూ ఏం లేదు ఉన్నదంతా స్థిమితంగా ఉండనే ఉంది. మనసంటూ ఉంటే గ్రహించటం, గ్రహించకపోవటం అంటూ రెండు ఉంటాయి అన్నారు. విభూతి ధారణ చేశారు. ఒక రెండు, మూడు రోజుల్లో వారి దేహాన్ని వదిలిపెట్టారు. అంటే time and space ని దాటుతాడు యోగి అన్నటువంటి నాలుగు రోజుల విచారణలో ఇదొక అద్భుత భావన. అలాగే మౌనస్వామి ఇంకొకాయన. ఆయన పేరు నిజానికి మౌనస్వామి కాదు. ఆయన పేరు శివయ్య. ఆయన కూడా ఇట్లాగే మనం అనుకుంటాం మాట్లాడి మాట్లాడి ఒకరోజున మౌనభూమికలోకి వెళ్ళాలి అని మనకు అనిపిస్తున్నట్లే ఆయన మౌనభూమికలోకి వెళ్లారు. అనేక మహత్యాలుగా చేశారు. అనేక మందిని ఆదరించారు. భగవత్ శక్తిని నిరూపించారు. మౌనస్వామి వారికి కూడా అరుణాచలంతో సంబంధం ఉంది. అది విచిత్రం! యోగులంతా అరుణాచలానికి సంబంధించి ఉంటారు. అరుణాచలానికి వెళ్ళటం, రమణుల్ని దర్శనం చేయటం, శేషాద్రి స్వామితో సహా వారితో కాసేపు మాట్లాడటం, ముచ్చటించడం జరిగితే, ఈయన అప్పటికి మౌనస్వామి కాదు గనుక రమణులు ఆయన్ని పేరుతో పిలిచారు. "శివయ్య ఎప్పుడొచ్చావు?" అని వారికి తెలుగొచ్చు గనుక. కాస్త ఆశ్చర్యపడ్డారు ఈయన. "నా పేరు ఎవరికీ తెలియదే. ఆంధ్రదేశం నుంచి వచ్చాను. నన్ను ఎలా పిలిచారు?" అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే. ఒక నదీ ప్రవాహంలో ఒక నీటి చుక్కని మరొక నీటి చుక్క వేరు చేయలేదు కదా! ఉన్నదంతా ఏకాత్మే, అఖండమే, చిద్గణమే, పూర్ణమే అయినప్పుడు ప్రత్యేకించి వ్యక్తిత్వాలంటూ ఎక్కడ ఉన్నాయి? వ్యక్తిత్వమూ, అస్తిత్వమూ ఉనికి నశించితే దాని పేరు ఆత్మ కదా! అన్నటువంటి ఒక భావన మౌనస్వామిని కుర్తాళం తీసుకుని వెళ్ళింది. కుర్తాళ పీఠాన్ని ఆయన ప్రారంభించారు. పీఠం ఉద్దేశంలో ఒకటే. దానికి మంత్రతంత్రాలకి అతీతమైనటువంటి పరమోదాత్తమైనటువంటిది కుర్తాళం పీఠం. వారు ఉన్నంత కాలం వారి ఉనికి ప్రపంచానికి అక్కరకు వచ్చింది. వారి భావాలన్నీ కూడా ప్రపంచాన్ని పరమ ఉదారంగా నడిపించినాయి. ఒక ఉద్ధతతో నడిపించినాయి.
SSSMC · audio

Yoga Pravaham - 15

Home

Yoga Pravaham - 15

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 21:21

More in this series

Yoga Pravaham

15 episodes · 7 hr 37 min

  1. 27 min 1

    Yoga Pravaham - 01

  2. 34 min 2

    Yoga Pravaham - 02

  3. 24 min 3

    Yoga Pravaham - 03

  4. 30 min 4

    Yoga Pravaham - 04

  5. 29 min 5

    Yoga Pravaham - 05

  6. 41 min 6

    Yoga Pravaham - 06

  7. 26 min 7

    Yoga Pravaham - 07

  8. 42 min 8

    Yoga Pravaham - 08

  9. 32 min 9

    Yoga Pravaham - 09

  10. 29 min 10

    Yoga Pravaham - 10

  11. 26 min 11

    Yoga Pravaham - 11

  12. 40 min 12

    Yoga Pravaham - 12

  13. 19 min 13

    Yoga Pravaham - 13

  14. 28 min 14

    Yoga Pravaham - 14

  15. 21 min 15

    Yoga Pravaham - 15

    Now playing