No transcript for this section.
సాధనలో మనకు తెలియకుండానే మనకి దివ్య సిద్ధులు కలుగుతూ ఉంటాయి. సాధన వల్ల కలిగే ఫలితాలు అంతే కదా! పరీక్ష రాస్తే ఎట్లా pass అవుతామో ఆధ్యాత్మిక సాధన గనక చేసుకుంటూ వెళితే వాక్ శుద్ధి, వాక్ సిద్ధి రెండు ఏర్పడతాయి. శుద్ధమైనటువంటి ఒక వాక్కులో నుంచి ఒక ఆనందం కలుగుతుంది. ఒక అధికారం ఏర్పడుతుంది. శాస్త్రాల పట్ల సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది. కావలసినప్పుడు నిన్నో మొన్నో అనుకున్నాం శాస్త్రగతమైన అన్ని విషయాలు ఏ రకమైన ప్రయత్నం లేకుండా they fall in place ఇది. యోగ స్థితిలో జీవుడి యొక్క సంచారాన్ని we can measure that way. అది ధ్యాన ధారణ అతీతమైనటువంటి ఒక స్థితి. ధ్యానం దాటాలి ధారణ దాటాలి అతీతమైనటువంటి ఒకానొక స్థితిలో జీవుడు యోగిగా మారినప్పుడు ప్రధానంగా ఈ కేవల కుంభక యోగాన్ని ఆశ్రయించినప్పుడు ఈయన యోగాన్ని ఆశ్రయిస్తాడా? యోగము ఆయన్ని ఆశ్రయిస్తుందా? అని యోగమే ఆయనను ఆశ్రయిస్తుంది. సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు ఏ సిద్ధి ఆయనకు అవసరమో ఆ సిద్ధి వస్తుంది. అందుకనే సత్య సాయి భగవానుడి సాహిత్యాన్ని మనం క్షుణ్ణంగా చదివినప్పుడు స్వామి ఒకే ఒక్కసారి ఒక revelation చెప్పారు. అష్టసిద్ధులు అరచేతి ఉసిరికలై ఉన్నప్పుడు ఏది ఎప్పుడు కావాలో వాటి పని అవి చేస్తుంటాయి అందులో నా ప్రయత్నం ఏమీ ఉండదు అన్నారు. ఇప్పుడు ఓ ఉంగరం సృష్టించారు, గొలుసు సృష్టించారు, ఓ లింగోద్భవం చేశారు. ఎలా చేశారు? విషయం తెలియని వాడికి అది మహిమగా, మాయగా, కనికట్టుగా, గారడీలాగా అనిపిస్తుంది. యోగశాస్త్రం ఎరిగిన వాడికి చాలా స్వామి చూపించింది చాలా చాలా చిన్న విషయాలు అవి చూసే మనం ఆశ్చర్యపోయినాం. కానీ యుగాలకు దాటి దాటి ద్వాపర యుగం నాడు వాడిన వస్తువులను కూడా స్వామి కలియుగంలో చూపించారు. సృష్టించి. ఎట్లా? అంటే యోగి దేశకాలాతీతుడు. దేశకాలకలనా వైచిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు. దక్షిణామూర్తి స్తోత్రం ఒక కవితాధార పరమాద్భుతమైన భావఝరి అది. అది చెప్పుకుంటుంటే దక్షిణామూర్తి వచ్చి ఇక్కడ వినవలసిందే. ఆయన ఎక్కడికి పోతాడు? ఆ ఆనందానుభూతి మనకు కలిగిస్తుంది ఆ, ఆ శ్లోకాలన్నీ కూడా. యోగశాస్త్రంలో కేవల కుంభకం వచ్చి సదాశివ బ్రహ్మేంద్రుడిని ఆశ్రయించింది. సంఘటనలు ఉంటే తప్ప సత్య నిరూపణ కాదు. అంతేగా! proof కావాలి. proof కావాలి అంటే ఓ కథ కావాలి. కథ అంటే కల్పించబడేది కథ జరిగినది సత్యం అది చరిత్ర. ఇవాళ మనం కథ చెప్పుకోవటంలా చరిత్ర చెప్పుకుంటున్నాం. ఒకసారి సదాశివ బ్రహ్మేంద్రుడు ఓ పొలం కుండా నడిచి వెళుతున్నారు. అక్కడ వరి కుప్పలు వేసున్నాయి. రెండో మూడో రోజుల్లో వాటిని నూర్చి ధాన్యం తీసుకుని ఇంటికి వెళ్ళాలి. వారేదో వారు తాదాత్మ్య స్థితిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎవరో దూరం నుంచి చూసి మన కుప్పలో దొంగతనం చేయటానికి ఎవడో ఒక వ్యక్తి వెళుతున్నాడు అనుకున్నాడు. అనుకొని ఆయన్ని వెంబడించాడు. ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. మామూలు మనిషిలా కనిపిస్తున్నాడు గాని అంగలు చాలా పెద్దవిగా ఉన్నాయి. అయినా వీడు ప్రయత్నం చేసి చేసి అందుకోలేక తన చేతిలో ఉన్నటువంటి కత్తి విసిరేద్దామని కుడి చెయ్యి ఎత్తాడు. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఆగిపోయింది. బొమ్మ అయిపోయింది చెయ్యి. ఆశ్చర్యపోయాడు ఏమైంది అని. ఏమైంది ఏం కాలే. అప్పుడు సదాశివ బ్రహ్మేంద్రుడు సంకల్పించినట్లుగా వారు ఎక్కువ కష్టం పెట్టరు మహిమ చూపిస్తారు మామూలుగా అయిపోతారు. ఇలా వెనక్కి తిరిగి చూశారు వాడి చెయ్యి మామూలు అయింది. అవ్వగానే వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడటం మానేశారుగా. తన దారిన తాను వెళ్ళటం మొదలు పెట్టారు. అలాగే కావేరీ నదీ తీరంలో సైకతం అంటే ఇసుకతిన్నె మీద కూర్చొని ధ్యానంలో ఉన్నారాయన. ఆ ధ్యానం నెమ్మదిగా దాటి దాటి సమాధి స్థితికి వెళ్లిపోయిందా అని తెలియలే. అంటే కేవల కుంభకం అయిన యోగం ఆ శరీరాన్ని ఆక్రమించింది, ఆవేశించింది ఆ సమయంలో. మరి ఎన్నాళ్ళు కూర్చున్నారో, ఎట్లా కూర్చున్నారో ఆయె, ఓ రోజున ఒక వరద వచ్చింది. కావేరీ వరద, గోదావరి వరద వరద అంటే అవే వరదలు. మామూలు వరదలు వరదలు కావు. వరద అంటే రెండు అర్థాలు. బురద తెచ్చేది వరదే, వరాన్ని అనుగ్రహించేది వరదే. వరద వరాన్నిస్తుంది. వరద రాకపోతే ఆ భూమి సస్యశ్యామలం కాదు. వరద రావాలి. అందుకనే వరదరాజస్వామి అన్నారు వెంకటేశ్వర స్వామిని. వరం ఇస్తూ ఉంటాడు అందులో ఆ వరాలివ్వటంలో he is the king అట. అందుకనే వరదరాజస్వామి అన్నారు. సరే సదాశివ బ్రహ్మేంద్రుల వారు అదిగో ఆ సమాధి గతమైనటువంటి స్థితిలో ఉండగా వరద వచ్చింది. పరవళ్ళు దొక్కుతూ నీరు ఆయన్ని ముంచెత్తింది. ముంచి ఎత్తగా ఎత్తగా వరద తగ్గుతుంది recede అయిపోయింది. మర్చిపోయారు. ఎవ్వడికీ తెలియదు అక్కడ ఆయన కూర్చున్నారనో, ఆయన మీదగా వరద ఎళ్ళిందనో ఎవరికీ తెలియదు. మూడు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఇసక మేట అంటారే అది ఏర్పడినప్పుడు మళ్ళీ బళ్ళు, లారీలు మామూలు మన మనిషి గోలంతా అదే కదా! తవ్వుకుపోవటమేగా మన పని జ్ఞానం తప్ప. అన్నీ తవ్వుకు పోవటమే. ఆ తవ్వుకు పోవటానికి వాళ్ళు వచ్చారు. పలుగు, పారా వేయగానే దానిలో నుంచి ఒక సజీవమైనటువంటి ఒక రాతి బొమ్మ కూర్చున్నట్టుగా ఉన్నారు. మూడు నెలలు ఇసక మేట లోపల వారు సమాధి స్థితిలో ఉండిపోయినారు.ఇది యోగశాస్త్రంలో కేవల కుంభక యోగానికి ఒక పతాక స్థాయి. వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. అసలు ఎట్లా బతికున్నారు ఈయన అని. యోగి, తొట్ట తొలి రోజున మనం త్రైలింగ స్వామి గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు వందల ఎనభై సంవత్సరాలు బతికారని, అలాగే బాబా, బాబాజీ అనబడేటువంటి అవతార్ బాబా అనేవేళ ఏదైతే పాపులర్ గా మనందరం వింటూ ఉంటామో, ఆయన కొన్ని వేల ఏళ్లుగా ఉన్నాడని. ఇందులో అసహజం ఏం లేదు. సహజ స్థితి ఏమిటంటే, అజ్ఞానం ఏమిటంటే, స్వామితో సహా మనం ఆయన వెళ్లిపోయారు, దేహం వదిలిపెట్టేశారు అంటూ ఉంటాం. ఆయన వదిలిపెట్టింది ఒట్టి దేహమే, ఇంకా ఏమి వదిలిపెట్టలా, ఇక్కడే ఉన్నారు. ఆ భావనలో మనం ఉండాలి. సమాధి స్థితిలో శక్తివంతం అవుతాయి, ఆ వచ్చినటువంటి అవతార మూర్తులన్నీ కూడా. పాంచభౌతిక దేహంలో ఇదే ప్రపంచంతో కూడి ఉన్నప్పుడు వాళ్లకన్నీ పరిమితులు ఉంటాయి. Rules and regulations వాళ్లకు కూడా ఉంటాయి. ఒక్కసారి దేహాన్ని దాటి బయటపడిపోయిన తర్వాత విశ్వశక్తి వారై ఉంటారు గనుక, ఇది కూడా ఇప్పుడేళ సప్రమాణికంగా మనం అనుభవం చేసుకుంటున్నాం. సదాశివ బ్రహ్మేంద్రుడు ఇట్లాగే మళ్ళీ తంజావూరు ప్రాంతంలో వరి పొలాలు బాగా ఉంటాయి. వెళుతున్నారు ఒక సాయంకాలం పూట, వేసవి కాలం. అక్కడ కుప్ప కాపలా కాస్తూ ఒక పడుచు కత్తె ఉన్నది. వీరు వెళుతున్నారు, వీడి మాన, వీరి మానాన వీరి వెళుతున్నారు దూరం నుంచి చూశాడు ఒకడు. తన భార్యకి ఏదైనా ఆయన అపకారం చేస్తాడేమో ఈ వ్యక్తి అనుకున్నాడు, కత్తి విసిరాడు. మొదటిసారి కత్తి విసరబడలేదు, ఇప్పుడు మాత్రం కత్తి విసిరాడు. ఎడమ చెయ్యి తెగిపోయింది, సదాశివ బ్రహ్మేంద్రుల వారిది. వాడన్నాడు, ఆయన పడిపోతాడు, కుప్పకూలిపోతాడు అని అనుకున్నాడు. వారు నడుస్తూనే ఉన్నారు, వారి వెనుక గాలిలో ఆ చెయ్యి వారితో పాటు ప్రయాణం చేస్తూ వెళ్ళింది. వీడికి ఆశ్చర్యం వేసింది. తెగిపోయిన చెయ్యి నేల మీద పడాలి కదా, వారి వెనక ఎట్లా వెళుతున్నది? వాడు, ఆయన యోగి అని వీడికి తెలియదు కదా. వెళ్ళగా, వెళ్ళగా చూశాడు, చాలా సేపు చూశాడు. ఎంతవరకు ఈయన నడవగలడో చూద్దాం అనుకున్నాడు, ఆయన నడుస్తూనే ఉన్నారు, అందుకున్నాడు. ఎదురు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఏం జరిగింది అన్నట్లుగా చూశారు. క్షమించమని వేడుకున్నాడు, ఆ కత్తి పారేశాడు కింద. మీ చెయ్యి నరికింది నేనేనన్నాడు. ఈయన వెనక్కి తిరిగి ఆ చెయ్యి వైపు చూస్తే చెయ్యి ఆయన దగ్గరకు వచ్చింది. ఊరికే మనం చొక్కా గుండీ పెట్టుకున్నట్టుగా ఇట్లా ఇట్లా అన్నారు, అది అతుక్కుంది, ఆయన దారిన వెళ్ళిపోయినారు. ఇది కేవల కుంభక యోగం. ఈ మహాత్ముల్ని మనం స్మరించుకోకపోతే మన జన్మ ఏమి, ఇదేమన్నా సాఫల్యం ఉందా నిజానికి? అట్లాగే, ఇది రెండవ సంఘటన, మూడవ సంఘటన. నాలుగవ సంఘటన, సదాశివ బ్రహ్మేంద్రుడు ఈ సంకీర్తనలు రాయటానికి రెండు కారణాలున్నాయి. ఎందుకు రాశారు? మాట వదిలేశారుగా. వాచా మౌనం కాదు మానసిక మౌనమే నన్నాంగా, అంటే ఇంకా మనసు ఉన్నదా? అంటే, ఆయన ఇందాక చెప్పిన ఆ సంకీర్తన బాలమురళీకృష్ణ గారు పాడారు వినండి. ఆయనే పాడాలి, మనమే వినాలి. అందులో ఖేలతి మమ హృదయే, ఎక్కడ నువ్వు ఆడుతున్నావు అంటే నా హృదయంలో ఆడుతున్నావు అని సంకీర్తన. అదంతా కూడా ఒక భావాత్మకమైన రసయోగం అది. రసార్ద్ర భూమి కంటాం. ఆ రసయోగంలో పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మని, ఆయన సంకీర్తన చేస్తాడు. రే రే మానస, ఇవన్నీ అన్నీ కలిపి పదమూడు. ఆ CD ఉంటే హాయిగా కొనుక్కొని ఎప్పుడన్నా వినండి. వింటే ఉయ్యాలలో ఊగుతుంది మనసు. ఆనందతాండవం చేస్తుంది. సమాధి నిష్ఠలో ఉన్నటువంటి ఒక జ్ఞాని భగవంతుణ్ణి గురించి గనక పాడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మామూలుగా కవులంతా జ్ఞానం కోసం, ముక్తి కోసం కవిత్వం రాస్తారు, కావ్యాలు రాస్తారు, ప్రబంధాలు రాస్తారు. పోతనామాత్యుడు అన్నాడు, శ్రీ కైవల్య పదం కోసం భాగవతం రాస్తున్నానన్నాడు. శ్రియన గౌరినా పరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ అని కొల్చడి భక్తజనంబు వైదిక జ్వాయిత కిత్తమెచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధి కిన్నన్నాడు తిక్కన. నన్నయ్యగారు జగద్ధితం. ఆధునిక కాలంలో, మన సమయంలో విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షాన్ని జన్మాద్యపాయము తప్పించుతన్నన్నాడు. మాటల్లో తేడా తప్ప భావం ఒకటే. శ్రీ కైవల్యం అన్నా, జన్మల వలన కలిగే అపాయం తప్పాలన్నా, పునర్జన్మ లేని ఒకానొక స్థితి ఏర్పడాలన్నా కవులు ఆ భావన చేసి శ్రీకారం చుట్టి పరమేశ్వరుడికి తమ కావ్య రచనని కైంకర్యం చేస్తారు, సమర్పించుకుంటారు. అది ఒక ఎత్తు. జ్ఞానే కవిత్వం రాస్తే, జ్ఞాని అయినవాడే కవిత్వం రాశాడనుకోండి. అరుణాచలంలో ఒక వైణికురాలు భగవాన్ రమణ మహర్షి దగ్గర మూడు రోజులు వీణ వాయించింది. మామూలుగా సహజ సమాధి స్థితిలో ఉండేటువంటి రమణ మహర్షి అది బాగుంది అనలేదు, బాగాలేదు అనలేదు, విన్నారో లేదో తెలియదు, వింటున్నారో లేదో తెలియదు. ఆయనకు నచ్చిందో లేదో తెలియదు, ఎవరికీ తెలియదు, ఆవిడ వాయిస్తున్నది ఆయన వింటున్నారు, మూడు రోజులు అయిపోయింది. నాలుగవ రోజు ఆమె ప్రయాణం. ఆ రోజున చటాలను ఆమె వైపు చూశారు భగవాన్.చూడగానే ఆమె నమస్కరించి "త్యాగరాజ స్వామి వారి వలె వీణావాదనం చేస్తూ తరించాలని అనుకుంటున్నాను అనుగ్రహించండి" అని అడిగిండ్రు. ఆయన "ఏమ్మా ఏమన్నావు?" అని అడిగారు. ఆయనకి వినపడలేదు అనుకొని ఈమె మళ్ళీ అన్నది "త్యాగరాజస్వామి వారి వలె నేను వీణావాదనం చేసి తరించాలి అని అనుకుంటున్నాను". అప్పుడు భగవాన్ రమణులు కరుణాపూర్ణ సుధాబ్ధి గనుక ఆయన ఓ మాట చెప్పారు "త్యాగరాజస్వామి పాడి తరించలేదమ్మ తరించి పాడారు" అది. తరించి పాడితే ప్రతి పాట ప్రతి కీర్తనలో శ్రీరామ దర్శనాన్ని ఆయన అనుభవించారు. తన దర్శనాన్ని తాను రోజూ ఉపాసిస్తున్న పూజిస్తున్న విగ్రహాన్ని శ్రీరామ విగ్రహంగా భావించాడు. శ్రీరాముడిగా భావించాడు. కాబట్టి కనబడుతున్నది బొమ్మ మాత్రమే కాదు అది బ్రహ్మము అనే భావనలో మహా యోగ స్థితిలో నాదయోగిగా సంచారం చేశారు గనుక ఇవాళ త్యాగరాజస్వామి వారిని కూడా తలుచుకోవాలి. నాదయోగి ఆయన. ఇటువంటి మాటలు commercial artists లకు మనం వాడకూడదు. అది ఒక మనోభ్రాంతి కలిగించి వాళ్ళ పతనానికి మనం కారకులం అవుతాం. మీరేవండీ త్యాగరాజస్వామి అంతటి వారు అనగానే అవునా అనుకుంటాడు పాపం వీడు. వీడు కానే కాదు. వీడు కచేరీ చేస్తే లక్ష రూపాయలు పుచ్చుకుంటాడు. త్యాగరాజస్వామి వారు ఉంచ వృత్తి చేసి ఆయన సహజంగా బాగా సంపన్న కుటుంబీకుడు సమస్తము ఇచ్చేసి ఉంచ వృత్తిలో పరమేశ్వర సంకీర్తనం చేసి దాని ద్వారా తన సంసారాన్ని నడిపాడు. అలాగే ఆధునిక కాలంలో శ్రీరామ్ శరణ్ అనే ఆయన పేరు ఎప్పుడన్నా మీరు విన్నారో లేదో వినండి. రోజు ఆయన ఎంత రామనామం చేస్తారో, పిడికెడా, చెటకెడా, గుప్పెడా తెలీదు. రామనామం తన మనస్సు దగ్గర ఒకచోట ఆగిపోయినప్పుడు ఎన్ని బియ్యం అక్కడ ఏర్పడ్డాయో అది మాత్రమే వండుకొని అది భుజించేవారు. ఆశ్చర్యం! అది యోగత్వం. శ్రీరామ్ శరణ్ ఆయన పేరు. ఉయ్యూరు దగ్గర ఉండేవారు ఆయన. వీళ్ళంతా మహాత్ములు మన బోటి వాళ్ళందరికీ దారి చూపించటానికి వచ్చినవారు వారు. మూడు పూటలా మనం భోజనం చేస్తున్నాం. కావలసినవన్నీ మనం త-తింటున్నాం. ఈ ఆనందానుభూతి వారు పొందినంత ఆనందానుభూతి మనం పొందగలుగుతున్నామా అంటే ఏమో తెలియదు. సంతోషాన్ని ఆనందంగా భ్రమిస్తున్నామా? సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నామా? అయితే మనందరం సదాశివ బ్రహ్మేంద్రులు, శ్రీరామ్ శరణు లేకపోతే ఇంకోరు ఇంకోరు త్యాగరాజస్వామి అయిపోవాలా అంటే కావొద్దు కానీ అయ్యే ప్రయత్నం మాత్రం చేయాలి. అయిపోయినాము అనుకొని ఆ స్థాయికి వెళ్ళిపోయినాము అని అనుకున్నట్లయితే మన ప్రస్థానం అయిపోతుంది. మన ఆధ్యాత్మిక సాధన మరొకరు కొలిచి మనకు చెప్పేది కాదు. మనం రోజూ కొలుచుకునేది కాదు. అది ఒక నిరంతరమైనటువంటి ఒక continuous process. అందులో మనం ఎక్కడున్నాం ఎక్కడ చేరుకున్నాం ఇదంతా ఒక వృధా ప్రయాస చేయకూడదు. ఎక్కడ ఉన్నామో ఎక్కడ ఉండాలేదో పరమాత్మకి ఎరుక కాబట్టి మనం మన కర్తవ్యాన్ని చేస్తున్నామా లేదా? సదాశివ బ్రహ్మేంద్రుల సంకీర్తనల అన్నింటి నిండా ఈ భావాలే ఉంటాయి. అందుకనే సుమారుగా వాటి తర్జుమా ఆయన సంస్కృతంలో రాశారు. ఆ సంస్కృతంలో భగవద్దర్శనం ఉంది. భగవంతుని ఉనికి ఉన్నది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఉంది. ఆయన్ని ఎట్లా పట్టుకోవాలో ఉంది. ఇది సద్గుణ సంపన్నుడు అయినటువంటి సదాశివ బ్రహ్మేంద్రులు తమ జీవిత కాలంలో సాధించుకున్నటువంటి ఒక మహా యోగ భూమిక అది. ఆ యోగ భూమిక ఏదైనా అవతారమూర్తి గాని మరొకరు గాని కాలం సమీపించినప్పుడు దేహాన్ని వదిలి పెట్టాలి గనుక వారికి తెలుసు ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నదీ. ఒక రాజు గారిని పిలిచి ఆయన చెప్పారు "ఫలానా రోజున నేను ఈ దేహాన్ని వదిలి పెడుతున్నాను". ఎలా చెప్పారు? మాట్లాడారా? మాట్లాడలే. సంకేతం ఇచ్చారు. ఆ సంకేతంలో నుంచి రాజుగారు అర్థం చేసుకొని వారి సమాధి ఏర్పరచినప్పుడు తదనుగుణంగా వారు సమాధి ప్రవేశం చేశారు. ఇది కేవల కుంభక యోగానికి గురు ఆజ్ఞను పాలించినటువంటి ఒక ఉత్తమోత్తమమైనటువంటి సాధకుడు యోగ స్థాయిని ఎట్లా అందుకోగలడో వారు గనక ఆ రోజున "ఇంకా మాటలు అవసరమా?" అని అని ఉండకపోతే ఆయన కూడా వాదోపవాదాల్లో నిమగ్నమై ఉండేవారు. అది. అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్కడికి ఒక్కో prescription ఇస్తాడు. అందరికీ ఒకటే ఇవ్వడు. వారి వారి స్థాయి ఏమిటో ఆ గురువుకి అర్థమైపోతుంది. దానికి అనుగుణంగా ఇక్కడి నుంచి నువ్వు అల్లుకొని పొమ్మనమని వెంట ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడంటే ఆ గురువు శిష్యుడు సన్మార్గంలో ఉండి సాధనా మార్గాన్ని తీవ్రతరం చేసుకొని సాధనా స్థితిలో నిలకడ చెందే వరకు గురువు ఉంటాడు. తర్వాత అనుభవించటానికి గాని అనుభూతి చెందటానికి గాని శిష్యుడు ఒక్కడు మిగిలిపోతాడు. ఏ గురువైనా సరే "నీకు నేను మోక్షం ఇస్తాను" అంటే ఆ గురువుని మనం hundred percent discount ఇవ్వాలి. ఎందుకంటే వాడు ఇవ్వలేడు. ఇవ్వగలిగినా ఇవ్వడు, ఇవ్వలేడు రెండు ఉన్నాయి. కానీ ఇవాళ అట్లా లేదు. పరిస్థితులు అట్లా లేవు. ఎవడైనా మోక్షం ఇచ్చేస్తానంటున్నాడు. ఎవడైనా దీక్ష ఇచ్చేస్తానంట అసలు టీవీలోనే దీక్ష ఇచ్చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. టీవీ మా ముందు కూర్చుంటే రోజూ మనకు దీక్షలు ఇచ్చేవాళ్ళు చాలా మంది పెరిగారు కదా. అవన్నీ చేయకూడదు. మాటలు దీక్షగా ఎందుకు అవుతాయి? మంత్రాలు దీక్ష. అది గురు ముఖతః రావాలి.మనకు అర్హత లేకపోతే ఆ గురువు ఆ మాట నమో నారాయణాయ కూడా చెప్పడు ఓం నమశ్శివాయ చెప్పడు ఓం శ్రీ సాయిరాం కూడా చెప్పడు స్వామి అంటే నమ్మకం లేని వాడికి ఓం శ్రీ సాయిరాం మనం చెప్తామా చెప్పం కదా నమ్మకం ఉండి కొంత సాధన చేసి కొంత అనుభవించి కొన్ని యోగాలు సిద్ధింపజేసుకుని fine tuning కావలసినప్పుడు దీక్షా యోగంలోకి వెళ్ళాలి అంతే తప్ప మనం ఎవరిని ఆశీర్వదించే పని లేదు భగవంతుడు మనందరినీ ఆశీర్వదించాలి ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవలసినటువంటి సాధన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర మనకి వీటన్నింటితో పాటుగా మరొక విషయం నేర్పుతుంది ఏ కాలం వాడు ఎంతకాలం ఉన్నాడు అనేటువంటి ఒక ప్రశ్నకి ఆయన కూడా సుదీర్ఘం ఉన్నారు ఇక్కడ చాలా కాలం ఉన్నారు సమాధి స్థితిలో ఉన్నవాడు సంచారం ఎట్లా చేయగలుగుతాడు సమాధి అంటే మన దృష్టిలో గోడకు కొట్టిన బొమ్మల్లే ఉండాలి కదా గోడకుర్చీ వేసిన మనుషల్లే ఉండాలి కదలని శిలవలే ఉండాలి అట్లా ఉండక్కర్లా నీవు ఎట్లా ఉన్నా నీ నీతో నీవు గనక కూడి ఉండగలిగినట్లయితే యోగరతోవా భోగరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా ఈ శ్లోకం మర్చిపోకూడదు మనమందరం అన్నివేళలా గుర్తు పెట్టుకోవాలి శంకర భగవత్పాదులు మన బోటి వారి కోసం రాసిందే అయ్యా నేను యోగిగా ఉన్నాను అని రోజు చెప్పాడనుకోండి ఒకడు వాడు యోగి కాదన్నమాట నువ్వు యోగిగా ఉన్నా అంటే ఉంటే ఉండు దాంతో ఏముంది భోగరతోవా యోగం నాకెక్కడ ఇగో ఇంకా ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి రోజు వచ్చేవాడు పోయేవాడు లంపటం ఎక్కువుంది నేను ఎప్పుడు మహా స్థితిలోకి ఆనందాన్ని పొందుతాను అనే వాడితో కూడా అంటున్నారు భగవత్పాదులు భోగరతోవా భోగం యందు నీకు interest ఉందా ఉండు సంగరతోవా విషయాసక్తులతో మనస్సు నిండిపోతున్నది పోనీ నిండని ఉండని ఏ ఎట్లా ఉన్నా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ చిత్తము అంటే మనస్సుని బ్రహ్మత్తో గనక అనుసంధానం చేసుకోగలిగితే అది నీకు బ్రహ్మానందాన్ని ఇస్తుంది ఇది మహదాశీర్వచనం మానవాళికి కాబట్టి కర్మయోగంలో ఉన్నవాడు తనకు ముక్తి లేదు అని అనుకోక్కర్లా భక్తి యోగంలో ఉన్నవాడు ఒక్కడే వైకుంఠం వెళ్తాడని మనం అనుకోక్కర్లా అలాగే జ్ఞాన యోగంలో ఉన్నటువంటి వాడు ఉత్తమోత్తముడని మనం ఆగి మనం మనం ఎప్పటికీ చేరుకో గలం అని నిరాశ చెందక్కర్లా నువ్వు ఏ యోగంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎట్టి పరిస్థితులలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నీ మనస్సు ఎక్కడ ఉన్నది అది ప్రధానం ఆ మనస్సుని సమాధి స్థితిలో నిలబెట్టుకొని మళ్ళీ సదాశివ బ్రహ్మేంద్రులు తమ జీవిత కాలాన్ని ఎక్కువ భాగం సమాధి గతంగా గడిపారు ప్రాంతానికి ప్రాంతానికి నడిచి వెళ్లారు చేయవలసినటువంటి మహత్తులన్నీ కూడా ప్రపంచాన్ని ఆకర్షించటం కోసం కాక భగవంతుని యొక్క శక్తి యోగ శక్తి ఇంత గొప్పది అని చెప్పటానికి సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క జీవితం మనకి అనేక పాఠాలు నేర్పుతుంది సహజ సమాధి స్థితి అనబడేటువంటి ఒక శబ్దం ఇవ్వాళ అది కూడా SSY YSS అని వింటూ ఉంటాం ఇంగ్లీషులో అనుకున్నంత కాలం వాటికేం బలం లేదు చక్కగా సమ సహజ సమాధి యోగా చేశాను అంటే ఎంత బావుంటుంది SSY అంటాం మొన్న SSY కి వెళ్లి వచ్చాను TM చేశానంట అంటే ఏమిటో తెలీదు trademark ఆ transcendental meditation దేన్నీ transcend చేయాలి time ని transcend చేయాలి space ని transcend చేయాలి ఆ time and space ఎక్కడుంది మన మనసులో ఉంది మనస్సుని transcend చేస్తేనే హృదయంలోకి వెళ్లగలుగుతాం అదే సదాశివ బ్రహ్మేంద్రుల వారు తమ జీవిత కాలంలో సాధించిన యోగ స్థితి బానే ఉంది మనం ఎట్లా చేయాలి SSY వద్దా YSS వద్దా ఇంకో TM వద్దా అన్నీ ఉండనివ్వండి కానీ వీటన్నింటి యొక్క సారము ఏమిటి అంటే నువ్వు ఏ స్పందలో ఉండు ఏ మార్గంలోనూ నడుస్తూ ఉండు నీ మనస్సు ఎక్కడ ఉన్నదో ఆ ఒక్క దాన్ని గమనించుకో ఆ మనస్సు బ్రహ్మంతో గనక ఆ బ్రహ్మము నీ యందే ఉన్నాడు గనక నీ యన్ కేలతి మమ హృదయే అని కదా ఎక్కడ ఆడుతున్నాడు ఈ బ్రహ్మం అంటే ప్రపంచం అంతా కూడా అది ఖేలా అది హేలా అది లీల ఈ ఆట పరమేశ్వరుడి ఆట అంతా మన లోపలే ఉంది మీకిక్కడ ఒక చిన్న సందర్భం చెప్తాను ఎయిటీస్ లో if I remember సత్యసాయి భగవానుడి దగ్గరికి ఎమ్. సుబ్బలక్ష్మి గారు వచ్చారు పొద్దున పూట స్వామి ఆమెకు interview ఇచ్చారు ఆ interview ఇచ్చినప్పుడు చాలా అదృష్టవశాత్తు దాంట్లో నేను కూడా ఉన్నా ఆ room లో మామూలుగా స్వామి ఆమెతో మాట్లాడుతున్నారు ఆమె స్వామితో మాట్లాడుతున్నది ఇద్దరూ హాయిగా తమిళంలో మాట్లాడుకుంటున్నారు మేము వింటున్నాం తమిళం తెలుసు కాబట్టి ఆమె అన్నది స్వామి తొమ్మిది భాషల్లో మీ మీద పాట రాయాలి పాడుకోవాలని ఉంది మీరు అనుగ్రహించాలి మలయాళంలో ఇప్పటికే కస్తూరి గారు ఒక పాట రాసేశారు మిగతావన్నీ గుజరాతీ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కన్నడ మరాఠీ పాడతాను అంటుండగా స్వామి తెలుగులో ఏం పాడబోతున్నావ్ అని అడిగారు చాలా వినయమూర్తి ఆవిడ చాలా a divine personality స్వామి నాదయోగి నాదబ్రహ్మము అయినటువంటి త్యాగరాజ స్వామి వారి యొక్క పాట పాడుకుంటాను కీర్తన అని అన్నది స్వామివారు అన్నారుఅది అందరూ పాడుతూనే ఉన్నారే అన్నారు మరి ఏం పాడాలి? హే స్వామి మనసులో ఇంకేదన్నా ఉందా? అది వద్దంటున్నారా? నాకు తెలియలే అది అందరూ పాడుతూనే ఉన్నారే అన్నారు అని నీకోసం నేనే స్వయంగా ఒక పాట ఇప్పుడు రాసిస్తా అన్నారు అని సాయిరామా చిలుక ఆత్మ పంజరముపై ఆడుగాక అని ఒక కీర్తన స్వామి అప్పటికప్పుడు రాసి స్వరకల్పన చేసి హంసధ్వని రాగంలో పాడించారు అది ఆవిడ గొంతులో పడ్డప్పుడు ఆ సాయిరామా చిలుక మన గుండెల మీద ఆడుతుంది తప్పదు అది ఖేలతి మమ హృదయే అది సంస్కృతంలో ఉంది ఇది తెలుగులో ఉంది కాబట్టి సహజ సమాధి స్థితి స్వామి యోగ స్థితిలో ఉన్నారా? అంటే స్వామికి యోగ స్థితులంటూ లేవు యోగమే స్వామి అది ఒక్క second one minute లో రాసేశారు tune కట్టారు పాడేశారు ఎలా పాడాలో చెప్పారు ఏ తాళంలో పాడాలో చెప్పేశారు ఎవరికి? ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మికి ఆమె అన్నది ఇవాళ నా జన్మ ధన్యమైంది స్వామి పరమాత్మే ఓ సంకీర్తన రాసింటే దానినే పాడటం నా జన్మ చరితార్థమైంది అందులో స్వరకర్త వాగ్గేయకారుడు సాక్షాత్తు వాగ్దేవి స్వరూపమైనటువంటి స్వామి ఆవిష్కరించినటువంటి ఒక పరమాద్భుత సన్నివేశం ఇవి స్వామి పరంగా అది దైవ పరమైన మాట అయినట్లయితే ఆశువుగా పరమాద్భుతంగా పరమ రమణీయంగా మనోజ్ఞంగా హృదయంగమంగా పరమేశ్వర సంకీర్తన చేయాలి అంటే యోగ స్థితి ఏర్పడాలి లేకపోతే మాటలు పేరిస్తే అది పాట కాదు భజన సాంప్రదాయంలో పాటలు పేర్చబడతాయి మాటలు మార్చబడతాయి పదాలు కూర్చబడతాయి అందంగా తీర్చబడతాయి మరి ఏముంది?
SSSMC · audio
Yoga Pravaham - 11
Yoga Pravaham - 11
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 26:16
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
- 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
- 26 min 7
Yoga Pravaham - 07
- 42 min 8
Yoga Pravaham - 08
- 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
Now playing - 40 min 12
Yoga Pravaham - 12
- 19 min 13
Yoga Pravaham - 13
- 28 min 14
Yoga Pravaham - 14
- 21 min 15
Yoga Pravaham - 15