No transcript for this section.
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ స్వామి దివ్య అనుగ్రహ విశేషం చేత యోగ ప్రవాహం అనబడేటువంటి ఒక విచారధార సాక్షాత్తు యోగ ప్రవాహమై సాగుతున్నది. ప్రవాహానికి మార్పు ఉండదని మలుపులు తప్ప మరొక విషయం ఉండదని అనుకున్నాం. ఈ ప్రతి మలుపు కూడా మానవ జీవన గతిని, ధృతిని, ఆధృతిని, వేగాన్ని, గతిని దానిలో దాగి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక మహా సంగీతాన్ని అంతర్వాహినిగా వినిపించేటువంటి ఒక పరమాద్భుత సుషుమ్నా గీతిక. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అని ఒకటి ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం మిగతా శాస్త్రాల వంటిది కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో ధ్యానము, యోగము, జ్ఞానము ఈ మూడు ప్రధానమైనవి. అధ్యాత్మ శాస్త్రం తెలియాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అధ్యాత్మ శాస్త్రాలన్నీ కూడా అవి occult sciences మాత్రమే కావు. Extra sensory perception levels అంటాం. ESP levels. అంటే ఇంద్రియాతీతమైన, భావాతీతమైన, మనస్సుకి అతీతమైన, లోక లోకాంతర ప్రాణగతమైనటువంటి ఒక విచారధార అది అధ్యాత్మ శాస్త్రం. లోకానికి ఇంకా పరిచయం కాని మాట ఇది. కానీ సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్యసాయి భగవానుడు ఈ పదాన్ని సుమారు ముప్పై, నలభై ఏళ్ల క్రితం వాడారు. spiritual scientist అన్నప్పుడు ఇప్పటికీ అందరికీ సందేహం. అయితే spiritual కావాలి లేకపోతే scientist కావాలి. ఇదేంటి విచిత్రంగా ఉంది అంటుంటారు. నన్ను ఉద్దేశించి అడుగుతుంటారు. ఇది కూడా ఒక సందర్భం కాబట్టి అది కాసేపు చెప్పుకొని యోగశాస్త్రంలోకి వెళదాం. chemistry, physics ఎట్లా శాస్త్రలో botany, zoology ఎట్లా శాస్త్రలో మిగతావన్నీ ఎట్లా శాస్త్రలో అధ్యాత్మ కూడా ఒక శాస్త్రం. ధ్యానం అధ్యాత్మ శాస్త్రంలో ఒక ప్రధానమైన భాగం. జ్ఞానము అంతే, యోగం కూడా అంతే. భగవద్గీత ఒక అత్యద్భుతమైనటువంటి యోగశాస్త్రం అది. ఆ యోగశాస్త్రంలో మనం రోజూ చెప్పుకునే ప్రపంచం ఉంటుంది. కానీ ఆ ప్రపంచాన్ని ఎట్లా నడిపించాలో మార్గోపదేశం ఉంటుంది. అది ఆత్మ. It is almost closer to the soul and self. అందుకనే ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం ఒక మాట బయటికి వచ్చింది. సుషుమ్నా గీతం అనే ఒక మాట. ఏమిటి ఆ సుషుమ్నా? మూడే మూడు ప్రధాన నాడులు ఇడా, పింగళ, సుషుమ్నా. ఇడా, పింగళ నాడులు స్పష్టంగా కనిపిస్తుంటాయి కానీ సుషుమ్నా నాడి కనిపించదు. మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది అది. ఆ ముగిసేటువంటి ఆ సుషుమ్నా ప్రాణనాడి. యోగేశ్వర కృష్ణుడు తన దేహాన్ని వదిలిపెట్టాలి అని నిర్ణయించుకున్నప్పుడు వేటగాడికి ఒక సంకల్పం కలిగించాడు. సుషుమ్నా నాడిని భేదనం చేయమన్నాడు. చెప్పి చేయించుకున్నాడా? అంటే ఆయన కుడివ కాలి బొటనవేలు ఒక చిన్న నీలి పిట్ట వలే కనిపించేట్టుగా చేశాడు. కృష్ణుడు బొటనవేలు అనుకోలేదు. నీలి పిట్టని కొట్టాలనుకున్నాడు, కొట్టాడు. సుషుమ్నా నాడి భేదనం జరిగింది. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథి భేదనాలు, గ్రంథి అంటే ముడి అని అర్థం. ఆ ముడులు ఎట్లా విడిపోతాయో సుషుమ్న కూడా అట్లాగే విడిపోయినప్పుడు దేహంలో ఉన్నటువంటి చైతన్యం విశ్వ చైతన్యంలో తన source లో కలిసిపోతుంది. ఇది యోగశాస్త్రం, ఇది అధ్యాత్మ శాస్త్రం. అధ్యాత్మని scientific గా చెప్పటం మాత్రమే అధ్యాత్మ శాస్త్రం కాదు. చాలామంది అనుకుంటారు. చాలా scientific approach తో చెప్తారు కాబట్టి ఆయన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని. దాని అర్థం నిజానికి అది కానే కాదు. science కి లోబడి science కోణంలో గనక అధ్యాత్మను చెప్పినట్లయితే అది scientific approach మాత్రమే. science ద్వారా ఎంతవరకు చెప్పగలరో అంతవరకూ చెప్తారు. అధ్యాత్మ శాస్త్రాన్ని ఎరిగిన వాడు అంటే ఆ ESP levels దాటినవాడు. దేనినైనా పరమ పవిత్రంగా భావించగలిగిన వాడు. పరమేశ్వరుడి యొక్క ప్రతి చలనాన్ని, ప్రకృతిలో జరిగే ప్రతి కదలికని ఈశ్వరలీలగా భావించేవాడు. ఈశ్వర విభూతి తప్ప అన్య విభూతి లేదనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి సిద్ధిలో తన తలపులను రంగరించేటువంటి వాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవుతాడు. అది దాని అర్థం. అది తెలిస్తే ఈ ప్రవాహం తెలుస్తుంది. లేకపోతే ఇది కూడా ఓ పిల్ల కాలవలో స్నానం అయిపోతుంది. పిల్ల కాలవకు పూజలు ఎవరు చెయ్యరు. ఈ పిల్ల కాలవ గనక నదిని సమీపిస్తే, దాంట్లో కలిస్తే నదితో పాటు ఇది కూడా పూజలు అందుకుంటుంది.నదులన్నీ కలిస్తే సముద్రానికి పూజ జరుగుతుంది ఎక్కడ సాగరం సంగమించేటువంటి వేళ నదీ సంగమం వేళ దాన్ని సాగర సంగమం అంటారు. సాగరం నదిని సంగమిస్తున్నదా నది సాగరాన్ని సంగమిస్తున్నదా సాగర సంగమం ఏంటి అర్థం ఏ లేదు ఆ మాటకి. నదులన్నీ సాగరంలో సంగమిస్తున్నాయి నదులు వెళ్ళి పరమాత్మలో కలుస్తున్నాయి జీవాత్మలన్నీ కూడా చెలమలుగా, పాయలుగా, నదులుగా, నదీమతల్లులుగా, నదాలుగా అనేక రీతులలో వెళ్ళి వెళ్ళి పల్లాలు ఎరిగి లోతులు ఎరిగి తాము ఎక్కడ పుట్టామో మరిచిపోయి ఎరుక లేకుండానే తమ జీవన ప్రస్థానంలో అనేకమైనటువంటి క్షేత్రాలని సుసంపన్నం చేస్తూ శుభ్రపరుస్తూ తాము శుభ్రపడుతూ చివరకు కైవల్యంగా ఏ రకమైన వికార భావనా వైకల్యాలు లేకుండా పరమాత్మ యందు ఎట్లా లీనమవుతుంటుందో అట్లాగే ఈ పరమాత్మ అనబడేటువంటి సాగరంలోకి జీవుడు అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే జీవుడు కూడా ఒక ప్రవాహమే. ఇంతవరకు మనం ఎత్తి వచ్చిన జన్మలన్నీ కూడా అవి జన్మ ప్రవాహాలు. కొన్నాళ్ళు దేవుని-- దేవుడితో కూడి ఉన్నాయి కొన్నాళ్ళు కూడకుండా ఉన్నాయి. కొన్నాళ్ళు దేవుడు లేడన్నాయి దేవుడే ఉన్నాడన్నాయి నమ్మినాయి నమ్మలేదు నమ్మి నమ్మకుండా గడిచినాయి. విజయాలు సాధించినప్పుడు వాటిని మనంగా భావన చేశాం. అపజయాలు ఏర్పడినప్పుడు దేవుడి దయ నా మీద లేదనుకున్నాం. ఇదంతా మనస్సు చేసేటువంటి గారడీ కాబట్టి ఎవరు ఈ జీవుడు అని ఒక చిన్న విచారణ చేసినప్పుడు పరమాత్మ యొక్క ప్రతి స్వరూపమే జీవుడు. దైవం యొక్క ప్రజ్ఞే ఒక అంశే జీవ ప్రజ్ఞగా ఉంటుంది. అందుకనే జీవుడు మమ అంశ అన్నాడు భగవద్గీతలో. నా అంశే జీవుడు నాకంటే భిన్నంగా లేడు. బంగారం ముక్కని కోస్తే బంగారంలో నుంచి బంగారమే వస్తుంది. ఒక తాను బట్ట తీసుకుని దానిని గనక కోస్తే దాంట్లో నుంచి బట్టే వస్తుంది వేరేదేం రాదే. పరమాత్మలో నుంచి పరిచ్ఛిన్నమైనటువంటి ప్రతి అణువు కూడా భగవత్ సమానమే. భగవంతుడు కానిది లేదు గనుక జీవుడు మాయావరణంలో ఉంటాడు గనుక జీవుడు అజ్ఞానం చేత, అహంకారం చేత, అనాచారం చేత, అస్పష్టత చేత అనేకమైన కారణాల చేత జన్మ జన్మాంతర సంస్కారాల చేత, వాసనల చేత, మూలవాసనల చేత సాధనా లేమి చేత లేదా సాధనా బలిమి చేత జీవాత్మ పరమాత్మ భిన్నం అనుకుంటాడు. యోగి అయినటువంటి వాడు ఆ పరమాత్మే ఈ జీవాత్మగా ఉన్నదని త్వమేవాహం న సంశయః నీకు నాకు తేడా లేదని కాకపోతే కొన్నాళ్ళు జీరో వాట్ బల్బుగా ఉన్నాను. కొన్నాళ్ళు ట్వంటీ ఫైవ్ వాట్స్, తర్వాత థౌజండ్ వాట్స్, తర్వాత టూ థౌజండ్ వాట్స్ ఇంకా నన్ను మొయ్యలేనంత ఒక యోగం ఏర్పడినప్పుడు నీలో ఉన్న వెలుగు నాలో ఉన్న వెలుగు ఒక్కటై ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావన సాధించుకునే దాకా జీవుడు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. అందుకనే యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. మరణాలన్నీ కూడా ఒక చిన్న కామా. ఫుల్ స్టాప్ కాదది. ఇప్పటికి ఫుల్ స్టాప్. ఈ పూటకి ఫుల్ స్టాప్. కామా పెడతాం మళ్ళీ జన్మ ఎత్తుతాం. అయ్యా ఎన్నాళ్ళు ఈ జన్మలు ఎత్తాలి అని. జన్మ ఎత్తవలసిన అవసరం లేనంత వరకు ఎత్తుతూనే ఉండాలి. పరీక్ష ఎప్పుడు పాస్ అవుతాం అంటే తప్పటం మానేసే దాకా అని అర్థం. అంతేగా. ఈ ప్రయత్నం ఎంత వరకు చేయాలి అని అడుగుతాడు. ఇక ప్రయత్నమే అక్కరలేని స్థితి వచ్చే దాకా. ఎవరిస్తారు ఇది? భగవంతుడు తుంచి ఉళ్ళో వేస్తాడా? గురువు పంచి చేతిలో పెడతాడా? ఆ రెండు పనులు వాళ్ళు చేయరు. కానీ అంతకంటే గొప్ప పని చేస్తారు. ఏమిటా పని అంటే మార్గోపదేశనం చేస్తారు. ఈ దారిలో నువ్వెళ్ళు. ఈ విషయం నువ్వు తెలుసుకో. ఈ విషయానికి ఇప్పుడు ఈ క్షణాన ఈ అర్థం ఇట్లా. ఉదాహరణకి సత్యసాయి భగవానుడు తమ దివ్యోపన్యాసాలలో చాలా పద్యాలు దొర్లించారు. ముందు ప్రారంభంలో ఒక పద్యం, మధ్యలో సందర్భవశాత్తు ఒక పద్యం చివరగా తొలినాళ్లలో పద్యం లేదా చివరలో భజన. ఇది ఒక స్ట్రక్చర్. ఆ పద్యాలకి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అదే పద్యం స్వామిది ఇచ్చి కాస్త అర్థం చెప్పండి అంటే ఆయన స్థాయిలో ఆయన ఎవరికి బోధిస్తున్నారో వారి స్థాయిలో ఆ పద్యానికి అర్థం చెప్తాడు. కాలేజీ లెవెల్కు వచ్చిన వాడికి అదే అర్థం చెప్పడు. పద్యం అదే, విషయం అదే, చెప్పిన మాటలవే, అదే తెలుగు పద్యంలో ఏం మార్పు లేదు. అర్థం మారిపోతుంది. అధ్యాత్మ యోగంలో అదే పద్యానికి వ్యాఖ్యానం చేసినప్పుడు పరమ రమణీయమైనటువంటి పుంఖానుపుంఖంగా ఎన్నెన్ని శాస్త్రాలు దాని నిండా ఇమిడి ఉన్నాయో ఒక మానవుడి మేధ అందుకోలేదు. ఇట్ కెన్నాట్ కాంప్రెహెండ్. పైకి ఓ చిన్న పద్యంలా కనిపిస్తుంది అది. అద్వైతా మృత ధార కురియ అంతరంగ మనిడి పాత్ర తెరచి ఉంచు.ఓర్లించి ఉండగా పుట్టైన చిక్కదు తెరచి ఉంచిన చాలు తరచనగును we have to keep it open అయినప్పుడు పద్యం యొక్క మాధుర్యం ఒక స్థాయి పద్యం యొక్క తాత్పర్యం ఒక స్థాయి ఆ పద్యాన్ని సత్య సాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంతో సమన్వయం చేసుకుని చెప్పుకునేటువంటిది అది తత్వచింతనాధార కాబట్టి ఎంత మాత్రమున ఎవరు తెలచిన అన్నాడుగా అన్నమాచార్య వారు నీటి కొలది తామేరా అన్నాడుగా పిండి కొద్దీ నిప్పట్టు అన్నాడుగా అంటే నిప్పుల మీద కాల్చిన అట్టు నిప్పట్టు అని అది చాలా రొట్టెలు కావాలి పిండి తక్కువుంది కాదే! ఎంత పిండో అంత ఎంత మేధో అంత ఎంత ఆలోచనో అంత ఎంత సాధనో అంత జన్మాంతర సంస్కారం అయినటువంటి ఒక భావనా భూమిక లోనుంచి యోగత్వాన్ని రససిద్ధం చేసుకున్నవాడు దానిని దర్శనం చేస్తాడు యోగత్వానికి వెళ్ళబోయే ముందు ఋషి అంటే ఎవడో కూడా తెలుసుకోవాలి కృషి చేస్తే మనిషి ఋషి అయిపోతాడు అని ఒక పాట వింటూ ఉంటాం కాడు ఋషి అంటే ఎవరంటే ఒక మంత్ర భాగంలో ఉన్నటువంటి బీజాక్షరాలను చూసి బీజాక్షరాల వెనుక ఉన్నటువంటి అధిష్టాన పరదైవతాన్ని దర్శనం చేయగలిగితే వాడు ఋషి అవుతాడు అంతే కృషి చేస్తే లాభం పొందుతాడు ఋషి అయితే దర్శనాన్ని పొందుతాడు అది అక్కడ ఆ కృషి ఆధ్యాత్మిక కృషి గనక అయితే వాడు ఋషి అవుతాడు భౌతికమైన కృషి అయితే తన రంగంలో number one number two ఏదో ఒక స్థాయికి వెళ్తాడు తొలి రోజున త్రైలింగ స్వామి నిన్నటి విచారణలో శ్యామాచరణ లాహిరి మహాశయుల దాంట్లోనే కాస్త సూచిప్రాయంగా తలాస్పర్శగా కాస్త అటు ఇటుగా Paramahansa Yogananda contribution to the world అది కూడా కాస్త విచారణ చేశాం అందుకనే పునః మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు లాహిరి మహాశయుడి యొక్క ఉదాత్త ఆశయాలని మహిమాన్విత స్వరూపాన్ని స్వభావాన్ని ఒక వైదాంతిక భూమికలోకి తీసుకుని వచ్చి ప్రధానంగా భగవద్గీత మీద జీసస్ క్రైస్ట్ ని అంటే Christianity ని follow అయ్యేటువంటి Christians కి కృష్ణత్వము క్రీస్తత్వము రెండు సుమారుగా ఒకటే అని Paramahansa Yogananda ఆ audience కి చెప్పారు రెండవది Quenching the thrust అని ఇంకో book రాశారు ఆయన అంటే దాహాన్ని తీర్చుకోవటం ఏ దాహం అని దాన్ని స్వామి చాలా అందమైనటువంటి మాటల్లో స్వామి సాహిత్యంలో ఇవన్నీ దొర్లుతాయి తృష్ణ ఉన్నవాడికి కృష్ణానది పొట్టలో నింపినా తృష్ణ తీరదు ప్రాపంచికమైన తృష్ణ తొలగాలి కృష్ణుడు ఏర్పడితే తృష్ణ తీరుతుంది అంటాడు స్వామి చూడండి తృష్ణ అంటే తీరని దాహం తీరని దాహం ప్రపంచం మిగులుస్తుంది తీరే దాహం అధ్యాత్మశాస్త్రం అనుగ్రహిస్తుంది వాడికి అన్నీ చాలు నిజానికి ఏమి అక్కర్లేదు ఊరికే కావలసినట్టుగా ఉన్నట్లు అనిపిస్తాడు it doesn't mean anything వాడికి ఏమి అక్కర్లేదు ఆ అక్కరలేని తనమే అన్నీ ఉన్నతనం ఆ అక్కరలేని తనమే నిండుతనం ఆ అక్కరలేని తనమే వైరాగ్యం అదే వైభోగం ఏ వైభోగం అది ఆధ్యాత్మిక వైభోగం కాబట్టి Paramahansa Yogananda లు దాంతో పాటుగా మూడో పుస్తకం రాశారు దాని పేరు Divine Romance పేరు గమ్మత్తుగా అనిపిస్తుంది ఎప్పుడైనా మీకు వీలుంటే చదవండి ఆనందంగా ఉంటుంది చదివే తీరులో చదవాలి దానికి కొంత పరిణితి కావాలి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆధ్యాత్మిక రంగంలో కొంత training అయి ఉండాలి లేదా పరమ గురువుల అనుగ్రహం ఉంటే అది కూడా అర్థమైపోతుంది పెద్ద కష్టం కాదు but Quenching the thrust కంటే The Divine Romance అనేటువంటి book అంటే పరమేశ్వరుడి యొక్క భావంతో మన భావాన్ని కలపటం దాన్ని స్వామి అచ్చ తెలుగులో భగవద్రతి అన్నారు నేను చెప్పుకున్నాను ఆ భగవద్రతే Divine Romance అంటే ఈ మాటలన్నీ అనేకమైన మాటలు మనస్సుకి తాకుతున్నప్పుడు ఒక్కమాట మాత్రం మనసులో నిలబడిపోతుంది ఈ స్వామి ఈ సత్యసాయి భగవానుడు చెప్పనిదంటూ ఇంకా అసలు ఏమన్నా ఉన్నదా ఆశ్చర్యపోతాం చెప్పినవే చెప్పబడినవే కానీ పరమాద్భుతంగా ఆవిష్కరిస్తూ జ్ఞాని కంటే జ్ఞాని గొప్పవాడని జ్ఞాని కంటే ఆ గొప్పతనం అనేది comparison కాదు ఒక స్థితి ఏ తర్వాత B అంటాం A కావాలి B కావాలి రెండు కావాలి A లేని B ఏం చేసుకుంటాం B లేని ఏం చే-- ఏం చేసుకుంటాం A తర్వాత B అన్నట్లుగా జ్ఞాని తర్వాత జ్ఞాని జ్ఞాని తర్వాత యోగి ఈ మధ్యలో జ్ఞానికి యోగికి మధ్యలో తపస్వి అని ఒకడున్నాడు ఇదంతా శరీరము మనస్సు చేసేటువంటి ఒక సాధన యోగి ఇంకా సాధన చేయటానికి ఏమి ఉండదు యోగి తనతో ముందు తాను కూడి ఉంటాడు దాంతో పాటేనిశ్చలమైనటువంటి పరబ్రహ్మంతో కూడా కూడి ఉంటాడు. అంటే రెండుగా కూడి ఉన్నాడా? తనను పరబ్రహ్మమునుగా, తన యందు పరబ్రహ్మమును ప్రతిష్టించుకొని తనతో తాను కూడి ఉన్నటువంటి వాడు మాత్రమే యోగి. మిగతావన్నీ కూడా మనం తగిలించుకునే బిరుదులే. యోగి అయినవాడు ఏ ప్రపంచం కనిపిస్తున్నా, ప్రపంచంలో జరుగుతున్న అనేకానేకమైన సంఘటనలు ఆయన చుట్టూనే జరుగుతున్నా, ఏం జరగనట్లే కూర్చునుంటాడు. యోగతారావళిలో శంకర భగవత్పాదులు చిట్టచివరి శ్లోకం, ఇరవైఏడో శ్లోకం అది. ప్రకాశమానే పరమాత్మభానవ్ అంటే ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెలుగుతున్నాడు, ప్రపంచం నడుస్తున్నది, దాని గతిశీలంగా వెళ్తున్నది. ఇంత జరిగినా ఈ యోగి ఏం పట్టనట్లు ఉంటాడే, ఏం చూడనట్లుగా ఉంటాడే అంటాడాయన. అంటే పట్టినట్లు, పట్టీ పట్టనట్లు, అర్ధనిమీలితంగా, గోచరాగోచరంగా తనదేమీ కానట్లు, తన ప్రమేయం లేనట్లు మన పక్కనే కూర్చుంటాడు. మనలాగానే ఉంటాడు. మన భాషే మాట్లాడుతుంటాడు కానీ ఏం పట్టదు. అది యోగి యొక్క లక్షణం. ఈ యోగి యొక్క లక్షణాలు శాస్త్రగతంగా చాలా చెప్పబడ్డాయి. గురువు లక్షణాలు మనం విచారణ చేశాం. శాంతిర్నితాంతమహితా పరమాస్య శక్తిహి, వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర, జ్ఞానం నిరన్నకుహనం మధురంచ వృత్తం, ఋణాం నిదర్శనమయం అని గురుస్వరూపాన్ని వర్ణిస్తాం. శాంతము, కరుణ, మధురవర్తన, వైరాగ్యము, అజ్ఞానాన్ని ఖండించగలిగినటువంటి జ్ఞానఖడ్గము, అన్నింటికంటే స్వీట్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఈయన నా గురువు అంటున్నాం. ఈయన నీ గురువు అని ఎలా చెప్పగలవు? ఈ లక్షణాలు ఆయనవి, నీకేం లాభం? అంటే అటువంటి మహాత్ముడి ఆవరణానికి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? దాన్ని బట్టి ఆయన మన గురువు అని నిర్ణయించుకోవాలి. ముందు మనస్సులో అరజడి తగ్గుతుంది, ఆతృత తగ్గుతుంది, తాపత్రయం తగ్గుతుంది, భావ తీవ్రత తగ్గుతుంది. మనస్సు ఒక మార్తవాన్ని సంతరించుకుంటుంది. భాష ఒక సంస్కారాన్ని అద్దుకుంటుంది. లోపల జరుగుతున్నటువంటి సర్వ వికార భావనలు దిద్దబడతాయి. ఇది గురువు యొక్క లక్షణం. ఆయనేం మాట్లాడలే మనతో. మంత్రం చెప్పలేదు, తంత్రం చెప్పలేదు, తాయెత్తు ఇవ్వలేదు, ఏం చేయలే. ఆయన దగ్గరికి వెళ్ళాం మనం. వెళ్ళగానే ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక భావావరణం ఏర్పడుతున్నది. భావావరణంలో నుంచి ఒక భావనావరణం సృష్టించబడుతున్నది. భావనావరణంలో నుంచి సర్వావరణాలు శూన్యమై, లయమై, లీనమై మహాశూన్య స్థితిలో ఏమీ లేనటువంటి ఒక మహా నిశ్శబ్దం ఆవరిస్తున్నది. ఆ నిశ్శబ్ద భూమికే బ్రహ్మము యొక్క కదలనితనం. అది అచల స్థితి. ఇంకా ఎదురుగా గురువు కూర్చునున్నాడు, మనస్సు ఇంకా పారాడుతున్నది, తారాడుతున్నది, ఏవో ఆలోచనలు కలుగుతున్నాయి. ఇటువంటి ప్రపంచంలోనే ఈ గురువు ఎట్లా ఉండగలుగుతున్నాడు అని మళ్ళీ మనమే ప్రశ్నించుకుంటున్నాం. మరి ఆ గురువు ఏం చేస్తున్నాడు? ఏం ప్రశ్నించటం లేదు. తనకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని, డ్యూటీని తాను చేస్తున్నాడు. దేన్ని ఆశించి? దేనినీ ఆశించకుండా, ఏమీ అక్కరలేకుండా. ఏమీ అక్కరలేకుండా ఏదన్నా పని చేసేవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా అంటే యోగి ఉంటాడు, ఒక గురువు ఉంటాడు. వాడికేం అక్కర్లేదు. శంకర భగవత్పాదుల్ని ప్రశ్న వేశారు. "అయ్యా! మీరు జగద్గురువు కదా? అద్వైత మతంతో పాటు ക്ഷണമത സ്ഥാപനാചാര്യരുടിവിനു സർവ്വജ്ഞുടിവി కదా? నీక్కుడా ఆ కోరిక ఉంటుందా?" అంటే, "ఆ, ఎందుకుండదు?" అన్నారు. "ఏమిటా కోరిక?" "నేను పొందినటువంటి అనుభూతిని అందుకోగలిగిన వాడు ఒక్కడు వస్తే, వాడు వచ్చేదాకా ఈ శరీరంలో నిలకడ చెందటమే కోరిక. ఆ తర్వాత అవసరం లేదు కదా" అన్నారు భగవత్పాదులు. ఆయన అన్నారు కానీ ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా? నరేంద్రుడు వచ్చేదాకా రామకృష్ణ గురుదేవులు ఎదురు చూశారు. ఆ నరేంద్రుడు వచ్చిన తర్వాత సర్వ శక్తులు ఆయనకి ధారపోసి "నరేన్! నీకోసం కదా ఇంతకాలం నేను ఎదురుచూస్తూ నిలకడ చెందాను. నువ్వివాళ అందుకున్నావు. నీకన్నీ నేను ఇచ్చేశాను. నిరుపేదనయ్యాను నరేన్" అన్నారు. ఆ నిరుపేద కావటం చాలా ఇష్టం. ధనవంతుడు కావటం చాలా తేలిక. ఇవాళ ధనవంతులం ఎలా కావాలో అన్ని మార్గాలు మనకు తెలిసిపోతున్నాయి. చిటుకులు, చిట్కాలు కదా! క్విక్ మనీ, షార్ట్ మనీ. ఆ. మనం ఇంకొన్ని దోచవచ్చు, దొంగతనం చేయవచ్చు, మోసం చేయవచ్చు, ఎన్నన్నా చేయవచ్చు. కానీ జ్ఞానాన్ని ఎట్లా సంపాదించటం? మనల్ని మనం ఎట్లా ఎరగటం? దీనికి అడ్డదారి లేదే. మరి ఏది దారి? అసలు దారి ఏది? ముందు ధ్యానివికా. మనస్సును నియంత్రించుకో. శరీరాన్ని చక్కగా శ్రమ పెట్టు. శరీరానికి కావలసిన అన్ని కదలికలు, మెదలికలు దానికివ్వు. శరీరంలో జరిగే పరమాద్భుత రసాయన చర్యల అన్నింటికీ కూడా కాయకష్టంతో ప్రాణం పోయి. ఓంకార ధ్యానం చెయ్. ఇరవైఒక్క సార్లు ఓంకారాన్ని గనక చేస్తే, నిన్న విచారణ చేశాం. మనస్సు దానంతట అదే ఓంకారమే అవుతుంది. అలాగే మనస్సును నియంత్రించు. మనో నియంత్రణ ఒక్క పూటలోనో, ఒక్క క్షణంలోనో, మటుమాయం అయి అన్నీ పోయి ఇది రాదు. అది రావటానికి చాలా సాధన చేయాలి.ప్రతిరోజూ మనం ఈ ఆవరణంలోకి రాగానే సాయి గాయత్రి మనం వింటూ కూర్చుంటాం కాసేపు. అది ritual కాదు. ఒక ambience ఒక ఆవరణం create కావాలి. ఆ ఆవరణంలో సాయి గాయత్రిని వింటున్న-వింటున్నప్పుడు మన మనస్సు మన ఆలోచనలు మన భావాలు మన సంస్కారాలు అన్నీ పరమాత్మ గతం కావాలి. ఆ సాయి గాయత్రి లో ఉన్నటువంటి నూట తొమ్మిదవ బీజాక్షరం ఏదైతే ఉన్నదో అది మనకు అనుగ్రహ వరదానం చేస్తుంది. ఇది సత్య సాయి భగవానుడి యొక్క అనుగ్రహం. కనుకనే ధ్యానివికా, జ్ఞానివికా, తపస్వికా చివరకు యోగివికా. పరమహంస యోగానంద వారి జీవితాన్ని ముగించటం చాలా ఆశ్చర్యకరంగా ముగించారు. ఆ క్రితం రోజు British High Commissioner తో చాలాసేపు మాట్లాడారు. డిన్నర్ లో కూర్చున్నారు. వారికి host చేశారు. తెల్లవారేసరికి పరమహంస యోగానంద తమ దైహిక కార్యకలాపాన్ని పూర్తిగా ముగించి శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆ శరీరం అంటే yogic body చాలా రోజులు అట్లా ఉంచారు. అందరూ రావాలి చూడాలని ఉంచుతారు కదా, ఉంచారు. ప్రాణ నిర్గమన సమయంలో ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా వారి దేహం అట్లా ఉన్నదో, అన్ని రోజులు గడిచినప్పటికీ కూడా వారి దేహం అట్లాగే ఉన్నది. ఇంకా ఆ దేహం నుంచి పరిమళాలు బయటికి వచ్చినాయి. ఇది యోగ భూమిక లో ఏర్పడేటువంటి ఒక సిద్ధి. పరమహంస యోగానంద తర్వాత, ఆయన్ని కూడా మనం చూడలే, ఎందుకంటే వారు దేహం వదిలిపెట్టే సరికి మనం ఇంకా పుట్టలేదు. సమకాలీనంగా కాస్త యోగాత్మ విచారణ చేయవలసి వచ్చినట్లయితే మళ్ళీ మహర్షి అంటే భగవాన్ రమణ మహర్షి అని, భగవత్పాదులు అంటే శంకర భగవత్పాదుల అని, యోగేశ్వరుడు అంటే శ్రీకృష్ణుడని, ధర్మ విగ్రహ స్వరూపము అంటే శ్రీరామచంద్రుడని ఎట్లా మనకి synonym గా తెలుస్తూ వస్తాయో యోగి అనగానే ఆధునిక కాలం immediate గా identify చేసేది అరవింద యోగిని.
SSSMC · audio
Yoga Pravaham - 07
Yoga Pravaham - 07
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 26:56
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
- 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
- 26 min 7
Yoga Pravaham - 07
Now playing - 42 min 8
Yoga Pravaham - 08
- 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
- 40 min 12
Yoga Pravaham - 12
- 19 min 13
Yoga Pravaham - 13
- 28 min 14
Yoga Pravaham - 14
- 21 min 15
Yoga Pravaham - 15