Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] "ప్రాతఃకాలిక సౌఖ్యశాయనిక వాగారంభవజ్జల్పతాం అంబాయాః ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణాం సఖా వాయుర్మాం స్ప్రుశతి ప్రతిక్షణ నవోన్మీలిత్సుఖాపాదకః మాతుర్భక్తగణాః పరస్పరమిదం సౌహార్దమాచిన్వతే" అని మంగళాశాసనం చేస్తూ దేవీ నవరాత్రులుగా శరన్నవరాత్రులుగా అనూచానంగా సాంప్రదాయకంగా అనేక కాలాలుగా జాతి భరత జాతి సమస్త సన్మంగళమైనటువంటి కాలంగా భావన చేస్తూ దేవీ ఉపాసనా మార్గంలో శాక్తేయంగా సాగేటువంటి నవరాత్రులే శరన్నవరాత్రులు. దేవీ పూజ అంటే శక్తి పూజ. దేవి అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అనంత శక్తి. ఇ-ఇదంతా కలిపితే శక్తి ఉపాసనకి ఇది అనువైన కాలంగా భావన చేస్తాం. అందున నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అంటే ఒక అర్థం. లేదా నవ ఎప్పటికీ కొత్తగా అనిపించేటువంటి, రాత్రి అంటే కాలము అని అర్థం. కాబట్టి కాలమంతా కూడా నవనవోన్మేషంగా, ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా, ఆనంద రసతుందేలంగా సాగిపోయేటువంటి కాలమిది. ఎందువలన అంటే ఇది మాతృవందనం చేసుకొని మాతృపూజ చేసి మాతృ ఉపాసన చేసి మాతృ స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారిని గురించినటువంటి ఉపాసనా మార్గం కాబట్టి ఇది అందరికీ ఆమోదయోగ్యం కాబట్టి జాతి మత వర్గ వర్ణాలకు అతీతంగా ఒక అఖండ భారతావని సాగించేటువంటి శరన్నవరాత్రులలో ప్రధానమైనటువంటి మూడు. అవి అష్టమి, నవమి, దశమి. పాడ్యమిగా మొదలై దశమితో అంతమయ్యేటువంటి ఇదిగో తొమ్మిది రోజుల నవరాత్రులలో ముందుగా దుర్గాష్టమి గురించి కాసేపు మాట్లాడుకుందాం. దుర్గాష్టమి, రెండు అష్టములు ప్రధానమైనవి. భారతీయమైనటువంటి పౌరాణిక నేపథ్యంలో ఒకటి అవతరించిన శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి. అది జన్మకు సంబంధించిన అంటే ఒక అవతార మూర్తి ప్రపంచంలోకి వచ్చిన అద్భుతమైనటువంటి వేళగా దాన్ని మనం ఆరాధన చేస్తాం. దుర్గాష్టమి ఇది సంహార క్రీడ. ఇది ఒక మరణానికి అధర్మం మీద ధర్మం జయించినటువంటి వైనానికి మానవుడు సన్మార్గంలో గనక ఉండకపోయినట్లయితే ఆతడిని సరిదిద్ది మళ్ళీ సన్మార్గంలో ప్రవేశపెట్టి జీవితానికి ఒక పరిపూర్ణతని, సాఫల్యాన్ని, పవిత్రతని, పారమార్థికమైనటువంటి భావనని సంతరింపజేసేటువంటిది కనుక ఇది దుర్గాష్టమి అత్యంత ప్రధానమైనటువంటిదిగా మనం భావన చేయాలి. ఇందులో దుర్గాష్టమి అనే అంటాం. ఎందుకని అంటే అమ్మవారే అనేక రూపాల్లో బహురూపిణిగా వస్తుంది గనుక రోజున ఆమె, ఆమె అంటే మహా త్రిపురసుందరి దేవి, బాలా త్రిపురసుందరి దేవియై ఎనిమిదవ రోజుకు వచ్చేప్పటికి దుర్గగా-- సన్మార్గంలో మాత్రమే సంచారం చేయాలి. అంటే ప్రపంచంలో, సమాజంలో లేదా కుటుంబంలో దాన్ని కూడా దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో ఒక దుర్గముడు ఉంటాడు. అంటే దుర్భావనలతో కూడి ఉంటాడు. మనసుకు లోబడి దాని ప్రకారంగా సంచారం చేస్తూ తాను దాటలేక యాతన పడుతూ చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడుతూ అనేకమైనటువంటి భావనలకు లోనవుతున్న సమయంలో దుర్గాష్టమి నాడు దుర్గా సప్తశతి అనేటువంటి చదువుకున్నట్లయితే మన లోపలే దాగి ఉన్నటువంటి దుర్గముడు నెమ్మది నెమ్మదిగా నశించి మనకి సన్మార్గం వైపు వెళ్ళేటువంటి దారి, వెసులుబాటు, నేర్పు, ఓర్పు, కూర్పు, మార్పు అన్నీ కూడా ఏర్పడి మనం చక్కగా జీవితాన్ని సఫలవంతం చేసుకునేటువంటి స్థాయికి తీసుకువెళుతుంది గనుక దుర్గాష్టమి అనేటువంటిది ఎనిమిదవ రోజున మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ఏదైతే ఇచ్ఛాశక్తి ఉన్నదో, క్రియాశక్తి ఉన్నదో, జ్ఞాన శక్తి ఉన్నదో మూడింటిని సమన్వయం చేసి అంటే వేదాంత భాషలో త్రిపుటీకరణం చేసుకొని మనలో ఉన్నటువంటి దుర్గమమైనటువంటి, దుర్గమము కానటువంటి రెండింటిని సమన్వయం చేసుకొని దేనిని దాటాలో దాటుతూ మన శక్తి చాలదు గనుక, జీవుడి ప్రజ్ఞ పరిమితం గనుక, దేవి యొక్క ప్రజ్ఞ అపరిమితము, అనంతము, అచ్యుతము, అవ్యయము గనుక శక్తిని కూడా జోడించుకొని జీవ ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ రెండూ కలిసి జమిలిగా సాగేటువంటి ఒక ఉదాత్త భూమిక దుర్గాష్టమి. దుర్గాదేవిని ఉపాసించినప్పుడు మనలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి అంటే ఇది చేయాలి అనేటువంటి కోరిక. క్రియాశక్తి ఇది చేయగలిగినటువంటి, చేయటానికి కావలసినటువంటి శక్తి. మూడవది జ్ఞాన శక్తి. జ్ఞానము అంటే వివేకము, విచక్షణ కలిపితే అదే జ్ఞానం. మిగతాదంతా శాస్త్రము, పాండిత్యము, పద్యము, శ్లోకము ఇదిగో ఇట్లా మాట్లాడటం ఇదంతా కూడా విజ్ఞాన కోశం. జ్ఞాన కోశంలో మౌనమే ప్రధానం గనుక మౌన భూమికలో నుంచి మనలో మనం మాట్లాడుతున్న దానిని తగ్గించుకొని ప్రాపంచిక కార్యకలాపాల నుంచి నెమ్మది నెమ్మదిగా మనం లోపలికి ప్రవేశిస్తూ, ప్రపంచ భావన నుంచి విడివడి మన లోపలికి వెళుతూ లోచూపును తెలుసుకుంటూ మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరిక్త భావనలు, ప్రతీప శక్తులు వీటన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్లటానికి ఒక శక్తి కావాలి గనుక శక్తి దైవీ శక్తిగా, దుర్గా శక్తిగాఆ దుర్గాష్టమి నాడు మనకి అనుకూలిస్తుంది గనుక దానికి కావలసిన అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లగలిగినట్లయితే మనం చేయగలిగినటువంటిది ఏమిటి అంటే శక్తిని సమన్వయం చేయాలి. శక్తిని ప్రసారం చేయాలి. శక్తిని సర్వ క్షేత్రాలలోకి లోపల ఉన్నటువంటి మామూలుగా వైద్య పరిభాషలో వైద్య విధానంలో డెబ్బై రెండు వేల యోగ నాడులు నాడులున్నాయని మనకు తెలుసు. కానీ యోగశాస్త్రం ప్రకారం మానవుడిలో రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులన్నీ ఉన్నాయి గనుక వీటన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేయటానికి సరళీకృతం చేయటానికి సమ్యక్ భావనకి సదాచారానికి సంతృప్తికరమైన జీవన విధానానికి సకారాత్మకమైనటువంటి ఆలోచనా స్రవంతికి మూలం ఏది అంటే దుర్గాదేవి. ఆమె మనలో ఉన్నటువంటి అనేక భావాలని క్షమింపజేస్తుంది, నిర్మూలనం చేస్తుంది, నిగ్రహిస్తుంది, నిరోధిస్తుంది. కడగా నిర్మూలనం కూడా చేసి మనల్ని ఉదాత్త మానవుడిగా, ఉన్నత మానవుడిగా, ఉత్కృష్ట మానవుడిగా, యదార్థ మానవుడిగా మానవుడిగా అంటే మా నవ, నీవు కొత్త వాడివి కాదు. నవ అంటే కొత్త మా అంటే కాదు. కొత్త వాడివి కాదు. అనేక బహూనాం జన్మనాం అంతే జ్నానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నెన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఇప్పటికి క్షణానికి వచ్చి జంతు ప్రవృత్తులన్నీ కూడా పోగొట్టుకుని మానవీయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిలో సంచారం చేయవలసినటువంటి మానవుడు ఒక దుర్మార్గమైనటువంటి అంటే సన్మార్గము కానీ ఏది ప్రపంచానికి హితం కాదో, ఏది కుటుంబానికి, దేశానికి కడగా తనకు కూడా రకంగాను అది ఉపయోగపడదో మార్గంలోకి వెళుతున్నప్పుడు దుర్గాదేవిని గనుక ఉపాసన చేసినట్లయితే, ప్రార్థించినట్లయితే, తలచుకున్నట్లయితే ప్రధానంగా దుర్గాష్టమి నాడు నవరాత్రులలో మనకి ఒక అజేయమైనటువంటి ఒక శక్తి, అత్యంత శక్తివంతమైనటువంటి ఒక భావనా స్థితి, ఇవన్నీ కూడా ఏర్పడి మనం మనం నడవవలసిన మార్గంలో నడిచేట్లుగా నడుస్తున్న మార్గం మన వెనక వచ్చేటువంటి వాళ్ళకి మార్గోపదేశనం చేసేట్లుగా, కాలం అనేటువంటి ఇసుక ఎడారి మీద మనం ఎట్లాగైతే పద ముద్రలు వేసుకుంటూ వెళ్ళిపోతామో అటువంటి వాటన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ మంచి ఉదాత్తమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఇది ఉపయోగిస్తుంది గనుక దుర్గాష్టమి అనబడేటువంటి శక్తేయమైనటువంటి శక్తివంతమైనటువంటి దుర్గాదేవిగా కనపడేటువంటి అమ్మవారు ముందే చెప్పినట్లుగా ఆమె కోటి సూర్య మండల మధ్యస్థ అయినటువంటి మహా త్రిపురసుందరి దేవి ఆమె. బాలా త్రిపురసుందరి దేవి ఆవిడే. మరి దుర్గాదేవిగా ఏది దాటవలసి ఉన్నదో దానిని దాటించడానికి మనం సంసార యాతన నుంచి బయట పడటానికి అలాగే దైహికమైనటువంటి అనేకానేక బంధనలు బాంధవ్యాల వలన జీవుడు నిర్వీర్యుడై పోతున్నటువంటి వేళ ఇట్లా కాదని ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులని త్రిపుటీకరణం చేసేటువంటి ఉపాసనా కాలమే దుర్గాష్టమి కాబట్టి దుర్గాష్టమి నాడు చేయవలసింది దుర్గా సప్తశతి పారాయణం. చేసినట్లయితే చేయని వాడు, తెలియని వాడు, అనుకోని వాడు ఏం చేయాలంటే కనీసం వినటం నేర్చుకోవాలి. వింటున్నట్లయితే శబ్దం చేసేటువంటి ప్రసారము, శబ్ద ఉచ్చారణ వల్ల కలిగేటువంటి నాదమే శక్తి మన అన్ని నాడులని కూడా పరిపుష్టము, సంతృష్టము, ఉత్కృష్టము, ఉదాత్తము చేసి ఉన్నతమైనటువంటి భావనా స్థితిలోకి మనందరినీ కూడా నడిపిస్తుంది గనుక దుర్గాష్టమి నాడు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అది కేవలం రాత్రి మాత్రమే కాదు, రాత్రి అంటే కాలం అనుకున్నాం, పగలు అదే రాత్రి అదే. సూర్యుడు అస్తమించాడు అంటున్నాం మళ్ళీ తెల్లవారేసరికి ఆయన ఉదయిస్తున్నాడు. చంద్రుడు వస్తున్నాడు అంటున్నాం తెల్లవారేసరికి ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళినట్లు వచ్చినట్లు కనబడుతున్నదే గాని భూమండలం అంతా కూడా కాలాజ్య విచ్ఛిన్నమైనటువంటి పరిభ్రమణంలో సాగిపోతున్నటువంటి వేళ మనకు కావలసినటువంటి శక్తిని మనం సాధించుకోవలసినటువంటి ఒకానొక సందర్భం ఏర్పడింది గనుక దీనిని పావన భావనామయమైనటువంటి ఒకానొక స్థితిలో మనల్ని మనం చక్కగా ఉద్ధరించుకోవాలి. విషయం తెలుసుకోవాలి. అర్థం తెలియకుండా పని చేసినా అది వ్యర్థమే గనుక దుర్గాష్టమి కాలంలో దుర్గాదేవి అంటే ఎవరు? ఉపాసన అంటే ఏమిటి? ఎందుకు చేయాలి? ఇది కేవలం వినోదమేనా? ఇది కేవలం సంప్రదాయమేనా? ఇది కేవలం ఆచారమేనా? అని కాకుండా మానవుడు తనను తాను నిబ్బరించుకొని తన సర్వ శక్తులని కూడా జగద్ధితం చేయాలి. జగత్తు కోసం వాటిని వినియోగించాలి. తద్వారా తన దేహాత్మ భావనను దాటి ఆత్మభావన వైపు వడివడిగా అడుగులు వేయవలసినటువంటి సందర్భమే దుర్గాష్టమిగా భావన చేస్తూ దుర్గా దేవికి నమోస్తుతే.
YouTube · audio

సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

Home

సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 11:24

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

    Now playing
  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam