Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] భారతీయమైనటువంటి ఒక సంస్కార ధారలో కుటుంబ వ్యవస్థ అత్యంత ప్రధానమైనటువంటిది. ప్రపంచ దేశాలన్నింటినీ అవి తమ జీవితాన్ని సాగిస్తున్న విధానాన్ని వైనాన్ని గమనించినప్పుడు భారతీయమైనటువంటి కుటుంబ వ్యవస్థ అత్యంత పటిష్టమైనది పవిత్రమైనది గంభీరమైనది ఉదాత్తమైనది. ఎందుకని అంటే తల్లి తండ్రి ఒక బిడ్డ మూడు కలిస్తే కుటుంబం అవుతున్నది. కానీ ముగ్గురు కూడా అన్ని దశలు దాటి వస్తారు గనుక దీనిలో అత్యంత ప్రధానంగా తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్పింది అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ నాలుగే చెప్పింది. అంటే మాతృదేవోభవ అంటే దైవం అనేది ఒకటి ఉన్నప్పుడు ఉన్నది అని నేను అనుకుంటే దైవం నా తల్లి. దైవం ఉన్నది అని నేను నమ్మినట్లయితే నా తండ్రి దైవం. అంతేకాదు నా గురువు నా దైవం నా ఇంటికి వచ్చిన అతిథి నాకు దైవం. అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనే నాలుగు వాక్యాలు ఒక మనిషి వ్యక్తిత్వ వికాసంలో అత్యంత కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి భూమికలివి. ఎట్లా అంటే మాతృదేవోభవ తల్లి గర్భాలయంలో తొమ్మిది నెలలు ఉంటాం మనం ఏం తెలియదు. తల్లి గాలి పీల్చిందో అది మనం పీలుస్తాం. ఆమె ఏమి తిన్నదో ఏమి పచనం అయిందో అది మనకు ఆహారం అవుతున్నది. అంతా చీకటి పెనుచీకటి మధ్యలో పడుకొని ఉంటాం మనం. కానీ తల్లి వెలుగు చూస్తున్నదో, మాట వింటున్నదో, మాట అంటున్నదో, వాక్యం పలుకుతున్నదో మాటలే మళ్ళీ మన యందు ప్రవాహ వేగంతో వస్తాయి గనుక మాతృ గర్భాలయంలో మనం ఉన్నటువంటి తొమ్మిది నెలలు తల్లి పోషణలో మనం ఉంటాం. తల్లి ఎట్లా ఉన్నదో మనం అట్లా ఉంటాం. అందుకని దైవం తెలియదు, ప్రపంచం తెలియదు, శాస్త్రం తెలియదు, ఏమీ తెలియని ఒకానొక స్థితిలో అన్నీ తెలిసేట్లుగా నడిపించగలిగినటువంటిది ఒకటి. రెండవది తన ప్రాణాన్ని పణం పెట్టి మనల్ని ప్రసవించి జగత్తులోకి తెచ్చి మళ్ళీ జగత్తులోకి వచ్చిన మరుక్షణమే తనకీ మనకీ ఉన్నటువంటి మాతృ పేగు బంధం ఏదైతే ఉన్నదో దానిని తెంపుకొని మళ్ళీ బిడ్డని తన బిడ్డగా భావించి మన జీవితంలో స్థిమిత పడేదాకా స్థితంగా హాయిగా స్థిరంగా ఉండేదాకా ఆమె మరణానంతరం కూడా మనల్ని ఆశీర్వదించి మనకి ఉగ్గుపాలతో చనుబాలు రంగరించి మనకి ఒక జీవన విధానాన్ని ఒక సంస్కార ధారని మనకు అనుగ్రహించేటువంటిది మాతృమూర్తి గనుక మాతృవందనం మొట్టమొదటిగా మనం చేయాలి. అందుకనే మాతృదేవోభవ మనం దేవుణ్ణి చూడలా ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఊహిస్తాం. లేదు లక్షణాలు ఉన్నాయన్ని దైవ సమానులు అంటాం. రాముడు కృష్ణుడు ఇంకొకరు ఇంకొకరు అని మనం చెప్పుకుంటాం కానీ అసలు దైవాన్ని ఎక్కడ చూడాలి అంటే వేదోపనిషత్తులు బోధించినటువంటి మొట్టమొదటి మాట నీ తల్లిని మించిన దైవం లేదు. అసలు నీ ఉనికి నీ అస్తిత్వం నీ వ్యక్తిత్వం నీ ప్రాణం నీ సంస్కారం నీ ఎదుగుదల నీ జీవితంలో నువ్వు భద్రతమమైన జీవితం గడపడానికి నీ తల్లి చేసేటువంటిది చెప్పేటువంటివి ఎలా ఉంటాయి అంటే అవి ఎవరూ చెప్పలేని నిశ్శబ్ద బోధలు అవి. వాటన్నింటినీ ఇక గమనించుకున్నప్పుడు దైవము అంటే నాకు తల్లే ఇది మాతృదేవోభవ. రెండవది పితృదేవోభవ మరి తండ్రిని గురించి మనం ఎక్కువ చెప్పం ఎందుకని అంటే ఆయన మనల్ని బ్రతికించడానికి మనల్ని పోషించడానికి మనకు విద్యాబుద్ధులు చెప్పడానికి మనల్ని సన్మార్గంలో జీవించేట్లుగా అప్పుడప్పుడు దండించడానికి మందలించడానికి అదలించడానికి ఆలించడానికి పాలించడానికి లాలించడానికి మూలమైనటువంటి వాడు తండ్రి గనుక దైవం అంటూ ఉంటే అదిగో నా తండ్రి చిన్నప్పుడే నన్ను సక్రమంగా గనుక పెంచి ఉండకపోతే ఆయన నన్ను దండించి ఉండకపోతే ఆయన నాకు సుద్దులు బుద్దులు చెప్పి ఉండకపోతే ఏమైపోయేవాడినో అని మనకు అనిపిస్తుంది. క్షణంలో దైవతం ఎవరు అంటే అదిగో తండ్రి అవుతున్నాడు. కనుక ఆయన పితృదేవోభవ. ఇక ఆచార్య దేవోభవ గురుదేవోభవ అనే మాట లేదు. ఆచార్య దేవోభవ ఎందుకంటే గురువు బోధిస్తాడు ఆచార్యుడు ఆచరిస్తూ బోధిస్తాడు. బోధించింది ఆచరిస్తాడు ఇంత తేడా ఉన్నది. గురువు శిష్యుడు బంధం అది. ఆచార్యుడు అంతేవాసి అదొక అత్యద్భుతమైన మేలు కలయిక. కనుక ఆచార్యుడు దేనిని ఆచరిస్తున్నాడు శౌచాన్ని అంటే శుచిని. శుచి అంటే వేదము అని అర్థం. స్మృతిని పురాణాన్ని వేదాన్ని జీవితాన్ని సమస్తమైనటువంటి దాన్ని శాస్త్రబద్ధమైనటువంటి స్మృతి పూర్వకమైనటువంటి విద్యా విధానం ద్వారా తాను బోధించి తాను ఆచరించి మనల్ని ఇలా ఉండమని చెప్పి ఇట్లా ఉన్నట్లయితే నీ జీవితం బాగుంటుందని చెప్పి మనకి మార్గోపదేశనం చేస్తాడు గనుక ఆయన ఆచార్య దేవోభవ. ఇక అతిథి దేవోభవ. అతిథి అంటే మన ఇంటికి వచ్చిన వాడు. ఎవరు వచ్చిన వాడు? మంచివాడు చెడ్డవాడు కాదు. ఆకలై వచ్చిన వాడు అతిథి అభ్యాగతుడు. అతిథి అంటే మన దగ్గరకు వచ్చి మన యోగక్షేమాలు కనుక్కొని తన విషయాలు మనతో పంచుకొని మన నుంచి ఆనందాన్ని పొంది మనల్నీ మన తరతరాలని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళేటువంటి వాడు అతిథి అవుతున్నాడు. అంటే ఆశ్రయము సమాశ్రయము విరామము అన్నీ ఒకచోట మన యందున్నటువంటి విశ్వాసంతో మన యందున్న ప్రేమతో మన యందున్న అభిమానంతో ఆదరంతో గౌరవంతో వచ్చేవాడు గనుక అతిథి కూడాదేవోభవ దైవమై ఉన్నాడు అది అతిథి దేవోభవ అంటే అయి ఉన్నాడు ఇందులో మళ్ళీ మరొక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తల్లి మనల్ని ప్రసవిస్తుంది మంచం మీద మనం పడుకొని ఉంటాం తల్లి దగ్గరగా పొదుగుకొని మనల్ని పడుకోబెట్టుకుంటుంది చాలామంది ఉంటారు పిల్లవాడు పుట్టాడు పిల్ల పుట్టింది అని అందరూ వస్తారు తల్లి అంతమందిలోనూ ఎవరినో సూచిస్తుంది చూపించదు ఇంకా కనురెప్పలు తెరుచుకొని బిడ్డ అంటే మనం అందరిలోనూ తండ్రి ఎవరో గమనిస్తాం ఇది సృష్టి రహస్యం ఆశ్చర్యపోతాం మనం ఎట్లా అందరూ ఎక్కడున్నారు మేనమామలు ఉన్నారు మామయ్యలు ఉన్నారు బావమరుదులు ఉన్నారు ఎవరెవరో ఉన్నారు చుట్టాలు కానీ తన తండ్రిని గుర్తింపు చేసేట్లుగా సంజ్ఞాపూర్వకమైనటువంటి ఒక విషయం ద్వారా తల్లి తండ్రిని చూపిస్తుంది తల్లి తండ్రి కాలం వదిలిపెట్టండి ఒకానొక కాలంలో తల్లి తండ్రి ఇద్దరూ కలిసి తమ పిల్లవాడికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి ఒక గురువు దగ్గరికి తీసుకెళతారు తీసుకెళ్లి అయ్యా భగవంతుడి దయవల్ల మేము ఒక పిల్లవాడిని కన్నాం పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గంలో పెట్టి మళ్ళీ మాకు అనుగ్రహించవలసింది మీకే అప్పజెప్తున్నాం అంటే ఇది గురుకుల విద్యా విధానంలో గురువు మీద ఉన్న విశ్వాసంతో గురు శక్తి మీద ఉన్న నమ్మకంతో తల్లి తండ్రి తీసుకెళ్లి గురువు దగ్గర అప్పజెప్తారు గురువు తల్లి తండ్రి ఎక్కడో దూరంగా ఉన్నా తన దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థికి బిడ్డకి తల్లై తండ్రై గురువై మార్గదర్శనం చేస్తూ తాను బోధించవలసిన అన్ని కూడా బోధిస్తాడు ఎంతవరకు బిడ్డకు ఏం చెప్పాలో అది వేద విద్య కావచ్చు ఇంకోటి కావచ్చు వ్యవహార నిష్ఠ కావచ్చు బ్రహ్మ నిష్ఠ కావచ్చు శుచి సౌచాలు కావచ్చు విధివిధానాలు కావచ్చు శీలము సత్ప్రవర్తన సత్సంగము సత్సాంగత్యము సదాచారము సమ్యక్ సంకీర్తన ఇవన్నీ కూడా గుదిగుచ్చి గురువు అప్పుడప్పుడు మాటల ద్వారా ఎక్కువగా మౌనం ద్వారా అట్లాగే మళ్ళీ ప్రపంచంలో ఉండేటువంటి అనేక విధానాల ద్వారా విద్యాబోధన సంపూర్ణం చేసి ఒక జాతి రత్నాన్ని తయారుచేసి ఉత్తమమైన యువకుడుగా తయారుచేసి మళ్ళీ తల్లిదండ్రులకు అప్పజెప్తాడు లేదా లోకానికి అప్పజెప్తాడు కనుక తల్లి తండ్రి ఇద్దరూ కలిసి గురువును చూపిస్తే గురువు వాళ్ళ ఇద్దరి బాధ్యతతో పాటు తాను చేయవలసినదంతా కూడా చేసి దైవం ఎక్కడ ఉంటుందో దైవం అంటే ఏమిటో దైవాన్ని ఎందుకు పట్టుకోవాలో అసలు దైవం మనకంటే భిన్నంగా ఉన్నదా మనలాగా ఉన్నదా మనతో ఉన్నదా మనలో ఉన్నదా ఇవన్నీ చెప్తూ అనేకమైన వైదాంతికమైనటువంటి విషయాలను బోధ చేస్తూ దైవం ఎక్కడో లేడు నీలో ఉన్నాడు నీలో ఉన్నటువంటి దైవం నీకంటే భిన్నంగా లేడు అది ద్వైత రమణీయ మనోజ్ఞ భావనా భూమికలో నీవు సంచారం చెయ్యి కానీ సమస్త ప్రకృతి ఆరు ఋతువులు కూడా ప్రకృతిలో తమ తమ కర్తవ్యాన్ని తాము ఎట్లా నిర్వర్తిస్తున్నాయో ఆలోచించినప్పుడు దీనిని ఎవరు నడిపిస్తున్నారు ఆకాశంలో తారకలు కింద పడకుండా ఎలా ఉన్నాయి సూర్యుడు సమయానికి ఎలా వస్తున్నాడు ఎలా మాయమవుతున్నాడు చంద్రుడు-- చంద్రోదయం ఎట్లా అవుతున్నది మళ్ళీ సూర్యోదయం ఎలా అవుతున్నది నదులు ఎలా పొంగుతున్నాయి మేఘాలు ఎలా వర్షిస్తున్నాయి ఇట్లా కొన్ని వేల ప్రశ్నలు ఏవైతే మనం రోజు అనుభవిస్తూ ఉన్నామో వాటన్నింటి మీద విశ్లేషణాత్మకమైన శాస్త్రీయపరమైనటువంటి అంటే scientific temperament తో చెప్పి వీటన్నింటికీ ఒక మూల శక్తి ఏదో ఉన్నది మూల శక్తికి మనం దైవం అని పేరు పెట్టుకుందాం ఆయనే భగవంతుడు భగవంతుడే లేకపోతే ప్రపంచమే లేదు నడవదు నడిపించేవాడు ఒకడు ఉండాలి ఉన్నవాడు మనకు కనపడడు కనుక ఇంకా ముందుకు తీసుకువెళ్లి లోలోతులకు తీసుకువెళ్లి ఆయన ప్రత్యేకంగా కనపడక్కర్లేదు కనబడుతున్న ప్రపంచం అంతా దైవమే దైవం కాని వస్తువు లేదు ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ లేదు మామరుడు తన పని తాను చేస్తాడు పండితుడు తన పని తాను చేస్తాడు ఎవరి ఎవరి పని మనం మన ప్రజ్ఞల ద్వారా మనం చేసుకుంటూ వెళతాం ఇందులో అధముడు లేడు అధికుడు లేడు సర్వమూ ఒకటే అనేటువంటి ఒక సమత్వ భావనా స్థితిలో మనందరినీ నడిపించేట్లుగా ఆచార్య సత్తముడు మనల్ని దైవం వైపు నడిపిస్తాడు మరి ఇంత ఉదాత్తమైనటువంటి సంస్కారతగతమైనటువంటి తల్లిదండ్రులు సర్వోన్నతుడైనటువంటి ఒక గురువు మనకు లభించినప్పుడు చెడు వాసనలు కానీ చెడు భావనలు కానీ చెడు తలపులు కానీ చెడు కార్యక్రమాలు కానీ చెడు చేతలు కానీ ఇవి ఏమీ లేకుండా సమాజం భద్రతమంగా ఉండేట్లుగా మనల్ని మనం పునర్నిర్మాణం ప్రతిరోజూ చేసుకుంటూ మనల్ని మనం సంస్కరించుకుంటూ నేను చేయటం లేదు మనం అంటాం మన గురించి ఎవరో చెప్తారు ఈయన చాలా రాశారు చాలా మాట్లాడారని వాళ్ళను అనుకోనివ్వండి మనకేం నష్టం లేదు మనం ఏమనుకోవాలంటే ఇవన్నీ చేయబడినయి చేయబడిన దాంట్లో భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఒక యోగం ఇచ్చాడు ఒక యుక్తం ఇచ్చాడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు అంతే అంతేగాని అవన్నీ నేను చేశాను అన్నప్పుడు నేను మేనుగతమైన నేను శరీరానికి సంబంధించిన నేను అన్నీ అంటుంటుంది కానీ శరీరాతీతమైనటువంటి ఒక నేను ఏదైతే ఉన్నదో ఇంత అత్యద్భుతమైన సంస్కార ధారలో నుంచి ఒక మానవుడు ఉదాత్త మానవ స్థితిలోకి వచ్చినప్పుడు అతడు దేనినీ కూడా ఇది నేను చేశాననడు ఇది కూశాననడు ఇది గీశాననడు ఇవన్నీ నేను చేశాననడు చేయబడిన దాంట్లో నేనున్నాను అంటాడు కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మరొకటి సమాజంలో ఉంటాం స్నేహితులుంటారు స్నేహితులు లేని మనిషి వాడి జీవితం నిస్సారం కష్టంలో సుఖంలో ఆపదలో ఆనందంలో వాడు ఉంటాడు గనుక ఐదవ పారిశ్రామికంగా మనం సంమిత్ర దేవోభవ అని కూడా అనుకోవాలి దైవం ఎక్కడ ఉన్నాడంటే సత్పురుషుడైన ఒక మిత్రుడు గనుక మనకున్నట్లయితే సంమిత్రుడు కూడా దైవమై ఉన్నాడని భావన చేస్తూ నాలుగు అంశాలు కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి గనుక వాటిని సమకాలీనంగా మన జీవితంలో అర్థం చేసుకుని మన కడుపున పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా వైదిక ధార్మిక మార్గంలో నడిపించే దిశగా మన జీవితాలు పల్లవిస్తున్న
YouTube · audio

సన్మార్గం | Sanmargam

Home

సన్మార్గం | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 12:52

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

    Now playing
  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam