⁂
No transcript for this section.
Transcript begins at 0:10.
[ఇంట్రో మ్యూజిక్] సనాతన ధర్మంలో మానవ జీవితంలో నిత్య నైమిత్తిక జీవితంలో అంటే day to day life అంటామే దాంట్లో చాలా అత్యంత ప్రధానమైనది కీలకమైనది ఒకటి ఉన్నది అది నిజానికి యోగాలో ఒక భాగమే కానీ యోగా అనేటువంటి దానిలో నుంచి యోగాన్ని అనుగ్రహించే యోగమును అనుగ్రహించేటువంటిది ఒకటి ఉంది. దాని పేరు ధ్యానం. ధ్యానానికి అనేక అర్థాలున్నాయి. ఒకానొక సమయంలో ఈ దేశంలో పదకొండు వందల డెబ్బై ఎనిమిది రకాల ధ్యాన ప్రక్రియలు ఉండేవి. పోయినయి అవన్నీ. పోగా అనేకమైనటువంటి దశలలో అనేక మార్పులు చెంది, చెంది, చెంది కొన్ని ధ్యాన ప్రక్రియలు మనకి మిగిలిపోయాయి. అయితే వీటన్నింటినీ కూడా సమన్వయించేసి శంకర భగవత్పాదులు ఒక శ్లోకంలో ధ్యానము అంటే ఏమిటో చెప్పారు మనకి. అదేమిటంటే "బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానందదాయిని" అని చెప్పారు. దానికి అర్థం చెప్పుకోవటానికి ముందు ఒక్క నిమిషం వెళ్లినట్లయితే ఇదిగో ఇందాక మనం అనుకున్నామే ఈ ధ్యానం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే మనస్సుని control చేయటానికి. మనస్సు అంటే ఏమిటి? అనేక ఆలోచనల సమూహం అది. దాని-- మనస్సు కాళ్లు చేతులు అంగాంగముల వలే దానికి ఒక అంగమే లేదు. అది అవయవమే కాదు. అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎందుకు ఆనందంతో ఎగిరి గంతేస్తుందో తెలియదు. అటువంటి ఆ ఆలోచనల సమూహం ఏదైతే ఉన్నదో దానిని మనం ఏం చేయాలి అంటే మనస్సు అనేటువంటి దానిని ధ్యానము అనేటువంటి ప్రక్రియ ద్వారా దానిని మనం సమన్వయం చేయాలి. దీనికి ధ్యానము అంటే అసలు శబ్దార్థం ఏంటంటే ధియానమే ధ్యానం. ధి అంటే intellect, మళ్లీ బుద్ధి. ధ్యానము, యానం అంటే ప్రయాణం. అంటే నీకున్నటువంటి బుద్ధి ద్వారా నీకున్నటువంటి శక్తి ద్వారా నీ లోపలికి నీవు ప్రయాణం చేయాలి. యోగా అంటే మనతో మనం ఉండటం. ధ్యానము అంటే మన లోపల మనం ఉండటం. ఇది. కాబట్టి మనతో మనం ఎలాగు ఉంటున్నాం తెలుసుకున్నాం. మనలో మనం ఎలా ఉండాలి? మనం బానే ఉన్నాం కదా! ఇంకా మన లోపల ఏముంది అంటే ఉన్నదంతా లోపలే ఉంది. ఆ లోపలికి వెళ్లు, లోపలికి వెళ్లు అంటామే, ఇగో గూట్లో నుంచి బయటకు వచ్చిన పక్షి మళ్లీ గూట్లోకి ఎలా వెళ్లాలో మనం కూడా బయట ఈ ప్రపంచం అనేటువంటి దాంట్లోకి, ఆ పంజరం నుంచి వచ్చాం మళ్లీ పంజరం లోపలికి వెళ్ళాలి. ఆ పంజరము ఆత్మ. ఆత్మై అక్కడ ఆడుతూ ఉండాలి అది. కనుక ఈ మనస్సు, ఈ ఆలోచనల సమూహాన్ని ఎన్ని ఒక, ఒక secondకి అంటే ఒక క్షణానికి ఆరువేల ఆలోచనలు పుట్టించగలిగే శక్తి ఉంది మన, మా మెదడుకి. మరి ఆరువేల ఆలోచనలు మనం తట్టుకోగలమా? మనకు తెలియకుండా కొన్ని రాలిపోతాయి, కొన్ని జారిపోతాయి, కొన్ని అక్కడే పుడుతూనే పోతాయి. కానీ కొన్ని ఉంటాయి. అవి కూడా అసంఖ్యాకంగా ఉంటాయి. మనల్ని మోయలేనంత బరువు. చూడండి ఒక దుఃఖంలో అడుగు పడదు. దుఃఖానికి కాలికి సంబంధం ఏమిటంటే దుఃఖానికి కాలికి సంబంధమే లేదు. కానీ దుఃఖం మనసు ద్వారా ఏర్పడింది గనుక గంభీరంగా నెమ్మదిగా నడుస్తూ వెళ్తాం. ఆలోచిస్తూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ. అదే ఆనందం కలిగింది, అవే కాళ్లు, అదే mind, అదే మనస్సు, ఆ అదే మనం పరిగెత్తుతూ వెళ్తాం. ఎట్లా అంటే మనో వాయువేగాల్లా పరిగెత్తుతూ వెళ్తాం. అంటే మనల్ని అన్ని విధాలా బాహ్యంగా control చేస్తున్నది, నిరోధిస్తున్నది ఏది అంటే మనస్సు అవుతున్నది గనుక ఈ మనకున్నటువంటి ధి intellect ద్వారా మన లోపలికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే స్థిమితంగా కూర్చోవాలి. ఏదో ఫలానా ఇలా చేయండి, పద్మాసనం వేసుకోండి, అంతా ఆ చీకటిగా పెట్టుకోండి, lightలు ఉండకూడదు, ఇవన్నీ కూడా పెడితే నేను ధ్యానం చేస్తున్నాము అవుతుంది. ధ్యానం చేసేది కాదు. ఏ అసలు ఏమీ చేయకపోవటమే ధ్యానం. ఏమీ చేయకపోతే ఆలోచనలే లేవు కదా! ఆలోచనారహిత స్థితి ఏదైతే ఉన్నదో అది ధ్యానంగా చెప్పబడింది. అయితే అది physical metaphysical అంటే భౌతిక, అతిభౌతిక స్థాయిలో అది విచారణ. కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో నికరమైన, ఖచ్చితమైనటువంటిది ఏది అంటే శంకర భగవత్పాదుల ప్రమాణం ఏమిటంటే మనం అనుకోవాలట. ఏమని? "బ్రహ్మైవాస్మీతి" నేను బ్రహ్మమునై ఉన్నాను. బ్రహ్మమునై ఉన్నానంటే బ్రహ్మ వేరే ఉన్నాడా? కాదట. ఈ కనిపిస్తున్న చరాచర ప్రపంచం అంతా కూడా నేనుగా భావించమన్నది. అంతే కాదు, నేను పక్షులు ఎలాగో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులలో నేను కూడా ఒక భాగం. కాకపోతే నా ద-దశ, నా స్థితి వేరు. కానీ నేను దీంట్లో భాగమే. ఈ గాలే పిల్చాలి, ఈ నీరే తాగాలి, ఇక్కడ అన్నమే తినాలి, ఇక్కడ ఉన్న వాటితో సహజీవనం చేయాలి, అందరితో కలిసి మెలిసి ఉండాలి, సంపదని, జ్ఞానాన్ని పెంచాలి, పంచాలి. ఇవన్నీ ఉన్నాయి గనుక ప్రపంచము లేని నేను లేను. నేను లేక ప్రపంచము లేదు. కాబట్టి నేను, కనబడుతున్న ప్రపంచము ఒక్కటే. కనుక నాకంటే ప్రత్యేకంగా బ్రహ్మము లేడు. బ్రహ్మము బ్రహ్మమని దేన్నంటున్నామో అది ఇదిగో అది నేనే ఉన్నాను అన్నప్పుడు "బ్రహ్మైవా అస్మీ ఇతి" నేనై ఉన్నాను. అనేటువంటి ఆ భావన రావటానికి చాలా ప్రయత్నం చేయాలి. కానీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? "బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా" సత్, సత్ అంటే ఆత్మ. మనో వృత్తులు, చిత్త వృత్తులున్నాయి. సత్ కు కూడా వృత్తులున్నాయి. ఆత్మకు కూడా వృత్తులున్నాయి. ఈ ఆత్మ కేనోపనిషత్తు గనుక చదివినట్లయితే ఆత్మ వృత్తులు ఎలా ఉంటాయి అంటే మన చేతి గడియారంలో ఉన్న batteryలాగా ఉంటుంది అది. అది కదలదు. కానీ అన్నింటినీ కదిలిస్తుంది. timeను చూపిస్తుంది. ఆ seconds ఎన్నో చెప్తుంది, నిమిషాలు ఎన్నో చెప్తుంది, ఎన్ని గంటలు అయిందో చెప్తుంది. అక్కడ ఏమైనా చెప్తున్నదా? చూపిస్తున్నది. ఆ చూపిస్తున్నటువంటి ఆత్మకు భాష లేదు.దానికి రూపం లేదు battery మనం ఎప్పుడో అది మా పని చేయకపోతే దాని వైపు ఆలోచిస్తాం గాని లోపల battery ఉందని మనం అంటాం watch చాలా బాగా పనిచేస్తుంది అండి పదేళ్లు అయిపోయింది అంటాం watch పనిచేయటం లే battery బాగా పనిచేస్తుంది ఇది తర్కంలో గనక అర్థం చేసుకున్నట్లయితే ఆ సత్ అనేటువంటిది ఆత్మ మనస్సుని trigger చేస్తుంది ప్రేరేపిస్తుంది ఎప్పుడైతే మనస్సు ఆలోచన ప్రేరేపింపబడిందో మాట్లాడు అంటే అది మాట్లాడుతుంది చాలు అంటే అది అయిపోతుంది విను అంటే వింటుంది నడువు అంటే నడుస్తుంది అంటే వీటన్నింటినీ ఆత్మ control చేస్తున్నది నిగ్రహింపజేస్తుంది నిర్ణాయకంగా ఉన్నది కాబట్టి ఈ ఆత్మ మనస్సుని కదిలించినప్పుడు అది ఏయే సంకేతాలు ఎట్లా ఇవ్వాలో బుద్ధి చిత్త విశేషం ద్వారా మనం మన కార్యకలాపాలన్నీ చేస్తాం సద్వృత్తులు ఏర్పడతాయి ఆత్మ వృత్తులు ఏర్పడతాయి అవన్నీ మంచివే కదా మంచి పని చెయ్ ఇగో మనం అంటాం కదా do good see good be good అంతే కదా మంచి మాట్లాడు మంచిగా ఉండు మంచి పనులే చెయ్ అంతా మంచి మంచి మంచి చెప్తాం అది సద్వృత్తి ఇది ఇది చెడగొట్టు ఇది పాడు చెయ్యి వాడిని ఇబ్బంది పెట్టు ఇది సద్వృత్తి కాదు కాబట్టి బ్రహ్మము యొక్క స్థాయికి వెళ్ళినవాడు బ్రహ్మైవాస్మితి సద్వృత్త్యా నిరాలంబయతాస్థితి నిర-ఆలంబయ ఆలంబయ అంటే ఆధారం ఆధారమే లేని స్థితి వస్తుంది ఇప్పుడు మనందరం ఉన్నాం మనకు ఆధారంతో ఉంటాం వాడి మీద వీడి మీద ప్రకృతి మీద ప్రపంచం మీద ఆ అనేక ఆధారాల మీద ఆధారపడి ఉంటాం కానీ ఆ బ్రహ్మైవాస్మితి స్థితికి వెళ్ళినవాడు సద్వృత్తులు ఏర్పడినటువంటి వాడు దేని మీద ఆధారపడి ఉండడు తన మీద తాను కూడా ఆధారపడి ఉండడు అది అలా ఉండిపోతుంది అటువంటి స్థితి గనక ఏర్పడితే దీన్నే మామూలుగా ఆలోచనా రాహిత్యం నిష్క్రియ పనులు చేయకుండా ఉండటం ఏమీ చేయకుండా ఉండటం ఏదీ ఆలోచించకుండా ఉండటం ఏ అనుభవాన్ని తీసుకోకుండా ఉండటం ఏ అనుభూతిని పొందకుండా ఉండటం ఒక నిరామయ్య నికేతన నిరంజనమైనటువంటి స్థాయిలో నీవు నీవుగా జడాత్మకమైన భావనలో గనక అక్కడి దాకా వెళ్లగలిగినట్లయితే అది ధ్యానం అని పేరు పెడితే ఇక్కడ భగవత్పాదులు అది కాదు నీవు బ్రహ్మము అనే భావన చేయి మనో వృత్తులు చిత్త వృత్తులు దాటు చక్కగా ఆత్మ వృత్తులతో జీవనం సాగించు అప్పుడు నీవు ఎవరి మీద ఆధారపడని ఒకానొక స్థితి ఏర్పడుతుంది ఈ మూడు ఎక్కడైతే ఏర్పడతాయో ధ్యాన శబ్దేన విఖ్యాత దానికి ధ్యానం అని పేరు ఆ రకంగా ధ్యానము ప్రపంచానికి తెలుస్తుంది ధ్యానం అనే పేరుతో ఆ మూడు స్థితులు కలిసి పిలవబడతాయి బానే ఉంది ధ్యాన శబ్దేన విఖ్యాత ఇక్కడి దాకా వచ్చాం బ్రహ్మం అయిపోయాం సద్వృత్తులున్నాయి ఎవరి మీద ఆధారపడటం లేదు నేను మంచి ధ్యానినై ఉన్నాను అదేంటి లాభం నీ-నీ వల్ల ఎవరికి లాభం నీ అంతట నీ వ్యక్తికి నీకు లాభమే తప్ప ప్రపంచానికి నీ వలన లాభం ఉన్నదా అంటే అటువంటి వాడు ఏం చేస్తాడంటే మన నుంచి ఏ వస్తువును తీసుకోడు అపరిగ్రహము అస్తేయము ఇటువంటివన్నీ ఉన్నాయి ఆ పదాలు వేదాంత పరిభాష అది ఇవన్నీ కూడా ఏమీ అక్కరలేని స్థితి ఏది ఉంటే దాంతో త-సంతృప్తి పడే స్థితి ఏది ఉన్నా ఎవరికైనా ఇవ్వగలిగిన స్థితి ఎవరు వస్తారా నా దగ్గర నుంచి ఈ వస్తువులు తీసుకెళ్ళిపోతే బాగుండును అనేటువంటి స్థితి లేదా ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే నిరామయంగా హాయిగా తీసుకుని వాడుకోండి అని ఇచ్చేటువంటి ఒక భావన ఇవన్నీ కూడా ధ్యానంలో ఒక భాగం ధ్యానం వలన కలిగేటువంటి అంటే త్యాగము ప్రేమ న కర్మణా న ప్రజయా న ధనేన చాగేనైకే అమృతత్వమానశుహు త్యాగము ద్వారా మాత్రమే మానవుడు అమృత పుత్రుడు అవుతాడు మిగతావన్నీ డబ్బుంది ఉందేమో అది ఎవరిదో న కర్మణా బావులు తవ్వించాం అనేక మంచి పనులు చేశాం అయిపోయింది న ప్రజయా కొన్ని లక్షల మందికి మనకు తెలుసు ఏం ప్రయోజనం వీటన్నింటికంటే అహంకార మమకారాలను త్యాగం చేసి తనకున్న వస్తు సంపదని ఖాళీ చేసుకొని తాను తానుగా బ్రహ్మముగా గనక నిలకడ చెందినట్లయితే ఆ ధ్యానము ద్వారా అతనికొకటి ఏర్పడుతుంది ఏమిటంటే ఆ ధ్యానము యొక్క అసలు లక్ష్యము లక్షణము ఏమిటంటే పరమానందదాయిని పరమ చర్మమైన ఆనందాన్నిస్తుంది ఆ పరమ చర్మమైన ఆనందం ఏమిటి అంటే మనుషానందము మనీషానందము గంధర్వానందము మానవ గంధర్వానందము పితృ పితా నందము ప్రజాపితా నందము కడగా హిరణ్యగర్భా నందము దేవుడు అని అంటున్నాం కదా దేవుడు ఇచ్చేవాడా తీసుకునేవాడా ఇచ్చేవాడు గనుకనే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం తీసుకునే వాడైతే మనం వెళ్ళం కదా ఏదైనా ఇవ్వగలడు శక్తిమంతుడు దయామయుడు అని మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఇదిగో ఇక్కడ కూడా ఆ హిరణ్యగర్భా ఆనందాన్ని మనం అనుభవించాలి ఎందుకని ఎట్లా అనుభవించాలంటే ధ్యానం ద్వారా ధ్యానం ఎలా ఎవరి మీద ఆధారపడని స్థితి ద్వారా అది ఎలా ఏర్పడింది సద్వృత్తుల ద్వారా అది ఎట్లా వచ్చింది నేను బ్రహ్మమునైన కారణంగా ఇన్ని జరిగితే మనకి ఒక మంచి ఆలోచన ఒక ఆనందం కలుగుతుంది ఒక మనిషిగా ఆనందం కలుగుతుంది సంతోషం వేరు ఆనందం వేరు శరీరానికి సుఖం తెలుసు మనసుకి సంతోషం తెలుసు హృదయానికి ఆనందం మాత్రమే తెలుసు హృదయానికి సుఖం సంతోషం రెండూ లేవు అది నిరామయ నికేతనమైనటువంటి స్థాయి గనుక ఈ ధ్యానము అనేటువంటిది సక్రమంగా అర్థం చేసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు మనం శ్రమ పడ్డా మన చేతికి వచ్చేది డబ్బు అంతే లేదు కీర్తి అంతే డబ్బు ఉండదు కీర్తి ఫలచబడిపోతుంది కానీ మనం పోయినా జీవించేట్లుగా ఉండాలి మనం బతికినన్నాళ్ళు మరణించినట్లు ఉండాలి అంటే వైరాగ్యంలో ఉండాలి మరణించిన తర్వాత జీవించి ఉండాలి మహాత్ములను చూడండి ఇదిగో ఇందాక మనం అనుకున్నాం ఆ కణాదులు మహర్షులు పిప్పలాది మహర్షులు పతంజలి ఎప్పటి పతంజలి ఎప్పటి యోగశాస్త్రం ఇవాళ ప్రపంచం అంతా యోగా అంటున్నది అంటే మూలపురుషుడు అయినటువంటి పతంజలి ధ్యానము వ్యాఘ్రపాదుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా భారతీయమైనటువంటి మహా సంస్కృతిలో వాళ్ళు భాగమై తరతరాలుగా ఇప్పుడు చెప్తున్నాం ఇంతటితో ఇది ఆగదు మన తర్వాత ఇంకా కాలం కల్పం ఉన్నంత కాలం కూడా వాళ్ళందరినీ మనం స్మరిస్తూనే ఉంటాం కాబట్టి ధ్యానము ద్వారా మరణానంతరం కూడా జీవించగలిగిన ఒక గౌరవాన్ని మనం సంపాదించుకోవాలి ధ్యానము వలన అప్పులు తీరవు ధ్యానము వలన రోగాలు తగ్గవు మరి ఎట్లా అంటే రోగానికి మందే వేసుకోవాలి అప్పు తీసుకున్నామంటే తీర్చటం అనే ధర్మం ఆచరించి ఆ అప్పు తీరిస్తేనే తీరుతుంది అలాగే ధ్యానం ద్వారా నిలకడమైన మనస్సు నిశ్చలమైన మనస్సు స్థితప్రజ్ఞ విచక్షణ వివేకము సూక్ష్మత జ్ఞానము ప్రజ్ఞానము సుజ్ఞానము ఇవన్నీ మనకు ఏర్పడితే గనుక ఈ ధ్యానము అనేటువంటి మహా ప్రక్రియ ద్వారా మన మనస్సును మనం నిరోధించుకొని నిగ్రహించుకొని మహదానంద పూర్వకమైనటువంటి ఉదాత్త ఉత్తమ ఉత్కృష్ట యదార్థ మానవ జీవితాన్ని గడిపేట్లుగా పరమేశ్వరుని