⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
నరసింహస్వామిని అనేకమైన నరసింహ స్వరూపాలు ఉన్నాయి మాలుల జ్వాల ఇలాంటివన్నీ అందులో ప్రధానంగా మనమందరం లక్ష్మీనరసింహస్వామి యొక్క రూపాన్ని మనం ఉపాసన చేస్తాం లేదా పూజించుకుంటాం ఎందుకంటే లక్ష్మితో కూడి ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న మూర్తి కనుక. అంతేకాదు జ్ఞాన లక్ష్మి ని ఇవ్వగలడు మామూలు మనకు కావలసిన ప్రాపంచికమైన లక్ష్మి ని ఇవ్వగలడు కానీ ఈ నరసింహస్వామి ఇంకోటి కూడా చేస్తాడు శంకర భగవత్పాదులు కాశీ నగరానికి వెళ్ళినప్పుడు అందరినీ వాదించి ఓడించి జయించి వెళుతున్నారు వెళితే కాశీ నగరానికి వెళ్లారు ఆయన వెళితే ఒక్కాయన్ని ఇంకా కలుసుకోవాలి ఆయన్ని జయించాలి వైదిక ధర్మాన్ని నిలబెట్టాలి అది శంకరుల యొక్క ఆహ్ ఆలోచన అక్కడ కాశీ నగరంలో ఎవరినో అడిగాడు ఇక్కడ మండన మిశ్రుడు అని ఒక అద్భుతమైనటువంటి ఆహ్ పండితుడు ఉన్నాడని విన్నాము ఆయన ఇల్లు ఎక్కడ అని అడిగాడు మామూలుగా ఇల్లు ఎక్కడో చెప్పకుండా వాడేమన్నాడంటే ఏ ఇంట్లో చిలకలు కూడా వేదమే పారాయణం చేస్తాయో ఆ ఇల్లే మండన మిశ్రుడు ఇల్లు అన్నారు. భగవత్పాదులు వెళ్లారు ఆ వెళ్లే సమయానికి ఏమైంది బయట తలుపులు మూసివేసి ఉన్నాయి లోపల ఏం జరుగుతున్నదంటే మండన మిశ్రుడు తన తండ్రికి శ్రాద్ధం పెడుతున్నాడు తద్దినం జరుగుతున్నది తత్తు దినము తండ్రి పోయిన దినము వచ్చింది అది తద్దినం జరుగుతుంటే దానికి భోక్తలు ఎవరో తెలుసునా బ్రహ్మ విష్ణువు భోక్తలుగా వచ్చారు అంతటి శక్తిమంతుడు ఆయన భార్య మామూలు భార్య కాదు ఆమె ఉభయ భారతి భర్తను మించినటువంటి జ్ఞాని ఉభయ భారతి ఈ సందర్భంలో భగవత్పాదులు లోపలికి వెళ్లారు అనగానే మనకు ప్రశ్న వస్తుంది తలుపు వేసిందని ఇప్పుడే చెప్పారు కదా లోపలికి ఎలా వెళ్లారు అని జ్ఞానికి భగవంతుడికి ఈ ద్వారాలు అడ్డు కావు ద్వార ప్రవేశం చేసి లోపలికి వెళ్లగలిగే పటికి మండన మిశ్రుడు చూశాడు నువ్వెవరు నిన్ను నేను పిలవలేదే ఇలా ఎందుకు వచ్చావు ఇక్కడ జరుగుతున్నది పితృకార్యం జరుగుతున్నది ఈ సమయంలో బయట వాడు రాకూడదు అంటే మరి ఆ వచ్చిన వారు ఎవరు అని అడిగారు భగవత్పాదులు ఆ వారు నువ్వు అందుకోలేని వారే ఒకడు విష్ణువు ఒకడు బ్రహ్మ అన్నాడు ఇట్లా తేలిగ్గా మరి త్రిమూర్తులు ముగ్గురు కదా బ్రహ్మ విష్ణువు వస్తే సరిపోతుందా భోక్తలలో మూడో వాడు కూడా ఉండాలి లేకుండా నువ్వు ఎలా చేస్తున్నావు ఈ కార్యక్రమం అన్నాడు మండన మిశ్రుడికి ఒక్కసారి ఒళ్ళు జలదరించింది ఈ ధర్మ సూక్ష్మం చెప్పటానికి వచ్చిన ఈయన ఎవరై ఉంటారు అని మీరెవరు అన్నాడు ఆ ముగ్గురిలో ఒకడ్ని అన్నారు అంటే నేను శివుడ్ని అని చెప్పకుండా శంభోర్ మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా ఆ శివుడే శంకర రూపంలో వచ్చాడని తర్వాత తెలిసింది సరే కానివ్వండి మీరు కూడా ఉండండి ఆహ్ ఇదైన తర్వాత నాతో ఏం పని అన్నారు కాసేపు మీతో మాట్లాడాలి నీతో మాట్లాడేంత ఇది నా దగ్గర లేదు నువ్వు ఎవరివో నువ్వు అసలు నువ్వు చాలా చిన్న పిల్లవాడివి నాతో ఏం మాట్లాడుతావ్ నువ్వు భోజనం చేయి హాయిగా అక్కడ అరుగు మీద కూర్చో అన్నాడు భగవంతుడు వినమ్రుడు ఆయన నెమ్మదిగా ఆయన చెప్పినట్లే భోక్తగా ఉన్నాడు ఉండి పక్కన అరుగు మీద కూర్చున్నాడు లోపలే కూర్చున్న తర్వాత మండన మిశ్రుడు ఆ నెమ్మదిగా వచ్చి ఏమిటి ఏం మాట్లాడాలని అనుకుంటున్నావ్ అని అడిగాడు మొదలు పెట్టారు ఆ భేదం వాద భేదం అంతా సుమారు చాలా తీవ్రమైనటువంటి వేద వాదన జరిగితే ఉభయ భారతి కి ఒక సందేహం కలిగింది నా భర్త గనుక ఇతని చేతిలో ఓడిపోతే నా భర్త తట్టుకోలేడు ఇప్పటివరకు కాశీ నగరంలోనే కాదు అఖండ భారతావనిలో నెంబర్ వన్ మహా పండితులు ఎవరు అంటే ఆయన మండన మిశ్రుడు అని పేరు వచ్చింది ఈ చిన్న పిల్లవాడి చేతిలో గనుక ఈయన ఓడిపోయినట్లయితే నా భర్త తట్టుకోలేడు కనుక ఇతన్ని ఎలాగైనా ఆ వాదనలో నుంచి అపమార్గం పట్టించాలి ఇంకో మార్గం వైపు తీసుకుని వెళ్లాలని అంటే ఆ వాదన జరిగే ముందు ఏమనుకున్నారంటే ఎవరు గెలిచారో ఎవరు ఓడారో చెప్పటానికి ఒకరు ఉండాలి కాబట్టి ఎవరినో ఎవరు కావాలి అని అడిగాడు మండన మిశ్రుడు నాకు ఎవరున్నా ఇబ్బంది లేదు మీరు పెట్టుకోండి అన్నాడు నా భార్య ఉండవచ్చునా అన్నాడు తప్పకుండా ఉండవచ్చు అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే భార్య ఎలాగూ నా వైపు జడ్జిమెంట్ ఇస్తుంది కదా అని కానీ ఆవిడ మాట్లాడుతున్నది వింటున్నది ఒకానొక సందర్భంలో ఏమైనా సరే మండల మిశ్రుడిని కాపాడుకోవాలి అనుకున్నది ఉభయ భారతి అప్పుడు ఆయన ఒక ప్రశ్న వేసింది ఏ శాస్త్రాన్ని గురించి నేను అడుగుతున్నా వారు అడుగుతున్నా మీరు దాన్ని ఖండిస్తున్నారు అసలు వాదం ఏదో చెప్తున్నారు అది ఏది కానివ్వండి ఆయన సర్వ శక్తులు ఒడ్డి అడుగుతున్నా మీ దగ్గర జవాబులు ఉన్నాయి మీరు ఆ వాదనకి ఆయన అంగీకరిస్తున్నారు కానీ శంకరా ఇక్కడ నాదొక విషయం కామశాస్త్రం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది ఈయన పిల్లవాడు పరివిరాజకుడు నాలుగేళ్ళకే సన్యాసం తీసుకున్నవాడు ఈ సంసారం అంటే ఏమిటో తెలియని వాడు అలాంటి వాడిని ఉభయ భారతి ప్రశ్న వేసింది యుక్తిగా వేసింది అంతే యుక్తిగా శంకరులు ఏం జవాబు ఇచ్చారంటే నాకు ఒక్క నెల సమయం ఇవ్వు అమ్మా ఒక్క నెల సమయం ఇవ్వు తర్వాత మళ్ళీ నేను వచ్చి నీతో మాట్లాడుతాను అంటే కాశీ పట్టణంలోనే పరకాయ మహావిద్య అని ఒకటుంది పర ఇతరుల యొక్క కాయ శరీరము నందు మనం ప్రవేశించవచ్చు ఆ పరకాయ విద్య చేయాలి అంటే ఈ శరీరాన్ని లోపల ఉన్న ప్రాణము చైతన్యము ఇవన్నీ ఆత్మ అక్కడికి వెళ్ళాలి ఆయన తీసుకు వెళ్తాడు ఆ విద్యలో ఆయన నిష్ణాతుడు గనుక తన శరీరాన్ని తన శిష్యులకి అప్పజెప్పి ఆయన అమరకుడు అనేటువంటి ఒక రాజు శరీరంలో ప్రవేశించాడు ఎవరు శంకర భగవత్పాదులు.యోగ భూమిక లో నుంచి భోగ భూమిక లోకి ప్రస్తావన చేశారు భగవత్పాదులు. వెళ్లి సమయం నెల రోజులే. ఆ రాజ్యంలో అక్కడ అంతఃపురం లో జరిగే వైభోగాలు, విలాసాలు, అవన్నీ ఆయన గమనిస్తున్నది. ఏది? శంకర చైతన్యం. దేహం దేంట్లో ఉంది? అమరుకుడు అనే రాజు దేహంలో ఉంది. దాంట్లో అన్ని వీక్షిస్తున్నది, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇంతలోకి దురదృష్టవశాత్తు అమరుకుడు మరణించాడు. నశించాడు. వాడు పోయినాడు. అమరుకుడు పోయినాడు గనుక వాడిని వైభవంగా తీసుకెళ్లి చితి మీద పడుకోబెట్టారు. ఆ చితి మీద పడుకున్నది అమరుకు దేహం అయినప్పటికీ, దేహం లోపల ఉన్నది శంకరుల వారు. కాబట్టి ఆ చెయ్యి కాలుతున్నప్పుడు, ఆ కాలుతున్న చెయ్యి ఎవరిది అయిందంటే శంకర భగవత్పాదులు. ఆయనకు అర్థమైపోయింది. ఈ చితి గనక ఒక్కసారి రాజుకు ఉన్నట్లయితే మొత్తం ఒక్క నిమిషంలో బూడిద అయిపోతుందని, "లక్ష్మీ నృసింహం మమ దేహి కరావలంబం" అని కరావలంబ స్తోత్రాన్ని ఆ చితి మీద పడుకొని శంకర భగవత్పాదులు చదవటం, చితి చల్లారటం, శంకరుల ఆత్మ, ప్రాణము, మనస్సు, చైతన్యము మళ్ళీ వారి స్వశరీరంలోకి వెళ్ళటం ఏకకాలంలో జరిగింది. ఇవాళ ఈ శంకరుడి కథ ఎందుకు చెప్పాలంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాలా గొప్ప స్తోత్రం. ఎవరైనా అనేక కష్టాలలో గనక ఉన్నట్లయితే, అది గనక చదువుకున్నట్లయితే కర అవలంబనం. Please lend me your hand. నా చేయూత కావాలి అని నరసింహస్వామిని శంకరుల వారు అడిగినందువలన ఆ చేయూతని ఇచ్చారు గనుక కరావలంబ స్తోత్రం కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు చదువుకుంటే దాని ఫలితాలు దానికి ఉంటాయి. అవి ఏమవుతాయి? ఎట్లా వస్తాయి? అద్భుతాలు అవన్నీ మనం మాట్లాడుకోనక్కర్లే. అది నిష్టగా చదివే వాడికి చ-జరుగుతుంది. ఆ అనిష్టంగా తప్పక జరిగే వాడికి అలాగే జరుగుతుంది, ఏదో జరుగుతుంది. కనుక మళ్ళీ శంకర భగవత్పాదులు శరీరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వాదన కొనసాగించినప్పుడు మండన మిశ్రుడు ఓడిపోవటం, ఆ ఓడిపోయిన తర్వాత నేను మీ శిష్యుడిగా ఉంటాను అనటం, అప్పుడు ఉభయ భారతిని శంకర భగవత్పాదులు, "అమ్మా, ఎటువంటి మహా జ్ఞానిని వెంట దేశాలు తిరగక్కర్లేదు. ఇక్కడే ఉండి మీ స్వాధ్యాయాన్ని మీరు చేసుకోండి" అని ఆ కథ అక్కడికి అయిపోతుంది. అంటే లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మితో కూడిన నరసింహస్వామి ప్రసన్నమూర్తి, ఆయన ప్రసాదమూర్తి, ఆయన అద్భుత మూర్తి, ఆయన ఆనందమూర్తి. అటువంటి వారిని మనం గనక ఆ ఆవాహన చేసుకోగలిగినట్లయితే, ఎట్లాగైతే ప్రహ్లాదుని వలన కూడా కాని పని లక్ష్మీదేవి యొక్క రాకతో, ఎప్పుడైతే మనకి అవిద్య లో నుంచి చెడిన మనసులో నుంచి ఈ ప్రపంచం కనబడుతుందని నేను అనుకున్నాం, అట్లాగే మన మనసు బాగా లేనప్పుడు, ఆత్రుత చెందినప్పుడు, ఆందోళన చెందినప్పుడు, సంసారాలు సరిగ్గా నడవట్లేదేమో అనే ఒక అపనమ్మకం కలిగినప్పుడు, ఆ అలాగే సంపదలు పోయినప్పుడు, రావలసిన సంపద రానప్పుడు, ఈ "లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం". కరావలంబ స్తోత్రం గనక చక్కగా వింటే, ఎవరో పాడింది వినకండి. మీరు చదువుకోండి. ఎవరో పాడింది వింటే ఫలితం ఏం ఉండదు. అది ఉరికే కాసేపు బాగుంటుంది అంతే. ఎవరికి వారు చదువుకోవాలి. ఇవాళ ఈ ఈ తపస్సు, ఈ జపము వీటితో పాటు ఇది కూడా ఆ తపస్సు చేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేయాలి. ఎందుకంటే కనకధారాస్తవం ఉంది. కనకధారాస్తవం అంటే దాన్ని లక్ష్మీక స్తోత్రం అని కూడా అంటారు. అనేక శ్లోకాలు ఉన్నాయి. అదే శంకర భగవత్పాదులే వెళ్ళటం, ఆవిడ ఒక ఎండిన ఉసిరికాయ వారి చేతిలో పెట్టడం, అది ఉంటే ఇరవై ఒక్క రోజులు ప్రాణం నిలబడుతుంది అనేది ఉన్నా తన భర్త, తన విషయం వదిలిపెట్టి, ఆ యతి మన వాకిట్లోకి వచ్చాడు గనుక మనం ఇది ఇవ్వాలని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉసిరికాయ ఇచ్చింది గనుక ఆయనకు భగవత్పాదుల హృదయం పల్లవించి ఏమన్నాడంటే, ఏమీ లేని స్థితిలో కూడా తన ప్రాణానికి ఏమైపోతుందో అని కూడా లెక్క పెట్టకుండా నా చేతికి ఈమె ఇచ్చింది అంటే ఈమె గనక లక్ష్మీ కటాక్షం ఉన్నట్లయితే, సంపదలు ఉన్నట్లయితే ఇంకా ఎంత మంచి పనులు చేసేదో అని ఆయన లక్ష్మీదేవిని ఆ వాకిట్లో నుంచొనే ప్రార్థన చేశారు. "ద్రుజ్యా దయాను పవనో ద్రవిణాంబుధారాం, అస్మిన్ న కించిన విహంగ శిశౌ విషన్నే, దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం, నారాయణ ప్రణయినీ నయనాంబు వాహః". ఆ మొత్తం వాటిలలో ఈ శ్లోకం ప్రధానమైంది. అందుకని చెప్పా. అంటే, అమ్మా, ఈ బీద ఇల్లాలి యొక్క ఆవేదన నీకు తెలియట లేదా? ఈవిడ స్థితి నీకు తెలియట లేదా? నువ్వు నారాయణుడు. నారము అంటే నీరు. అది నీరు కావచ్చు, పాలు కావచ్చు, నీరు. నీటిలో ఉండే నీకు నిరంతరము నీటిలో మాత్రమే నీ భర్తతో ఉండే నీకు ఈ ఇల్లాలి, పేద ఇల్లాలి కన్నీటి విలువ తెలియటం లేదా? నువ్వు కాపాడమని అడిగారు ఆయన. అడిగితే ఆ ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది. కనక ధార అది. బంగారపు ధార. ఆ స్తోత్రం. ఇవన్నీ కూడా మంత్రం. నిన్న అనుకున్నాం, ఏనుగేమో అంకుశానికి లొంగుతుంది, మన మనసేమో మంత్రానికి లొంగుతుంది అని. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి రావటానికి కారణమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు రావటానికి కారణమైన వాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, లీలావతి, నారదుడు, ఈ పాత్రలన్నీ కలిపితే, ఓ సంఘటన జరిగితే, దీనికంటే ముందుగా సనక సనందనాది ఋషులు, తద్వారా శ్రీ మహావిష్ణువు, ఇంతమంది కలిస్తే ఒక నరసింహ అవతారం ఈ జగత్తులోకి వచ్చింది. ఇది ప్రహ్లాదుడి యొక్క చరిత్ర. మనం దాన్నుంచి అంతవరకు గ్రహించగలిగితే చాలు. అదేదో భక్తి పాటలు, పద్యాలు ఉన్నాయి. భాగవతం నిండా పద్యాలన్నీ ఉన్నాయి. ఏమనుకున్నాం అంటే, ఇవాళ ముందు మీకు కథ చెప్పేస్తే సాయంకాలం మూడు కథలు చెప్పబోతున్నాం ఇవాళ. ఒకటి ప్రహ్లాదుడి చరిత్ర. ఇప్పుడు అయిపోయింది అది. ఇక రెండవది గజేంద్ర మోక్షం.అది కూడా ఇప్పుడు చెప్పుకుందాం వీటికన్నింటికీ లింక్ ఉంది. మూడవది వామన చరిత్ర. ఈ మూడు కలిపి చెప్పుకుంటేనే అది సంపూర్ణమైనటువంటి భాగవతం అవుతుంది. అందువలన ప్రహ్లాద చరిత్ర లో మనం ఏం నేర్చుకోవాలో మాట్లాడుకున్నాం గనుక నెమ్మదిగా గజేంద్ర మోక్షంలోకి వెళదాం. చూడండి మనిషి ఒక్కొక్కసారి వినోదానికి బయలుదేరుతాడు. మనం కూడా excursion కి వెళతాం కదా. మనం కూడా నైమిశారణ్యానికి వచ్చాం గనుక గోమతి నిధ-- న-నదిలో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, మళ్ళీ తలవారుజామున, మళ్ళీ పట్టపగలు ఇట్లా అలా స్నానాలు చేస్తూ ఉంటామని మనకొక ఆ వినోదంలో ఆహ్ అతిశయమైన భావాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడో మళ్ళీ వస్తామో రామో రోజూ చేద్దాం స్నానం ఏమవుతుంది కానీ ఖర్చు లేదు కదా అనుకుంటాం. అది, అది విపరీత ధోరణి. అది మంచిది కాదు. దానికి అనేక విపత్తులు ఎదురుచూస్తూ ఉంటాయి. మనల్ని కాలం ఎట్లా కబళిస్తుందో తెలియదు. అన్ని జాగ్రత్తలు తీసుకుని కొద్దిగా మనకి ఆ పురోహితులు తీర్థం ఇస్తారా చెంబుతో నీళ్ళు ఇస్తారా? ఇంతే ఇస్తారు. అంతే కదా. కొద్దిగా. అకాల మృత్యుహరణం అని ఇస్తారు. నీకు మృత్యువే లేకుండా ఉండేట్టుగా నేను ఇస్తున్నాను అనడు. జరగకూడనిది జరగకుండా ఈ మంత్రం-- మంత్ర జలాన్ని నీకు ఇస్తున్నాను అదే తీర్థం అవుతున్నది. కాబట్టి ఈ ఒక గజరాజు ఉన్నాడు. వాడికి గజేంద్రుడు అని పేరు. అంటే ఇంద్రియాలతో మదమెక్కిన వాడు వాడు. వాడు రాజు. ముఖ్యంగా ఒక మూడు కొండలున్నాయి. ఒక కొండకి శిఖరం ఉంది. ఆ శిఖరం బంగారంతో చేసింది. అంటే అది బంగారు కొండ. రెండవది వెండి కొండ. మూడవది ఇనప కొండ. మూడు కొండలు ఉన్నాయి. దీన్ని కలిపితే త్రికూటాచలము అని పేరు పెట్టారు దానికి. ఆ త్రికూటాచలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాని నిండా ఏనుగులు ఉంటాయి అంతే. ఇంకేం ఉండవు. only ఏనుగులు ఉంటాయి. ధారాళమైన పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చాలా విస్తృతంగా ఉంటాయి. సరే అందులో ఈ రాజులకి ఈ ఏనుగులకు ఓ రాజు ఉన్నాడు. ఆయన పేరు గజేంద్రుడు. గజేంద్రుడు అనగానే ఆయనకు కూడా చాలామంది భార్యలు అంటే ఆడ ఏనుగులు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళంతా మామూలుగా జీవితం గడుపుతున్న వాళ్ళు. విధి వశాత్తు by providence. ఆ twist with destiny అంటాం. ఆ విధి వశాత్ ఒకరోజున ఆ రాజుగారికి ఓ ఆలోచన కలిగింది. ఏంటి రోజూ అంతఃపురంలో ఉంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఈ సల్లాపం సాగుతున్నది. అలా అసలు మన త్రికూటాచలం అంతా ఎలా ఉందో చూసేద్దాం అని ఆయనకు వినోదం పట్ల అభిలాష కలిగింది. ఎప్పుడైతే రాజు బయలుదేరాడో, రాజు వెడలి రవి తేజము లడగగానే అటూ ఇటూ అందరూ మనుషులు అదే ఏనుగులు వెళ్లిపోతా-- వెళ్లిపోవాలని అనుకున్నారు, వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఈ ఏనుగులు ఎప్పుడైతే వన విహారానికి వెళ్లినయో, మనిషి కూడా చూడండి. ఏ వినోద ప్రక్రియ కోసం వెళతాడో ఆ వినోదంలో తన లోపల అణచుకున్నటువంటి అనేక కోరికలను విజృంభించి బయట సాధ్యమైనంత వరకు misbehave చేస్తాడు. అప్పటి వరకు ఏంటి ఇలా ఉన్నాడు ఏమిటి ఈ మనిషి అనుకుంటాం. వాడు అలాగే ఉంటాడు. అది ఆ వినోద మహత్యం అది. వినోదంలో మనస్సు మా friction అంతా పోతుంది. ఏం-ఏం చూసి ఏం చేసినా ఇక్కడ చూసేవాళ్ళు లేడు కదా. పైగా ఈ రాజ్యం, ఈ త్రికూటాచలం మనది. పైగా మనం రాజు గారితో కలిసి వెళుతున్నాం. మనల్ని అడ్డగించేవాళ్ళు లేడు. మనల్ని చంపడానికి సింహాలు పులులు లేవు అని వెళుతుంటే అవి ఎత్తుగా ఉంటాయి. అందులో ఒక్కొక్కటి ఐరావత సమానమైనవి అని వర్ణన ఉంది. అంటే చాలా పెద్దవి అని. ఇరవై ఒకటి నుంచి ముప్పై అడుగుల ఎత్తున ఆ ఏనుగులు ఉన్నాయి. అవి తమ తొండంతో దారి పొడుగూతా చెట్లని, కొమ్మలన్నీ విరుస్తూ పూలన్నీ నేల మీద, ఆ పూల కొమ్మలన్నీ నేల మీద వేస్తూ వాటి మీద నడుస్తూ వెళుతుంటే ఆ పూలలో ఉన్నటువంటి రసం వలన మొత్తం చిత్తడి అయిపోయిందట. ఆ మార్గం అంతా. త్రికూటాచలం అంతా. సరే ఎంత చేసినా అలసట ఉంటుందిగా అది ప్రాణిగా. చాలా దూరం వెళ్ళినాయి, చాలా వెళుతున్నాయి. అన్నింటికీ దాహం వేసింది. ఏనుగుకి దాహం వేస్తే ఈ చెంబు నీళ్ళో అవి పనికిరావు కదా. చాలా పెద్ద మడుగు కావాలి, చెరువు కావాలి. ఒక తటాకం దగ్గరికి వెళ్ళేప్పటికీ ముందు రాజుగారు తాగితే తప్ప బొట్లు తాగటానికి వీల్లేదు, బంట్లు. ముందు రాజుగారు ఏం చేశారంటే దాంట్లోకి నెమ్మదిగా దిగారు. ఆ నీళ్ళు చల్లగా, హాయిగా శరీరానికి శరీర సుఖము అనుభవంలోకి వస్తున్నది. ఆయన వెనక్కి తిరిగి సైగ చేశాడు. సైగ చేస్తే ఆయనకు ఉన్నటువంటి ఆ భార్యలు అనుకోండి ఆడ ఏనుగులు అవి కూడా ఆ మడుగులో దిగినాయి. ఆ మడుగులో దిగితే అక్కడ చక్కగా తిరుగుతున్నాయి, విహారం చేస్తున్నాయి, జలక్రీడ చేస్తున్నాయి. చుట్టూ బొట్లు అంతా కూడా ఒక వలయంగా ఏర్పడి రాజుగారి వినోద క్రీడను చూస్తున్నారు. అంతా terrible amount of merriment అంటాం. అత్యద్భుతమైనటువంటి ఆనంద కేళిలో వాళ్ళు సాగిపోతున్నటువంటి వేళ ఒక మొసలి దగ్గరకు వచ్చింది. వీళ్ళ దగ్గరికి. ఇదేమిటి ప్రశాంతంగా ఉన్న దాన్ని ఇలా భగ్నం చేయడానికి ఏనుగులు ఎన్నడూ రాలేదే, ఇవాళ వచ్చినాయి అని ఎడమ కాలిని పట్టుకుంది. గజేంద్రుడి యొక్క ఎడమ కాలిని పట్టుకుంది. పట్టుకోగానే వాడు చాలా బలమైన ఇంద్రియాలు గలవాడు. ఆ ఎడమ కాలు ఒక్కసారి జాడించాడు. జాడించేసరికి ఈ మొసలి ఉన్న place నుంచి తటాకం లో నుంచి నేల మీద పడిపోయింది. నేల మీద పడగానే అది బలం కోల్పోతుంది. దాని బలం అంత ఎక్కువ ఉండదు బయట. బలిమంతా స్థానబలిమంతా కూడా మొసలికి నీటిలోనే. అది ఎలాగో మళ్ళీ నెమ్మదిగా పాకుతూ ఏదో పడేసాం కదా అని గజేంద్రుడు మళ్ళీ ఉత్సాహంగా వినోదంలో ఉన్నాడు. మొసలి నెమ్మదిగా పాక్కుంటూ తన నీళ్ళల్లో తాను చేరుకుంది. మళ్ళీ దాని పలా-- బలాన్ని పొందుకుంది. కానీ అప్పటికే కొంత రక్తం దాని శరీరంలో నుంచి వచ్చి నెమ్మదిగా ఈ మడుగులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తటాకంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఎర్రబారటం మొదలు పెట్టినాయి.కానీ మొసలికి ఒక కోపం ఉంది లోపల. ఈ ఏనుగుని ఎలాగైనా నేను ఇబ్బంది పెట్టాలి చంపాలి అనుకుంది. ఈసారి వెనక ఉన్న కాళ్ళు కాకుండా ముందు ఉన్నటువంటి కాళ్ళను పట్టుకుంది. పట్టుకొని ఇంకా వదలటం లేదు. నీళ్ళల్లో ఉందది. నీటి బయట ఉండవలసిన ఏనుగు నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లోనే ఉండవలసిన మొసలి అక్కడ ఉన్నది. ఆ రెండింటి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఏనుగు రక్తాన్నంతా పీలుస్తున్నదది. పీల్చి నీళ్ళలోకి వదిలి పెడుతున్నది. అది మందారపు రంగులో మొత్తం కూడా తటాకమంతా ఎర్రగా అయిపోయింది. అంటే చక్కగా స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి ఒక గుణం సత్వగుణం ఏమైపోయింది అంటే అహంకారం వలన, ఆభిజాత్యం వలన, అధికార మదం వలన తామున్నటువంటి ప్రదేశాన్ని రజోగుణంతో నింపేసింది. సరే ఎప్పుడైతే ఏనుగు నెమ్మదిగా గజేంద్రుడు సడలిపోతున్నాడు. భయమేస్తున్నది, బలహీన పడిపోతున్నది. అప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆడ ఏనుగులున్నాయే, ఆ ఆడ ఏనుగులు నెమ్మదిగా గట్టెక్కినయి. భార్యలుగా ఉన్నవి కూడా గట్టెక్కేసినయి. ఎందుకంటే, ఈయనని ఏదో పట్టుకుంది. ఈయన బతికి బయట పడటం అసాధ్యం. కనీసం మన ప్రాణాలు మనం దక్కించుకుందామని ఆడ ఏనుగులు పైకెక్కినయి. భటులు ఒక్కడు కిందికి దిగలేదు. మా రాజుని కాపాడుకోవాలి, ఏమైపోతుంది అని వాళ్ళు దిగలేదు. ఉన్నవాళ్ళు కూడా వెళ్లిపోయినారు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇది చాలా విచిత్రం. జీవితంలో కూడా వీడు నా వాడు అనుకున్నవాడు సమయానికి ఉండడు. వీడు పనికిరాడు అన్నవాడు సమయానికి అక్కరకు వస్తాడు. ఇది విధి విచిత్రాల్లో అదొకటి. నా వాడు, నా వాడు, ఇది నాది, నా వల్ల వచ్చింది, నన్ను వీడు వదలడు అన్నవాడు వాడు ముందే వెళ్లిపోవచ్చు. అసలు నీ సమయానికి నీకు అక్కరకు రాకపోవచ్చు. వీడు చదువు లేదు, వీడు ప్రయోజకుడు అప్రయోజకుడు వీడు, వీడి వల్ల లాభం లేదు అనుకున్నప్పుడు మనకి ప్రయోజనం కలిగించేలా వాడు ఎప్పుడప్పుడు జీవితంలోకి వస్తాడు. ఇది ఇక్కడ జరిగేది అదే. అయిన వాళ్ళందరూ వెళ్లిపోయినారు. గజేంద్రుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. మొసలి పట్టు వీడటం లేదు. శరీరంలో రక్తమంతా ఆ నీళ్ళు రక్తం అయిపోయినయి. శరీరంలో నుంచి రక్తం ఎప్పుడైతే ఓ కౌంట్ పడిపోయిందో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మనకెలా వస్తాయో వాటికి కూడా వచ్చినయి. ఆ ఇబ్బందులలో నుంచి తన ఇంద్రియ బలం చేత, తనకున్నటువంటి నైపుణ్యం చేత, తనకున్నటువంటి శారీరక బలం చేత ఎదుర్కుంటూనే ఉన్నది. ఎంత ఎదుర్కున్నా బలహీన పడటం మాత్రం తగ్గలేదు. అప్పుడు ఆలోచన కలిగింది. అందరూ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని చెప్తే చెవిన పడ్డది విన్నాను. ఆ ఉన్నటువంటి వాడు ఎక్కడైనా ఉంటే ఇప్పుడు వస్తాడా? నా పాలి కలిమియై వస్తాడా? నా పాలి బలిమి, కలిమి అంటే సంపద. ఈ క్షణంలో నాకు సంపద ఏమిటంటే నా ప్రాణం నిలబెట్టటమే. నా బలం ఏమిటంటే నేను మళ్ళీ బతికి బట్టకట్టి మళ్ళీ ఒడ్డుకు చేరటమే. అటువంటి వాడు ఉన్నాడా అంటే సమాధానం దొరకటంలా. practice లేదు ఆయనకి. గజేంద్రుడికి దైవ చింతన లేదు. ఆ క్షణంలో ఆపద వచ్చినప్పుడు ఒక దైవచింతన ఏర్పడినప్పుడు ఒక ఆలోచన కలిగింది అంటే విన్నాడు ఆయన కూడా. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇట్లా విన్నాను అట్లా ఉంటాడు, అట్లా ఉంటాడని. వాడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు. ఇక్కడ చూడండి చాలా విచిత్రమైనటువంటి అద్భుతమైన పద్యం ఇది. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ పుడుతున్నాడు? దేనిలో లీనమై ఉన్నాడు? దేనిలో మునిగి ఉన్నాడు? పరమేశ్వరుడై ఉన్నాడు. అన్ని, ఈశ్వర అంటే జంతు అనేకమైనటువంటి జంతు జాలాలకి, జీవజాలాలకి ఆయన అధిపతి అయి ఉన్నాడు. అటువంటి వాడు ఎక్కడున్నాడు? నాకు కనపడటం లేదు. దేవుడు అక్కడ ఎక్కడా కనపడటంలా. కాబట్టి వాణ్ని నేను ఏం చేస్తానంటే ఆత్మభవు నా లోపలే ఉన్నటువంటి పరమాత్మని ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈశ్వరుడినే శరణు పొందుతాను అని ఒక అర్థం. ఈశ్వరు నే శరణంబు వేడెదన్ అది రెండో అర్థం. ఈశ్వరున్నే నేను పొందుతాను. ఆ ఈశ్వరున్ని నేను ఈ క్షణాన పొందుతాను శరణు పొందుతాను అని. శరణు పొందాడు. ఏం కదలిక లేదు. ఈ పద్యం పాడినా ఆయన ఏం కదల్లా. మరి ఏం చేయాలి? అప్పుడు అనుకున్నాడు. నా ఇంద్రియాలు చల్లబడిపోయినయి. నాలో మనస్సు పోయింది. నాలో ఉన్నటువంటి జాడ్యాలు నశించిపోయినయి. నాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అరిషడ్వర్గాలు నెమ్మది నెమ్మదిగా పోతున్నాయి. శరీరమా ఇంకా కాసేపట్లో పోయేట్టుగా ఉంది. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెన్. చూడండి, మూర్చ గనక వస్తే ఇక ఇది కూడా అడగటానికి కూడా స్పృహ ఉండదు. కాబట్టి అయ్యేలోగా నేను ఒక పని చేస్తా. అంటే ఆ తెల్లగా ఉన్నటువంటి ఆ మడుగు అంతా ఎర్రగా మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పుష్పాలున్నాయి తామర పుష్పాలు. ఆ పుష్పాల మీద కూడా ఈ ఎర్ర రంగు పడింది. తెల్లగా ఉన్నవన్నీ ఎర్రగా మారిపోయినయి. గులాబీ రంగులోకి మారిపోయినయి. నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి ఆ, ఆ పుష్పాన్ని సే ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెన్ తనువున్ దస్సెన్ శ్రమంబయ్యెడిన్నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపుమని అడిగాడు కాబట్టి ఇక ఏమి పెకలించగలడు అంటే చేయగలిగితే ఆ తొండంలో ఇంకా ఏదన్నా శక్తి మిగిలి ఉంటే ఆ తామర పువ్వును తీసి ఆయన ఎక్కడున్నాడో తెలియదు పక్కన ఈ పక్కన ఆ పక్కన ముందు వెనక ఆ ఆ వెనక ఈ వెనక ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు కానీ నాకు ఎక్కడున్నాడో తెలియదు గనుక దీన్ని ఆకాశంలోకి విసురుతున్నానని ఆ తొండం ఒకటే పని చేస్తున్నది ఆకాశంలోకి ఆ పుష్పాన్ని వదిలాడు ఆ పుష్పం ఏమిటంటే హృదయ పుష్పాన్ని ఇచ్చాడు మనస్సు లేదు ఇవ్వటానికి మాట్లాడటానికి భాష లేదు శక్తి లేదు శరీరం దసిపోయింది ఇంద్రియాలు అలసిపోయినాయి ఆ పరిస్థితిలో ఆకాశంలోకి హృదయ పుష్పాన్ని విసిరినప్పుడు అక్కడ ఏమైంది? ఆ విష్ణువు ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు గానీ ఈయనకి తెలియదు ఇంకా. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరాంబృతసరః పాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమావినోదియగు ఆపన్నప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అను కుయి ఆలించి సంరంభియై. ఎక్కడో వైకుంఠంలో ఓ నగరం ఉంటే ఆ నగరంలో ఎక్కడో మూల ఒక తోట ఉంటే ఆ తోటలో ఉయ్యాల ఉంటే ఆ ఉయ్యాలలో అమ్మవారు ఉంటే అమ్మవారితో కూర్చున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇక్కడ విఫల నాగేంద్రము నాగేంద్రం అంటే ఏనుగు విఫలము భయభ్రాంతమైనటువంటి ఒక ఏనుగు పాహి పాహి అని అరుస్తున్నది ఇక భూలోకంలో నుంచి అది ఆయన చెవిన పడింది ఆ కుయి అంటే కూత వినపడి సంరంభియై తొట్రుపాటు పడ్డాడట నా భక్తుడు ఇంత యాతన పడుతూ ఉంటే నేను లీలావినోదంలో ఎలా ఉంటాను. వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల నేను ఇట్లా ఉంటే లాభం లేదని తొట్రుపాటు పడి ఒక్కసారి లేచాడట లేస్తే అప్పుడు అమ్మవారికి అయ్యవారికి అమ్మవారి కం అయ్యవారి కండువాకి అమ్మవారి చీర కుంకుమ కట్టబడి ఉన్నది అది లీలావినోదంలో ఒక భాగం అంటే మనం విడిపోయి లేము కలిసి ఉన్నామని చెప్పటానికి దానికి కుంగుముడి అంటాం చూడండా కుంగుముడి అంటే అది అది వివాద ప్రోద్ధిత స్త్రీకు చోపరి చలాంచలమైన వీడడు ఎలా వస్తున్నాడో చూడండి ఆయన అప్పుడు ఒక్కసారి లేచాడు లేచి పరిగెత్తడం మొదలు పెట్టాడు విష్ణువు ఈవిడకి అర్థం కాలా ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పటిదాకా హాయిగా మాట్లాడే వాడికి ఏమైపోయింది ఎటు పరిగెత్తుతున్నాడు అని సిరికించెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సందింపడు ఏ పరివారముం జీరడు అభ్రగపతిం బన్నింపడు ఆకర్ణికాంతరధమిల్లము చకనొత్తడు వివాద ప్రోద్ధిత స్త్రీకు చోపరి చలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్సాహం ఎక్కడున్నదంటే అమ్మవారితో మాట్లాడటం కాదు అమ్మవారితో కాసేపు వినోదంగా చమత్కారంగా సమయం గడపటం కాదు ఆయన ఉత్సాహం అంతా తన భక్తుణ్ణి రక్షించాలి చెప్పలేదు ఆమెకు కూడా చెప్పలా సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సందింపడు రెండు చేతుల్లో శంఖము లేదు చక్రము లేదు ఏ పరివారముం జీరడు మీరు రండి మీరు రండి అనటం లేదు అభ్రగపతిం బన్నింపడు గరుత్మంతుణ్ణి రా అనటం లేదు మరి ఎలా వెళ్లాలనుకున్నాడో వెళ్ళిపోతున్నాడు ఆ ఉత్సాహంలో ఆ ఉద్వేగంలో శ్రీ మహావిష్ణువు వెళ్తుంటే వివాద ప్రోద్ధిత స్త్రీకు చోపరి చలాంచలమైన వీడడు అది ఆ కొంగుతో సహా అమ్మవారితో సహా ఆమె వెనక వెళ్ళిపోతున్నాడు ఆమె వెనక పరిగెత్తుకు వస్తున్నది ఆయన ముందుకు వెళ్తున్నాడు గజప్రాణావనోత్సాహియై వెళ్తూ ఉంటే అమ్మవారి మనస్సు ఎలా ఉన్నది ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఆయన దొరక్క దొరక్క దొరక్క దొరికాడు ఈ మందార వనంలో ఉన్నవాడు ఐదు నిమిషాలు ఉన్నాడో లేదో ఎవడో భక్తుడో పెద్ద కేక పెట్టాడు ఈమె పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు ఏమిటో తెలియటం లేదు అయోమయంలో అమ్మవారు పడిపోయి అడిగెదనని కడువడి చను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ విడవిడ చిడిముడి తడవడ నడుగిడు నడుగిడతు జడిమ నడుగిడు ఎడలన్ చూసారా ఆవిడ ఉద్వేగం ఆవిడ ఆవేదన ఇంత ఒక గుర్రపు స్వారీ వలె వెళ్ళిపోతున్నది అడిగెదనని కడువడి చను అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని దగ్గరకు వెళ్తుందట తను అడిగిన తన మగడు నుడువడని చెప్పడని అడుగు ఇడున్ మళ్ళీ వెనక్కి వస్తుందట ముందుకు వెళ్తుంది వెనక్కి వస్తుంది ఆయన చెప్తాడో చెప్పడో అడిగెదనని కడువడి చను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ విడవిడ చిడిముడి తడవడ అడుగు ఇడు అడుగిడతు జడిమ అడుగిడు ఎడలన్ అడుగు వేస్తుంది అడుగు వెనక్కి వస్తుంది ఈ కంద పద్యంలో ఇరవై ఏడు ఢకారాలు ఉన్నాయి అది ఆ వేగంతో అట్లాగే చదివితే తప్ప ఆ పద్యానికి అర్థం లేదు అర్థం చెప్పుకునేటప్పుడు ఇది చెప్పితే అదేదో ఉరికే శబ్దమే అవుతుంది కదా కాబట్టి మొత్తానికి అమ్మవారు ఆ చిడిముడి తడబడి పోతున్నది మొత్తానికి అది లూస్ అయిపోయింది అమ్మవారు విడిపోయినారు ఈయన వెళ్ళాడు ఈయన వెళితే యుద్ధం ఇంకా సాగుతోంది కింద ఈయన దగ్గర ఆయుధాలు లేవు శంఖం లేదు పెద్దగా ఓ పెద్ద భీకరమైనటువంటి శంఖ ధ్వానం చేస్తే అవి రెండూ విడిపోవచ్చు శంఖం లేదు చంపడానికి చక్రం లేదు పరివారం లేదు తనను మోసుకెళ్లడానికి గరుత్మంతుడు లేడు కానీ ఇవన్నీ మనకు భగవంతుడు యోగం వల్ల ఇంత పెట్టాడు గానీ ఆయనకి ఇవన్నీ అవసరమా భగవంతుడు నువ్విది సేవ చెయ్యి ఆ పని చెయ్యి దానం చెయ్యి ధర్మం చెయ్యి ఈ విద్యావరదానం చెయ్యి జ్ఞాన సం ఉపార్జన చెయ్యి నువ్వు నా సేవలో ఉండు అంటే స్వామి సేవలో అంటాం కదా మనం స్వామికి ఎవరన్నా మనం సేవ చేశామా ఎవరైనా ఏ ఒక్కరైనా స్వామి సేవలో పుటపట కెళ్తున్నాం అంటే స్వామి రూపంలో ఉన్నటువంటి అక్కడ పరిస్థితికి స్వామి రూపంలో ఉన్నటువంటి భక్తులకి సేవ చేయటానికి వెళ్తామే తప్ప స్వామికి ఎవరు సేవ చేయలేరు ఎందుకని ఆయనకి సేవ అక్కర్లేదు గనుక ఇక్కడ కూడా అదే అయింది కానీ ఆయన వెళ్ళేప్పటికీ సిరి వెంటన్ ఆ లక్ష్మి వెంట ఏవైతే శంఖము చక్రము గద పుష్పము అలాగే గరుత్మంతుడు ఒకదాని వెంట పరివారము అంతా కూడా ఆ మడుగు దగ్గరికి చేరిని