⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఆ నిజమైన గురువు అగ్ని కార్యం చేసుకొని అగ్నిని ప్రార్థిస్తాడు. ఏమనంటే "నిన్న ఒక బతుకు బతికాను, అనేక శాస్త్రాలు చదివాను, చాలా విషయాలు హృదయానికి తెలిసివై. వీటిని అందుకోవటానికి ఒక్క శిష్యుణ్ణి పంపు" అని అగ్ని దేవుడిని అడిగితే అతడు వస్తాడట. ఆ అడగబోయే ముందు "ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహా" అంటాడు."ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహా" బ్రహ్మచారిణి అంటే వాడు బ్రహ్మము అన్న-- పెళ్లి చేసుకొని వాడు కాదు. నిరంతరము బ్రహ్మము నందు మనస్సుని, చిత్తాన్ని నిరంతరము దానిలో గడిపేటువంటి వాడు, దాని యందు లగ్నము చేసినటువంటి అటువంటి ఒక శిష్యుడు గనుక వస్తే ఆ గురువు గారి జీవితం ధన్యమవుతుంది. ఒక్క శిష్యుడు, ఒక్క వ్యక్తి రోజుకొక్కడు వింటే చాలట. మరి ఈశ్వరానుగ్రహం ఎంత గొప్పది అంటే, ఇదిగో నలభై ఆరేళ్లుగా ఇలా అంటునే ఉన్నాం. అనేక ప్రదేశాలలో అందరూ వింటూనే ఉన్నారు. మనం ఎన్ని యజ్ఞాలు చేసి ఉండాలి? ఎవరు యజ్ఞం చేయాలంటే ఇంకా భగవంతుణ్ణి చూడని వాడు, ఇంకా చూడాలి అనుకునేవాడు, యజ్ఞమే భగవంతుడు అనుకునేవాడు, అవన్నీ చేయాలి. కానీ మన విషయంలో, మనందరి విషయంలో యజ్ఞమే చేయించే, యజ్ఞమే తానైనటువంటి పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారే మన వారైనప్పుడు మిగతా యజ్ఞాలన్నీ చేయవలనా అంటే, చెయ్ లో-లోకరీతిలో చెయ్. కానీ చేయవలసింది ఏమిటంటే, నీ జ్ఞానాన్ని వరదానం చెయ్. ప్రపంచానికి ఇచ్చేసేయ్. అది నీది కాదు, ఇక్కడికి వచ్చి నువ్వు సంపాదించుకున్నావ్. You acquired the wealth. దాన్ని నువ్వు ఎవరికి అందించాలో, ఎవరికి చిందించాలో, ఎక్కడ చిందించాలో దానిని చింతిస్తూ తీసుకొని వెళ్ళమని సత్యసాయి భగవానుడు చెప్పారు. కనుక అది నిజం కనుక, తద్భావానికి అనుగుణంగా ఇవాళ మనం భాగవతాన్ని ఆ అనేక కోణాలలో ఇప్పటిదాకా భాగవత ప్రమాణం, భాగవతాన్ని అనేకమంది చెప్పారు. ఒకళ్ళం కాదు, ఒక్కనే కాదు. ఒకరు పురాణ వాఙ్మయంగా చెప్పారు. కథని కథగా చెప్పారు. చాలా అవసరం. ముందు కథ తెలియాలి కదా. కథని భావోద్వేగంతో చెప్పారు. అవును కాస్త చెప్పే వాడికి కూడా ఉద్వేగం కలిగితే, వినే వాడికి కూడా ఉద్వేగం కలుగుతుందని దానిని హరికథగా చెప్పాడు. అయిపోయింది. ఇది గ్రహించలేని వాడికి బుర్రకథగా చెప్పాడు. అంటే వాడికి మెదడుకి ఆ బుర్ర, బుర్ర దాకా వెళితే ఆ కథ చెప్తే చాలు. హరికథ అయింది, బుర్రకథ అయింది, పారాయణం అయింది, అన్నీ అయింది. మరి అసలు ఇదేమిటి అని. భాగవతంలో చివరి రెండు ప్రధానమైనవి. మొదటి మూడు ఆ రెండికే ఆధారమైనవి. చివరి రెండు ఏమిటి? త అంటే తత్వం, ము అంటే ముక్తి. అంతే కదా. పరీక్షిత్ మహారాజుకి "నీకు మరణం ఉండదు, నువ్వు ఇంకో రెండొందల ఏళ్ళు ఈ భరతవర్షాన్ని పాలిస్తావు" అని చెప్పడానికి శుకదేవుడు జ్యోతిష్కుడు కాదు. అసలు ఉండడు. ఉండడు అని నిర్ణయం అయిన తర్వాత జరిగింది భాగవతం. కాబట్టి ఆయన జీవితకాలం ఇంకెంత? ఏడు రోజులు మాత్రమే. మరి ఏడు రోజుల తర్వాత అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు భగవంతుడు అనుకుందాం. ఏం చేసుకుంటాడు? ఎవరికో అప్పజెప్పి వెళ్ళాల్సిందే. లేదు, ఇప్పటివరకు కలగని సర్వానందము ఇచ్చాడనుకుందాం. అది వదిలిపెట్టవలసిందే. మరి వదిలిపెట్టవలసినవి, తన నుంచి విడిపోబోతున్న వాటన్నింటికీ శుకదేవుడు వచ్చి భాగవతం చెప్పాలా? "నువ్వు వెలుగు వైపు వెళ్ళవయ్యా, ఇగ జ్ఞానం సంపాదించు, దృక్కుము కరణే, వ్యాకరణం మొదలు పెట్టు, సంస్కృతం చదవటం నేర్చుకో, సంస్కృతంలో మాట్లాడితే చాలా గౌరవం." ఇవన్నీ చెప్తే పరీక్షిత్ మహారాజు చేయగలడా? చేయగలడేమో. కానీ ఎన్ని రోజులు? ఏడు రోజులే. ఇక వైరాగ్యం ఏర్పడింది. వైరాగ్యం ఏర్పడిందంటే శరీరమే పోబోతున్నది కదా. ఇక ఉండేది లేదు. అన్నీ, అన్నీ పోయినా నా శరీరం ఉంటే చాలు అనుకునే స్థితి నుంచి అన్నీ ఉన్నా నా శరీరం పోయినా పర్వాలేదు అనే స్థితికి పరీక్షిత్ మహారాజు వచ్చాడు. వైరాగ్యంకి వచ్చాడు. వైరాగ్యం వచ్చిన తర్వాత ఆయనకి తెలియవలసింది తత్వమే. తత్వం ద్వారా ముక్తి. ముక్తి అంటే ఏంటో చివరి రోజున మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. కాబట్టి ఇవాళ, ఇవాళ నుంచి, మధ్యాహ్నం నుంచి విషయంలోకి మనం పూర్ణంగా వెళుతున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన భాగవతమే మళ్ళీ చెప్పబడదు. కథా కథనంగా చెప్తూనే దానిలో దాగి ఉన్నటువంటి పారమార్థికమైన ఆధ్యాత్మిక సంపద ఏదున్నదో తత్వభూమికలో దాన్ని మనం బయటికి తీసుకోవాలి. ఆ తత్వాన్ని మనం తెలుసుకోకపోతే ముక్తి లేదు. ఇంకా అది కావాలి, ఇది కావాలి. ఈ పారాయణం చేశాం, దాని వల్ల ఈ లాభం కలిగింది. కలుగుతాయి. కానీ అశాశ్వతమై which are transient and impermanent. जो जाने वाले वो आएगा, जो आएगा वो जरूर जाएगा. ఈ आए-आएगा-जाएगा మధ్యలో जानना बहुत जरूरी है. ఆ जानना అంటే మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటానికి తెలివితేటలు కావాలి. తెలివితేటలు కావాలంటే జిజ్ఞాస కావాలి. జిజ్ఞాస కావాలంటే సంస్కృతి కావాలి. సంస్కృతి కావాలంటే సంస్కారం కావాలి. సంస్కారం కావాలంటే మా-మూలవాసనలు బాగుండాలి. మూలవాసనలు బాగుండాలంటే జన్మ బాగుండాలి. జన్మ బాగుండాలంటే కర్మలు మంచివి చేసి ఉండాలి. అతనికేమండీ అదృష్టవంతుడు ఎంత గొప్ప జీవితం వచ్చిందో అంటాడు. అదృష్టమంతా అతని సంపదలో ఉన్నదా, జ్ఞానంలో ఉన్నదా? అదృష్టమంతా అతని సౌందర్యంలో ఉన్నదా, అతని శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సుఖములో ఉన్నదా అంటే, అందుకే పోతన గారు భాగవతం చెప్తూ "చదువులన్నీ చదివి చావంగానేటికి చావులేని చదువు చదువవలయు" అన్నాడు. మిగతా ఇప్పుడు మనం చదువుకున్న నాతో సహా, ఇందాక ఆయన చెప్పారు కదా, అది చదివారు, ఇది చదివారు అని, అవన్నీ జీవితాన్ని నడపటానికి, దొక్క నింపుకోవటానికి, కాలం, అదృష్టం, యోగం కలిసి వస్తే ఇంకో నలుగురి దొక్కలు నింపటానికి ఆ చదువు ఉపయోగిస్తుంది.అంతేతప్ప మనసుని నింపడానికి హృదయాన్ని విశాలమయం చేయటానికి ఆ భావాంబుధిలో మునకలు వేయటానికి కావలసినది తత్వార్థ విచారణ గనుక అటువంటి తత్వం వైపు మనం ప్రస్థానం చేయాలి. మనందరం ఆ ఇక్కడ ఒక వంద మంది ఉంటే నా కళ్ళ ముందు ఒక ఐదారుగురు యువకులు కనిపిస్తున్నారు. నిజమైన యువకులు. ఆ యవ్వనాన్ని దాటి మధ్య వయసుకు వచ్చిన వాళ్ళు ఇంకో పది మంది కనిపించారు. మరి మిగతా వారంతా ఎవరు కనిపిస్తున్నారు? అంటే జీవితాన్ని కాచి, జీవితాన్ని వెడబోసి, జీవితాన్ని అనుభవించి, జీవితం యొక్క పరిమితులు తెలుసుకుని, నేర్చుకున్న దాని యొక్క పరిమితి తెలుసుకుని, ఇక నేర్వవలసినది ఏదన్నా అసలు ఉన్నదా? అన్నటువంటి ప్రశ్న పరంపరలతో కూర్చున్నటువంటి వారే అధిక భాగం గనుక వారికి ఇవ్వాళ మనం చెప్పవలసింది భాగవత కథ మాత్రమే కాదు, కథ చెప్పాలి. కథ చెప్పకపోతే, పాలే లేకపోతే వెన్న ఎట్లా? వెన్నే లేకపోతే నెయ్యి వచ్చేదెట్లా? కానీ పాలలో నుంచి నెయ్యి వస్తుంది గాని నేతిలో నుంచి పాల చుక్క పుట్టదు. irreversible process. అందుకని ముందు అంగవతి ఉపాసన చేయాలి. అంగవతి ఉపాసన అంటే స్వామి, స్వామి యొక్క సౌందర్యం, స్వామి యొక్క నడక, స్వామి యొక్క దివ్యమైన చూపులు, హస్తాభయం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ అది గడపటం. ఇక రెండవది అన్యవతి ఉపాసన. ఇవ్వాళ స్వామి దేహపరంగా లేరు. మనమంతా చూశామని చెప్తున్నాం, చూడని వారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా అంటే ఈ ఫోటోని ఆధారం చేసుకోవాలి. CD ని ఆధారం చేసుకోవాలి. బొమ్మని ఆధారం చేసుకొని బ్రహ్మమును పట్టుకోవాలి. ప్రతిమా ఈశ్వరః అంటే అన్యంగా ఆలోచిస్తూ భావంలో నుంచి బాబాను చూడాలి. అది దాటాం. మరి ఇప్పుడు ఏం చేయాలి అని నిదానవతి ఉపాసన. అంటే మళ్ళీ గ్రామీణ స్త్రీలు, మూలాలు మనవన్నీ గ్రామీణంలోనే ఉన్నాయి పట్టణంలో ఏం లేదు. ఆ ఉన్నదంతా ఏంటంటే పాలు ఉండాలి, పాలు కాల్చాలి, అది మీగడ కట్టాలి, దాన్నుంచి తోడు పెట్టాలి, చిలకాలి. ఆ చిలుకుతున్నప్పుడు ఒక rhythm, ఒక balance తో చిలకాలి. ఆ లోపల ఆ చెక్కవరల కూడా వేడి పుట్టినప్పుడు దానిలో నీళ్ళు చల్లుతూ చేయాలి. అది వెన్న తీసే ప్రక్రియ మీ అందరికీ మేము చెప్పక్కర్లే. You are all adept in this. బాగా చేయగలరు. కానీ ఒకేసారి తీసుకొని గబగబా కొత్త కూడలం చేసినట్టు అయితే ఏమీ రాదు. కవ్వం మాత్రం ఒక్కటే బయటకు వస్తుంది. ఆ వెన్నను తీసే ఉడుపు, అందుకనే వైజాగ్ లో చెప్పిన దానికి స్వామి పెట్టిన పేరు శ్రీభాగవత నవనీతము అని చెప్పు అన్నారు. ఆ నవనీతం నెమ్మదిగా, ప్రశాంతంగా, అర్థమయ్యేట్లుగా, అర్థం కావలసినట్లుగా, ఏది అర్థమైతే మనకు ఆనందం కలుగుతుందో ఆ విధానంతో ఇటు సాహిత్య సంగీత సమన్వయం చేస్తూ భాగవతాన్ని మనం పాడుకోవాలి. భాగవతాన్ని అనుకోవాలి. భాగవతాన్ని విశ్లేషించుకోవాలి. భాగవతాన్ని విశదీకరించుకోవాలి. భాగవతాన్ని విచారణ చేయాలి. ఎందుకంటే ఒక కారణంతో మనకు దేహాలు వచ్చినాయి. కాళ్ళు చేతులు ఉన్నాయి గనుక కరచరణాది అవయవాలతో ఆ కారణం నుంచి చారణంలోకి వచ్చేసాం. చారణంలో నుంచి విచారణలోకి వెళ్ళాలి. విచారణలో నుంచి మనం తారణంలోకి వెళ్ళాలి, ముక్తి వైపు వెళ్ళాలి. కాబట్టి ఈ ఏడు రోజులు శుక మహాదేవుడు శుకాధూత పరీక్షిత్ మహారాజుకి ఏం చెప్పాడు? తాత్వికమైన చింతనా భూమికలో ఈ భాగవతాన్ని ఎలా ఆవిష్కరించాడు? ఫలితం పొందాడు. నీకు సంపదలు వస్తాయి, గోసంపదలు వస్తాయి, వెండి బంగారాలు వస్తాయి, చీని-చీనాంబరాలు వస్తాయి, గోసంపద పుడుతుంది. ఇది ఏమీ చెప్పకుండా-- చెప్తూ భాగవతాన్ని మీరు కల్పవృక్షంగా భావించండి. అనగానే మనకి కొన్ని కొన్ని mistaken impressions generations గా తరతరాలుగా చెప్పబడినది ఏంటంటే కల్పవృక్షం అంటే అక్కడికి వెళ్ళి కోరిక కోరితే అది ఆకు రాలుస్తుందని, మన కోరిక తీరిపోతుందని, అన్నింటినీ ఇచ్చేది కల్పవృక్షం అని, ఇవ్వద-వలసిన దాన్ని ఇచ్చేది కామధేనువు అని చెప్తూ వచ్చారు. కానీ కల్పవృక్షం చేసే పని అది కాదు. మన అర్హతను బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, జన్మ సంస్కార విశేషాన్ని బట్టి ఆ కల్పవృక్షం మనం వెళ్ళి అడిగితే అది ఇవ్వదు. మనకి ఏం కావాలో దానికి తెలుసు గనుక అది రాలుస్తుంది. భగవంతుడు కూడా అంతే. మనవన్నీ వరాలు ఆయన అడుగుతాం, స్వామి ఇస్తూ ఉంటారు. అడిగి పొందేవన్నీ వరాలైతే అడక్కుండా పొందేదాని పేరు కరుణ. వరాల-- మానవుడికి మనసు ఉన్నంత కాలం కోరికలు పుడుతూనే ఉంటాయి, తీరుస్తూనే ఉంటారు. మళ్ళీ పుడతాయి, మళ్ళీ తీరుస్తారు. కానీ ఇక చాలు. పరితృప్తీం యంగతిం జ్ఞానలక్ష్మీ జన్వత్ పరిణామం ముమ్మో దయతో శ్రీ కాలహస్తీశ్వరా అంటాడు దుర్జటి. చాలు ఇంకా నాకేం అక్కర్లేదు అనే స్థితికి వస్తే అది నిజమైనటువంటి వైరాగ్యం. అటువంటి ఆ వైరాగ్య భూమికలో నిలకడ చెందటానికి ఇవాళ నేపాల్ నుంచి, అమెరికా నుంచి అట్లాగే అనేక ప్రాంతాలు ఆంధ్రదేశం నుంచి వచ్చిన మనందరినీ కూడా ఒక సూత్ర బంధనం చేశారు స్వామి. ఆ సూత్ర బంధనం మైత్రి బంధనం కావాలి. ఆ మైత్రి బంధనం అంతా కూడా భగవంతుని యొక్క దివ్య నామ సంకీర్తన విశేషంగా మిగిలిన ఖండ జీవితం అంతా కూడా అలాగే సాగాలి అని మనం భాగవతాన్ని వినాలి. ఇవ్వాళ మనం చేయవలసిన ప్రమాణం అదే. స్వామి, అది కాదు ఇది కాదు స్వామి అన్నారు ఒకసారి. సిరిసంపదలకేముంది? ఎన్ని ఇచ్చినా చాలదు. భోగభాగ్యాలు అంతే. కీర్తి అంతే. కానీ మీరు కోరుకోవాల్సింది నా దగ్గరికి వచ్చి మీరు ఏం కోరాలో తెలియటంలే మీకు. స్వామి! మీరు ఎప్పుడైనా...మా జీవిత కాలంలో మమ్మల్ని దగ్గరకు తీసి నువ్వు నా భక్తుడివి అంటే చాలు అని అనిపించుకోండి అన్నారు. మనం అంటున్నాం ఆయన సత్యసాయి డివోటీ అంటున్నాం. స్వామి ఎవరినన్నా పిలిచి వీడు నా భక్తుడు అని చెప్పారా? ఇంతవరకు చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే ఆ డిజర్వ్డ్నెస్ కోసం మనం ప్రయత్నం చేయాలి. చేస్తే తప్పకుండా వీడు నా నిజ భక్తుడు అంటారు. కాబట్టి భాగవత ప్రమాణం కూడా ఇవాళ ఎప్పుడి పరీక్షిత్ మహారాజు మనం చూశామా? జనమేజయుడిని చూశామా? శుకదేవుడిని చూశామా? చూడలేం. అటువంటి ఆయన వేదవ్యాసుల వారు దీనికి భాగవతము అని పేరు పెట్టలేదు. దీనికి ఆయన పెట్టినటువంటి పేరు ఏమిటంటే శ్రీ జయం అని పేరు పెట్టారు. శ్రీ జయం. జయం అనేటువంటిది సంస్కృతంలో ప్రధానంగా భారతీయ సంఖ్యాశాస్త్రం ప్రకారం వెనక నుంచి చదవాలి. చదివితే ఆ జ అనేటువంటి బీజాక్షరానికి పొటెన్సీ ఎనిమిది. ఆ యం కలిపితే ఆ అక్షరానికి ఒకటి. జయం అంటే ఎనభై ఒకటి. వెనక్కి తిరిగి చదవాలి. అందుకని జయం వెనక్కి తిరిగి తిప్పి చదివితే దాని పేరు, దాని అంక్య విలువ పద్దెనిమిది. కనుక పద్దెనిమిది పురాణాలు. ఆయన ఏం చేసినా పద్దెనిమిదే. అష్టాదశాధ్యాయని అధ్యాయాలు పద్దెనిమిది. ఆ పద్దెనిమిది అంటే సంస్కృత వాంగ్మయంలో పరమేశ్వర స్వరూపానికి సంకేత శబ్దం అది. కాబట్టి అటువంటి ఆ భాగవతాన్ని పదకొండు స్కంధాలుగా స్కంధము అని పేరు దానికేమో పదకొండు అధ్యాయాలు అనొచ్చు, పదకొండు పర్వాలు అనొచ్చు. అక్కడేమో పర్వం అన్నాడు భారతంలో, ఇక్కడ స్కంధము అన్నాడు. స్కంధము అంటే కొమ్మ. బ్రాంచ్. దేనికి కొమ్మ? మూలమైనటువంటి కల్పవృక్షానికి పద్దెనిమిది కొమ్మలు ఉన్నాయి గనుక ఇది కల్పవృక్షమే. ఈ కొమ్మని పట్టుకోవాలి. స్వామి చెప్తారు, పట్టిన పట్టు పట్టనీయ పట్టెతివి పట్టు విడునందాక అట్టే ఉండు. అది బాగుంది. మరి దేన్ని పట్టుకోవాలి అంటే? దేనిని పట్టుకుంటే మనకి పట్టు దొరుకుతుందో, మన పిడికిలి ఎంతవరకు పట్టుకోగలదో, కండాన్ని కాండాన్నికి నమస్కారం చేయగలం, కౌగలించుకోగలం. బ్రాంచ్ కొమ్మ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోగలం. రెమ్మని రెండు వేళ్ళ మధ్య పెట్టగలం. ఆకును రెండు ఆ ఈ చేతి వ్రేళ్ళ మధ్యలో పెట్టగలం. అంటే ప్రమాణాన్ని బట్టి పరిణామం, పరిణామాన్ని బట్టి ప్రమాణం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గనుక ఇవాళ మనకి ఇవ్వబడినటువంటి ఏడు రోజుల్లో ఒక హాఫ్ డే అయిపోయింది. ఇవన్నీ తెలుసుకోకుండా నదిలోకి దూకంగా గోమతి నది వెళ్ళినప్పుడు బురద ఎక్కడ లేదు, కర్దము ఎక్కడ లేదు చూసుకున్నామా? అకర్దము బురద లేని చోటికి వెళ్ళామా? ఎంతవరకు మునగగలుగుతామో మునిగామా? అన్నీ చెక్ చేసుకున్నాం కదా. ఆ పూర్వరంగం తెలియకపోతే మునుగుతాం కానీ మళ్ళీ తేలం. అందువలన ఈ భాగవతం అనేటువంటి దానిలోకి మునగబోయే ముందు ఈ నేపథ్యం అంతా తెలుసుకుంటూ మనం చేయవలసినటువంటి ఆ పని ఏమిటంటే దీనిని ఉపాసనగా వినండి. మహత్తరమైనటువంటి విషయాలన్నీ కూడా అప్పటికి నేనేమి షెడ్యూల్ తయారు చేసుకోను. స్వామి ఒకసారి నవ్వుతూ అన్నారు, "ఏం లేదు ప్లగ్ పుడపర్తిలో అలా అలా లోపలికి ప్లగ్ పెట్టగానే మాట్లాడుతూ ఉంటాడు" అని అన్నారు స్వామి. ఆ రెండోది ఒకాయన అన్నారు, "స్వామి మీరు మూర్తి గారిని కూడా ప్రశాంతి నిలయంలో చాలా మాట్లాడించారు. ఇంకా ఇంకా మాట్లాడించాలంటే?" స్వామి గొప్పగా ఓ మాట అన్నారు. అది ఆనందం కలిగించింది. అక్కడ మాట్లాడాం అది వేరు. ఎవరో అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, "అట్లానా? మూర్తి ఇక్కడ కొద్ది రోజులు మాట్లాడుతూ ఉంటాడు. అసలు మూర్తి ఎక్కడ మాట్లాడుతాడో అక్కడికి నేను రోజూ వెళ్తూనే ఉన్నాను" అన్నారు స్వామి. ఇవాళ ఇవాళ ఈ మాట్లాడిస్తున్నది ఎవరంటే సత్యసాయి పురుషుడే. ఈ మాటలన్నీ మనకోసం మీతో పాటు నేను కూడా వింటున్నా. అవన్నీ నేను తెలిసి చెప్తున్నానని ఏయ్ అనుకోకండి. అక్కడి నుంచి వినపడతాయి. నేను ప్రథమ శ్రోతని మళ్ళీ మీకు అందిస్తా, ఈ మైక్ అందిస్తున్నట్టుగా అనుకుందాం. కాబట్టి చమత్కారంగా అహంకార మమకార రాహిత్య భావనా స్థితిలోకి మనం వెళ్తూ మనం ఒక- సమయం చూసుకోండి ఇక్కడ షెడ్యూల్ అయింది కాబట్టి. కరెక్ట్ గా పన్నెండు గంటల పదిహేను నిమిషాలు. చూశారా? ఇప్పుడు చూశాం గడియారం. ఈ భాగవతాన్ని వ్యాస భాగవతాన్ని సంస్కృతంలో వారిని పారాయణం చేయనివ్వండి. అది వాళ్ళు చేయాలి. ఆ నిశ్శబ్దంలో నుంచి దాన్నుంచి రావలసిన తరంగాలు మనకు అందుతాయి. మనం ఏం చేయాలి అంటే నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ అనబడేటువంటి ముగ్గురు మహానుభావులు, పోతన గారు రాసుకున్నారు ఈ మాట. నా పూర్వ పుణ్య విశేషం చేత భాగవతాన్ని తెరిగించకుండా వదిలిపెట్టేశారు. అందువలన వ్యాసులవారు రాసినటువంటి భాగవతాన్ని నేను తెరిగించి తెలుగులో రాసి నా జాతి రుణం తీర్చుకుంటాను అన్నాడు. ఇది భగవంతుడు ఆయనకి మాత్రమే ఇవ్వబడినటువంటి యోగం. ఆ అవకాశాన్ని తెలుగువారి-తెలుగుల పుణ్యపేటి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే తెలుగువారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే పోతన గారు ఆ భాగవతాన్ని అలా రాయగలిగారు. అలా రాశారు. రాసి మనకిచ్చేశారు. ఆ భాగవతాన్ని వ్యాస భాగవతానికి పోతన భాగవతానికి ఏమిటండీ తేడా అని అంటే వ్యాస భాగవతం లేకపోతే పోతన గారి భాగవతమే లేదు. కదా, అది మూలం. ఒకటి, వ్యాస భాగవతంలో లేనివి పోతనగారు భాగవతంలో చాలా చెప్పారు, చాలా అందంగా చెప్పారు. ఉదాహరణకి వానావతార ఘట్టం ఒకటుంది. అందులో పోతన గారు చెప్పినంత కథ వ్యాస భాగవతంలో లేదు.అసలు నిజానికి వ్యాస భాగవతాన్ని నాలుగు శ్లోకాలలో పూర్ణం కూడా చేశారు. నాలుగు పంక్తులలో ఏకశ్లోకి, ఒక్క శ్లోకంలో నాలుగు పంక్తులు భాగవతం అయిపోయింది అన్నారు. కానీ తెలుగువారి కోసం తాను అనుభవించిన ఆధ్యాత్మిక ఆనంద అనుభూతిని భక్తి పారమ్యంలో మందార మకరంద విశేషంగా అందమైనటువంటి తెలుగులో సాంస్కృతిక పరమైన అంటే సంస్కార గతమైన లేదు సంస్కృత భాషతో కూడినటువంటి జటిలమైనటువంటి భాష లేకుండా అచ్చ తెలుగులో ఈ భా-గ-వా-త-ము అనబడేటువంటి దాన్ని అన్ని స్థాయిలలోనూ అనేక కథా కథనాల రూపంలో చెప్తే వామనావతార ఘట్టంలో వ్యాసుల వారు మీరు వారిని అడిగితే చెప్తారు చదివినప్పుడు. పారాయణం చేసేవారికి కూడా తెలుస్తుంది ఆ విషయం. వామనుడు వెళ్ళాడు తల్లి అదితి వాకిట్ లోకో బయటకో వెళ్ళిన బిడ్డ రాలేదే అని అలా ఎదురుచూస్తూ ఉండిపోయింది అని రాశారు వ్యాసులవారు. సరే ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదు? తిరిగి రానంత పని ఏం చేశాడు? వ్యాసులవారు రాయలా. ఆ రచన అంతా చేసినటువంటి వారు తెలుగువారైనటువంటి పోతన బొమ్మిర పోతనామాత్యుడు. ఆ తల్లి యొక్క హృదయాన్ని మాతృ హృదయానికి ఒక శాంతిని కలిగించేటువంటి రీతిలో ఒక దాన ప్రక్రియని, దాన వైభవాన్ని, దాన గుణశీలతని, పరమాత్మ యొక్క ఆనందము యొక్క మహా ప్రజ్ఞా భూమికి ఆవిష్కరిస్తూ వామనావతార ఘట్టం మనం చదువుకుంటాం ఈ కథా గమనంలో. కాబట్టి తెలుగువారి యొక్క పుణ్యానికి గుర్తు ఏది అంటే భాగవతమే. తెలుగువారికి రామాయణం రాసినటువంటి వారు వి-విజయవాడ విశ్వనాథ సత్యనారాయణ గారు. శ్రీమద్రామాయణ కల్పవృక్షం. ఇది రెండవది. Suniye hum yahan pravachan ho raha hai aap jara suniye agar kuch aur baat karni hai toh aap jara bahar jaake kar lijiye. Chinta mat kijiye abhi ant ko aa gaye hai hum. కాబట్టి భారతం మూడు భాషల్లో ముగ్గురు మహా కవులు వంద వంద ఏళ్ళు, మూడు వందల ఏళ్ళల్లో ముగ్గురు ఒకరోజు కూర్చొని రాయలా. నన్నయ్య గారు రాసిన వంద ఏళ్ళకి తిక్కన, తిక్కన గారితో-తో-తో ఎర్రాప్రగడ. మూడు వందల ఏళ్ళు పట్టింది. అది తెలుగువారు మాత్రమే చేసుకున్న ఒక అదృష్టం భారతం. రామాయణం, శ్రీమద్రామాయణ కల్పవృక్షం విశ్వనాథవారు రాశారు. శ్రీ మంజు శిఖ భక్త రక్షణ కళా శ్రీ చుంచు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్షలక్ష్మి మాణిక్య వినోద్ర మేఘల కటాక్షి భూత నిహారురు శ్రీమంతంబు వైపు వచ్చు వెలుగు నొక్కడే సేవింతు విశ్వేశ్వరా! అంటూ ప్రారంభించారు ఆయన. ఇక మూడవది ఇదిగో పోతనామాత్యుడు భాగవతం. భారతం, భాగవతం, రామాయణం తెలుగువారు ఆనాడు గనక కవిత్రయము పోతన, విశ్వనాథవారు రాసి ఉండకపోతే, ఇవాళ మనం సంస్కృతం తెలిస్తే తప్ప భాగవతం చెప్పలేని పరిస్థితి. కాబట్టి భాగవతంలో ఏముందో మెరుగులు దిద్దుతూ వెళ్లారు. అది కేవలం మధుర భక్తి మార్గంలో చెప్పారు. పోతన గారు ద్వైత-అద్వైత మార్గంలో చెప్పారు. ద్వైతం చెప్పారు, అద్వైతం చెప్పారు, శంకర భాష్యం చెప్పారు. ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఉదాత్తమైనటువంటి వైఖరిలో పరా, పశ్యంతి, మధ్యమా వైఖరి అని ఉన్నాయి. ఏదైనా విషయం చెప్పాలి అంటే చెప్పే వాడికి ఏముండాలో ప్రమాణం ఉంటుంది. చెప్పడం అంటే ఏదో చెప్పడం కాదు కదా. రాయటం అంటే ఏదో రాయటం కాదు కదా. చెప్పే వాడికి ఏముండాలి అంటే పరా, చూడవలసిన దానిని పశ్యంతి, చూసి మధ్యమా, అనుభవించి వైఖరి, చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ వాక్కుకు బలం ఉంటుంది. మరి అనే వాడికి సరే, మరి వినే వాడికి ఏం కూడా ఉండాలి అంటే శ్రవణ యోగం ఉండాలి. చిత్త ఏకాగ్ర స్థితిలో మీకు ఈత ఆకు ఉంటుంది. ఈత ఆకు చివర ఒక ముల్లు ఉంటుంది. ఆ ముల్లు యొక్క పశ్చభాగం గనక గుచ్చుకుంటే నాలుగు రోజుల దాకా నొప్పి తగ్గదు. కుశాగ్ర బుద్ధి అంటాం, దర్భ చివర ఒకటుంటుంది అట్లాగే. కాబట్టి ఆ అత్యున్నతమైన ఏకాగ్ర స్థాయిలో గనక ఇది వినగలిగినట్లయితే, అది భాగవతం కానివ్వండి, భారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ జాతి సంపాదించుకున్నటువంటి కథలనిసి. ఎవరన్నా మనకు వంద రూపాయలు ఇస్తే అది అప్పటికి ఎన్ని చేతులు మారిందో, ఇది ఇంకా ఎన్ని చేతులు మారుతుందో, తిరుగుతూనే ఉంటుంది, భ్రమిస్తూనే ఉంటుంది. కానీ జరిగేది ఏమిటంటే కథలనిసి. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. అట్లాగే ఉంటుంది. కానీ అన్నింటినీ కదిలిస్తుంది. అటువంటి పురా-పురాణ వైభవ వాంగ్మయాన్ని మనం నిరంతరము దర్శించుకోవటానికి, మాట్లాడుకోవటానికి, ఇవాళ సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మనం ఈ ఏడు రోజులు తెలుగు భాగవతం చెప్పుకోబోతున్నాం. ఇది మనం చేసుకున్న పుణ్యం. తెలుగు భాగవతము, సంస్కృత భాగవతము ఆ రెండూ కాక ఇంగ్లీష్ భాగవతం అంటూ లేవు. భాగవతం అంటూ ఉంటే అది ఒక్కటే. అది భక్తుల కథ, భక్తులతో కూడిన భగవంతుని కథ, భగవంతుడితో కూడిన మనందరి భక్తుల కథ. ఇటువంటి పూర్ణ అద్వైత భావనా స్థితిలో మనందరం కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనటానికి స్వామి సంకల్పించారు. వారు సంకల్పించిన తర్వాత వెనక్కి వెళ్ళటానికి, ఆగిపోవటానికి కారణాలేవి ఉండవు. పిడుగులు రాని, ఎన్ని అలజడులు కలగని, జడివానలు కురియని, నా వాక్కు నిత్యమై, సత్యమై, శాశ్వతమై, శిలా సదృశమై, గంభీరంగా ఒక సముద్ర మధ్యంలో ఒక గండ శిల ఎలా ఉంటుందో నా సంకల్పం వజ్ర సంకల్పం అన్నారు స్వామి. ఆ వజ్ర సంకల్పం ఏమిటో మనం ఇవాళ అనుభవిస్తున్నాం. అటువంటి దయామూర్తి, కరుణాపూర్ణ సుధాబ్ధి అయిన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, సాయంకాలం ఖచ్చితంగా నాలుగు గంటల పదిహేను నిమిషాలకి బయట ఏం జరిగినవి అండి మన ప్రవచన కార్యక్రమాన్ని మనం వేగవంతం చేసుకోకపోతే చివరిలో ఎక్కడో మిగిలిపోతాం. చెప్పవలసినవేవో ఆగిపోతాయి. దానికి టైమ్ అంటూ ఉండదు. ఒక పది నిమిషాలు అటు అవుతుంది, ఇటు అవుతుంది. కానీ అన్నింటినీ చిత్త ఏకాగ్ర స్థితిలో ఎవరికి వారమే పరీక్షిత్ మహారాజు అనుకుందాం. ఎవరికి వారమే మనకి యోగం కలిగింది కదా అనుకుందాం. అందునా నైమిశారణ్యం అనేటువంటి ఒక మహా పుణ్య క్షేత్రంలో ఎక్కడ శౌనకాది మునులు, సూత మహాముని కొన్ని వేల మునులందరూ తపస్సు చేసినటువంటి ఈ పవిత్ర భూమి మధ్యలో కూర్చొని సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణాల దగ్గర కూర్చొని సహజంగా స్వామి భక్తులమైన మనందరం కూడా ఇవన్నీ మాట్లాడుకోవటం స్వామి అనుగ్రహం తప్ప ఇదేమీ Miracle కాదు. స్వామి అనుగ్రహము అమృత వృష్టి వలె మనందరిపై కురియు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.