Skip to content
Transcript తెలుగు
మందస్మిత మనోహరం వందారు జన వందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శిలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శ్రీమద్భాగవతం మహాయజ్ఞంలో మనం మరొక మలుపు మరొక మెట్టు మరొక లోతు చూట్టానికి మనందరం సమావేశమైనాం [గొంతు సవరించిన శబ్దం] నిన్నటి దాకా భాగవతం అంతా కూడా ఆత్మవిచార మార్గాన్ని గురించి ఆత్మ అంటే ఏమిటి? మనసు అంటే ఏమిటి? శరీరాలు అంటే ఏమిటి? అవన్నీ ఎందుకు వస్తాయి? అవన్నీ ఎందుకు ఉంటాయి? ఉండి ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా ఒక తార్కికమైనటువంటి ఆధ్యాత్మిక భూమికలో భాగవతం ప్రారంభమైంది. మరి ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి మనసో, బుద్ధో, చిత్తమో, అహంకారమో ఇవన్నీ translate అయినాయా భాగవతంలో ఏదన్నా పాత్రలు ఉన్నాయా? అటువంటి వాళ్ళు వీటన్నింటినీ ఎవరైనా ఆచరించారా? మనసు చెడ్డది, మనసు మంచిది, మనసు చలచ్ఛలితమైనది అని చెప్పుకున్నామే. మనసు పాత్రల యందు ప్రవేశించి అది ఎట్లా జీవితాలను అతలాకుతలం చేసింది. కానీ కడగా సాయుజ్యం వైపు అది ఎలా దారితీసింది అనేటువంటి విషయాన్ని మనకి నిజానికి ప్రహ్లాద చరిత్ర చెబుతుంది. ప్రహ్లాద చరిత్ర చాలా అందమైనటువంటి చరిత్ర. ఎందుకంటే మనం వరాహావతారాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు భూమిని సముద్రం లోపలికి తీసుకెళ్లాడని హిరణ్యాక్షుడు. మళ్ళీ భూమిని తెచ్చి పైన పెట్టడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి ఒక చాపగా చుట్టి తన రెండు కోరల మీద నిలబెట్టి ఇంక వాడు భూమిని ఎత్తుకొని వెళ్లిపోయినాడు. కానీ వాడి కన్నంతా కూడా బంగారం మీద ఉంటుంది. హిరణ్యము అంటే బంగారం. బంగారం మామూలుగా ఒక భౌతిక స్థాయిలో చూసినట్లయితే అది మనం ఆభరణాలకు వాడేటువంటి బంగారం అది ఒకటి. నిజానికి అసలు బంగారం అంటే ఏమిటి? అని అది అధ్యాత్మలో స్థాయిలో spiritual level లో బంగారము అంటే శుద్ధ చైతన్యము అని. శుద్ధ చైతన్యం వైపు వాళ్ళు వెళ్ళక భౌతిక స్థాయిలో ఆగిపోయిన కారణంగా హిరణ్యాక్షుడు అంతటి темпериతనానికి ఒడిగట్టి చివరికి వరాహావతారం వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో వాడు మరణించాడు. మనం మొదటి రోజే చెప్పుకున్నాం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకుడు జయ విజయులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు సనక సనందనాది ఋషులు వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని కాసేపు ఆగండి ఇప్పుడే రారు స్వామి అని చెప్పిన కారణంగా వాళ్ళు కోపించి మాక్కుడా ఇటువంటి నిబంధనలు ఉంటాయా? మేము అవతారంలో పాయలమే మేము అని అనుకుంటూ వాళ్ళని శపించారు. ఏమని శపించారు అంటే మీరు భూలోకంలోకి వెళ్ళి అక్కడే ఒక మానవ జన్మ ఎత్తి రాక్షస ప్రవృత్తితో జీవించెదరు గాక అన్నాడు. శాపం ఇచ్చాడో లేదో స్వామి లోపల్నుంచి బయటకు వచ్చారు. ఇంత చిన్న తప్పు చేశారు వాళ్ళు నేను మీ కోసం గాక నేను ఇక్కడ వైకుంఠంలో ఎందుకున్నాను? శాపాన్ని కాస్త ఉపసంహరించుకోండి అన్నాడు. సనక సనందనాది మునులు ఏమన్నారంటే మేము ఉపసంహరించం. కానీ శాపం నుంచి బయట పడటానికి కావలసినటువంటి మార్గం మాత్రం చెబుతాం. అని స్వామికే చెప్పారు. వీళ్ళు మూడు జంటలుగా పుడతారు. రావణ కుంభకర్ణులు గా పుడతారు ఒక యుగంలో. ఒక యుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గా పుడతారు. ముందు వాళ్ళే వస్తారు కృతయుగంలో. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులై వస్తారు. తర్వాత ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్త్రుడై వాళ్ళు వస్తారు. వచ్చి భక్తి, మూఢ భక్తి, మధుర భక్తి దాటి వాళ్ళు ఎంచుకునే మార్గం ఏమిటంటే వైర భక్తి. ఒక వైరం వల్లనే వాళ్ళు జన్మ ఎత్తవలసి వచ్చింది కాబట్టి మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా నీ యందు ఉన్నటువంటి అత్యంత అభిమానం చేత, నీ యందున్నటువంటి పూర్ణమైన భక్తి చేత, స్వామికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా విచక్షణా జ్ఞానం వీళ్ళకి లేదు గనుక శాపం ఇవ్వబడింది. ఆహ్ విచక్షణ లేకుండా జీవిస్తూ కడగా నేను చేరుకునేటువంటి ఒక అవకా-అవకాశం వీళ్ళకు ఉంటుంది. తద్వారా మళ్ళీ జయ విజయులు వచ్చి మీకు కావలి భటుల వలే వాకిలి దగ్గర ఉంటారు అని స్వామికి విన్నవించుకుంటే ఆయన సరేనన్నాడు. ఆయన సరే అని ఎందుకన్నాడు? అంటే ఆయన అవతారాలు ఎత్తవలసి ఉన్నది కనుక. ఎత్తవలసి ఉన్నప్పుడు ఆయన ఎవరితోనో తలపడాలి, ఎవరితోనో పోట్లాడాలి. మామూలు భక్తులని మామూలు మనుషులతో పోట్లాడితే ప్రయోజనం ఏం లేదు. దేవుడు అసలు పోట్లాడడు. మరి ఎవరితో పోట్లాడాలి? తన వారితో శాపగ్రస్తులైన వారితో పోట్లాడాలి గనుక ఆయన విధానానికి తలవంచి అలాగే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గా ఇద్దరూ అన్నదమ్ములై పుట్టారు.సరే ఇక్కడ కథా ప్రారంభంలో అసలు హిరణ్యకశిపుడు అంటే కశిపుడు అంటే వస్త్రం బంగారంతో చేసిన వస్త్రం ధరించేవాడు అని మాములు సామాన్య అర్థం రాజుగారు కాబట్టి బంగారంతో చేయించుకుంటాడు ఇంకోటి చేయించుకుంటాడు కోశాగారం నిండా డబ్బులే ఉన్నాయ్ అని దాని అర్థం కాదు అసలు అర్థం ఏమిటంటే వస్త్రము అంటే మన దేహం మన దేహం లోపల ఏదున్నది అంటే హిరణ్యమున్నది బంగారం ఏమిటి అంటే ఆత్మ ఆత్మని ఎరగకుండా మూఢభక్తి లో ఉండాలి వైరభక్తిలో ఉండాలి వీళ్ళిద్దరూ కూడా హిరణ్యాక్షుడికి వైరం లేదు ఆశ దురాశ రెండే కారణంగా భూమిని లోపలికి తీసుకుని వెళ్లిపోయినాడు తన తమ్ముడిని శ్రీమహావిష్ణువు ఒక అవతారమే ఎత్తి వచ్చి అంటే దాన్ని మనం ఏమంటామంటే instantaneous గా వచ్చాడు అవతారం దానికి ముందు వెనుక పెద్ద కథ లేదు ఇంతే కదా కాబట్టి వచ్చాడు మా తమ్ముడిని చంపాడు కాపాడవలసిన భగవంతుడు ఇంత నిర్దయుడయినాడా మహావిష్ణువు అనేవాడు ఎక్కడ ఉన్నా సరే నేను మహావిష్ణువునే సంహరిస్తానని నిర్ణయం తీసుకున్నాడు సంహరించాలి అంటే పగ పెంచుకోవాలి వైరం పెంచుకోవాలి దూరం పెంచుకోవాలి ఇవన్నీ చేశాడు హిరణ్యకశిపుడు నిజానికి హిరణ్యకశిపుడికి నలుగురు కొడుకులు అందులో కట్టకడపటి వాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు లీలావతి అంటే హిరణ్యకశిపుడి యొక్క భార్య గర్భవతిగా ఉన్నది ఉంటే హిరణ్యకశిపుడు ఈవిడ గర్భము దాల్చిన తర్వాత ఆయన తపస్సుకు వెళ్ళాడు సమయంలో నారదులవారు వచ్చి రోజు లీలావతి దగ్గర నారాయణ మంత్రం చదివేవాడు నారాయణుడి గురించిన పాటలు పాడేవాడు మృత్యం చేసేవాడు ఇవన్నీ కూడా గర్భస్థ పిండమైనటువంటి ప్రహ్లాదుడు అవన్నీ విని విని విని నారాయణ మంత్రం అతని ఊపిరిలో అతని ప్రాణంలో అతని భావనలో అతని తలపులో అన్నిటా అంతటా నారాయణుడు నిండిపోయినాడు ప్రహ్లాదుడి యొక్క శరీరంలో సరే తర్వాత హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఒక వరం పొంది వచ్చాడు తపస్సులో వాడికి పిల్లలు కలుగుతారా పిల్లలు ఉంటారా భార్య ఉన్నదా రాజ్యం ఉన్నదా కాదు శ్రీ మహావిష్ణువు గనక ఎప్పుడైనా దొరికితే ఆయనతో తలపడితే ఆయన అందరూ అంటారు కదా రూపంలో వస్తాడో ఎట్లా సంహరిస్తాడో తెలిదయ్యా జాగ్రత్తగా ఉండమన్నారు జాగ్రత్తగా ఉండండి అని ఉండమని చెప్పిన కారణంగా హిరణ్యకశిపుడు గాలి గాని నీరు గాని అగ్ని గాని భూమి గాని కాలం కానీ ఋతువులు కానీ ఏవీ నన్ను చంపకుండా ఉండేట్టు నాకు వరం ఇవ్వమన్నాడు వరం ఇచ్చారు వాడు అయితే పగలు గాని రాత్రి గాని అని కూడా అడిగాడు వర గర్వంతో ఇంటికొచ్చాడు ఇంటికి వచ్చేప్పటికీ ఉయ్యాలలో ప్రహ్లాదుడు దోగాడుతూ ఉన్నటువంటి సందర్భంలో నారదుడు కూడా అక్కడ ఉన్నాడు వచ్చి ఎంత అదృష్టం చేసుకున్నావ్ ఒక మహాత్ముడు నీ ఇంట పుట్టాడు నారదుల వారికి ఏం చెప్పాలి సత్యమే చెప్పాలి కాబట్టి ఒక మహాత్ముడు నీ ఇంట పుట్టాడు నీ కుల వంశ గౌరవాన్ని పదింతలు పెంచేటువంటి వాడై వచ్చాడు అటువంటి వాడికి అయితే నువ్వే పేరు పెట్టు అన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదము అంటే ఆనందము అని అర్థం ప్రహ్లాదుడు అంటే బ్రహ్మానందమే పరమానందమే ఆధ్యాత్మిక స్థితిలో మనం పరమ చరమంగా పొందవలసినటువంటి ఆనందమే ఒక బిడ్డగా నీ ఇంట పుట్టాడు గనుక వీడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టమన్నాడు ముగ్గురి కథ ప్రహ్లాదుని కంటే ముందు వచ్చిన వారి కథ భాగవతంలో ఎక్కడా ఏం లేదు మనకు కావలసింది కూడా అదే ప్రహ్లాదుని కథే కావాలి ప్రహ్లాదుడు దిన దిన ప్రవర్ధమాన అవుతున్నాడు natural గా అందరిలాగానే నాలుగేళ్ల వయస్సు ఐదేళ్ల వయస్సు వచ్చేప్పటికీ గురుకులంలో పెట్టాలి అనుకున్నాడు హిరణ్యకశిపుడు ఐదేళ్లకు ఎందుకు పెట్టాలి మామూలుగా ఎనిమిదేళ్లకు కదా ఉపనయనం చేయాలి వాడు రాజు కాబట్టి ఉపనయన అర్హత ఉంది వాడికి ఎనిమిదేళ్లకు చేయాలి కదా అంటే ఐదేళ్లకు చేయాలన్నాడు ఐదేళ్లకు ఎందుకు చేయాలి అంటే మామూలుగా బ్రహ్మోపదేశం పొందాలి అంటే ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి బాలుడికి ఉపనయనం చేస్తారు ఉడుగు చేస్తారు కానీ మహాత్ములకి శుకుడు వంటి వారికి శంకర భగవత్పాదులు వంటి వారికి మహాత్ములైనటువంటి వాళ్లకు మాత్రం ఐదవ ఏట చేస్తారు ఇది రహస్యం ఐదవ ఏట ఎందుకంటే దానికి కామ్యోపనయనము అని పేరు పెట్టారు మాములు ఉపనయనం సంధ్యా గాయత్రి చేసుకోటానికి ఐదవ ఏట పెట్టినటువంటి ప్రక్రియ దేనికంటే కామ్య ఉపనయనము అంటే ఏదో ఒక మంచి పని జరగాలి మంచి పని జగత్తుకి అక్కరకొచ్చేట్టుగా ఉండాలి కాబట్టి కామ్యోపనయనం చేయించేశాడు హిరణ్యకశిపుడు వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు శాస్త్రాలు చదివే వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు వేదాధ్యయనం చెప్ప చేయించగలిగిన వాళ్ళు అటువంటి గురువులని ఆయన ఎంచుకున్నాడు హిరణ్యకశిపుడి హృదయము చాలాకాలం వైకుంఠంలో ఉన్నాడు కాబట్టి పాత వాసనలు ఎలాగూ ఉంటాయి కాబట్టి వేదం పట్ల చదువు పట్ల విద్య వల్ల కలిగే లాభాల పట్ల పైగా మహావిష్ణు సంహార కార్యక్రమంలో ఇంతటి మహాత్ముడు పుట్టాడు అంటే వాణ్ని కూడా మహావిష్ణువు పైకి ఉసిగొల్పడానికి వాడుకోవచ్చని నిర్ణయించాడు నిర్ణయించి కుమారుడిని పిలిచి నాయనా నువ్వు చదువుకో చదివినవాడ జ్యుండగు చదివిన సదా సద్విచే వివేకము కలుగును చదువే లేకపోతే ఇదిగో మా లాగానే ఉంటావ్ మేము ఏదో పుట్టాము పెరిగాము రాజ్యం వెళ్తున్నాం కానీ నువ్వు మా కడుపున పుట్టావ్ మాకు రాని అదృష్టం నీకు కలగాలి.ఆ మంచి గురువుల దగ్గరికి నేను పంపిస్తున్నాను గురుకులం లోకి వెళ్ళు వెళ్లి అక్కడ బాగా విద్య నేర్చుకొని నాకు ఆనందాన్ని కలిగించు నాయనా అని అడిగాడు చాలా చక్కగా అడిగాడు కానీ దాని వెనుక వాడి భావం ఇది కాదు చదువు వలన శక్తి వలన మంత్ర బలిమి వల్ల మహావిష్ణువుని ఎదుర్కొని తన పినతండ్రి మరణానికి కారణమైనటువంటి మహావిష్ణువుతో తాను ఒకవేళ తలపడడానికి అవకాశం లేకపోతే ఉత్తర వారసుడుగా తన కుమారుడు కూడా అటువంటి దాంట్లోనే పెరిగి వాడిని ఢీ కొట్టాలి అనేది వాడి భావన అది ఎట్లా ఉన్నా ప్రహ్లాదుడు వెళ్ళాడు ఐదేళ్ల వయసుకే కామ్యోపనయనం చేసుకొని గురుకులానికి వెళ్లి గురుకులంలో గురువుల గారి దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు చెప్పేది ఒకటి ఇతను అనేది ఒకటి విచిత్రంగా ఉంది వాళ్ళు ఏమి చెబుతున్నారో దానికి భిన్నంగా అంతా దైవమే అంతా భక్తే అంతా సంకీర్తనమే చేస్తున్నాడు ఏం చేసినా నారాయణ అనేటువంటి పదాన్ని వాడుతున్నాడు వీళ్ళు రాక్షసులకు పాఠం చెప్పటం అలవాటు అయిన వాళ్ళు వీళ్ళిద్దరూ లేదా గురువులు ఇద్దరో నలుగురో ఇటువంటి భక్తుడికి పాఠం చెప్పటం వాళ్ళకి కష్టమైపోయింది ఎందుకంటే syllabus మారిపోయింది student వల్ల syllabus మారింది కాబట్టి గురువులిద్దరూ కంగారు పడ్డారు పడి ఇంతలోకి వర్తమానం వచ్చింది వర్తమానం ఏంటంటే కబురు ఏమిటంటే మా అబ్బాయిని ఒకసారి తీసుకొచ్చి ఎంతవరకు చదువుకున్నాడో నాకు చూపించమన్నాడు రాజు గారు సో వీళ్లిద్దరూ వెళ్లారు వెళ్ళేప్పటికి నాయనా ఎట్లా అంటే అన్ని శాస్త్రాలు నా గురువులు చెప్తున్నారు అన్నీ నేను చదువుకుంటున్నాను అసలు వేదాలలో శాస్త్రాలలో ఉన్నటువంటి మర్మం అంతా నేను తెలుసుకున్నాను తండ్రీ అన్నాడు ఆనందపడిపోయినాడు హిరణ్యకశిపుడు ఆనందపడిపోయి ఏది కొన్ని విషయాలు చెప్పు అన్నాడు చెప్పటం మొదలు పెట్టిన తర్వాత శాస్త్రమే చెప్తున్నాడు గాని దానిలో నారాయణ శబ్దమే ఉంటున్నది శాస్త్రమే చెప్తున్నాడు గాని దైవాన్ని గురించినది ఉంది శాస్త్రమే చెప్తున్నాడు గాని మహావిష్ణువు యొక్క తత్వాన్ని మహావిష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని సర్వ శక్తిమంతమైనటువంటి స్థితిని భగవంతుడు భక్తులందరినీ ఆపదలు ఎలా రక్షిస్తాడో ఇవన్నీ చెప్తుంటే హిరణ్యకశిపుడికి ఆగ్రహం కలిగింది. ఇద్దరు గురువులని పిలిచాడు మీరు ఏం చెప్పాలి మా పిల్లవాడికి మహావిష్ణువును గురించి వ్యతిరేకమైన భావాలు వచ్చేట్టుగా చెప్పాలి కదా అట్లా కాకుండా ఇట్లా విద్య మీరెందుకు చెప్పారు అంటే ప్రహ్లాదుడు చెప్పాడు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు నా మనసుకు ఇది తోస్తున్నది తండ్రీ అన్నాడు. నీకు అలా తోయటానికి వీల్లేదు సరే మొన్న మొన్ననే వెళ్ళావు కదా నువ్వు వెళ్లి బాగా చదువుకొని అసలు ఏం నేర్చుకున్నావో మళ్ళీ ఒక ఆరు నెలలో ఎంతో నాలుగు నెలలో ఎంతో టైం పెట్టాడు మళ్ళీ వచ్చి చెప్పు అన్నాడు ప్రహ్లాదుడి భక్తి ఇంకా ముదిరిపోయింది మొదటి రోజుల్లో లేలేతగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు చాలా గంభీరంగా అనేకమైనటువంటి విషయాలు తండ్రితో మాట్లాడటం మొదలు పెట్టాడు అతనికి భయంకరమైనటువంటి శత్రువుని సంకీర్తన చేస్తున్నట్లు అనిపిస్తున్నది తన ఇంట్లో విష్ణువు ఇంతటివాడు గాలిలో ఉన్నాడు అంబోధిలో ఉన్నాడు అంటే సముద్రంలో ఉన్నాడు నీటిలో నిప్పులో గాలిలో అంతటా ఉన్నాడు గాలిలో ఉన్నాడు అన్నప్పుడు అనుకున్నాడు గాలి నన్నేం చేయదు వరం ఉంది కదా అదిగో నీళ్ళలో ఉన్నాడు నీళ్ళు నన్నేం చేయవుగా అన్నాడు కాలమే భగవంతుడు అయి ఉన్నాడు అన్నాడు అసలు కాలాన్ని నేను జయించాను అన్నాడు పగలు అనేటువంటి సూర్యకాంతం అంతా కూడా భగవంతుడి వల్లనే ఏర్పడింది అన్నాడు సూర్యుడి వల్ల నాకే నష్టం లేదు అన్నాడు రాత్రి చంద్రుడు వస్తున్నాడు అంటే చంద్రుడు వల్ల అసలు నాకు నష్టం లేదు కాబట్టి నువ్వు నేర్చుకున్నటువంటి విద్య నా ప్రాణానికి మాత్రం రకమైన హాని కలిగించదని లోపల సంబర పడ్డాడు కానీ ఎక్కడైనా తన మరణాన్ని గురించిన ప్రస్తావన ప్రహ్లాదుడు తెస్తాడేమో అని ఎదురు చూశాడు కానీ వాడు అదేం చేయటంలా ఏం చేసినా మహావిష్ణువు గురించే చెప్తున్నాడు సరే మళ్ళీ ఆరు నెలలకి తీసుకొని మళ్ళీ ఇంకొక ఆరు నెలలకి మూడోసారి తీసుకొని వచ్చారు వచ్చేప్పటికి పరమ భక్తుడు అయినాడు పరమ భాగవతుడు అయినాడు మనసంతా శరీరంలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులు అన్నీ కూడా నారాయణ మంత్రంతో ఉత్తేజితమై ఉన్నాయి ముఖమంతా కూడా ఉద్దీపనమైపోయింది కాంతివంతమైపోయింది నారాయణ అనేటువంటి పదం అతనికి ఒక ఎనలేని శక్తిని ఎనలేని భక్తిని ఎనలేని యుక్తిని అన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటే ఇంకా హిరణ్యకశిపుడికి అర్థమైపోయింది వీడి వల్ల నా శత్రువు నశించడు వీడు శత్రువుని జయించడు వీడు నా శత్రువుకే దాసుడైపోయినాడు గనుక వీడిని గనుక చంపేస్తే నేనే తలపడతాను అహం వల్ల చూశారా గర్వం వల్ల నా కొడుకు ఏదో చేస్తాడని ఆశపడితే నా ఇంట్లో నా కడుపున పుట్టిన వాడే నా శత్రువుకి దాసుడైనాడు గనుక నేను వాడిని ఢీ కొంటాను ఎదుర్కుంటాను అని అంటూ చంపించే ప్రయత్నం చేశాడు ఎందుకు చంపించాలని ప్రయత్నం చేశాడు కథ అందరికీ తెలుసు కదా కన్న కొడుకుని ఎవరైనా చంపుకుంటారా అంటే అహంకారం ప్రబలినప్పుడు అతిశయం ప్రబలినప్పుడు కోరికలు తీరనప్పుడు తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు తాను ఏది అనుకున్నాడో అది మాత్రమే జరగాలని అనుకున్నప్పుడు మానవుడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది అది పశువుని కూడా దాటి కిందకి వెళ్ళిపోతుంది దాని పశువుని దాటి రాక్షసత్వాన్ని సంతరించుకున్నాడు కొడుకుకైతే మంచి విద్య నేర్పించాలని అనుకున్నాడో మంచి విద్య నేర్చుకొని వచ్చినటువంటి కుమారుడిని చంపేసేయాలని నిర్ణయించాడు అది కానీ హ్లాదము అంటే ఈశ్వరలీల అని రెండో అర్థం ప్రహ్లాదుడు ఎవరు అంటే హిరణ్యకశిపుడిని ఎవరు చంపగలరు అన్ని వరాలు పొంది వచ్చాడు వాడు కాబట్టి మృత్యువునేప్రాధ రూపంలో పంపించాడు పరమాత్మ కొడుకుగా పుట్టించాడు ఎట్లా కంసుడికి కంసవధకి దేవకీ గర్భంలో అష్టమ గర్భంలో కృష్ణ పరమాత్మని ఎట్లా మృత్యువు ద్వారా మృత్యువు కృష్ణుడి ద్వారా వచ్చిందో ఇక్కడ కూడా అట్లాగే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి పాలిటి ఎముడై వచ్చాడు కొడుకై రాలే అది అర్థమైపోయింది హిరణ్యకశిపుడికి ఎందుకని వాడు తపస్సు చేసినవాడే వాడు వైకుంఠ ద్వార పాలకుడే అన్నీ ఉన్నాయి మూల సంస్కారాలన్నీ ఉన్నాయి కానీ వదులుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరే మనకు తెలిసినట్టుగా ఏనుగులతో తొక్కించాడు పాములతో కరిపించాడు కొండ కోనల మీద నుంచి సముద్రంలోకి నెట్టాడు అగ్నిలో పడేశాడు ఇవన్నీ చేశాడు కానీ ప్రహ్లాదుడు కేవలము నారాయణ మంత్రం అనేటువంటి ఉచ్చాటన వలన మంత్రాన్ని చదువుతూ చదువుతూ శత్రువుని అలాగే మరణాన్ని జయిస్తూ తాను ఎక్కడ కూడా గాయపడకుండా కాయాన్ని నిలుపుకొని బయటకు వస్తున్నాడు హిరణ్యకశిపుడికి ఇది అర్థం కాలేదు అప్పుడు తన భార్య లీలావతిని అడిగాడు ఇది ఒక విచిత్రమైనటువంటి త్రికోణ కథ లీలావతి పరమ సాధ్వి పరమ భక్తురాలు హిరణ్యకశిపుడు హరి వైరి అంటే హరి అంటే శత్రువు వాడికి ప్రహ్లాదుడు హరికి భక్తుడు అంటే ఇంట్లోనే unity లేని ఇల్లది అంతే కదా ఎవరు హిరణ్యకశిపుడు ఒక వైపు తల్లి కొడుకులు రెండో వైపు కాబట్టి శాంతి అక్కడ ఉండటానికి వీలు లేదు లీలావతిని అడిగాడు ఏమిటి నాకు తెలియకుండా నీ కుమారుడిని ఇలా పెంచావు నిందించాడు తండ్రి ఎప్పుడూ కూడా పిల్లవాడు చెడిపోతే తల్లిని నిందిస్తాడు తన పాత్ర దానిలో ఏమీ లేదన్నట్టుగా అప్పుడు అప్పుడు అదే ఇప్పుడు అదే సరే ఎప్పుడైతే నెమ్మదిగా లీలావతి అన్నది వాడు పుట్టింది మొన్న మొన్ననే పుట్టాడు పదేళ్లు కూడా రాలేదు వాడితో మీకు వైరవ్ ఏమిటి వాడే బుద్ధులు నేర్చుకుంటాడులే అంటే వీడు వెళ్లి మన రాక్షస గురువులకి హరి గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏదో పద్యం పాడుతుంటే వీడు హరి కీర్తన చేస్తున్నాడు సంకీర్తన కాబట్టి వీడు అసలు మన కులాన్ని మన గురుకులాన్ని మన వంశాన్ని మొత్తము భ్రష్టు పట్టించి హరిమయం చేస్తున్నాడు వీడు కాబట్టి వీడు ఉండటానికి వీలు లేదంటే తల్లి కాబట్టి కళ్ళా వేళ్ళా పడింది వేళ్ళా పడినా ఒకటే ఇంకా ఉన్నారు కదా వాళ్ళతో నువ్వు ఊరేగుతూ ఉండు వీణ్ణి నేను నిర్మూలిస్తాను అన్నాడు నిర్మూలించడం ఎట్లా ఎలా నిర్మూలించాలి వాణ్ణి ఒక కాసేపు కూర్చొని మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే చాలా అనునయంగా మాట్లాడాడు నువ్వు హరి అన్నిటా అంతటా ఉన్నాడు అని చెప్తున్నావు కదా నాకు చూపించగలవా అని అడిగాడు అసలు నేను చూపించేది ఏమిటి అసలు సర్వోపగతుడై ఉన్నాడు చక్రి కాబట్టి నువ్వు ఎక్కడ కావాలంటే నీకు కనపడతాడు నాకే కాదు అని ఒక రహస్యం చెప్పాడు ప్రహ్లాదుడు అలా చెప్పాలి అయితేనే హిరణ్యక కశిపు వధ జరుగుతుంది సరే ఆరోజు సాయంత్రం తండ్రితో చెప్పాడు నువ్వు నువ్వు నేను ఎలాగైతే ప్రార్ధన చేస్తున్నానో నువ్వు కూడా నీదైన భక్తితో కనపడు కనపడమని నువ్వు అడుగు ఆయన కనపడతాడు అన్నాడు అప్పుడు రాత్రి హిరణ్యకశిపుడు ఆలోచించాడు అంతఃపుర మందిరం నా పూర్వీకులు కట్టించారు దాంట్లో హరి ఉండటానికి వీలు లేదు ఎందుకంటే మేము ఇంతకాలం ఇక్కడే బతికా Maaku ఎప్పుడూ హరి కనపడలా ఇదిగో ఇక్కడ ఎక్కడో కొత్త రెండు స్తంభాలు నేను పెట్టించా అది నేను కట్టించా కాబట్టి ఇంకా హరి ఉండే అవకాశమే లేదు అని నిర్ణయించుకున్నాడు వీడు ఎప్పుడైతే అంతఃపురంలో ఒక స్తంభంలో తనను చూడాలని పట్టుకోవాలని అనుకుంటున్నాడు అనేది సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి తెలిసిన కారణంగా ఆయన ఏం చేశాడంటే ఆరోజు రాత్రి ఎక్కడైతే హిరణ్యకశిపుడు ఆలోచనంతా చేశాడో అదే సమయంలో స్తంభాలలో మాత్రమే కాకుండా అంతఃపురంలో ఉన్నటువంటి అన్ని స్తంభాలలో తన విష్ణు శక్తిని ప్రవేశపెట్టాడు అణువు అణువునా విష్ణు శక్తి ప్రబలించేశాడు. బళ్ళను తెల్లవారింది కొడుకును ఈడ్చుకొని వెళ్ళాడు ఏడి ఎక్కడ ఎక్కడున్నాడు హరి చూపించమన్నాడు నువ్వు ఎక్కడంటే అక్కడే ఉన్నాడు అన్నాడు స్తంభంలో చూపించగలవా అన్నాడు అది సాయంకాలం అయిన వేళ సాయంకాలపు వేళ పగలంతా మాట్లాడుతూనే ఉన్నాడు time వచ్చినప్పుడు నువ్వు ప్రార్ధించు వస్తాడేమో అన్నాడు నేను నాకోసం ప్రార్ధించను నా మనసంతా నా హృదయమంతా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు కాబట్టి నేను ఏం చేయను అన్నాడు మరి సంకీర్తన కూడా చేయలేదు ఆరోజున ప్రహ్లాదుడు కానీ ఇంతలో హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది స్తంభంలో చూపిస్తావా అని అడిగాడు చూద్దాం వస్తే నేను కూడా చూస్తాను అన్నాడు నేను ఇంతవరకు ఆయన్ని చూడలేదు ఎలా ఉంటాడో ఇట్లా ఉంటాడు అట్లా ఉండాలని నేను విభూదజనుల వలన విన్నంత కన్నంత నేను కూడా అట్లా ఉంటాడని అనుకుంటున్నాను నాకు తెలియదు ఎలా ఉంటాడో అని అనగానే సరే చూపించమన్నాడు స్తంభాన్ని కొట్టాడు కొట్టగానే స్తంభాన్ని చీల్చుకొని అది సమయం అంటే పగలు వెళ్లిపోవటానికి ఇంకొక్క second ఉంది సాయంకాలం అయి రాత్రి రావటానికి ఇంకొక్క second ఉంది తర్వాత ఇంటి లోపల ఇంటి బయట రెండింటిని సీమారేఖగా ఉండేటువంటి దాన్ని ఏమంటాం అంటే దేహళి దత్తదీపము అంటారు గడప గడపను సంస్కృతంలో దేహళి దత్తదీపము.ఆ గడప దగ్గర ఒక్కసారిగా దానిలో నుంచి ఆవిర్భవించి ఆయన భయంకరమైనటువంటి రూపంలో దర్శనం ఇచ్చాడు. హిరణ్యకశిపుడికి అర్థం కాలా, నా కొడుకు చాలా లలిత లలితమైన పదాలతో విష్ణువుని వర్ణిస్తున్నాడు. కిరీటధారి చక్రధారి గదాధారి ఇవన్నీ అంటున్నాడు అసలు రూపం ఏంటి నరకేశరి రూపం సగమేమో మనిషిలా ఉన్నాడు తలంతా కూడా సింహం తల ఉంది ఇదేదో విచిత్ర జంతువు వచ్చింది అనుకున్నాడు వాడిని చూడండి వాడి సంస్కారం ఏదో విచిత్ర జంతువు ఏముంది ఇలాంటి వాటిని నేను ఒక నిమిషంలో చంపుతాను. దీని వెనకే వాడెవడో దాక్కొని ఉంటాడు హరి అని ఇంకా మాయలో ఉన్నాడు. సరే భీకరమైనటువంటి శబ్దాలు ఘీంకారాన్ని వాటన్నింటినీ వింటూ ప్రహ్లాదుడు అలా స్థాణువై ఉండిపోయినాడు. నేను భావించిన, నేను ఊహించిన, నేను ఉపాసించిన, నేను కీర్తించిన, నేను నెర నమ్మినటువంటి హరి ఇట్లా ఉంటాడా? ఆయనది బహుసుందర రూపంగా ఉండాలి. ఇది ఇదేదో భిన్నంగా ఉన్నదని ప్రహ్లాదుడు కూడా అనుకున్నాడు. కానీ ప్రహ్లాదుడి మనస్సు అప్పటికే శిక్షణ పొందిన మనస్సు. condition అయిపోయింది. ఏమిటి condition అయిపోయింది అంటే హరి రూపంలోనైనా రావచ్చు ఆయనే ఈయన కావచ్చు అనుకున్నాడు మళ్ళీ వెంటనే. అక్కడికి దాగితే హిరణ్యకశిపుడు భయభ్రాంతుడయినాడు. అటువంటి రూపాన్ని వాడు కూడా ఎప్పుడూ చూడలా. చూడక వెనక్కి వెనక్కి వెళుతున్నాడు గదిలో. కానీ ఆయన ఏం చేశాడంటే పంజా విసిరాడు. పంజా విసిరి మూలకు వెళ్లిపోయిన హిరణ్యకశిపుడిని పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఇక్కడ మామూలుగా పురాణము ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటారే. వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన్ని చంపి గోళ్ళతో రక్కి ఇవన్నీ చెప్తారు. అదేమిటో కూడా చెప్తాం. పంజా విసిరాడు తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. పొట్ట చీల్చాడు పేగులన్నీ మాలలుగా వేసుకున్నాడు. రక్తమంతా తాగాడు. తాగి ఇంకా ఉగ్ర నరసింహ మూర్తిగా ఉన్నాడాయన. ఉగ్ర నరసింహ మూర్తిని అలా చూస్తూ హిరణ్యకశిపుడు చైతన్యం పొందాడు. ఇంత జరుగుతుంటే ప్రహ్లాదుడు భయభ్రాంతుడై తన తండ్రి మరణాన్ని తాను స్వయంగా తన కంటి ముందు ఎవరినైతే జయించాలనుకున్నాడో జయించలేక అపజయమై అపమృత్యువై ఒళ్ళో నిర్జీవమై పడున్నటువంటి తండ్రిని చూసి "ఓహో! మానవ జీవితం ఇంతే కదా! అది ఎప్పుడు ఎట్లా రాలిపోతుందో ఎవరికి తెలియదు" అని ఆయన వేదాంతంలో ఆయన మాట్లాడుకుంటున్నారు లోలోపల. దీని కథ ఏమిటంటే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారమై ఎత్తి వచ్చిన ఆయన పొట్ట చీల్చి హిరణ్యకశిపుడి యొక్క మాలలు లోపల ఉన్న పేగులన్నీ తన కంఠమాలలుగా వేసుకున్నాడు. వాడిలో ఉన్నటువంటి జన్మ వలన ఏర్పడినటువంటి, స్వభావం వలన ఏర్పడినటువంటి కలుషిత రక్తాన్ని మొత్తము తాను తాగాడు. చూడండి భగవంతుడికి భక్తుడి మీద ఉండే దయ. తాగి దాన్నేం చేశాడు? లోపలికి తీసుకొని శరీరాన్ని పవిత్రీకరించాడు. పవిత్రీకరించి వాడి యందున్నటువంటి ఒక అంతర్జ్యోతిని తనలో లీనం చేసుకున్నాడు. అంతర్జ్యోతి అంటే అది ఆత్మజ్యోతే. జీవుడిగా ఉన్నటువంటి జయవిజయులలో ఒకడైనటువంటి హిరణ్యకశిపుడి యొక్క మూలమైనటువంటి ఆత్మజ్యోతిని పరమాత్మ అయిన తన యందు లయమూ లీనమూ రెండూ చేశాడు. మరి లీనమన్నా లయమన్నా ఒకటే కదా అంటే లీనము అంటే దగ్గర తీసుకోవటం. లయము అంటే ఇక లేకుండా చేయటం. అది తానైపోవటం. అంటే క్షణాన హిరణ్యకశిపుడి యొక్క వధ ఏమైంది అంటే హిరణ్యకశిపుడు ఒక సాలోక్యంగా పరమాత్మను చూశాడు. తనతో పాటుగా చూశాడు. సామీప్యంగా చూశాడు. చాలా దగ్గరగా చూశాడు. సాన్నిధ్యంగా చూశాడు. ఎంతటి సాన్నిధ్యం అంటే పరమాత్మ ఒళ్ళో ఒక పసిపాపను పడుకోబెట్టుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువు పడుకోబెట్టుకున్నాడు. కాబట్టి సాలోక్య, సామీప్య, సాన్నిధ్య అనే మూడు స్థాయిలు దాటి కడగా ఏం చేశాడు? సాయుజ్యాన్ని అనుగ్రహించాడు. సాయుజ్యం అనుగ్రహించడమంటే మళ్ళీ తన మూలమైనటువంటి వికుంఠ స్థానానికి, వికుంఠమైన స్థానానికి తీసుకొని, వాణ్ని తీసుకు వెళ్ళటానికి యమభటులు రాలా, విష్ణుదూతలు రాలా, విష్ణువే స్వయంగా వచ్చాడు. ఇది వైర భక్తిలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి కోణం. ఒక పార్శ్వం. కాబట్టి నేను భోగంలో ఉండాలి, హరిని చంపైనా సరే నేను చాలాకాలం రాజ్యం ఏలాలి అనుకున్నటువంటి వాడికి వాడు ఊహించని రీతిలో నరసింహావతారంలో నరసింహ స్వరూపంగా ఆతడికి సాయుజ్యం ఇచ్చాడు. చూశారా? భోగంలో ఉండాలి అనుకున్నటువంటి వాడికి యోగాన్ని ఇచ్చాడు.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 29:21

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

    Now playing
  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22