⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
కేలింగ్ చాలి ప్రాతఃకాలిక సౌఖ్య శాయనిక వాగారం భవజ్జల్పతాం అంబా యాః ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణాం సఖా వాయుర్మాం స్ప్రుశతి ప్రతిక్షణనవో నీలత్సుఖ ఆపాదకః మాతుర్భక్తగణాః పరస్పరమిదం సౌహార్దమాచన్వతే ఒక ప్రశాంతమైన ప్రసన్నమైనటువంటి సుప్రభాతం చిత్త నవప్రభాత వేళ ఒక చల్లని గాలిలో మలయ పవనాలు శరీరాన్ని తాకుతుండగా ఓ తల్లి మందమంద్రమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఈ మలయ సమీరాలలో నుంచి మాకు సమున్నతమైన భావములు పుట్టు గాక అమృత వాక్కులు మా నుంచి జగత్తులోకి ప్రవహించు గాక తద్వారా నీ వైభవాన్ని గుణ సంకీర్తనని సమస్తమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని మళ్ళీ నాతో పాటు నా తర్వాత తరానికి అందించేటువంటి ఒక వాక్శక్తిని నువ్వు అనుగ్రహించమని సరస్వతీ దేవిని ప్రార్థించాలి కనుక సరస్వతీ దేవికి నమస్కారం ఇది అయిన తర్వాత ఇంకా ఎవరికన్నా వందనం చేయాలంటే గురువుకి వందనం చేయాలి ఎవరు గురువు? ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే కంటికి కనబడని ఈశ్వరుడన్నా ఎప్పటికైనా కనుక్కోవలసి ఉన్నటువంటి ఆత్మ అయినా ఆ ఈశ్వరుడు ఈ ఆత్మ రెండు కలిపి గనుక ఒక రూపం ఎత్తితే ఆయమే గురువు గురు వేషంలో ఉన్నవాడు కాదు గురువైనటువంటి వాడు నిక్కమైనటువంటి వడు అటువంటి ఆ గురు స్వరూపానికి మనందరం కూడా నమస్కారం చేయాలి ఆ గురువా ఈ గురువా ఆ ఫలానా ఆయన వెరీ పాపులర్ ఫలానా ఆయన శక్తిమంతుడు కాదు నా వరకు నాకు సర్వోన్నతమైనటువంటి ఒక జన్మ ఇచ్చిన తల్లిని పక్కనబెడితే ఈ జన్మకి భావ సంపదకి తల్లియై భావ ప్రకటనకు తండ్రియై భావ విచారణని ఆచార మార్గంలో అంటే ఆచరించేటువంటి మార్గంలో ఆచార్య దేవుడై గురుదేవుడై ఏ దేవా అంటే ఆట ఆ ఆట సాగుతున్నప్పుడు ఆట ఆడిస్తున్న పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శనం చేయించగలిగిన చేయగలిగినటువంటి ఒక వైభవాన్ని ఒక యోగాన్ని ఒక అదృష్టాన్ని ఒక అవకాశాన్ని కల్పించిన తల్లి తండ్రి గురువు దైవమైన సత్యసాయి భగవానునికి నమస్కరిస్తున్నా [చప్పట్లు] ఇంతకు మించిన అవతారం మళ్ళీ రాదు రాదు రాదు ఎందుకంటే ఈ కలియుగం చివరి వరకు సత్యసాయి నామం ఈ జగత్తు నిండా వినపడుతూనే ఉంటుంది మన నుంచి మన పిల్లలు వారికి వారికి అట్లా అట్లా అట్లా స్వామి యొక్క సంకీర్తనా వైభవం సాగుతూనే ఉంటుంది మిగతావన్నీ కల్పాంతంలో అయిపోతాయి ఇది యుగాంతం వరకు ఉంటుంది కాబట్టి అటువంటి స్వామితో మనకు ఒక యోగం ఏర్పడటం వారిని దర్శించగలగటం ఈయన పరమాత్మి అనేటువంటి ఒక భావనలో మనసును నిలుపుకోగలగటం నేనేం చేయాలి అని నిరంతరము కింకరః కింకరో శంకరః నేనేం చేయాలి ఏం చేయాలి అని తపన పడుతూ ఏం అక్కర్లేదు లోకానికి అపకారం చేయకుండా ఉండు మొదటి పని రెండవది చేతనైనంత లోకానికి మంచి చెయ్ అందుకనే కింకరుడైన వాడు మాత్రమే శంకరుడు అవుతాడు శంకరుడంటూ ప్రత్యేకంగా లేడు అని చెప్పినటువంటి సాక్షాత్తు ఉపనిషన్మూర్తి అయినటువంటి స్వామికి వందనం చేద్దాం ఆ తర్వాత ఎందరెందరో ఎందరో ఎందరు మెట్లు ఎక్కిస్తే ఎందరు చెట్టు కనవేలు పెట్టి నడిపిస్తే మనం ఒక స్థాయికి భౌతిక స్థాయి కాదు ఆంతరంగిక స్థాయికి చేరగలిగామో వారందరికీ ఈవేళ మనం మనసారా నమో వాక్కులు సమర్పించాలి తర్వాత ఈ వందన గురువందన సమర్పణ అయితే ఒక చిన్న విషయం కబీర్ మనందరికీ తెలుసు చాలా గొప్ప భక్తుడయ్యాడు శ్రీరామ భక్తుడయ్యాడు అయితే ఓ రోజున హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు నామజపం లోపల చేసుకుంటున్నాడు రోజు గురువుగారు కబీర్ గురువుగారు వెళ్ళి కబీర్ దగ్గరకు గురువుగారు వెళ్ళేవారు వెళ్లి కాసేపు కూర్చొని విషయాలు చెప్పి నాయనా ఇది ఇట్లా అది అట్లా ఇట్లా నేర్చుకోవాలి అలా చేయాలి అని చెప్తూ ఉంటారు కానీ ఒకరోజున గురువు గారితో పాటు ఇంకో వ్యక్తి కూడా వెంబడించారు ఆ ఇద్దరు వచ్చారు వచ్చేసరికి మనసు రెండు భాగాలుగా చీలిపోయింది కబీర్ కి రోజూ వచ్చే అసలు నా గురువుకి నమస్కరించనా? మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిధి దేవోభవ అని ఈ జాతి నాకు నేర్పిందే ఈ అతిధికి నమస్కరించనా? అని మనసు ప్రశ్నిస్తే జ్ఞాని కాబట్టి సద్భక్తుడు కాబట్టి ఒక్క క్షణం ఆలోచించలేదు వెంటనే అనుకున్నాడు "గురు గోవింద దొనుఖడే కాకే లాగూ పాయే బలిహారి అపనే గురు గోవింద దియో భతాయే" ఎంత అద్భుతమైన మాట నిజమే గురువు ఎవరినో వెంబడి పెట్టుకొచ్చారు వచ్చి ఆ గురువు నాకు ఇప్పుడే ఏం చెప్పాడంటే ఓ కబీర్ ఏ దేవుడి గురించి నువ్వు అనుకుంటున్నావో ఏ దేవుడి పేరు తలుచుకుంటూ నీ జీవితాన్ని ధన్యవంతం చేసుకుంటున్నావో అటువంటి ఆ భగవంతుడే నా-నాతో పాటు నిన్ను చూట్టానికి వచ్చాడు ఇదిగో ఇతడే దేవుడు అన్నాడు ఇతడే దేవుడు అనగానే దేవుడు ఇతడు అని చెప్పగలిగిన వాడు ఎవరై ఉంటాడంటే ఆ దేవుడంటే తెలిసిన వాడై ఉంటాడు ఆ దేవుణ్ణి చూసిన వాడై ఉంటాడు ఆ దివ్యత్వాన్ని అనుభవించిన వాడై ఉంటాడు "దేవో భూత్వా దేవం యజేత్" అంటే దైవాన్ని గురించి మాట్లాడాలంటే ఆతను దైవమై ఉండాలి ఆ దైవత్వానికి అతి సన్నిహితంగా వెళ్లగలిగి ఉండాలి కనుక ఈవేళ ఎవరు రాని ఆ వచ్చినాయనా దేవుడని మా గురువుగారు చెప్తున్నారు ఆయన చెప్పగలిగారు కనుక నా ప్రథమ వందనం నా గురువుకేనన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఎవరికి నమస్కరించాలి గురువుకి నమస్కరించాలి.ఈ గురువు అయిన తర్వాత ఈ ప్రపంచం అంతా మనకు అవకాశాలు ఇస్తుంది మనం ఏమి చేయలేం. చేసినట్టుగా ఉంటాం ఆలోచిస్తే చేయబడుతున్న దాంట్లో మనం కూడా ఉంటాం కదా అంతే ఇప్పుడు ఈ ప్రస్తావనకు వచ్చినప్పుడు నైమిశారణ్యంలో భగవద్--భాగవతం చెప్పుకోవాలి అని నాకు ఏమాడు కోరిక లేదు అది విశేషం అక్కడ చెబితేనే భాగవతం అవుతుందని నమ్మిన వాడిని కాదు కానీ ఒక బలమైన కారణం ఈ భాగవతాన్ని యజ్ఞ రూపంలో చాలా సచ్చాడిగా వైదిక పరమైన ఫ్రేమ్ లో కాకుండా చాలా సార్లు చెప్పడం జరిగింది చాలా సార్లు అసంఖ్యాకంగా అందులో ఒకటి మొట్టమొదటి సారి హైదరాబాద్ లో సంపూర్ణ భాగవతం అంతా చెప్పుకున్నాం కేవలం దశమ స్కంధం వరకు మాత్రమే కాదు ఏకాదశ ద్వాదశ స్కంధాలలో అసలు విషయాలు ఉన్నాయి ఆత్మజ్ఞానాన్ని గురించి ఉన్నాయి దశమ స్కంధమే రుక్మిణీ కల్యాణం అంతా అయిపోయింది అంటాం కథ అక్కడ మొదలవుతుంది అది చెప్పగలగాలి అది చెప్పుకున్నాం తర్వాత సత్య సాయి భగవానుడు సంకల్పించిన రేడియో సాయి లో చెప్పినప్పుడు దాని పేరు భాగవత నవనీతము అన్నారు స్వామి కేవలం సప్తాహం కాదు నవనీతం వెన్న తీసి చేతిలో పెట్టినట్టుగా చెప్పాలి అప్పుడు అందరికీ అర్థమవుతుంది అన్నారు అది రెండోది ఇక మూడవది మళ్ళీ హైదరాబాద్ లోనే హరి భాగవత సప్తాహం అని చేశాం ఆ హరి భాగవతం ఏంటి భాగవతం అంతా హరిదే కదా అంటే కూడిన కథలతో కూడిన అదొక విధానంగా అది అయింది తర్వాత రెండువేల పదకొండు మార్చి మొదటి వారంలో వైజాగ్ లో ఏడు రోజులు భాగవత సప్తాహం చేశాం ఆ ఏడు రోజులు ఒక చోట చేయలేం ఏడు భాగాలుగా విభజించారు సత్య సాయి ఆర్గనైజేషన్ ఇవాళ ఇక్కడ ఒక అధ్యాయం లేదు కొన్ని మాటలు చెప్తే మళ్ళీ గుడారం రెండో చోటుకు వెళ్ళేది రెండు మూడు నాలుగు ఐదు అన్ని చిట్టచివరకు వచ్చి స్వామి యొక్క మందిరంలో పరిపూర్ణం అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఆ వాళ్ళంతా ఫోటోలు ఇలాగే తీశారు ఒక ఫ్రేమ్ కట్టిన అమ్మకి ఇట్లా ఇట్లా ఇట్లా తడుముతూ తాకుతూ స్పృశిస్తూ ఆనందాన్ని ప్రకటిస్తూ వారు చెప్పిన ఆ మాటలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి జీవితం ఒక మాధుర్యంతో భగవంతుని యందు ఒక అద్భుతమైనటువంటి రసాత్మకమైనటువంటి స్థితిలో ఉండాలంటే భారతం చదివితే లోకం చేత మోసగింపబడకుండా లోకాన్ని మోసం చేయకుండా ఎలా జీవించాలో చెప్పేది భారతం మానవ జన్మ ఎత్తినందుకు పరమాత్ముడైన నారాయణ మూర్తి అయినటువంటి రాముడైనా సరే ఒక మానవుడిగా ఎంత ఉదాత్తంగా జీవించాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదివితే రామాయణం మనకు ఒక్కటే నేర్పుతుంది మర్యాద పురుషోత్తముడుగా ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పుతుంది భాగవతం గనుక చదివితే భా అంటే వెలుగు గ అంటే జ్ఞానం వ అంటే వైరాగ్యం త అంటే తత్వం మ అంటే ముక్తి భాగవతం అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తుల సముచ్ఛయమే భాగవతం అటువంటి ఆ భాగవతాన్ని చెప్పావు చాలా సంతోషం స్వామి ఎవరి పట్ల ఎవరితోనూ అనని ఒక మాట అన్నారు జన్మ ఎత్తినందుకు భాగవతం చెప్పి ఇలా చెప్పి జీవితాన్ని ధన్యం చేసుకున్నావు మూర్తి బంగారు అన్నారు ఇది మహాదాశీర్వచనం ఆ అది ఇంకా నా దగ్గర ఉంది అది ఒక ఎత్తు అయిపోయింది అయిపోతే మా వేణుగోపాల్ రావు గారు వాళ్ళ ఇంటికి నన్ను విజయవాడలో తీసుకెళ్లినప్పుడు నేను వాళ్ళని ముఖే చూద్దాం అని వెళ్ళాను ఒక మిత్రుడు ద్వారా వెళ్ళాను వెళితే ఆ రోజు వాళ్ళు ఏం వెలిబుచ్చారంటే భాగవతం చెప్పాలి నైమిశారణ్యంలోనే చెప్పాలి మాకు అది కోరిక అని అడిగితే బహుశా ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ గుర్తుంటు-- వాళ్ళకెలాగో గుర్తుంటుంది నైమిశారణ్యం దాకా ఎందుకమ్మా మీ డాబా మీద మీ మేడ మీద పెట్టుకోండి ఎవ్వరూ ప్రయాస పడకుండా మీ వాకిట్లోకి వచ్చి నేను చెప్తాను ఏడు రోజులు మీరు ఏమీ disturb కాకుండా హాయిగా చెప్తాను మిగతా మనకి ఏం అవసరం లేదన్నాం కాదు అట్లా కాదన్నారు సరే అవును అనుకున్న తర్వాత కరోనా వచ్చింది అంటే రెండు మూడు, మూడున్నర సంవత్సరాలు అలా గడిచిపోయాయి కరోనా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దంపతులు ఇద్దరూ వచ్చి అడిగినప్పుడు దీని వెనుక నేను నైమిశారణ్యం వెళ్ళాలని స్వామి నిర్ణయించారు అక్కడ నేను భాగవతం ఏం చెప్తాను ఎలా చెప్తాను కాదు ఏం చెప్పినా అదే కథ చెప్పాలి నేనైనా కానీ ఆ dynamics వేరే ఉంటాయి కాబట్టి నేను తప్పకుండా వస్తాను అని చెప్పాను అని మీరంతా ఎలా సన్నద్ధమైనారో నేను కూడా అవుతున్న వేళ ఒక పదిహేను రోజుల క్రితం ఆ కాకినాడలో కంచి విజయేంద్ర స్వామి వారితో నేను మాట్లాడుతూ కూర్చుంటే ఏదో కొత్తగా ఒక book రాస్తే ఆయన అన్నారు విజయదశమి నాటికి book release చేద్దాం అన్నారు విజయదశమి నాటికి ఇక్కడ ఉండాలే dates అన్నీ fix అయినాయే వారు పెద్దవారు అయితే మిగతా వారికి భయం ఉంటుంది నేను అది చదువుతా అన్నాను స్వామి భాగవతం చెప్పాలని నైమిశారణ్యంలో నిర్ణయం అయింది కనుక నేను నైమిశారణ్యం వెళ్లి ఏడు రోజులు complete చేసుకొని ఆ తర్వాత చేద్దామా అని అన్నాను వారు అన్న ఒక్కటే ఒక్క మాట ఈ పుస్తకం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు నైమిశారణ్యానికి వెళ్లి భాగవతం చెప్పటం అనేటువంటి ఆ ప్రతిజ్ఞను పూర్తి చేయండి.ఆ యజ్ఞం పరిపూర్ణం అవుతుంది. అమ్మని కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నదని వారందరికీ చెప్పండి అన్నారు. వారు చెప్పింది మీకు అందించాను. అంటే సత్యసాయి భగవానుడి సంకల్పం కంచి పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనం ఇవన్నీ కలిసి మనం ఈవేళ ఇక్కడికి రాగలిగాం. ఇది ఇవాళ మనందరం కలవటానికి కలిగినటువంటి ఒక ఈ నేపథ్యాన్ని ఒక్కసారి స్మరించుకొని మనం భాగవతంలోకి వెళ్దాం. పరీక్షిత్ మహారాజు ఆయనకు తెలిసిపోయింది ఇక జీవితం ఇంకో ఏడు రోజులే అని తెలిసిపోయింది. రాజ్యం ఉంది, సంపద ఉంది, ఒక అద్భుతమైనటువంటి కుటుంబ నేపథ్యం ఉంది. పుట్టుక గొప్పది. కానీ ఏడు రోజుల్లో నేను మరణిస్తానా? మరి మరణించేలోగా నేను ఏం నేర్చుకోవాలి? అసలు ఏం తెలుసుకోవాలి? తెలుసుకున్నా నేను చేయగలిగేది ఏముంది? తెలుసుకోవచ్చు గాక ఏడు రోజుల్లో. శాస్త్రాలన్నీ వంట పట్టించుకోవచ్చు గాక. కానీ ఏడో రోజున మృత్యుదేవత వచ్చి లాక్కపోతుందే. మరి ఏం చేయాలి? అని ఒక నిమిషం ఆలోచించి భాగవతం చెప్పుకోవాలి అనుకున్నాడు. చెప్పించుకోవాలి, వినాలి అదేమిటో. కానీ ఎవరు చెప్తారు? ఆయనకు ఏడు రోజులలో భాగవతం చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? అంటే ఒక వ్యాసులవారు ఉన్నారని ఎవరో చెప్పారు. వ్యాసులవారు ఏమన్నారంటే, నా కుమారుడు శుకుడు వచ్చి చెప్తాడు. వాడు బాగా చెప్తాడు అన్నారు. అయ్యా మీరు తండ్రి మీ తర్వాతే కదా మీ కుమారుడు అని అంటే, అట్లా కాదు ఒక్కొక్కసారి ఆత్మావై పుత్ర నామాసి. ఆత్మ యొక్క భావంలో నుంచి పుట్టేవాడే కొడుకు. కానీ ఈ కొడుకు తండ్రి కంటే సర్వోత్తముడై ఉంటాడు. నాకు సంసారము, జంజాటము, లంపటము అన్నీ ఉన్నాయి. మా శుకుడు శుకదేవుడు, శుక అవధూత, శుక మౌని, శుక మహర్షి. వాడికి స్త్రీ పురుష భేదం తెలియదు. పూర్ణాద్వైత మూర్తి. కనుక మా శుకుడు చెప్తాడు అన్నప్పుడు శుకుడికి ఒక ప్రమాణం ఉంది. అదేమిటంటే, ఏ గృహస్తు ఇంటికి అసలు వెళ్ళడు మొట్టమొదటిది. ఒకవేళ వెళ్ళినా ఆవు పొదుగు దగ్గర కూర్చొని పాలు పిండటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఆ గృహస్తుతో గడుపుతాడు వెళ్ళిపోతాడు అంతే. ఇంకా మరో క్షణం ఉండటానికి వీల్లేదు. మరి అట్లా వెళ్ళిపోయే వాడు భాగవతం ఎలా చెప్తాడని వీళ్ళు అనుకున్నారు. కానీ చూడండి దైవ నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి. ఇవాళ ఈ శరీరం, ఈ జన్మ లేదు మనమందరం మామూలు భాషలో నేను పొందిన మహా యోగం మీకు చెప్తాను. ఇరవై ఆరవ తారీఖు పొద్దున కపిల గోవు యొక్క పూజ. కపిల గోదానంలో మా మిత్రులు ఒకరు చేస్తే వారి ఇంటికి నన్ను ఒక్కరినే పిలిచారు వారు. అది ఏకాంతంలో చేసుకున్నటువంటి ఆ గోపూజ. అది అయి మళ్ళీ విమానం ఇక్కడికి రావటానికి ఇరవై నాలుగు గంటల వ్యవధి దాటకుండానే మళ్ళీ మహత్తరమైన గోపూజ ఇప్పుడే చేసుకున్నాం. రెండు గోపూజలు డెబ్బై రెండు గంటల్లో జరగటం అసాధ్యం, అసంభవం. కానీ ఈ రెండింటినీ ఎవరు అనుగ్రహించారు? ఈశ్వరుడే. మరి ఎవరు ఈ గోపూజ? అంటే నాలుగు కాళ్ళతో ఉన్న ఒక ఆవుకు పూజ చేశామా? గో అంటే జ్ఞానము అని అర్థం. అందుకనే కృష్ణ పరమాత్మకి గోవిందుడు జ్ఞానము చేత విందు చేస్తాడు. గోపాలుడు జ్ఞానము చేత పాలిస్తాడు. నిజానికి జ్ఞానాన్ని పాలిస్తాడు. ఆయనతో కూడి ఉన్నవారెవరు? గోపికలు. పికము అంటే పక్షి. పక్షి అంటే ఆత్మ అనేటువంటి హంస. దానికి ఆ జ్ఞానాంచితమైనటువంటి పదహారు వేల కళలతో ఉండేటువంటి ఆ గోపికలే ఆ చిత్కళలే పదహారు వేల మంది గోప గోపిక జనంగా శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ పరివేష్కృతమై ఉన్నటువంటి ఆ భావనలో ఇంత గోశబ్దం ఉన్నది. అంతే కాదు శంకర భగవత్పాదుల గురువు గారి పేరు గోవింద భగవత్పాదులు. అంటే గో అనేటువంటిది ఇవాళ మనందరం గోపూజ అంటే ఆవు పూజ చెయ్యం. సుమారుగా ముప్పది ముక్కోటి దేవతలను శరీరంలో నింపుకున్నటువంటి ఒక దైవతానికి మనం ప్రదక్షిణ చేశాం, నమస్కారం చేసుకున్నాం. పూజ చేసుకున్నాం. మన ఆరాధనా భావాన్ని చెప్పాం. మాతృ స్థానంలో ఉన్నటువంటి ఆ గోవుకి నమస్కారం చేసుకున్నాం. కాబట్టి గోపూజ కూడా, గోదానం కూడా అవి అసాధారణమైనవే తప్ప సాధారణమైనవి కావు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి ఈవేళ ఈ భాగవత ప్రవచన ప్రారంభాలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఇంకాస్త ఉంది కొన్ని విషయాలు. ఇవి చెప్పాక మనం విషయంలోకి వెళ్ళొచ్చు. అయితే సత్యసాయిబాబా వారి బోధనలు చాలా విశేషంగా ఉంటాయి. చాలా సరళంగా ఉంటాయి. అవునా? ఇంతేనా? భాగవతం చదివితే అది అవుతుంది, ఇది అవుతుందని చాలా విన్నామే. ఈయన ఏమిటి ఇలా తేల్చేశారంటే, ఏం లేదు భాగవతం చదివితే బాగవుతాము అన్నారు. ఆ బా ఒత్తు తీసేయమన్నారు. కాబట్టి ఇవాళ భాగవతం చదవ-- బాగవ్వటం అంటే ఏంటంటే అండి, ఎలా ఉండాలో అలా ఉండకపోవటమే వ్యాధి. అంతే కదా. ఒక డిగ్రీ టెంప్ గానే జ్వరం వచ్చింది అంటున్నాం. తగ్గగానే మామూలైనామంటున్నాం. మామూలుగా ఉండే స్థితికి ఆ భా వెలుగు వైపు నడవాలి మానవులు. ఎట్లా వెలుగు ఎలా ఎటువైపు వెళ్ళాలి వెలుగంటే ఏంటి? ఇదిగో లైట్ ఉంది, వస్తోంది, పోతోంది, ఉంటోంది, ఉండకపోవచ్చు. ఇదేమిటి సూర్యుడే ఆరు గంటలు అయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. చంద్రుడు వస్తాడు. ఆయన ఇంకో వెలుగునివ్వడు కాంతిని ఇస్తాడు. మరి వచ్చే పోయే ఈ వెలుగుగా జ్యోతిర్మయమై చరాచరమయమై శ్రీమయమై వాంగ్మయమై అఖండమై అవ్యయమై అచ్యుతమై చిద్గణమై ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి ఆ జ్యోతి ఎలా పట్టుకోవాలి అంటే దానికి గ జ్ఞానం కావాలి.జ్ఞానం రావాలి అంటే వైరాగ్యం కలగాలి వైరాగ్యం అంటే ఆ Dilution కాదు ప్రాపంచిక వైముఖ్యం కాదు, అద్భుతమైన సంపదలు ఉన్నా అవన్నీ నావి కాదన్నట్లు ఉండగలిగితే దాని పేరు వైరాగ్యం. ఆ వైరాగ్యమే నిజమైన వైభోగం. ఈ వైరాగ్యం గనక ఏర్పడి జ్ఞానం వైపు నడుస్తూ ఆ వెలుగు వైపు ఇంకాస్త ముందుకు వెళ్లగలిగితే ఏర్పడేది ఏమిటంటే తత్వం తెలుస్తుంది. తత్వం అంటే ఆ Quintessence శాస్త్రాల సారం కాదు. తత్ తత్వం తత్ అది త్వం నేను అదే నేను నేను అదే ఆ రెండు తత్వం తత్వమసి తత్ త్వం అసి అదే నేనే ఉన్నాను అన్నటువంటి భావనలోకి వెళ్ళటానికి భాగవతం మనకి బోధ చేస్తుంది. ఇక చివరగా ఏమిటంటే ముక్తి ముక్తి అంటే మరణానంతర సుఖం కాదు, మరణానంతరం నువ్వు కైలాసానికి వెళ్తావ్ విష్ణులోకానికి ఖచ్చితంగా వెళ్తావ్ మనలోనే మన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు పోగానే మా తాతగారు వైకుంఠానికి వెళ్లిపోయాడని ఎవరో చెప్తారు మనం కూడా అంటాం. కానీ ఆ ఆలోచిస్తే ఎన్ని కోట్ల జీవరాశులు ఈ ప్రపంచంలోకి వచ్చినయి అన్ని కోట్ల జీవరాశులు వెనక్కి వెళ్లిపోయినయి ఏ ఒక్కడైనా వెనక్కి వచ్చి విష్ణులోకం ఇలా ఉంది అని చెప్పాడా ఇంతవరకంటే ఒక్కడు లేడు. కాబట్టి అక్కడికి వెళ్ళాడని ఇక్కడున్నవాడు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే ఇది మాయ చూశారా? అక్కడికి వెళ్ళాడు మా నాన్నగారు మంచి పనులు చేశారు వైకుంఠంలోనే ఆయన అక్కడే ఉంటారు వీటి నమ్మకం సాంప్రదాయకమైన ఒక విశేషం అది. దాన్ని గౌరవిస్తూనే మనం ఏం చేయాలి? వేదాన్ని అధ్యయనం చేస్తే మనకోకటి తెలుస్తుంది. ఏమని చెప్పింది మరణానంతరం వచ్చింది సుఖము కాదు, దుఃఖము కాదు, ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఇహమేవా ఇప్పుడే ఇక్కడే English లో Now and Here రేపంటూ లేదు. ఆ లేని రేపు కోసం మానవుడు యాతన పడొద్దు. ఈ ఉన్న వాస్తవాన్ని అధికృతమైన వాస్తవాన్ని ఈ వర్తమానాన్ని ఇక్కడే గనక జీవించగలిగితే అది పూర్ణ జీవితమై ఈ గడిపిన ఈ వర్తమానమే రేపు భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటుంది. ఈ వర్తమానం ఎలా ఏర్పడింది అంటే నిన్న కొంత గడిపావు గనక ఒక రోజు నిన్న అని బ్రతికినావు గనక దానిలో నుంచి ఇవాళ అనేది ఏర్పడింది. ఇవాళలోనుంచి రేపు పుడుతుంది ఇది నిరంతరమైనటువంటి భ్రమణమైనటువంటి ఒక చక్రాంకితమైనటువంటి స్థితి గనక జరిగిపోయిన దానిలో మనం ఏం చేయలేం వెనక్కి తేలేం. రాబోయేది ఎలా ఉంటుందో తెలియదు కానీ మానవుడు జరిగిన దాని వలన కలిగిన బాధని ఏం జరుగుతుందో అన్న భయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనందమయమైనటువంటి వర్తమానాన్ని విధ్వంసం చేసుకుంటాడు గనక భూత భవిష్యత్తులు రెండు పరమాత్మకు వదిలిపెట్టి నీవు నిశ్చలుడివై నిర్మలుడివై నికేతనుడివై నిరంజనుడివై నిర్లిప్తుడవై నిర్మముడవై ఆనంద ధామమైనటువంటి ఈ జాగ్రదావస్థలో ఈ ఒక్కరోజుని గనక నువ్వు గడపగలిగితే అది నీకు సంపూర్ణ ఆనంద అతిశయ రేఖని ప్రసాదిస్తుంది. ఇరవై నాలుగు గంటలిచ్చాడా దేవుడు అంటాం. చూడండి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు, పదహారు గంటలు ప్రపంచంతో ముడిపడే గడిచిపోతుంది. ఆరింటికో, ఐదింటికో లేస్తాం. రాత్రి పదికో, పదకొండుకో పడుకుంటాం. ప్రపంచంతో సంబంధంతోనే గడుపుతాం. ఇక మిగిలినది ఎంత అంటే అదిగో మిగిలిన నిద్రావస్థలో ఎనిమిది గంటలు గడిచిపోతుంది. ఈ పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై గంటలు. ఇరవై గంటల్లో మిగిలింది ఇంకా నాలుగు గంటలు నాలుగు గంటలు అటు వెళ్లి, ఇటు వెళ్లి, ఇటు కూర్చొని, అటు కూర్చొని, అది చేసి, ఇది చేసి మూడు గంటలు అయిపోయింది. మరి ఏం మిగిలింది మన దగ్గర? ఏమి మిగలలేదు. అందుకనే బ్రాహ్మీ కాలంలో మూడు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మనం ఏకాగ్ర చిత్తంతో ఎవరికీ వాళ్లమే ఒకరిగా కూర్చొని మన లోపలికి మనం తొంగి చూస్తూ మనతో మనం కూడి ఉంటే మన లోపలికి మనం వెళ్లగలిగితే దాని పేరు ధ్యానం. మనతో మనం కూడి ఉండగలిగితే దాని పేరు యోగం. ఈ ధ్యానము, ఈ యోగము ధ్యానం అంటే ముక్కు మూసుకోవటం, కళ్ళు మూసుకోవటం, చెవులు మూసుకో కానే కాదు. ఆలోచనారాహిత్యమైన భావ శూన్య స్థితిని తెచ్చుకోమంటారు రమణ మహర్షి ఉపదేశ సారంలో. అటువంటి ఆ ధ్యానానికి అనువైన సమయం ఏదంటే తెల్లవారుజామున నాలుగు గంటలు Precisely అనుకోండి. ఎందుకనేది నిర్ణయించారు? ఆ బ్రహ్మ ముహూర్తం ఏంటంటే ఏం లేదు మనకు అర్థమైతే నాలుగు గంటల కాలంలో మనం ఈ ప్రపంచంలోకి వెళ్లినా ఏం చేయలేం. ఎందుకంటే ప్రపంచం ఇంకా మేలుకోనలేదు. ప్రపంచం మేలుకోనలేదు గనుక దానికి నీతో పని లేదు. దానికి నీతో పని లేదు, నీ అవసరం దానికి లేదు, కనుక ఏం చేయాలి అంటే ఆ సమయం మనదిగా భావించి హాయిగా మనతో మనం ఉండి ముందు రూప ధ్యానం, నామ ధ్యానం చేసుకుంటూ, చేసుకుంటూ ఒక నిర్లిప్తమైనటువంటి మౌన స్థితిలోకి వెళ్లగలిగితే అది ధ్యానము అని దానికి పేరు. దానికి అద్వైతంలో శంకర భగవత్పాదులు చెప్తారు "బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శక్తేన విఖ్యాతా పరమానందదాయిని" ఇది తెలిస్తే ధ్యానం తెలుస్తుంది మిగతావి ధ్యానాలు కావు. ఒకసారి స్వామి దగ్గర మేమందరం కూర్చొని ఉంటే చాలా పోయి యాభై ఏళ్ల క్రితం మేము చిన్న పిల్లలం ఎవరో ఒకాయన వచ్చి ధ్యానం గురించి కాసేపు మాట్లాడతాను స్వామి మీ ఎదురుగా మాట్లాడాలా? మాట్లాడమన్నారు. ఆయన అన్నారు "నేను రోజుకి ఎనిమిది, తొమ్మిది గంటలు ధ్యానంలోనే ఉంటాను స్వామి చాలా హాయిగా ఉంటుంది" అని చెప్తూ ఉన్నారు. సరే కూర్చోమన్నారు. ఎనిమిది, తొమ్మిది గంటలు ధ్యానంలో హాయిగా ఉంటుంది అన్నావే ఎవరికి హాయి? నీకా? నీ కట్టుకున్న ఇల్లాలకా? నీ కడుపున పుట్టిన బిడ్డలకా?ఈ ప్రపంచం నువ్వేదో చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నదే దానికా ఎవరికి ఆనందం కలిగింది అంటే, అవన్నీ కలిగా నాకు ఆనందంగా ఉంది, నీకు ఆనందం కలిగితే సరిపోతుందా? కనుక నువ్వు ఏం చేశావ్ అంటే ఎనిమిది గంటలు అక్కడ ఉన్నావ్ అంతే, ధ్యానం అని అనుకున్నావ్ కానీ నువ్వు అక్కడ లేవు. ఎందుకంటే న్యూరాలజీ లో కూడా మనిషి యొక్క concentration ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు అంటే వీళ్ళ లెక్క దాని తన్మాత్ర లెక్కలు ఉన్నాయి. మనకి ఆ technicality అక్కర్ల. అరగంట సేపు దాటితే అది ధ్యానం కాదు. తర్వాత నేను ధ్యానం చేస్తున్నా అంటున్నారే అసలు ఏమీ చేయకపోవటమే ధ్యానం, మళ్ళీ ధ్యానం ఏమిటండి నువ్వు చేయటం ఏమిటి? అని స్వామి చాలా విషయాలు చెప్తూ ఒక్క మాట అన్నారు. ఆ ఇరవై ఎనిమిది నిమిషాలు దాటినంతవరకు నీకు ఎరుక కలగాలి, ఆ time లో. ఎరుక అంటే నేను దేహము మాత్రమే కాదన్న స్పృహ పేరు ఎరుక గనుక అది కలిగితే మంచిదే. మిగిలినదంతా ఎరుక కలక్కపోగా ఏడూన్నర గంటలు గురక తప్ప ప్రత్యక్షంగా ఏం లేదన్నారు. కాబట్టి నువ్వు ఎనిమిది గంటల సమయాన్ని దాని కోసం వెచ్చించకు. ఏదో నీ ఆరోగ్యం బాగుండాలి, అప్పులు తీరాలి ఇది ధ్యానం కాదు ఇది జగద్వంచన అని స్వామి స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ ధ్యానం అటువంటి ధ్యానం. నేను ఎందుకు వచ్చాను? అసలు నేను ఎవర్ని? వచ్చి ఏం చేస్తున్నాను? నా ఉనికి, నా వ్యక్తిత్వం, నా అస్తిత్వం, నా జ్ఞానం, నా సంపద ఎవరికైనా ఉపయోగపడుతున్నదా? అని ఒక ప్రశ్న వేసుకుంటే కొందరికైనా ఉపయోగపడుతున్నది అన్నప్పుడు సంతృప్తిగా ఉండు. చాలామందికి ఉపయోగపడుతున్నది అన్నప్పుడు సంతోషాన్ని పొందు. అసలు నా ఉనికి వలననే ఆనందం కలుగుతున్నప్పుడు నువ్వు పరమాత్మతో సమానుడివి అవుతావు. కాబట్టి ధ్యానము వ్యక్తులు తమ ఆంతరంగికమైన, వ్యక్తిగతమైన, వైయక్తికమైన లాభం కోసం చేసేది ధ్యానం కాదు. పైగా చేసేది ధ్యానం కాదు. ఇక యోగము మనతో మనం కూడి ఉండేది ఎప్పుడు? ఓ దీపావళి పండగ వస్తుంది కారు నిండా sweet packet లు పెట్టుకుంటారు. బంధువులకి, స్నేహితులకి ఎవరెవరికో ఆ sweet లన్నీ పంచిపెట్టి ఇంటికి వస్తాడు. sweet లన్నీ అయిపోయినాయి తనకు కూడా మిగలలేదు. చాలా happy గా ఉంటాడు. ఏమిటా happiness అంటే నేను correct గా కొన్నాను, correct గా ఇచ్చాను. ఈసారి దీపావళి బ్రహ్మాండంగా చేశాను అంటాడు. కానీ జరిగింది ఏమిటంటే అందరికీ ఇచ్చానన్న అహం పెంచుకున్నావే తప్ప ఇప్పించిన వాడిని నువ్వు ఎప్పుడో మర్చిపోయినావు ఒకటి. ఆ ఇప్పించిన వాడు చూస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు కర్మ సాక్షియై ఉన్నాడు. కనుక ఆంతరంగికమైనటువంటి నీ ఆత్మను నీవు స్పర-స్పర్శించుకోవటానికి, దర్శించుకోవటానికి నువ్వు భాగవతం వంటి విశిష్టమైనటువంటి పౌరాణిక అమ్మయాన్ని గనుక చదువుకోగలిగినట్లయితే ఈ distribution sweet distribution కాదు. నిజమైన sweet distribution ఏది అంటే మనకున్న జ్ఞానాన్ని వరదానం చెయ్యాలి. ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్ర జాలౌ గురుః స్వక్షుష్య బోధయా తత్సత్యం అశ్నితావన్ శంకర భగవత్పాదు. నీకు ఉన్నటువంటి ఒక ప్రజ్ఞ, నీ దగ్గర ఉన్నటువంటి ఒక సంపద, లేదు నీ దగ్గర ఉన్నటువంటి ఒక వాఙ్మయ సంపద, నీ భావ సంపద, నీ తపస్సు, నీ ధ్యానం వలన కలిగిన నీకు కలిగిన ఒక ఆనందాతీతమైన ఒక భావన, ఇదంతా గనుక నీవు జగత్తుకి ఇవ్వటానికి ఒక్క శిష్యుడి కోసం ఎదురు చూడగలిగితే చాలు అనుకుంటాడట నిజమైన గురువు.