⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
పూర్ణ జ్ఞానానికి సంకేతం ఏమిటి అంటే హీన జ్ఞాని అంట ఆయన. రమణ మహర్షిని అడిగారు. ఒక్కోసారి తెలిసో తెలియకో కొన్ని ప్రశ్నలు వేస్తాడు సాధకుడు. మనకవి చాలా ఆ ఏంటి ఇలా వేశాడు మహర్షి అంతటి వాడి దగ్గరికి వెళ్తే ఎలాంటి ప్రశ్న వెయ్యాలి? ఇలాగ అడిగేదని. వాడు ఏమడిగాడంటే, "భగవాన్! మీరంద-- వీళ్లందరూ ప్రపంచం మొత్తం మిమ్మల్ని జ్ఞాని అంటోంది. మీరు జ్ఞానేనా?" అని అడిగాడు. వీళ్లందరూ అంటున్నారు మీరు జ్ఞానేనా? అని అడిగాడు. భగవాన్ ఏమన్నారంటే నవ్వుతూ, "అందరూ జ్ఞాని అంటున్నారే, అది వారి సంగతి. మాకెందుకు? మేము జ్ఞాని కాదు అని చెప్పాలా? మేము జ్ఞాని అని చెప్పాలా?" అంటే, చెప్పటానికేం లేదు. జ్ఞాని అనేవాడు జ్ఞానిగా ఉండటమే. జ్ఞానిగా ఉండటం. జ్ఞాని is not a title. ఏ అనుభవాన్ని, ఏ జ్ఞానాన్ని నువ్వు పొందావు, ఏ సర్వోత్కృష్టమైనటువంటి భగవత్ తత్వాన్ని నీవు అంచులు చూశావో దానిని నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నీ body language లో, నీకున్నటువంటి inter personal relations తో, ఈ ప్రపంచంతో నీవు ఏర్పరుచుకున్న సంబంధ బాంధవ్యాలలో, వ్యాపారాత్మకమైన భావాలలో కూడా అది గనక ప్రతిఫలించినట్లయితే, నీవు యోగ రతోవా, భోగ రతోవా, విషయ రతోవా, సంగ రతోవా నీకు ఆనందం కలుగుతుంది. నిజానికి జ్ఞానమే ఆనందం. ఆనందమే జ్ఞానం. స్వామి అంటారు కదా, మనం-మీరంతా వింటారు, మళ్ళీ పునః చెప్పుకోవాలి. మీ ఆనందమే నాకు ఆహారము అదే క్యాలెండర్లో కూడా ప్రింట్ చేశారు. ఆయన అట్లా మాట్లాడలే. ఆయన చెప్పింది ఏంటంటే, మీ ఆనందము నాకు ఆహారం అన్న విషయం కాకుండా, మీరందరూ ఆనందంగా గనక ఉన్నట్లయితే, ఆ ఆనందము, ఈ ఆనందము ఒకటే అయి ఉంటాయి. ఒకటే. ఇదే ఆనందం అక్కడ, అదే ఆనందం ఇక్కడ. భేదం చెప్పుకోలేము. మీరు వేరు, నేను వేరునని ఆయన ఎన్నడూ చెప్పలా. అలాగే ఆనందం అనేదానికి నిర్వచనం ఏమిటంటే, తృప్తి ఒకటి కావచ్చు. తృప్తి, contentment. అలాగే రెండవది తనకు ఉన్న దాంట్లో చాలా మన తెలుగులో ఒక పదం ఉంది. కడుపులో ముద్ద తీసి పెట్టాను అంటుంది ఓ తల్లి. కదా. కడుపులో ముద్ద అంటే ఆ ముద్ద కూడా ఆవిడ కడుపులోకి వెళ్ళాలి. కానీ త్యాగం చేసింది. ఆ ముద్ద తీసి లోపలికి వెళ్ళిన దాన్ని తీసిందని కాదు, వెళ్ళవలసిన దాన్ని ఇచ్చింది అని. కాబట్టి జ్ఞానం అనేది అనేక పారుశాలలో ఉంటుంది. జ్ఞానం అంటే gathering of information కానీ, శాస్త్రాల మీద అధికారం కానీ, శాస్త్రాల మీద నాకు అధికారం ఉన్నది అన్నవాడు జ్ఞాని కాడు. వాడికి తెలియకుండానే ఒక అహంకారం వాడి యందు ఉంటుంది. నిజమైనటువంటి జ్ఞాని సేవకుడు అవుతాడు. ఒకసారి అరుణాచలంలో ఒక వృద్ధుడు యాభై, తొంభై ఏళ్ళు అప్పటికి వచ్చేసినాయి. కాళ్ళు ఇరుచుకుంటూ అరుణాచలం రమణాశ్రమంలోకి వస్తున్నాడు ఆయన. వస్తుంటే అందరూ ఆయనకి సహాయం చేయకపోగా, "మాకు అడ్డం వస్తున్నావు. నువ్వు నెమ్మదిగా నడుస్తున్నావు. పక్కకి వెళ్ళు. అది పట్టుకో, ఇది పట్టుకో" సలహాలు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రమణ మహర్షి అప్పుడే బయట అరుణాచలం నుంచి కిందకి దిగి వచ్చి అలా ప్యానోరామిక్ గా చూస్తే వృద్ధుడు కనిపించాడు. ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి చాలా ఆ భరి ఆరడుగుల మూడడుగుల భగవాన్ రమణ మహర్షి గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఆయన్ని ఎక్కడ ఆయన కలుసుకున్నారో ఆ వృద్ధుడ్ని అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అతని పాదాలు ఒత్తారు. ఆ అడుగు పాదాలన్నీ గా-గట్టిగా అయిపోయినాయి. చెప్పులు లేవు, ఏం లేవు. పాదాలు ఒత్తుతూ, ఒత్తుతూ ఎవరితో ఒక చెంబు నీళ్ళు తెప్పించి ఆ పాదాలన్నీ కడిగి, "నువ్వు ఇంత దూరం శ్రమపడి రావటం ఎందుకు? నువ్వు అక్కడ తలుచుకుంటే సరిపోయేది కదా" అంటే, "స్వామీ! ఇంకా నామరూపాలు వదిలిపెట్టలేని స్థితిలో ఉండి మిమ్మల్ని ఒక్కసారి చూద్దామని వచ్చాను" అని అంటే భగవాన్ ఒక మాట అన్నారు. "నువ్వు చూద్దామని అనుకున్నావు, బహుశా నేను కూడా నిన్ను చూద్దామని నాకు అనిపించిందేమో, ఇద్దరం ఇలా కలుసుకున్నాం" అన్నారు. చూశారా, భగవంతుడు ఎప్పుడూ వినమ్రుడు. గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ నేను అధికుడినని చెప్పడు. విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు చదువుతుంటే, లోపల ఆత్మ సంగీతంగా సుషుమ్నా గీతంగా పాడుతుంటే, ఎవరి గురించి పాడుతున్నాడో ఆ మహావిష్ణువే శ్రీకృష్ణుడై ఉంటే, ఆయన తల వంచుకొని, శిరస్సు వంచుకొని, చేతులు కట్టుకొని విష్ణు సహస్రనామం విన్నాడు. అది ఈ జాతి సంస్కారం. మనకు బోధించే బోధలు ఇవన్నీ. కృష్ణుడు అలా ఉన్నాడా లేడా, మీరు కృష్ణుడిని చూశారా అంటే, నేను చూడక్కర్లా, ఊహించగలను. ఎందుకంటే కృష్ణుడు అలాగే ఉంటాడు గనుక. సేవ చేయటానికే వచ్చాడాయన. సేవలు అందుకోవటానికి ఆయన రాలేదు. స్వామి కూడా అంటారు, "సేవలందుటే గాని సేవించుటరుంగని శ్రీ సాయియే నాకు సేవకుడయ్యే" అనుకోండి, మీరు సేవకుడిని కాకుండా నన్నెప్పుడైనా వదిలిపెట్టారా మీరు? ఆ పక్కనే బెల్లు పెట్టి, calling bell పెట్టి సాయిరాం రా, సాయిరాం రా అని కొన్ని వేల గంటలు నన్ను పిలుస్తుంటే ప్రతి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళానా లేదా? మరి నేను దేవుడిని నేనెప్పుడైనా అని నేను మీకు సేవకుడినని అన్నారు స్వామి భగవత్ గారు. "సేవలందుటే గాని సేవించుటరుంగని శ్రీ సాయియే నాకు సేవకుడయ్యే". ధ్రువ అమీజియా అజామిళ ఉపాఖ్యానాలు ఎన్నో లోక లోకాంతర ప్రాణాలని కదిలిస్తాయి. అనేక ఆలోచనలు కలిగిస్తాయి. అనేక అమృత భావనలు కలిగిస్తాయి. వీటన్నింటినీ కూడా కథగా మాత్రమే వినకండి. కథ చెప్పటానికి నేను ఇంత దూరం రానక్కర్లేదు. దాని యొక్క తత్వం ఏమిటి? మూలం ఏమిటి? మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలి? ఇంకా పునర్నిర్మాణం ఎలా చేయాలి? అసలు పునర్నిర్మాణం ప్రారంభం నిర్మాణమే ప్రారంభం కాకపోతే how to define ourselves? How to redefine ourselves? How to reform ourselves? How to refine ourselves? అంతేగాని వాడిని మార్చటానికి నేను రాలా. నన్ను మార్చుకోవటానికి నేను వచ్చాను.నాలో ఉన్నటువంటి negativity ఏదన్నా ఉంటే, అహంకారము, దంభము, ప్రగల్భము, గర్వము ఇవన్నీ చెప్పుకున్నాం. అవన్నీ ఇంకా ఎక్కడైనా నాలో ఉంటే, ఈ ఏడు రోజులలో వీటన్నింటి నుంచి నేను ముక్తం కాగలిగితే దాని పేరు మోక్షం. అంతేగాని, ఆ ఏడు రోజులు అయిపోగానే మనం ఈ శరీరం వదిలిపెడతామని, ఇక్కడి నుంచి direct గా విష్ణు లోకానికి వెళ్తామని అర్థం కాదు. ముక్తం కావటమంటే, ఏది మనం కాళ్ళకి, చేతులకి సంకెళ్ళు వేసుకున్నామో, మనంతట మనం కోరి ఏలి వేసుకున్నామో, వాటిని మనంతట మనమే విప్పుకోగలిగినటువంటి ఒక ప్రజ్ఞని, భగవంతుని యొక్క అనుగ్రహంతో పొంది, ఆ పని గనక మనం చేయగలిగినట్లయితే, అది సర్వోత్కృష్టమైనటువంటి అధ్యాత్మ సాధన. మరి ఈ ప్రపంచం ఇట్లా ఉంది కదా. ఈ ప్రపంచంలో మాకు సాధన కుదరటం లేదనే వాళ్ళు ఉంటారు. మాకు అన్నీ ఇబ్బందులేనండి, ఈ సాధన మేమెక్కడ చేయం. నిద్ర లేవగానే యాత్రలే ఉన్నాయంటే, యాత్రల మీద మన మనస్సు ఉన్నంత కాలం దీని వైపు మనం రాలేము. దీనివైపు వచ్చిన తర్వాత యాత్రలు కూడా దూది పింజలా వెళ్ళిపోతాయి. అసలు నిజానికి మనల్ని తాకవు. ఇది విష్ణువు యొక్క ప్రమాణం భాగవతంలో. ఎవరైతే భగవత్ చింతనతో ఉంటారో, భగవన్నామ సంకీర్తన చేస్తారో, చేయలేక మరణ, స్మరణ, ధ్యాన, తపో ధ్యానాదుల వర్ణ. ఎవరైతే భగవంతుణ్ణి తమ యందు నిలుపుకొని ఉంటారో, వారు నిత్యముక్తులై ఉంటారు. నిత్యముక్తులు వేరు, ముక్తులు వేరు, విముక్తులు వేరు, జీవన్ముక్తులు వేరు. జీవించి ఉండగానే వీటన్నింటి నుంచి బయటపడితే వాడు జీవన్ముక్తుడు. శరీరం వదిలిపెడితే వాడు విదేహక ముక్తుడు. తనకు తాను వేసుకున్నటువంటి సంకెళ్ళు తాను తొలగించుకోగలిగితే, అది జీవన్ముక్త, విదేహముక్త స్థాయిలో మోహాన్ని క్షయం చేసుకున్నవాడు. వాడు మోక్ష సామ్రాజ్యాధిపతిగా ఈ ప్రపంచంలో ఉంటాడు కాబట్టి, ఇటువంటి ఉదాత్త వై-భావనా వైఖరిలో మనందరి జీవితాలు పల్లవించాలి. ఇక్కడ సాహిత్య పరంగా ఒక విషయం చెప్తాను. మీ విజయవాడే. చాలా గొప్పవాడు. విశ్వనాథ సత్యనారాయణ గారిని, ఒక ఋషి, మహాఋషి. ఆయన రామాయణ కల్పవృక్షం రాశారు. రామాయణ కల్పవృక్షం రాస్-రాయటానికి ముందు, బహుశా ఆయన కాస్త యవ్వన దశ దాటి కొద్దిగా పరిణితి చెందిన వయసులో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారిని వాళ్ళ గురువుగారు. సంస్కృతం ఆంధ్రం నేర్పారు. వాళ్ళ గురువు గారికి అరవై ఏళ్ళు వచ్చినాయి, షష్టిపూర్తి. ఉన్న శిష్యుల్లో ఈయన ఉత్తమ శిష్యుడు. ఇది ఎక్కడ జరిగింది? బందరులో జరిగింది, మచిలీపట్నంలో. సరే, ఆ గురువుగారి గురించి శ్లోకాలు రాసేవాళ్ళు, పద్యాలు రాసేవాళ్ళు, బట్టలు పెట్టేవాళ్ళు, డబ్బు ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు. చిట్టచివరకు విశ్వనాథ వారిని మాట్లాడమన్నారు. విశ్వనాథ వారు ఏమన్నారంటే, "గురువు గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి." అనంటూ, [పాట] అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృశుండు అలఘుస్వాదురసావతార దిక్షణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి శిశుడై నాడన్నట్టి ఆయోమపేషల చంద్రి మృదుకీర్తి మా చెళ్లపిళ్ల వంశ స్వామికి ఉన్నట్లుగన్. సభ నిర్ఘాంతపోయింది. ఏమయ్యా మీ గురువు గారి గురించి మంచి పద్యం రాయమంటే, నీ గురించి రాసి పాడావేమిటి అన్నారు. వాళ్ళకి అది అర్థమైంది. ఆయన ఏమన్నాడంటే, "నన్నయ్య గారు ఉన్నారు గొప్పవాడు. ఆయన శిష్యుడు ఎవరో మీరు చెప్పండి నాకు. ఉన్నాడా? లేడు. తిక్కన గారికి పాఠకులు ఉన్నారు గానీ శిష్యులు లేరు. తిక్కన గారి శిష్యుడు ఎవరన్నా ఉన్నాడా? లేడు. ఆ భోగము వాళ్ళిద్దరికీ లేదు. కానీ, నావంటి అస్మాదృశుండు అలఘుస్వాదురసావతార దిక్షణాహంకార సంభారదోహల బ్రాహ్మీమయమూర్తి, అంటే ఎన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఒక శిష్యుడు, ఇటువంటి శిష్యుడున్నాడనేటువంటి గౌరవం మా చెళ్లపిళ్ల స్వామికి ఉంది." అని అనేప్పటికి సభ నిర్ఘాంతపోయింది. అప్పుడు ఆయన సమాధానం చెప్పారు. అంటే, "నా శిష్యత్వం వలన, శిష్యరికం వలన నా గురువుకి ఈ గొప్పదనం రాలా. ఎలా వచ్చిందంటే, ఆయన వలన నాబోటి వాడు ఇంతటి గొప్ప శిష్యుడు అయినాడు. అదే నేను ఇస్తున్నటువంటి గౌరవం" అన్నాడాయన. సరే, అది ఒక phase. ఆ phase అయిపోయిన తర్వాత నలభై ఏళ్ళు, నలభై ఐదు ఏళ్ళు వచ్చినాయి. బయటంతా పురస్కారాలు, సన్మానాలు, అభినందనలు, అభివందనలు అన్నీ జరుగుతున్నాయి. జీవితం అంతా సరిగ్గా లేదు. ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. ఆ సమయంలో వాళ్ళ ఇంటి ముందే ఒక మంచం వేసుకుని పడుకున్నాడు వెన్నెల్లో. ఆకాశంలోకి చూస్తున్నాడు. అవును నేను ఎక్కడున్నాను? నేను ఏం చేస్తున్నాను? పాటలు రాస్తున్నాను, పద్యాలు రాస్తున్నాను, పుస్తకాలు రాస్తున్నాను, పాఠాలు చెప్తున్నాను, అన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు నేను-అసలు నేను ఎక్కడున్నాను? అని అంటూ [పాట] ఆకలన శరత్ పూర్ణిమావృత శశాంక రోచిర్వితానము ఈకలన భయదంధకార చటాక్రాంత భూమి అందు నను నేను స్ఫారీభవన్నవీన శంపాలతాకృతి పూనివుంటి అందు సగము ఇందు సగముంటి అవురా నేను. అటువైపు చూస్తే కీర్తి, వెన్నెల వంటి కీర్తి బయట. ఇటు చూస్తే అంతా భయంకరమైనటువంటి చీకటి తాండవం ఆడుతున్నది. ఈ రెండింటి మధ్యలో నేను ఎక్కుపెట్టినటువంటి ధనుస్సు వలె, బాణం వలె ఉన్నాను. ఆ బాణం అటు పోతుందా? ఇటు పోతుందా? ఇంతకీ నేను ఎక్కడున్నాను? అది ప్రతి మధ్య వయస్కుడు వేసుకునే ప్రశ్న. ఎదుర్కునేటువంటి, గతించిన కాలం ఒడ్డు, మొదటి ఒడ్డు వెళ్ళిపోయింది. అవతల ఒడ్డు కనిపిస్తున్నది. సముద్ర మధ్యంలో, నదీ మధ్యంలో పడవ సాగుతున్నది. వైరాగ్యం వస్తే లాభం లేదు, ఈత రావాలి. ఏదైనా జరిగితే.ప్రజ్ఞ లేదు ఏమి అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం లేదు అని అనుకున్నాడు మధ్య వయస్సు దాటింది శ్రీమద్రామాయణ కల్పవృక్ష నిర్మాణం చేశాడు రాశాడు ఆయన దానికి తొట్టతలీ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది తెలుగు వారికి సంపాదించి పెట్టాడు ఆయన పెడితే అప్పటికి ఆయన శిష్యులంతా కూడా Chief Minister లు అనేక రంగాలలో సమున్నత Governor లు అయిపోయారు కాబట్టి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి గురువు గారి దగ్గరికి వెళ్లారు వెళ్ళి ఏం చేద్దాం గురువు గారు ఈ పుస్తకం ఎలా చేద్దాం ఎక్కడ చేద్దాం ఏ సభ ఏ ఊర్లో పెడదాం ఎవరిని పిలుద్దాం ఆ ఇక్కడే చేద్దామా ఇంకెక్కడన్నా అని అడుగుతున్నారు ఆయన నిర్మా నిరామయంగా అన్నారు సాయంకాలం కృష్ణా నది ఒడ్డుకి రండి మీరంతా ఒక ఇసుక తిన్నె మీద కూర్చొని ఉండండి నేను అక్కడికి వస్తాను అన్నాడు అందరూ వెళ్లారు పౌర్ణమి ఆ రోజున ఇసుక తిన్నె మీద కూర్చున్నారు గురువు గారి కోసం పది మందో పదిహేను మందో ఈయన వ్యాసపీఠము రామాయణ కల్పవృక్షము తీసుకుని వెళ్లారు ఇది విజయవాడ కృష్ణా నది కూర్చున్నారు ఇసుక మీద కూర్చొని వీళ్ళంతా Notebook తెచ్చుకున్నారు ఎవరి పేరు ఆయన నోటినుంచి వస్తే వాడిని పిలవాలి organize చేయాలి పెద్ద event చేయాలని ఆయన అన్నారు మీరు ప్రశాంతంగా ఉండండి నేను ఒక పని చేయబోతున్నాను అది అయిన తర్వాత మీరు ఆలోచించుకోండి అన్నారు సద్యోనిర్గతమైన సర్వభావనా సంహారంబు ఎల్ల నైవేద్యం విచ్చితి నీకు రామచంద్ర ప్రభువా విశ్వాసమున్ పూర్ణవే ఆద్యంబగు జీవలక్షణము సంహారంబు కావింపవే హృద్యంబై చలితోచు దివ్యతేజంబు సారింపంగ దే నా గుండీయం ఇక్కడ వచ్చేసాడు ఆయన అప్పటికప్పుడు పుట్టినటువంటి అనేకమైనటువంటి భావాలన్నీ పెద్ద వంటకం చేసి రామచంద్ర ప్రభువు అవన్నీ నువ్విచ్చినవే నేను వంట చేశాను నీకు పళ్ళ నైవేద్యం ఇచ్చేస్తున్నాను నేను ఈ శరణాగతిలో ఉన్నాను నేను నాకు ఎవరి సత్కారాలు నాకు అక్కర్లేదు చూడండి ఆద్యంబగు జీవలక్షణము నాలో ఇంకా జీవలక్షణము ఉందా ఉంటే ఆ జీవలక్షణం నా అహంకారం అయితే ఆ జీవలక్షణం నా మమకారం అయితే ఆ రెండిటిని నువ్వు పోగొట్టు పోగొట్టినంత మాత్రాన నాకు ఆనందం కలగదు దివ్యమైనటువంటి నీ తేజస్సును నా హృదయం మీద ఒక్క క్షణం ప్రసారం చేయమని అడిగాను అది సమర్పణ చూశారా అంటే జీవితంలో మనకు అనేక దశలు ఏర్పడతాయి పదిహేనేళ్ళు ఒకటి ముప్పై ఏళ్ళు ఒకటి యాభై ఏళ్ళు ఒకటి అరవై ఏళ్ళు డెభై ఎనభై తొంభై ఇవన్నీ ఉంటాయి వీటన్నింటిలో మహాకావ్య నిర్మాణం చేసి రాముడి కథ రాసినటువంటి వాడు ఏమన్నాడంటే పురస్కారం నాకు వద్దు అన్నాడాయన చాలువాలు నాకు అక్కర్లేదు అన్నాడు నీ అనుగ్రహము నీ దివ్య తేజస్సు నా గుండె మీద నా హృదయం మీదికి వచ్చేట్టుగా చూడమన్నాడు ఇది ధృడమైనటువంటి నీతి ఏదో గడిచిన బాల్యమంతా దుఃఖంలో దారిద్య్రంలో గడిచిపోయింది ఈ పుస్తకాన్ని రాశాను దీంట్లో బోలెడు డబ్బు వస్తే బాగుండు ఇంకా లక్షలు మా ఇంటికి వచ్చేస్తే బాగుండు అని మీరందరూ వెళ్లి నా పుస్తకాలన్నీ అమ్మేసి మీరు ఆ డబ్బు తెచ్చి వాకిట్లో కట్టమని అడగలా రాముడి అనుగ్రహం కోరుకున్నాడు చూశారా ఇది పరిణామ దశ ఆ చివరి దశలో ఆ రామున్నే తలుచుకున్నాడు ఆయన ఆయన్ని అడిగారు మనం మొదటి రోజు చెప్పుకున్నాం మళ్ళీ రామాయణం ఎందుకు రాశారు అన్నప్పుడు మరల ఇదేల రామాయణంబు అన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళల తిరుచున్న అన్నమే తెరుచున్నదిన్నాళ్లు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన కొలిచిన రామునే తలతును నేనును నా భక్తి రచనలు నావిగాన కవి ప్రతిభ ఉండును కావ్యశతాంశముల తొంబదియైన పాండ్లు ప్రాగ్విపశ్చిమ్మంతంబున రసము వెయ్యి రెట్లు గొప్పది నవకథాద్భుతిన మించి రామాయణం కంటే గొప్ప కథ ఎవరు రాయగలరు దానికంటే ఆ రామాయణంలో ఉన్న రస వాహినిని గనక మీకు అందించగలిగితే అందించే ముందు నేను అనుభవించగలిగితే అది నా జీవిత సాఫಲ್ಯం అన్నాడాయన కాబట్టి ఈ ధృడమైన నిర్ణయం ఉండాలి అజామైలుడు వలె భగవంతుని యొక్క నామాన్ని నిరంతరము స్మరించుకుంటూ ఉండాలి అక్కడ సంకల్పం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రవచనం జరుగుతూ ఉంటుంది మన హృదయాలన్నీ ఎక్కడ దేనిమీద ఏకీకృతమైన అంటే సత్యసాయి పదపద్మాధీన చేతస్కులమై ఉన్నాం స్వామి ఇక్కడ ఉన్నారు అనేటువంటి భావన మాత్రమే మిగిలిపోతూ ఉన్నది ఇది ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అనుభవంగా నేను భావన చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాహిత్య సంగీతములు లేకుండా అధ్యాత్మ లేదు అధ్యాత్మ లేని సాహిత్యం ఒట్టి జనపకట్టే ఎందుకని పోతనామాత్యుడు అన్నాడు శ్రీ కైవల్య పదంబు కోరుటకునే నేను చింతించెదన్ అన్నాడు శ్రీ కైవల్య పదం అంటే బ్రహ్మానంద పదం నాకు కావాలి అందుకై భాగవతం రాస్తున్నాను అన్నాడు నన్నయ్య గారు జగద్ధితం ఈ జగత్తు కళ్యాణం జరగాలి గనక భారతాన్ని రాస్తున్నాను అన్నాడు శ్రీయన గౌరినాపರగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ అని కొలిచిడి భక్తజనంబు వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వంబు కొలిచెద ఇష్టసిద్ధికెన్నన్నడితిక్కన హరుడు లేడు హరి లేడు రెండూ నా దృష్టిలో ఒకడే ఇదే అద్వైతం కాబట్టి నాకు నా ఇష్టదైవం ఎవరంటే హరి కాదు హరుడు కాదు హరిహరుడు హరిహరాద్వైతాన్ని ప్రతిపాదన చేశాడు విశ్వనాథవారు జన్మార్జపాయంబు తప్పించుటన్ ఈ జన్మలలో కలిగేటువంటి జన్మ రావటమే ఉపాయం కాదది అపాయం అన్నాడాయన ఈ అపాయం తప్పించడం కోసం నేను రామాయణ కల్పవృక్షం రాస్తున్నాను అన్నాడు వాల్మీకి రామాయణం రాస్తూ ఏమన్నాడంటే ఏ రామకథని నేను చూస్తూ దర్శనం చేస్తూ రా కథగా రాస్తున్నానో రాసినంత కాలము నా గుండెనిండా రాముడే నిలబెట్టి రాయించాడు ఆ రాముడే పరదైవతమై నన్ను నడిపించాడు నడిపించాలి అనుకున్నాడు వాల్మీకి భగవంతుడి కథని ప్రత్యక్షంగా చూస్తూ రాసినటువంటి వాడు వాల్మీకి అందువలన ఆయన ఆదికవి అయినాడు వ్యాసులవారు భారతం రాసిన ఇదిగో వ్యాసభాగవతం శ్రీ జయం రాసిన అష్టాదశ పురాణాలు రాసిన వేదాలు విభజించిన ఎందుకు విభజించారంటే లోకకళ్యాణార్థమై నేను చేస్తున్నాను అన్నాడు ఇది లోకానికి ఉపయోగపడు గాక లేకపోతే ఎప్పటి ద్వాపరయుగం ఎప్పటి కలియుగం ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి కూడా మనం ఇంకా మనం చేస్తున్నామంటే అది వాళ్ళ కోరిక తరం మారుతుంటుంది జనం మారుతుంటారు ఆలోచనలు మారుతుంటాయి అవసరాలు మారుతుంటాయి విలువలు పతనమైపోతుంటాయి మళ్ళీ పునః పురా వైభవాన్ని మనం సంపాదించుకోవాలంటే పునర్నిర్మాణం చేయాలంటే మళ్ళీ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనేటువంటి సత్య పరాక్రములుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోగలిగితే సత్యయుగాన్ని సత్యలోకాన్ని ఇక్కడే మనం సాధించగలం దానికి నాంది ప్రస్తావన చేసినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ మీ అందరికీ Sai Ram.