⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఇవాళ కర్మయోగి అనేది కూడా ఒక డయాస్ మీద ఇవ్వబడేటువంటి బిరుదు అయిపోయింది. వాళ్ళు కర్మ యోగులు కారు కర్మ చేసేవారు మాత్రమే. సంపదను సృష్టిస్తారు, సమాజంలో పంచి పెట్టినట్లు ఉంటారు, దాన్ని మళ్ళీ reinvest చేస్తారు వాళ్ళు కర్మ యోగులు కాలేరు. ఎవరు కర్మయోగి అంటే తన వారి కోసం మాత్రమే కాక, తన ఇల్లాలు, తన బిడ్డలు, తన మనమలు, రాబోయే తరాలకు మాత్రమే కాక, తాను జీవించి ఉన్నటువంటి కాలంలో తన కష్టార్జితం ద్వారా ఒక నియమైన-నియమమైన, నిశ్చితమైన, మనీషాయుక్తమైనటువంటి ఒక హృదయంతో ఎవరు స్పందిస్తారో, ఎవరు స్పందించి సమాజం వైపు తమ చేతులు చాస్తారో అటువంటి వారు కర్మయోగులు అవుతారు. అటువంటి వాళ్ళని మనం చాలా మందిని సంఘ సంస్కర్తలు, స్వాతంత్రోద్యమంలో వాళ్ళ జీవితాలని సమర్పించిన వాళ్ళు. వారు నిజమైనటువంటి కర్మ యోగులు. అధ్యాత్మలో ఈ కర్మ యోగాన్ని మనం ప్రవేశపెట్టుకోవాలి. పనులన్నీ చేస్తాం, చాలా మంచి పనులు చేస్తాం, మనం చూస్తూ ఉంటాం లోకంలో. ఒకసారి అనంతపూర్ జిల్లాలో ఉరవకొండ అని ఒక ఊరు ఉంది. ఆ ఉరవకొండలో స్వామి ఒక ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్లారు. అది స్వామి అవతార declaration చేసిన place అండ్ చదువుకున్న ప్రదేశం కూడా. వెళితే ఇట్లాగే ఒక పెద్ద hall ఉంది. ఎండాకాలం వెళ్లారు, మధ్యాహ్నం రెండు గంటలకు ఉపన్యాసం పెట్టారు. వెళితే ఇక అనంతపుర్ ఎండలు ఎండలు ఏమీ కనపట్టడం లేదు. ఎండమావులు చాలా glaring గా ఉన్నాయి. కానీ fan లు తిరగటం లేదు, mic పనిచేస్తోంది current ఉంది light లు వేశారు. సరే స్వామి ఒక ఐదు పది నిమిషాలు చూశారు, చూసి, "ఆ fan లు తిరగటం లేదేమీ fan లు వేయండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా" అన్నారు. అంటే ఎవరు మాట్లాడలేదు. "ఎవరు? దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? వారిని పిలవండి" అన్నారు. స్వామి ఉపన్యాసం ఆపి పిలిస్తే, "ఏమీ fan లు ఏమీ తిరగటం లేదు ఎందుకు తిప్పటం లేదు" అంటే, "స్వామి మేము ఆ fan లు వేయం" అన్నారు. మరి fan లు వేయనందుకు ఎందుకు మిగించారు అన్నారు. "కాదు స్వామి మేము వేయం, మీరు మాట్లాడండి" అన్నారు. "స్వామి నేను మాట్లాడతా, ముందు దీని జవా-- అది ఎందుకు వేయవో నాకు చెప్పు" అన్నారు. "ఏం లేదు స్వామి, ప్రతి fan కి మూడు రెక్కలు ఉంటాయి. ఒక రెక్క మీద మా నాయన పోయినాడు ఆయన పేరు రాశాను, రెండో రెక్క మీద మా అమ్మ పేరు రాశాను, మూడో రెక్క మీద నా పేరు రాసుకున్నాను. అది తిరక్కపోతే అందరూ చదువుతారు గాని తిరుగుతుంటే ఎవ్వడు చదవడు కదా, అందువల్ల నేను అవి వేయం స్వామి మీరు మాట్లాడండి" అని వాడు వెళ్ళిపోయినాడు. చివరికి స్వామి చెప్పినా fan వేయలేదు. అంటే వాడు కర్మయోగి ఎలా అవుతాడు? fan ఇచ్చాడు, మిగించాడు కానీ ఉపయోగం చేయలేదు నిరుపయోగం చేశాడు. అట్లా మనం కూడా అది జ్ఞానం సంపాదించిన, విజ్ఞానం సంపాదించిన, బాగా డబ్బు సంపాదించిన, మంచి కీర్తి సంపాదించిన, సౌశీల్యంతో ఉన్న, సుగుణాభిరాములై ఉన్న మనం చేయవలసింది ఏమిటంటే, "यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्री विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम।।" భగవద్గీతలో చిట్టచివరి శ్లోకం. ఈ శ్లోకమే ఒక వివేకానందుడిని నడిపించింది. ఎందుకని అంటే యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడి స్థాయి గురువు ఒకడు, నిత్యమూ ధనుస్సు ధరించి ఉన్నటువంటి అర్జునుడు వంటి సిద్ధుడు, సంసిద్ధుడు అయినటువంటి ఒక సాధకుడు ఇద్దరూ కన-కలిసినట్లయితే, ఈ గురువు శిష్యుడు, బోధకుడు సాధకుడు, ఆచార్యుడు అంతేవాసి కలిస్తే ఏమవుతుంది అంటే ఒక ధృడమైనటువంటి ఒక నీతి ఈ ప్రపంచంలోకి వెళుతుంది. ఆ నీతి కోసమే మనం ప్రయత్నం చేయాలి. మరి కర్మ యోగంలో మనం ఏం చేయాలి? దీనికి ఆధునిక కాలంలో మనం కొన్ని రెండు examples మనం చెప్పుకుందాం. కర్మ యోగ-- లేకపోతే ఈ తృతీయ స్కంధం ఆహ్ ఐదు నిమిషాల్లో చెప్పొచ్చు. చెప్పబడింది అంతే, కానీ అది కాదు. లోతుగా వెళ్ళాలి గనుక, భగవాన్ రమణ మహర్షి, ఆయన మరణానుభవాన్ని పొందారు. ఆత్మానుభవము, మరణానుభవము ఏకకాలంలో జరిగింది ఆయనకి. సరే ఆయన ఉన్న మదురై నుంచి అరుణాచలానికి వచ్చారు. అరుణాచలానికి వచ్చిన తర్వాత ఆయనకు ఆత్మానుభూతిలేం కలగలా. కలిగిందంతా బయటే. ఇక్కడికొచ్చి ఉన్నారు. ఎలా ఉన్నారంటే కలిగిన ఆత్మానుభవాన్ని నెలబెట్టుకొని తాను శరీరంలో చివరగా యాభై నాలుగేళ్ళు, తొలి పది-పదిహేడేళ్ళు కాక మొత్తం డెబ్బై ఒకేళ్ళు. కాబట్టి యాభై నాలుగు సంవత్సరాలు ఆ స్థితిలో ఉన్నారు. కానీ అదే స్థితిలో ఉన్నారా? కేవలము ఆత్మానుభవాన్ని పొందినట్టుగానే ఉన్నారా అంటే కాదు. పిండి రుబ్బారు, తన బట్టలు తాను ఉతుక్కున్నారు, పుస్తకాలకి అట్టలు వేశారు, పరిష్కారం చేశారు. ఎవరైనా కవిత్వం రాస్తే వాటిని పరిష్కారం చేశారు. ప్రాపంచికమైనటువంటివన్నీ కూడా తాను ఎంతవరకు చేయగలరో వాటన్నింటినీ కూడా సుకౌశలంతో చేశారు. ఆయన handwriting the best. ఆయన పుస్తకానికి అట్ట వేస్తే ఇలా వేయాలి అట్ట అన్నట్లు ఉంటుంది. కాబట్టి కర్మలన్నీ కూడా కౌశల్యంతో చేయాలి, skillful గా చేయాలి. ఆ skill లేకపోతే he will become a secondary person. కర్మలో ఉంటాడు కర్మ యోగంలో ఉండడు. ఉదాహరణకి మనం-- మన దగ్గరే ఉన్నారు కాబట్టి, వేణుగోపాలరావు గారు ఒక కంటి doctor గారు అచ్చ తెలుగులో. ఆ కంటి doctor గారికి అంత మంచి పేరు కా-రావటానికి కారణం ఏమిటి వాళ్ళ ఊళ్ళో అని అంటే రెండే కారణాలు. ఒకటి, ఆయనకున్న skill, ప్రజ్ఞ. మామూలుగా గనక అయితే ఆ యోగము పక్కనబెడితే ఆయన కూడా మామూలు doctor గారు. ఓ వంద operations చేస్తే తొంభై fail అయిపోవచ్చు. ఇక్కడ అలా కాదు. వందకు వంద success ఎందుకు అవుతాయి అంటే కర్మ సుకౌశలం. ఆ కౌశలం అనే ఆ ప్రజ్ఞ ఏది అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఒకటి. ఇక రెండవది...మిగతా వాళ్ళందరూ ఎలా ఉన్నా ఏం చేసినా తాను నమ్మినటువంటి వృత్తి ధర్మానికి సంపూర్ణమైనటువంటి ఆ న్యాయం చేయాలి. వాళ్ళు ఎవరైనా సరే వ్యవసాయదారుడైనా అంతే చివరికి మామూలుగా ఒక బట్టలు ఉతికి తీసుకొచ్చే ఆ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే తమ వృత్తిని దైవంగా భావించాలి. దైవం అంటూ ప్రత్యేకంగా లేడు. దైవమనగ వేరు దేశమున లేడు తాను చేయు పనుల యందు తగిలి ఉండు. మనం చేసే పనులే మనల్ని నిర్ణయిస్తాయి ఆయన మంచివాడా చెడ్డవాడా లోభ్యా దాతా ఇవన్నీ నిర్ణయింపబడతాయి. కాబట్టి ఈ కర్మని అంత నిష్టగా చేసినటువంటి వారు ఎవరు అంటే భగవాన్ రమణ మహర్షి. బహుశా మీలో చాలా, నేను కూడా ఆయన్ని చూడలే. వారు దేహం వదిలిపెట్టాకే నేను పుట్టా. కాబట్టి నాకు అవకాశం లేదు. కానీ next ఈ ప్రపంచం మొత్తంలో అధ్యాత్మని అటూ ఇటూ ఎంత తెరవేసినా, ఉపన్యాసాలు ఇచ్చిన వారున్నారు, అందరినీ జాగృతం చేసిన వాళ్ళున్నారు, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఊరుకున్న వాళ్ళున్నారు. తాను చెప్పిందే చేసి, తాను చేయగలిగింది మాత్రమే చెప్పినటువంటి ఒక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. ఎందుకంటే eighth standard complete చేయకుండా, ఆయన building లు చూడండి ఒక civil engineer గనక వెళితే, ఓ కొలత గనక వేస్తే అది perfect గా civil engineering లో ఉంటుంది. ఆనాడు తొలినాళ్లలో engineers ఎవరు లేరక్కడ అన్నీ ఆయనే, అన్నీ తానే చేశారు. రమణాశ్రమాన్ని దగ్గరుండి కట్టించిన వారు ఎవరంటే నిజానికి భగవాన్ రమణ మహర్షి. అన్నామలై స్వామి అనే తాపీ మేస్త్రీని ఒక్కడినే పెట్టుకొని రమణాశ్రమం కట్టించారు ఆయన. అంటే కర్మ యోగం అనమాట. ఆ యోగం దేనికి? ఆశ్రమం ఎందుకు కట్టారు? ఆయన కట్టారు గనుక ఇవాళ మనందరం రమణాశ్రమం వెళ్ళామని అంటున్నాం. అక్కడ ఏమీ లేదనుకోండి అయి ఉండేది కాదు. అలాగే సత్యసాయి భగవానుడు కూడా ఒక university పెట్టారు. ఆయన చేసిన projects మనందరికీ తెలుసు. దాని జోలికి నేను వెళ్ళటలే. కానీ ఏం చేసినా perfect గా చేశారు. అది కర్మ సుకౌశలానికి ఒక ఉదాహరణ ఏదన్నా ఒకటి రెండు చెప్పండి అంటే, నా అనుభవంలో, నా అధ్యయనంలో, నేను అర్థం చేసుకున్న దానిలో వీళ్లిద్దరే నాకు మిగిలారు. మిగతా మిగిలిన వాళ్ళంతా చెప్పిన వాళ్ళే కానీ చేసిన వాళ్ళు కారు. చేయించారేమో కానీ స్వామి స్వయంగా చేశారు. ఆఖరికి వడ్డన దగ్గర కూడా ఎంత perfect గా ఉండాలో స్వామికి మాత్రమే తెలుసు. అటు అంటే కర్మ కర్మ అనే దాన్ని యోగంగా సాక్షాత్తు భగవద్ రూపమే చేసినప్పుడు మన బోటి వాళ్ళం ఏం చేయాలి అంటే కర్మ అనే aspect నుంచి కాస్త పై మెట్టుకు వెళ్ళాలి. ఇదంతా కూడా ఉద్ధవుడు విదురుడికి చెప్పాడు. మా కృష్ణుడు ఇవన్నీ చేశాడు అని చెప్పి దుఃఖిస్తూ దుఃఖిస్తూ పొగిలి పొగిలి ఏడుస్తూ పాపం ఇవన్నీ చెప్పాడు. కానీ వియోగ భారాన్ని తట్టుకునేటువంటి జ్ఞాన సంపత్తి ఆయనకి అబ్బలేదు. కృష్ణ పరమాత్మ యందున్న ప్రేమ, కృష్ణుడితో ఉన్న స్నేహము, కృష్ణుడి పట్ల ఉన్న ఆరాధనా భావం, కృష్ణుడు అంటే ఆయన తప్ప మరొకరు లేరు అన్న ఒక నిశ్చితమైన అభిప్రాయం తప్ప ఉద్ధవుడు అంతకంటే, "నేను చెప్పలేను ఆ ఈ నాకు ఎంతవరకు తెలుసో నీకు అంతవరకు చెప్పాను మిగతాది నువ్వు మైత్రేయి దగ్గరికి వెళ్ళమన్నాడు." అంటే మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే భక్తి యోగాన్ని గురించిన విచారణ జరిగింది. ఆ భక్తి యోగంలో భక్తి మళ్ళీ యోగము. ఒట్టి భక్తి ఏమిటంటే మనం చూస్తుంటాం కొన్ని temples లో ఎప్పుడైనా మనం వెళితే లేదా మన ఇళ్ళ దగ్గర ఉన్న temples లో ఉంటే వాన రానీ, వరద రానీ, పిడుగులు పడని ఒకాయన రోజూ గుడికి వెళ్తాడు. మనం ఆయన్ని చూసి మెచ్చుకుంటాం. ప్రతి రోజూ గుడికి వెళ్తాడండి ఎంత మహా భక్తుడో అనుకుంటాం. ఇంకో ఆయన ఉంటాడు. ఆయన కష్టం వచ్చినప్పుడల్లా గుడికి వెళ్తాడు, కష్టం తీరగానే ఇంట్లోనే కూర్చుంటాడు. ఆయన రెండో ఆయన. మూడో ఆయన గుడికి ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, వెళ్లి ఏం చేయాలో తెలియదు కానీ వెళుతూ ఉంటాడు, అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉంటాడు. వెళ్లి వచ్చి ఆయన ఏం చెప్తాడంటే, "ఆ గుడిలో రంగులు పోయినాయి, పెచ్చలు ఊడిపోయినాయి, పూజారి సరిగ్గా లేడు" ఇవన్నీ మనకి చెప్తాడు వచ్చి. కాబట్టి వీళ్ళెవరూ భక్తులు కారు. ఎవరు నిజమైన భక్తుడు అంటే భగవంతుడి దగ్గర నుంచొని, సమర్పణం చేసుకొని, శరణాగతిని చెంది, "నీ వలన ఈ రోజు నా కరచరణాది అవయవాలన్నీ కూడా నడుస్తున్నాయి." చూడండి మనంతట మనం చెయ్యెత్తలేం కదా. చెయ్యెత్తడానికి ఓ mechanism కావాలి. ఆ mechanism కావాలి అంటే దాని వెనుక ఒక శక్తి కావాలి. దా అది spiritual energy గనక ఉన్నట్లయితే ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఇది కావాలని ఉండదు, ఇది లేదని ఉండదు. వీటికి అనేకమందిని ఉదాహరణలు మనం చెప్పొచ్చు అది ఇప్పుడు అక్కర్లేదు. అంటే అది ప్రధానమైనటువంటి [దగ్గు] ఆ విషయాన్ని గమనించినట్లయితే భక్తి అనేటువంటిది అన్య భక్తి, అనన్య భక్తి, పరాభక్తి అని అనేక రకాలున్నాయి. సరే నవవిధ భక్తులు మనందరికీ తెలుసు అవి ఎలాగో ఉన్నాయి. ఈ దాస్య భక్తి అనండి, ఇంకోటి అనండి అవన్నీ కూడా. కానీ అవన్నీ కూడా వ్యక్తికి వ్యవస్థకి. వ్యక్తికి పరమాత్మకి సంబంధించినవి అంటే కావు. వ్యక్తికి వ్యక్తికి సంబంధించినవి. ఈ వ్యక్తి యొక్క భక్తి, భక్తి అంటే ఏకాగ్రత. భక్తి అంటే స్థిమితమైన మనసుతో ఒకచోట కూర్చొని ఒక దానిని అంటూ దానినే వింటూ కాలాన్ని కూడా లెక్క పెట్టకుండా ఉన్ ఉండగలిగితే దాని పేరు భక్తి. మరి ఇంతేనా? ఇంతకంటే ఇంకేం లేదా అంటే వేదం ఒక శ్లోకంలో దీన్ని చక్కగా నిర్వచించింది. అదేమిటంటే ఏనకేన ప్రకారేణేష్య కశ్యాపి దేహినసంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం అని చెప్పింది. అంటే నేను ఎందుకు వచ్చాను ఏం చేస్తున్నాను నా వలన అసలు ఈ ప్రపంచానికి ఏమన్నా ఉపయోగం ఉన్నదా అని అనుకుంటూ నిరంతరము శ్రమ పడుతూ ఆలోచిస్తూ పరహితం కోసం సమాజం కోసం ఆలోచిస్తూ సంఘ జీవనాన్ని ప్రభావితం చేసే దిశగా మానవుడు తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకుంటూ వెళ్లినట్లయితే అది మాత్రమే శివ పూజ. ఇది వేదం చెప్పింది. వేదం కమ్యూనిస్టులు చెప్పేదానికంటే చాలా ఎక్కువ చెప్పింది. అది దేనినీ వద్దనలేదు కానీ అసలుది ఏమిటో చెప్పింది. తత్ ఏవ అది మాత్రమే ఈశ్వర పూజనం పూజ అని అర్థం. కాబట్టి ఈ భక్తి అనేక రకాలుగా ఉంటే భక్తిని ఒక యోగ మార్గంలోకి తీసుకుని వెళ్ళాలి అంటే యోగించాలి అంటే నీకు సగుణ భక్తి కావాలి ముందు కదా. సగుణ భక్తి అంటే ఓ బొమ్మ కావాలి ఓ స్వామి స్వరూపం ఆయన అందచందాలు ఆయన నడిచే హొయలు ఆయన చెప్పే మాటలు ఆ చాలా మందస్మిత మనోహరమైన అటువంటి ఆ దృశ్యము ఇదంతా ఒక ఎత్తు. అయితే వీటన్నింటినీ దాటి భక్తి మార్గంలో సగునోపాసనను దాటిన తర్వాత ఇంకేమైనా ఉందా అంటే భక్తుణ్ణి అడగండి దీన్ని మించి లేదండి అంటాడు. నేను ఆ విగ్రహానికి అలంకారం చేశాను, అర్చన చేశాను, అభిషేకం చేశాను ఇంకా ఏముంది భక్తి అంటే దాన్ని మించి ఏముంది? నేను ఆయనకు రోజు కొబ్బరికాయ కొడతాను, రోజు ప్రదక్షిణలు చేస్తాను, నీరాజనం ఎత్తుతాను అన్నీ చెప్తాడు. అవన్నీ ఉండవలసినవే కానీ అది మాత్రమే కాదు అని చెప్తూ ఇక్కడ కపిలుడు దేవహూతికి చెప్తున్నాడు తన తల్లికి. అమ్మా! ఇవన్నీ నువ్వు చేస్తూనే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆత్మ సమర్పణం చెయ్. నీ ఆత్మని సమర్పణ చెయ్. నీ హృదయాన్ని సమర్పణ చెయ్. నీకంటూ ఇది నాది అని గనక నీకు ఏదన్నా ఉంటే దానిని సమర్పణ చెయ్. దీనిని వేదంలో భాగవతం ఒక వేదమే, రామాయణం ఒక వేదమే. దానిలో ఏం చెప్పారంటే అంగ సమర్పణ చేయ్యమను మాట ఉంది. అంగ సమర్పణం. మన అంగ సమర్పణ అనంగానే మన కాళ్ళు మన చేతులు ఇవన్నీ మనకు గుర్తు వస్తాయి. అవే అంగాములు అనుకుంటాం. అవి మాత్రమే కాదు వాటితో పాటుగా భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు ఆ రెండు చేతులతో ఎన్ని మంచి పనులు చేయాలో అలా చెయ్. రెండు కాళ్ళు ఇచ్చాడు అవి ఎక్కడెక్కడ తిరగాలో ఎందుకు తిరగాలో ఎక్కడ తిప్పాలో ఎరిగి అక్కడ నువ్వు నడక సాగించు అని చెప్తూ ఈ కర చరణాది అవయవాల అన్నింటినీ కూడా పరమేశ్వరుడికి సమర్పించు. నాకు కుడి చెయ్యి ఇచ్చావు దానిలో నేను కుడి చేతికి బలం ఎక్కువ గనుక నా పనులన్నీ దాంతోనే చేయాలి నేను కన్నుమూసే దాకా అది చక్కగా పనిచేసేటట్టుగా చూడు. కానీ దాన్ని పరోపకారం కోసం నేను దీన్ని వాడుతానని అనుకోవాలి. అలాగే ఎడంచేయిని గురించి మాట్లాడినప్పుడు అది చేయవలసిన పని అది చేయాలి. అనేక దేశాల్లో left handers ఉంటారు left hand తో రాసి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. మరి వాళ్ళు దాన్నే ఆధారం చేసుకొని జీవితాన్ని గడపాలి. అలాగే కన్ను ఉన్నది దేనిని చూడాలో దానినే చూడాలి. చెవులున్నాయి దేనిని వినాలో దానిని వినాలి. నోరున్నది ఆ నోటి ద్వారా ఏమి అనాలో దానిని మాత్రమే అనాలి. ఈ అనాలి, వినాలి, కనాలి అనే ఈ ఇంద్రియాల అన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ గనక వెళ్లినట్లయితే అది పరమేశ్వరుడి కృప వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని నీవు నెర నమ్మి లోలోపల నమ్మి గట్టిగా విశ్వసించి జీవితాన్ని గనక నువ్వు గడపగలిగితే అది నిజమైనటువంటి భక్తి యోగం. అంతేగాని పూజాతే విషయోపభోగ రచన. పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు అవి ఇవి కాదని ఎవరు అనలే ఉండాలి. కానీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. ఈ పదాలు రెండూ వాడకుండా సత్యసాయి భగవానుడు అన్నారు ఎప్పుడూ ఎల్కేజీ అయినా కాస్త యూకేజీ కి రండి అక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా ఎక్కుతూ ఎక్కుతూ పీజీ దాకా వెళ్ళండి. పీజీకి మీరెవరూ ఎల్కేజీలోనే ఉంటే ఆ పీజీ ఏమైపోతుంది? దానికోసమన్నా వెళ్ళండి అని నవ్వుతూ చెప్పేవారు. అంటే మనం improve చేసుకుంటూ వెళ్ళాలి. మనల్ని మనం ఉత్తీర్ణులం అని మార్కులు వేసేవాళ్ళు లేరు ఎవరూ దీంట్లో. అధ్యాత్మంలో ఎవరు మార్కులు వేస్తారు? ఏమన్నా ఉందా? పేపరే లేదు ఈ దేశంలో. కాబట్టి మనల్ని మనం ఉత్తీర్ణం చేసుకోవాలి. మనల్ని మనం promote చేసుకోవాలి. promote అంటే self promotion propaganda కాదు. మనలో ఉన్నటువంటి negativities అన్నీ కూడా మంచి సత్కర్మల ద్వారా, సదాచారం ద్వారా, సమ్యక్ సంకీర్తన ద్వారా, సమ్యక్ భావన ద్వారా, సమ్యక్ దృష్టి ద్వారా. సమ్యక్ అంటే comprehensive అని అర్థం. ఇందులో కాస్త అమెరికాలో ఉన్న అమ్మాయి కూడా ఉంది గనుక ఈ పదాలు చెప్తున్నా. ఈ ఈ వేదాంత పరిభాషలో ఉన్నవి చెప్తే వాళ్ళకి సమ్యక్ ఎందుకు వాడావు అని మళ్ళీ అడక్కుండా comprehensive గా ఉండాలి. ఏ వస్తువును చూసినా సమగ్రంగా చూడాలి, సమన్వయ దృష్టితో చూడాలి, సహేతుక దృష్టితో చూడాలి, సారూప్య దృష్టితో చూడాలి. ఇవన్నీ చేయగలిగితే అది నిజమైన భక్తి యోగం అవుతుంది. మనం వెళ్తాం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. వెళ్లి ఏం చేస్తాం? ఎవరో చిన్నప్పుడు చెప్పారు యాత్రకు వెళ్ళాం అంటే పాత్ర కొనుక్కూ రావాలి అని. అప్పటికే పాత్రలన్నీ ఇంటి నిండా ఉన్నాయి. కొన్ని టన్నుల పాత్రలున్నాయి. అయినా పాత్ర కొనుక్కొని వెళ్తాడు. ఎందుకని వెళ్తాడు అంటే వెళ్ళకపోతే బాగుండదేమో అని. అక్కడ విచక్షణ వినియోగించాలి. ఆ పాత్ర కొనండి లేని వాడికి ఇచ్చేసేయండి. అవసరమైన వాడికిచ్చేయండి. వాడు ఎప్పుడన్నా రానివ్వండి. లేదు లేదు నేను నమిశారణ్యంలో కొన్నాను, దాని మీద రాయించాను అది ఎవడికీ ఇవ్వను అని అనకండి. ఇచ్చేసేయండి. ఇవ్వటంలోనే ఆనందం ఉన్నది, పుచ్చుకోవటంలో బరువు ఉన్నది. కాబట్టి ఇవన్నీ భక్తి యోగం మనకి నేర్పు నేర్పుతుంది. ఒక విదురుడు, ఒక భీష్ముడు, ఒక కుంతి మీరు ఏ పేరు చెప్పండి భారతం నుండా భాగవతం నుండా పరుచుకున్న వీళ్ళందరి పేర్లు గనక మీరు తెలుసుకున్నట్లయితే వాళ్ళందరూ భక్తి యోగంలో ఒక్కరినే వాళ్ళు సేవించారు. ఎవరు అంటే కృష్ణ పరమాత్మ.శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క ఆ మధుర విషాద గాథలో ఆయన్ని దేవుడు అన్న వాళ్ళు చాలా తక్కువ మంది, దేవుడు కాదన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. అయినా సరే ఆయన చెప్పాడు దేవుడనే వాడు ఒకడు అంటూ ఉంటే అది నేనేనన్నాడు. నన్ను అనన్య భక్తితో సేవించండి అన్నాడు. రకరకాలుగా భక్తిని గురించి ఆ భగవద్గీత ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడుదాం. కాబట్టి ఇవాళ భక్తి యోగము అనేటువంటి దానికి ఒక స్థూలమైనటువంటి నిర్వచనం మనకు కావాలి అంటే కూడి ఉండటమే. ఎవరితో కూడి ఉండటము? పరమేశ్వరుడితో కూడి ఉండటం. పరమేశ్వరుడు మనతో ఉండడుగా, physical level లో ఉండడుగా, పరమేశ్వర భావనతో కూడి ఉండటం. అంటే దేవుడున్నాడు, మళ్ళీ ఇది బాబా గారు చెప్పిన మాటే. దేవుడున్నాడు ఇదే మీకు పంచాక్షరి. ఏ దేవుడు? వాడెవరైనా కానివ్వండి. ఆ దేవుడు ఉన్నాడు అనగానే మనం అణగి ఉంటాం. నా పైన ఎవరో ఉన్నారు అంటే నేను జాగ్రత్తగా ఉంటాను. నా పైన ఇంకెవరూ లేరు, ఐ యామ్ ultimate అనుకున్న తర్వాత మనస్సు విచ్చలవిడితనానికి వెళ్ళిపోతుంది. అంటే ఈ గురువు అనేటువంటి వాడు ఒక పేపర్ వెయిట్ లాంటి వాడు. దైవం కూడా ఒక పేపర్ వెయిట్ లాంటి వాడు. టేబుల్ మీద ఒక పేపర్ పెట్టండి, fan వేయండి. ఉంటుందా అక్కడ? గాలికి ఎగిరి వెళ్ళిపోతుంది. అది నిలకడగా మళ్ళీ మనం వచ్చేదాకా అది ఉండాలి అంటే fan ఎంత తిరిగినా దాని మీద చిన్న పేపర్ వెయిట్ పెడితే, అది భగవంతుడి యొక్క శక్తి. ఆ భగవంతుడే శక్తి స్వరూపం అని గనక మనం అనుకోగలిగినట్లయితే, అనుకొని జీవించగలిగినట్లయితే, మనం ఓ ఓ దేవాలయానికి వెళ్తాం. దేవాలయానికి వెళ్ళామంటే, దేవాలయం అంటే మన దృష్టిలో అదొక structure. ఆ చాలా బాగుంది architecture కోసం ఒకడు వెళ్తాడు, శిల్పకళ కోసం రెండో వాడు వెళ్తాడు, కోరికల కోసం మూడో వాడు వెళ్తాడు. కానీ అందరం వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? ఇక్కడ ఈ భక్తి యోగంలో ఇది చాలా ప్రధానమైన అంశం. అదేమిటంటే, దేవాలయము మన దేహము ఒకటే. దేహో దేవాలయ ప్రోక్తో జీవ దైవ సనాతనః. ఇద్దరూ కలిసే సనాతనంగా, eternal గా, immortal గా ఎన్ని యుగాలు గానో ఉన్నారు అని చెప్తూ, ఈ దేహాన్ని అనేక పేర్లు పెట్టారు. ముందు దేహము అన్నాం. దేహము అంటే శరీరం అనుకోండి, తర్వాత చెప్తాం. దేహము అంటే దహయతి ఇతి దేహః. మనం వందేళ్ళు కాదు, నూట యాభై ఏళ్ళు కాదు కాదు, రెండు వందల ఏళ్ళు ఇక్కడ ఉన్నాం అనుకోండి, కానీ ఏదో ఒక రోజున దేహం వదిలి పెట్టాలి కదా! వదిలిపెట్టిన తర్వాత అది దహింపబడుతుంది గనుక దీనికి దేహము అని పేరు. శ్రియతి ఇతి శరీరః. నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది గనుక దీనికి శరీరం అని పేరు. మన బాల్య కౌమార యవ్వన దశలు ఇవాళ ఉన్నవి, మన photo album ఇరవై ఏళ్ల నాటితో, నలభై ఏళ్ల నాటితో ముందు పెట్టుకుంటే, అప్పుడు అట్లా ఉన్నానా, అప్పుడు ఎంత బాగున్నానా, ఇప్పుడు ఇలా ఉన్నానా అని మనమే అనుకుంటాం. మన photo యే మనం నమ్మకం ఉండదు. మన చిన్నప్పటి photo గనక ఇస్తే ఎవరు వీడు అని అడుగుతారు మనల్ని. అది నేనే అంటే, నువ్వు కాదయ్యా, నీ స-- నీ photo ఏదంటే, నా photo ఇవాళ్టిది, అది ఎవరిది అంటే అది మనదే. మనకు తెలియకుండా అనేక మార్పులు శరీరంలో జరుగుతాయి. అలాగే కవచము అని దీనికి పేరు. పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహం, five elements తో వచ్చినటువంటి ఈ దేహం. ఈ మొత్తం లోపల ఉన్నదంతా anatomy యే, అస్థిపంజరం. దానిలో అక్కడక్కడా కొన్ని అవయవాలు ఉన్నాయి. కానీ పైన బహు సుందరంగా ఎందువల్ల కనిపిస్తున్నది అంటే, దీని మీద కప్పబడినటువంటి చర్మం వలన. ఈ చర్మము వలన అది మనకు కవచం అవుతున్నది. ఆ కవచము అని దేహానికి పేరు. కాబట్టి దేహము, శరీరము, కవచము. ఇక తర్వాత, దేవాలయం. రథం అని కూడా పేరుంది. ఎందుకంటే, పది గుర్రాలు నడిపిస్తుంది. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు క-కలిపి ఈ దేహం నడుస్తూ ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా. ఈ దేహానికి ఓ రథం అని కూడా పేరు. రథం అయిన తర్వాత దేవాలయము అని గనక అనుకున్నట్లయితే, ఎందుకు దేవాలయం అయిందంటే, దైవము యొక్క పూర్ణ స్వరూపము, సూక్ష్మ సూక్ష్మేతరమైనటువంటి, చాలా subtlest of the subtle గా ఉండేటువంటి ఆ స్వరూపం ఏదంటే అది ఆత్మ. ఈ దేహంలో ఉన్నది గనుక, దానివలననే మన మనస్సు, మన ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి గనుక, ఇదంతా ఒక సమన్వయంగా సాగుతున్నటువంటి ఒక విధానం కనుక ఇది దేవాలయం అవుతున్నది. సరే ఓ దేవాలయంలోకి మనం వెళ్తాం. వెళ్ళగానే దానికి ముందు ఒక ప్రాకారం ఉంటుంది. అంతే కదా? చుట్టూ గోడ ఉంటుంది. ఆ ప్రాకారం ఈ దేహానికి కూడా ఉంది. మనందరికీ ఉంది. మనల్ని నుంచోబెట్టి ఒక artist ని బొమ్మ గీయండి మా బొమ్మ అని గనక అడిగితే artist ముందు మన బొమ్మ గీడు, outline గీస్తాడు. దానికే ప్రాకారము అని పేరు. ఆకారానికి ఉండవలసినది ప్రాకారం. దేవాలయానికి కూడా ప్రాకారం ఉంటుంది. ప్రాకారంలో నుంచి మనం లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభము అంటే దానికి వేదాంత భాషలో వీణాదండం అని పేరు. మనం మన శరీరాన్ని మనం పోల్చుకుంటూ ఉంటే ఇవి అర్థమవుతాయి. మనక్కూడా వెన్నెముక ఉంది. వెన్నుపూస అంటాం. అది వీణాదండం. అది మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు దాటి సహస్రారం దాకా వెళ్ళింది గనుక, ఇదంతా కూడా ఈ దేహంలోనే దేవాలయంలాగా వెన్నుపూస వంగిపోయినా, ఒక పూస అరిగిపోయినా దేహం యొక్క స్వరూపం మారిపోతుంది. కనుక మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం తాకి నమస్కరించేది దేన్నీ అంటే ధ్వజస్తంభాన్ని. అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. తొందరగా వెళ్ళాలి మనం. ఎందుకు? లోపల ప్రదక్షిణాలు చేయాలి కదా! కనీసం మూడు చేస్తాం. ఒకటి ఎవరు చేయరు. మూడు. మొదటిది వెళుతూ మనం ఏమనుకోవాలంటే, ఈ సర్వాంగీణమైనటువంటి, సర్వాంగములతో కూడినటువంటి ఈ దేహం, ఈ స్థూల శరీరాన్ని నీవే రక్షిస్తున్నావు గనుక నీకు ప్రథమ నమస్కారం అంటూ తొలిరౌండు పూర్తి చేయాలి. మళ్ళీ రెండోది, ఇది మాత్రమే కాదు, రాత్రికి నేను నిద్రపోయినప్పుడు నాకు నిద్రావస్థ ఏర్పడుతుంది. ఆ నిద్రావస్థలో కూడా నన్ను కాపాడుతున్నటువంటి నీకు నమస్కారం అని రెండోది చేస్తాం. మూడవది కూడా చేస్తాం. అదేమిటంటే, ఇటు కలా మెలకువా కాని ఒకానొక స్థితి నాకు ఏర్పడినప్పుడు, నీవు నాలోనే మహా కారణ శరీరమై ఉండి, నన్ను ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి నాలుగు కలిపి ఏడువునయ్యే, ఈ ఏడింటిని కూడా నీవు చూస్తున్నావు గనుక నీకు నమస్కారం చేస్తున్నాం అని చెప్పటం కోసం మూడు ప్రదక్షిణాలు చేయాలి. అదేం విధివిధానం కాదది. కానీ దాన్ని ఆ శాస్త్ర ప్రమాణం అది కాబట్టి. ఇక తర్వాత, ఇది అయిపోయిన తర్వాత మనకి గంట కొడతాం. గంట కొట్టడం అంటే ఆయనకి నేను వచ్చాను అని చెప్పడం. నీ దగ్గరకు నీ దాకా రాగలిగాను అని చెప్పడం. నీ దాకా రాగలిగి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర నుంచోగలిగాను అని చెప్పడం కాబట్టి అది వినయంగా సమర్పించుకోవటానికి ఒక కొలిమి ఇట్టు. ఆ తర్వాత వీడు నెమ్మదిగా మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్లి మూలవిరాట్ దగ్గరికి వెళ్తాం. ఇవాళ మూలవిరాట్ కి ఫ్లడ్ లైట్స్ వేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఆగమ శాస్త్రం ప్రకారం అలా లైట్లు వేయటానికి లేదు. దీపం నూనె దీపం వెలిగించాలి. ఆ కాంతిలోనే ఆయన నీరాజనం ఇచ్చేటప్పుడు, ఇగో పాదాలు, ఇగో అరచేతులు, ఇది స్వామి భుజం, స్వామి కంఠం, స్వామి నుదురు ఇవన్నీ ఆయన చూపిస్తూ ఉంటే మన మనస్సు పరమాత్మ యొక్క ఆ శరీర ఆకృతిని మనం చూస్తూ అనుభవిస్తాం. ఆ ఆయనే అసలు పాలరాయి దాని మీద మళ్ళీ ఫ్లడ్ లైట్ ఏం కనపడదు మనకి. మనం ప్రత్యేకించి ప్రయత్నం చేయక్కర్ల. కనుక ఇక్కడ కూడా అధ్యాత్మలో, ఇవాళ వెళ్ళాం రేపటికల్లా అధ్యాత్మ అంతా వచ్చేసింది. అని ఎవరో గురువుగారి దగ్గరికి వెళ్ళాం మొత్తం మాకు చెప్పేశారంటే, ఆయన చెప్పి ఉండవచ్చు గాక, దానిని ప్రాక్టీస్ చేయటానికి మనకి జీవితకాలం చాలదు. చెప్పగలిగిన వాడు ఆయన విషయాన్ని మనం వదిలేద్దాం. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఆయన మనకేదో మనం తీసుకెళ్లిన ఒక కొబ్బరికాయ కొడితే ఆ సగం చిప్ప మన చేతికి ఇస్తారు. మనం ఏం చేస్తామంటే అది తీసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ఆగాలి. ఎందుకు ఆగాలి? ఆ ఆగటమే, నిదానమే, ఎరుకే, ఎదురు చూపే ప్రధానం. అయిన తర్వాత కాసేపు కూర్చొని వెళ్ళండి అంటారు. కూర్చొని వెళ్ళకపోతే ఏమన్నా అయిపోతుందని కూర్చుంటాం. అందుకోసం కూర్చోకూడదు. కూర్చోకుండా వెళ్ళినా ఏమీ కాదు. అయ్యేది ఎందుకు కూర్చోవాలంటే, ఏ ధ్వజస్తంభాన్ని నువ్వు తాకి గర్భాలయం దాకా వెళ్ళి దైవతాన్ని దర్శించావో, ఆ దైవత దర్శనం అయిపోయిన తర్వాత, నీ మనస్సుని కాసేపు నిలకడ చెందించాలి. దానిని హాయిగా ఉంచే, దానికి ధ్యానం అని పెద్ద పేరు పెట్టొద్దు. మామూలుగా కూర్చోవాలి. కూర్చొని ఏకాగ్రంగా వినాలి. దేన్నీ వినాలి? బయటేమో ఆ రణగొణ ధ్వనులున్నాయి. హోలాహల ఉంది. ఏం వినపడుతుంది అంటే, ఈ ధ్వజస్తంభం చివర గాలికి కదలాడేటువంటి చిరు గజ్జెలు, చిరు మువ్వలు ఉంటాయి. వాటి ఆ మరుసవ్వడి మనం వినగలిగినట్లయితే అప్పుడు మనం దేవాలయానికి వెళ్ళినటువంటి ఆ ప్రయోజనం మనకు సిద్ధించినట్టు లెక్క. అంటే ఈ శబ్దం, ఈ ఈ వీణాదండం, ఈ వెన్నెపుస మనకు ఎట్లా ఉన్నదో, దేవాలయానికి కూడా అలాగే ఉన్నది గనుక దే దేహాన్ని దేవాలయం చేసుకోవాలి. అందుకనే బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి, నిరంతర అలంకారము, నిరంతరమైనటువంటి అర్చన, ఇవన్నీ కూడా మన దేహానికి మనం చేసుకోవాలి. మనకి అర్చన, అభిషేకము, ఆరాధన ఏంటంటే చక్కగా డ్రెస్ చేసుకోవటం. ఖరీదైన బట్టలు కాదు. శుచి అయిన బట్టలు కట్టుకోవాలి. ఇవన్నీ కూడా అధ్యాత్మ పరంగా గనక చూసినట్లయితే సనాతనంగా మనకు చెప్పబడిన ఈ విశేషాలన్నీ కూడా దైవానికి దగ్గరగా మనల్ని తీసుకువెళ్ళేటువంటి సంగతులు. కాబట్టి భక్తి యోగం అనేదానికి అధ్యాత్మ ఎంతగా సన్నిహితమైందో చూడండి. మాకు భక్తి చాలండి, మాకు జ్ఞానం అక్కర్లేదు. అది అందదు. అది అందేది కాదు. మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి జ్ఞానం అంటే శాస్త్రాలు రావాలి, పురాణాలు రావాలి, శ్లోకాలు రావాలి. అది జ్ఞానమా? అది ఏమీ జ్ఞానం కాదు. అది విజ్ఞానం యొక్క రేఖ. దాన్ని ఇక్కడ మైత్రేయ మహర్షి చక్కగా విదురుడికి ఈ విషయాలన్నీ చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఈ భక్తి నీకు ఎప్పుడు యోగిస్తుందంటే, పరమేశ్వరుడిని నీ యొక్క ప్రతిరూపంగా భావించమని. అసలు నీకు ఆయనకు ఏం తేడా లేదనే భావనలో గనుక నువ్వు వెళ్ళగలిగితే అది నిజమైనటువంటి భక్తి యోగం. మిగతాదంతా విభక్తి యోగమే. అడు, ఆయన, ఆమె, అతడు, వచ్చాడు, వచ్చింది, వెళ్ళింది ఇదంతా ఎవరో గురించి చెప్తున్నాం. మన గురించి మనం చెప్పుకోగలిగి, మన గురించి మనం తెలుసుకోగలిగి, మనం పొందవలసిన దాన్ని మనం పొంది, ఆ పొందిన దాని ద్వారా పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడన్న నిశ్చితమైనటువంటి భావనలో గనుక మనం ఉండగలిగినట్లయితే అది నిజమైనటువంటి భక్తి యోగము. ఎప్పుడైతే ఇటువంటి భక్తుడు ఒకడు దొరికాడు అనుకోండి, జీవితంలో కనపడ్డాడు అనుకుందాం. మనం కూడా నెమ్మదిగా ప్రవేశించేస్తాం. ఎంత ఆనందాన్ని పొందుతున్నాడు, ఓ భజన చేస్తున్నాడు, సంకీర్తన చేస్తున్నాడు. ఉదాహరణకు త్యాగరాజ స్వామి వారు. ఆయన అంటారు, రాముని గురించి చెప్తూ భక్తి యోగంలో పరాకాష్టకు వెళ్ళిపోయి, మరుగైలరా ఓ రాఘవా! ఆ కీర్తన గుర్తు తెచ్చుకున్నట్లయితే, నిన్ను తెలుసుకోవాలంటే నాకు ఈ శాస్త్రాలు అక్కర్లేదు. ఇంత విచారణ, ఇన్ని మాటలు నాకు అక్కర్లేదు. నిన్ను ఎలా తెలుసుకున్నానో రామా తెలుసునా? తిన్నగా విధికి తెలుసుకుంటినయ్యా. తిన్నగా డైరెక్ట్ గా వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే, అసలు నువ్వు వినా పరదైవతలు లేదని నేను నమ్మాను. నువ్వు లేకుండా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవని నమ్మాను. కనుక తిన్నగా వెళ్ళినందువల్ల నువ్వు నాకు కనపడ్డావు అన్నాడు. ఎప్పుడైనా అంతే కదా. లొకేషన్ పెట్టండి అంటే ఎందుకు పెడుతున్నాం? GPS ఆన్ చేయండి అంటే ఎందుకు ఆన్ చేయమంటున్నాం? మనల్ని తీసుకెళ్తుంది అక్కడికి అని నమ్మకం. అది సరిగ్గా చూపించనప్పుడు మన మార్గం మనం ఎన్నుకొని వెళ్ళిపోతూ ఉంటాం.