⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఒక ఎత్తయితే "కృష్ణం వందే జగద్గురుం" అలవాటైపోయింది మనకి. "కృష్ణం వందే సనాతనం" అన్నది వేదం. సనాతనమైనటువంటి ఒక వేదము ఆకారం తీసుకుంటే అది కృష్ణ పరమాత్మ. "కృష్ణం వందే సనాతనం". సనాతనం అంటే ఇప్పటిది కాదది, ఎప్పుడూ కృష్ణుడిగా కనిపిస్తున్నాడు. ఈనే ఇంతకుముందు రాముడై వచ్చాడు. ఆ రాముడిలో అంశగా పరశురాముడు వచ్చాడు. ఆ రాముడిలో అంశ అంశగానే ఇంకొక రాముడు వచ్చాడు. ఆ రామత్వాన్ని వదులుకోలేక రామ, బల అనే రెండు పేర్లతో బలరాముడిగా మళ్ళీ కృష్ణుడితో వచ్చాడు. కాబట్టి ఈ రామకృష్ణ అవతారాలు రెండూ కూడా భారత జాతిని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి అవతారాలు. ఒకటి ధర్మాన్ని ఎలా కాపాడాలని చెప్తుందో అది రాముడైతే, ధర్మ సంరక్షణలో నిబద్ధతగా శత్రు సంహార క్రీడ చేయవచ్చును, అధర్మం నశించకపోతే ఇక ధర్మం మిగలదని చెప్పినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందుకనే ఈయన పదవ స్కంధంలో భాగవతంలో దశమ స్కంధాన్ని కృష్ణ పరంగా మొత్తం అంకితం చేశారు. అది ఒక పావుగంటలో అరగంటలో ఇది మనకు time చక్కగా దొరికింది. రేపు నుండి ఎల్లుండి ఐదవ తారీఖు దాకా దశమ స్కంధం అయిపోయిన తర్వాత చివరగా ఎవరూ చెప్పనటువంటి రెండు స్కంధాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఆ రెండు ఏమిటంటే ఏకాదశ ద్వాదశ స్కంధాలు రెండు. ఏకాదశ స్కంధం గనక అర్థం కాకపోతే తెలుసుకోకపోతే ఈ భాగవత ప్రవచనానికి సంపూర్ణత్వం లేదు. కానీ ఇక్కడ ఆపేస్తారు. దశమ స్కంధం అయిపోయింది, కృష్ణుడు రుక్మిణీ కళ్యాణం అయిపోయింది అంటారు. రుక్మిణీ కళ్యాణం దాటిన తర్వాత అనేక విషయాలు చెప్తాడు భాగవతంలో. ఆ ఏకాదశ స్కంధంలో అలాగే ద్వాదశి స్కంధం పన్నెండవ స్కంధం కూడా చాలా ఉదాత్తమైనది కానీ గంభీరమైనది కథలు ఉండవు. మళ్ళీ abstract లోకి వెళ్తాం. ఏ అధ్యాత్మతో ప్రారంభమై ఏ అధ్యాత్మతో ముగియబోతున్నదో దాని మధ్య చెప్పినదంతా metaphysical కథలు. ఈ కథలలో నుంచి మనకి నిరంతరము ఒక నీతి ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వాన్ని ఎలా బొమ్మ గీసుకుని ఒక నిర్మాణం చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి గనుక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా కథరాన్ని ఆయన పుట్టుకొని వాటి వెనుక ఆయన చేసిన లీలల వెనుక, లీలలు ఏం చేసాడో అందరికీ తెలుసు. పూతను చంపాడు, తృణావర్తుణ్ణి చంపాడు, వృషాసురుణ్ణి చంపాడు మనకన్నీ కథలు తెలుసు. కానీ మూలం ఏమిటి? ఎందుకు చంపాడు వాళ్ళని? శకటాసురుణ్ణి ఎందుకు చంపాడు? ఆ చంపటం వెనుక ధర్మ నిర్ణయం అయిందా? ధర్మ సంస్థాపన కోసం చేశాడా? లేదు తన శక్తి ఇంత గొప్పది అని చెప్పడానికి చేశాడా? అవన్నీ కూడా మనం తాత్విక విచార ధారలో మనం అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది రేపటి సంగతి. ఇక భాగవతం మనం జ్ఞానం కోసం చదువుదామా, ముందు కథ కోసం చదువుదాం. తర్వాత విజ్ఞానం కోసం చదువుదాం. తర్వాత ధర్మ నిర్ణయం చేయటానికి భాగవతంలో ఏర్పడిన అనేక ధర్మ ప్రక్రియలన్నీ కలిసి ఒక గ్రంథం ఏర్పడింది, దాని పేరు ధర్మ సింధువు. అవి ఈ కాలానికి చెల్లుబాటు కావు. అన్నీ కావు. కొన్ని అవుతాయి. అన్నీ ఆ పరిణామ దశలో అన్నీ మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఆ నిజాం నవాబు యొక్క నాణేలు ఆ రోజుల్లో చలామణి అయినటువంటి నాణేలు. ఇప్పుడు గనక మనం బజారుకు తీసుకెళ్తే చదువు రాని వాడు కూడా అది పనికిరాదు అని చెప్తాడు. నవంబర్ eighth న మన దగ్గర ఉన్న వెయ్యి రూపాయల నోటు పనిచేయదని పెద్దాయన చెప్తే పనికిరాకుండా పోయింది. అవునా కాదా? అంటే మన కాలంలోనే ఒక నాణెమో currency చెల్లకుండా పోయింది. అట్లాగే ఒక యుగానికి ఉన్న యుగ ధర్మం రెండో యుగంలో ధర్మంగా మారదది. విలువలు మారుతాయి, అవసరాలు మారుతాయి కానీ ధర్మం మారదు. ధర్మం స్థిమితమైనది. ధర్మ మూలం తెలిసిన వాడికి ఏ అధర్మము ధర్మము లేకుండా జీవితం సాగుతుంది. అందుకనే వేదాల గురించి, రాముడి గురించి చెప్పాం, కృష్ణుడి గురించి చెప్పాం. మరి వేదాల గురించి ఏం చెప్తారు? దాంట్లో ఏమున్నదంటే "వేదోఖిలో ధర్మమూలం". వేదమంతా అఖిలమైన ధర్మమూలమే దాని యందున్నది గనుక వేద పఠనం చేయాలి. వేదం వెల్లవేయటం కాస్త నాలుగు రోజులు కష్టపడితే వేదం నోటికి వస్తుంది. వేదార్థం చెప్పగలిగిన, వేద భాష్యం చెప్పగలిగిన, వేదార్థం చెప్పగలిగిన, వేదమే గమనంగా చేయగలిగినటువంటి అటువంటి గురువులు ఈ రోజు ఈ కాలానికి కావాలి. అందుకనే "మధుశ్చ మాధవశ్చ వాసంతీకా వృతౌ" అంటుంది ఋగ్వేదం. "మధుశ్చ మాధవశ్చ వాసంతీకా వృతౌ" అదే మన వేళ ఉగాది అని మనం పేరు పెట్టుకున్నాం. ఆ ఉగాదిలో మధువు వస్తుంది, మాధవుడు వస్తాడు ప్రపంచంలోకి. మాధవుడు అంటే పరమాత్మ ప్రకృతి అనేటువంటి వస్త్రాన్ని ధరిస్తాడు. అందువలన "మధుశ్చ మాధవశ్చ". మధువు అంటే తేనె. వసంత కాలంలోనే పూలు విరగ పూస్తాయి. దానిలో నుంచే తేనెటీగలు ఇవన్నీ కూడా తేనెని తీసుకుని వెళ్లి మన కోసం దాచిపెడతాయి. మనం కాల్చగానే అవి మరణిస్తాయి చూడండి. వాటి శ్రమంతా మనం దోపిడి చేస్తాం. అది పెట్టగానే దానికి నిప్పు పెడతాం మనం. ఆ నాలుగు బిందువుల కోసం. కానీ అది నిజానికి దాచిపెట్టేది కూడా దాని కోసం కాదు. ఏ తేనెటీగ కూడా తేనె చుక్కని తాగదు. పరుల కోసం, ఇతరుల కోసం ఆ తుట్టె పెడుతుంది. చాలా చాలా పెద్ద పెద్ద తుట్టెలు వస్తాయి. అది ఏర్పడేటువంటి కాలం ఏమిటంటే వసంత కాలమే. ఆ వసంత కాలము మాధవుడు కూడా ఉంటాడు. మాధవుడు అంటే మళ్ళీ కృష్ణుడు విష్ణుమూర్తి అని కాదు. మా అంటే భూమి. ధవుడు భూమికి భర్తగా ఉంటాడు. వసుంధరకి భర్తగా ఉంటాడు. కాబట్టి దీనినంతా ధరించి ఆ వసంత కాలమంతా నిలబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ మాధవుడిగా ఇక్కడికి మన మధ్యలో మెసలి మిగిలిన ఋతువుల అన్నింట్లోనూ కూడా మన జీవితాలు చల్లగా హాయిగా సాగేట్టుగా దానికి కావలసినటువంటి ఔషధీయుక్తమైనటువంటి అనేకమైన సంగతులు మనకన్నీ అందిస్తూ ఆ మాధవుడు భూమిని తన భార్యగా చేసుకుంటాడు.తన భాగస్వామినిగా చేసుకుంటాడు జీవిత భాగస్వామిగా చేసుకుంటాడు చేసుకొని ఆ భూమిలో నుంచి ఏ ఏవి బయటకు రావాలో ఎట్లా పుట్టాలో ఏది పుడితే మానవజాతికి ఇదంతా అందుతుందో ఇవన్నీ చెప్తాడు గనుక మధుష్య మాధవస్య వాసంతీ కా వృతౌ అని మనం ఉగాదిని అలా ప్రారంభిస్తాం ఆ రోజున కూడా తేనె తెచ్చుకుంటాం కొత్త ఆ పుట్ట తేనె తెస్తాం ఎందుకని తెచ్చుకుంటాం అంటే పుట్ట తేనె పెట్టిన తేనే పుట్ట తేనె ఆ పుట్ట ఆకాశంలో ఉంటుంది పాము పుట్ట నేలలో ఉంటుంది నేల మీద ఉన్న పాము పుట్టలో తేనె లేదు విషం ఉన్నది ఆకాశమంత ఎత్తున ఉండేటువంటి ఈ తేనెటీగలో అమృత భాండ అమృత చిరుకులు ఉంటాయి కాబట్టి ఇదంతా ఒక వేద ప్రామాణికమైన ఒక సమగ్రమైన అటువంటి విజ్ఞాన భాండాగారం ఈ భాగవతం దీనిని మనం చక్కగా చదివి రేపటి నుంచి ఇంకా అంతా కథలే అంతా కృష్ణమాయే అంతా కృష్ణలీలలే వాటన్నింటినీ కూడా మనం ఆకళింపు చేసుకొని అంతరార్థాన్ని గ్రహించి ఆ అంతరార్థాన్నంతా కూడా మనం మన పిల్లలకి ఇక్కడికి రాలేకపోయిన వారికి ఇక్కడ మీరు ఏమి నేర్చుకున్నారో ఏమి తెలుసుకున్నారో మననం చేసుకొని ఎక్కడైనా రాసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా ఒకళ్ళకొకలు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతిరోజూ జరిగేదే భాగవత ప్రవచన మహా ప్రవాహం ఇది ఏదో ఒక రోజు జరిగేది కాదు ఇది నిరంతరాభ్యాసం తో జరుగుతూ ఉంటుంది గనుక రేపు దశమ స్కంధాన్ని మనం ప్రారంభించుకుందాం శ్రీరాముడి పట్ల పోత నామాచార్యుల యొక్క గౌరవాన్ని మనం ఆస్వాదించుకొని మనం ఆ బలి చక్రవర్తి కథ అలాగే అంబరీషుడి కథ ప్రహ్లాదుడి కథ అలాగే గజేంద్రుడి కథ ఇవన్నీ చెప్పుకోగలిగాము చెప్పుకున్నాము అంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి link up అయి ఉన్నాయి అవి అలా ఏర్పడ్డాయి ఆ ఏర్పడిన దాంట్లో ప్రహ్లాదుడు భక్తితో వైర భక్తితో ప్రహ్లాదుడి కథ జరిగింది వైర భక్తి హిరణ్యకశిపుడిది మధురమైన స్పష్టమైన భక్తి ప్రహ్లాదుడిది హిరణ్యకశిపుడు భోగాన్ని ఆశించాడు కానీ యోగాన్ని పొందాడు యోగాన్ని ఆశించిన ప్రహ్లాదుడు భోగాన్ని పొందాడు గజేంద్రమోక్షంలో ఇంద్రియాలని శరీర బలాన్ని అంటే దేహ బలాన్ని నమ్ముకున్నటువంటి ఒక అతిశయించిన ఇంద్రియాలు కలిగిన గజేంద్రుడు అనేటువంటి వాడు తన దేహ పరిమితి ఎప్పటికైనా చిన్నదేనని అల్పమైనదని పరమాత్మ యొక్క శక్తి లేకపోతే మనం దేని నుంచి బయటపడలేమని మనం ఈ శరీరాన్ని ఈ భావాన్ని ఈ తత్వాన్ని వదిలిపెట్టి మళ్ళీ మన మూల స్థానంలోకి వెళ్ళాలి అంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నువ్వు తప్ప నాకెవరూ దిక్కు లేదు నీకు శరణు పొందుతున్నాను అనేటువంటి భావన కలిగించేది గజేంద్రమోక్షం అలాగే శ్రీకృష్ణ పరమాత్ మహావిష్ణువు యొక్క లేదా దైవం యొక్క మనందరికీ ఆశ ఉంటుంది ఉత్కంఠ ఉంటుంది భగవంతుడికి కూడా ఉత్సాహం ఉంటుందా అని భగవంతుడి ఉత్సాహం ఒక్కటే గజా ప్రాణావనోత్సాహి భక్తుడి యొక్క ప్రాణాన్ని రక్షించడమే భగవంతుడి యొక్క ఉత్సాహం దాన్ని ఆధారం చేసుకొని గజేంద్రమోక్షం నడిచింది వామనావతార ఘట్టాన్ని ఒకసారి మనం review చేసుకున్నట్లయితే పునః సింహావలోకనం చేసినట్లయితే దానిలో దానం చేయండి భావంతో చేయండి అహంకారంతో కాదు దానవ అహంకారము దానా అహంకారము కలిసిన ఒక బలి చక్రవర్తి తన వాకిట్లోకి వచ్చినటువంటి వటువికి తన సర్వ సంపదలన్నీ తన వంశాన్ని కులాన్ని ధారపోసి తాను ఆ పరమేశ్వరుడి యొక్క అధీనంలో సుదర్శన చక్రం యొక్క కాంతి రక్షణలో నిరంతర నారాయణ స్మరణం చేస్తూ ఇప్పటికీ పాతాళ లోకంలో మన మసలుతున్నాడు కాబట్టి అహంకారంతో దానం చేస్తే మనం లోపలికి పాతాళంలోకి వెళ్తాం దానం చేయండి just forget మర్చిపోండి స్వామి చెప్పేది అదే give and forgive get and forget అంతే వదిలిపెట్టేసేయ్ కాబట్టి అది మనకి బలి చక్రవర్తి అనేక కథలు చెప్తుంది ఆ వామనుడిని కొడుకుగా పొంద వామనుడి వంటి వాడిని కొడుకుగా పొందాలనుకున్న రత్నావళి ఆ అటువంటి వాడు ఒకడు పుడితే వాడికి తల్లిదే వాడిని చంపుతానని బయలుదేరిందే మానవ ప్రవృత్తులు ఎలా ఉన్నాయో చూడండి అందుకనే స్వామి కూడా చాలా సార్లు అంటారు మీ పనులు అయ్యేంతవరకూ పుటపర్తిలో ఎక్కడ మీరు ఉంటే అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సాయిరాం సాయిరాం సాయిరాం అంటూ ఉంటారు ఎప్పుడన్నా మీరు అనుకున్నది జరగకపోతే సాయిరాం అని తొడగొడతారు మీరు ఇది భక్తికి మంచిది కాదు అని చెప్పారు సాయిరాం అనేది ఒక నిర్ణయం చేసుకొని ఉండాలి సాయిరాం చేయటానికి వీల్లేదు ఆయనకి ఆయనకి challenge విసరటానికి మన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇటు ఇటువంటి రత్నావళి కథ మనకి చెబుతుంది అలాగే గురువైనటువంటి వాడు నిజమైనటువంటి గురువైనటువంటి వాడు తాను ఒక్కడే మోక్ష పదం వైపు వెళ్ళటానికి వీల్లేదు తాను వెళుతూ కొన్ని వేల మందిని తన వెంట తీసుకొని వెళ్ళాలి అందులో అసమర్థులు ఉండొచ్చు సాధన చేయలేని వాళ్ళు ఉండొచ్చు సాధన చేయటం తెలియని వాళ్ళు ఉండొచ్చు చేస్తున్న సాధన వలన అతిశయించిన వాళ్ళు ఉండొచ్చు కానీ వీళ్ళందరినీ కలుపుకొని ఎప్పుడైనా ఆ సాధనలో ఒక మంచి పని చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు చేయమని ప్రోత్సహించేవాడు సద్గురువు చేస్తే నువ్వే పాడైపోతావని చెప్పేవాడు శుక్రాచార్యుడు వంటి వాడు పైగా ఆత్మ విచార మార్గంలో ఆత్మోద్ధరణ వైపు మనం వెళుతూ ఉన్నప్పుడు ఇటువంటి శుక్రాచార్యుడు వంటి గురువు గనుక మనకు దొరికితే కనపడితే తారసపడితే పక్కకు నెట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి అక్కడ మన నిర్ణయమే ప్రధానం కావాలి మన మనీషా మన conviction నేను చేస్తున్నది సత్కర్మమైనదే నేను చేస్తున్న ఈ దానం గాని ఈ పని గాని ఈ వ్రతం గాని ఈ యజ్ఞం గాని సర్వహిత జన సమ్మతంగా నేను చేస్తున్నానన్న ఆ తీవ్రమైనటువంటి భావనలో మనం గనుక ఉండగలిగినట్లయితే అక్కడ గురువు అవసరం మనకుండదు.ఆ గురువు అనేటువంటి వాడు మనల్ని ఉత్తేజ పరచాలి, ఉద్వేగ పరచకూడదు. అనుద్వేగకరం వాక్యం. అలాగే సత్యం పలకాలి. ఎప్పుడైనా ఒక కష్టమైన మాట ఇతరులకి బాధ కలిగించే విషయాన్ని convey చేయాలి అన్న అనుద్వేగకరంగా చెప్పాలి, ఉదారంగా చెప్పాలి, నెమ్మదిగా చెప్పాలి. సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ న బ్రుయాత్ సత్యం అప్రియం. ప్రేమగా సత్యం చెప్పాలి, నెమ్మదిగా చెప్పాలి. ఎవరో పోయారు అనుకుందాం, "ఇగో మీ వాళ్ళు ఎవరో చచ్చిపోయారు" అని చెప్పకూడదు. నెమ్మదిగా బానే ఉన్నాడు, బాగా ఉంటున్నాడు, ఏదో ఒంట్లో బాలేదు ఇవన్నీ నెమ్మదిగా సత్యమే చెప్పాలి. ఆ సత్యాన్ని ప్రియంగా చెప్పాలి, నెమ్మదిగా చెప్పాలి, నాగరికంగా చెప్పాలి, మర్యాదగా చెప్పాలి, విద్యతో కూడి చెప్పాలి, విజ్ఞతతో కూడి చెప్పాలి, వినయంతో చెప్పాలి, నెమ్మదిగా చెప్పాలి, మంద్రంగా చెప్పాలి. ఇవన్నీ కూడా మనకు భాగవతం అంతా నేర్పేటువంటి అనేకమైన రీతులవి. భాగవతం అంటే కేవలం పురాణ కాలక్షేపం కాదది. It is not just a pass time కాదు. లేదు time pass చేసేది కూడా కాదు. చాలా లోతులకు వెళ్ళాలి. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. "నువ్వు నిజమైన సాధకుడివి గనుక అయితే ఎలా ఉండాలి అంటే సముద్రం దాకా వెళ్తావు కదా, సముద్రం ఒడ్డున నుంచొని ఓ ఆలిచిప్ప నాకు నాలుగు ముత్యాలు తీసుకురా నువ్వు అడిగితే అది ఇవ్వదు. నువ్వు అట్లా ఎన్ని యుగాలు నుంచున్నా సముద్రాన్ని కాళ్ళ వైపు నెట్టుకొని తీసుకొచ్చేదాన్ని చిల్లి గవ్వలు తీసుకొస్తుంది. గులకరాళ్లను బయటకు నడుస్తుంది. ఎవరో ఇది పనికిరాదన్న వస్తువును సముద్రంలో పడి-పడేయగానే సముద్రమే బయటకు నెట్టేస్తుంది. అటువంటి వస్తువులు మాత్రమే నీకు లభిస్తాయి. నీకు నిజమైన ముత్యము నిజమైన ఆత్మజ్ఞానం కావాలి అంటే నువ్వొక గజేతగాడివి కావాలి. సంసారమనే మహా సముద్రాన్ని ఈదగలిగిన శక్తిని సంపాదించాలి. సంపాదించి ఆ ఆలిము-- ఆ చిప్పలు ఎక్కడ ఉన్నాయో వెతకటానికి నీ నడుం చుట్టూ ఇటుకరాళ్లు కట్టుకోవాలి. కట్టుకొని నీళ్లలో దిగాలి. ఆ బరువు వల్ల నువ్వు నీళ్లలోకి దిగుతావు. ఆలు చిప్పలు ఏరుకోవాలి. మొలను కట్టుకోవాలి. అప్పటివరకూ మొలకు కట్టుకున్న ఇటుకరాళ్లు సముద్రంలో వదిలిపెట్టాలి. సముద్రం ఎప్పుడైతే నీ శరీరం తేలిక అయిందో నీళ్లు నిన్ను పైకి నెడతాయి. ఆలిముత్య-- ఆలిచిప్పలతో ముత్యాలతో నువ్వు వస్తావు. అలా ఊరుకొని అట్లా నుంచొని నాకు ముత్యం కావాలంటే వస్తుందా?" అంటారు. అంటే సాధన పైపైన కాసేపు మాట్లాడుకొని, ఆ కాసేపు చాలా బాగుందని అనుకొని, చాలా విషయాలు నాకు తెలుసు అనుకొని, అనుకున్న మరుక్షణమే మనకు ఏమీ తెలియదు అని తెలియజెప్తాడు భగవంతుడు. మనకు తెలిసింది కాదు, ఆ తెలిసిన దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, లోతుగా తీసుకెళ్లాలి, విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి. ఆ తీసుకువెళ్లేటువంటి ప్రయత్నానికే అధ్యాత్మ సాధన అని పేరు పెట్టారు. ఈ ప్రవచనం అనేటువంటిది నిజానికి నాకు ప్రవచన కర్త అని ఎవరో బిరుదు తగిలించారు అది, నాకెవరూ పెట్టలేదు. నాకు ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే ప్రవచన కర్త ఒక్కడే ఆతడు సత్య సాయి భగవానుడే. ఇంకెవరూ కాదు. ఎందుకంటే వచనము వేరు ప్రవచనము వేరు. ప్రవచనం చేసేవాడని పాపం వాళ్లకు అర్థం. అందువల్ల పెట్టారు, తెలియక పెట్టారు. కానీ ఎవరికీ అలా పెట్టకూడదు. ప్రవచన కర్త భగవంతుడు ఒక్కడే. ప్రవచనము by ఏదో మూర్తి గారి చే ప్రవచనము అనొచ్చు. ప్రవచన కర్తని మనం కా-- కర్తలం మనం కాకూడదు. మనం కర్మవీరధీర గంభీరులం కావాలి. మనకు తెలిసిన దానిని తెలిసినంత, పోతనగారే అన్నారుగా "విబుధ జనుల వలన విన్నంత కన్నంత". ఏం విన్నామో, ఏం తెలుసుకున్నామో ఒక పరమ పురుషుడు అయినటువంటి సత్య సాయి భగవానుడు వంటి అవతారమూర్తితో కలిసి జీవించిన ఒక సందర్భం ఈ శరీరానికి ఏర్పడింది గనుక, అంటే మనందరికీ ఏర్పడింది గనుక మనం దాని నుంచి ఎలా గ్రహించాం, ఏమి గ్రహించాం, తద్వారా మన జీవితానికి ఎటువంటి బొమ్మ తీసుకున్నాం, దానిలో మన వలన ఈ ప్రపంచానికి హాని జరగకుండా, ప్రపంచం చేత హాని పడకుండా, చెందకుండా ఎట్లా ఈ రెండింటి మధ్య మన జీవితాన్ని ఎంత తృప్తిగా, భద్రతమ-- ఆనంద సంధాయకంగా గడుపుతూ వచ్చామో, వస్తున్నామో, ఇంకా రావలసి ఉన్నదో, ఏమి చేయవలసి ఉన్నదో ఇవన్నీ నిర్ణాయకుడైనటువంటి జగన్నాయకుడికి వదిలిపెట్టి మనకివ్వబడినటువంటి కర్తవ్యాన్ని మనం అది ఏ పని కానివ్వండి అది ప్రవచనమే కాదు ఏ పని చెప్పినా "అంతయున్ ఈశ్వర ప్రీతికే" నే చేసే పని పరమేశ్వరుడికి సంతోషం కలిగించు గాక. నాక్కాదు, జనానికి కాదు, పరమేశ్వరుడికి సంకల్పం ఆనందం కలిగించాలి అనేటువంటి భావనతో మన అన్ని కార్యక్రమాలు, మన ఆలోచనా విధానాలు, మన బాంధవ్యాలు అన్నీ కూడా ఇలాగే పవిత్రీకరింపబడాలి. నిత్యమూ జీవితమంతా కూడా కృష్ణ సంగీతంగా సాగుగాక. జీవితం-జీవితం రామ సంగీతం కాదు, జీవితం కృష్ణ సంగీతం. ఎందుకంటే సంగీతంలో ఉదాత్త, అనుదాత్తాలని రెండు స్వరాలుంటాయి. ఉదాత్తంగా కాసేపు, అనుదాత్తంగా కాసేపు చెప్పాలంటే పైనా కింద ఉదాత్తం పైనా అనుదాత్తం కింద. అంటే స్వరాలు మారుతూ ఉంటాయి. వాటి ప్రకారంగా సరిగమపదని అనే దానిలో మనం నిలకడ చెంది ఎట్లాగైతే సంగీతాన్ని మనం ఆ ఆచరిస్తామో, పాడుతామో, అనుభవిస్తామో, ఆనందిస్తామో అట్లాగే జీవితాన్ని కూడా కృష్ణ సంగీతంగా ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎ-ఎగిరి పడతాం మళ్ళీ కింద పడతాం. కింద పడ్డప్పుడు దుఃఖపడొద్దు. ఎగిరి పైన ఎక్కడో ఉన్నప్పుడు కూడా నీ స్థితిలో నీవు ఉండగలిగితే జీవితమంతా కూడా ఈ కృష్ణ సంగీతం నుంచి రామ సంగీతంగా మారుతుంది. రామము అంటే ప్రియతమమైనది, రమణీయమైనది, రసజ్ఞమైనది. అందుకనే రాముని గురించి చెప్తూ "రమయతీతి రామః" అంటారు. కష్టం రాగానే కృష్ణా ఎక్కడున్నావ్ అని ఒక్కడడువడు. రామా ఎక్కడున్నావ్ రా అంటాం, రా అంటాం. అంటే మన వాడినే చేసుకున్నాం. ఎందుకని? "రమయతీతి రామః" ఆ రామ శబ్దంలోనే ఒక హాయి ఉన్నది, ఒక శాంతన ఉన్నది, ఒక తల్లిదండ్రులు ఉన్నది, ఒక పవిత్రత ఉన్నది, ఒక ధర్మం ఉన్నది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా ఆచరణాత్మకమైనటువంటి ఒక దివ్య జీవన విధానాన్ని మనం రూపకల్పన చేసుకొని మన రాబోయే కాలమంతా కృష్ణ సంగీతంగా, కృష్ణమయంగా, భాగవతమయంగా, భగవన్మయంగా, జ్ఞానమయంగా, కర్మభక్తి మార్గాల యొక్క సమన్వయమైనటువంటి స్థితిలో మన కాలమంతా కూడా నడుచు గాక అని మంగళాశాసనం చేస్తూ దానిని ఇంతవరకు ఈ భాగవత ప్రవచనాన్ని ఇట్లా నడిపించినటువంటి స్వామికి వేవేల నమస్కారాలు మళ్ళీ వారికి సమర్పించుకుంటూ స్వామే మనందరినీ కూడా చక్కగా చిట్టచివరి క్షణం వరకు నైమిశారణ్య మహా క్షేత్రంలో ఇంత ఆనందాన్ని, ఇంత ఉద్వేగాన్ని, ఇంత ఆనంద సంభరితమైన హృదయాన్ని అనుగ్రహించినటువంటి స్వామికి మనసా, వచసా, శిరసా ప్రణమిల్లుతూ అందరికీ సాయిరాం.