⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఈ ఏకాదశ స్కంధంలో పరుష వాక్యాన్ని మాత్రం ఎన్నడూ వాడకండి. అలా గనక వాడినట్లయితే ఎంత కోపం రానివ్వండి, ఎంత ఆగ్రహం రానివ్వండి. ఆ ప్రదేశం నుంచి నెమ్మదిగా తప్పుకోండి. స్వామి నన్ను అడిగారు, "స్వామికి కోపం రాగా ఎప్పుడన్నా చూశారా?" అని. రాలేదు. కోపాన్ని ఆయన ప్రదర్శించారు. just అభినయించారు. దానికి ఒక కథ చెప్పారు. ఒక ఋషి ఓ ఇట్లాగే ఇటువంటి నెమిశారణ్యం లాంటి చోట ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ అడవికి ఎవరు వెళతారు? కట్టెలు కొట్టుకునే వాళ్ళు, ఆ అడవిలో పని ఉన్న వాళ్ళు. వాళ్ళు వెళుతూ ఉంటే అక్కడ ఒక పాము నెమ్మదిగా పెరిగింది. అది గోధుమ వర్ణే త్రాచు. దానికి-- దాన్ని చూసి అందరూ భయపడేవాళ్ళు. వీళ్ళు భయపడుతున్న కొద్ది అది భయం-- భయపెట్టేది. ఎవరినో వెళ్ళి కారణం లేకుండా కరిచి వెనక్కి వచ్చేసేది. కానీ వాళ్ళకి ఆ దారి తప్ప లేదు అడవిలోకి అలా వెళ్ళాలి. ఈ ముని కదలడు, దారి లేదు, పాము వదిలిపెట్టదు. ఇది పరిస్థితి. సరే ఓసారి వీళ్ళందరూ వెళ్ళి, "అయ్యా మరి పాము సంగతి ఏమిటి? ఇది లేకుండా చేయండి" అంటే ఆయన అసలు పట్టించుకోలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కన్ను తెరిచి ఆ పామును పిలిచాడు. పాముని పిలిచి పాముకి ఏం చెప్పాడంటే, "నువ్వు ఈ పూట నుంచి, నువ్వు విన్నావు కదా అన్ని, నువ్వు ఎవ్వరినీ కరవవద్దు" అని శాసనం చేశాడు. పాము విన్నది, మాట విన్నది. మనం వినంగానే అది విన్నది. విని ఎవరినీ కరవటంలా. మర్నాడు మామూలుగా కట్టెలు కొట్టుకునే ఆవిడ గొడ్డలి ఓపెట్టుకొని భయపడుతూ భయపడుతూ వెళుతుంటే పాము అలా పడగెత్తి చూస్తున్న తప్ప దూకటం లేదు, పాకటం లేదు, పరిగెత్తి ఎవరినీ కాళ్ళకు చుట్టు పట్టటం లేదు. ఇలా ఏదో దీనికి ఏదో అయింది, పాపం ఉంట్లో బాలేదేమో, దానికి కూడా రోగం రావచ్చు కదా అనుకున్నారు వీళ్ళు. అట్లా సుమారు ఒక రెండు నెలలు దాన్ని గమనిస్తే అది ఎవరి జోలికి వెళ్ళటం లేదు. అప్పుడు మనిషిలో ఉన్నటువంటి రాక్షసుడు బయటికి వచ్చాడు. చూడండి. వాడు ఏం చేశాడంటే ఈ పాముని, "ఇది మనల్ని ఎంత యాతన పెట్టింది, బహుశా దీనికి ముసలితనమో, ఏదో జాడ్యమో శరీరానికి వచ్చింది. దీన్ని లేకుండా ముని ఏం చేయటంలా, పట్టించుకోటంలా. మనమే దీన్ని చంపేద్దాము" అని రాళ్ళు పెట్టి కొట్టారు. రాళ్ళు పెట్టి కొట్టేప్పటికి దాని ఒళ్ళంతా గాయమైపోయింది. గాయమైపోతే అందరూ వెళ్ళిన తర్వాత పాపం అది నెమ్మదిగా ఆ ముని దగ్గరకు వెళ్ళి, "నువ్వు చెప్పిన మాట విన్నాను. అప్పుడు కనీసం నా జోలికి వచ్చేవాళ్ళు-- నేను వచ్చేవాళ్ళు కాదు. నేనంటే కాస్త భయపడేవాళ్ళు. ఇప్పుడు నన్ను ఇదిగో నా దేహమంతా రక్తసిక్తమైపోయింది. రేపో మాపో నా ప్రాణం ఇంకో నాలుగు రాళ్ళు వేస్తే పోతుంది. ఎట్-- ఎందుకు ఇటువంటి సలహా ఇచ్చావు స్వామి?" అని అడిగింది. ఆయన అన్నారు, "సహజ ప్రవృత్తిని నువ్వు కోల్పోయిన తర్వాత కరవవద్దు అని చెప్పాను కానీ బుసగొట్టద్దు అని చెప్పానా?" అన్నాడాయన. అది, అది బుసగొడితేనే వాళ్ళు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. పాపం ఆ interpretation దానికి తెలియక పాము ఆ సాత్విక గుణాన్ని పూర్తిగా అలవాటు చేసుకుంది. కనుక సాత్వికంగా ప్రపంచంలో ఉండాలి. స్వామి ఎవరి మీద ఆగ్రహించిన దాఖలా ఒక్కటి లేదు. అలాగే మనం వారు ఇట్లా, వీరు ఇట్లా అని ఒక విశ్లేషణ చేస్తాం. స్వామి ఈ ప్రపంచంలో ఉన్నా, లేదు ప్రపంచం నుంచి వెళ్ళిపోయినా, ఏ వ్యక్తిని గురించి కూడా he never pronounced any judgement. Never. ఆ ఎప్పుడన్నా చెప్తే శంకర భగవత్పాదులు సనాతన ధర్మ వాంగ్మయాన్ని ఎలా నిలబెట్టారు? ఆ రామకృష్ణ పరమహంస అబ్బో ఎట్లా చేశారు? ఈశాన్య భారతంలో చైతన్య మహాప్రభు ఎంత గొప్పగా సంకీర్తన, భజన సాంప్రదాయాన్నిచ్చి హరి నామాన్ని కలియుగంలో మొదలు పెట్టిన చైతన్య మహాప్రభు, అలాగే శంకర భగవత్పాదుల భజగోవిందం, రామకృష్ణ పరమహంస. మనిషి మానవ జన్మ ఎత్తిన తర్వాత అన్ని తెలుసుకోవటం ఒక ఎత్తయితే తనను తాను తెలుసుకోవటమే సర్వోత్తమమైనది అని చెప్పిన భగవాన్ రమణ మహర్షి అని ఇలా చెప్పేవారు. ఈ ముగ్గురిని ఎక్కువ ప్రస్తావన చేశారు. ఇంకెవరినీ ఎక్కువ చెప్పేవారు కాదు. కానీ వాళ్ళ-- ఎవరి పట్ల ఆయనకి ఏ రకమైన వ్యతిరేక భావం లేదు. ప్రపంచంలోకి అనేక మంది వస్తారు. అనేకమైన dynamics తో వస్తారు. అనేకమైన ప్రవృత్తులతో వస్తారు. అనేకమైన మనో ప్రవృత్తులతో, చిత్తవృత్తులతో వస్తారు. వారు వారి వారి పరిధిలో అంతవరకు మాత్రమే ప్రవర్తించగలరు. అందరూ స్వామి లాగా ప్రవర్తించగలిగితే ఇంకా స్వామి ప్రత్యేకత ఏమీ ఉండదు. మనం చేయలేం అసలు. కాబట్టి ఈ ప్రసన్నమైనటువంటి వదనము, సరళమైనటువంటి వాక్యము మనకి ఆనందాన్ని కలిగించే భాషను మనం వాడాలి. మన మనస్సును పరమాత్మ వైపు తిప్పగలిగినటువంటి భాషని మనం వినియోగించాలి. మీరు స్వామి ఎర్లీ డేస్ లో ఉపన్యాసాలు వింటే అసలు ఆ ధార, ధారణ, ఆ వేగం మామూలు వాడు మాట్లాడలేడట్ల. మొత్తం ఇరవై ఎనిమిది నిమిషాలు దాటి మాట్లాడేవారు కాదు ముందు. ఆ ఇరవై ఎనిమిది నిమిషాలు పట్టుకోవటం కష్టమయ్యేది. అంత ధారాళంగా మాట్లాడేవారు. ఆ మాట్లాడిన దాంట్లో ఒక్క పొల్లు లేదు. ఒక ఇది ఉంటే-- ఉండకుండా ఉంటే బాగుండును అన్నటువంటి భావన లేని అటువంటి ఆ సరళమైనటువంటి భాషలో భారతీయ వాంగ్మయాన్నంతా కూడా మనకి మూడువేల ఎనిమిది వందల ఇరవై నాలుగు lectures దివ్యోపన్యాసం అని మనం పేరు పెట్టుకున్నాం. ఆ వాటి ద్వారా భారతీయ సంప్రదాయాన్ని, భారతీయ సంస్కారాన్ని, జీవన విధానాన్ని పల్లలే పట్టుగొమ్మలు అన్నటువంటి ఒక భావనని, ఎందుకంటే పల్లెలు ఇవాళ మనం అయిపోయినాయి లేవని అనుకుంటున్నాం కానీచేయగలిగితే సేవ గ్రామానికే చేయాలి. నగరం వాడికి సేవ అక్కర్లేదు. వాడికి వాడి కోరికలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ కోరికలున్నాయి గ్రామంలో అవసరాలున్నాయి. కోరికలు తీరుస్తూ వీణ్ణి పోషిద్దామా? అవసరాలను కాపాడుకుంటూ వాణ్ణి రక్షించుకుందామా? వ్యవసాయం చేసేవాడు గ్రామంలోనే ఉండాలి. అంటే, పాత్రత ఎరిగి మనం దానం చేయాలి. అది విద్య కావచ్చు, డబ్బు కావచ్చు, ఏది కావచ్చు, పాత్రత. ఒక దాని ఎండ్ రిజల్ట్ ఏమిటి? మనం పది రూపాయలు ఒక వ్యక్తికి మనం ఇచ్చాం. అది ఎలా కాబోతున్నది? దాన్ని అతను వినియోగిస్తున్నాడా? దుర్వినియోగం చేస్తున్నాడా? లేదు తనకున్న వ్యసనాలకు దాన్ని వాడుకోబోతున్నాడా? మన యందున్నటువంటి మంచి భావాన్ని వాడు తీసుకుని ప్రపంచంలో చెడును వ్యాప్తి చేస్తున్నాడా? అందుకనే పాత్రత ఎరిగి దానం చేయాలి. దానం చేయడం అంటే ఇవ్వటమే. మనం ఊరికే దానం అనే మాట అంటాం. మనకు ఎవరో డబ్బు ఇచ్చారు. డబ్బు ఇచ్చారు. వాళ్ళకు ఊరికే రాలేదు కదా. చాలా కష్టపడితే, చాలా ఒక సంకల్పం చేసుకుంటే ఆ డబ్బు ఉన్నది. తెచ్చి ఇచ్చారు. దాన్ని ఏం చేయాలి? ఏ పవిత్రమైన హృదయంతో అది మనకివ్వబడిందో దానిని మళ్ళీ పవిత్ర కార్యక్రమానికి మాత్రమే వినియోగించాలి. దానిని స్వార్థ ప్రయోజనానికి కానీ, వ్యక్తిగతమైనటువంటి అవసరానికి కానీ, మన కోరికలు తీర్చుకోవటానికి కానీ మనం చేసినట్లయితే ఏమవుతుంది? పైకి ఏం అయినట్టు కనిపించదు. ఏముంది డబ్బు వచ్చింది, ఏదో అది కొన్నాడు, ఇది కొన్నాడు, ఇది ఇది వచ్చింది, అది వచ్చింది, అది కాదు. ఎప్పుడైతే స్వామి చెప్పిన ఆ మాట ఎంత గొప్ప మాట అంటే "When something is given to you, it is not to you alone, it is through you to the world". దీన్ని ఎలా మర్చిపోతాం? నీకు ఎవరైనా పది రూపాయలు తెచ్చి వాకిట్లో ఇచ్చారంటే, నీకోసం వాళ్ళు ఇవ్వలా. నీకోసమే కాక, ప్రపంచం మొత్తానికి చెందేట్లుగా మీ మీ భావంలో మీరు చేయండి అని మీకు అప్పజెప్పారే తప్ప, వాళ్ళు మీకు ఏమీ ఇవ్వలేదు. మీ ద్వారా భగవంతుడు ఇచ్చారు. మరి ఆ ఇచ్చిన వాళ్ళకి ఎవరు ఇచ్చారు? భగవంతుడే సంకల్పం కలిగించాడు. కనుక final analysis లో ఏం తెలుస్తుందంటే, మనకు ఒక పది రూపాయలు ఇచ్చారంటే భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడే మనకి తెచ్చి ఇచ్చాడంటే, మనం దాన్ని భగవత్ కార్యక్రమానికో, సంఘ సేవకో, ఎక్కడన్నా నలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాస్త ఆసరాగానో ఆ ఆ ధనాన్ని మనం వినియోగించాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, అంతఃశుద్ధి లో నుంచి మాత్రమే వస్తుంది. ఆ అంతఃశుద్ధి లేనినాడు మనకి ప్రతిదీ ఆకర్షణే, ప్రతిదీ అవసరమే, అక్కరలేనిది అంటూ ఏమీ ఉండదు. అన్నీ మనం పొందుతూనే ఉండాలి. ఇక నాల్గవది, వేషం. వేషం అంటే బట్ట కట్టుకోవటం. అది మామూలుగా ఏమనుకుంటామంటే, అందరికీ కావలసినట్టుగా we have to present to the world. అందుకనే బాగా, చక్కగా, ఆహ్ మంచి వేషంలో ఉండాలి. సముచిత వేషంలో ఉండాలి. సమయానుకూలమైన వేషంలో ఉండాలి అని, కదా. ఇవన్నీ మనకు చెప్పారు పెద్దలు. అవే గనక నిజమైనట్లయితే, స్వామి తమ పద్నానుగవ ఏట తల్లిని, కుటుంబాన్ని వదిలిపెట్టి, మీకు నాకు ఎట్టి సంబంధము లేదని బయటకు వచ్చిన నాడు, ఏ dress కట్టుకున్నారో, తమ శరీరాన్ని వదిలిపెట్టుతున్నటువంటి ఎనభై ఆరవ ఏట వరకు కూడా అదే dress లో ఉన్నారాయన. అదే dress, మార్పు లేదు. అంటే ఏమిటి? దేహమే ఒక వస్త్రంగా, ఆ వస్త్రం అందరికీ ప్రదర్శించేది కాదు గనుక, మానాన్ని కాపాడుకోవటానికి, అందరిలో చక్కగా కనిపించటానికి, ఆ dress వారు ఎన్నుకున్నారే తప్ప, దానికి ప్రత్యేకత ఏముంది అన్నారు స్వామి. ఆ రోజుల్లో Illustrated Weekly లో AS నారాయణ అని, ఆహ్ చాలా గొప్ప journalist ఆయన. ఆయన స్వామిని అడిగారు, "స్వామి మీరు-- స్వామి యుక్త వయస్సులో చాలా అందం, మామూలు అందం కాదు, మహా తేజస్సుతో ఉండేవారు. ఆ తేజస్సుతో ఉన్నప్పుడు 'Swami you look very very beautiful. You are both masculine and feminine.' మిమ్మల్ని ఒకవైపు చూస్తే ఒక అద్భుతమైన స్త్రీమూర్తి వయ్యారంగా నడిచి వచ్చినట్టు ఉంటుంది. రెండోవైపు చూస్తే ఒక కొదమ సింహం నడిచి వచ్చినట్టు ఉంటుంది. మరి మీరు ఈ కాషాయం ధరించారు. ఏమిటిది సన్యాసులు కదా ధరించవలసింది?" అంటే, "సన్యాసులు అంటే ఎవరు? సమన్యాసం చేయగలిగిన వారే సన్యాసులు. అన్నింటినీ సమదృష్టితో చూడగలిగిన వారే సన్యాసులు. అన్నింటియందు ఏకాత్మ భావంతో ఉన్నటువంటి వారే సన్యాసులు. నేను సన్యాసిని కాదు. నేను యోగిని కాదు. నేను భోగిని కాదు. నేను స్త్రీని కాదు, పురుషుడిని కాదు. నేను బాలుడను కాదు, వృద్ధుడను కాదు. నేను నేనైన నేను. ఆ నేను నేనుగా ఉండటానికి, ఇదిగో ఇది ఎందుకు అంటే, ఈవేళ మీరు నా దగ్గరికి వచ్చి కనీసం మాట్లాడుతున్నారు. రాబోయే భవిష్యత్ కాలంలో కొన్ని లక్షల మంది స్వామి దర్శనం-- నా దర్శనం అనేవారు కాదు, స్వామి దర్శనానికి వచ్చినప్పుడు, అందరికీ దర్శనం లభించనప్పుడు, ఎక్కడో చిట్టచివర కూర్చున్నటువంటి వాడికి కూడా, అరుగో స్వామి వెళ్లారు, అరుగో స్వామి వచ్చారన్నట్టుగా ఒక చిన్న ఎర్రటి dot కనిపిస్తే అది స్వామికి సంకేతమై ఉంటుంది తప్ప, ఈ dress పట్ల నాకేం అపేక్ష లేదు" అన్నారు. మంచి silk dress వాడొచ్చు కదా. స్వామికి తొలినాళ్లలో ఆ మైసూర్ భక్తులు ఎక్కువగా ఉండేవారు. వాళ్ళు మైసూర్ నుంచి తాండ్లు తాండ్లు కావాలంటే తెచ్చిస్తారు స్వామికి. కుట్టించి కూడా ఇస్తారు. He chose only cotton. అది చిత్రావతికి వెళ్ళాలి, చాకలి ఉతకాలి, చలవ చేయాలి, మడత పెట్టాలి, మళ్ళీ స్వామికి ఇవ్వాలి. అది మాత్రమే ధరించేవారు. అందుకనే స్వామి ఎప్పుడూ ఎవరి దగ్గర బట్టలు తీసుకోలేదు. అది ఇచ్చిన వాళ్ళు లేరు. ఆయన నిరసించేవారు, "వద్దు నాకు వద్దు" అనేవారు. మా-- నాకున్నది నాకు చాలు. స్వామికి అంతవరకు చాలు. ఎక్కువ ఏం చేసుకోను. అంటే...మనం చెప్పుకున్న భాగవతంలో ఉన్న భా-- భాగవతుడి లక్షణాన్ని మనం భగవంతునిలో చూడగలగాలి. ఆయన ఎలా ఉండగలిగారు? ఇంత నిగ్రహం ఎలా ఉంది? ఇక తర్వాత మితభోజనం. శరీరం నిలబడాలి అంటే, ప్రాణం నిలవాలి అంటే, ఇంద్రియాలు తమ తమ కార్యకలాపాలు జాగ్రత్తగా చేయాలి అంటే శరీరానికి ఆహారం అవసరమే, ఖచ్చితంగా అవసరమే. కానీ మృష్టాన్న భోజనం ప్రతిరోజూ పనికిరాదు. అది అధ్యాత్మ సాధనకి పెద్ద అడ్డు. వీలైతే... చాలామంది, స్వామి ఒక ఉదాహరణ, మహర్షి ఒక ఉదాహరణ, రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ, శంకర భగవత్పాదులు వీరందరికంటే ముందు శంకర భగవత్పాదులు సన్యాసి-- సన్యాసి అనుకుంటూనే ఒక భిక్షాపాత్ర, మళ్ళీ ఒక కమండలము, తర్వాత ఆ ఒక చిన్న దిండు, ఇవన్నీ ఉండాలి కదా! అవి ఆ రోజుల్లో మోసుకుని వెళ్ళేవాళ్ళు. శంకర భగవత్పాదులు వివేక చూడామణి లో చెప్తారు. ఏం చెప్తారు అంటే, "నీ అరచేతిని భిక్షాపాత్ర చేసుకో." మళ్ళీ పాత్ర ఎందుకు? దానిలో ఒక ముద్ద తిన్నావా, మూడు ముద్దలు తిన్నావా తిను, ఆ పాత్రను కడుక్కు అయిపోయింది. నీకు possession, వస్తువులు అక్కర్లేదు. రెండవది, భగవంతుడు నీకు ఒకటి అమర్చాడు. ఆ అమర్చింది ఏమిటంటే, నీ మోచేతిని దిండుగా భావించి, దిండు నీ దగ్గర ఉన్నది అనుకో. చూడండి, హంసతూలికా తల్ప మీద లేకపోతే ఇవాళ ప్రపంచంలో అమ్మబడేటువంటి అత్యద్భుతమైన మ్యాట్రస్ లో దిండు కూడా వాళ్ళు ఇస్తారు. కదా. అంత దిండు మీద పడుకున్న ఇంత ధనవంతుడు చివరగా వాడికి నిద్ర పట్టాలంటే మోచేయి పెట్టుకొని నిద్రపోతాడు. అంటే మోచేయి అనేది అత్యంత సహజమైన తలగడ. తలకడ అది. తల దగ్గర ఉండేది కాబట్టి తలకడ. కాబట్టి మనము వస్తువు ద్వారా ఇవన్నీ ఉండాలనుకున్నాం. పరమేశ్వరుడు మనకన్నీ అనుగ్రహించాడు. ఇక దాహం. ఒక జ్ఞానికి, ఒక తపస్వికి, భగవంతుని యందు మనస్సు లగ్నము చేసి ఉన్నటువంటి వాడికి నిరంతర స్వాధ్యాయ సత్సంగ సత్సాంగత్య సదాచార సంకీర్తనామయమైనటువంటి దేహానికి దాహము ఉండదు. వాడు గటగటా మాట్లాడినంత కాలం ఇరవై bottles గనక తాగాడంటే, వాడి ఆలోచనలన్నీ ప్రపంచం మీద ఉన్నట్టే లెక్క. కంచి పరమాచార్య మహాస్వామి వారి దీనికి ఒక పెద్ద గుర్తు. స్వామి కూడా అంతే. స్వామి దగ్గర ఇంత glass ఉంటుంది. దాంట్లో నీళ్ళు పెట్టి దానికి ఒక మూత పెడతారు. మనం అనుకుంటాం గటగటా తాగేస్తారని. ఆయన ఎప్పుడూ గటగటా తాగలే. దాన్ని, దాన్ని ఎంత మర్యాదగానో, ఆ మూతను కూడా అలా విసిరేయటంలా ఉండదు. ఇలా నెమ్మదిగా తీసి పక్కన-- అంటే సరళ స్వభావానికి ఆ glass నెమ్మదిగా తీసుకుని పెదవులకి అంటీ అంటకుండా ఒక గుక్క, ఈ గొంతు జారే దాకా పెట్టి, మళ్ళీ ఆ glass ని భద్రంగా అదే place లో పెట్టి మూత పెట్టి అప్పుడు మళ్ళీ ఆ తమ పని తాము చేసుకునేవారు. అంటే మనం ప్రతి దానియందు ఒక అలక్ష్యము, నిర్లక్ష్యము రెండు. పోతే పోయింది, వస్తే వచ్చింది. ఇది పోతే ఇంకోటి అంటాం. ఇది పోతే ఇంకోటి వస్తుందో రాదో. ఉన్నదాన్ని నిలబెట్టుకుంటే చాలు కదా. ఆ పోతే పోయింది, ఇంకోటి వస్తుందంటే, పోయే శరీరం ఎలాగూ పోతుంది, ఇంకోటి వస్తుందో రాదో అలా గమనించాలి. మళ్ళీ ఇటువంటి జన్మ మనకు ఏర్పడుతుందో లేదో, ఒకవేళ ఏర్పడిన ఈ భగవద్భావన ఉంటుందో లేదో, ఉన్న ఈ పుణ్య కార్యక్రమాలు చేయాలనే మనసుతో వస్తామో లేదో. మళ్ళీ భగవంతుడు అవతార ముర్తి రోజుకు అవతారమెత్తి వస్తాడా? వచ్చారు, ఇప్పుడు వచ్చారు. ఐదువేల ఐదువందల సంవత్సరాల తర్వాత ఒక పూర్ణావతారంగా సత్య సాయి భగవానుడు వస్తే మళ్ళీ ఒక generation ఎప్పుడు మళ్ళీ ఇటువంటి అవతారం వస్తుందో తెలియదు. కాబట్టి ఏ పరమాత్మ ఒక గురు స్వరూపంగా మన ముందు ఉన్నారో, మనతో ఉన్నారో అటువంటి వారి యందు మనకి ఆ నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ వారితో చక్కగా అలవాటు చేసుకోవాలి. అంటే, అందరూ అలా ఉండగలరా అంటే ఉండలేరు. ఉండగలిగింది ఏమిటంటే, ఎప్పుడూ చెప్పే మూడే పదాలు. ముందు సమర్పించుకోవాలి, భగవంతుడికి సమర్పించుకోవాలి, శరణాగతి పొందాలి. అన్యధా శరణం నాస్తి అనేటువంటి భావనలో ఉండాలి. ఏది రాని, ఎన్ని సంపదలు వనగూడని, ఎన్ని శాస్త్రాలు తెలియని, ఎంత జ్ఞానం రాని వినయంగా ఉండాలి. వినయమే భూషణం. విద్య-- the end of education is character, not a degree. కదా. కాబట్టి అది ఇటువంటి spiritual organization లో, spiritual congregation లో, ఈ ఆధ్యాత్మిక బృందాల మధ్య మనకు కావలసినటువంటి ఈ భావాలు, మనకు అవసరమైనటువంటి ఈ సూత్రాలన్నీ కూడా ఏకాదశ స్కంధంలో ఉన్నది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భాగవతంలో దశమ స్కంధం వరకు ఇప్పుడు చెప్పినవన్నీ చదువుకున్నా ఏకాదశ స్కంధం మాత్రం వదిలిపెట్టొద్దు. ద్వాదశం వదిలిపెట్టినా ఏం పెద్ద నష్టం లేదు. ద్వాదశం ఏం లేదు, కృతజ్ఞతాపూర్వకంగా ముగుస్తుంది అది. పదకొండవది మాత్రమే మన character ని, మన ప్రవర్తనని, మన మనో ప్రవృత్తిని, మనం ఆ జీవించే విధానాన్ని సరిదిద్ది మనల్ని నిజ భక్తులుగా మార్చేటువంటిది ఏకాదశ స్కంధం. అది చాలా చాలా అత్యుత్తమమైన స్కంధం నా దృష్టిలో. అంటే ఏ అధ్యాత్మతో మొదలైందో భాగవతం, ఏ భక్తితో నిలకడ చెందిందో, ఏ భాగవతుల యొక్క వేదన, ఆవేదన, సంవేదన, నివేదన ఇవన్నీ దాటి ఈశ్వర కటాక్షం ఎలా లభించిందో ఆ కథలన్నీ వింటూ జీవితాన్ని ధన్యవంతం చేసుకుంటూనే అటువంటి ఒక అంబరీషుడి వలె, ఒక ప్రహ్లాదుడి వలె మనం ఎలా ఉండగలం. అందుకని ఈ విధివిధానాన్ని ఏకాదశ స్కంధంలో వ్యాసులవారు నిర్ణయించారు. ఇక నాలుగవది, మనకి వ్యక్తుల పట్ల వైముఖ్యం ఉండకూడదనుకున్నాం. అట్లాగే అమితమైనటువంటి అనుబంధాలు కానీ, అమితమైనటువంటి ప్రేమానురాగాలు కానీ...అవి మనం ఎక్కువగా ఆ లతను పెంచుకోకూడదు. ఒక సన్నజాజి మొక్క ఉంటుంది. ఎక్కడో చిన్న మొక్క. మనకి ఆ పూలు ఇష్టం కాబట్టి పూచేదాకా దానికి ఒక తాడు కట్టి, కట్టబెట్టి, పెట్టి, పెట్టి, పెట్టి మొత్తానికి దాన్ని తీగ పాకిస్తాం. పాకించాక విస్తృతమైనప్పుడు పందిరి వేస్తాం. పూలు పూయటం మొదలు పెడుతుంది. కానీ గమనించండి, చాలాకాలం పూలు పూస్తుంది కానీ మొదలు నెమ్మదిగా ఎండిపోవటం మొదలు పెడుతుంది. సన్నజాజి చెట్టు యొక్క లక్షణం. మనం కూడా మూలంలో నుంచి ఆ చెమ్మ ఉండాలి. మూలల్లో అన్నీ ఉండాలి, ప్రాణం నిలబడాలి గనుక. విస్తృతమైనప్పుడు when you raise higher in life when you raise higher internally లోపల ఆంతరంగికంగా ఒక ఉత్తమ స్థాయికి మీరు చెందుతున్నప్పుడు, చెందాను అనుకుంటే అది రాదు. అది లెక్కబెట్టేది కాదు. ఒక ఆలోచన కలిగినప్పుడు భగవంతుని దయవల్ల నేను ఇక్కడిదాకా రప్పించాడు అనుకోవాలి. అదేంటి అంటే, పూలు పూసినట్లుగా మన ఆలోచనలు ఉండాలి. అది ఎవరైనా కోసుకెళ్లొచ్చు, ఎంతమందైనా కోసుకెళ్లొచ్చు, ఎవరికి కావాలో వాళ్ళు కోసుకెళ్లొచ్చు కానీ ఆ భావాలన్నీ కూడా మళ్ళీ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకు మాత్రమే సమర్పించేటువంటి ఒక స్థాయికి వెళ్ళాలి. ఇవాళ ప్రశాంతి నిలయం వెళ్ళిన వాళ్ళకి లేడీస్ సైడ్ ఇప్పటికీ ఒక సన్నజాజి పందిరి ఉంది. ఆ దాని కింద స్వామి ఆ రోజులలో ఉపన్యాసాలు ఇచ్చేవారు, నేల మీద కూర్చొని. అలాగే వాళ్ళతో వెన్నెల రాత్రులతో లేడీస్ కాదు జెంట్స్ అండ్ లేడీస్ అక్కడ కూర్చొనేవారు. కూర్చొని మాట్లాడేవారు. అది ఆ చెట్టు ఇంకా, స్వామి దేహాన్ని వదిలిపెట్టారు గాని ఆ చెట్టు ఇంకా అక్కడే ఉన్నది. ఎందుకని ఆ చెట్టుని అంటే, ఇదిగో ఈ భావం చెప్పడానికే. ఏదో సందర్భంలో స్వామే చెప్పిన మాట ఇది. పూలు పై పైన పూస్తూ ఉంటాయి. వేళ్లన్నీ ఎక్కడో లోతుగా ఉంటాయి. ఈ పైన ఏం జరుగుతున్నదో దానికి తెలియదు. నీళ్లు అందించటమే వేళ్ల పని. ఆ నీళ్లని అందుకొని ప్రాణం నిలబెట్టుకొని ఆకులకు అందించడమే కాండము పని, తీగ పని. పూలు పూయటం పైదాని పని. మరి ఇంత భగవంతుడు చేశాడు అలా కొయ్యగానే యాభై చె--పూలు చేతికి వస్తున్నాయే, నువ్వొక సంపెంగ పువ్వునో, ఓ సన్నజాజి పువ్వునో సృష్టించగలవా? ఈ ప్రశ్న వేశారు. సమాధానం ఒకటే, మనం చేయలేం. కాబట్టి ప్రకృతిలో పరమేశ్వరుడికి వినియోగించేట్లుగా మనం ప్రతి వస్తువుని అలా వినియోగించాలి. ఇప్పుడు యజ్ఞం జరుగుతున్నది, హోమాలు జరుగుతున్నాయి. ద్రవ్యాలన్నీ ఇక్కడ ఉన్నాయి. పుష్కలంగా ఉన్నాయి, మామూలుగా లేవు. మరి పుష్కలంగా ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ ఎవరైనా తమ కోసం వాడుకుంటున్నారా? మనం, మనమైనా పోనీ మాకు అది కావాలండి, ఇది కావాలండి, మా ఇంట్లో అది లేదు అనట్లా. భగవంతుడికి అర్పించడానికి వినియోగం జరుగుతుంది. ఆ వివిధ వస్తువులు ఇక్కడికి చేరతాయి. మనం కూడా మనకు ఏర్పడిన జ్ఞానం కానీ, సంపద కానీ, అవకాశాలు కానీ ఇవన్నీ కూడా పరమేశ్వర సంకల్పితంగా మన వాకిట్లోకి వచ్చినాయి. ఆ జరుగుతున్న దాంట్లో మనక్కూడా ఒక యోగాన్ని కల్పించారనే భావన వలన అంతరంగ శుద్ధి కలుగుతుంది. ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. దేనికదే ఇక ఆ తర్వాత ఈ అరిషడ్వర్గాలు ఒక ఆరు. ఆ ఆరు మనకు తెలుసు. శంకర భగవత్పాదులు శివానందలహరిలో చెప్తారు ఒక మాట. కిరాత రూపంలో శివుడు వచ్చి కిరాతార్జునీయంలో ఒక విల్లు పట్టుకొని వేటాడుతున్నాడు. అడవి మృగం కోసం ఒక అడవి పందిని పట్టుకోవాలని ఆయన వేటాడుతున్నాడట. వేటాడాడు, దానిమీద ఆ అర్జునుడికిను, ఆ శివుడికి మాయావేషంలో ఉన్న శివుడికి ఘర్షణ జరిగింది. ముందు నేను వేశానన్నాడు, ముందు నేనే వేశానన్నాడు. ఇద్దరూ కాసేపు అనుకున్న తర్వాత వేసిన వాడు నువ్వు కాదు, నేను కాదు, వేయించిన వాడు ఎక్కడో ఉన్నాడని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అటువంటి ఆ కథని ఆధారం చేసుకొని భగవత్పాదులు శివానందలహరిలో ఏం చెప్తారంటే, ఓ ఆదిశంకరా, ఆది కింకర! నువ్వు ప్రపంచంలోకొచ్చి అరణ్యంలో జొరబడి స్వేచ్ఛగా, హాయిగా సంచరించే ఆ జీవుల మీద నీ బాణాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నావు? ఎందుకు వాటిని వేటాడుతున్నావు, వేధిస్తున్నావు, చంపుతున్నావు? ఒక్క పని చెయ్. అదే బాణాన్ని నా గుండె వైపు సారించి అనుసంధానం చెయ్. బాణప్రయోగం నా మీద చెయ్. ఆరు మృగాలు నాలో తిరుగుతూ ఉన్నాయి. అరిషడ్వర్గాలు అనేటువంటి ఆరు మృగాలు. ఆ ఆరు మృగాలని నువ్వు సంహారం చేస్తే నువ్వు దైవానవి. నువ్వు చేయవలసిన పని అది. అమాయకమైనటువంటి జంతువుని చంపటం కాదు అంటారు. అంటే పరమేశ్వరుడిని కూడా ప్రార్థించే విధానం అది. అందుకే ప్రార్థన మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిది. ఆ ప్రార్థనే రుద్రంలో వచ్చినప్పుడు అది నమకమైంది, చమకమైంది. అదే అనేక invocations అయినాయి. అంటే ఆ దైవతాన్ని ఆహ్వానం చేయటం, ఆవేశింపజేసుకోవటం, తనలో తాను దాన్ని నెలబెట్టుకోవటం, తద్వారా భక్తుడిగా తాను చేయవలసిన కర్తవ్యాన్ని చేసి, నీ దయవలన, నీ అనుగ్రహం వలన, నీవిచ్చిన అవకాశం వలన నేను ఇంతవరకు చేయగలిగాను. ఆ చేయబడటంలో నన్ను ఉంచావు. నన్ను ఇలాగే ఉంచు అని ప్రార్థించాలి. మనం కూడా అడుగుతాం కదా, సేవ ఇవ్వమని అడుగుతాం. ఇట్లాగే సేవ ఇస్తూ ఉండమని కూడా అడుగుతూ ఉండాం, అడుగుతూ ఉండాలి. అదే నిజమైనటువంటి ప్రార్థన. అలాగే నాకు సేవ ఇవ్వు, నాకు అవకాశమివ్వు అనటం ఒక ఎత్తయితే, నీవిచ్చిన ఈ అవకాశమంతా కూడా ఈ ప్రపంచానికి ఆనందం కలిగించు గాక. దానిలో ఉన్న ఆనంద రసాన్ని నువ్వే ఇవ్వాలి అని. కాబట్టి ప్రార్థన ఉండాలి మనకి. ప్రార్థన అంటే not confession. నేను ఈ పాపాలన్నీ శనివారం దాకా చేశాను. ఆదివారం నాటికల్లా మొత్తం washout అయిపోయినాయి. మళ్ళీ సోమవారం నుంచి కొత్త పాపాలు చేస్తాను కాదు. అది హైందవ ధర్మంలో లేదు.హైందవ ధర్మంలో ఏముందంటే మనము చెడు తలపు తలచినా, చెడు పని చేసినా, చెడు తల పెట్టినా మనం కర్మ ఫలాన్ని ఈ శరీరం వదిలిపెట్టేలోగా అనుభవించాలి. మనం చూశాం చాలా మందిని చూశాం. ఇక్కడే, ఇక్కడే అనుభవించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దేహం వదిలేస్తుంది ఆత్మ. కాబట్టి మనం చాలా నిగ్రహించుకోవాలి మనస్సుని. మనకి కావలసింది ద-ద-దొరకనప్పుడు మనిషిలో ఒక ఘర్షణ ఏర్పడుతుంది. దానిలో తాను అసమర్ధుడు గనుక అయితే ఆవేశం పెరుగుతుంది. నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు, నేను కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగటం లేదన్నప్పుడు లోపల ఉన్నటువంటి అహం విజృంభించి అది క్రోధమై, అది ద్వేషమై, అది పగై అన్ని విధాలా చెడు వైపు మానవుణ్ణి మనస్సును నడిపిస్తుంది గనుక ఇక్కడ ఆయన అంటారు మనం ఏకాదశి వ్రతం అంబరీషుడు చెప్పుకున్నాం. ఓ దూర్వాస మహాముని! ఆయనకు కోపం ఎందుకుండాలి? జయవిజయులు అక్కడికి వెళ్ళింది సనక సనందనాది నలుగురు వెళ్లారు. సనత్సుజాతీయుడు, సనత్కుమారుడు, సనకుడు, సనందుడు అని వీళ్ళు వెళ్లారు. వెళ్లి మాకు స్వామి దర్శనం ఇప్పించమని అడిగారు. ద్వారపాలకులు వారి డ్యూటీ వాళ్ళు చేశారు. ఇప్పుడు స్వామి రారు, ఇప్పుడు మీరు వెళ్ళటానికి వీల్లేదు అని. ఎప్పుడైతే నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు స్వామితో చాలా పరిచయం ఉంది, మీరు పక్కకు వెళ్ళండి నేను లోపలికి వెళ్తాననటానికి లేదు అప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది. చూశారా, స్వామి దర్శనం దొరకలేదని వాళ్ళకి కోపం వచ్చింది. ఆ కారణంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులై, రావణ కుంభకర్ణులై, శశుపాల దంతవక్త్రులై మూడు జంటలుగా మూడు జన్మలు అనుభవించవలసి వచ్చింది. కనుక ఇక్కడ మనం చేయవలసింది ఏమిటంటే కోపాన్ని రానివ్వకూడదు, రానీ కూడదు. వచ్చినందువలన ఎదుటి వాడికి ఏ రకమైన నష్టం లేదు. దానివలన మనకే నష్టం జరుగుతుంది. మన లోపల మామూలుగా సాధారణంగా హాయిగా నడి-నడుస్తున్న మనందరినీ బతికిస్తున్న మన అవయవాలన్నీ ఆ క్రోధావేశానికి తల్లడిల్లి పోతాయి. మనకు తెలియదు ఏ అవయవం దేనివల్ల ప్రభావితమై అది తన శక్తిని కోల్పోతుందో తెలియదు గనుక మనం చక్కగా హాయిగా కలకాలం ప్రశాంతంగా ఉండాలి అంటే మనం క్రోధాన్ని వదిలిపెట్టాలి.