⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
సింహావలోకనము అని పేరు అంటే సింహం రెండడుగులు ముందేస్తే వెనక్కి రెండడుగులు వేసి వెనక ఏముందో కూడా చూసుకుంటుంది. అవలోకనం అంటే చూట్టం ఆలోచనము అంటే అర్థం చేసుకోవటం. అవగాహన చేసుకోవాలి అవగాహనైన తర్వాత ఆచరణ చేయాలి ఆచరణ లో నుంచి అనుభవాన్ని పొందాలి అనుభవంలో నుంచి అనుభూతిని చెందిన్చుకోవాలి ఆపై విభూతి స్థాయికి వెళ్ళాలి. ఇది ఒక క్రమఫలినామం అధ్యాత్మ సాధనలో. నిజానికి ఈ భాగవత సప్తాహాలు ఈ పునః పునః ఎందుకు చేయాలి? దీని వలన జాతికి ఏమి ప్రయోజనము? అని అన్నప్పుడు ఏదైనా పునః పునః చేయాలి. ప్రాపంచికమైనది కూడా ఏదన్నా కోరుకున్నప్పుడు ఎన్నో ఆలోచించి ఎంతో ఆలోచించి ఎట్లాగైతే కార్యక్రమం చేస్తామో అధ్యాత్మ సాధనలో కూడా ముందుకు వెళుతున్న కొద్ది అనేకమైనటువంటి అమృత భావాలు కలుగుతూ ఉంటాయి. అవి నిన్న ఉన్నట్లే ఇవాళ ఉండవు. ఈరోజు ఈ క్షణాన కలిగే ఈ భావాలు ఇలాగే రేపు ఉండకపోవచ్చు. కాబట్టి ఏ క్షణాన ఏ అమృత భావన ఒక హృదయంలో నుంచి బయటకు వస్తుందో అది ఒక అనుభవ సారంగ మనం గ్రహించగలిగితే మనకి ఇవన్నీ ఎందుకు చేయాలో అర్థమవుతుంది. ఇక భారతీయ వాంగ్మయం చాలా పవిత్రమైనటువంటి వాంగ్మయం. ఏ దేశంలోనూ ఇటువంటి వాంగ్మయం మాత్రం లేదు. ఏమిటి దీని విశిష్టత అంటే చూడండి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి యొక్క మనస్సు అతలాకుతలం అయిపోయిన వేళ ఆయనకప్పుడు ఎనిమిది సంవత్సరాలు. అయోధ్య నగరం అంతా తిరిగి వచ్చాడు. ఓ చిన్న పిల్లవాడు రథం ఎక్కి నగరం లోకెళ్ళి అనేకమైన విషయాలు చూసి వస్తే ఆనందంతో నాట్యం చేయాలి. కానీ రాముడు స్తబ్ధుడై కూర్చున్నాడు. విషన్న హృదయంతో కూర్చున్నాడు. వశిష్టులవారు వచ్చి "ఎందుకు రామా? ఎందుకిలా ఉన్నావు?" అని అడిగారు. "ఏమున్నది? నాకీ ప్రపంచం అంతా దుఃఖా రామమై కనిపిస్తున్నది. నేను ఆనందంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నాకు చాలా సంతోషంగా ఉన్నది అన్న వాణ్ణి నేను చూడలేదు. మరి ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చానా? అని నా మనస్సు చాలా కేద పడుతున్నది." అన్నప్పుడు వశిష్టుల వారి జ్ఞాన దృష్టితో ఈ రాముడు ఎనిమిదేళ్ళకే వైరాగ్యంలోకి వెళ్లిపోతే రావణ వధ అయ్యేదేట్లా? ఈ అవతారం పరి-పరిపూర్తి ఎలా అవుతుంది అని ఆలోచించి అప్పటికప్పుడు శ్రీ రామచంద్రుడితో ముఖాముఖి మాట్లాడాడు. అదంతా మనసు యొక్క మర్మాన్ని గురించిన విశేషాలు. అంటే ఒక విషాదంలో నుంచి, ఒక అపజయంలో నుంచి, ఒక భయంలో నుంచి, ఎప్పుడైనా అంతే చూడండి పిరికితనంలో నుంచి భయం, భయంలో నుంచి ధైర్యం పుట్టుకొస్తాయి. ఒక కమలం పురదలో ఉంటుంది వికసించినప్పుడు నయనానందకరంగా, మనోహరంగా ఉంటుంది. మూలాలు ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి శ్రీ రామచంద్రుడు వశిష్ఠ వారు మాట్లాడుకున్నవి ముప్పై మూడు వేల శ్లోకాలైతే అవే మనకి యోగవాసిష్టమైంది. ఆ యోగవాసిష్టంలో ఎలా ఉన్నదో శ్రీ రామచంద్రుడి మనస్సు, యుద్ధానికి వెళ్ళిన అర్జునుడి మనస్సు కూడా అలాగే ఉన్నటువంటి వేళ శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? నదీ తీరంలోనా? ఓ కుటీరంలో నా? లేదు ఆ ఒక వ్యక్తికంగా, ప్రత్యేకంగా చెప్పాడంటే మహారణరంగ మధ్యంలో చెప్పాడు. అలాగే త్రేతాయుగంలో ఆదిత్య హృదయం కూడా యుద్ధరంగంలోనే పుట్టింది. విష్ణు సహస్ర నామం యుద్ధ రంగంలో పుట్టింది. అంటే మానవ జీవితమే మహా సంగ్రామం. ఇది పెద్ద రణరంగం. ఈ రణరంగంలో నుంచి జీవుడు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు దాటి తత్వచింతనా భూమికలో నెలకొన చెందకపోతే భక్తి అర్థం కాదు, జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. తెలిసినదే జ్ఞానం అనుకుంటూ ఉంటాడు. ఇంకా తెలియవలసినది ఎంతో ఉన్నదని అనుకుంటాడు. ఆ అనుకుంటూ ఆ తపన లో నుంచి, ఆర్తి లో నుంచి, ఆర్ద్రత లో నుంచి, ఆ ఎదురుచూపు లో నుంచి మహా కావ్యాలు పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ కూడా అలా ప్రారంభమైనవే. ఇవాళ భాగవతం కూడా అట్లాగే పుట్టుకొచ్చింది. పొద్దున మనం వ్యాస భాగవతం ఎలా పుట్టిందో చెప్పుకున్నాం. వేద వ్యాసుల వారి మనస్సు వ్యాకులత చెంది ఇంకా చిత్తశాంతి దొరకని కారణంగా ఆ సందర్భంలో నారదుల వారు రావటం అదంతా పొద్దున చెప్పుకున్నాం. మరి తెలుగు భారతం ఎలా పుట్టింది? తెలుగు భాగవతం ఎలా పుట్టింది? తెలుగు భారతం ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా సాంఘిక మర్యాదలకు లోబడి సంఘ సంస్కరణకు శ్రీకారం చుడుతూ భారతం పుడితే తెలుగు భాగవతం పోతనామాత్యుని గుండెల్లో నుంచి పుట్టింది. గుండెలో నుంచి దానంతట అది వచ్చిందా? అంటే ఆయన భాగవతం రాయటానికి ముందే కవి. కానీ తన బావ శ్రీనాథుడి వలె ఆయన కూడా భోగిని దండకమని ఒక నర్తకి మీద రాశారు. కానీ రాసిన తర్వాత ఆయనకు అనిపించింది పరమేశ్వరుడు ఇచ్చిన ఈ ప్రజ్ఞని, ఈ విభూతిని, ఈ సరస్వతీ సంవిత్ ఫలాన్ని నేను ఇలా వృధా చేసుకున్నానా? ప్రాపంచికమైన ఒక వస్తువుని వర్ణించడంలో ఇన్ని శతకాలు రాశానా? అని ఆయనకు ఒక ఖేదము, ఒక దుఃఖం పుట్టింది. అప్పుడు ఆయన అనుకున్నాడు. రాయగలిగాను, రాయగలను అనే నమ్మకం ఏర్పడింది గనుక నేనంటూ రాయగలిగితే ఒక మహా కావ్యాన్ని రాస్తా అనుకున్నాడు. మహా కావ్యం రాయాలని అందరికీ ఉంటుంది, ఆయనకీ ఉన్నది. కానీ ఆయన రాయగలడు. ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి? ఏ ముహూర్తంలో మొదలు పెట్టాలి? ఇతివృత్తం ఏమిటి? ఏ దేవీ దేవతల మీద రాయాలి? ఆలోచన తెగటం లేదు. గోదావరి నదీ తీరంలోకి వెళ్లి రోజూ భగవంతుణ్ణి ప్రార్థించేవాడు.ఎక్కడ స్పురణకి రావట్లా తపన తప్తమైన హృదయంతో తపస్సు చేస్తూ ఉంటే ఎప్పుడైనా జీవితంలో ఇట్ డాన్స్ అంటాం DAWNS అంటే అలా తెల్లవారుతుంది తెలీదు మనకి. ఏ క్షణాన ఒక కూలి వాడికి పెద్ద బౌండ్-బౌల్డర్ ఇచ్చి ఈ ఇది పగలగొట్టు నీకో రెండు వందల రూపాయలు ఇస్తాను అంటే పాపం వాడు రెండు వందలకి ఆశపడి బౌల్డర్ బద్దలు కొడుతూ ఉంటాడు. ఇరవై రోజులు అయిపోతుంది యజమానికి అసహనం పెరిగిపోతూ ఉంటుంది. వీడు ఇంకా ఎంత కూలి అడుగుతాడో ఇంతవరకు ఎక్కడ క్రాక్ కూడా కాలేదు అని. ఆరోజు పిలిచి అడుగుతాడు, "నీ వల్ల కాకపోతే చెప్పు ఇంకెవరినన్నా పెట్టుకుంటాను" అని. "ప్రయత్నం చేద్దాం బాబాయ్" అంటాడు వెళ్తాడు. మరనాడు వస్తాడు. వస్తూనే ఓ దెబ్బ కొడతాడు. కొట్టగానే బద్దలైపోతుంది. "అంటే నువ్వు కొట్టగలిగి ఇన్నాళ్ళు కొట్టలేదా?" అంటాడు యజమాని. ఇతనంటాడు, "ఇప్పటికిప్పుడు నేను కొట్టలేదు ఇరవై సార్లు కొట్టిన కారణంగా ఇదిగో ఇరవై ఒకటవ సారి బద్దలైంది". ఇదే జీవితంలో కూడా అంతే, ఎన్నో జరిగిన తర్వాత కానీ తత్వజ్ఞానాభిలాష కలగదు అని చెప్పటానికి జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి మన ప్రయత్నం మనం చేయాలి అని చెప్పటానికి పోతనగారు గోదావరి నదీ తీరంలో కూర్చొని ఉన్నాడు. [కొట్టుకుంటూ] ఆరోజు తెల తెలవారుతున్నటువంటి వేళ ఏం జరిగింది? అంటే తూర్పు దిక్కు నుంచి రాజాభరణాలు ధరించి ఒక విల్లు ధరించి పక్కన ఒక మహారాణితో కలిసి ఎవరో వచ్చినట్టుగా దృశ్యం కనిపించింది. కనిపించగానే ఈయన పట్టించుకోలా. ఆయనన్నాడు-- ఈయన అనుకున్నాడు రాజ ప్రముఖుడు ఎవరో వచ్చారు అని. అనుకునేలోగా వచ్చిన ఆయన ఏమన్నాడంటే, "నేను రాజ ప్రముఖుడ్ని కాదు రామభద్రుడ్ని" అన్నాడు. రామభద్ర దర్శనమైంది అంటే రామచంద్రుడు కనిపించాడు. మరి పోతన హృదయం రాముడి మీద లేదే ఆయనెందుకు కనిపించాడు అని? పోతన వీరశైవుడు. కనిపిస్తే శివుడు కనిపించాలి, రాస్తే శివపురాణం లాంటిది రాయాలి. మరి ఇది ఏదీ కాకుండా ఈ రాముడు ఎందుకు వచ్చాడు అనుకున్నాడు. పోనీ ఆ వచ్చిన రాముడన్న "ఏమయ్యా! నీకోసం నేను వచ్చాను. నా కథ రాయమన్నాడా?" అంటే, "భాగవతం రాయ్" అన్నాడు. కృష్ణుడి కథ రాయ్ అన్నాడు. ఇది భారతీయ అధ్యాత్మలో ఒక అద్వైత మహాస్థితికి ఇది సంకేతం. కాబట్టి మనం ఏమి చేశాము, మనం ఎవరిని ఉపాసించాము, మనం ఏం చేయాలి అనేది నిర్ణయం మనది కాదు. ఈశ్వరుడు అనబడేటువంటి ఒక కర్త దాని నిర్ణయించిన ప్రకారమే ఇవన్నీ జరుగుతాయి గనుక పోతనామాత్యుడు అన్నాడు, "పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవభయం హ-హరమగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేలా" అన్నాడు. అంటే ట-టకారంతో చెప్పాడు. "నేనేం రాయటలే రాయమన్నాడు ఆయన, చెప్పాడట, అన్నాడట, రామాయణం-- భాగవతం అట, కనుక నేను రాస్తాను ఏమవుతుంది?" అని భాగవతం మొదలు పెట్టాడు. కాబట్టి ఇక్కడ మనం ఏకేశ్వర ఉపాసన ఒక భాగంగా ఈ జాతి జీవితంలో ఉన్నప్పటికీ బహురూపాలలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గ్రహించాలి. భాగవతం మనకి అదే చెబుతుంది. రాముడా? కృష్ణుడా? మరొకరా? మరొకరా? కాదు. ఏకోహం బహుష్యాం ఉన్నది ఒక్కటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అద్వితీయం అంటే నా ద్వితీయం రెండోది లేదు ఉన్నది ఒక్కటే. కాబట్టి అఖండమై నిత్యమై ఉన్నటువంటి ఒక ఏకమైనటువంటి సద్వస్తువు అనేక రూపాలు తీసుకుని వస్తుంది గనుక ఆ రూపాలలో, ఆ భావాలలో శివ పారంభ్యం కలిగినటువంటి పోతనామాత్యుడి యొక్క హృదయంలో నుంచి ఆ ఆర్తి కారణంగా శివతత్వంలో నుంచి రామదర్శనం ఏర్పడి రామదర్శనంలో నుంచి శ్రీమహావిష్ణువు కృష్ణుడు కథ ఈ భాగవతం పుట్టింది. కనుక దీని మూలం ఇది. ఇక్కడ కూడా ఆర్తిలో నుంచే పుట్టింది, అవసరంలో నుంచి ఏదీ పుట్టలా. కావ్యం గాని, వాక్యం గాని, భావం గాని లోపల జరిగేటువంటి ఒక అంతరంగ మహాయజ్ఞంలో నుంచి ఎట్లాగైతే ఒక ప్రజాపత్య పురుషుడు బయటికి వచ్చి ఒక అమృత భాండాన్ని చేతికిస్తాడో అట్లాగే మన జీవితాలలో కూడా ఇటువంటి విశేషమైనటువంటి సందర్భాలలో మనకు తెలియని మన లోకలోకాంతర ప్రాణాలలో దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటివన్నీ మన బయటికి వస్తూ ఉంటాయి. వీటిని మనం చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే ఇదిగో ఈ భాగవతం మనకి భాగవుతాం అనేదానికి ఒక ప్రమాణంగా నిలకడ చెందుతుంది. ఇక ఈ భాగవతం ఎలా ప్రారంభమైంది? రామాయణం ఎలా ప్రారంభమైంది? విషాదంలో నుంచి అన్నారు. నిజమే వైక్లభ్యంలో నుంచి పుత్రులు లేరన్న దశరథ మహారాజు దుఃఖంలో నుంచి ఏర్పడిన రామరావణ సంగ్రామం దాకా వెళ్ళింది. భాగవతం ద్వాపర యుగ అంతంలో ఏర్పడింది. ఈ మైక్ సరిగ్గా లేదు ఇది వేరి అవుతున్నది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సరే వాళ్ళు వస్తే చూద్దాం లేకపోతే లేదు. కాబట్టి ద్వాపరయుగం-ద్వాపర యుగంలో యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత కుంతీదేవితో ప్రారంభమైంది. కుంతీదేవి ఒక విన్నపం చేసింది. ఆ విన్నపం ఏమిటంటే, "కృష్ణా! కష్టాలలో మాతోనే ఉన్నావ్. మేము ఏం కష్టాలు పడ్డామో నువ్వు కష్టపడవలసిన అవసరం లేకపోయినా మా కష్టాల్లో పాలు పంచుకుంటూ నువ్వున్నావ్. ఇదిగో నా కొడుకులు రాజులైనారు, యుద్ధం జయించబడింది, నేను రాజమాతనైనాను, ఇవన్నీ నీ దయవల్ల అయినాయి. కానీ కొద్ది రోజులు మా దగ్గర ఉండకూడదా?" అని అడిగింది కృష్ణుణ్ణి.కృష్ణుడు ఉన్నాడు ఉంటే కొద్ది రోజుల కాగానే కృష్ణ పరమాత్మ దగ్గరకు కుంతీదేవి వెళ్లి ఇలా భాగవతం ప్రారంభమవుతుంది. వెళ్లి చూడు కష్టాలన్నీ అయిపోయినాయి తీరిపోయినాయి నా బిడ్డలు వాళ్ళ సంసారాలు సుఖంగా నడుస్తున్నాయి మరి ఇక నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? నా పాత్ర ఇంకేం లేదు కదా ధర్మ స్వరూపుడవైన నువ్వే రక్షించావు కదా నాకు విముక్తి కలిగించు విదేహ విముక్తి కలిగించు అని కృష్ణుడు వెంటనే అడిగిన దానికి జవాబు ఇవ్వడు ఇవ్వకుండా ఆయన ఏమన్నాడంటే ఓ అట్లాగా అయితే మరి నీ మనవళ్ళని వాళ్ళని చూడాలని నీకు లేదా? అని అడిగాడు ఇది మాయావరణం కుంతి అన్నది కొడుకులని కన్నాను భరత సంతతికి వన్నె తెచ్చే బిడ్డలు ఐదుగురిని కన్నాను మహాపతివ్రతామతల్లి అయిన అగ్ని లో పుట్టిన ద్రౌపది వంటి అమ్మాయి మా ఇంటి కోడలయింది వంశం నిలబడుతుంది కనుక నువ్వు నాకు విదేహ విముక్తి ఇచ్చేసేయ్ అని అడిగింది సరేలే అన్నాడు కృష్ణుడు కనుక మహాభాగవతంలో మొట్టమొదటిగా విదేహ విముక్తి పొంది మోక్ష సామ్రాజ్యంలో అడుగుపెట్టినది ఎవరంటే కుంతీదేవి ఎందుకంటే ఐదుగురు బిడ్డలని ధర్మమూర్తులుగా నిలబెట్టి వాళ్ళ కష్టంలో తాను కూడా పాలుపంచుకుని ధర్మాచరణకి మాతృ స్థానం ఎంత బలమైనదో ఎంత వెన్నుదన్నుగా ఉంటుందో నిరూపించినటువంటి సాధ్విలలామె ఎవరంటే కుంతి అది ఆమె విషాదం ఆ రకంగా తొలగిపోయింది ఇక రెండవవారు ఎవరంటే భీష్మాచార్యులవారు అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు మరి భీష్మ పితామహుడు కురుకుల పితామహుడు అయినాడు కుల పితామహుడు కాగలిగాడు కానీ ఆచార్య స్థితముడు కాలేని పరిస్థితి భీష్ముడిది ఎందుకంటే ఎన్నెన్ని అరాచకాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నా ధర-- ధర్మరాజు వంటి ధర్మాత్ముడికి పంచ పాండవులకి ద్రౌపదికి ప్రధానంగా సభలో అవమానం జరుగుతున్నప్పటికీ కూడా ఏమీ పల్లెత్తు మాట అనకుండా ఆయన అక్కడ ఉండిపోయినాడు ఉన్నందువలన కర్మఫలం ఎవరైనా అనుభవించవలసిందే పాండురాజ కుమారులు అరణ్యాలకు వెళ్ళిపోయి కందమూలాలు తింటూ బతుకుతూ ఉంటే దుర్యోధనుడు అనేటువంటి వాడు ఒక్కడి మనసును కూడా మార్చలేనటువంటి దుర్బల మనసు కలిగినటువంటి ఒక భీష్ముడు నేను మహా త్యాగం చేసి ఈ వంశాన్ని నిలబెట్టాను అనేటువంటి ఒక భావనని నిరంతరము మనసులో నెమరువేసుకుంటున్నటువంటి భీష్ముల వారికి చివరికి అంపశయ్యాగతుడు కావలసి వచ్చింది అయితే అంపశయ్య మీద పడుకోవటం అనేది భయంకరమైనది అంటే ముళ్ళ పాన్పు మీద పడుకున్నాడు ఎక్కడ పడుకున్నాడు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు రాజభవనంలో ఉన్నాడు ఆయన కానీ యుద్ధము ఐదు గంటలకి సూర్యాస్తమయం కావటానికి కొన్ని క్షణాల ముందు యుద్ధ విరమణ భేరి మ్రోగుతుంది ఆ మోగినప్పుడు ఇరు పక్షాల వాళ్ళు వెళ్ళిపోతారు మరి అక్కడ ఇంకెవరుంటారు అంటే శవాలని పీక్కు తినటానికి వచ్చే నక్కలు ఊళలు వేస్తూ ఉంటాయి భార్యలను పోగొట్టుకు భర్తలను పోగొట్టుకున్న భార్యలు విధవరాండ్రై అక్కడికొచ్చి రోదన చేస్తూ ఉంటారు శరీరంలో సగం అవయవాలు తెగిపోయి అటు బ్రతుకు ఇటు జీవితము ప్రాణము లేని వాళ్ళు వాళ్ళందరూ హాహాకారాలు రోదన వినిపిస్తూ ఉంది ఇటువంటి ఆ సమయంలో భీష్మాచార్యుల వారు మళ్ళీ తెల్లవారి యుద్ధానికి వచ్చే దాకా ఆయన ఒక్కడు ఉండాల్సి వచ్చింది చూసారా కానీ అంపశయ్య మీద పడుకున్న కారణంగా ఆ శరీరంలో ఉన్నటువంటి కలుషాన్నము తిన్నాడు ఆయన కలుషాన్నం ఎవరిది కౌరవులది కలుషాన్నం గనుక ఆ కలుషాన్నం వలన ఏర్పడినటువంటి ఒక మనస్సు ఒక రక్తము ఇవన్నీ నెమ్మదిగా నేలని తడుపుతున్నటువంటి వేళ ఆ మనస్సు నెమ్మది నెమ్మదిగా కలుష రాహిత్యాన్ని పొందింది కలుషాన్ని పోగొట్టుకుంది ఒక ఉత్తేజితమైన ఉద్వేగకరమైన భావావేశమైన మధుర భక్తి సమన్వితమైనటువంటి ఒక మనోస్థితి ఏర్పడింది భీష్ముల వారికి ఆ సమయంలో ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు పాండవులున్నారు ఆ సమయంలో పాడిన పాటే విష్ణు సహస్ర నామం ఎదురుగా ఉన్న కృష్ణుడులో ఆయనకి చాలా గుర్తొచ్చినాయి ఇందాక మనం అనుకున్న సింహావలోకనం చేసుకున్నాడు యుద్ధంలో ఆ రోజున అర్జునుడిని చంపటానికి అవకాశం లేక చంపలేక ఎట్లాగైనా చంపాలని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను చంపటానికి కృష్ణ పరమాత్మ యుద్ధం చేయనన్నవాడు నా మీద యుద్ధానికి వచ్చాడు అలాగే మహా రణరంగ స్థల మధ్యంలో యుద్ధాన్ని నిలిపి నరుడు అంటే అర్జునుడు ఆదేశించగా కృష్ణుడు రథసారథియై రణరంగ మధ్యంలో రధాన్ని నిలబెట్టి అర్జునుడు చెప్పినదన్-- చెప్పినవన్నీ ఆలకిస్తూ ఆ నగుమోముతో ఉన్నటువంటి కృష్ణుడు నాకు కనబడుతున్నాడు అన్నాడు అలాగే శంఖ చక్రాలు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు నాకు మదిని ఆవేశించు ఎల్లప్పుడును అన్ని అవస్థలలో జాగ్రదవస్థ నిద్రావస్థ సుషుప్తి అది ఏది కానివ్వండి ఏకాంతంలో ఉండనివ్వండి సమూహంలో ఉండనివ్వండి నాకు ఆ కృష్ణుడు గుర్తొస్తున్నాడు అన్నాడు అని ఇంకొకటి గుర్తు చేసుకున్నాడు ఆయన అదేంటంటే పాండవులంతా నిద్రపోయారు యుద్ధం చేశారు వచ్చారు అలసిపోయారు స్నానం చేశారు భోజనం చేశారు గుడారాల్లో పడుకున్నారు కౌరవ సైన్యం వేరే వాళ్ళు అట్లాగే ఉన్నారు గుర్రాలు అలసిపోయినయి రధాన్ని తోలి తోలి శ్రీకృష్ణ పరమాత్మ తన కండువాని తలకు చుట్టుకొనిఆ గుర్రాలకి మాలిష్ చేస్తూ గుర్రపు డెక్కలలో ఇరుక్కున్నటువంటి ఇనప ముక్కలు బాణాలని ఇనుముతో చేస్తారు. ఆ ఇనప ముక్కలన్నీ కూడా నెమ్మదిగా తొలగిస్తూ అ-అశ్వాలను అన్నింటినీ కూడా రేపటి యుద్ధానికి సిద్ధపరుస్తున్నటువంటి ఆ ధూళిధూసరమైనటువంటి రణరంగంలో ఈ రథాలు వెళుతూ ఉండగా రథసారథికి ఛత్రం ఉండదు. ఆయన open to the sky కాబట్టి, ఇదంతా కూడా ఆయన జుట్టు మీద పడి నీలవర్ణముతో ఉన్నటువంటి జుట్టంతా కూడా రాగి రంగులోకి మారిపోయిందట. అటువంటి ఆ కృష్ణుణ్ణి నేను చూస్తున్నాను అన్నాడు. అలాగే మహాభారత సంగ్రామ ఆరంభ వేళలో అర్జునుడి దగ్గరకు వెళుతూ భగవద్గీత అనబడేటువంటి ఒక యోగశాస్త్రాన్ని మా విజయుడికి అంటే అర్జునుడికి బోధిస్తున్నటువంటి ఆ విజయుడి యొక్క రూపమే నాకు కనిపిస్తున్నది అన్నాడు. చూశారా! కదిలిపోయిన, చెదిరిపోయిన, జారిపోయిన, కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో దృశ్యాలు ఆ క్షణాన ఆయనకి గుర్తుకొచ్చినాయి. మానవుడు జీవితంలో కూడా సింహావలోకనం చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి విష్ణు సహస్రనామం మూలం ఈయన యొక్క ఆర్ద్రత, మానసిక పరిణితి, తాను చేసినటువంటి తప్పులన్నీ జారిపోగా ఇక మిగిలిన కొన్ని క్షణాలైనా విష్ణువుని అంగవతీ ఉపాసనగా ప్రతిమా ఈశ్వరః అన్న భావనతో ఒక బొమ్మలో బ్రహ్మాన్ని దర్శిస్తూ సగుణోపాసన చేసుకున్నటువంటి సందర్భం అది. అక్కడ విష్ణు సహస్రనామం ఏర్పడింది. ఆయన ఉన్నాడు గనుక అన్ని గుణాలు గుర్తుకొచ్చినాయి. ఆయన ఉన్నాడు గనుక ఆయన శౌర్యం గుర్తుకొచ్చింది. అక్కడ ఉన్నాడు గనుక ధీరవీర గంభీరమైనటువంటి స్థాయిలు కృష్ణ పరమాత్మలో ఆయన అనుభవిస్తూ తాదాత్మ్యం చెందుతూ-- కాబట్టి ఈ మానవ జీవితంలో జరిగేటువంటి అనేకానేక సంఘటనలకు మూలం ఏమిటి? అని విచారణ చేస్తే దుఃఖమే కారణం. మనందరం అంటాం కలియుగం చాలా చెడ్డది, పాపకాలనిది అంటాం. నా దృష్టి అది కాదు. కృతయుగంలో సత్యం మాత్రమే ఉన్నది. అంటే జీవులు ఒక గోలోకం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా ఒక యోగ ప్రక్రియ ద్వారా పరమాత్మతో జీవాత్మను అనుసంధానం చేసుకొని సత్య జీవితాన్ని గడిపారు. అప్పటికి నగరాలు ఏర్పడలే. మామూలుగా ఉన్నాయి. నెమ్మదిగా త్రేతాయుగం వచ్చింది. రాజులు వచ్చారు, రాజ్యాలు వచ్చినాయి. రాజ్యాలు వచ్చినాయి గనుక స్పర్ధలు వచ్చినాయి. స్పర్ధలు వచ్చినాయి గనుక యుద్ధాలు వచ్చినాయి. యుద్ధాలు వచ్చినాయి గనుక నరహంతకమైనటువంటి మహాప్రళయాలు సంభవించినాయి త్రేతాయుగంలో. కనుక సత్యయుగం ఏది? కృతయుగం అంటే కృతయుగం అంతా అస్థిగతం. అస్థి, ఎముకలు. ఎముకలు అరిగిపోయేలాగా తపస్సు చేసి జీవన్ముక్తులైపోయినారు వారు. అలాగే విదేహ విముక్తి కూడా అక్కడే కలిసిపోయింది. ఇక త్రేతాయుగంలోకొచ్చేప్పటికి ఇది మాంసగతం. మాంసం ప్రధానమైన ఆహారంగా త్రేతాయుగం నడిచింది. యజ్ఞయాగాదులలో మాంసాన్ని వినియోగించినటువంటి సందర్భాలు త్రేతాయుగంలో ఉన్నాయి. అలాగే ఈ ద్వాపర యుగం వచ్చేసరికి అదంతా రక్తగతం. ద్రౌపది లాంటి అగ్ని సంజాత, ఆమె ఏమన్నది? దుర్యోధనుడి-- దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తం తెచ్చి నా కుర్లకు రాయమని అడిగింది భీమసేనుడ్ని. అంటే అదంతా రక్తగతం. అలాగే దాయాది మాత్సర్యాలు. ఒక జాతి వైరం ఎక్కడంటే ఇంట్లో పుట్టినటువంటిది ద్వాపరయుగం. కాబట్టి ఇదంతా ఏమిటంటే ఇది రక్తయుగం. సత్యయుగం ఏమో అస్థిగతం. త్రేతాయుగం ఏమో మాంసగతం. ద్వాపరయుగం ఏమో రక్తగతం. మరి కలియుగం ఏమిటి? ఇది అన్నగతం, అన్నగతం. అన్నం అంటే ఒక మెతుకులో నుంచి మనం తినే పిడికెట అన్నంలో నుంచి ప్రాణం పుడుతుందండి. మనస్సు పుడుతుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఐదు కోశాలు. అంటే మనం ఎటువంటి మెతుకో అటువంటి బతుకు ఏర్పడుతుంది. బతుకు ఏర్పడటం అంటే మనం ఏం తింటామో దానిలో నుంచి భావము, భాషా పుడతాయి. కాబట్టి ఇదంతా కూడా అన్నగతం కాబట్టి ఇక్కడ ప్రాణానికి విలువ ఉంది. మనస్సుకి విలువ ఉండాలి. విజ్ఞానము, ఆనందము అన్నీ అనుభవించగలిగింది ఇది. అంతేకాదు, నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతిః ఈ కలియుగంలో తపస్సు స్వాధ్యాయం చేయలేము. ఆనాటి ఆ రాక్షసికం పోయింది గనుక రాజ్యాలు, యుద్ధాలు లేవు, ఉండవు. ద్వాపరయుగంలో అసలు అన్నదమ్ములు కలిసి ఉండే అవకాశమే లేదు. మరి కలియుగంలో ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు విడిగా జీవితాన్ని హాయిగా గడుపుతారు. ఇది నిర్ణయం. కాబట్టి ఇక్కడ నామస్మరణం ద్వారా జీవన నౌకని అవతలి తీరానికి తీసుకు వెళ్ళొచ్చు అని చెప్పేటువంటిదే ఇది కలియుగం. అయితే ఈ కలి ఎప్పుడు ప్రవేశించాడు? మహారణరంగంలో అర్జునుడి రథం ఎప్పుడైతే మధ్యలోకి వచ్చిందో, కృష్ణుడు ఇక్కడ ఆపమని అన్నాడో అప్పుడే కలి ప్రవేశించాడు. కనుకనే పైకి ధర్మంగా కనిపించే అధర్మ యుద్ధము జరిగింది. అయ్యో అధర్మం చేస్తున్నాడే అంటే కాదు ఇది ధర్మమేనని చెప్పింది కూడా మహాభారత యుద్ధం కాబట్టి కలి ప్రభావం ఇవాళో నిన్నో పుట్టింది కాదు. ఇది నాలుగు యుగాలు దాటగా నాల్గవ యుగమైనటువంటి దీంట్లో ఐదువేల ఐదువందల డెబ్బైఎనిమిది సంవత్సరాలకి ఇప్పటికొచ్చాం మనం.