⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
సత్య లోకాన్ని ఇక్కడే మనం సాధించగలం. దానికి నాంది ప్రస్తావన చేసినటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య శ్రీ చరణాలకు ప్రణమిల్లుతూ మీ అందరికీ సాయిరాం. గురుం సత్య సాయి ఈశ్వర అలన్ వీర విహీనం లోమాతరం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ ప్రణిపతు స్తోతరం. పరమ మాకేశ్వర స్వరూపుడు సత్య చరణంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రాణ ప్రణాం సమర్పించుకుంటూ, ఈ భాగవతం ప్రవచన మహా ప్రవాహంలో అనేకమైనటువంటి మలుపులు, ఒక్కొక్కడినీ ఒక్కొక్క సాధకుడినీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు నడిపించేటువంటి ఈ స్కంధాలన్నీ కూడా చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అందించేట్టుగా, ఆ చిటారు కొమ్మ ఏమిటి? మిఠాయి పొట్లం ఏమిటంటే, ఓ చెట్టు ఉంటుంది. ఎవరైనా చెట్టు చివర పైదాకా వెళ్లి మిఠాయి పొట్లం కడతారా? కట్టరు. కానీ మనకు ఒక సామెత అలా ఏర్పడింది. అంటే కింద నుంచి ప్రారంభించి మూలాధారం నుంచి ప్రారంభించి సహస్రారం వరకు జీవుడు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒకనాడు ఆ చివర ఉన్న మిఠాయిని పట్టుకోవాలి. ఆ మిఠాయి పొట్లంలో ఏముందంటే జ్ఞానం ఉన్నది. కర్మా, భక్తి ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. భజనలు, పాటలు, పద్యాలు సాగుతూనే ఉంటాయి. కానీ అసలు మిఠాయి, అసలు తీయదనం ఎక్కడ ఉన్నది అంటే జ్ఞానమే అమృతం. అందుకే జ్ఞానానంద సుధామరందలహరి అన్నారు శంకర భగవత్పాదులు. అది ఉరికే తేనె వాక్ ప్రవహిస్తున్నట్లుగా ఉంటుందట. జ్ఞానం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న వాడికి. నిజానికి మనం ఈవేళ చతుర్థ స్కంధంలో ఉన్న ధ్రువుడి కథని మళ్ళీ ఇప్పుడు చెప్పుకోబోయే దానికి అడ్డం లేకుండా క్రమంలో ఉండాలి గనుక ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి అజామీలుడి కథని పక్కపక్కనే చెప్పుకున్నాం. నిజానికి నాలుగు, ఐదు, ఆరు రావాలి. కానీ మనం ఏం చేశామంటే కావాలని కాకుండా అలా జరిగిపోయింది నాలుగు, ఆరు. మరి మధ్యలో ఏమైంది ఐదు? ఐదవ అధ్యాయం చెప్పుకోవడానికి లేదా అంటే ఆ రెండు కథల మధ్య అసలు విషయం ఉంది. ఆ ఐదవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటే ఈవేళ నాలుగు, ఐదు, ఆరు చెప్పినట్లు అవుతుంది. కారణం ఏమిటి? నాలుగు, ఐదు, నాలుగు, ఆరు చిన్నవి. చాలా చిన్న కథలు. చిన్న సంఘటన. కానీ ఐదవది కాస్త మళ్ళీ గంభీరమైన విషయం. చాలా తీవ్రంగా మాట్లాడుకోవాలి. లోతులకు వెళ్ళాలి. అదేమిటో చూద్దాం. మోక్షానికి దారి ఏది? అది దాంట్లో విచారణ జరుగుతుంది ఆ అధ్యాయంలో. మోక్షము, దారి అది ఎటు అనే మూడు మాటల్లో అసలు మోక్షం అంటే ముందు తెలుసుకోవాలి మనం. మోక్షం అంటే ఏమిటి? మరణానంతరం వచ్చే ఒక సుఖమా? లేదు ప్రాపంచిక బంధనాల నుంచి మనం వైదొలగిపోయి ఏమీ కాదనుకోవటమా? మనసంతా పరితృప్తమైపోయి ప్రాపంచికంగానూ అక్కరలేదు, ఆధ్యాత్మికంగానూ అక్కరలేదు, అసలు దైవపరంగానూ ఏమీ అక్కరలేదు అని ఏమీ అక్కరలేని ఒక సంపూర్ణ స్థితి వస్తే దానికి మోక్షం అని పేరు పెట్టారా? మోక్షం అంటే స్వర్గానికి వెళ్లటమే మోక్షమా? విష్ణు లోకాన్ని చేరటమే మోక్షమా? ఇవన్నీ మనం ఈవేళ ఈ సమయంలో చాలా లోతుగా ఆలోచన చేయాలి. పొద్దున్న ఆహ్ ఒకరు నన్ను అడిగారు. ఒక జీవుడు తన ప్రాణాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు వారి చుట్టూ మనందరం కూడా రామనామమో, విష్ణు నామమో, శివ నామమో, సాయి నామమో చేస్తూ ఉంటే ఆ జీవుడికి మనం చేసేటువంటి ఈ నామం స్మరణ అంతా కూడా చెందుతుందా? అనేది ఒక మంచి అందమైన ప్రశ్న అది. సాధారణంగా ఎవరూ వేయరు. ఎందుకంటే ఆ జీవుడి పట్ల అపేక్ష గనక లేకపోతే, ఇవన్నీ మనం చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం ఇంకేదో అరుణాచల స్తోతి పంచకం చదువుతున్నాం అరుణాచల శివ అరుణాచల శివ అంటున్నాం. మరి ఆ జీవుడేమో ప్రాణం వదిలిపెట్టే సమయంలో అతడు ఉన్నాడు. మరి ఇవన్నీ వెళతాయా? అతని చెందుతాయా? అసలు చెందవా? లేకపోతే ఆ వెళ్ళే మార్గాన్ని ఇవన్నీ ఏమైనా సుగమం చేస్తాయా? లేదు ఆ విన్నవో, కన్నవో, అనుభవించినవో అవి ఇక్కడే వదిలిపెట్టి ఆ జీవుడు ఖాళీగా వెళ్ళిపోతాడా? ఎన్ని అందమైన ప్రశ్నలు చూడండి దాంట్లో. దానికి కాసేపు మనం సమాధానం చెప్పుకుందాం. ఒక జీవుడు ప్రాణం వదిలిపెట్టేటువంటి సమయంలో మనం చేయవలసింది ఒకటే. సంతాప సభ పెట్టడం కాదు. విషాదంలో మన మనస్సును కూర్చి మనం కూడా దాని చుట్టూ కూర్చొని ఏడవటం కాదు. ఆ రోదనలో జీవుడు బలహీనుడు అయిపోతాడు. ఆ జీవుడు ఎవరైతే ప్రాణం వదిలిపెట్టబోతూ ఉన్నాడో, ఉన్నదో ఆమె లేక ఆతడు ఈ మాటలు వింటూ వింటూ ఈ నామస్మరణ చెవుల సోకుతూ ఉంటుంది. ఎక్కడో చాలా నెమ్మదిగా లీలా మాత్రంగా నేను దేహం వదిలిపెట్టే వేళ కూడా నన్ను భగవంతుడు వదిలిపెట్టలేదనే విశ్వాసం వాళ్ళకి కలుగుతుంది. మరి అక్కడి నుంచి ఈ ఆనందం వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలో ఎక్కడో ఆ ప్రాణం పోయే సమయంలో వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. జీవించి ఉండగా సాగని కోరిక. మిగిలిపోయిన కోరిక. ఆ మిగిలిపోయిన కోరికని కూడా మనం చేసేటువంటి నామస్మరణతో అది కూడా ఆ కోరిక కూడా నశించిపోయి కేవలము నామస్మరణము అనేటువంటి ఆ నౌకలో నామి ఎవరు అంటే భగవంతుడు. నావికుడు ఎవరు అంటే నామము. నడిపేవాడు నామము. ఆ క్షణంలోవెళుతున్న వాడు ఎవరు ఆ జీవుడు చక్కగా ఆ నామమనేటువంటి పడవలో కూర్చొని ఈవలి గట్టు నుంచి ఆవలి గట్టుకు వెళుతున్నప్పుడు, ఈ చిన్న వెలుగులో నుంచి పెను వెలుగులోకి వెళుతున్నప్పుడు, ఈ ప్రపంచంలో నుంచి తన మూల స్థానమైన గోలోకానికి వెళుతున్నప్పుడు, గోలోకం అంటే మళ్ళీ ప్రత్యేకమైన ఆ లోకం కాదది. జ్ఞాన లోకం వైపు మళ్ళీ వెళుతున్నప్పుడు తాను చేసిన పుణ్య చరితని, తాను చేసిన పుణ్య కార్యకలాపాలని అన్నింటిని చక్కగా నెమరువేసుకుంటూ వేసుకుంటూ నా ప్రయాణానికి ఇంతమంది అద్భుతంగా నన్ను సాగనంపుతున్నారన్నటువంటి ఒకానొక ఆత్మ తృప్తితో ఆ జీవుడు శరీరాన్ని వదిలి పెడతాడు. కాబట్టి ఈ అన్నవి, అనుకున్నవి, పాడినవి, ఈ మంచి మాటలు ఇవన్నీ కూడా జీవుడికి ఒక తృప్తిని, ఒక భద్రతని, ఒక పూర్ణత్వాన్ని, ఒక పవిత్రతని ఇచ్చి ఈ మాయా జగత్తులో లేదా మాయామయ జగత్తులో అనేక అనుభవాలు కలిగినప్పుడు, ఆ అనుభవాల వలన అనేకమైనటువంటి కష్ట నిష్టూరాలు ఏర్పడినప్పుడు లేదా సుఖ, సంతోష, ఆనందాలు కలిగినప్పుడు వాటన్నింటిలో కూరుకుపోకుండా మాయావరణాన్ని విచ్ఛేదం చేయగలిగినటువంటిది నారాయణ మంత్రం లేదా శివ మంత్రం లేదా అరుణాచల మంత్రం లేదా సాయిరాం మంత్రం. అది ఏ మంత్రం అయినా సరే, మరి ఎందుకని ఈ మంత్రానికి ఇంత బలం ఉన్నది? మంత్రాలు ఏమిటి ఎవరైనా రాశారా? వీటన్నింటిని మంత్రాలు అంటున్నామేంటే "మనత్రాయతే ఇతి మంత్రః" మంత్రము అంటే మనం మననం చేయగా, చేయగా, చేయగా ఏర్పడేదే మాట. నిజానికి ఆ మంత్రం అలా ఏర్పడినప్పుడు దానిలో కొన్ని బీజాక్షరాలు ఏర్పడతాయి. ఆ బీజాక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాత దైవ-దైవతం ఉంటుంది. ఒక నామస్మరణ చేసినప్పుడు, నామ సంకీర్తన చేస్తున్నప్పుడు ఆ బీజాక్షరాలలో అధిష్టాతమైన దేవీదేవతలంతా మన నాలుక మీద నరాయాడతారు, నర్తిస్తారు. అందువలన కేవలం మన పాట పాడటం లేదు, భజన పాడటం లేదు, ఏం చేస్తున్నాం అంటే ఆయా సందర్భాలకు చెందిన, ఆయా సన్నివేశానికి చెందిన, ఆయా నామ రూప భావాలకు చెందినటువంటి దేవతలను మనం ఆహ్వానం చేస్తున్నాం, ఉపాసన చేస్తున్నాం. ఆ ఉపాసనా బలం చేత జీవుడు సర్వ సన్నద్ధుడై వెళ్తాడు. ఓ అరవై ఏళ్ళో, డెభై ఏళ్ళో పోనీ తొంభై ఏళ్ళో పాత కాలం వాళ్ళు, తొంభై ఏళ్ళు, వంద ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శరీరం వదిలిపెట్టేటప్పుడు ఏ అపేక్షలు ఉండవు. ఇది ఒక పార్శ్వం. రెండవది, ఇవేవీ లేవు అనుకుందాం. ఎవరూ అతని చుట్టూ ఎవరూ లేరు. ఒక్కడే ఉన్నాడు. ప్రాణం పోబోతున్నది. అతనికి నామస్మరణ చేయాలన్న స్ఫూర్తి గాని, శక్తి గాని లేకపోయినట్లయితే అతనికి పెద్ద సహాయం పడదు. కానీ చిన్నప్పటి నుంచి గనక ఈ నామస్మరణ అలవాటు చేసుకున్నట్లయితే, భగవత్ చింతన అలవాటు గనక చేసుకున్నట్లయితే ఆ ప్రాణ నిర్గమన వేళ, ప్రాణం పోయే వేళ అతడికి చటారుణ స్పురణకు వస్తుంది. వచ్చే రామానో, కృష్ణానో, గోవిందానో ఏదో ఒక పలుకు పలుకుతాడు. ఆ ఒక్క పలుకు చాలు అతన్ని వైతరణి నదిని దాటించి, విరజా నదిని దాటించి ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఆనంద ధామంలోకి తీసుకెళ్లేటువంటి మహా శక్తి దేనికి ఉన్నది అంటే మంత్రానికి ఉన్నది. మంత్రము అంటే నామస్మరణం. ఆ నామం ఉన్నది. ఆ నామాన్ని మనం గనక గమనించినట్లయితే మనకి ఆ లాభం కలుగుతుంది. ఇక రెండవది, ఇది ఏదీ లేకుండా అక్కడే గనక ఓ జీవుడు, ఆహ్ దానికొక చిన్న ఉదాహరణ. ఏదో ఒక కోరిక ఉంది. ప్రాణం పోవట్ల. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎందుకు ఇంత యాతన పడుతున్నాడు? లేదు ఈమె ఎందుకు ఇంత యాతన పడుతుంది? హాయిగా, స్వేచ్ఛగా శరీరం వదిలిపెడితే బాగుండుని ఆవిడ యాతన చూడలేక వీడంటాడు. ఆ అన్నప్పుడు ఆ కోరికతోనే గనక మరణించినట్లయితే ఆ కోరిక తీర్చుకోవటం కోసం మళ్ళీ జన్మ కచ్చితంగా ఎత్తి తీరాలి ఇది. అంటే ప్రాణ నిర్గమన వేళ మన మనసులో గాని, మన నాలుకపై గాని, మన లోపల గాని ఉండవలసింది భగవంతుడి యొక్క నామము, భగవంతుడి రూపము, భగవంతుడి యొక్క భావము. ఈ మూడింటిలో ఏదో ఒకటి. కొందరికి ఆ రూపం కనిపిస్తుంది. కనిపించి, నేను వస్తున్నాను, స్వామి నన్ను తీసుకెళ్తున్నారు లేదా రాముడు నన్ను పట్టుకెళ్తున్నాడు ఇలా అంటారు. అంటే ఏమిటి? వాళ్ళకి ఆ రూపం కనిపించింది. ప్రపంచంతో బంధనాలు తెగిపోయినాయి. ఓ నామం వినిపిస్తున్నది. ఏదో నామం వినిపిస్తూ ఉన్నది. అది ఆనందాన్నిస్తున్నది. మనసంతా ఆనందతాండవం చేస్తున్నది. ఆ జీవుడు ఉత్తమ గతులు పొందుతాడు. ఇవన్నీ హాల్మార్క్స్. ఇవి కాకపోయినట్లయితే ఏమవుతుంది అంటే ఆ జీవుడు అలాగే పుడతాడు. ఉదాహరణకి భాగవతంలోనే భరతుడను ఒకాయన ఉన్నాడు. భరతుడంటే మన భారతదేశానికి చెందిన భరతుడు కాదు. ఒక ముని. చాలా నిష్ఠాగరిష్టుడు. అన్నీ పరిత్యజించినవాడు. పరివ్రాజకుడు. అటువంటి ఆయన ఒకరోజున తపస్సు చేసుకొని ఇట్లాగే ఓ గోమతి నది అనుకుందాం. ఆయన ఆ నదీ పరిసర ప్రాంతానికి వెళ్ళాడు. ఊరికే ఆహ్లాదంగా ఉంది కదా! ప్రకృతి అంతా పరవశించి పోతున్నది. మనం కూడా కాసేపు అక్కడ కూర్చుందాం, నుంచుందాం. ఆ నదీ ప్రవాహంలో వెళ్ళటం, మునగటం, రావటమే పుణ్యం వచ్చిందని అనుకోవటమే తప్ప ఆ నది ఎలా పరవళ్ళు తొక్కుతూ వెళ్తున్నది, అప్పుడప్పుడు ఎందుకు ఆగుతున్నది, ఆగి మళ్ళీ ఒక సుడితిరిగి మళ్ళీ ముందుకు వెళ్తున్నది, ఇవన్నీ, ఈ అందాన్ని, ఈ సౌందర్యాన్ని చూద్దామని ఆయనకు అనిపించి అక్కడ ఉండిపోయినాడు. ఉన్నాడు ఇంతలోకే అక్కడ ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ గర్భం దాల్చి ఉన్నది. అయితే దానికి ఇంకా సమయం ఉంది ప్రసవం చేయటానికి. ఇంతలోకే పెళపెళార్బటులుగా ఆకాశంలో మెరుపులు, ఉరుములు, పిడుగులు అక్కడక్కడా పడ్డాయి. ఆ శబ్దానికి లేడి పిల్ల-లేడి తల్లి భయపడిపోయింది.ఆ భయంతో ఒక బిడ్డను ప్రసవించింది. ప్రసవించిన-- ప్రసవించగానే ఆ చిన్న అప్పుడే పుట్టినటువంటి చిన్న లేడీ నీళ్లలో కొట్టుకుపోవడం ఆయన కంట పడింది. ఆయన నీళ్లలోకి దూకారు. దూకి దాన్ని ఒడిసి పట్టుకొని నెమ్మదిగా బయటకు, అప్పుడే పుట్టింది అది, తీసుకుని వచ్చి నెమ్మదిగా తన ఆశ్రమం వైపు వెళుతున్నాడు. ఈ బిడ్డని కని, భయం వలన బిడ్డని కన్నది తల్లి మరణించింది. కనుక ఈ అప్పుడే పుట్టినటువంటి బిడ్డ అనాథ అయింది. తల్లి లేనిది అయింది. అప్పుడు ఈ భరతుడు అనేటువంటి ఒక ముని దానిని సాకాడు. పెంచాడు. విపరీతమైన తీవ్రమైన అభిమానాన్ని దాని పట్ల పెంచుకున్నాడు. తపస్సు వెనక్కి వెళ్లిపోయింది. ధ్యానం వెనక్కి వెళ్లిపోయింది. రోజూ చేసుకునే అగ్ని కార్యం వెళ్లిపోయింది. ఆత్మ విచారణ వెళ్లిపోయింది. శాస్త్రాధ్యయనం వెళ్లిపోయింది. మంత్ర జపాలన్నీ వెళ్లిపోయినాయి. మరి ఏం మిగిలింది అంటే ఆయనకి సర్వ ప్రపంచం ఒక లేడీ పిల్ల అయిపోయింది. రక్షించి దాన్ని కొద్ది రోజులు ఉంచి అడవిలో వదిలిపెడితే అది వేరే సంగతి. ఉన్నదే అడవిలో పక్కన వదిలేస్తే పోయేది. కానీ ఆయన ఏం చేశారు? ప్రేమని పెంచుకున్నారు. ఎంత ప్రేమ అంటే తెంచుకోరాని తెంచుకోలేని ఒక అనుబంధాన్ని పెంచుకున్నటువంటి కారణంగా ఆ లేడి పిల్ల ఆయనకి సర్వ ప్రపంచం అయిపోయింది. సరే, మరి తీవ్ర అధ్యయనం చేశాడు మహాత్ముడు. మామూలు వాడు కాదు భరత ముని ఆయన. ఆయనకి మరి ఆయన కూడా శరీరం వదిలి పెట్టాలి. ఆ సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఆయన దిగులు పడ్డదల్లా ఒకటే. నేను పోతే ఈ లేడి పిల్లను ఎవరో వేటగాడు వచ్చి చంపేస్తాడేమో, ఏ పులి వచ్చి వేటాడి మింగుతుందేమో, ఇంతగా పెంచినది ఇది ఏమైపోతుందో అనేటువంటి ఒక వ్యాపకంలో మనసు పడిపోయింది. మరణించాడు. ఆయన దేహం వదిలేశాడు. మళ్ళీ ఏ జన్మ ఎత్తాడో తెలుసునా? మళ్ళీ ఒక లేడీయే జన్మ ఎత్తాడు. ఇది భాగవత ప్రమాణం. అంటే మనం కూడా ఇప్పటి నుంచి ఎప్పుడో ఓ రోజు అది రాక తప్పదు. అది ఎట్లా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ మనస్సుని ఆయత్తం చేయాలి. ఏనుగు ఎవరికి లొంగుతుంది? మావటి వాడికి లొంగుతుందా? మనుషులకు లొంగుతుందా? గొలుసులకు లొంగుతుందా? కట్టుతాళ్లకు లొంగుతుందా అంటే ఒక చిన్న అంకుశానికి లొంగిపోతుంది. మనసు కూడా ఒక మంత్రంతో లొంగిపోతుంది. అందుకనే ప్రతిరోజూ మనం ఏదో ఒక మంత్రం, అది అష్టాక్షరి నారాయణ మంత్రమా లేకపోతే పంచా-పంచాక్షరీ ఓం నమః శివాయ లేపోతే అవేమీ కాదు ఓం శ్రీ సాయిరామా మీ ఇష్టం. ఏమీ లేకపోతే ఒట్టి ఓం గనక అనుకోగలిగినట్లయితే ఎప్పుడైనా ప్రాణం అనేది పోతే ఆ రోజు వస్తే మనకి ఈశ్వర కృప ఉంటే తప్ప ఆ తలపులు కలగవు. అక్కడ అంకుశం ఎవరంటే గురువు అంకుశం, భగవంతుడు అంకుశం, మనతో పాటు ప్రయాణం చేసిన సత్సంగులు అంకుశం. సత్సాంగత్యము అనుగ్రహించినటువంటి వారందరూ కూడా ఆ ప్రాణ నిర్గమన వేళ మనకి దారి చూపిస్తారు. కనుక ఆ ప్రాణం వదిలేటప్పుడు ఈ రెండు, రెండు ప్రశ్నలు పొంతన ఉన్నవి. అవి మామూలుగా వేసిన ప్రశ్నలు కావు. ఎందుకంటే మనం అధికంగా ప్రేమించినటువంటి మన తల్లి శివ భావనతో శివమూర్తితో మమేకమైనటువంటి ఒక తల్లి మన కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆమెకి ఉత్తమ లోకాలు మాత్రమే కలగాలి అని అసలు ఆ శివుడు అక్కడికి వస్తాడా, వచ్చి తీసుకు వెళ్తాడా అదేమో మాకు తెలియదు గాని మాకు తోచిన రీతి మేము శివనామస్మరణ చేశాము. అది ఆ జీవుడికి చెందుతుందా అనే ప్రశ్నకి జీవుడు ఆ దేహాన్ని వదిలిపెట్టే వరకు ఈ చేసిన నామమే బలమై ఆ జీవుడికి అది ఆస్తి అవుతుంది ఆ క్షణంలో. అదే ఎప్పటికీ చెదరని కదలని ఒక అద్భుతమైనటువంటి అధ్యాత్మ సంపద కాబట్టి ఆ సంపదను సంపాదించుకోవాలి అంటే మన దగ్గర ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు పేరు మనస్సు. ఈ మనస్సు అనేక విధాల వర్ణించబడింది. దీనికి అనేక రూపాలున్నాయి, అనేక శక్తులున్నాయి, అనేక పారుశ్వాలు ఉన్నాయి. మరి ఈ మనస్సు ఆలోచనల నుంచి పుడుతుంది. అన్ని ఆలోచనలు కలిస్తే ఒక మనస్సు అవుతున్నది. మనం మనసులో నుంచి ఆలోచన వచ్చింది అంటాం. తప్పది. అన్ని ఆలోచనలు కలిపితే ఒక మనస్సు అవుతున్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నా మనసులో నుంచి వచ్చిన ఆలోచన మీకు చెప్పాను. నా మనసులో నుంచి వచ్చిన భావం మీకు చెప్ప-లేదు. మీ భావం ద్వారా మనస్సు పుడుతుంది. మీ ఆలోచన ద్వారా మాత్రమే మనస్సు పుడుతుంది. మరి ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? సంస్కారంలో నుంచి పుట్టింది. ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ జననాంతర సౌహృదాది. అనేక జన్మలలో ఎక్కడో ఎప్పుడో ఏర్పడి అనేకమైన జన్మలు ఎత్తి రాగా ఒక సంస్కారం అనేది ఏర్పడింది. ఈ సంస్కారం ఎలా నిలబడింది అంటే ఒక జాతి, ఒక ప్రదేశ, ఒక దేశ పరిస్థితులలో ఉన్నటువంటి సంస్కృతి ద్వారా సంస్కారం నిలబడుతుంది. అంటే ఆలోచన, సంస్కారము, సంస్కృతి. ఈ సంస్కృతికి వెనక మళ్ళీ ఏమున్నది అంటే మనం అనేక జన్మలు ఎత్తి వచ్చా ఉంటున్నాం కదా, ఆ జన్మలలో నుంచి కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇందాక భరత ముని ఒక జన్మ ఎత్తాడు. భరత మునిగా ఎత్తాడు. ఆ లేడీ పట్ల అపేక్ష పెంచుకున్నాడు. ఆ లేడీ ఉండిపోయింది తాను వెళ్లిపోయినాడు. ఆ వెళుతున్నప్పుడు కూడా ఈ లేడీని గురించినటువంటి భావనలతోనే ఆయన మరణించాడు. కాబట్టి మళ్ళీ ఏ జన్మ ఎత్తాడు? లేడీ జన్మ ఎత్తాడు. కాబట్టి ఆ జన్మలన్నీ దేని నుంచి ఏర్పడ్డాయి? కర్మను బట్టి ఆయనకి ఆ జన్మ ఏర్పడింది. కర్మ ఏమిటి? వదులుకోలేని ప్రేమానుబంధాలు, రాగానుబంధాల వలన తాను వదులుకోలేకపోయినాడు.సర్వ శాస్త్రాధ్యయనం చేసి కూడా అనేక విషయాలు కొన్ని వందల మందికి చెప్పగలిగిన శక్తిమంతుడు అయినప్పటికీ కూడా తన వరకు వచ్చేప్పటికీ అభిమానాన్ని దాటలేకపోయినాడు. ఆ మమకారాన్ని చంపుకోలేకపోయినాడు. "అహం మమత్వా సిధిలాయమాని" అంటారు శంకర భగవత్పాదులు. అహం మమత్వా నేను నాది అన్న భావన. ఆ రెండు బలీయమై పోతున్నప్పుడు ఆ మమత ఉండాలి ఒక తల్లికి తన బిడ్డ పట్ల, బిడ్డకి తన తల్లి తండ్రుల పట్ల, మనందరికీ మన గురువుల పట్ల మమత ఉండాలి మమకారం ఉండకూడదు. మమత వేరు మమకారం వేరు. మమకారము అంటే వదులుచుకోలేని మమత. మమత అంటే సహజ సిద్ధమైనటువంటి గౌరవంలో నుంచి, ప్రేమలో నుంచి, అభిమానంలో నుంచి, ఆరాధనలో నుంచి, సాంగత్యంలో నుంచి, సంఘములో నుంచి ఏర్పడేటువంటిది మమత కాబట్టి మమతానుబంధాలు ఉండాలి అది కూడా గట్టి ఎరిగి ఉండాలి పరిమితులు ఎరిగి ఉండాలి మమకారాలు మాత్రం ఎంత తగ్గించుకుంటే మనకి తగ్గుతాయి. మమకారం పెరిగినప్పుడల్లా దాంతో పాటు పెరిగేది అహంకారం. అహంకారం పెరిగినప్పుడల్లా మమకారం. ఎవరన్నా వచ్చి మీ అబ్బాయి బాలేడు, మీ అమ్మాయి బాలేదని చెప్పగానే మమకారము వలన మనం react అవుతాం respond అవ్వం react అయి ఇదేంటి ఇట్లా అంటున్నారు నా కడుపున పుట్టిన బిడ్డ, నా-మా పిల్లని ఇలా అంటారా? మా అబ్బాయిని ఇలా అంటారా? అంటాం. ఇది అహంకార ప్రేరితమైనటువంటిది కాబట్టి "అహం మమత్వా సిధిలాయమాని" ఆ రెండు నా యందు నశించు గాక. ఇది రోజూ అనుకోక్కర్ల ఆ స్పృహలో ఉంటే చాలు. ఆ స్పృహలో ఎప్పుడైతే భరతుడు వెనుక ఉండి ఉన్నట్లయితే, ఏదో నీళ్లలో అప్పుడే పుట్టింది నీళ్లలో పడిపోయింది కళ్ళ ముందు ఒక జీవి మరణిస్తున్నది దాన్ని కాపాడాలనుకోవటం వరకు ఒక ఉదాత్త వైఖరి. ఇక రెండవది, ఆ లేడి పిల్లను తెచ్చుకున పెంచుకోవటం దానికి కాస్త కాళ్ళు పరిగెత్తే శక్తి వచ్చేదాకా పోషించటం అది కూడా అంగీకారమే. కానీ అది లేకపోతే నా జీవితమే లేదనుకున్నామే అది మమకారం. ఆ మమకారం తగ్గించుకోవాలి. స్వామి అంటారు ఎప్పుడో-ఎప్పుడో అనేవారు ఒక మాట "ప్రపా-ప్రపంచంలో ప్రజలందరూ ఏడుస్తూనే ఉంటారు, నా కంటికి కనిపిస్తూనే ఉంటుంది, ఏదో ఒక రకంగా ఏడుస్తూ కనిపిస్తారు. ఇందులో ఏ ఒక్కరైనా భగవంతుడి కోసం ఏడ్చినారా?" అని ఒక question వేశారు. భగవంతుడి కోసం ఒక్కడు ఏడవటంలా నాకిది కావాలి అది పోయింది అది పోయినందుకు ఏడుపు, ఇది రానందుకు ఏడుపు, ఇది ఉన్నందుకు ఏడుపు. అంతా స్వకీయమైనటువంటి రోదనే తప్ప నాకు భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు? ఆ భగవంతుడి రూపం ఏమిటి? ఆ భగవంతుడు అంటూ ఉంటే ఆయనకి నేను ఏం చేయాలి? ఆయన అనుగ్రహం పొందటానికి నేను చేయవలసిన సాధనా రీతులు ఏమిటి? ఇట్లా ఎవరు ఒక్కడు ఏడ్చిన వాడిని నేను చూడలేదు అన్నారు స్వామి. అలాగే స్వామి sixtieth birthday పూర్ణచంద్ర auditorium లో చాలా విశేషంగా జరిగింది. చాలామంది వచ్చారు అందులో స్వామికి వీళ్ళు ఆయనకి లెక్కలేదు గానీ వీళ్ళంతా సృష్టి పూర్తి అని బయలుదేరి వెళ్ళాం. వెళ్తే పూర్ణచంద్ర అప్పటికి ఇంక కులువంత లేదు. పూర్ణచంద్ర auditorium నుంచి స్వామి చాలా brief గా మాట్లాడిన సందర్భం అదొక్కటే. నుంచున్నారు, "వెతుకుచున్నాను వెతుకుచున్నాను వెతుకుచున్నాను" అంటూ మొదలు పెట్టారు. ఏంటిరీ స్వామి ఏంటి వెతుక్కోవటం ఏంటి అని? మీరందరూ దేవుడిని దేవులాడుతూ వచ్చారు ఇక్కడికి. దేవులాట అంటే వెతుకులాట. నేను కూడా వెతుకుతున్నాను వెతుకుచున్నాను వెతుకుచున్నాను వెతుకుచునే ఉన్నాను. కంటికి ఒక్కడు నిజ మానవుడు కానరాడి అన్నారు. అది నిజ మానవుడు, నిజమైనటువంటి మానవత్వం మూర్తీభవించిన వాడు ఒక్కడు నా కంటికి కనపడలేదే ఇది ఎంత దురదృష్టం అన్నారు. అంటే ఒక భగవంతుడికి కలిగినటువంటి ఒక పరివేదన. ఇది కృష్ణుడికి కలిగింది, ఇది రాముడికి కలిగింది, ఇది షిరిడి బాబాకి కలిగింది, ఇది భగవాన్ శ్రీ సత్య సాయికి కూడా కలిగింది. ఎందుకు కలిగింది అంటే ఈ ప్రపంచంలో మనం గురువుల దగ్గరికి వెళ్తాం, మంత్రాలు నేర్చుకుంటాం, శాస్త్రాలు చదువుతాం, పుస్తకాలు రాస్తాం, ఆ అనేక చోట్ల అనేక విషయాలు అంటూ ఉంటాం. కానీ మనం మమతానుబంధాలను తగ్గించుకోలేకపోతున్నామే, మమకారాన్ని వదులుకోలేకపోతున్నామే, అహంకారాన్ని చంపుకోలేకపోతున్నామే, మనలో ఉన్నటువంటి అనేకమైన negativities ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మాట తూలుతున్నామే, మాట పడుతున్నామే, ఇంకొకరిని కించపరుస్తున్నామే, ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని నాకు మోక్షం ఇవ్వు అంటే అదేమన్నా పదార్థవా? అదేమన్నా లడ్డూనా ఇవ్వటానికి? మరి ఏం చేయాలి? ఈ ప్రపంచం, ఈ మనస్సు రెండు విధాల ఏర్పడుతుంది. ఒక అవిద్యతో, అస్పష్టతతో, అనాచారంతో, అహంకారంతో ఏర్పడినటువంటి ఒక మనసు ద్వారా మనం ఈ ప్రపంచాన్ని చూస్తాం. నిజానికి ఈ ప్రపంచం ఉన్నదా లేదా? అదేంటి ఇక్కడ కుర్చీ ఉంది నేను కూర్చున్నాను, కుర్చీలు ఉన్నాయి అందరూ కూర్చున్నారు, light లు ఉన్నాయి, mic లు ఉన్నాయి. ఈ కనిపిస్తున్న ఈ దృశ్యమాన ప్రపంచాన్ని లేదని, కాదని ఎవరు చెప్పగలరు? ఇది వేదాంతంలో శుష్క వేదాంతమా? అంటే కాదు కాదు. శంకర భగవత్పాదులు దీనిని ఒక కోటి గ్రంథాలలో, కోటి గ్రంథాలలో చెప్పవలసిన విషయాన్ని నేను ఒక అర్ధ శ్లోకంలో చెప్తానన్నారు. శ్లోకంలో కూడా సగమే. ఆ సగం ఏమిటంటే, "ఈ జగత్తు మిధ్య, బ్రహ్మ సత్యం" అంతే. దీన్ని ఆలోచించండి అన్నారు. నిజానికి అది కోటి గ్రంథాలు చదివినా తెలియని విషయం. ఆ అర్ధ శ్లోకి అని ఉంటుంది దాంట్లో "జగత్తు మిధ్య" మిధ్య అంటే వీళ్ళందరూ కూడా సనాతన వాదులు కూడా, హేతువాదులు కూడా లేకపోతే ఇంకెవరో స-చదివి చదవని వారు కూడా ఏమంటారంటే శంకర భగవత్పాదులు ఇలా చెప్తారేంటండీ ప్రపంచం కనబడుతుంటే లేదనుకో అంటారేంటి? లేదంటారేంటి? అనంటే ఆయన లేదు అనలేదు.జగత్ నాస్తి అనలేదుగా జగన్ నాస్తి అనలేదుగా జగత్తు మిధ్యా అన్నారు. మిధ్యా అంటే శాశ్వతంగా ఉన్నట్లు కనిపించేది మిధ్యా. మనం ఇక్కడి నుంచి ఎక్కడికో ఓ వంద కిలోమీటర్ల ప్రయాణం కారులో వెళ్తూ ఉంటాం. మంచి ఎండాకాలం రోడ్డు సిమెంట్ రోడ్డు ఓ తారు రోడ్డు ఓ అనుకుంటూ ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. దాహం వేస్తూ ఉంటుంది కారులో కూర్చున్న మనకి. నీళ్లు ఎక్కడా లేవు కానీ ఆ ఎదురుగ్గా వెళుతూ ఉంటే ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎండమావులన్నీ నీళ్లు ఉన్నట్లుగా భ్రమింపజేస్తాయి. పోనీ కారు ఆపితే ఎండమావి మాయమైపోతుంది. కారు నడిపితే ఎండమావి బయటకు వస్తుంది. ఆ ఎండ వలన కలిగిన మావి, మావి అంటే మాయ. ఎండ వలన కలిగిన ఆ మావిలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎండలో నీళ్లు ఉంటాయా రోడ్డు మీద? మనతో పాటు నది ఏమన్నా ప్రవహిస్తున్నదా? కానీ బుద్ధిజీవుడు కానివాడు, బద్ధజీవుడైనటువంటి వాడు ఎండమావి వెంట పరిగెత్తి, పరిగెత్తి, పరిగెత్తి ఎక్కడో దాహం తీరక స్పృహ తప్పిపోతాడు. ఇది కూడా ఈ జగత్తు కూడా అట్లాగే ఉంటుంది. ఇది ఒక విరాట్ మూర్తి యొక్క స్వరూపంగా మనం భావన చేసినట్లయితే జగత్తు ఉన్నదా లేదా? ఉన్నది అనుకున్న వాడికి ఇదే ఉన్నది. లేదు అనుకున్నటువంటి spiritually elevated personality ని అడగండి. స్వామిని వెళ్లి అడగండి. స్వామి ఈ జగత్తు ఉన్నదా? అంటే ఈ జగత్తు ఉన్నదా అంటే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది కానీ ఇది ఇట్లాగే ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనకు ఆరు ఋతువులున్నాయి. ఆరు ఋతువుల్లో ఒక్కొక్క ఋతువు నుంచి ఇంకో ఋతువుకు మారినప్పుడల్లా ప్రకృతి మారిపోతుంది. శిశిర ఋతువు రాగానే ఆకులు రాలిపోతాయి. వసంతం రాగానే ఆకులు మళ్లీ మోసులెత్తుతాయి. మళ్లీ హేమంత కాలంలో ప్రశాంతంగా ఉంటాయి. మంచు బిందువులన్నింటినీ పట్టుకొని ఉంటాయి. ఇదంతా దృ-దృశ్యం చూడటానికి మాత్రమే ఉన్నది తప్ప ఇది నిరంతరము మార్పు చెందుతూనే ఉన్నది. ప్రపంచాన్ని, చెట్టుని వదిలిపెట్టండి మన దేహాన్ని తీసుకోండి. తల్లి గర్భంలో మనం చిన్న పిండంగా ఉన్నాం. ఆ పిండము ముందు అండము. ఆ అండము నెమ్మదిగా పిండమైంది. ఆ పిండము నెమ్మదిగా శిశు ఆకృతి దాల్చింది. తల్లి గర్భాలయంలో నుంచి జీవుడు బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు వాడికి అవయవాలన్నీ అప్పటికి రూపుదిద్దుకొని ఉన్నాయి. కానీ పరిగెత్తలేడు, పాలడగలేడు, ఇది కావాలి అనలేడు. కానీ నెమ్మది నెమ్మదిగా ఆ రూపం మారుతున్నప్పుడల్లా వాడు బాలుడో బాలికో అయి ఒక్కసారి కెవ్వున కేక వేసి ఒక signal ఇస్తాడు నాకు ఆకలి అవుతుంది అని. ఈ ఆకలి దాంతో ఏర్పడేటువంటి అనేకమైనవన్నీ కూడా వాడికి నెమ్మదిగా ఎవరూ అలవాటు చేయకుండానే ఏర్పడిపోతాయి. జీవుడు నెమ్మది నెమ్మదిగా ప్రవర్ధమానమవుతాడు, బాలుడవుతాడు, నడక నేరుస్తాడు, మాట నేరుస్తాడు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నది? ఎవరైనా ఇవన్నీ చేశారా? మనకు ఎవరైనా మాటలు నేర్పారా? నువ్వు ఇలా నడవాలి అలా నడవాలి అని ఎవరైనా చెప్పారా? జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనలోనే మనకు ఒక ఎనభై తొంభై ఏళ్ళు వచ్చేప్పటికి మన రూపమే మారిపోతుంది. ఇవాళ ఉన్నట్లుగా అప్పుడు ఉండం. ఇదివరకు ఉన్నట్లుగా ఇప్పుడు లేము కాబట్టి. కాబట్టి ఈ సహజమైనటువంటి పరిణామ క్రమంలో ఈ జగత్తు నిరంతరము మార్పు చెందేది. ఈ జగత్తు మార్పు చెందుతూ ఇది సత్యం అని అనిపిస్తుంది అది. ఓ మామిడి చెట్టు వేస్తాం. ఆ మామిడి చెట్టు ఉంటుంది ఓ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు. ఆ మామిడి చెట్టు పెరగటం చూసిన తాతగారు ఉండడు. పెరిగిన తర్వాత కాయలు కోసుకున్న మనవడు ఉండడు. కానీ చెట్టు ఉండిపోతుంది. జీవుడు ఉండడు జగత్తు ఉంటుంది ఇది. కాబట్టి జగత్తు ఎప్పుడూ constant factor. కానీ అది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు చెందుతున్నది అనేటువంటి స్పృహ ఉండటమే జ్ఞానంలో మొదటి మెట్టు. ఇది మార్పు చెందదు అన్నీ, అన్ని ఋతువులలో వసంతం లాగ ఉండాలి, అన్ని ఋతువులలో పూలు పూయాలి, అన్ని ఋతువులలో కాయలు కాయాలి అంటే అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి సూత్రం. అలా జరగదు. ఒక చెట్టు ఉంటుంది మామిడి చెట్టు [గొంతు సవరించిన శబ్దం] అది బాగా పూత పూసింది. చాలా విపరీతంగా పూత పూసింది. ఆ యజమాని అనుకుంటాడు ఈ సంవత్సరం కొన్ని వందల మామిడి పళ్ళు రేపు నేను తీసుకోబోతున్నాను, దింపబోతున్నాను వాళ్ళ భాష. పండు దింపబోతున్నాను అంటాడు. అనుకుంటున్నాడో లేదో రెండు రోజులకి పెద్ద పెనుగాలి వస్తుంది. ఏవి కొమ్మకి అంటుకోకుండా ఉన్నాయో అవన్నీ వాడి కళ్ళ ముందు రాలిపోతాయి. ఓ thirty percent రాలిపోతాయి. పోనీలే పోయినా డెబ్బై percent ఉందని ఉంటాడు. ఇంతలోకి ఏదో మంచు కమ్ముతుంది. దాంట్లో కొన్ని పోతాయి. తర్వాత ఇంకేదో అవుతుంది. ఏదో చీడ వస్తుంది దాంట్లో కొంత పోతాయి. కొన్ని అసలు పరిణామం చెందవు. కాయగానే మారవు. ఒకవేళ కాయగా మారినా ఆహ్ సరైన ఆకారంతో రావు. తర్వాత పండుతాయి. కొన్ని పండుతాయి, కొన్ని రాలుతాయి, కొన్ని ఎవరో కోసుకుపోతారు, కొన్ని ఎండిపోతాయి. చివరికి మిగిలేది ఏమిటి? అని ప్రశ్న వేసుకుంటే ఏది మనకి అందవలసి ఉన్నదో అది మాత్రమే పరమేశ్వరుడు మనకిస్తాడు. ఏది మనకు ప్రాప్తమో అది మాత్రమే లభిస్తుంది. మనం ఏం కోరుకోవాలంటే ఇది కావాలి అది కావాలని కోరుకోకూడదు. మరి ఏం చేయాలి? కోరుకోకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి? పోనీ కోరుకో. ఎట్లా కోరుకోవాలి? ఎట్లా ఆనందపడాలంటే నీ చేతికి ఏది అందిందో అది పరమేశ్వర ప్రసాదంగా భావన చెయ్. నీవు కావాలన్నదంతా కల్పవృక్షము ఇవ్వదు, కామధేనువు ఇవ్వదు, పరమాత్మ కూడా ఇవ్వడు. ఏమిస్తే మనకు ఆనందం కలుగుతుందో, ఎంత ఇస్తే దాన్ని మనం కాపాడుకోగలమో, మన శక్తి ఏమిటో దానిని బట్టి సంపద అయినా ఇస్తాడు, కీర్తి అయినా ఇస్తాడు. అక్కరలేని వాడికి కీర్తిని ఇవ్వడు. వాడికి అపకీర్తిని ఇస్తాడు. కీర్తి ఇవ్వవలసిన వాడికి ఇవ్వవలసినంత ఇస్తాడు. ఐశ్వర్యం ఎంద-ఎవరికి ఇవ్వాలో వాడికి ఇస్తారు. ఆ ఎంత ఇవ్వాలో, ఇదంతా కూడా ఇ-ఇది is a measured గా ఉండేటువంటి ఒక దివ్యమైనటువంటి విధానం. కాబట్టి అవిద్యతో కూడిన మనస్సు వలన ఈ జగత్తు ఉంటుంది అనేటువంటి ఒక భ్రాంతి వలనజీవుడు ఇక్కడ యాతన పడుతూ ఉంటాడు. ఈ యాతన లో నుంచి మోక్షం వైపు వెళ్ళాలి ఇది కదా అసలు ప్రశ్న. ఇప్పుడు మనందరం ఎవరినడిగినా మోక్షం కావాలి నాకు ఈ జన్మ అక్కర్లేదు అంటాడు. ఇది చాలా చూశాం అండి ఇంకా నాకు ఈ జన్మే అక్కర్లేదు మీరు ఎట్లాగైనా స్వామికి చెప్పండి నాకు జన్మ లేకుండా చేయమని అడుగుతూ ఉంటారు. అమాయకంగా అడుగుతారు. స్వామి కూడా దాని మీద ఎటువంటి ప్రమాణం చేయలేదు. అసలు మీ కర్మలకు నేను బాధ్యుడిని కాదన్నారాయన. మీ కర్మలు గనక ఏర్పడిన ట్లయితే, ఇబ్బందులు ఏర్పడిన ట్లయితే, కష్టాలు వచ్చినట్లయితే దాన్ని మీరు కర్మ నిష్ట గా మార్చుకోండి. దాన్ని అధిగమించటానికి ఏం చేయాలో చేయండి. మీకు కావలసినటువంటి సహాయ సంపత్తులన్నీ కూడా దైవం అనేక విధాల మీకు సమకూరుస్తాడు తప్ప, మీ కష్టము రాగానే దాన్ని తీసేసి పక్కన పెట్టడు. ఒక్కసారి ప్రశాంతి నిలయంలో ఒకాయన ఒక one month క్రితం ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. చాలా ఆ విపత్కరమైన పరిస్థితి. స్వామి ఆ ఉత్తరం తీసుకున్నారు. ఒక నెల అయిన తర్వాత ఆయన వచ్చారు, ప్రశాంత నిలయానికి వచ్చారు. రెండో ఉత్తరం రాసుకుని వచ్చాడు. రెండో ఉత్తరం స్వామి తీసుకోల. మొదటిసారేమో అడిగి తీసుకున్నారు, రెండో సారేమో ఇలా చూపిస్తున్నా ఆయన ముట్టుకోలేదు అలా వెళ్ళిపోయినారు. సరే ఆ నెల gap లో నన్ను కూడా చూసాడు గనుక అప్పుడు స్వామి ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు నా దగ్గర ఎందుకు తీసుకోలేదు మీ దగ్గర జవాబు ఉంటే చెప్పండి అని అన్నారు. చూడండి ఆ ఉత్తరంలో మీరు ఏమి రాశారో తెలియదు గాని స్వామికి తెలుసు గనుక, దానిలో మీరు ఏదన్నా కష్టాన్ని గురించి రాసి ఉంటే తీరిపోయింది. తీరిపోయిన వాటితో మళ్ళీ ఆయన ముచ్చట్లు పెట్టుకోలేరు ఆయనకి చాలా పని ఉంటుంది కదా. తీరి ఉండకపోతే మళ్ళీ ఉత్తరం తీసుకునేవారు. మీ కష్టం తీరే దాకా ఉత్తరం తీసుకునేవారు, తీసుకోలేదు ఉంటే మీ కష్టం తీరి ఉండాలి అని అన్నా. చాలా బాగుందండి కష్టం పోయిందనే కృతజ్ఞతగా ఉత్తరం రాశాను మరి స్వామికి ఉంది అని చెప్పినప్పుడు ఉత్తరం రాయాలి, తీరింది అన్నప్పుడు కూడా ఉత్తరం ఇవ్వాలి కదా అని అంటుండంగా స్వామి వెనక నుంచి వచ్చారు. ఆ వెనక room నుంచి cut చేసుకొని ఇటు వచ్చారు. రాగానే పాపం ఇతనితో మాట్లాడారు. నుంచున్నారు అక్కడ. నుంచుంటే ఇతను మోకాళ్ళ మీద నుంచొని స్వామి నెల రోజుల క్రితం మీకు ఉత్తరం ఇచ్చాను, నెల తిరక్కుండా నా కష్టాలన్నీ తీరిపోయినాయి కృతజ్ఞతతో నేను మీ దగ్గరికి వచ్చాను అన్నారు. మామూలు సాధారణ గురువు గనక అయితే ఏమంటాడంటే, అవును నీ కష్టం నేను తీర్చాను అంటాడు అంతే కదా. స్వామి ఏమన్నారో తెలుసా? కష్టం వచ్చినప్పుడు వచ్చింది నువ్వే, కష్టం తీరినప్పుడు వచ్చింది నువ్వే, ఆ రెండింటిలో ఉన్నది నేనే గాని నువ్వు కాదు అన్నారు స్వామి. అంటే నా ప్రమేయం ఏం లేదు అకర్తృత్వం. ఇది ఒక beautiful answer మనకు కూడా. అంటే అవును నేను తీర్చాను అంటే ఇది ఆ తీర్చడానికి అంతు ఉండదు, ఇది గడిస్తే ఇంకో ఉత్తరం వస్తుంది. రోజు ఇక ఆయన ఒక్కడినే attend అవ్వాలి ఆయన life అంతా. అందుకని నీ కష్టం తీరే సమయానికి నువ్వు నా దగ్గరికి వచ్చావ్ అన్నారు. ఇట్లా rational గా స్వామిని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడికి వస్తే ఈ జగత్తు మిధ్య, బ్రహ్మ సత్యం అన్నాం. ఆ బ్రహ్మను గురించి కాసేపు పక్కన పెడదాం. బ్రహ్మకు సంబంధించిన మోక్షాన్ని కాసేపు అయ్యాక మాట్లాడదాం. ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే జగత్తు గురించి మాట్లాడాలి. అసలు జగత్తు అనేటువంటి మాట ఎలా వచ్చింది? జగత్తు తెలుగులో, జగత్ సంస్కృతంలో. ఏమిటి? ఆ జ అంటే పుట్టేది, గత్ అంటే పోయేది, అది. ఏది పుడుతున్నదో అది పోతుంది, ఏది పోవలసి ఉన్నదో అదే పుడుతూ ఉన్నది అది ఈ జగత్ అంటే అది. ఈ జగత్తుని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో దానికి మోహ ముద్గరా అని పేరు పెట్టారు మొదట్లో. అందరికీ అర్థం కాదు అని దక్షిణామూర్తి స్తోత్రం గా దాన్ని మార్చి కేవలం దశశ్లోకి, పది శ్లోకాలు ఉంటాయి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం, పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా, యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ಇದಂ శ్రీ దక్షిణామూర్తయే. అది. అంటే విశ్వం, ఈ ప్రపంచం అంతా, ఈ జగత్తు అంతా ఎట్లా ఉన్నది అంటే దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. అద్దంలో నగరం బొమ్మ ఎలా కనిపిస్తున్నదో అట్లా ఉందట అంతే. అద్దం ఏమిటి? విశ్వంభరుడు అద్దం అయినట్లయితే దానిలో ఒక బొమ్మలాగా. ఇప్పుడు మన బొమ్మ మనకు అద్దంలో ఎలా కనిపిస్తున్నదో అంత మాయగా కనిపిస్తున్నది. మనం అద్దం ముందు నుంచొని బొట్టు పెట్టుకోవాలి అనుకున్నాం. బొట్టు ఎవరికి పెడుతున్నాం? మనకి పెట్టు-పెట్టుకుంటే. పెట్టుకున్నామో లేదో ఆ బొమ్మ చెప్తుంది, ప్రతిబింబం చెప్తుంది. అద్దంలో ఉన్నదానికి మనం బొట్టు పెట్టం కదా! కాబట్టి ఏది మిధ్య అంటే నేను ఆ అద్దంలో ఉన్నాను అనేటువంటి భ్రాంతి కలగటమే మిధ్య. మరి అక్కడ నువ్వు లేవా? నువ్వు నుంచుంటే ఇంకెవరో వచ్చి కనబడుతున్నారంటే కాదు కాదు. నువ్వు నుంచున్నావు, నువ్వే కనబడుతున్నావు. కానీ అద్దానికి ఇటు నువ్వున్నావు, అద్దం లోపల నువ్వున్నావు, అద్దానికి వెనక ఏమీ లేదు చూడండి. ఆ అద్దాన్ని నెమ్మదిగా ఒక రెండడుగులు పక్కకి జరపండి, మీరు అక్కడే నుంచోండి. మీరు రెండడుగులు అవతలికి వెళితే తప్ప మీ బొమ్మ మీకు కనపడదు. అలాగే అద్దం వెనక్కి వెళ్లి బొట్టు పెట్టుకుందామంటే అసలు వెళ్లటం ఎందుకు? ఇక్కడైనా పెట్టుకోవచ్చు కదా. అంటే ఈ జగత్తు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మనిషిని మాయావరణంలోకి నెట్టివేస్తుంది. దీనికి కారణం అవిద్య. అవిద్య అంటే చదువు లేకపోవడం అవిద్య కాదు, బాగా చదువుకున్నవాడు కూడా అవిద్యలో ఉంటాడు. దానికే భజగోవిందంలో శంకర భగవత్పాదులు చెప్తారు కదా, దృకుంకరణై, తొంభై ఏళ్ళు వచ్చినై చెట్టు కింద కూర్చున్నాడు, వేదాలు శాస్త్రాలు వల్లె వేస్తున్నాడు, భగవత్పాదుల వారి శిష్యులతో వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే దూరం నుంచే ఆ ముసలాయనను చూశారు. ఈయనేమో మంచి నవ యవ్వనంలో ఉన్నారు భగవత్పాదులు. ఆయనకి ఆ వృద్ధుడి మీద జాలి కలిగింది. శిష్యులతో సమానం ఆ వాళ్ళని కూడా కలుపుకొని ఆయన దగ్గరికి వెళ్లి నుంచొనిఏమి ఏం చేస్తున్నారు ఈ వయసులో పెద్ద వయసు వచ్చింది కదా ఇప్పుడు శాస్త్రాలు వల్ల వేస్తున్నారు ఏమిటి ఇప్పుడు ఈ అధ్యయనం ఏమిటి అని అడిగితే నేను నువ్వు నాకు చెప్పేంత వాడివి కాదు నా వయసు అంత నీ వయసు లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపో నీ దారి నువ్వు వెళ్ళు అన్నాడు అట్లా కాదు మీరు ఏం చదువుతున్నారు అని అడిగాడు నేను వ్యాకరణం నేర్చుకుంటున్నాను అన్నాడు వ్యాకరణం సరే ఆ వ్యాకరణం నేర్చుకొని ఏం చేస్తావు అని అడిగారు శాస్త్రాలన్నీ చదివేస్తాను అన్నాడు అప్పటికి తొంభై ఏళ్ళు వచ్చినాయి ఆయనకి అప్పుడు ఆయన అన్నారు ఎంత మాయా మోహిత జగత్ ఇది ఎంత మాయ ఏర్పడి ఉన్నది తొంభై ఏళ్ల వాడు భగవాన్ నామస్మరణ చేయవలసింది పోయి ఇప్పుడు భాగవతం చదువుదామా భగవద్గీత చదువుదామా వ్యాకరణం నేర్చుకుందామా తర్క మీమాంస తెలుసుకుందామా అని ఉన్న సమయాన్ని కూడా అచేతనంగా వృధా చేసుకుంటున్నాడే అని భజగోవిందం ఆయన నెమ్మదిగా చదువుతూ వెళుతూ అక్కడ ఒక మాట అంటారు మూఢమతే అంటారు ఈ అవిద్యకు సంబంధించినది ఆ మూఢమతే అంటే ఎవరినో ఆయన తిట్టినట్లు కాదు అన్నీ తెలిసి కూడా ఇది సత్యమని ఎరిగి కూడా ఇది మనం చేయలేమని ఖచ్చితంగా తెలుస్తున్నప్పటికీ కూడా నేను మాత్రమే చేయగలనని వెళ్ళేటువంటి ఆ అహంకృత్-- కర్తృత్వం ఏదైతే ఉన్నదో దానిని మూఢమతే అన్నారు ఎవరు ఆ మూఢమతులు అంటే బాగా చదువుకున్న వారికి జాడ్యం ఉంటుంది అందుకనే మనం తెలుగులో చదువుకున్న వాడి కంటే మడేలు మడేలు అంటే చాకలి వాడు వాడు చాలా గొప్పవాడు ఎందుకంటే మన వస్త్రాలన్నీ మా-- ఆ మరక పోయేదాకా దాన్ని ప్రయత్నం చేసి తొలగిస్తాడు వాడికి పెద్ద విద్య లేదు కానీ ఆ ప్రజ్ఞ ఉంది విద్య వేరు ప్రజ్ఞ వేరు విద్య లేని వాడి దగ్గర ఎక్కువ ప్రజ్ఞ ఉంటుంది బాగా విద్య ఉన్నవాడి దగ్గర ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది ఈ రెండూ కలిసి ఉన్నట్లయితే అప్పుడు మనకి విచారణ సంపూర్ణ అవుతుంది గనుక