⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
ఇక జరగవలసింది ఏమిటంటే కంసవధ జరగాలి అది ఎలా జరుగుతుంది మాయోపాయం చేత వీళ్ళని మట్టుపెట్టాలనుకున్నాడు కంసుడు కానీ ఈయన యోగ మాయలో పుట్టి. లోక మాయని ఆశ్రయించి. ఈ ప్రపంచాన్ని ప్రపంచం అనే దాంతోనే ఎదురుకునేటువంటి వాడు అంటే ముల్లుని ముల్లుతోనే తీసేవాడు గనుక మాయని మాయతో జయించాలనుకున్నాడు కృష్ణుడు కనుకనే ఎదురుగా కనిపిస్తుంటే పట్టుకోబోతే అక్కడ కృష్ణుడు ఉండేవాడు కాదు ఇంకెక్కడో నుంచొని ఉండేవాడు అక్కడికెళ్లి ఇదంతా భాగవతంలో ఉన్నదే వెళ్లి మళ్ళీ పట్టుకుందాం పట్టుకుందామని వెళితే దొరికేవాడు కాదు చివరికి ఏమన్నాడంటే నీ మాయలేవో ఉంటే అవి ఆపి నా చేతికి చిక్కు నీ సంగతి చెబుతానన్నాడు. నీ చేతికి నేను చిక్కటానికి రాలేదు నా చేత నువ్వు చిక్కుంచుకుంటావు చూడమన్నాడు ఒక మూడు నాలుగు నిమిషాలలో కంసుడిని పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడంటే ఒక ఎముడు ఎమ భటులు కాదు ఎముడే వచ్చి పట్టినంత గట్టి పట్టు పట్టాడు కంసుడిని నేల మీద పడేశాడు ఎందుకంటే ఒక కుటుంబంలో తన తండ్రిని తన చెల్లిని చెల్లి భర్తని చెల్లి భర్తని మనం విష్ణు స్వరూపంగా చూస్తాం మన సంప్రదాయంలో బావగారిని ఏదో కాస్త కాలక్షేపం ఆ ఉన్నప్పటికీ కూడా చెల్లెలు భర్త అనగానే మనం దైవంగా చూస్తాం అది జాతి సంస్కారం అటువంటి ఆయన్ని కూడా పాపం వసుదేవుడు చాలా మంచివాడు సౌమ్యుడు అటువంటి వాడిని కూడా నువ్వు హింస పెట్టావు గనుక నీకు ఇదే మరణం అన్నాడు కంసవధ చేశాడు. దీంట్లో అధ్యాత్మ ఏమన్నా ఉందా అంతా కథగానే ఉంది కదా అంటే కంసుడు మూడు మాయలు పనిచేసినయి ఈ కథలో ఒక మాయ యోగ మాయ కృష్ణుడు దానిలో నుంచే వచ్చాడు రెండవది కృష్ణుడు ఆవేశించుకున్నటువంటి లోకమాయ రెండవది ఇక మూడవది మాయ అసలు మాయ అసలు మాయ అంటే అజ్ఞానంతో అహంకారంతో దంభంతో అధికారంతో కూడుకున్నటువంటి మాయావరణంలోకి ఎప్పుడైతే కంసుడు దానిని వినియోగించి తన పీఠాన్ని తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని అనుకొని తండ్రిని హింసించాడో అటువంటి వాడిని చంపాడు కంసుడు పీడ వదిలింది ముందు కువ-కువలయ పీడ అయిపోయింది ఇక్కడ కంస పీడ అయిపోయింది అయిన తర్వాత ఉగ్రసేన మహారాజుని బయటకు తీసుకొచ్చాడు తల్లి తండ్రిని బయటకు తీసుకొచ్చాడు అప్పుడు చెప్పాడు వసుదేవుడికి దేవకికి అమ్మా అప్పుడు కృష్ణి గర్భుడని నారాయణుడని మాధవుడని నన్ను పిలిచారు కదా ఇప్పుడు నాకు పెట్టారమ్మా పేరు నా పేరు కృష్ణుడు అప్పటిదాకా ఆమెకు తెలియదు గర్గ మహర్షి వచ్చి ఆ పేరు పెట్టాడు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి నేనే ఆ కృష్ణుడిని ఇదిగో నాకంటే ముందు పుట్టిన బలరాముడు అని ఆ దేవకికి చెప్పినప్పుడు ఉగ్రసేన మహారాజు తాతగారు అంటే బయటకు వచ్చి నాయనా కృష్ణా నువ్వు వచ్చావు గనుక ఆ కంసవధ జరిగింది మా వల్ల అయ్యేది కాదు మేము మా జీవితమంతా చెరసాలలోనే మేము మగ్గి అక్కడే మరణించి ఉండేవాళ్ళం వయస్సు చిన్నదైనప్పటికీ ఈ రాజ్య సింహాసనార్హత నీకు మాత్రమే ఉన్నది గనుక నేను బతికుండగానే నీకు పట్టాభిషేకం చేస్తాను రమ్మనమన్నాడు ఉగ్రసేన మహారాజు అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏమిటంటే నాది కాని దానిని నాదిగా నేను భావించను చూడండి అపరిగ్రహము అస్తేయము అనేటువంటి వేదాంత పరిభాషలో ఉన్న పదాలను కృష్ణుడు ఆ రెండూ వాడకుండా చెప్పాడు నాది కాని దానిని నాది అని నేను అనుకోను అది ఎవరిది ఎవరెవరికి ఏది చెందాలో వారికి అప్పచెప్పడమే నా పని మీరు ఈ రాజ్యానికి వారసులు కాదు మీరు మూలం మీరు బతికుండగానే సింహాసనం ఎక్కాడు కంసుడు మా మామ కాబట్టి మీరే ఈ రాజ్యానికి అర్హులు అనంటే ఆయన అప్పటికి పెద్దవాడైపోయినాడు లేదు దేవకీ వసుదేవులు నీకు తల్లిదండులు కదా వాళ్ళ ఇద్దరినీ మా ఈ మధురా నగరానికి రా చేద్దాం అనే రాజ్యానికి అనంటే వాళ్ళిద్దరూ ఏమన్నారంటే కృష్ణుడంతటి ఒక పరమాత్మని ఈ గర్భంలో నేను ధరించిన తర్వాత ఈ రాజ్య సింహాసనము తుచ్ఛము నాకు అక్కర్లేదు అన్నది ఆమె మాకు అవసరం లేదన్నది వసుదేవుడు కూడా అన్నాడు భగవంతున్నే మేము కడుపులో పెట్టుకొని ఈ ప్రపంచానికి అందించాం మాకీ అల్పమైన స్వల్పమైన ఈ భౌతికమైనటువంటి సంపద గాని ఈ అధికారం గాని మాకు అక్కర్లేదు కనుక మా దారిన మేము తపస్సుకి చేసుకోవటానికి ఇద్దరము అడవిలోకి వెళ్తాం మిగిలిన జీవితం అంతా మేము అట్లా గడుపుతాం కనుక మీరు ఈ రాజ్యం ఏలుకోండి అంటే తన తాత గారికి పట్టాభిషేకం చేశాడు కృష్ణ పరమాత్మ దీంతో కంసవధ పూర్తయిపోతుంది సరే మరి ఇంకా ఏమి మిగిలింది అని ఈ ఈ మధ్యలో కంస వధ నుంచి రుక్మిణీ కల్యాణం వరకు అనేకమైనటువంటి ఈ దుష్ట సంహార క్రీడ సాగిస్తూ వెళ్ళాడు అవన్నీ ఇలాగే ఉంటాయి ఆ కథలన్నీ ఇంత భిన్నంగా ఏం ఉండవు కాకపోతే ఒకచోట మగవాడు ఉంటాడు ఇంకోచోట తొంగ ఉంటుంది ఒకచోట వృషభ ఉంటుంది ఒకచోట శకటం ఉంటుంది ఒకచోట సుడిగాలి ఉంటుంది ఒకచోట అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అది ఆయన ప్రమాణం మనం కూడా జీవితంలో ఒక ప్రమాణం చేసుకోవాలి ఆ ప్రమాణం ఏమిటంటే మనం పుడతాం. బీదరికంలో పుట్టామో డబ్బుతో పుట్టామో పుట్టాము పుట్టిన తర్వాత ప్రపంచంలో ఒక మర్యాదని సంపాదించుకునే రీతిలో చదువుకున్నాము మర్యాదను కూడా సంపాదించుకున్నాం అలాగే అరవై ఏళ్ళో డెభై ఏళ్ళో ఎనభై ఏళ్ళో వస్తాయి కానీ ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే ఇందాక పొద్దున్న నుంచి చెప్పుకున్న కథల్లో ఒకే ఒక్క నీతి ఉన్నది ఈ లోక మాయకు లోబడకండి అది నీతి ఆ కథలు చెప్పుకోవడం పెద్ద ఆనందం ఏం కాదు ఏం లేవు ఆ కథల్లో నిజానికి కానీ లోకమాయ మనల్ని చాలా భ్రష్టు పట్టిస్తుంది.మన్ మహాయోగ నిష్ఠ సమాధి నుండి విక్రియ భేద బ్రహ్మ భావించు వేళ పట్టరాని సౌందర్య పిపాస తగిలి భ్రష్ట యోగిని కవి జన్మ బడసినాడా ఏమిటయ్యా ఇదంటే ఓ బాగా చదువుకున్నాయన బాగా గ్రంథాలు రాసినాయన భాష మీద మంచి పట్టున్నాయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఎందుకు అక్షర వాంగ్మయాన్ని చేశాడు అనేక పుస్తకాలు రాశాడు మరి అటువంటి వాడికి బ్రహ్మ లోక ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి తదనుగుణంగా ఈయన బ్రహ్మ లోకానికి వెళ్ళాడు వెళ్లే సరికి పద్మంలో కూర్చున్నాడు బ్రహ్మ ఆయనకు కొద్దిగా దూరంలో వీణావాదనం చేస్తున్నది సరస్వతీదేవి అమ్మవారు ఆ సరస్వతీ దేవి యొక్క వీణ నిస్తంద్ర మంద్రంగా చాలా సన్నగా వాయిస్తు ఉన్నది ఎందుకని ఏం వాయిస్తున్నది అంటే మనసుకి ఒక ఉత్సాహము అలసట లేనితనము కేవలము మానవ కంఠం తో పోలి ఉండేటువంటి ఒకే ఒక Musical Instrument అంటే సంగీత వాద్య పరికరం ఏది అంటే అది వీణ భారతీయమైనటువంటి ఈ పరికరాలు అన్నింటిలో బ్రహ్మ చేత సృష్టింపబడిన అటువంటిది వీణ పాత వీణ మీరు ఎక్కడైనా ఫోటోలు చూస్తే ఒక మనిషి తలగా ఉండి ఆ తల నుంచి కాళ్ళ వరకు వెళ్లినట్లుగా ఉంటుంది పడుకోబెట్టిన నిలబెట్టిన దాని మీద Strings మనం Play చేసినప్పుడు ఖచ్చితంగా పురుష కంఠం వినిపిస్తుంది లేదా మానవ కంఠం వినిపిస్తుంది ఇంకా మూడు రా దాంట్లో అటువంటి పరిస్థితిలో ఈయనకి అసలు ఈ బ్రహ్మ లోకం ఏమిటి ఎంత అద్భుతంగా ఉన్నది అమ్మవారు ఆ తెల్లని వస్త్రాలు ఇవ్వాళ మీకు తెలుసో తెలియదో అమ్మవారి మూలా నక్షత్రం రోజు ఇవ్వాళ ఐదవ రోజు సరస్వతీదేవి అలంకారంతో మనకి దర్శనం ఇస్తుంది మనం దాన్నుంచి ఇక్కడ భాగవతంలో ఉన్నాం కదా అయినా ఒక పాయెదు నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారు. శారద నీర దేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ కుంద మందార సుధాపయోధి శితతామర సామర వాహినీ శుభాకార తనప్పు నిన్ను మదిగా నగ ఎన్నడు తలంతు భారతీ ఈ పద్యం రాసింది పోతన గారే భాగవతంలో పద్యమే సరస్వతీదేవి గురించి రాశాడు అంతా తెలుపే శారద అంటే శరత్కాలం నాటి నీరద మేఘం తెల్ల మేఘాలు ఉంటాయి ఇందు తెల్లది అట్లాగే క్షీరసాగరం తెలుపు మల్లెలు తెలుపు దానిలో ఉన్నటువంటి సముద్రం మీద వచ్చేటువంటి నురుగు తెలుపు ఈ తెలుపు తెలుపు అంతా ఎందుకంటే దేనిని తెలియవలసి ఉన్నదో దాన్ని తెలపటానికి తెలుపు ధరించింది అమ్మవారు పైగా ఆయన కవి బ్రహ్మ లోకంలో కూర్చున్నాడు చూసి ఆనందపడిపోయి బ్రహ్మ లోకం అంటే ఇట్లా ఉంటుంది అని నేను మా లోకంలో ఒకసారి వెళ్లి చెప్పాలి అనుకున్నాడు చూశారా అది వాసన నిన్న జడభరతుడి కథ చెప్పుకున్నాం కదా ఒక లేడి పిల్లను పెంచుకోవటం ఆ లేడి పిల్లే జీవితంగా గడపటం మరణించిన తర్వాత మళ్ళీ లేడి పిల్లయీ పుట్టటం ఇదంతా అందుకనే మన ఆలోచనలలో మనం ఎప్పుడూ కూడా భగవంతుని ఆలోచనలలో గనుక మనం ఉండగలిగినట్లయితే మనం ప్రాణం వదిలిపెట్టే సమయంలో కూడా ఆ భగవన్నామము భగవద్రూపం మన యందుండి మనకి ఆ జన్మాద్యపాయం జన్మ వలన కలిగే అపాయాన్ని లేదా జన్మ అనేటువంటి అపాయాన్ని తప్పిస్తుంది గనుక అటువంటి స్థితిలోకి వెళ్లాలనుకున్నాడు ఈయన మళ్ళీ వచ్చాడు వచ్చి ఏమైంది యోగ నిష్ఠ సమాధి వల్ల అక్కడి దాకా వెళ్ళాడు పట్టరాని సౌందర్య పిపాస తగిలింది భ్రష్ట యోగిని కవి జన్మ బడసినాడా మళ్ళీ కవినై వచ్చాడు మళ్ళీ కథలు కావ్యాలు రాయటమే నా జీవితం అయిపోయింది అని ఆయన అలా అనుకోకుండా ఏదో చూసి ఆనందించి బ్రహ్మకి సరస్వతికి నమస్కరించి ఉంటే ఎంత బాగుండేది అని అనుకున్నాడు ఎక్కడ అంతా అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ ముందే అనుకోవాలి ఏ పని చేసినా ముందు అనుకొని చేయాలి చాలా తక్కువ మాట్లాడాలి సరస్వతి వాగ్ రూపం కదా చాలా తక్కువ మాట్లాడాలి చాలా నెమ్మదిగా మాట్లాడాలి మనకు అవసరం లేని విషయాలు మాట్లాడకూడదు దానిలో సరస్వతి ఉండదు రసము ఉండదు మరి ఏముంటుంది అంటే ఏమీ ఉండదు దానివలన మన ఆయువు క్షీణమైపోతుంది ఏది మాట్లాడిన ఏది ఆలోచించిన ఏ కాసేపు ముచ్చటించుకున్న పరమేశ్వరుడి యొక్క భగవత్ తత్వాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి ఆ భగవత్ తత్వం వలన మనకి లేని ఓజస్సు తేజస్సు రజస్సు మహస్సు అనేటువంటి నాలుగు ధాతువులు మనలో ప్రవేశిస్తాయి ముందు ఓజస్సు ఒక శక్తి ఒక కాంతి సమస్తమైనటువంటి ధాతు పుష్టి మనకు కలుగుతుంది రజస్సు కలుగుతుంది రజము అంటే వెన్నెల లోపల వెలుగు కలుగుతుంది తర్వాత మహస్సు కలుగుతుంది ఆ మహస్సు అంటే మనం అందుకోవలసినటువంటి తారకా మండలం ధ్రువ మండలం లాగా మహనీయమైన మహత్ తత్వమైనటువంటి భావనా భూమిక లోకి మనం వెళ్ళటానికి ఈ ఓజస్సు రజస్సు తపస్సు మహస్సు ఇవన్నీ కూడా ఏర్పడాలి అంటే మాటలు చాలా తక్కువ మాట్లాడుకోవాలి అవసరమైనవే మాట్లాడాలి మనం ఆ మీలో అనుభవం గనక ఉంటే స్వామి ఇక్కడ నలుగురు కూర్చుని ఉన్నారు స్వామి ఇక్కడ ఉన్నారు.స్వామి మాట్లాడతారు అందులో ఎవరితో మాట్లాడాలో వారికి మాత్రమే అది వినిపిస్తుంది ఆ పక్క ముగ్గురికి ఏం తెలియదు మీతో ఏం మాట్లాడారు అని తర్వాత వీళ్ళు అడుగుతారు అంత నెమ్మదిగా మాట్లాడతారు చాలా attentiveగా మాట్లాడతారు చెప్పారు వృధా ప్రసంగం గాని వృధా మాట గాని పొల్లు పోవటం గాని ఈ శరీరం లో నుంచి బయటకు రాదు ఎందుకంటే ఇది తోలునోరు కాదు కదా ఇది తోలునోరు కాదు ఇది తాలుమాటలు రావటానికి ఆ రాయలసీమ పరిభాషలో కాబట్టి తాలుమాటలు ఏమైనా పనికొస్తాయా తాలు అంటే పొట్టు పొట్టు గాలికి కొట్టుకుపోతుంది నిలకడ చెందేటువంటి ఒక ధాన్యపు రాశి వలె మానవుడు తన మనస్సుని ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి స్థితిలో గురువు యందు, గురుపాదముల యందు పరమాత్మ పాదముల యందు వాటిని లగ్నం చేసుకొని ఉండాలి ఇక్కడ ఒక చిన్న విషయం శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో హనుమంతుడు సీతాన్వేషణకు వెళ్తాడు లంకానగరానికి. ఆయన గురించి కాస్త మంచిగా చెప్పాలి అని ఈ కవి గారికి ఏదో అనిపించింది మంచిగా direct గా చెప్తే impact పెద్ద ఎక్కువ ఉండదు నిందాస్తుతి చేసినట్టుగా చెప్పాలి ముందు ఆయన ఇది కాదు అని చెప్తూ ఆయన అవును అని establish చేయాలి అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ ఆంజనేయస్వామి గురించి నేను ఏం చెప్పను అంటే తక్కువ మాటలు మాట్లాడాలి అనటానికి ఉదాహరణ. శ్రీ వాయుభవుడందునా అనిలు శసించెన్మహాయోగియై పోవో కేసరి కోటికూన అననా ముక్తేంద్రియ భ్రాతు నన్నాదేశించిన రామచంద్ర పద పద్మాధీన చేతస్కునిన్ ఆ చివరి line చాలా important ఈ ఆంజనేయస్వామిని చాలా గొప్పవాడు అందామా అంటే ఏం గొప్పవాడు ఈన ప్రభు ముద్రిక మేలి ముఖమహి జలధిలాంఘికయే అచరజనాహి ఆ రాముడు ఇచ్చినటువంటి దాన్ని రెండు పెదవుల మధ్య పెట్టుకొని గాలిని తన తండ్రి వాయుదేవుడు ఆయన్ని బంధించి లంకను చేరుకున్నాడు ఎటువంటి కొడుకు వీడు ఒక కొడుకా అన్నాడు అంటే నిందాస్తుతి చేశాడు. ఆ గాలిని బంధించటం అంటే అది యోగం ఆ యోగంలో గాలిని బంధించకపోతే హనుమంతుడి యొక్క శరీరం గాలిలో తేలి వెళ్ళదు పైగా ఆ ఇచ్చినటువంటి ఉంగరం ఎక్కడో బుడ్లోనో ఎక్కడో దోపుకుంటే అది ఎక్కడైనా పడిపోతే ఆనవాలే లేకపోతే కనుక ఆయన ఏం చేశాడు రెండు పెదవుల మధ్య పెట్టుకొని నూరు తెరవకుండా లంక చేరే దాక వెళ్ళాడు ఆయన శ్రీ వాయుభవుడందునా అనిలు శసించెన్మహాయోగియై పోనీ పోవోనా ఇదో కేసరి అనేటువంటి ఒక కోతికి పుట్టిన చిన్న పిల్ల అనుకుందామంటే ముక్తేంద్రియ భ్రాతు ఇంద్రియాలను జయించాడు ఈన జయించిన ఇంద్రియాలతో శ్రీరామ సేవ చేశాడు జయించిన ఇంద్రియాలతో అమ్మవారి దగ్గరికి వెళ్లగలిగాడు జయించిన ఇంద్రియాలతో రావణుడిని సభలో ఎదుర్కొన్నాడు ఉరికే చూసిరా అంటే ఉన్నదంతా కాల్చి రాగలిగాడు మా తమ్ముడి ప్రాణం పోతుందేమో అన్న సమయంలో ఆ మొక్క ఎక్కడుందో నాకు తెలియదు ఆ వెతికే time నాకు లేదని పర్వతాన్ని తెచ్చి అక్కడ లంకానగరంలో ప్రతిష్ఠితం చేశాడు చేస్తే అంటే ఏమిటి శ్రీరామ సేవలో స్వామి సేవలో మనం గనక నిమగ్నమై ఉన్నట్లయితే మన చేత స్వామి చేయిస్తారు ఆ పని అందులో మనం చేసేది ఉండదు అందుకనే మూడు పాదాలు చెప్పి శ్రీ రామచంద్ర పద పద్మాధీన చేతస్కునిన్ అంటాడు ఆ మూడింటితో నాకేం పని నా వలె నా మనస్సు వలె ఆంజనేయుడి మనస్సు కూడా శ్రీరాముడి యొక్క పాదపద్మముల యందు లగ్నమై ఉన్నది గనుక అటువంటి ఆంజనేయుడికి నేను నమస్కరిస్తున్నాను అని కాబట్టి ఇక్కడ కావలసింది ఏంటంటే ఈ కంసుడు కృష్ణుడు దేవుడే లేదు మానవాతీతమైన ఒక బాలుడే చాలా అసాధారణమైన బాలుడే అటు వ్రజభూమిలో గాని ఇటు బృందావనంలో కానీ ఆ చంపబడిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు రాక్షసులు తాను పంపిన రాక్షసులు వాళ్ళు పోయినారు వాళ్ళంతట వాళ్ళు వచ్చిన వాళ్ళు పోయినారు కాళింది మడుగులో ఉన్నటువంటి కాలిపోయింది కాలము పోయింది వీటన్నింటినీ ఇతను ఎలా చేయగలిగాడు అన్నప్పుడు కొద్దిగా స్పృహ గనక ఉన్నట్లయితే జాగ్రత్త పడేవాడు ఎదుటి బలాన్ని మనం గమనించాలి ఎదుటి వాడి యొక్క శక్తిని మనం గమనించాలి జీవితాన్ని మనం ఎదుర్కోవటానికి కేవలము ఎదురుగా గోడ చూసుకుని వెళ్తానంటే వెళ్ళటానికి, తలుపు తీసుకుని మనం బయటకు వెళ్ళాలి కంసుడిలో ఆ వివేకం లేకపోయింది కారణం అధికార మదం వలన ఆభిజాత్యం వలన జన్మ సంస్కారం వలన తాను పట్-- తాను చేసినటువంటి చెడ్డ పనుల వలన అతని మనస్సు పనిచేయటం మానేసింది కనుక కంసవధ అలా జరిగిపోయింది కాబట్టి మనం కూడా జీవితంలో కొన్ని resolutions ఇందాక అనుకున్నామే ఎలా ఉండాలి మనం ఏం చేస్తే మనకు నిజంగా ఆనందం కలుగుతుంది ఏం చేస్తే మన వలన ఇతరులకు ఆనందం కలుగుతుంది ఆ ఇతరులు అనే వాళ్ళు ఎవరు మన బంధువులా స్నేహితులా ఎవరు అంటే మొన్న హైదరాబాదులో కాంచీ స్వామి వారు ఒక మాట చెప్పారు ఆప్తులు అంటే ఎవరు అంటే సత్యాన్వేషణ ఎవరు చేస్తారో అన్వేషణలో సత్యాన్ని ఎవరు గ్రహిస్తారో గ్రహించిన సత్యం ద్వారా జీవితాన్ని సాగిస్తారో వారే నిజమైనటువంటి ఆప్తులు మనకి మరి ఇక్కడ నా వరకు నాకు.స్వామికి అన్వేషణ లేదు స్వామే సత్య స్వరూపం మరి వారి జీవితాన్ని గనక దగ్గరగా గమనించినట్లయితే ఈ మహాభాగవతం కంటే కూడా కొన్ని వేల లక్షల పేపర్లు రాయొచ్చు దాని గురించి మరి ఆయన సత్య జీవితమే గడిపారు. ఏది సత్యమో దాన్ని ప్రపంచంలో ఆయన demonstrate చేశారు మిగతా బిల్డింగులు కట్టారు water project అదంతా చేశారు అది వేరే దాని వ్యవహారమే వేరు అసలు ఆయన ఆధ్యాత్మిక ఏం చేశారని గనక విచారణ చేసినట్లయితే మానవుడు మానవుడిగా జీవిస్తూ తనలో ఉన్నటువంటి మాధవుడిని కనుక్కుంటూ తాను కూడా మాధవుడి స్వరూపాన్ని అని అర్థం చేసుకుంటూ తన తోటి వారందరికీ సేవ చేస్తూ వారందరినీ కూడా ప్రేమిస్తూ ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా కులము, మతము, జాతి, వర్గము, వర్ణము ఇవేవీ లేకుండా అందరూ ఒకటే అనేటువంటి ఒక భావనతో జీవించగలిగితే చాలు అని ప్రపంచానికి చెప్పడానికి వచ్చారు స్వామి. ఆయన కేవలం చెప్పారా అంటే కేవలం చెప్పలా దాన్ని ఆచరణాత్మకం అంటే అనుష్ఠాన వేదాంత భూమికగా దాన్ని ఆయన మార్చారు అనుష్ఠానం చేశారు He practiced first then he preached. మనం అలా చేయం మాట్లాడుతాం బోలెడు ఎన్నో విషయాలు మాట్లాడుతాం కానీ మన వరకు వచ్చినప్పుడు జీవితంలో మనం ఆచరించం చాలా వెనక్కి వెళ్ళిపోతాం అది మాయావరణం. ఈ యోగ మాయతో గనక మనం ఈ లోక మాయని దగ్గరకు తీసుకు వెళ్లినట్లయితే స్వామి అన్నారు మీరందరూ కూడా అమృతస్య పుత్రాహ అమృత లోకం అంటే గోలోకం నుంచే ఇక్కడికి వచ్చారు గోలోకం నుంచి ఎక్కడికి దిగారు అంటే మా లోకంలో దిగారు మా లోకం అంటే లోకము కాని లోకము మా లోకం గోలోకం ఒక మా అంటే కాదు అని అర్థం సంస్కృతంలో కాబట్టి గోలోకం నుంచి ఇది ఎట్లా ఉంటుందో ఈ భూమి ఈ విశేషమైనటువంటి ప్రకృతి అని మీరు ఇక్కడికి వచ్చారు ఇది మా లోకము గోలోకము మా లోకము ఆ భూలోకము పోగా మీరు ఎక్కడ నిలకడ చెందారు అంటే మా లోకంలో నిలబడ్డారు మా లోకం అని అంటాం అయోమయాన్ని ఆ మనం ఏమి తోచని స్థితిని దీనిని ఆలోచించలేని స్థితిని అవిద్యని, అస్పష్టతని వీటన్నింటినీ కూడా మా లోకం అంటారు గోలోకం పోయింది, భూలోకం పోయింది మిగిలింది ఏమిటి ఆ మా లోకం అంటే కంసుడి జీవితం అంతా కూడా గోలోకం ఎక్కడుందో వాడికి తెలియదు. భూలోకము తద్వారా తాను పొందిన మా లోకము. ఈ మాయని చేధించడానికి వచ్చినటువంటి వాడే కృష్ణుడు. అందుకనే ప్రతిచోటా మీరు చూడండి భాగవతం నిండా ఎక్కడెక్కడ మాయా పొరకమ్మి ఉన్నదో ఎవరి యందు ఆ పొర తీవ్రంగా ఉన్నదో ఎవరు ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూడలేకపోతున్నారో ఎవరు అతి వాస్తవిక దృష్టితో తమ జీవితాలను తాము నడుపుకోలేక పోతున్నారో వాళ్ళ మాయని చేధించాడు. అక్రూరుడు వంటి వాళ్ళకి అభయవరదానం చేశాడు. భీష్ముడి వంటి వాడికి మంచి మాటలు చెప్పాడు తర్వాత వస్తాయి అవన్నీ, వచ్చినాయి కానీ విన్నది ఎవరు? భీష్ముడికి విశ్వరూపం చూపించాడు భీష్ముడితో కాసేపు ఇటువంటి అధ్యాత్మ మాటలు మాట్లాడాడు కానీ ఆయనకి కురువంశం మీద ఉన్న వ్యామోహం వలన ఆయన కూడా పడి చెవిని పెట్టడు. చివరికి మనం అనుకున్నాం కదా ఆయనకెక్కడ విష్ణు సహస్ర నామం ఎక్కడ చదివాడు రణరంగంలో చదివాడు అంపశయ్య మీద పడుకొని అప్పుడు విష్ణు సహస్ర నామం చదివాడు. మనం ఇక్కడ ఉండా మనకు అంపశయ్యలు వద్దు మనం చేయవలసింది షిరిడి సాయి కూడా ఒక మాట చెప్పారు సాయంకాలం పూట విష్ణు సహస్రనామం చదవండి పగలు జ్ఞానేశ్వరి చదవండి జ్ఞానేశ్వరి అంటే భ-భగవద్గీత భగవద్గీత చదవండి విష్ణు సహస్రనామం చదువుకోండి మీ మనసుకి కావలసినంత ఆహారం దొరుకుతుందన్నారు. మనసుకు కావలసిన ఆహారం ఏమిటంటే మంచి ఆలోచనలే మనసుకు మనం ఇచ్చే ఆహారం అవి ఈ లోకంలో గాని లోక వృత్తులలో గాని మన ప్రవృత్తిలో గాని మనకుండే మానవ సంబంధాలలో కానీ సమాజ పరమైనటువంటి సంబంధాలలో గాని ఇవి మనకేం దొరకవు అక్కడ ఏం దొరుకుతాయంటే కేవలం లోకమే దొరుకుతుంది లోకంలో ఉంటూ లోకాతీతంగా ఉండాలి మరి ఇదే ప్రపంచంలో మనమంతా ఈ ప్రపంచం చెడ్డది అందాం ఇంత చెడ్డ ప్రపంచంలోకే రాముడు వచ్చాడు ఇంత చెడ్డ ప్రపంచంలోకే కృష్ణుడు వచ్చాడు ఇంత చెడ్డ ప్రపంచంలోకే సత్య సాయి కూడా వచ్చాడు మరి ఎందుకు వచ్చారు మరి వాళ్ళు ఉండగా ఇవన్నీ ఎందుకు జరిగినాయి అన్నదానికి ప్రశ్న ఏంటంటే అసలు వాళ్ళు వచ్చింది వాళ్ళ కోసమే సంహరించడం కోసం కొంత సంస్కరించడం కోసం కొంత సమన్వయం చేయడానికి కొంత వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు అలా ఈ మూడింటిని పోగొట్టుకున్నటువంటి దురదృష్టవంతులు ఎవరంటే కంసుడు గనుక తన మేనల్లుడి చేతిలో ఎనిమిదేళ్ళ నిండని బిడ్డ చేతిలో తన ప్రాణాన్ని తన మానాన్ని ఆ మొత్తము పోగొట్టుకున్నాడు అవకాశం వచ్చినా తనను తాను సంస్కరించుకోవడానికి అవకాశం వచ్చినా అది జరగలేదు కాబట్టి కంసవధ వెనుక ఇంతటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనా స్థితి ఉన్నది. ఇక శ్రీకృష్ణ పరమాత్మ అష్ట భార్యలతో ఈ ఎనిమిదేళ్ళ వాడికి అష్ట భార్యలు ఇంకా రాలా ఇంకా పని ఉంది ఈ అష్ట భార్యలతో ఒక ఒక పురుషుడు ఎలా ఉన్నాడు అని ప్రశ్నలున్నాయి లోకంలో. ఈ అష్ట భార్యలు అంటే అనిమాది సిద్ధులే ఆయనకు భార్యలుగా ఉన్నాయి భార్యలుగా అంటే ఆయనతో కూడి ఉన్నాయి. సాహాత్మకంగా ఉన్నాయి సహజంగా ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తికి అవి దోహదం చేస్తూ వచ్చినాయి తర్వాత కాలంలో అలాగే పదహారు వేల మంది గోపికలు ఏమిటి గోపికలంతా స్త్రీలా అంటే వాళ్ళంతా మునులు ఒక పరివారాన్ని తీసుకొని వచ్చాడు కృష్ణ పరమాత్మ తాను ఒక్కడిగా వచ్చిన తన వెంట వీరందరినీ తీసుకొని వచ్చాడు ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఒక మధురమైనటువంటి ఒక భక్తిని ఈ ప్రపంచంలో ఇదొకటి ఉన్నదని.మూఢభక్తి మాత్రమే కాదని, వైయక్తికమైన అంటే personalized devotion కాదని, ఇది సామూహికంగా సమస్తంగా సమష్టిగా చేసుకోవాలని, నేను ఎప్పుడు వేణువు ఊదినా, ఎప్పుడు పిల్లను రోగి నడిపించినా మీరందరూ రండి అని అన్నప్పుడు, ఆయన ఆ శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిహి. అంటే అక్కడ శిశువు అంటే పసిపిల్లవాడు కాదు. పసిపిల్లవాడు ఆ నాదానికి ఆకర్షితుడు అవుతాడు. ఇక్కడ శిశువు అంటే కుమారస్వామి. పశుర్వేత్తి, ఈశ్వరుడి యొక్క వాహనమైనటువంటి నంది. ఫణి అంటే ఆదిశేషు. ఈ ముగ్గురికి సంగీత రహస్యం తెలుసు. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి తెలుసు. ఏమి తెలుసు? జ్ఞానం. ఎవరికి? ఫణి. ఆదిశేషువుకి తెలుసు. ఈ ఆదిశేషువు యొక్క తత్త్వమే అనేకమైనటువంటి రూపాలలో మనకు భాగవతం నిండా పరిచరిస్తూ వచ్చింది. ఎవరిని? కృష్ణ పరమాత్మని. ఆయన ఛాయవలె ఒక నీడవలె, ఆయన object అయితే ఆయనది ఒక నీడ. ఆ నీడ కాలమే ఆయన్ని నడిపించింది. ఎక్కడా ఇది నేను చేస్తున్నాననలేదు, చేశానని అనలేదు. కానీ పరమాత్మ తన కార్యక్రమాన్ని ఆయనను అనేక విధాలు నిందించినా, అవమానపరిచినా, అవరోధించినా, అడ్డుకున్నా, ఏం చేసినా తాను ఏం చేయాలి అని నిర్ణయించుకుని వచ్చాడో ఆ గమ్యం వైపు ఈ ప్రపంచాన్ని ద్వాపర యుగంలో పరమాద్భుతంగా నడిపించాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. కాబట్టి భాగవత కథ ఈ మధ్యలో గోపగోపికలతో ఆయన ఏమున్నది అంటే ఆ పదహారువేల చిత్కళలు అని ఉన్నాయి. ఆ చిత్కళలే ఆయన చుట్టూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మునులై, తపస్సులై, ఋషులై శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాలోక్య, సామీప్య, సాన్నిధ్యాలు వదులుకోలేక మళ్ళీ ఇట్లా జన్మ ఎత్తి వచ్చినాయి. పదహారు వేలు అంటే పదహారు వేలుగా ఉన్నాయి. ఎనిమిది అంటే ఎనిమిది ఆ అద్భుతమైనటువంటి శక్తులు. అనిమాది సిద్ధులు. ఆ సిద్ధులని ఆయా ప్రదేశాలలో శ్రీకృష్ణ పరమాత్మ బాల్యం నుంచి ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగాన్ని ఎందుకు చేశాడంటే ధర్మసంస్థాపన కొర్-కోసం చేశాడు. ఆయన చెప్పుకున్నది కూడా అదే. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ యుగం ప్రతి క్షణంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ రానే వచ్చాడు. ఈ మధ్యలో రాధా కథ ఉన్నది. నిన్న ఊరికే intro లో ఒక మాట చెప్పి దాన్ని వదిలేసాం. ఈ రాధాకృష్ణుల యొక్క సమాగమం ఏదైతే ఉన్నదో మనం వాటికి కూడా స్త్రీ పురుష రూపాలు పెట్టి రాధా అంటే స్త్రీ అని కృష్ణుడు అంటే మన కృష్ణుడు అని వాళ్ళిద్దరికీ అన్యోన్యమైనటువంటి ఒక బాంధవ్యం ఉన్నదని కథలు చెప్పుకుంటూ వచ్చాం. కానీ నిజానికి సత్యం ఏమిటంటే రాధా శబ్ద బ్రహ్మం, కృష్ణ పరమాత్మ నిశ్శబ్ద బ్రహ్మం. ఈ నిశ్శబ్దంగా ఉంటే ఆయన పనులు సాగువు. ఆయన కూడా ఆడాలి, పాడాలి, కూడాలి, వీడాలి అన్నీ చేయాలి. మరి అన్నీ చేయాలంటే మరి ఎనిమిది మంది అష్టమహిషులు ఉన్నారు కదా! మళ్ళీ ఈ రాధ ఎందుకంటే ఇది అలౌకికమైన యోగాత్మకమైనటువంటి ఒక శబ్ద ధార. ఆ శబ్ద ధారని మనం తిప్పి గనక చదివితే అది రాధ అవుతుంది. ఆ రాధ దేనితో కూడి ఉన్నది? లోక మాయతో ఉన్న ఈ కృష్ణుడితో అది కూడి లేదు. యోగ మాయతో మొట్టమొదట వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపానికి, గుణానికి, స్వభావానికి అతి చేరువుగా అతి సన్నిహితంగా ఉండి కృష్ణ పరమాత్మతో ఆ అర్ధ శరీరం కాదు పూర్ణ శరీరమై నిలకడ చెందింది. కనుకనే రాధాకృష్ణులు అనబడేటువంటి ఒక మాట ఈ లోకంలోకి వచ్చింది. కాబట్టి శబ్ద బ్రహ్మం కావాలి. ఈ శబ్ద బ్రహ్మం అంటే ఏమిటప్పుడు మనం ఉన్నాం. నాలుగున్నర వరకు మనం ఎవరితో మాట్లాడకోలే. కాసేపైన తర్వాత మనం మాట్లాడుకోము లేదా మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? భగవత్ చింతనే చేస్తాం. భగవంతుడి గురించే మాట్లాడుకుంటాం. అది మనకు ఆనందం కలిగిస్తుంది గనుక అవన్నీ మాట్లాడుతాం. కానీ అసత్యం మాట్లాడకూడదు. తెలిసినదంతా కూడా ఏది అనుభవంలో ఉన్నదో దానిని మాత్రమే మనం అనుభవించాలి గనుక శ్రీకృష్ణ పరమాత్మ కంసవధ అయిపోయిన తర్వాత ఆయనకి ఆయన మిగతా గోపగోపికలతో బృందావనంలో వేణుగానంలో అనేకమైన విషయాలతో ఆయన సమయమంతా గడిచిపోయింది. ఇంతలోకే రానే వచ్చింది ద్రౌపది స్వయంవరం. ఆ ద్రౌపది స్వయంవరానికి మొట్టమొదటిసారిగా మనకు భారతంలో అప్పటిదాకా కృష్ణుడు కనపడడు. కృష్ణుడు కలుస్తాడు అక్కడికి వచ్చి. ఎందుకు వస్తాడు అంటే అక్కడ గనక ద్రౌపదిని అర్జునుడు గనక స్వయంవరంలో గెలుచుకోకపోతే ఆ ద్రౌపది దుర్యోధనుడి వశమైపోతుంది. కాబట్టి దాన్ని తప్పించాలి. తప్పించాలి అంటే తాను ఉండాలి. తాను ఉండాలి అంటే తాను పాండవ పక్షంలో ఉండాలి. మత్స్య యంత్రంలో కన్ను చెదిరేట్టుగా, గురి తప్పేట్టుగా కృష్ణ పరమాత్మ మాయోపాయం చేత ధర్మాన్ని రక్షించాడు. అప్పుడు అందరూ కూడా ఎప్పుడైతే అర్జునుడికి ద్రౌపది దక్కిందో, ఎప్పుడైతే ఆ అగ్ని శక్తిని ఐదుగురు పంచుకోవాలి అక్కడ భార్యను పంచుకోవటం కాదు. పెడర్థం మనం మాట్లాడుకోకూడదు. అగ్ని పునీతమైనటువంటి ద్రౌపది దేవి యొక్క శక్తి త్రేతాగ్నిగా వచ్చినటువంటి ఆ శక్తి, యోగాగ్నిగా వచ్చినటువంటి ఆ శక్తి ఎక్కడా పాండవులతో ఆమెకు వియోగం లేదు, సంయోగం తప్ప. ఎవరు మళ్ళీ పాండవులు అంటే అనేకమైనటువంటి దేవతా స్వరూపాల యొక్క అంశాలుగా ధర్మ సంస్థాపన కోసమే పాండవులు వచ్చారు. వాళ్ళకి శక్తిని ఇవ్వటానికి, రాముడికి శక్తిని ఇవ్వటానికి సీత ఎలా వచ్చిందో అర్జునుడికి, ధర్మరాజుకి, భీముడికి, నకుల సహదేవులకి ఆ శక్తిని ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ ద్రౌపది పేరు కూడా మనకు మరి తెలుసు కృష్ణ.కాబట్టి ఇదంతా కృష్ణాతమకమైన కృష్ణమయమైనటువంటిది గనుక ఆనాడు ఆ సమయంలో ఆ సందర్భంలో ఇన్ని వందల కథలలో కథానాయకుడు ఒక్క కృష్ణుడు ఏ కనుక ఇదంతా ఆయన్ని భగవాన్ అని తర్వాత అన్నారు. ఆ భగవంతుడి కథే భాగవతం అయింది. ఇప్పటిదాకా చెప్పుకున్న చాలామందిని ఆయన చంపాడు. ప్రతి వాడు ఒక శాపవిముక్తి పొందారు. ప్రతి వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్లారు. అంటే శాప విముక్తి చేయటానికి వాళ్ళని చంపాడు. శాపం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చెడ్డ పని ఇంతకుముందు చేసి ఉంటారు. ఎవరికో కోపాన్ని తెప్పించి ఉంటారు. ఎవరో మునుడు మన జయవిజయులు లాగా. ఎప్పుడైతే అలా చేసారో వాళ్ళని తప్పించడం కోసం, రక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి సందర్భాలు, అనేక ప్రదేశాలు, అనేక సన్నివేశాలలో శ్రీకృష్ణుడు వీళ్లందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు. అంతే కాదు మహాభారత సంగ్రామం అయ్యేదాకా, వాళ్ళు రాజ్యంలో సింహాసనం ఎక్కే దాకా, వాళ్ళు కుదుట పడే దాకా తాను ధర్మమూర్తియై పక్కన నిలబడ్డాడు. అంటే మనం కూడా ఆ పంచ పాండవులు ఎవరంటే మనలో ఉన్నటువంటి ఐదు మంచి గుణాలు. కౌరవులు ఎవరంటే మనలోనే ఉన్నటువంటి నూరు చెడ్డ గుణాలు. నూరు ఇటు, ఐదు ఇటు. కదా. మరి కృష్ణుడు ఎక్కడున్నాడు? అంగుష్టమాత్ర పురుషోత్తముడుగా కుడిచేతి బొటనవేలు పై కనుపు ఎంత ఉందో అంత వొమ్మగా, అంత శక్తివంతంగా మన యందు మధ్యలో ఉన్నాడు ఆయన. కురుక్షేత్రం అంటే ఉరికే కథలో ఉన్నట్లు కాదు. చెడు ఒకవైపు మంచి ఒకవైపు ఉంటే చెడుని పూర్తిగా నశింపజేసి మంచి వైపు నడిపించినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడంటే, "అయమాత్మా గుడాకేశ" నేనే ఆత్మని, నీ యందే ఉన్నాను. భగవద్గీత మొత్తం ఇదే. ఎక్కడికక్కడ ఆయన నేను నేను నేను అని చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ నేను మనం కూడా నేను అనగానే మన visiting card, మన position, మనకున్నటువంటి చెప్పడం ఇది కాదు. ఆ నేను అంటే మనమంతా ఆత్మ స్వరూపులు గా మనం భావన చేసుకోవాలని ఈ భగవద్గీత ఇంకా గోపిక గీతాలు, బ్రహ్మర గీతాలు అవన్నీ మనకి సాహిత్య పరంగా పనికొస్తాయి కానీ అధ్యాత్మ పరంగా ఈ మహాయజ్ఞ ప్రవాహంలో అవి ఇమడవు కాబట్టి వాటిని గురించి మనం ప్రస్తావనే తెచ్చుకోవద్దు. ఆ సమయాన్ని మనం ఏకాదశ ద్వాదశ స్కంధాలకు వినియోగిస్తే మనందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనం భాగవతాన్ని చెప్పుకోవలసిన పద్ధతి అదే. రుక్మిణీ కల్యాణం తో భాగవతం అయిపోలా. ఉత్తర భాగంలోకి వచ్చేప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక మానవుడిగా ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు ఆయన, కుచేలుడితో ఎలా ఉన్నాడు మనకు ఆ కథలన్నీ ఉన్నాయి. అవి కూడా మనం వెళ్లే లోగా ఐదో తారీఖు లోగా ఇవన్నీ చక్కగా చెప్పుకుందాం. అలాగే సత్యసాయి భగవానుని యొక్క అనుగ్రహం చేత మనకు కలిగినటువంటి ఈ స్కంధాలన్నీ కూడా నెమ్మదిగా ఆత్మ విచారణ అంతా కూడా అయిపోయింది నిజానికి. మనసు, చిత్తము, హృదయము అన్నీ కూడా మాట్లాడుకున్నాం. అది ఎక్కడ ఉంది, అది ఏం చేస్తుంది అని. ఈ కథా కథనంలో నుంచి మనం నేర్వవలసింది లోకమాయకు లోబడకండి. మాయకు లోబడ్డామా మనం మన దారి తప్పుతాం. అది మాయ అని తెలిసినప్పుడు, ఆకర్షణ అని తెలిసినప్పుడు, అది మనల్ని ముంచబోతున్నది అని తెలిసినప్పుడు ఇంకా మనకి ఇది చాలు అనుకోవాలి. "పరితృప్తం జెందితి" ఇక్కడికి నాకు చాలు అనుకున్నామా ప్రాణం సుఖంగా ఉంటుంది, జీవితం కూడా హాయిగా నడుస్తుంది. కాదు ఇంకా సంపాదించాలి, ఇంకా పేరు రావాలి, నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి, నా పేరు సువర్ణాక్షరాలతో లిఖితం కావాలి, అసలు నన్ను మించిన వాడు ఉండకూడదు. ఆ ఇవన్నీ కూడా మనం వదులుచుకోవటానికి భాగవతాన్ని గనక చదివితే అక్రూర భక్తి మనకు ఉండాలి. అక్రూరుడు ఏమీ కోరుకోలా, ఏమీ ఒక్కటి కూడా కోరుకోలా. రథం మీద ప్రయాణం చేశాడు. ఈ బాలురు ఇద్దరు ఎవరో ఆయనకు తెలుసు. కానీ ఆయన దురదృష్టం చూడండి ఎవరి దగ్గర సేవకుడుగా ఉండవలసి వచ్చింది, ఎవరి ఆస్థానంలో ఉండవలసి వచ్చింది కంసుడి దగ్గర. మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా చెడ్డ ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది. ఎందుకు అంటే సాధనకి అది బలమైంది. జీవితంలో మామూలుగా చమత్కారంగా చెప్తున్నాను. ఒక చాలా సహృదయుడు. కేవలం నెమ్మదితనం, సరళమైన స్వభావం ఉంటుంది. అటువంటి పురుషుడికి గయ్యాళి భార్యను కడతాడు. పరమ సాధ్వివై ఉంటుంది స్త్రీమూర్తి. ఆమె ఎవరికీ అపకారం చేయకపోగా వీలైనప్పుడల్లా ఉపకారం చేద్దామని నిర్ణయించుకుని చేస్తూ ఉంటుంది. దానిని అడ్డుకోవటానికి ఒక భర్తని ఇస్తాడు. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక వైపరీత్యం. ఇది మాయా ప్రభావం చేత ఇది జరుగుతుంది. కనుక వీటిని మనం గ్రహించినప్పుడు ఇక్కడ చెడ్డ భార్యలు, చెడ్డ భర్తలు అని ఇద్దరు లేరు. ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళే. కాలం చూపిస్తుంది తప్ప చెడ్డవారు అంటూ ఈ ప్రపంచంలో లేరు, ఉండరు, ఉండకూడదు. మరి అందరూ మంచివారే ఎట్లా అవుతారు అంటే ఆ అందరిలోనూ ఇటువంటి ఈ ఈ భావాలు గనక మనం నిరంతరము చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఓ వెయ్యి మంది, ఓ వంద మంది వింటే అందులో ఒకరిద్దరైనా దాన్ని పట్టుకుని తమ జీవితాన్ని redefine చేసుకోగలుగుతారు. అటువంటి ఒక అద్భుతమైన స్థితిలోకి సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మనందరినీ చక్కగా నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ, ఇవాళ మనకి ఇంకా చాలా ఎక్కువ కార్యక్రమం కూడా ఉంది. దానిలో మనం పాల్గొనాలి. ఎందుకంటే అరుణ హోమము, అరుణ సూక్తము, తర్వాత సుదర్శన హోమము, తర్వాత సూర్య నమస్కారాలు. పొద్దున్న మీరు చూశారు. ఎంత perfect గా చేశారో చెప్పలేను. అంత బాగా చేశారు. ప్రతి దానిని, ప్రతి ఆవృత్తాన్ని ఎక్కడా వాళ్ళు compromise కాలా. వాళ్లకున్న time లో వాళ్లకున్న పరిధిలో చాలా అందంగా చేసుకుంటూ వెళ్లారు. ఇది అయిన తర్వాత మనకి దీపోజ్జ్వలన కార్యక్రమం ఉంది. అది చాలా అపురూపమైనటువంటి సందర్భం మనందరికీ.బయట వెలిగిస్తున్నాము అంటే ఆ అంతర్జ్యోతిని దానిని ఆధారం చేసుకొని మన హృదయంలో అటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి. నిన్న శంఖము చక్రము నామము అవి చేస్తున్నప్పుడు మనం సాక్షాత్తు తిరుమలలో ఉన్నామా అనిపించింది. ఆ పైన స్వామి యొక్క విగ్రహం కానివ్వండి అమ్మవారి విగ్రహం కానివ్వండి వీటిని చూస్తుంటే మనకి ఈ ప్రకృతి అంతా కూడా పరమేశ్వరుడితో నిండిపోయింది. మనం ఒక పద్యం చెప్పుకున్నాం "ఉదయ గ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహం మువార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది తారా నివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యతమై శీతగభస్తిబింబ శివలింగం ఒప్పె ప్రాచీదిశన్" ప్రకృతిని మించినటువంటి పరమాత్మ లేడు స్వామి చెప్పేవారు. మీరు environmental studies environmental protection ఇవేళ మాట్లాడుతున్నారు. ఈ పర్యావరణ రక్షణ ఎవరు చేశారంటే ఇప్పుడు ఈ నయీం సారణ్యం ఉంది దీనిలో మనం పీల్చే గాలిలో కాలుష్యం లేదు. ఎక్కడైనా బయట కాలుష్యం ఏదైనా ఉంటే గాలి కొట్టుకుపోతుంది. మనకి మనస్సుకి శరీరానికి ఒక శాంతిని హాయిని ప్రసన్నతని ఇచ్చేటువంటి ఇటువంటి అరణ్యాలన్నీ కూడా మనం పాడుచేసుకుని నగర నిర్మాణం చేసుకుంటూ ఇటుకల మధ్యలో బతుకులు ఈడుస్తూ మనం ఈ ప్రకృతి నుంచి దూరం అయిపోయాం. ఇకపై అలా కాకుండా ఉండాలి. కాకుండా ఉండాలంటే మనం ఆ ప్రకృతికి ఏం చేయాలి? ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళమే చేయగలిగిన చోట చేయవలసినంత చేస్తూ గనుక వెళ్ళినట్లయితే మళ్ళీ ఇవేళ అక్కడ ఆ దీపోత్సవానికి మనం వెళితే ఆ అక్కడ మనం ఇవేళ ఏం చేస్తున్నాం అంటే పరమేశ్వరుడిని సూర్యనారాయణ మూర్తిని సూర్యనారాయణ మూర్తికి మూలమైనటువంటి మహా శక్తిని జ్యోతి స్వరూపంగా మనం ఆరాధన చేసుకోబోతున్నాం. దీపం వెలిగించటం అందం కోసం కాదు. ఈ వెలుగు నా లోపల కూడా ప్రవేశించు గాక. ప్రవేశించినటువంటి ఆ జ్యోతి ఆధ్యాత్మిక జ్యోతి మళ్ళీ నా నుంచి ఈ ప్రపంచంలోకి ఆ చెందు గాక అని మనం అక్కడ ప్రమాణం చేస్తూ ఆ దీపం వెలిగించాలి. అటువంటి శుభస్కరమైనటువంటి శోభాయమానమైనటువంటి ఒక కాలాన్ని ఒక సన్నివేశాన్ని ఒక సందర్భాన్ని మనకు సృష్టించిన స్వామికి దానికి సత్సంకల్పం చేసినటువంటి డాక్టర్ గారికి ఆయన భార్యకి మనమందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని. ఎందుకంటే ఇలా కూడా జీవితాన్ని గడపచ్చు. ఇలా కూడా మనకున్న సంపదని కొంత ఇలా ఖర్చు పెట్టచ్చు. ఇలా కూడా నాలుగు చోట్ల జరిగితే నాలుగు నాలుగు చోట్ల వాళ్ళే అని కాదు. నాలుగు చోట్ల నలుగురు చేస్తూ గనుక వెళితే ఈ భారతదేశం మళ్ళీ తన పురా వైభవాన్ని తాను పొందగలదు అని నాకొక గడాఢమైనటువంటి నమ్మకం కలిగింది. సాయంకాలం కల్లా ఈ సప్తమి కాగానే కృష్ణుడు పుడతాడు. అప్పుడు ఇవాళ వస్తే ఆ పిల్లలు బీద పిల్లలుగా నాకు కనిపించలే. వాళ్ళ అల్లరి మనం చెప్పుకున్న అల్లరే వాళ్ళు చేశారు. వాళ్ళకి ఏం కావాలో తీసుకున్నారు. మరి ఈ planning ఇదంతా ఎలా జరిగింది అంటే మనలో మాతృ హృదయం ఉంటే ఆధ్యాత్మిక హృదయం ఉంటే మనకున్న దాన్ని పంచి పెట్టడంలో ఆనందము అది గోరంథలు కొండంతలుగా పెరిగిపోతుంది. మనది మనమే దాచుకుందాం మన FDలు మన flatలు మన buildingలు మన వడ్డీలు జీవితం కాదు. కొంత కొంతన్నా మనం దానం చేయాలి. కొంతన్నా పక్కవాడి కన్నీరు తుడవటానికి మన సంపదని వాడాలి. ఇక జ్ఞాన సంపద అంటారా? దాన్ని ప్రపంచానికి ఇస్తూనే ఉండాలి. నీకు శక్తి ఉన్నంత కాలం "నీ నూరు నొవ్వంగా హరికీర్తి నుడువడేని" ఆ ఇక చేయలేనేమో ఇంకా నా వల్ల కాదేమో అనే దాకా చేయాలి. ఆ నా వల్ల కాదేమో అనంగానే ఆయనొచ్చి మనకి ఎలా కావాలో అలా చేస్తారు. ఏం చేయాలో చేస్తారు. మన జీవితాలన్నీ కూడా భగవత్ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాయి. భగవంతుడి మీద నమ్మకంతో మనం జీవించాలి. ప్రాచీనమైనటువంటి ఒక భారతీయమైనటువంటి ఆత్మని భారతీయమైనటువంటి ఒక శాస్త్ర విధానాన్ని మన జీవితాల్లో గనుక మనం నెమ్మదిగా ప్రవేశపెట్టుకోగలిగితే మన తర్వాత తరమన్నా దానిని చూసి నేర్చుకుని వాళ్ళు ఈ పర్యావరణాన్ని ఈ జగత్తుని ఈ భూమిని భారతాన్ని ఈ దేశాన్ని వాళ్ళు రక్షించగలరు అంతే. ఎందుకంటే రాజకీయము తెలిసినటువంటి వాళ్ళు రాజ్యాంగ బద్ధ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు, చేయాలి. మరి సాంస్కృతిక నాయకత్వం కావాలి మనకి. ఈ సంస్క-- ఇదంతా సాంస్కృతిక నాయకత్వం. మరచిపోతున్న విలువలన్నింటినీ ఓసారి గుర్తు చేసుకోవటానికి. [కాష్] అంతేగాని త్రేతాయుగంలో ఉన్నట్టే ఈ యుగంలో ఉండి అంటే అది పొంతన కుదరదు. అది ఆ కాలాంది. ద్వాపర యుగంలో దాని విలువలు దానివి. కలియుగంలో మనం ఏం చేయగలం? కలియుగంలో నామస్మరణ వలనే మనకి ఆ ముక్తి. ముక్తి అంటే మళ్ళీ వైకుంఠం కైలాసం కాదు. ప్రాపంచికమైనటువంటి భావనల నుంచి మనం బయటపడాలంటే ఏమీ చేయలేకపోయినా శ్రీరామ నామం జపం చేస్తే ఓ గురు నామం జపం చేస్తే లేదు మనం అనుకుంటూ ఉంటే దానికి పెద్ద పేర్లు పెట్టకుండా అది చాలు. అటువంటి ఒక అత్యద్భుత నేపథ్యంలో మనం భాగవతాన్ని చెప్పుకోవటం నేను కూడా పరమా ఆనంద సంధాయకమైనటువంటి హృదయంతో చాలా focusedగా పరమేశ్వరుడిని నేను అనుభవిస్తూ మీ అందరితో కలిసి నాలుగు మాటలు చెప్పుకునేటువంటి ఈ యోగాన్ని కల్పించినటువంటి స్వామికి మరొక్కసారి నమస్కరిస్తూ మీ అందరి జీవితాలు ఇలాగే వెలుగుమయం కావాలని జ్ఞానమయం కావాలని ప్రపంచం విసిరేటువంటి చిన్నచిన్న సవాళ్ళన్నీ నెమ్మదిగా దూది పింజలై పక్కకి తొలగిపోవాలని మీ అధ్యాత్మ మార్గం సుగమం కావాలని గమ్యాన్ని చక్కగా జీవించి ఉండగానే సాధించుకోవాలని దానికి మళ్ళీ స్వామి అనుగ్రహం కావాలని స్వామిని మనసా వచసా శిరసా ప్రార్థన చేస్తూ మీ అందరికీ