Skip to content
Transcript తెలుగు
ఉపనిషత్తులలో నుంచి పుట్టినటువంటి భగవద్గీత లో రాజవిద్య రాజగుహ్య యోగం అంతా ఆత్మను గురించే. సాంఖ్య యోగం అంతా ఆత్మను గురించే ఉంది. కానీ భగవద్గీతలో యోగీశ్వర కృష్ణుడు ఏం చెప్పాడు? ఇదిగో నీటిలో నానదు, నిప్పులో కాలదు, అదేమీ కదలదు, అన్నింటినీ కదిలిస్తుంది అంతవరకే చెప్పాడు. శంకర భగవత్పాదులు ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ విని ఆత్మ అనేటువంటి పదానికి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే ఆత్ అంటే ఏమీ మా అంటే లేదు. ఏమీ లేదు అదే ఆత్మ. మరి ఆత్మను పట్టుకోవాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి అని మనం అడుగుతూ వింటూ ఉంటాం కదా అంటే ప్రశ్నని రమణ మహర్షి అరుణాచలంలో ఎదుర్కొన్నారు. ఒకతను అడిగాడు, "భగవాన్! ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అసలు? అది ఎట్లా ఉంటుంది?" అని అడిగితే ఆయన అన్నారు, "ఆత్మసాక్షాత్కారం అంటే నీలాగా ప్యాంటు చొక్కా వేసుకుని నీ లోపల నుంచి బయటకు వచ్చి నీకు కనబడి మళ్లీ లోపలికి వెళ్తుందని అనుకుంటున్నావా? ఆత్మసాక్షాత్కారం అనేది ఒక పదం కాదు. ఆత్మ-- కాస్త నిదానంగా మాట్లాడు. ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది అంటే అదే నువ్వు" అని. ఆత్మే ఒక దేహం తీసుకొని వచ్చింది ఆత్మసాక్షాత్కారం అంటే ఇది. మరి దేహాన్ని రోజూ అద్దంలో చూస్తున్నాం, రోజూ అలంకారం చేస్తున్నాం మరి దీన్ని ఆత్మ అనుకోలా మనం? దేహమే అనుకుంటున్నాం. మై బాడీ, మై బాడీ అని చెప్తూనే ఉన్నాం. నేను ఆత్మ స్వరూపుడిని అనేటువంటి భావన కలగాలి. కలిగిననాడు అది ఆత్మసాక్షాత్కారం అయినట్లు. ఎట్లా అంటే వే-వేదాంతంలో రెండు పదాలున్నాయి నేతి అని. నేతి అంటే నా ఇతి, నా ఇతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ వెళితే అసలది ఏదో వస్తుంది. మనం కూడా అంతే కొత్త చోటికి వెళ్తాం, అడ్రస్ సరిగ్గా లేదు, ఏదో లీలగా గుర్తుంది, ఏదో మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు ముందు ఏదో కొబ్బరి చెట్టు ఉంది, ఇల్లే, ఇంటికి ఎర్ర రంగు ఏసి ఐదు ఇల్లు ఉంటాయి, ఐదు ఇళ్లలో ఇల్లు మళ్లీ. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ వెళితే అసలది ఏదో ఒక్కడ మాత్రం దొరుకుతుంది. ఇది కూడా అంతే. ఇక్కడ శంకర భగవత్పాదుల సమయం 2500లైన నాడు అది అయిపోయింది. మరి ఇక తర్వాత ఇందాక పధ్నాలుగు లోకాలు శరీరంలో ఉన్నాయి అని చెప్పారు కదా, మరి ఆత్మ కూడా శరీరంలోనే ఉన్నది, అది లోపల ఉండబట్టే ఇంద్రియాలు నడుస్తున్నాయని కేనోపనిషత్తు చెప్పింది కదా. నిజానికి ఆత్మ ఎక్కడుందండి మన దేహంలో చెప్పండి అని అడగాలి. కానీ ఎవరూ ఎవరినీ అడగలే. వాళ్ళకి అది అవసరం లేదు. మహర్షి మనతో మాట్లాడారా లేదా? మహర్షి చెప్పిందంతా మనం రోజూ వింటున్నామా లేదా? ఆశ్రమం బాగా నడుస్తోందా లేదా? మనం ఏమైనా చేయగలమా? చేయగలమా, పాడు చేయగలమా రెండే కదా. కాబట్టి ఏదో ఒకటి చేద్దాం. కాబట్టి ఇక్కడ మహర్షి మన శరీరంలో ఆత్మ యొక్క స్థానాన్ని చెప్పారు. ఇది ఆయన contribution to the world. మిగతావి మాట్లాడారు, మాట్లాడలేదు, ఆయన కరుణాపూర్ణ, సుధాబ్ది అవన్నీ ఒక ఎత్తండి. మన శరీరంలో ఆత్మ యొక్క స్థానాన్ని locate చేసినవారు ఎవరంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి. పృథివి మనసాస్వం చిన్నతా మజ్జతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం. నిన్న సాయంకాలం ప్రత్యేక సమావేశంలో మాట్లాడుకున్నాం ఇది. ఇది అందరూ మళ్ళీ పునః వినాలి. అంటే హృదయ కుహర మధ్యే, ఇక్కడ హృదయం ఉంది ఎడమవైపు, కుడి రొమ్ము ఖాళీగా ఉంది, గుహ లాగా ఉంది. దాని మధ్యలో ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఒకటిన్నర అంగుళాల దూరంలో ఒక గుహ ఉన్నది. గుహ అంటే ఖాళీగా ఉన్నది. ఖాళీగా ఉన్నది గనుక ఏదో శబ్దం వస్తోంది. చెంబు తీసుకుందాం, గ్లాస్ తీసుకుందాం, నిండా నీళ్లు నింపండి. ఒక స్పూన్ తీసుకుని కదిలించినా శబ్దం రాదు. ఎందుకని నిండిపోయి ఉన్నది గనుక. నీరు బయటకు నెట్టండి. అదే గ్లాసులో అదే స్పూన్ తీసుకుని అటూ ఇటూ కొడితే గంట కొట్టినట్టుగా శబ్దం వస్తుంది. అంటే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందంటే ఖాళీ అయినప్పుడు శబ్దం వస్తుంది. శబ్దం ఎక్కడి నుంచి పుట్టిందంటే నిశ్శబ్దంలో నుంచే పుట్టింది. నిశ్శబ్దం-- శబ్దం యొక్క మూలం పుట్టుక ఏదంటే నిశ్శబ్దం కాబట్టి ఒకటిన్నర అంగుళాల దూరంలో ఉన్న కుడి రొమ్మున ఉన్నటువంటి హృదయ స్థానము గుహ గనక అయినట్లయితే అక్కడ ఒకటి-- ఒక వస్తువు ఉంది. దానికి ఆయన సద్వస్తువు అని పేరు పెట్టారు. అదేమిటంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. Absolute బ్రహ్మన్. ఎక్కడ? బ్రహ్మం. నేను కూర్చున్న కుర్చీ బ్రహ్మనే, స్వామికి ఇచ్చిన కుర్చీ బ్రహ్మనే, నా శరీరము బ్రహ్మనే, పరా-- పరా ప్రకృతిలో ఉన్న జడము, అజడము, చరము, అచరమైన అన్ని వస్తువులు, అనాత్మగా ఉన్న మొత్తం ప్రపంచము, ఇదంతా కూడా బ్రహ్మమే. కానీ, కేవల బ్రహ్మం ఏమిటి? Reality వేరు Absolute Reality వేరు. సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది Vacuum Vacuum ఏ. శుద్ధ శూన్య ప్రదేశము అంటాం. Absolute Vacuum అని ఒకటి ఉంది. అది NTP అంటే Absolute Vacuum లాగా ఇక్కడ Absolute Knowledge, Absolute బ్రహ్మం ఎక్కడ ఉన్నదంటే అది ఇక్కడ ఉన్నది. బయట కనిపిస్తున్న మాట్లాడటం బ్రహ్మము మాట్లాడుతున్నది. వింటున్నది బ్రహ్మము. అంతా బ్రహ్మమే. కానీ అసలు సిసలైన, మూలమైన, ఆదిమూలమైన Primordial Sound ఎక్కడ పుడుతున్నది అని అంటే ఇక్కడ హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. అదంటుందట. యహం అహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి. యహం అహం అంటే నేను, నేను, నేను, నేను, నేను, నేను అంటూనే నిరంతరంగా ఉన్నదట.ఆ నిరంతరంగా నేను నేను అని ఇక్కడ అంటుంటే ఎడమ గుండెలో ఇది హృదయం కాదు ఇది గుండె, గుండెలో అది కూడా అటు ఇటు పెండ్యులం లాగా ఊగుతూ లబ్ డబ్, లబ్ డబ్ అంటోంది. దాన్ని బట్టే కదా చెప్తారు. లబ్ డబ్ ని మనం ఏం చేశామంటే లబ్ అంటే లాభం డబ్ అంటే డబ్బు అనుకున్నాం. కదా! లబ్బు డబ్బు, లబ్బు డబ్బు అది గుండెకు సంబంధించింది. దీని గురించి మనం మాట్లాడక్కర్లే, అది పనిచేసినంత కాలం పనిచేస్తుంది పోయినాడు అయిపోతుంది. అది పోదు మనల్ని పంపిస్తుంది అంతే, అది అక్కడే ఉంటుంది పని చేయకుండా. కాబట్టి ఇక్కడ ఆత్మ నిష్టోభవత్వం, ఆత్మ ఒక నిష్టలో ఉన్నదట. ఎలా ఉన్నదంటే నేను నేను నేను అదే ఆయన కూయామై అనేటువంటి ప్రశ్నకి నేనెవరు అన్న తాత్విక చింతనా విధానానికి ప్రేరణ కలిగించినటువంటి పరిశోధనాత్మకమైన ఫలితం ఏమిటంటే, హృదయ కుహరం వచ్చే కేవలం బ్రహ్మ మాత్రం యామహమిత్యసాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వంచంతతా మత్సతావా పవన చరణ రోగాత్ ఆత్మ నిష్టో భవత్వం. ఇది మామూలుగా స్వామి దగ్గర నిన్న చెప్పుకున్నాం దీపం వెలిగించడం దాని మీద చిల్లులున్న ఒక పాత్ర బోర్లించి ఉంచటం, ఎన్ని గాలులు వీచినా లోపల దీప కణిక కదలటం లేదని అది నిజంగా నెలకడ చెంది ఉన్నదని చెప్తున్నాం. అలాగే దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, చైతన్యము, అనుభవాలు, అనుభూతులు, కోరికలు, కార్యకలు, మారకము, తారకము ఇవన్నీ కూడా ఏది జరుగుతున్నా అది సాక్షిభూతంగా చూస్తూ ఉన్నది. It is always in a state of witnessing. సాక్షిభూతంగా ఉన్నది. అది నిజమైనటువంటి ఆత్మ యొక్క స్థావరం. ఇవాళ మనకి తృతీయ స్కంధం కపిలుడి వలన కపిలుడి యొక్క అనుగ్రహం వలన మనం ఏం నేర్చుకున్నామంటే మన దేహం దేవాలయం. దాన్ని అలాగే చూద్దాం ఇదేదో సౌందర్యము అందంతో కూడింది కాదు. నిజానికి అందం ఎప్పుడూ కూడా ఇంద్రియాలను రెచ్చగొడుతుంది. సౌందర్యం ఇంద్రియాలను సమన్వయం చేస్తుంది. అందుకనే శంకర భగవత్పాదులు లలితా సహస్ర నామాలకి భాష్యం రాయలేదని చింతబడి సౌందర్యలహరి రాశారు. అది అందాల హరి కాదది సౌందర్యలహరి. దానిలో మొట్ట మొదటి నలభై ఒక్క శ్లోకాను ఆనందలహరి దాని పేరు. నలభై ఒకవ శ్లోకం నుంచి మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటి భావనలో ఆయన నిరంతరం కూడా మిగిలిన అన్ని శ్లోకాలు కూడా సౌందర్యలహరి. అమ్మవారి యొక్క ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, పదం పట్టుకోవాలి, ఎక్కడ conjunction బీజాక్షరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పారు. అంటే ఇది ఎందుకు చెప్పాలంటే వస్తువునైనా విషయాన్నైనా physical level లో ఒక అర్థం అది తెలుస్తుంది. మన intellect ని వాడినప్పుడు meta physical level లో మరొక అర్థం తెలుస్తుంది. spiritual level లో అంతా అనుభవంలోకి వస్తుంది. spiritual level లో అర్థం కావటం అంటూ ఏం లేదు. ఇవి మొదటి రెండు perfect గా ఉంటే మూడవది మనకి సంపూర్ణమైన అనుభూతిని ఇస్తుంది. ఒక అనుభవాన్ని ఇస్తుంది, అనుభూతిని ఇస్తుంది, దానిలో నుంచి మనం విభూతి స్థాయికి వెళ్ళాలి. ఎటువంటిది కపిలుడు తన తల్లికి ఎంత ఉదాత్తమైన విషయాలు చెప్పాడు. మీ శరీరంలోనే పధ్నాలుగు లోకాలు ఉన్నాయి ఎక్కడో ఎక్కడో ఎందుకు వెతుకుతారు మీరు. ఇంకో లోకానికి వెళ్ళామని ఎవరు dollar ఖర్చు పెట్టలే ఇంతవరకు. ఇంకొక గ్రహ-గ్రహంలోకి అంగారక గ్రహంలోకి, చంద్ర గ్రహంలోకి, సూర్యుడి దగ్గరికి వెళ్తామని అంటున్నారు, Mars దగ్గరికి. లోకానికి వెళ్ళని వాడెవ్వడు లేడు, వెళ్ళక్కర్లేదు. అన్ని లోకాలు మన యందే ఉన్నాయి. దానికి ఉదాహరణగా మనకి ఇవాళ పధ్నాలుగు లోకాలు ఉన్నాయని తెలిసింది గనుక స్నానం చేసేటప్పుడు తలస్నానం చేసేటప్పుడు తల మీద మనం మొదటి చెంబు నీళ్లు పోసుకున్నప్పుడు బ్రహ్మ లోకానికి మీరు నమస్కరించి అభిషేకం చేస్తున్నట్లు లెక్క. అలాగే రెండు కళ్లతో చూడవలసిన దానిని మాత్రమే చూస్తూ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క శక్తిని, అమ్మవారి యొక్క దివ్య దీధిచి ఒక ప్రజ్ఞని, ప్రభని, కాంతిని చూట్టం మొదలు పెట్టినట్లయితే కళ్ళు ఇంకా అనేకమైనటువంటి లోకాలు చూడగలిగిన శక్తి కళ్ళకి లభిస్తుంది. అలాగే ముక్కుపుటాలు రెండు ఉన్నాయి. అవి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి అదే మార్గం, వేరే మార్గం లేదు. గాలి పీల్చుకోవాలి, గాలి వదిలిపెట్టాలి, గాలిని నిలబెట్టాలి. గాలిని పీల్చుకుంటే పూరకం. తీసుకున్న గాలిని నిలబడితే దాని పేరు కుంభకం. తీసుకున్న గాలిని కాసేపు ఉంచి వదిలిపెడితే దాని పేరు రేచకం. పూరక, కుంభక, రేచక అనబడేటువంటి మూడింటిని సమన్వయం చేయటం మాత్రమే నిజమైనటువంటి యోగ సాధన. అందుకని మనం ముక్కుపుటాలను జాగ్రత్త పెట్టుకోవాలి. ముక్కుపుటాలు రెండు ఏమిటనేది తర్వాత మీకు మళ్ళీ ఇంకొద్దిగా చెప్తాను. ఇది అయిన తర్వాత దీనిని ఇక్కడ భగవత్పాదులు ముక్కుపుటాల గురించి ఉచ్ఛ్వాస నిశ్వాసల గురించి చెప్తూ మీకెవరికీ తెలియని ఒక రహస్యం చెప్తున్నాను. లయ యోగాలు ఉన్నాయి. లయ యోగాలు అంటే కూడి ఉండేవి, లీనం చేసేవి. ఒకటి ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. ఒక దానిలో నుంచి మరొక దానిలోకి వెళ్ళేది. మీ అంతట మీరు మీ భావాన్ని, మీ భాషని, మీ సంస్కారాన్ని, మీ దృక్పథాన్ని, మీ ఆలోచనని అన్నింటినీ కూడా ఎక్కడో లోపలికి తీసుకుని ఒకచోట చేర్చాలి, లయింపజేయాలి. అదేమిటంటే సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసన్తి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేమాన్యతమం లయానాం. ఒక లక్షా ఇరవై ఐదు వేల యోగాలున్నాయట ఒక్క లయ యోగంలో. ఇర-- లక్షా ఇరవై ఐదు వేల యోగాలని కలిపితే దాని పేరే నాదానుసంధాన యోగం అని పేరు పెట్టారు. నాదానుసంధానం అంటే నాదం అంటే సంగీతం కాదు. సంగీతానికి తల్లి ఎవరంటే నాదం.అందుకనే మనం త్యాగరాజు స్వామి వారిని సంగీత బ్రహ్మము అనలేదు నాద బ్రహ్మము అన్నాం అంటే నాదాన్ని పట్టుకున్నాడు మూలాన్ని పట్టుకున్నాడు శబ్దము ఎక్కడ ఉత్పత్తి అవుతున్నదో దానిని గ్రహించాడు గ్రహించిన దానిని రామాంకితం చేశాడు రామాంచితం చేశాడు రామ పరం చేశాడు రామ గతం చేశాడు తాను రామ భక్తి సామ్రాజ్యానికి నిర్మాత కాగలిగాడు. ఇవాళ సంగీతము సంగీతం నాలుగు కృతులు పాడగానే వాణ్ణి నాదయోగి అంటున్నాం నాలుగు ఉపన్యాసాలు ఇవ్వగానే వాణ్ణి జ్ఞానపుత్రుడు అంటున్నాం జ్ఞాన పుత్రుడు జ్ఞానానికి పుత్రులే లేరు పుత్రికలే లేరు జ్ఞానము జ్ఞానమే కాబట్టి ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే తృతీయ స్కంధాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి ఇక దశమ స్కంధమా బోలెడు అందరూ చెప్పినట్టే మనమో కథలు చెప్పుకోవాలి కానీ మనం చెప్పుకోం సుమా మనం చెప్పుకునేది వేరే ఉంది దశమ స్కంధం అందరికీ తెలియే కృష్ణుడి కథ ఎవరికి తెలియదు తెలియదా అందరికీ తెలుసు కానీ అది వేరే సరే. పధ్నాలుగు లోకాలు మనలో ఉన్నాయి ముక్కు పుటాలు దాటిన తర్వాత నోరు ఉన్నది నోరు లోపల మనకి ముప్పై రెండు దంతాలు ఉన్నాయి ముప్పై రెండు దంతాలు ఏమిటో తెలుసునా they are not mere teeth to pulp or crush whatever we eat ముప్పై రెండు గణేషుడి యొక్క ముప్పై రెండు అవతారాలకు గుర్తు అది ముప్పై రెండు పదహారు ప్లస్ పదహారు ముప్పై రెండు గణేషుడి యొక్క ముప్పై ఏడు యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మానవుడి నోట దంత రూపంలో పరమేశ్వరుడు ప్రతిష్ట చేశాడు. అందుకనే ఒకటి రాలి పైనా రెండు రాలి పైనా పళ్ళు రాలటం మొదలు పెడితే జరిగే ప్రమాదం ఏమిటంటే తిన్న ఆహారం జీర్ణం కాదు మాట స్వచ్ఛతగా రాదు మాటకి పటువు బలము రెండూ ఉండవు దానికి సౌందర్యం కూడా నశించిపోతుంది. మీకు ఎంత భాషా ధాన్యమండి దంతాలు కరెక్ట్ గా గనక align అయి ఉంటే మాట స్పష్టత వస్తుంది కనుక మనం ఏం చేయాలి వాటిని రక్షించుకోవాలి. అలాగే ముప్పై రెండు దంతాల మధ్య అసలు ఎముకే లేని ఒకటి ఉన్నది దాని పేరు నాలుక ఎముక లేని వస్తువు ఏంటంటే నాలుక అది ముక్క మనకి వీసా ఇస్తుంది మనం తిన్న దాన్ని లోపలికి పంపించడానికి బాగుందో బాగోలేదో పాపం అదేమీ తినదు నాలుక రుచి జిహ్వ చాపల్యం అని పేరు పెట్టారు గానీ అదేం తినదు it will just pass సరే వెళ్ళు వెళ్ళు అంటుంది బాగాలేదంటే ఆగు బయట వమనం చెయ్ బయటకు నెట్టేసేయ్ అంటుంది అంటే it checks at the very entry point అది అది entry అదే sentry కూడా అదే. కనుకనే స్వామి అన్నారు ఏమి జారిపోయినా వంగి తీసుకోవచ్చు బంగారు నాలుక గనక జారిపోతే నాకము కూడా జారిపోతుంది స్వర్గం దాటిపోతుంది నాకము నిలబడాలి స్వర్గం ఉండాలి ఆనందం ఉండాలి సుఖం ఉండాలి సంతోషం ఉండాలి అంటే ఒక్క నీ నాలుకని control చేసుకో. రెండే అక్షరాలున్నాయి తెలుగులో ఒకటి పో రెండవది రా పో అన్నావనుకో మనిషి దూరం అయిపోతాడు ఎంత దూరంగా అంటే మన జీవిత కాలంలో మళ్ళీ వాడు వెనక్కి రాడు దగ్గరకు రా అని పిలిచాం అనుకోండి వాడు ఎవడికైనా ఇవ్వండి వాళ్ళతో మనకేం సంబంధం దగ్గరకు రా అని పిలవగానే నన్ను దగ్గరకు తీసుకున్నారు అనే ఒక భావన అతన్ని బతికినంత కాలం నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాంగ్మయాన్ని వాక్కుని అక్షరాన్ని చక్కగా వాడుకునేటటువంటి బుద్ధికుశలతని mechanism ని మనకు చక్కగా ఇచ్చేది నాలుక నాలుకకు చుట్టూ ఉన్న పరివేష్టితమై ఉన్నటువంటి దంతాలు కాబట్టి లోకాన్ని చాలా చక్కగా శుభ్రపరచుకోవాలి. మనకెందుకు పశుపక్ష్యాదులకి బ్రష్లును పేస్ట్లేం లేవు కదా ఏం లేవు కానీ అవి శుభ్రపరుచుకుంటాయి మనలాగా మన నాలుక లాగా వాటి నాలుక ఉండదు ఆకురాయి వలే ఉంటుంది ఆకురాయి ఆకురాయి అంటే చాలా గరుగ్గా ఉంటుంది దాంతో అది ఒక్కసారి clean చేసుకుంటుంది మనకి మంది మెత్తగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది కాబట్టి మనకు external aid కావాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ పరంగా విచారణ చేస్తే materialistic world కి ఆత్మకి ఎంత సంబంధం ఉంది నాలుక ముందుకి వెనక్కి పక్కకి అటూ ఇటూ తిరగటానికి mechanism ని trigger చేస్తున్నది ఏమిటి అంటే అది ఆత్మ it is the source of ener-energy. అదైన తర్వాత రెండు భుజాలు లేదా రెండు చేతులు రెండు చేతులతో మనం ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు కొన్ని ఒంటి చేత్తో లేపగలం కొన్నింటిని రెండు చేతులు ఉంటే తప్ప లేపలేము ఒకటి ఒంటి చేత్తో తీసుకొను కూడదు ఒంటి చేత్తో ఇవ్వను కూడదు నిజానికి రెండు చేతులతోనే ఇవ్వాలి రెండు చేతులతోనే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సమభావాన్ని సృష్టించి చెప్పటానికి లౌకిక విద్య ఉండాలి పారలౌకిక విద్య ఉండాలి. ఇవాళ నైమిసారణ్యం ఏడు రోజుల తర్వాత పది రోజుల తర్వాత మేము ఆత్మ విద్యని చాలా తెలుసుకున్నామండి అసలు ఉన్నదంతా ఆత్మే మీరెవరు నేనెవరు అనకూడదు మీరు ఆత్మే నేను ఆత్మే కలిసి ఉన్నాం ఒకటే రెండే కనిపిస్తున్నాయి అని చెప్పాలి కాబట్టి పనులన్నీ ఇంకా బలంగా అర్థం చేసుకుని చేయాలి చేసినప్పుడు జగత్తుకి జగద్ధితము జగత్తు యొక్క కళ్యాణం జరుగుతుంది జగత్తు ఎక్కడో లేదు మన ఇంట్లో అంతకంటే ముందు మన ఒంట్లో సర్వ జగత్తులు ఉన్నాయి అలాగే రెండు చేతులకి చేతినిండా పని ఉండాలి అంటాం మన ఉద్దేశం ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి అని కాదు ఏది చేసినా చేతి నిండుగా పని చేయాలి ఏది ఇచ్చినా చేతి నిండుగా ఇవ్వాలి అని అర్థం. తర్వాత రెండు కాళ్ళు పాదాలున్నాయి పాదాలు ఎంత గొప్పవి అంటే శరీరం మొత్తాన్ని రెండు పాదాలు నడిపిస్తాయి గురువు గారికి.పాద నమస్కారం చేసుకోవటం దేశపు సంప్రదాయం భారతీయ సంప్రదాయం దోషం ఏం లేదు కానీ పళ్ళెంలో పాదాలు పెట్టి దాన్ని లక్ష రూపాయలకు అమ్ముకోకూడదు. శ్రీ భూయిత్త శ్రీహరి చిన్హితాభ్యం అగస్త్య రేఖా దవిరంచితాభ్యం నమో నమః సద్గురు పాదుకాభ్యం అని మనకి ఒక ప్రమాణం ఉంది. ఏమిటంటే మానవుడి అరచేతిలో కర్మ రేఖలు ఉంటాయి మనం time బాలేనప్పుడు కష్టాలు ఏదో చుట్టుముడుతున్నప్పుడు ఎవడి దగ్గరికి పుట్టలో పాము ఉందని చివరికి చెయ్యి చూసే వాడికి కూడా మనం చెయ్యి చూపిస్తాం మంచి రోజులు ఎప్పుడొస్తాయో చెప్పండని. కర్మ రేఖలు అన్నీ ఇక్కడ ఏర్పడి ఉంటాయి గురువుగారి పాదాల పైన ఏమీ ఉండదు తెలుసుకోవాల్సింది అది. గురువుగారి పాదాల అడుగున ఉంటాయి అగస్త్య రేఖలు అంటారు అగస్త్యుల వారు సముద్రం మొత్తాన్ని తాను ఎలా కమండలంలో బంధించగలిగాడో, ఎలా దేనినైనా జీర్ణం చేసుకోగలిగాడో, ఎలా సంపూర్ణ జ్ఞానమూర్తి అయినాడో, ఏత్-ఎట్లా వైదిక మూర్తి అయినాడో, కాశీ నగరం నుంచి బహిష్కరింపబడిన వ్యాసుల వారు ఆంధ్రదేశానికి రావలసి వస్తే ఆయన్ని ద్రాక్షారామంలో ఎట్లా ఆహ్వానం చేయగలిగాడో, ఇవన్నీ గమనించినప్పుడు అగస్త్య రేఖలు గురువు యొక్క పాదాల యందు ఉంటాయి. మరి గురువుగారి పాదాల అడుగున ఉన్నాయి మనవేమో ఇక్కడ ఉన్నాయి అంటే కర్మ రేఖలు గనుక అగస్త్య రేఖలను తాకిన ట్లయితే అప్పటివరకు చేసిన కర్మల వలన కలిగిన చెడు ఫలితాలన్నీ నశిస్తాయి, క్షమిస్తాయి, తగ్గుతాయి. కనుక గురుపాదమునకి మనం నమస్కరించాలి. గురుపాదం నమస్కరించాలండి మన మీరు అడుగున ఉన్నాయి అని చెప్తున్నారే అడుగున ఎలాగండి అంటే అందుకని శాస్త్రం ఏం చెప్పింది అంటే గురు పాదానికి నమస్కరించినప్పుడు పై పైన చేయకండి, చేసుకోకండి రెండు గురువు యొక్క రెండు కాళ్ళ బొటనవేళ్ళ కింద మీ అరచేతి అరచేయిని అంతా కాకుండా చిటికెన వేల-వేలు కొసలు అంటాం వాటిని చాల్చి దాన్ని తాకినట్లయితే గురు పాదముల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. అంటే గురువు పాదానికి ఎలా నమస్కరించాలి భారతీయ సంప్రదాయంలో గురు పాదానికి పూజలు లేవు గురువు యొక్క పాదుకలకు పూజలు ఉన్నాయి. పాదానికి పూజలు ఏమీ చేయరు, చేయకూడదు కానీ వాళ్ళందరూ చేస్తున్నారు. గురువు గారిని మనమే వాళ్ళని ఇంటికి పిలుస్తాం ఆయన కాళ్ళు కూడా తు-- కడగచ్చు మంచిదే కానీ దానిని డబ్బు కోసం మాత్రం ముడి పెట్టకూడదు. గురుపాద, గురు సంసేవన చేయవలసిందే అవన్నీ మంచివే అందుకనే మీకు ఒక చిన్న రామాయణ స్పృహ ఒకటి చెప్తాను. రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళిపోయినాడు. ఎలా వెళ్ళాడు? మామూలుగా కాళ్ళకి చెప్పులు, ఇవాళ మనం పాదుకలు అంటున్నాం చెప్పులు వేసుకున్నాడు ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళిన కొద్ది రోజులకే చిత్రకూటం వరకు వెళ్ళేప్పటికీ భరతుడికి విషయమంతా తెలిసి తండ్రి మరణించాడని, అన్నగారు, లక్ష్మణుడు, వదినగారు అరణ్యంలోకి వెళ్లిపోయారని ఇక దశరథుడే లేనప్పుడు తండ్రియే లేనప్పుడు ఆయన మాట ఎందుకు పాటించాలి అన్నా నువ్వు తిరిగి వచ్చి రాజ్యంకే-- రాజ్యం ఏలుకోమని చెప్పడానికి పాపం భరతుడు వెళ్ళాడు. సరే రాముడు అన్నాడు తండ్రి ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తండ్రి ఉన్నప్పటి సంగతి ఏమోగాని తండ్రి శరీరం వదిలిపెట్టిన తర్వాత తండ్రి ఏం చెప్పాడో అది పాటించకపోతే నేను కుమారుడిని కాదంటాడు. నిజానికి మన దక్షిణ భారతంలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది సంప్రదాయం ఏంటంటే ఒక తండ్రి ఉంటాడు తండ్రి చుట్టుపక్కల వాళ్ళు ఎవరి దగ్గరో పది రూపాయలో ఇరవై రూపాయలో అప్పు తీసుకుని ఉంటాడు. ప్రాణం పోయేటప్పుడు కొడుకుని దగ్గరకు పిలుస్తాడు. నాయనా మనకు ఆస్తి ఉంది ఆనాడు ఏవో ఇబ్బందులు వచ్చినాయి ఫలానా వారి ఇంట్లో నేను ఇరవై రూపాయలు అద్దెకు తెచ్చా-- అప్పు తెచ్చాను నా బదులు నువ్వు తీర్చమని చెప్పి వెళ్తాడు. తండ్రి పోతాడు అప్పు ఇచ్చిన వాడు అడగడు కానీ కుమారుడు ఏం చేస్తాడంటే మాట పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి మా తండ్రి నాకు మాట చెప్పాడు మీకు ఇస్తున్నాను అని అప్పు తీరిస్తాడు. ఇది జాతి తెలుగు వారి తెలుగు జాతి యొక్క సంస్కారం ఇది. ఇది ఇంకా మరొక చోట మనం వినం సరే దాన్ని అక్కడ పెడదాం. సరే భరతుడు వెళ్ళాడు వాళ్ళిద్దరూ ఇదే మాట్లాడుకున్నారు. నాన్నగారు లేనప్పుడు నీ-నీదే ఉంది నువ్వు వచ్చేసెయ్ వదినగారు నీ వల్ల ఆవిడ కష్టపడుతున్నది అక్కడ ఊరి మీద ఇబ్బంది పడుతున్నదని చెప్పవలసినవన్నీ చెప్పాడు ఆయన, ఆయన రాలేడు. అన్నాడు అయితే ఏవో పని చెయ్ నువ్వు లేని అయోధ్యకు నేను వెళ్ళను. నువ్వు వచ్చాకే నీకు పట్టాభిషేకం స-సమయంలోనే మనందరం కలిసి అయోధ్యలోకి వెళదాం అప్పటి వరకు నేను అయోధ్యకు బయట ఉన్న నంది గ్రామంలో ఉంటా. నంది గ్రామంలో ఉండి నేను ఏం చేస్తాను రాజ్యం ఏళను, నేను రాజ్యం-- సింహాసనం ఎక్కను. అక్కడ ఉండి అయోధ్యా నగరంలో చేయవలసిన పనులు కొన్ని చేస్తా కాబట్టి నీ ప్రతినిధిగా, నీ గుర్తుగా చూడగానే నువ్వే అన్నట్లుగా ఉండే నీ రెండు పాదుకలు ఇవ్వు మన్నాడు. అంటే రాముల వారు ఒక ఏడాది కాళ్ళకి పాదుకలతో నడిచాడు మిగిలిన సమయం అంతా ఆయన కాళ్ళకి చెప్పులే లేవు. ముళ్ళు, రాత్రిపూట అమ్మవారు ముళ్ళు తీసేదని వాల్మీకింలో ఉంటుంది. సరే ఈయన తీసుకొని వెళ్ళాడు తీసుకెళ్లి నంది గ్రామంలో ఇటువంటిదో సింహాసనం తెచ్చి దానిలో అన్నగారి పాదుకలు పెట్టాడు. పాదుకలు పెట్టి రోజూ దానికి పూజ చేశాడు. పూజ చేస్తూ పాదుకలు ఎలా ఉన్నాయిట అంటే, చూడండి ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు మన మనసులో అనేక భావాలు కలుగుతాయి. భావాలన్నీ మన సంస్కారాన్ని బట్టి కలుగుతాయి. రాముల వారు చెట్టు కింద పడుకొని ఉండగా భరతుడు నుంచొని రాముల వారిని చూశాడు మొట్ట మొదటిసారి. పడుకొని ఉన్నాడు ఆయన నేల మీద.తలగడ అలా మోచేయి కింద అంచుకొని పడుకొని ఉన్నాడు. పై నుంచి అన్నగారిని చూసినప్పుడు ఒక చిన్న బొమ్మ గనక గీసినట్లయితే outline గీస్తే రామ దేహము ఎట్లా ఉన్నదో రామ పాదుకలు అట్లా ఉన్నాయట. పడుకోబెట్టిన రాముడు వలే ఉన్నాయి, పడుకున్న రాముడు వలే ఉన్నాయి. అక్కడ ఆయన దానం చేశాడు సామగానం చేశాడు. అక్కడ అయోధ్య ప్రజలందరూ రాముడి ప్రతినిధిగా ఉన్న పాదుకలను చూశారు. [పాట] పాదుకలను రఘువంశ స్వామిగా చూశాడట భరత స్వామి, చూడండి. ఎంత ఉదాత్తమైన సంస్కారం! ఒక అన్న పట్ల ఒక తమ్ముడు చూపించిన గౌరవం. అలాగే పాదుకలు, ఇవాళ పాదుకా పూజ అంటే మీరు కంచి పీఠంలో గనక మీరు చూసినట్లయితే అక్కడ గురువు పాదాలకు పూజ చేయించుకోరు. వాళ్ళు allow చేయరు. పాదుకలకు చేసుకోండి అంటారు. పాదుకలు పీఠ సంస్కృతికి, పీఠ శక్తికి నిలయాలు. కానీ ఇవాళ కాలం మారింది. కలము కలికాలం పూర్ణంగా ఆవిష్కరణ అవుతున్న సమయంలో కాస్త నాలుగు మంచి మాటలు చెప్పగలిగిన వాడు, కాస్త కొద్దిగా popularity ఉన్నవాడు, వాడి పాదాలకు మనం పూజ చేసే వాడి అహంని పెంచుతున్నాం మనం. చేయకూడదు ఇది. పాదుకా పూజ చేయాలి. పాదుకలు ఎప్పుడు దొరుకుతాయీ మనకంటే, గురువు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత పాదుకలనే మనం గురువుగా భావించి నమస్కరించాలి. మీకిక్కడ స్వామి సంగతి ఒకటి చెప్పాలి. పాదుకా పూజ ఉత్సవం జరిగింది ప్రశాంతి నిలయంలో. బహుశా మీలో వెళ్లి ఉంటారు విజయవాడ నుంచి కూడా. సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం అందరూ కూర్చున్నారు భక్తులు అటు ఇటు. వెండి పాదుకలు అందరూ చేసుకొని వెళ్లారు. ఎవరిది వాళ్లే తీసుకెళ్లారు, ముందు పెట్టుకున్నారు. స్వామి వీటి అన్నింటి మధ్యలో నడుచుకుంటూ కొన్ని చోట్ల వాటిని తాకి ఏదో వెళ్లారు. చాలా అద్భుతంగా జరిగిన ఒక సంఘటన, సందర్భం అది. పండగ అయిపోయింది. పండగ అయిపోయిన ఆరేడు రోజులకి నేను ప్రశాంతి నిలయానికి వెళ్ళా. పూజలో నేను లేను. స్వామి నన్ను అడిగారు "నువ్వు కనపడలేదేమి?" అని అడిగారు. "నేను రాలేదు స్వామి, అందుకని కనపడలేదు. నేను నా పనిలో ఉన్నాను, నేను రాలేదు" అన్నాను. "పాదుకా పూజ ఎందుకు చేశారో తెలుసా?" అని అడిగారు స్వామి. వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, స్వామికి తెలుసు. కానీ రాని నన్ను వారు వేసిన ప్రశ్న ఇది. అప్పుడు నేను అన్నాను "స్వామీ! పాదుకలిమ్ము పావన నామా పరమపదమిమ్ము నెమ్మది నా హృది నీ పాదాల పాదుకొన నిమ్ము" అన్నాను. ఆనందపడిపోయారు స్వామి. ఎందుకంటే పాదుకలు కూడా నా దృష్టిలో వస్తువులే, అంతే. మరి నేనేం చేయాలి? నాకు ఎటువంటి పాదుకలు కావాలంటే, నా హృదయాన్ని నీ పాదముల దగ్గర పాదుకునేట్టుగా చెయ్. మనం విత్తనం లోపల పెడతామే, అలా ఉంటే అది నాకు పరమపదం అవుతుంది. పాదుకలిమ్ము పావన నామా పరమపదమిమ్ము. నెమ్మది, నెమ్మదిగా. ఒకే రోజు instant గా కాదు. క్రమ పరిణామంగా జరగాలి. నెమ్మది నా హృది నీ పాదాల పాదుకొన నిమ్ము. అంటే ప్రతిదానిని ఒక స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. ఒకే ఒక్క స్థాయిలో పాదుకలు వచ్చాయ్, పాదుకలను ఊరేగించాం, పాదుకలకు పూజ చేశాం, పాదుకలకు వింజామర వించాం. ఇది గురువు కోరుకోవటం లే. తాను నడిచిన మార్గంలో ఒక్కొక్క అడుగులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, స్వామిని అర్థం చేరా స్వామో, రాముడో, కృష్ణుడో, ఇంకొరో, ఇంకొరో, గురువో మార్గంలో ఎంతమంది వెళుతున్నారు, వెళ్లి ఎంత చక్కగా జీవితాన్ని భద్రతమం చేసుకుంటున్నారు అనే విషయం చెప్పాలి గనుక పాదుకా పూజ అనేటువంటిది ఒకటి. గురువుగారి పాదాల అడుగున మాత్రమే అగస్త్య రేఖలు ఉంటాయని, కనుకనే రోజులలో వాళ్ళు పాదచారులై వెళ్లేవారు. అనేకమైన scientific కారణాలున్నాయి. అది వేరే, అప్రస్తుతం. ఇప్పుడక్కర్లేదు. సరీ [గొంతు సవరించిన శబ్దం] దేహంలో మనం ఇవన్నీ అనుకున్నాం, నోరు అనుకున్నాం, పాదాలు అనుకున్నాం, ఇదంతా బాగుంది. ఇక్కడ పొట్ట ఉంది. అసలు laboratory అంతా ఇది. జరిగేదంతా ఇక్కడే. శక్తి పుట్టేది ఎక్కడే, శక్తి dissipate అయ్యేది అదే. అది మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని ఒకటుంది. మీకు ఇక్కడికొచ్చిన group వాళ్ళందరి address లు గనక ఉంటే నాకిస్తే. ఉపనిషత్ సుధ అని పది ఉపనిషత్తుల మీద ఒక book రాయబడింది. అది చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంత ఉన్నదా ఉపనిషత్తులలో అని. రెండు వేల pages లు, మూడు వేల pages లు మనకక్కర్లేదు. ఏం కావాలో అది ఉన్నది గనుక, అవన్నీ మీకు అందేట్లుగా మేము చూస్తాం వీరిని బట్టి. అది యోగం ఉండాలి. నే-నేనివ్వాలని అనుకున్నా అది అందరికీ చేరాలి. చూద్దాం మళ్ళీ మన doctor గారిని అడిగి దానికేదన్నా mechanism evolve చేద్దాం నెమ్మదిగా. అంటే ఉపనిషత్తులన్నీ ఎవరో చెప్పగా వినటం మాత్రమే కాదు, మనంతట మనం అక్షర తెలుగులో చదువుకోవాలి. చదువుకుంటే తర్వాత మళ్ళీ మూల గ్రంధాలలోకి వెళ్ళొచ్చు.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 29:52

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

    Now playing
  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22