Skip to content
Transcript తెలుగు
లలితా జవం జవ మహా జీమూత పాపాంబుధారా వేగంబు నన్ మన్మనోజ్య సముదీర్ణత్వంబు కొల్పో ఇతిన్ దేవా కరుణా శరత్ సమయమింతే చాలు చిద్భావనా సేవన్ తామరతం పరై మనియదన్ శ్రీ కాళహస్తీశ్వరా శ్రీ అంటే సాలెపురుగు శ్రీ అంటే లక్ష్మి శ్రీ అంటే సరస్వతి శ్రీ అంటే హాలాహలం నాలుగు పేర్లున్నాయి దానికి శ్రీ కేవలం గౌరవ వాచకం కాదు శ్రీ అంటే లక్ష్మి అందరికీ తెలుసు ఇంకా బాగా కావాలని శ్రీలక్ష్మి అని కూడా పేరు పెట్టుకుంటారు అసలు శ్రీ అంటేనే లక్ష్మి శ్రీ సరస్వతి కూడా అమ్మవారు అమ్మవారు సరస్వతీదేవి ఎలా అయిందంటే శకార రకార ఈకారములు మూడు బీజాక్షరాలు ఉన్నాయి అంటే శారదా బీజం అంటే రమా బీజం అంటే దుర్గా బీజం కాబట్టి ఇటువంటి శారదాదేవి రెండవ శ్రీ మూడవది హాలాహలం శ్రీకంఠుడు అయినాడు ఎవరు శివుడు ఎందుకు శ్రీ ని కంఠంలో నిలబెట్టుకున్నాడు గనుక శ్రీకంఠుడు అయినాడు అలాగే చివరికి సాలెపురుగు సాలెపురుగు తన చుట్టూ తన నుంచి స్రవించేటువంటి ఒక ద్రవం ద్వారా ఒక గూడు అల్లుకుంటూ అల్లుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోతుంది కీటకాల నుంచి దూరమైపోతుంది కానీ దానికి ఆకలి వేస్తుంది ఏం చేస్తుంది అప్పుడు తాను కట్టుకున్నటువంటి సాలె గూటిని తానే తింటుంది అది కాబట్టి శ్రీ అంటే సాలెపురుగు శ్రీ అంటే సరస్వతి శ్రీ అంటే హాలాహలం శ్రీ అంటే లక్ష్మి ఇక కాళము కాళము అన్నా కాలము అన్నా ఒకటే కాళము అంటే అందుకే కాల సర్పము అన్నాం శ్రీకాళహస్తిలో కాళము అంటే సర్పమే కదా ఇక హస్తి అంటే ఏనుగు నిన్న మనం అనుకున్నాం ముప్పై రెండు దంతాలు అక్కడ ఉన్నాయి మరి శ్రీకాళహస్తి ఎక్కడ ఉన్నది అంటే సాలెపురుగుగా మన మనసులో ఉంది లక్ష్మీదేవిగా మన సంపదలో ఉంది సరస్వతీదేవిగా మన వాక్కులో ఉంది హాలాహలం జీవితానుభవాలన్నీ గరళాలుగా మింగలేక కక్కలేక అంటాం కదా బయటకు వమనం చేయలేం లోపల పెట్టుకోలేం అది కంఠం ద్వారా బ-బంధించి ఉంచుకుంటాం గనుక శ్రీ కాళహస్తి అంటే ప్రాపంచికమైనటువంటి బంధనాల వలన అనుభవాల వలన కలిగినటువంటి పోతే కనుక ఇక్కడ దూర్జటి ధ్రువత్వాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఎక్కడ ఈయనకి అవమానం జరగలా అతిశయించిన సంపదలు కూడా ఆయనకు అవమాన భారంగా తీసుకొచ్చినాయి దానిలో నుంచి లేదు నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆనంద తారక స్థితిలో నేను ఆనంద భూమికలో ఆనంద విహారం చేయాలి అనుకున్నాడు ఇవాళ కాళహస్తీశ్వర శతకం మనకి రాసి ఇచ్చాడు అంతకు ముందు రాజు గారి మీద రాసిన పద్యాలు ఎవరికీ గుర్తు లేవు ఎప్పుడైతే ఏదైతే భగవత్పరంగా మనం మాట్లాడుతామో ఎప్పుడైతే భగవంతుని పరంగా యోచిస్తామో ఎప్పుడైతే భగవత్పరంగా కార్యకలాపాలలో మునిగి ఉంటామో పరంగా ఎప్పుడైతే అన్నీ ఈశ్వర ప్రీతికే నేను సంపాదించినా సంపాదించకపోయినా అసలు నా జీవితమే ఈశ్వర ప్రీతికై సాగు గాక అని గనుక మనం సంకల్పించుకున్నట్లయితే అవన్నీ కూడా దివ్యత్వాన్ని సిద్ధించుకుంటాయి మనకి ధ్రువుడి కథ మాత్రమే చెప్పి మనలక్కడ వదిలిపెట్టేస్తుంది అయితే ఇదే సందర్భంలో అజామీలుడు కథ ఒకటి ఉంది నిన్న అనుకున్నాం మనం కదా అంటే చాలా సేపు సుదీర్ఘమైన తపస్సు చేసి సాయుజ్యం పొందటం ఒకటి అసలు కేవలం పరీక్షిత్ మహారాజు ఏడు రోజులు భాగవతం విని ముక్తి మార్గం తెలుసుకున్నాడు అసలు ముక్తినే ఏడు క్షణాలలో పొందిన వాడు కూడా భాగవతంలో ఉన్నాడని మనం అనుకున్నాం మొన్న వాడి పేరే అజామీలుడు అజామీలుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు సద్బ్రాహ్మణుడు వాడు నిత్యమూ అఖండ గాయత్రి చేసుకునేవాడు వేదో నిత్యం అధియతం అని ప్రతి నిత్యమూ కూడా వేదం చదువుకునేవాడు వేదార్థం తెలుసుకునేవాడు వేద భాష్యం చెప్పేవాడు సత్కర్మలు చేసేవాడు తను ఉన్నటువంటి పురానికి హితము చెప్పే మాటలు చెప్పి పురోహితుడు అయినాడు ఇవాళ పురోహితులు అయితే పంతులు గారు అయిపోయినారు పంతులు గారు అంటే డబ్బు తీసుకునేవాడు అయిపోయినాడు కాదు పురానికి హితము చెప్పేవాడు పురోహితులు అవుతున్నాడు ఎవడైనా పురంలో నగరంలో గ్రామంలో చెడు మార్గంలో వెళుతుంటే వాడిని సన్మార్గంలో పెట్టే బాధ్యతని ఆనాడు పురోహితులు చేసేవారు అది వాళ్ళ బాధ్యత వాళ్ళు సంపాదించుకోవటానికి పౌరోహిత్యం కాదు పురహితమే వాళ్ళ సంపాదన దానిలో వాళ్ళ డొక్క ఎండిపోయినా పర్వాలేదు అట్లా నిష్ఠాగరిష్టంగా బతికిన ఒక జాతి అటువంటి వాడు అజామీలుడు త్రికాల సంధ్యావందనం చేసి వేదాధ్యయనం చేసి శాస్త్రాధ్యయనం చేసి బహు కుటుంబీకుడు ఆయన సుమారు పదిమంది పిల్లల్ని కన్నాడు కాబట్టి చక్కని సంసారం ఉంది సమకూడిన ఇల్లాలు ఉంది అన్నీ ఏర్పడ్డాయి కానీ చూడండి trust with destiny అంటాం విధి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా వక్రీస్తుంది మనకు తెలీదు అది రూపంలో వచ్చి మలుపు తిప్పుతుందో మనకు తెలియదు మనం మడతలో పడిపోతాం మళ్ళీ బయటకు రావటానికి చాకచక్యం ఉన్నవాడు [కొవ్వు] భగవదనుగ్రహం ఉన్నవాడు ఎలాగో బయటకు రాగలడేమో కానీ అందరూ రాలేరు ఒక్కసారి అపమార్గంలోకి మనిషి మనసు వెళ్ళింది అంటే అపమార్గం తాత్కాలికమైన ఒక సుఖాన్ని ఇస్తుంది కనుక వాడు అపమార్గంలో వెళుతూనే ఉంటాడు ఒక ఎండమావి వెనుక పరిగెత్తినట్టు వెళుతూ ఉంటాడు సన్మార్గంలో వెళుతున్న వాడికి ఎత్తులు ఉంటాయి పల్లాలు ఉంటాయికాళ్ళ కింద పల్లేరులు ఉంటాయి నల్లేరులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి గులకరాళ్ళు ఉంటాయి అట్లాగే మంచి రోడ్ వస్తుంది రోడ్ లేకుండా ఉంటుంది వెళుతున్నప్పుడు ఒక అగాధం ఏర్పడుతుంది మళ్ళీ ఒక లోయ ఏర్పడుతుంది మళ్ళీ ఎత్తు వస్తుంది ద్వంద్వాలు అన్నీ కూడా సన్మార్గంలో ఉన్న వాడికి వస్తాయి. వాడు మంచివాడు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మంచి మార్గమే కాబట్టి మంచి మార్గం రాజమార్గం కాదు మార్గాన్ని రాజమార్గం చేసుకుంటూ మనం వెళ్ళాలి మార్గం మార్గమే కాబట్టి దీనిని అర్థం చేసుకుంటే అజామిలుడు దురదృష్టవశాత్తు ఇంతటి వాడు కూడా ఒకానొక సమయంలో స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. అసలు అతనికి అవకాశమే లేదు అతని మనసులో భావాలే లేవు చక్కని పిల్లలు సంసారం ఉంటే వ్యామోహంలో పడ్డాడు పడ్డ వాడు బయటకు రాలేకపోయాడు. భోగమే శాశ్వతం అనుకున్నాడు లౌకికమైనటువంటి తాత్కాలిక సుఖసంతోషాలే శాశ్వతం అనుకున్నాడు ఇంటిని ఇల్లాలిని వదిలిపెట్టాడు ఉండకూడది చోట ఉండటం మొదలు పెట్టాడు ఇవన్నీ జరిగేవన్నీ జరిగినయి కానీ వాడు మంచివాడా? చాలా చెడ్డవాడా? వాడు రాజా? వాడు బంట? ఎముడికి గాని కాలానికి గాని లెక్క లేదు ముఖ్యంగా కాలానికి లెక్కలేదు మరి అతడికి కూడా వృద్ధాప్యం వచ్చింది అవసాన దశ ఏర్పడింది అవసాన దశ ఏర్పడినప్పుడు ఎవరు అంతమంది పిల్లలున్నా ఎవరు దగ్గర లేరు. దాహం వేసి అరుస్తూ ఉన్నాడు ఎవరూ పట్టించుకోవటంలా పిలుపు అందుకునేంత దూరంలో [కొట్టు] బంధువు లేడు కావాల్సిన వాళ్ళంటూ ఎవరూ లేరు సమయంలో యమభటులు అప్పటికే వచ్చి పొంచి ఉన్నారు time రాగానే వాణ్ని తీసుకరి వెళ్ళాలి పాశం వేసి. వీడికి దాహం వేసింది వాళ్ళ దగ్గర పాశం ready గా ఉంది వీడు వేద విద్యని సంస్కృతిని మర్చిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది కానీ దాహం తీర్చుకోవటానికి తన కట్టకడపటి కొడుకు చిన్నవాడంటే అమిత ప్రేమగా ఉంది వాడికి వాడు నారాయణా అని పిలిచాడు నారాయణా వాడు పలకలా రెండోసారి మూడోసారి నాలుగోసారి నారాయణా నారాయణా కొడుకును పిలిచాడు నారాయణా అని నాలుగు సార్లు అనటానికి అతనికి ఒక రెండు నిమిషలో ఒక నిమిషం పట్టు ఉంటుంది మరి రావలసిన వాళ్ళు వచ్చేశారు. వాళ్ళు విష్ణు భటులు కాదు విష్ణు దూతలు వచ్చారు వచ్చి మాతో రమ్మన్నారు యమభటులు అడుగుతున్నారు వీడు మహాపాపి దుర్మార్గమైన జీవితం గడిపాడు వీడిని క్షమించడానికి వీలు లేదు వీడిని మీ లోకంలోకి ఎలా తీసుకుని వెళతారు మాకు యముడి ఆజ్ఞ ఉంది వీడు చేసినటువంటి పాపకృత్యాల అన్నింటికీ నరకమే తప్ప ఇంకో చోటు లేదు మీరు వెళ్ళిపోండి అన్నారు యమభటులు విష్ణుదూతలు అన్నారు వాడు నారాయణ స్మరణ చేశాడు వాడి మంచి చెడుతో మాకు సంబంధం లేదు మంచివాడేగా మధ్యలో కదా చెడిపోయినాడు కానీ చివరిలో నారాయణ కాదు మీరు పటపా-పొరపాటు పడుతున్నారు వాళ్ళ అబ్బాయిని పిలుస్తున్నాడు తప్ప మన శ్రీమన్నారాయణుడిని పిలవటం లేదు కాబట్టి మీరు. నారాయణుడిని పిలిచాడా కొడుకు నారాయణని పిలిచాడా మాకు అనవసరం నారాయణ నారము అయనముగా కలిగినవాడా నారము జ్ఞానమై ఉన్నటువంటి వాడా అన్నింటిని ఇవ్వగలిగిన వాడా అని నారాయణుడిని ప్రార్థించాడు కనుక మేము ఇతన్ని విష్ణు లోకానికే తీసుకు వెళ్తున్నాం అని అన్నప్పుడు యమభటులు యముడి దగ్గరికి వెళ్లి అడిగారు మీ మామ శయం అని అడుగుతారు లేదా వాణ్ని ఎందుకు తేలేదని అడుగుతారు పెడ రెక్కలు విరిచి తేమని మన వాళ్ళు కాస్త ఎక్కువగా రాస్తారు కవులు వాళ్ళకి ఆవేశం కలిగినప్పుడు మాటలు కూడా భిన్నంగా వస్తాయి సరే అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇది మనకి కూడా నరక లోకానికి కూడా ఇది పెద్ద గుణపాఠం ఏమిటి అంటే ఎవరు హరినామ స్మరణ చేస్తారో ఎవరు హరి చింతన చేస్తారో ఎవరు కట్టకడపటి క్షణంలోనైనా భగవంతుణ్ణి తలుచుకుంటారో వాళ్ళని మాత్రం విష్ణు సాయుజ్యం ఇచ్చి విష్ణు లోకానికే పంపండి ఇన్ని అవకాశాలు ఇచ్చిన చిట్టచివర గనుక భగవంతుణ్ణి తలుచుకోకపోతే వాణ్ని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు అట్లా యమధర్మ నిర్ణయం జరిగింది అజామిలుడి వలన కలిగింది అంతకు ముందు లేదు ఇది కాబట్టి అజామిలుడి వలె ఉందాం అంటే దీంట్లో పెడ అర్థం తీసే వాడు ఒకడు ఉంటాడు మన మధ్యలోనే ఉంటాడు అంటే నేను చేసే పాపాలన్నీ తొంభై ఏళ్ళు చేస్తా చివర్లో ഒരിക്കే నారాయణ సాయిరాం అంటా అంటే వెళ్ళిపోతానన్నమాట అని దాని అర్థం అది కాదు దాని అర్థం ఏమిటంటే అది అట్లా చేసినా భగవంతుడు కరుణామయుడు కరుణ వల్ల నిన్ను తీసుకొని వెళ్ళాడు నువ్వు ఏం చేయాలంటే క్షణంలో కొడుకు ఉన్నాడు గనుక నారాయణ అని పిలిచాడు కొడుకు పేరు నారాయణ కాదు ఇంకేదో పేరు అనుకుందాం మరి ఎవడు రాడు లోకానికి చెందని వాడు రాడు స్వామి ఇక్కడ చిన్న కథ చెప్తారు దీనికి ఎట్లా అంటే ఒక మహా భక్తుడు వాడు ఏం చేసాడంటే అడవికి వెళ్ళాడు వాడు శివభక్తుడు వెళ్ళి చెట్టు కొమ్మలు నరుక్కుంటున్నాడు వంటకి కావాల్సి నరుక్కుంటూ ఉంటే వాడికి స్పృహ లేదు అయ్యో నేను కూర్చున్నది కూడా నేను నరుక్కుంటున్నానని స్పృహ లేదు వాడికి కావాల్సింది కట్టెలు కాబట్టి గొడ్డలితో అలా cut చేస్తూ ఉన్నాడు ఇది పెద్ద మాను లాగా ఉంది నెమ్మదిగా కోస్తున్నాడు ఇంకొద్దిగా మిగిలింది చాలా కొద్దిగా ఇంకో రెండు మూడు నిమిషాలు ఉంటే కొమ్మ విరిగి పడటం ఖాయం కొమ్మతో పాటు వీడు కూడా నేల మీద పడిపోవటం ఖాయం అప్పుడు శివుడు ధ్యానంలో ఉన్నాడు పక్కన పక్కన అంటే సగమేగా రెండో సగం అమ్మవారు ఏమంది అంటే స్వామి ధ్యానం కాసేపు ఆపు.నీ భక్తుడు వాడు ఇంకో నిమిషంలో చచ్చిపోతున్నాడు కింద మరణిస్తాడు వాడు కొమ్మ విరగబోతోంది నీ కంటికి కనపట్టలేదా ఒక్కసారి నీ దృష్టి సారించు అని ఈమె పోరు పెడుతున్నది పక్కన కూర్చొని. ఆయన అసలు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు ఇంకా అది ఒక నిమిషం time కి దగ్గర పడింది అమ్మవారికి తా-తల్లిదనం వలన తట్టుకోలేక స్వామి మీరు ఏదైనా చేయాలి ఏమైనా చేయండి వాడిని కాపాడండి ముందు అన్నింటికంటే వాడు మీ భక్తుడు అన్నది. అనగానే ఆయన అన్నాడు "నీకే ప్రేమ ఉందా నాకు లేదా చూడు పని చేద్దాం కొమ్మ కొడుతూ ఉన్నాడు ఒక నిమిషం రెండు నిమిషాల్లోనో పడుతుంది పడేటప్పుడు అయ్యా అని గనక అరిస్తే నేను చూసుకుంటా భయంతో బాధతో అమ్మా అన్నాడనుకో నువ్వు చూసుకో మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం చేద్దాం చూస్తూ ఉండు" అన్నారు. ఇంతలో కొమ్మ పెళ్ళన విరిగింది. వాడు అమ్మా అనలేదు అయ్యా అనలేదు అయ్యయ్యో అన్నాడు. అయ్యయ్యో అనటంతో వాడు కింద పడ్డాడు. చూశారా! ఎంత శివభక్తుడైనా అవసరమైనటువంటి వేళ సమయానికి తగు మాటలాడి, ఎప్పుడొస్తాయి సమయానికి తగు మాటలాడి అంటే తపస్సు వలన వస్తాయి. వాడు శివభక్తుడైనా నన్ను శివుడు కాపాడాలి అని శివ ప్రార్థన చేయలే. వాడి మనసంతా శివుడి మీద లేదు కొడుతున్న కొమ్మ మీద ఉంది మాను మీద ఉంది. కనుక ఇటు సరస్వతి మన పార్వతీదేవి గానీ అటు అయ్యవారు గానీ ఇద్దరూ వాడిని రక్షించుకోలేకపోయినారు. మరి తప్పెవరిది? అయినా రక్షించాలి కదా అని అంటే కొమ్మ నేలమీద పడకుండా కాస్త అక్కడే ఎక్కడ ఏదో అడ్డొచ్చి అది ఆగింది. పైనుంచి వాడు దానిమీద దూకి తనను తాను కాపాడుకున్నాడు. నన్ను నేను కాపాడుకున్నాను అని వీడు అనుకున్నాడు అమ్మ అయ్యలు ఇద్దరూ పోనీలే వాడి భక్తి వాడిని కాపాడిందని వాళ్ళు అనుకున్నారు. అంటే మనం ఎప్పుడూ కూడా అజామీలుడి కథలో ఉన్నటువంటి సారాన్ని last minute దాకా గాని మనం పని అయినా సరే చివరి క్షణంలో చిటికెలో చేస్తానంటాడు ఒకడు. చిటికెలో చేయకూడదు. దానికి క్రమంగా చేయాలి పద్ధతి ప్రకారం చేయాలి ప్రయాణమైనా అంతే జీవన ప్రయాణమైనా అంతే. అంతా prepared గా చక్కగా schedule గా చేసుకుంటూ వెళితే చివరి నిమిషం tension లో వాడికి దేవుడి పేరు వచ్చిందా వీడికి అయ్యయ్యో వచ్చింది అయ్యా లేదు అమ్మ లేదు. వాడికి అదృష్టవశాత్తు కొడుకు పేరు వచ్చింది నారాయణ శబ్దం విష్ణులోకానికి వెళ్ళాడు. కాబట్టి అజామీలుడి కథ ఒకటి ధ్రువుడి కథ ఒకటి మనకి చతుర్థ స్కంధాన్ని చాలా చిన్న స్కంధం అది. నిజానికి ఒక అరగంటలో పూర్తి చేసే స్కంధం కానీ మనం చెప్పుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. కేవల భాగవతం మాత్రమే దానికి పరిమితం కాకుండా మన జీవితాలతో మన దుర్భరదాలతో మన ఆలోచనలతో మన విచారధారతో సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. కనుక సంకల్పం ఎలా ఉండాలంటే రోజు పొద్దున ఎనిమిది గంటలకి డాక్టర్ గారు ఆయన సతీమణి ఇద్దరూ వస్తారు కూర్చుంటారు సంకల్పం చేయండి అంటారు పండితులు అంతే కదా. అంటే ఏమిటా సంకల్పం? నా కుటుంబమే కాక నా క్షేమమే కాక సర్వ ప్రపంచానికి కార్యక్రమం ద్వారా భగవంతుని అనుగ్రహం లభించు గాక. అది సంకల్పం. అది ఎప్పుడు లభిస్తుంది? సక్రమంగా జరిగితే లభిస్తుంది. సక్రమంగా ఎలా జరిపి ఎవరు జరిపించాలి ఎవరు నిర్ణయింపబడ్డారో వాళ్ళు నడిపించాలి. వారికి చిత్తశుద్ధిని బుద్ధిని ఎవరు అనుగ్రహిస్తారు? మళ్ళీ భగవంతుడే అనుగ్రహించాలి. కాబట్టి ఎటు వెళ్ళినా మళ్ళీ వెళ్ళి భగవంతుని యొక్క అనుగ్రహం మీదనే ఇవన్నీ మిగిలి ఉన్నాయి కాబట్టి ఇవ్వాళ మన జీవితాలన్నీ కూడా భగవంతుని అనుగ్రహం కోసం మనం పాటుపడాలి. కోరికలు కామ్యసిద్ధుల కోసం ఎలాగో వెళతాం ఇది కావాలి అది కావాలి అంటే ముడుపు పెడతాం కొండెక్కుతాం వెళతాం అన్నీ చేస్తాం చేయవలసిందే కానీ అది మాత్రమే కాదు. జ్ఞానం వైపు మన మనస్సును మళ్ళించుకోలేకపోతే చేసిన పూజలు, చేసిన వ్రతాలు, చేసిన దానధర్మాలు ఇవన్నీ కూడా మనల్ని కొంత దూరం మాత్రమే తీసుకుని వెళతాయి. పరిపూర్ణంగా మన స్వస్థానం వైపు మన నిజమైన స్థానం వైపు అది నిజమైన స్థానం ఏదంటే [కొవ్వు] బ్రహ్మ స్థానము అది మూల స్థానము అది మన యందే ఉన్నది గనుక అక్కడికి వెళ్ళటానికి, చూడండి దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే visa కావాలి కదా. లేదు ఈ-ఈ దేశంలోనే ఇంకోచోటు నుంచి ఇంకోచోటుకి ఏదన్నా వస్తువు తీసుకెళ్లాలంటే permit కావాలి. ఏదన్నా చేయాలి అంటే license కావాలి. వ్యాపారం చేయాలి అంటే ఇంకేదో కావాలి. కానీ మన ఇంట్లోకి మనం వెళ్ళటానికి visa అక్కర్లేదు తాళం చెవి ఉంటే చాలు. తాళం ఉంటుంది తాళం తీసుకుంటాం లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత ఎవరన్నా మా ఇంట్లోకి నేను వస్తున్నాను నన్ను రానివ్వండి అని ఎవరికైనా చెప్తామా? మన ఇంట్లోకి మనం హాయిగా వెళ్ళిపోతాం. There is no visa కావలసింది మాత్రం key. key పేరే భక్తి. దాని పేరే సమర్పణ. దాని పేరే శరణాగతి. దాని పేరే సంపూర్ణమైనటువంటి వినయము. ఇవన్నీ గనుక key మన దగ్గర ఉంటే మన ఇంట్లోకి అంటే మన ఒంట్లోకి మన లోపలికి జ్ఞానం ద్వారా లోపలికి వెళ్ళాలి. విజ్ఞానం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఇంతే తేడా. విజ్ఞానం శాస్త్ర జ్ఞానం knowledge వల్ల ప్రపంచం ఏమిటి? భాగోగులు ఏమిటి? మనం ఎట్లా ఉన్నాం? మనం ఉండవలసిన రీతిలో ఉన్నామా లేదా? మనం చేయవలసిన పని చేస్తున్నామా లేదా? వయసును బట్టి మన ప్రవర్తన ఉన్నదా? వయసును దాటి ఉన్నదా? ఇవన్నీ కూడా మన knowledge వల్ల మనం తెలుసుకుంటాం. కానీ భక్తి వలన, సమర్పణ వలన, నిత్య సత్య కర్మ యోగం వలన ఒక విజ్ఞానం ఏర్పడినప్పుడు విజ్ఞానమే నెమ్మదిగా జ్ఞానం వైపు గనుక మనల్ని నడిపించకపోతే శ్రమంతా వృధా అయిపోతుంది.ఇవాళ సాప్తాహికమైనటువంటి జ్ఞాన యజ్ఞంలో మనందరం కూడా ఒక ప్రమాణం తీసుకోవాలి మనసులో ఏదో ధ్యానం చేశాం కొన్నాళ్ళు గడిచింది పురాణాలన్నీ చదివేశాం బాగుంది బాగా గడిచింది ఇట్లాగే ప్రవచనాలు కొన్ని వందలో వేలో వినేసాం అయిపోయింది సరే ఏది వచ్చినా విన్నాం ఎలా ఉన్నా విన్నాం అది కూడా అయిపోయింది మరి ఇప్పుడు నేనేం చేయాలి నాకు జ్ఞానం ఎవరిస్తారు జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఎవరు బుద్ధనేరాత్మనాత్మ విచక్షణే జ్ఞానం వివేకమే జ్ఞానం రెండింటిని సమన్వయం చేసుకొని మనం గనక వెళ్ళగలిగినట్లయితే నిన్న కపిలదేవహుతి సంవాదాన్ని లోపల చాలా register చేసుకోగలిగితే జ్ఞానమార్గం మనకు తెలుస్తుంది శరీరాన్ని సృష్టింపజేసే ఉపవాసాలు చేయకండి ప్రయోజనం లేదు దానివల్ల బుద్ధుడు తన జీవితాన్నే పోగొట్టుకున్నాడు సత్యాన్వేషణలో యవ్వనంలో ఉన్న భార్యని యువరాజ పట్టాభిషేకాన్ని అప్పుడే పుట్టిన కుమారుడ్ని వదిలిపెట్టి సత్యాన్వేషణకి నగరంలోకి వెళ్ళాడు అడవుల్లోకి వెళ్ళాడు వెళితే ఎక్కడా ఏం దొరకల అన్నిచోట్ల బీదా అరుపులు రోగాలు ఇవన్నీ కనిపించినయి నిరాశక్తుడైపోయినాడు అయిపోయి అరణ్యంలోకి వెళ్ళాడు వెళ్లి ఇట్లా కాదు సమాజం అంతా కూడా ఇలాగే ఉంది ఊరు వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఎవరిని కదిలించినా వాడు ఒక వ్యధాభరితమైన కథ చెప్తున్నాడు నాకు నేను ఇవన్నీ తీర్చడానికి వచ్చానా నేను సత్యం ఏమిటో తెలుసుకోవటానికి కదా నేను వచ్చింది నాకు అది తప్ప అన్నీ కలుగుతున్నాయి అన్నాడు అరణ్యానికి వెళ్ళాడు చెట్టు కింద కూర్చున్నాడు తపస్సు చేశాడు చేస్తున్నాడు చేస్తున్నాడు ఎంతగా చేశాడంటే పై చర్మం అంతా పల్చటి పొర అయిపోయింది పోషణ లేదు లోపల ఉన్నటువంటి అస్థిపంజరం పై కనిపిస్తున్నది అక్కడిదాకా వెళ్ళాడు వెళితే అక్కడ ఆయన దగ్గర కేవలం పన్నెండు మంది శిష్యులు మాత్రమే మిగిలారు పన్నెండు మందిలో గురువుగారి హృదయానికి సాంత్వన కలిగిద్దామని ఒక చల్లటి వస్తువు ఆయన గుండె మీద పెట్టారు అది భస్మం అయిపోయింది ధ్యానం వలన కలిగినటువంటి వేడి దాని వలన పుట్టినటువంటి అగ్ని వలన చల్లటి వస్తువు మాయమైపోయింది క్షణంలో లోపల ఉన్నటువంటి బుద్ధుడికి ఒక ఆలోచన కలిగింది శరీరాన్ని సృష్టింపజేసిన దీన్ని మరణానికి దగ్గరగా తీసుకుని వెళ్ళిన అసలు నాకు శరీరమే లేకుండా పోయే స్థితి వచ్చినా నాకు ఇంకా సత్యం గమనించలేదే సత్యము ఆత్మ బయట మాత్రం లేవు అది నా యందే ఉన్నది అది that is called the state of enlightenment బద్ధత్వం పోయింది బుద్ధత్వం వచ్చింది ఏమనుకున్నాడంటే దేవుడు బయట లేడు ఉన్నదంతా లోపలే ఉన్నది నా లోపల ఉన్న భగవంతుణ్ణి నేను వదిలిపెట్టి కస్తూరి మృగ ఏదైతే కస్తూరి ఉన్నదో అది మద మృగము అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తుతున్నదట అత్యద్భుతమైనటువంటి కస్తూరి పరిమళం ఎక్కడో ఎక్కడో ఉన్నదని వెతుకుతున్నది ఎక్కడ వెతికినా దానికి కనబడటం లేదు నిజానికి ఒక్కచోట ఆగింది ఆగి ఎక్కడినుంచి వస్తోందని చూస్తే దాని పొట్టలో నుంచి వస్తోంది దానిలో నుంచే పరిమళం వస్తోంది అది తెలియక తిరిగింది తిరిగింది బుద్ధుడు కూడా అలాగే తిరిగాడు తిరిగాడు తిరిగి చివరికి ఏం చేశాడు ఉపవాసం వలన ప్రయోజనం లేదు అని నిర్మించాడు ఉపవాసమే ప్రధానం అని చెప్పిన బుద్ధుడు ఉపవాసం అక్కరలేదన్నాడు ధర్మ కర్మ కాండలో జీవహింస వద్దు అనుకున్నటువంటి వాడు అసలు జీవహింస ఆపేసేయండి అని ఊరూరా ప్రచారం చేసిన నేను నేను కూడా ఒక జీవినే కదా దీన్ని ఇంత కాలం హింస పెట్టానా ఇలా చేయవచ్చునా నేను నా ప్రాణాన్నే అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటే నా చెవులలో దాని రోదన వినిపించింది నేను ఎంత మహా పాతకం నా శరీరం పట్ల చేశాను దీన్ని పోషించుకోవాల్సిందే అని మళ్ళీ బుద్ధుడు తన శరీరాన్ని మామూలు స్థితికి తెచ్చుకొని చుట్టూ ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులకి ఒక్క మాట చెప్పాడు నేను ఇంతవరకు చెప్పినవన్నీ విని వదిలిపెట్టండి ఒక్కటే ఆత్మ సత్యము నిత్యము శాశ్వతము అతడే గురువు గురువు మన లోపల ఉన్నాడు బయట లేడు బ్రహ్మానందం మీ అందరికీ తెలుసు కదా శ్లోకం చదవండి పరమసుఖదం అనండి కేవలం బ్రహ్మమాత్రం కేవలం బ్రహ్మమాత్రం నాకు వినిపిట్టలేదు ద్వంద్వాతీతం త్రిగుణరహితం ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్ సమస్యాది లక్ష్యం తత్ సమస్యాది లక్ష్యం ఏకం ఏకం నిత్యం నిత్యం విమలం విమలం అచలం అచలం సర్వధి సాక్షిభూతం సర్వధి సాక్షిభూతం అది గురువు అన్నిచోట్ల సాక్షిభూతంగా ఉండాలి ఉండాలి అతడు ఏకమై ఉంటాడు ఏకము అనేది ఏక వస్తువు ఏదంటే ఒక ఆత్మే దానికి ఏదన్నా మళ్ళీ రంగు రుచి వాసన ఉందంటే విమలం కదా మాలిన్యమే లేదు అచలం కదలటం లేదు సర్వధి సాక్షిభూతం అది అనుభవిస్తున్నది ఏమిటి అంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిన్ కేవల జ్ఞానమూర్తి ఎక్కడ ఉన్నాడు అంటే బయట కాదు ఒకసారి ప్రశాంత నిలయం తొలినాళ్లలో స్వామి సాయంకాలం దర్శనం ఇవ్వటానికి వచ్చే సమయం ఉండేది సమయానికి అప్పుడు కస్తూరి గారు ఒక్కరే ఉండేవారు ఆయన వెళ్లి తలుపు దగ్గర నిల్చుంటే స్వామి తలుపు తీసుకుని బయటకు వచ్చేవారుప్రతిరోజూ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఏదో మ్ అక్కడికి వచ్చిన భక్తులంతా స్వామితో ఎలాగూ మాట్లాడలేము. కస్తూరి గారితో మాట్లాడుదాం కొన్ని విషయాలు తెలుస్తాయి అని పాపం ఆయన ఉన్న room దగ్గరికి వెళ్తే ఆయనేదో చెప్తూ ఉండేవారు. ఇందులో ఒకాయన ఆయన్ని ఏమడిగారంటే "అయ్యా మాకు ఏదన్నా స్వామి మీద చిన్న book ఉంటే ఇవ్వండి, పొద్దున్న దర్శనం అవుతోంది స్వామి వెళ్ళిపోతున్నారు సాయంకాలం అయ్యేదాకా మళ్ళీ రావటం లేదు. పుట్టపర్తి లో మేము ఏం చేయడానికి లేదు స్వామి book మాకు ఇస్తే మేమేదో చదువుకుంటూ ఉంటాం" అంటే ఆయన ఏమన్నారంటే "స్వామి మీద books అంటూ ఏం లేవు మీ పని మీరు చేసుకోండి" అని పంపించారు. రోజునే స్వామి తలుపు తీస్తూనే "కస్తూరి, ఇవాళ నిన్ను ఎవరన్నా పలకరించారా? రోజు నీ దగ్గరికి చాలామంది వస్తుంటారట కదా, ఇవాళ కూడా ఎవరన్నా వచ్చారా?" అంటే "అవురు స్వామి ఎవరో ఒకాయన వచ్చారు" "వచ్చి ఏమడిగాడు?" "స్వామి మీద ఏదన్నా పుస్తకం ఉందా?" అని అడిగాడు స్వామిని. "నువ్వేం చెప్పినావు?" అన్నారు. "స్వామి మీద పుస్తకాలు అంటూ ఏం లేవు మా దగ్గర మీ పని మీరు చేసుకోండి" అని ఆయన ఏం చెప్పారో అదే యథార్థంగా చెప్పారు. అప్పుడు స్వామి ఒక గొప్ప instruction మన బట్టి వాళ్ళందరికీ "కస్తూరి, నువ్వు చెప్పవలసింది అది కాదు, ఇవ్వవలసిన జవాబు అది కాదు. మా స్వామి పుస్తకాల్లో దొరకడయ్యా అని చెప్పాలిగా" అది పుస్తకాల్లో దొరకడు, వర్ణనలో దొరకడు అని చెప్పాలిగా. సరే సరే ఇకపై జాగ్రత్త. అంటే గురువు ఎట్లా ఉంటాడంటే సర్వదీ సాక్షిభూతమై ఉంటాడు. అలాగే జగదక్షుడై ఉంటాడు, జగద్రక్షకుడై ఉంటాడు. జగత్తునంతా ఒక కంటితో చూస్తాడు. రాత్రిని ఒక కంటితో, పగలు మరొక్కంటితో చూస్తూ ఉంటాడు. చూస్తూనే ఉంటాడు. మరి గురువు, ధ్రువుడికి గురువు ఎవరంటే సంకల్పమే గురువు ధ్రువుడికి. అజామీలుడికి ముక్తిని, ముక్తి మార్గాన్ని, జ్ఞానాన్ని చూపించిన గురువు ఎవరు అంటే తనలో ఉన్నటువంటి పూర్వం చేసుకున్న పుణ్యం ఉంది చూడండి. త్రికాలసంచ, వేదాధ్యయనం, పురాణ పఠనం ఇవన్నీ కూడా అతనికి క్షణంలో అన్నింటినీ మరపించి నారాయణ అనేటువంటి ఒక పదాన్ని గుర్తు చేసినయి. అది కొడుకు పేరు కావచ్చు గాక కానీ నారాయణ శబ్దం అప్పటికే స్పురణలోకి వచ్చింది. మనం కూడా నిత్యము కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటే మాగన్నుగా నిద్రపట్టిన, దీర్ఘ నిద్రలోకి జారిపోయే వేళలు వచ్చిన, ప్రాణ నిర్గమన వేళ జరిగిన, ఇంద్రియాలు ఉడిగిపోయిన, వయసు భారమైన మన నాలుక మీద ఒకటే నాట్యం ఆడాలి. అది భగవంతుడి యొక్క నామం. నామానికి మనం బహిరంగంగా- వారు లక్ష గాయత్రి చేశారండి, వీరు ఎనిమిది లక్షల గాయత్రి చేశారండి, అది గిన్నిస్ రికార్డ్ కాదు. రమణ మహర్షి చెప్పారు "ఎందుకు అంత యాతన పడతారు? ఒక్కసారి హృదయంలో నుంచి మీరు చెప్పండి, భగవంతుడు కదిలి మీ దగ్గరికి వస్తాడు. వాడు ఎక్కడున్నా వస్తాడు" అన్నారు. స్వామి కూడా అన్నారు "మీరు సాయి సాయి సాయి అనుకుంటూ కేవలం కేకలు పెట్టకండి. మీ హృదంతరము నుంచి గనక సాయి అని గనక మీరు పిలిస్తే నేను మీ దగ్గర ఒక్క క్షణంలో వస్తాను" అన్నారు. రూపం వేరు కావచ్చు, భావం వేరు కావచ్చు, ఎలాగైనా వస్తాను అని. కాబట్టి ఇవన్నీ కూడా మనం నిరంతరము స్మరణ చేసుకుంటూ ఉండాలి. భగవంతుడు మనకిచ్చిన ఆయుష్షులో, జీవితంలో ఒక పది రోజులు మనతో మనం ఉండటానికి అవకాశం ఇచ్చారు. రోజూ నే-నేను నాకు సంబంధించిన వాళ్ళకి చెప్పా నేను ఉండటం లేదు. నాకు phone చేయకండి, నా దగ్గర phone ఏం ఉండదు. మీరు చూసి ఉంటారు. I don't bring a phone. ఇక్కడ నా పని phone మాట్లాడటం కాదు, మీతో మాట్లాడటం. మీతో మాట్లాడటం అంటే నాతో నేను మాట్లాడుకోవడం, అంతే. మీకు బోధించటానికి రాలా, నేను బోధ అందుకున్నానో మీకిద్దామని వచ్చా. కాబట్టి నాకు దాంతో పని లేదు. TV లేదు, news paper లేదు, మనసెంత హాయిగా ఉందో. కదా. మనం భగవంతుని వైపు మన చిత్తాన్ని- అందుకే శంకర భగవత్పాదులు శ్లోకం చెప్తారు. ఆనందం అంటే ఏమిటి? అని ఎవరిన్నా అడిగితే ఇది చెప్పండన్నారు. యోగ రతోవా, భోగ రతోవా, విషయ రతోవా, సంగ రతోవా, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. నందతి నందతి నందత్యేవా. ఎంత అద్భుతంగా చెప్పారు. నువ్వు యోగివా, భోగివా, విషయాసక్తుడవై ఉన్నావೋ, విష్ణు వాంఛలతో ఉన్నావా, ఎక్కడుంటే ఏమి, ఎట్లా ఉంటే ఏమి, యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నీ చిత్తం ఉన్నదే పురాకృతగా నీవు వెంట తెచ్చుకున్నటువంటి చిత్తం గనక ఎప్పుడైతే యస్య, ఎప్పుడైతే పరబ్రహ్మము నందు మాత్రమే లగ్నమై ఉన్నదో అప్పుడు కలిగే దాని పేరు ఆనందము. నందతి. నందతి, అదే ఆనందం. అది ఆనందము, అదే ఆనందము. మూడవది నందత్యేవా, అది మాత్రమే ఆనందం. అది. అది మాత్రమే ఆనందమే, కేవల బ్రహ్మానందం. కేవల జ్ఞానం అంటే మనకు అది కావాలి. జ్ఞానం అంటే information అంతా కాదు. స్వామి ఒకసారి మాతో మాట్లాడుతూ "ఆ IIT" IIT అంటే ఏమిటి? అని చెప్పాడు. సరే సరే మీ మీ definitions అవన్నీ అట్లా పక్కన పెడితే మొదటిది I is information. రెండవ I implementation. చివరి T transformation. నీ దగ్గర బోలెడు information ఉంది, నువ్వు implement చేయలా transformation ఎక్కడి నుంచి వస్తుంది? మన showcase నిండా వెయ్యి పుస్తకాలు ఉన్నాయి, చదవకపోతే దాంట్లో ఏముందో ఎలా తెలుస్తుంది? IIT అంటే Information, Implementation and Transformation is real IIT అన్నారు స్వామి. ఆయన ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? ఆయనకెవరు చెప్పారు English? ఆయన చదువుకున్న పుట్టపర్తి స్కూల్లో ఎనిమిదో క్లాసులో వాళ్ళ మాస్టారుకి అప్పటికి IITలే లేవు. అంటే ఒక-
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 30:34

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

    Now playing
  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22