Skip to content
Transcript తెలుగు
భయం లేదన్నట్టుగా ఉందట. భద్ర అభిరామ మూర్తి అయి వచ్చాడు రామభద్రాభిరామ మూర్తి అయి వచ్చాడు దీనికి ఒక చిన్న కథ ఉంది. కథ ఏమిటంటే శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో మూడవ పాదంలో కర్కాటక రాశిలో పుట్టినప్పుడు ఆయనకి నామకరణం చేయాలి ఆయనతో పాటు ఆయన తమ్ముళ్లకు కూడా చేయాలి మన సంప్రదాయమే బియ్యంలో ఉంగరం పెట్టి దానిమీద పేరు రాయాలి. వశిష్టుల వారు రావటం కొద్దిగా late అయింది ఆరోజు ఆయన పెద్దవారు ఆయన చాలా పెద్దవారు. రామాయణంలో వర్ణించబడిన వయస్సు ప్రకారం ఆయనకి మూడు వందల ఏళ్ళు అప్పటికి. ఎంతోమంది ఇక్ష్వాకు రాజులకు ఆయన గురువు రాముడుకు కూడా ఆయనే గురువయినాడు. సరే ఉంగరంతో రాసినప్పుడు రాసేసారు పేరు రాయటం అయిపోయింది. వశిష్టుల వారు వచ్చారు రాగానే "ఆచార్య నామకరణం ఇప్పుడే అయిపోయింది ఏం పేరు పెట్టారు?" "నేను చదువుతాను" అన్నాడు. ఆయన మూడు వందల ఏళ్ళు కదా! దాన్ని అలా చూస్తూ ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ శ్రీరామచంద్ర అని ఆగాడు శ్రీరామచంద్ర. కానీ అక్కడ రాయబడింది ఏమిటంటే శ్రీరామభద్ర అది రామభద్రుడు అందుకనే భద్రాద్రి రాముడి యొక్క మూలం ఏమిటంటే భద్రుడు వల్ల రాలే శ్రీరామ భద్రాభిరామ మూర్తి రుచుతోచే. అనగానే దశరథుడికి భయమేసింది దశరథుడు భయస్తుడు అప్పటికే పుట్టక పుట్టక పిల్లలు పుట్టారు వీళ్ళ పేరు కూడా తప్పు రాసామేమిటి అసలు గురువుగారు వచ్చేదాకా ఉంటే బాగుండేది కదా ఆత్రుత పడ్డారు వీళ్ళు ఆడవాళ్ళందరూని ఆయన వాళ్ళ మీద కోపడి అలా నుంచొని కానీ గురువు గారి దగ్గరికి వెళ్లి మేము శ్రీ రామభద్ర అని రాశాము మీరేమో శ్రీరామచంద్ర అని చదివారు స్వామి ఇదేమన్నా విపత్కర పరిస్థితులు వస్తాయా మన ఇక్ష్వాకు వంశానికి ఇబ్బందులు ఉంటాయా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే "మీరు రాసింది సత్యమే అది శ్రీరామ తత్వానికి దగ్గరైనటువంటి పేరు శ్రీ రామభద్ర అది శ్రీరామ ముద్ర అది శ్రీరామ చిన్ముద్ర జగత్తంతటికీ కూడా రాముడే భద్రమూర్తి అయి ఉంటాడు గనుక ఆయన రామభద్రుడే" మరి రామచంద్రుడు ఏం చేద్దాం అన్నారు "ఆ రామచంద్రుడా! శ్రీరామచంద్రుడు మీ వంశమంతా సూర్యవంశం ఆయన వివాహం చేసుకోబోయేటువంటి కన్యక చంద్రవంశంలో నుంచి వస్తుంది కనుక సూర్యచంద్రులకి సమన్వయం చేసేటువంటి రెండు కాంతులని ఒకే దేహంలో నిలుపుకున్నటువంటి పరమాత్మే నీ కుమారుడు కనుక శ్రీరామచంద్ర అంటే రకారము రామా లో రకారము రవిబీజం మకారము చంద్రబీజం మధ్యలో ఉన్న అకారము అగ్ని బీజం అందువల్లనే ప్రజాపత్య పురుషుడు పుత్రకామేష్టి యాగం చేసినందువలన అగ్ని లో నుంచి వచ్చినటువంటి పురాణ పురుషోత్తముడు రాముడు గనుక అక్కడ అది అగ్ని బీజం అయింది రవి బీజం అంటే సూర్యబింబ-సూర్య వంశం నుంచి వచ్చాడు గనుక రవి బీజం అయింది రాబోయే అమ్మవారు చంద్రబీజం గనుక ముందే నిక్షుబ్ధం చేసి శ్రీరామ అనేటువంటి నామాన్ని రాముడుకి ఇచ్చారు" ఎంత దీనికి ఎంత లో-లోతుకు వెళితే ఇవి మనకు తెలుస్తాయి. ఏదో శ్రీరామ పేరు రాసేసాం ఏదో రాసేసాం నక్షత్రాన్ని బట్టి కా కే కో కౌ ఏవో చెప్తుంటారు కదా కాకులు లేవు కేకలు లేవు ఉన్నదంతా చాలా నక్షత్రము అదంతా జ్యోతిష్యాలు దాని-అది శాస్త్రం కాబట్టి అహల్య దేవి శ్రీరామున్ని మామూలుగా ఏం చేయాలి శాప విముక్త అయింది గనుక అహల్య దేవికి రాముడు అహల్య రాముడికి దండం పెట్టాలి ఉపకారం పొందింది గనుక కానీ రాముడు ఏం చేశాడు అహల్య దేవికి నమస్కరించాడు. ఎందుకు నమస్కరించాడు అంటే పన్నెండేళ్ళు అప్పుడు ఆయన వయస్సు విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు just twelve years. స్త్రీ కనిపించినా ఆమెలో ఆయనకే కౌసल्या దేవి కనిపించేది. వాళ్ళ అమ్మే రాయిలో నుంచి వచ్చింది అనుకున్నాడు దండం పెట్టాడు అప్పుడు ఆమె చెప్పింది ఏమంటే "నువ్వు పని చేయబోతున్నావ్" అని ఆయన జీవితంలో జరగబోయేటువంటి సంఘటనల అన్నింటినీ కూడా అహల్య స్తోత్రంగా ఏడు శ్లోకాలలో చెప్పింది. శ్రీరామచంద్ర శ్రీరామభద్ర అంటూ చెప్తూ కళ్యాణ రామ అగణిత పట్టాభిరామ అగణిత పట్టాభిరామ యోగాభిరామ ధనుజ విరామ రామ తర్వాత సీతా మనోహర రామ అని ఆయన జీవితం అంతా కూడా ఏడు సార్లు వర్ణించింది. ఇది అవుతుండగానే మిధిలా నగరం నుంచి ఆయనకు వర్తమానం రావటం అక్కడి నుంచి వెళ్ళటం ఎప్పుడైతే అహల్య శాపవిమోచనం జరిగిందో రాముడు విశ్వామిత్రుడి వైపు గురువు గారి వైపు చూశాడు చూసి "ఇదేమిటీ ఆశ్చర్యం ఏమిటీ" అని అడిగాడు "ఏం లేదు రాజవంశంలో రాజుగా పుట్టావు గనుక నీలో రాజస గుణం కావడం ఉంటుంది మొదటిదేమో సంహారము రెండవదేమో సంస్కారం అహల్యంను సంస్కరించినందువలన రామా! నీలో ఉన్న రజోగుణం కూడా పోయింది" ఇంతలోకే వర్తమానం వచ్చింది అక్కడికి వెళ్ళటం శివ ధనుస్సు విరవటం అమ్మవారిని పెళ్లి చేసుకోవటం ఇదంతా అయిపోయింది. అప్పుడు కూడా విశ్వామిత్రుడి వైపు చూశాడు రాముడు "ఇది ఏమిటి? ఇది ఎలా జరిగింది? ఐదు వేల మంది వచ్చినా లాగటానికి వీలు లేని శివ ధనుస్సు ఇలా నా చేతిలో అలా ఎత్తగానే రెండు ముక్కలై విరిగి పోయిందే, పద్నాలుగు హోనాల్లోకి కూడా శబ్దం వెళ్లిందే, ఇదంతా ఏమిటీ? అద్భుతం ఏంటి? తాటకం చంపటం పన్నెండేళ్ళ వాడిని నా వల్ల అవుతుందా? ఏదో నా కాలు తగిలో దగ్గర పడేయో నిజానికి దగ్గర పడే ప్రాంతమైనంతనే కాలు--కాలు ఆయన పెట్టలేదు తాకలేదు కూడా దగ్గర పడింది. అట్లా ఒక రాతిలో నుంచి ఒక స్త్రీమూర్తి అహల్య మాత బయటకు వచ్చిందే, శివ ధనుస్సు విరవటం ఏమిటీ? ఈమె ఎవరో నాకు ఇంతవరకు తెలీదు. పెళ్లి చేసుకోవటం ఏమిటి? ఇదేమిటి అంటే ఇప్పుడు వివాహం కారణంగా జగన్మాత శ్రీమహాలక్ష్మి అయినటువంటి సీతాదేవిని నువ్వు వివాహం చేసుకున్నందువలన నువ్వివాళ పూర్ణ పురుషుడివి అయినావు రామా!"ఇవన్నీ చెప్పటానికే విశ్వామిత్రుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి రాముడి జీవితంలోకి వచ్చాడు. సీతా కల్యాణం తర్వాత ఇక విశ్వామిత్రుడు లేడు. ఆయన కథే లేదు అక్కడితో అయిపోయింది. తన పూర్వ గాథలన్నీ చెప్తూ రాముడితో పిల్లల్ని అడవిలో నడిపించినటువంటి విశ్వామిత్రుడి యొక్క పాత్ర ముగుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే గత జన్మలు ఉన్నాయా? హిందూ సమాజానికి చాలా ఆ-అవిద్యలో ఉంటారు, అజ్ఞానంలో ఉంటారు. ఎక్కడున్నదండి ఉన్నదే ఒక జన్మ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. వీళ్లు పూర్వ జన్మలు పూర్వ జన్మలు పుణ్యం అని మాట్లాడుతున్నారే అంటే పుణ్యము ఉంటుంది దానివలన మనం నైపుణ్యం కూడా వస్తుంది. రెండూ ఏర్పడతాయి. ఇవి కథలన్నీ మనకి ఏం చెప్తున్నాయి? ఎక్కడో ఒక జయవిజయంలో ఒకడు. వాళ్లలో ఒకడు హిరణ్యకశిపుడు కావటం శ్రీ మహావిష్ణువే ఒక అవతారం దాల్చి తన భక్తుల కోసం రావటం. నరసింహ అవతారం కూడా గంటలు గంటలు లేదు. మనం చెప్పుకోవడానికి అరగంట పట్టింది గానీ జరిగింది రెండు సెకన్లలో జరిగింది. రె-- టూ సెకండ్స్ అంతే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రహ్లాద చరిత్రలో లీలావతి విషయం అదైతే మనమందరం కూడా గర్భం దాల్చినా దాల్చకపోయినా బతికున్నంత కాలం మన లోపల ఏం జరుగుతూ ఉండాలి అంటే నారాయణ మంత్రం జపించ-- నారాయణ శివ మంత్రం పంచాక్షరి అద్భుతమైనటువంటి మంత్రం చదవాలి. కబీరుని సంగతి మీకు మీరు విని ఉంటారు. కబీరు బట్టలు నేసేవాడు. అతని శరీరం అంతా రామనామంతో నిండిపోయింది. రోజు పడుకున్నాడు. పడుకొని ఉంటే ఆయనలో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఏమిటి కొత్తగా శబ్దాలు వస్తున్నాయి ఈయన శరీరంలో నుంచి అని ఆయన బిడ్డ అంటే కూతురు వెళ్లి ఆయన చెవి దగ్గర తన చెవి పెట్టింది. పెడితే దానిలో నుంచి రామనామం వినిపించింది. ముక్కు పుటాలలో నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నుంచి రామనామం వినిపించింది. అంటే తను వృత్తి మానేశాడా? బట్టలు నేయటం మానేశాడా? అన్నం తినటం మానేశాడా? నిద్ర పోవటం మానేశాడా? అన్నీ చేశాడు. కానీ అవస్థాత్రయాతీతమైనటువంటి మనం ఎప్పుడూ జాగ్రదవస్థ గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం. పడుకున్నాం, ఇది చేశాం, అది చేశాం, డైరీలు రాస్తాం. కానీ అన్ని అవస్థలలో కూడా ఏమి ఉండాలి అంటే భగవంతుడి యొక్క స్మరణ ఉండాలి. భగవంతుడి గురించి పాట కాదు ఒకటి స్మరణ. జస్ట్ కాన్స్టెంట్ థింకింగ్ ఎబౌట్ లార్డ్. అది గనక ఉన్నట్లయితే లోపల ఏవన్నా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి నశించిపోతాయి అని లీలావతి వరకు ఉన్నటువంటి కథ మనకు చెప్తుంది. ఇక ప్రహ్లాదుడు ఇందాక చెప్పినట్టుగా యోగం కావాలనుకున్నాడు ఆయనకు అది దక్కలేదు భోగం మాత్రమే దక్కింది. ఇంకా యోగం రాలేదు ఇంకా ఉన్నాడు ఇక్కడే. ఎక్కడున్నాడో అది మనకు మధ్యాహ్నం కథలో వస్తుంది అది. ఇక మూడోవాడు హిరణ్యకశిపుడు శాపవశాత్తు శాపగ్రస్తుడై భూలోకంలోకి వచ్చినందుకు వాడి మనసంతా కూడా ఎప్పుడైనా మనం ప్రేమగా పిలిస్తే వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మనల్ని తలుచుకునే వాళ్ళు కూడా ప్రేమగా తలుచుకుంటూ ఉంటారు. కానీ వైరం ఉన్నవాడు ప్రతినిత్యము తలుచుకుంటాడు. మనమంటే ఇష్టం లేనివాడు, మనం కోప్పడిన వాడు వాడు ప్రతిరోజూ ప్రతిక్షణము వాన్నే తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతిక్షణము తలుచుకున్నటువంటి కారణంగా శ్రీ మహావిష్ణువు ఒక అవతారం దాల్చి వచ్చి భోగంలో ఉండాలి, రోజు బంగారంతో నేసిన బట్టలు మీకు తెలిసి ఉంటుంది ఒకప్పుడు దేశంలో బాగా వేడి అన్నం మీద బంగారు రేకులు వేసేవాళ్ళు. బంగారు రేకు కరిగిన దాన్ని వాళ్ళు అన్నం తినేవాళ్ళు. శరీరంలో ధాతు పుష్టి కోసం. కాలం అయిపోయింది అనుకోండి. కాలం అయిపోయి అవి ఇప్పుడు ఇంకేవో వస్తున్నాయి. కాబట్టి కశిపము, వస్త్రము వాడు ఏమనుకున్నాడంటే మామూలు నేత వస్త్రం అయితే చినిగిపోతుంది దేహము బంగారంతో గనక చేసుకున్నట్టయితే అది ఎవరూ తీసుకెళ్లే వాళ్ళు లేరు రాజుగారి ఒంటిమీద ఉంటుంది. దానికి సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ ఆలోచించుకున్నాడు వాడు. కానీ వాడు ధరించింది శుద్ధ చైతన్యం అనేటువంటి వస్త్రాన్ని ధరించే హిరణ్యకశిపుడు ఉన్నాడు. కానీ వాడు ఎంచుకున్న మార్గం మాత్రం వైర భక్తి. మధుర భక్తి కానివ్వండి, వైర భక్తి గాని, నవవిధమైనటువంటి భక్తులు గాని కొంతమందితో కొంతమంది గురువులతో మనం స్నేహితులుగా ఉంటాం. ఇదే భాగవతంలో మనకి అర్జునుడు చెప్తాడు మన సచివుడు, మన బాంధవుడు, మన హితులు, మన సన్నిహితులు కృష్ణుడు ఇంకా లేడు అని చెప్తాడు. వాళ్ళు కృష్ణుణ్ణి దైవంగా భావిస్తూనే ఒక ఫ్రెండ్ అనుకున్నారు, గురువు అనుకున్నారు, చుట్టం అనుకున్నారు. అన్ని స్థాయిలలో గురువు యొక్క తత్వం ఉంటుంది గనుక ఒక్కొక్కరు ఒక్కొక్క దానితో కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే భగవంతుడు ప్రత్యేకంగా ఆయన వేరు మనం వేరు అనుకున్నప్పుడు దూరం చాలా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి హిరణ్యకశిపుడి యొక్క ఆర్తి, వాడి తపన శ్రీ మహావిష్ణువుని ఆకారం తీసుకుని వచ్చేట్టుగా చేసింది. మరి అప్పుడు అప్పటిదాకా పాటలు పాడి, పద్యాలు పాడి, సంకీర్తనం చేసిన ప్రహ్లాదుడికి నోరు పెగలటం లేదు. ఆయన చూడగానే అన్నీ వెనక్కి వెళ్లిపోయినాయి. మామూలు ప్రహ్లాదుడు అయిపోయినాడు. భక్తి పోగా భయం ఏర్పడింది. భయంతో దేవాలయానికి వెళ్ళకూడదు. భక్తితోనే వెళ్ళాలి. గురువు దగ్గరకైనా భయంతో వెళ్ళకూడదు. ఆయన ఏమైనా ఇస్తాడేమో, చేస్తాడేమో అని వెళ్ళకూడదు. ఆయన ఏం చేయడు. చేయగలిగినా చేయడు. మరి మనం ఎందుకు వెళ్లాలి అంటే మనకంటే సర్వోన్నతుడైన వాడు గనుక మనకంటే ఒక శక్తి కాస్త ఎక్కువ ఉన్నవాడు గనుక ఎవరు సద్గురువు అయితే ఆయన దగ్గరకు మనం వెళితే ఆయన నుంచి మనకు వస్తువులు రావు మనలో ఉన్న సద్వస్తువు ఏదో మనకు నెమ్మదిగా తెలుస్తుంది. కాబట్టి లీలావతి, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు అయిన తర్వాత మరి ఆయన ఎన్నడూ లేని నరకేశరి రూపంలో వచ్చి గదతో చంపలేదు, ఆయుధంతో చంపలేదు, సుదర్శన చక్రాన్ని పిలవలేదు. తన చేతి గోళ్ళతో వాణ్ణి చంపాడు. పిడికిలితో చంపాడు. కాబట్టి ఆయన ఇంకా ఉగ్రం తగ్గలేదు. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా భయభ్రాంతులైపోయినారు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు మరణించాడో ఇంద్రాది దేవతలంతా కూడా అంతఃపురంలో ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్ళంతా ఆయన్ని ప్రార్థించారు. మామూలుగా అయిపో, మామూలుగా అయిపో. రూపాన్ని మేము-మేము ఇంతవరకు చూడలేదని వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటే అందులో ఒకాయన ఒక తెలివిగలవాడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి, "ఇదివరకు నువ్వు బాగా పాడేవాడివి కదా, సంకీర్తన చేసేవాడివి కదా, నువ్వు సంకీర్తన చెయ్. దాని వల్ల తగ్గుతుందేమో." అంటే పాపం వాడు నా వల్ల గనక ఉగ్రరూపం తగ్గితే చాలని వాడు సంకీర్తన మొదలు పెట్టాడు. తగ్గలే. తగ్గలేదు. ఎందుకని తగ్గలేదు? ఎందుకు తగ్గలేదంటే ఉగ్ర రూపాన్ని దం-- తగ్గించగలిగిన శక్తి ప్రహ్లాదుడు కోల్పోయినాడు. వాడి దగ్గర లేదు. అయిపోయింది అది. ఇంకా వాడు చాలా పని చేయాలి. మరి ఎవరు తగ్గిస్తారు? అంటే లక్ష్మీదేవికి దూరమైనటువంటి మన నరసింహస్వామికి లక్ష్మీదేవి వస్తే తప్ప ఆయనకి శాంతి కలగదు. ఇల్లాలు వస్తే తప్ప ఆందోళనకరమైనటువంటి మనస్సు చల్లబడదు అనేటువంటి ఒక భావం వలన అందరు దేవతలు కూడా లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. లక్ష్మి ఎవరు అంటే జ్ఞానలక్ష్మి. ఆమె వస్తే ఆమె వెళ్ళి ఆయన అంకం మీద కూర్చున్నది. అప్పుడు ఆయన నెమ్మదిగా శాంతించటం మొదలు పెట్టాడు.
YouTube · audio

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

Home

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

Source: Bhagavata Saaram on YouTube

0:00 / 14:00

More in this series

శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య

39 episodes · 18 hr 8 min

  1. 29 min 1

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -28/9/22

  2. 28 min 2

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -28/9/22

  3. 25 min 3

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -28/9/22

  4. 24 min 4

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -28/9/22

  5. 30 min 5

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -28/9/22

  6. 27 min 6

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -28/9/22

  7. 30 min 7

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -29/9/22

  8. 30 min 8

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -29/9/22

  9. 30 min 9

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -29/9/22

  10. 29 min 10

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -29/9/22

  11. 31 min 11

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -29/9/22

  12. 33 min 12

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -29/9/22

  13. 35 min 13

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -29/9/22

  14. 31 min 14

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -30/9/22

  15. 30 min 15

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -30/9/22

  16. 30 min 16

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -30/9/22

  17. 19 min 17

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -30/9/22

  18. 38 min 18

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -30/9/22

  19. 33 min 19

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -30/9/22

  20. 21 min 20

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7-30/9/22

  21. 29 min 21

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -01/10/22

  22. 14 min 22

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -01/10/22

    Now playing
  23. 31 min 23

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -01/10/22

  24. 20 min 24

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 4 -01/10/22

  25. 29 min 25

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -01/10/22

  26. 10 min 26

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -01/10/22

  27. 18 min 27

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 7 -01/10/22

  28. 19 min 28

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 8 -01/10/22

  29. 30 min 29

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -02/10/22

  30. 23 min 30

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -02/10/22

  31. 21 min 31

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -02/10/22

  32. 33 min 32

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 5 -02/10/22

  33. 42 min 33

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 6 -02/10/22

  34. 24 min 34

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -03/10/22

  35. 32 min 35

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -03/10/22

  36. 31 min 36

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -03/10/22

  37. 27 min 37

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 1 -04/10/22

  38. 26 min 38

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 2 -04/10/22

  39. 29 min 39

    శ్రీమద్ భాగవత సప్తాహం నైమిశారణ్య -Part 3 -04/10/22